చెలరేగిన ఆసీస్‌ బౌలర్లు.. 125 పరుగులకే పరిమితమైన విండీస్‌ | Sutherland Strikes Last Ball As Caribbeans End On 125-7 | Sakshi
Sakshi News home page

T20 WC 2026: చెలరేగిన ఆసీస్‌ బౌలర్లు.. 125 పరుగులకే పరిమితమైన విండీస్‌

Jun 30 2026 8:37 PM | Updated on Jun 30 2026 8:44 PM

Sutherland Strikes Last Ball As Caribbeans End On 125-7

మహిళల ప్రపంచకప్‌-2026లో లండన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బౌలర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

విండీస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ హీలీ మాథ్యూస్‌(30) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. డాటిన్‌(26) ఆఖరిలో దూకుడుగా ఆడింది. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్‌ జోషఫ్‌ అయితే 22 బంతులు ఆడి కేవలం 16 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఆసీస్‌ బౌలర్లలో సోఫీ మోలినెక్స్, గార్డెనర్‌, జార్జియా వేర్‌హామ్ తలా రెండు వికెట్లు సాధించారు.

తుది జట్లు
వెస్టిండీస్‌: ఖియానా జోసెఫ్, హేలీ మాథ్యూస్(కెప్టెన్), షెమైన్ క్యాంప్‌బెల్(వికెట్ కీపర్), స్టెఫానీ టేలర్, డియాండ్రా డాటిన్, చినెల్ హెన్రీ, జహజారా క్లాక్స్టన్, జానిలియా గ్లాస్గో, ఆలియా అల్లీన్, అఫీ ఫ్లెచర్, కరిష్మా రామ్‌హరక్

ఆస్ట్రేలియా: జార్జియా వోల్, బెత్ మూనీ(వికెట్ కీపర్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, యాష్లీ గార్డనర్, జార్జియా వేర్‌హామ్, అన్నబెల్ సదర్లాండ్, నికోలా క్యారీ, సోఫీ మోలినెక్స్(కెప్టెన్), కిమ్ గార్త్, లూసీ హామిల్టన్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement