
సౌతాంప్టన్ వేదికగా భారత మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది.
ఓపెనర్లు టామీ బ్యూమాంట్(5), అమీ జోన్స్(1)ను బారత పేసర్ క్రాంతి గౌడ్ పెవిలియన్ పంపింది. ఈ క్రమంలో కెప్టెన్ స్కివర్ బ్రంట్(41), లాంబ్(39) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ ఔటయ్యాక సోఫీ డంక్లీ(83), ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్(53) జట్టు స్కోర్ బోర్డును నడిపించారు.
వీరిద్దరూ ఐదో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. చరణి, అమన్‌జ్యోత్ కౌర్ తలా వికెట్ సాధించారు. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయింది.
తుది జట్లు
ఇంగ్లండ్: టామీ బ్యూమాంట్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), ఎమ్మా లాంబ్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంక్లీ, ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్, లారెన్ ఫైలర్, లారెన్ బెల్
భారత్: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, శ్రీ చరణి, క్రాంతి గౌడ్