
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ప్లే ఆఫ్స్‌లో గుజరాత్ టైటాన్స్ అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. దీంతో తమ ఫ్లే ఆఫ్స్ బెర్త్‌ను గుజరాత్ టీమ్ ఖారారు చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్(18 పాయింట్లు) అగ్రస్ధానంలో కొనసాగుతోంది.
గుజరాత్ విజయంతో ఆర్సీబీ(17 పాయింట్లు), పంజాబ్ కింగ్స్(17 పాయింట్లు) సైతం ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించాయి. మరో స్ధానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పోటీపడుతున్నాయి.
ఓపెనర్ల విధ్వంసం..
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 19 ఓవర్లలోనే ఊదిపడేసింది. గుజరాత్ ఓపెనర్లే మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. సాయిసుదర్శన్(58 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 108 నాటౌట్) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. శుబ్‌మన్ గిల్(53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ఒక్కరూ కనీసం వికెట్ సాధించలేకపోయారు.
రాహుల్ సెంచరీ వృథా..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు.
రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. ఇక రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.