
ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం బీసీసీఐ సెలక్షన్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది. భారత జట్టుకు కొత్త టెస్టు కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు సెలక్టర్లు మల్లుగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.
టెస్టు కెప్టెన్సీ రేసులో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ముందుంజలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికి.. బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కెప్టెన్సీ రేసులో గిల్‌తో పాటు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ పేర్లు కూడా వినిపిస్తున్నాడు.
తాజాగా ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన అభిప్రయాన్ని వెల్లడించాడు. వీరి ముగ్గురిలో శుబ్‌మన్ గిల్‌కే గవాస్కర్ ఓటేశాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ మే 23న ప్రకటించే అవకాశముంది. అదే రోజున కొత్త టెస్టు కెప్టెన్ పేరును బీసీసీఐ వెల్లడించనుంది.
"ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగించినా మన సూపర్ లీడర్స్ ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి స్ధాయికి చేరుకోవడానికి కచ్చితంగా రెండేళ్లు పడుతోంది. ఈ ముగ్గురు టెస్టు కెప్టెన్సీకి సరికొత్త అర్ధాన్ని తీసుకొచ్చారు. భారత కెప్టెన్సీకి ప్రధాన పోటీదారులైన గిల్, అయ్యర్, పంత్‌లను చూస్తుంటే, నాకు ధోని, రోహిత్, విరాట్ గుర్తుస్తున్నారు.
బహుశా అయ్యర్, పంత్ కంటే గిల్‌కే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా న్నాయి. గిల్‌కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అంతేకాకుండా మైదానంలో చాలా చురుగ్గా ఉంటూ వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: ఇది ‘ఇండియన్’ ప్రీమియర్ లీగ్: ఫారన్ ప్లేయర్లకు శ్రేయస్ కౌంటర్?