ఓపెన‌ర్లే కొట్టేశారు.. ఢిల్లీని చిత్తు చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ | IPL 2025: Delhi Capitals vs Gujarat Titans Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2025: ఓపెన‌ర్లే కొట్టేశారు.. ఢిల్లీని చిత్తు చేసిన గుజరాత్‌ టైటాన్స్‌

May 18 2025 7:09 PM | Updated on May 18 2025 11:09 PM

IPL 2025: Delhi Capitals vs Gujarat Titans Live Updates

PC: BCCI/IPL.com

IPL 2025 DC vs GT Live Updates: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి.

ప్లే ఆఫ్స్‌కు గుజరాత్‌..
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ వికెట్ నష్టపోకుండా 19 ఓవర్లలో ఛేదించింది. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్‌(61 బంతుల్లో 108) సూపర్ సెంచరీతో చెలరేగగా.. శుబ్‌మన్‌ గిల్‌(53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93 నాటౌట్‌) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

విజ‌యం దిశ‌గా గుజ‌రాత్‌
గుజ‌రాత్ టైటాన్స్ విజ‌యం దిశ‌గా దూసుకెళ్తోంది. 16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్ట‌పోకుండా 165 ప‌రుగులు చేసింది. క్రీజులో సాయిసుద‌ర్శ‌న్‌(87), శుబ్‌మ‌న్ గిల్‌(74) ఉన్నారు.

శుబ్‌మ‌న్ గిల్ హాఫ్ సెంచ‌రీ..
200 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో గుజ‌రాత్ టైటాన్స్ అద్బుతంగా ఆడుతోంది. 13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్‌ వికెట్ న‌ష్ట‌పోకుండా 134 ప‌రుగులు చేసింది. శుబ్‌మ‌న్ గిల్‌(59), సాయిసుద‌ర్శ‌న్‌(72) హాఫ్ సెంచ‌రీల‌తో త‌మ బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నారు.

7 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్‌: 63/0
7 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ టైటాన్స్ వికెట్ న‌ష్టపోకుండా 63 ప‌రుగులు చేసింది. క్రీజులో సాయిసుద‌ర్శ‌న్‌(46), శుబ్‌మ‌న్ గిల్‌(17) ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న గుజరాత్‌
200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్‌(25), శుబ్‌మన్ గిల్‌(6) ఉన్నారు.

కేఎల్ రాహుల్ సెంచరీ.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం
ఐపీఎల్‌-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

 ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. ఇక రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్‌(30), అక్షర్ పటేల్‌(25), స్టబ్స్‌(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్‌, సాయికిషోర్‌, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.

ఢిల్లీ రెండో వికెట్ డౌన్‌
అభిషేక్ పోరెల్ రూపంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 30 ప‌రుగులు చేసిన పోరెల్‌.. సాయికిషోర్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.
కేఎల్ రాహుల్ ఫిప్టీ..
అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచ‌రీ సాధించాడు. 65 ప‌రుగుల‌తో రాహుల్ త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 11 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ వికెట్ న‌ష్టానికి 98 ప‌రుగులు చేసింది.

6 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోర్‌: 44/1
6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ వికెట్ న‌ష్టానికి 44 ప‌రుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్‌(36), అభిషేక్ పోరెల్‌(1) ఉన్నారు.

ఢిల్లీ తొలి వికెట్ డౌన్‌..
ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 5 ప‌రుగులు చేసిన డుప్లెసిస్‌.. అర్ష‌ద్ ఖాన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 

ఆచితూచి ఆడుతున్న ఢిల్లీ ఓపెన‌ర్లు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిల‌క‌డ‌గా ఆడుతోంది. 3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ వికెట్ న‌ష్ట‌పోకుండా 14ప‌రుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్‌(9), ఫాఫ్ డుప్లెసిస్‌(3) ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో కీల‌క పోరుకు స‌మ‌యం అస‌న్న‌మైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజ‌రాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

తుది జ‌ట్లు
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్‌), జోస్ బట్లర్ (వికెట్ కీప‌ర్‌), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: ఫాఫ్ డు ప్లెసిస్ , అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), అక్షర్ పటేల్ (కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, టి నటరాజన్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement