
యశవంతపుర(కర్ణాటక): బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఓ వీడియో కలకలం రేపింది. మ్యాచ్ జరిగే సమయం లో పిచ్‌లోకి చొరబడి విరాట్ కోహ్లికి హగ్ చేస్తానంటూ శరణ్ అనే వ్యక్తి ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారు. అది వైరల్ అవు తుండగానే బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీసులు శరణ్ అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్టాలో లైక్స్, వీవ్స్ కోసం ఈ విధంగా వ్యవహరించినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.