
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. లావుగా ఉన్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కఠినమైన వ్యాయామాలతో పాటు ఆహారపు నియమాలు పాటించి ఆరు వారాల్లో 10 కిలోలు తగ్గాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు ఫిట్‌నెస్ మెరుగుపర్చుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న సర్ఫరాజ్.. కఠోరమైన నియమనిబంధనలు పాటించి స్లిమ్‌గా తయారయ్యాడు. ఇంకా ఫిట్‌గా, బెటర్ క్రికెటర్‌గా తయారయ్యేందుకు ఇంకాస్త బరువు తగ్గుతానని సర్ఫరాజ్ అంటున్నాడు.
కొత్త లుక్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ను ఎవరూ పోల్చుకోలేకపోతున్నారు. సర్ఫరాజ్ న్యూ లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరవలువుతున్నాయి. బరువు తగ్గకముందు, బరువు తగ్గాక సర్ఫరాజ్‌లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. బరువు తగ్గాక సర్ఫరాజ్ ఎంతో ఉత్సాహంగా, స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు.

కాగా, 27 ఏళ్ల సర్ఫరాజ్ ఓవర్ వెయిట్ కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అపారమైన నైపుణ్యమున్నప్పటికీ.. ఆ ఒక్కటీ (ఓవర్ వెయిట్) సర్ఫరాజ్‌ను టార్గెట్ చేసేలా ఉండింది. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు ముందు అతను స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా జిమ్‌లో జాయిన్ అయ్యాడు. న్యూట్రిషియన్‌ను పెట్టుకున్నాడు. ఉదయాన్నే గంట పాటు జాగింగ్, ఆతర్వాత అరగంట స్మిమ్మింగ్‌ను ప్రతి రోజు షెడ్యూల్ చేసుకున్నాడు.
సర్ఫరాజ్‌తో పాటు అతని కుటుంబం మొత్తం వెయిట్ లాస్ ప్రక్రియకు పూనుకుంది. సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్, అతని చిన్న సోదరుడు మొయిన్ ఖాన్ కూడా ఓవర్ వెయిట్ ఉంటారు. సర్ఫరాజ్ రెండో సొదరుడు మునీర్ ఖాన్ ఫిట్‌గా ఉన్నప్పటికీ అతను కూడా ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో వారితో పాటే నడిచాడు. మొత్తానికి సర్ఫరాజ్ వెయిట్ లాస్ జర్నీ స్పూర్తిదాయకంగా ఉంది.

ఇదిలా ఉంటే, సర్ఫరాజ్ వచ్చే నెలలో షెడ్యూలైన ఇంగ్లండ్ పర్యటన కోసం భారత-ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచ్‌ల్లో ప్రదర్శన ఆధారంగా ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేస్తారు. ఈ సిరీస్ సత్తా చాటి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని సర్ఫరాజ్ పట్టుదలగా ఉన్నాడు.
గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన హొం టెస్ట్ సిరీస్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తన డెబ్యూ మ్యాచ్‌లోనే రెండు అర్ద సెంచరీలు సాధించి (రెండు ఇన్నింగ్స్‌ల్లో) రికార్డుల్లోకెక్కాడు. అనంతరం గతేడాదే న్యూజిలాండ్‌పై 150 పరుగులు చేసిన సర్ఫరాజ్ తనలోని అత్యుత్తమ టాలెంట్‌ను వెలికి తీశాడు. అయితే తదనంతర పరిణామాల్లో (సీనియర్ల రాకతో) సర్ఫరాజ్‌కు టీమిండియాలో చోటు దక్కలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలోనూ అతనికి మొండిచెయ్యే ఎదురైంది.
ఇంగ్లండ్ పర్యటనకు భారత్ ఏ జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే