breaking news
India tour of England
-
వరుసగా మూడో మ్యాచ్‌లోనూ సెంచరీ చేసిన టీమిండియా యువ సంచలనం
టీమిండియా యువ సంచనలం ముషీర్ ఖాన్ ఇంగ్లండ్ పర్యటనలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోతున్నాడు. వరుస సెంచరీలు, ఐదు వికెట్ల ప్రదర్శనలతో దుమ్మురేపుతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎమర్జింగ్ టీమ్ (MCA Colts) తరఫున ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న ముషీర్ ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడు.ఈ పర్యటనలో Notts 2nd XIతో జరిగిన తొలి మ్యాచ్‌లో 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 123 పరుగులు చేసిన ముషీర్.. ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ ఇరగదీసి 6 వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం జులై 3న ఛాలెంజర్స్‌తో (కంబైన్డ్ నేషనల్ కౌంటీస్) ప్రారంభమైన రెండో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (127 బంతుల్లో 125; 11 ఫోర్లు, సిక్స్) చేసిన ముషీర్.. బౌలింగ్‌లోనూ చెలరేగి ఆ మ్యాచ్ మొత్తంలో పది వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 4) తీశాడు.తాజాగా ముషీర్ లౌబరో UCCE జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో ముషీర్ 146 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ముషీర్‌కు ఇంగ్లండ్ పర్యటనలో ఇది వరుసగా మూడో సెంచరీ.హ్యాట్రిక్ సెంచరీలు, అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శనలతో ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపుతున్న ముషీర్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. భారత క్రికెట్‌కు మరో భవిష్యత్ తార దొరికాడని టీమిండియా అభిమానులు సంబురపడిపోతున్నారు. 20 ఏళ్ల ముషీర్ గతేడాది సెప్టెంబర్‌లో కారు ప్రమాదానికి గురైన తర్వాత ఆడుతున్న తొలి రెడ్ బాల్ టోర్నీ ఇది.ఈ టోర్నీలో ముషీర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ భారత సీనియర్ టీమ్ సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. ఇప్పటికే భారత జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ముషీర్ అన్న సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నా టీమిండియా బెర్త్ దక్కడం లేదు. మరోవైపు కౌంటీల్లో సత్తా చాటుతూ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా భారత టెస్ట్ జట్టు బెర్త్ వైపు చూస్తున్నారు. ఇంత పోటీలో ముషీర్ టీమిండియా వైపు ఎలా వస్తాడో చూడాలి. ఇక్కడ ముషీర్‌కు ఓ అడ్వాంటేజ్ ఉంది. ముషీర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఇరగదీస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన ముషీర్.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కూడా సత్తా చాటాడు.ముషీర్‌కు దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్ సెంచరీ కూడా ఉంది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముషీర్ బౌలర్‌గానూ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్ 2024 అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్‌గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. -
ఇంగ్లండ్‌లో కొనసాగుతున్న టీమిండియా యువ సంచలనం హవా.. మరో సెంచరీ, 6 వికెట్లు
ఇంగ్లండ్ పర్యటనలో భారత యువ సంచలనం ముషీర్ ఖాన్ హవా కొనసాగుతోంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎమర్జింగ్ టీమ్ (MCA Colts) తరఫున ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న ముషీర్.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అదిరిపోయే ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో అదరగొట్టాడు.Notts 2nd XIతో జరిగిన తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో 123 పరుగులు (127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో) చేసిన ముషీర్.. ఆతర్వాత బౌలింగ్‌లో 6 వికెట్ల ప్రదర్శన (8.2 ఓవర్లలో 6/31) నమోదు చేశాడు.తాజాగా రెండో మ్యాచ్‌లోనూ ముషీర్ తొలి మ్యాచ్ తరహా ప్రదర్శనలు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో కూడా ముషీర్ సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి భారత క్రికెట్ అభిమానులు ముషీర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.భారత క్రికెట్‌కు మరో భవిష్యత్తు తార దొరికాడని ఆకాశానికెత్తుతున్నారు. ముషీర్‌కు సంబంధించిన తాజా వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.కారు ప్రమాదం నుంచి బయటపడి..!20 ఏళ్ల ముషీర్ గతేడాది సెప్టెంబర్‌లో కారు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో ముషీర్ మెడకు బలమైన గాయమైంది. ఆ ప్రమాదం తర్వాత ముషీర్ ఆడుతున్న తొలి రెడ్ బాల్ టోర్నీ ఇదే. ముషీర్ తన చివరి రెడ్ బాల్ మ్యాచ్‌ను దులీప్ ట్రోఫీలో ఇండియా-బి తరఫున ఆడాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ముషీర్ ఐపీఎల్ 2025లో ఆడాడు (పంజాబ్ కింగ్స్ తరఫున ఓ మ్యాచ్). ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్‌లో ముషీర్ డకౌటై నిరాశపరిచాడు. ఆ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ముషీర్ 3 బంతులు ఎదుర్కొని సుయాశ్ శర్మ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే ఇదే మ్యాచ్‌లో ముషీర్ బంతితో పర్వాలేదనిపించాడు. 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి మయాంక్ అగర్వాల్ వికెట పడగొట్టాడు.ముషీర్ ఖాన్ మరో టీమిండియా అప్ కమింగ్ మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు. ముషీర్‌కు దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్ సెంచరీ కూడా ఉంది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముషీర్ బౌలర్‌గానూ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్ 2024 అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్‌గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. -
ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేసిన మరో టీమిండియా యువ సంచలనం
ప్రస్తుతం భారత క్రికెట్ మొత్తం ఇంగ్లండ్ చుట్టూ తిరుగుతుంది. పురుషులు, మహిళలు, దివ్యాంగులు.. ఇలా విభాగంతో సంబంధం లేకుండా భారత క్రికెటర్లంతా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నారు. భారత పురుషుల సీనియర్ జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుండగా.. భారత పురుషుల అండర్-19 జట్టు ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఐదు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్ ఆడుతుంది. భారత సీనియర్ మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌లోనే ఉంది. ఈ పర్యటనలో భారత జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. పురుషులు, మహిళల జట్లే కాక, భారత పురుషుల దివ్యాంగ జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ జట్టు ఇంగ్లండ్ దివ్యాంగ టీమ్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఇదే కాక చాలామంది భారత పురుష క్రికెటర్లు ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. టీమిండియా యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, ఖలీల్ అహ్మద్ వేర్వేరు జట్ల తరఫున కౌంటీ ఛాంపియన్షిప్ ఆడుతున్నారు. వీరిలో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ తమ కౌంటీ అరంగేట్రంలోనే సెంచరీలు చేసి అదరగొట్టగా.. మిగతా ఇద్దరు తమ తొలి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.పైన పేర్కొన్న జట్లు, ఆటగాళ్లే కాక ప్రస్తుతం మరో భారత స్థానిక జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ ఎమర్జింగ్ జట్టును ఇంగ్లండ్‌కు పంపింది. ఈ జట్టు ప్రస్తుతం నాట్స్ సెకెండ్ 11తో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ సెంచరీతో అదరగొట్టాడు. ముషీర్ 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ముషీర్ సెంచరీ చేసిన విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఓ అధికారి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.HUNDRED FOR MUSHEER KHAN 🇮🇳- Mumbai Cricket Association has sent the Emerging players to UK and they are currently playing against Notts 2nd 11, A great work by MCA for Developing the young stars. pic.twitter.com/lFkqecQ37n— Johns. (@CricCrazyJohns) June 30, 2025ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అన్ని భారత క్రికెట్ జట్లలో ఒక్క భారత సీనియర్ పురుషుల జట్టు మినహా అన్ని జట్లు సక్సెస్ చూశాయి. భారత సీనియర్ పురుషుల జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓటమిపాలు కాగా.. అండర్-19 జట్టు తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. మరోవైపు భారత సీనియర్ మహిళల జట్టు తొలి టీ20లో ఇంగ్లండ్‌ను చిత్తు చేయగా.. భారత పురుషుల దివ్యాంగుల జట్టు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌ను ఓడించింది.ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత ఆటగాళ్లలో చాలామంది శతకాలు చేశారు. సీనియర్ పురుషుల జట్టులో జైస్వాల్, గిల్, రాహుల్, పంత్ (2).. సీనియర్ మహిళల జట్టులో స్మృతి మంధన.. కౌంటీల్లో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్.. తాజాగా ముషీర్ ఖాన్ శతకాలతో హోరెత్తించారు. ముషీర్ ఖాన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఈ సీజన్లో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. ముషీర్ దేశవాలీ సీజన్లో అన్న సర్ఫరాజ్ ఖాన్‌తో పోటీపడి పరుగులు సాధిస్తున్నాడు. అన్నదమ్ములిద్దరూ ముంబై జట్టుకే ఆడతారు. సర్ఫరాజ్ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌పై తృటిలో సెంచరీ చేజార్చుకుప్పటికీ.. టీమిండియా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేశాడు. అయినా అతనికి భారత జట్టు నుంచి పిలుపు రాలేదు. -
England Tour: యువ ఆటగాడిని వెనక్కి పిలిచిన బీసీసీఐ
ఇంగ్లండ్ పర్యటన కోసం టీమిండియా బ్యాకప్ పేసర్‌గా ఎంపికైన హర్షిత్ రాణాను బీసీసీఐ వెనక్కు పిలిచినట్లు తెలుస్తుంది. హర్షిత్‌ను వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు భారత మేనేజ్మెంట్ రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముందు హర్షిత్‌ను రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. రెండో టెస్ట్ కోసం బర్మింగ్హమ్కు పయనమైన భారత జట్టుతో పాటు హర్షిత్ లేడని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. వాస్తవానికి హర్షిత్ ఇంగ్లండ్ పర్యటన కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో లేడు. సుదీర్ఘంగా సాగే పర్యటన కావడంతో పేస్ బౌలర్లు గాయపడే అవకాశం ఉందని హెడ్ కోచ్ గంభీర్ ముందు జాగ్రత్త చర్యగా హర్షిత్ పేరును సిఫార్సు చేశాడు. దీంతో తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు హర్షిత్ హుటాహుటిన ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. అయితే తాజా పరిస్థితుల ప్రకారం బ్యాకప్ పేసర్ అవసరం లేదని భారత మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. జట్టులోని పేసర్లంతా ఫిట్‌గా ఉన్నారని సమాచారం. అందుకే మేనేజ్మెంట్ హర్షిత్‌ను బీసీసీఐకి సరెండర్ చేసినట్లు తెలుస్తుంది.గంభీర్‌పై విమర్శలుఇంగ్లండ్ పర్యటన కోసం హర్షిత్‌ను టీమిండియా బ్యాకప్ పేసర్ ఎంపిక చేసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వచ్చాయి. హర్షిత్ విషయంలో గంభీర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని విశ్లేషకులు బహిరంగ కామెంట్లు చేశారు. గంభీర్ కేకేఆర్ కోచ్‌గా ఉన్నప్పుడు హర్షిత్‌ను దగ్గరగా చూశాడు. అదే పరిచయంతో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక హర్షిత్ పేరును సెలెక్టర్లకు కూడా సిఫార్సు చేసినట్లు టాక్ వినిపించింది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాకే హర్షిత్ మూడు ఫార్మాట్లలో భారత్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. హర్షిత్‌లో గుర్తించదగ్గ ప్రత్యేకతలేమీ లేనప్పటికీ.. టీమిండియా తరఫున సులువుగా అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు హర్షిత్‌ను బ్యాకప్ పేసర్‌గా ఎంపిక చేయడంతో విమర్శల శృతి మించిందని గంభీరే స్వయంగా హర్షిత్‌ను బీసీసీఐ సరెండర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.కాగా, బ్యాకప్ పేసర్‌తో పాటు పేస్ బౌలింగ్ బలం సంపూర్ణంగా ఉన్నా భారత్ తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత ఓటమికి బౌలింగ్ విభాగం కూడా ఒకానొక కారణం. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా పుణ్యమా అని (5 వికెట్ల ప్రదర్శన) ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది. బుమ్రా సహా బౌలింగ్ విభాగమంతా తేలిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌కు పగ్గాలేయడం ఎవరి వల్ల కాలేదు. బుమ్రా సైతం చేతులెత్తేశాడు. ఫలితంగా భారత్ 371 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక పరాజయంపాలైంది. -
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ..!
భారత క్రికెట్ జట్టు రేపటి నుంచి (జూన్ 20) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్‌ను (2025-27) ప్రారంభిస్తుంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ రేపటి నుంచి మొదలవుతుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ హెడింగ్లేలోని లీడ్స్‌లో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్ ఇదివరకే తుది జట్టును ప్రకటించింది. భారత్ కూడా తుది జట్టుపై క్లారిటీ ఇచ్చేసింది. రోహిత్, విరాట్, అశ్విన్‌ల రిటైర్మెంట్ తర్వాత యంగ్ ఇండియా ఎదుర్కోబోయే తొలి అగ్నిపరీక్ష ఇదే.ఈ సిరీస్‌తో శుభ్‌మన్ గిల్ టీమిండియా కెప్టెన్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెడతాడు. భారత తుది జట్టులో చాలా మార్పులకు అవకాశం ఉంది. యువ ఆటగాడు సాయి సుదర్శన్ అరంగేట్రం దాదాపుగా ఖరారైపోయింది. బ్యాటింగ్ స్థానాలపై కూడా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ నిన్నటి ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చాడు. నాలుగో స్థానంలో గిల్, ఐదో ప్లేస్‌తో తను బ్యాటింగ్‌కు దిగుతామని పంత్ వెల్లడించాడు.ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్.. వన్‌డౌన్‌లో సాయి సుదర్శన్ పేర్లు కూడా దాదాపుగా ఖరారైపోయాయి. ఆరో స్థానంపై కూడా టీమిండియా మేనేజ్మెంట్కు నిన్నటి వరకు ఎలాంటి అనుమానం లేకుండింది. 8 ఏళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఈ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని మేనేజ్మెంట్ సూచనప్రాయంగా వెల్లడించింది.The incident where Karun Nair got hit at the nets by a delivery from @prasidh43 @RohanDC98 #ENGvsIND #Headingley pic.twitter.com/xGMsiSF8PA— RevSportz Global (@RevSportzGlobal) June 18, 2025అయితే నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్లో టీమిండియాకు ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తుంది. దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి టీమిండియా తలుపులు తట్టిన కరుణ్ నాయర్ నెట్స్ గాయపడ్డాడని ప్రచారం జరుగుతుంది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌ను ఎదుర్కోబోయి కరుణ్ పక్కటెముకల్లో దెబ్బ తగిలించుకున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఒకవేళ నిజంగానే కరుణ్ గాయపడినట్లైతే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలనట్లవుతుంది. కరుణ్ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించి జోరుమీదున్నాడు. అతని గాయం తీవ్రమైందైతే తుది జట్టులో అతని స్థానం గల్లంతైనట్లే. ఇది టీమిండియా బ్యాటింగ్ కూర్పును భారీగా ప్రభావితం చేస్తుంది. ఆరో స్థానం కోసం మేనేజ్మెంట్ మరో ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్థానం కోసం ప్రత్యామ్నాయ ఆటగాడిగా ధృవ్ జురెల్ అందుబాటులో ఉన్నప్పటికీ.. అతను మ్యాచ్ కోసం సిద్దంగా ఉండకపోవచ్చు. కరుణ్‌కు ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్‌తో ముందుకు వెళ్లాలనుకుంటే కూడా వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉన్నాడు. కరుణ్ గాయం తీవ్రమైందైతేనే ఈ ఈక్వేషన్స్ అన్నిటికీ ఆస్కారం ఉంటుంది. సోషల్‌మీడియాలోని మరో వర్గం కరుణ్ గాయాన్ని కొట్టిపారేస్తుంది. అతని గాయం తీవ్రమైంది కాదని అంటుంది. తొలి టెస్ట్‌లో కరుణ్ తప్పక ఆడతాడని చెబుతుంది. ఈ విషయమై మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత తుది జట్టు (అంచనా).. యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ/అర్షదీప్ సింగ్టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్. -
కాబోయే భార్యతో ఫోటోలు పోస్ట్ చేసి, వెంటనే డిలీట్ చేసిన కుల్దీప్ యాదవ్.. ఏం జరిగింది..?
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇటీవలే (జూన్ 4న) తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో నిశ్చితార్ధం చేసుకున్నాడు. లక్నోలోని ఓ హోటల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కుల్దీప్-వన్షిక సంప్రదాయ బద్దంగా ఉంగరాలు మార్చుకున్నారు. కాన్పూర్‌లోని శ్యామ్ నగర్ ప్రాంతానికి చెందిన వన్షిక ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తుంది. కుల్దీప్-వన్షిక ఎంగేజ్మెంట్కు యూపీకి చెందిన పలువురు క్రికెటర్లు, టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ హాజరయ్యారు. వివాహా తేదీని త్వరలో ప్రకటిస్తామని కుల్దీప్ చెప్పాడు.కాగా, కుల్దీప్-వన్షిక నిశ్చితార్ధం జరిగి రెండు వారాలు కూడా గడవకముందే వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందని సోషల్‌మీడియాలో పుకార్లు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ ఉదంతం ఈ పుకార్లకు బలం చేకూరుస్తుంది. కుల్దీప్ వన్షికతో కలిసి దిగిన ఫోటోలను నిన్న తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేశాడు. కుల్దీప్ ఇలా చేయడంపై క్రికెట్ ఫాలోవర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరి మధ్య ఏదో జరిగిందని గుసగుసలాడుకుంటున్నారు. కుల్దీప్-వన్షిక బంధం పెళ్లి వరకు కూడా సాగేలా లేదని కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కుల్దీప్ ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్నాడు. ఈ సిరీస్‌లో కుల్దీప్ టీమిండియాకు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కుల్దీప్ ఇంగ్లండ్ గడ్డపై ఇప్పటివరకు ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అందులోనూ అతను కేవలం తొమ్మిది ఓవర్లు మాత్రమే వేశాడు. ఇంగ్లిష్ కండీషన్స్‌పై పెద్ద అవగాహన లేని కుల్దీప్ ఏమేరకు రాణిస్తాడో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ సిరీస్‌లో భారత స్పిన్ విభాగం బరువును కుల్దీప్తో పాటు రవీంద్ర జడేజా మోయనున్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత ఈ ఇద్దరు భారత్ స్పిన్ విభాగానికి పెద్ద దిక్కుగా మారారు. అక్షర్ పటేల్ రూపంలో భారత్‌కు మరో స్పిన్ ఆప్షన్ ఉన్నా ఈ సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ ఉన్నా అతనికి తుది జట్టులో అవకాశం దొరకడం అనుమానమే. జూన్ 20 నుంచి హెడింగ్లేలో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. -
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు టీమిండియాకు గాయాల బెడద.. ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ప్రకటన
ఈ నెల 24 నుంచి ఇంగ్లండ్‌తో జరుగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు ముందు భారత అండర్-19 జట్టుకు గాయాల బెడద పట్టుకుంది. ఈ సిరీస్‌కు ఎంపికైన ఇద్దరు కీలక ఆటగాళ్లు (ఆదిత్య రాణా, ఖిలన్ పటేల్) బీసీసీఐ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా శిబిరంలో గాయపడ్డారు. ఆదిత్య వెన్ను భాగంలో స్ట్రెస్ ఫ్రాక్చర్‌కు గురి కాగా.. ఖిలన్ పటేల్ కుడి కాలి గాయానికి గురయ్యాడు. వీరిద్దరు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లరని బీసీసీఐ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. వీరికి ప్రత్యామ్నాయంగా దీపేశ్, నమన్ పుష్పక్లకు ఎంపిక చేసింది. దీపేశ్, పుష్పక్ ఇదివరకే ప్రకటించిన భారత జట్టు స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో ఉన్నారు.కాగా, ఇంగ్లండ్‌తో జరుగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత కెప్టెన్‌గా ఐపీఎల్ హీరో ఆయుశ్ మాత్రే (సీఎస్కే) ఎంపికయ్యాడు. ఈ జట్టులో మరో ఐపీఎల్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లలో వైభవ్.. మాత్రేతో కలిసి భారత ఇన్నింగ్స్‌లు ప్రారంభిస్తాడు. వైభవ్ తాజాగా జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో 90 బంతుల్లో 190 పరుగులు చేసి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఓ 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్, 5 వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్‌లు (టెస్ట్‌లు) ఆడుతుంది.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టు: ఆయుశ్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్-కెప్టెన్ & వికెట్‌కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్‌కీపర్), ఆర్ ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, నమన్ పుష్పక్, హెనిల్ పటేల్, యుద్దజిత్ గుహా, ప్రణవ్ రాఘవేంద్ర, మొహమ్మద్ ఎనాన్, దీపేశ్, అన్మోల్జీత్ సింగ్స్టాండ్బై ప్లేయర్స్: వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (వికెట్‌కీపర్)ఇంగ్లండ్ పర్యటనలో భారత అండర్-19 జట్టు షెడ్యూల్..జూన్ 24- 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్ (లోగ్‌బరో యూనివర్శిటీ)జూన్ 27- తొలి వన్డే (హోవ్)జూన్ 30- రెండో వన్డే (నార్తంప్టన్)జులై 2- మూడో వన్డే (నార్తంప్టన్)జులై 5- నాలుగో వన్డే (వార్సెస్టర్)జులై 7- ఐదో వన్డే (వార్సెస్టర్)జులై 12-15: తొలి మల్టీ డే మ్యాచ్ (బెకెన్హమ్)జులై 20-23: రెండో మల్టీ డే మ్యాచ్ (చెమ్స్‌ఫోర్డ్) -
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు సంచలన విషయాన్ని బయటపెట్టిన కరుణ్ నాయర్
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు (జూన్ 20) టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. మెయిల్ స్పోర్ట్ అనే ప్రముఖ మేగజైన్‌తో మాట్లాడుతూ.. ఓ బాంబు లాంటి వార్త చెప్పాడు.కరుణ్ మాటల్లో.. నాకు ఇప్పటికీ గుర్తుంది. రెండేళ్ల క్రితం టీమిండియాలో స్థానం కోసం పరితపిస్తున్న రోజులవి. ఆ సమయంలో ఓ అగ్రశ్రేణి భారత క్రికెటర్ నాకు ఫోన్ చేసి రిటైర్మెంట్ ప్రకటించమని సలహా ఇచ్చాడు. ప్రైవేట్ టీ20 లీగ్‌ల్లో చాలా డబ్బు వస్తుందని చెప్పడమే అతని ఉద్దేశం. అలా చేసి ఉండటం చాలా సులభం. కానీ నేను భారత క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చే ఏ విషయంలోనూ రాజీ పడదలచుకోలేదు. ఆ రోజు నేను డబ్బు గురించి ఆలోచించి ఉంటే ఈ రోజు ఇక్కడ (ఇంగ్లండ్‌లో) ఉండే వాడిని కాదు.టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలన్న ధృడమైన లక్ష్యంతో ఆ రోజు ఆ ప్రముఖ క్రికెటర్ సలహాను పెడచెవిన పెట్టిన కరుణ్.. రెండేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు టీమిండియాలో చోటు సాధించాడు. 2023లో కర్ణాటక నుండి విదర్భకు మారడం (దేశవాలీ క్రికెట్లో) కరుణ్ అదృష్టాన్ని మార్చేసింది.గత రెండు దేశవాలీ సీజన్లలో 1500కు పైగా పరుగులు సాధించిన కరుణ్ (విదర్భ).. టీమిండియా తలుపులు తట్టాడు. గత రంజీ సీజన్లో అసాధారణ ప్రదర్శన (53.93 సగటున 863) కనబర్చి విదర్భ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మధ్యలో ఇంగ్లండ్ కౌంట్లీలోనూ ఆడిన కరుణ్ అక్కడ కూడా సత్తా చాటాడు. రెండు సీజన్లలో నార్తప్టంన్షైర్ తరఫున 56.61 సగటున 736 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.నాయర్ తాజాగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో కూడా డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. విరాట్ కోహ్లి టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానానికి కరుణ్ సరైన అర్హుడని కొందరు భావిస్తున్నారు. 2018లో టీమిండియా తరఫున చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన కరుణ్.. దాదాపు ఏడేళ్ల తర్వాత 33 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇవ్వడం ఆసక్తికర పరిణామం. కరుణ్ తన చిన్నపాటి టెస్ట్ కెరీర్లోనే ట్రిపుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. కరుణ్ చేసిన ఆ ట్రిపుల్ సెంచరీ ఇంగ్లండ్‌పైనే కావడం విశేషం.ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టు..శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
శుభ్‌మన్ గిల్ ఓవరాక్షన్.. సచిన్, కోహ్లి కూడా ఎప్పుడూ అలా చేయలేదు..!
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా నయా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై విమర్శలు వస్తున్నాయి. గిల్ ఓ ఫోటో షూట్లో తనను స్పాన్సర్ చేస్తున్న ఎంఆర్ఎఫ్ కంపెనీ బ్యాట్‌తో దర్శనమిచ్చాడు. ఇందులో తప్పేముంది అని అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి.ఎంఆర్ఎఫ్ కంపెనీ క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చే ఆటగాళ్లకు స్పాన్సర్ చేస్తూ వస్తుంది. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ లాంటి స్టార్ ఆటగాళ్లకు ఈ కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తూ వచ్చింది. వీరంతా ఎంఆర్ఎఫ్ స్టిక్కర్లు ముద్రించిన బ్యాట్లను వినియోగిస్తారు.తమతో ఒప్పందంలో ఉన్న ఆటగాళ్లకు ఎంఆర్ఎఫ్ ఛాంపియన్, జీనియస్, మాస్టర్ లాంటి బిరుదులు ఇచ్చింది. వీటిని ఆటగాళ్ల బ్యాట్లపై కంపెనీ స్టిక్కర్‌తో పాటు ముద్రిస్తుంది. జీనియస్ అన్న పదాన్ని ఎంఆర్ఎఫ్ చాలాకాలం పాటు వాడింది. సచిన్, లారా, డివిలియర్స్, విరాట్ ఎంఆర్ఎఫ్ జీనియస్ అనే స్టిక్కర్లు ఉన్న బ్యాట్లు అధికంగా వాడారు.ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌కు ముందు గిల్‌తో ఒప్పందం చేసుకున్న ఎంఆర్ఎఫ్.. అతనికి కూడా జీనియస్ అన్న బిరుదును కొనసాగించింది. ఇక్కడి వరకు అంతా బాగుంది.గిల్ ఇటీవల టీమిండియా కొత్త కిట్ ఆవిష్కరణ సందర్భంగా ఎంఆర్ఎఫ్ లోగో ఉన్న బ్యాట్‌తో ఫోటో షూట్‌కు అటెండ్ అయ్యాడు. బీసీసీఐ అధికారికంగా విడుదల చేసిన ఈ ఫోటోల్లో కొందరు నెటిజన్లు గిల్ బ్యాట్‌పై ఎంఆర్ఎఫ్ జీనియస్ స్టిక్కర్‌తో పాటు ప్రిన్స్ అని ముద్రించడాన్ని గమనించారు.ఇదే గిల్‌పై విమర్శలకు దారి తీసింది. క్రికెట్లో ఎంతో సాధించిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి కూడా తమ బ్యాట్లపై తమ బిరుదులైన గాడ్, కింగ్ అన్న పదాలను ఎప్పుడూ ముద్రించుకోలేదు. గిల్ ఏవరో కొందరు ప్రిన్స్ అనగానే, ఆ పదాన్ని తన బ్యాట్‌పై ముద్రించుకున్నాడని విమర్శిస్తున్నారు. 🚨The Overhyped "Prince" of Indian Cricket🚨Shubman Gill is so self-obsessed. Who even called you the Prince? A so-called 'Prince of ICT with a poor SENA record, a below 35 Test average, and zero overseas centuries across all formats after 5 years in his international career. pic.twitter.com/SKxiUKT0pa— Niik (@Niiki099) June 11, 2025వాస్తవానికి ప్రిన్స్ అన్న బిరుదు మొదట లారా ఉండిందన్న విషయాన్ని 90 దశకంలోని అభిమానలు గుర్తు చేస్తున్నారు. గిల్ ప్రిన్స్ అన్న బిరుదుకు అర్హుడు కాదని అతని వ్యతిరేకులు కామెంట్లు చేస్తున్నారు. గిల్ ఏం సాధించాడని అతనికి ప్రిన్స్ అన్న బిరుదు అని ప్రశ్నిస్తున్నారు. గిల్‌కు టెస్ట్‌ల్లో 35 కంటే తక్కువ సగటు ఉందని గుర్తుకు చేస్తున్నారు. SENA దేశాల్లో అతనికి చెత్త రికార్డు ఉందని ప్రస్తావిస్తున్నారు. ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో విదేశాల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదని అని గుర్తు చేస్తున్నారు. ఆటగాళ్లకు బిరుదులను విశ్లేషకులు, దిగ్గజాలు ఇస్తారు. సోషల్‌మీడియాలో సొంత డబ్బాను బట్టి బిరుదులు రావంటూ మండిపడుతున్నారు. Sachin Tendulkar never played with a bat that had "God" written over it and Virat Kohli never played with a bat that had "King" written over it. You get tags with your performances and the tags are given by the greats of the game and not from the social media.— Cricket🏏 Lover // ICT Fan Account (@CricCrazyV) June 11, 2025గిల్ తన సొంతంగా బ్యాట్‌పై ప్రిన్స్ అన్న పదం ముద్రించుకున్నాడో లేక ఎంఆర్ఎఫ్ కంపెనీనే ఆ పదాన్ని ముద్రించిందో తెలియలేదు. కాగా, గిల్ ఇంగ్లండ్ పర్యటనకు ముందే టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ ఆకస్మిక రిటైర్మెంట్తో గిల్‌కు ఈ అదృష్టం వరించింది. -
వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు.. భారీ శతకంతో విరుచుకుపడ్డాడు
ఐపీఎల్ 2025 ద్వారా పరిచయమై (రాజస్తాన్ రాయల్స్ తరఫున), 14 ఏళ్ల వయసులోనే క్యాష్ రిచ్ లీగ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో) బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ.. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో మరోసారి చెలరేగిపోయాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో (ఎన్సీఏ) జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేవలం 90 బంతుల్లోనే 190 పరుగులు చేశాడు. వైభవ్ విధ్వంసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. వైభవ్ విధ్వంసం చూసి క్రికెట్ అభిమానులు అబ్బురపడుతున్నారు. VAIBHAV SURYAVANSHI MADNESS..!! 🥶🔥Vaibhav Suryavanshi smashed 190 off just 90 balls in a practice match during the India U-19 team's camp at the BCCI Centre of Excellence in Bengaluru. [Gaurav Gupta]pic.twitter.com/QFsVSWyZeQ— Sports Culture (@SportsCulture24) June 10, 202514 ఏళ్ల వయసులో ఈ కుర్రాడు ఇంత భారీ షాట్లు ఆడుతూ, ఇంత సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఎలా ఆడగలుగుతున్నాడని ఆశ్చర్యపోతున్నారు. పొట్టి క్రికెట్ భవిష్యత్తు ఇతడే అంటూ కీర్తిస్తున్నారు. భారత క్రికెట్లో వైభవ్ పెను సంచలనమని కొనియాడుతున్నారు. వైభవ్ టాలెంట్‌కు నీరాజనాలు పలుకుతున్నారు.కాగా, వైభవ్ త్వరలో ఇంగ్లండ్‌లో పర్యటించబోయే భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో భారత్ ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఓ 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్, 5 వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్‌లు (టెస్ట్‌లు) ఆడుతుంది. ఈ సిరీస్‌లకు భారత కెప్టెన్‌గా మరో ఐపీఎల్ హీరో ఆయుశ్ మాత్రే (సీఎస్కే) కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లలో వైభవ్.. మాత్రేతో కలిసి భారత ఇన్నింగ్స్‌లు ప్రారంభిస్తాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఎన్సీఏలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా శిబిరంలోనే వైభవ్ 90 బంతుల్లో 190 పరుగులు చేశాడు.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టు: ఆయుశ్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్-కెప్టెన్ & వికెట్‌కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్‌కీపర్), ఆర్ ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుద్దజిత్ గుహా, ప్రణవ్ రాఘవేంద్ర, మొహమ్మద్ ఎనాన్, ఆదిత్య రాణా, అన్మోల్జీత్ సింగ్స్టాండ్బై ప్లేయర్స్: నమన్ పుష్పక్, డి దీపేష్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (వికెట్‌కీపర్)ఇంగ్లండ్ పర్యటనలో భారత అండర్-19 జట్టు షెడ్యూల్..జూన్ 24- 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్ (లోగ్‌బరో యూనివర్శిటీ)జూన్ 27- తొలి వన్డే (హోవ్)జూన్ 30- రెండో వన్డే (నార్తంప్టన్)జులై 2- మూడో వన్డే (నార్తంప్టన్)జులై 5- నాలుగో వన్డే (వార్సెస్టర్)జులై 7- ఐదో వన్డే (వార్సెస్టర్)జులై 12-15: తొలి మల్టీ డే మ్యాచ్ (బెకెన్హమ్)జులై 20-23: రెండో మల్టీ డే మ్యాచ్ (చెమ్స్‌ఫోర్డ్) -
స్టేడియం పైకప్పు బద్దలు కొట్టిన పంత్.. వైరల్ వీడియో
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత సీనియర్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ జూన్ 20న లీడ్స్‌లోని హెడింగ్లేలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ జూన్ 13 నుంచి 16 వరకు కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్లో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్ కోసం భారత్ రెండు వారాల ముందే ఇంగ్లండ్‌లో వాలిపోయింది. ప్రస్తుతం టీమిండియా లార్డ్స్ క్రికెట్ మైదానంలో కఠోరమైన సాధన చేస్తుంది.- PANT BROKE THE ROOF WITH A SIX...!!!🔥 [Espn Cricinfo]- RISHABH PANT IS GEARING UP FOR THE TEST SERIES AGAINST ENGLAND.- RISHABH PANT IS IN GREAT TOUCH WITH BAT, GUD TO SEE HIM.#Rishabhpant#ENGvsIND#rinkusingh#RohitSharma#INDvsAUS#WTCFinalpic.twitter.com/t3dRuyeMGg— Nitesh Prajapati (@itsmenitesh004) June 9, 2025ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓ భారీ సిక్సర్ బాది వార్తల్లోకెక్కాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో పంత్ కొట్టిన ఓ సిక్సర్ స్టేడియం పైకప్పును బద్లలు కొట్టింది. దీనికి సంబంధిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసి పంత్ అభిమానులు సంబరపడిపోతున్నారు. తమ ఫేవరెట్ ఆటగాడు తిరిగి లయను అందుకున్నాడని ముచ్చటపడిపోతున్నారు.పంత్‌ను ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ సిరీస్‌లో అతను తొలిసారి భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన శుభ్‌మన్ గిల్‌కు డిప్యూటీగా వ్యవహరిస్తాడు. పంత్‌కు ఇంగ్లండ్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ అతను 17 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 32.70 సగటున 556 పరుగులు చేశాడు. పంత్ ఇంగ్లండ్ గడ్డపై చివరి సారి ఆడిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. 2022 పర్యటనలో అతను 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు.పేలవ ఫామ్ కొనసాగినా..!పంత్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రద్శనలు చేశాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. సీజన్ ఆధ్యాంతం పేలవ ఫామ్‌లో కొనసాగిన పంత్.. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్‌లో పంత్ విధ్వంసకర శతకంతో (61 బంతుల్లో 118 నాటౌట్) విరుచుకుపడ్డాడు. అయినా ఆ మ్యాచ్‌లో పంత్ జట్టు ఎల్ఎస్జీ ఓటమిపాలైంది. జితేశ్ శర్మ ఊహకందని మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. ఈ సీజన్‌కు ముందు ఎల్ఎస్జీ పంత్‌ను రికార్డు ధర రూ. 27 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు. ఇంత డబ్బుపోసి కొనుక్కునా ఈ సీజన్లో పంత్ దారుణంగా నిరాశపరిచాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా తేలిపోయాడు. సీజన్ ఆరంభంలో టైటిల్ ఫేవరెట్‌గా కనిపించిన లక్నో చివరి వచ్చే సరికి ఏడో స్థానంతో సీజన్‌ను ముగించింది. ఇంగ్లండ్ పర్యటనలోనైనా పంత్ స్థాయికి తగ్గట్టు రాణించాలని కోరుకుందాం. -
టీమిండియాకు స్వల్ప ఆధిక్యం
ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న రెండో నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత ఏ జట్టుకు 21 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌కు 327 పరుగుల వద్ద తెరపడింది. ఖలీల్ అహ్మద్ (19-1-70-4), అన్షుల్ కంబోజ్ (18-3-56-2), తుషార్ దేశ్‌పాండే (14-1-62-2), తనుశ్ కోటియన్ (11-2-25-1), నితీశ్ కుమార్ రెడ్డి (12-2-49-1) చెలరేగడంతో లయన్స్ భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటలేకపోయింది. 192/3 స్కోర్ వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన లయన్స్ టీ విరామం లోపే మిగతా 7 వికెట్లు కోల్పోయింది. ఇవాళ ఆటలో ఖలీల్ అహ్మద్ నిప్పులు చెరిగాడు. ఇవాళ లయన్స్ కోల్పోయిన 7 వికెట్లలో ఖలీల్ ఒక్కడే 4 వికెట్లు తీశాడు. లయన్స్ చివరి ముగ్గురు ఆటగాళ్లు ఫర్హాన్ అహ్మద్ (24), జోష్ టంగ్ (36 నాటౌట్), ఎడ్వర్డ్ జాక్ (16) ప్రతిఘటించడంతో లయన్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.లయన్స్ ఇన్నింగ్స్‌లో టామ్ హెయిన్స్ 54, ఎమిలియో గే 71 అర్ద సెంచరీలతో రాణించగా.. జోర్డర్ కాక్స్ 45, బెన్ మెక్‌కిన్నీ 12, జేమ్స్ ర్యూ 10, జార్జ్ హిల్ 0, క్రిస్ వోక్స్ 5, మ్యాక్స్ హోల్డన్ 7 పరుగులు చేశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (116) అద్భుతమైన శతకంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ధృవ్ జురెల్ (52), కరుణ్ నాయర్ (40), నితీశ్ కుమార్ రెడ్డి (34) రాణించారు. యశస్వి జైస్వాల్ (17), అభిమన్యు ఈశ్వరన్ (11), శార్దూల్ ఠాకూర్ (19), తనుశ్ కోటియన్ (15), అన్షుల్ కంబోజ్ (2), తుషార్ దేశ్‌పాండే (11) తక్కువ స్కోర్‌కు ఔటయ్యారు. -
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో కీలక నియామకం
త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో కీలక నియామకం జరిగింది. సోహమ్ దేశాయ్ స్థానంలో టీమిండియా నూతన స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా సౌతాఫ్రికాకు చెందిన అడ్రియన్ లె రౌక్స్ నియమితుడయ్యాడు. అడ్రియన్ గతంలో (2002 జనవరి-2003 మే) కూడా భారత జట్టుకు సేవలందించాడు. అడ్రియన్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. క్రికెటేతర ట్రైనింగ్ ద్వారా ఆటగాళ్ల ఫిట్నెస్ను పెంపొందించడమే స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ విధి. ఈ విధిలో అడ్రియన్ నిష్ణాతుడు. క్వాలిఫైడ్ స్పోర్ట్స్ సైంటిస్ట్‌గా అడ్రియన్‌కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అడ్రియన్.. ప్రస్తుతం లార్డ్స్‌లో ఉన్న టీమిండియాతో జతకట్టాడని బీసీసీఐ ఓ వీడియో ద్వారా తెలియజేసింది. అడ్రియన్ పర్యవేక్షణలో టీమిండియా అత్యంత కఠినమైన హై ఇంటెన్సిటి ట్రైనింగ్ తీసుకుంటుంది.2002 నాట్‌వెస్ట్ ట్రోఫీలో టీమిండియా విజయంలో అడ్రియన్ కీలకపాత్ర పోషించాడు. ఆతర్వాత అతను 2003-2007 వరకు సౌతాఫ్రికా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా పని చేశాడు. అడ్రియన్ ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 2019 వరకు కేకేఆర్‌తో.. ఆతర్వాత పంజాబ్‌తో పని చేశాడు. అడ్రియన్ 22 ఏళ్ల విరామం తర్వాత కీలకమైన ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు.ఇదిలా ఉంటే, జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత ఇదివరకే లండన్‌లో ల్యాండైంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్‌కు ముందే గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ సిరీస్‌కు ముందే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) -
నిప్పులు చెరిగిన సీఎస్కే బౌలర్
ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత ఏ బౌలర్, సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ నిప్పులు చెరిగాడు. మూడో రోజు ఆటలో ఖలీల్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీశాడు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి పటిష్టంగా (192/3) ఉన్న లయన్స్ మూడో రోజు ఆట తొలి సెషన్లోనే కష్టాల్లో పడింది. కడపటి వార్తలందే సరికి లయన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఫర్హాన్ అహ్మద్ 11, జోష్ టంగ్ 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు లయన్స్ ఇంకా 83 పరుగులు వెనుకపడి ఉంది.మూడో రోజు ఆటలో ఖలీల్ జోర్డర్ కాక్స్ (45), జేమ్స్ ర్యూ (10), జార్జ్ హిల్ (0), క్రిస్ వోక్స్ (5) వికెట్లు తీశాడు. రెండో రోజు 10 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన ఖలీల్.. ఇవాళ ఆట తొలి సెషన్లోనే 4 వికెట్లు తీసి భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు పునాది వేశాడు. ఈ రోజు ఆటలో ఖలీల్‌తో పాటు తుషార్ దేశ్‌పాండే కూడా ఓ వికెట్ తీశాడు. తుషార్.. మ్యాక్స్ హోల్డన్‌ను (7) ఔట్ చేశాడు.అంతకుముందు లయన్స్ ఆటగాళ్లు టామ్ హెయిన్స్ (54), ఎమిలియో గే (71) అర్ద సెంచరీలతో రాణించగా.. బెన్ మెక్‌కిన్నీ (12) తక్కువ స్కోర్‌కు ఔటయ్యాడు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 4, తుషార్ దేశ్‌పాండే 2, అన్షుల్ కంబోజ్, తనుశ్ కోటియన్ చెరో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (116) అద్భుతమైన శతకంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ధృవ్ జురెల్ (52), కరుణ్ నాయర్ (40), నితీశ్ కుమార్ రెడ్డి (34) రాణించారు. యశస్వి జైస్వాల్ (17), అభిమన్యు ఈశ్వరన్ (11), శార్దూల్ ఠాకూర్ (19), తనుశ్ కోటియన్ (15), అన్షుల్ కంబోజ్ (2), తుషార్ దేశ్‌పాండే (11) తక్కువ స్కోర్‌కు ఔటయ్యారు. -
శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాణించిన కరుణ్ నాయర్, జురెల్
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సహచర టీమిండియా సభ్యుల కంటే ముందుగానే ఇంగ్లండ్‌లో ల్యాండైన కేఎల్ రాహుల్ వచ్చీ రాగానే పని మొదలుపెట్టాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో ఇవాళ (జూన్ 6) ప్రారంభమైన రెండో అనధికారిక టెస్ట్‌లో అర్ద సెంచరీ పూర్తి చేసి సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ 151 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. యశస్వి జైస్వాల్‌కు జతగా బరిలోకి దిగిన రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి చాలా సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. ఎలాంటి దూకుడైన షాట్లు ఆడకుండా, చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలించి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.మరో ఎండ్‌లో జైస్వాల్ (17), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (11) తక్కువ స్కోర్లకే ఔటైనా, తొలి అనధికారిక టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ సహకారంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలి టెస్ట్ ఫామ్‌నే కొనసాగించిన కరుణ్ ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్ దిశగా సాగుతున్న వేల క్రిస్ వోక్స్ అతనికి అడ్డుకట్ట వేశాడు. వోక్స్ ఓ అద్భుతమైన బంతితో కరుణ్‌ను 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీడబ్ల్యూ చేశాడు. కరుణ్ ఔటయ్యాక రాహుల్ ధృవ్ జురెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్ట్‌లో రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటిన జురెల్.. రాహుల్‌తో కలిసి 50 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 55 ఓవర్ల అనంతరం భారత్-ఏ స్కోర్ 234/3గా ఉంది. భారత్-ఏ కోల్పోయిన మూడు వికెట్లు క్రిస్ వోక్స్ ఖాతాలనే పడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ లయన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాపం సర్ఫరాజ్ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇచ్చేందుకు గత మ్యాచ్‌లో సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్‌ను తప్పించారు. సర్ఫరాజ్ తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో 92 పరుగులు చేశాడు. రాహుల్ ఓపెనర్‌గా రావడంతో కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ మూడో స్థానానికి డిమోట్ అయ్యాడు. బౌలింగ్ డిపార్ట్మెంట్లోనూ ఓ కీలక మార్పు జరిగింది. తొలి మ్యాచ్‌లో 3 వికెట్లతో రాణించిన ముకేశ్ కుమార్ స్థానంలో ఖలీల్ అహ్మద్‌ను బరిలోకి దించారు. అలాగే హర్ష్ దూబే స్థానంలో తనుశ్ కోటియన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో రెండో అనధికారిక టెస్ట్ కోసం భారత-ఏ జట్టు..యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్, అన్షుల్ కంబోజ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్ -
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు సంబంధించి కీలక అప్డేట్
భారత టెస్ట్ జట్టు పూర్తి స్థాయి కెప్టెన్ హోదాలో శుభ్‌మన్ గిల్ తొలిసారి మీడియా ముందుకు రానున్నాడు. ఇవాళ (జూన్ 5) సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌ను హాజరు కానున్నాడు. ఈ సమావేశానికి గిల్‌తో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరవుతాడు.భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగనుంది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా త్వరలోనే లండన్‌కు బయల్దేరుతుంది. ఈ సమావేశంలో గిల్, గంభీర్ ఇంగ్లండ్‌లో అనుసరించబోయే వ్యూహాలు, తదుపరి డబ్ల్యూటీసీ సైకిల్లో ప్రణాళికల గురించి మీడియాకు వివరిస్తారు. దిగ్గజ ఆటగాళ్లు రోహిత్, విరాట్, అశ్విన్ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాక జరుగనున్న సిరీస్ కావడంతో ఇంగ్లండ్ టూర్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. గిల్ ఇటీవలే రోహిత్ శర్మ నుంచి భారత టెస్ట్ జట్టు పగ్గాలు చేపట్టాడు. బుమ్రా, పంత్ లాంటి సీనియర్లు ఉన్నా బీసీసీఐ గిల్‌కే టెస్ట్ కెప్టెన్సీ అప్పగించింది. గిల్ నేతృత్వంలో భారత టెస్ట్ క్రికెట్లో కొత్త శకం మొదలుకానుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో యువకులు, అనుభవజ్ఞులు ఉన్నారు. వీరిని సమన్వయపరుచుకుంటూ గిల్ ఏ మేరకు నెట్టుకు రాగలడో చూడాలి. ఇంగ్లండ్ పర్యటనలో గిల్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) రిషబ్ పంత్‌ను నియమించారు.ఇంగ్లండ్ పర్యటనలో భారత్ జూన్ 20న తొలి టెస్ట్ ఆడనుంది. లీడ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అనంతరం జులై 2, 10, 23, 31 తేదీల్లో రెండు, మూడు, నాలుగు, ఐదు టెస్ట్ మ్యాచ్‌లు బర్మింగ్హమ్, లార్డ్స్, మాంచెస్టర్, కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికలుగా జరుగనున్నాయి. ఈ సిరీస్‌కు ముందు భారత్ జూన్ 13-16 మధ్యలో ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపికైన మెజార్టీ సభ్యులు ఇప్పటికే ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నారు. భారత-ఏ జట్టులో భాగమైన వారు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఇదివరకే ముగిసింది. రెండో మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ పర్యటన కోసం భారత టెస్ట్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
ఇంగ్లండ్‌కు బయల్దేరిన కేఎల్ రాహుల్
త్వరలో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టాడు. రాహుల్ నిన్ననే ముంబై నుంచి లండన్‌కు బయల్దేరాడు. రాహుల్ లండన్‌లోని హీథ్రూ విమానాశ్రయంలో ల్యాండైన దృశ్యాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.రాహుల్ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడతాడు. ఈ మ్యాచ్ కోసమే రాహుల్ చాలా ముందుగా లండన్‌లో ల్యాండయ్యాడు. ఈ మ్యాచ్ జూన్ 6న ప్రారంభం కానుంది. నార్తంప్టన్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం తనను ముందుగానే ఇంగ్లండ్‌కు పంపాలని రాహుల్ బీసీసీఐకి ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. భారత్‌లో వాతావరణం ప్రాక్టీస్‌కు అనువుగా లేదని, అందుకే తనకు లయన్స్‌తో మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వాలని రాహుల్ బీసీసీఐని కోరాడు. రాహుల్ కోరిక మేరకు బీసీసీఐ అతన్ని ముందుగానే లండన్‌కు పంపింది.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు భారత్-ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ నిన్ననే ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అయ్యింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లకు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపికైన కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ తృటిలో సెంచరీలు మిస్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్, ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి అర్ద సెంచరీలతో రాణించారు.లయన్స్‌తో రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ తర్వాత భారత జట్టు ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ జూన్ 13 నుంచి 16 వరకు జరుగుతుంది. అనంతరం జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు జూన్ 5వ తేదీ తర్వాత లండన్‌కు బయల్దేరుతుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్‌కు ముందే గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ సిరీస్‌కు ముందే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) -
England Tour: డబుల్ సెంచరీకి చేరువలో కరుణ్ నాయర్
ఇంగ్లండ్ లయన్స్‌తో ఇవాళ (మే 30) మొదలైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు ఆటగాళ్లు కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ఇరగదీశారు. వీరిలో కరుణ్ నాయర్ డబుల్ సెంచరీకి చేరువలో (186 నాటౌట్) ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్ (119 బంతుల్లో 92; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సర్ఫరాజ్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన ధృవ్ జురెల్ (82 నాటౌట్) అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఏ 3 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది.కాంటర్బరీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత-ఏ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 8 పరుగులకే ఔటయ్యాడు. ఆతర్వాత మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కరుణ్ నాయర్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ కూడా 24 పరుగుల వద్ద ఔటయ్యాడు.జైస్వాల్ ఔటయ్యాక ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కరుణ్ నాయర్ తీసుకున్నాడు. కరుణ్.. సర్ఫరాజ్ సహకారంతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టును గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ కూడా ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఔటయ్యే సమయానికే భారత్ పటిష్ట స్థితిలో ఉంది.సర్ఫారాజ్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన ధృవ్ జురెల్ కూడా ఇరగదీశాడు. కరుణ్, జురెల్ ఇద్దరు పోటీపోటీగా ఆడుతూ భారత్‌ను అతి భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. -
ఇంగ్లండ్ పర్యటనలో తొలి ఇన్నింగ్స్‌లోనే సత్తా చాటిన కరుణ్ నాయర్
దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి ఎట్టకేలకు భారత జట్టులో చోటు సంపాదించిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ పర్యటనలో తన తొలి ఇన్నింగ్స్‌లోనే సత్తా చాటాడు. ఇంగ్లండ్ లయన్స్, భారత్-ఏ మధ్య ఇవాళ (మే 30) ప్రారంభమైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో కరుణ్ అర్ద సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కరుణ్ 85 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 8 పరుగులకే ఔటయ్యాడు. ఆతర్వాత మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కరుణ్ నాయర్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ కూడా 24 పరుగుల వద్ద ఔటయ్యాడు. జైస్వాల్ ఔటయ్యాక ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కరుణ్ నాయర్ తీసుకున్నాడు. కరుణ్.. సర్ఫరాజ్ సహకారంతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టును గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్తున్నాడు. 44 ఓవర్ల అనంతరం భారత జట్టు స్కోర్ 158/2గా ఉంది. కరుణ్ 66, సర్ఫరాజ్ 48 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నారు.కాగా, కరుణ్ నాయర్‌కు ఇంగ్లండ్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఇక్కడ కౌంటీలు ఆడిన కరుణ్.. 21 ఇన్నింగ్స్‌ల్లో ఓ డబుల్ సెంచరీ, ఓ సెంచరీ, 7 అర్ద సెంచరీల సాయంతో 1025 పరుగులు చేశాడు.2024 అక్టోబర్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కరుణ్ స్కోర్లు.. 66* (ప్రస్తుత మ్యాచ్), 135, 86, 6, 45, 29, 122, 105, 3, 4, 39, 123, 85ఇదిలా ఉంటే, 33 ఏళ్ల కరుణ్ నాయర్ ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఈ లీగ్‌లో తన తొలి మ్యాచ్‌లోనే కరుణ్ ఆకట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడాడు. ఈ మ్యాచ్ మినహా కరుణ్ ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయినా దేశవాలీ క్రికెట్లో ట్రాక్ రికార్డు కారణంగా కరుణ్‌కు ఇంగ్లండ్ టూర్‌కు పిలుపు అందింది. ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లకు, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌లకు కరుణ్ ఎంపికయ్యాడు.గతేడాది కాలంగా భారత క్రికెట్ సర్కిల్స్‌లో కరుణ్ పేరు మార్మోగిపోతుంది. ఈ మధ్యకాలంలో అతను ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు.ఈ ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి నమ్మశక్యంకాని సగటుతో (389.50) 779 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి.ఈ ఏడాది రంజీ ట్రోఫీలోనూ కరుణ్ అదే జోష్‌ను కొనసాగించాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 57.33 సగటున 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి విదర్భ జట్టును ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.కరుణ్ అరివీర భయంకరమైన ఫామ్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఇవే కాక కరుణ్ గతేడాది ప్రారంభంలో జరిగిన మహారాజా ట్రోఫీలోనూ పరుగుల వరద పారించాడు. టీ20 ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్‌ల్లో 188.4 స్ట్రయిక్‌రేట్‌తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇంగ్లండ్ దేశవాలీ సీజన్లో కరుణ్ 11 ఇన్నింగ్స్‌ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
కేఎల్ రాహుల్.. నీ కమిట్మెంట్కు సలాం..!
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్‌కు చేరని జట్ల ఆటగాళ్లందరూ ప్రస్తుతం వారివారి పనుల్లో నిమగ్నమైపోయారు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత ఏ ఆటగాళ్లు ఇవాల్టి నుంచి ఇంగ్లండ్ లయన్స్‌తో తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత ఏ జట్టు రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఆతర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఐపీఎల్ పూర్తయిన తర్వాత ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెడతారు.కాగా, ఐపీఎల్లో తన జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఖాళీగా ఉన్న ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ బీసీసీఐని ఓ విషయం కోసం అభ్యర్దించినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఎంపికై, ప్రస్తుతం భారత్‌లోనే ఉన్న రాహుల్ ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ కోసం తనను ఎంపిక చేయాలని బీసీసీఐని కోరాడట.ప్రస్తుతం భారత్‌లో వాతావరణ పరిస్థితులు ప్రాక్టీస్‌కు అనుకూలంగా లేకపోవడంతో (వర్షాలు) లయన్స్‌తో టెస్ట్ మ్యాచ్ తన ప్రాక్టీస్‌కు ఉపయోగపడుతుందని రాహుల్ భావిస్తున్నాడట. ఇందుకే తనను లయన్స్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌కు ఎంపిక చేయాలని బీసీసీఐని కోరాడట. ఈ విషయంపై స్పందించిన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాహుల్‌కు రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. రాహుల్‌ను సోమవారం (జూన్ 2) లండన్‌కు బయల్దేరాల్సిందిగా ఆదేశించిందట.జాతీయ జట్టు తరఫున రాణించేందుకు రాహుల్ బీసీసీఐకి చేసిన విన్నపం గురించి తెలిసి భారత క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. రాహుల్ కమిట్మెంట్కు సలాం కొడుతున్నారు. స్టార్డమ్ ఉన్న ఇతర ఆటగాళ్లు ఖాళీ దొరికితే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చూస్తారు. రాహుల్ మాత్రం తన దేశం తరఫున రాణించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాండంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లండ్ లయన్స్‌తో రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి నార్తంప్టన్ వేదికగా జరుగనుంది.ఇంగ్లండ్ లయన్స్‌తో టెస్ట్ మ్యాచ్‌లకు ఎంపిక చేసిన భారత-ఏ జట్టు..కరుణ్ నాయర్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, తనుశ్ కోటియన్, హర్ష్ దూబే, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, ఆకాశ్దీప్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
ఇండియా ఏతో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. వోక్స్, ఫ్లింటాఫ్‌కు చోటు
మే 30 నుంచి ఇండియా-ఏతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ లయన్స్ జట్టును ఇవాళ (మే 21) ప్రకటించారు. ఈ జట్టుకు వెటరన్ పేసర్ క్రిస్ వోక్స్ ఎంపికయ్యాడు. వోక్స్ కాలి మడమ గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ గాయం కారణంగానే జింబాబ్వేతో రేపటి నుంచి ప్రారంభం కాబోయే నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌కు వోక్స్‌ను ఎంపిక చేయలేదు.ఇండియా ఏతో సిరీస్‌కు ఎంపిక చేసిన లయన్స్ జట్టుకు జేమ్స్ ర్యూ సారథ్యం వహించనున్నాడు. వోక్స్‌తో పాటు రెహాన్ అహ్మద్, డాన్ మౌస్లీ లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సిరీస్ కోసం భారత-ఏ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో సత్తా చాటే ఆటగాళ్లకు జాతీయ జట్లలో చోటు దక్కే అవకాశం ఉంది.భారత్-ఏతో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ లయన్స్ జట్టు..జేమ్స్ ర్యూ (కెప్టెన్), ఫర్హాన్ అహ్మద్, రెహాన్ అహ్మద్, సోనీ బేకర్, జోర్డాన్ కాక్స్, రాకీ ఫ్లింటాఫ్, ఎమిలియో గే, టామ్ హైన్స్, జార్జ్ హిల్, జోష్ హల్, ఎడ్డీ జాక్, బెన్ మెకిన్నీ, డాన్ మౌస్లీ, అజీత్ సింగ్ డేల్, క్రిస్ వోక్స్ఇంగ్లండ్ లయన్స్‌తో సిరీస్‌కు భారత-ఏ జట్టు..యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, హర్ష్ దూబే, తనుశ్ కోటియన్, ఇషాన్ కిషన్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, తుషార్ దేశ్‌పాండే, ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్, ఖలీల్ అహ్మద్భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య అనధికారిక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..మే 30-జూన్ 2- తొలి టెస్ట్ (కాంటర్బరీ)జూన్ 6-9- రెండో టెస్ట్ (నార్తంప్టన్) -
'అందుకే' మందు మానేశా: స్టార్ క్రికెటర్
లండన్: ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. తరచు గాయాల బారిన పడుతూ మళ్లీ మళ్లీ ఆటకు దూరమవుతున్న 33 ఏళ్ల స్టోక్స్ గత ఏడాది డిసెంబర్ తర్వాత అసలు ఏ స్థాయి మ్యాచ్ కూడా ఆడలేదు. తొడ కండరాల గాయంతో తప్పుకున్న అతను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. వేగంగా ఫిట్నెస్ అందుకునే క్రమంలో భాగంగా ‘రీహాబిలిటేషన్’ సమయంలో మద్యానికి దూరంగా ఉన్నట్లు వెల్లడించాడు. ‘నాకు తొలిసారి గాయమైనప్పుడు నా శరీరం చికిత్సకు సరిగా స్పందించలేదు. ఇది ఎలా జరిగిందని ఆలోచిస్తే వారం రోజుల క్రితం బాగా మద్యం తాగిన విషయం గుర్తుకొచి్చంది. బహుశా అది కూడా కారణం కావచ్చనిపించింది. దాంతో ఈసారి గాయం తర్వాత చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను మారితే మంచిదని భావించా. అయితే పూర్తిగా అది సాధ్యం కాదు కాబట్టి రీహాబిలిటేషన్ వరకు నియంత్రణలో ఉండేందుకు ప్రయత్నించా. మైదానంలోకి దిగే వరకు దీనిని పాటించాలని ప్రయతి్నస్తున్నా. అందుకే ఈ ఏడాది జనవరి నుంచి మద్యం మానేశా. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానిని ముట్టలేదు’ అని స్టోక్స్ చెప్పాడు. గురువారం నుంచి జింబాబ్వేతో జరిగే ఏకైక టెస్టులో బరిలోకి దిగనున్న స్టోక్స్...ఆ తర్వాత భారత్‌తో టెస్టు సిరీస్, యాషెస్ సిరీస్ కోసం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టీమిండియా యువ క్రికెటర్
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. లావుగా ఉన్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కఠినమైన వ్యాయామాలతో పాటు ఆహారపు నియమాలు పాటించి ఆరు వారాల్లో 10 కిలోలు తగ్గాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు ఫిట్నెస్ మెరుగుపర్చుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న సర్ఫరాజ్.. కఠోరమైన నియమనిబంధనలు పాటించి స్లిమ్‌గా తయారయ్యాడు. ఇంకా ఫిట్‌గా, బెటర్ క్రికెటర్‌గా తయారయ్యేందుకు ఇంకాస్త బరువు తగ్గుతానని సర్ఫరాజ్ అంటున్నాడు.కొత్త లుక్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ను ఎవరూ పోల్చుకోలేకపోతున్నారు. సర్ఫరాజ్ న్యూ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరవలువుతున్నాయి. బరువు తగ్గకముందు, బరువు తగ్గాక సర్ఫరాజ్‌లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. బరువు తగ్గాక సర్ఫరాజ్ ఎంతో ఉత్సాహంగా, స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు.కాగా, 27 ఏళ్ల సర్ఫరాజ్ ఓవర్ వెయిట్ కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అపారమైన నైపుణ్యమున్నప్పటికీ.. ఆ ఒక్కటీ (ఓవర్ వెయిట్) సర్ఫరాజ్‌ను టార్గెట్ చేసేలా ఉండింది. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు ముందు అతను స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా జిమ్‌లో జాయిన్ అయ్యాడు. న్యూట్రిషియన్‌ను పెట్టుకున్నాడు. ఉదయాన్నే గంట పాటు జాగింగ్, ఆతర్వాత అరగంట స్మిమ్మింగ్‌ను ప్రతి రోజు షెడ్యూల్ చేసుకున్నాడు.సర్ఫరాజ్‌తో పాటు అతని కుటుంబం మొత్తం వెయిట్ లాస్ ప్రక్రియకు పూనుకుంది. సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్, అతని చిన్న సోదరుడు మొయిన్ ఖాన్ కూడా ఓవర్ వెయిట్ ఉంటారు. సర్ఫరాజ్ రెండో సొదరుడు మునీర్ ఖాన్ ఫిట్‌గా ఉన్నప్పటికీ అతను కూడా ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో వారితో పాటే నడిచాడు. మొత్తానికి సర్ఫరాజ్ వెయిట్ లాస్ జర్నీ స్పూర్తిదాయకంగా ఉంది.ఇదిలా ఉంటే, సర్ఫరాజ్ వచ్చే నెలలో షెడ్యూలైన ఇంగ్లండ్ పర్యటన కోసం భారత-ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచ్‌ల్లో ప్రదర్శన ఆధారంగా ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేస్తారు. ఈ సిరీస్ సత్తా చాటి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని సర్ఫరాజ్ పట్టుదలగా ఉన్నాడు.గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన హొం టెస్ట్ సిరీస్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తన డెబ్యూ మ్యాచ్‌లోనే రెండు అర్ద సెంచరీలు సాధించి (రెండు ఇన్నింగ్స్‌ల్లో) రికార్డుల్లోకెక్కాడు. అనంతరం గతేడాదే న్యూజిలాండ్‌పై 150 పరుగులు చేసిన సర్ఫరాజ్ తనలోని అత్యుత్తమ టాలెంట్‌ను వెలికి తీశాడు. అయితే తదనంతర పరిణామాల్లో (సీనియర్ల రాకతో) సర్ఫరాజ్‌కు టీమిండియాలో చోటు దక్కలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలోనూ అతనికి మొండిచెయ్యే ఎదురైంది. ఇంగ్లండ్ పర్యటనకు భారత్ ఏ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే -
ఇంగ్లండ్ టూర్‌కు ఆర్సీబీ కెప్టెన్.. కరుణ్, సాయి సుదర్శన్‌కు కూడా పిలుపు..?
ఐపీఎల్ 2025 ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్ మధ్యలో ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరుతుంది. ఈ పర్యటనలో టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ 35 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తుంది.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25, అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సెలెక్టర్లు మరో అవకాశం ఇస్తారని తెలుస్తుంది. ఇన్ ఫామ్ బ్యాటర్ కరుణ్ నాయర్, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ జట్టులో చోటు దక్కించుకోనున్నారని సమాచారం. ఐపీఎల్ 2025లో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్న గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్‌ను ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా సీఎస్కే యువ సంచలనం ఆయుశ్ మాత్రే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.అశ్విన్ రిటైర్ కావడంతో అతని స్థానాన్ని కుల్దీప్ యాదవ్‌తో భర్తీ చేయనున్నారని సమాచారం. ఈ సిరీస్ కోసం అక్షర్ పటేల్ పేరు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. అలాగే మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పేరును కూడా సెలెక్టర్లు పక్కన పెట్టారని తెలుస్తుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సత్తా చాటుతున్న శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలా వద్దా అన్న అంశంపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ప్రధాన పేసర్లుగా బుమ్రా, షమీ ఎంపిక దాదాపుగా ఖరారైనప్పటికీ.. సేఫ్టీగా వీలైనంత ఎక్కువ మంది రిజర్వ్ పేసర్లను ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత సీనియర్ జట్టుతో పాటు భారత-ఏ జట్టును కూడా మే రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, భారత ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్ 2025లో బిజీగా ఉన్నారు. ఈ లీగ్‌లో ప్రదర్శనల ఆధారంగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికలు జరుగుతాయి. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లను భారత సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవచ్చు. ఫార్మాట్ వేరైనా ఆటగాళ్లలో కన్సిస్టెన్సీని గమనిస్తారు.ప్రస్తుతం ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతుంది. మొత్తం ఏడు జట్లు నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్‌ల కోసం ప్రధానంగా పోటీపడుతున్నాయి. ఏ జట్టుకు ఇప్పటివరకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కాలేదు. సీఎస్కే మినహా అన్ని జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో ఆర్సీబీ ముందుంది. ఆ జట్టు 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆతర్వాత ముంబై, గుజరాత్, ఢిల్లీ తలో 12 పాయింట్లతో వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ (11), లక్నో (10), కేకేఆర్ (9) ఆతర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాజస్థాన్ (6), సన్‌రైజర్స్ (6), సీఎస్కే (4) 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి. -
IND VS ENG 5th Test: బాగా ఆడలేదు, ఓడాం.. పరాజయానికి సాకులు చెప్పదల్చుకోలేదు..!
గత కొన్ని ఫలితాలు మాకు తీవ్ర నిరాశ కలిగించాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో, ఇక్కడా మాకు మంచి అవకాశాలు లభించాయి. కానీ వాటిని ఉపయోగించుకోలేకపోయాం. బౌలింగ్‌లో ఒకే తరహా తీవ్రత, ప్రదర్శన, ఫిట్నెస్ మ్యాచ్ ఆసాంతం కొనసాగించలేకపోవడం దానికి కారణమని భావిస్తున్నా. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. తుది జట్టుపై చర్చ సహజం. శార్దుల్ బాగానే ఆడుతున్నాడు కాబట్టే మరో అవకాశమిచ్చాం. అశ్విన్ స్థాయి ఆటగాడిని పక్కన పెట్టడం అంత సులువు కాదు. అయితే తొలి రోజు పిచ్ చూసినప్పుడు పేసర్లకు అనుకూలిస్తుందని అనిపించింది. మ్యాచ్ చివరి వరకు కూడా బంతి పెద్దగా స్పిన్ కాలేదు. పిచ్‌లో కూడా పెద్దగా మార్పు రాలేదు కాబట్టి రెండో స్పిన్నర్ ఉన్నా ఫలితం మారకపోయేదేమో. తొలి నాలుగు టెస్టుల సమయంలో నేను లేను. అప్పుడు ఇంగ్లండ్ కొంచెం ఇబ్బంది పడ్డా, ఇప్పుడు వరుసగా మూడు విజయాల తర్వాత ఇక్కడకు వస్తే, మనం టెస్టులు ఆడి చాలా రోజులైంది. అయినా ఓటమికి సాకులు చెప్పదల్చుకోలేదు. ఇంగ్లండ్ కీలక సమయాల్లో బాగా ఆడింది కాబట్టి టెస్టు గెలవగలిగింది. –రాహుల్ ద్రవిడ్, భారత్ హెడ్ కోచ్ -
IND VS ENG 5th Test: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో భారీ షాక్
అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు పుండు మీద కారం చల్లే పరిణామం! ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్‌పై ఐసీసీ చర్య తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానాతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల నుంచి 2 పాయింట్లు కోత విధించింది. దాంతో డబ్ల్యూటీసీ పాయింట్ల జాబితాలో మన జట్టు నాలుగో స్థానానికి పడిపోయింది. ఇదే సిరీస్ తొలి టెస్టులో, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ టెస్టులో కూడా ఇదే తరహాలో స్లో ఓవర్ రేట్ శిక్షకు గురైన టీమిండియా మొత్తంగా ఈ ఏడాది డబ్ల్యూటీసీలో ఐదు పాయింట్లు ఇలాగే కోల్పోయింది. కాగా, బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్లు తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పరాభవంతో పటౌడీ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. స్కోరు వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 416; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284; భారత్ రెండో ఇన్నింగ్స్: 245; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: లీస్ (రనౌట్) 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0; రూట్ (నాటౌట్) 142; బెయిర్‌స్టో (నాటౌట్) 114; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (76.4 ఓవర్లలో 3 వికెట్లకు) 378. వికెట్ల పతనం: 1–107, 2–107, 3–109. బౌలింగ్: బుమ్రా 17–1–74–2, షమీ 15–2–64–0, జడేజా 18.4–3–62–0, సిరాజ్ 15–0–98–0, శార్దుల్ 11–0–65–0. -
IND VS ENG: పంత్ సెంచరీ చేశాడంటే టీమిండియాకు ఓటమి తప్పదా..?
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మ్యాచ్ ఆఖరి రోజు టీమిండియా గెలుపుకు మరో 7 వికెట్లు అవసరముండగా.. ఇంగ్లండ్ విజయానికి మరో 119 పరుగులు కావాల్సి ఉంది. వరుణుడు ఆటంకం కలిగిస్తేనో లేక ఏదైనా అద్భుతం జరిగితేనో తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా పరాజయాన్ని ఆపడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లోనూ టీమిండియా అభిమానులు తమ బౌలర్లపై ఏ మూలనో ఆశ పెట్టుకుని ఉన్నారు. ఆఖరి రోజు తమ పేసర్లు చెలరేగి టీమిండియాకు మరపురాని విజయాన్ని అందిస్తారని వారు భావిస్తున్నారు. ఏదో మూలన భారత విజయావకాశాలు మినుకుమినుకుమంటున్నా ఫాన్స్‌ను ప్రస్తుతం ఓ అంశం కలవరపెడుతంది. అదేంటంటే.. విదేశాల్లో రిషబ్ పంత్ సెంచరీ బాదిన సందర్భాల్లో టీమిండియా గెలిచిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఇదే విషయం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. పంత్ తన టెస్ట్ కెరీర్లో మొత్తం 5 సెంచరీలు బాదగా.. అందులో నాలుగు విదేశీ పిచ్‌లపై సాధించినవే ఉన్నాయి. ఈ నాలుగింటిలో పంత్ సిడ్నీలో సెంచరీ చేసిన మ్యాచ్ డ్రా కాగా.. మిగతా రెండు మ్యాచ్‌ల్లో (ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ను మినహాయించి) టీమిండియా ఓటమిపాలైంది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ రిపీటైతే టీమిండియాకు మరో ఓటమి తప్పదని భారత అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. పంత్ సెంచరీల వివరాలు.. 1. 2018 ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్ (ఐదో టెస్ట్) పంత్ 114- టీమిండియా ఓటమి 2. 2019 ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా (నాలుగో టెస్ట్) పంత్ 159 నాటౌట్- మ్యాచ్ డ్రా 3. 2021 ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా (నాలుగో టెస్ట్) పంత్ 101- ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో టీమిండియా విజయం 4. 2022 ఇండియా టూర్ ఆఫ్ సౌతాఫ్రికా (మూడో టెస్ట్) పంత్ 100 నాటౌట్- టీమిండియా ఓటమి 5. 2022 ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్ (ఐదో టెస్ట్) పంత్ 146, 57- ? ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్ వివరాలు.. టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 259/3. చదవండి: Ind Vs Eng: టీమిండియా ఫ్యాన్స్‌కు చేదు అనుభవం.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. -
రంగంలోకి దిగిన హిట్‌మ్యాన్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ..!
ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్‌కు ముందు కరోనా బారిన పడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా కోలుకున్నాడు. ఎనిమిది రోజుల ఐసోలేషన్‌ను పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్.. కోవిడ్ నెగిటివ్ రిపోర్టు రాగానే ప్రాక్టీస్ సైతం మొదలుపెట్టాడు. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు తాను రెడీ అంటూ అభిమానులకు సంకేతాలు పంపాడు. ఆదివారం క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన హిట్ మ్యాన్.. నెట్స్‌లో చాలా సేపు ప్రాక్టీస్ చేశాడు. భారీ షాట్లు కాకుండా డిఫెన్స్‌కే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించిన రోహిత్.. నెట్స్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఈ వీడియోను చూసిన హిట్‌మ్యాన్ అభిమానులు.. ఇక ఇంగ్లీషోల్లకు దబిడిదిబిడే అంటూ కామెంట్లు చేస్తున్నారు. Exclusive and Latest video 📸 Captain Rohit Sharma is looking in great touch in nets. pic.twitter.com/OsXPZP4r32 — Rohit Sharma Fanclub India (@Imro_fanclub) July 4, 2022 ఇదిలా ఉంటే, రోహిత్ శర్మకు కరోనా నెగిటివ్ రిపోర్డు వచ్చినప్పటికీ మరో పరీక్షకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. హిట్‌మ్యాన్‌కు ఇవాళ (జులై 4) గండె రక్తనాళాలకు సంబంధించిన పరీక్ష చేయాల్సి ఉందని.. ఆ రిపోర్టు ఆధారంగానే అతను తొలి టీ20కి అందుబాటులో ఉంటాడా.. లేదా..? అన్న విషయంపై క్లారిటీ వస్తుందని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు. రోహిత్‌కు ఈ టెస్ట్‌లో నార్మల్ రిపోర్ట్ వచ్చినా మళ్లీ ఫిట్నెస్ పరీక్షను సైతం ఎదుర్కొనాల్సి ఉంటుంది. కరోనా నిబంధనల ప్రకారం హిట్‌మ్యాన్ ఈ ప్రొసీజర్ మొత్తాన్ని క్లియర్ చేస్తేనే తొలి టీ20కి అందుబాటులో ఉంటాడు. కాగా, జులై 7 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లలో మూడు టీ20లు, మూడు వన్డేలు జరగాల్సి ఉన్నాయి. చదవండి: భువీ రికార్డు బద్ధలు కొట్టిన బుమ్రా .@ImRo45 - out and about in the nets! 👏 👏 Gearing up for some white-ball cricket. 👌 👌#TeamIndia | #ENGvIND pic.twitter.com/nogTRPhr9a — BCCI (@BCCI) July 4, 2022 -
భువీ రికార్డు బద్ధలు కొట్టిన బుమ్రా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే ఓ ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టిన (టెస్ట్ క్రికెట్లో ఓ ఓవర్లో అత్యధిక పరుగులు (31)) బుమ్రా తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 21 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఇంగ్లండ్ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2014 సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్ పడగొట్టిన 19 వికెట్లే (5 మ్యాచ్‌ల సిరీస్‌లో) ఇప్పటివరకు అత్యధికం కాగా, తాజా సిరీస్‌లో బుమ్రా.. భువీ రికార్డును తిరగరాశాడు. ఈ జాబితాలో జహీర్ ఖాన్ (2007లో 18 వికెట్లు), ఇషాంత్ శర్మ (2018లో 18 వికెట్లు), సుభాశ్ గుప్తే (1959లో 17 వికెట్లు) బుమ్రా, భువీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సాధారణంగా టీమిండియా తరఫున అత్యధిక వికెట్ల ఘనత స్పిన్నర్లకు దక్కుతుంటుంది. అయితే ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక వికెట్లు (ఓ సిరీస్‌లో) సాధించిన టాప్-5 బౌలర్లలో ఒక్కరే స్పిన్నర్ ఉండటం విశేషం.సుభాశ్ గుప్తే.. 1959 ఇంగ్లండ్ సిరీస్‌లో (5 టెస్ట్ మ్యాచ్‌లు) 17 వికెట్లు సాధించాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పదో స్థానంలో బరిలోకి దిగి బ్యాట్‌తో (16 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ల సాయంతో 31 పరుగులు) చెలరేగిన బుమ్రా.. ఆతర్వాత బంతితోనూ, ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటాడు. తొలుత ఇంగ్లండ్ టాప్ 3 బ్యాటర్లను ఔట్ చేసి బుమ్రా.. ఆ తర్వాత ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అద్భుతమైన డైవిండ్ క్యాచ్ అందుకుని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇక మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్ప్‌లో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసిన భారత్.. ఓవరాల్‌గా 257 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. పుజారా (50), పంత్ (30) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో రోజు ఆటలో టీమిండియా మరో 100 పరుగులు చేయగలిగితే మరింత పటిష్ట స్థితికి చేరుకుంటుంది. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు కష్టమే.. టీమిండియాదే విజయం! -
హర్షల్ ఆల్‌రౌండ్ షో.. రెండో మ్యాచ్‌లోనూ టీమిండియాదే విజయం
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఓ పక్క టెస్ట్ మ్యాచ్‌లో చెలరేగి ఆడుతుంటే, మరో పక్క యువ భారత జట్టు టీ20ల్లో దుమ్మురేపుతోంది. డెర్బీషైర్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన యువ భారత్.. నార్తంతాంప్టన్షైర్ క్లబ్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. నిన్న జరిగిన ఈ మ్యాచ్‌లో డీకే సారధ్యంలోని యంగ్ ఇండియా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. నామమాత్రపు స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. టాపార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలం కాగా.. కెప్టెన్ డీకే (26 బంతుల్లో 34; 3 ఫోర్లు, సిక్స్), హర్షల్ పటేల్ (36 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) టీమిండియాను ఆదుకున్నారు. నార్తంతాంప్టన్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 3, బక్, ఫ్రెడ్డీ హెల్డ్రిచ్ తలో 2 వికెట్లు, కాబ్ ఓ వికెట్ పడగొట్టారు. ఛేదనలో భారత బౌలర్లు విజృంభించడంతో నార్తంతాంప్టన్ 19.3 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో సైఫ్ జైబ్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, చహల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ధ్ కృష్ణ, వెంకటేశ్ అయ్యర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. హర్షల్ పటేల్ ఆల్‌రౌండర్ షోతో (54, 2/23) టీమిండియా వరుసగా రెండో టీ20లోనూ విజయం సాధించింది. చదవండి: వారెవ్వా... కెప్టెన్ బుమ్రా -
రోహిత్ శర్మకు ‘నెగెటివ్’
ఎట్టకేలకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా నెగెటివ్ ఫలితం వచ్చింది. ఫలితంగా అతను ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చాడు. ఇంగ్లండ్‌తో ఈనెల 7న మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. లీస్టర్‌షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండో రోజు రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. రెండుసార్లు అతనికి పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు దూరమయ్యాడు. -
గల్లీ క్రికెట్‌ను తలపించిన టీమిండియా వార్మప్ మ్యాచ్.. ఔటైనా నాటౌటే..!
భారత్-లీస్టర్‌షైర్ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్ గల్లీ క్రికెట్‌ను తలపించింది. మూడో రోజు టీమిండియా బ్యాటింగ్ సమయంలో కొన్ని వింతలు చోటు చేసుకున్నాయి. భారత బ్యాటర్లు రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ రెండో ఇన్నింగ్స్‌లో ఔటైన మళ్లీ బ్యాటింగ్ కొనసాగించి అర్ధసెంచరీలు స్కోర్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో లీస్టర్‌షైర్ తరఫున ఆడిన నయా వాల్ పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తరఫున.. రెండు ఇన్నింగ్స్‌ల్లో టీమిండియా తరఫున ఆడిన శుభ్‌మన్ గిల్ లీస్టర్‌షైర్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి బ్యాటింగ్‌కు దిగాడు. వార్మప్ మ్యాచ్ కావడంతో టీమిండియా ఆటగాళ్లు రూల్స్‌ను పక్కకు పెట్టి గట్టిగా ప్రాక్టీస్ చేశారు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌కు ముందు జరుగుతున్న మ్యాచ్ కావడంతో భారత ఆటగాళ్లంతా సాధ్యమైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ మ్యాచ్‌లో మరో రోజు (నాలుగో రోజు) ఆట మిగిలి ఉంది. నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి లీస్టర్‌షైర్ వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. లీస్టర్‌షైర్ టీమిండియాపై గెలవాలంటే మరో 287 పరుగులు సాధించాల్సి ఉంది. శుభ్‌మన్ గిల్ (46), శామ్యూల్ ఈవాన్స్ (17) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 246/8.. రెండో ఇన్నింగ్స్‌లో 364/7 స్కోర్ల వద్ద డిక్లేర్ చేసింది. లిస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సమయానికి (జులై 1) రోహిత్ కోలుకోకపోతే బుమ్రా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే గాయం కారణంగా కేఎల్ రాహుల్, కోవిడ్ కారణంగా అశ్విన్ ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. చదవండి: కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు.. -
ఫిఫ్టి కొట్టి బుమ్రా ఉచ్చులో చిక్కిన కోహ్లి
లీస్టర్‌షైర్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి అర్ధసెంచరీ సాధించాడు. మూడో రోజు ఆటలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి.. 98 బంతులను ఎదుర్కొని 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. అనంతరం బుమ్రా బౌలింగ్‌లో అబ్దైన్ సఖండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో స్వేచ్ఛగా షాట్లు ఆడిన కోహ్లి సెంచరీ సాధిస్తాడని అంతా భావించారు. అయితే వారికి మరోసారి నిరాశే ఎదురైంది. 90/1 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. మూడో రోజు మూడో సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్ (43), హనుమ విహారి (20), శార్దూల్ ఠాకూర్ (28), పుజారా (22) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ (46), రవీంద్ర జడేజా (19) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు టీమిండియా 246/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. లీస్టర్‌షైర్ 244 పరుగులకు ఆలౌటైంది. కాగా, జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చదవండి: కోపం వస్తే మాములుగా ఉండదు.. మరోసారి నిరూపితం -
కోహ్లి వికెట్ తీశానని నా మనవళ్లతో గర్వంగా చెప్పుకుంటా..!
Roman Walker: ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా లీస్టర్‌షైర్‌తో 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో లీస్టర్‌షైర్ బౌలర్ రోమన్ వాకర్ 5 వికెట్ల ప్రదర్శనతో రెచ్చిపోవడంతో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే (246/8 డిక్లేర్) పరిమితం కాగా.. టీమిండియా బౌలర్ల ధాటికి లీస్టర్‌షైర్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్, విహారి క్రీజ్‌లో ఉన్నారు. ☝️ | Kohli (33) lbw Walker.@RomanWalker17 strikes again! This time he hits the pads of Kohli, and after a long wait the umpire's finger goes up. Out or not out? 🤔 🇮🇳 IND 138/6 𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌: https://t.co/adbXpwig48 👈 🦊 #IndiaTourMatch | #LEIvIND pic.twitter.com/iE9DNCUwLO — Leicestershire Foxes 🏏 (@leicsccc) June 23, 2022 ఇదిలా ఉంటే, తొలి రోజు ఆటలో కోహ్లి, రోహిత్ సహా మొత్తం ఐదు వికెట్లు (5/25) పడగట్టిన రోమన్ వాకర్ కోహ్లి వికెట్‌ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్లో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న 21 ఏళ్ల వాకర్ కోహ్లి వికెట్ పడగొట్టడంపై స్పందిస్తూ.. తొలి ఇన్నింగ్స్‌లో నా పర్ఫామెన్స్ సంతృప్తినిచ్చింది.. ప్రపంచంలోనే మేటి బ్యాటర్ అయిన విరాట్ కోహ్లి వికెట్ నాకు జీవితకాలం గుర్తుండిపోతుంది.. కోహ్లి వికెట్ సాధించిన అనంతరం నా టీమ్ మేట్స్ కొందరు మెసేజ్ చేశారు.. కోహ్లి వికెట్ గురించి నీ మనవళ్లతో గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు.. అవును వరల్డ్ క్లాస్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఔట్ చేశానని నా మనవళ్లతో గర్వంగా చెప్పుకుంటానని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించిన వాకర్ 57 బంతుల్లో 7 ఫోర్లతో 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చదవండి: సిక్సర్‌తో పంత్ అర్థశతకం.. ఫామ్‌లోకి వచ్చినట్టేనా! -
షాకింగ్ న్యూస్: విరాట్ కోహ్లికి కరోనా పాజిటివ్..?
టీమిండియా అభిమానులకు చేదు వార్త. రీ షెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. కోహ్లి లండన్‌లో ల్యాండయ్యాక షాపింగ్ అంటూ వివిధ ప్రదేశాల్లో సంచరిస్తూ, ఫ్యాన్స్‌తో సెల్ఫీలకు పోజులిచ్చాడు. అక్కడే అతను కోవిడ్ బారిన పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లి ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరక ముందు మాల్దీవ్స్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేశాడు. A lucky day for this fan as he got to meet both Virat Kohli and Rohit Sharma. pic.twitter.com/DN5B2ZSYuJ — Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2022 కోహ్లి కొద్ది రోజులగా జట్టు సహచరులతో క్లోజ్‌గా ఉండటంతో భారత శిబిరంలోనూ కరోనా కలవరం మొదలైంది. ప్రాక్టీస్ సందర్భంగా కోహ్లి టీమ్ మేట్స్‌తో అత్యంత సన్నిహితంగా ఉండి ఫోటోలు దిగాడు. కోహ్లి కోవిడ్ బారిన పడ్డాడన్న వార్త నేపథ్యంలో ఇంగ్లండ్‌తో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌పై సందేహాలు నెలకొన్నాయి. కాగా, టీమిండియా ఇంగ్లండ్‌కు బయల్దేరడానికి ముందు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, కోవిడ్ కారణంగా గతేడాది అర్ధంతరంగా నిలిచిపోయిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: Ind Vs Eng: ఇంగ్లండ్‌తో టీమిండియా పోరు.. పూర్తి షెడ్యూల్, ‘జట్టు’ వివరాలు! -
మళ్లీ మొదలైన రగడ.. వాన్‌కు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చిన వసీం జాఫర్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ల మధ్య ట్విటర్ వార్ మళ్లీ మొదలైంది. ఇంగ్లండ్‌తో టీమిండియా సిరీస్ ప్రారంభానికి ముందు వీరిద్దరు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. తాజాగా జాఫర్ చేసిన ఓ ట్వీట్‌కు వాన్ కౌంటర్ ఇవ్వడంతో రగడ మొదలైంది. వాన్ కౌంటర్ ట్వీట్‌ను జాఫర్ తనదైన స్టైల్లో తిప్పికొట్టడంతో ట్విటర్ వార్ పతాక స్థాయికి చేరింది. జాఫర్-వాన్ల మధ్య జరుగుతున్న ఈ వార్ క్రికెట్ ఫాలోవర్స్‌కు కావాల్సిన మజాను అందిస్తుంది. జాఫర్-వాన్ల మధ్య వార్ ఎక్కడ మొదలైందంటే.. జాఫర్ జూన్ 21న ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో కూర్చొని దిగిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీనిపై వాన్ స్పందిస్తూ.. నేను తొలి టెస్ట్ వికెట్ తీసుకొని 20 ఏళ్లు అయిన సందర్భంగా ఇక్కడికి వచ్చావా అంటూ జాఫర్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన జాఫర్ తనదైన స్టైల్లో వాన్‌పై కౌంటర్ అటాక్ చేశాడు. Sun is shining, the weather is sweet @HomeOfCricket 😊 pic.twitter.com/ImwcAS5YYh — Wasim Jaffer (@WasimJaffer14) June 20, 2022 2007 ఇంగ్లండ్ టూర్లో టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా ఫొటోను పోస్ట్ చేస్తూ.. దీని 15వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చాను అంటూ వాన్‌కు దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాడు. జాఫర్ వాన్‌కు ఇచ్చిన ఈ స్ట్రోక్ టీమిండియా అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. నిద్రపోయిన సింహాన్ని గెలికితే ఇలాగే ఉంటదంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. Is it the 20th anniversary of my first Test wicket you are here for Wasim ? https://t.co/7Ul5Jw62ra — Michael Vaughan (@MichaelVaughan) June 20, 2022 Here for the 15th anniversary of this Michael 😄 #ENGvIND https://t.co/Qae4t8IRpf pic.twitter.com/gZC5ShGNwS — Wasim Jaffer (@WasimJaffer14) June 21, 2022 కాగా, ఇంగ్లండ్‌లో టీమిండియా చివరిసారి 2007లో టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్ టీమిండియాకు నాయకత్వం వహించాడు. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0తో చేజిక్కించుకుంది. ఆ సిరీస్‌లో టీమిండియా గెలిచిన నాటింగ్హమ్ టెస్ట్‌లో మైఖేల్ వాన్ సెంచరీ చేసినప్పటికీ ఇంగ్లండ్‌ను ఆదుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు అర్ధ సెంచరీలు సాధించడంతో టీమిండియా పట్టు బిగించింది. ఆ మ్యాచ్‌లో జాఫర్ అర్ధ సెంచరీ సహా 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే, 2007లో ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా ఆ అవకాశం వచ్చింది. గతేడాది అర్ధంతరంగా నిలిచిపోయిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. అప్పుడు రద్దైన ఐదో టెస్ట్ మ్యాచ్‌ను భారత్ జులై 1 నుంచి ఆడనుంది. ఈ మ్యాచ్‌ను టీమిండియా కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ విజయం సాధిస్తుంది. చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్.. కోవిడ్ నుంచి కోలుకున్న స్టార్ స్పిన్నర్ -
టీమిండియాకు గుడ్ న్యూస్.. కోవిడ్ నుంచి కోలుకున్న స్టార్ స్పిన్నర్
India Tour Of England 2022: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ కోవిడ్ బారిన పడటంతో ఈ నెల 16న టీమిండియా సభ్యులతో పాటు ఇంగ్లండ్‌కు బయల్దేరని విషయం తెలిసిందే. అయితే తాజాగా అశ్విన్‌కు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు రావడంతో ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు లండన్‌కు బయల్దేరనున్నాడని సమాచారం. అతను ఇవాళే లండన్ ఫ్లైట్ ఎక్కనున్నాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న అశ్విన్‌కు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చిందని, అతనికి ఇంగ్లండ్ వెళ్లాక మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారని, ఆతర్వాతే అతను టీమిండియాతో కలుస్తాడని ఆయన పేర్కొన్నారు. అయితే అశ్విన్ ఈ నెల 24 నుంచి లీసెస్టర్‌షైర్‌తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం మాత్రం లేదని ఆయన వివరించారు. కాగా, ఐపీఎల్ ముగిశాక తమిళనాడు క్రికెట్ సంఘం నిర్వహించిన స్థానిక లీగ్‌లో పాల్గొన్న సందర్భంగా అశ్విన్ కోవిడ్ బారిన పడ్డాడు. చదవండి: ఇంగ్లండ్‌కు బయల్దేరనున్న సుందర్.. గాయం నుంచి కోలుకోని చాహర్ -
రంగంలోకి దిగిన రాహుల్.. రాగానే రుద్దుడు షురూ
India Tour Of England 2022: దక్షిణాఫ్రికాతో ఐదో టీ20 ముగియగానే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు లండన్ ఫ్లైట్ ఎక్కిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ లీసెస్టర్షైర్లో ఉన్న టీమిండియాతో కలిశాడు. రాహుల్ వచ్చీ రాగానే ఆటగాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేసి వారిని టెస్ట్ మ్యాచ్ కోసం సన్నద్దం చేస్తున్నాడు. ద్రవిడ్ టీమిండియా ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ ప్రారంభించిన దృశ్యాలను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన వస్తుంది. రాహుల్ రంగంలోకి దిగంగానే రుద్దుడు షురూ చేశాడంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. Look who's here! Head Coach Rahul Dravid has joined the Test squad in Leicester. 💪💪 #TeamIndia pic.twitter.com/O6UJVSgxQd — BCCI (@BCCI) June 21, 2022 కాగా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతుండగానే టీమిండియాలోని కీలక సభ్యులు ఈ నెల 16న లండన్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ బ్యాచ్ బయల్దేరిన తర్వాతి రోజు రోహిత్ శర్మ.. నిన్న ద్రవిడ్, పంత్, శ్రేయస్‌లు లండన్‌లో ల్యాండయ్యారు. అశ్విన్ మినహా భారత టెస్ట్ జట్టంతా ప్రస్తుతం లీసెస్టర్షైర్లో ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉంది. జూన్ 24న లీసెస్టర్‌షైర్ కౌంటీతో ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం టీమిండియా జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. గతేడాది కోవిడ్ కారణంగా రద్దైన ఈ టెస్ట్ మ్యాచ్‌ను ఇరు దేశాల క్రికెట్ బోర్డుల సంయుక్త ఒప్పందం మేరకు రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో గతేడాది నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరుగగా టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌ను అధికారికంగా గెలవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా అయినా చేసుకోవాల్సి ఉంది. అయితే ఇంగ్లండ్ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే అది అంత తేలిక కాదని తెలుస్తోంది. ఆ జట్టు తాజాగా వరల్డ్ ఛాంపియన్స్ న్యూజిలాండ్‌ను 2-0తో మట్టికరిపించి మాంచి జోష్ మీద ఉంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్.. జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ జులై 7న తొలి టీ20 జులై 9న రెండో టీ20 జులై 10న మూడో టీ20 జులై 12న తొలి వన్డే జులై 14న రెండో వన్డే జులై 17న మూడో వన్డే చదవండి: ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక టెస్టు.. చెమటోడుస్తున్న టీమిండియా.. ఫోటోలు వైరల్! -
ఇంగ్లండ్‌కు బయల్దేరనున్న సుందర్.. గాయం నుంచి కోలుకోని చాహర్
టీమిండియా కీలక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ త్వరలో ఇంగ్లండ్‌కు బయల్దేరనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ (చేతికి గాయం) సుందర్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఇంగ్లండ్ కౌంటీ జట్టు లంకాషైర్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిలిటేషన్‌లో ఉన్న సుందర్.. త్వరలో ప్రారంభంకానున్న కౌంటీ సీజన్లో సత్తా చాటి టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కాగా, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటడం ద్వారా సుందర్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు శ్రీలంకతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడిన మరో ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ ఇంకా కోలుకోలేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. సుందర్‌తో పాటు ఎన్సీఏ రిహాబిలిటేషన్‌లో ఉన్న చాహర్.. పూర్తిగా కోలుకోవడానికి మరో ఐదు వారాల సమయం పడుతుందని మీడియాలో కధనాలు వినిపిస్తున్నాయి. దీంతో అతన్ని ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు పరిగణలోకి తీసుకోవడంలేదని ప్రచారం జరుగుతుంది. కాగా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్‌లను గతేడాది ఐపీఎల్ మెగా వేలంలో ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: రోహిత్, కోహ్లిలకు బీసీసీఐ వార్నింగ్..! -
రోహిత్, కోహ్లిలకు బీసీసీఐ వార్నింగ్..!
త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు ఫార్మాట్ల సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్, మాజీ కెప్టెన్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న వీరి ఫోటోలే ఇందుకు కారణం అని సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఓ టెస్ట్, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం కొద్దిరోజుల కిందట లండన్‌లో ల్యాండైన టీమిండియా ప్రస్తుతం లీసెస్టర్షైర్లో ప్రాక్టీస్ చేస్తూ బిజీబిజీగా గడుపుతుంది. అయితే రెండు రోజుల కిందట రోహిత్, కోహ్లిలు షాపింగ్ అంటూ లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫోటోలకు పోజులివ్వడం నెట్టింట వైరలైంది. A lucky day for this fan as he got to meet both Virat Kohli and Rohit Sharma. pic.twitter.com/DN5B2ZSYuJ — Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2022 యూకేలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రోహిత్, కోహ్లిలు మాస్కులు లేకుండా వీధుల్లో తిరగడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుందని సమాచారం. ఇదే విషయమై బీసీసీఐ రోహిత్, కోహ్లిలతో పాటు టీమిండియా మొత్తాన్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది. టీమిండియా ఆటగాళ్లందరూ కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని లేని పక్షంలో చర్యలు తీసుకునేందుకు ఎంత మాత్రం వెనకాడేది లేదని వార్నింగ్ ఇచ్చిందని సమాచారం. కాగా, యూకేలో కోవిడ్ తీవ్రత గత కొద్ది రోజులతో పోలిస్తే ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆక్కడ ఇప్పటికీ రోజుకు 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే టీమిండియా కీ స్పిన్నర్ అశ్విన్ కోవిడ్ కారణంగా జట్టుతో పాటు ట్రావెల్ చేయలేకపోయాడు. ఇదిలా ఉంటే, గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో మిగిలిపోయిన టెస్ట్ మ్యాచ్ జులై 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో గతేడాది జరిగిన నాలుగు టెస్టుల్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉంది.. జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ జులై 7న తొలి టీ20 జులై 9న రెండో టీ20 జులై 10న మూడో టీ20 జులై 12న తొలి వన్డే జులై 14న రెండో వన్డే జులై 17న మూడో వన్డే చదవండి: ఇంగ్లండ్‌తో సిరీస్.. పలు అరుదైన రికార్డులపై కన్నేసిన రోహిత్-విరాట్ జోడీ -
ఇంగ్లండ్‌తో సిరీస్.. పలు అరుదైన రికార్డులపై కన్నేసిన రోహిత్-విరాట్ జోడీ
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ జోడీల్లో ఒకటిగా పరిగణించబడే రోహిత్ శర్మ-విరాట్ కోహ్లి ద్వయం త్వరలో ప్రారంభంకాబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో పలు అరుదైన రికార్డులపై కన్నేసింది. జులై 1 నుంచి ప్రారంభంకాబోయే ఈ సిరీస్‌లో టీమిండియా తొలుత టెస్ట్ మ్యాచ్ ఆ తర్వాత టీ20, వన్డే సిరీస్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. తరుచూ వ్యక్తిగత రికార్డుల పరంగా రికార్డుల్లోకెక్కే రోహిత్, విరాట్లు ఇంగ్లండ్‌తో సిరీస్‌లో జంటగా పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకోనున్నారు. టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 940 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రోహిత్-విరాట్ జోడీ ఇంగ్లండ్‌తో జరుగబోయే టెస్ట్‌లో మరో 60 పరుగులు జోడిస్తే 1000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటుంది. టీ20ల్లో ఇప్పటివరకు 991 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రోహిత్-విరాట్ ద్వయం రానున్న సిరీస్‌లో మరో 9 పరుగులు జోడిస్తే పొట్టి ఫార్మాట్లో 1000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటుంది. అలాగే వన్డేల్లో ఇప్పటిదాకా 4906 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఈ దిగ్గజ బ్యాటింగ్ ద్వయం మరో 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే వన్డేల్లో 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ సిరీస్‌లో రోహిత్-విరాట్ జోడీ మరో 133 పరుగులు జోడిస్తే రోహిత్-శిఖర్ ధవన్ జోడీ పేరిట ఉన్న 5039 పరుగుల రికార్డును అధిగమించి.. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన టాప్ 7 జోడీగా నిలుస్తుంది. ఈ రికార్డులే కాక టీమిండియా స్టార్ జోడీ మరో అరుదైన రికార్డుపై కూడా కన్నేసింది. ఈ జోడీ టెస్టుల్లో, టీ20ల్లో 1000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటే, మూడు ఫార్మాట్లలో వెయ్యికి పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన మొట్టమొదటి జోడిగా సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకూ ఏ జోడీ కూడా మూడు ఫార్మాట్లలో 1000కి పైగా పరుగులు జోడించలేదు. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉంది.. జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ జులై 7న తొలి టీ20 జులై 9న రెండో టీ20 జులై 10న మూడో టీ20 జులై 12న తొలి వన్డే జులై 14న రెండో వన్డే జులై 17న మూడో వన్డే చదవండి: రవిచంద్రన్ అశ్విన్ కు కరోనా పాజిటివ్.. తగ్గాకే ఇంగ్లండ్‌కు..! -
లండన్‌లో ల్యాండైన రోహిత్.. కోహ్లితో కలిసి షాపింగ్‌లో బిజీ
గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో మిగిలిపోయిన టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా ఇదివరకే లండన్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల చేత అప్పుడు జట్టుతో పాటు వెళ్లని కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా లండన్‌లో ల్యాండయ్యాడు. జులై 1 నుంచి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. రోహిత్, కోహ్లిలు మాత్రం షాపింగ్ చేస్తూ లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించారు. A lucky day for this fan as he got to meet both Virat Kohli and Rohit Sharma. pic.twitter.com/DN5B2ZSYuJ — Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2022 ఈ క్రమంలో అభిమానులు వారితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. రోహిత్, కోహ్లిలు లండన్ వీధుల్లో ఫ్యాన్స్‌తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు లీసెస్టర్షైర్లో టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఈ ఫోటోలు కూడా నెట్టింట సర్ఫేస్ అవుతున్నాయి. కోహ్లితో షాపింగ్ అనంతరం రోహిత్ జట్టుతో పాటు చేరాడు. Hello from Leicester and our training base for a week will be @leicsccc 🙌 #TeamIndia pic.twitter.com/MAX0fkQcuc — BCCI (@BCCI) June 20, 2022 ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 19) దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగియడంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్, మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లు బెంగళూరు నుంచే నేరుగా లండన్‌కు బయల్దేరారు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌కు ముందు టీమిండియా ఈ నెల 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అనంతరం బర్మింగ్‌హామ్ వేదికగా జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. కాగా, ఇంగ్లండ్‌తో గతేడాది జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు టెస్టులు పూర్తి కాగా.. టీమిండియా 2-1 లీడ్‌లో ఉంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉంది.. జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ జులై 7న తొలి టీ20 జులై 9న రెండో టీ20 జులై 10న మూడో టీ20 జులై 12న తొలి వన్డే జులై 14న రెండో వన్డే జులై 17న మూడో వన్డే చదవండి: భారత క్రికెట్ చరిత్రలో జూన్ 20 ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే..? -
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు
దుబాయ్: ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్‌పై టీమిండయా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2-1తేడాతో టీమిండియా సిరీస్ గెలిచిందని వివాదాస్పద స్టేట్మెంట్ చేశాడు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన రసవత్తర సిరీస్‌లో టీమిండియానే అసలైన విజేత అని పేర్కొని వివాదానికి తెరలేపాడు. తుది ఫలితం వెలువడకుండానే టీమిండియాను విజేతగా పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ), బీసీసీఐ, ఐసీసీ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయంపై రోహిత్ ఎలా ప్రకటన చేస్తాడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా, 5 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన ఆఖరి మ్యాచ్ కరోనా కారణంగా అర్ధాంతరంగా రద్దైన సంగతి తెలిసిందే. చివరి టెస్ట్‌కు కొద్ది గంటల ముందు భారత బృందంలో కరోనా కేసు బయటపడడంతో టీమిండియా ఆటగాళ్లు బరిలోకి దిగేందుకు నిరాకరించారు. నాలుగు టెస్ట్‌లు ముగిసే సమయానికి టీమిండియా 2-1 లీడ్‌లో ఉంది. రద్దైన ఆఖరి టెస్ట్‌ను వచ్చే ఏడాది టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలో షెడ్యూల్ చేసేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు సూచనప్రాయంగా అంగీకారం తెలిపాయి. అయితే, ఆ మ్యాచ్ స్టాండ్ అలోన్ టెస్ట్‌గా జరుగుతుందా లేక 5టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతుందా అన్న విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సంచలన స్టేట్మెంట్ చేయడం చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. 4 మ్యాచ్‌ల్లో 52.57 సగటుతో 368 పరుగులు చేసి టీమిండియా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: వార్నర్‌ను పక్కకు పెట్టడానికి క్రికెటేతర కారణాలు ఉన్నాయి..! -
రద్దైన టెస్ట్ మ్యాచ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ఇరు బోర్డులు.. అయితే..?
ముంబై: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10న జరగాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైన సంగతి తెలిసిందే. అయితే రద్దైన ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసేందుకు తాజాగా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకారం తెలిపాయి. వచ్చే ఏడాది జులైలో జరిగే ఇంగ్లండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు ఈ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ, ఈసీబీలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. అయితే, రీ షెడ్యూల్ అయ్యే ఆ మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు సంబంధం ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నోరుమెదపలేదు. రీ షెడ్యూల్ మ్యాచ్ 5 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగానే జరగాలని ఈసీబీ పట్టుబడుతుంటే.. బీసీసీఐ మాత్రం అది స్టాండ్ అలోన్ మ్యాచ్(సెపరేట్ మ్యాచ్) అవుతుందని సూచన ప్రాయంగా పేర్కొంది. 4 టెస్ట్‌లు ముగిసే సమయానికి టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో సిరీస్ ఫలితం ఎటూ తేలలేదు. ఈ విషయమై ఐసీసీ సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్‌కు ముందు తొలుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌లకు వైరస్ సోకింది. అనంతరం ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం (సెప్టెంబర్ 9) సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్ట్‌లో ఆడలేమంటూ చేతులెత్తేసింది. చదవండి: అతన్ని వదులుకోవడం కేకేఆర్ చేసిన అతి పెద్ద తప్పిదం.. -
కన్నడ టీచర్‌గా మారిన రాహుల్ ద్రవిడ్
నాటింగ్‌హామ్: రాహుల్ ద్రవిడ్ కొద్దిసేపు కన్నడ టీచర్‌గా మారారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్‌లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీరీస్ నేపథ్యంలో బ్రిటీష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీస్కు రాహుల్ ద్రవిడ్ కన్నడ నేర్పిస్తున్నాడు. దీనికి సంభందించిన వీడియోను అలెక్స్ ఎల్లీస్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ద్రవిడ్ కన్నడ నేర్పిస్తుండగా.. వేగంగా పరిగెత్తూ అనే పదాన్ని కన్నడలో బేగా ఓడి అని చెప్పాలని రాహుల్ ద్రవిడ్ చేప్పడం విశేషం. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అవుతుంది. కాగా శ్రీలంక పర్యటనలో రాహుల్ ద్రవిడ్ కోచ్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన 50 ఓవర్ల సీరిస్‌ను భారత్ కైవసం చేసుకోగా, టీ20 సిరీస్‌ను శ్రీలంక సొంతం చేసుకుంది. అయితే ఈ పర్యటనలో రాహుల్ ద్రవిడ్ కోచ్ గా తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించారు. Cricket expressions in Indian languages part 2. Today, we’re down south in Bengaluru. What better teacher than ‘The Coach’ #RahulDravid, who taught taught me this in #Kannada ಕನ್ನಡ 👇 pic.twitter.com/tDCtHOcIwa — Alex Ellis (@AlexWEllis) August 7, 2021 -
ధవన్ సేనలోని ఆ ఇద్దరికి ప్రమోషన్..!
ముంబై: ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోన్న కోహ్లీ సేనలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, స్టాండ్ బై బౌలర్ ఆవేశ్ ఖాన్లు గాయాల బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరికి రీప్లేస్‌మెంట్‌గా మరో ఇద్దరు క్రికెటర్లను లండన్‌కు పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం లంక పర్యటనలో ఉన్న పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లు అక్కడ టీ20 సిరీస్ ముగియగానే కోహ్లీ సేనను జాయిన్ అవుతారని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ధవన్ సేనలో కొనసాగుతున్న షా, సూర్యకుమార్‌లకు బంపర్ ఆఫర్ లభించినట్లైంది. 🚨 NEWS 🚨: Injury & replacement updates - India’s Tour of England, 2021 More Details 👇 #ENGvIND — BCCI (@BCCI) July 26, 2021 వీరిలో పృథ్వీ షా ఇదివరకే టెస్టుల్లో అరంగేట్రం చేయగా, సూర్యకుమార్ యాదవ్ తొలిసారి టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు. కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓపెనర్ శుభమన్ గిల్ గాయపడగా, ఇటీవల జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో యువ ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లు గాయాలపాలయ్యారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి బయల్దేరారు. దీంతో ప్రస్తుతం లంక పర్యటనలో సత్తా చాటుతున్న పృథ్వీ షా, సూర్యకుమార్‌లకు లక్కీ ఛాన్స్ లభించింది. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్‌ల మధ్య వచ్చే నెల 4న ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. కోహ్లీ సేన: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్. స్టాండ్ బై ప్లేయర్లు: ప్రసిద్ధ్ కృష్ణ, అర్జాన్ నగ్వాస్వాలా -
రెండో ఇన్నింగ్స్‌లోనూ ఫిఫ్టి కొట్టిన జడ్డూ
రెండో ఇన్నింగ్స్‌లోనూ ఫిఫ్టి కొట్టిన జడ్డూ టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. వార్మప్ మ్యాచ్‌లో బ్యాట్‌తో దుమ్మురేపాడు. కౌంటీ ఎలెవెన్ జట్టుతో జరగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ(75) చేసిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ(51 రిటైర్డ్ ఔట్) ఫిఫ్టి కొట్టాడు. మరో ఎండ్‌లో ఉన్న హనుమ విహారి(43 నాటౌట్) సైతం రాణించాడు. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 192 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 91 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమిండియా 284 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందుంచింది. అనంతరం ఛేదన ప్రారంభించిన కౌంటీ ఎలెవెన్ జట్టు వికెట్ నష్టపోకుండా 10 పరుగులు సాధించింది. చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు కౌంటీ సెలెక్ట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్ ఆఖరి రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, పుజారాలు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించిన అనంతరం మయాంక్(47) ఔటవ్వగా.. 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పుజారా పెవిలియన్‌కు చేరాడు. 34 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. క్రీజ్‌లో విహారి(12), జడేజా(11) ఉన్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 91 పరుగుల ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతానికి టీమిండియా 205 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. That will be Lunch on Day 3 of the three-day warm-up game against County XI.#TeamIndia 311 & 113/2, lead by 204 runs. pic.twitter.com/GItTWrcN7X — BCCI (@BCCI) July 22, 2021 అంతకు ముందు రెండో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించడంతో ప్రత్యర్థి జట్టు 220 పరుగులకు ఆలౌటైంది. భారత పేసర్లు ఉమేశ్ యాదవ్ (3/22), మహమ్మద్ సిరాజ్ (2/32) పదునైన బంతులతో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగా, ఓపెనర్ హసీబ్ హమీద్ (246 బంతుల్లో 112; 13 ఫోర్లు) శతకంతో జట్టును ఆదుకున్నాడు. పాటర్సన్ వైట్(33), లిండన్ జేమ్స్(27) కాసేపు పోరాడారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, శార్ధూల్, జడేజా, అక్షర్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్(101), జడేజా(75) రాణించారు. -
కోహ్లీ సేనకు భారీ షాక్.. యువ ఆల్‌రౌండర్ దూరం..?
డర్హమ్: ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ సేనను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కాలి గాయంతో సిరీస్ నుంచి అర్దంతరంగా వైదొలగగా, బుధవారం స్టాండ్ బై బౌలర్ ఆవేశ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా ఈ జాబితాలో యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా చేరాడు. టీమిండియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ తరఫున బరిలోకి దిగిన సుందర్.. గురువారం ఆటలో గాయపడినట్లు సమాచారం. అతని చేతి వేలికి గాయమైందని, అయితే గాయం తీవ్రతపై స్పష్టత లేదని, స్కానింగ్ తీసిన తర్వాతే గాయంపై క్లారిటీ వస్తుందని ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది. గాయంతో సుందర్ పడుతున్న ఇబ్బంది చూస్తే.. వేలు విరిగినట్లు అర్థమవుతుందని సదరు సంస్థ తెలిపింది. ఇదే జరిగితే ఇంగ్లండ్ టూర్ నుంచి ఈ యువ ఆల్‌రౌండర్ తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే, ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా కౌంటీ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజు వార్మప్ మ్యాచ్‌లో అవేశ్ ఖాన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ గాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో కౌంటీ సెలెక్ట్ ఎలెవన్ తరఫున అవేశ్ ఖాన్, సందర్ బరిలోకి దిగారు. ఆ జట్టులోని ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఈ ఇద్దరు బరిలోకి దిగాల్సి వచ్చింది. అయితే తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను అవేశ్ ఖాన్ బౌలింగ్ చేయగా.... విహారి కొట్టిన రిటర్న్ షాట్‌ను ఆపే ప్రయత్నంలో అతని ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. స్కానింగ్‌లో అవేశ్ ఖాన్ వేలు విరిగినట్లు తేలింది. అతను కోలుకోవడానికి కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుందని బీసీసీఐ తెలిపింది. దీంతో అతని ఇంగ్లండ్ పర్యటన అర్థంతరంగా ముగిసింది. తాజాగా సుందర్ సైతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. కాగా, 24 మంది సభ్యుల జట్టులో ముగ్గురు ఆటగాళ్లు గాయాల బారిన పడటం కోహ్లీ సేనను కలవరపెడుతోంది. మరోవైపు శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీషా, దేవదత్ పడిక్కల్‌ను ఇంగ్లండ్‌కు పంపాలని కోహ్లీ సేన చేసిన విజ్ఞప్తిని సెలెక్టర్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. -
వాషింగ్టన్ సుందర్‌తో గొడవకు దిగిన సిరాజ్
డర్హమ్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు కౌంటీ ఎలెవన్ జట్టుతో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ప్రారంభం అయిన ఈ మూడు రోజుల మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్(150 బంతుల్లో 101 రిటైర్డ్ ఔట్; 11 ఫోర్లు, సిక్స్), రవీంద్ర జడేజా (146 బంతుల్లో 75; 5 ఫోర్లు, సిక్స్) సెంచరీ, హాఫ్ సెంచరీలతో రాణించడంతో 311 పరుగల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. అనంతరం బుధవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కౌంటీ ఎలెవన్ ఆది నుంచి తడబడుతూ ఉంది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు భారత ఆటగాళ్లు(వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్) ప్రత్యర్ధి జట్టు తరఫున బరిలోకి దిగారు. Mohammad Siraj exchanged a few words to Washington Sundar. pic.twitter.com/xC5EPuZeZI — Mufaddal Vohra (@mufaddal_vohra) July 21, 2021 ఈ క్రమంలో రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన వాషింగ్టన్ సుందర్(1)ను టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. అయితే అంతకు ముందు సిరాజ్.. సుందర్‌తో గొడవకు దిగాడు. వారి మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరిగింది. అయితే సహచరులు సర్ధి చెప్పడంతో వారు మిన్నకుండిపోయారు. ఆ వెంటనే సిరాజ్ బౌలింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ అందుకోవడంతో సుందర్ మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అంతకుముందు ఓపెనర్ లిబ్బి (12)ని ఉమేశ్ యాదవ్, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ రాబర్ట్ యేట్స్ (1)ను బుమ్రా పెవిలియన్‌కు పంపారు. అనంతరం కెప్టెన్ విల్ రోడ్స్(11) ఆచితూచి ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఉమేశ్ యాదవ్ అతన్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో కౌంటీ ఎలెవన్ జట్టు రెండో రోజు భోజన విరామ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. క్రీజులో హసీబ్ హమీద్ (47), లిండన్ జేమ్స్(5) ఉన్నారు. టీమిండియా బౌలర్లు ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, బుమ్రా, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సన్నాహక మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానేతో పాటు సీనియర్ బౌలర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ దూరంగా ఉన్నారు. దాంతో రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఆగష్టు 4 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. -
సూపర్ సెంచరీతో అదరగొట్టిన కేఎల్ రాహుల్
సూపర్ సెంచరీతో అదరగొట్టిన కేఎల్ రాహుల్ టపార్డర్ బ్యాట్స్మెన్లు దారుణంగా విఫలమైన వేళ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(101 రిటైర్డ్) అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. అతనికి మరో ఎండ్‌లో జడేజా(57) హాఫ్ సెంచరీతో సపోర్ట్ ఇవ్వడంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. క్రీజ్‌లో జడేజాకు తోడుగా శార్దూల్ ఠాకూర్(9) ఉన్నాడు. 77 ఓవర్ల తర్వాత టీమిండియా 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల సాధించింది. CENTURY @klrahul11 💯A brilliant innings 👏🇮🇳Live Stream ➡️ https://t.co/ZsCqJdCEX1#CountyXIvIndia @BCCI pic.twitter.com/4Ffzd5wnEP— Durham Cricket (@DurhamCricket) July 20, 2021 టీమిండియా నాలుగో వికెట్ డౌన్.. విహారి(24) ఔట్ టీమిండియా ప్లేయర్లు ఒకొక్కరుగా తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరుతున్నారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి(24) కూడా కనీసం హాఫ్‌సెంచరీ మార్క్ చేరుకోలేకపోయాడు. స్పిన్నర్ ప్యాటర్సన్ వైట్ బౌలింగ్‌లో.. క్రెయిగ్ మైల్స్‌కు క్యాచ్ అందించి వెనుదిరిగాడు. క్రీజ్‌లో కేఎల్ రాహుల్(47), రవీంద్ర జడేజా(9) ఉన్నారు. 47 ఓవర్ల తర్వాత టీమిండియా 4 వికెట్ల నష్టానికి141 పరుగులు చేసింది. Patterson-White gets Vihari! India are 107/4 Live stream ➡️ https://t.co/FfTRHD7fDr#CountyXIvIndia @TrentBridge pic.twitter.com/dNC7ERr83J — Durham Cricket (@DurhamCricket) July 20, 2021 Carson x Rew, Pujara gone. 🏴🇮🇳@SussexCCC 🤝 @SomersetCCC Live Stream ➡️ https://t.co/JeTNRWzv2g pic.twitter.com/aB1jPQLNTT — Durham Cricket (@DurhamCricket) July 20, 2021 మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. పుజారా(21) ఔట్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(9), మయాంక్ అగర్వాల్(28) సహా వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ పుజారా(21) కూడా తక్కువ స్కోర్‌కే చేతులెత్తేశారు. ప్రాక్టీస్ మ్యాచ్ అని సరదాగా తీసుకున్నారో ఏమో కానీ, నిర్లక్ష్యంగా షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. లంచ్ విరామ సమాయనికి 30 ఓవర్లు ఆడిన టీమిండియా బ్యాట్స్మెన్లు 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేశారు. క్రీజ్‌లో విహారి(16), కేఎల్ రాహుల్(5) ఉన్నారు. కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ బౌలర్లలో లిండన్ జేమ్స్ 2 వికెట్లు పడగొట్టగా, పుజారా వికెట్ జాక్ కార్సన్‌కు దక్కింది. కార్సన్ బౌలింగ్‌లో పుజారా క్రీజ్ వదిలి ముందుకు రావడంతో వికెట్‌కీపర్ జేమ్స్ రివ్ స్టంపింగ్ చేశాడు. చెస్టర్ లీ స్ట్రీట్: కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ జట్టుతో మంగళవారం మధ్యాహ్నం 3:30కు ప్రారంభమైన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ(33 బంతుల్లో 9; 2 ఫోర్లు) దారుణంగా విఫలం కాగా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(35 బంతుల్లో 28; 6 ఫోర్లు) కాస్త పర్వాలేదనిపించాడు. Brilliant from @TrentBridge's Lyndon James who picks up his second. Agarwal bowled for 28 👏 Live Stream ➡️ https://t.co/ZoY9QkxDQk#CountyXIvIndia @CountyChamp pic.twitter.com/PWOlck8Y5o — Durham Cricket (@DurhamCricket) July 20, 2021 ప్రత్యర్ధి బౌలర్ లిండన్ జేమ్స్‌కు ఈ రెండు వికెట్లు దక్కాయి. 14 ఓవర్ల తర్వాత భారత జట్టు స్కోర్ 46/1గా ఉంది. క్రీజ్‌లో పుజారా(8), విహారి(1) ఉన్నారు. కాగా, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ కోసం టీమిండియా ఈ మ్యాచ్‌ను పట్టుపట్టి మరీ షెడ్యూల్ చేసుకుంది. భారత జట్టు: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, హనుమ విహారి, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
కోహ్లీ సేనకు గుడ్ న్యూస్.. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న పంత్
డర్హమ్: కోహ్లీ సేనకు గుడ్ న్యూస్. ఇంగ్లండ్ పర్యటనలో కరోనా బారిన పడిన టీమిండియా వికెట్ కీపర్, డాషింగ్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతనికి నెగటివ్ వచ్చినట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. దీంతో డర్హమ్‌లో ఏర్పాటు చేసిన టీమిండియా ప్రాక్టీస్ క్యాంప్‌లో అతను జూలై 21న చేరనున్నాడు. అయితే, రేపటి(జులై 20) నుంచి కౌంటీ ఎలెవన్‌తో ప్రారంభమయ్యే సన్నాహక మ్యాచ్‌కు మాత్రం అతను దూరం కానున్నాడు. కాగా, ఇంగ్లండ్‌లోని వివిధ కౌంటీ జట్ల నుంచి 15 మంది ఆటగాళ్లు కౌంటీ ఎలెవన్ తరఫున ఆడనున్నారు. వార్విక్షైర్ కెప్టెన్ విల్ రోడ్స్ ఈ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఖాళీ స్టేడియంలో జరగనున్నట్లు డర్హమ్ కౌంటీ బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉంటే, త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్ గరానీకి కూడా కరోనా పాజిటీవ్‌గా తేలడంతో అతనితో సన్నిహితంగా ఉన్న వృద్దిమాన్ సాహా ఐసోలేషన్‌లో ఉన్నాడు. దీంతో రేపటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు. ఇంగ్లండ్‌లో ఇటీవల డెల్టా వేరియంట్ కరోనా వైరస్ వేగంగా వ్యాపి చెందుతోంది. రిషబ్ పంత్ కూడా ఈ వైరస్ బారిన పడినట్లు ప్రచారం జరిగింది. ఇటీవల యూరో ఛాంపియన్షిప్ మ్యాచ్‌ను చూసొచ్చిన పంత్.. తేలికపాటి జ్వరంతో బాధపడ్డాడు. ఆ సమయంలో చేయించుకున్న పరీక్షల్లో అతనికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అనంతరం భారత ఆటగాళ్లకు బీసీసీఐ బ్రేక్ ఇచ్చింది. దాంతో బయో బబుల్ వీడిన ఆటగాళ్లు 20 రోజుల పాటు ఇంగ్లండ్ పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. అనంతరం డర్హమ్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ పూర్తి చేసుకొని ప్రాక్టీస్ మ్యాచ్‌కు సిద్దమయ్యారు. -
నేనిక్కడే ఉన్నా, వచ్చేయమంటారా.. టీమిండియాకు డీకే బంపర్ ఆఫర్
లండన్: టీమిండియా వికెట్ కీపర్లు రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహాలు కరోనా కారణంగా ఐసోలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈనెల 20 నుంచి కౌంటీ ఛాంపియన్షిప్ జట్టుతో ప్రారంభం కాబోయే ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ ఎవరన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో తాను ఇంగ్లండ్‌లోనే ఉన్నాను, వచ్చేయమంటారా అంటూ టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ టీమిండియాకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌తో వ్యాఖ్యాతగా కొత్త అవతారమెత్తిన డీకే.. క్రికెట్‌కు వీడ్కోలు పలుకకుండానే కామెంటేటర్‌గా మారిపోయాడు. స్కైస్పోర్ట్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. 😋 #justsaying pic.twitter.com/zX3ValErDc — DK (@DineshKarthik) July 15, 2021 ఇదిలా ఉంటే, టీమిండియాలోని ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు కరోనా కారణంగా ఐసోలేషన్‌కు పరిమితం కావడంతో జట్టులో వికెట్ కీపింగ్ అనుభవమున్న కేఎల్ రాహుల్‌వైపు అందరూ చూస్తున్నారు. అయితే రాహుల్‌కు గతంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కీపింగ్ చేసిన అనుభవం ఉంది. అందులోనూ రెగ్యులర్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కావడంతో ఓపెనింగ్ బాధ్యతలు రాహుల్‌పైనే పడే ఆస్కారం ఉంది. దీంతో టీమిండియా యాజమాన్యం అతనిపై అధిక భారం వేసేంత సాహసం చేయకపోవచ్చనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇలాంటి సమయంలో దినేశ్ కార్తీక్ చేసిన ట్వీట్ టీమిండియా పాలిట బంపర్ ఆఫర్‌గా మారింది. అయితే, డీకే.. క్రికెట్ కిట్‌తో పెట్టిన ట్వీట్లో 'జస్ట్ సేయింగ్' అన్న క్యాప్షన్ జోడించడం విశేషం. -
ఇషాంత్ స్థానంలో సిరాజ్, టీమిండియాలో భారీ మార్పులు..?
లండన్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకునేలా కనిపిస్తుంది. త్వరలో ప్రారంభం కాబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో ఇషాంత్ స్థానంలో సిరాజ్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో పేసర్లకు అనుకూలించే పిచ్‌పై ఇషాంత్ పూర్తిగా తేలిపోయాడని, మూడు వికెట్లు పడగొట్టినా అది అతని స్థాయికి తగ్గ ప్రదర్శన కాదని జట్టు యాజమాన్యం అభిప్రాయపడుతుంది. 100 టెస్టుల అనుభవం ఉన్న ఇషాంత్ ఇప్పటికీ కొత్త కుర్రాడిలాగే కనిపిస్తున్నాడని, అతడి బౌలింగ్‌ను పరిశీలిస్తే అన్ని టెస్టులు ఆడిన అనుభవం కనిపించడం లేదని విమర్శకులు చురకలంటిస్తున్నారు. దీంతో అతనికి ప్రత్యామ్నాయమైన సిరాజ్‌ను ఖచ్చితంగా తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సిరాజ్.. అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. సిరీస్ ప్రారంభానికి ముందు తండ్రి మరణించినా.. ఆ బాధను దిగమింగుకుని మరీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీసి.. సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ముఖ్యంగా బ్రిస్బేన్‌లో జరిగిన చివరి టెస్ట్‌లో 5 వికెట్లు పడగొట్టిన సిరాజ్.. టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, సిరాజ్ ఇప్పటి వరకూ 5 టెస్ట్ మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఇంగ్లండ్ సిరీస్ నిమిత్తం టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు- చేర్పులు జరిగేలా కనిపిస్తున్నాయి. గాయపడిన ఓపెనర్ గిల్ స్థానంలో మయాంక్ లేదా కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే, జడేజాను పక్కకు పెట్టి విహారిని ఆడించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు టీమిండియా స్పిన్నర్‌కు లక్కీ ఛాన్స్..
లండన్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఓ గొప్ప అవకాశం దొరికింది. జులై 11న సర్రే తరఫున కౌంటీ మ్యాచ్ ఆడే లక్కీ ఛాన్స్ లభించింది. దీంతో ప్రతిష్ఠాత్మక సిరీస్‌కు ముందు యాష్‌కు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ దొరికినట్లవుతుంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఓటమి తర్వాత టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మ్యాచ్‌ల గురించి ప్రశ్నించిన నేపథ్యంలో యాష్‌కు సరైన సమయంలో సరైన అవకాశం లభించినట్టైంది. కాగా, అశ్విన్‌కు గతంలో కౌంటీ క్రికెట్లో నాటింగ్హమ్షైర్, వొర్సెస్టర్‌షైర్‌కు ఆడిన అనుభవం ఉంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లంతా విరామంలో ఉన్నారు. వారితో పాటే అశ్విన్ సైతం కుటుంబంతో కలిసి బ్రిటన్‌లో పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నాడు. అన్నీ సవ్యంగా సాగితే జులై 11న అతడు సర్రే తరఫున బరిలోకి దిగుతాడు. ఓవల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో సర్రే.. సోమర్సెట్ను ఢీకొంటుంది. ఇదే మైదానంలో టీమిండియా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ ఆడనుంది. ఈ రకంగా కూడా యాష్ కౌంటీ మ్యాచ్ ఆడటం టీమిండియాకు కలిసొచ్చే అంశమే. మరోవైపు సర్రే యాజమాన్యం సైతం యాష్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. -
ఆ ఇద్దరి కోసం పట్టుపట్టిన కోహ్లీ సేన.. బేఖాతరు చేసిన చీఫ్ సెలక్టర్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఎడమ పిక్క కండరాల గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కావడంతో, టీమిండియా మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఓపెనర్లైన పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్‌లను ఇంగ్లండ్‌కు పంపించాలని భారత సెలక్షన్ కమిటీని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీమిండియా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గత నెల చివర్లో సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మకు మెయిల్ చేశాడని, బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే షా, పడిక్కల్‌ను కాదని అనూహ్యంగా బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌ను స్టాండ్‌బైగా ఇంగ్లండ్ పర్యటనకు పంపడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2019-20 రంజీ సీజన్, ఇండియా ఏ న్యూజిలాండ్ పర్యటనలో ఏ మాత్రం ప్రభావం చూపని అభిమన్యు ఈశ్వరన్‌ను ఏ ప్రాతిపాదికన ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేశారనే విమర్శలు తలెత్తుతున్నాయి. కాగా, ఈ విషయమై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా జోక్యం చేసుకుంటేనే సెలక్షన్ కమిటీ చైర్మన్ స్పందించేలా ఉన్నాడని బీసీసీఐ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి పృథ్వీషా, పడిక్కల్‌ను ఇంగ్లండ్‌కు పంపాలని టీమిండియా మేనేజ్మెంట్ నుంచి బీసీసీఐకి ఎలాంటి అధికారిక రిక్వెస్ట్ అందలేదు. మరోవైపు షా, పడిక్కల్ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకలో ఉన్నారు. జూలై 26న ఈ సిరీస్ ముగిసాక వీరి ఇంగ్లండ్ పర్యటన అంశం కొలిక్కివచ్చే అవకాశం ఉంది. -
కోహ్లీ సేనకు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఓకే చెప్పిన ఈసీబీ
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త చెప్పింది. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డును (ఈసీబీ) ఒప్పించింది. ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా నేరుగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బరిలో దిగిన భారత్.. సౌతాంఫ్టన్ పరిస్థితులను అర్ధం చేసుకోలేక చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ తప్పు మరోసారి పునరావృతం కాకుండా బీసీసీఐ జాగ్రత్త పడింది. దీంతో జులై 20-22 మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఈసీబీ షెడ్యూల్ చేసిందని తెలుస్తోంది. అయితే భారత జట్టుతో తలపడే ప్రత్యర్థి ఎవరన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బయో బబుల్ నుంచి బయటకు వచ్చి.. కుటుంబంతో గడుపుతున్న కోహ్లీసేన తిరిగి రాగానే ఈ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే, భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఆగష్టు 4 నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. -
WTC Final: భువీని తీసుకెళ్లకపోవడం అతిపెద్ద పొరపాటు..
న్యూఢిల్లీ: భువనేశ్వర్ కుమార్ లాంటి అనుభవజ్ఞుడైన స్వింగ్ బౌలర్‌ను ఇంగ్లండ్ పర్యటనకు తీసుకెళ్లకపోవడం టీమిండియా యాజమాన్యం చేసిన అతిపెద్ద పొరపాటని భారత మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ అన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిని విశ్లేషిస్తూ ఆయన ఈమేరకు వ్యాఖ్యానించాడు. భారత జట్టులో అత్యుత్తమ స్వింగ్ బౌలరైన భువీని ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొన్నాడు. ఫైనల్‌కు ముందు టీమిండియా ప్రకటించిన 15 మంది జాబితాలో శార్ధూల్ ఠాకూర్ పేరు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని వ్యాఖ్యానించాడు. అలాగే, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్‌పై అతిగా ఆధారపడటాన్ని ఆయన తప్పుపట్టాడు. గత కొంత కాలంగా హార్ధిక్ బౌలింగ్ చేయకపోవడాన్ని ఉదహరించాడు. ఈ క్రమంలో శార్ధూల్, విజయ్‌శంకర్, శివమ్ దూబేలలో ఒకరిని ప్రోత్సహించాలని ఆయన సూచించాడు. ప్రస్తుత జట్టులో యువ పేసర్ మహ్మద్ సిరాజ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడని, రాబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో అతనికి వీలైనన్ని ఎక్కవ అవకాశాలు కల్పించాలని ఈ మాజీ సెలెక్టర్ సూచించారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టీమిండియా రొటేషన్ పద్ధతి పాటించి, ప్రతి ఆటగాడికి అవకాశం కల్పించాలని ఆయన అభిప్రాయడ్డాడు. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లను ఆడించినా పరిస్థితులను బట్టి అదనపు పేసర్‌ను కూడా తీసుకోవాలని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆయన టీమిండియా బ్యాటింగ్‌లో లోపాలను కూడా ఎత్తి చూపాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన స్థాయి మేరకు రాణించలేకపోతున్నాడని, అతను అతిగా ఒత్తిడికి లోనవుతున్నాడని తెలిపాడు. పుజారా, రహానే లాంటి సీనియర్ ఆటగాళ్లు ఎప్పుడూ ఒకేలా ఆడుతున్నారని, వారు పరిస్థితులకు తగ్గట్టు మారాలని సూచించాడు. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్‌లపై భారం తగ్గించే ఆటగాళ్లు కావాలని తెలిపాడు. మొత్తంగా కోహ్లీ సారథ్యంలోని టీమిండియా బాగానే ఆడుతున్నా, ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడం విచారకరమని పేర్కొన్నాడు. చదవండి: WTC Final: పాస్ పోర్టులు లాక్కొని మరీ గద కోసం ఆరా తీశారు.. -
WTC 2021-23: టీమిండియా షెడ్యూల్ ఖరారు.. ఇంగ్లండ్ సిరీస్‌తో షురూ
ముంబై: మరో రెండేళ్ల పాటు జరిగే సెకండ్ ఎడిషన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(2021-23) పోటీలకు టీమిండియా షెడ్యూల్ ఖరారైంది. గతంలో మాదిరే ఈసారి కూడా మూడు విదేశీ పర్యటనలు, మూడు స్వదేశీ సిరీస్‌లు ఉండనున్నాయి. కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఆతిథ్య జట్టుతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. మరో రెండేళ్ల పాటు జరిగే సెకండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. ఈ సిరీస్ కోసం టీమిండియా అన్ని విధాలుగా సమాయత్తం అవుతుంది. ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్న ఆటగాళ్లు.. బయో బబుల్ వీడి ఇంగ్లండ్ పరిసరాలను ఆస్వాధిస్తున్నారు. టీమిండియా సభ్యులంతా తిరిగి జూలై రెండో వారంలో బయో బబుల్‌లో చేరి ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సిద్దం కానున్నారు. టీమిండియా 2021-23 డబ్ల్యూటీసీ షెడ్యూల్: * ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్ 2021 ఆగస్ట్ 4-8 తొలి టెస్ట్, ఆగస్ట్ 12-16 రెండో టెస్ట్, ఆగస్ట్ 25-29 మూడో టెస్ట్, సెప్టెంబర్ 2-6 నాలుగో టెస్ట్, సెప్టెంబర్ 10-14 ఐదో టెస్ట్. * న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా 2021 తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాను ఓడించిన న్యూజిలాండ్ ఈ ఏడాది నవంబర్‌లో భారత్‌కు రానుంది. విలియమ్సన్ సేన రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత్‌కు రానుంది. * ఇండియా టూర్ ఆఫ్ సౌతాఫ్రికా 2021-22 భారత్ ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్ గెలవని దేశం ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే. ఈసారి ఆ ముచ్చట కూడా తీర్చుకునే అవకాశం టీమిండియాకు దక్కనుంది. మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత్ ఈ ఏడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికాకు వెల్లనుంది. * శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా 2022 వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం శ్రీలంక.. భారత్‌లో పర్యటించనుంది. * ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇండియా 2022 2022 అక్టోబర్-నవంబర్ నెలల్లో నాలుగు టెస్ట్‌ల సిరీస్ నిమిత్తం ఆస్ట్రేలియా భారత్‌కు రానుంది. * ఇండియా టూర్ ఆఫ్ బంగ్లాదేశ్ 2022 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్-2లో భాగంగా టీమిండియా ఆడే చివరి టెస్ట్ సిరీస్ ఇదే. 2022 చివర్లో రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. చదవండి: అతన్ని బ్యాట్స్‌మెన్ కోటాలో ఆడించారు.. టీమిండియా కొంప ముంచాడు -
శతక్కొట్టిన పంత్.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్
సౌతాంప్టన్: ఇంగ్లండ్ పిచ్‌లకి టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ తొందరగానే అలవాటుపడినట్లు కనిపిస్తోంది. ఈ నెల 3న సౌతాంప్టన్‌కి చేరుకున్న భారత క్రికెటర్లు.. గత మూడు రోజులుగా ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీగా గడుపున్నారు. ఈ క్రమంలో నిన్న భారత బృందం రెండు జట్లుగా విడిపోయి ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో రిషబ్ పంత్ అద్భుత శతకంతో (94 బంతుల్లోనే 121 పరుగులు) అజేయంగా నిలువగా, యువ ఓపెనర్ శుభమన్ గిల్ అర్ధశతకంతో (135 బంతుల్లో 85 పరుగులు) రాణించాడు. వీరిద్దరి ధాటికి సహచర బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోగా, ఇషాంత్ శర్మ(3/36) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ స్కోర్‌కు సంబంధించిన వివరాలను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. అయితే, ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఎంత స్కోరు చేశారన్న విషయాన్ని బీసీసీఐ ప్రకటించలేదు. ఇదిలా ఉంటే, 2018లో మొదటిసారి ఇంగ్లండ్‌లో పర్యటించిన రిషబ్ పంత్.. సూపర్ సెంచరీతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ శతక్కొట్టడంతో ఇంగ్లండ్ పిచ్‌లపై అతని రికార్డు మరింత మెరుగుపడింది. భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు జరుగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నేపథ్యంలో.. పంత్ ఫామ్‌లోకి రావడం భారత జట్టులో ఉత్సాహాన్ని నింపుతుంది. కాగా, డబ్యూటిసీ ఫైనల్ తర్వాత భారత్.. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. చదవండి: India vs Sri Lanka: రేపటి నుంచి ధవన్ సేన క్వారంటైన్ షురూ -
టీమిండియా ప్రాక్టీస్ అదుర్స్.. ఈ పర్యటనలో ఇదే తొలిసారి
లండన్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత టెస్ట్ జట్టు ఈ నెల 18 నుండి ప్రారంభంకానున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)ఫైనల్నేపథ్యంలో ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఇంగ్లండ్ గడ్డపై కాలు మోపాక మూడు రోజులు కఠిన క్వారంటైన్లో గడిపిన భారత జట్టు.. తొలిసారి ఓ బృందంగా సాధనచేసింది. దాదాపు నాలుగు వారాల తర్వాత టీమిండియాకు ఇదే తొలి ట్రైనింగ్ సెషన్ కావడంతో.. ఆటగాళ్లంతా హుషారుగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఈ పర్యటనలో ఇదే మా తొలి గ్రూప్ ప్రాక్టీస్, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు' అంటూ క్యాప్షన్ జోడించింది. We have had our first group training session and the intensity was high 🔥#TeamIndia's 🇮🇳 preparations are on in full swing for the #WTC21 Final 🙌 pic.twitter.com/MkHwh5wAYp — BCCI (@BCCI) June 10, 2021 కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు టీమిండియాకు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోవడంతో ఆటగాళ్లంతా నెట్ సెషన్లోనే తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే, ఓపెనర్ రోహిత్ శర్మ, టెస్ట్ స్పెసలిస్ట్ చెతేశ్వర్ పుజారాలు సాధనలో మునిగిపోయారు. అందరూ నెట్ సెషన్లో చమటోడ్చారు. కోహ్లీ బ్యాట్ లేకుండా కెమెరాకు పోజులివ్వగా.. రోహిత్ భారీ షాట్లు ఆడుతూ కనిపించాడు. గిల్, పంత్ బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్, వికెట్ కీపింగ్ సాధన చేశారు. ఇక బౌలర్లు సిరాజ్, అశ్విన్, బుమ్రా, ఇషాంత్, షమీలు హుషారుగా బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. డ్యూక్ బంతులతో సాధన చేస్తూ ఊహించని స్వింగ్‌ను రాబడుతూ.. సంతోషంలో మునిగితేలారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2021 వాయిదా పడిన అనంతరం ఇళ్లకు వెళ్లిపోయిన టీమిండియా ఆటగాళ్లు.. ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం ముంబైలో రెండు వారాలు క్వారంటైన్లో గడిపారు. అనంతరం జూన్ 3న భారత బృందం ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌కు చేరుకుంది. అక్కడ ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు హోటల్ గదుల్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆతర్వాత మూడు రోజుల పాటు ఒక్కో ఆటగాడు మాత్రమే సాధన చేశారు. గురువారం నుంచే భారత బృందం కలిసికట్టుగా సాధన మొదలుపెట్టింది. కాగా, ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే డబ్యూటీసీ ఫైనల్లో భారత్.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. సుదీర్ఘ విరామానంతరం తిరిగి ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధవన్ పేరు ఖరారు..? -
టీమిండియాకు శుభవార్త.. ఆ మ్యాచ్ అయ్యాక 20 రోజులు రిలాక్స్
సౌథాంప్టన్: ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయ్యాక 20 రోజుల పాటు రిలాక్స్ అయ్యే వెసులుబాటును కల్పించాలని నిర్ణయించింది. అంటే కోహ్లీ సేన జూన్ 23న బయో బబుల్‌ను వీడితే, తిరిగి జులై 14న బుడగలోకి ప్రవేశిస్తుంది. ఈ మూడు వారాల పాటు భారత బృందం ఎక్కడ గడుపుతారన్నది(యూకే పరిధిలోనే) వారి వ్యక్తిగత విషయమని బీసీసీఐ తేల్చింది. నాలుగున్నర నెలల పాటు సాగే సుదీర్ఘ పర్యటన కావడంతో ఆటగాళ్లకు ఈ బ్రేక్ ఊరట కలిగించే అంశమని, ఈ సమయాన్ని క్రికెటర్లు కుటుంబం సభ్యులతో కలిసి ఆస్వాధించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోను జట్టు సభ్యులంతా జులై 14న తిరిగి భారత క్యాంప్‌లోకి అడుగుపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా, జూన్ 2న ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరేముందు ముంబైలో రెండు వారాలు క్వారంటైన్లో గడిపిన టీమిండియా సభ్యులు, ఇంగ్లండ్‌లో దిగిన తర్వాత మళ్లీ మూడు రోజులు క్వారంటైన్లో గడిపారు. ఈ సమయంలో వారు ఒకరినొకరు కలుసుకునే అవకాశం కూడా లభించలేదు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత బయో బబుల్ నుంచి 20 రోజుల బ్రేక్ లభించడమనేది టీమిండియాకు ఊరట కలిగించే అంశమే. ఇదిలా ఉంటే, ఆగస్ట్ 4న ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్ ముగిసాక, టీమిండియా క్రికెటర్లంతా మళ్లీ ఐపీఎల్ బబుల్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ 20 రోజులు వాళ్లకు స్వేచ్ఛగా తిరిగే అవకాశం రావడం మానసికంగా ఉల్లాసానికి గురి చేసే విషయమని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: శభాష్ విహారి.. నువ్వు నిజంగా చాలా గ్రేట్ గురూ -
శభాష్ విహారి.. నువ్వు నిజంగా చాలా గ్రేట్ గురూ
లండన్: టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా కాలంలో తన మిత్రులు, అనుచరులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసి అవసరాల్లో ఉన్నవాళ్లకు సాయం చేస్తున్న విహారి.. తాజాగా ప్రేమోన్మాది చేతిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ అమ్మాయిని కాపాడాడు. సరైన సమయంలో వైద్యానికి అవసరమైన డబ్బును అందించడంతో ప్రియాంక అనే ఆ అమ్మాయి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి కోలుకుంటుంది. As promised yesterday to Priyanka’s family. They’ll be receiving funds from me today n get her surgery started asap. She deserves to have a better life and it’s all of our responsibility to give it to her.thank you everyone who has come forward@Hidderkaran special mention to you — Hanuma vihari (@Hanumavihari) June 7, 2021 వివారాల్లోకి వెళితే... శ్రీకాంత్ అనే అబ్బాయి ప్రేమ పేరుతో బాధితురాలు ప్రియాంకను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ ఓ రోజు ప్రియాంకకు ప్రపోస్ చేయగా.. ఆమె నిరాకరించింది. దీంతో ఆవేశానికి లోనైన శ్రీకాంత్.. కత్తితో ప్రియాంకపై దాడి చేసి, ఆమె గొంతు కోశాడు. ఘటనా స్థలంలో నిర్జీవంగా పడివున్న ప్రియాంకను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆపరేషన్ కోసం 6 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. అంత మొత్తంలో డబ్బులు చెల్లించుకోలేని ప్రియాంక కుటుంబసభ్యులు సోషల్ మీడియా ద్వారా దాతలను అభ్యర్ధించారు. ఈ విషయం తెలుసుకున్న హనుమ విహారి.. వెంటనే స్పందించి ఆ అమ్మయి వైద్యానికి అవసరమయ్యే 5 లక్షలు పంపాడు. ఆపరేషన్ తర్వాత ప్రియాంక ప్రస్తుతం కోలుకుంటోంది. విహారి చేసిన సహాయానికి ప్రియాంక, ఆమె కుటుంబ సభ్యులతో పాటు విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంట కనిపెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. వీరందరూ పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ లాంటి పలు సేవల్ని ప్రజలకు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, 27 ఏళ్ల హనుమ విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ డ్రా చేసుకున్న సిడ్నీ టెస్టులో విహారి.. అశ్విన్‌తో కలిసి నాలుగు గంటల పాటు పోరాడి జట్టును గట్టెక్కించి విషయం తెలిసిందే. చదవండి: ఆసీస్ వికెట్ కీపర్‌కు తీవ్ర గాయాలు.. పెదాలపై ఏడు కుట్లు -
క్వారంటైన్ కంప్లీట్.. ప్రాక్టీస్ షురూ
సౌతాంప్టన్: మూడు రోజుల కఠిన క్వారంటైన్ ఆనంతరం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ప్రాక్టీస్‌ను ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 18 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. క్వారంటైన్ శనివారం ముగియడంతో ఆటగాళ్లు ఆదివారం ప్రాక్టీస్‌లో పూర్తిగా నిమగ్నమయ్యారు. దాదాపు మూడు వారాల తర్వాత టీమిండియాకు ఇదే మొదటి ట్రైనింగ్ సెషన్ కావడంతో ఆటగాళ్లంతా హుషారుగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. First outing in southampton🙌 #feelthevibe #india pic.twitter.com/P2TgZji0o8 — Ravindrasinh jadeja (@imjadeja) June 6, 2021 స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సౌతాంప్టన్‌లో ఫస్ట్ ప్రాక్టీస్ అంటూ క్యాప్షన్ జోడించాడు. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి అడుగుపెట్టిన యువ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా బౌలింగ్ సాధన చేస్తూ హుషారుగా కనిపించాడు. వీరితో పాటు మరికొందరు టీమిండియా క్రికెటర్లు నెట్స్‌లో బిజీగా గడిపారు. టీమిండియా క్రికెటర్లు ఏజియస్ బౌల్ స్టేడియానికి పక్కనే ఉన్న హిల్టన్ హోటల్లో బస చేస్తున్నారు. కాగా, ముంబైలో రెండు వారాల క్వారంటైన్ అనంతరం టీమిండియా జూన్ 3న ఇంగ్లండ్‌కు చేరుకుంది. అనంతరం ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు హోటల్ గదుల్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే, డబ్యూటీసీ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్ధి న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అరంగేట్రం ఆటగాడు డెవాన్ కాన్వే (200) డబుల్ సెంచరీతో అదరగొట్టడంతో ఆ జట్టు ప్రత్యర్ధిపై పైచేయి సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత ఇరు జట్లు జూన్ 10న రెండో టెస్ట్‌లో తలపడతాయి. దీంతో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు కావాల్సిన ప్రాక్టీస్ లభించినట్లవుతుంది. మరోవైపు టీమిండియా డబ్యూటీసీ ఫైనల్ ముగిసాక(జూన్ 22) 42 రోజుల పాటు ఖాళీగా ఉంటుంది. అనంతరం ఆగస్ట్4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తలపడనుంది. చదవండి: టిమ్ సౌథీ 'ఆరే'యడంతో న్యూజిలాండ్‌కు ఆధిక్యం -
విమానంలో రోహిత్ చేసిన పనికి నిద్రపోలేదు..
లండన్: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, రూట్ సేనతో ఐదు టెస్ట్ సిరీస్‌ల కోసం టీమిండియా గురువారం యూకేలో అడుగుపెట్టింది. భారత్ నుంచి ప్రత్యేక విమానంలో పురుషుల, మహిళల జట్లు లండన్‌కు చేరుకున్నాయి. క్రికెటర్లంతా విమానాల్లో సందడి చేస్తుండగా తీసిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ప్రయాణ సమయంలో ఆటగాళ్లు ఏ రకంగా గడిపారో కొందరు క్రికెటర్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన ప్రయాణ విషయాలను తెలుపుతూ.. ప్రశాంతంగా నిద్రపోతుంటే రోహిత్ శర్మ తన నిద్రకు భంగం కలిగించాడని తెలిపాడు. దీంతో సరిగా నిద్ర పోలేదని చెప్పుకొచ్చాడు. 'ఇప్పుడే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాం. హోటల్‌కు వెళ్లడానికి రెండు గంటలు సమయం పడుతుంది. విమాన ప్రయాణంలో రెండు గంటలు మంచిగా నిద్రపోయాను. ఆ తర్వాత రోహిత్ భాయ్ వచ్చి లేపాడు. ఇక అంతే ఆ తర్వాత మళ్లీ నిద్ర రాలేదు. సరిగ్గా విమానం ల్యాండ్ అయ్యే రెండు గంటల ముందు మళ్లీ కాస్త నిద్రపోయా. నిన్న కాస్త ఎక్కువగానే రన్నింగ్ సెషన్లో పాల్గొన్నాం. దాంతో నేను చాలా అలసిపోయాను' అని సిరాజ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. 🇮🇳 ✈️ 🏴 Excitement is building up as #TeamIndia arrive in England 🙌 👌 pic.twitter.com/FIOA2hoNuJ — BCCI (@BCCI) June 4, 2021 చదవండి: బాలీవుడ్ నటితో పెళ్లి.. అప్పుడే క్లారిటీ ఇచ్చిన టీమిండియా కోచ్ -
ముంబై టు లండన్.. అలా సాగిపోయింది
సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు రూట్ సేనను 5 టెస్ట్‌ల సిరీస్‌లో ఢీకొనేందుకు టీమిండియా లండన్‌లో ల్యాండ్ అయ్యింది. మూడు రోజుల కఠిన క్వారంటైన్ అనంతరం సౌతాంప్టన్‌లోని ఏజియస్ బౌల్ స్టేడియంలో టీమిండియా క్రికెటర్లు సాధన చేయనున్నారు. ఈ మూడు రోజుల పాటు ఆటగాళ్లు ఒకరిని ఒకరు కలుసుకునే వీలు ఉండదు. కాగా, భారత బృందం ముంబై నుంచి బయల్దేరి, సౌతాంప్టన్ చేరుకునే వరకు జరిగిన మొత్తం సన్నివేశాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. జూన్ 2న భారత్ పురుషుల, మహిళా క్రికెటర్ల బృందం.. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో లండన్‌కు బయల్దేరింది. 🇮🇳 ✈️ 🏴 Excitement is building up as #TeamIndia arrive in England 🙌 👌 pic.twitter.com/FIOA2hoNuJ — BCCI (@BCCI) June 4, 2021 ఇంత భారీ ఎత్తున భారత క్రికెట్ బృందం విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లడం చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో ఈ జర్నీని క్రికెటర్లు ఎప్పటికీ మరిచిపోకుండా ఉండేందుకు బీసీసీఐ ప్రతి ఒక్క సన్నివేశాన్ని రికార్డు చేసి, ట్విటర్లో షేర్ చేసింది. విమానంలో పురుష, మహిళా క్రికెటర్లు ఒకరితో ఒకరు ఆడుతూ పాడుతూ, ఇంటర్యూలు చేసుకుంటు సరదాగా గడిపిన సన్నివేశాలు అభిమానులకు అలరించాయి. కాగా, జూన్ 18న టీమిండియా.. న్యూజిలాండ్‌తో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా, జూన్ 16న భారత మహిళా జట్టు ఇంగ్లండ్‌తో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదిక కానుంది. చదవండి: పాక్ జట్టులోకి భారీ హిట్టర్.. -
కోహ్లీ, రవిశాస్త్రి ఆడియో లీక్..
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో లీకైంది. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిన్ ఫైనల్‌కు ముందు టీమిండియా అనుసరించాల్సిన వ్యూహాలపై కెప్టెన్, కోచ్ డిస్కస్ చేసిన అంశాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇంగ్లండ్‌కు బయల్దేరే ముందు ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లీ మాట్లాడారు. అయితే, ఈ సమావేశానికి కొన్ని నిమిషాల ముందు రవిశాస్త్రితో కోహ్లీ మాట్లాడిన మాటలు లీకయ్యాయి. లైవ్ ఇంకా స్టార్ట్ కాలేదని భావించిన కోహ్లీ.. డబ్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లను ఎలా ఔట్ చేయాలనే అనే అంశంపై రవిశాస్త్రితో చర్చించాడు. 🗣️ Happy to have the opportunity to play the World Test Championship Final: #TeamIndia Captain @imVkohli ☺️ pic.twitter.com/jjFEwEisrD — BCCI (@BCCI) June 2, 2021 ఈ క్రమంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లను రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేయించడం ద్వారా కట్టడి చేయబోతున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. అందుకు రవిశాస్త్రి కూడా అంగీకారం తెలిపాడు. అయితే, ఈ మాటలు డైరెక్ట్‌గా లైవ్‌లో వచ్చేయడంతో తమ ప్లాన్ బహిర్గతమైందని కోహ్లీ, రవిశాస్త్రి నాలుక కరుచుకున్నారు. కాగా, బుధవారం రాత్రి ముంబై నుంచి ఇంగ్లండ్‌కు బయల్దేరిన భారత జట్టు.. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్‌తో ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు 20 మందితో కూడిన భారత జంబో జట్టు, ముంబైలో 14 రోజుల క్వారంటైన్‌ను ముగించుకుని స్పెషల్ ఛార్టెర్ ప్లైట్‌లో లండన్‌కు బయల్దేరింది. చదవండి: కచ్చితంగా ఐదు వికెట్లు తీస్తావని ధైర్యం నింపాడు.. -
Team India: కుటుంబ సమేతంగా ఇంగ్లండ్‌కు పయనం!
ముంబై: భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు కుటుంబ సమేతంగా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చేందుకు యూకే ప్రభుత్వం సమ్మతి తెలిపింది. తమ దేశంలో సుదీర్ఘ పర్యటన నిమిత్తం రానున్న రెండు జట్ల ప్లేయర్స్.. తమ తమ ఫ్యామిలీస్‌తో కలిసి ఉండేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పర్యటనలో భాగంగా భారత పురుషుల జట్టు ఏకంగా నాలుగున్నర నెలలు యూకేలోనే గడపనుండగా, మహిళా జట్టు కూడా దాదాపు నెలన్నర రోజులు అక్కడే స్టే చేయనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు రూట్ సేనతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో పాల్గొనేందుకు భారత పురుషుల జట్టు, ఇంగ్లండ్ వుమెన్స్ టీమ్‌తో ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు భారత మహిళా జట్లు ఈ నెల 2న ప్రత్యేక విమానంలో లండన్‌కు బయల్దేరనున్నాయి. లండన్‌లో ల్యాండ్ అయ్యాక ఇండియా మెన్స్ టీమ్.. డబ్ల్యూటీసీ ఫైనల్ వేదికైన సౌథాంప్టన్‌కు వెళ్లనుండగా.. భారత మహిళల జట్టు ఏకైక టెస్ట్‌కు వేదికైన బ్రిస్టల్‌కు బయల్దేరుతుంది. అయితే, యూకేలో ల్యాండ్ అయ్యాక భారత బృందం 10 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. అనంతరం ప్లేయర్స్‌తో పాటు వారి కుటుంబ సభ్యుల నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టును కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. కాగా, లండన్‌కు బయల్దేరనున్న భారత బృందం ఇప్పటికే ముంబైలోని ఒకే హోటల్లో క్వారంటైన్లో ఉంటుంది. భారత్‌లో రెండో దశ కరోనా వ్యాప్తి కారణంగా ఇండియా నుంచి ప్రయాణాలపై నిషేధం ఉన్నా.. క్రికెట్ మ్యాచ్‌ల కోసం యూకే ప్రభుత్వం ప్లేయర్స్‌కు సడలింపులు ఇచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది. చదవండి: నా 'ఈ స్థాయికి' ధోనినే కారణం: జడ్డూ -
టీమిండియా ఆ 42 రోజులు ఏం చేస్తుంది..?
ముంబై: ఇంగ్లండ్ పర్యటనకు బీసీసీఐ రూపొందించిన షెడ్యూల్‌పై భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ మండిపడ్డాడు. ఈ పర్యటనలో భారత్.. జూన్ 18 నుంచి 22 మధ్యలో న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్ ముగిశాక టీమిండియా 42 రోజులు ఖాళీగా ఉండటంపై భారత అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ పర్యటనకు కుటుంబ సమేతంగా వెళ్తున్న భారత జట్టు ఇన్ని రోజుల పాటు ఖాళీగా కాలం గడపాల్సి వచ్చేలా షెడ్యూల్ రూపొందించడం ఏంటని వెంగ్సర్కా్ర్ నిలదీశాడు. ఇంత దారుణమైన షెడ్యూల్ ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక జట్టును దేశం కాని దేశంలో 42 రోజుల పాటు ఖాళీగా కూర్చోబెట్టడం ఏ మాత్రం సరికాదని, అన్ని రోజులు క్రికెటర్లు ఏం చేస్తారని ప్రశ్నించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన వెంటనే టెస్ట్ సిరీస్ ఆరంభం అయ్యేలా షెడ్యూల్ ఎందుకు రూపొందించలేకపోయారని ప్రశ్నించాడు. కాగా, దాదాపు నెలన్నర ఖాళీగా ఉన్న తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. షెడ్యూల్ ప్రకారం.. జూన్ 3వ తేదీన ఇంగ్లండ్‌లో అడుగు పెట్టబోయే భారత జట్టు, అక్కడి నుంచి ఐపీఎల్లో పాల్గొనేందుకు సెప్టెంబర్‌లో యూఏఈకి బయల్దేరనుంది. అంటే ఆరు టెస్ట్ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్.. దాదాపు నాలుగున్నర నెలలు కాలం అక్కడే గడపనుంది. చదవండి: మంజ్రేకర్ కోసం వెతికాను.. అతని కోసమే అలా చేశాను -
భారత సీ జట్టు వెళ్లినా సునాయాసంగా గెలుస్తుంది..
కరాచీ: ప్రస్తుతం భారత క్రికెట్ చాలా పటిష్ఠంగా ఉందని, ఏక కాలంలో మూడు జట్లను బరిలోకి దించి, విజయాలు సాధించే సత్తా భారత్‌కు మాత్రమే ఉందని పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ ఈ స్థాయికి చేరడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అవలంబిస్తున్న విధానాలే కారణమని, యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో బీసీసీఐని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకోవాలని ఈ పాక్ మాజీ డాషింగ్ క్రికెటర్ సూచించాడు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ లాంటి లీగ్‌లు భారత యువ ఆటగాళ్ల పాలిట వరంలా మారాయని, ఈ తరహా టోర్నీల వల్ల మేటి ఆటగాళ్లు ఉద్భవిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. శ్రీలంక పర్యటనకు భారత్ రెండో జట్టు వెళ్లనున్న నేపథ్యంలో ఈ పాక్ మాజీ ఆటగాడు స్పందిస్తూ.. శ్రీలంక పర్యటనకు భారత సీ జట్టు వెళ్లినా సునాయసంగా గెలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. యువ క్రికెటర్లకు రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజ ఆటగాడు మార్గనిర్దేశం చేస్తుండటం భారత క్రికెట్ ఉన్నతికి మరో కారణమని ఆయన పేర్కొన్నాడు. ద్రవిడ్ ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా చాలా మంది యువ క్రికెటర్లు లైమ్‌లైట్‌లోకి వచ్చారని, టీమిండియా హెడ్ కోచ్రవిశాస్త్రి కూడా జట్టుకు అద్భుతంగా సేవలందిస్తున్నాడని ప్రశంసించాడు. మాజీ కెప్టెన్ ధోనీ నాయకత్వాన్ని ప్రస్తుత సారథి కోహ్లీ అందిపుచ్చుకున్నాడని, విరాట్ అందుబాటులో లేకపోతే ఆ బాధ్యతలు రోహిత్ చూసుకుంటాడని, అతను కూడా గాయపడితే ఆ బాధ్యతలను కేఎల్ రాహుల్ చూసుకుంటాడని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత రెగ్యులర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరనుండగా.. భారత బి జట్టు శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. భారత జట్టు ఏక కాలంలో రెండు అంతార్జాతీయ జట్లతో రెండు వేర్వేరు సిరీస్‌లలో పాల్గొననుంది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు యూకే పర్యటనకు వెళ్తుండగా.. అదే సమయంలో భారత బి జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. భారత బి జట్టుకు కోచ్‌గా భారత మాజీ క్రికెటర్, ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనుండగా, బి జట్టుకు సీనియర్ ఆటగాడు ధవన్ సారధ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. చదవండి: Sachin Tendulkar: ఆ రెండు కోరికలు నెరవేరలేదు -
ఎన్ని అర్హతలున్నా ఏం లాభం.. అతనుండగా జట్టులోకి కష్టమే
ముంబై: తుది జట్టులో ఉండడానికి ఎన్ని అర్హతలున్నా ఏ ప్రయోజనం లేదని టీమిండియా యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశాడు. జట్టులో రవీంద్ర జడేజా లాంటి అత్యుత్తమ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అల్ రౌండర్ ఉండగా, తనకు తుది జట్టులో స్థానం లభిస్తుందని అనుకోవట్లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉన్న అక్షర్ పటేల్.. ఓ ఇంటర్వ్యూ సందర్బంగా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనలో టాలెంట్ కు ఏ కొదవ లేదని, జట్టు ప్రయోజనాల కోసం ప్రతి ఒక్క ఆటగాడు పాటు పడాల్సి ఉంటుందని అక్షర్ చెప్పుకొచ్చాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో అత్యద్భుతంగా రాణించి, 27 వికెట్లు పడగొట్టిన ఈ లెఫ్ట్ అర్మ్ స్పిన్ అల్ రౌండర్.. ఇంగ్లండ్ పర్యటనలో తన అవకాశాలపై స్పందిస్తూ ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు. కాగా, గాయం కారణంగా జడేజా అందుబాటులో లేకపోవడం వల్ల ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా అక్షర్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ లో అతను 3 మ్యాచ్ ల్లో 10.59 సగటుతో 27 వికెట్లు పడగొట్టి అరంగేట్రం సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ సిరీస్ లో అక్షర్ ఏకంగా నాలుగు సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ‘నైపుణ్యాల పరంగా వెనుకబడలేదు. కాగా, టెస్టుల్లో జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ద్వయం ఇంటా, బయటా అద్భుత ప్రదర్శనలు చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌కు చోటు దొరకడం చాలా కష్టం. కుల్దీప్, చహల్ లాంటి స్పిన్నర్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణిస్తున్నా, జట్టు కూర్పు కారణంగా వారికి కూడా చోటు దొరకడం లేదు. చదవండి: WTC Final: ఒక్కో టికెట్ ధర 2 లక్షలు..? -
పంత్‌కు క్రికెట్ దిగ్గజం వార్నింగ్..
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్‌కు దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ సున్నితమైన వార్నింగ్ ఇచ్చాడు. ఇంగ్లీష్ గడ్డపై దూకుడు తగ్గించుకొని బ్యాటింగ్ చేయాలని హెచ్చరించాడు. ప్రతి బంతిని బాదడానికి ప్రయత్నించకూడదని, క్రీజులో ఎక్కువ సమయం గడిపేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించాడు. గతంలో రోహిత్ శర్మకు కూడా ఇదే సలహా ఇచ్చానని పేర్కొన్నాడు. తాజాగా ఓ జాతీయ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కపిల్ మాట్లాడుతూ.. పంత్ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా పరిణితి చెందాడని, అందుకు అతని ఇటీవల కాలంలో ఫామే నిదర్శనమని చెప్పుకొచ్చాడు. అయితే అతని సహజ సిద్దమైన ఆటతీరుకి ఇంగ్లండ్ లో పరిస్థితులు అనుకూలించకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ పిచ్ లపై ప్రతి బంతిని బాధాలని ప్రయత్నించకూడదని, క్రీజ్ లో ఎక్కువ సమయం గడిపితే పరుగులు ఆవంతకవే వస్తాయని తెలిపాడు. ఇంగ్లండ్ పర్యటనలో పంత్ ఈ ప్రణాళికను అమలుచేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. కాగా, గతంలో ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మకు కూడా ఇదే విషయాన్ని చెప్పానని కపిల్ ప్రస్తావించాడు. రోహిత్ కూడా పంత్ లాగే ప్రతి బంతిని బలంగా బాధాలనుకుండేవాడని, అయితే ఈ సలహాను పాటించడం వల్ల అతను సత్ఫలితాలు సాధించాడని పేర్కొన్నాడు. రోహిత్ లాగే పంత్ కూడా చాలా తెలివైన, విలువైన ఆటగాడని.. తాను చెప్పిన ఫార్ములాను ఇంగ్లండ్ గడ్డపై అమలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలో న్యూజిలాండ్ తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు అతిథ్య ఇంగ్లండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇదిలా ఉంటే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ను బెస్టాఫ్ 3 ఫార్మాట్లో నిర్వహించాలని కపిల్ బీసీసీఐ కి సూచించాడు. రెండేళ్ల పాటు సాగిన టోర్నీలో ఒక్క మ్యాచ్‌తో విజేతను తేల్చడం కంటే, బెస్టాఫ్ 3 పద్దతిలో ఫైనల్ నిర్వహించడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఈ టోర్నీ ని ప్రవేశపెట్టడం వల్ల టెస్ట్ క్రికెట్ కు ఆదరణ పెరిగిందని, బెస్టాఫ్ 3 పద్దతి వల్ల ప్రేక్షకులకు కావాల్సిన మజా లభించడంతో పాటు టెస్ట్ ఫార్మాట్ కు మరింత ఆదరణ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి: ఏంటి కోహ్లి.. ఫీజు ఒకేసారి చెల్లిస్తావా లేక ఈఎంఐల్లో కడతావా.. ? -
రాహుల్ వర్కౌట్లకు అతియా అదిరిపోయే రెస్పాన్స్..
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ ఓపెనర్ కేఎల్ రాహుల్.. ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా అపెండిసైటిస్‌తో బాధపడుతూ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇటీవలే కోలుకుని తేలికపాటి కసరత్తులు ప్రారంభించాడు. ఈ సందర్బంగా తాను తీసుకున్న కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కెటిల్ బాల్‌తో తేలికపాటి కసరత్తులు చేస్తున్న చిత్రంతో పాటు సేదతీరుతున్న క్యాండిడ్ చిత్రాలను షేర్ చేస్తూ.. And still, We Rise అనే క్యాప్షన్ ను జోడించాడు. ఈ పోస్ట్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. గంటల వ్యవధిలో వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. అయితే రాహుల్ పోస్ట్ కు అతని అంతరంగ స్నేహితురాలు అతియా శెట్టి పెట్టిన కామెంట్ నెటిజన్లను ప్రత్యేకంగా ఆకర్షింది. ఆమె మరీ భిన్నంగా రెస్పాండ్ కాలేదు, కేవలం స్మైలీ ఏమోజీ పెట్టి వదిలేసింది. అయినప్పటికీ ఈ కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా, బాలీవుడ్ నటి అతియా శెట్టితో రాహుల్ ప్రేమలో ఉన్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ బాహటంగానే చెట్టాపట్టాలేసుకుని తిరిగినా.. తమ మధ్య ప్రేమ వ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా రాహుల్ పెట్టిన పోస్ట్‌కు అతియా స్పందించడంతో వీరి ప్రేమ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ లో పర్యటించాల్సిన భారత జట్టులో కే ఎల్ రాహుల్ సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియాతో పాటు అతను కూడా లండన్ ఫ్లైట్ ఎక్కాలంటే ఫిట్ నెస్ పరీక్షలో పాస్ కావాల్సి ఉంది. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు రూట్ సేనతో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. చదవండి: WTC FINAL: డ్రా అయితే ఆరో రోజు కూడా..? -
రోజురోజుకు రాటుదేలుతున్నారు..
ముంబై: ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో ఎనిమిది రోజుల కఠిన క్వారంటైన్ నిమిత్తం ముంబై చేరుకున్న టీమిండియా క్రికెటర్లు జిమ్ లో కఠోరంగా శ్రమిస్తున్నారు. అవుట్ డోర్ ప్రాక్టీస్ లేకపోవడంతో ఎక్కువ సమయం జిమ్ లోనే కసరత్తులు చేస్తూ, రోజురోజుకు రాటుదేలుతున్నారు. ఈ క్రమంలో క్రికెటర్లంతా శారీరకంగా ధృడంగా మారుతున్నారు. ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రహానే, ఉమేశ్ యాదవ్, మయాంక్ అగర్వాల్ తదితరులు జిమ్‌లో గంటల కొద్దీ చెమటోడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. Getting stronger each day! 💪💪#TeamIndia pic.twitter.com/0bZFml1gxL — BCCI (@BCCI) May 26, 2021 కాగా, క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ కు బయల్దేరనున్న కుటుంబ సభ్యులు, సహాయ సిబ్బంది కూడా బయో బబుల్‌లోకి అడుగుపెట్టారు. వారు కూడా ఎనిమిది రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉంటారు. అనంతరం జూన్ 2న భారత బృందం ప్రత్యేక విమానంలో లండన్ కు బయల్దేరుతుంది. ఈ టూర్లో న్యూజిలాండ్ తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు ఆతిథ్య ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు తలపడుతుంది. జూన్ 8న డబ్ల్యూటీసీ ఫైనల్, ఆగస్ట్ 4 నుంచి సెప్టెంబర్ 14 మధ్యలో ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. చదవండి: ఆ బౌలర్ ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడు.. -
టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కనున్న స్టార్ ప్లేయర్
ముంబై: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు రూట్ సేనతో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కనున్న భారత జట్టుతో స్టార్ ఆటగాడు కే ఎల్ రాహుల్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం ఎంపిక చేసిన భారత జట్టులో రాహుల్ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. అపెండిసైటిస్‌కు జరిగిన సర్జరీ కారణంగా అతను పూర్తి ఫిట్నెస్ సాధించాల్సి ఉండింది. ఈ క్రమంలో అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో జట్టుతో పాటు ఇంగ్లండ్ బయల్దేరేందుకు బీసీసీఐ పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే జట్టులోకి రావొచ్చని జట్టు ఎంపిక సమయంలోనే సెలక్టర్లు పేర్కొన్న విషయం విధితమే. ఈ ఏడాది ఐపీఎల్ మధ్యలో రాహుల్ అపెండిసైటిస్‌తో బాధ పడ్డాడు. రాహుల్ చివరిసారిగా 2019 సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో టెస్టులో ఆడాడు. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో జట్టులోనే ఉన్నప్పటికీ అతనికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. 29 ఏళ్ల రాహుల్ ఇప్పటి వరకు 36 టెస్టుల్లో 2006 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 11 అర్ధశతకాలున్నాయి. ఇదిలా ఉంటే, కోహ్లి సారథ్యంలోని భారత జంబో జట్టు జూన్ 2న ఇంగ్లండ్ బయల్దేరనుంది. ఈ పర్యటనలో తొలుత(జూన్ 18న) డబ్ల్యూటీసీ ఫైనల్ల్లో న్యూజిలాండ్ తో తలపడనున్న టీమిండియా .. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. -
టీమిండియాలో అత్యంత ప్రమాదకర ఆటగాడు అతనే..
లండన్: ప్రస్తుతం టీమిండియాలో అత్యంత ప్రమాదకర ఆటగాడు రిషబ్ పంతేనని, అతనికి అడ్డుకట్ట వేయడం తమ బౌలర్లకు తలకు మించిన పని అవుతుందని న్యూజీలాండ్ బౌలింగ్ కోచ్ షేన్ జుర్గెన్సెన్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌లో భాగంగా భారత్, న్యూజీలాండ్ జట్లు తలపడనున్న నేపథ్యంలో తమ జట్టు బౌలర్లు పంత్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించాడు. క్షణాల్లో మ్యాచును మలుపు తిప్పే సామర్థ్యం ఉన్న పంత్ పట్ల తమకు ప్రత్యేక ప్రణాళికలున్నాయని, వాటిని అమలు చేసి పంత్ ను ఖచ్చితంగా కట్టడి చేస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై పంత్ ఎదురుదాడికి దిగిన విషయాలపై తాము అధ్యయనం చేసామని వివరించాడు. ఈ సందర్బంగా టీమిండియా బౌలింగ్ అటాక్ పై కూడా ప్రశంశల వర్షం కురిపించాడు. బుమ్రా, షమీ, సిరాజ్, ఇషాంత్‌లతో కూడిన టీమిండియా పేస్ దళం అద్భుతంగా ఉందని కొనియాడాడు. కాగా, సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న భారత్, న్యూజీలాండ్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పోరులో తలపడేందుకు కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు ఇదివరకే ఇంగ్లాండ్‌కు చేరుకుంది. ఈ పర్యటనలో కివీస్ జట్టు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు ముందు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో రెండు టెస్టులు ఆడనుంది. కాగా, ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం భారత జట్టు జూన్ 2న లండన్ కు బయల్దేరనుంది. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌తో పాటు ఆతిధ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. -
ఇంగ్లండ్ పర్యటనలో అతను పాంటింగ్‌ను అధిగమిస్తాడు..
లాహోర్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి శతక దాహం త్వరలో ప్రారంభంకానున్న ఇంగ్లండ్ పర్యటనలో తీరుతుందని పాక్ మాజీ ఆటగాడు సల్మాన్ బట్ జోస్యం చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి శతకొట్టక దాదాపు రెండేళ్లు అయ్యిందని, అతని కెరీర్ మొత్తంలో సెంచరీకి ఇంత గ్యాప్ రావడం ఇదే తొలిసారని వెల్లడించాడు. 2019 నవంబర్‌లో చివరిసారి బంగ్లాదేశ్‌పై పింక్ బాల్ టెస్ట్‌లో శతకం సాధించిన కోహ్లి.. రెండేళ్ల కాలంలో చాలాసార్లు సెంచరీకి చేరువయ్యాడు కానీ, సెంచరీని మాత్రం చేయలేకపోయాడని పేర్కొన్నాడు. అయితే, కోహ్లి కేవలం సెంచరీ మార్కును మాత్రమే చేరుకోలేకపోయాడని, అతని పరుగుల ప్రవాహానికి ఏమాత్రం అడ్డుకట్ట పడలేదని గుర్తుచేశాడు. న్యూజిలాండ్‌తో జరుగబోయే డబ్యూటీసీ ఫైనల్లోనే కోహ్లి సెంచరీ సాధిస్తాడని, దీంతో అతనితో పాటు అభిమానుల నిరీక్షణకు కూడా తెరపడనుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్లో 70 శతకాలు నమోదు చేసిన కోహ్లి.. అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అతను రానున్న ఇంగ్లండ్ పర్యటనలో మరో సెంచరీ చేస్తే రెండో స్థానంలో ఉన్న పాంటింగ్(71) సరసన చేరతాడు. అంతర్జాతీయ క్రికెట్లో శతక శతకాలతో సచిన్(100) అగ్రస్థానంలో నిలిచాడు. చదవండి: సచిన్ 'దేవుడు', ధోని 'లెజెండ్', కోహ్లి..? -
టీమిండియాకు ఆడేందుకు 50 మందికి పైగా రెడీగా ఉన్నారు..
లాహోర్: భారత్ క్రికెట్ జట్టు రిజర్వ్ బెంచ్ బలంపై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హాక్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాకు ఆడేందుకు కనీసం 50 మంది ఆటగాళ్లు రెడీగా ఉన్నారని, ఈ పరిస్థితి 1990, 2000 దశకాల్లో ఆస్ట్రేలియా కూడా లేదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్‌ను శాశిస్తున్న రోజుల్లో ఆ దేశం తరఫున రెండు బలమైన జట్లు(రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లతో) సాధ్యపడలేదని, భారత్ మాత్రం ఆ దిశగా దూసుకుపోతుందని తెలిపాడు. కోహ్లి నేతృత్వంలో 23 మంది సభ్యులతో కూడిన భారత జంబో జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంటే, అంతే బలమైన మరో భారత జట్టు (భారత్ బి) శ్రీలంక పర్యటనకు సిద్దమవడం బట్టి చూస్తే భారత్ క్రికెట్ ఏ స్థాయిలో ఉందో సుస్పష్టమవుతుందని అన్నాడు. నాలుగుకు పైగా బలమైన జట్లను వివిధ అంతర్జాతీయ స్థాయి జట్లతో తలపడేందుకు సిద్ధం చేయగల సత్తా భారత్‌కు ఉందని కొనియాడాడు. అనుభవజ్ఞులైన స్టార్ ఆటగాళ్లతో పాటు ప్రతిభగల యువ ఆటగాళ్లతో భారత్ క్రికెట్ నిండు కుండని తలపిస్తుందని ఆకాశానికెత్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ రెండు జట్లను కలిగి ఉండటం సహజమేనని అభిప్రాయపడ్డాడు. ఓ దేశం తరఫున రెండు జాతీయ జట్లు వివిధ దేశాలతో ఒకేసారి తలపడటం క్రికెట్ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి కావచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. కాగా, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడేందుకు కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు జూన్ 2న లండన్‌కు బయల్దేరనుంది. ఈ పర్యటనలో తొలుత(జూన్ 18-22) న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్న భారత్.. అనంతరం ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్ మధ్య వచ్చే గ్యాప్‌లో బీసీసీఐ ఓ పరిమిత ఓవర్ల సిరీస్‌ను ప్లాన్ చేసింది. అక్టోబర్‌లో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని గతేడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. లంకలో పర్యటించనున్న భారత బి జట్టుకు శిఖర్ ధవన్ నాయకత్వం వహించే అవకాశాలుండగా, జట్టు సభ్యులుగా పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, రాహుల్ తెవాటియాలు ఉండే అవకాశం ఉంది. చదవండి: కరోనా బారిన పడిన భారత దిగ్గజ అథ్లెట్ -
నాటింగమ్:భారత్ లక్ష్యం 228 పరుగులు
నాటింగమ్: భారత్ ఇంగ్లండ్ టూర్ 3వ వన్డేలో ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లకు 227 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ పరుగుల లక్ష్యం 228గా నిర్ధేసించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నఇంగ్లండ్ ఆరంభంలో దూకుడుగా ఆడింది. ఇండియా బౌలర్లను చీకాకు పరచింది. అయితే ఆ తరువాత భారత స్పిన్నర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలు పెట్టారు. కూక్ 44 పరుగులు, హేల్స్ 42, బెల్ 28, రూట్ 2, మోర్గాన్ 10, బట్లెర్ 42, స్టోక్స్ 2, ఓక్స్ 15, ట్రెడ్‌వెల్ 30, ఫిన్ 6 పరుగులు చేశారు. అండెర్సన్ పరుగులు ఏమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు. అశ్విన్ మూడు వికెట్లు, కుమార్, షమి, రైనా, రాయుడు, జడేజా ఒక్కో వికెట్ తీసుకున్నారు.