
మే 30 నుంచి ఇండియా-ఏతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ లయన్స్ జట్టును ఇవాళ (మే 21) ప్రకటించారు. ఈ జట్టుకు వెటరన్ పేసర్ క్రిస్ వోక్స్ ఎంపికయ్యాడు. వోక్స్ కాలి మడమ గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ గాయం కారణంగానే జింబాబ్వేతో రేపటి నుంచి ప్రారంభం కాబోయే నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌కు వోక్స్‌ను ఎంపిక చేయలేదు.
ఇండియా ఏతో సిరీస్‌కు ఎంపిక చేసిన లయన్స్ జట్టుకు జేమ్స్ ర్యూ సారథ్యం వహించనున్నాడు. వోక్స్‌తో పాటు రెహాన్ అహ్మద్, డాన్ మౌస్లీ లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సిరీస్ కోసం భారత-ఏ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో సత్తా చాటే ఆటగాళ్లకు జాతీయ జట్లలో చోటు దక్కే అవకాశం ఉంది.
భారత్-ఏతో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ లయన్స్ జట్టు..
జేమ్స్ ర్యూ (కెప్టెన్), ఫర్హాన్ అహ్మద్, రెహాన్ అహ్మద్, సోనీ బేకర్, జోర్డాన్ కాక్స్, రాకీ ఫ్లింటాఫ్, ఎమిలియో గే, టామ్ హైన్స్, జార్జ్ హిల్, జోష్ హల్, ఎడ్డీ జాక్, బెన్ మెకిన్నీ, డాన్ మౌస్లీ, అజీత్ సింగ్ డేల్, క్రిస్ వోక్స్
ఇంగ్లండ్ లయన్స్‌తో సిరీస్‌కు భారత-ఏ జట్టు..
యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, హర్ష్ దూబే, తనుశ్ కోటియన్, ఇషాన్ కిషన్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, తుషార్ దేశ్‌పాండే, ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్, ఖలీల్ అహ్మద్
భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య అనధికారిక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..
మే 30-జూన్ 2- తొలి టెస్ట్ (కాంటర్బరీ)
జూన్ 6-9- రెండో టెస్ట్ (నార్తంప్టన్)