మరోసారి ఇంగ్లండ్‌లో పర్యటించనున్న టీమిండియా.. షెడ్యూల్‌ విడుదల | India To Tour England Again In 2026 For White Ball Series | Sakshi
Sakshi News home page

మరోసారి ఇంగ్లండ్‌లో పర్యటించనున్న టీమిండియా.. షెడ్యూల్‌ విడుదల

Jul 24 2025 3:35 PM | Updated on Jul 24 2025 4:00 PM

India To Tour England Again In 2026 For White Ball Series

భారత పురుషుల సీనియర్‌ క్రికెట్‌ జట్టు వచ్చే ఏడాది మరోసారి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలోనే ఉన్న టీమిండియా.. 2026 జులైలో ఇంగ్లండ్‌తో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ మేరకు ఇవాళ (జులై 24) షెడ్యూల్‌ విడుదలైంది. 

వచ్చే ఏడాది జులై 1 (డర్హమ్‌), 4 (మాంచెస్టర్‌), 7 (నాటింగ్హమ్‌), 9 (బ్రిస్టల్‌), 11 (సౌతాంప్టన్‌) తేదీల్లో ఐదు టీ20లు.. ఆతర్వాత 14 (బర్మంగ్హమ్‌), 16 (కార్డిఫ్‌), 19 (లార్డ్స్‌) తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి.  

భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లతో పాటు వచ్చే ఏడాది హెం సమ్మర్‌ షెడ్యూల్‌ మొత్తాన్ని​ ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. పురుషులతో పాటు మహిళల క్రికెట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. వచ్చే ఏడాది హోం సమ్మర్‌లో భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ పర్యటనలో భారత్‌ 3 టీ20లు, ఓ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనుంది. 

వచ్చే ఏడాది ఇంగ్లండ్‌ పురుషుల హోం సమ్మర్‌ షెడ్యూల్‌..

మొదటి టెస్ట్ న్యూజిలాండ్‌తో జూన్ 4-8 లార్డ్స్, లండన్
రెండవ టెస్ట్ న్యూజిలాండ్‌తో జూన్ 17-21 ది కియా ఓవల్, లండన్
మూడవ టెస్ట్ న్యూజిలాండ్‌తో జూన్ 25-29 ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్

మొదటి T20I ఇండియాతో జూలై 1 బ్యాంక్స్ హోమ్స్ రివర్‌సైడ్, డర్హమ్
రెండవ T20I ఇండియాతో జూలై 4 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
3వ T20I ఇండియాతో జూలై 7 ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్
4వ T20I ఇండియాతో జూలై 9 సీట్ యూనిక్ స్టేడియం, బ్రిస్టల్
5వ T20I ఇండియాతో జూలై 11 యుటిలిటా బౌల్, సౌతాంప్టన్

మొదటి వన్డే ఇండియాతో జూలై 14 ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
రెండవ వన్డే ఇండియా తోజూలై 16 సోఫియా గార్డెన్స్, కార్డిఫ్
మూడవ వన్డే ఇండియాతో జూలై 19 లార్డ్స్, లండన్

మొదటి టెస్ట్ పాకిస్తాన్‌తో ఆగస్టు 19-23 హెడింగ్లీ, లీడ్స్
రెండవ టెస్ట్ పాకిస్తాన్‌తో ఆగస్టు 27-31 లార్డ్స్, లండన్
మూడవ టెస్ట్ పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 9-13 ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్

మొదటి T20I శ్రీలంకతో సెప్టెంబర్ 15 యుటిలిటా బౌల్, సౌతాంప్టన్
రెండవ T20I శ్రీలంకతో సెప్టెంబర్ 17 సోఫియా గార్డెన్స్, కార్డిఫ్
3వ T20I శ్రీలంకతో సెప్టెంబర్ 19 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్

మొదటి ODI శ్రీలంకతో సెప్టెంబర్ 22 బ్యాంక్స్ హోమ్స్ రివర్‌సైడ్, డర్హామ్
రెండవ ODI శ్రీలంకతో సెప్టెంబర్ 24 హెడింగ్లీ, లీడ్స్
మడవ ODI శ్రీలంకతో సెప్టెంబర్ 27 ది కియా ఓవల్, లండన్

వచ్చే ఏడాది ఇంగ్లండ్‌ మహిళల హోం సమ్మర్‌ షెడ్యూల్‌..

మొదటి వన్డే న్యూజిలాండ్‌తో మే 10 బ్యాంక్స్ హోమ్స్ రివర్‌సైడ్, డర్హామ్
రెండవ వన్డే న్యూజిలాండ్‌తో మే 13 ది కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్
మూడవ వన్డే న్యూజిలాండ్‌తో మే 16 సోఫియా గార్డెన్స్, కార్డిఫ్

1వ T20I న్యూజిలాండ్‌తో మే 20 ది సెంట్రల్ కో-ఆప్ కౌంటీ గ్రౌండ్, డెర్బీ
2వ T20I న్యూజిలాండ్‌తో మే 23 ది స్పిట్‌ఫైర్ గ్రౌండ్, కాంటర్‌బరీ
3వ T20I న్యూజిలాండ్‌తో మే 25 ది 1వ సెంట్రల్ కౌంటీ గ్రౌండ్, హోవ్

1వ T20I ఇండియాతో మే 28 అంబాసిడర్ క్రూయిజ్ లైన్ గ్రౌండ్, చెల్మ్స్‌ఫోర్డ్
2వ T20I ఇండియాతో మే 30 సీట్ యూనిక్ స్టేడియం, బ్రిస్టల్
3వ T20I ఇండియాతో జూన్ 2 ది కూపర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్, టౌంటన్

టెస్ట్ ఇండియాతో జూలై 10-14 లార్డ్స్, లండన్

1వ వన్డే ఐర్లాండ్‌తో సెప్టెంబర్ 1 ది అప్టన్‌స్టీల్ కౌంటీ గ్రౌండ్, లీసెస్టర్
2వ వన్డే ఐర్లాండ్‌తో సెప్టెంబర్ 3 ది సెంట్రల్ కో-ఆప్ కౌంటీ గ్రౌండ్, డెర్బీ
3వ వన్డే ఐర్లాండ్‌తో సెప్టెంబర్ 6 వోర్సెస్టర్‌షైర్ న్యూ రోడ్, వోర్సెస్టర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement