ENG VS IND 4th Test: దిగ్గజాల సరసన కేఎల్‌ రాహుల్‌ | ENG VS IND 4th Test: KL Rahul Completes 1000 Test Runs in England, Joins Virat Kohli, Sachin, Dravid And Gavaskar In Elite List | Sakshi
Sakshi News home page

ENG VS IND 4th Test: దిగ్గజాల సరసన చేరిన కేఎల్‌ రాహుల్‌

Jul 23 2025 6:43 PM | Updated on Jul 23 2025 7:38 PM

ENG VS IND 4th Test: KL Rahul Completes 1000 Test Runs in England, Joins Virat Kohli, Sachin, Dravid And Gavaskar In Elite List

మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జులై 23) మొదలైన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓపెనింగ్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 28 పరుగుల వద్ద రాహుల్‌ ఇంగ్లండ్‌ గడ్డపై 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో భారత బ్యాటర్‌గా.. రెండో భారత ఓపెనర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రాహుల్‌కు ముందు దిగ్గజ బ్యాటర్లు సచిన్‌ టెండూల్కర్‌ (1575), రాహుల్‌ ద్రవిడ్‌ (1376), సునీల్‌ గవాస్కర్‌ (1152), విరాట్‌ కోహ్లి (1096) మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో గవాస్కర్‌ ఒక్కరే ఓపెనర్‌.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ 46 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో జాక్‌ క్రాలేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. రాహుల్‌ ఔటయ్యే సమయానికి (30 ఓవర్లు) భారత్‌ స్కోర్‌ 94/1గా ఉంది. యశస్వి జైస్వాల్‌ 45 పరుగులతో కొనసాగుతుండగా.. అతనికి జతగా సాయి సుదర్శన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

భీకరమైన ఫామ్‌లో రాహుల్‌
ప్రస్తుత ఇంగ్లండ్‌ పర్యటనలో రాహుల్‌ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 421 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌స్కోరర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 

ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించగా.. భారత్‌ రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్‌ సిరీస్‌లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్‌ భారత్‌కు డు ఆర్‌ డైగా మారింది.

తుది జట్లు..
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, ⁠ ⁠బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, ⁠హ్యారీ బ్రూక్,⁠ బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, ⁠క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే,  జోఫ్రా ఆర్చర్.

భారత్‌: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్‌, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్‌ ఠాకూర్‌, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement