విమానంలో రోహిత్‌ చేసిన పనికి నిద్రపోలేదు..

Mohammed Siraj complains Rohit Sharma Not Letting Him Sleep Flight - Sakshi

లండన్: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, రూట్‌ సేనతో ఐదు టెస్ట్‌ సిరీస్‌ల కోసం టీమిండియా గురువారం యూకేలో అడుగుపెట్టింది. భారత్​ నుంచి ప్రత్యేక విమానంలో పురుషుల, మహిళల జట్లు లండన్‌కు చేరుకున్నాయి. క్రికెటర్లంతా విమానాల్లో సందడి చేస్తుండగా తీసిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తన అధికారిక ట్విటర్​లో షేర్‌ చేసింది. ప్రయాణ సమయంలో ఆటగాళ్లు ఏ రకంగా గడిపారో కొందరు క్రికెటర్లు చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన ప్రయాణ విషయాలను తెలుపుతూ.. ప్రశాంతంగా నిద్రపోతుంటే రోహిత్ శర్మ తన నిద్రకు భంగం కలిగించాడని తెలిపాడు. దీంతో సరిగా నిద్ర పోలేదని చెప్పుకొచ్చాడు. 'ఇప్పుడే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాం. హోటల్‌కు వెళ్లడానికి రెండు గంటలు సమయం పడుతుంది. విమాన ప్రయాణంలో రెండు గంటలు మంచిగా నిద్రపోయాను. ఆ తర్వాత రోహిత్ భాయ్ వచ్చి లేపాడు. ఇక అంతే ఆ తర్వాత మళ్లీ నిద్ర రాలేదు. సరిగ్గా విమానం ల్యాండ్ అయ్యే రెండు గంటల ముందు మళ్లీ కాస్త నిద్రపోయా.  నిన్న కాస్త ఎక్కువగానే రన్నింగ్ సెషన్‌లో పాల్గొన్నాం. దాంతో నేను చాలా అలసిపోయాను' అని సిరాజ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.

చదవండి: బాలీవుడ్‌ నటితో పెళ్లి.. అప్పుడే క్లారిటీ ఇచ్చిన టీమిండియా కోచ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top