
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్‌కు చేరని జట్ల ఆటగాళ్లందరూ ప్రస్తుతం వారివారి పనుల్లో నిమగ్నమైపోయారు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత ఏ ఆటగాళ్లు ఇవాల్టి నుంచి ఇంగ్లండ్ లయన్స్‌తో తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత ఏ జట్టు రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఆతర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఐపీఎల్ పూర్తయిన తర్వాత ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెడతారు.
కాగా, ఐపీఎల్‌లో తన జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఖాళీగా ఉన్న ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ బీసీసీఐని ఓ విషయం కోసం అభ్యర్దించినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఎంపికై, ప్రస్తుతం భారత్‌లోనే ఉన్న రాహుల్ ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ కోసం తనను ఎంపిక చేయాలని బీసీసీఐని కోరాడట.
ప్రస్తుతం భారత్‌లో వాతావరణ పరిస్థితులు ప్రాక్టీస్‌కు అనుకూలంగా లేకపోవడంతో (వర్షాలు) లయన్స్‌తో టెస్ట్ మ్యాచ్ తన ప్రాక్టీస్‌కు ఉపయోగపడుతుందని రాహుల్ భావిస్తున్నాడట. ఇందుకే తనను లయన్స్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌కు ఎంపిక చేయాలని బీసీసీఐని కోరాడట. ఈ విషయంపై స్పందించిన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాహుల్‌కు రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. రాహుల్‌ను సోమవారం (జూన్ 2) లండన్‌కు బయల్దేరాల్సిందిగా ఆదేశించిందట.
జాతీయ జట్టు తరఫున రాణించేందుకు రాహుల్ బీసీసీఐకి చేసిన విన్నపం గురించి తెలిసి భారత క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. రాహుల్ కమిట్‌మెంట్‌కు సలాం కొడుతున్నారు. స్టార్‌డమ్ ఉన్న ఇతర ఆటగాళ్లు ఖాళీ దొరికితే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చూస్తారు. రాహుల్ మాత్రం తన దేశం తరఫున రాణించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాండంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లండ్ లయన్స్‌తో రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి నార్తంప్టన్ వేదికగా జరుగనుంది.
ఇంగ్లండ్ లయన్స్‌తో టెస్ట్ మ్యాచ్‌లకు ఎంపిక చేసిన భారత-ఏ జట్టు..
కరుణ్ నాయర్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, తనుశ్ కోటియన్, హర్ష్ దూబే, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్