కోహ్లీ సేనకు గుడ్‌ న్యూస్‌.. ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఓకే చెప్పిన ఈసీబీ

India vs England: Team India To Get Practice Match Ahead Of First Test - Sakshi

లండన్: ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త చెప్పింది. టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డును (ఈసీబీ) ఒప్పించింది. ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా నేరుగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బ‌రిలో దిగిన భారత్.. సౌతాంఫ్టన్ పరిస్థితులను అర్ధం చేసుకోలేక చేతులెత్తేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆ తప్పు మరోసారి పునరావృతం కాకుండా బీసీసీఐ జాగ్రత్త పడింది. దీంతో జులై 20-22 మ‌ధ్య మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఈసీబీ షెడ్యూల్ చేసిందని తెలుస్తోంది. అయితే భారత జట్టుతో తలపడే ప్ర‌త్య‌ర్థి ఎవ‌ర‌న్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం బ‌యో బ‌బుల్ నుంచి బ‌య‌ట‌కు వచ్చి.. కుటుంబంతో గడుపుతున్న కోహ్లీసేన తిరిగి రాగానే ఈ మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఇదిలా ఉంటే, భారత్‌, ఇంగ్లండ్‌ల మధ్య ఆగష్టు 4 నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top