
సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు రూట్ సేనను 5 టెస్ట్‌ల సిరీస్‌లో ఢీకొనేందుకు టీమిండియా లండన్‌లో ల్యాండ్ అయ్యింది. మూడు రోజుల కఠిన క్వారంటైన్ అనంతరం సౌతాంప్టన్‌లోని ఏజియస్ బౌల్ స్టేడియంలో టీమిండియా క్రికెటర్లు సాధన చేయనున్నారు. ఈ మూడు రోజుల పాటు ఆటగాళ్లు ఒకరిని ఒకరు కలుసుకునే వీలు ఉండదు. కాగా, భారత బృందం ముంబై నుంచి బయల్దేరి, సౌతాంప్టన్ చేరుకునే వరకు జరిగిన మొత్తం సన్నివేశాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. జూన్ 2న భారత్ పురుషుల, మహిళా క్రికెటర్ల బృందం.. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో లండన్‌కు బయల్దేరింది.
🇮🇳 ✈️ 🏴
— BCCI (@BCCI) June 4, 2021
Excitement is building up as #TeamIndia arrive in England 🙌 👌 pic.twitter.com/FIOA2hoNuJ
ఇంత భారీ ఎత్తున భారత క్రికెట్ బృందం విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లడం చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో ఈ జర్నీని క్రికెటర్లు ఎప్పటికీ మరిచిపోకుండా ఉండేందుకు బీసీసీఐ ప్రతి ఒక్క సన్నివేశాన్ని రికార్డు చేసి, ట్విటర్‌లో షేర్ చేసింది. విమానంలో పురుష, మహిళా క్రికెటర్లు ఒకరితో ఒకరు ఆడుతూ పాడుతూ, ఇంటర్యూలు చేసుకుంటు సరదాగా గడిపిన సన్నివేశాలు అభిమానులకు అలరించాయి. కాగా, జూన్ 18న టీమిండియా.. న్యూజిలాండ్‌తో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా, జూన్ 16న భారత మహిళా జట్టు ఇంగ్లండ్‌తో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదిక కానుంది.
చదవండి: పాక్ జట్టులోకి భారీ హిట్టర్..