
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో తమ ప్రస్తానాన్ని ముగించిన డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ తాజాగా ఓ అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. లీగ్ పునఃప్రారంభం తర్వాత తిరిగి రాని విండీస్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్‌కు (గాయం) ప్రత్యామ్నాయంగా మధ్యప్రదేశ్ మిస్టరీ స్పిన్నర్ శివమ్ శుక్లాను ఎంపిక చేసుకుంది. శుక్లా ఈ సీజన్‌లో కేకేఆర్ ఆడబోయే చివరి మ్యాచ్‌కు (మే 25న సన్‌రైజర్స్‌తో) అందుబాటులో ఉంటాడు. 29 ఏళ్ల శివమ్ శక్లా ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు.
🚨 The mystery spinner from MP is a Knight now!
Shivam Shukla replaces Rovman Powell for the remainder of the #TATAIPL2025 pic.twitter.com/usUoOnFzLG— KolkataKnightRiders (@KKRiders) May 18, 2025
అక్కడ అతను ముత్తయ్య మురళీథరన్ ఆథ్వర్యంలో రాటు దేలాడు. కేకేఆర్.. సన్‌రైజర్స్‌తో ఆడబోయే తమ చివరి మ్యాచ్ కోసం వారి అస్త్రాన్నే (శివమ్ శుక్లా) ప్రయోగించనుంది. కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలర్ అయిన శుక్లా ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ టీ20 లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. శుక్లా సన్‌రైజర్స్ ప్రాక్టీస్ సెషన్స్‌లో అభిషేక్ శర్మ వికెట్ తీసి ప్రాచుర్యంలోకి వచ్చాడు. తదుపరి సీజన్ దృష్ట్యా కేకేఆర్ శుక్లాను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది.
Shivam Shukla the mystery spinner who plays for MP in domestic under Rajat’s Captaincy.
SRH picked him as Net bowler as he took Abhishek’s wicket in 1st over in practice game.
Kudos to RCB’s scouting 🙏 https://t.co/artzL8rOPP pic.twitter.com/0l2hBdqUaR— Fearless🦁 (@ViratTheLegend) March 19, 2025
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 పునఃప్రారంభం తర్వాత నిన్న (మే 17) జరగాల్సిన ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించగా.. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ఆరు జట్లు (ఆర్సీబీ (17), గుజరాత్ (16), పంజాబ్ (15), ముంబై (14), ఢిల్లీ (13), లక్నో (10)) మాత్రమే మిగిలాయి. సీఎస్‌కే, రాజస్థాన్, సన్‌రైజర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
ఇవాల్టి మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఆదివారం (మే 18) ఐపీఎల్ 2025లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సువాయ్ మాన్‌సింగ్ స్టేడియం (జైపూర్) వేదికగా మధ్యాహ్నం జరగాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్, పంజాబ్ తలపడనున్నాయి. రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనుంది.