IPL 2025: బ్రెవిస్‌ విధ్వంసం​.. కేకేఆర్‌పై సీఎస్‌కే విజయం | IPL 2025: CSK Beat KKR By 2 Wickets | Sakshi
Sakshi News home page

IPL 2025: బ్రెవిస్‌ విధ్వంసం​.. కేకేఆర్‌పై సీఎస్‌కే విజయం

May 7 2025 11:19 PM | Updated on May 7 2025 11:21 PM

IPL 2025: CSK Beat KKR By 2 Wickets

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 7) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్‌ అహ్మద్‌ 4 వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బేశాడు. అన్షుల్‌ కంబోజ్‌, జడేజా తలో వికెట్‌ తీశారు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో రహానే (48), మనీశ్‌ పాండే (36 నాటౌట్‌), రసెల్‌ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కే 60 పరుగులకే సగం​ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (52) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన జట్టును తిరిగి గెలుపు ట్రాక్‌లో పెట్టాడు. మధ్యలో దూబే (45) బాధ్యతాయుతంగా ఆడి సీఎస్‌కే విజయతీరాలవైపు మళ్లించాడు. 

ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు అవసరమైన తరుణంలో అప్పటిదాకా కామ్‌గా ఉన్న ధోని (17 నాటౌట్‌) సిక్సర్‌ కొట్టి సీఎస్‌కేకు గెలుపుకు చేరువ చేశాడు. నాలుగో బంతికి కంబోజ్‌ బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపు వల్ల సీఎస్‌కేకు ఒరిగేది ఏమీ లేనప్పటికీ కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దెబ్బకొట్టింది. 

బ్రెవిస్‌ విధ్వంసం​.. ఒకే ఓవర్‌లో 30 పరుగులు
వైభవ్‌ అరోరా వేసిన 11వ ఓవర్‌లో డెవాల్డ్‌ బ్రెవిస్‌ శివాలెత్తిపోయాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లు సహా 30 పిండుకున్నాడు. ఈ ఒక్క ఓవర్‌తో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు ఓటమి ఖాయమనుకున్న సీఎస్‌కే ఒక్కసారిగా గెలుపు ట్రాక్‌లోకి వచ్చింది.బ్రెవిస్‌ 20 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement