
ఇంగ్లండ్ టూర్‌కు భారత-ఎ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా అభిమన్యు ఈశ్వరన్ నియమితుడయ్యాడు. ఈ టూర్‌లో ఈశ్వరన్ డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ వ్యవహరించనున్నాడు. కాగా ఇండియా-ఎ జట్టుకు చానాళ్ల తర్వాత వెటరన్ క్రికెటర్ కరుణ్ నాయర్ ఎంపికయ్యాడు. కరుణ్ 8 ఏళ్ల తర్వాత ఇండియా సీనియర్ టెస్టు జట్టులోకి సైతం రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.
ఇక కరుణ్ నాయర్‌తో పాటు ఇషాన్ కిషన్‌కు కూడా భారత-ఎ జట్టులో చోటు దక్కింది. అయితే ఆశ్చర్యకరంగా శ్రేయాస్ అయ్యర్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. దీంతో అయ్యర్ ఇంగ్లండ్‌తో టెస్టులకు ప్రధాన భారత జట్టులో లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ 18 మంది సభ్యుల జట్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ కూడా ఉన్నారు. వారిని ప్రాక్టీస్ కోసం ముందుగా ఇంగ్లండ్‌కు బీసీసీఐ పంపింది. అదేవిదంగా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ తర్వాత శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్‌లు ఇండియా-ఎ జట్టుతో కలవనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
వికెట్ల వీరుడికు చోటు
ఈ ఏడాది రంజీ ట్రోఫీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ హర్ష్ దుబే కూడా భారత-ఎ జట్టులో భాగమయ్యాడు. ఈ విదర్భ స్పిన్నర్ 10 మ్యాచ్‌ల్లో 17 సగటుతో 69 వికెట్లు పడగొట్టాడు. మరో ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా ప్రధాన సిరీస్‌కు ముందు ఇండియా-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు మే 30 నుండి జూన్ 9 వరకు జరగనున్నాయి.
ఇంగ్లండ్ పర్యటనకు భారత్ ఎ జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే