
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 పునఃప్రారంభంలో జరగాల్సిన ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ (మే 17) వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచి భారీ కురుస్తుండటంతో టాస్ కూడా సాధ్యం కాలేదు. రాత్రి 10:30 గంటల సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించగా.. ఆర్సీబీ టేబుల్ టాపర్‌గా, కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. కేకేఆర్ నిష్క్రమణతో ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ఆరు జట్లు (ఆర్సీబీ (17), గుజరాత్ (16), పంజాబ్ (15), ముంబై (14), ఢిల్లీ (13), లక్నో (10)) మాత్రమే మిగిలాయి. సీఎస్‌కే, రాజస్థాన్, సన్‌రైజర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన జట్లు.
ఆర్సీబీ-కేకేఆర్ మధ్య మ్యాచ్ రద్దు కావడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం రికార్డుల్లోకెక్కింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు రద్దైన స్టేడియంగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐదు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి (ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్‌తో కలుపుకుని). ఐపీఎల్ చరిత్రలో ఇన్ని మ్యాచ్‌లు ఏ వేదికపై రద్దు కాలేదు.
ఐపీఎల్‌లో మ్యాచ్‌లు రద్దైన స్టేడియాలు (టాప్-5)
చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు)-5
అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ)- 1
ఎకానా స్టేడియం (లక్నో)- 1
బర్సపరా స్టేడియం (గౌహతి)- 1
ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా)- 1
రాజీవ్ గాంధీ స్టేడియం (హైదరాబాద్)- 1
ఇవాల్టి మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఆదివారం (మే 18) ఐపీఎల్ 2025లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సువాయ్ మాన్‌సింగ్ స్టేడియం (జైపూర్) వేదికగా మధ్యాహ్నం జరగాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్, పంజాబ్ తలపడనున్నాయి. రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనుంది.