
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ ఆఖరి వరకు ఆజేయంగా నిలిచాడు. తొలుత ఆచితూచి ఆడిన రాహుల్.. ఐదు ఓవర్ల తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 60 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 65 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) రాణించారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.
శుబ్‌మన్ గిల్‌ను దాటేసిన రాహుల్..
ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో శుబ్‌మన్ గిల్, షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్‌లను రాహుల్ అధిగమించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన లిస్ట్‌లో రాహుల్(5) నాలుగో స్దానంలో నిలిచాడు. అగ్రస్ధానంలో విరాట్ కోహ్లి(8) కొనసాగుతున్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే..
8: విరాట్ కోహ్లీ
7: జోస్ బట్లర్
6: క్రిస్ గేల్
5: కెఎల్ రాహుల్
4: శుభ్‌మన్ గిల్
4: షేన్ వాట్సన్
4: డేవిడ్ వార్నర్