
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్జే మహ్‌వశ్ పేరు తెగ వినిపిస్తోంది. దీనికి కారణం ఈ ముద్దుగుమ్మకు టీమిండియా క్రికెటర్ యుజ్వేందర్ చాహల్‌తో కనిపించడమే. వీరిద్దరు కలిసి దుబాయ్‌లో ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో ఫోటోలు పెద్దఎత్తున వైరలయ్యాయి. ఆ తర్వాతే ఈ జంట డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనూ మహ్‌వశ్ సందడి చేయడంతో వీటికి మరింత బలం చేకూరింది. కానీ తమ రిలేషన్‌పై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్జే మహ్‌వశ్.. తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. అవీ తనను ఎలా ప్రభావితం చేశాయో వివరించింది. కొంతమంది ట్రోల్స్ కారణంగా ఇలాంటివీ జరుగుతూ ఉంటాయని తెలిపింది. కానీ అందులో ఎలాంటి నిజం లేకపోవడంతోనే వాటిని అంగీకరించలేకపోయానని పేర్కొంది. ఈ వ్యక్తులు నాతో ఎందుకు ఇలా చేస్తున్నారు.. నిజం తెలియనప్పుడు నా జీవితం పట్ల ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? అని బాధపడ్డానని వెల్లడించింది. అందుకే సోషల్ మీడియాను వదిలేసి ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నట్లు ఆర్జే మహ్‍వశ్ తన బాధను పంచుకుంది. కానీ నాపై వచ్చిన రూమర్స్, ట్రోల్స్ బాగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేసింది. మీరు చెప్పేవన్నీ కల్పితాలేనని.. మా మధ్య అలాంటిదేమీ లేదని ఆర్జే మహ్‌వశ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
కాగా.. ఆర్జే మహ్‌వశ్ ప్యార్ పైసా ప్రాఫిట్ అనే సిరీస్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ మ్యాక్స్ ప్లేయర్‌లో ప్రసారం అవుతోంది. ఈ షో ప్రీమియర్ అయినప్పుడు చాహల్ ఈ సిరీస్‌పై పోస్ట్ పెట్టారు.