
మే 29 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కుడి చేతి బొటన వేలి గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది. ఆర్చర్‌కు ప్రత్యామ్నాయంగా లూక్ వుడ్‌ను ఎంపిక చేసింది.
ఆర్చర్ ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ గాయం బారిన పడ్డాడు. దీని కారణంగా అతను కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మధ్యలో ఐపీఎల్ ఆగిపోవడంతో స్వదేశానికి వచ్చేసిన ఆర్చర్ తిరిగి భారత్‌కు రాలేదు. ఈ సీజన్‌లో ఆర్చర్ 12 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశాడు.
ఈ సీజన్‌లో రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేక ఇంటిముఖం పట్టింది. నిన్న (మే 20) సీఎస్‌కే విజయంతో రాయల్స్ ఈ సీజన్‌ను ముగించింది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం నాలుగే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 జరుగుతుండగానే వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ మే 29, జూన్ 1, జూన్ 3 తేదీల్లో జరుగుతుంది. ఈ సిరీస్ కారణంగా ఇంగ్లండ్, విండీస్‌కు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు దూరం కానున్నారు. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ కూడా జరుగుతుంది. జూన్ 6, 8, 10 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
విండీస్‌తో వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు..
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జో రూట్, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, విల్ జాక్స్, జోస్ బట్లర్, టామ్ బాంటన్, జేమీ స్మిత్, జోఫ్రా ఆర్చర్ (లూక్ వుడ్), బ్రైడన్ కార్స్, టామ్ హార్ట్లీ, గస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్
విండీస్ జట్టు..
బ్రాండన్ కింగ్, షిమ్రోన్ హెట్‌మైర్, ఎవిన్ లెవిస్, కీసీ కార్తీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ ఛేజ్, జస్టిన్ గ్రీవ్స్, గుడకేశ్ మోటీ, జువెల్ ఆండ్రూ, షాయ్ హోప్ (కెప్టెన్), ఆమిర్ జాంగూ, మాథ్యూ ఫోర్డ్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, జేడన్ సీల్స్, జేదియా బ్లేడ్స్