
ఈ ఏడాది జూన్‌లో భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్ 2025-27లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. జూన్ 20న లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య ఈ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ప్రధాన సిరీస్‌కు ముందు ఇండియా-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో మూడు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.
తొలి టెస్టు మే 30 నుంచి జూన్ 2 వరకు కాంటర్బరీ వేదికగా, రెండో టెస్టు నార్తాంప్టన్‌లో జూన్ 6 నుంచి 9 వరకు జరగనున్నాయి. ఈ సిరీస్‌క భారత-ఎ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా అభిమన్యు ఈశ్వరన్ ఎంపికయ్యాడు. అదేవిధంగా కరుణ్ నాయర్, ఇషాన్ కిషన్‌లకు చోటు దక్కింది.
హెడ్ కోచ్‌గా కనిత్కర్..!
ఇక ఇంగ్లండ్ టూర్‌లో భారత-ఎ జట్టు హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ హృషికేష్ కనిత్కర్ వ్యవరించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. రెగ్యూలర్ హెడ్ కోచ్ గౌతం గంభీర్ జూన్ 6న ఇంగ్లండ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జట్టు కోచింగ్ బాధ్యతలు హృషికేష్‌కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.
కనిత్కర్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. 2022 ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన భారత మహిళా జట్టుకు హెడ్‌కోచ్‌గా హృషికేష్ కనిత్కర్ వ్యవహరించాడు. అతడు గోవా , తమిళనాడు రాష్ట్ర జట్టుకు కూడా కోచ్‌గా పనిచేశాడు.
ఇంగ్లండ్ పర్యటనకు భారత్ ఎ జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే