breaking news
National
-
కాంగ్రెస్ రెబల్.. స్టన్నింగ్ విక్టరీ!
రాజకీయాల్లో రెబల్స్ వ్యవహారం కొత్తేమీ కాదు.. పార్టీ నిర్ణయాలను ధిక్కరించి బయటకు వచ్చేవాళ్లు, ఆ తర్వాత ప్రత్యర్థి కూటములతో చేతులు కలిపేవాళ్లు చాలాచోట్ల కనిపిస్తూనే ఉంటారు. కానీ కొన్నిసార్లు ఈ తిరుగుబాట్లే స్థానిక రాజకీయాల దిశను మార్చేస్తాయి. కేరళలోనూ ఇప్పుడు అదే జరిగింది. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన బిజు మాథ్యూస్.. ఎల్డీఎఫ్ మద్దతుతో స్టన్నింగ్ విక్టరీ సాధించాడు.కేరళలోని పాలా మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన బిజు మాథ్యూస్.. ఎల్డీఎఫ్ మద్దతుతో మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సెబాస్టియన్ పాలక్కల్పై 14–11 ఓట్ల తేడాతో విజయం సాధించారు.మొత్తం 26 మంది సభ్యులున్న పాలా మున్సిపల్ కౌన్సిల్లో వైస్ చైర్పర్సన్ ఎన్నికకు 14 ఓట్లు అవసరం. బిజు మాథ్యూస్‌కు కేరళ కాంగ్రెస్ (ఎం) నుంచి 10, సీపీఎం నుంచి 2, చైర్పర్సన్ మాయా రాహుల్ నుంచి ఒక ఓటు.. ఆయన సొంత ఓటు కలిపి మొత్తం 14 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ రెబల్ రాజితా ప్రకాశ్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మరో ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్ టోనీ తైప్పరంబిల్, లిస్సీకుట్టి మాథ్యూ మాత్రం యూడీఎఫ్ అభ్యర్థి సెబాస్టియన్‌కు ఓటేయడం గమనార్హం.అక్కడే ఈ రాజకీయ మలుపు..పాలా మున్సిపాలిటీలో అధికార మార్పిడికి కాంగ్రెస్ రెబల్స్ కీలకంగా మారారు. గతంలో కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించి ఎల్డీఎఫ్ మద్దతుతో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన బిజు మాథ్యూస్, టోనీ తైప్పరంబిల్, లిస్సీకుట్టి మాథ్యూ, రాజితా ప్రకాశ్‌లను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే వీళ్లు ఎల్డీఎఫ్తో చేతులు కలపడంతో పాలా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.దియా బిను పులిక్కకండంను అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్పర్సన్ పదవి నుంచి తొలగించిన తర్వాత.. కాంగ్రెస్ రెబల్ మాయా రాహుల్ ఎల్డీఎఫ్ మద్దతుతో చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. దీంతో కేరళ కాంగ్రెస్ (ఎం) నేతృత్వంలోని మున్సిపాలిటీ డెవలప్మెంట్ ఫ్రంట్ పాలా మున్సిపాలిటీపై పట్టు సాధించింది. అదే కూటమికి ఇప్పుడు బిజు మాథ్యూస్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.చర్చలు.. ఆపై ట్విస్ట్మాయా రాహుల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తర్వాత వైస్ చైర్పర్సన్ పదవి ఖాళీ అయింది. ఈ పదవిపై బిజు మాథ్యూస్, టోనీ తైప్పరంబిల్ ఇద్దరూ ఆసక్తి చూపడంతో కూటమిలో చర్చలు జరిగాయి. చివరకు ఎల్డీఎఫ్ మద్దతు బిజుకు దక్కింది. ఎన్నికకు ముందు ఆయనకు కూటమిలో మెజారిటీ మద్దతు ఉందని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. మిగతా రెబల్స్ మాత్రం అధికార పక్షం వైపే మొగ్గు చూపించారు.ఇదిలా ఉండగా.. పాలా మున్సిపాలిటీలో పార్టీ మార్పిడి వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టింది. మాయా రాహుల్‌తో పాటు మాజీ కాంగ్రెస్ కౌన్సిలర్లు బిజు మాథ్యూస్, టోనీ తైప్పరంబిల్, లిస్సీకుట్టి మాథ్యూ, రాజితా ప్రకాశ్లకు యాంటీ డిఫెక్షన్ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 22న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. యూడీఎఫ్, స్వతంత్ర కౌన్సిలర్ బిను పులిక్కకండం చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల్లో ‘చేదు’ అనుభవం.. బీజేపీకి ఇక గడ్డు కాలమేనా? -
వివాదంలో కర్ణాటక ఎమ్మెల్యే మేనకోడలు.. ఏం జరిగిందంటే?
బెంగళూరు: ఓ వైపు ప్రభుత్వ అనుబంధ నమ్మ క్లినిక్‌లో డాక్టర్‌గా ఉద్యోగం.. మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్య! నెలకు రూ.70 వేలకు పైగా జీతం తీసుకుంటూనే క్లినిక్ విధులకు దూరంగా ఉన్నారనే ఆరోపణలు కర్ణాటకలో ఓ వైద్యురాలిని చిక్కుల్లోకి నెట్టాయి. పైగా ఆమె అధికార పార్టీకి చెందిన బాగల్కోట్ ఎమ్మెల్యే ఉమేశ్ మెటీకి మేనకోడలు కావడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టగా.. విచారణకు హాజరుకాకపోవడం ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది.వివరాల ప్రకారం.. బాగల్‌కోట్‌లోని వాంబే కాలనీ నమ్మ క్లినిక్‌లో డాక్టర్ అంకిత యరగల్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అయితే మార్చి 3 నుంచి సెప్టెంబర్ వరకు ఆమె క్లినిక్‌లో విధులకు హాజరుకాలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చే ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఇంతకీ డాక్టర్ అంకిత ఎక్కడున్నారు? అనే ప్రశ్నకు అధికారుల దర్యాప్తులో.. ఆమె ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య విద్య అభ్యసిస్తున్నట్లు తేలిందని అధికారులు చెబుతున్నారు. అంటే ఒకవైపు నమ్మ క్లినిక్ మెడికల్ ఆఫీసర్‌గా జీతం.. మరోవైపు పీజీ మెడిసిన్.. ఈ రెండు బాధ్యతలను ఒకేసారి కొనసాగించారా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.విచారణకు పిలిస్తే.. హాజరు కాలేదు!ఈ ఆరోపణలపై బాగల్కోట్ జిల్లా పరిషత్ సీఈవో గజానన్ బాలే విచారణ చేపట్టారు. అయితే డాక్టర్ అంకిత ఆ విచారణకు హాజరుకాలేదు. దీంతో అధికారులు సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని రూమ్ నంబర్ 11లో జరిగే ఈ విచారణకు తప్పనిసరిగా రావాలని ఆదేశించారు. ఈసారి కూడా హాజరుకాకపోతే.. ఆమె వివరణ లేకుండానే అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.కాలేజీ అనుమతి ఇచ్చినా.. క్లినిక్ సంగతేంటి?ఈ వ్యవహారంలో మరో కీలక అంశం కూడా తెరపైకి వచ్చింది. డాక్టర్ అంకిత పీజీ చదువుకునేందుకు ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ అనుమతి ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ అనుమతి ఉన్నప్పటికీ నమ్మ క్లినిక్‌లో తన విధులకు హాజరుకాలేదని ఆరోపిస్తున్నారు. అంటే పీజీ చదువుకునేందుకు అనుమతి ఉండటం వేరు.. అదే సమయంలో నమ్మ క్లినిక్‌లో విధులు నిర్వహించకపోయినా జీతం తీసుకోవడం వేరు అన్నది అధికారుల విచారణలో పరిశీలిస్తున్న అంశంగా కనిపిస్తోంది.రూ.70 వేల జీతం.. తిరిగి చెల్లించాల్సి వస్తుందా?అనుమతిలేని ద్వంద్వ బాధ్యతలు నిర్వహించినట్లు విచారణలో తేలితే.. ఆ కాలంలో ఆమెకు చెల్లించిన జీతం లేదా గౌరవ వేతనాన్ని తిరిగి రికవరీ చేసే అవకాశం ఉందని అధికారులు నోటీసులో హెచ్చరించారు. అంతేకాదు.. వ్యవహారం ప్రొఫెషనల్ మిస్కండక్ట్గా తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు కర్ణాటక మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కమిషన్‌కు కూడా విషయం పంపే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇక జిల్లా ఆరోగ్య అధికారి రాజ్‌కుమార్ యరగల్ ఇప్పటికే డాక్టర్ అంకితను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. ప్రస్తుతం మొత్తం వ్యవహారం అధికారుల విచారణలో ఉంది. సెప్టెంబర్ 18న జరిగే విచారణలో డాక్టర్ అంకిత హాజరై తనపై వచ్చిన ఆరోపణలపై ఏం వివరణ ఇస్తారు? పీజీ చదువుతో పాటు నమ్మ క్లినిక్ ఉద్యోగానికి సంబంధించిన అనుమతులు, విధులు, జీతం చెల్లింపులపై ఆమె సమర్పించే వివరాలే ఇప్పుడు కీలకంగా మారాయి.ఇదీ చదవండి: బీజేపీకి కొత్త చిక్కులు.. యూపీ‘ఐ’ ఫైట్ తప్పదా? -
‘క్వీన్ ఫిషర్’ యూట్యూబర్ జీవితం విషాదాంతం
'తంబూరు క్వీన్ ఫిషర్' అనే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కేకే తంబూరు (36), అద్దె ఇంట్లోని ఒక గదిలో శవమై కనిపించారు. వైకోం చెంబు కట్టిక్కున్ను తురుతుకు చెందిన తంబూరు, సోమవారం మధ్యాహ్నం పులించువాడ్లోని ఒక అద్దె ఇంట్లో శవమై కనిపించారు. సాయంత్రం పాఠశాల నుండి తిరిగి వచ్చిన ఆమె 13 ఏళ్ల కుమార్తె వచ్చిన తరువాత ఈ విషాదం వెలుగు చూసింది. ఆమె అకాల మరణం ఎంతోమంది అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది.భర్తతో విడిగా ఉంటున్న ఆమె, గత కొన్ని నెలలుగా తన 13 ఏళ్ల కూతురితో కలిసి అదే ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె కుమారుడు భర్త వద్ద ఉంటున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చిన కూతురు, లోపల నుండి గొళ్ళెం వేసి ఉండటాన్ని గమనించింది. కిటికీలో నుంచి చూడగా తల్లి ఉరివేసుకుని కనిపించింది. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వైకోం పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం అనంతరం, మృతదేహాన్ని కట్టిక్కున్నులోని ఆమె పూర్వీకుల ఇంటికి తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు.బంధువుల ఆరోపణలుపాలక్కాడ్కు చెందిన ఒక యువకుడితో ఆమెకు సాన్నిహిత్యం ఉందని, వారిద్దరూ కలిసి ఉన్న వీడియోలను చూపిస్తూ ఆ యువకుడు ఆమెను బెదిరించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.ఎవరీ క్వీన్ ఫిషర్'Queen Fisher' పేరిట యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తూ, సాంప్రదాయ చేపల వేట వీడియోలతో కేరళకు ఒక అరుదైన చేపలు పట్టే పద్ధతి పరిచయం చేసిన ఘనత తంబూరు సొంతం. తరతరాలుగా ఆమె కుటుంబంలో వస్తున్న చేపలు పట్టే పనే తంబూరు జీవిత గమనాన్ని మార్చివేసింది. పదవ తరగతి చదువు పూర్తి చేశాక, ఆమె తన తల్లితో కలిసి చేపలు పట్టడం మొదలుపెట్టి, దాని ద్వారా వచ్చిన ఆదాయంతో తన తమ్ముళ్లు, చెల్లెళ్ల చదువును పూర్తి చేసింది.ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలుకుటుంబాన్ని పోషించుకునేందుకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, డ్రైవింగ్ స్కూల్లో పని, వస్త్ర తయారీ యూనిట్లో పనిచేస్తున్నప్పటికీ, తంబూరు తన కుటుంబం యొక్క సాంప్రదాయ చేపల వేటను ఎన్నడూ వదులుకోలేదు. వారు పోటు ఎక్కువగా ఉన్నప్పుడు పడవలో వెనుక జలాల్లోకి వెళ్లి, వల గానీ ఎర గానీ లేకుండా బురద, రాళ్ల మధ్య వెతుకుతూ చేతులతో చేపలు పట్టేవారు. అలా ఆమె తొలి వీడియోకే 9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. భర్త నుండి విడిపోయి, తమ కుటుంబ జీవనాధారమైన సాంప్రదాయ చేపల వేటను వేలాదిమందికి సుపరిచితం చేసిన తంబూరు, 36 ఏళ్ల వయసులోనే అనూహ్యంగా కన్ను మూయడం విషాదం. ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి! -
ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!
గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్లోమరో విడత ఉద్యోగ కోత (Layoff) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఉదయం తెల్లవారేసరికి ల్యాప్‌టాప్‌లు పనిచేయడం మానివేయడంతో వేల మంది ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆందోళన పడిపోయారు.అమెరికాలోనే ఉద్యోగాల కోతలు ఉన్నట్లు భావించినా ఇప్పుడు ఇండియాలో కూడా మరో రౌండ్ లేఆఫ్స్ జరుగుతున్నట్టు టెకీల ద్వారా తెలుస్తోంది. ఇందులో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. ఈ క్రమంలో ఒరాకిల్ (Oracle) సంస్థలో 12 సంవత్సరాలుగా సీనియర్ ప్రిన్సిపాల్ సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేసిన ఇండియన్ టెకీ సౌరభ్ (Sourabh), ఇటీవల సంస్థ చేపట్టిన ఉద్యోగ కోతలలో తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఆయన తన వర్క్ సిస్టమ్‌లోకి లాగిన్ కాలేకపోవడంతో ఉద్యోగం పోయిందని గ్రహించారు. సౌరభ్ భార్య పూజా సాహు లింక్డ్ఇన్ (LinkedIn) వేదికగా తన భర్త సంస్థ పట్ల ఎంతో విధేయత, అంకిత భావంతో పనిచేశారో వివరిస్తూ పోస్ట్ పోట్టారు. సెలవులు, వారాంతాలు లేవు. పండగలు, పబ్బాలు లేకుండా ఎంతో కష్టపడి పనిచేశారనీ చెప్పుకొచ్చారు. హోలీ, దీపావళి వంటి పండుగలు, కుటుంబ వేడుకలు, చివరికి ఆమె ఆసుపత్రిలో శస్త్రచికిత్స సమయంలో కూడా ఆయన పనిచేశారని ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఇంత చేసిని 12 ఏళ్ల అనుభవం ఉన్నా తనకి ఉద్వాసన తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే కష్టపడి పనిచేసే తన భర్తకు తగిన ఉద్యోగ అవకాశాలు చూపించాల్సిందిగా ఆమె తన ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ను కోరారు. చివరగా "సౌరభ్ నీకు మంచి రోజులు రాబోతున్నాయి అంటూ తన భర్తకు భరోసా ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఆమె భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మరో ఉద్యోగికథపన్నెండేళ్లు అదే సంస్థలో పనిచేసి ఉద్యోగం కోల్పోయిన ఒక ఉద్యోగి మాత్రం దీన్ని ఇదోరకమై "విముక్తి"గా అభివర్ణించాడు. భారీ పనిగంటలు,. ఒత్తిడినుంచి మోక్షం లభించిందన్నాడు. రెడ్డిట్ వేదికగా తన అనుభవాన్ని పంచుకుంటూ, తాను ఒక కీలకమైన ప్రాజెక్ట్‌పై పనిచేశానని, రోజుకు 12-13 గంటలు కష్టపడ్డానని తెలిపాడు. అయితే, మేనేజ్మెంట్ నుండి ఎదురైన సూక్ష్మ పర్యవేక్షణ (micromanagement) , అధిక ఒత్తిడి కారణంగా ఈ ఉద్యోగం పోవడం వల్ల తనకు ఉపశమనం కలిగిందని పేర్కొన్నాడు.ఎంత కష్టపడి పనిచేసినా, ఎన్ని సంవత్సరాల విశ్వాసపాత్రత చూపించినా కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగ కోతలను క్షణాల్లో అమలు చేస్తాయని, ఈ ఘటన మరోసారి నిరూపించిందని పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలుకాగా 2026 ప్రారంభంలో జరిగిన చాలా పెద్ద కోత తర్వాత ఈ తాజా కోతలు చోటుచేసుకున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్య సుమారు 21,000 మంది (13 శాతం) తగ్గారు. దీంతో మే నెలాఖరు నాటికి కంపెనీలో దాదాపు 141,000 మంది ఉద్యోగులు మిగిలారు. కంపెనీ AI మౌలిక సదుపాయాలు , డేటా సెంటర్లపై కూడా ఖర్చును గణనీయంగా పెంచుతోంది.విస్తృత సంస్థాగత మార్పులలో భాగంగా సెప్టెంబర్ 14న కంపెనీ కొత్త విడత ఉద్యోగ కోతలను ప్రారంభించింది. ప్రభావిత ఉద్యోగులకు తెల్లవారుజామున ఇమెయిల్స్ అందినట్లు సమాచారం. ఈ తాజా విడతలో ప్రభావితమైన మొత్తం ఉద్యోగుల సంఖ్యను ఒరాకిల్ బహిరంగంగా వెల్లడించలేదు. ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్ -
బీజేపీకి కొత్త చిక్కులు.. యూపీ‘ఐ’ ఫైట్ తప్పదా?
జేబుల్లో, పర్సుల్లో క్యాష్ పెట్టడం జనాలకు అరుదుగా మారిపోయింది. చిల్లర నుంచి పెద్ద పెద్ద పేమెంట్ల దాకా ఫోన్‌తోనే జరిగిపోతోంది. అలాంటిది యూపీఐ (UPI)తో చెల్లింపుల విషయంలో కొత్త రూల్స్ జనాలను బెంబేలెత్తిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, ఆపై డిజిటల్ చెల్లింపులంటూ క్యాష్‌లెస్ విధానం అలవాటు చేసిన ఎన్డీయే ప్రభుత్వం.. ఇప్పుడు ఛార్జీల ద్వారా పరోక్షంగా సామాన్యుడిపై భారం వేసే ప్రయత్నమూ చేస్తోంది. అయితే రానున్న రోజుల్లో ఇదే బీజేపీ పాలిట గుదిబండగా మారుతుందా?..2016 నవంబర్ 8.. రూ.500, రూ.1,000 నోట్ల చెల్లుబాటును రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పునకు దారితీసింది. నగదు లావాదేవీలపై ఆధారపడిన ప్రజలకు ఒక్కసారిగా ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాల అవసరం ఏర్పడింది. అదే సమయంలో ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ప్రారంభించింది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగాయని.. ఇకపై నగదు ఆధారిత వ్యవస్థను తగ్గించి ‘క్యాష్ లెస్ ఎకానమీ’ వైపు వెళ్లాలని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్కడితోనే ఆగకుండా.. డిజిటల్ పేమెంట్లు చేసే వినియోగదారులు, వ్యాపారులను ప్రోత్సహించేందుకు ‘లక్కీ గ్రాహక్ యోజన’, ‘డిజి-ధన్ వ్యాపార్ యోజన’ వంటి ప్రోత్సాహక పథకాలను తీసుకొచ్చింది. అలా క్రమంగా డిజిటల్ చెల్లింపులు వ్యవస్థ.. అర్బన్ నుంచి రూరల్ ప్రాంతాలకు విస్తరించగలిగింది.ఇప్పుడు అదే UPIపై ఛార్జీల చర్చ!ఇప్పుడు UPI లావాదేవీలపై MDR చర్చకు దారితీస్తోంది. తాజా నిబంధనల ప్రకారం.. ఒకరి నుంచి ఒకరు యూపీఐ(ఫోన్‌పే, గూగుల్‌పే ఇలా.. ) చేసుకునే చెల్లింపులు పూర్తిగా ఉచితం. కానీ, రూ.2,000 దాటి ఏదైనా బయట షాపింగ్, కొనుగోలు చేస్తే మాత్రం MDR పడుతుంది. అలాగే.. చిన్న వ్యాపారులకు కూడా జీరో-MDR రక్షణ కొనసాగుతుందని కేంద్రం చెబుతోంది. దాదాపు 96 శాతం మర్చంట్ UPI లావాదేవీలు ప్రభావితం కావని ప్రభుత్వం వెల్లడించింది. కానీ, ఆర్థిక నిపుణులు మాత్రం మరోలా చెబుతున్నారు. ఇది సామాన్యుడిపై భారం పడే స్థితికి కచ్చితంగా తెస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ‘UPIపై ఛార్జీలు’ అనే అంశం రాజకీయ చర్చలోకి వచ్చింది.రాహుల్ గాంధీ ఎంట్రీ.. రాజకీయ వేడి.. ఇదే అంశాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజకీయంగా ప్రశ్నిస్తున్నారు. 2,000కు మించిన లావాదేవీలు మొత్తం UPI లావాదేవీల్లో సంఖ్య పరంగా సుమారు 5 శాతమే అయినప్పటికీ.. వాటి విలువ మొత్తం UPI లావాదేవీల విలువలో దాదాపు 65 శాతం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మర్చంట్‌పై MDR విధించినా.. వ్యాపారులు ఆ ఖర్చును చివరకు వస్తువులు, సేవల ధరల్లో కలిపి వినియోగదారుడిపై మోపే అవకాశం ఉందని ఆయన వాదిస్తున్నారు. అంతేకాదు.. భారత్‌లోని జీరో-MDR విధానాన్ని అమెరికా చెల్లింపుల సంస్థలు చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నాయని, తాజా మార్పు అమెరికా ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమంటూ రాహుల్ ఆరోపించారు. ఈ అంశాన్ని అమెరికా ట్రేడ్ డీల్ చర్చలతోనూ ముడిపెట్టారు. అయితే, కేంద్రం వాదన మరోలా ఉంది. UPI వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ, మోసాల నిరోధం, టెక్నాలజీ, మౌలిక వసతులపై నిరంతరం పెట్టుబడులు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. ఆ వ్యవస్థ దీర్ఘకాలికంగా కొనసాగేందుకు పరిమిత MDR అవసరమని వివరిస్తోంది.యూపీ ఎన్నికల్లో ఎందుకు కీలకం?యూపీఐ అంటే కేవలం యాప్‌లో డబ్బు పంపడం కాదు. కూరగాయల బండి, టీ దుకాణం, మెడికల్ షాప్, చిన్న హోటల్, ఆటో.. ఇలా రోజువారీ లావాదేవీల్లోకి అది వెళ్లిపోయింది. అందుకే ఛార్జీల అంశం కేవలం బ్యాంకింగో లేదంటే ఫిన్‌టెక్ పాలసీగా కాకుండా చిన్న వ్యాపారి, వినియోగదారుడి జేబుకు సంబంధించిన అంశంగా రాజకీయ పార్టీలు ప్రస్తావించే అవకాశం ఉంది. ఇదే పాయింట్‌ను కాంగ్రెస్ పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ‘ఒకప్పుడు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించారు.. ఇప్పుడు పెద్ద మొత్తంలోని మర్చంట్ లావాదేవీలకు MDR ఎందుకు?’ అనే ప్రశ్నను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించాలనుకుంటోంది. వచ్చే ఏడాదిలో ఏడు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలోని పలు సమస్యలతో పాటు యూపీఐని కూడా ఎన్నికల ప్రచార అస్త్రంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.క్యూఆర్ కోడ్ టూ రాజకీయ కోడ్.. ఇప్పటికే రైతులు, యువత, ఉద్యోగాలు, ధరలు, సంక్షేమ పథకాలు వంటి అంశాల చుట్టూ సాగుతున్న యూపీ రాజకీయంలో.. UP‘I’ ఛార్జీల అంశం కొత్త చర్చకు దారి తీస్తుందా? రోజూ ఫోన్లో కనిపించే QR కోడ్.. ఎన్నికల ప్రచారంలోనూ రాజకీయ కోడ్‌గా మారుతుందా? లేక ఇది కేవలం కేంద్ర విధానంపై కాంగ్రెస్ చేస్తున్న మరో విమర్శగానే మిగిలిపోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: మోదీని కలిసిన వారం రోజుల్లోనే.. -
సీఎం కోటాలో నిన్ను ఐఏఎస్‌ను చేస్తా!
‘‘మీరు చాలా అందంగా ఉంటారు. అంతకంటే మంచి మనసు కూడా ఉంది. మీ వ్యక్తిత్వమూ ఎంతో అద్భుతమైంది. ఇవన్నీ కాదండీ.. మీరు ఓ కంప్లీట్ ఉమెన్. మీరు చేసే పని మీకు అస్సలు సూట్ కాలేదు. నేను గనుక రాజకీయాల్లో కొనసాగితే.. రేపు మా పార్టీ అధికారంలోకి వస్తే సీఎం కోటాలో మీకు ఏఐఎస్ జాబ్ ఇప్పిస్తా’’ .. ఇలా ఓ వాట్సాప్ మెసేజ్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. బ్యాంక్ ఉద్యోగి అయిన ఆమెను ఏకంగా ఐఏఎస్‌ను చేస్తానంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడా నేత. కాకపోతే అధికారంలోకి వస్తేనే ఆ పని చేస్తాడంట. అందుకోసం ఆమెను ‘కాంప్రమైజ్’ కావాలంటూ వేధించాడాయన!. ఓ బ్యాంక్ ఉద్యోగిని సంచలన ఆరోపణలతో ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేగింది. సమాజ్‌వాదీ పార్టీ మైనారిటీ విభాగం కార్యదర్శి రాజన్ రిజ్వీ తనను వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించిందామె. అంతేకాదు.. తనకు పంపిన పలు మెసేజ్‌లను మీడియా ముందు రిలీజ్ చేయడం తీవ్ర దుమారం రేపింది. రోజూ నా వెంటపడే వాడు. ఏదో ఒక పని మీద రిజ్వీ రోజూ బ్యాంక్‌కు వచ్చేవాడని.. తోటి సిబ్బందిని ప్రలోభపెట్టి తన నెంబర్ సంపాదించాడని.. అప్పటి నుంచి వేధించడం మొదలుపెట్టాడని ఆమె ఆంటోంది. గట్టిగా నిలదీస్తే బెదిరింపులకు దిగాడని ఆరోపిస్తోంది. అంతేకాకుండా.. ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తనకు సీఎం కోటాలో ఐఏఎస్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రిజ్వీ ఆశ చూపుతున్నాడని చెబుతోంది. ఈ మేరకు రిజ్వీ చేసినట్లుగా ఉన్న వాట్సాప్ మెసేజ్‌లను బయటపెట్టిందామె."मुझे आपकी पर्सनालिटी पर ये जॉब अच्छी नहीं लगती। अगर भविष्य में राजनीति में आगे जाता हूं और सपा की सरकार बनती है तो मैं आपको CM कोटे से IAS बनवाने की कोशिश करुंगा"बैंक की महिला कर्मचारी को यह मैसेज करने वाला सपा नेता राजन रिजवी है। पुलिस ने FIR कर ली है।📍मथुरा, उत्तर प्रदेश pic.twitter.com/YfBHGXOG3Q— Sachin Gupta (@Sachingupta) September 16, 2026వేధింపులు ఎక్కువయ్యేసరికి తాను ఫోన్ ఎత్తడం మానేశానని.. దీంతో సరాసరి బ్యాంక్‌కు వచ్చి అందరి ముందే బెదిరించాడని చెప్పిందామె. అంతేకాదు.. తన కుటుంబాన్ని సైతం టార్గెట్ చేసుకున్నాడని.. గూండాలతో వాళ్లపై నిరంతరం నిఘా పెడుతున్నాడని వాపోయింది. భరించలేకనే ఇలా పోలీసుల ముందుకు రావాల్సి వచ్చిందని తెలిపింది. ఈ నేపథ్యంతో మధురలోని కొత్వాలి పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేయగా.. సెప్టెంబర్ 15న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఎస్పీ చర్యలు..రిజ్వీ వ్యవహారాన్ని ఆధారంగా చేసుకుని అధికార బీజేపీ ప్రతిపక్ష ఎస్పీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అయితే కేసు నమోదైన నేపథ్యంలో రాజన్ రిజ్వీని సమాజ్‌వాదీ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. మహిళల భద్రత విషయంలో ఎలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: ఇలా కలిశారో లేదో.. అలా పని జరిగిపోయింది! -
దిశా మృతి కేసు దర్యాప్తు.. ఎవరీ సీమా పాహుజా?
న్యూఢిల్లీ: దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పలు క్రిమినల్ కేసుల దర్యాప్తులో అనుభవం ఉన్న సీబీఐ అధికారి సీమా పాహుజాకు ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఓ భవనంలోని 12వ అంతస్తు నుంచి పడిపోవడంతో దిశా సాలియన్ మృతి చెందింది. ఇది జరిగిన ఆరేళ్ల తర్వాత ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేపట్టింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్లో ఎవరినీ నిందితుడిగా పేర్కొనలేదు.సీమా పాహుజా ఎవరంటే..ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో స్పెషల్ క్రైమ్స్ యూనిట్ ఎస్పీగా సీమా పాహుజా పనిచేస్తున్నారు. గతంలో సీబీఐ చండీగఢ్ విభాగంలోనూ సేవలందించారు. హత్రాస్ ఘటన, ఉన్నావ్ అత్యాచార కేసు, కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో జరిగిన అత్యాచారం-హత్య కేసు దర్యాప్తులతో పాటు సిమ్లాలోని ‘గుడియా’ అత్యాచారం హత్య కేసు దర్యాప్తులోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు. 2021లో ‘బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్’గా సీమా పాహుజాకు బంగారు పతకం లభించించింది.దిశా సాలియన్ కేసులో దర్యాప్తుదిశా మృతికి సంబంధించిన పాత రికార్డులు, అందుబాటులో ఉన్న ఆధారాలను సీబీఐ బృందం మరోసారి పరిశీలించనుంది. 2020 జూన్ 8 రాత్రి ఆమె కాబోయే భర్త రోహన్ రాయ్ ఇంట్లో జరిగిన పార్టీకి హాజరైన వారి వాంగ్మూలాలను తొలిదశలో నమోదు చేయనున్నారు. అప్పటి పోలీసు దర్యాప్తు వివరాలు, ఘటనాస్థల రికార్డులు, ఫోరెన్సిక్ ఆధారాలు, ఇతర పత్రాలను కూడా పరిశీలించనున్నారు. దిశా మృతి జరిగిన కొద్ది రోజులకే సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన నివాసంలో మృతిచెందారు. రెండు ఘటనలు దాదాపు ఒకే సమయంలో జరగడంతో వాటి మధ్య సంబంధంపై అప్పట్లో అనేక ఊహాగానాలు వినిపించాయి.ఇదీ చదవండి: ఇక చిటికెలో టీబీ గుర్తింపు.. 16 ఏళ్ల కుర్రాడి వినూత్న ఆవిష్కరణ! -
దర్గా సాక్షిగా హిందూ జంట పెళ్లి.. ముస్లిం పెద్దల అక్షింతలు
మతాల మధ్య చిచ్చు పెట్టి తమ ప్రయోజనాలు చూసుకునే ప్రయత్నాలు ఎక్కడో జరుగుతుండొచ్చు. కానీ సామాన్యులు మాత్రం ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవానికే పెద్దపీట వేస్తున్నారు. తమిళనాడులోని నాగూర్ నుంచి ఇప్పుడు అలాంటి మానవీయతను చాటే ఓ అందమైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. నాగపట్నం జిల్లాలోని నాగూర్ ఆండవర్ దర్గాకు ఆదివారం ఉదయం వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. అనంతరం దర్గా ప్రాంగణంలోని సన్నిధి వద్ద హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నిర్వహించారు. వరుడు వధువు మెడలో తాళి కట్టగా.. అక్కడే ఉన్న దర్గా నిర్వాహకులు, ముస్లిం పెద్దలు, ఇరు కుటుంబాల సభ్యులు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించారు.ముస్లిం పెద్దల ఆశీర్వాదం..నాగూర్ దర్గా చైర్మన్, వారసత్వ ట్రస్టీ మొహమ్మద్ ఖలీఫా సాహిబ్ కూడా ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. నాగపట్నం జిల్లా చాలా కాలంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. నాగూర్ దర్గాలో వివిధ మతాలకు చెందిన ప్రజలు రావడం, తమ ప్రత్యేక సందర్భాలను జరుపుకోవడం కొత్తేమీ కాదన్నారు.VIDEO | Nagapattinam: Hindu wedding held at Nagore Dargah, with people from both Hindu and Muslim communities attending the ceremony. pic.twitter.com/D2f4vQ83PH— Press Trust of India (@PTI_News) September 15, 2026వధూవరుల వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. దర్గా నిర్వాహకులు హిందూ జంటను ఆశీర్వదిస్తున్న దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నాగూర్ దర్గా భిన్న మతాల ప్రజలు కలిసి మెలిసి ఉండే సంప్రదాయానికి మరోసారి వేదికగా నిలిచిందంటూ పలువురు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలను భవిష్యత్ తరాలకు కూడా చూపించాల్సిన అవసరం ఉందని ఖలీఫా సాహిబ్ అభిప్రాయపడ్డారు. ఓవైపు పలువురి అభ్యంతరాలు.. మరోవైపు మతం ఏదైనా ఒకరి సంతోషంలో మరొకరు భాగస్వాములు కావచ్చనే సందేశాన్ని ఈ వివాహ వేడుక చాటిందనే కామెంట్లు నెట్టింట కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: నాగ్‌పూర్ హిట్ అండ్ రన్ కేసులో బిగ్ ట్విస్ట్ -
మోదీని కలిసిన వారం రోజుల్లోనే..
దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదం.. ఎన్నో ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్య. పైగా ఆ వెనక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారన్న ఆరోపణ. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో బాల్య స్నేహితుడ్ని కలిసి.. సీబీఐ విచారణ జరిపించాలని ఆ పెద్దాయన కోరారు. అవతలి ఉంది మాములు వ్యక్తి కాదు.. అందుకే వారం తిరగ్గ ముందే ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది.ప్రధాని నరేంద్ర మోదీతో పాఠశాలలో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గర్ అలీ వోరా.. మహారాష్ట్రలోని భయందర్‌లో తన భూమి వివాదంపై సెప్టెంబర్ 8న మోదీని కలిశారు. ఇది జరిగిన.. వారం రోజుల్లోనే వివాదాస్పద స్థలంపై బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా వెనక్కి తగ్గారు. భూమిపై తనకున్న స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించడంతోపాటు, అక్కడ నిర్మాణానికి తీసుకున్న అనుమతులను కూడా సరెండర్ చేశారు. వోరాపై గతంలో ఇచ్చిన పోలీస్ ఫిర్యాదును సైతం ఉపసంహరించుకున్నారు.నాకేం తెలియదు: వోరామోదీతో చిన్నప్పుడు కలిసి చదువుకున్న వోరా.. ప్రస్తుతం ముంబై సమీపంలోని మీరా రోడ్లో నివసిస్తున్నారు. భయందర్ ఈస్ట్‌లోని నవ్‌ఘర్‌లో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని 1989లో రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేశారు. తాను ఆ భూమిని ఎప్పుడూ విక్రయించలేదని, మరెవరికీ బదలాయించలేదని పేర్కొన్నారు.అయితే 2011లో తనకు తెలియకుండా భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి, ఆస్తిని రెండు భాగాలుగా విభజించినట్లు వోరా ఆరోపించారు. ఒక భాగాన్ని స్వయం బిల్డర్స్ పేరుతో, మరో భాగాన్ని నరేంద్ర మెహతాకు సంబంధించిన సెవెన్ ఎలెవన్ కన్స్ట్రక్షన్స్ పేరుతో చూపించినట్లు ఆయన పేర్కొన్నారు. తన భూమిపై నిర్మాణ అనుమతులు ఎలా ఇచ్చారనే అంశంపైనా అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కూడా ఆయన కోరారు.15 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా..ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు దాదాపు 15 ఏళ్లుగా వివిధ ప్రభుత్వ విభాగాలను ఆశ్రయిస్తున్నానని వోరా తెలిపారు. 2015లో నకిలీ పత్రాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైందని, అయితే దర్యాప్తు నివేదిక చాలా ఆలస్యంగా వచ్చిందని ఆయన ఆరోపించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీసు విభాగాల అధికారులకు ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని వోరా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 8న ప్రధాని మోదీని కలిసి తన సమస్యను వివరించారు. ఈ భేటీ అనంతరం మహారాష్ట్ర అధికార యంత్రాంగం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది.మోదీ ఎఫెక్ట్.. సచివాలయంలో కీలక సమావేశంసెప్టెంబర్ 15న మహారాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీకర్ పరదేశి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో అస్గర్ అలీ వోరాతో పాటు ఎమ్మెల్యే నరేంద్ర మెహతా, మీరా-భయందర్ మున్సిపల్ కమిషనర్ రాధా బినోద్ శర్మ, టౌన్ ప్లానర్ పురుషోత్తమ్ షిండే పాల్గొన్నారు.ఈ సమావేశంలో నరేంద్ర మెహతా టౌన్ ప్లానింగ్ విభాగానికి లేఖ ఇచ్చారు. వివాదాస్పద భూమిపై తాను కలిగి ఉన్న స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు, ఆ స్థలానికి మంజూరైన నిర్మాణ అనుమతిని కూడా సరెండర్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే ఈ భూమిని తాను 2019లో మెర్విన్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు మెహతా తన లేఖలో తెలిపారు.ఫిర్యాదు కూడా ఉపసంహరణఇదే సమయంలో వోరాపై గతంలో తాను చేసిన పోలీస్ ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు మెహతా పోలీస్ కమిషనర్‌కు మరో లేఖ రాశారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరినందున ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భూవివాదానికి ఓ ఎండ్ కార్డ్ పడినట్లైంది.ఇదీ చదవండి: ఆ హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఊరట -
విశ్వ వీక్షణ నిలయం.. ఈ గణేశ మండపం
నాగ్‌పుర్: ఆధ్యాత్మికతతో పాటు విజ్ఞానాన్ని మేళవిస్తూ మహారాష్ట్రలోని నాగపూర్‌లో గల బాల గణేశోత్సవ మండల్ ఈ ఏడాది ‘విజ్ఞానం ద్వారా ఆత్మశుద్ధి’ ఇతివృత్తంతో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసింది. మనసు, చైతన్యం, విజ్ఞానం, ఆధ్యాత్మికతల మధ్య ఉన్న అనుసంధానాన్ని భక్తులకు పరిచయం చేయడం దీని ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ మండపాన్ని అంతరిక్షాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. గెలాక్సీలు, గ్రహాల స్ఫూర్తితో లోహాలు, రేఖాగణిత ఆకృతులు, వృత్తాకార నిర్మాణాలను ఉపయోగించి ఖగోళ అంశాలు, అవి మానవ జీవితంపై చూపే ప్రభావాన్ని ప్రతిబింబించారు.ప్రవేశద్వారం వద్ద భక్తుల అవగాహనకు విశ్వానికి సంబంధించిన నమూనాలను ఉంచారు. మానవ మెదడు పనిచేసే తీరును చూపించే ప్రతిరూపాలు, ఇన్స్టలేషన్లు ఇందులో ఏర్పాటు చేశారు. ఈ అలంకరణ ద్వారా భక్తులు తమలోకి తాము చూసుకుని ఆలోచనలు, భావోద్వేగాలు, చర్యల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నట్లు కార్పొరేటర్, మండల్ అధ్యక్షుడు ఈశ్వర్ తెలిపారు. ప్రధాన మండపంలోకి వెళ్లిన తర్వాత విశ్వాన్ని తలపించే ఏర్పాట్లు కనిపిస్తాయని, మానవ మెదడులో నిరంతరం జరిగే ఆలోచనలు, కార్యకలాపాలను గోడలపై ప్రతిబింబించామని ఈశ్వర్ వివరించారు. భావోద్వేగాలు, ప్రవర్తనకు సంబంధించిన శాస్త్రీయ ప్రక్రియలను కూడా ఇందులో చూపించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ మండళ్లలో రూపొందించిన నమూనాలు, డిజైన్లను పరిశీలించిన తర్వాత ఈ మండపాన్ని రూపొందించినట్లు చెప్పారు.మండపం మధ్యలో మనసు, మేధస్సు, ఆలోచనలు, సంస్కృతికి ప్రతీకగా భారీ జలాశయాన్ని పోలిన నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. దాని నుంచి వెలువడే తరంగాలు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరు అంతర్గత శత్రువులను సూచిస్తాయి. మధ్యభాగం పైన భారీ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. మానవులలో మారుతూ ఉండే ఆలోచనలు, భావోద్వేగాలను వీక్షించే విశ్వశక్తికి ఇది ప్రతీకగా పేర్కొన్నారు. అదుపు లేని భావోద్వేగాలు, ప్రతికూల ధోరణులు.. మానసిక అశాంతి, ఘర్షణ, ద్వేషం, హింస, విధ్వంసానికి దారితీస్తాయని ఈశ్వర్ తెలిపారు. దీనికి భిన్నంగా గణేశుడికి శరణాగతి, ప్రార్థన, నైతిక విలువలు, సత్ప్రవర్తన, కరుణ ఆత్మశుద్ధికి మార్గాలుగా చూపించినట్లు చెప్పారు. అజ్ఞానం నుంచి ఆధ్యాత్మిక జ్ఞానోదయం వైపు సాగే ప్రయాణానికి ప్రతీకగా 16 దీపస్తంభాలను కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: ఆడంబరాలకు దూరంగా.. వందేళ్ల 32 గణేశ మండపాలు -
బాత్రూం వస్తుందని జంప్ అయ్యాడు!.. ఆపై ట్విస్ట్
హైప్రొఫైల్ హిట్ అండ్ రన్ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టిన ఘటనలో కల్యాణ్ బైన్స్లాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ తర్వాత కూడా అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, అతని ప్రయత్నం ఫలించకపోగా.. మళ్లీ పోలీసులకు దొరికిపోయాడు. మరోవైపు.. కల్యాణ్, సహ నిందితులకు శిక్ష పడేంత వరకు తన పోరాటం ఆగదని బాధితురాలు చెబుతోంది. సెప్టెంబర్ 13న గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ సియా ప్రాణాలతో బయటపడింది. చిన్న ఉల్లంఘటనకు చలాన్లు వేసే ట్రాఫిక్ వ్యవస్థ.. ఈ ఘటనను తేలికగా తీసుకోవడాన్ని ఆమె భరించలేకపోయింది. ఆ యాక్సిడెంట్ వీడియోను నెట్టింట పోస్ట్ చేసి.. తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో పోలీసులు సుమోటోగా కేసు విచారణ చేపట్టారు. అయితే తప్పంతా ఆ బైకర్దేనని.. ఆమె దగ్గరకు వచ్చి కట్లు కొట్టిందని నిందితుడు కల్యాణ్ ఆరోపించాడు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన కల్యాణ్.. తన లాయర్‌తో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈలోపు.. నిన్న ఉదయం రాజస్థాన్‌లోని దౌసా సమీపంలో దాక్కున్న అతడిని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు అయితే ఆ సమయంలో బాత్రూంకు వెళ్లాలని చెప్పి కల్యాణ్ రోడ్డు పక్కకు వెళ్లాడు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు చేజ్ చేయగా.. కొంత దూరం వెళ్లాక కిందపడిపోయి స్వల్పంగా గాయపడ్డాడు. పోలీసులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించి తిరిగి అదుపులోకి తీసుకున్నారు. కల్యాణ్‌తో ఓ వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు.Kalyan Bainsla from the Gurugram Hit n Run case arrested and made to kneel like a dog in front of his car…Gaanv todo saale ki! pic.twitter.com/1S40RXGx7k— Roop Darak (@RoopDarak) September 15, 2026వీడియో వైరల్.. కేసులో కీలక మలుపుసెప్టెంబర్ 13న గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై మహిళా బైకర్ శివానీ చౌహాన్ అలియాస్ సియాను కారు ఢీకొట్టిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె తన స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన మారుతి సుజుకి సియాజ్ ఆమె బైక్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి శివానీ రోడ్డుపై పడిపోయి కొంత దూరం వరకు జారుకుంటూ వెళ్లారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేసు వెలుగులోకి వచ్చింది. వీడియోలోని దృశ్యాలను పరిశీలించిన పోలీసులు తొలుత ర్యాష్ డ్రైవింగ్, గాయపర్చిన కేసుగా నమోదు చేశారు. అయితే దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాస్త ఉంటే తన ప్రాణం పోయేదని అటు సియా సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో సీసీటీవీ, వైరల్ వీడియోలను విశ్లేషించిన అనంతరం భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 109 కింద హత్యాయత్నం ఆరోపణను చేర్చారు. అలాగే మహిళను వెంబడించడం, ఆమె మర్యాదకు భంగం కలిగించే చర్యలకు సంబంధించిన సెక్షన్లను కూడా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. మీడియా ముందుకొచ్చి.. ఆపై ఫోన్ స్విచ్ఛాఫ్ఘటన వీడియో వైరల్ అయిన తర్వాత కల్యాణ్ బైన్స్లా మీడియా ముందుకు వచ్చి తన వాదన వినిపించాడు. ఇది కావాలని చేసిన దాడి కాదని, ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పాడు. అయితే అనంతరం అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. అతడు గురుగ్రామ్ నుంచి పాల్వాల్ మీదుగా రాజస్థాన్ వైపు వెళ్లినట్లు గుర్తించి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. చివరకు దౌసా–రాజ్‌గఢ్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కారులో మరో వ్యక్తిఈ ఘటనలో కల్యాణ్‌తో పాటు అతడి బంధువు లవ్నిష్ కూడా కారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనం కల్యాణ్ స్నేహితుడి పేరుతో ఉన్నట్లు సమాచారం. అయితే ఆర్మీలో పని చేస్తున్న ఆ స్నేహితుడికి.. మీడియాలో వార్త వచ్చాకే జరిగిన ఘటన గురించి తెలిసింది. అరెస్ట్ మాత్రమే సరిపోదు: సియా మరోవైపు బాధితురాలు బైకర్ సియా (శివానీ చౌహాన్) ఈ ఘటన ప్రమాదం కాదని ఆరోపించారు. తనను కారు అడ్డుకోవడానికి ప్రయత్నించిందని, తాను వేగం పెంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ కారు తన బైక్‌ను ఢీకొట్టిందని ఆమె చెబుతున్నారు. కారులో నలుగురు ఉన్నారని.. వాళ్లంతా మద్యం సేవించారని.. అందరిపైనా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. నిందితుల అరెస్ట్‌తో కేసు ముగియదని శివానీ స్పష్టం చేశారు. నిందితులకు శిక్ష పడే వరకు తాను సంతృప్తి చెందబోనని చెప్పారు. మరోవైపు కల్యాణ్‌ను కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కేసులో సీసీటీవీ ఫుటేజీ, వైరల్ వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల వాదనలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. This isn't hit and run... it's hit and kill 🖐️Car No: HR 30Y 4949In Gurugram, first a female bike rider was harassed by 4 louts sitting in a Verna car, they made vulgar vulgar gestures When the girl stopped them from doing so and told them to leave, the beasts rammed her… pic.twitter.com/W1141MIGSJ— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 14, 2026 ఇదీ చదవండి: సెక్యూరిటీ రీజన్.. నిరాశగా వెనుదిరిగిన అభిమానులు -
ఆడంబరాలకు దూరంగా.. వందేళ్ల 32 గణేశ మండపాలు
ముంబై: ముంబైలో గణేశోత్సవం అంటే భారీ విగ్రహాలు, వైభవంగా కనిపించే అలంకరణలు, లక్షలాది భక్తుల సందడే గుర్తుకొస్తుంది. అయితే ఈ వేడుకల మూలాలు మాత్రం నిశ్శబ్దంగా సాగే సామాజిక ఉత్సవాల్లో ఉన్నాయి. నగరంలోని వందేళ్లకు పైబడిన కొన్ని గణేశ మండపాలు ఇప్పటికీ తమ పూర్వీకుల సంప్రదాయాలను కొనసాగిస్తున్నాయి. చిన్న విగ్రహాలు, సంప్రదాయ పూజలు, కుటుంబసభ్యులు, స్థానికులతో కలసి ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ముంబైలో వందేళ్ల చరిత్ర కలిగిన 32 గణేశ మండపాలు ఉన్నాయని, వాటిలో 24 గిర్గావ్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయని నగరంలో పర్యటనలు నిర్వహించే ‘ఖాకీ టూర్స్’ తెలిపింది.గిర్గావ్లోని వీపీ రోడ్డులో ఉన్న 105 ఏళ్ల అంగ్రేవాడి గణేశోత్సవ మండల్లో ఈసారి వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. నితిన్ గాడ్రే, స్వాతి జోషి అనే ఇద్దరు స్థానికులు గత నెల కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల అనంతరం వారు గల్లంతైన వారిలో ఉన్నట్లు సమాచారం. ఇద్దరూ ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనేవారని కమిటీ సభ్యుడు మిలింద్ పోంక్షే తెలిపారు.అంగ్రేవాడిలో గతంలో సుమారు 100 మరాఠీ కుటుంబాలు గణేశోత్సవంలో పాల్గొనేవి. 1971లో నిర్వహించిన స్వర్ణోత్సవాల్లో నాటకాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మంత్ర పఠనాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ 30-40 మరాఠీ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ 2.5 అడుగుల విగ్రహంతో 10 రోజులపాటు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 8-10 మంది పూజారులు మంత్ర పఠనం, హారతి నిర్వహిస్తున్నారు. గణేశుడికి సంస్కృత స్తుతితోపాటు ప్రసాదంగా ఉసల్ తయారు చేసే సంప్రదాయం కొనసాగుతోంది.ఖాదిల్కర్ రోడ్డులోని కేశవ్జీ నాయక్ చాల్‌లోని శ్రీ సార్వజనిక గణేశోత్సవ సంస్థ 133వ ఏడాదిని జరుపుకొంటోంది. 1901లో లోకమాన్య తిలక్ ఈ చాల్ను సందర్శించి అక్కడ ఆతిథ్యం స్వీకరించినట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఇక్కడ రెండు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి, లౌడ్స్పీకర్లు లేకుండా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇళ్లలోనే పరిమితమైన గణేశోత్సవాన్ని స్వాతంత్య్ర యోధుడు తిలక్ ప్రజా ఉద్యమంగా మార్చారు. బ్రిటిష్ పాలనలో రాజకీయ సమావేశాలపై ఆంక్షలు విధించిన సమయంలో, ప్రజలను ఒకచోట చేర్చేందుకు, స్వరాజ్య సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించారు.కింగ్స్ సర్కిల్లో 1925లో ఏర్పడిన దక్షిణీ బ్రాహ్మణవాడి మండల్ రెండు రోజుల గణపతి ఉత్సవాన్ని నిర్వహించింది. స్థానికుల నుంచి కొద్దికొద్దిగా ధాన్యం సేకరించి, మహాప్రసాదం ఏర్పాటు చేయడం ఇక్కడి సంప్రదాయం. వివాహం అనంతరం ఈ ప్రాంతం విడిచి వెళ్లిన మహిళలు సైతం పూజల్లో పాల్గొనేందుకు ఇక్కడికి తిరిగి వస్తుంటారు. మరాఠీ నాటకాలు, ఆర్కెస్ట్రా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు.ఇదీ చదవండి: 471 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ ‘ఒంటరి మెదడు’ హెచ్చరిక? -
ఫోన్‌పే, గూగుల్‌పే వాడుతున్నారా?.. అయితే ఎక్స్ట్రా ఛార్జీలు కట్టాల్సింది ఎవరు??
ఇన్నాళ్లూ ఉచితంగా సాగిన యూపీఐపై ఇప్పుడు వాయింపు మొదలైందనే చర్చ జోరందుకుంది. అక్టోబర్ 15 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని, ఆన్లైన్లో రూ.2,000 దాటిన చెల్లింపులపై ఛార్జీలు పడతాయంటూ వార్తలు వస్తున్నాయి. కొన్ని రకాల లావాదేవీలకు రూ.5, మరికొన్నింటికి అంతకంటే ఎక్కువే చెల్లించాల్సి వస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఇక యూపీఐతో డబ్బులు పంపినా.. షాపులో చెల్లించినా.. మన జేబుకు మోత పడుతుందా? అన్న ఆందోళన సామాన్యుల్లో మొదలైంది. అసలు ఈ ఛార్జీలు ఎవరికి వర్తిస్తాయి? ఎంత చెల్లించాలి? కస్టమర్ జేబు నుంచి డబ్బులు పోతాయా? లేక వ్యాపారే భరించాలా? యూపీఐ వాడే ప్రతి ఒక్కరిపైనా ఛార్జీల భారం పడుతుందా?.. మీరు కిరాణా షాపులో సామాన్లు కొన్నారు.. బయట షాపింగ్ చేశారు. ఫోన్ తీసి యూపీఐతో డబ్బులు పంపారు. ఏమైనా అదనంగా కట్టాలా?.. అవసరం లేదు. స్నేహితుడికి రూ.10 వేలు పంపారు.. ఛార్జీ పడుతుందా? అదీ లేదు. మరి యూపీఐపై ఛార్జీలు అంటూ వస్తున్న వార్తలేంటి? ఇక్కడే అసలు గందరగోళం మొదలైంది. కొత్త నిబంధనల ప్రకారం అందరూ యూపీఐకి ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 15 నుంచి కొన్ని రకాల వ్యాపార చెల్లింపులపై మాత్రమే ‘ఎండీఆర్’ అనే ఛార్జీ ఉంటుంది. అది కూడా సాధారణ కస్టమర్ చెల్లించాల్సింది కాదు.. వ్యాపారి చెల్లించాల్సింది.చాలా సింపుల్‌గా చెప్పాలంటే.. మీరు ఒక వ్యక్తికి డబ్బులు పంపితే ఎలాంటి ఛార్జీ ఉండదు. ఎంత మొత్తం పంపినా ఇదే నిబంధన. ఉదాహరణకు మీ స్నేహితుడికి రూ.10 వేలు పంపినా, కుటుంబ సభ్యుడికి రూ.50 వేలు పంపినా యూపీఐ ఛార్జీ ఉండదు. అలాగే షాపులో మీరు రూ.2 వేల వరకు యూపీఐతో చెల్లించినా ఎలాంటి ఛార్జీ లేదు. అంటే రూ.500, రూ.1,000, రూ.2,000 బిల్లు కట్టేటప్పుడు మీరు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి రూ.2 వేలు దాటితే?ఇక్కడే కొత్త నిబంధన వస్తుంది. ఒక వ్యాపారికి రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపు చేస్తే కొన్ని సందర్భాల్లో 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. కానీ ఆ డబ్బును కస్టమర్ నుంచి తీసుకోకూడదు. వ్యాపారే భరించాలి. ఈ ఛార్జీ ఒక్క లావాదేవీకి గరిష్ఠంగా రూ.300కే పరిమితం.ఉదాహరణకు మీరు ఓ రెస్టారెంట్లో రూ.6,000 బిల్లు కట్టారనుకోండి. 0.4 శాతం ప్రకారం రూ.24 ఎండీఆర్ వస్తుంది. మీరు రూ.6,000 మాత్రమే చెల్లించాలి. ఆ రూ.24ను రెస్టారెంట్ భరిస్తుంది. అలాగే రూ.30 వేల విలువైన మొబైల్ కొంటే.. మీరు రూ.30 వేలు చెల్లిస్తే సరిపోతుంది. అదనంగా యూపీఐ ఛార్జీ పేరుతో డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు.పెట్రోల్ పోయించుకుంటే?ఇక్కడ మరో చిన్న తేడా ఉంది. పెట్రోల్, రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, వ్యవసాయ ఇన్పుట్స్ వంటి కొన్ని రంగాల్లో రూ.2,000 కంటే ఎక్కువ చెల్లింపులకు రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ ఉంటుంది. ఈ రూ.5 కూడా కస్టమర్ చెల్లించాల్సినది కాదు.. వ్యాపారి భరించాల్సిందే. అంటే పెట్రోల్ బంకులో రూ.5,000 విలువైన ఇంధనం పోయించుకుని యూపీఐతో చెల్లించినా.. మీరు రూ.5,000 మాత్రమే చెల్లిస్తారు.చిన్న షాపుల వాళ్లకు ఏంటి?ఇదీ చాలా ముఖ్యమైన విషయం. చిన్న కిరాణా దుకాణాలు, తోపుడు బండ్లు, వీధి వ్యాపారులు భయపడాల్సిన అవసరం లేదు. యూపీఐ ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు పొందే చిన్న వ్యాపారులకు జీరో ఎండీఆర్ సదుపాయం కొనసాగుతుంది. అందుకే చిన్న షాపు దగ్గర రూ.200, రూ.500, రూ.1,000 ఇలా యూపీఐతో చెల్లించే వారికి ఎలాంటి మార్పు ఉండదు.ఈ డబ్బు ఎవరికి వెళ్తుంది?ఇది ప్రభుత్వానికి వెళ్లే పన్ను కాదు. ‘ఎండీఆర్’ అంటే యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే వ్యాపారికి సంబంధించిన చిన్న ఛార్జీ. వచ్చిన మొత్తాన్ని బ్యాంకులు, చెల్లింపు సేవలు అందించే సంస్థలు, యూపీఐ యాప్‌లతో కూడిన చెల్లింపు వ్యవస్థలోని భాగస్వాములకు పంచుతారు. యూపీఐ వ్యవస్థను నడపడం, భద్రత పెంచడం, మరింత విస్తరించడమే దీని ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.వ్యాపారి మీ దగ్గర అడిగితే?ఇదే ఇప్పుడు చాలామందికి ఉన్న భయం. యూపీఐ ఛార్జీ వచ్చింది.. అదనంగా డబ్బులు ఇవ్వండి అని షాపు యజమాని అడిగితే?. నిబంధనల ప్రకారం ఆ ఛార్జీని కస్టమర్‌పై వేయకూడదు. బ్యాంకులు వ్యాపారులు ఈ ఎండీఆర్‌ను కస్టమర్ల నుంచి వసూలు చేయకుండా చూడాలని ఆర్థిక శాఖ సూచించింది. యూపీఐ యాప్‌లు కూడా అదనపు ప్లాట్‌ఫామ్ ఫీజులు లేదంటే అదనపు చార్జీలు విధించకూడదు. అంటే.. యూపీఐ ఇక ఫ్రీ కాదా?సామాన్యుడి విషయంలో ఇప్పటికీ ఫ్రీనే. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితం. రూ.2 వేల వరకు వ్యాపార చెల్లింపులూ ఉచితమే. చిన్న వ్యాపారులకు కూడా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి. ఆర్థికశాఖ, ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త ఎండీఆర్ వల్ల మొత్తం వ్యాపారి-కస్టమర్ యూపీఐ లావాదేవీల్లో దాదాపు 96 శాతం ప్రభావితం కావు. అంటే వార్తల్లో ‘‘యూపీఐ ఛార్జీలు’’ అని కనిపించినంతగా సామాన్యులపై కొత్త భారం పడటం లేదన్నమాట. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే.. మీరు స్నేహితుడికి డబ్బు పంపుతున్నారా? ఛార్జీ లేదు. పేమెంట్లు చేస్తున్నారా? ఛార్జీ లేదు. షాపులో రూ.2 వేల వరకు చెల్లిస్తున్నారా? ఛార్జీ లేదు. చిన్న వ్యాపారి QRకి డబ్బు పంపుతున్నారా? ఛార్జీ లేదు. రూ.2 వేలకు మించిన కొన్ని వ్యాపార చెల్లింపుల్లో ఎండీఆర్ ఉన్నా.. దాన్ని కస్టమర్ కాకుండా వ్యాపారే భరించాలి.యూపీఐ అంటే ఒక్క యాప్ కాదు. మనం రోజూ ఉపయోగించే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్, అమెజాన్ పే, వాట్సాప్ పే వంటి యాప్‌ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేస్తుంటాం. అలాగే చాలా బ్యాంకుల యాప్‌లలోనూ యూపీఐ సదుపాయం ఉంటుంది. ఏ యాప్ ద్వారా డబ్బులు పంపినా.. వెనుక పనిచేసేది యూపీఐ వ్యవస్థే. ఇదీ చదవండి: ఆన్లైన్ పేమెంట్లతో మనం ఏడాదికి ఎంత చెల్లిస్తున్నామో తెలుసా? -
‘ఎంఎస్’ జీవితాన్ని మలుపుతిప్పిన సదాశివం
ప్రముఖ కర్ణాటక సంగీత విధ్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితగాథ తెరపైకి ఎక్కనున్నదని తెలియగానే చాలామంది సంగీత ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బులక్ష్మి పాత్రను ప్రముఖ నటి రష్మిక పోషిస్తున్నదని ఈ సినిమా నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యలో ఎంఎస్ సుబ్బులక్ష్మి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పలువురిలో కలిగింది. భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి ఒక శిఖరం. ఆమె గాత్రం కోట్లాది మందిని ఆకట్టుకుంది. భక్తిగీతాల నుంచి కర్ణాటక సంగీతంలోని క్లిష్టమైన కృతుల వరకు ఆమె చేసిన గానం అపూర్వమైన ముద్ర వేసింది. 1974లో రామన్ మెగసెసే అవార్డు, 1998లో భారతరత్న అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. అయితే, ఆమె సంగీతం వెనుక ఉన్న కళాత్మక స్వేచ్ఛ, వ్యక్తిగత జీవితం, సామాజిక పరిస్థితులు, భర్త టి సదాశివం ప్రభావం, ఆమెపై ఏర్పడిన ‘దైవ స్వరూపం’ అనే గుర్తింపు.. మొత్తంగా చూస్తే ఎంఎస్ సుబ్బులక్ష్మి కథ.. ఔరా అనిపిస్తుందని ప్రముఖ కర్ణాటక గాయకుడు, రచయిత టీఎం కృష్ణ గతంలో రాసిన ఒక వ్యాసంలో విశ్లేషించారు.దేవదాసి సంప్రదాయంలో జన్మించి..1916లో మదురైలో వీణ విద్వాంసురాలు మదురై షణ్ముఖవడివు కుమార్తెగా సుబ్బులక్ష్మి జన్మించారు. ఆమె తల్లి దేవదాసి సంప్రదాయానికి చెందినవారు. పదేళ్ల వయసులోనే ‘మరకతవడివు’ పాటను జెంజూటి రాగంలో హెచ్ఎంవీ రికార్డుపై పాడి సంగీత ప్రపంచానికి పరిచయమయ్యారు. 1926 నాటి ఆ రికార్డింగ్‌లోనే వేగంగా, స్పష్టంగా, ధైర్యంగా స్వరాలను పలికించే ప్రత్యేకత ఆమెలో కనిపించిందని కృష్ణ పేర్కొన్నారు. అధికారిక జీవితచరిత్ర వివరాల ప్రకారం కూడా ఆమె చిన్న వయసులోనే గానప్రస్థానం ప్రారంభించి, తరువాత దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందారు.మదురై నుంచి మద్రాస్‌కు..1936లో 20 ఏళ్ల వయసులో సుబ్బులక్ష్మి మదురై నుంచి మద్రాస్‌కు వెళ్లారు. అక్కడ టి సదాశివం కుటుంబంతో ఆమెకు అనుబంధం ఏర్పడింది. స్వాతంత్య్ర ఉద్యమంతో సదాశివానికి అనుబంధం ఉండేది. ప్రకటనల రంగంలోనూ ఆయనకు అనుభవం ఉంది. ఎంఎస్‌లో ఉన్న సంగీత ప్రతిభను గుర్తించి ఆమె కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. 1940లో సదాశివం భార్య మరణించిన తరువాత అదే ఏడాది జూలైలో ఎంఎస్‌ను సదాశివం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఎంఎస్ జీవితం, కళా ప్రయాణంలో పెద్ద మార్పు ప్రారంభమైందని కృష్ణ విశ్లేషించారు.‘మీరా’తో జాతీయ స్థాయిలో సంచలనం1938 నుంచి 1947 మధ్య ఎంఎస్ ఐదు సినిమాల్లో నటించారు. వాటిలో సేవాసదనం, శకుంతలై, సావిత్రి, తమిళ మీరా, హిందీ మీరా ఉన్నాయి. 1947లో హిందీ మీరా విడుదలతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మీరా పాత్రను పోషించడం ఆమెకు వ్యక్తిగతంగా, ఆధ్యాత్మికంగా కూడా ప్రగాఢమైన అనుభూతిని కలిగించిందని ఆమెకు సన్నిహితులైన వారు చెప్పినట్లు కృష్ణ తెలిపారు. ఆ తర్వాత సదాశివం ఆమెను మళ్లీ సినిమాల్లో నటించనీయలేదని కృష్ణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. గాయని నుంచి ‘ఆధ్యాత్మిక మూర్తి’గా..1950ల చివర, 1960ల నాటికి ఎంఎస్ గానశైలిలో మార్పు కనిపించిందని కృష్ణ తెలిపారు. మీరా భజనలతో పాటు తులసీదాస్, కబీర్, నానక్, సూరదాస్, తుకారాం రచనలు, రవీంద్రసంగీత్ వంటి విభిన్న సంగీత సంప్రదాయాలను ఆమె నేర్చుకున్నారు. కోల్‌కతాలో టాగోర్, పుణేలో తుకారాం, ఢిల్లీలో తులసీదాస్, మద్రాస్‌లో త్యాగరాజు.. ఇలా ప్రాంతానుసారం ఆమె గానంలో విభిన్న సాంస్కృతిక స్వరూపాలు కనిపించేవని కృష్ణ వివరించారు.భజనల నీడలో మరుగునపడిన కర్ణాటక సంగీతం?ఎంఎస్ 1968లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ నుంచి ‘సంగీత కళానిధి’ అందుకున్నారు. అయితే అదే సమయంలో కర్ణాటక సంగీతానికి చెందిన కొందరు విమర్శకులు ఆమెను ప్రధానంగా భజన గాయనిగా చూడటం ప్రారంభించారని కృష్ణ పేర్కొన్నారు. ఆమె రాగం-తానం-పల్లవి వంటి అత్యంత క్లిష్టమైన కర్ణాటక సంగీత ప్రదర్శనలు చేసినప్పటికీ, అవి భజనలంత ప్రజాదరణ పొందలేదని ఆయన అభిప్రాయపడ్డారు. 1963లో విడుదలైన వెంకటేశ్వర సుప్రభాతం రికార్డింగ్ ప్రజాదరణ పొందినప్పటికీ, ఆమె భజగోవిందం, విష్ణు సహస్రనామం వంటి భక్తిగీతాల ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాల్లోకి చేరారని కృష్ణ గుర్తుచేశారు.సదాశివం ప్రభావం.. సాధనలో పరిపూర్ణతఎంఎస్ కచేరీల్లో ఏ రాగం పాడాలి.. ఒక్కో కృతికి ఎంత సమయం కేటాయించాలి వంటి విషయాల్లో సదాశివం ప్రభావం ఉండేదని కృష్ణ తెలిపారు. ముఖ్యంగా శంకరాభరణం రాగాన్ని ప్రధానంగా పాడాలని ఆయన కోరుకునేవారని, ఆమె కొన్నిసార్లు భైరవి లేదా సావేరి వంటి రాగాలను పాడాలనుకున్నా ఆమె నిర్ణయం మారేదన్నారు. ఆమె తన సహకార కళాకారులతో తరచూ సాధన చేసేవారు. సాధారణంగా వేదికపైనే పరస్పర స్పందనతో సంగీతాన్ని వినిపించే కర్ణాటక సంప్రదాయానికి ఇది భిన్నమైన విధానమని కృష్ణ పేర్కొన్నారు. అయితే ఆ సాధన వల్ల ఆమె ప్రదర్శనలు సమన్వయంతో, తప్పుల్లేకుండా సాగేవని కూడా ఆయన తెలిపారు.చివరికి మిగిలింది.. 1970ల నాటికి ఎంఎస్‌కు ప్రపంచవ్యాప్తంగా గౌరవం దక్కింది. 1974లో రామన్ మెగసెసే అవార్డు అందుకున్న ఆమె, 1998లో భారతరత్న పొందిన తొలి సంగీత విద్వాంసురాలిగా నిలిచారు. అయితే ఈ బాహ్య విజయాల వెనుక నిజమైన ఎంఎస్ ఎక్కడ ఉందనేది ఇంకా ప్రశ్నగానే మిగిలిందని టీఎం కృష్ణ అంటారు. ఆమె తన సంగీతంలో పూర్తిగా తనను తాను వ్యక్తీకరించగలిగిందా? లేక సామాజిక, కుటుంబ, కళా అంచనాల మధ్య తన స్వరూపాన్ని మార్చుకోవాల్సి వచ్చిందా? దీనికి ఖచ్చితమైన సమాధానం చెప్పడం కష్టమని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆకర్షిస్తున్న ‘గోల్డెన్ మోదక్’.. కిలో ఎంతంటే.. -
విద్యా సంస్థల నియంత్రణ... కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్
న్యూఢిల్లీ: పద్నాలుగేళ్ల లోపు పిల్లలకు మతపరమైన, సాధారణ విద్యనందించే సంస్థల నియంత్రణ విషయంలో ఆదేశాలు పాటించకపోవడంపై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర విద్యాశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నాలుగువారాల్లోగా సమాధానమివ్వాలని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్నాగూలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. విద్యాశాఖ కార్యదర్శి టి.కె.అనిల్‌కుమార్ తానిచ్చిన విజ్ఞప్తిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడాన్ని అశ్వినికుమార్ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది సవాలు చేయడంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వానికి తన విజ్ఞప్తిని సమర్పించాలని సుప్రీంకోర్టు మే 11వ తేదీ ఉపాధ్యాయ్‌కు సూచించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. న్యాయవాది అశ్వినీ దూబే ద్వారా దాఖలైన ఈ పిటిషన్లో ‘‘14 ఏళ్ల లోపు పిల్లలకు మత సామరస్య, మతపరమైన సూచనలిచ్చే ప్రతి విద్యాసంస్థ రిజిస్టర్ అయ్యేలా, గుర్తింపు కలిగి ఉండేలా, పర్యవేక్షణ, నిఘాలకు అనుకూలంగా ఉండేలా కేంద్రం తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలి’’ అని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగంలోని ఆర్టిక్ 21ఏ, ఆర్టిక్ 39(ఎఫ్), 45, 51–ఏ(కే)ల స్ఫూర్తితో ఈ చర్యలు తీసుకోవాలని కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 మైనార్టీలకు ఎలాంటి ప్రత్యేక, అదనపు హక్కులు కల్పించవని, ఆర్టికల్ 19(1)(జీ) కింద ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, వాణిజ్యాల్లో స్వేచ్ఛ మాత్రమే లభిస్తుందని పిటిషనర్ వాదించారు. ‘‘ఆర్టికల్ 30 అనేది ఆర్టికల్ 19 (1)(జీ) పునరుద్ఘాటన అని ప్రకటించాలని, దానిద్వారా ప్రత్యేక, అదనపు హక్కులు, ప్రయోజనాలు, ప్రత్యేతలు లభించవని ఆదేశించేలా చేయాలి’’ అని కోరింది. ‘‘పిల్లలు ఈ దేశానికి వెన్నెముక అని పిటిషనర్ గుర్తిస్తున్నారు. వారి లేత వయసు కారణంగా తొందరగా ప్రభావితమయ్యే అవకాశమూ ఉంది కాబట్టి ప్రభుత్వానికి వారిపట్ల ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. రిజిస్టర్ కాని విద్యా సంస్థలు దేశ భవిష్యత్తు అయిన పిల్లల మెదళ్లను తప్పుదోవ పట్టించేందుకు, నియంత్రించేందుకు అవకాశాలు ఉంటాయి’’ అని స్పష్టం చేసింది. ఉత్తరప్రదరేశ్ సరిహద్దు జిల్లాల్లో తాను విస్తృతంగా పర్యటించానని, అక్కడ రిజిస్టర్ కానీ, గుర్తింపులేని సంస్థలు అనేకం నడుస్తున్నాయని ఉపాధ్యాయ్ తన పిటిషన్లో తెలిపారు. ఎలాంటి పర్యవేక్షణ, నియంత్రణల్లేకుండా ఈ సంస్థలు లాభాలు దండుకుంటున్నాయని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు మే నెల 11న కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. అయితే కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఉపాధ్యాయ్ మళ్లీ ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. -
హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్!
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై జంతర్‌మంతర్‌లో జరిగిన ఆందోళన సందర్భంగా ఒకవ్యక్తిపై దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌కు న్యూఢిల్లీ కోర్టు మంగళవారం మూడు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఈ మూడు వారాల్లో స్వతంత్ర ప్రవర్తనను పరిశీలించిన తరువాత అతడి సాధారణ బెయిల్‌పై విచారణ చేపడతామని కోర్టు తెలిపిందని సమాచారం. ‘‘న్యాయస్థానం విశ్వాసానికి ఈ బెయిల్ ప్రతీక. అంతేకానీ అది అందరికీ చూపేలా ప్రదర్శించే ట్రోఫీ కాదు’’ అని న్యాయమూర్తి బెయిల్ ఇస్తూ స్పష్టం చేసినట్లు తెలిసింది. అత్యంత హీనాతిహీనమైన కేసులో బెయిల్ దక్కడంపై ఉత్సవాలు, ఊరేగింపులు జరపడం, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం సమాజం, శాంతి భద్రతలకు అంతగా సరిపోయే అంశం కాదని అన్ని పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న తరువాత, కస్టడీలో ఉన్న దాదాపు పదిరోజుల్లో భరద్వాజ్ ఆత్మపరిశీలన చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు న్యాయమూర్రిత తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. భరద్వాజ్ విచారణ కూడా పూర్తయిందని, అతడిపై మోపిన అభియోగాలకు ఏడేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని న్యాయమూర్తి తెలిపారు. అయితే ఈ కేసులో న్యాయస్థానం ఆందోళన ప్రధానంగా ఫిర్యాదుదారు, అతడి కుమార్తె మైనర్ బాలిక విషయంలో ఉందని, తగిన షరతులతో వారి భద్రతను కాపాడవచ్చునని వ్యాఖ్యానించింది. ‘‘బాధితుల రక్షణ, ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యతలను పూర్తి చేయండం రెండూ కఠినమైన షరతుల కింద అప్లికెంట్కు మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయడం ద్వారా సాధ్యమవుతాయి’’ అని పేర్కొన్నారు. ఈ కాలంలో అతడి ప్రవర్తనను గమనించాలని, దాని ఆధారంగానే అతడి సాధారణ బెయిల్ విజ్ఞప్తిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. జూన్ 23 నాటి ఘటనకు సంబంధించిన ఏ నిర్ణయమైనా న్యాయస్థానాల్లో సాక్ష్యాల ఆధారంగా జరగాలని, బహిరంగంగా సోషల్ మీడియాలో కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. భరద్వాజ్‌ను రూ.50 వేల వ్యక్తిగత బాండ్, అంతే మొత్తానికి ష్యూరిటీ, పలు షరతులతో మధ్యంతర బెయిల్‌పై విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కేసు గురించి చర్చించడం, తనకు మద్దతుగా పోస్టులు పెట్టడం, లేదా ఫిర్యాదుదారుల కుటుంబానికి వ్యతిరేకంగా ఏ రకమైన మీడియాలోనూ వ్యాఖ్యలు చేయకపోవడం వంటివి మధ్యంతర బెయిల్‌కు పెట్టిన షరతుల్లో కొన్ని. బాధితుడిని, అతడి కుమార్తెను లేదా సాక్షులను సంప్రదించే ప్రయత్నం అసలు చేయకూడదు. సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం విదేశాలకు పారిపోయే యత్నమూ చేయకూడదు. విచారణకు సహకరించాలి. చిరునామా, ఫోన్ నెంబర్లను పోలీసులకు ఇవ్వడంతోపాటు మధ్యంతర బెయిల్ సమయం ముగిసిన తరువాత లొంగిపోవాలి. తదుపరి విచారణ అక్టోబరు ఆరవ తేదీ జరగనుంది. మంగళవారం నాటి బెయిల్ విచారణ ఇన్ కెమెరా జరిగిన విషయం తెలిసిందే. -
యూపీఐపై వడ్డన!
సాక్షి, హైదరాబాద్: దేశంలో దాదాపు ఆరేళ్లుగా కొనసాగుతున్న పూర్తి ఉచిత యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపుల సేవలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. యూపీఐ చెల్లింపులపై చార్జీల విధానాన్ని పునఃప్రవేశపెట్టాలంటూ గూగుల్ పే, అమెజాన్ పే, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంక్ సహా మరికొన్ని సంస్థలు సభ్యులుగా ఉన్న పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెచ్చిన ఒత్తిడితోపాటు ఏటా రూ. 40 లక్షలకుపైగా టర్నోవర్ ఉండే వ్యాపారులపై చార్జీలు విధించాలన్న ఆర్బీఐ, బ్యాంకుల సూచనను పరిగణనలోకి తీసుకుంది. వ్యక్తుల నుంచి వ్యాపారులకు రూ. 2 వేలకుపైగా జరిగే యూపీఐ చెల్లింపుల లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. అలాగే రూ. 75 వేలకన్నా ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ను గరిష్టంగా రూ. 300గా ఖరారు చేసినట్లు తెలిపింది. అయితే రూ. 2 వేలలోపు వ్యక్తుల నుంచి వ్యాపారులకు జరిపే యూపీఐ చెల్లింపులతోపాటు వ్యక్తుల నుంచి వ్యక్తుల మధ్య జరిగే యూపీఏ లావాదేవీలు, చిరు వ్యాపారులకు ఎలాంటి ఎండీఆర్ చార్జీ వర్తించదని స్పష్టం చేసింది. అక్టోబర్ 15 నుంచి నూతన విధానం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ) సంయుక్తంగా నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఎండీఆర్ రుసుము రూపంలో ఏటా పేమెంట్స్ పరిశ్రమకు రూ. 16,000 కోట్లు వస్తాయని అంచనా. వినియోగదారులు చార్జీ చెల్లించక్కర్లేదు.. ‘యూపీఏ ద్వారా చేసే చెల్లింపులపై వినియోగదారులు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యాపారుల చెల్లింపుల వ్యవస్థలో ఎండీఆర్ ఒక రకమైన చార్జీ. ఇది యూపీఐ చెల్లింపులు జరిపే వినియోగదారులపై విధించే చార్జీ కాదు. వ్యక్తులు ఎప్పటిలాగే ఎలాంటి పరిమితులు, కోటాలు లేకుండా పూర్తి ఉచితంగా యూపీఐ లావాదేవీలు కొనసాగించవచ్చు’ అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఎండీఆర్‌ను కస్టమర్ల నుంచి వసూలు చేయరాదని.. వ్యాపారులే భరించాలని స్పష్టం చేసింది. అలాగే ఎండీఆర్ చార్జీల భారాన్ని వ్యాపారులు వినియోగదారులపై మోపకుండా చూడాలని బ్యాంకులను ఆదేశించింది. అదే సమయంలో యూపీఐ యాప్‌ల ప్రొవైడర్లు ప్లాట్‌ఫాం ఫీజులు లేదా హిడెన్ చార్జీలు వసూలు చేయడాన్ని నిషేధించింది. కీలక రంగాలకు యూపీఐ చెల్లింపులపై.. అయితే రైల్వే టికెట్ల బుకింగ్, టెలికం రీచార్జీలు, బీమా ప్రీమియం చెల్లింపులు, పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపుకోవడం వంటి వాటికి వ్యక్తులు రూ. 2 వేలకుపైగా జరిపే యూపీఐ చెల్లింపులపై ఒక్కో లావాదేవీకి రూ. 5 చొప్పున ఎండీఆర్ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే రూ. 2 వేలకు మించిన విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, పైప్డ్ గ్యాస్ బిల్లులపై జరిపే యూపీఏ చెల్లింపులతోపాటు రూ. 2 వేలకు మించిన స్కూలు ట్యూషన్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు చెల్లింపులపైనా ఒక్కో లావాదేవీపై రూ. 5 చొప్పున ఎండీఆర్ ఉంటుందని పేర్కొంది. అయితే రూ. 2 వేలకన్నా తక్కువగా ఉండే బిల్లులు, ఫీజులపై మాత్రం ఎలాంటి టీడీఆర్ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మరోవైపు మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీల చెల్లింపులు, స్టాక్‌బ్రోకర్లు, డీలర్ల ద్వారా జరిపే చెల్లింపులపై 0.02 శాతం టీడీఆర్ వర్తిస్తుందని తెలిపింది. అయితే వ్యక్తుల ఖాతా నుంచి వ్యాపారుల ఖాతాకు నేరుగా జరిగే యూపీఐ చెల్లింపులకు మాత్రమే ఎండీఆర్ వర్తిస్తుందని.. యుటిలిటీ బిల్లులు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, పునరావృత పెట్టుబడులకు సంబంధించి అమలయ్యే యూపీఐ మ్యాండేట్లు లేదా ఆటోపే విధానాలకు ఎండీఆర్ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఎందుకీ చార్జీ? మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ద్వారా వసూలయ్యే మొత్తంలో కొంత యూపీఐ లావాదేవీల సేవలు అందిస్తున్న బ్యాంకులు, యాప్‌లకు పంచుతామని ఎన్పీసీఐ తెలిపింది. అలాగే మిగిలిన మొత్తాన్ని దేశంలో మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల ఊతానికి, నూతన ఆవిష్కరణాలు, సైబర్ సెక్యూరిటీ, కస్టమర్ సర్వీస్ రంగాలకు ఉపయోగిస్తామని వివరించింది. అలాగే టైర్–3 పట్టణాలు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ–కాశ్మీర్, లద్దాఖ్‌లలో డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ఆర్థిక రాయితీలు ఇవ్వడానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది. కొత్త వ్యాపారులను డిజిటల్ పరిధిలోకి తీసుకురావడానికి ఈ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించనుంది. దేశంలో 2021లో కోవిడ్ వ్యాప్తి వేళ యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్ చార్జీని తొలగించిన కేంద్ర ప్రభుత్వం.. దీనివల్ల బ్యాంకులు, పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లకు అయ్యే వ్యయాన్ని బడ్జెట్ కేటాయింపుల ద్వారా భరిస్తూ వచ్చింది. అయితే యూపీఏ సేవల నిర్వహణ, సర్వర్ల బ్యాండ్‌విడ్త్ వ్యయం, బ్యాంకుల సాంకేతిక సహాయ ఖర్చులు ఏటా సుమారు రూ. 20 వేల కోట్లను చేరడంతో తమ బడ్జెట్ కేటాయింపుల ద్వారానే ఆ మొత్తాన్ని భర్తీ చేయలేమని కేంద్రం చెబుతోంది. యూపీఐని నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకారం ఆగస్టులో దేశవ్యాప్తంగా రూ.29,82,356 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి. అలాగే లావాదేవీల సంఖ్య 2,451 కోట్లు దాటింది. లావాదేవీల వాటా ఇలా.. – ఆగస్టులో నమోదైన యూపీఐ లావాదేవీల సంఖ్యలో 63 శాతం వాటా వ్యాపారులకు చేసిన చెల్లింపులదే. – వ్యాపారులకు చేసిన మొత్తం చెల్లింపుల్లో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీల వాటా 67 శాతం. అంటే వ్యాపార రంగంలో జరిగే మెజారిటీ నగదు చలామణి పెద్ద మొత్తాల్లోనే సాగుతోంది. – సంఖ్య పరంగా చూస్తే రూ.2,000 పైబడిన లావాదేవీలు కేవలం 4 శాతం మాత్రమే. కానీ విలువ పరంగా అవి 67 శాతం ఉండటం వల్ల ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లు, బట్టలు, బంగారు ఆభరణాలు, విమాన/రైలు టికెట్లు, హోటల్ బిల్లుల వంటి పెద్ద చెల్లింపులపై ఈ అదనపు భారం పడనుంది. – వ్యాపారులు ఈ ఎండీఆర్ భారాన్ని తాము భరించలేక వినియోగదారులపైకి నెట్టేసే ప్రమాదం ఉంది. దీనివల్ల పెద్ద కొనుగోళ్లు చేసేటప్పుడు ప్రజలు యూపీఐని పక్కనపెట్టి మళ్లీ నగదు వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. – నెలవారీ వ్యాపార టర్నోవర్ రూ.1 లక్ష లోపు ఉన్న చిన్న చిన్న దుకాణదారులకు ఈ రుసుము నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు. – ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు పంపే వ్యక్తిగత నగదు బదిలీల విషయానికి వస్తే మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో దీని వాటా అత్యధికంగా 70 శాతం. – పర్సన్–టు–పర్సన్ విభాగంలో జరిగిన మొత్తం లావాదేవీల విలువలో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన బదిలీల వాటా ఏకంగా 85 శాతం నమోదైంది. – సంఖ్య పరంగా ఇవి 18 శాతం మాత్రమే అయినప్పటికీ, విలువలో 85 శాతం కలిగి ఉండటం గమనార్హం. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్): మనం ఏదైనా దుకాణానికి వెళ్లి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ పద్ధతిలో డబ్బులు చెల్లించినప్పుడు.. ఆ సేవను అందించినందుకు బ్యాంకులు, చెల్లింపు కంపెనీలు వ్యాపారి నుండి వసూలు చేసే రుసుము. – డిజిటల్ చెల్లింపు చేసినప్పుడు ఆ డబ్బు వినియోగదారుడి ఖాతా నుండి వ్యాపారి ఖాతాకు సురక్షితంగా చేరాలి. దీనికోసం పని చేసే బ్యాంకులు, కార్డు కంపెనీలు, యాప్‌లు తమ సాఫ్ట్వేర్, భద్రతను నిర్వహించడానికి ఈ ఛార్జీని తీసుకుంటాయి. – నిబంధనల ప్రకారం ఈ భారాన్ని వ్యాపారస్తులే భరించాలి. వినియోగదారులు కాదు. ఉదాహరణకు ఈ రుసుము 1 శాతం ఉందనుకుందాం. దుకాణంలో మీరు రూ.3,000 చెల్లిస్తే వ్యాపారికి రూ.2,700 మాత్రమే అందుతాయి. ఛార్జీల కింద రూ.30 కట్ అవుతుంది. – వ్యాపారస్తులు తమ లాభాలు తగ్గిపోకుండా ఉండటానికి ఈ భారాన్ని వస్తువుల ధరలు పెంచి చివరికి వినియోగదారుల పైకే నెట్టేసే ప్రమాదం ఉంది. -
యూపీఐ చార్జీలు.. ఏటా 84 వేల కోట్ల ఆదాయం!
భారత్‌లో ఏడాదికి యూపీఐ (UPI) మొత్తం లావాదేవీల విలువ సుమారు రూ. 314 లక్షల కోట్లు అని అంచనా. తాజాగా 2వేల రూపాయల కంటే ఎక్కువ విలువైన పీ2ఎమ్ (పర్సన్ టూ మర్చంట్) లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ (మర్చంట్ రేట్ డిస్కౌంట్) వర్తిస్తుంది. అయితే భారత్‌లో ఏడాదికి రూ. 2 వేల కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీల మొత్తం విలువ రూ. 210 లక్షల కోట్ల పైమాటే. ఈ లెక్కన రూ. 210 లక్షల కోట్లు x 0.4 శాతంతో లెక్కిస్తే ఏడాదికి రూ. 84వేల కోట్లు. అందుకే కేంద్ర ప్రభుత్వం యూపీఐ ద్వారా 2వేల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపే పీ2ఎమ్‌పై 0.4 శాతం విధించడం ద్వారా వచ్చే 84 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం కిందే లెక్క అని చెప్పవచ్చు.ఇక యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటును (MDR) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఖరారు చేసింది. రూ.2వేలు పైబడి వ్యాపారులకు వ్యక్తులు చేసే చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అక్టోబర్ 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి రానున్నాయని వెల్లడించింది.సాధారణ వినియోగదారులు ఎప్పటిలాగే యూపీఐ లావాదేవీలను ఉచితంగానే కొనసాగించవచ్చని పేర్కొంది. అలాగే, వ్యక్తుల మధ్య జరిగే నగదు లావాదేవీలు (P2P), రూ. 2వేలలోపు వ్యాపార చెల్లింపులు (P2M) ఎండీఆర్ పరిధిలోకి రావని స్పష్టంచేసింది.ఇదీ చదవండి: శాంసన్ మెరుపులు.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం -
'80's ట్రెండ్'అని ఫోటో పోస్ట్ చేసి.. కటకటాల్లోకి..
వెంకి పెళ్లి సుబ్బిసావుకొచ్చింది అనే సామెత మనం తరచుగా వాడుతుంటాం... సరిగ్గా అటువంటి సన్నివేశమే ఇక్కడ సరిగ్గా సరిపోయింది. ఇటీవల 80'80's ట్రెండ్ పేరుతో సోషల్ మీడియాలో పిక్స్ పెట్టడం పెద్దఎత్తున వైరల్‌గా మారాయి. ఆ ట్రెండ్‌ని ఫాలో అవుతూ ఒక మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా.. అదే తనను కటకటాల్లో పెట్టేలా చేసింది. దీంతో తలపట్టుకోవడం ఆ మహిళ వంతైంది.వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో 45 ఏళ్ల క్రితం ఓ స్వర్ణకారుడి దుకాణంలో ఒక మహిళ హారం దొంగలించి పరారైంది, అనంతరం తన పేరు మార్చుకుని వేరే ప్రాంతంలో జీవనం సాగిస్తోంది. అయితే ఇదిలా ఉండగా ఇటీవల వైరల్‌గా మారిన 80's ట్రెండ్‌లో పాల్గొని తన ఫోటోను కూడా 80's ట్రెండ్‌కు అనుగుణంగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది చూసిన స్వర్ణకారుడు తన దుకాణంలో దొంగతనం చేసింది ఈమె అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో ఈ కేసును రీఓపెన్ చేసిన పోలీసులు తనను పట్టుకొని విచారించగా తానే దొంగతనం చేసినట్టు ఒప్పుకుంది. దీంతో తనను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వెంకి పెళ్లి సుబ్బి సావుకు రావడం అంటే ఇదేనేమో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. -
కేంద్ర మంత్రి కాన్వాయ్‌నే ఓవర్టేక్ చేసి దూసుకెళ్లి..
పుణేలో కేంద్ర మంత్రి, పుణే ఎంపీ మురళీధర్ మొహోల్ భద్రతా కాన్వాయ్‌ను ఓవర్టేక్ చేశాడు ఓ బైకర్. దీంతో ఆ 32 ఏళ్ల ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 13న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇవాళ రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో మొహోల్ కాన్వాయ్ శివాజీనగర్‌లోని సంచైతి చౌక్ మీదుగా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మొహోల్ భద్రతా విధుల్లో ఉన్న పోలీసు అధికారి ఈశ్వర్ లక్ష్మణ్ భికులే ఫిర్యాదు మేరకు నానా పేఠ్కు చెందిన శుభం విజయ్ వణిత్పై శివాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వణిత్ అధిక వేగంతో ద్విచక్ర వాహనం నడుపుతూ నిర్లక్ష్యంగా కాన్వాయ్‌ను దాటాడని పోలీసులు ఆరోపించారు. ఈ చర్యతో ఇతర వాహనదారులు, పాదచారులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొహోల్ ప్రత్యేక విధుల అధికారి వినోద్ సతవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బైకర్ మద్యం మత్తులో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మొహోల్కు కల్పించిన వై ప్లస్ భద్రతా వలయాన్ని బైకర్ పదేపదే ఉల్లంఘించాడని సతవ్ ఆరోపించారు. “ఇది తీవ్రమైన భద్రతా ఉల్లంఘన” అని ఆయన అన్నారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
చిన్నారిని ఎత్తుకున్న వ్యక్తిపై ఒక్కసారిగా పడిన పాము
ముంబై: మహారాష్ట్రలోని అంబోలి జలపాతం వద్ద ఓ వ్యక్తి చిన్నారిని ఎత్తుకుని వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ పాము అతడిపై పడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.జలపాతం వద్ద సందర్శకులు తిరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారిని చేతుల్లో పట్టుకున్న వ్యక్తి ముందుకు వెళ్తుండగా పాము అకస్మాత్తుగా పై నుంచి అతడి మీదకు పడింది. ఊహించని పరిణామంతో అక్కడున్నవారు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.పాము తనపై పడిన వెంటనే ఆ వ్యక్తి తీవ్రంగా స్పందించినట్లు వైరల్ దృశ్యాల్లో కనిపిస్తుంది. అతడి చేతుల్లో చిన్నారి ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అయితే పాము కిందపడిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది.వర్షాకాలంలో జలపాతాలు, అడవులను సందర్శించే సమయంలో పాములు, ఇతర వన్యప్రాణులు కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రకృతి ప్రాంతాల్లో రాళ్లు, చెట్లు, పొదల సమీపంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు.అంబోలి జలపాతం వద్ద జరిగిన ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలపై స్పష్టత లేదు. అయితే చిన్నారితో ఉన్న సమయంలో పాము అకస్మాత్తుగా పడటం సందర్శకుల్లో భద్రతపై మరోసారి ఆందోళన కలిగించింది.జలపాతంలో పైనుంచి పామూ పడింది.. వైరల్ వీడియోమహారాష్ట్రలోని అంబోలి జలపాతం వద్ద కుటుంబంతో సరదాగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా పైనుంచి భారీ పాము పడిందిచిన్నారిని ఎత్తుకుని ఉన్న వ్యక్తి పక్కనే పాము పడటంతో అక్కడున్నవారు హడలిపోయి కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఇది కోబ్రా అనిపిస్తుంది pic.twitter.com/cUXm49jM7A— basker reddy (@chicagobachi) September 15, 2026 -
సీఎం విజయ్‌పై అనుచిత కామెంట్స్.. ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలపై కేసు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, న్యాయశాఖ మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో డీఎంకే ఎంపీ ఎ.రాజా, ఇద్దరు ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సెప్టెంబర్ 12న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన డీఎంకే నిరసనల్లో చేసిన ప్రసంగాలకు సంబంధించి చెన్నై, కళ్లకురిచ్చి పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.ఎ.రాజా, హార్బర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పీకే శేఖర్‌బాబు, రిషివందియం ఎమ్మెల్యే వసంతం కే కార్తికేయన్‌పై వేర్వేరు కేసులు నమోదయ్యాయి. అసెంబ్లీలో విజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ డీఎంకే ఈ ఆందోళనలు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం కింద అరెస్టు చేసిన అంశంపై విజయ్ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారు.ఎ.రాజాపై పోలీసులు 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసభ్య పదజాలం ఉపయోగించడం, పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం, ప్రజా శాంతికి విఘాతం కలిగించేలా వ్యవహరించడం వంటి ఆరోపణలు ఇందులో ఉన్నాయి. మతం, జాతి లేదా భాష ఆధారంగా వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నానికి సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. నిరసన సందర్భంగా న్యాయశాఖ మంత్రి నిర్మల్ కుమార్ తండ్రి గురించి రాజా ప్రశ్నలు లేవనెత్తినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి కరుణానిధి పరోక్షంగా చేసిన మందలింపు నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.ఇదే నిరసనలో ముఖ్యమంత్రి విజయ్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పీకే శేఖర్‌బాబుపై నార్త్ బీచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కళ్లకురిచ్చిలో జరిగిన నిరసనలో ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో వసంతం కే. కార్తికేయన్‌పై 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులతో తమిళనాడులో అధికార డీఎంకే, ముఖ్యమంత్రి విజయ్ మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. -
‘వాస్తవాన్ని చూపండి’ అంటూ యువతకు ‘సీజేపీ’ సౌరభ్ కీలక పిలుపు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పాఠశాలల పరిస్థితులను పరిశీలించేందుకు కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన సౌరభ్ దాస్ నేతృత్వంలో ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం ప్రారంభమైంది. పాఠశాలల్లో పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో చదువుతున్నారో పరిశీలించి, వాటిని నమోదు చేయనున్నట్లు దాస్ తెలిపారు.మంగళవారం నోయిడాకు వచ్చిన దాస్ మాట్లాడుతూ.. నగరంలోని కొన్ని పాఠశాలలను బృందం పరిశీలించనుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో నోయిడాను మెరుగైన జిల్లాల్లో ఒకటిగా పరిగణిస్తారని, అక్కడి పాఠశాలల పరిస్థితి కూడా అందుకు తగ్గట్టుగానే ఉందో లేదో తమ పరిశీలనలో తేలుతుందని అన్నారు. “ఈరోజు మేం నోయిడాకు వచ్చాం. ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా కొన్ని పాఠశాలలను తనిఖీ చేయబోతున్నాం. పిల్లలు చదువుతున్న పరిస్థితులను చూస్తాం. పరిస్థితి ఏదైనా ఉంటే దాన్ని మీకు చూపిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలోని యువత వారి వారి ప్రాంతాల్లోని పాఠశాలలను కూడా పరిశీలించాలని దాస్ కోరారు. పాఠశాలల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, పిల్లలకు ఎలాంటి విద్య అందుతోంది? అన్న విషయాలను స్వయంగా పరిశీలించి నమోదు చేయాలని పిలుపునిచ్చారు.సీజేపీ ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమాన్ని ఆగస్టులో దేశవ్యాప్తంగా సామాజిక తనిఖీ కార్యక్రమంగా ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రాథమిక సదుపాయాలను పరిశీలించడమే దీని ఉద్దేశమని పార్టీ తెలిపింది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొలి తనిఖీ జరిగింది. అక్కడ తాగునీరు, బెంచీలు, మరుగుదొడ్ల పరిశుభ్రత, పగిలిన కిటికీలు, నీటి సరఫరా వంటి సమస్యలను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రస్తావించారు.తదుపరి తనిఖీల్లో తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు, మధ్యాహ్న భోజనం తయారీకి ఉపయోగించే సామగ్రి వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. నోయిడా తనిఖీల ఫలితాలు, ఇతర ప్రాంతాల్లో యువత చేపట్టే పరిశీలనలు ఈ కార్యక్రమానికి తదుపరి దిశను నిర్ణయించనున్నాయి.This is a primary school in Noida, a city supposed to be one of the most prosperous in entire UP.Sincere appeal to our UP politicians—stop the Hindu-Muslim politics. FIX OUR GOVT SCHOOLS!@Cockroachisback pic.twitter.com/f4vBwr5aqC— Saurav Das (@SauravDassss) September 15, 2026🚨After just ONE school inspection, UP government ordered all government schools in Gautam Buddha Nagar to be CLOSED today. Watch this video.As you can see, classes were going on. Children were inside. Teachers were very kind with us. However, the Noida administration called… pic.twitter.com/gsXc3OO7M5— Saurav Das (@SauravDassss) September 15, 2026 -
12 ఏళ్ల క్రితం మనవరాల్ని చంపి జైలుకు : పెరోల్‌పై వచ్చి భార్య హత్య
ఉత్తర ప్రదేశ్‌లో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సత్నా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ కల్లాన్ రైక్వార్ (50) ప్యారోల్పై ఇంటికి వచ్చి తన భార్యను త్రిశూలంతో పొడిచి హత్య చేశాడు. యూపీలోని మహోబా జిల్లా కుల్పహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 10 నెలల పసికందు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కల్లాన్ ఇటీవల పెరోల్‌పై ఇంటికి వచ్చాడు. బుధవారం తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఇంత ఘోరానికి ఎందుకు పాల్పడ్డాడు.అనుమానమేనా?తాను తినే ఆహారంలో తన భార్య చంప ఏదో విషం కలిపిందని కల్లాన్ అనుమానించాడు. ఈ విషయంలో ఆదివారం రాత్రి వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోదిక్తుడైన కల్లాన్ ఇంట్లోని త్రిశూలంతో భార్య చంప (45) తలపై, మెడపై తీవ్రంగా పొడిచి చంపేశాడు. రాత్రంతా అక్కడే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం చుట్టుపక్కల ఉన్న తన బంధువులకు ఈ విషయం చెప్పాడు. బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని కల్లాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని మహోబా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) శశాంక్ సింగ్ చెప్పారు. ఇదీ చదవండి: ఫ్రిజ్ పేలి ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనం 12 ఏళ్ల క్రితం మనవరాలి హత్య కుల్పహార్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అవధేష్ కుమార్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. 2014లో మధ్యప్రదేశ్‌లోని నౌగావ్‌లో తన కూతురి 10 నెలల చిన్నారి తలను రాయితో పగులగొట్టి హత్య చేసిన కేసులో కల్లాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2017లో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. ఇటీవల 14 రోజుల ప్యారోల్పై ఇంటికి వచ్చి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కల్లాన్ కుమారుడు మున్నా దిల్లీలో కూలీగా పనిచేస్తుండగా, మరో కుమారుడు నాలుగేళ్ల క్రితం మరణించాడు. ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలు -
ఫ్రిజ్ పేలి ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనం
బెంగళూరు: కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నగరమంతా గణేష్ చతుర్థి వేడుకలను జరుపు కుంటున్న వేళ బెళగావిలోని చవట్ గల్లీలోని ఒక ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలడంతో సంభవించిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మంగళవారం పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు.సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పేలుడు శబ్దాన్ని తొలుత అంతా దాన్ని బాణాసంచా పేలుడు అని భావించారు. రిఫ్రిజిరేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం చావట్ గల్లీలోని ఒక నివాసంలో మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయని ప్రాథమిక విచారణలో తేలింది. మంటలు వేగంగా ఇళ్లంతా వ్యాపించడంతో, అందులో ఉన్నవారు బయటకు రాలేక ఊపిరాడక, నలుగురు సజీవదహనమైపోయారు. ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇల్లు తీవ్రంగా దెబ్బతిన్నది. చనిపోయిన వారిని గజానన్ ధమోనే (65), రోషన్ ధమోనే (21), శారద ధమోనే (45), భారతి ధమోనే (50) లుగా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన ప్రియ ధమోనే (28), గంగ ధమోనే (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.షార్ట్ సర్క్యూట్ లేదా మరేదైనా అగ్ని ప్రమాదం వల్ల పేలుడు సంభవించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నమని. క పోలీసు అధికారి తెలిపారు.గణేష్ విగ్రహానికి విద్యుత్ దీపాలను కూడా అమర్చారు, కాబట్టి షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నాన్నారు. తాము కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇంటి యజమాని గజానన్ వడ్రంగిగా పనిచేసేవారు, మిగిలిన వారు ఇంటి పనులు లేదా వాణిజ్య సంస్థలలో పనిచేసేవారు.ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్ఇదీ చదవండి: రూ. 12,300 కోట్ల సీఎం విజయ్ డీల్ : 9 వేల ఉద్యోగాలు -
రూ. 2 వేలు దాటితే వడ్డింపు, కస్టమర్లపైనే భారం : రాహుల్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం యూపీఐ (UPI) విధానాలపై తీసుకున్న తాజా నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ అమెరికన్ ఒత్తిడికి తలొగ్గి, దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని రాహుల్ ఆరోపించారు. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైనమర్చంట్ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జ్ ఉండవచ్చు అంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాత్రికి రాత్రి జారీ చేసిన జారీ చేసిన సరికొత్త గెజిట్ నోటిఫికేషన్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది.రాహుల్ గాంధీ మండిపాటుయూపీఐపై ఛార్జీలు విధించేందుకు మోదీ ప్రభుత్వం రహస్యంగా గేట్లు తెరిచిందని మండిపడ్డారు. ఇప్పుడు రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (Merchant Discount Rate - MDR) విధింపుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇవి కేవలం 5శాతం వాల్యూమ్ మాత్రమే అయినప్పటికీ, మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో దాదాపు 65శాతంగా ఉంటాయని రాహుల్ ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు. అంతిమంది కస్టమర్లపై భారం పడుతుందని ఆయన విమర్శించారు.కస్టమర్లకు ఎలాంటి ఫీజులు ఉండవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దుకాణదారులపై విధించే ఫీజులు చివరకు ఎక్కడి నుంచి వస్తాయి? నేరుగా సామాన్యుడి జేబు నుంచే వస్తువుల ధరల రూపంలో వసూలు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా జీరో-ఎండీఆర్ (Zero-MDR) విధానాన్ని అమెరికా పేమెంట్ కంపెనీలు ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తున్నాయని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం అదే దిశగా విధానాన్ని మార్చేందుకు మార్గం సుగమం చేసిందని రాహుల్ ఆరోపించారు.కాగా రూ. 2,000 వరకు చేసే యూపీఐ లావాదేవీలు లేదా రుపే డెబిట్ కార్డ్ (RuPay) చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు విధించ కూడదని బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లను ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. అయితే, రూ. 2,000 కంటే ఎక్కువ లావాదేవీలపై వర్తకులకు ఛార్జీలు వర్తిస్తాయా లేదా అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటివరకు మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ఆమోదం పొందిన పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007 సవరణ ప్రకారం ఈ మార్పులు వచ్చాయి.ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలుమల్లికార్జున ఖర్గే స్పందనఈ నిర్ణయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిందిపోయి, వారి జేబులు గుల్ల చేసేందుకు ప్రభుత్వం రోజూ కొత్త మార్గాలను వెతుకుతోందని విమర్శించారు. "యూపీఐపై ఎలాంటి ఫీజులు లేవు" అన్న నిబంధనను "రూ. 2,000 వరకు మాత్రమే" అని మార్చేశారని ఎద్దేవా చేశారు. విపరీతమైన ద్రవ్యోల్బణం, టోకు ద్రవ్యోల్బణం దాదాపు 10% వద్ద ఉన్న తరుణంలో, బీజేపీ ప్రభుత్వం ప్రజలపై 'డిజిటల్ పేమెంట్స్ ట్యాక్స్' భారం మోపేందుకు ప్లాన్ చేసిందని ఖర్గే ఆరోపించారు.ఇదీ చదవండి: రూ. 12,300 కోట్ల సీఎం విజయ్ డీల్ : 9 వేల ఉద్యోగాలుప్రభుత్వం వాదన ఇలా ఉందిలావాదేవీల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ, మోసాల నిరోధక చర్యలు, మౌలిక వసతుల నిరంతర అభివృద్ధి కోసం సిస్టమ్‌కు నిధులు అవసరమని ప్రభుత్వం సమర్థించుకుంది. మార్కెట్ విస్తరణ, స్వయం సమృద్ధి, మెరుగైన పోటీతత్వం కోసం ఒక సమతుల్య విధానం అవసరమని, కేవలం సబ్సిడీలపై ఆధారపడటం సాధ్యం కాదని పేర్కొంది.ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్ -
రూ. 12,300 కోట్ల సీఎం విజయ్ డీల్ : 9 వేల ఉద్యోగాలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనలో భాగంగా నాలుగు కీలక పెట్టుబడి ఒప్పందాలపై సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం, ఈ ఒప్పందాల విలువ దాదాపు రూ. 12,300 కోట్లు కాగా, దీనివల్ల సుమారు 9,000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అంచనా. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే రూ. 1 లక్ష కోట్లకు పైగా విలువైన పెట్టుబడి అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా చెన్నైలో 'గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్' (GCC) ఏర్పాటు కోసం ఎర్నస్ట్ & యంగ్ (Ernst & Young) ద్వారా ఒక బ్రిటిష్ కంపెనీతో రూ. 1,000 కోట్ల ఒప్పందంపై కూడా విజయ్ సంతకం చేశారు. వీటిలో అతిపెద్ద ఒప్పందం 'సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్'తో జరిగింది. ఈ ఒప్పందంగా రూ. 11,000 కోట్ల పెట్టుబడితో కుదిరింది. దీని ద్వారా డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, అసెంబ్లీ రంగాల్లో దాదాపు 7వేల ఉద్యోగాలు వస్తాయి.గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (చెన్నై): బ్రిటన్ కంపెనీతో ఎర్నెస్ట్ అండ్ యంగ్ (Ernst & Young) ద్వారా రూ. 1,000 కోట్ల ఒప్పందం కుదిరింది. దీని ద్వారా 2,000 ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభించనున్నాయి సిగ్మా టెక్నాలజీ గ్రూప్: స్వీడన్‌కు చెందిన ఈ సంస్థ చెన్నై, తిరుచిరాపల్లిలో తమ కేంద్రాలను విస్తరించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల 600 ఉద్యోగాలు రానున్నాయి. విల్సన్ పవర్ సొల్యూషన్స్: తిరువల్లూరు జిల్లాలో రూ. 300 కోట్ల పెట్టుబడితో మరో ఒప్పందం కుదిరింది. దీని ద్వారా దాదాపు 400 ఉద్యోగాలు లభిస్తాయి.ఫోకస్ రంగాలు: అధునాతన తయారీ (అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్), ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, మరియు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. యూకే పర్యటనలో మోటార్ స్పోర్ట్స్ మరో ముఖ్యమైన అంశం తమిళనాడులో ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ నగరాన్ని అభివృద్ధి చేయడం, రేసింగ్‌కు సంబంధించిన తయారీ మరియు అనుబంధ పరిశ్రమలలో అవకాశాలను సృష్టించడం వంటి ప్రభుత్వ ప్రణాళికలతో కూడా ఈ పర్యటనకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌ను సందర్శించి, ప్రముఖ నటుడు, రేసర్ అజిత్ కుమార్ పాల్గొన్న రేసును జెండా ఊపి ప్రారంభించారు. తమిళనాడులో ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ప్రణాళికలో ఇది భాగం. ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్ప్రతిపక్షం విమర్శలు- టీవీకే స్పందనఅయితే, ఈ పెట్టుబడుల ప్రోత్సాహం పారదర్శకత లోపించిందని ప్రతిపక్షాల నుంచి విమర్శలను కూడా రేకెత్తించింది. విజయ్ పర్యటన వివరాలు, సమావేశాలపై పారదర్శకత కొరవడిందంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో టీవీకే స్పందించింది . దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్న నేపథ్యంలో (పోటీ ఫెడరలిజం), ఎంఓయూలు కుదిరిన వెంటనే వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని తెలిపింది.సెప్టెంబర్ 16 వరకు యూకేలోనే ఉండనున్న విజయ్ మరిన్ని ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. -
వినాయకుని దర్శనానికి 15 గంటలు
ముంబై: గణపతి ఉత్సవాల్లో భాగంగా ముంబైలోని ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా గణేశోత్సవం 93వ సంవత్సరం వేడుకలు సెప్టెంబరు 14న ప్రారంభమయ్యాయి. 12 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల తొలిరోజే లక్షలాది మంది భక్తులు లాల్‌బాగ్‌లోని గణేశ్ మండపానికి తరలివచ్చారు. అర్ధరాత్రి కూడా భక్తుల రాక కొనసాగింది. భారీగా క్యూలు ఏర్పడ్డాయి. ముంబైతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూశారు.భారీ రద్దీ కారణంగా క్యూలలో తోపులాటలు చోటుచేసుకున్నట్లు పలువురు సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. కొందరు భక్తులు 15-16 గంటలపాటు క్యూలో వేచి ఉన్నట్లు పోస్టులు పెట్టారు. అదే సమయంలో వీఐపీలకు సులభంగా దర్శనం లభిస్తుండటంపై చర్చ మొదలైంది. సాధారణ భక్తులకు కూడా గౌరవప్రదమైన, దర్శన సౌకర్యం కల్పించాలని పలువురు కోరారు. తొలిరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ లాల్బాగ్చా రాజాను దర్శించుకుని పూజలు చేశారు. భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ సభ్యులతో కలిసి మండపానికి వచ్చారు.సాధారణ దర్శనం ఉచితమేనని, భక్తుల కోసం అధికారికంగా ఎలాంటి చెల్లింపు పాస్‌లు లేవని నిర్వాహకులు స్పష్టం చేశారు. రద్దీ నియంత్రణ, భద్రత కోసం మండపం పరిసరాల్లో పోలీసులను మోహరించారు. ఏఐ ఆధారిత కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. మండపానికి రాలేని భక్తుల కోసం 24 గంటల ఆన్లైన్ ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంది.భారీ రద్దీ నేపథ్యంలో ముంబై పోలీసులు లాల్బాగ్, కాలాచౌకీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేస్తున్నారు. సెప్టెంబరు 14 నుంచి 25 వరకు పరిస్థితిని బట్టి అవసరమైన చోట 24 గంటలపాటు రహదారుల మూసివేత కొనసాగనుంది. లాల్బాగ్చా రాజా ఉత్సవాలు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నప్పటికీ, భారీ రద్దీని సురక్షితంగా నిర్వహించడం నిర్వాహకులు, అధికారులకు సవాలుగా మారింది.ఇదీ చదవండి: ఆకర్షిస్తున్న ‘గోల్డెన్ మోదక్’.. కిలో ఎంతంటే.. -
బార్బర్ ఉద్యోగాలకూ AI ఎసరు.. రోబోల చేతికి కటింగ్, షేవింగ్
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయంకా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,ఆటోమేషన్ టెక్నాలజీ భవిష్యత్తులో కేవలం ఫ్యాక్టరీ ఉద్యోగాలనే కాకుండా, నైపుణ్యంపై ఆధారపడే సంప్రదాయ వృత్తులను కూడా ఎలా ప్రభావితం చేయవచ్చో ఈ ఉదంతం తెలియజేస్తోంది. ఓ క్షురకుడు (బార్బర్) తన పనిని చేస్తుండగా, అతడి కదలికలను రికార్డ్ చేసి విశ్లేషించేలా ఒక హైటెక్ సెటప్‌ను అమర్చినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. సదరు యువకుడు క్షవరం చేస్తున్నప్పుడు అతని చేతుల కదలికలు, టైమింగ్, కచ్చితత్వాన్ని ఏఐకు శిక్షణ ఇచ్చే డేటాగా సేకరిస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియోను షేర్ చేస్తూ..దేశంలో ఏఐ శిక్షణ జరుగుతోంది! రాబోయే రోజుల్లో క్షురకుల ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడవచ్చు’అని హర్ష్ గోయంకా పేర్కొన్నారు. ఆ వీడియో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.క్షవరం చేసే సమయంలో రోబోట్లకు ముఖంపై బ్లేడ్లు అప్పగించడం ప్రమాదకరమని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. స్థానిక క్షురకుల అనుభవం, వారి మనుషుల మధ్య ఉండే సంభాషణలు, హస్తకళ నైపుణ్యాన్ని ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, టెక్నాలజీ వేగంగా మారుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో మానవ ప్రమేయం లేని సేవలు పెరిగే అవకాశం ఉందని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోందని నిపుణులు అంటున్నారు.గతంలో మెహందీ పెట్టే యంత్రాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసి మరికొన్ని ఉద్యోగాలు మాయం అంటూ గోయంకా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ షేవింగ్ ఏఐ వీడియో టెక్నాలజీ భవిష్యత్తుపై మరోసారి పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది. AI training going on India ! Even barbers job may soon be at risk 🙈 pic.twitter.com/99CAwj5m2h— Harsh Goenka (@hvgoenka) September 14, 2026 -
ఆకర్షిస్తున్న ‘గోల్డెన్ మోదక్’.. కిలో ఎంతంటే..
నాసిక్: వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న వేళ.. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ స్వీట్ షాప్ ప్రత్యేకమైన మోదక్‌ను తయారు చేసి, అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. విద్యా వికాస్ సర్కిల్లోని సాగర్ స్వీట్స్ 24 క్యారెట్ల తినదగిన బంగారు పూతతో ‘గోల్డెన్ మోదక్’ను తయారు చేసింది. కిలో ధరను ఏకంగా రూ.27,000గా నిర్ణయించింది. దీంతో ఈ మోదక్ ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. వినాయక చవితిని పురస్కరించుకుని సాగర్ స్వీట్స్ 25కు పైగా రకాల మోదక్‌లను అందుబాటులోకి తెచ్చింది. సంప్రదాయ రకాలతో పాటు ప్రీమియం స్వీట్లు ఇందులో ఉన్నాయి. అయితే 24 క్యారెట్ల బంగారు పూతతో రూపొందించిన మోదక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.వినాయక చవితి వేడుకల్లో మోదక్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది గణేశుడికి ఇష్టమైన పదార్థంగా భావిస్తారు. మహారాష్ట్రతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భక్తులు కొబ్బరి కోరు తదితర పదార్థాలతో నింపిన మోదక్‌లు, చాక్లెట్ మోదక్‌లు తదితర రకాలను తయారు చేసి గణేశుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. సంప్రదాయ మోదక్‌లు వేడుకల్లో ప్రధానంగా ఉన్నప్పటికీ.. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా స్వీట్ షాపులు కొత్త రకాల మోదక్‌లను పరిచయం చేస్తున్నాయి.వినాయక చవితి వేడుకలు సెప్టెంబర్ 14న ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోనూ భక్తులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇళ్లలో, మండపాల్లో మట్టి గణేశ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రతిరోజూ ప్రార్థనలు, నైవేద్యాలు, హారతులు నిర్వహిస్తారు. చివరగా గణేశ నిమజ్జనంతో వేడుకలు ముగుస్తాయి.ఇదీ చదవండి: గణేశ్ మండపంలో దారుణ హత్య -
సుప్రీంకోర్టులో హైడ్రాకు బిగ్ షాక్!
సాక్షి,న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో హైడ్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కంటోన్మెంట్‌లోని 40 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.కంటోన్మెంట్‌లోని వివాదాస్పద 40 ఎకరాల భూమి శాంత శ్రీరామ్ కన్ స్ట్రక్షన్దేనని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇది ప్రభుత్వ భూమి అంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్‌ను ఏకంగా 219 రోజుల ఆలస్యంగా దాఖలు చేశారనే కారణంతో జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం డిస్మిస్ చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించినట్లయింది.ఇదే భూమికి సంబంధించి హైకోర్టు తీర్పును ఉల్లంఘించి, శాంత శ్రీరామ్ కన్ స్ట్రక్షన్ సంస్థ భూమిలో హైడ్రా కూల్చివేతలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని, ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఈ ఉత్తర్వులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ డివిజన్ బెంచ్ ద్వారా స్టే పొందడం గమనార్హం. శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ తరపున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా, న్యాయవాదులు అల్లంకి రమేష్, మహమ్మద్ జీషన్, మమత ఆర్ వాదనలు వినిపించారు. ఇదీ చదవండి : కాప్రా చెరువులో నిమజ్జనాలు వద్దు -
గణేశ్ మండపంలో దారుణ హత్య
బిలాస్పూర్: గణేశ్ చతుర్థి వేడుకల సందడి మధ్య ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో దారుణ హత్య చోటుచేసుకుంది. గణేశ్ మండపం వద్ద సౌండ్ సిస్టమ్ విషయంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. సక్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంబల్పురి గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సౌండ్ సిస్టమ్ విషయమై అమన్ సూర్యవంశీ (23), ఆకాశ్ సూర్యవంశీ (22) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అది ఘర్షణకు దారి తీసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని రేషన్ దుకాణం ఎదుట గణేశ్ ఉత్సవాల కోసం మండపం ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం అక్కడ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు విషయంలో అమన్, ఆకాశ్ మధ్య మాటామాటా పెరిగింది. వివాదం ముదరడంతో అమన్ కత్తి తీసుకుని ఆకాశ్‌పై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆకాశ్ అక్కడికక్కడే కుప్పకూలాడు.సమాచారం అందుకున్న గ్రామస్థులు డయల్-112కు ఫోన్ చేశారు. తీవ్రంగా గాయపడిన ఆకాశ్‌ను సిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి, అతడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఘటన అనంతరం పోలీసులు అమన్ సూర్యవంశీని అదుపులోకి తీసుకున్నారు. వివాదానికి అసలు కారణం, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై అతడిని విచారిస్తున్నారు.ప్రాథమిక దర్యాప్తులో సౌండ్ సిస్టమ్ విషయంలోనే వివాదం తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం ప్రకారం.. నిందితుడు మత్తు పదార్థాలకు అలవాటుపడిన వ్యక్తిగా చెబుతున్నారు. గణేశ్ మండపం సమీపంలోనే హత్య జరగడంతో గ్రామంలో కలకలం రేగింది.ఇదీ చదవండి: గణపయ్య వేడుకల్లో మళ్లీ ‘గోవిందా’.. కనిపించని సునీత! -
గురుగ్రామ్ హిట్ అండ్ రన్ నిందితుడి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయిన ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని దౌసా నుంచి డ్రైవర్ కల్యాణ్ బైన్స్లాను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం అతడిపై హత్యాయత్నం అభియోగాన్ని నమోదు చేసినట్లు సమాచారం.హర్యానా గురుగ్రామ్‌కు చెందిన సియా.. స్పోర్ట్స్ బైక్ రైడర్. ఆమె ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్‌పై వెళ్తుండగా ఆదివారం గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. మరోవైపు కల్యాణ్ ఆ సమయంలో తెల్లటి సెడాన్ కారును నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కసారిగా కుడివైపునకు మళ్లిన కారు.. హెల్మెట్ ధరించి బైక్‌పై వెళ్తున్న సియాను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోగా.. బైక్ కొంతదూరం జారుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.సీసీటీవీ ఆధారంగా హత్యాయత్నం కేసుప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు ఫుటేజీల్లో కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించి దౌసాలో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేరానికి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.‘జాలిపడితే.. ఎందుకు ఆపలేదు?’ ప్రమాదం తర్వాత కల్యాణ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు ఆ యువతి మహిళో, పురుషుడో తెలియదని, ఘటనలో ఒకవైపు కథనం మాత్రమే బయటకు వచ్చిందని చెప్పాడు. ఆమెపై తనకు చాలా బాధ కలిగిందని పేర్కొన్నాడు. అదే సమయంలో అతని లాయర్.. కేవలం వ్యూస్, ఫాలోవర్స్ కోసమే ఆ మహిళా బైకర్ ఇలా చేస్తోందని ఆరోపించాడు. అయితే కల్యాణ్, అతని లాయర్ వ్యాఖ్యలపై సియా తీవ్రంగా స్పందించింది. “నాపై నిజంగా జాలిపడితే.. ప్రమాదం జరిగిన వెంటనే ఎందుకు ఆపలేదు? నేను గాయపడ్డానా లేదా అని చూడటం నీ బాధ్యత కాదా?” అని ప్రశ్నించింది. ప్రమాదం తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోయిన తీరును సీసీటీవీ ఫుటేజీలు స్పష్టంగా చూపిస్తున్నాయని పేర్కొంది. అలాగే అతని లాయర్ పైనా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.I don’t think Gurgaon is safe for girls anymore. The guy hit her intentionally as you can see in this clip, he asked her to Stop but she didn’t for her safety. So he hit and run her so badly. https://t.co/eyWEwXt3bn pic.twitter.com/bNdtEw5aSl— LUCK7773 (@Luck_7773) September 15, 2026‘చనిపోయి ఉండొచ్చు’ఈ ప్రమాదంలో తనకు మరింత తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఉందని సియా తెలిపింది. “నా ఎముకలు విరిగి ఉండొచ్చు. అక్కడికక్కడే చనిపోయి ఉండొచ్చు. అదృష్టవశాత్తూ అలా జరగలేదు” అని చెప్పింది. ప్రమాదం తర్వాత ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్లిపోవడం తనను మరింత బాధించిందని పేర్కొంది. సియా తండ్రి రోషన్ చౌహాన్ కూడా నిందితుడికి శిక్ష పడే వరకు తమ కుటుంబం వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.మళ్లీ బైక్ నడుపుతా..గురుగ్రామ్ హిట్ అండ్ రన్ ఘటనలో గాయపడిన బైకర్ సియా మళ్లీ బైక్ నడుపుతానని, అయితే రోడ్లపైకి ఒంటరిగా వెళ్లాలంటే భయంగా ఉంటుందని తెలిపింది. ఆ కారు నడుపుతున్న వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని.. అంటే ఉద్దేశపూర్వకంగా కారు దగ్గరకు వెళ్లడం, కట్ కొట్టడం నేను చేయలేదు. రోడ్లపై నా భద్రత నేను చూసుకుంటా. ప్రమాదానికి ముందు కారు తనను పదేపదే వెంబడిస్తూ బైక్‌కు దగ్గరగా వచ్చిందని, దీంతో భయపడి కారు నుంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించానని చెప్పింది. అనవసరంగా సమస్యను ఎందుకు సృష్టించుకుంటాను? అని సియా అంటోంది. అయినా కారు వేగంగా వచ్చి తన బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయిందని వివరించింది. ఈ ఘటన తనను తీవ్రంగా భయపెట్టిందని, ముఖ్యంగా మహిళా బైకర్లు రోడ్లపై ప్రయాణించాలంటే ఆందోళన కలిగించేలా ఉందని సియా పేర్కొంది.VIDEO | Delhi: "I am not interested in 'pinching' a car driver; my own safety on the road is paramount, why would I try to cause unnecessary trouble?" says Siya, woman biker who was hit by a car in Gurugram.(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/rUpg6NAzVs— Press Trust of India (@PTI_News) September 15, 2026ఇదీ చదవండి: జై హింద్ అనలేదని ట్రాన్స్ఫర్ చేశారా? -
నందిగ్రామ్ ఉప ఎన్నిక: ముఖ్యమంత్రి పీఏ తల్లికి టికెట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంగళవారం అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో సఖరవ్ సర్కార్, హసిరాణి రాథ్ పేర్లకు ఆమోదం లభించింది. రేజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సఖరవ్ సర్కార్ పోటీ చేయనున్నారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి రబియుల్ ఆలం చౌధురితో తలపడనున్నారు. మరోవైపు నందిగ్రామ్ నుంచి హసిరాణి రాథ్‌ను బీజేపీ బరిలోకి దించింది. అక్కడ టీఎంసీ అభ్యర్థి సంచిత ప్రధాన్‌తో పోటీ పడనున్నారు.హసిరాణి రాథ్ ఎంపికకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకునిగా పనిచేసిన చంద్రనాథ్ రాథ్‌కు ఆమె తల్లి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే చంద్రనాథ్ రాథ్ హత్యకు గురయ్యారు. నందిగ్రామ్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడంపై హసిరాణి రాథ్ మీడియాతో మాట్లాడారు. ‘నందిగ్రామ్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు పార్టీ కల్పించింది. ఇక్కడ పార్టీ మా వెంట ఉంది. నందిగ్రామ్ ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాం’ అని ఆమె పేర్కొన్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో నందిగ్రామ్ నుంచి హసిరాణి రాథ్ పేరు ఆసక్తికరంగా మారింది. రేజీనగర్‌లో సఖరవ్ సర్కార్, నందిగ్రామ్‌లో హసిరాణి రాథ్ బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ టీఎంసీ అభ్యర్థులతో బీజేపీ అభ్యర్థులు తలపడనున్నారు.ఇదీ చదవండి: హౌతీల మెరుపు దాడులతో సౌదీలో ఉద్రిక్తత -
బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్
దేశవ్యాప్తంగా బొజ్జ గణపయ్య వేడుకలు ఘనంగా జరుగుతుండగా, తమిళనాడులోని తిరునెల్వేలిలో ఒక బిర్యానీ దుకాణం యజమానికి భారీ షాక్ తగిలింది. గణేశుడిని అవమానించాడనే ఆరోపణల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమైంది అంటే.. తమిళనాడులోని పలు నగరాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలతో వాతావరణం సందడిగా ఉంది. ఇంత కోలాహలం మధ్య తిరునెల్వేలిలోని బిర్యానీ దుకాణం యజమాని 30 ఏళ్ల జయంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుకాణం బయటగణపతి బిర్యానీ తింటున్నట్లుగా ఒకబ్యానర్ ఏర్పాటు చేసిశాడు.ఇదే వివాదానికి దారి తీసింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడంటూ 42 ఏళ్ల సెల్వరాజ్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.తమిళనాడులో వాడవాడలా వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెన్నైలోని కపాలీశ్వరర్ ఆలయంలో ఉదయం గణపతి హోమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. నర్తన వినాయకర్ విగ్రహానికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, బంగారు కవచంతో అలంకరించారు.మధురై మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయంలో 7 అడుగుల ఎత్తైన ముక్కురుణి వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తుల కోసం భారీ ముక్కురుణి కొడకట్టై (కుడుములు) తయారు చేశారు. తిరుచిరాపల్లిలో రాక్‌ఫోర్ట్ పై ఉన్న ఈ ఆలయంలో 417 మెట్లు ఎక్కి వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 25 కేజీల కుడుము నైవేద్యంతో 14 రోజుల పెరువిళా వేడుకలు ప్రారంభమయ్యాయి.అంతేకాదు తిరువన్నామలైలో 51,000 రుద్రాక్షలతో తయారు చేసిన గణేశ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మధురైలో దర్భ గడ్డితో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కోయంబత్తూర్‌లో కోయంబత్తూర్‌లో రూ. 5 లక్షల విలువైన 500 రూపాయల నోట్లతో కూడిన దండతో విగ్రహాన్ని అలంకరించగా, చెన్నైలోని టి.నగర్లో కరెన్సీ నాణేలతో చేసిన విగ్రహం అందరినీ ఆకట్టుకుంది.కాగా తమిళనాడు వ్యాప్తంగా నిమజ్జన ఊరేగింపులు సెప్టెంబర్ 19, 20 తేదీల్లో జరగనున్నాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను వినియోగించనున్నారు. పర్యావరణ నిబంధనల దృష్ట్యా పట్టినాబాక్కం, నీలంకరై బీచ్లలోని సాంప్రదాయ నిమజ్జన ప్రాంతాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. -
విమర్శలకు భయపడొద్దు.. సోషల్ మీడియాకు తలొగ్గొద్దు: సీజేఐ
న్యాయవ్యవస్థపై సోషల్ మీడియానో, ఇతర బయటి శక్తుల ప్రభావం ఉండకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అలాగని విమర్శలకు న్యాయవ్యవస్థను అతీతంగా ఉంచడం కూడా సరికాదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన 6వ రామ్ జెఠ్మలానీ స్మారక ఉపన్యాసంలో ‘జస్టిస్ సీన్ టు బీ డన్: ట్రాన్స్పరెన్సీ అండ్ పబ్లిక్ ట్రస్ట్ యాజ్ పిల్లర్స్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.న్యాయవ్యవస్థ విమర్శలకు అతీతం కాదని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. కోర్టుల పనితీరుపై వచ్చే నిష్పాక్షిక, నిర్మాణాత్మక విమర్శలు న్యాయవ్యవస్థను మరింత మెరుగుపరచడానికి, జవాబుదారీతనాన్ని పెంచడానికి ఉపయోగపడతాయని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే కోర్టులు విమర్శలకు, పరిశీలనకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.కోర్టు తీర్పును మాత్రమే కాకుండా.. ఆ తీర్పు వెనుక ఉన్న కారణాలను కూడా ప్రజలు పరిశీలించే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. తీర్పు ప్రకటించి, దాని వెనుక ఉన్న కారణాలను మాత్రం ప్రజలకు తెలియకుండా ఉంచితే దాన్ని పూర్తి పారదర్శకతగా చెప్పలేమన్నారు.సోషల్ మీడియా ప్రభావం మాత్రం వద్దు..అయితే పారదర్శకత పేరుతో కోర్టు వ్యవహారాలను సోషల్ మీడియా ప్రభావానికి వదిలేయకూడదని సీజేఐ హెచ్చరించారు. న్యాయస్థానాలపై బాహ్య ఒత్తిళ్లు, ప్రజాభిప్రాయ ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు. మీడియా లేదంటే సోషల్ మీడియా తమ సొంత అభిప్రాయాలతో వ్యవహరించే పరిస్థితుల్లో.. న్యాయం జరగడమే కాకుండా అది నిష్పాక్షికంగా కనిపించేలా ఉండటం కూడా ముఖ్యమని వివరించారు.ప్రజల మెప్పు కాదు.. నమ్మకమే ముఖ్యంకోర్టులు ప్రజల మెప్పు పొందడం ద్వారా విశ్వాసాన్ని సంపాదించలేవని సీజేఐ అన్నారు. కేసులో ఓడిపోయిన వ్యక్తి సైతం.. తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును ఇచ్చిన ప్రక్రియ న్యాయంగా జరిగిందని నమ్మినప్పుడే న్యాయవ్యవస్థపై నిజమైన విశ్వాసం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజల ఆమోదం కంటే న్యాయ ప్రక్రియలోని నిష్పాక్షికతే కోర్టుల విశ్వసనీయతకు కీలకమన్నారు.న్యాయవేత్త టామ్ ఆర్. టైలర్ పరిశోధనలను ప్రస్తావిస్తూ.. కేసులో ఓడిపోయినా ప్రక్రియ న్యాయంగా జరిగిందని భావించే వ్యక్తులు న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు. గెలుపు కంటే న్యాయమైన ప్రక్రియే కోర్టులకు చట్టబద్ధత, విశ్వసనీయతను తెచ్చిపెడుతుందని అన్నారు.‘న్యాయం జరగాలి.. కనిపించాలి’‘జస్టిస్ ఈజ్ డన్’తో పాటు ‘జస్టిస్ సీన్ టు బీ డన్’ అనే సూత్రాన్ని కూడా సీజేఐ ప్రస్తావించారు. 1924లో ఇంగ్లండ్‌లోని ‘ఆర్ వర్సెస్ ససెక్స్ జస్టీసెస్’ కేసును ఉదాహరణగా తీసుకున్నారు. సంబంధిత కేసుతో అనుబంధం ఉన్న సంస్థలో కోర్టు క్లర్క్ పనిచేస్తున్న విషయం బయటపడటంతో.. అతను న్యాయమూర్తుల నిర్ణయాన్ని ప్రభావితం చేశాడనే ఆధారాలు లేకపోయినా, పక్షపాతానికి అవకాశం కనిపించిందనే కారణంతో తీర్పును రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. న్యాయం చేయడం మాత్రమే కాదు.. అది న్యాయంగా జరిగిందని ప్రజలకు కనిపించడమూ అంతే ముఖ్యమని అన్నారు.ప్రజా విశ్వాసమే న్యాయవ్యవస్థ బలంఅలెగ్జాండర్ హామిల్టన్ రాసిన ‘ది ఫెడరలిస్ట్ నంబర్ 78’ను కూడా సీజేఐ ప్రస్తావించారు. ప్రభుత్వంలోని ఇతర విభాగాలకు ఆర్థిక, బలప్రయోగ అధికారాలు ఉన్నప్పటికీ.. న్యాయవ్యవస్థకు ప్రధానంగా తీర్పు ఇచ్చే అధికారమే ఉందని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా కోర్టుల తీర్పులను గౌరవించడానికి కారణం.. న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వాసమేనన్నారు.ఆ విశ్వాసం ఒక్కసారి సంపాదించుకుంటే సరిపోదని.. ప్రతి దశలోనూ దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రజా విశ్వాసమే న్యాయవ్యవస్థకు అత్యంత విలువైన మూలధనమని చెప్పారు.సామాన్యుడికి న్యాయం చేరాలికోర్టు భవనం అందుబాటులో ఉండటం మాత్రమే న్యాయానికి ప్రాప్యత కాదని సీజేఐ అన్నారు. సామాన్య పౌరుడు న్యాయవ్యవస్థను చేరుకోగలగాలి, అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలగాలి, న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడం తనకు మరో పోరాటంగా మారకూడదని చెప్పారు. ఈ సందర్భంగా ఈ-కోర్టుల ప్రాజెక్టు ద్వారా అమలవుతున్న పలు చర్యలను ప్రస్తావించారు. సింగిల్ సైన్-ఆన్ పోర్టల్, ఎలక్ట్రానిక్‌గా సమన్ల జారీ, జైలు-కోర్టు రికార్డుల అనుసంధానం వంటి చర్యలు న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయని వివరించారు. ఈ-సేవా కేంద్రాల మొబైల్ వాహనాల ద్వారా కోర్టు సేవలు, న్యాయ సహాయాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్లే ప్రయత్నాలను కూడా ప్రస్తావించారు.ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రామ్ జెఠ్మలానీ. దేశంలోనే అత్యంత పేరున్న న్యాయవాదుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన.. ఎన్నో సంచలన కేసుల్లో వాదించారు. రామ్ జెఠ్మలానీ పారదర్శకత, జవాబుదారీతనం కోసం చేసిన కృషిని గుర్తుచేసిన సీజేఐ.. న్యాయవ్యవస్థలో పారదర్శకతను పునాదిగా చేసుకుని, ప్రజల విశ్వాసాన్ని నిరంతరం పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. న్యాయం జరగడమే కాదు.. అది జరిగినట్లు ప్రజలకు కనిపించాలన్న సూత్రం న్యాయవ్యవస్థకు మార్గదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: విజయ్‌కు షాకిచ్చిన వామపక్షాలు -
‘జైహింద్’ అనలేదని ఐపీఎస్ అధికారిణి బదిలీ!
ఆమె ఓ ఐపీఎస్ అధికారిణి. యూపీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు. అందులో వాళ్లను మోటివేట్ చేసేందుకు తన జర్నీనే చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఆ వీడియో నెట్టింట దుమారం రేపింది. ఓ హిందూ సంఘం అభ్యంతరాలతో ఏకంగా రాష్ట్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం నేపథ్యంలో.. ప్రభుత్వం ఆమెను మరో విభాగానికి బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.పశ్చిమ బెంగాల్లో ఐపీఎస్ అధికారిణి బుష్రా బానో(IPS Bushra Bano) వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖరగ్‌పూర్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ఆమెను సోమవారం రాష్ట్ర సాయుధ పోలీసు దళం డిప్యూటీ కమాండెంట్‌గా బదిలీ చేశారు. అయితే ఆమెపై ఫిర్యాదు, ఆగమేఘాల మీద బదిలీకి మధ్య జరిగింది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.2021 బ్యాచ్‌కు చెందిన బుష్రా బానో(Bushra Bano).. సెప్టెంబర్ 13న యూపీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు. అందులో తాను సివిల్ సర్వీసెస్‌కు ఎలా సిద్ధమయ్యారో వివరించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU)లోని రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ తన యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఎంతో సహాయపడిందని చెప్పారు. చదువుకు అవసరమైన స్టడీ మెటీరియల్, లైబ్రరీ, టెస్ట్ సిరీస్ వంటివి తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని వివరించారు.అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. వీడియో ప్రారంభంలో ‘అస్సలామువాలైకుమ్’, మధ్యలో ‘ఇన్షా అల్లా’, చివర్లో ‘జజాకల్లా’ వంటి పదాలను ఉపయోగించారు. దీనిపై ఎక్స్(ట్విటర్)లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జై హింద్’, ‘వందేమాతరం’ వంటి జాతీయ అభివాదాలను ఆమె ఉపయోగించలేదని విమర్శించారు.హిందూ లీగల్ ఫండ్ ఫిర్యాదుఈ వ్యవహారంపై ‘హిందూ లీగల్ ఫండ్’ అనే సంస్థ పశ్చిమ బెంగాల్ హోం సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ప్రజా వేదికపై భారత ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహించే సర్వీసింగ్ అధికారిణి న్యూట్రల్‌గా ఉండాలని, జాతీయ అభివాదాలను ఉపయోగించాలని కోరినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.అయితే ఇది జరిగాక.. బుష్రా బానో ట్రాన్స్ఫర్ అయ్యారు. అందుకు సువేందు ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ రాలేదు. బుష్రా బానో బదిలీపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆమెపై వచ్చిన ఫిర్యాదు కారణమా? లేదంటే సాధారణ పరిపాలనా బదిలీయా? అన్నదానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.సౌదీ నుంచి సివిల్స్ వరకు..బుష్రా బానో ప్రయాణం కూడా ఆసక్తికరమే. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాకు చెందిన ఆమె అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మేనేజ్మెంట్ స్టడీస్‌లో పీహెచ్డీ చేశారు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా సాధించారు. వివాహం, కుటుంబ బాధ్యతల మధ్య కొంతకాలం సౌదీ అరేబియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనంతరం భారత్‌కు తిరిగి వచ్చి యూపీఎస్సీకి సిద్ధమయ్యారు.ఆమె 2018లో యూపీఎస్సీలో 277వ ర్యాంక్ సాధించి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. అయితే రెండో బిడ్డకు గర్భవతిగా ఉండటంతో ఆ పోస్టులో చేరలేకపోయారు. ఆ తర్వాత మరోసారి యూపీఎస్సీ రాసి 2019లో 234వ ర్యాంక్ సాధించారు. ఈసారి ఐపీఎస్‌కు ఎంపికై.. పశ్చిమ బెంగాల్ కేడర్‌కు కేటాయించబడ్డారు.ఖరగ్‌పూర్ నుంచి సాయుధ పోలీసులకు..కెరీర్లో తొలి పోస్టింగ్ హుగ్లీ రూరల్ ఏఎస్పీగా చేపట్టిన బుష్రా బానో.. ఈ ఏడాది జూన్‌లో అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. అనంతరం ఖరగ్‌పూర్ అదనపు ఎస్పీగా పనిచేశారు. తాజాగా ఆమెను రాష్ట్ర సాయుధ పోలీసు దళం డిప్యూటీ కమాండెంట్‌గా బదిలీ చేశారు.ఇదీ చదవండి: వీధుల్లో దీన స్థితిలో కోటీశ్వరుడు.. ఎందుకంటే! -
గణపయ్య వేడుకల్లో మళ్లీ ‘గోవిందా’.. కనిపించని సునీత!
బాలీవుడ్ నటుడు గోవిందా అమెరికా నుంచి తిరిగి వచ్చిన అనంతరం అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. కుమార్తె టీనా అహూజా, కుమారుడు యశ్వర్ధన్ అహూజాలతో కలిసి గణపతి దర్శనం చేసుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే కుటుంబంతో కలిసి ఫొటోలకు పోజిచ్చిన సమయంలో ఆయన భార్య సునీతా అహూజా ఎక్కడా కనిపించలేదు.పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థనలుగణపతి ఆశీస్సులు తీసుకున్న గోవిందా.. తన కుమారుడు యశ్వర్ధన్కు మంచి భవిష్యత్తు రావాలిని కోరుకున్నారు. కుటుంబంలో గణపతి వేడుకల సంప్రదాయం తన తల్లి నుంచే ప్రారంభమైందని ఆయన తెలిపారు. కొన్నేళ్లుగా తాను ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నానని, ఇప్పుడు యశ్వర్ధన్ కూడా దానిని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. కుమారుడికి విజయాలు, సిరిసంపదలు కలగాలని గణపతిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.మీడియాతో మాట్లాడిన అనంతరం గోవిందా తన పిల్లలు టీనా, యశ్వర్ధన్లతో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. అయితే ఆ సమయంలో సునీతా అహూజా ఫొటోలో కనిపించలేదు. అంతకుముందు సునీతా అహూజా తన పిల్లలతో కలిసి ఉత్సాహంగా గణపతి వేడుకలను ప్రారంభించారు. సాధారణంగా గోవిందా లేదా యశ్వర్ధన్ గణపతిని ఇంటికి తీసుకొస్తారని, ఈసారి తానే పాటలు, నృత్యాలతో గణపతిని ఇంటికి తీసుకొచ్చానని ఆమె తెలిపారు. గత ఏడాది వినాయకుడు తనకు ఎంతో పేరు, విజయాన్ని అందించారని చెప్పారు. అందుకే ఈసారి స్వయంగా గణపతిని తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కాగా వేడుకల ఫొటోల్లో సునీత కనిపించకపోవడంతో మరోమారు గోవిందా వార్తల్లో నిలిచారు. ఇదీ చదవండి: అంబానీ గణేశ్ పూజకు.. ‘డీప్ నెక్’లో హీరోయిన్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు! -
బీజేపీకి లోకల్ దెబ్బ.. సీఎం ఇలాకాలోనూ ఓటమి!
రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీలో కొత్త చర్చకు తెరతీశాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమకు తిరుగులేదని ధీమా వ్యక్తం చేసిన పార్టీకి.. కీలక నేతల సొంత ప్రాంతాల్లోనే ఓటర్లు గట్టి సంకేతం ఇచ్చారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాఠోడ్, కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది.ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సొంత జిల్లా భరత్‌పూర్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల ప్రచారంలో సీఎం స్వయంగా రోడ్‌షోలు నిర్వహించినప్పటికీ.. ఆ ప్రభావం ఫలితాల్లో పూర్తిగా కనిపించలేదు. మొత్తం 65 వార్డులున్న భరత్పూర్ నగర పాలక సంస్థలో బీజేపీ కేవలం 20 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ఏడు స్థానాలు గెలుచుకోగా.. ఏకంగా 36 వార్డులను స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో అక్కడ బోర్డు ఏర్పాటు చేయాలంటే బీజేపీకి స్వతంత్రుల మద్దతు తప్పనిసరి కానుంది. అధ్యక్షుడి ఇలాకాలోనూ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాఠోడ్ సొంత జిల్లా పాలీలోనూ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. మొత్తం 65 వార్డుల్లో కాంగ్రెస్ 29 స్థానాలు గెలుచుకోగా.. బీజేపీ 21 స్థానాల వద్దే ఆగిపోయింది. మరో 15 స్థానాలను స్వతంత్రులు దక్కించుకున్నారు. బోర్డు ఏర్పాటుకు 34 స్థానాలు అవసరం కావడంతో.. ఇక్కడ కూడా స్వతంత్రులే కీలకం కానున్నారు.వసుంధర గడ్డలో కాంగ్రెస్ జెండా..మాజీ సీఎం వసుంధర రాజే ప్రభావం బలంగా ఉన్న ఝలావార్‌లో బీజేపీకి మరింత పెద్ద షాక్ తగిలింది. ఝలావార్ మున్సిపల్ కౌన్సిల్‌లోని 45 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 29 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది. దీంతో అక్కడ బీజేపీ అధికారం కోల్పోయింది. వసుంధర ప్రభావం ఉన్న ప్రాంతంలోనే కాంగ్రెస్ ఈ స్థాయిలో విజయం సాధించడం కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.భూపేంద్ర యాదవ్ ప్రాంతంలోనూ..కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అల్వార్ ప్రాంతంలోనూ బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. మొత్తం 65 వార్డుల్లో బీజేపీ 28 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ 23 సీట్లు దక్కించుకుంది. మరో 13 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. ఒక స్థానాన్ని బీఎస్పీ గెలుచుకుంది. దీంతో ఇక్కడ కూడా బీజేపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించలేదు.జోధ్‌పూర్‌లో హోరాహోరీ..ఇటు జోధ్‌పూర్‌లోనూ బీజేపీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. 100 వార్డులున్న నగర పాలక సంస్థలో బీజేపీ, కాంగ్రెస్ చెరో 44 స్థానాలు గెలుచుకున్నాయి. మరో 11 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. దీంతో బోర్డు ఏర్పాటులో స్వతంత్రుల పాత్ర కీలకంగా మారింది.బికనీర్‌లో కాంగ్రెస్ దూకుడుకేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రభావం ఉన్న బికనీర్ బీజేపీకి నిరాశే ఎదురైంది. మొత్తం 80 వార్డుల్లో కాంగ్రెస్ 42 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది. బీజేపీ 27 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్‌కు బోర్డు ఏర్పాటు చేసేందుకు ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండా పోయింది.2028కి ముందు హెచ్చరికేనా?రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 4,179 వార్డులు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 3,613, స్వతంత్రులు 2,273 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ముందంజలో ఉన్నప్పటికీ.. కీలక నేతల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్, ఇండిపెండెంట్ల బలం స్పష్టంగా కనిపించింది. అయితే భరత్పూర్, పాలి, ఝలావార్, అల్వార్, జోధ్‌పూర్, బికనీర్ వంటి కీలక ప్రాంతాల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి హెచ్చరికగా మారాయి. ముఖ్యంగా సీఎం నుంచి కేంద్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి వరకు కీలక నేతల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పార్టీకి స్పష్టమైన ఆధిపత్యం దక్కకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఈ ఫలితాలు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై బీజేపీ నాయకత్వం దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: షాకింగ్.. రైల్వే స్టేషన్లలో రైల్వే వాళ్లు ఇచ్చే నీళ్లు ఎలాంటివో తెలుసా? -
హిందీలో ఎంబీబీఎస్.. నాలుగేళ్ల తర్వాత దిమ్మతిరిగే రిజల్ట్!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో వైద్య విద్యను హిందీలో అందించాలన్న ప్రయోగం నాలుగేళ్ల తర్వాత ఎలాంటి ఫలితాలు ఇచ్చిందన్న అంశంపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022లో హిందీలో ఎంబీబీఎస్ చదువును ప్రారంభించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. వైద్య విద్యకు సంబంధించిన పుస్తకాలను హిందీలో రూపొందించి, వాటిని ఆవిష్కరించారు. ఉన్నత విద్యలో హిందీని ప్రోత్సహించే దిశగా ఇది కీలక ముందడుగుగా అప్పట్లో పేర్కొన్నారు.అయితే నాలుగేళ్లు గడిచిన నేపథ్యంలో ఈ ప్రయోగం క్షేత్రస్థాయిలో ఎంతవరకు విజయవంతమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హిందీలో ఎంబీబీఎస్ విద్య కోసం రూపొందించిన పుస్తకాలు ప్రస్తుతం గోదాముల్లోనే ఉన్నట్లు ‘ఆజ్‌తక్’ పేర్కొంది. హిందీ మాధ్యమంలో వైద్య విద్య కోసం దాదాపు రూ.9 కోట్ల విలువైన పుస్తకాలను సిద్ధం చేశారు. అయితే వాటి వినియోగంపై చర్చ మొదలైంది. హిందీ మాధ్యమంలో ఎంబీబీఎస్ చదివేందుకు విద్యార్థులు ఎంతమేరకు ఆసక్తి చూపుతున్నారన్నది వెల్లడయ్యింది.మధ్యప్రదేశ్‌లో ఎంబీబీఎస్ విద్యార్థుల్లో సుమారు 90 శాతం మంది హిందీకి బదులుగా ఆంగ్ల మాధ్యమాన్నే ఎంచుకున్నట్లు ‘ఆజ్ తక్’ పేర్కొంది. దీంతో హిందీలో రూపొందించిన వైద్య పుస్తకాల వినియోగం పరిమితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. హిందీ దినోత్సవం సందర్భంగా హిందీ భాష గౌరవం, ప్రచారం, ప్రోత్సాహంపై చర్చ జరుగుతున్న సమయంలో మధ్యప్రదేశ్ ఇలాంటి పరిస్థితి కనిపించింది. 2022లో వైద్య విద్యలో స్థానిక భాషను ఉపయోగించాలన్న ఉద్దేశంతో పుస్తకాలను కూడా సిద్ధం చేశారు. అయితే నాలుగేళ్ల తర్వాత అధిక శాతం విద్యార్థులు ఆంగ్లానికే ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. హిందీలో వైద్య విద్యను అందించాలన్న ప్రయత్నం కొనసాగుతుందా? విద్యార్థులు హిందీ పుస్తకాలను వినియోగించేలా చేయగలరా? లేక ఆంగ్ల మాధ్యమానికే ఎక్కువ ప్రాధాన్యం కొనసాగుతుందా? రూ.9 కోట్ల విలువైన పుస్తకాల పరిస్థితి, 90 శాతం మంది విద్యార్థులు ఆంగ్లాన్ని ఎంచుకున్న విషయం అంతుచిక్కని అంశంగా మారింది. ఇదీ చదవండి: షాక్.. 1.14 లక్షల మందికి నాణ్యత లేని ‘రైల్ నీర్’? -
అంబానీ గణేశ్ పూజకు.. ‘డీప్ నెక్’లో హీరోయిన్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
ముంబై: గణేశ్ చతుర్థి సందర్భంగా ముకేశ్ అంబానీ నివాసం ‘యాంటీలియా’లో సెప్టెంబర్ 14న నిర్వహించిన ప్రత్యేక పూజకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. నటి దిశా పటానీ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఆమె ధరించిన దుస్తులపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె ఎరుపు రంగు లెహంగా చోళీలో హాజరయ్యారు. లెహంగాతో పాటు డీప్ నెక్ బ్రాలెట్ తరహా బ్లౌజ్ ధరించారు. ఈ దుస్తుల డిజైన్ ఎక్కువగా రివీలింగ్‌గా ఉందంటూ పలువురు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. పండుగ పూట, అదికూడా పూజ లాంటి సంప్రదాయ కార్యక్రమాలకు ఇలాంటి దుస్తులతో వస్తారా అంటూ పలువురు ఆమెను ఎద్దేవా చేస్తున్నారు.ఈ వేడుకకు హాజరైన పలువురు సెలబ్రిటీలు సంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో దిశా పటానీ లుక్ మరింత చర్చనీయాంశమైంది. సామాజిక మాధ్యమాల్లో కొందరు ఆమె వస్త్రధారణను ఇతర నటీమణుల దుస్తులతో పోల్చారు. రివీలింగ్ దుస్తుల విషయంలో దిశా పటానీ గతంలోనూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎదుర్కొన్నారు. గత ఏడాది గణపతి పూజకు కూడా ఇలాంటి దుస్తులతో హాజరైనప్పుడు ట్రోలింగ్ జరిగింది.అంబానీ ఇంట జరిగిన గణేశ్ చతుర్థి వేడుకలో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్-సైఫ్ అలీ ఖాన్, ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వాణీ, రేఖ, కాజోల్, రణ్వీర్ సింగ్, కరణ్ జోహార్ తదితరులు పాల్గొన్నారు. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు ధరించే దుస్తులపై సామాజిక మాధ్యమాల్లో తరచూ చర్చ జరుగుతోంది. సంప్రదాయ వేడుకల్లో ఆధునిక లేదా బోల్డ్ లుక్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఫ్యాషన్ స్వేచ్ఛకు మద్దతు లభిస్తుండగా, మరోవైపు సంస్కృతి, సంప్రదాయాలను ప్రస్తావిస్తూ విమర్శలు వస్తున్నాయి. ఇదీ చదవండి: మేయర్ ఇంట్లో.. రెండో తరగతి పిల్లాడి వినాయకుడు! View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
రూ.2,000 లోపు యూపీఐ లావాదేవీలపై ఛార్జీల రద్దు
దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ ద్వారా జరిగే రూ.2,000 వరకు ఉన్న రూ పే (RuPay) డెబిట్ కార్డు, యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు లేదా డిజిటల్ పేమెంట్ సర్వీసు సంస్థలు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్, 2007’ చట్టంలో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.సామాన్యులు, చిన్న వ్యాపారులకు ఊరటతాజా ఉత్తర్వుల ప్రకారం.. రూ.2,000 లోపు జరిపే లావాదేవీలపై చెల్లింపుదారుల నుంచి కానీ, స్వీకరించే వారి (మర్చంట్లు) నుంచి కానీ నేరుగా లేదా పరోక్షంగా ఎటువంటి రుసుమును వసూలు చేయరాదని స్పష్టంచేశారు. ఈ నిర్ణయం దేశంలోని అత్యధిక శాతం డిజిటల్ లావాదేవీలకు వర్తిస్తుంది. రోజువారీ సామాన్య ప్రజలు, చిన్న తరహా వ్యాపారులు జరిపే చిన్న మొత్తాల డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి అదనపు భారం పడకుండా ఉంచడమే దీని ప్రధాన లక్ష్యం.పెద్ద మొత్తాల లావాదేవీలపై మార్గదర్శకాలు?అయితే, ప్రభుత్వం నోటిఫికేషన్లో రూ.2,000 వరకు ఉన్న లావాదేవీలను మాత్రమే ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. అంతకంటే ఎక్కువ మొత్తం (భారీ లావాదేవీలు) జరిపే నగదు బదిలీలపై ఛార్జీలు విధించేందుకు ఇది మార్గం సుగమం చేసినట్లయింది. అయితే, పెద్ద మొత్తాల లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారా లేదా, ఒకవేళ విధిస్తే ఎంత మేర ఉంటాయనే దానిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల ద్వారా మర్చంట్లు, వినియోగదారులపై భారం పడకుండా యూపీఐ ప్లాట్‌ఫామ్ నిర్వహణ ఖర్చులను భరించవచ్చని కేంద్రం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలో క్యాష్‌లెస్ ఎకానమీ మరింత వేగంగా విస్తరించనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కాలంతో పోటీపడిన సాంకేతిక శిఖరం.. మోక్షగుండం! -
కాలంతో పోటీపడిన సాంకేతిక శిఖరం.. మోక్షగుండం!
ఆలోచనకు ఆకారం ఇవ్వడమే ఇంజినీరింగ్. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రగతికి నాంది పలికే వారే ఇంజినీర్లు. సమాజ పురోగతికి అహర్నిశలు శ్రమించే ఈ సాంకేతిక శిల్పుల త్యాగాన్ని, ప్రతిభను స్మరించుకునేందుకు ఏటా సెప్టెంబర్ 15న ‘ఇంజినీర్స్ డే’గా జరుపుకుంటాం. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహించడం ఆయనకు దేశం ఇచ్చే ఘన నివాళి. నేటి డిజిటల్ యుగంలో ‘కూర్చుంటే మాటలు.. నిలబడితే చేతలు’ అన్నట్లు కాలం గడిపే యువతకు విశ్వేశ్వరయ్య జీవితం స్ఫూర్తిమంతం.పేదరికాన్ని గెలిచిన మహోన్నత బాల్యంకర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా ముద్దెనహళ్లిలో ఒక సాధారణ పేద కుటుంబంలో 1861 సెప్టెంబర్ 15న విశ్వేశ్వరయ్య జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా తాను ధైర్యం కోల్పోలేదు. వీధిదీపాల కింద చదువుకుంటూ, ట్యూషన్లు చెప్పుకుంటూ విద్యనభ్యసించారు. కష్టపడేవాడికి కామధేనువు సమకూరుతుంది అన్న చందంగా, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని బెంగళూరులోని సెంట్రల్ కాలేజీలో బీఏ, ఆపై పుణెలోని సైన్స్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ ఫస్ట్ క్లాస్‌లో పూర్తి చేశారు.వృత్తి ధర్మం.. నిర్మాణాత్మక సేవలుబ్రౌన్/బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రారంభ కెరీర్ (1884 – 1908)పుణెలో ఇంజినీరింగ్ విద్య పూర్తయిన వెంటనే 1884లో బొంబాయి ప్రెసిడెన్సీలోని ప్రజాపనుల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా చేరారు.ప్రస్తుత పాకిస్థాన్‌లోని సుక్కూర్ నగరంలో సింధు నది నీరు మురికిగా ఉంటే దానికి ప్రత్యేక ‘ఫిల్ట్రేషన్’ విధానాన్ని రూపొందించి స్వచ్ఛమైన నీటిని అందించారు.బ్లాక్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్: నీటి వృధాను అరికట్టడానికి కాలవల ద్వారా పొలాలకు సమంగా నీరందేలా ‘బ్లాక్ పద్ధతి’ని ప్రవేశపెట్టారు.ఆటోమేటిక్ స్లూయిస్ గేట్లు: పుణె సమీపంలోని ఖడక్వాస్లా జలాశయానికి వరద నీటి నియంత్రణ కోసం పేటెంట్ పొందిన ఆటోమేటిక్ గేట్లను రూపొందించారు. శానిటరీ ఇంజినీర్: 1901లో బొంబాయి ప్రభుత్వంలో శానిటరీ ఇంజినీర్‌గా సేవలు అందించారు. హైదరాబాద్ నగర రూపశిల్పిగా (1908 – 1909)1908లో హైదరాబాద్‌ను ముంచెత్తిన మూసీ నది తీవ్ర వరదల తర్వాత ఆనాటి నిజాం ప్రభుత్వం ఆయనను ప్రత్యేక సలహాదారుగా/చీఫ్ కన్సల్టింగ్ ఇంజినీర్‌గా ఆహ్వానించింది. హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను డిజైన్ చేశారు. నగర రక్షణకు, తాగునీటి అవసరాలకు ఉస్మాన్ సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్ జలాశయాల నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేశారు.మైసూర్ సంస్థానంలో కీలక భాధ్యతలు (1909 – 1918)1909లో బ్రిటిష్ సర్వీస్‌కు స్వచ్ఛంద విరమణ (వీఆర్ఎస్) ఇచ్చి మైసూర్ మహారాజు నాలుగో కృష్ణరాజ ఒడియార్ పిలుపు మేరకు మైసూర్ సంస్థానంలో చేరారు. మైసూర్ రాజ్యంలో ప్రజాపనుల శాఖ కార్యదర్శిగా, ప్రధాన ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహించి కృష్ణరాజ సాగర్ (కేఆర్ఎస్) డ్యామ్‌కు రూపకల్పన చేశారు. 1912లో మైసూర్ 19వ దివాన్ (ప్రధానమంత్రి)గా బాధ్యతలు చేపట్టారు. ఆయన కాలంలో రాజ్యాన్ని పారిశ్రామికంగా, విద్యాపరంగా అగ్రపథంలో నిలిపారు. భద్రావతిలో మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ స్థాపించారు. బెంగళూరులో యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఏర్పాటు చేశారు. మైసూర్ సోప్ ఫ్యాక్టరీ ప్రారంభించారు.ఉద్యోగ విరమణ అనంతరందివాన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయన ఖాళీగా ఉండలేదు. దేశ నిర్మాణం కోసం పలు కీలక బోర్డుల్లో, కమిటీల్లో పనిచేశారు. టాటా స్టీల్ డైరెక్టర్ బోర్డులో (1927 – 1955) దాదాపు 28 ఏళ్ల పాటు సభ్యుడిగా ఉంటూ సంస్థ విస్తరణకు సలహాలు ఇచ్చారు. విశాఖపట్నం పోర్ట్‌లో సముద్రపు కోత నుంచి వైజాగ్ నౌకాశ్రయం దెబ్బతినకుండా రక్షణ వ్యవస్థలను రూపొందించారు. తుంగభద్ర ప్రాజెక్ట్ బోర్డ్ ఆఫ్ ఇంజినీర్స్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించారు. విశ్వేశ్వరయ్య 1962 ఏప్రిల్ 14న బెంగళూరులోని తన నివాసంలో వృద్ధాప్య సమస్యల (సహజ కారణాల) వల్ల కన్నుమూశారు.దేశం ఇచ్చిన సర్వోన్నత గౌరవంవిశ్వేశ్వరయ్య జీవనశైలి నిరంతరం క్రమశిక్షణకు ప్రతిరూపం. ఆయన ఎప్పుడూ ‘చేప పిల్లకి ఈత నేర్పక్కర్లేదు’ అన్నట్లుగా సమర్థంగా పనిచేస్తూండేవారు. పక్కాగా సమయాన్ని పాటించేవారు. సమాజానికి ఆయన చేసిన అసమాన సేవలకుగానూ 1955లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’తో గౌరవించింది. అలాగే బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ‘నైట్‌హుడ్’(సర్) బిరుదును ప్రదానం చేసింది.నేటి యవతకు ఆయన జీవితమే పాఠంతాత్కాలిక ఆకర్షణలకు లొంగిపోకుండా యువత క్రమశిక్షణ, నిబద్ధత అలవర్చుకోవాలని ఆయన జీవితం చెబుతోంది. కాలం కరిగిపోయే నీటి లాంటిది; దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అడ్డంకులు ఎదురైతే వెనుకంజ వేయకుండా పరిష్కారం వైపు ఆలోచించాలి. సాంకేతికతను కేవలం స్వార్థానికి కాకుండా సమాజాభివృద్ధికి ఉపయోగించాలని ఆయన జీవితం చెబుతోంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చూపిన ప్రగతి బాటలో పయనిస్తూ నైపుణ్యాలకు పదును పెట్టుకోవడమే నేటి యువత ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. 102 ఏళ్ల సంపూర్ణ జీవితంలో ప్రతి నిమిషాన్ని దేశ పునర్నిర్మాణానికే అంకితం చేసిన ఈ అపర విశ్వకర్మ భారతజాతికి నిత్యస్మరణీయుడు!ఇదీ చదవండి: గాడిదల వ్యాపారం.. చైనా డిమాండ్.. పాకిస్థాన్ ఆశలు! -
షాక్.. 1.14 లక్షల మందికి నాణ్యత లేని ‘రైల్ నీర్’?
భోపాల్: రైలు ప్రయాణికులకు అందించే తాగునీరు, ఆహార పదార్థాల నాణ్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. భోపాల్ రైల్వే డివిజన్లో నిర్వహించిన సాధారణ నాణ్యత తనిఖీల్లో ఐఆర్సీటీసీకి చెందిన ‘రైల్ నీర్’ నీటి నమూనాతో పాటు ఆహార తయారీలో ఉపయోగించే శనగపిండి శాంపిల్ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. దీంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల సాధారణ పరీక్షల్లో భాగంగా నీటి నమూనాను సేకరించారు. డివిజన్ పరిశీలనల ప్రకారం.. ఆ నమూనా నిర్దేశిత నాణ్యత ప్రమాణాలను అందుకోలేకపోయింది. అలాగే ఆహార పదార్థాల్లో ఉపయోగించే శనగపిండి కూడా నాణ్యత ప్రమాణాల్లో విఫలమైంది. దీనిపై అధికారులు దృష్టి సారించారు.రోజుకు 1.14 లక్షల ప్రయాణికులు2025-26లో భోపాల్ రైల్వే డివిజన్లో రోజుకు సగటున 1.14 లక్షల మంది ప్రయాణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భోపాల్ జంక్షన్‌లోనే రోజుకు 150కుపైగా రైళ్లు ఆగుతుండగా.. సుమారు 70 వేల మంది ప్రయాణికుల రాకపోకలు ఉంటాయి. మండీదీప్ ప్లాంట్ నుంచి రాణి కమలాపురం, నర్మదాపురం, ఇటార్సీ, విదిశ, గంజ్ బసోడా తదితర స్టేషన్లకు రోజుకు సుమారు 5,000 రైల్ నీర్ బాటిళ్లు సరఫరా అవుతున్నాయి. లీటరు రూ.14 చొప్పున లెక్కిస్తే.. రోజువారీ సరఫరా విలువ సుమారు రూ.70 వేలు కాగా, ఏడాదికి రూ.2.55 కోట్ల వ్యాపారం జరుగుతోంది.మరిన్ని బాటిళ్లకు పరీక్షలుఈ ఘటనపై భోపాల్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సౌరభ్ కటారియా స్పందించారు. రైల్ నీర్‌ను క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నామని తెలిపారు. ఒక నమూనాపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో అదే బ్యాచ్‌కు చెందిన మరికొన్ని బాటిళ్లను పరీక్షల కోసం సేకరించినట్లు చెప్పారు. ఐఆర్సీటీసీ అధికారులు కూడా పరీక్షల కోసం సుమారు 10 బాటిళ్లను పంపినట్లు వెల్లడించారు. ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. గతంలో ఇటార్సీ బేస్ కిచెన్‌లో తనిఖీలు నిర్వహించి, గడువు ముగిసిన, నాణ్యత లేని ఆహార పదార్థాలను గుర్తించి, ధ్వంసం చేశారు.ఇదీ చదవండి: మేయర్ ఇంట్లో.. రెండో తరగతి పిల్లాడి వినాయకుడు! -
కేంద్రం ఆగ్రహం.. భారత్‌లో కార్యకలాపాలపై మెటా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యల నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను నేరుగా పోలీసులకు సమాచారం అందించేందుకు అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.దేశంలో సోషల్ మీడియా సంస్థలు కార్యకలాపాలు నిర్వహించాలంటే చిన్నారుల ఆన్లైన్ భద్రత ప్రాథమిక సూత్రమని, ఇందులో ఎలాంటి రాజీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్‌లలో చిన్నారుల లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన కంటెంట్, ప్రకటనలు వస్తున్నట్లు వార్తలు రావడంతో కేంద్రం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఉక్కుపాదం మోపుతోంది.చిన్నారుల భద్రతకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసుల వివరాలను ఇకపై భారతీయ చట్ట అమలు సంస్థలకు అందించేందుకు మెటా అంగీకరించింది. ఆన్లైన్లో పిల్లల భద్రత అనేది ఏ సోషల్ మీడియా సంస్థకైనా అత్యంత ప్రాథమిక, అనివార్యమైన సూత్రమని ప్రభుత్వం తేల్చిచెప్పింది.ప్లాట్‌ఫామ్‌లలో హానికరమైన సమాచారాన్ని ముందస్తుగా గుర్తించి, ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకోని సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికలను పిల్లలకు పూర్తిగా సురక్షితంగా మార్చే దిశగా మెటా తీసుకున్న ఈ నిర్ణయం ఒక కీలకమైన తొలి అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా పిల్లల భద్రత కోసం ముందస్తు రక్షణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వం నిరంతరం చర్చలు జరుపుతోంది. -
3 వేల కోట్ల ఆస్తులు.. బిచ్చగాడిలా మారిన ఎమ్మెల్యే!
ఆయన రాష్ట్రంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేల్లో ఒకరు. కోట్లాది రూపాయల ఆస్తులు.. భద్రతా సిబ్బంది.. ఖరీదైన వాహనాలు.. ఎక్కడికి వెళ్లినా హంగామా. కానీ ఒక్కరోజు మాత్రం ఇవన్నీ పక్కనపెట్టి వీధుల్లో బిచ్చగాడిగా కూర్చున్నారు. చేతిలో డబ్బులు లేకపోయినా.. అడిగిన వారికి తనకు తోచినంతగా ఇవ్వమని కోరారు. చివరకు అదే రూపంలో వచ్చిన ఆహారాన్ని స్వీకరించి తిన్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు?మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ఈ వింత అనుభవాన్ని స్వయంగా చవిచూశారు. జైన సంప్రదాయంలో కొనసాగుతున్న ప్రత్యేక మాసం సందర్భంగా తన ఆధ్యాత్మిక గురువు చేసిన సూచనతో ఆయన ఈ పని చేశారు. ముంబైలోని ఘాట్కోపర్ వీధుల్లో కొంతసేపు బిచ్చగాడి వేషంలో గడిపారు. ఇందులో భాగంగా.. తన భద్రతా సిబ్బందిని, వాహనాలను పక్కనపెట్టారు. ఖరీదైన వస్తువులన్నింటినీ వదిలి.. మేకప్ వేసుకుని తనను ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తపడ్డారు. అనంతరం రోడ్లపై కూర్చుని ప్రజలను ఆహారం, డబ్బు అడిగారు.రూ.20.. సమోసా ఉచితం!ఈ అనుభవం తనకు జీవితంలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే అవకాశం ఇచ్చిందని పరాగ్ షా తెలిపారు. సాధారణంగా తనను కలవడానికి ప్రజలు వరుసలో నిలబడతారని.. కానీ తాను వారి దగ్గరకు వెళ్లినప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు.ఓ వ్యక్తి తనకు రూ.20 ఇచ్చి “వెళ్లి తిను బాబా” అని చెప్పినట్లు షా గుర్తుచేసుకున్నారు. మరోవైపు ఓ సమోసా విక్రేత వద్దకు వెళ్లి తన దగ్గర డబ్బులు లేవని చెప్పగా.. అతడు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా చిరునవ్వుతో సమోసా ఇచ్చాడని తెలిపారు.“నేను డబ్బులు లేవని చెప్పినా.. ఆ పేద చిరు వ్యాపారి ఏ మాత్రం మొహం చాటేయకుండా నవ్వుతూ సమోసా ఇచ్చాడు. ముంబై ప్రజల్లో ఒకరికొకరు సాయం చేసే గుణం ఉంది” అని షా తన అనుభవాన్ని వివరించారు.మేకప్ తొలగించి మళ్లీ అక్కడికే..కొన్ని గంటలపాటు బిచ్చగాడిగా గడిపిన తర్వాత పరాగ్ షా మేకప్ తొలగించుకున్నారు. అనంతరం తాను గతంలో తిరిగిన ప్రాంతాలకే వెళ్లి.. తనను గుర్తుపట్టని సమయంలో ప్రజలు ఎలా స్పందించారో మరోసారి పరిశీలించారు. ఈ అనుభవాన్ని తన గురువుతో పాటు ఇతరులతోనూ పంచుకున్నారు.₹5,000 CRORE MLA BECOMES A ‘BEGGAR’ FOR A DAYGhatkopar East MLA Parag Shah, known for his immense wealth, reportedly took on the life of a beggar as part of a spiritual exercise suggested by his Jain guru, Namramuni Maharaj.He gave up his security, luxury cars and expensive… pic.twitter.com/Vv601XljkQ— Subodh Kumar (@kumarsubodh_) September 15, 2026తనకు లభించే గౌరవం, హోదా, అధికారాల వెనుక ఉన్న భిన్నమైన ప్రపంచాన్ని ఈ అనుభవం చూపించిందని షా అన్నారు. “నన్ను కలవడానికి వచ్చే ప్రజలే.. నేను వారి దగ్గరకు వెళ్లినప్పుడు నాకంటే ఎత్తుగా కనిపించారు. అదే జీవితంలోని వాస్తవం” అని ఆయన వ్యాఖ్యానించారు.రిచ్చెస్ట్ ఎమ్మెల్యేఘాట్కోపర్ ఈస్ట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న పరాగ్ షా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో రూ.3,383 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు. దీంతో అప్పట్లో మహారాష్ట్రలోనే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్తగా ఉన్న ఆయన.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో కార్పొరేటర్‌గానూ పనిచేశారు.ఇంతటి సంపద, హోదా ఉన్న వ్యక్తి ఒక్కరోజు అన్నింటినీ పక్కనపెట్టి సామాన్యుడిలా, చివరకు బిచ్చగాడి రూపంలో ప్రజల మధ్య కూర్చోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే తనకు ఈ అనుభవం “జీవితంలోని వాస్తవాన్ని చూపించింది” అని పరాగ్ షా చెప్పడం అసలు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. -
మేయర్ ఇంట్లో.. రెండో తరగతి పిల్లాడి వినాయకుడు!
ముంబై: గణేశ్ చతుర్థి సందర్భంగా ముంబై మేయర్ రితు తావ్డే తన నివాసంలో పర్యావరణహిత మట్టి గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నగరంలో నిర్వహించే గణేశోత్సవ వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ విగ్రహాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు చెందిన ప్రభాదేవి మున్సిపల్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న రితిక్ పాస్వాన్ స్వయంగా తయారు చేశారు.రితిక్ తన చేతులతో తయారుచేసిన మట్టి గణేశుడి విగ్రహాన్ని మేయర్‌కు అందించారు. విద్యార్థి కళాత్మక ప్రతిభను, భక్తి భావాన్ని గౌరవిస్తూ తావ్డే ఆ విగ్రహాన్ని తన నివాసంలో ప్రతిష్ఠించారు. గణేశ్ పూజకు రితిక్, అతని తల్లిని కూడా ఆహ్వానించారు. మేయర్ నివాసంలో ఒకటిన్నర రోజుల గణేశోత్సవం సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. పూలు, ఇతర పర్యావరణహిత వస్తువులతో అలంకరణలు చేశారు. ఈ సందర్భంగా తావ్డే మాట్లాడుతూ మహారాష్ట్ర రాష్ట్ర పండుగైన శ్రీ గణేశోత్సవాన్ని పురస్కరించుకుని అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ముంబై నగర ప్రజలకు ఆనందం, సౌభాగ్యం, ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షించారు.ఇదీ చదవండి: లండన్‌లో గంగా హారతి.. చరిత్రలో తొలిసారి! -
‘ఇదేం స్ట్రాటజీ సోదరా?’.. దోస్తీ అంటూనే విజయ్‌తో కుస్తీ!
తమిళనాడులో రాజకీయ సమీకరణాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. విజయ్ ఏర్పాటు చేయబోయే సెక్యులర్ కూటమికి దూరంగా ఉంటామని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. అంతేకాదు.. 120 రోజుల విజయ్ పాలనపై తీవ్ర విమర్శలకు సిద్ధపడినట్లు బహిరంగంగా ప్రకటించాయి. ఇది చాలదన్నట్లు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. ఇవన్నీ డీఎంకేకు లాభం చేకూర్చే నిర్ణయాలేనని, ప్రతిపక్షానికి మళ్లీ అవి దగ్గరవుతున్నాయా? అనే చర్చా జోరందుకుంది.తమిళనాడులో అక్టోబర్ 6న జరగనున్న రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. మదురాంతకంలో సీపీఎం, ధారాపురంలో సీపీఐ అభ్యర్థులను బరిలోకి దించనున్నాయి. సెప్టెంబర్ 15న అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో టీవీకే నేతృత్వంలోని కూటమితో పాటు డీఎంకే, అన్నాడీఎంకే–బీజేపీ కూటమి, నామ్ తమిళర్ కట్చి ఇప్పటికే రంగంలో ఉన్నాయి. వామపక్షాల తాజా నిర్ణయంతో పోరు ఐదు కోణాల్లో సాగనుంది. అయితే ఈ పోటీ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని.. విజయ్ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశాయి. దీంతో బయటి నుంచే సపోర్ట్ చేస్తున్న వామపక్షాలు.. ఉప ఎన్నికల వేళ మాత్రం అదే ప్రభుత్వ అభ్యర్థులకు ఎదురుగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ నిర్ణయం డీఎంకేకు లాభం చేకూర్చేందుకు కాదని లెఫ్ట్ పార్టీలు స్పష్టం చేశాయి. టీవీకే ఏర్పాటు చేయబోయే కొత్త కూటమిలో మేం చేరబోం. మూడు ప్రధాన కూటములకూ వ్యతిరేకంగా మేం పోటీ చేస్తున్నాం. అంతే తప్పా ఏ పార్టీకో లాభం చేకూర్చేందుకు మేం పోటీ చేయడం లేదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం తేల్చిచెప్పారు. బయట మద్దతు.. లోపల విమర్శలు2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మెజార్టీకి కొంత దూరంలో నిలిచిన విజయ్ ప్రభుత్వానికి సీపీఐ, సీపీఎం బయట నుంచి మద్దతు ప్రకటించాయి. ప్రజల తీర్పును గౌరవించడం, గవర్నర్ పాలనకు అవకాశం లేకుండా చూడటం, పరోక్షంగా బీజేపీ పాలన రాకుండా అడ్డుకోవడమే తమ మద్దతు ఉద్దేశమని అప్పట్లో వామపక్షాలు తెలిపాయి. అయితే కేబినెట్లో మాత్రం చేరలేదు. అలాగే టీవీకే అధికారిక కూటమిలోనూ భాగం కాలేదు.ఇప్పుడు ఉప ఎన్నికల్లో మాత్రం టీవీకే అభ్యర్థులపై పోటీకి దిగుతున్నాయి. దీంతో ‘ప్రభుత్వానికి మద్దతు.. అభ్యర్థులకు వ్యతిరేకం’ అనే వామపక్షాల వైఖరి రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. దీనిపై విమర్శలు వచ్చినా.. ఉప ఎన్నికలు ప్రభుత్వం మార్పు కోసం జరిగేవి కావని షణ్ముగం స్పష్టం చేశారు. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయడం తమ రాజకీయ నిర్ణయమని తెలిపారు.120 రోజుల పాలనపై ప్రచారంలోనే కౌంటర్ఉప ఎన్నికల ప్రచారాన్ని విజయ్ ప్రభుత్వంపై విమర్శలకు వేదికగా చేసుకుంటామని సీపీఎం ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వ తొలి 120 రోజుల పాలన, ఆర్థిక విధానాలు, పరిపాలనా చర్యలు, అసెంబ్లీ పనితీరుపై తమ అభిప్రాయాలను ప్రజలకు వివరిస్తామని షణ్ముగం చెప్పారు. ముఖ్యంగా ‘నియో లిబరల్’ ఆర్థిక విధానాలపై తమ అభ్యంతరాలను ప్రచారంలో ప్రస్తావిస్తామన్నారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లో పారదర్శకత ఉండాలని వామపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. విదేశీ పెట్టుబడులతో పాటు స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాయి.సచివాలయం విషయంలోనూ విభేదాలుచెన్నైలోని పట్టినప్పాక్కంలో కొత్త సచివాలయం, అసెంబ్లీ సముదాయం నిర్మించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపైనా వామపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయంపై మత్స్యకారుల జీవనోపాధి, పర్యావరణం, ట్రాఫిక్ తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించాలని కోరాయి. అసెంబ్లీలో డీఎంకే అధినేత స్టాలిన్‌పై విజయ్ చేసిన వ్యాఖ్యలు, చేతి సైగలపైనా సీపీఎం గతంలో తీవ్రంగా స్పందించింది. సభను వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చొద్దని షణ్ముగం సూచించారు.‘ఇది ప్రజలపై రుద్దిన ఎన్నిక’మదురాంతకం, ధారాపురం ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయన్న దానిపైనా వామపక్షాలు టీవీకేపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 2026 ఎన్నికల్లో ఈ రెండు స్థానాల నుంచి అన్నాడీఎంకే తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కే. మరగతం కుమారవేల్, పి. సత్యబామలు ఆ తర్వాత రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఇప్పుడు అదే స్థానాల నుంచి టీవీకే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.ఎన్నికైన కొద్ది రోజులకే ఎమ్మెల్యేలు పార్టీ మారి రాజీనామా చేయడం ప్రజల తీర్పును అవమానించడమేనని సీపీఎం విమర్శించింది. ఈ పరిణామాల వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని.. ఇవి సహజంగా వచ్చిన ఎన్నికలు కావని, ప్రజలపై రుద్దిన ఎన్నికలని షణ్ముగం వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పు వెనుక ‘హార్స్ ట్రేడింగ్’ జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు.రెండు సీట్లలో గెలిస్తే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తమ గొంతును మరింత బలంగా వినిపించవచ్చన్నది వామపక్షాల లెక్క. అందుకే ప్రభుత్వం విషయంలో విజయ్‌కు మద్దతు కొనసాగిస్తూనే.. ఎన్నికల విషయంలో మాత్రం టీవీకేను ఢీకొట్టాలని నిర్ణయించాయి. అంటే.. ప్రభుత్వం నిలబడేందుకు దోస్తీ.. తమ రాజకీయ బలం చాటుకునేందుకు కుస్తీ! ఇదే ఇప్పుడు తమిళనాడు ఉప ఎన్నికల్లో లెఫ్ట్ అనుసరిస్తున్న ‘ఇదేం స్ట్రాటజీ సోదరా?’ అనే ప్రశ్నకు అసలు సమాధానం.ఇదీ చదవండి: బిహార్‌లో బీజేపీకి ఝలక్ -
‘యూపీ’ ఎన్నికలు: రెండు శాతమున్న ‘జాట్’లే శాసనకర్తలుగా..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర జనాభాలో జాట్ సమాజం వాటా కేవలం రెండు శాతం మాత్రమే అయినప్పటికీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని పలు నియోజకవర్గాల్లో ఆ వర్గం ఓట్లు ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. అందుకే 2027 ఎన్నికలకు ముందు జాట్ ఓటర్లను ఆకర్షించడం అధికార ఎన్డీఏతో పాటు సమాజ్‌వాదీ పార్టీ–కాంగ్రెస్ కూటమికి కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.పశ్చిమ యూపీలో బలమైన పట్టుజాట్ సమాజానికి చెందిన పెద్ద సంఖ్యలో ప్రజలు సంప్రదాయంగా వ్యవసాయంపై ఆధారపడుతుంటారు. రాజకీయంగా వారు చాలాకాలంగా జాతీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)కి దగ్గరగా ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూడా జాట్ సమాజంలో తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. ఫలితంగా జాట్ ఓటర్లలో ఒక వర్గం బీజేపీ వైపు మళ్లింది. అయినప్పటికీ ఆర్ఎల్డీ ఇప్పటికీ ఆ సమాజంలో గణనీయమైన మద్దతును కొనసాగిస్తోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో దాదాపు 99 శాతం జాట్ జనాభా ఉంది. ఈ ప్రాంతంలో 136 అసెంబ్లీ, 27 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల విశ్లేషకుల అంచనా ప్రకారం 35 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో జాట్ ఓట్లు బలమైన ప్రభావం చూపనున్నాయి. దాదాపు 50 స్థానాల్లో ఎన్నికల పోటీలో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంది.2007–2012లో ఆర్ఎల్డీ ఆధిపత్యంజాట్ ఓటర్ల రాజకీయ వైఖరిలో గత రెండు దశాబ్దాల్లో గణనీయమైన మార్పులు కనిపించాయి. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎల్డీకి జాట్ ఓట్లలో 61 శాతం లభించగా, బీజేపీ+కు సుమారు 18 శాతం వచ్చాయి. బీఎస్పీకి 10 శాతం, ఎస్పీకి 8 శాతం, కాంగ్రెస్‌కు 2 శాతం జాట్ ఓట్లు లభించాయి. ఆ ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ విజయం సాధించింది. 2012లో ఆర్ఎల్డీ తన జాట్ ఓటు ఆధిక్యాన్ని కొనసాగించినప్పటికీ వాటా 45 శాతానికి తగ్గింది. బీఎస్పీ 16 శాతం, కాంగ్రెస్ 11 శాతం, బీజేపీ 7 శాతం, ఎస్పీ 7 శాతం జాట్ ఓట్లు పొందాయి. ఈ ఎన్నికల్లో ఆర్ఎల్డీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన విషయం గమనార్హం. అదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకుంది.2017లో మారిన రాజకీయ గణితం2017 అసెంబ్లీ ఎన్నికలు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచాయి. 403 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 300కుపైగా సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో జాట్ ఓట్లలోనూ బీజేపీ గణనీయంగా చొచ్చుకుపోయింది. మరోవైపు ఆర్ఎల్డీ ప్రభావం బలహీనపడింది. ఆ పార్టీ కేవలం ఒక్క స్థానంలో గెలిచి, రాష్ట్రవ్యాప్తంగా 1.80 శాతం ఓట్లకే పరిమితమైంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 24 జిల్లాల్లో 126 స్థానాలకు గాను బీజేపీ 100 స్థానాలను గెలుచుకోవడం ఆ ప్రాంతంలో పార్టీ బలాన్ని స్పష్టం చేసింది.2022లో బీజేపీకి ఎదురుదెబ్బలు2022 ఎన్నికల్లోఆర్ఎల్డీ, ఎస్పీతో జతకట్టింది. వ్యవసాయ చట్టాల వ్యతిరేకత నేపథ్యంలో జాట్ సమాజంలో బీజేపీపై ఉన్న అసంతృప్తి తమ కూటమికి అనుకూలంగా మారుతుందని ఎస్పీ-ఆర్ఎల్డీ భావించింది. అయితే ఆశించిన స్థాయిలో అది జరగలేదు. పశ్చిమ యూపీలో బీజేపీ 85 స్థానాలు గెలుచుకోగా, ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి 41 స్థానాలు సాధించింది. అయినప్పటికీ జాట్ ప్రాబల్యం ఉన్న కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. షామ్లీ జిల్లాలోని మూడు స్థానాలన్నింటినీ, మీరట్‌లోని ఏడు స్థానాల్లో నాలుగింటిని, ముజఫర్‌నగర్‌లోని ఆరు స్థానాల్లో నాలుగింటిని బీజేపీ కోల్పోయింది. మురాదాబాద్‌లోని ఆరు స్థానాలన్నింటిలోనూ రాంపూర్, సంభల్ జిల్లాల్లో కలిపి నాలుగు స్థానాల్లో మూడింటిలోనూ ఓటమి ఎదురైంది. ఇదే ఎన్నికల్లో ఆర్ఎల్డీ ఎనిమిది స్థానాలు గెలుచుకుంది.2027 కోసం పార్టీల వ్యూహాలుపశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జాట్ ఓట్ల ప్రాధాన్యాన్ని బీజేపీ నాయకత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో 2022 ఆగస్టులో జాట్ నేత భూపేంద్ర సింగ్ చౌధరీని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. అయితే 2025 డిసెంబరులో జరిగిన మార్పుల్లో ఆయన స్థానంలో కుర్మీ సామాజిక వర్గానికి చెందిన పంకజ్ చౌధరీని నియమించారు. మరోవైపు జయంత్ చౌధరీ నాయకత్వంలోని ఆర్ఎల్డీ ఇప్పుడు ఎన్డీఏలో భాగంగా ఉంది. జాట్ సమాజంలో తన మద్దతును మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ కూటమి బీజేపీకి ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నాయకత్వ నిర్మాణం, టికెట్ల కేటాయింపులో జాట్లకు ప్రాతినిధ్యం పెంచే అంశాన్ని కూడా బీజేపీ పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. సంజీవ్ బలియాన్, సత్యపాల్ సింగ్ వంటి నేతలు జాట్ సమాజంలో బీజేపీ మద్దతును పెంచడంలో కీలకంగా మారవచ్చు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మాజీ ప్రధాని చౌధరీ చరణ్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వడం కూడా జాట్ సమాజానికి బీజేపీ ఇచ్చిన రాజకీయ సంకేతంగా విశ్లేషిస్తుంటారు. ఇదిలా ఉండగా 2027 అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను బీజేపీ వేగవంతం చేసింది.ఇదీ చదవండి: బిగ్‌బాస్: మేరీ కోమ్ వ్యాఖ్యలపై దుమారం.. టీమ్ క్షమాపణలు! -
‘నాపై అంత జాలి ఉంటే..’ కల్యాణ్‌కు బైకర్ సియా కౌంటర్
రోడ్డుపై వెళ్తున్న ఓ యువతి బైక్‌ను కారు ఢీకొట్టడం.. ఆమె కిందపడిపోయినా వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోవడం.. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. గురుగ్రామ్‌లో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. తనను కారు కావాలనే వెంబడించి ఢీకొట్టారని బైకర్ ‘రెబల్ వీల్స్ సియా’ ఆరోపిస్తుండగా.. నిందితుడి తరఫు న్యాయవాది మాత్రం తప్పంతా బైకర్లదేనని అంటున్నాడు.గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగింది. సియా తన ఏప్రిలియా ఆర్ఎస్ 457 స్పోర్ట్స్ బైక్‌పై తోటి బైకర్లతో కలిసి వెళ్తోంది. ఆ సమయంలో తెల్లరంగు సెడాన్ తమను వెంబడించిందని ఆమె చెబుతోంది. కారులోని వారు తనకు దగ్గరగా వచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తించారని, దూరంగా ఉండాలని తాను సూచించినా.. బైక్‌ను ఆపాలని సైగలు చేశారని ఆమె ఆరోపించింది. చివరకు కారు పక్క నుంచి వచ్చి తన బైక్‌ను ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయానని తెలిపింది.‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని’ప్రమాదంపై తొలిసారి స్పందించిన సియా.. నిందితుడు కల్యాణ్ బైన్స్లా చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ‘నాపై జాలిపడుతున్నానని చెబుతున్నారు. నిజంగా జాలిపడితే ప్రమాదం తర్వాత ఎందుకు ఆపలేదు?’ అని ప్రశ్నించింది. తనను కారు చాలా దూరం వెంబడించిందని చెబుతూ.. ‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని. ఎముకలు విరిగిపోయేంత తీవ్ర గాయాలు కూడా అయ్యుండొచ్చు’ అని పేర్కొంది.కారు తనను వెంబడించలేదన్న వాదనను కూడా ఆమె ఖండించింది. ‘నా జుట్టు కనిపించింది.. నా దగ్గరకు వచ్చారు.. ఆపాలని సైగ చేశారు. అలాంటప్పుడు బైక్‌పై మహిళ ఉందో లేదో తెలియదని ఎలా చెబుతారు?’ అని ప్రశ్నించింది. ప్రమాదానికి సంబంధించిన రెండు వీడియోల్లోనూ కారు తన బైక్ వైపు లేన్ మార్చి ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపింది.This isn't hit and run... it's hit and kill 🖐️Car No: HR 30Y 4949In Gurugram, first a female bike rider was harassed by 4 louts sitting in a Verna car, they made vulgar vulgar gestures When the girl stopped them from doing so and told them to leave, the beasts rammed her… pic.twitter.com/W1141MIGSJ— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 14, 2026కొత్త వీడియో.. మరో కోణంలో ఢీకొట్టిన దృశ్యంఈ ఘటనకు సంబంధించి సియా వెనుకే వస్తున్న మరో బైకర్ రికార్డు చేసిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో కారు సియా బైక్ వైపు వచ్చి ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. కారు తమను చాలా దగ్గరగా వెంబడించిందని, డ్రైవర్ కిటికీ దించి ఆపాలని సైగ చేశాడని ఆ బైకర్ ఆరోపించాడు. ప్రమాదం తర్వాత కారు వెళ్లిపోవడంతో తాను దాన్ని వెంబడించి డ్రైవర్ ముఖాన్ని కెమెరాలో రికార్డు చేశానని చెప్పాడు. ప్రమాదం కారణంగా సియాకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అయితే రైడింగ్ గేర్ ధరించి ఉండటంతో తీవ్ర గాయాలు తప్పాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్ మాత్రం దెబ్బతింది.‘కారులో నలుగురు.. మద్యం మత్తులో ఉన్నారు’సియా సోదరుడు కూడా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రమాదం జరిగిన వెంటనే తనకు సియా ఫోన్ చేసి.. ఎవరో కారుతో ఢీకొట్టి వెళ్లిపోయారని చెప్పిందన్నాడు. కారులో నలుగురు ఉన్నారని, వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించారని ఆమె చెప్పినట్లు వెల్లడించాడు. కారులోని వారు అసభ్యకరమైన సైగలు చేశారని కూడా ఆరోపించాడు. సియా తండ్రి ఈ ఘటనను సాధారణ ప్రమాదంగా చూడలేమని, ఇది హత్యాయత్నంగా భావిస్తున్నామని అన్నారు. రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్ కూడా లేదని.. అలాంటి సమయంలో ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.‘తప్పంతా బైకర్లదే’.. నిందితుడి తరఫు వాదనగురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్యాణ్ బైన్స్లా బాడీబిల్డర్, జిమ్ ట్రైనర్. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ‘ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్’, ‘ఇండియన్ రగ్బీ టీమ్ సభ్యుడు’గా రాసుకున్నాడు. హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్ బైన్స్లా తరఫు న్యాయవాది మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపించారు. కారులో నలుగురు ఉన్నారని.. వారిలో బంధువులు కూడా ఉన్నారని చెప్పారు. బైకర్లు రోడ్డుపై అడ్డంకిగా మారుతున్నారని, వారి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కారు ఫుట్‌పాత్‌ను తప్పించుకునే క్రమంలో కొంచెం ఎడమవైపు వెళ్లిందని.. అదే సమయంలో యువతి కుడివైపు రావడంతో ఢీకొట్టిందని న్యాయవాది చెప్పారు. ప్రమాదం తర్వాత ఆపకపోవడానికి కారణం అక్కడ గుమిగూడిన వారు దాడి చేస్తారనే భయమేనని, ఆ పరిస్థితుల్లో కారు వెళ్లిపోయిందని తెలిపారు. సియా సోషల్ మీడియాలో ఫాలోవర్లు, వ్యూస్ కోసం ఘటనను ప్రచారం చేస్తోందని కూడా ఆరోపించారు. ఆమె బైక్ వేగం గంటకు 140–170 కిలోమీటర్ల వరకు ఉందని వాదించారు.కారు ఎవరిది?ప్రమాదానికి ఉపయోగించిన కారు హరియాణాలోని పల్వాల్‌కు చెందిన మనీష్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను ఆ సమయంలో కారులో లేనని మనీష్ స్పష్టం చేశాడు. తాను ఆర్మీలో పనిచేస్తున్నానని, ఘటన జరిగిన సమయంలో అసోంలో విధుల్లో ఉన్నానని చెప్పాడు. ఆదివారం తన కుటుంబానికి చెందిన కారును ఓ స్నేహితుడు తీసుకెళ్లాడని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాతే ప్రమాదం విషయం తనకు తెలిసిందని వివరించాడు.పోలీసుల దర్యాప్తుకల్యాణ్ బైన్స్లా మాత్రం తాను కావాలనే బైకర్‌ను ఢీకొట్టలేదని చెబుతున్నాడు. బైకర్ అధిక వేగంతో వెళ్తుండగా, తాను కారు మలుపు తిప్పే సమయంలో ఢీకొన్నట్లు అతడి వాదన. ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడానికి బైకర్ల గుంపు దాడి చేస్తుందనే భయమే కారణమని కూడా అతడి తరఫున వాదన వచ్చింది. అయితే మహిళా బైకర్ మాత్రం కారు తనను ఉద్దేశపూర్వకంగా వెంబడించి ఢీకొట్టిందని ఆరోపిస్తోంది. ఈ రెండు వాదనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గురుగ్రామ్ పోలీసులు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వైరల్ వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, కారు వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? కారు ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టిందా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: బీజేపీ బిగ్ విక్టరీ -
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ హవా.. కాంగ్రెస్‌కు బిగ్ షాక్
జైపూర్: రాజస్థాన్‌లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. అధికార బీజేపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు గట్టి ఎదురుదెబ్బ తగిలాయి. తాజా ఫలితాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 41 శాతం వార్డులలో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 35 శాతానికే పరిమితమైంది.గత స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ తన ఓటు శాతంలో సుమారు 5 శాతం కోల్పోయింది. రాజస్థాన్‌లో చివరి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కారణంగా కొత్తగా 2,770 వార్డులు (37శాతం పెరుగుదల) చేరాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం వార్డుల సంఖ్య 10,244కి చేరింది.నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తొలిసారి జరిగిన మొత్తం 10,244 స్థానాల్లో 4,179 వార్డులను కైవసం చేసుకుని, మొత్తం స్థానాల్లో 40.8% వాటాను దక్కించుకుంది. గతంతో పోలిస్తే బీజేపీ గెలిచిన స్థానాల సంఖ్య ఏకంగా 57శాతం పెరిగింది. కాంగ్రెస్ 3,613 వార్డులను మాత్రమే గెలుచుకుని 35.3శాతం వాటాను సొంతం చేసుకుంది.గత ఎన్నికలతో పోలిస్తే పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఏకంగా 2,273 వార్డులలో గెలుపొంది 22.2శాతం వాటాను సాధించారు. మొత్తం మీద కాంగ్రెస్ కంటే బీజేపీ 566 వార్డులు ఆధిక్యంలో నిలిచింది. ప్రధాన పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ,సీపీఐ(ఎం),రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ వంటి ఇతర పార్టీలు సైతం కొన్ని ప్రాంతాల్లో మంచి స్థానాలను కైవసం చేసుకున్నాయి. -
కేంద్ర మంత్రి నివాసంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
సోమవారం వినాయక చవితి పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీలోని పీయూష్ గోయల్ ఇంటికి వెళ్లిన మోదీ గణపతి బప్పాను దర్శించుకున్నారు. అనంతరం హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ గణేశుడి కృప అందరిపై ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అనంతరం గణపతి బొప్ప మోరియా అని మోదీ తన నోటి వెంట పలికారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఇంట్లో గణేషుడికి చేసిన పూజ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ స్వయంగా తన ‘ఎక్స్’లో పంచుకున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రధాని మోదీ స్పందిస్తూ..‘‘నా తోటి పౌరులందరికీ హృదయపూర్వక గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. విఘ్న నివారకుని దర్శన పూజలకు సంబంధించిన ఈ పవిత్ర పండుగ ప్రతిఒక్కరి జీవితాల్లోకి నూతన శక్తిని, తాజా ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను. ఆయన దివ్య ఆశీస్సులతో అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అంటూ ముగించారు.VIDEO | Delhi: Prime Minister Narendra Modi participates in Ganesh Utsav at Union Minister Piyush Goyal’s residence.(Source: PM Modi's YT)(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/l1kLZzNxBg— Press Trust of India (@PTI_News) September 14, 2026ఇదీ చదవండి: గురుగ్రామ్ ఘటన.. సియా కుటుంబం చెప్పిన మరో కోణం! -
గురుగ్రామ్ ఘటన.. సియా కుటుంబం చెప్పిన మరో కోణం!
సాక్షి, న్యూఢిల్లీ: గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ బైకర్‌ను కారు వెంబడించి ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. సియా అనే యువతి ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఆమె సోదరుడు తెలిపారు. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వారు మద్యం మత్తులో ఉన్నట్లు ఆయన ఆరోపించారు.సియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెతో పాటు మరికొందరు బైకర్లు రోడ్డుపై వెళ్తుండగా ఓ కారు వెనుక నుంచి వారిని అనుసరించింది. దాంతో కారు దూరంగా ఉండాలని సైగ చేసినప్పటికీ, అది ఆమె బైక్ వైపు వచ్చి ఢీకొట్టినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఆమెను కారు ఢీకొనడంతో సియా బైక్ నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. న్యాయవాది కూడా పోలీస్ అధికారులను కలిసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సియా సోదరుడు తెలిపారు.అయితే, కారు డ్రైవర్ మాత్రం మరోలా చెప్పాడు. యూటర్న్ వద్ద కారు అదుపుతప్పడంతోనే బైక్‌ను తాకిందని, కావాలని ఢీకొట్టలేదని పేర్కొన్నాడు. అలాగే, తాను బైకర్ అక్కడ ఉన్న విషయాన్ని సరిగ్గా గమనించలేదని చెప్పాడు.ఆ సమయంలో రోడ్డుపై సుమారు 20 నుంచి 22 మంది బైకర్లు ఉన్నారని డ్రైవర్ తెలిపాడు. వారిని నెమ్మదిగా వెళ్లాలని మాత్రమే సూచించానని, ఎలాంటి అసభ్యకర సైగలు చేయలేదని, కారు ఆపితే బైకర్లు తనపై దాడి చేస్తారనే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయానని డ్రైవర్ చెప్పాడు. మరోవైపు ఈ ఘటనపై సియా కుటుంబం మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.సియాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్, బైకర్ చెప్పిన విషయాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: నాలుగేళ్ల తర్వాత బీజేపీ కార్యకర్త అస్థిపంజరం వెలికితీత -
జేడీయూ యూటర్న్.. షాక్‌లో బీజేపీ!
బీహార్‌లో అధికార ఎన్డీయే కూటమికి జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) ఊహించని షాక్ ఇచ్చింది. పార్లమెంట్లో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లుకు మద్దతు తెలిపినప్పటికీ, బీహార్‌లో మాత్రం దానిని అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామం బీజేపీని షాక్‌కు గురి చేసినట్లయింది. ఇదే విషయమై జేడీయూ సీనియర్ నేత శ్యామ్ రజక్ మాట్లాడుతూ.. "పార్లమెంటులో బిల్లుకు మద్దతు పలికినప్పటికీ, బీహార్‌లో యూసీసీ అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం. మా పార్టీ అధినేత నితీశ్ కుమార్ ఇప్పటికే ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు" అని తేల్చిచెప్పారు.2029 నాటికి 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శ్యామ్ రజక్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం బీహార్‌లో బీజేపీ-జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శ్యామ్ రజక్ స్పందిస్తూ, ప్రభుత్వం మిత్రపక్షాల మద్దతుతోనే నడుస్తుందన్న విషయాన్ని గుర్తుచేశారు. యూసీసీపై తమ వైఖరి అత్యంత సుస్పష్టంగా ఉన్నందున, రాష్ట్రంలో దాని అమలు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, ఈ పరిణామాలపై ప్రతిపక్ష ఆర్జేడీ స్పందించింది. ఇటీవల ఎదురైన రాజకీయ ఎదురుదెబ్బల తర్వాత బీజేపీ మళ్లీ 'ద్వేష రాజకీయాల'కు పాల్పడుతోందని ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తి యాదవ్ విమర్శించారు. బీహార్ ప్రజలు లౌకికవాదులని, రాష్ట్రంలో యూసీసీని అమలు చేయాలని చూస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన హెచ్చరించారు.ఇదీ చదవండి: కవిత జోరు.. మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త సారథులు -
సంక్షోభంలో నేపాల్.. వెలుగులు పంచుతున్న భారత్
నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలతో జలవిద్యుత్ మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లడంతో.. ఆ దేశానికి రోజుకు 18 గంటల చొప్పున విద్యుత్ ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించింది. సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ విద్యుత్ సరఫరా కొనసాగనుంది. గరిష్ఠంగా 654 మెగావాట్ల విద్యుత్‌ను నేపాల్‌కు అందించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.ఇటీవలి వరదల కారణంగా నేపాల్‌లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా దెబ్బతింది. సుమారు 550 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిన్నట్లు అంచనా. దీంతో దేశీయ విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో పాటు, భారత్‌కు నేపాల్ నుంచి జరిగే విద్యుత్ ఎగుమతులు కూడా సుమారు 400 మెగావాట్ల మేర తగ్గాయి.ఈ పరిస్థితుల్లో విద్యుత్ కొరతను అధిగమించేందుకు భారత్ నుంచి విద్యుత్ దిగుమతి చేసుకోవాలని నేపాల్ కోరింది. ఆ అభ్యర్థనను భారత్ ఆమోదించింది. రోజులో 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇందులో గరిష్ఠంగా 600 మెగావాట్ల విద్యుత్‌ను ముజఫర్‌పూర్-ఢల్కేబర్ 400 కేవీ ప్రసార మార్గం ద్వారా, మరో 54 మెగావాట్లను టనక్పూర్-మహేంద్రనగర్ 132 కేవీ మార్గం ద్వారా అందించనున్నారు.ఈ సరఫరా సమయం ప్రధానంగా పగటి వేళల్లో ఉండేలా నిర్ణయించారు. భారత్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తి అధికంగా ఉండే సమయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా రెండు దేశాల విద్యుత్ వ్యవస్థలకు ప్రయోజనం కలిగేలా ఈ ఏర్పాటును రూపొందించారు. నేపాల్‌లో జలవిద్యుత్ రంగం దేశ విద్యుత్ అవసరాల్లో అత్యంత కీలకమైనది కావడంతో వరదల ప్రభావం అక్కడి విద్యుత్ వ్యవస్థపై తీవ్రంగా పడింది.డిసెంబర్లో ఈ ఏర్పాటును మరోసారి సమీక్షించనున్నారు. అవసరాన్ని బట్టి 2027 జనవరిలో కూడా సరఫరాను కొనసాగించే అవకాశాన్ని పరిశీలించనున్నారు. వరదలతో దెబ్బతిన్న నేపాల్‌కు తక్షణ విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు, భారత్-నేపాల్ మధ్య ఇంధన రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. -
సెకన్లలోనే భారీ చెట్టెక్కిన యువతి.. వైరల్‌గా మారిన వీడియో
హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ పూజా గులేరియా చెట్టుపైకి అత్యంత సులభంగా ఎక్కుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎలాంటి నిచ్చెన, ఇతర సహాయం లేకుండానే ఆమె కొన్ని సెకన్లలో చెట్టు పైభాగంలోని కొమ్మ వరకు చేరడం వీడియోలో కనిపించింది. ఆమె వేగం, శరీర సమతుల్యతను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.పూజా గులేరియా హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్. తన ప్రాంతంలోని జీవన విధానం, పరిసరాలు, బహిరంగ కార్యకలాపాలకు సంబంధించిన దృశ్యాలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటారు. ఆమెకు 3 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. చెట్టెక్కుతున్న ఆమె తాజా వీడియో వైరల్ కావడంతో మరోసారి ఆమె పేరు చర్చలోకి వచ్చింది.ఈ వీడియోను నిఖిల్ సైనీ అనే ఎక్స్ యూజర్ సెప్టెంబర్ 13న షేర్ చేశారు. పూజా చెట్టుపైకి ఎక్కిన తీరును ప్రశంసించిన ఆయన.. జిమ్‌కు క్రమం తప్పకుండా వెళ్లే పలువురు పురుషులు, ప్రొఫెషనల్ క్రీడాకారిణులు కూడా ఇంత సులభంగా చెట్టెక్కలేకపోవచ్చని వ్యాఖ్యానించారు. పూజా శారీరక సామర్థ్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.పూజా ఇంత సులభంగా చెట్టెక్కడం ఎలా సాధ్యమవుతోందన్నది వీడియో చూసినవారిలో ఆసక్తిని పెంచింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాల్లో ప్రకృతితో మమేకమైన జీవన విధానంలో వివిధ రకాల శారీరక, బహిరంగ కార్యకలాపాలు సాధారణంగా కనిపిస్తాయి. పూజా కంటెంట్‌లోనూ హిమాచలీ జీవనశైలి, బయట చేసే కార్యకలాపాల దృశ్యాలు కనిపిస్తాయి.వీడియో చూసి ఎవరైనా చెట్టెక్కేందుకు ప్రయత్నించడం ప్రమాదకరం. చెట్టు ఎత్తు, కొమ్మల బలం, నేల పరిస్థితులను అంచనా వేయకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే గాయాలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పూజా గులేరియా చెట్టెక్కిన ఈ వీడియో ఆమె చురుకుదనం, శారీరక సమతుల్యతపై సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీస్తోంది.She is Pooja Guleria, a Himachali content creator with 3 lakh+ followers was looking at her latest reel and how effortlessly she climbs that tree! Pretty sure even men who go to the gym regularly and pro athlete women would struggle to do this so easily . Quite talented! pic.twitter.com/pmnPYlMLe3— Nikhil saini (@iNikhilsaini) September 13, 2026 -
ఒక్కొక్కరికి రూ.500 చొప్పున పంచిన నేత.. ఆయన ఆస్తులు ఎంతంటే?
పట్నా: బిహార్‌లో భారీ వరదల మధ్య పూర్ణియాకు చెందిన స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున నగదు అందించడంతో పాటు బియ్యం, అటుకులు, పిండి, ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. మహిళలకు శానిటరీ ప్యాడ్లు అందించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పడవలను కూడా ఏర్పాటు చేశారు.పట్నాలోని దీఘా ఘాట్, పూర్ణియా, కటిహార్, రాఘోపూర్ ప్రాంతాల్లో పప్పూ యాదవ్ సహాయక సామగ్రి పంపిణీ చేశారు. వరద నీటిలోకి వెళ్లి బాధితులను కలుస్తున్న ఆయనకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వద్ద ఉన్న ఆస్తులపై కూడా చర్చ మొదలైంది.సహాయక చర్యల సందర్భంగా పప్పూ యాదవ్ తన వద్ద ప్రభుత్వం వద్ద ఉన్నదానికంటే కూడా ఎక్కువ డబ్బు ఉందని వ్యాఖ్యానించారు. రేషన్ సరిపోకపోవడంతో ప్రజల అవసరాలు తీర్చేందుకు నేరుగా నగదు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. పట్నాలో సహాయక సామగ్రి పంపిణీ సమయంలో జనాల రద్దీని ఉపయోగించుకుని ఆయన బ్యాగ్ లేదా జేబు నుంచి సుమారు రూ.లక్ష చోరీ అయినట్లు కూడా సమాచారం వెలువడింది. వరద సహాయక చర్యలపై బిహార్, కేంద్ర ప్రభుత్వాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.గత లోక్‌సభ ఎన్నికల సమయంలో పప్పూ యాదవ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ రూ.12,08,84,682, అంటే సుమారు రూ.12.08 కోట్లు. ఆయన మొత్తం అప్పులు రూ.1,72,36,808, అంటే సుమారు రూ.1.72 కోట్లు అని అందులో పేర్కొన్నారు.అఫిడవిట్ ప్రకారం ఆయనకు ఇన్నోవా కారు, సుమారు 204 గ్రాముల బంగారం ఉన్నాయి. నివాస, వాణిజ్య భూములకు సంబంధించిన స్థిరాస్తులు కూడా అందులో నమోదయ్యాయి. అయితే ఇవి 2024 ఎన్నికల సమయంలో స్వయంగా ప్రకటించిన వివరాలు మాత్రమే. View this post on Instagram A post shared by Rajesh Ranjan (@pappuyadavjapl) -
మహిళా బైకర్ ఘటన : నిందితుడు జిమ్ ఓనర్, బాడీ బిల్డర్?
హర్యానాలోని గురుగ్రామ్‌లో తన స్నేహితుడి మారుతి సియాజ్ కారుతో మహిళా బైకర్ సియాను ఢీకొట్టిన ఘటనలో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. సియా పట్ల అనుచితంగా ప్రవర్తించి, వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది.దీంతో కారు యజమాని స్పందించారు. తన కారును రెండు రోజుల కరితం స్నేహితుడి కిచ్చానని, తనకు ఈ ప్రమాదానికి సంబంధం లేదని వివరణ ఇచ్చాడు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కళ్యాణ్ బైన్స్లా వెలుగులోకి వచ్చాడు. దీంతో నిందితుడి వివరాలు నెట్టింట సంచలనంగా మారాయి. అలాగే ఈ కేసును స్యుమోటోగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. పల్వాల్‌కు చెందిన, KBT జిమ్ యజమాని అని తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్ ఫోటోలో కండలుతిరిగి ఫోటోలతోపాటు, తనను తాను 'అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్, 'భారత రగ్బీ జట్టు' సభ్యుడిని అని చెప్పుకున్నాడు. అతను 'అమెచ్యూర్ ఒలింపియా ఇండియా'(Amateur Olympia India) అనే బాడీ బిల్డింగ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచానని కూడా అతను పేర్కొన్నాడు. అయితే ఈ వివరాలను ధృవీకరించాల్సి ఉంది. బైన్స్లా ఇన్‌స్టాలో కసరత్తు చేస్తూ, కండలు చూపిస్తూ కనిపిస్తాడు. ఇతనికి ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. అయితే ఈ ఘటన తరువాత అతని అకౌంట్‌ను డియాక్టివేట్ చేశాడు.ఇదీ చదవండి: మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటనఢిల్లీ-ఎన్సీఆర్ రోడ్లపై భద్రత మరింత ప్రశ్నార్థకంగా నిలిచింది. . ఒక మహిళ బైక్ నడపడాన్ని జీర్ణించుకోలేక, నిన్న గురుగ్రామ్ రోడ్లపై అనే మహిళా మోటార్‌సైక్లిస్ట్‌ను ఢీకొట్టడం ద్వారా కళ్యాణ్ బైన్స్లా ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశాడు సోషల్‌మీడియాలో దుమారం రేగింది.కండలు పెంచినంత మాత్రాన నువ్వు 'మర్ద్' (అసలైన మగాడివి) అయిపోవు. అలా ఒకరిని గుద్ది పారిపోవడం కరెక్ట్ కాదు అంటూ మండి పడుతున్నారు.ఇదీ చదవండి: గురుగ్రామ్‌లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్‌మాట’!కాగా ఆదివారం రాత్రి, కారులోని వ్యక్తులు తనను వేధిస్తున్న వీడియోను ఆ మహిళ షేర్ చేశారు. ఈ వీడిమో కారు కుడివైపుకు దూసుకెళ్లి, ఆమెను పక్క నుండి ఢీకొట్టి, వేగంగా వెళ్లిపోయింది. ఆమె రోడ్డుపై పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. -
నాలుగేళ్ల తర్వాత బీజేపీ కార్యకర్త అస్థిపంజరం వెలికితీత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో మరణించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కార్యకర్త ఆస్తిక్ చంద్ర దాస్ అస్థిపంజరాన్ని నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు సమాధి నుంచి వెలికితీశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖాలీలో జరిగిన ఈ ప్రక్రియను కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించారు. అస్థిపంజరాన్ని పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.సందేశ్‌ఖాలీలోని ఝాంఝనియా గ్రామానికి చెందిన ఆస్తిక్ చంద్ర దాస్ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో మరణించారు. ఆయన మరణానికి అసలు కారణం ఏమిటో నిర్ధారించేందుకు తాజాగా సమాధి నుంచి అస్థిపంజరాన్ని బయటకు తీశారు. పోలీసు అధికారి వివరాల ప్రకారం, మేజిస్ట్రేట్, మృతుడి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. మొత్తం వ్యవహారాన్ని వీడియోగా కూడా రికార్డు చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన సమయంలో ఆస్తిక్ చంద్ర దాస్‌పై దాడి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. మృతుడి కుమారుడు సుబ్రత దాస్ మాట్లాడుతూ.. దాడి తర్వాత తన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారని, దీంతో ఆయన ఇంట్లోనే మరణించారని ఆరోపించారు. ఈ ఘటన తర్వాత ఇంటి బయట పోలీసులు మోహరించారని, పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాన్ని ఖననం చేయాల్సి వచ్చిందని కుటుంబం పేర్కొంది.ప్రభుత్వం మారడంతో చర్యలు రాష్ట్రంలో ప్రభుత్వం మారాక కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో అస్థిపంజరాన్ని వెలికితీసే ఆదేశాలు వచ్చాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ఈ ఘటనను 2021 ఎన్నికల అనంతరం పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులకు ఉదాహరణగా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, దోషులకు శిక్ష పడుతుందని అన్నారు.అవసరమైతే సీబీఐ దర్యాప్తు చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రస్తుతం పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల నివేదికలపై ఈ కేసులో తదుపరి చర్యలు ఆధారపడనున్నాయి. -
కోట్లాది మందికి నేపాల్ వరదల తరహా ముప్పు
హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాలు గత దశాబ్దంతో పోలిస్తే మరింత వేగంగా కరుగుతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ ప్రాంతం కీలకమైన మలుపు దిశగా వెళ్తోందని, శతాబ్దం మధ్య నాటికి గరిష్ఠ నీటి ప్రవాహ దశకు చేరుకున్న తర్వాత నదుల్లో నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. దీనివల్ల కోట్లాది మంది ప్రజల తాగునీరు, వ్యవసాయం, జీవనోపాధిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.అధ్యయనం ప్రకారం హిందూకుష్-హిమాలయ ప్రాంతంలో ఇటీవలి దశాబ్దాల్లో హిమనీనదాల ద్రవ్యరాశి వేగంగా తగ్గుతోంది. ఈ విస్తారమైన పర్వత వ్యవస్థ అఫ్గానిస్థాన్ నుంచి మయన్మార్ వరకు 8 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 40,000 హిమనదాలు ఉన్నప్పటికీ భూమిపై కేవలం 21 హిమనదాలనే పర్యవేక్షిస్తున్నారని అధ్యయనం తెలిపింది.భారత్‌లో దాదాపు 200 హిమనీనద సరస్సులను అధిక ప్రమాదకరమైనవిగా గుర్తించారు. వాటిలో 56 అత్యంత అధిక ప్రమాద స్థాయిలో ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. హిమనీనదాలు వెనక్కి తగ్గడంతో వాటి వెనుక అస్థిరమైన సరస్సులు ఏర్పడుతున్నాయని, అవి ఎప్పుడైనా విరిగి దిగువ ప్రాంతాల్లో భారీ వరదలకు కారణమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.ఆగస్టు చివరలో నేపాల్-టిబెట్ సరిహద్దులో హిమనీనదం అకస్మాత్తుగా కూలిపోవడం వల్ల లోయల్లో వరుసగా కొండచరియలు, వరదలు సంభవించిన ఘటనను అధ్యయనం ప్రస్తావించింది. నేపాల్, చైనా-టిబెట్ ప్రాంతాల్లో ఈ ఘటనలో ఇప్పటివరకు 1,300 మందికి పైగా మరణించినట్లు, 5,300 మందికి పైగా గల్లంతైనట్లు పేర్కొంది.హిమాలయ ప్రాంతం భారత భూభాగంలో సుమారు 18 శాతం ఉన్నప్పటికీ, ప్రకృతి విపత్తుల్లో దాని వాటా దాదాపు 35 శాతంగా ఉందని అధ్యయనం తెలిపింది. హిమనీనదాల కరుగుదలతో వరదలు, కొండచరియలు, కరువులు పెరిగే అవకాశం ఉందని, వ్యవసాయం, జలవిద్యుత్ ప్రాజెక్టులు, రోజువారీ నీటి అవసరాలు ప్రభావితమవుతాయని పేర్కొంది.హిమనదాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రమాదకర సరస్సులను పరిశీలించడం, స్థానిక ప్రజలను విపత్తులకు సిద్ధం చేయడం కీలకంగా మారనుంది. -
ఒరంగుటాన్ కేసు ఒక హెచ్చరిక : జాతీయ భద్రతా ముప్పు
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లాలోని ఒక అడవి ప్రాంతంలో అంతరించిపోతున్న 5 ఒరాంగుటాన్ పిల్లల జాడ రాజకీయ దుమారం రేపుతోంది. భారత దేశ తూర్పు సరిహద్దుల వెంబడి తీవ్రమైన జాతీయ భద్రతా లోపాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సంఘటనపై భొగరాయ్ బిజూ జనతా దళ్ (బీజేడీ) ఎమ్మెల్యే గౌతమ్ బుద్ధ దాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లతో సహా ప్రముఖ జాతీయ దర్యాప్తు సంస్థలచే తక్షణమే సంయుక్త విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. బాలాసోర్ జిల్లాలోని అడవుల్లో లభించిన సంఘటనపై గత 6 రోజులుగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) మరియు అటవీ శాఖ దర్యాప్తు బృందం నిందితులను, వాహనాలను గుర్తించడంలో విఫలమైందని గౌతమ్ బుద్ధ దాస్ విమర్శించారు. ఇదీ చదవండి: మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటనఆందోళనకరం ఈ నేపథ్యంలో దీన్ని చాలా పెద్ద సమస్యగా ముఖ్యమంత్రి ప్రకటించగా ఇందులో ఒక అంతర్జాతీయ ముఠా ప్రమేయం ఉందని అటవీ శాఖ మంత్రి పేర్కొనడం ఎమ్మెల్యే ఉదహరించారు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది కేవలం ఒరంగుటాన్లకు మాత్రమే పరిమితం కాదు. వన్య ప్రాణుల అక్రమ రవాణా అతీతంగా విస్తరించి, జాతీయ భద్రతలో తీవ్రమైన లోపాన్ని సూచిస్తోంది. ఈ ప్రాంతంలో చాంద్ పూర్, ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం వంటి సున్నితమైన రక్షణ స్థావరాలు ఉన్నాయి. అందువల్ల ఈ సమస్య జాతీయ భద్రతకు సంబంధించినదని వేలెత్తి చూపారు. మిజోరం, పశి్చమ బెంగాల్, దిఘా నుంచి సముద్ర మార్గాల ద్వారా లేదా పర్యవేక్షణ లేని గ్రామీణ సరిహద్దు రహదారుల ద్వారా అంతర్జాతీయ సరిహద్దుల గుండా భొగరాయ్లోకి అంతరించిపోతున్న జాతిని అక్రమంగా రవాణా చేసినట్లు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదే వాస్తవమైతే ఈ రవాణా మార్గాలను శత్రు వర్గాలు, ఉగ్రవాదులు, ఆయుధాలు, అక్రమ మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీని రవాణా చేయడానికి తేలికగా ఉపయోగించుకోవచ్చు. బంగ్లాదేశీయులు ఇప్పటికే రాష్ట్రంలోకి చొరబడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: పారాచూట్ ఫెయిల్: ఎముకలన్నీ విరిగి, పైలట్ 50 గంటల తర్వాతఇదే విధమైన ఆందోళనలను ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ వ్యక్తం చేశారు. అక్రమ రవాణాకు గురైన ఒరాంగుటాన్ శిశువులను స్మగ్లర్లు పట్టుబడతామనే భయంతో వదిలివేసి ఉంటారని పేర్కొన్నారు. వారిని తక్షణమే గుర్తించి తగిన దీర్ఘకాలిక చర్యలను చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ ఒరాంగుటాన్ లభ్యతపై కేంద్ర దర్యాప్తు బృందాల దర్యాప్తును తిరస్కరించింది. ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత సున్నితంగా వ్యవహరిస్తుంది. దర్యాప్తు ముఖ్యమంత్రి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్టీఎఫ్, డబ్ల్యూసీసీబీ సంస్థలు ఈ నెట్‌వర్క్‌ను ఛేదించి, దోషులను అరెస్టు చేయగల పూర్తి సామర్థ్యం ఉన్న వృత్తిపరమైన సంస్థలు అని బీజేపీ ఎమ్మెల్యే ఇరాసిష్ ఆచార్య అన్నారు. జంతువుల సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. భువనేశ్వర్ నందన్‌కానన్‌లో 5 ఒరాంగుటాన్లు సురక్షితంగా ఉన్నాయి. వాటికి మంచి సంరక్షణ అందుతోందన్నారు. -
లవర్ కోసం రూ.కోట్ల ఖర్చు.. బ్రేకప్ అయ్యాక తిరిగివ్వాలని కేసు
భారతీయ మూలాలున్న వ్యాపారవేత్త, టీసీఐ ఎక్స్‌ప్రెస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చందర్ అగర్వాల్ తన మాజీ ప్రేయసి ఫెలిషియా లీ నుంచి సుమారు రూ.3.5 కోట్లు తిరిగి ఇప్పించాలంటూ దాఖలు చేసిన కేసును సింగపూర్ హైకోర్టు కొట్టివేసింది. ఆ మొత్తం రుణంగా ఇచ్చినట్లు నిరూపించే ఆధారాలు లేవని, ఎక్కువ భాగం ఖర్చులు బహుమతులేనని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా మాజీ ప్రేయసి న్యాయ ఖర్చులను కూడా చందర్ చెల్లించాలని ఆదేశించింది.చందర్, ఫెలిషియా లీ తొలిసారి 2019లో విమాన ప్రయాణంలో కలుసుకున్నారు. అనంతరం సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం కొనసాగింది. 2022 సెప్టెంబర్‌లో వారి మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది. అయితే అంతకుముందు నుంచే చందర్ ఆమె కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని కోర్టులో వెల్లడైంది.లూయీ విట్టాన్ హ్యాండ్‌బ్యాగ్, ప్రాడా వోచర్లు, ఆపిల్ హెర్మిస్ గడియారాలు వంటి ఖరీదైన వస్తువులను ఆయన కొనిచ్చారు. బార్సిలోనా, లిస్బన్, లండన్ పర్యటనలకు సంబంధించిన విమానాలు, హోటళ్లు, షాపింగ్ ఖర్చులను కూడా భరించారు. 2023 డిసెంబర్లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మార్చి 2024లో చందర్ సింగపూర్ కోర్టును ఆశ్రయించి 4,68,090 సింగపూర్ డాలర్లు, అంటే దాదాపు రూ.3.5 కోట్లు తిరిగి ఇప్పించాలని కోరారు. ఇవి బహుమతులు కాదని, వడ్డీ లేని రుణంగా ఇచ్చిన డబ్బు అని ఆయన వాదించారు.అయితే లీ ఆ వాదనను తిరస్కరించారు. సంబంధం కొనసాగిన సమయంలో తనపై చేసిన ఖర్చులన్నీ స్వచ్ఛందంగా ఇచ్చిన బహుమతులేనని, విడిపోయిన తర్వాత తిరిగి చెల్లించాలనే ఒప్పందం ఎప్పుడూ లేదని తెలిపారు. రుణంగా ఇచ్చినట్లు నిరూపించే స్పష్టమైన ఒప్పందం లేదా ఆధారాలు కూడా కోర్టుకు లభించలేదు. సెప్టెంబర్ 9న ఇచ్చిన తీర్పులో కోర్టు చందర్ వాదనను తోసిపుచ్చింది. ఇక ఈ కేసులో ముందుకు వచ్చే అంశం న్యాయస్థానం ఆదేశించిన న్యాయ ఖర్చుల చెల్లింపే. -
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ దిశ కేసులో సరికొత్త సంచలనం!
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో అత్యంత సంచలన పరిణామం చోటు చేసుకుంది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసుకు సంబంధించి అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ ఎఫ్ఐఆర్లో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేలతో పాటు పలువురు ప్రముఖుల పేర్లు ఉండటం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.దిశా మరణంపై ఆమె తండ్రి సతీష్ సాలియన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. గత నెల ఆగస్ట్ చివరి నాటికి వాదనలు పూర్తి చేసి సెప్టెంబర్ 3న కీలక తీర్పు వెలువరించింది. దాదాపు ఆరేళ్ల పాటు ముంబై పోలీసులు ఈ ఘటనను కేవలం ఆత్మహత్య లేదా ప్రమాదవశాత్తు అకస్మాత్తు మృతి (ADR - Accidental Death Report) కోణంలోనే దర్యాప్తు చేయడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలే ఎక్కువపోలీసుల దర్యాప్తు తీరు ‘సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలను లేవనెత్తుతోందని’, విచారణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా, దిశా మరణించి ఆరేళ్లు గడుస్తున్నా కుటుంబ సభ్యులకు పోస్ట్ మార్టం రిపోర్ట్, ఏడీఆర్ కాపీలను కూడా అందజేయలేదని హైకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులోని అనేక అనుమానాలను పరిగణలోకి తీసుకుంటూ సమగ్ర దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగిస్తూ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.సీబీఐ ఎఫ్ఐఆర్లోని కీలక అంశాలు కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ.. గత వారం దిశా తండ్రి సతీష్ సాలియన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆదిత్య ఠాక్రే తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఇతరులు ఈ కుట్రలో, ఆ తర్వాత జరిగిన పరిణామాలను కప్పిపుచ్చడంలో కీలక పాత్ర పోషించారని ఎఫ్ఐఆర్ పేర్కొంది.కేసు పత్రాలు, ఫైళ్లు, ఇతర ప్రభుత్వ రికార్డులను ధ్వంసం చేయడం, అధికారిక రికార్డులను తారుమారు చేయడం, ప్రజాధనాన్ని, మానవ వనరులను, పోలీసు యంత్రాంగాన్ని చట్టవిరుద్ధమైన పనులకు, నేరస్థులను రక్షించడానికి దుర్వినియోగం చేశారని పేర్కొంటూ.. సంబంధిత ప్రభుత్వోద్యోగులు, పోలీసు అధికారులు కూడా ఈ విచారణకు బాధ్యులవుతారని సీబీఐ తేల్చిచెప్పింది.నాటి సీఎం,ఆయన కుమారుడికి చుట్టూ బిగుస్తున్న ఉచ్చుఎఫ్ఐఆర్లో శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, నటులు డీనో మోరియో, సూరజ్ పంచోలి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి, అప్పటి ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్, దిశా కాబోయే భర్తతో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావించారు. దిశా అటాప్సీ(పోస్ట్‌మార్టం) రిపోర్టును ఆలస్యం చేశారని, కేసును తప్పుదోవ పట్టించేలా ప్రయత్నం చేసేందుకు అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రే, అప్పటి హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పాత్రపై కూడా ఎఫ్ఐఆర్లో ఆరోపణలు గుప్పించారు. అలాగే ఆలస్యమైన పోస్ట్‌మార్టమ్‌కు సంబంధించిన వైద్యులు, సిబ్బంది పాత్రపై కూడా విచారణ జరగాల్సి ఉందని తెలిపారు.అకస్మిక మృతిగా కేసు నమోదు చేసి..2020 జూన్ 8న ముంబైలోని మాలాడ్ ప్రాంతంలో ఓ నివాస భవనం 14వ అంతస్తు నుంచి కింద పడి దిశా సాలియన్ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత సరిగ్గా వారం రోజుల వ్యవధిలోనే (జూన్ 14న) ఆమె సహచరుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన ఫ్లాట్‌లో మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.అప్పట్లో ముంబై పోలీసులు దిశా మృతి కేసుకు సంబంధించి కేవలం అకస్మిక మృతిగా నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే, తన కుమార్తెను ముందస్తు పథకం ప్రకారం గ్యాంగ్‌రేప్ చేసి హత్య చేశారని, దీని వెనుక పెద్దల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సతీష్ సాలియన్ గత ఏడాది బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగడంతో ఈ కేసులో మునుముందు మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటన
గురుగ్రామ్‌లో ఒక మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి, పారిపోయిన ఘటన, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కారు నంబరుతో సహా బాధితురాలు షేర్ చేయడంతో కారు యజమాని మీడియా ద్వారా స్పందించారు. దీంతో ఆయన ప్రకటన కీలకంగా మారింది.వాహనాన్నిఎవరు నడిపారనే దానిపై కారు యజమాని మనీష్ స్పష్టత ఇచ్చారు. కారు తనదేనని యజమాని అంగీకరించినప్పటికీ, ఈ ప్రమాద ఘటనలో తన పాత్ర ఏమీ లేదన్నారు. తాను ఆర్మీ ఉద్యోగినని, ప్రస్తుతం తాను విధి నిర్వహణలో భాగంగా అస్సాంలో ఉన్నానని చెప్పుకొచ్చారు. తన స్నేహితుడు కళ్యాణ్ కారు నడిపినట్టు వెల్లడించారు. తన స్నేహితుడు తన కుటుంబం నుండి కారును తీసుకున్నాడని తెలిపారు.ఇదీ చదవండి: గురుగ్రామ్‌లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్‌మాట’!సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాతే తనకు ఈ ఘటన గురించి తెలిసిందని ఆయన చెప్పారు. తన స్నేహితుడు కళ్యాణ్ సింగ్ రెండు రోజుల క్రితం ఎక్కడికో వెళ్లాలని చెప్పి కారును తీసుకున్నాడని పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలియగానే తాను తన స్నేహితుడికి ఫోన్ చేశానని, కానీ అతను ఫోన్ తీయలేదని మనీష్ చెప్పారు.. తన తండ్రిని, ఇతరులను కూడా అతని ఇంటికి పంపించానని, కళ్యాణ్ సింగ్ హర్యానాలోని పల్వాల్ జిల్లాకు చెందినవాడని కూడా కూడా చెప్పారు. కాగా 'మారుతి సుజుకి సియాజ్' (Maruti Suzuki Ciaz), దీని రిజిస్ట్రేషన్ నంబర్ HR30Y4949. ఇది హర్యానాలోని పల్వాల్ నివాసిమనీష్ పేరు మీద నమోదై ఉంది. -
విడాకులు తీసుకున్న మహిళను నమ్మించి...
టీమిండియా వెటరన్ బౌలర్ మహ్మద్ షమీ సోదరుడు, క్రికెటర్ మహ్మద్ కైఫ్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని తనను మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడాకులు తీసుకున్న మహిళను నమ్మించి...దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. క్రికెటర్ షమీ సోదరుడు కైఫ్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న సదరు మహిళకు కైఫ్ మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు.హోటల్‌కు రప్పించిబలవంతం మీద ఆమెను సెప్టెంబరు 9, 2023న కోల్‌కతాలోని ఓ హోటల్‌కు రప్పించి శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని కోరగా.. ఆమెతో స్నేహాన్ని తెంచుకున్నాడు. ఈ మేరకు సదరు మహిళ ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని అర్షియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కైఫ్‌పై కేసు నమోదైందని రిపోర్టర్ అభిషేక్ త్రిపాఠి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.అన్న మాదిరే బెంగాల్‌కు ఆడుతూ..కాగా అన్న షమీ మాదిరే కైఫ్ కూడా క్రికెటర్. ఉత్తరప్రదేశ్ వీరి సొంత రాష్ట్రం అయినప్పటికీ అన్న బాటలోనే దేశవాళీ క్రికెట్లో కైఫ్ బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్మద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు పలు దేశీ టోర్నమెంట్లలో ఆడుతున్నాడు. మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన అతడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటికి 40కి పైగా వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే.. ఇంతకుముందు కూడా ఓ మహిళ కైఫ్‌పై ఇదే తరహాలో ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఆరోపించింది. అయితే, అధికారికంగా కేసు మాత్రం పెట్టలేదని సమాచారం. కాగా షమీపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.షమీపై కూడా గతంలో ఆరోపణలుషమీ భార్య హసీన్ జహాన్ స్వయంగా తీవ్రమైన ఆరోపణలతో కోర్టు మెట్లు ఎక్కింది. అతడికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపించడంతో పాటు ఫిక్సింగ్ చేస్తాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పటి నుంచి విడిగా ఉంటున్న వీరు.. భరణానికి సంబంధించి తరచూ ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తున్నారు. కాగా హసీన్ జహాన్ ఐపీఎల్లో చీర్ గర్ల్‌గా ఉన్న సమయంలో ఆమె ప్రేమలో పడ్డ షమీ.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అయితే, అప్పటికే హసీన్‌కు వివాహమై కూతురు కూడా ఉన్నట్లు సమాచారం. షమీ- హసీన్‌కు కూడా ఓ కుమార్తె జన్మించింది.చదవండి: వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి? -
బ్రిక్స్ సదస్సులో ప్రధాన ఆకర్షణగా ఆ యువకుడు..!
భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు దిగ్విజయంగా ముగిసింది. అందుకు సంబంధించిన ఒక ఫోటోను మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది షేర్ చేసిన గంట వ్యవధిలోనే వైరల్‌గా మారింది. ఆ ఫోటోల భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు చేతులు కలిపి ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన ఆ నాయకుల మధ్య ప్రశాంతంగా నిలబడి ఉన్న ఒక యువకుడు అందరి దృష్టిని అమితంగా ఆకర్షించాడు. ఎవరీ సిద్ధార్థ్ బాబు..?కేరళలో కొచ్చికి చెందిన 36 ఏళ్ల ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. 2017 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని తూర్పు ఆసియా విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కొన్ని నివేదికలలో ఆయన పేరు సిద్ధార్థ్గా కనిపిస్తుంది. ఆయన చాలామందికి తెలియని అత్యంత కీలకలమైన గదిలో ఏళ్ల తరబడి పనిచేసిన దౌత్యవేత్త. మెకానికల్ ఇంజనీర్ అయిన ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ ఇండియా 15వ ర్యాంకుతో ఉత్తీర్ణులయ్యారు. ఆయన ఫారిన్ సర్వీస్‌ని ఎంచుకున్నారు. అలా ఆయన దేశంలోని అత్యంత సున్నితమైన సంభాషణల నేపథ్యంలో సాగే వృత్తి జీవితాన్ని గడుపుతున్నారు. అక్కడ కనిపించడం కంటే సన్నద్ధతకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.ఆ నాయకుల మధ్య ఉండటానికి రీజన్..అతను మాండరిన్ అనువాదకుడు. శిఖరాగ్ర సమావేశంలో షీ జిన్‌పింగ్ మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలను మోదీ అర్థం చేసుకునేలా సహాయం చేయడమే అతని పని. ఇది కనిపించే దానికంటే చాలా కష్టం. ఒక దౌత్య అనువాదకుడు కేవలం భాషనే కాకుండా, ప్రతి పదబంధంలో రాజకీయ ప్రాముఖ్యతను కూడా గ్రహించి, అర్థాన్ని కచ్చితంగా తక్షణమే తెలియజేయాలి. ఎందుకంటే వాణిజ్యం, భద్రత లేదా సరిహద్దుల విషయంలో పలికే ఒక్క తప్పు పదం మొత్తం సంబంధం స్వరూపాన్నే మార్చేయగలదు.ఆ బ్రిక్స్ ఫోటోని బట్టి అతడికి అదే అతిపెద్ద వేదిక అరంగేట్రం అనుకుంటే పొరపాటే..ఎందుకంటే ఈ ఏడాది జరిగిన గణతంత్ర వేడుకల్లో కూడా కనిపించారు. మోదీ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్పులా వాన్ డెర్ లేయన్తో సంభాషించేటప్పుడు సిద్ధార్థ్ అర్థమయ్యేలా వివరించడంలో సహాయం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక రకంగా ఈ ఘట్టం..భారతదేశం నిర్వహించే దాదాపు ప్రతి ప్రధాన దౌత్య సమావేశంలో కొంతమంది ప్రతిభావంతులైన భాషావేత్తలు అంతర్భాగంగా ఉంటారనే నగ్న సత్యాన్ని ఇది తెలియజేస్తోంది. అలాగే అత్యంత శక్తిమంతమైన వ్యక్తులతో సంభాషించేటప్పుడే వారి మాటాలు సునాయాసంగా అర్థం చేసుకుని సమాచారాన్ని చేరవేసే ఈ భాషావేత్తలదే అత్యంత కీలకమైన పాత్ర అని ప్రస్ఫుటమవుతోంది.(చదవండి: మైనస్ 50 డిగ్రీల చలిలో లక్షలాది మంది ఖైదీల కన్నీటి కథ) -
గురుగ్రామ్‌లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్‌మాట’!
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్ఫ్లుయెన్సర్, మహిళా బైకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించి, వెంటాడి, వేధించి కారుతో ఢికొట్టి పరారైన ఘటన కలకలం రేపింది. గురుగ్రామ్ రోడ్లపై తన కెదురైప భయానక అనుభవాన్ని సోషల్ మీడియా షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. 'rebelwheels_sia_' అనే ఇన్స్టాగ్రామ్ పేజీని నిర్వహిస్తున్న సియా అనే మహిళ, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆన్లైన్లో షేర్ చేసి, తన ఆవేదనను వివరించారు.మరోవైపు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండోసారి కావడంతో మండిపడుతున్నారు. జాతీయ రాజధానికి సమీపంలో హర్యానాలోని 'మిలీనియం సిటీ' గురుగ్రామ్ రోడ్లపై, ఇన్‌స్టాగ్రామ్‌లోని మీమ్స్‌లో చెప్పినట్లుగా, కొంతకాలంగా "అయితే నా మాటే లేదంటే థార్ మాటే చెల్లుతుంది" అన్నట్లుగా ఉందీ అంటున్నారు నెటిజన్లు. నిన్న పార్కింగ్ సిబ్బంది అనుచితం ప్రవర్తనతో 1999 కార్గిల్ యుద్ధ వీరుడు, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ అమిత్ కుమార్ గుప్తా చేదు అనుభవం ఎదురైంది. పోలీసు ఫిర్యాదు ప్రకారం, ఆకాశహర్మ్యాల మధ్య ఉన్న ఒక రెస్టారెంట్‌కు కుటుంబంతో కలిసి డిన్నర్ వెళ్లారు. ఈయన సమయంలో భారత వైమానిక దళం యొక్క ఆపరేషన్ సఫేద్ సాగర్ బృందంలో భాగంగా ఉన్నారు.అతను తన కుటుంబాన్ని దింపి, స్వయంగా కారు పార్క్ చేస్తున్న సందర్భంలో వివాదం చోటు చేసుకుంది. పార్కింగ్ సిబ్బంది అతన్ని వాలెట్ స్టాండ్ నుండి ఒక బేస్మెంట్కు, ఆపై బహుళ అంతస్తుల పార్కింగ్ స్థలానికి పంపారు. తీరా అక్కడ కారును అసలు పార్క్ చేయడానికి నిరాకరించారు. దీంతో అతను కారును రివర్స్ చే స్తుండగా అక్కడి సిబ్బంది ఒకడు విండ్‌షీల్డ్‌ను పగలగొట్టడంతోపాటు, అతన్ని ఇనుప రాడ్‌తో కొట్టి చంపేస్తానని బెదిరించాడు.భద్రతా సిబ్బంది ఎవరూ జోక్యం చేసుకోలేదని, పోలీసు బృందం తన వద్దకు చేరుకోవడానికి అరగంటకు పైగా పట్టిందని గుప్తా ఆరోపించారు. పార్కింగ్ ఏర్పాటు చేయడానికి జీతం తీసుకునే భద్రతా సిబ్బంది కాకుండా, ఒక రెస్టారెంట్ చెఫ్ చివరకు జోక్యం చేసుకున్నారని అతను చెప్పాడు. దీంతో మోచేయి విరగడంతో పాటు, ప్రమాదం నుండి బయటపడటానికి తలకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.ఇక రెండో ఘటనలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో సియా తెలిపిన వివరాల ప్రకారం, గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆమె తన బైకింగ్ గ్రూప్ సభ్యులతో కలిసి అప్రిలియా ఆర్ఎస్ 457 (Aprilia RS 457) స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.తన రైడ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఒక కారులోని వ్యక్తులు తనను వెంబడించడానికి ప్రయత్నించారు. పలుమార్లు బైక్‌కు దగ్గరగా, అడ్డుగా రావడం వంటి దూకుడు చేష్టలతో వేధింంచారు. దీంతో విసుగొచ్చిన ఆమె తన బైక్‌కు డిస్టెన్స్పాటించాలని కోరింది. దీంతో మద్యం సేవించి ఉన్న కారులోని వ్యక్తులు మరింత రెచ్చిపోయారు. బైక్ ఆపాలని బెదిరింపులు పాల్పడ్డారు. వెంబడించి తన బైక్‌ను ఢీకొట్టి అక్కడి నుంచి ఉడాయించరాఉ. ఆ ధాటికి ఆమె బైక్ పైనుంచి ఎగిరిపడింది. దీంతో రోడ్డుపై కొన్ని మీటర్ల దూరం ఆమెను ఈడ్చుకెళ్లింది..ఈ ఘటన మొత్తం సియా మోటార్సైకిల్పైఅమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డైంది.You got to book this car driver under “hit and run” case @gurgaonpolice. Bring them to justice. Car No: HR 30Y 4949📹: IG/rebelwheels_sia_ pic.twitter.com/KngHxTZ5ke— Yo Yo Funny Singh (@moronhumor) September 14, 2026నెటిజన్ల ఆగ్రహం - చర్యలకు డిమాండ్ఈ రెండు ఘటనలపై సోషల్ మీడియా వినియోగదారులు మండిపడ్డతున్నారు. నగరంలో రోడ్డు భద్రత, ర్యాష్ డ్రైవింగ్ తీరుపై కొందరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ పోలీసులు, గురుగ్రామ్ పోలీసులు, గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు, హర్యానా పోలీసులను ట్యాగ్ చేస్తూ బాధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మహిళా డ్రైవర్ ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. -
ఆ మిస్టరీ వీడకుండానే.. రియా భర్త కన్నుమూత
భార్యను అతిదారుణంగా హత్య చేసి.. ఆమె తలను భర్త ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టిన కేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించిన ఆ భర్త.. తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని మీడియా ముందే ప్రకటించుకున్నాడు. అంతేకాదు బయటకు వచ్చాక మరో హత్య చేస్తానంటూ పోలీస్ స్టేషన్ బయటే చెప్పాడు. చివరకు పోలీస్ కస్టడీలో ఉండగానే అతని ప్రాణం పోయింది!.అస్సాం రాజధాని గువాహటిలో సంచలనం సృష్టించిన రియా తాలుక్దార్ (25) హత్య కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు, ఆమె భర్త రమానుజ్ గోస్వామి పోలీసు వాహనం నుంచి దూకి మృతిచెందాడు. సోమవారం వేకువ జామున ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల రమానుజ్‌ను వైద్య పరీక్షల అనంతరం సోమవారం తెల్లవారుజామున హటిగావ్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నరకాసుర్ పహార్ ప్రాంతం వద్ద పోలీసులపై ఒక్కసారిగా దాడికి ప్రయత్నించిన అతడు.. కదులుతున్న వాహనం నుంచి కిందకు దూకినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి లోయలో పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు అతడిని గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH)కు తరలించగా.. వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.అతనిది పారిపోయే ప్రయత్నమా? లేదంటే కావాలనే దూకి చావాలనుకున్నాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే రియా కేసులో కొన్ని ప్రశ్నలకు అతని నుంచి పోలీసులు సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. దీంతో ఈ కేసు ఇంకా క్లిష్టతరంగా మారే అవకాశం కనిపిస్తోంది.అసలు కేసులో ఏం జరిగింది?గువాహటి సమీపంలోని హటిగావ్-బసిస్థాపూర్ ప్రాంతంలో రమానుజ్, అతడి భార్య రియా తాలుక్దార్ (25) నివసిస్తున్నారు. దాదాపు ఆరు నెలల క్రితమే వీరికి వివాహమైంది. అయితే భార్యపై అనుమానంతో రమానుజ్ తరచూ గొడవపడేవాడని తెలుస్తోంది. సెప్టెంబర్ 3న జరిగిన గొడవలో రియాపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఆమె తలను, వేళ్లను వేరు చేసి నల్లటి పాలిథిన్ సంచిలో చుట్టి ఫ్రిడ్జ్‌లో దాచాడు.దుర్వాసనతో వెలుగులోకి..సెప్టెంబర్ 6న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా రియా మృతదేహం కనిపించింది. అయితే తల కనిపించలేదు. ఫ్రిడ్జ్‌ను తనిఖీ చేయగా పాలిథిన్ సంచిలో ఆమె తలను గుర్తించారు. ఘటన తర్వాత ఇంట్లో రమానుజ్ కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. చివరకు అతడు పోలీసుల ఎదుట లొంగిపోయి.. భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న రక్తపు మరకలున్న కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు.‘షుగర్ డాడీ’ ఎవరు?ఈ కేసులో మరో సంచలన అంశం రమానుజ్ చేసిన వ్యాఖ్యలు. సెప్టెంబర్ 8న పోలీసులు అతడిని ఘటనాస్థలికి తీసుకెళ్లిన సమయంలో మీడియాతో మాట్లాడిన రమానుజ్.. భార్యను చంపినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అన్నాడు. అంతేకాదు.. తన భార్య క్యారెక్టర్ అస్సలు మంచిది కాదని.. జైలు శిక్ష పూర్తయ్యాక బయటకు వచ్చి ఆ ‘షుగర్ డాడీ’ని చంపుతానంటూ హెచ్చరించాడు. ఆ వ్యక్తి ఎవరని మీడియా ప్రశ్నించగా అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో రియాకు నిజంగా ఎవరితోనైనా సంబంధం ఉందా? ‘షుగర్ డాడీ’గా అతడు ఎవరిని ఉద్దేశించాడు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ కస్టడీలో నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేసినా.. అతను నిన్నటిదాకా నోరు విప్పలేదని తెలుస్తోంది.మత్తులోనే హత్య చేసి..అనుమానంతో విచారణలో రమానుజ్.. హత్య జరిగిన సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నట్లు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఖాళీ మద్యం సీసాలు కూడా లభించాయి. రియా కుటుంబ సభ్యులు మాత్రం రమానుజ్కు డ్రగ్స్ అలవాటు, గతంలో ఆర్థిక మోసం కేసులో అరెస్టు వంటి ఆరోపణలు చేశారు. వీటిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.రమానుజ్పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని హత్యకు సంబంధించిన సెక్షన్ 103(1), ఆధారాలను మాయం చేయడానికి సంబంధించిన సెక్షన్ 238 కింద కేసు నమోదు చేశారు. అతడికి ఏడు రోజుల పోలీసు కస్టడీ కూడా లభించింది. అయితే విచారణ పూర్తికాకముందే పోలీసు వాహనం నుంచి దూకడంతో ఈ కేసులో కీలక ప్రశ్నలకు సమాధానాలు మిగిలిపోయాయి.ఇదీ చదవండి: దుబాయ్ ఫ్లైట్ ఎక్కాల్సినోడు.. పాడెక్కాడు! -
వెంబడించి మరీ.. లేడీ బైకర్‌పైకి కారు!
రోడ్డుపై ఓ లేడీ బైకర్‌ను కొందరు ఆకతాయిలు వెంబడించారు. తనను వెంబడించొద్దని.. దూరంగా ఉండాలని ఆమె వాళ్లకు సున్నితంగానే చెప్పింది. అయినా పట్టించుకోకుండా వెంటపడ్డారు. చివరకు కారుతో ఆమె బండిని ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఆమె కింద పడిపోగా.. బైక్ కొద్దిదూరం ముందుకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగినట్లు బాధిత బైకర్ సియా వెల్లడించింది. ఆమె తన బైకింగ్ గ్రూప్‌తో కలిసి ఏప్రిలియా ఆర్ఎస్ 457పై వెళ్తుండగా.. ఓ కారు వెనుక నుంచి వెంటపడటం మొదలుపెట్టిందని తెలిపింది. కారులో ఉన్నవారు దూకుడుగా ప్రవర్తించడంతో.. కొంత దూరం పాటించాలని తాను కోరినట్లు చెప్పింది. అయితే వారు బైక్ ఆపాలని చెప్పారని, మద్యం మత్తులో ఉన్నట్లుగా కనిపించారని తెలిపింది.కారు తనను పక్కకు రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించానని సియా తెలిపింది. వెనుక వస్తున్న తన స్నేహితుడు కూడా కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాడని చెప్పింది. అయినప్పటికీ కారు డ్రైవర్ బైక్‌కు ముందుగా వచ్చి కట్ చేయడంతో ఢీకొట్టిందని ఆరోపించింది. దాంతో సియా బైక్‌పై నుంచి కిందపడిపోగా.. ఆమె స్పోర్ట్స్ బైక్ కొంత దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లింది.ఈ మొత్తం ఘటన ఆమె బైక్‌కు అమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డైంది. ప్రమాదం తర్వాత సియా స్నేహితుడు కారును వెంబడించి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆపేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్‌ను ప్రశ్నించగా.. తన తప్పేమీ లేదంటూ అక్కడి నుంచి కారుతో వెళ్లిపోయినట్లు సియా తెలిపింది.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సియా.. గురుగ్రామ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది. వాహనం నంబర్‌తో పాటు ఆర్సీ యజమాని వివరాలను కూడా వెల్లడించింది. వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ, గురుగ్రామ్, హరియాణా పోలీసులను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.Caught on Cam: Gurugram Woman Biker Thrown Off Aprilia After Car Rams Her for Asking to Keep Distance#Gurugram - A woman motorcyclist in Gurugram has alleged that a car rammed into her sports bike and fled after she asked the driver to keep a distance. The incident, recorded on… pic.twitter.com/Mq3xdfq83o— Siraj Noorani (@sirajnoorani) September 14, 2026 -
దారుణం.. ఆర్టీసీ బస్సు మీది నుంచి పోవడంతో
అత్తవారింట గౌరి గణేశ పండుగను జరుపుకోవడానికి వెళ్లిన మహిళను కేఎస్ ఆర్టీసీ బస్సు యమపాశంలా ఊపిరి తీసింది. ఈ ఘటన హాసన్ నగరంలో జరిగింది. వివరాలు.. అపర్ణ (31), భర్త యోగిశ్ హాసన్ నుంచి బెంగళూరుకు వలస వచ్చి జీవిస్తున్నారు. వినాయక చవితికి సొంతూరికి వెళ్లారు. శనివారం ఉదయం హాసన్ ఎన్ఆర్ సర్కిల్లో అపర్ణ స్నేహితురాలి స్కూటర్లో వెళుతుండగా ఓ కేఎస్ ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది. అపర్ణ కిందపడిపోగా ఆమె పై నుంచి బస్సు దూసుకెళ్లింది. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. కొంతసేపటికి ఆమె మరణించడంతో భర్త, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ట్రాఫిక్ పోలీసులు ప్రమాదస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -బెంగళూరు ఇదీ చదవండి: తుఫానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు! -
మళ్లీ నెత్తురోడిన మణిపూర్.. నలుగురు కుకీల మృతి
ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. గత 24 గంటల్లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో కుకీ తెగకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ మహిళ కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఈ దాడుల వెనుక నాగాలాండ్‌కు చెందిన నాగా తిరుగుబాటు సంస్థలు NSCN(IM), ZUF(K) ఉన్నాయని కుకీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ్లాంగ్ జిల్లాలోని టోలెన్ గ్రామంలో తొలి దాడి జరిగింది. అక్కడ సైనెహ్ సింగ్సిట్, ఆయన భార్య లింగ్జాంగైపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన దంపతుల ఆరేళ్ల కుమారుడు కూడా గాయపడ్డాడు. లింగ్జాంగై అక్కడికక్కడే మృతి చెందగా.. సైనెహ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. బాలుడి శరీరంలోకి దూసుకెళ్లిన బుల్లెట్‌ను తొలగించేందుకు వైద్యులు ఆపరేషన్ చేయనున్నారు. మరో ఘటనలో బియ్యం తీసుకెళ్తున్న ఓ బృందంపై గుర్తుతెలియని సాయుధులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో జూలీ గాంగ్టే, థాంగ్రోయెల్ గాంగ్టే అక్కడికక్కడే మృతి చెందారు. వారితో ఉన్న మరో మహిళ కనిపించకుండా పోయినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనలపై మణిపూర్ ముఖ్యమంత్రి వైకే మేఘచంద్ర సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక పౌరులపై జరిగిన కాల్పులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి హింసకు సమాజంలో చోటు లేదని, బాధ్యులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.मणिपुर में एक बार फिर हिंसा भड़क गई है. तामेंगलोंग और नोनी जिलों में अलग-अलग हमलों में कुकी समुदाय के 4 लोगों की मौत हो गई, जिनमें 2 महिलाएं शामिल हैं. वहीं, 6 साल के एक बच्चे को भी गोली लगी है. घटना के बाद दोनों इलाकों में अलर्ट बढ़ा दिया गया है.#Manipur #Violence #Kuki pic.twitter.com/tADsxzxPJX— zingabad (@zingabad) September 14, 2026మణిపూర్‌లో కుకీ–నాగా వర్గాల మధ్య ఘర్షణలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1992లో ప్రారంభమైనజాతి ఘర్షణలు దాదాపు ఆరేళ్లపాటు కొనసాగి వెయ్యికి పైగా ప్రాణాలను బలిగొన్నాయి. అయితే 2023లో ప్రారంభమైన కుకీ–మెయితీ హింసలోనూ 260 మందికి పైగా మృతి చెందారు.ఇటీవలి కాలంలో కుకీ–నాగా ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ ఏడాది మే 13న కాంగ్పోక్ఫీ జిల్లాలోని ఓ గ్రామం నుంచి ఆరుగురు నాగా తెగకు చెందిన వారిని బందీలుగా తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. జూన్ 10న కుకీ నివాస ప్రాంతానికి సమీపంలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. అంతకుముందు ఫిబ్రవరిలో నాగా వర్గాలతో జరిగిన ఘర్షణల్లో 14 మంది కుకీలు మృతి చెందారని, పలు ఇళ్లు దగ్ధమయ్యాయని కుకీ సంఘాలు ఆరోపించాయి.తాజా కాల్పులతో మణిపూర్‌లో ఇప్పటికే సున్నితంగా ఉన్న కుకీ–నాగా సంబంధాలపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది.ఇదీ చదవండి: బ్రిక్స్ దేశాల్లోనూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సేవలు -
ముందే పక్కా ప్లాన్.. హోటల్ గదిలో దారుణం
గౌహతి: అస్సాంలోని కామ్రూప్ రూరల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ హోటల్ గదిలో ప్రియురాలిని ప్రియుడు కత్తెరతో పొడిచి చంపేశాడు. ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడిన తర్వాత ఆ యువకుడు ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలిని సోనిత్పూర్ జిల్లాలోని హుగ్రాజులికి చెందిన మాలిని గురియాగా గుర్తించారు. ఉదల్ గురి జిల్లాకు చెందిన అభిజిత్ కిందో.. గురియా తనను మోసం చేస్తోందనే అనుమానంతోనే ఆమెను హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు.కిందో, గురియా కామ్రూప్లోని రంగాయా రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక హోటల్లో బస చేశారు. ఉదయం పూట ఆ గదిలోనే మహిళ మృతదేహాన్ని గుర్తించారు. అదే గదిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గురియా అంతకుముందు రాత్రి చెన్నై నుండి మరో ఇద్దరు మహిళలతో కలిసి రంగాయా చేరుకుందని.. రైల్వే స్టేషన్లో వారిని రిసీవ్ చేసుకునేందుకు కిందో వెళ్లాడని పోలీసులు తెలిపారు. ఆమె ఇతర పురుషులతో మాట్లాడుతుండటంతో ముందే హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది.ఇదీ చదవండి: కోడలిని హతమార్చి.. బావిలోకి దూకి.. -
బిగ్‌బాస్: మేరీ కోమ్ వ్యాఖ్యలపై దుమారం.. టీమ్ క్షమాపణలు!
బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ‘బిగ్‌బాస్ 20’(హిందీ)లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. రింగ్ వెలుపల ఆమె వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న ఈ రియాలిటీ షోలో ఇటీవల ఓ సంభాషణ వివాదానికి దారితీసింది. మహిళా క్రీడాకారిణులపై మేరీ కోమ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆమె టీమ్ స్పందించి వివరణతో పాటు క్షమాపణలు తెలిపింది.సానియా, సైనా ప్రస్తావనతో మొదలైన చర్చ‘బిగ్‌బాస్ 20’లో సహచర కంటెస్టెంట్ ఖాజీ తౌకీర్‌తో మేరీ కోమ్ సంభాషించారు. భారత మహిళా క్రీడాకారిణులు సాధించిన విజయాల గురించి చర్చ సందర్భంగా ఖాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ పేర్లను ప్రస్తావించారు. సానియా, సైనా క్రీడల్లో గొప్పగా రాణించారని ఆయన పేర్కొన్నారు.‘నా స్థాయిలో ఎవరూ సాధించలేదు’ఖాజీ తన మాటలు పూర్తిచేయకముందే మేరీ కోమ్ జోక్యం చేసుకుని.. ‘నా లాంటి విజయాలను ఎవరూ సాధించలేదు’ అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఆమె తన సొంత బాక్సింగ్ విజయాలను ప్రస్తావించడంతో.. ఇతర భారత మహిళా క్రీడాకారిణుల విజయాలను తక్కువ చేసి చూపినట్లుగా కొందరు ప్రేక్షకులు భావించారు.ఆన్లైన్లో వైరల్‌గా వీడియో క్లిప్పులుఈ సంభాషణకు సంబంధించిన క్లిప్పులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మేరీ కోమ్ కెరీర్‌ను అభినందించే క్రమంలో ఇతర ప్రముఖ మహిళా క్రీడాకారిణుల విజయాలను తగ్గించి చూపకూడదంటూ పలువురు విమర్శలు చేశారు.మేరీ కోమ్ టీమ్ వివరణఈ నేపథ్యంలో మేరీ కోమ్ అధికారిక ఖాతా ద్వారా ఆమె టీమ్ వివరణ ఇచ్చింది. ‘మేరీ మాటలను తప్పుగా అర్థం చేసుకుని ఉంటే క్షమాపణలు. మరో క్రీడాకారిణి ప్రయాణాన్ని కించపరచడం లేదా పోల్చడం ఆమె ఉద్దేశం కాదు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించే ప్రతి క్రీడాకారిణిపై మేరీకి ఎంతో గౌరవం ఉంది’ అని పేర్కొంది.ప్రతి పతకం దేశానికి గర్వకారణమే‘ప్రతి ఒక్కరి ప్రయాణం ప్రత్యేకమైనది. ప్రతి విజయం ముఖ్యమైనదే. ప్రతి పతకం భారత్‌ను గర్వపడేలా చేస్తుంది’ అని మేరీ కోమ్ టీమ్ స్పష్టం చేసింది.‘బిగ్‌బాస్ 20’ సెప్టెంబర్ 6, 2026న ప్రారంభమైంది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ జియో హాట్‌స్టార్‌లో ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ అవుతోంది. కలర్స్ టీవీలో రాత్రి 10:30 గంటలకు ప్రసారం చేస్తున్నారు. ఈ సీజన్లో రెండు ఇళ్ల ఫార్మాట్‌తో పాటు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లకు తిరిగి వచ్చే అవకాశం కల్పించే విధానం, ఎలిమినేషన్లను ప్రభావితం చేసే ‘వరదాన్’/ఎక్స్ట్రా లైఫ్ ట్విస్ట్‌లు ఉన్నాయి.ఇదీ చదవండి: 45 ఏళ్లుగా గణేశ్ వేడుకల్లో మారుమోగుతూ.. -
ఎల్లలు లేని వినాయకుడు.. వివిధ దేశాల్లో..
విఘ్నాలను తొలగించే దేవుడిగా, కొత్త ఆరంభాలకు ప్రతీకగా భారతీయులు కొలిచే గణపతి దేవునికి సరిహద్దులు లేవు. ఆసియాలోని పలు దేశాల్లో గణేశుడిని వివిధ పేర్లతో, భిన్నమైన సంప్రదాయాలతో పూజిస్తుంటారు. జపాన్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, నేపాల్, మలేషియా, కంబోడియాల్లో గణేశుని ఆరాధనలు కనిపిస్తాయి.జపాన్‌లో ‘కాంగిటెన్’గా గణపయ్యజపాన్లో గణేశుడిని కాంగిటెన్ (Kangiten)గా పూజిస్తారు. జపాన్ సంస్కృతిలో ఆయనను విఘ్నాలను తొలగించి ఆనందం, విజయం అందించే దేవుడిగా భావిస్తారు. ఇక్కడ గణేశుడి ఆరాధనకు బౌద్ధమతంతో సన్నిహిత సంబంధం ఉంది. భారత్‌లో గణపతికి మోదకాలు నైవేద్యంగా సమర్పించడం సాధారణం కాగా.. జపాన్‌లో ఆయనకు ముల్లంగిని సమర్పించే సంప్రదాయం ఉంది. జపాన్‌లోని మత్సుచియామా షోడెన్, హోజాంజిలలో కాంగిటెన్ ఆలయాలున్నాయి.థాయ్‌లాండ్‌లో ‘ఫ్రా ఫికానెట్’ప్రధానంగా బౌద్ధ దేశమైన థాయ్‌లాండ్‌లో పలు హిందూ దేవతలను కూడా భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అందులో గణేశుడు కూడా ఒకరు. ఇక్కడ ఆయనను ‘ఫ్రా ఫికానెట్’ గా పిలుస్తారు. అదృష్టం, విజయం ప్రసాదించే దేవుడిగా ఆయనను భావిస్తారు. ఆనందాన్ని అందించడంతో పాటు కష్టాలను అధిగమించే శక్తిని గణేశుడు ప్రసాదిస్తాడని స్థానికుల నమ్మకం. దేశవ్యాప్తంగా గణేశుడి విగ్రహాలు, ఆలయాలు, పూజా స్థలాలు ఉన్నాయి. స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా వీటిని సందర్శిస్తారు.ఇండోనేషియా.. బాలిలో ప్రత్యేక స్థానంఇండోనేషియాలో ముఖ్యంగా బాలిలో గణేశుడికి విశిష్ట స్థానం ఉంది. అదృష్టం, జ్ఞానం, కొత్త ఆరంభాలకు నెలవైన దేవుడిగా గణేశుడిని పూజిస్తారు. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తుశకం 7వ, 8వ శతాబ్దాల నాటికే ఇండోనేషియాలో గణేశుడు ముఖ్యమైన దేవతగా గుర్తింపు పొందాడు. అక్కడి కొన్ని హిందూ సమాజాల్లో విష్ణువు, శివుడు, సరస్వతితో పాటు గణేశుడిని కూడా ఆరాధిస్తారు. ఇండోనేషియా ప్రాచీన సంస్కృతి, కళల్లోనూ గణేశుడి ప్రాతినిధ్యం కనిపిస్తుంది.నేపాల్‌లో శుభప్రద దేవుడిగా..నేపాల్‌లో గణేశుడిని గణేశ, గణపతి, వినాయక వంటి పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా హిందూ నేవార్ సమాజంలో ఆయనను అదృష్టాన్ని ప్రసాదించే దేవుడిగా పూజిస్తారు. భారత్‌లో మాదిరిగానే అక్కడ కూడా మతపరమైన కార్యక్రమాలను ప్రారంభించే ముందు గణేశుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది. నేపాల్‌లో పలు గణేశ ఆలయాలు ఉన్నాయి. రాజధాని ఖాట్మండులోని మారూ గణేశ్, భక్తపూర్‌లోని సూర్య వినాయక ఆలయాలు వాటిలో ప్రముఖమైనవిగా చెబుతుంటారుమలేషియాలోనూ వినాయక చవితిమలేషియాలో హిందువులు అధికంగా కనిపిస్తారు. అక్కడ కూడా గణేశుడిని కొత్త ఆరంభాలకు ప్రతీకగా, విఘ్నాలను తొలగించే దేవునిగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం గణేశ చతుర్థిని కూడా నిర్వహిస్తారు. అదృష్టం కోసం పలువురు తమ ఇళ్లలో గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించుకుంటారు. మలేషియాలోని శ్రీ సిద్ధి వినాయగర్ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది.కంబోడియాలో శతాబ్దాల చరిత్రకంబోడియాలో గణేశుడి ఆరాధనకు శతాబ్దాల చరిత్ర ఉంది. క్రీస్తుశకం 5వ-6వ శతాబ్దాల నుంచే అక్కడ గణేశుడిని పూజించినట్లు చరిత్ర చెబుతోంది. శైవ హిందూ సంప్రదాయం వ్యాప్తి ద్వారా గణేశుడి ఆరాధన అక్కడికి చేరినట్లు చెబుతారు. ఖ్మేర్ సామ్రాజ్య కాలానికి చెందిన కళల్లోనూ గణేశుడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. శిల్పాలు, చెక్కడాల్లో ఆయన రూపాలు దర్శనమిస్తాయి. ప్రజలు గణేశుడిని విముక్తిని ప్రసాదించే, విఘ్నాలను తొలగించే దేవునిగా భావిస్తారు. కంబోడియాలోనూ పలు గణపతి ఆలయాలు కనిపిస్తాయి.ఇదీ చదవండి: 45 ఏళ్లుగా గణేశ్ వేడుకల్లో మారుమోగుతూ.. -
‘నీట్’లో భారీ మార్పులు.. ‘బ్రిక్స్’ దేశాలకూ ‘ఎన్టీఏ’ సేవలు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించేందుకు లక్షలాది మంది విద్యార్థులు రాసే నీట్ యూజీ పరీక్ష విధానంలో త్వరలో కీలక మార్పు రానుంది. ఇకపై ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో (సీబీటీ) నిర్వహించేందుకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్,పేపర్ విధానం, ఓఎంఆర్ షీట్ల వినియోగానికి త్వరలో స్వస్తి పలకనున్నట్లు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు.దేశంలో ప్రస్తుతం నీట్ యూజీ ప్రధానంగా పెన్,పేపర్ పరీక్షగా కొనసాగుతోంది. అయితే దీన్ని కూడా త్వరలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా మార్చనున్నట్లు అభిషేక్ సింగ్ వెల్లడించారు. ‘మా పరీక్షలన్నీ సీబీటీ’ విధానంలోనే జరుగుతున్నాయి. నీట్ మాత్రమే మిగిలింది. దీనినీ త్వరలో సీబీటీకి మారుస్తాం’ అని ఆయన తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణకు పరీక్షా మౌలిక వసతులను మరింత విస్తరించాల్సి ఉంటుందని ఎన్టీఏ డీజీ చెప్పారు. భద్రతా చర్యలను కూడా బలోపేతం చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జేఈఈ, యూజీసీ నెట్, సీయూఈటీ, నిఫ్ట్ పరీక్షలు సీబీటీ విధానంలోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎన్టీఏ నిర్వహించే అన్ని పరీక్షలూ సీబీటీ విధానంలోకి వస్తాయని పేర్కొన్నారు.ఎన్టీఏ ప్రస్తుతం స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా కొనసాగుతోంది. కేంద్ర స్థాయిలో లక్షలాది మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే బాధ్యతను ఇది నిర్వర్తిస్తోంది. 2026లో జరిగిన పేపర్ లీక్ వ్యవహారం తర్వాత సంస్థపై తీవ్ర విమర్శలు, ప్రజాగ్రహం, న్యాయపరమైన ఒత్తిడి పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జులైలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. భవిష్యత్తులో ఇతర దేశాలకు, ముఖ్యంగా బ్రిక్స్ దేశాలకు డిజిటల్ పరీక్షా పరిష్కారాలను అందించాలన్న ఆలోచన ఎన్టీఏ ఉందని సింగ్ తెలిపారు.అయితే ప్రస్తుతం భారత్‌లోనే పరీక్షా వ్యవస్థను పటిష్ఠం చేయడం, ప్రక్రియలను మెరుగుపరచడం, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించడమే ప్రధాన ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కృత్రిమ మేధ (ఏఐ), బయోమెట్రిక్ ధ్రువీకరణ కీలకంగా మారుతున్నాయని సింగ్ చెప్పారు. ఆధార్ ఆధారిత ధ్రువీకరణతో పాటు ముఖ గుర్తింపు విధానాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఆధార్ డేటాబేస్, ఫేస్ ఆథెంటికేషన్ వ్యవస్థతో ఈ సమస్యను పరిష్కరించామని, ఎన్టీఏ నిర్వహించే దాదాపు ప్రతి పరీక్షలో ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నామని వెల్లడించారు.ఇదీ చదవండి: రాహుల్, ప్రియాంకతో మలేసియా ప్రధాని భేటీ -
45 ఏళ్లుగా గణేశ్ వేడుకల్లో మారుమోగుతూ..
గణేశ్ చతుర్థి వచ్చిందంటే చాలు.. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పాటు డీజేల్లో మారుమోగే కొన్ని పాటలు పండగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మారుస్తాయి. అలాంటి పాటల్లో నాలుగున్నర దశాబ్దాలుగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పాట ‘దేవా హో దేవా గణపతి దేవా’. 1981లో విడుదలైన ఈ పాట ఇప్పటికీ గణేశ్ చతుర్థి వేడుకల్లో నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. అంతేకాదు.. ఒకే పాటకు ఆరుగురు ప్రముఖ గాయకులు తమ గాత్రాన్ని అందించడం ఈ పాటకున్న ప్రత్యేకత.45 ఏళ్లుగా అదే జోష్గణేశ్ చతుర్థిని పురస్కరించుకుని హిందీ చిత్రసీమలో ఎన్నో గణపతి పాటలు వచ్చాయి. అయితే వాటిలో ‘దేవా హో దేవా గణపతి దేవా’ పాటకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. సుమారు 45 ఏళ్ల క్రితం విడుదలైన ఈ గీతం ఇప్పటికీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సందడి చేస్తుంటుంది. పండగ సమయంలో డీజేలు, ఇతర వేడుకల్లో ఈ పాట వినిపించడం సర్వ సాధారణంగా మారింది.‘హమ్ సే బఢ్కర్ కౌన్’తో అనుబంధంఈ పాట 1981లో విడుదలైన ‘హమ్ సే బఢ్కర్ కౌన్’ అనే హిందీ చిత్రంలోనిది. ప్రముఖ దర్శకుడు దీపక్ బహ్రీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నటుడు అమ్జద్ ఖాన్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో కనిపించారు. ఈ చిత్రంలోని ‘దేవా హో దేవా గణపతి దేవా’ పాట 1980లలో భక్తి గీతంగా విశేష ప్రజాదరణ పొందింది.సినిమాను మించిన హిట్సినిమాలో భాగమైనప్పటికీ ఈ పాటకు వచ్చిన ఆదరణ ప్రత్యేకంగా నిలిచింది. అమ్జద్ ఖాన్, మిథున్ చక్రవర్తి, డ్యానీ డెంజోంగ్పా, రంజితా కౌర్, నీతా మెహతా తదితరులపై ఈ పాటను చిత్రీకరించారు. అయితే సినిమా కంటే ఈ పాటకే ఎక్కువ గుర్తింపు లభించిందని చెబుతుంటారు. నాలుగు దశాబ్దాలకు పైగా గడిచినా గణేశ్ చతుర్థి సందర్భంగా ఈ పాటకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ఆరుగురు దిగ్గజాల స్వరాలుఈ పాటకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒకే పాట కోసం హిందీ సంగీత ప్రపంచానికి చెందిన ఆరుగురు గాయకులు కలిసి తమ గాత్రాన్ని అందించారు. వారిలో మొహమ్మద్ రఫీ, ఆశా భోస్లే, శైలేంద్ర సింగ్, భూపేంద్ర, రామ్‌లక్ష్మణ్, సప్నా చక్రవర్తి ఉన్నారు. ఇంతమంది ప్రముఖ గాయకుల స్వరాలు కలవడం ఈ పాటకు మరింత ప్రత్యేకతను తీసుకువచ్చింది.గణపతి వేడుకల్లో ఇప్పటికీ మార్మోగుతూ..1981లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాటకు 45 ఏళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ ప్రతి గణేష్ చతుర్థి సమయంలో ఈ పాట వినిపిస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటుంది. తరాలు మారినా గణపతి వేడుకల్లో ఈ పాటకు ఆదరణ కొనసాగుతుండటం దీని ప్రత్యేకతను తెలియజేస్తున్నది.ఇదీ చదవండి: ఒక చేతిలో ‘బ్రహ్మోస్’.. మరో చేతిలో సెమీకండక్టర్ చిప్.. -
పంజాబీ గాయకుడి ఇంటిపైకి కాల్పులు
చండీగఢ్: పంజాబీ గాయకుడు గులాబ్ సిద్ధు నివాసంపైకి గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. పంజాబ్‌లోని బర్నాలాలో ఉన్న ఆయన ఇంటి వద్దకు అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో బైక్‌లపై ముసుగు ధరించిన వచ్చిన ముగ్గురు వ్యక్తులు మెయిన్ గేటుపైకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. సిద్ధు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారని, కాల్పుల సమయంలో ఆయన తల్లిదండ్రులు, భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారన్నారు. కాల్పులతో ఎవరికీ ఎటువంటి అపాయం సంభవించలేదని వివరించారు. అనంతరం, ఈ కాల్పులకు తమదే బాధ్యతంటూ గ్యాంగ్‌స్టర్ డోని బాల్ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు. తమ ఫోన్ కాల్స్‌కు అతడు స్పందించనందునే, అతడి ఇంటి డోర్‌బెల్‌ను తుపాకీ కాల్పులతో మోగించామంటూ వ్యాఖ్యానించాడు. హత్యకు గురైన గాయకుడు సిద్ధూ మూసేవాలాకు గులాబ్ సిద్ధూ సన్నిహిత మిత్రుడు కావడం గమనార్హం. -
ఒక్క విద్యార్థి కోసం 5 కి.మీ.ల ట్రెక్కింగ్
కొల్హాపూర్: రోజూ ఉదయం ప్రభుత్వపాఠశాలలో బోధించేందుకు వెళ్లాలంటే ప్రతి టీచర్ సొంత వాహనం లేదా ఆర్టీసీ బస్సులో ప్రయాణం మొదలెడతారు. కానీ 55 ఏళ్ల ఉపాధ్యాయుడు జీవన్ వసంతరావ్ మిథారీ మాత్రం రోజూ రానుపోను 5 కిలోమీటర్లు కొండప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తూ పాఠశాలకు వెళ్లివస్తున్నారు. దట్టమైన అడవి, ఎడతెరపి వానలు, వన్యప్రాణుల నుంచి ప్రాణహాని ఉన్నా వాటిని తట్టుకుంటూ ఒకే ఒక్క విద్యార్థికి పాఠాలు చెప్పేందుకు గత 13 ఏళ్లగా తన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ అంకితభావంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సహ్యాద్రి పర్వతశ్రేణిలో కొల్హాపూర్ జిల్లాలోని గగన్బవాడ తాలూకాలో కొండ మీద కవాల్టెక్ ధంగర్వాడా అనే మారుమూల గ్రామం ఉంది. అక్కడ పాతికేళ్ల క్రితం దాదాపు 100 కుటుంబాలు ఉండేవి. తర్వాత జీవనోపాధి కోసం దాదాపు కుటుంబాలన్నీ కొల్హాపూర్ నగరానికి వలసవచ్చాయి. ఒకటీ రెండు కుటుంబాలే అక్కడ ఉన్నాయి. వారిలో మూడో తరగతి చదవే స్వర బొడాకే ఒక్కతే అక్కడి జిల్లాపరిషత్ స్కూల్‌కు వస్తోంది. ఈమెకు చదువు చెప్పేందుకే టీచర్ మిథారీ రోజూ 2.5 కిలోమీటర్లు పైకి ట్రెక్కింగ్చేసి స్కూల్ అయ్యాక మళ్లీ 2.5 కి.మీ.లు కిందకు దిగొస్తున్నారు. ‘‘కొల్హాపూర్ జిల్లా ప్రైమరీ స్కూల్ టీచర్స్ సహకార బ్యాంక్‌కు గతంలో చైర్మన్‌గా ఉన్నా. అప్పుడు నాలాంటి ప్రతిభావంతులైన టీచర్లకు పట్టణాల్లో పోస్టింగ్‌లు ఇచ్చి ఇతరులకు కుగ్రామాల్లో పోస్టింగ్‌లు ఇస్తారని ఒకరు నాతో అన్నారు. అది తప్పు అని నిరూపించేందుకే ఈ పాఠశాలను నేనే ఎంచుకున్నా. సాయంత్రం ఆలస్యమైతే అడవి దున్నల వంటి వన్య ప్రాణాలతో ముప్పు ఎక్కువ. అందుకే ఉదయం చాలా త్వరగా స్కూల్‌కు ఆరోజు సిలబస్ మొత్తం చెప్పి త్వరగా వెనుతిరుగుతా. స్వర చెల్లెలు అంగన్వాడీ లేకపోవడంతో ఆ పాప కూడా బడికొస్తోంది. వచ్చే ఏడాది ఆమె ఒకటో తరగతిలో చేరబోతోంది’’అని టీచర్ నవ్వుతూ చెప్పారు. కవాల్టెక్ ధంగర్వాడా గ్రామానికి విద్యుత్ సౌకర్యంలేదు. -
పూర్తి ఆరోగ్యంతో ఉన్నా!
సాక్షి, న్యూఢిల్లీ: తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఆదివారం ఆమె యూపీ రాజధాని లక్నోలో మీడియాతో మాట్లాడారు. వదంతులను నమ్మవద్దని, రాబోయే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ నుంచి తాజాగా మూడోసారి బహిష్కృతుడైన ఆకాశ్ ఆనంద్‌పై ఆమె మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆరోగ్యంపై వదంతులు వ్యాప్తి చేసేందుకు అతడు ప్రయతి్నస్తున్నాడని ఆరోపించారు. సొంత ఆలోచనలతో కాకుండా మామ, మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ కనుసన్నల్లోనే అతడు నడుస్తున్నాడని విమర్శించారు. ‘శనివారం నా నివాసంలో ఉన్న పార్టీ ఇంఛార్జ్ అలోక్ కుమార్‌కు ఆకాశ్ ఆనంద్ ఫోన్ చేశాడు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలను సైతం బెహెన్జీ(మాయావతి) ఎక్స్ ద్వారానే ప్రకటిస్తున్నారు. ఆమె ఆరోగ్యం బాగోలేదా అంటూ అలోక్‌ను అడిగాడు. తాను ఫోన్ చేసిన విషయాన్ని నాకు చెప్పవద్దని కూడా అలోక్ కుమార్‌ను కోరాడు. ఆకాశ్ ఫోన్ చేయడం వెనుక ఎలాంటి ఉద్దేశమున్నప్పటికీ అతడు సొంతంగా ఏమీ చేయడం లేదు, మామ అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో కార్యకర్తలకు నేరుగా వాస్తవాలు వివరించాల్సిన అవసరముంది. కాబట్టే ఈ ప్రకటన చేస్తున్నా’అని ఆమె స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాల కోసం ఇటీవల తీసుకున్న కఠిన నిర్ణయాలు బీఎస్పీకి మేలు చేశాయని ఆమె పేర్కొన్నారు. తన సోదరుడు ఆనంద్ కుమార్ కుమారులు ఆకాశ్ ఆనంద్, ఇషాన్ ఆనంద్‌లకు బీఎస్పీలో ఎలాంటి పదవులు ఇవ్వడం లేదని ఆమె ప్రకటించారు. వారసురాలిగా దీపికా ఆనంద్! సోదరుడు ఆనంద్ కుమార్తె దీపికా ఆనంద్ విషయం ఇటీవల మాయావతి ప్రస్తావించా రు. బీఎస్పీకి సంబంధించిన అంశాల్లో ఆమె తండ్రికి సాయంగా ఉండవచ్చని అన్నారు. ముందుకు వస్తే ఆమెకు పార్టీలో కీలక బాధ్యతలను కూడా అప్పగిస్తామని ప్రకటించారు. ఆమె సిద్ధంగా లేకుంటే దళిత వర్గానికి చెందిన సాధారణ కార్యకర్తకు ఆ బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశాయి. కాగా, లా చదువుతున్న దీపికా ఆనంద్ ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. -
శాకాహారం మంట!
న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాధినేతలతోపాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్దసంఖ్యలో దౌత్యాధికారులకు ప్రధాని మోదీ శనివారం ఇచ్చిన విందులో కేవలం శాకాహార భోజనం వడ్డించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసహనం వ్యక్తంచేశారు. అత్యధికశాతం భారతీయులు మాంసాహారులని తెల్సి కూడా మోదీ సర్కార్ కేవలం శాకాహారం వడ్డించడంలో ఆంతర్యమేంటని ఆయన నిలదీశారు. ఈమేరకు రాహుల్ ఆదివారం ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘గణాంకాలను మీకు గుర్తుచేస్తున్నా. 80 శాతం మంది భారతీయులు మాంసాహారులే. మరీ ముఖ్యంగా భారతీయ మాంసాహార వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. నా చెల్లి చేసిన శాకాహార చిరుతిండి ఛోలే భటూరేలా మాంసాహారం ఎంతో పసందుగా ఉంటుంది. అలాంటప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ సంబంధిత విందులో మాంసాహారాన్ని విస్మరించాల్సిన అవసరం ఏమొచ్చింది? ’’అని రాహుల్ మోదీ సర్కార్‌కు సూటి ప్రశ్న వేశారు. పోస్ట్‌తోపాటు తన సోదరి చేసిన చిరుతిండి ఫొటోను పోస్ట్‌చేశారు. నచ్చిన ఆహారం వడ్డించరా?: కాంగ్రెస్ భారత్‌తోపాటు విదేశాల్లోనూ మాంసాహార ప్రియులే అత్యధికమని, అలాంటి బ్రిక్స్ దేశాల నుంచి వచ్చిన విదేశీ అతిథులకు శాకాహారం బలవంతంగా వడ్డించాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టింది. ‘‘బ్రిక్స్ సదస్సు ప్రాధాన్యత దృష్ట్యా ప్రపంచదేశాల అతిథులు ఈ కార్యక్రమానికి వచ్చి విందు ఆరగించారు. వీళ్లు ఏ ఆహారం తినాలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయిస్తుందా? ఇప్పటికే భారతీయులు ఏం తినాలో బీజేపీ ఆదేశిస్తోంది. ఇక విదేశీయులకు శాకాహారాన్ని బలవంతంగా తినిపించడం ఎంతవరకు సబబు?’’అని కాంగ్రెస్ మీడియా విభాగ చీఫ్ పవన్ ఖేడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చవులూరించే ఎంతో మాంసాహార వంటకాలకు భారత్ పెట్టిందిపేరు. వాటిని విదేశీ అతిథులు రుచి చూడకుండా చేసి భారతీయ ఆహార సంప్రదాయాలను దాచాలని చూస్తారా?’’అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విందు మెనూను పోస్ట్చేసింది. సక్సెస్‌ను కాంగ్రెస్ సహించట్లేదు: బీజేపీ సదస్సు విజయవంతంకావడంతో కాంగ్రెస్ సహించట్లేదని, అందుకే అర్థంపర్థంలేకుండా ఆహారం గురించి విమర్శలుచేస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. ‘‘సదస్సు గురించి వంకలుపెట్టడానికి ఏమీ లేదు. డిక్లరేషన్‌లో ఏకాభిప్రాయం సాధించి మోదీ సర్కార్ తన దక్షతను చాటింది. సదస్సు ఇలా విజయవంతంకావడం కాంగ్రెస్ సహించలేకపోతోంది. అందుకే విమర్శించడానికి మరే విషయాలు లేక చివరకు ఆహారం గురించి విమర్శలు చేస్తోంది’’అని భండారీ అన్నారు. ‘‘డిక్లరేషన్‌తో విజయం సాధించిన మోదీని రాహుల్ అభినందించాల్సిందిపోయి ఈ శాకాహారం, మాంసాహారం గోల ఏంటి?’’అని మరో బీజేపీ జాతీయ ప్రతినిధి తుహిన్ సిన్హా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పోస్ట్ చేసిన మెనూ (అన్నీ శాకాహారాలే) స్టార్టర్స్.. 1. ఖండ్వీ మిలే–ఫియులే(శనగపిండితో ఆవిరిపై ఉడికించి పలుచగా చేసిన రోల్స్) 2. మష్రూమ్ కబాబ్‌లు, షీర్మాల్ రొట్టెతో కలిపి ఖుంబ్ గలౌతీ మెయిన్ కోర్స్ 1. పనీర్ లబాబ్దార్ 2. హిమాలయాల్లో లభించే అరుదైన మోరెల్ మష్రూమ్‌లు, ఆస్పరాగస్, కుంకుమపువ్వు, ఎండుద్రాక్ష, బాదంతో చేసిన గుచ్చీ మారి్మక్ 3. క్యారెట్, గ్రీన్ బీన్స్ కూర 4. కందిపప్పు, టమాటాలతో చేసినకర్ణాటక తక్కలి బెల్లే చారు 5. చిరు ధాన్యాల పులావ్6. బీట్రూట్ రైతా 7. వివిధ రకాల భారతీయ బ్రెడ్లు తీపి పదార్థాలు1. పాత ఢిల్లీ ఫ్రూట్ క్రీమ్ 2. జిలేబీ 3. పాలు, బియ్యం, మల్బెర్రీ పండ్లు కలిపిన షాహ్తూత్ పాయసం -
మూడేళ్లలోపు 21 రాష్ట్రాల్లో యూసీసీ
ముంబై: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువుదీరిన 21 రాష్ట్రాల్లోనూ 2029 ఏడాదిలోపు ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని అమలుచేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. గత పుష్కర కాలంలో ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం సాధించిన ఘనత, మోదీ నాయకత్వంలో గత పాతికేళ్లలో బీజేపీ ప్రయాణం, మోదీ జన్మదినంను గుర్తుచేస్తూ సెపె్టంబర్ 17 నుంచి సేవా సంకల్ప్ అభియాన్ జరగబోతోందని ప్రకటించాక పలు అంశాలపై ఆదివారం ముంబైలో అమిత్‌షా మీడియాతో మాట్లాడారు. ‘‘త్రిపుల్ తలాఖ్‌ను రద్దుచేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించాం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీ అమలవుతోంది. 2029లోపు ఎన్డీఏపాలిత అన్ని రాష్ట్రాల్లో ఇది అమలయ్యేలా చేస్తా’’అని అన్నారు. 2029లో సార్వత్రిక ఎన్నికలున్న విషయం తెల్సిందే. మోదీ శకంలో అన్నీ మారుతున్నాయ్.. ‘‘గతంలో దేశంలో అవినీతి, కులతత్వం, వారసత్వ రాజకీయాలు తిష్టవేసి దారుణ పరిస్థితులను సృష్టించాయి. ఇప్పుడు మోదీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం వాటినన్నింటినీ పారద్రోలింది. మోదీ శకం ఆరంభమైంది. ఇప్పుడంతా పనితీరు ఆధారిత రాజకీయాలే’’అని షా అన్నారు. మానవసేవే మాధవ సేవ తరహాలో జనసేవే ప్రభు సేవ అనే కొత్త నినాదం షా విన్పించారు. 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్‌ను సాకారంచేసేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నాం. మోదీ సారథ్యంలో గుజరాత్లో, దేశంలో పెను సానుకూల మార్పులొచ్చాయి. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ప్రాథమికస్థాయిలో సంస్కరణల బాటలో పయనిస్తోంది’’ అని మోదీని షా కొనియాడారు. -
ఏకపక్ష ఆంక్షలతో ప్రజలపై తీవ్ర ప్రభావం: పెజెష్కియాన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక, వాణిజ్య వ్యవస్థలపై అధికంగా ఆధారపడితే వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు రాజకీయ ఒడిదుడుకులకు గురయ్యే ప్రమాదం ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. అందుకే బ్రిక్స్ కూటమి దేశాలు తమ జాతీయ కరెన్సీల్లో వాణిజ్యాన్ని విస్తరించుకోవాలని, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక చట్రం దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఆదివారం బ్రిక్స్ సదస్సులో ఆయన మాట్లాడారు. పాశ్చాత్య దేశాలపై విమర్శలు గుప్పించారు. కొన్ని దేశాలు విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలు ప్రపంచ ఆహార భద్రత, ప్రజల సంక్షేమంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పరోక్షంగా అమెరికాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్రిక్స్ కూటమి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారానికి సంబంధించిన ఒక వేదిక స్థాయిని దాటేసి, నేడు మరింత సమతుల్యమైన, సమ్మిళితమైన ప్రపంచం కోసం పెరుగుతున్న ఆకాంక్షకు ప్రతీకగా మారిందని హర్షం వ్యక్తంచేశారు. అటువంటి ప్రపంచంలో ఏ ఒక్కరికీ ఇతరుల భవిష్యత్తును నిర్ణయించే హక్కు ఉండదని తేల్చిచెప్పారు. -
జిన్‌పింగ్ పంచ సూత్రావళి
న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాలు సమున్నతంగా ఎదిగేందుకు పంచ సూత్రావళిని పాటించాలంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సరికొత్త సూచనలు చేశారు. కృత్రిమ మేధ, వాణిజ్యం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, స్మార్ట్ ఫ్యాక్టరీలు, సీనియర్ శాస్త్రవేత్తలతో అతిపెద్ద సమీకృత మార్కెట్‌ను బ్రిక్స్ దేశాలు సొంతంగా సృష్టించుకోవాలని జిన్‌పింగ్ అభిలషించారు. బ్రిక్స్ సదస్సు ముగింపు సమావేశంలో ఆదివారం జిన్‌పింగ్ మాట్లాడారు. ‘‘అభివృద్ధిచెందుతున్న మార్కెట్లు, గ్లోబల్ సౌత్ దేశాలతో బ్రిక్స్ సభ్య దేశాలు అనుసంధానం కావాలి. దీంతో మన సరకు రవాణా గొలుసులు పటిష్టమవుతాయి. తద్వారా భవిష్యత్తులో అతిపెద్ద సమీకృత మార్కెట్‌ను అవతరింపజేయవచ్చు. అందుకోసం మొదటగా బ్రిక్స్ ఏఐ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీని ఏర్పాటుచేద్దాం. దీని ఏర్పాటుకు చైనా అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల తయారీ, అభివృద్ధికి కృషిచేద్దాం. ఏఐ సెమినార్లు నిర్వహిద్దాం. శిక్షణా కోర్సులను అందుబాటులోకి తెద్దాం. అలా ఓపెన్ ఏఐ ఎకోసిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. ఇక రెండోది వాణిజ్యం, పెట్టుబడులను సులభతరంచేసే వ్యవస్థను ఏర్పాటుచేయడం. ఇందుకోసం బ్రిక్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ భాగస్వామ్య వ్యవస్థను ఏర్పాటుచేద్దాం. దీని ద్వారా ఇంటెలిజెంట్ పోర్టల్, విధానాల రూపకల్పన, కొత్త పెట్టుబడులు, వ్యాపార అవకాశాలకు అనుగుణంగా వాతావరణం సృష్టించుకోవచ్చు. దీంతో బ్రిక్స్ దేశాల మధ్య వస్తుసేవలు, పెట్టుబడులు పరస్పరం సులభంగా బదిలీఅవుతాయి’’అని జిన్‌పింగ్ అన్నారు. ‘‘ఇక మూడోది. డిజిటల్ పరిశ్రమను బలోపేతంచేయడం. ఇందుకోసం డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం, కొత్త సాంకేతికతల మార్పిడి, వివిధ పరిశ్రమల మధ్య సమన్వయం, డిజిటల్ ఎకానమీ అభివృద్ధి కోసం కృషిజరగాలి’’అని జిన్‌పింగ్ చెప్పారు. ‘‘ఇక నాలుగోది స్మార్ట్ కర్మాగారాలను కొలువుతీర్చడం. రోబోటిక్స్, ఆటోమేషన్‌లతో తయారీరంగాన్ని ఆధునీకరించాలి. ఏఐ, డిజిటల్ సాంకేతికతలను వస్తూత్పత్తి కర్మాగారాల్లో పూర్తిస్థాయిలో ఉపయోగిస్తూ ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్‌ను సాకారంచేయాలి. అందుకు కావాల్సిన ప్రమాణాల రూపకల్పనలో చైనా కూడా భాగస్వామిగా ఉంటుంది. ఇంటెలిజెంట్ మ్యానుఫాక్చరింగ్‌లో పారదర్శకత, ఎప్పటికప్పుడు అప్డేట్ ముఖ్యం’’అని ఆయన అన్నారు. ‘‘ఇక ఐదోది ఇంజనీర్స్ సృష్టి కూటమి. యూత్ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రతిభావంతులైన యువతను బ్రిక్స్ దేశాల మధ్య సమన్వయంచేస్తూ కొత్త ఇంజనీర్లను తయారుచేద్దాం’’ అని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. -
బ్రిక్స్ ధాన్యం మార్కెట్ ఏర్పాటు చేద్దాం: పుతిన్
న్యూఢిల్లీ: నేటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో సమగ్రమైన విధానాన్ని అవలంభించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. కూటమి దేశాల మధ్య ధాన్యం(గ్రెయిన్) మార్కెట్ కోసం ఒక కొత్త బీమా యంత్రాంగాన్ని, సహకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు కఠినమైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో బ్రిక్స్ సభ్య దేశాలు, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి సంబంధించిన కొత్త కార్యక్రమాలను కూడా ప్రతిపాదించారు. బ్రిక్స్ దేశాల కలిసి ఆర్థిక వృద్ధి కోసం ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయాలని అన్నారు. మూలధనం, శ్రామిక శక్తి, సాంకేతికతల విషయంలో రష్యాకు స్వతంత్ర మార్గాలు ఉన్నాయని చెప్పారు. బయటి ఒత్తిళ్లతో సంబంధం లేకుండా కార్యకలాపాలు సాగించగలమని స్పష్టంచేశారు. ఆదివారం బ్రిక్స్ సదస్సులో పుతిన్ మాట్లాడారు. గ్లోబల్ సౌత్ దేశాలు మెరుగైన ప్రపంచ పాలనా విధానాన్ని ఉమ్మడిగా ముందుకు తీసుకెళ్లాలని, భద్రతాపరమైన సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలని స్పష్టంచేశారు. -
మోదీ థ్యాంక్స్
న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖ రాగ్ర సదస్సును ఫలప్రదంగా, ఫలితాల ఆధారితంగా మార్చినందుకు కూటమిలోని సభ్య దేశాల అధినేతలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు సంబంధించిన కీలక ఘట్టాలను ప్రతిబింబించే ఒక వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. సదస్సు విజయవంతమైందని హర్షం వ్యక్తంచేశారు.శిఖరాగ్ర సమావేశంలో మోదీ చేసిన ప్రసంగంలోని కొంత భాగాన్ని కూడా ఇందులో చేర్చారు. బ్రిక్స్ సదస్సు ద్వారా భారత్ అన్ని రంగాల్లోనూ స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని పెంపొందించుకుందని ఆయన పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్, ఇతర దేశాధినేతలు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును ముగించుకొని తమ స్వదేశానికి పయనమయ్యారు. జిన్‌పింగ్ అధికారులు, వ్యాపారవేత్తలతో కూడిన భారీ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఏడేళ్ల తర్వాత ఆయన భారతదేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. రెండు రోజలపాటు తీరిక లేకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, చైనా మధ్య వాణిజ్య లోటును తగ్గించడం, ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కోవడం సహా పలు కీలక అంశాలపై చర్చించారు. అలాగే పుతిన్ శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. -
సాంకేతికతను ఖనిజాలను అస్త్రాలుగా వాడుకోవద్దు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్య ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సవాళ్లను ఎదుర్కొని మానవాళి కోసం బ్రిక్స్ కూటమి ఉమ్మడిగా కృషి చేయాలని, సహకారం, సమ్మిళిత వృద్ధి ద్వారా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆదివారం బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆధునిక సాంకేతికతను, అరుదైన ఖనిజాలను కొన్ని దేశాలు స్వలాభం కోసం అస్త్రాలుగా మార్చుకోవడంపై∙ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచదేశాల ఉమ్మడి పురోగతికి, శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుందన్నారు. గ్లోబల్ సౌత్‌లోని అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకను వినడం, వారి అనుభవాలకు విలువ ఇవ్వడం, భాగస్వామ్యం ఏర్పర్చుకోవడం వల్ల అవి బ్రిక్స్‌ను ఎక్కువగా విశ్వసిస్తున్నాయని చెప్పారు. మన వైవిధ్యమే మన గుర్తింపు, మన సహకారమే మన స్ఫూర్తి, మన పురోగతి సకల మానవాళికి సేవగా మారాలని బ్రిక్స్ సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. సమ్మిళిత ప్రపంచ వృద్ధిని ఆకాంక్షిస్తున్నాం అస్థిరమైన భౌగోళిక–రాజకీయ వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాల మధ్య సహకారం బలోపేతం కావడం అత్యంత కీలకమని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. కూటమికి భారత్ అధ్యక్షత వహించడం నిబ్బరం, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత అనే నాలుగు స్తంభాలపై కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఈ నాలుగు మూలస్తంభాల ఆధారంగా బ్రిక్స్ ద్వారా సమ్మిళిత ప్రపంచ వృద్ధిని భారత్ ఆకాంక్షిస్తోందని వ్యాఖ్యానించారు. ఎందుకంటే కూటమిలో అభివృద్ధి చేసిన పరిష్కారాల ప్రయోజనాలు కేవలం భారత్‌కే పరిమితం కాకూడదని, గ్లోబల్ సౌత్ దేశాలకు సైతం అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు స్పష్టంచేశారు. కూటమిలో అందరి సహకారం, మద్దతుతో మన ఉమ్మడి దృక్పథాన్ని పరస్పర ప్రయోజనకరమైన సహకారంగా మార్చగలగడం సంతోషాన్నిస్తోందని మోదీ ఉద్ఘాటించారు. ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి కాదు నేడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఘర్షణలు, ఉద్రిక్తతల కారణంగా సామాన్య ప్రజలే అధికంగా నష్టపోతున్నారని మోదీ గుర్తుచేశారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాల వంటివి నేటి పరస్పర అనుసంధానిత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని నిరూపించాయని తెలియజేశారు. అందుకే బ్రిక్స్ కూటమిలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం, తక్షణ చర్యలు చేపట్టడం ముఖ్యమని వివరించారు. అంటువ్యాధుల నివారణ, వాటిపై స్పందించేందుకు ‘బ్రిక్స్ సమగ్ర ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’ను ఏర్పాటు చేయడానికి అంగీకరించామని అన్నారు. అలాగే విపత్తు నిర్వహణ కోసం ‘ముందస్తు హెచ్చరిక సమాచార అనుసంధాన మార్గదర్శకాలు’రూపొందించినట్లు తెలిపారు. సప్లై చైన్లను మరింత విశ్వసనీయంగా, దృఢంగా మార్చడానికి ‘బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్ కోఆపరేసన్ ఫ్రేమ్‌వర్క్’ తోడ్పడుతుందని అన్నారు. ఆవిష్కరణల విభాగంలో బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్ మన స్టార్టప్‌లను, ఇంక్యుబేటర్లను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుందని వెల్లడించారు. ‘బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్’ను ప్రతిపాదించినట్లు స్పష్టంచేశారు. సాంకేతికతను, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం మన ఉమ్మడి పురోగతికి ఆటంకం కలిగిస్తుందన్నారు. అందుకే సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో సమ్మిళితత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ చెప్పారు. ‘బ్రిక్స్ కనెక్ట్’తో ఉపాధి అవకాశాలు బ్రిక్స్ కూటమిలోని వివిధ వేదికల ద్వారా స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని పెంపొందించినట్లు ప్రధాని వివరించారు. బ్రిక్స్ సహకారం కేవలం ప్రభుత్వాలకే పరిమితం కావడం సరైంది కాదన్నారు. పారిశ్రామికవేత్తలు, రైతులు, పరిశోధకులు, మహిళలు, యువత, సామాన్య పౌరులను ఇందులో క్రియాశీల భాగస్వాములుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ‘బ్రిక్స్ కనెక్ట్’ద్వారా నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, పనిలో మహిళల భాగస్వామ్యం, సామాజిక భద్రత, సామర్థ్య పెంపుదల వంటి అంశాలను ప్రోత్సహించామని అన్నారు. చిన్న తరహా పరిశ్రమలను పరిజ్ఞానం, ఆర్థిక వనరులు, కొత్త మార్కెట్లతో అనుసంధానించేందుకు ‘బ్రిక్స్ ఎంఎస్ఎంఈ కోఆపరేషన్ పోర్టల్’ను ప్రారంభించామని వెల్లడించారు. మన నగరాల మధ్య ఉత్తమ విధానాల పరస్పర బదిలీని సులభతరం చేసేందుకు ‘బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్’ను ఏర్పాటు చేశామన్నారు. భావి తరాల పట్ల అది మన బాధ్యత భారతీయ నాగరికతలో ప్రకృతికి కన్నతల్లి స్థానం ఉందని గుర్తుచేశారు. అభివృద్ధి, పర్యావరణం అనేవి ఒకదానికొకటి ప్రత్యామ్నాయాలు కాదని, అవి పరస్పర పూరకాలని శతాబ్దాలుగా విశ్వసిస్తున్నామని ఉద్ఘాటించారు. మానవాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పట్ల కచ్చితంగా సమతుల్యత పాటించాలని తేల్చిచెప్పారు. భావి తరాల పట్ల అది మన బాధ్యత అని సూచించారు. ఆ దిశగా పలు అంశాల్లో తాము పురోగతి సాధించామన్నారు. స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వ కోసం ‘బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేశామని, ఇది స్వచ్ఛ ఇంధన వ్యవస్థలను మరింత విశ్వసనీయంగా, సమర్థవంతంగా మార్చడానికి, అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి దోహదపడుతుందని ప్రధాని చెప్పారు. -
ప్రపంచాన్ని చుట్టేసిన వినాయకుడు
సాక్షి, అమరావతి: వినాయకుడు.. ప్రపంచాన్ని చుట్టేసిన ఆరాధ్యదైవం. వినాయకచవితి సందర్భంగా మనదేశంలో పల్లె నుంచి మహానగరం వరకు సందడి కనిపిస్తే.. విదేశాల్లోనూ భారతీయులు, హిందూ సమాజాల ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పండగ నిర్వహిస్తున్నారు. భక్తి, కళ, వ్యాపారం.. ఈ మూడు కలిసిన భారీపండగగా గణపతి ఉత్సవం మారింది. అయితే ఈ పండగకు జరిగే వ్యాపారం మామూలుగా ఉండదు. దేశవ్యాప్తంగా వేలకోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. గణనాథుడికి ఘనంగా ఉత్సవం జరపడం కోసం భక్తులు ఇష్టంగా ఈ ఖర్చు చేస్తున్నారు. ఈ వివరాలను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఒక నివేదికలో వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. పలురంగాలకు ఆదాయం దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల గణేశ్ మండపాలు ఏర్పాటవుతున్నాయి. మండపాల ఏర్పాటు, అలంకరణ, పూజాసామగ్రి, కార్యక్రమాలు, ఆహారం, రవాణా, పూలు, స్వీట్లు.. ఇలా అనేక రంగాలకు ఈ పండగ ఆదాయాన్ని తెస్తోంది. గతేడాది గణేశోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రూ.30 వేలకోట్ల వరకు వ్యాపారం జరిగిందని అంచనా. ఈ ఏడాది అది రూ.45 వేలకోట్లకు చేరే అవకాశం ఉంది. అంతకుముందు 2024లో రూ.25 వేలకోట్లకు పైగా వ్యాపారం జరిగింది. గతేడాది మండపాలు, అలంకరణ, పూజాసామగ్రి కోసం దాదాపు రూ.12 వేలకోట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్కు సుమారు రూ.5 వేలకోట్లు ఖర్చుచేశారు. ఆహారం, స్వీట్లు, ముఖ్యంగా మోదకాలకు సంబంధించి దాదాపు రూ.2,400 కోట్ల వ్యాపారం జరిగింది. బంగారం, వెండి తదితరాలకు సుమారు రూ.వెయ్యికోట్ల మేర డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్కెట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వినాయకచవితి పండగకు ప్రత్యేకస్థానం ఉంది. ఏటా ఒక్కో రాష్ట్రంలో సుమారు రెండులక్షల మండపాలు ఏర్పాటవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక్క విజయవాడలోనే కుటుంబాలు సాధారణంగా రూ.1,000–రూ.2,000 వరకు పూజాసామగ్రిపై, మండప నిర్వాహకులు రూ.50 వేల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చుచేస్తున్నట్లు స్థానిక మార్కెట్ నివేదికలు చెబుతున్నాయి. కొన్ని పెద్దమండపాల అలంకరణకే రూ.5 లక్షలకు పైగా ఖర్చవుతోంది. మహారాష్ట్ర గణేశోత్సవానికి కేంద్రబిందువు. అక్కడ 7 లక్షలకుపైగా మండపాలుంటాయని అంచనా. రాయ్‌గఢ్‌లోని పెన్ ప్రాంతం గణేశ విగ్రహాల తయారీకి ప్రసిద్ధి. అక్కడ సుమారు 600 వర్క్‌షాప్‌లలో ఏడాదికి 10 లక్షల విగ్రహాలు తయారవుతుండగా దాదాపు 2.5 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. ఈ ఒక్క ప్రాంతం విగ్రహ పరిశ్రమ వార్షిక టర్నోవర్ సుమారు రూ.200 కోట్లు. విగ్రహ తయారీదారులు, రంగులు వేసేవారు, అలంకరణ కారి్మకులు, విద్యుత్ సిబ్బంది, పూల వ్యాపారులు, పూజాసామగ్రి విక్రేతలు, స్వీట్ షాపులు, క్యాటరింగ్, రవాణా, డీజేలు, సౌండ్సిస్టమ్, భద్రతా సిబ్బంది.. ఇలా భారీసంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి ఈ పండగతో ముడిపడి ఉంది. విగ్రహాల తయారీలో వందలాదిమంది కళాకారులు, కార్మికులకు ఉపాధి లభిస్తోంది.విదేశాల్లోనూ బొజ్జగణపయ్య సందడి మారిషస్, ఫిజీ, మలేసియా, సింగపూర్, నేపాల్, ఇండోనేషియా వంటి దేశాల్లో వినాయకచవితి ప్రత్యేకంగా జరుగుతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆ్రస్టేలియాల్లోను ఆలయాలు, భారతీయ సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇండోనేషియాలోని బాలిలో గణేశుడిని జ్ఞానం, కళలకు ప్రతీకగా భావిస్తారు. ఆగ్నేయాసియాలో అయితే గణేశుడి ఆరాధనకు శతాబ్దాల చరిత్ర ఉంది. థాయ్‌లాండ్‌లో ‘ఫ్రా ఫికానెట్’గా పూజిస్తారు. జపాన్‌లో ‘కాంగితెన్’ పేరుతో ప్రత్యేక రూపంలో గణేశుడిని ఆరాధించడం ఆశ్చర్యం కలిగించే విషయం. అమెరికా నుంచి ఆ్రస్టేలియా వరకు భారతీయ సమాజాల భాగస్వామ్యంతో గణేశోత్సవం విస్తరిస్తుండటం.. వినాయకుడి భక్తి విశ్వవ్యాప్తమని చాటుతోంది. -
ఫెరిస్ వీల్లో చిక్కుకున్న జుట్టు.. అయినా గిరాగిరా తిరగడంతో..
ముంబై: మహారాష్ట్రలోని యవత్మాల్లో జాతర వేళ ఘోర ప్రమాదం జరిగింది. ఫెరిస్ వీల్లో జుట్టు చిక్కుకోవడంతో బాలీ మారోతి తాలికోటే (25) అనే యువతి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె తలపై చర్మంలో కొంత భాగం పూర్తిగా ఊడిపోయింది. యవత్మాల్ జిల్లా మహాగావ్ తాలూకాలో తంహా పోలా పండుగ సందర్భంగా ఒకరోజు జాతర నిర్వహించారు. సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు పునేశ్వర్ మహాదేవ్ ఆలయానికి వచ్చారు.ఫుల్సావంగి గ్రామానికి చెందిన బాలీ మారోతి తాలికోటే జాతరకు వచ్చి ఫెరిస్ వీల్ ఎక్కారు. అది వేగంగా తిరుగుతున్న సమయంలో ఆమె జుట్టు సీటు వెనుక ఉన్న తిరిగే బేరింగ్‌లో చిక్కుకుంది. ఫెరిస్ వీల్ వేగంగా తిరుగుతుండటంతో ఆమె జుట్టు ఒక్కసారిగా బలంగా లాగినట్లయింది. దీంతో తలపై చర్మంలో పెద్ద భాగం ఊడిపోయింది. తీవ్ర నొప్పితో ఆమె కేకలు వేయడంతో అక్కడున్న వారు గమనించారు. రక్తంతో ఉన్న ఆమెను చూసి జాతరలో భయాందోళనలు నెలకొన్నాయి.సమాచారం అందుకున్న సహాయ పోలీసు ఇన్స్పెక్టర్ సునీల్ అంబురే, పోలీసు కానిస్టేబుల్ సుహాస్ కాయ్టే అక్కడికి చేరుకున్నారు. వేగంగా తిరుగుతున్న ఫెరిస్ వీల్‌ను స్థానికుల సహాయంతో నిలిపివేశారు. అనంతరం బాధిత యువతిని సురక్షితంగా ఫెరిస్ వీల్ నుంచి బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి Bharat Squad (@thebharatsquad) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది -
అత్యంత సంపన్న గణపతి మండపం.. రూ.703 కోట్ల బీమా
ముంబైలోని కింగ్స్ సర్కిల్లో ప్రతిష్ఠించిన జీఎస్బీ మహాగణపతి విగ్రహానికి ఈ ఏడాది రూ.703.27 కోట్ల బీమా కల్పించారు. దేశంలోనే అత్యంత సంపన్న గణపతి మండపాల్లో ఒకటిగా పేరున్న జీఎస్బీ సేవా మండల్ ఈ బీమా తీసుకుంది. గత ఏడాది రూ.474 కోట్ల బీమా తీసుకోగా.. ఈ ఏడాది మొత్తం పెరిగింది.ఈ మహాగణపతి విగ్రహాన్ని 66 కిలోలకు పైగా బంగారం, 335 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు. విలువైన రత్నాలను కూడా విగ్రహానికి అలంకరించారు. ఈ ఆభరణాల్లో చాలా వరకు భక్తులు, సేవకులు విరాళంగా ఇచ్చినవేనని నిర్వాహకులు తెలిపారు.జీఎస్బీ అంటే గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్. ఈ మండల్ ఈ ఏడాది 72వ గణేశోత్సవాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు 5 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. మహాగణపతి విగ్రహాన్ని పర్యావరణహితంగా తయారు చేశారు. ఉత్సవాల్లో ప్రతిరోజూ 40,000 మందికి పైగా అన్నదాన సేవ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 5 రోజుల వ్యవధిలో 2 లక్షల మందికి పైగా ప్రసాదం అందుకోనున్నట్లు చెప్పారు.వేద సంప్రదాయాలు, శాస్త్రాల ప్రకారం పలు పూజలు, సేవలు నిర్వహించనున్నారు. కాగితపు వృథాను తగ్గించేందుకు సంప్రదాయ ముద్రిత రశీదుల స్థానంలో డిజిటల్ రశీదులను కూడా ప్రవేశపెట్టారు. -
విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు చేసింది. తన స్నేహితుడు, సినీ హీరో అజిత్ కారు రేసును చూడటానికే విజయ్ లండన్ వెళ్లారని ఆరోపించింది. ఈ విమర్శలపై టీవీకే స్పందించింది. స్నేహితుడిని కలవడం తప్పేమీ కాదని స్పష్టం చేసింది. బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన మిషెలిన్ లే మాన్స్ కప్ రేసును ప్రారంభించేందుకు విజయ్ సంప్రదాయ ఆకుపచ్చ జెండాను ఊపారు. అజిత్ కుమార్ 2026 ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నారు.“తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ లండన్‌లో ఉన్నారు. మనకు రైతుల సమస్య ఉంది, మత్స్యకారుల సమస్య ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎలాంటి తొందర లేదు” అని డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అన్నారు. తమిళనాడుకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, చెన్నై సమీపంలో ప్రతిపాదించిన మోటార్ స్పోర్ట్స్ సిటీ కోసం ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలను పరిశీలించడం కోసం విజయ్ బ్రిటన్‌లో అధికారిక పర్యటన చేస్తున్నారు.“వీళ్లకు ప్రచారం చేసుకోవడం, గొప్పగా చూపించుకోవడంపైనే ఆసక్తి ఉంది. కానీ మన ముఖ్యమంత్రి పని చేస్తున్నారు. మీరు పర్యటనలో ఉన్నప్పుడు మీ స్నేహితుడిని కలవడం తప్పేమీ కాదు. వాళ్లు అజిత్ గురించి మాట్లాడుతున్నారని నాకు తెలుసు. అజిత్ తమిళనాడులోనే కాదు, రేసింగ్ రంగంలో కూడా ఒక స్టార్” అని టీవీకే అధికార ప్రతినిధి అమెరికై వి. నారాయణన్ అన్నారు. “ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అజిత్ లాంటి వ్యక్తిని వెళ్లి కలిస్తే, అది తమిళనాడు బ్రాండ్ విలువను పెంచుతుంది. వాళ్లు మనపై అసూయతో ఉన్నారు. అందుకే ఇవన్నీ చేస్తున్నారు. ఈ చిన్న, అర్థంలేని మాటలతో మన దృష్టి మళ్లించుకోవాల్సిన అవసరం లేదు” అని ఆయన అన్నారు.విజయ్ బ్రిటన్ పర్యటనతమిళనాడు బలమైన ఆటోమొబైల్, విద్యుత్ వాహనాల తయారీ రంగాన్ని ఉపయోగించుకుని ప్రపంచస్థాయి మోటార్ స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేయాలనే ప్రతిష్ఠాత్మక ప్రణాళికను ముందుకు తీసుకెళ్తున్న సమయంలో విజయ్ బ్రిటన్ పర్యటన సాగుతోంది. ప్రభుత్వం ప్రకారం, మోటార్ స్పోర్ట్స్ మౌలిక సదుపాయాలు, క్రీడా పర్యాటకం, ఈ రంగంతో అనుసంధానమైన ప్రత్యేక ఆటోమొబైల్ పరిశ్రమల అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుంది.విజయ్-అజిత్ కలయికసిల్వర్స్టోన్ రేసింగ్ సర్క్యూట్లో విజయ్ తన స్నేహితుడు అజిత్ కుమార్ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి ఆలింగనం చేసుకున్న దృశ్యం కనిపించింది. మిషెలిన్ లే మాన్స్ కప్‌లో సిల్వర్‌స్టోన్ రౌండ్‌కు ముందు అజిత్ కుమార్ స్వయంగా ముఖ్యమంత్రి విజయ్‌కు వేదిక వద్ద స్వాగతం పలికారు.@actorvijay in action! 🎥Watch the full race LIVE and FREE on FIAWEC+ https://t.co/DYCHBX6lvB pic.twitter.com/12EgOUsYGy— Le Mans Cup (@LeMansCup) September 12, 2026 Ajith Kumar and Thalapathy Vijay looking effortlessly iconic together. What a moment. pic.twitter.com/camn5fuGhw— The XO Show ™ (@latenightxoshow) September 13, 2026 -
‘నేను రాజీనామా చేస్తున్నా’.. అభిజీత్ దీప్కే కిర్రాక్ సెటైర్
భోపాల్: కాక్రోచ్ జంతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై వ్యంగ్యంగా స్పందించారు. తాను రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ ఓ వ్యంగ్య రాజీనామా లేఖను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేశారు. అయితే, ఈ లేఖ అధికారిక లెటర్‌హెడ్‌ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలకు దారితీసింది.బాలాఘాట్‌లో కొందరు సామాజిక మాధ్యమ ఇన్ఫ్లుయెన్సర్లు తనను అడ్డుకుని ప్రశ్నించిన మరుసటి రోజే దీప్కే ఈ లేఖను షేర్ చేశారు. సంక్రమణ వ్యాధితో మరణించిన గిరిజన పిల్లల కుటుంబాలను కలిసేందుకు ఆయన బాలాఘాట్ వెళ్లారు. “మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. అయితే ఈ అవకాశంలో నేను స్పష్టంగా విఫలమయ్యాను” అని దీప్కే పేర్కొన్నారు. ఆయన లేఖ అచ్చం అధికారిక లేఖలా కనిపించింది.వ్యంగ్యంగా రూపొందించిన ఈ లేఖలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలుగా తాను భావిస్తున్న అంశాలను దీప్కే ప్రస్తావించారు. సాగర్ కల్తీ మద్యం ఘటన, బాలాఘాట్‌లో సంక్రమణ వ్యాధులతో గిరిజన పిల్లల మరణాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఆయన సహచరులను ఆయన విమర్శించారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి ఆశుతోష్ రంకా కూడా దీప్కే పోస్టుపై స్పందించారు. బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.లెటర్‌హెడ్ దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలుదీప్కే వ్యంగ్య రాజీనామా లేఖపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. అధికారిక లెటర్‌హెడ్‌ను దుర్వినియోగం చేశారని కొందరు ఆరోపిస్తూ.. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఓ స్వచ్ఛంద సంస్థ కోరింది.భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా పేర్కొన్న ఓ వ్యక్తి కూడా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి లెటర్‌హెడ్‌ను దుర్వినియోగం చేసినందుకు, ముఖ్యమంత్రి ఉన్నత పదవిని మోసపూరితంగా అనుకరించినందుకు దీప్కేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.బాలాఘాట్‌లో దీప్కేపై ప్రశ్నల వర్షంశనివారం మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని అడోరి, కోర్కా, బొండారీ గ్రామాలను అభిజీత్ దీప్కే సందర్శించారు. సంక్రమణ వ్యాధులతో మరణించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గిరిజన పిల్లల కుటుంబాలను కలుసుకోవడంతో పాటు స్థానిక వైద్య సదుపాయాల గురించి సమాచారం సేకరించేందుకు ఆయన అక్కడికి వెళ్లారు.దీప్కే కారులో అక్కడి నుంచి వెళ్తుండగా ఓ మహిళా సామాజిక మాధ్యమ ప్రభావశీలి ఆయన ముఖం వద్దకు మైక్రోఫోన్ తీసుకెళ్లి ప్రశ్నించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. “శవాలపై రాజకీయాలు చేయడానికి వచ్చారా?” అని ఆమె ప్రశ్నించారు. ఇంత ఆలస్యంగా ఈ ప్రాంతాన్ని ఎందుకు సందర్శిస్తున్నారని కూడా అడిగారు. తాను ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు దీప్కే చెప్పడం వినిపించింది.“ఇక్కడ మంచి రహదారి నిర్మించారు. అది మీకు కనిపించడం లేదా?” అని కూడా ఆ మహిళ ప్రశ్నించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దీప్కేతో వచ్చిన కాక్రోచ్ జంతా పార్టీ కార్యకర్తలు ఆయనను మరో కారులో ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీప్కే వెళ్లిపోతుండగా ఆ మహిళ “పారిపోయారు.. పారిపోయారు” అని చెప్పడం వినిపించింది.బయటి ప్రాంతాలకు చెందిన ఈ సామాజిక మాధ్యమ ఇన్ఫ్లుయెన్సర్ల బృందం మారుమూల గ్రామానికి రావడంపై స్థానిక పాత్రికేయులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడి పర్యటనను అడ్డుకునేందుకు ఎవరైనా వారిని పంపించారా? అనే అనుమానాలను వారు వ్యక్తం చేశారు.ఈ ప్రాంతంలో 30 మందికి పైగా పిల్లలు మరణించిన ఘటనపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. పిల్లలకు తగిన వైద్యం అందడం లేదని, 50 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రిలో సుమారు 400 మంది పిల్లలకు చికిత్స అందిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.రాష్ట్ర ఆరోగ్య శాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖ, బాలాఘాట్ కలెక్టర్ తదితరులకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఆ ప్రాంతంలో విస్తృతంగా అపరిశుభ్రత ఉందని, ఈ పరిస్థితుల వల్ల సంక్రమణలు ఏర్పడుతున్నాయని, పిల్లలు వ్యాధులతో మరణిస్తూనే ఉన్నారని పిటిషనర్ రూపొందించిన నివేదికలో ఆరోపించారు.సాగర్ కల్తీ మద్యం ఘటనసాగర్ జిల్లా బండా ప్రాంతంలో కల్తీ మద్యం సేవించిన తర్వాత పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఈ కేసులో 19 మంది నిందితులను అరెస్టు చేశారు. విషపూరిత మద్యం సేవించినట్లు అనుమానం ఉన్నప్పుడు ఉపయోగించే ఫోమెపిజోల్ అనే విరుగుడు మందుతో చికిత్స పలువురు రోగులకు కీలకంగా మారింది. అధికారుల ప్రకారం ఈ మందు ఇప్పటివరకు 30 మందికి పైగా ప్రాణాలను కాపాడటంలో సహాయపడింది.ఇదీ చదవండి: పండ్ల బుట్టలో దాచిన తుపాకీని తీసి కాల్పులు -
పండ్ల బుట్టలో దాచిన తుపాకీని తీసి కాల్పులు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా జైలులో ఓ విచారణ ఖైదీ.. జైలు గార్డుపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన 9 రోజుల తర్వాత ఈ దృశ్యాలు బయటకు రావడం గమనార్హం. పండ్ల బుట్టలో దాచిన తుపాకీతో ఖైదీ జైలు గార్డుపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో తాత్కాలిక జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు.ఖైదీ పేరు నీలేశ్ ఠాకూర్. రక్షాబంధన్ సందర్భంగా జైలులో నిర్వహించిన వేడుకల సమయంలో అతడు జైలు గార్డు దిగ్విజయ్ సింగ్ తోమర్‌పై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యాయత్నం కేసులో ఠాకూర్ జైలులో ఉన్నట్లు ఉపవిభాగ పోలీసు అధికారి ప్రతిభా శర్మ తెలిపారు.గార్డును ఠాకూర్ ఒక్కసారిగా పట్టుకుని కాల్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. గార్డు తిరిగి ఎదురుదాడికి ప్రయత్నించగా.. ఖైదీ అతడిని పక్కకు నెట్టేసి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు దృశ్యాల్లో ఉంది. ఠాకూర్ పండ్ల బుట్టతో ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి దాన్ని తెరవాలని తోమర్‌ను ఒత్తిడి చేశాడు. గార్డు నిరాకరించడంతో.. బుట్టలో దాచిన దేశీయంగా తయారు చేసిన తుపాకీని బయటకు తీసి అతడిపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.కాల్పుల్లో బుల్లెట్ తోమర్ వీపు ఎడమ వైపున తగలడంతో అతడు కుప్పకూలాడు. జిల్లా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన తర్వాత పరిస్థితి విషమించడంతో భోపాల్‌లోని ఎయిమ్స్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. తాత్కాలిక జైలు సూపరింటెండెంట్ ఆర్కే.చౌరే, ఇతర గార్డులు వెంటనే అక్కడికి చేరుకుని ఠాకూర్‌ను పట్టుకున్నారని చెప్పారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అక్రమ ఆయుధం జైలులోకి ఎలా చేరిందనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.చౌరే సస్పెన్షన్ ఈ ఘటనలో తీవ్రమైన నిర్లక్ష్యం జరిగినట్లు అధికారులు గుర్తించడంతో చౌరేను వెంటనే సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ సమయంలో ఆయనను జైలు ప్రధాన కార్యాలయంలో విధులకు కేటాయించారు. దర్యాప్తును జైళ్ల శాఖ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ సంజయ్ పాండేకు అప్పగించారు. మధ్యప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వరుణ్ కపూర్ మాట్లాడుతూ.. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇదీ చదవండి: ‘నేను రాజీనామా చేస్తున్నా’.. అభిజీత్ దీప్కే కిర్రాక్ సెటైర్భద్రతా లోపంలో జైలు గార్డుల పాత్ర ఏమైనా ఉందా? ఠాకూర్‌కు ఆయుధం అందేందుకు ఎవరైనా సహకరించారా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో.. బయట నుంచి ఎవరో తుపాకీని జైలు లోపలికి విసిరారని ఠాకూర్ చెప్పినట్లు తెలుస్తోంది. రక్షాబంధన్ వేడుకల కోసం జైలులోకి తీసుకొచ్చిన స్వీట్లు, పండ్ల బుట్టల్లో ఒకదానిలో తుపాకీని దాచి ఉండవచ్చని చౌరే అంతకుముందు అనుమానం వ్యక్తం చేశారు. తుపాకీ జైలులోకి ఎలా చేరింది? ఇందులో ఎవరి ప్రమేయం ఉంది? అనే విషయాలను దర్యాప్తు తేల్చనుంది.🚨 RAISEN : An undertrial prisoner allegedly attacked a jail guard during an escape attempt, firing a shot before striking him and throwing chilli powder into his eyes. The guard fought back and helped stop the escape, while a security probe was ordered. https://t.co/CrMAdCnAHR— indiainlast24hr (@indiain24hr) September 12, 2026 -
దేవుళ్లపై భక్తుల ఫిర్యాదులు, విచారణ.. కఠిన శిక్షలు
కోరిన కోరికలు తీర్చడం లేదని దేవుళ్లకే శిక్షలు వేస్తున్నారు ఓ గ్రామంలో. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని బంగారం దేవి ఆలయానికి శనివారం వచ్చిన భక్తులు తమ దేవుళ్లను వెంట తీసుకొచ్చారు. అయితే ఇది కేవలం పూజల రోజు కాదు. కొందరు భక్తులు తమ దేవుళ్లపై ఫిర్యాదులు చేసేందుకు అక్కడికి వచ్చారు.ఈ సంప్రదాయాన్ని అనుసరించే సమాజాలకు బంగారం దేవి సాధారణ దేవత మాత్రమే కాదు. ఈ సంప్రదాయ న్యాయస్థానానికి ఆమె ప్రధాన దేవతగా భావిస్తారు. న్యాయమూర్తి, జైలర్ బాధ్యతలను ఆమె నిర్వహిస్తుందని నమ్ముతారు.పూజిస్తున్నప్పటికీ అనారోగ్య సమస్యలు కేశ్కల్ ప్రాంతానికి చెందిన మంగళ్ చంద్ మార్కమ్ కొన్నేళ్లుగా ఒక దేవతను పూజిస్తున్నా, ఆయన కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు కొనసాగాయి. దీంతో ఆ దేవతను భంగారం దేవి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. తన కుటుంబాన్ని కాపాడే బాధ్యతను ఆ దేవత నిర్వర్తించలేదని ఫిర్యాదు చేసి, శిక్షించాలని కోరారు.కేశ్కల్ గ్రామాలు, పరిసర ప్రాంతాల్లోని గిరిజన సమాజాలు పూజించే దేవతల ప్రతీకలను భాదో జాత్ర సమయంలో ఆలయానికి తీసుకొస్తారు. ఈ సమయంలో ఈ మతపరమైన సమూహ సమావేశం సంప్రదాయ న్యాయస్థానంలా మారుతుంది. ఇందులో సాధారణంగా ఫిర్యాదుదారు భక్తుడిగా ఉంటాడు. నిందితుడిగా దేవత ఉండవచ్చు.కుటుంబ సభ్యుడు ప్రార్థనలు చేసినా అనారోగ్యంతోనే ఉండటం, కష్టపడి పంట పండించినా పంటలు దెబ్బతినడం వంటి రోజువారీ జీవిత సమస్యలపై ఫిర్యాదులు ఉంటాయి. ఎన్నేళ్లుగా పూజిస్తున్న దేవత నుంచి తమకు రక్షణ, శ్రేయస్సు లభించలేదని కుటుంబాలు భావిస్తాయి.తమ బాధ్యతను దేవత నిర్వర్తించలేదని భక్తులు భావించినప్పుడు, ఆ దేవతను బంగారం దేవి ఆలయ న్యాయస్థానం ముందు తీసుకొస్తారు. ఇతర దేవతలపై వచ్చిన ఫిర్యాదులను భంగారం దేవి ముందు ఉంచుతారు. భక్తులు తమ సమస్యలను వివరిస్తారు. తాము ఆధారాలుగా భావించే అంశాలను న్యాయస్థానం ముందు సమర్పిస్తారు. అనంతరం సమాజ సంప్రదాయ విశ్వాసాల ప్రకారం తీర్పు వెలువడుతుంది.దేవతలకు కఠిన శిక్ష ఒక దేవతను అక్కడ ఉంచిన తర్వాత దానిని ఇకపై పూజించరు. ఆ కుటుంబం లేదా గ్రామం మరో దేవతను పూజించడం ప్రారంభిస్తుంది. మరో గ్రామస్థుడు సోమ్లు కుంజమ్ మాట్లాడుతూ.. తాను వ్యవసాయంలో కష్టపడి పనిచేసినా గత 2 సంవత్సరాలుగా దిగుబడి తక్కువగానే ఉందని తెలిపారు. ఆ బాధ్యతను తన దేవత సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్లే ఇలా జరిగిందని భావించి, ఆ దేవతపై చర్య తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.ఆలయ కమిటీ కార్యదర్శి నంద్లాల్ సిన్హా మాట్లాడుతూ.. భాదో జాత్రకు ప్రజలు తమ దేవతలపై వివిధ రకాల ఫిర్యాదులతో వస్తారని తెలిపారు. సంప్రదాయ విచారణలో భాగంగా ఈ ఫిర్యాదులను వింటారని చెప్పారు. చిన్న ఫిర్యాదుల విషయంలో దేవతకు కేవలం హెచ్చరిక ఇచ్చి, తన బాధ్యతలను మెరుగ్గా నిర్వర్తించాలని సూచిస్తూ తిరిగి పంపవచ్చని సిన్హా తెలిపారు.ఒక దేవత చాలాకాలంగా తమకు సహాయం చేయలేదని లేదా పట్టించుకోలేదని గ్రామస్థులు భావిస్తే మరింత కఠినమైన శిక్ష విధించవచ్చని చెప్పారు. అలాంటి దేవతలకు శాశ్వత శిక్ష విధించవచ్చని తెలిపారు. వాటి ప్రతీకలను ఆలయ ప్రాంగణంలోని ఒక గుంతలో ఉంచుతారు. ఆ ప్రాంతాన్ని సమాజం జైలుగా పిలుస్తుంది.ఒక దేవతను అక్కడ ఉంచిన తర్వాత దానిని ఇకపై పూజించరు. ఆ కుటుంబం లేదా గ్రామం మరో దేవతను పూజించడం ప్రారంభిస్తుందని సిన్హా తెలిపారు. ఈ సంప్రదాయం ఎలా ప్రారంభమైందనే దానిపై లిఖితపూర్వక ఆధారం ఏదీ లేదని సిన్హా వివరించారు. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందని, వివిధ గ్రామాల ప్రజలు తమ కుటుంబం లేదా గ్రామ దేవతలపై ఫిర్యాదులతో ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. -
బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయం.. కదిలిన యంత్రాంగం
ఢిల్లీ : తన 37 ఏళ్ల క్రితం నాటి భూవివాదాన్ని పరిష్కరించాలని అస్గర్ అలీ వోహ్రా (81) తన బాల్య మిత్రుడు ప్రధాని మోదీని కోరారు. అందుకు ప్రధాని మోదీ అభయమిచ్చారు.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గుజరాత్‌లోని వద్‌నగర్‌లో ప్రధాని మోదీతో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గర్ అలీ వోహ్రా తన భూ వివాదంపై జోక్యం చేసుకోవాలని ప్రధానిని అభ్యర్థించారు. మహారాష్ట్రలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ భూ వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.మహారాష్ట్రలోని మీరా రోడ్ ప్రాంతానికి చెందిన అస్గర్ అలీ వోహ్రా (81) ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నేరుగా కలిశారు. 1989లో ముంబై భాయందర్ ఈస్ట్ పరిధిలోని నవ్ఘర్ ప్రాంతంలో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని తాను రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.అయితే 2011లో ‘స్వయం బిల్డర్స్’, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు చెందిన ‘సెవెన్ ఎలెవన్ కన్ స్ట్రక్షన్’ సంస్థలు తన భూమిని కబ్జా చేశాయని వోహ్రా ఆరోపించారు. అసలు యజమానికి తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించి, ఆ భూమిని రెండు భాగాలుగా విభజించి ఆ రెండు సంస్థల పేరిట ఆక్రమించుకున్నారని ఆయన వాపోయారు.ఈ భూ వివాదానికి సంబంధించి 2015లోనే ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ, కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. దశాబ్దాలుగా రెవెన్యూ శాఖ, మున్సిపల్ అధికారులు, పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో చివరికి ఆయన ప్రధాని మోదీని ఆశ్రయించారు. తన గోడు వెళ్లబోసుకున్న వోహ్రాకు ప్రధాని సానుకూలంగా స్పందించి అభయమిచ్చారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ విడుదల చేయగా, ప్రధాని తన బాల్య స్నేహితుడికి తగిన న్యాయం అందేలా చూస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రధాని కార్యాలయ జోక్యంతో కదిలిన మున్సిపల్ యంత్రాంగం ఈ ఉదంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 16న ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక విచారణకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ‘సెవెన్ ఎలెవన్ కన్ స్ట్రక్షన్’, ‘స్వయం బిల్డర్స్’ ప్రతినిధులకు అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. -
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని వాయువ్య ప్రాంతమైన స్వరూప్ నగర్లో ఆదివారం ఉదయం ఒక గోడౌన్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు దాదాపు 15 అగ్నిమాపక యంత్రాలను ఘటనా స్థలానికి రప్పించారు.ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం, భయాందోళనల మధ్య కొందరు స్థానికులు భవనాల పైనుంచి దూకడం వల్ల మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. మంటలు చెలగడానికి అసలు కారణం ఏమిటి అనే కోణంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది విచారణ జరుపుతున్నారు. -
కొత్త కమిషనర్‌గా కేతరిన్ శరణ్య బాధ్యతలు
తమిళనాడు: వేలూరు కార్పొరేషన్‌ను హరిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన కేతరిన్ శరణ్య అన్నారు. వేలూరు కమిషనర్‌గా పనిచేస్తున్న సుల్తానాను చెన్నైకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న కేతరిన్ శరణ్యను నియమించారు. దీంతో శనివారం ఉదయం ఆమె వేలూరులో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ వేలూరు కార్పొరేషన్‌లోని సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు అధిక ప్రాదాన్యత ఇస్తామన్నారు. అదే వి«ధంగా ప్రజల దాహర్తిని తీర్చేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు. కాగా కమిషనర్ కేతరీన్ శరణ్య వేలూరు ఎస్పీ శివరామన్ సతీమణి కావడం గమనార్హం. చదవండి: ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు -
ఒక చేతిలో ‘బ్రహ్మోస్’.. మరో చేతిలో సెమీకండక్టర్ చిప్..
న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్సీఆర్లో గణేశోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 14 నుంచి పది రోజులపాటు దేశభక్తి, సాంస్కృతిక అంశాలతో మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముంబై, చెన్నైతో పాటు దక్షిణాది కళాకారులు ఢిల్లీకి రానున్నారు. ‘ఢిల్లీ కా మహారాజా’ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి వినూత్న థీమ్‌ను ఎంచుకున్నారు. 9 అడుగుల గణపతి విగ్రహం చేతుల్లో సంప్రదాయ వస్తువులకు బదులుగా బ్రహ్మోస్ క్షిపణి, డ్రోన్, సెమీకండక్టర్ చిప్‌ను ఉంచారు. ‘విఘ్నహర్త నుంచి వికాసకర్త’ అనే ఇతివృత్తంతో దేశ పురోగతిలో సాంకేతికత, భద్రత, యువత పాత్రను చాటనున్నారు. 80 అడుగుల ప్రదర్శన వేదికపై సంప్రదాయ ఆలయాలు, రాకెట్లు, డ్రోన్లు, 10 అడుగుల బుల్లెట్ రైలు నమూనాలను ప్రదర్శించనున్నారు.2,100 శంఖాలతో ఘన ప్రారంభంలాల్బాగ్ కా రాజా గణపతి మహోత్సవం సెప్టెంబర్ 14న ప్రారంభం కానుంది. రాత్రి 7.30 గంటలకు 2,100 మంది భక్తులు ఒకేసారి శంఖాలు ఊది కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం ముంబైలోని లాల్బాగ్చా రాజా విగ్రహాలను రూపొందించే కళాకారులు తయారుచేసిన 18 అడుగుల గణపతి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రోజుకు సుమారు 20 వేల నుంచి 25 వేల మంది భక్తులు దర్శనానికి వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.ఢిల్లీలో మహారాష్ట్ర సందడి29వ సార్వజనిక గణేశ్ ఉత్సవంలో మహారాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించనుంది. మరాఠీ గజల్స్, నాటకాలు, లావణి, సంగీత కార్యక్రమాలతో పాటు పూరణ్ పోళీ, ఉక్కడిచే మోదక్ వంటి సంప్రదాయ వంటకాలు అందుబాటులో ఉంటాయి. పైఠణీ, ఇర్కల్ చీరల విక్రయాలు, ప్రత్యేక నిమజ్జన ఊరేగింపు కూడా నిర్వహించనున్నారు.చెన్నై కళాకారుల గణపయ్యమయూర్ విహార్‌లోని శ్రీ శుభ సిద్ధి వినాయక మందిరంలో చెన్నై కళాకారులు రూపొందించిన నాలుగు అడుగుల గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సెప్టెంబర్ 14న 25 మూలమంత్ర జపం అనంతరం 5,000 మోదకాలను నైవేద్యంగా సమర్పించనున్నారు. దక్షిణాది కళాకారులు సంప్రదాయ భజనలు నిర్వహించనున్నారు.నోయిడాలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలునోయిడాలోని శ్రీ వరసిద్ధి వినాయక మందిరంలో ఐదు రోజులపాటు గణేశ్ చతుర్థి వేడుకలు జరగనున్నాయి. హవనం, అభిషేకాలు, సహస్రనామ పారాయణాలతో పాటు భరతనాట్యం, వేణుగానం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ఇదీ చదవండి: అద్దెకు ఫైబర్ గణేశుడు.. 10 అడుగుల విగ్రహం మూడు వేలకే.. -
అద్దెకు ఫైబర్ గణేశుడు.. 10 అడుగుల విగ్రహం మూడు వేలకే..
బెంగళూరు: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) గణేశ విగ్రహాలపై నిషేధం అమల్లోకి రావడంతో విగ్రహ తయారీదారులు కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పర్యావరణహితంగా పండుగను నిర్వహించేందుకు ఫైబర్ గణేశ విగ్రహాలను అద్దెకు ఇస్తున్నారు. వివిధ పరిమాణాల్లో అందుబాటులో ఉన్న ఈ విగ్రహాలకు వాటి సైజును బట్టి అద్దె నిర్ణయిస్తున్నారు. ఈ విధానాన్ని పర్యావరణవేత్తలు స్వాగతిస్తున్నారు. పీవోపీ విగ్రహాల వల్ల నీటి వనరులకు కలిగే కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు ఇవి ఉపయోగపడతాయని అంటున్నారు.బెంగళూరుకు చెందిన శ్రీ వినాయక అండ్ కంపెనీ ప్రతినిధి ఎం. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. వారి వద్ద సుమారు 50 రకాల ఫైబర్ గణేశ విగ్రహాలు అద్దెకు అందుబాటులో ఉన్నాయి. పీవోపీ విగ్రహాలపై నిషేధం నేపథ్యంలో ఈ విధానాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. కొందరు ఇప్పటికే ఫైబర్ విగ్రహాలను అద్దెకు తీసుకున్నారని, ఊరేగింపు అనంతరం దానిని తిరిగి అప్పగిస్తారని, చెరువులో నిమజ్జనం చేయబోరని వివరించారు.8 నుంచి 10 అడుగుల విగ్రహానికి రోజుకు రూ.3,000 నుంచి.. 18 నుంచి 20 అడుగుల విగ్రహానికి రూ.30,000 వరకు అద్దె ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి, ఒప్పందంపై సంతకం చేస్తే బెంగళూరు నగరం లేదా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా విగ్రహాలను సరఫరా చేస్తామని చెప్పారు. డిపాజిట్ మొత్తం విగ్రహ పరిమాణం, అద్దె కాలవ్యవధిపై ఆధారపడి ఉంటుందన్నారు.ఫైబర్ విగ్రహాలకు పూజలు నిర్వహించవచ్చని, వాటితోపాటు చిన్న మట్టి గణేశుడిని ఏర్పాటు చేసుకోవాలని శ్రీనివాస్ సూచించారు. మట్టి విగ్రహాన్ని నిర్ణీత ప్రదేశంలో నిమజ్జనం చేసి, ఫైబర్ విగ్రహాన్ని తిరిగి ఇవ్వవచ్చన్నారు. బకాయి అద్దెను మినహాయించిన అనంతరం భద్రతా డిపాజిట్‌ను తిరిగి చెల్లిస్తామని తెలిపారు.ఇదీ చదవండి: రాహుల్, ప్రియాంకతో మలేసియా ప్రధాని భేటీ -
రాహుల్, ప్రియాంకతో మలేసియా ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం భారత్‌కు వచ్చిన మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహిం ఆదివారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. దీనిలో రాహుల్ సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు. ముగ్గురూ కలిసి అల్పాహారం స్వీకరిస్తూ, పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు. అన్వర్ ఇబ్రహిం రాహుల్ గాంధీని కలిసిన సమయంలో ఇరువురు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అనంతరం అల్పాహార టేబుల్ వద్దకు వెళ్లారు. అక్కడ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఉండటంతో ముగ్గురూ కలిసి అల్పాహారం చేస్తూ మాట్లాడుకున్నారు. అయితే చర్చించిన అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు. Prime Minister of Malaysia Anwar Ibrahim met Lok Sabha Leader of the Opposition Rahul Gandhi and Congress MP Priyanka Gandhi Vadra for a breakfast meeting. (Source: AICC) https://t.co/tW5MCZfTKv— ANI (@ANI) September 13, 2026బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహిం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రక్షణ, వాణిజ్యం, డిజిటల్ సాంకేతికత, సెమీకండక్టర్లు తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. ఫిబ్రవరి 2026లో మోదీ మలేసియా పర్యటన సందర్భంగా వచ్చిన ఫలితాలపైనా చర్చ జరిగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ-భద్రత, సెమీకండక్టర్లు, మౌలిక వసతులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, ఫిన్‌టెక్, విద్య, పర్యాటకం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతిని నేతలు సమీక్షించారు. -
టీవీకే సర్కార్‌కు డీఎంకే షాక్.. విజయ్ ప్లాన్‌కు బ్రేక్ తప్పదా?
చెన్నై: తమిళనాడులో మరోసారి అధికార టీవీకే, డీఎంకే మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడులో కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయం నిర్మాణం విషయం రాజకీయ రగడకు కారణమవుతోంది. చెన్నైలోని పటినపాక్కంలో 25.55 ఎకరాల్లో రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును డీఎంకే వ్యతిరేకించింది. అక్కడ సచివాలయం నిర్మిస్తే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆ పార్టీ ఎంపీ విల్సన్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో నిర్మాణాన్ని అనుమతించబోమని తేల్చిచెప్పారు.అయితే కొత్త స్థలం కోసం వెతకడం కంటే.. ఇప్పటికే ఉన్న ఓమందూరార్ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాన్నే తిరిగి సచివాలయంగా మార్చాలని డీఎంకే సూచిస్తోంది. మాజీ సీఎం ఎం. కరుణానిధి హయాంలో ఈ భవనాన్ని సచివాలయం కోసమే నిర్మించారని, పెద్దగా మార్పులు చేయకుండానే చిన్నపాటి మరమ్మతులతో తిరిగి ఉపయోగించుకోవచ్చని విల్సన్ పేర్కొన్నారు. కరుణానిధి ప్రభుత్వం నిర్మించిన ఈ భవనాన్ని అనంతరం జయలలిత ప్రభుత్వం ఆస్పత్రిగా మార్చింది.12 గ్రామాల ఆందోళన..మరోవైపు పటినపాక్కంలో ప్రతిపాదిత నిర్మాణంపై స్థానిక మత్స్యకారుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సమీపంలోని 12 మత్స్యకార గ్రామాలకు చెందిన కుటుంబాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పడవలు నిలపడం, వలలు బాగుచేయడం, చేపలు ఆరబెట్టడం, మార్కెట్లు నిర్వహించడం కోసం ఈ ప్రాంతాన్ని ఉపయోగిస్తున్నామని వారు చెబుతున్నారు. సచివాలయ నిర్మాణం జరిగితే సముద్రానికి తమ రాకపోకలు పరిమితం కావడంతో పాటు భవిష్యత్తులో జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ అంశంపై డీఎంకే మాత్రమే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం పనులను నిలిపివేసి, స్థల ఎంపికపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్ తీరప్రాంత పర్యావరణం, వరదలు, తుపాన్ల ముప్పును ప్రస్తావించారు. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ కూడా కొత్త సచివాలయం వల్ల ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ.. చెన్నై వెలుపల ప్రత్యేక పరిపాలనా నగరాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.దీంతో రూ.1,200 కోట్ల కొత్త సచివాలయ ప్రాజెక్టు ఇప్పుడు స్థల వివాదంలో చిక్కుకుంది. మత్స్యకారుల అభ్యంతరాలు, ప్రతిపక్షాల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం పటినపాక్కం ప్రతిపాదనపైనే ముందుకెళ్తుందా? లేక ఇప్పటికే ఉన్న ఓమందూరార్ భవనాన్ని తిరిగి సచివాలయంగా మార్చే ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: తన డ్యాన్స్ వీడియోపై కేరళం సీఎం విస్మయం -
కోడలిని హతమార్చి.. బావిలోకి దూకి..!
నాగపూర్‌లో దారుణం జరిగింది. చేతబడి అనుమానంతో ఓ వృద్ధుడు తన కోడలిని గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతుండగా.. శనివారం మరింత ముదిరింది. లక్ష్మి రవిశంకర్ పాలి (42) బట్టలు ఉతుకుతుండగా ఆమె మామ నూతులాల్ పాలి మరోసారి వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన అతడు ఆమె తలపై గొడ్డలితో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆ వృద్ధుడు ఇంటి వెనుక ఉన్న బావిలో దూకాడు. అయితే స్థానికులు అతన్ని కాపాడి చికిత్స నిమిత్తం మెడికల్ ఆసుపత్రికి తరలించారు. నూతులాల్ తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే, తన అనారోగ్యానికి, అలాగే తన కుమారుడి మరణానికి కోడలే చేతబడి కారణమని బలంగా నమ్మాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు."ఓ వృద్ధుడు బావిలో పడిపోయాడని మాకు సమాచారం అందింది. వెంటనే మా బృందం అగ్నిమాపక సిబ్బంది సహాయంతో అతన్ని బయటకు తీసింది. లక్ష్మి తన భర్త చనిపోయినప్పటి నుండి ఇంట్లోనే వేరే గదిలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. చేతబడి వల్లే తన కొడుకు చనిపోయాడని, మామ నూతులాల్ ఆమెతో తరచూ గొడవపడేవాడు. నేడు కూడా ఇదే విషయమై వివాదం చెలరేగడంతో అతను ఆమెపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు" అని యశోధరా నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ యూనస్ షేక్ తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యశోధరా నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు -
సరయూ తీరంలో వెలుగుల హారతి.. ఎప్పుడంటే..
అయోధ్య: రామనగరి అయోధ్యలో ఈ ఏడాది దీపోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. నవంబర్ 7న జరగనున్న దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ రికార్డు సృష్టించేలా భారీ సంఖ్యలో దీపాలను వెలిగించడంతోపాటు, సరయూ నది ఘాట్లను ప్రత్యేకంగా అలంకరించనున్నారు. సరయూ నది వంతెన నుంచి లక్ష్మణ ఘాట్ వరకు సుమారు ఒక కిలోమీటరు మేర ఉన్న ఘాట్ ప్రాంతాన్ని పూలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.సాయంత్రం వేళ దీపాల వెలుగులు, విద్యుత్ కాంతులు కలిసి సరయూ తీరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నాయి. ఈ అలంకరణను దీపోత్సవంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా అధికారులు చెబుతున్నారు. దీపోత్సవం సందర్భంగా సరయూ ఘాట్ల వద్ద ఘనంగా మహా హారతి నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేద మంత్రోచ్ఛారణలు, ధార్మిక కార్యక్రమాలు, వేలాది దీపాల వెలుగుల మధ్య జరిగే ఈ హారతిలో అవధ్ ప్రాంతంలోని ధార్మిక, సాంస్కృతిక సంప్రదాయాలు ప్రతిబింబించనున్నాయి. సరయూ అలల మధ్య వెలిగే దీపాలు, హారతి ఘోష భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.ఇదిలా ఉండగా, సరయూ ఘాట్ల వద్ద ప్రస్తుతం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. దీపోత్సవం నాటికి పనులను పూర్తి చేసి ఘాట్లకు మరింత వైభవమైన రూపాన్ని తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. దీపోత్సవ నిర్వహణకు సంబంధించి వివిధ శాఖలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. నవంబర్ 7న దీపోత్సవం నిర్వహించనున్నట్లు అయోధ్య జిల్లా కలెక్టర్ శశాంక్ త్రిపాఠి తెలిపారు. ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఘాట్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీపోత్సవం నేపథ్యంలో అయోధ్యకు వచ్చే భక్తుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. ఈసారి కేవలం దీపాల వెలుగులకే కాకుండా అయోధ్య ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రత్యేకంగా చాటిచెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 7న దీపాలు, రంగురంగుల కాంతులు, మహా హారతి వెలుగులతో అయోధ్య మరోసారి ‘దీపాల నగరి’గా వెలిగిపోనుంది.ఇదీ చదవండి: భారీ వర్షంలో గణేశుడు మీద పడి నలుగురు విలవిల -
బ్రిక్స్ వేదిక: పాటతో అదరగొట్టిన మలేషియా ప్రధాని
సాధారణంగా శిఖరాగ్ర సమావేశాలు అంటే.. అధికారిక ప్రసంగాలు, తీవ్రమైన చర్చలే ఉంటాయి. బ్రిక్స్ వేదికగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తన గానంతో సందడి చేశారు. నిన్న(శనివారం) సాయంత్రం జరిగిన కార్యక్రమంలో అందరినీ అలరించేలా ఓ క్లాసిక్ బాలీవుడ్ పాటను పాడారు. 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరైన ఆయన.. డిన్నర్ కార్యక్రమంలో 1965 నాటి తీన్ దేవియాన్ సినిమాలోని కిషోర్ కుమార్ అమర ప్రేమ గీతం "ఖ్వాబ్ హో తుమ్ యా కోయ్ హకీకత్" పాటను పాడి ఉర్రూతలూగించారు.మజ్రూహ్ సుల్తాన్‌పురి రాసిన ఈ పాటను ఆలపించిన ప్రధాని అన్వర్ ఇబ్రహీం.. సభలోని అందరి దృష్టిని ఆకర్షించారు. దౌత్యం, రాజకీయాలతో నిండిన ఆ రాత్రిని వినోదంగా మార్చారు. అన్వర్ ఇబ్రహీం తన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పాటను పాడేందుకు అనుమతి కోరుతున్నట్లు క్యాప్షన్ రాశారు. ఈ వీడియో వైరల్ కాగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. "సర్, మీరు చాలా బాగా పాడారు; భారత్‌లో మీకు అద్భుతమైన సమయం గడిచిందని ఆశిస్తున్నాను’’ అంటూ ఓ యూజర్ కామెంట్ సెక్షన్లో రాశారు."వావ్, మిస్టర్ అన్వర్ ఇంత మధురంగా పాడగలరని నాకు తెలియదు. చాలా బాగుంది. మలేషియాలో ఉంటున్న ఒక ప్రవాస భారతీయుడి నుంచి బోలెడన్ని ప్రేమపూర్వక శుభాకాంక్షలు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. భారతీయ పాటలపై మలేషియా ప్రధాని తన అభిమానాన్ని చాటుకోవడం ఇదే మొదటిసారి కాదు. భారతీయ సినిమా, సంగీతం పట్ల అభిమానాన్ని గతంలో కూడా పంచుకున్నారు. భారత్‌లో పర్యటించిన సమయంలోనూ ఆయన మీడియా సమావేశంలో సరిగ్గా ఇదే కిషోర్ కుమార్ పాటనూ, ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖేష్ క్లాసిక్ పాట "దోస్త్ దోస్త్ నా రహా"ను కూడా ఆలపించారు.Guru mintak izin nyanyi kejap ok! pic.twitter.com/NzazFHV509— Anwar Ibrahim (@anwaribrahim) September 12, 2026కాగా, బిక్స్ సదస్సులో మలేషియా ప్రధాని.. ప్రపంచ సమస్యలు, ఆర్థిక సంబంధాలు, వాణిజ్య పద్ధతులపై చర్చించారు. భారత్-మలేషియా దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశాలలో డిజిటల్ టెక్నాలజీ, పర్యాటకం వంటి రంగాలలో సహకారాన్ని మరింత విస్తరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అలాగే ప్రధాని మోదీ ప్రపంచ స్థాయి గుర్తింపును కొనియాడారు.ఇదీ చదవండి: లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు -
మోదీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. ఏం జరిగింది?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల సందర్భంగా షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక విందుకు మాత్రం హాజరుకాలేదు. శనివారం జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించిన జిన్‌పింగ్.. రాత్రి జరిగిన గాలా డిన్నర్‌కు దూరంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.కాగా, ప్రధాని మోదీ శనివారం బ్రిక్స్ దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల కోసం విందును ఏర్పాటు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అయితే జిన్‌పింగ్ మాత్రం విందుకు రాలేదు. ఆయన ఎందుకు హాజరుకాలేదన్న దానిపై అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడికాలేదు. అయితే ఓ వర్గం సమాచారం ప్రకారం.. సదస్సు కార్యక్రమాల తర్వాత జిన్‌పింగ్ హోటల్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ కూడా విందుకు హాజరుకాలేదు. అయితే ఆయన సదస్సు కార్యక్రమాల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వెళ్లారు. జిన్‌పింగ్ గైర్హాజరుపై కారణం స్పష్టత లేకపోవడంతో ఆయన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన జిన్‌పింగ్.. మోదీతో డిన్నర్‌కు దూరంగా ఉండటం ఆసక్తిని రేపుతోంది. అయితే ఇది కేవలం విశ్రాంతి కోసమేనా.. లేక మరేదైనా కారణమా అన్నది మాత్రం అధికారికంగా తేలాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. నిన్న (సెప్టెంబర్ 12) మోదీ-జిన్‌పింగ్ మధ్య సుమారు 50 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రధానంగా సరిహద్దు వివాదం, వాణిజ్య లోటు, మార్కెట్ యాక్సెస్, సరఫరా చైన్, రవాణా-ప్రజల మధ్య సంబంధాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా సరిహద్దు విషయంలో న్యాయబద్ధమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం పనిచేయాలని ఇద్దరూ అంగీకరించారు. మోదీ ఇప్పటికే ఉన్న సరిహద్దు ఒప్పందాలు, అవగాహనలను గౌరవించాలని స్పష్టం చేశారు. ఇక ఆర్థిక అంశాల్లో భారత్-చైనా మధ్య వాణిజ్య అసమతుల్యతను తగ్గించడం, మార్కెట్ యాక్సెస్‌ను సులభతరం చేయడం, సప్లై చెయిన్ సమస్యలను పరిష్కరించడంపై చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య విమానాలు, వీసాలు, కైలాస్ మానసరోవర్ యాత్ర వంటి సంబంధాలు కూడా క్రమంగా పునరుద్ధరిస్తున్నాయి.ఇదీ చదవండి: సముద్రం అడుగున బంగారు ఖజానా.. చైనా సంచలన అన్వేషణ! -
సభ్య దేశాల సహకారంతో ఉమ్మడి ప్రయోజనం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు రెండో రోజుకు చేరుకుంది. దీనిలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘బ్రిక్స్’లో గ్లోబల్ సౌత్ దేశాల స్వరం గట్టిగా వినిపిస్తోందని అన్నారు. భారత అధ్యక్షతన నాలుగు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. సత్సీలత, నవకల్పన, సహకారం, సుస్థిరత అనే నాలుగు స్తంభాలపై కృషి చేశామని చెప్పారు. సభ్య దేశాల సహకారం, మద్దతుతో ఉమ్మడి ఆలోచనలను అందరికీ ప్రయోజనం చేకూర్చే సహకారంగా మార్చగలిగామని పేర్కొన్నారు.సరఫరా గొలుసులను మరింత విశ్వసనీయంగా, బలోపేతంగా మార్చేందుకు బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్ సహకార ఫ్రేమ్‌వర్క్ దోహదపడుతుందని మోదీ తెలిపారు. బ్రిక్స్ ఇన్క్యుబేటర్ నెట్వర్క్ ద్వారా స్టార్టప్‌లు, ఇన్క్యుబేటర్లను అనుసంధానించనున్నట్లు చెప్పారు. విస్తృతంగా అమలు చేయగల కొత్త పరిష్కారాలను ప్రోత్సహించేందుకు బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi receives President of Kazakhstan, Kassym-Jomart Tokayev, at Bharat Mandapam on Day 2 of the BRICS Summit 2026. (Source: DD News) https://t.co/NRkO6pDWBM— ANI (@ANI) September 13, 2026డిజిటల్ వ్యవసాయంపై బ్రిక్స్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని మోదీ అన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), జియోస్పేషియల్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రైతుల వాస్తవ అవసరాలకు అనుగుణంగా అనుసంధానించనున్నట్లు తెలిపారు. సాంకేతికత, కీలక ఖనిజాలను ఆయుధాలుగా ఉపయోగించడం ఉమ్మడి అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చని హెచ్చరించారు. సాంకేతికతను అందిపుచ్చుకునే విషయంలో అందరినీ భాగస్వాములను చేసే విధానానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు.తొలి రోజు సమావేశాల్లో సభ్య దేశాల నేతలు ‘న్యూఢిల్లీ ప్రకటన-2026’ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రపంచ పాలనలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరాన్ని వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్‌కు మరింత పెద్ద పాత్ర కల్పించాలన్న ఆకాంక్షలకు మద్దతు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడంతోపాటు ఏకపక్ష ఆంక్షలు, సుంకాలు, వాణిజ్య పరిమితులపై ఆందోళన వ్యక్తం చేశారు.రెండో రోజు సమావేశాల్లో భారత్ 2026 అధ్యక్షతన నిర్దేశించిన స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే నాలుగు ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఉమ్మడి సవాళ్ల పరిష్కారంపై నేతలు దృష్టి సారించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ పాలనలో సంస్కరణలకు సంబంధించి పది ప్రతిపాదనలు చేశారు. ప్రపంచ దక్షిణాది దేశాలు కేవలం నిబంధనలు అనుసరించే స్థాయి నుంచి వాటి రూపకల్పనలో భాగస్వాములుగా మారాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ సాంకేతికతలు, వాటికి సంబంధించిన నియమాల రూపకల్పనలో సమాన భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. సముద్ర రవాణా సిబ్బంది అత్యవసర సహాయానికి ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi, Russian President Vladimir Putin and other world leaders at Bharat Mandapam PM Modi has hosted gala dinner for global leaders and delegates here (Source: DD) https://t.co/lOlKp0W7Df— ANI (@ANI) September 12, 2026బ్రిక్స్ ప్రకటనలో పశ్చిమాసియా సంక్షోభంపై ఆందోళన వ్యక్తమైంది. పౌరులు, పౌర మౌలిక వసతుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రపంచ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలు, ఇంధన ప్రవాహం సజావుగా కొనసాగేందుకు దేశాలు కలిసి పనిచేయాలని పేర్కొంది. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారమే మార్గమని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. భారత్-చైనా సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృష్టితో చూస్తున్నట్లు జిన్‌పింగ్ పేర్కొన్నారు. మరోవైపు, బ్రిక్స్ దేశాలు కృత్రిమ మేధ, క్వాంటమ్ సాంకేతికత, డిజిటల్ మౌలిక వసతులు, స్టార్టప్‌లు, సరఫరా వ్యవస్థల వంటి రంగాల్లో సహకారం పెంచుకోవాలని నిర్ణయించాయి. సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించి, మూల దేశాలకు పురాతన వస్తువులు, ఆధ్యాత్మిక, చారిత్రక వస్తువులను తిరిగి అప్పగించేందుకు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. -
భారీ వర్షంలో గణేశుడు మీద పడి నలుగురు విలవిల
నలసోపారా: మహారాష్ట్రలోని నలసోపారాలో శనివారం సాయంత్రం వర్షం కారణంగా గణేశ్ విగ్రహం అదుపుతప్పి మీదపడటంతో నలుగురు మండప సభ్యులు దాని కింద చిక్కుకుపోయారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి, వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. పశ్చిమ నలసోపారాలోని యశ్వంత్ గౌరవ్ ప్రాంతంలో సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గణేశ్ మండపానికి భారీ విగ్రహాన్ని తీసుకెళ్తుండగా అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. దీంతో విగ్రహం తడవకుండా ప్లాస్టిక్ కవర్లతో కప్పేందుకు వెంట వచ్చిన కొందరు ప్రయత్నించారు. ఈ క్రమంలో విగ్రహం పడిపోయింది.విగ్రహం కూలిన సమయంలో గణేశ్ మండపానికి చెందిన నలుగురు వ్యక్తులు దాని కింద చిక్కుకుపోయారు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది. అందులో కొందరు విగ్రహం కింద చిక్కుకున్న దృశ్యాలు కనిపించాయి. ఘటనను గమనించిన అక్కడున్న వారు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికులు కూడా వారితో కలిసి విగ్రహాన్ని పైకి లేపి, కింద చిక్కుకున్న నలుగురిని బయటకు తీశారు. వేగంగా స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సహాయక చర్యలు పూర్తయిన అనంతరం విగ్రహాన్ని పైకి లేపి గణేశ్ మండపం వద్దకు సురక్షితంగా తరలించారు. ఈ ఘటనలో విగ్రహానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. దీంతో మండప సభ్యులు, అక్కడున్న ఇతరులు ఊపిరి పీల్చుకున్నారు.ఇదీ చదవండి: ‘పద్మ’లో పడవ బోల్తా.. 10 మందిని రక్షించిన బీఎస్ఎఫ్ -
భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త!
భార్య వివాహేతర ప్రియుడిని గొంతు కోసి చంపిన భర్తకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ధర్మపురి జిల్లాలోని కరిమంగళంకు చెందిన పార్థిబన్, శారదాను గతంలో వివాహం చేసుకున్నాడు. తర్వాత పార్థిబన్, అతని భార్య కృష్ణగిరి జిల్లాలోని హోసూర్ సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ నగర్లో నివసిస్తూ, సిబ్ కాట్ లోని ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఈ స్థితిలో హోసూర్ పార్వతీ నగర్ కి చెందిన అమావాసై, శారదాకి మధ్య పరిచయం ఏర్పడి, అది చివరికి వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పార్థిబన్, ఆ సంబంధాన్ని వదులుకోమని తన భార్యను చాలాసార్లు మందలించాడు. అయినప్పటికీ, వారు తమ సంబంధాన్ని వదులుకోలేదు. ఈ స్థితిలో, 14.3.2017న, పార్థిబన్ తన భార్యతో తాను పనికి వెళ్తున్నానని చెప్పి, పనికి వెళ్లకుండా ఇంటి దగ్గర దాక్కున్నాడు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన అమావాసై, శారద సరదాగా గడుపుతున్నారు. ఇది చూసిన పార్థిబన్, తీవ్రమైన కోపంతో అమావాసై గొంతు కోసి చంపేశాడు. ఇది చూసి అతని భార్య శారద పారిపోయింది. ఈ విషయమై సిబ్కకట్ పోలీసులు కేసు నమోదు చేసి పార్థిబన్ ను అరెస్టు చేశారు. హోసూర్ అదనపు జిల్లా కోర్టులో శుక్రవారం విచారణ జరుగుతున్న ఈ కేసులో జడ్జి సంతోష్ తీర్పు వెలువరించారు. అందులో, అమావసై గొంతు కోసి హత్య చేసినందుకు పార్థిబన్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. -
‘పద్మ’లో పడవ బోల్తా.. 10 మందిని రక్షించిన బీఎస్ఎఫ్
ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో పద్మా నదిలో పడవ బోల్తా పడటంతో నదిలో కొట్టుకుపోయిన 10 మంది బంగ్లాదేశీయులను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) రక్షించింది. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. బంగ్లాదేశ్‌లోని చాపైనవాబ్‌గంజ్ జిల్లాకు చెందిన వీరంతా నదిలోని ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయారు. పద్మా నదిలో చిక్కుకున్న వారిని బీఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించి, వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల వద్దకు చేరుకుని వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చేందుకు లాల్గోలా పరిధిలోని తారానగర్ ప్రాంతం నుంచి స్పీడ్‌బోట్‌ను పంపించారు.బాధితులను రక్షించిన అనంతరం వారిని ప్రాథమిక చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని నిర్ధారించిన తర్వాత, వారిని సురక్షితంగా బంగ్లాదేశ్‌కు తిరిగి పంపే ఏర్పాట్లను బీఎస్ఎఫ్ చేసింది. బంగ్లాదేశ్‌లో గత 24 గంటల్లో పద్మా నది నీటిమట్టం 3 సెంటీమీటర్లు పెరిగింది. హార్డింజ్ బ్రిడ్జి పాయింట్ వద్ద ప్రమాదకర స్థాయికి కేవలం 75 సెంటీమీటర్ల దిగువన నది ప్రవహించింది. పబ్నా వాటర్ డెవలప్మెంట్ బోర్డు (పీడబ్ల్యూడీబీ) హైడ్రాలజీ విభాగం ప్రకారం ఉదయం 9 గంటలకు నీటిమట్టం 13.05 మీటర్లుగా నమోదైంది. ప్రమాద స్థాయి 13.80 మీటర్లు కాగా, శుక్రవారం ఇదే సమయానికి 13.02 మీటర్లుగా ఉంది.ఇదీ చదవండి: ట్రంప్ చిన్ననాటి ఇంటికి భారీ ధర! -
హెల్మెట్ ధరించలేదని కారు డ్రైవర్‌కు జరిమానా
బెంగళూరు: హెల్మెట్ ధరించకపోతే ద్విచక్ర వాహనదారులకు పోలీసులు జరిమానా విధించడం సాధారణంగా చూస్తుంటాం. అయితే కారు డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని రూ.500 జరిమానా విధించిన సంఘటన బెళగావి జిల్లా అథణి పట్టణంలో వెలుగు చూసింది. అథణి పట్టణ నివాసి సుభాష్ అనే వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు ఈ మేరకు నోటీసులు పంపించడంతో ఆశ్చర్యపోయాడు. తరువాత హెల్మెట్ పెట్టుకుని కారు డ్రైవ్ చేస్తూ వీడియో తీసి తనకు వచ్చిన నోటీసును సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఏఐ కెమెరా పనితీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: రష్యా పోలీసులు చిత్రహింసలు పెట్టారు -
లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు
అమెరికా సెప్టెంబర్ 11 దాడులకు పాతికేళ్లు పూర్తయిన వేళ.. అమెరికా గూఢచార సంస్థ (CIA) సంచలన విషయాలు బయటపెట్టింది. అల్ ఖైదా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. భారత్‌పై కూడా దాడులకు ప్లాన్ చేసినట్లు షాకింగ్ విషయం వెలుగులోకి తెచ్చింది. 1998లోనే ఈ కుట్రకు పథకం రచించినట్లు సీఐఏ తాజాగా విడుదల చేసిన రహస్య పత్రాల ద్వారా బయటపడింది. బిన్ లాడెన్‌కు సంబంధించిన 70కి పైగా ప్రెసిడెన్షియల్ ఇంటెలిజెన్స్ బ్రీఫ్లను, 100 పేజీలకు పైగా సమాచారాన్ని సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ బహిర్గతం చేశారు.ఒసామా బిన్ లాడెన్ దాడులు జరపాలనుకుంటున్న దేశాల జాబితాలో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఈజిప్ట్, అరేబియన్ ద్వీపకల్పంలోని దేశాలు, ఉగాండా, నైజీరియా ఉన్నాయి. అయితే, ఆ పత్రాల్లో భారత్‌లో ఎక్కడ? ఎప్పుడు? దాడి చేయాలనుకున్నారో వంటి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. "బిన్ లాడెన్ టెర్రరిస్ట్ నెట్వర్క్ స్టిల్ ఏ థ్రెట్" అనే పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక.. అమెరికా దాడుల తర్వాత కూడా లాడెన్ నెట్వర్క్ చెదిరిపోలేదని పేర్కొంది.కాగా, ఉగ్రవాదుల ఉన్మాదానికి 2,977 మంది బలైపోయిన సెప్టెంబర్ 11(9/11) దాడులకు 25 ఏళ్లు పూర్తయ్యాయి. అగ్రరాజ్యం అమెరికానే సవాలు చేస్తూ ముష్కరులు సాగించిన మారణహోమాన్ని ప్రపంచం ఇప్పటికీ మర్చిపోలేదు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై విరుచుకుపడింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడికి నిలిచిపోయింది. అల్‌ఖైదా శిక్షణలో రాటుతేలిన 19 మంది ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి పలు లక్ష్యాలను ఢీకొట్టారు.ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలపై జరిగిన దాడులు భారీ ప్రాణనష్టాన్ని, పెను విధ్వంసాన్ని సృష్టించాయి. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడిలో దాదాపు 2,750 మంది, పెంటగాన్ వద్ద 184 మంది, పెన్సిల్వేనియాలో 40 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ అఘాయిత్యానికి తెగించిన మొత్తం 19 మంది ఉగ్రవాదులు సైతం మృత్యువాత పడ్డారు. మంటల్లో చిక్కుకున్న బాధితులను రక్షించే ప్రయత్నంలో 400 మందికి పైగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరణించడం గమనార్హం. 9/11 దాడుల వల్ల అమెరికాకు 10 బిలియన్ డాలర్లుకుపైగా నష్టం వాటిల్లింది.ఇదీ చదవండి: ఘోర కలికి పాతికేళ్లు -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
కర్ణాటక: పక్షవాతంతో మంచాన పడిన భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య ఉదంతమిది. ఈ ఘటన బెంగళూరు అవలహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ముబారక్, షహీనాబాను దంపతులకు 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. ముబారక్‌కు పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు. వీరి కుమార్తెకూ ఆరోగ్యం బాగాలేదు. బాలికకు చికిత్స అందించే సాకుతో నహీముద్దీన్ ఖురేషి అనే వ్యక్తి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. కొద్దిరోజులకు షహీనాతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ఇంట్లో ఉండడంతో తమ సంతోషానికి అడ్డు అని, పైగా రోగిష్టి అని షహీనా భావించింది. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రణాళిక రచించింది. తల్లి హసీనా జాన్‌తో కలిసి భర్త మర్మాంగాన్ని కాలితో తన్ని తలపై దిండు పెట్టి చంపేసింది. కిత్తగనూరులోని యల్లప్ప గార్డెన్లో సెపె్టంబర్ 9న రాత్రి ముబారక్ (45) చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడని విలపిస్తూ షహీనా అందరినీ నమ్మించే యత్నం చేసింది. అయితే షహీనా వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న ముబారక్ బంధువులు పోలీసులకు విషయం చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ముబారక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో ముబారక్ది సాధారణ మరణం కాదని, హత్యని తేలడంతో షహీనాబానును, ఆమె తల్లి హసీనా జాన్‌ను, షహీనా ప్రియుడు నహీముద్దీన్ ఖురేషిని అరెస్టు చేశారు. -
డ్యాన్స్ వీడియోపై కేరళం సీఎం విస్మయం
కొచ్చి: కొందరు ఉద్యోగులతో కలిసి తాను డ్యాన్స్ చేస్తున్నట్లుగా కృత్రిమ మేధ(ఏఐ)తో రూపొందించిన ఓ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతుండటంపై కేరళం సీఎం వీడీ సతీశన్ విస్మయం వ్యక్తం చేశారు. ఆ వీడియో చూసి షాకైనట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం, తరచూ కరెంటు కోతల నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉద్యోగులతో కలిసి సతీశన్ డ్యాన్స్ చేస్తున్నట్లుగా వచ్చిన వీడియో వైరల్‌గా మారింది. శుక్రవారం రాత్రి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సతీశన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఈ అంశాన్ని ఆయన సీరియస్‌గా తీసుకోలేదు. మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్, తన స్నేహితుడు, తమిళనాడు సీఎం విజయ్ కంటే చాలా బాగానే డ్యాన్స్ చేసినట్లుగా అందులో కనిపించిందన్నారు. ఆ ఇద్దరు డ్యాన్సర్ల కంటే తానే బాగా డ్యాన్స్ చేశానంటూ నవ్వేశారు. అయితే, ఇలాంటి వీడియోలను ఏఐతో సృష్టించడంతో చూసి షాకయ్యానన్నారు. ఇటువంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు కాపీరైట్ పరిరక్షణ చట్టాల్ని కఠినతరం చేయాల్సిన అవసరముందని సతీశన్ అన్నారు. -
బీఎస్పీలో ఆకాశ్, ఇషాన్‌లకు చోటు లేదు
లక్నో: సోదరుడు ఆనంద్ కుమార్ కుమారులు ఆకాశ్ ఆనంద్, ఇషాన్ ఆనంద్‌లకు బీఎస్పీలో ఎటువంటి రాజకీయ పదవులు ఇవ్వడం లేదని, ఇది తన అంతిమ నిర్ణయమని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. పార్టీలో కీలక పదవుల నుంచి ఆకాశ్‌ను తొలగిస్తున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించిన మాయావతి..తాజాగా శనివారం ఈ విషయం తెలిపారు. 2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా పార్టీలో నాయకత్వ సమస్యలున్నాయంటూ వ్యాఖ్యానించిన మాయ కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సోదరుడు ఆనంద్ కుమార్ తన వెంటే ఉంటూ అవసరమైతే ఆయన ఏకైక కుమార్తె దీపికా ఆనంద్ సాయం తీసుకోవచ్చని అన్నారు. తన అంతిమ లక్ష్యం కాన్షీరాం జీ మాదిరిగానే బహుజన్ సమాజ్ కుటుంబ సంక్షేమమేనన్నారు. ఆయన మాదిరిగానే కుటుంబసభ్యులకు, బంధువులు పార్టీలో ఎలాంటి పదవులు కూడా ఇవ్వరాదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. -
పీఎం మ్యూజియం, బ్రిక్స్ బజార్‌ను సందర్శించిన పెజెష్కియాన్ కుమార్తె
న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తోపాటు భారత్ మండపానికి విచ్చేసిన ఆయన కుమార్తె జహ్రా శనివారం ఢిల్లీలోని ‘ప్రధానమంత్రి మ్యూజియం’, బ్రిక్స్ బజార్లను సందర్శించారు. ప్రధానిమ్యూజియంలో ప్రజాస్వామ్య ఘనచరితను, భారతదేశ సాంస్కృతిక వారసత్వం తాలూకు విశేషాలను ఆమె తెల్సుకున్నారు. శిఖరాగ్ర సదస్సు జరిగే మండపానికి సమీపంలోని నేషనల్ క్రాఫ్స్ మ్యూజియంను సైతం ఆమె సందర్శించారు. అక్కడి బ్రిక్స్ బజార్లో ఆమె కలియతిరిగారు. చేతి వృత్తి కళాకారులు, సంప్రదాయక వస్తువుల విశేషాలను అడిగి తెల్సుకున్నారు. జహ్రా పెజెష్కియాన్ బ్రిక్స్ బజార్‌ను ఎంతో ఆసక్తిగా చూశారని ఆమెకు అక్కడ స్వాగతం పలికిన కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి చెప్పారు. బ్రిక్స్ బజార్లో బ్రెజిల్ మృణ్మయ పాత్రలు మొదలు బెలారస్లో విల్లో చెట్ల కొమ్మలతో అల్లిన కళాకృతులదాకా బ్రిక్స్ దేశాలకు చెందిన సంపద్రాయక వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. తీన్ మూర్తి భవన్ కాంప్లెక్స్‌లోని మ్యూజియంను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ జూనియర్ సతీమణి లీజా అరానేటా కూడా సందర్శించారు. -
మాది అత్యంత పారదర్శక పద్ధతి: సీఈసీ
అహ్మదాబాద్: భారతదేశ ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాతో మొదలుపెట్టి ఓట్ల లెక్కింపు వరకూ ప్రతిదశలోనూ ధ్రువీకరణ జరుగుతూండటం ఇందుకు కారణమని ఆయన చెప్పారు. అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్శిటీ అటల్ కలామ్ హాల్లో శుక్రవారం బూత్ లెవల్ ఆఫీసర్లతో సీఈసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రతిదశలోనూ రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు నిరంతరం ధ్రువీకరణ చేస్తూంటారు కాబట్టి ఇది అత్యంత పారదర్శక ఎన్నికల విధానమని స్పష్టం చేశారు. -
గణేశ్ మండపం వ్యర్థాలతో ఇంధనం
ముంబై: ఈ ఏడాది ముంబైలోని ప్రఖ్యాత లాల్బాగ్చా గణేశ్ మండపం వద్ద ఏర్పడే ప్రసాద వ్యర్థాలు మొత్తం ఇంధనంగా మారనుంది. బాంబే మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చేపట్టిన ‘ప్రసాద్ టు ఎనర్జీ’ కార్యక్రమంలో భాగంగా ప్రసాదం తయారీ, పంపిణీల సమయంలో పుట్టుకొచ్చే సుమారు 80 టన్నుల వ్యర్థాలను బయోమెథనైజేషన్ ద్వారా వంట గ్యాస్‌గా మార్చనున్నారు. ఈ గ్యాస్‌తో ఉత్పత్తి అయ్యే 7700 యూనిట్ల విద్యుత్తును ముంబైలోని నాలుగు మున్సిపల్ ఆసుపత్రుల్లో వాడనున్నారు. సెలెబ్రిటీలు సహా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే లాల్బాగ్చా రాజా మండల్ సాయంతో తామీ కార్యక్రమం చేపట్టినట్లు బీఎంసీ ప్రకటించింది. సోమవారంతో మొదలై మొత్తం పదకొండు రోజులపాటు జరిగే గణేశ్ ఉత్సవాల్లో రోజూ కనీసం 8 నుంచి పది టన్నుల చెత్త ఉత్పత్తి అవుతూంటుందని బీఎంసీ అంచనా వేస్తోంది. ఈ చెత్తను అక్కడికక్కడే వేరు చేసి ప్రత్యేక వాహనాల ద్వారా నాయర్, కస్తూర్బా, జీటీబీ, సియాన్ ఆసుపత్రుల్లోని బయోమెథనైజేషన్ ప్లాంట్లకు తరలిస్తారు. ఈ ప్లాంట్లు ఒకొక్కటి రోజుకు రెండు టన్నుల వరకూ చెత్తను గ్యాస్‌గా మార్చగలవు. అయితే ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మాత్రం చెత్తను బట్టి మారిపోతూంటుంది. ఆసుపత్రుల్లోని విద్యుత్తు దీపాలను వెలిగించేందుకు ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడతామని బీఎంసీ తెఇపింది. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ కంపెనీకి అప్పగించామని తెలిపింది. తడిచెత్త సాయంతో విద్యుత్తు ఉత్పత్తి చేసి చెత్త సమస్యను పరిష్కరించవచ్చునన్న సందేశాన్ని అందరికీ పంపేందుకే తామీ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపింది. -
రష్యా పోలీసులు చిత్రహింసలు పెట్టారు
కాన్పూర్: రష్యా రాజధాని మాస్కోలో పోలీసులు తనను అనవసరంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేశారని యూపీలోని కాన్పూర్‌కు చెందిన చందన్ గుప్తా(45) ఆరోపించారు. నోయిడాలోని యూఫ్లెక్స్ అనే కంపెనీ తరఫున 2023 నుంచి భార్య, కుమారుడితోపాటు మాస్కోలో ఉంటున్నట్లు చందన్ చెప్పారు. రష్యా పోలీసుల కస్టడీలో దాదాపు 48 గంటలు గడిపిన తర్వాత మాస్కో నుంచి తిరిగి స్వదేశానికి వచ్చేశానన్నారు. అక్కడి పోలీసులు తనను, తన స్నేహితుడిని దుర్భాషలాడటంతోపాటు, బెదిరించి, చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఈ సంఘటన తనను ఎంతో వేదనకు గురిచేసిందని, ఇకపై రష్యా ఒక్కటే కాదు, విదేశాలలో ఎన్నడూ పనిచేయరాదని నిర్ణయించుకున్నట్లు శనివారం చెప్పారు. ‘ఈ నెల 5వ తేదీ రాత్రి మిత్రుడు ఆశిష్‌తో కలిసి మాస్కోలోని కిటే గొరోడ్ మెట్రో స్టేషన్‌కు, హాంగింగ్ బ్రిడ్జి, అటు నుంచి రెడ్ స్క్వేర్ వైపు నడిచి వెళ్తుండగా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. తాము మద్యం మత్తులో ఉన్నట్లు, అంబులెన్సు కిటికీ అద్దాన్ని పగులగొట్టామని ఆరోపిస్తూ చిత్రహింసలకు గురిచేశారు. ఏవో పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. కుటుంబసభ్యులు, మిత్రులను కూడా కలవనివ్వలేదు. మా కంపెనీ లాయర్ల జోక్యంతో దాదాపు 48 గంటల తర్వాత విడిచిపెట్టారు’అని ఆరోపించారు. రెండు రోజుల క్రితం చందన్ గుప్తా భార్య స్నేహ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తన భర్తను విడిపించేందుకు సాయం చేయాలంటూ యూపీ సీఎం యోగిని అందులో కోరారు. మాస్కోలోని భారత ఎంబసీ తమకు ఎటువంటి సాయం చేయలేదని, రష్యా పోలీసులు చేసిన ఆరోపణలనే వినిపించిందన్నారు. -
బ్రిక్స్ ఎఫెక్ట్..! దేశ రాజధానిలో హోటళ్లకు ఫుల్ డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు హోటల్ పరిశ్రమకు భారీ డిమాండ్‌ను తీసుకొచ్చింది. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జరుగుతున్న ఈ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు, దౌత్యవేత్తలు, మంత్రులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో, ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో హోటల్ గదులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సుమారు 3 వేల గదులు బుక్కయినట్లు సమాచారం. హోటల్ గది అద్దెలు కూడా భారీగానే పెరిగాయి. రూ.80 వేల నుంచి రూ.2.3 లక్షల దాకాసాధారణ రోజుల్లో ఫైవ్‌స్టార్ హోటళ్లలో రూ.10వేల నుంచి రూ.18 వేల వరకు ఉండే లగ్జరీ హోటల్ గది అద్దె ప్రస్తుతం రూ.80 వేలు, అంతకంటే ఎక్కువకు చేరినట్లు హాస్పిటాలిటీ రంగ వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని ఫైవ్‌స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో రోజుకు రూ.18వేల నుంచి రూ.25 వేల వరకు అద్దె వసూలు చేసే హోటళ్లు ఇప్పుడు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. హోటల్ ఐటీసీ మౌర్యాలో గదికి 11, 12వ తేదీల్లో కేవలం ఒకే ఒక్క రాత్రికిగాను ఏకంగా రూ.2.30 లక్షల బిల్లు వేయడం గమనార్హం. కొన్ని హోటళ్లలో గదులు పూర్తిగా బుక్ కాగా, మరికొన్ని చోట్ల గదులు అందుబాటులో లేకుండా పోయాయి. సదస్సు ముగిసిన తర్వాత కూడా కొంతకాలం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, దాదాపు సెప్టెంబర్ 20 వరకు టారిఫ్‌లు అధికంగానే ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హోటల్ ‘ఐటీసీ మౌర్య’లో రష్యా అధ్యక్షుడు పుతిన్ బస చేస్తున్న క్రమంలో ఆయన దృష్టిని ఆకర్షించేందుకు వారం రోజుల ముందే దేశంలోని సంపన్న వర్గాలకు చెందిన వారు సైతం ఆ హోటల్లో ప్రైవేటు గదులను బుక్ చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బస చేసిన తాజ్ ప్యాలెస్‌లోని గదులకూ డిమాండ్ ఆకాశాన్నంటింది.సెంట్రల్ ఢిల్లీకే పరిమితం కాని డిమాండ్బ్రిక్స్ శిఖరాగ్రం ప్రభావం కేవలం సెంట్రల్ ఢిల్లీలోని ఒబెరాయ్, తాజ్ ప్యాలెస్, లీలా ప్యాలెస్ వంటి ఫైవ్‌స్టార్ హోటళ్లకే పరిమితం కాలేదు. ఏరోసిటీ, గురుగ్రామ్, నోయిడా ప్రాంతాల్లోని హోటళ్లకూ భారీగా బుకింగ్స్ వచ్చాయి. అనేక హోటళ్లలో గదుల లభ్యత దాదాపు లేనట్లు సమాచారం. ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ సభ్యుడు రాజన్ సెహగల్ మాట్లాడుతూ.. బ్రిక్స్ సదస్సు భారత్ ఆతిథ్య, పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించే గొప్ప అవకాశమని అన్నారు. ప్రపంచ దేశాల అధినేతలు, భారీ ప్రతినిధి బృందాలతో భారత్‌కు వస్తున్నప్పుడు హోటళ్లలో డిమాండ్ పెరగడం సహజమేనని తెలిపారు. ల్యూటెన్స్ ఢిల్లీతో పాటు ఎన్సీఆర్లోని హోటళ్లు కూడా భారీ బుకింగ్స్‌తో కళకళలాడుతున్నాయని చెప్పారు.అధినేతల కోసం అత్యున్నత స్థాయి గదులుదేశాధినేతలు, మంత్రులు, సీనియర్ దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు సాధారణంగా హోటళ్లలో అత్యున్నత కేటగిరీ గదులనే ఎంచుకుంటారని కేంద్ర అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దీంతో పరిమిత సంఖ్యలో ఉన్న ప్రీమియం గదులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగి అద్దెలు భారీగా పెరిగాయి. భారత ఆతిథ్యానికి ప్రపంచ వేదికబ్రిక్స్ సదస్సు కేవలం హోటల్ రంగానికి వ్యాపార అవకాశాలను కల్పించడమే కాకుండా.. ప్రపంచానికి భారతీయ సంçస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, సంగీతం, నృత్యాలు, ఆతిథ్యాన్ని పరిచయం చేసేందుకు గొప్ప అవకాశమని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్ ఇప్పటికే జీ20, ఏఐ సదస్సు వంటి అంతర్జాతీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని గుర్తుచేస్తూ.. బ్రిక్స్ సదస్సుతో కూడా దేశ పర్యాటక రంగానికి మరింత అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని అంటున్నాయి.ప్రాంతీయ వంటకాలు.. సాంస్కృతిక కార్యక్రమాలుబ్రిక్స్ ప్రతినిధులకు మన దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలు, వంటకాలను పరిచయం చేస్తున్నట్లు ఢిల్లీ హోటల్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ మురళీమణి మీడియాకు తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేకమైన సంçస్కృతి, ఆహార వైవిధ్యం ఉందని, అందుకు అనుగుణంగా వివిధ రకాల వంటకాలను హోటళ్లలో అందిస్తున్నట్లు చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. బడ్జెట్ హోటళ్లలోనూ ప్రాంతీయ వంటకాలను అందించేలా హోటల్ యాజమాన్యాలకు కేంద్రం ముందుగానే సూచనలు చేసినట్లు తెలిసింది. -
భారత్ ఇన్నోవేషన్‌కు ప్రపంచ దేశాలు ఫిదా
సాక్షి, న్యూఢిల్లీ: 18వ ‘బ్రిక్స్’శిఖరాగ్ర సద స్సు వేదికగా భారత్ తన సాంకేతిక, పరిశోధ నా, స్టార్టప్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్‌లు, ల్యాబొరేట రీలు, రీసెర్చ్ పార్క్‌ల నుంచి వెలువడిన అత్యాధునిక డీప్‌టెక్ ఆవిష్కరణలను ఈ వేదికపై ప్రదర్శించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో ‘బ్రిక్స్’లో ప్రదర్శన ప్రపంచ దేశాలను ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో దేశానికి చెందిన 37 అత్యాధునిక డీప్‌టెక్ ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజారోగ్యం, వైద్యం, పునరుత్పాదక ఇంధనం, సముద్ర సాంకేతికత, విద్యుత్ వాహనాలు, మాతా–శిశు ఆరో గ్యం వంటి విభిన్న రంగాలకు చెందిన సాంకేతిక పరిష్కారాలను ఇందులో ప్రదర్శించారు. వాటిలో ము ఖ్యంగా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యవస్థ, నీటిపై ఏర్పాటు చేసే ఫ్లోటింగ్ సోలార్ పీవీ సాంకేతికత, మెరైన్ రోబోటిక్స్, అరుదైన ఖనిజాల అవసరం లేని రేర్ ఎర్త్ ఫ్రీ ఈ–పవర్ట్రెయిన్లు, ఏఐ ఆధారిత తల్లి– గర్భస్థ శిశువు ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ వంటి వినూత్న పరిష్కారాలను ప్రదర్శించారు. భారత్ ఉన్నత విద్యా వ్యవస్థలో రూపుదిద్దు కుంటున్న ఆవిష్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కేంద్రం పే ర్కొంది. దేశంలోని స్టార్టప్‌లు, ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రయోగ శాలలు, రీసెర్చ్ పార్క్‌లను ప్రపంచంలోని కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, విశ్వవిద్యాల యాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వాలు, విదేశాల్లోని భారతీయ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడానికి ఇది ఉపయోగపడనున్నట్లు వేదిక సందర్భంగా కేంద్రం పేర్కొంది. ఈ వేదిక ద్వారా భారత ఆవిష్కర్తలకు కేవలం తమ సాంకేతికతను ప్రదర్శించే అవకాశమే కాకుండా పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, వ్యాపార ఒప్పందాలు, అంతర్జాతీయ విపణిలోకి ప్రవేశం వంటి అవకాశాలు లభించనున్నాయి.‘బ్రిక్స్’ బిజినెస్ ఫోరంతో..శుక్ర, శనివారాల్లో జరిగిన ‘బ్రిక్స్’ బిజినెస్ ఫోరం కార్యక్రమంతో ఈ ప్రదర్శనను అను సంధానం చేశారు. దీంతో ‘బ్రిక్స్’ సభ్య దేశాలకు చెందిన సీఈఓలు, పెట్టుబడి దారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, పరిశ్రమ ప్రతినిధులతో భారతీయ స్టార్టప్‌లు నేరుగా పరిచయం ఏర్పరుచుకునే అవకాశం లభించింది. బిజినెస్–టు–బిజినెస్(బీ2బీ) సమావేశాలు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, పెట్టుబడి చర్చలు, వ్యాపార సంబంధాల ఏర్పాటు అంశాలకు ఈ వేదిక దోహదపడిందని కేంద్రం పేర్కొంది. భారత్ 2026 ‘బ్రిక్స్’ అధ్యక్షతన నిర్దేశించిన ‘బిల్డింగ్ ఫర్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టెయినబి లిటీ’ అనే థీమ్‌కు అనుగుణంగా ఈ ప్రదర్శనను నిర్వహించారు. బిక్స్ ఎడ్యుకేషన్ ట్రాక్‌లో గుర్తించిన ఐదు ప్రాధాన్య రంగాల్లో ఒకటైన ‘పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లను బలోపేతం చేయడం’ లక్ష్యాన్ని ఈ ప్రదర్శన ముందుకు తీసుకెళ్తుందని కేంద్రం తెలిపింది. 2026లో భారత డీప్‌టెక్ స్టార్టప్‌ల కోసం నిర్వహిస్తున్న ప్రధాన ఎక్స్పోజిషన్లలో ఇది రెండోది. తొలి ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమాన్ని ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో జూన్ 14 నుంచి 16 వరకు నిర్వహించారు. తాజాగా బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న ఈ రెండో ఎడిషన్ ద్వారా భారత ఆవిష్క రణలను ‘బ్రిక్స్’ దేశాల నాయకులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల దృష్టికి తీసికెళ్లడం గమనార్హం.ఆవిష్కర్తలతో విద్యాశాఖ మంత్రి ముచ్చటకేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రల్హాద్ జోషి భారత్ మండపంలోని ఎక్స్ పోజిషన్‌ను సందర్శించి డీప్‌టెక్ స్టార్టప్‌లు, ఆవిష్కర్తలతో మాట్లా డారు. వివిధ రంగాల్లో భారతీయ యువ ఆవిష్కర్తలు రూపొందించిన అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను ఆయన పరిశీలించారు. భారత ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని డీప్‌టెక్ స్టార్టప్‌లకు అంతర్జాతీయ స్థాయి వేదిక లభిస్తోందని జోషి పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనే ప్రపంచ నాయకుల ముందు భారతీయ స్టార్టప్‌లు తమ ప్రతిభ, సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ వేదిక ప్రత్యేక అవకాశాన్ని కల్పించిందని వ్యాఖ్యానించారు. -
2 దశాబ్దాల బ్రిక్స్ స్మారక స్టాంప్
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా రెండు స్మారక తపాలా బిళ్లలను పోస్టల్ శాఖ శనివారం విడుదలచేసింది. ఢిల్లీలో 18వ సమావేశంలో ఈ రెండు పోస్టల్ స్టాంప్‌లను విడుదలచేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ రెండు తపాలా బిళ్లలపై ‘బ్రిక్స్: రెండు దశాబ్దాల సహకారం, 2006–2026’ అని ఇంగ్లిష్, హిందీలో ముద్రించారు. పరస్పర విశ్వాసానికి ప్రతీకగా తొలి స్టాంప్‌ను, భారత్ అధ్యక్షత సమావేశాలు, కూటమి దార్శనికత, లోగోను గుర్తుచేస్తూ మరో స్టాంప్‌ను విడుదలచేశారు. -
ద్విపాత్రాభినయం తప్పదు
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాల నూతన అంతర్జాతీయ విపణుల మధ్య సహకారానికి అత్యంత ప్రభావవంతమైన వేదికగా బ్రిక్స్ కూటమి ఎదిగిందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ఆయన ఈ కూటమి దేశాల అగ్రనేతలనుద్దేశించి కీలక ప్రసంగంచేశారు. ‘‘పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతల స్థాపనకు బ్రిక్స్ దేశాలు ద్విపాత్రాభినయం చేయాల్సిందే. ఎందుకంటే పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లోని యుద్ధాలు, మారుతున్న విపరిణామాలతో ఆయా ప్రాంతాల ప్రజలు కష్టాల కడలిలో పడిపోయారు. అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కల్గుతోంది. ఇకనైనా పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం అభివృద్ధి చెందుతున్న దేశాల అగ్రనేతలు ఉమ్మడిగా పోరాడాలి. చరిత్ర గుర్తుంచుకునేలా సరైన పథంలో నడిచి ఈ ప్రాంతాల పురోభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలి’’అని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. చైనా సైతం పశ్చిమాసియా, గల్ఫ్‌లో శాంతి,సుస్థిరత కోసం ఈ కూటమితో కలిసి సమష్టిగా కృషిచేస్తుందని స్పష్టంచేశారు. ఆ మనస్తత్వం మానండి.. ‘‘ఇకనైనా బ్రిక్స్ దేశాలు ప్రచ్ఛన్న యుద్ధకాలంనాటి మనస్తత్వాన్ని వీడాలి. సభ్య దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం మానుకోవాలి. ఆయా దేశాల సార్వ¿ౌమత్వాలకు భంగం వాటిల్లేలా వ్యవహరించడం వంటి పనులకు చరమగీతం పాడాలి. శత్రుత్వాలకు త్యజించాలి. ఇందుకోసం పరస్పర అవగాహన, విశ్వాసం పెంచుకోవడంపై కూటమి దేశాలు దృష్టిపెట్టాలి. బ్రిక్స్ దేశాలు స్వావలంబన సాధిస్తూనే, దేశీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే సరికొత్త అభిృవృద్ధిబాటల్లో పయనించడం శుభసూచకం. అగ్రదేశాల ఆధిపత్య విధానాలు, కేంద్రీకృత రాజకీయాల విపరిణామాల దుష్పఫలితాలను మనందరం చవిచూస్తున్నాం. దీంతో శాంతి, అభివృద్ధి, భద్రత, సుపరిపాలన అనేవి కష్టమవుతున్నాయి. వీటికి పరిష్కారాలు వెతుకుదాం. కోవిడ్ సంక్షోభాన్ని సమష్టిగా ఎదుర్కొన్నట్లు ఇకమీదటా వాతావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభం వంటి అంతర్జాతీయ సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించుకుందాం’’అని జిన్‌పింగ్ అన్నారు. -
జిన్‌పింగ్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: బ్రిక్స్ సదస్సుకు హాజరైన అగ్రనేతల గౌరవార్థం ప్రధాని మోదీ శనివారం రాత్రి ఇచ్చిన విందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరుకాలేదు. విందులో జిన్‌పింగ్ ఎందుకు హాజరుకాలేదనే విషయంలో అధికారికంగా ఎలాంటి కారణాలు వెల్లడికాలేదు. కానీ శిఖరాగ్ర సదస్సులో సుదీర్ఘంగా పాల్గొని అలసిపోయిన ఆయన తన హోటల్ గదికి విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిపోయారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రధాన సమావేశానికి హాజరైన అబూదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ సైతం వెంటనే స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. దీంతో ఈయన సైతం బ్రిక్స్ గాలా డిన్నర్‌కు గైర్హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇతర బ్రిక్స్ దేశాల అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విందులో పాల్గొన్నారు. విందులో అత్యంత రుచికరమైన గుజరాతీ చిరుతిండి అయిన ఖండ్వీ మిలే ఫియులే, కుంభ్ గలౌతీ కబాబ్, పనీర్ లబాబ్దార్, గుచ్చీ మారి్మక్, క్యారెట్–బీన్ పొరియల్, చిరుధాన్యాల పులావ్‌లను వడ్డించారు. పాత ఢిల్లీ ఫ్రూట్ క్రీమ్, జిలేబీ, షతూత్ ఫిర్నీలనూ అందించారు. -
విభేదాలు వివాదాలుగా మారొద్దు
న్యూఢిల్లీ: భారత్–చైనా సంబంధాలు మరింత బలోపేతం కావాలంటే ఇరుదేశాల సరిహద్దు వద్ద శాంతియుత వాతావరణం నెలకొనడం అత్యవసరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు స్పష్టం చేశారు. సరిహద్దు నిర్వహణకు సంబంధించిన ప్రస్తుత ఒప్పందాలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ, జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానంగా భారత్, చైనా సంబంధాలపై చర్చించారు. వాణిజ్య లోటును తగ్గించడం, ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కోవడం, బహుపాక్షిక వేదికలపై న్యాయమైన, పారదర్శక వాణిజ్యం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. విభేదాలు వివాదాలుగా మారకూడదని ఇరువురు నేతలు పునరుద్ఘాటించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని వారు పేర్కొన్నట్లు వెల్లడించింది. పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనం వాణిజ్య అసమతుల్యత, సప్లై చైన్లు, మార్కెట్ ప్రవేశాన్ని సులభతరం చేయడం వంటి అంశాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ, జిన్‌పింగ్ నిర్ణయానికి వచ్చారు. సమగ్ర ద్వైపాక్షిక సంబంధాలు, ఇరుపక్షాల దీర్ఘకాలిక ప్రయోజనాల ఆధారంగా సరిహద్దు సమస్యకు న్యాయబద్ధమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. పరస్పర సంబంధాల విషయంలో భారత్, చైనాలు పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనం అనే మూడు అంశాల ఆధారంగా ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు జిన్‌పింగ్ శనివారం ఢిల్లీకి చేరుకున్న కొద్ది గంటల తర్వాత ఈ సమావేశం జరిగింది. జిన్‌పింగ్ భారత్‌లో పర్యటిస్తుండడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఉమ్మడి కార్యాచరణ మరింత విస్తృతం గత ఏడాది ఆగస్టులో టియాంజిన్‌లో జరిగిన తమ చివరి సమావేశం తర్వాత భారత్–చైనా సంబంధాల్లో సాధిస్తున్న స్థిరమైన పురోగతిని మోదీ, జిన్‌పింగ్ స్వాగతించారని భారత విదేశాంగ శాఖ తెలియజేసింది. రెండు దేశాలు తమ సంబంధాల పట్ల వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉండాలని వారు పునరుద్ఘాటించినట్లు వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాల నిరంతర అభివృద్ధికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులే ప్రాతిపదికగా నిలుస్తాయని ప్రధాని మోదీ తేల్చిచెప్పారని ఉద్ఘాటించింది. సరిహద్దు సంబంధిత అంశాలపై ప్రస్తుతం అమల్లో ఒప్పందాలు, అవగాహనలను ఇరుపక్షాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారని పేర్కొంది. ప్రజల మధ్య సంబంధాల్లో సాధించిన పురోగతిని ఇద్దరు నేతలు గుర్తించారని, రెండు దేశాల మధ్య సాంస్కృతిక మారి్పడి, వాణిజ్య సంబంధాలు, రాకపోకలను మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందని నిర్ణయానికి వచ్చారని తెలిపింది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతోపాటు వివిధ సవాళ్లను ఎదుర్కోవడంలో ఉమ్మడి కార్యాచరణను మరింత విస్తృతం చేయాలని మోదీ, జిన్‌పింగ్ నిర్ణయించినట్లు సమాచారం. భారత్ చేపట్టిన బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలకు చైనా అందించిన మద్దతును, కూటమి శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావడంలో చైనా చేసిన కృషిని ప్రధాని మోదీ అభినందించారు.భారత్, చైనాలపై పెద్ద బాధ్యత: జిన్‌పింగ్ భారత్–చైనా సంబంధాల అభివృద్ధిని బీజింగ్ ఎల్లప్పుడూ వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతోనే చూస్తోందని జిన్‌పింగ్ స్పష్టంచేశారు. మన రెండు దేశాల పరిస్థితులు వేర్వేరుగా ఉన్నప్పటికీ మనం ఒకరికొకరు అండగా నిలుస్తూ ఉమ్మడి అభివృద్ధి మార్గంలో పయనించవచ్చని అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలుగా, గ్లోబల్ సౌత్‌లో కీలక సభ్యులుగా భారత్, చైనాలు పెద్ద బాధ్యతలను కలిగి ఉన్నాయని వివరించారు. ఇరుపక్షాలు మానవాళి భవిష్యత్తును, తమ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. సహకారాన్ని పెంపొందించుకోవడానికి, సమ్మిళిత ఆర్థిక భవిష్యత్తు దిశగా మనం కలిసి పనిచేయాలని జిన్‌పింగ్ భారత్‌కు పిలుపునిచ్చారు. -
స్నేహగీతం..!
న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో అత్యంత విశేషమైన ఘట్టం చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన కుడివైపున రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో, ఎడమ వైపున చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చేతులు కలిపి చిరునవ్వులు చిందించారు. ముగ్గురు నేతలు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. తామంతా ఐక్యంగా ముందుకు సాగుతున్నామని ప్రపంచానికి చాటిచెప్పారు. సరిహద్దు వివాదాలు, విభేదాలు ఉన్నప్పటికీ భారత్, చైనా మధ్య అనుబంధం చెక్కుచెదరలేదని మోదీ సంకేతాలిచ్చారు. శనివారం బ్రిక్స్ సదస్సు జరిగిన భారత్ మండపం వద్ద తీసిన ఈ చిత్రాన్ని ప్రధానమంత్రి ఇన్‌స్టా్రగామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోకు ‘కింగ్డమ్ బీజీఎం’అనే పాట నేపథ్య సంగీతంగా వినిపిస్తోంది. ముగ్గురు దేశాధినేతల స్నేహగీతం సదస్సు వేదిక వద్ద అందరినీ ఆకట్టుకుంది. ఆప్యాయతతో కూడిన ఈ క్షణం ప్రత్యేకంగా నిలిచింది. మోదీ సోషల్ మీడియాలో మరికొన్ని ఫొటోలను సైతం మోదీ పోస్ట్ చేశారు. పుతిన్, షీ జిన్‌పింగ్‌లతోపాటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో దిగిన చిత్రాలున్నాయి. మరొక చిత్రంలో పుతిన్, షీ జిన్‌పింగ్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోలతో మోదీ ఉత్సాహంగా చర్చిస్తూ కనిపించారు. -
చర్చలే శరణ్యం!
న్యూఢిల్లీ: సంఘర్షణలు, సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల్లోనే శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న భారతదేశం పిలుపును బ్రిక్స్ కూటమి దేశాల అధినేతలు సమరి్థంచారు. ఈ మేరకు శనివారం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇరాన్‌తోపాటు సౌదీ అరేబియా, యూఏఈ సైతం ఆమోదం తెలిపాయి. పశ్చిమాసియా యుద్ధంపై నెలకొన్న విభేదాలను పక్కనపెట్టి ఇరాన్, యూఏఈలు ఈ డిక్లరేషన్ విషయంలో ఒక్కటి కావడం విశేషం. భారతదేశానికి ఇది ముఖ్యమైన దౌత్యవిజయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయితే, ఈ ప్రకటనలో ఇరాన్‌పై అమెరికా దాడుల గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని కూడా తప్పుపట్టలేదు. గాజాలో హింసాకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలని, పాలస్తీనా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని తేల్చిచెప్పారు. ‘వర్తించే’అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రపంచ వాణిజ్యం, సప్లై చైన్లు, ఇంధన సరఫరా సజావుగా కొనసాగానికి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని కూటమి నేతలు నొక్కిచెప్పారు. తొలుత ఇరాన్, యూఏఈలు తమ కఠిన వైఖరిని ప్రదర్శించడంతో ఈ డిక్లరేషన్ పాఠంపై చర్చలు చివరి నిమిషం వరకు కొనసాగాయి. బ్రిక్స్ అనేది ఏకాభిప్రాయం ఆధారంగా పనిచేసే కూటమి. ఏ ఒక్క సభ్య దేశం వ్యతిరేకించినా డిక్లరేషన్ ఆమోదం పొందదు. ఏకపక్ష ఆంక్షలు, బలవంతపు చర్యలు వద్దు విచక్షణారహిత సుంకాలు, నాన్–టారిఫ్ చర్యలు, సంరక్షణవాదం వంటి వాణిజ్య నిరోధక చర్యలపై బ్రిక్స్ దేశాలు తమ డిక్లరేషన్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇవి ప్రపంచ వాణిజ్యాన్ని మరింత తగ్గించి, సప్లై చైన్లకు అంతరాయం కలిగించి, ఇప్పటికే ఉన్న ఆర్థిక అసమానతలను మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలను పరోక్షంగా తప్పుపట్టాయి. అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమైన ఏకపక్ష ఆంక్షలు, బలవంతపు చర్యలను తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాయి. బ్రిక్స్ సదస్సులో తొలి రోజు చర్చల ముగింపు సందర్భంగా న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించినట్లు భారత ప్రధాని మోదీ ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నామని డిక్లరేషన్ పేర్కొంది. గరిష్ట సంయమనం పాటించాలని, పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టంచేసింది. ఇతర దేశాల సార్వ¿ౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని తెలిపింది. ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉద్దేశాలు, సూత్రాలకు అనుగుణంగా పౌరులు, పౌర మౌలిక సదుపాయాలకు రక్షణ కల్పించాలని వెల్లడించింది. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి, భద్రత, స్థిరత్వానికి దోహదపడే దీర్ఘకాలిక అవగాహన కోసం చర్చలు, దౌత్యం ద్వారా ప్రయత్నాలను ముమ్మరం చేయడాన్ని ప్రోత్సహిస్తున్నామని స్పష్టంచేసింది. ఉగ్రవాదులను కోర్టు ముందు నిలబెట్టాల్సిందే గత ఏడాది జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మందిని బలిగొన్న ఉగ్రవాద దాడిని బ్రిక్స్ కూటమి అత్యంత తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నాసరే సహించడానికి వీల్లేదని, ఈ ముప్పును ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలన్న భారత్ పిలుపునకు పూర్తి మద్దతు తెలిపింది. ఉగ్రవాద సవాలును ఎదుర్కోవడంలో సమష్టి విధానాన్ని అవలంబించడానికి కూటమి నేతలు అంగీకరించారు. ‘‘సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఆశ్రయం కల్పించడం సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం’’అని డిక్లరేషన్‌లో తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని ఏ మతం, జాతీయత, నాగరికత, జాతి సమూహంతో ముడిపెట్టకూడదని ఉద్ఘాటించారు. -
రూల్స్ మనమే రూపొందించాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య ఘర్షణలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు పెరుగుతున్న నేపథ్యంలో గ్లోబల్ సౌత్ దేశాలు ‘నియమాలను రూపొందించేవిగా’మారాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ప్రపంచ పాలనలో ప్రస్తుతం ఉన్న ‘విశేషాధికారాల పిరమిడ్’స్థానంలో ‘భాగస్వామ్య వేదిక’కావాలని తేల్చిచెప్పారు. రెండు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని భారత్ మండపంలో అట్టహాసంగా మొదలైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. బ్రిక్స్ చట్రం కింద ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 పాయింట్ల రోడ్‌మ్యాప్‌ను ప్రతిపాదించారు. ప్రపంచ, ప్రాంతీయ సంక్షోభాల వల్ల అధిక ముప్పును ఎదుర్కొంటున్న నావికుల రక్షణ కోసం ‘సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్’ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్రిక్స్ సదస్సులో చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, ఇండోనేసియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో, అబూదాబీ యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది బ్రిక్స్‌కు భారత్ నేతృత్వం వహిస్తోంది. కీలకమైన ప్రపంచ సంస్థగా బ్రిక్స్ బ్రిక్స్ కూటమి ఒక కీలకమైన ప్రపంచ సంస్థగా ఆవిర్భవించిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. తీవ్రమైన ప్రపంచ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రాబోయే 20 ఏళ్లలో కూటమికి ఒక నూతన, ప్రతిష్టాత్మక ఎజెండా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ పాలనా వ్యవస్థ ఒక పిరమిడ్‌ను పోలి ఉందని చెప్పారు. అధికారం, నిర్ణయాధికారం పైస్థాయిలో కేంద్రీకృతమై ఉండగా, కింది స్థాయిలోని దేశాలు ఆ నిర్ణయాల ప్రభావానికి లోనవుతున్నాయి తప్ప వాటిని ప్రభావితం చేయలేకపోతున్నాయని వెల్లడించారు. నేడు ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కోవడంలో ‘గ్లోబల్ సౌత్’ముందు వరుసలో ఉన్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం వెనుకంజలోనే ఉందన్నారు. అందుకే విశేషాధికారాల పిరమిడ్ స్థానంలో అన్ని దేశాలతో కూడిన భాగస్వామ్య వేదికను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ప్రతి దేశానికీ గళం వినిపించే అవకాశం ఉండాలన్నారు. ప్రతి ప్రయత్నానికీ మానవాళి అభివృద్ధే కేంద్ర బిందువుగా ఉండేలా చూడాలని తెలిపారు. ఉమ్మడిగా రోడ్‌మ్యాప్ మానవాళి సంక్షేమం కోసం బ్రిక్స్ కూటమి సంస్కరణ ప్రణాళికా చట్రం పరిధిలోనే ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 అంశాలతో కూడిన రోడ్‌మ్యాప్‌ను ఉమ్మడిగా రూపొందించాలని మోదీ ప్రతిపాదించారు. తదుపరి శిఖరాగ్ర సమావేశం నాటికి ఈ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంలో మనం మూడు కీలక అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘ప్రాతినిధ్యం, స్పందించే గుణం, నియమావళి రూపకల్పన’అవసరమని చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని, దీనికి సంబంధించిన చర్చలను ఒక నిర్దిష్ట కాలపరిమితితో స్పష్టమైన ఫలితాల దిశగా ముందుకు తీసుకెళ్లాలని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆర్థిక సంస్థల్లో ఓటింగ్ అధికారం, నాయకత్వ స్థానాలు, విధానపరమైన ప్రాధాన్యతలు నేటి ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే దేశాలు ప్రపంచ ఆర్థిక పాలనను తీర్చిదిద్దడంలోనూ తగిన పాత్ర పోషించాలని సూచించారు. భవిష్యత్తులో ప్రపంచ నియమాలను నిర్ణయించడంలో సమాన భాగస్వామ్యాన్ని కల్పించడం అత్యంత కీలకమని తేల్చిచెప్పారు. కృత్రిమ మేధస్సు, సైబర్ స్పేస్, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కీలక సాంకేతికతల వంటి రంగాలు భవిష్యత్తు అవకాశాలను తీర్చిదిద్దడమే కాకుండా, భవిష్యత్తు నియమాలను కూడా నిర్దేశిస్తున్నాయన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు ఇక కేవలం నియమాలను పాటించేవారి స్థాయిలో ఉండడానికి వీల్లేదన్నారు. నియమాలను రూపొందించే స్థాయికి ఎదగాలని స్పష్టంచేశారు. ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాం బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ ఏడాది బ్రిక్స్ 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు. మానవ జీవితంలో 20 ఏళ్ల వయస్సు అనేది పరిపక్వత, బాధ్యతతో కూడిన ఒక కొత్త దశకు ఆరంభమని వ్యాఖ్యానించారు. బ్రిక్స్ కూడా పరిపక్వత సాధించే దశకు చేరుకుందని, ప్రపంచ వేదికపై క ప్రత్యేక గుర్తింపును సాధించిందని అన్నారు. తాము ఇతరుల ఆకాంక్షలను గౌరవిస్తామని, ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామని వివరించారు. ఎవరినో వ్యతిరేకించడం ద్వారా కాకుండా అందరినీ కలుపుకొని వెళ్లడం ద్వారా పురోగతి సాధించడానికి కృషి చేస్తామన్నారు. కూటమిలో మనకున్న ఐక్యతను, ఏకాభిప్రాయాన్ని ప్రపంచ వేదికపై ప్రత్యక్ష ఫలితాలుగా మార్చుకోవాలని సూచించారు. రాబోయే 20 ఏళ్లకు సంబంధించిన బలమైన ఎజెండాపై మనం కృషి చేయాలన్నారు. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు ఏటా మారుతున్నప్పటికీ అది మన సంస్థాగత పురోగతికి ఆటంకం కలిగించకూడదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఆమోదించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’మన ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఈ తీర్మానాలను స్పష్టమైన ఫలితాలుగా మార్చడం మన బాధ్యత అని ఉద్బోధించారు. 10 పాయింట్ల రోడ్‌మ్యాప్ 1. నియమాలను పాటించేవారి నుంచి నియమాలను రూపొందించేవారిగా బ్రిక్స్ ఎదగడం 2. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు 3. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం బలోపేతం 4. కూటమి అధ్యక్షులు మారినప్పటికీ నిర్ణయాలు కొనసాగింపు 5. కూటమి నిర్ణయాల అమలుపై దృష్టి 6. వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడం 7. సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరింపజేసుకోవడం 8. అభివృద్ధి భాగస్వామ్యాలను బలోపేతం చేయడం 9. గ్లోబల్ సౌత్‌కు మరింత ప్రాధాన్యత ఇవ్వడం 10. ప్రపంచ వేదికపై బ్రిక్స్‌ను మరింత సమర్థవంతంగా మార్చడం -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి...
సాక్షి, చెన్నై: పరిచయం పెంచుకుని యువతిని మాయ మాటలతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని తీయని కబుర్లుచెప్పి గదికి తీసుకెళ్లి శీతలపానీయంలో మత్తు మందు కలిపి లైంగికదాడికి తెగబడ్డాడు. వీడియో చిత్రీకరించి పిలిచినప్పుడల్లా రావాలని బ్లాక్మెయిల్ చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌లో శుక్రవారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన 25 ఏళ్ల యువతి తిరుప్పూర్ జిల్లా మొదలిపాలయంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో కుట్టుపని చేస్తోంది. అదే ప్రాంతంలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన వికాష్ కుమార్ యాదవ్ ఆమెను పరిచయం చేసుకున్నాడు. మాయమాటలతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని ఆశలు రేపాడు. ఈ పరిస్థితులలో పని ముగించుకుని శుక్రవారం సాయంత్రం తన కోసం వచ్చిన యువతిని వికాష్ కుమార్ తన గదికి తీసుకెళ్లాడు. ఆమెకు తెలియకుండా శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన యువతి స్పృహ కోల్పోవడంతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను తన సెల్ఫోన్లో వీడియోగా చిత్రీకరించి, ఫోటోలూ తీశాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత యువతి ఆందోళన చెంది తనను పెళ్లి చేసుకోవాలని వేడుకోవడంతో తనకు అప్పటికే పెళ్లయినట్టు చెప్పాడు. తను తీసిన చిత్రాలను ఆమెకు చూపి ఇక, తాను పిలిచినప్పుడల్లా రావాలని హెచ్చరించి పంపాడు. ఎవరికైనా చెబితే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసి పరువు తీస్తానని బెదిరించాడు. అంతే కాకుండా ఆ వీడియోను తన బంధువు ఒకరికి అతడు పంపించి పైశాచికానందం పొందాడు. దీంతో ఆ యువతి తిరుప్పూర్ పోలీసులను శనివారం ఆశ్రయించింది. కాంగేయం ఆల్ ఉమెన్ పోలీసులు తక్షణం రంగంలోకి దిగి వికాష్కుమార్యాదవ్ను అరెస్టు చేశారు. అతడి ఫోన్‌ను పరిశీలించగా అందులో ఆయువతితో గడిపిన వీడియోలతో పాటుగా మరికొన్ని అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. నిందితుడు మరెవరినైనా ఈ తరహాలో వేధించాడా? అన్న అనుమానంతో విచారణ జరుపుతున్నారు. -
వడివడిగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనులు
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ, వాణిజ్యపరంగా అత్యంత వ్యూహాత్మకమైన ఆదిలాబాద్ విమానాశ్రయ ప్రాజెక్టు పనులను వేగంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పురోగతిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో శనివారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ భేటీలో పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రాజెక్టు అమలును పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు రక్షణ శాఖ, పౌరవిమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కో నోడల్ అధికారిని వచ్చే వారంలోగా నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే ప్రాజెక్టు డీపీఆర్, మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తీర్మానించారు. ఉత్తర తెలంగాణలో పౌర విమానయాన మౌలిక వసతుల కల్పనతోపాటు ప్రాంతీయ వైమానిక అనుసంధాన మెరుగుదలకు ఈ ప్రాజెక్టు బాటలు వేస్తుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.రక్షణ శాఖ సంపూర్ణ సహకారం..దేశ రక్షణపరంగా వ్యూహాత్మక ప్రాంతమైన ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ అభివృద్ధికి రక్షణ శాఖ సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా కీలక ముందడుగు పడిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులు ఆదిలాబాద్ విమానాశ్రయ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ కోసం 2.75 కిలోమీటర్ల పొడవైన రన్‌వే నిర్మాణం అవసరమని తేల్చారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధీనంలో 369.45 ఎకరాల భూమి అందుబాటులో ఉండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 1,500 ఎకరాల భూసేకరణ చేయాలని అధికారులు నిర్ణయించారు. -
తలా అజిత్‌తో సీఎం విజయ్.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ట్రీట్!
తమిళనాడు సీఎం, హీరో విజయ్.. స్టార్ హీరో అజిత్ కుమార్‌ను లండన్‌లోని సిల్వర్‌స్టోన్ రేసింగ్ ట్రాక్‌లో కలిశారు. ప్రస్తుతం ‘మిచెలిన్ లీ మ్యాన్స్ కప్’లో పాల్గొంటున్న అజిత్‌ను విజయ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. విజయ్ సినిమాల్లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోటీ ఉండేది. వీరిద్దరి అభిమానుల మధ్య రైవల్రీ కూడా ఉన్నప్పటికీ.. వీరి తాజా భేటీ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ముఖ్యమంత్రిగా విజయ్ తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా లండన్ వెళ్లగా.. అక్కడే అజిత్‌తో ఈ అరుదైన కలయిక చోటుచేసుకుంది. ఒకరిని ఒకరు చూసిన వెంటనే ఆనందంతో విజయ్ పరుగెడుతూ వెళ్లి అజిత్‌ను ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకరు రాజకీయ నాయకుడిగా, మరొకరు సినీ రంగంతో పాటు మోటార్ స్పోర్ట్స్‌లో రాణిస్తున్నారు. ఇలా ఇద్దరూ తమ తమ రంగాల్లో సరికొత్త ప్రయాణం సాగిస్తున్న వేళ జరిగిన ఈ భేటీపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.The way Thalapathy Vijay Hugged Ajith Kumar & AK welcomed @actorvijay ❤️ What an incredible Moment !!! An WHOLESOME Video !!! https://t.co/5IxWCYarp0— Let's X OTT GLOBAL (@LetsXOtt) September 12, 2026 -
పాముల మధ్యే విధులు నిర్వహించిన డాక్టర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో గంగా నది ఉప్పొంగడంతో రతువా బ్లాక్ ఆసుపత్రిలోకి వరద నీరు చేరింది. ఆసుపత్రిలో దాదాపు 40 శాతం ప్రాంతం నీటిలో మునిగిపోయింది. ప్రధాన రహదారితో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో అక్కడికి చిన్న పడవల ద్వారానే చేరుకునే పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లోనూ డాక్టర్ అరిజీత్, కొద్దిమంది వైద్య సిబ్బందితో కలిసి ఆసుపత్రిని వీడకుండా రోగులకు చికిత్స అందిస్తున్నారు.వరద నీటితో నిండిన ఆసుపత్రి కారిడార్లలో విషపూరిత పాములు, ఇతర కీటకాలు సంచరిస్తున్నాయి. మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ డాక్టర్ అరిజీత్ చికిత్స అవసరమైన రోగుల వద్దకు వెళ్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేని రోగులకు వైద్యం అందించడమే తమ ప్రాధాన్యంగా ఆయన, వైద్య సిబ్బంది విధులు కొనసాగిస్తున్నారు.ఈ పరిస్థితిని డాక్టర్ అరిజీత్ కష్టతరమైన సమయంగా అభివర్ణించారు. “ఇది చాలా కష్టంగా ఉంది. కానీ వైద్యులు, వైద్య సిబ్బందిగా చికిత్స అందించడం కూడా అవసరం. ప్రజలకు మన అవసరం ఎక్కువగా ఉండే సమయం ఇదే. ఈ ఆసుపత్రిలో పాములు, కీటకాలు ఉన్నాయి. అయినా ఈ కష్టకాలంలో రోగులను చూసుకోవడం మరింత ముఖ్యం” అని ఆయన తెలిపారు.వరదల కారణంగా రతువా, మాణిక్చక్, రతన్‌పూర్ ప్రాంతాల్లో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. మొత్తం ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రిలోనూ అంధకారం నెలకొంది. అయినా డాక్టర్ అరిజీత్, వైద్య సిబ్బంది రోగుల సంరక్షణ కొనసాగిస్తున్నారు. “ఒక వైద్యుడికి ఆసుపత్రిని వదిలి వెళ్లడం ఎప్పుడూ ఒక ఎంపిక కాదు” అని డాక్టర్ అరిజీత్ చెప్పారు. వరద పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు వైద్య సేవలు అందించడం, సిబ్బంది భద్రత రెండూ కీలకంగా మారాయి. -
రీల్స్ పిచ్చి.. నదీ ప్రవాహంలో చిక్కుకుని విలవిల
సామాజిక మాధ్యమాల్లో అద్భుతమైన వీడియో పోస్ట్ చేసి పాపులర్ కావాలనే ప్రయత్నంలో కొందరు యువకులు అత్యంత ప్రమాదకరమైన చర్యకు పాల్పడ్డారు. ఓ ఎస్‌యూవీని నదిలోకి నడిపిస్తూ వీడియో చిత్రీకరించారు. ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా వారు వాహనాన్ని నదిలోకి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఈ ఘటన జమ్మూ కశ్మీర్‌లోని సింధ్ నది ప్రాంతంలో, హోటల్ సింధ్ రిసార్ట్స్ సమీపంలో జరిగింది. నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా బలంగా ఉండటంతో స్కార్పియో నీటిలో చిక్కుకుపోయింది. వాహనంలోని వారు దాన్ని బయటకు తీసుకురాలేకపోయారు. వాహనంలోని అందరి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది. ఘటనపై జమ్మూకశ్మీర్ పోలీసులు సమాచారమందుకుని అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.వైరల్‌గా మారిన వీడియోలో.. కొందరు వ్యక్తులు ఎస్‌యూవీలో ప్రయాణిస్తూ నదిలోకి వెళ్లడం కనిపిస్తుంది. వాహనం నీటిలోకి వెళ్లిన తర్వాత కూడా వారు వీడియో చిత్రీకరణ కొనసాగించారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రమాదకర చర్యకు పాల్పడ్డారు.వాహనం నదిలోకి వెళ్లడంతో పరిస్థితి ఎప్పుడు అదుపు తప్పుతుందో తెలియని ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. వాహనం నీటిలో చిక్కుకుంటే అందులో ఉన్నవారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయినా వీడియో కోసం వారు ఈ ప్రమాదాన్ని పట్టించుకోలేదు.ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. ఇటువంటి వీడియో తీసుకోవడం కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వాహనాన్ని నదిలోకి తీసుకెళ్లిన వ్యక్తుల తీరును విమర్శిస్తున్నారు.#Watch | SUV gets stuck in Nallah #Sindh during reported stunt attempt near SonamargA Scorpio vehicle became stranded in Nallah Sindh near #Sonamarg after its occupants allegedly attempted a stunt. Police and locals launched a rescue operation to retrieve the vehicle. pic.twitter.com/GbFzTouW48— Greater Kashmir (@GreaterKashmir) September 11, 2026 -
విషాదం.. విమానం ఎగరడానికి కొన్ని గంటల ముందే..
ఢిల్లీ: ఓ స్టార్ హోటల్ రూమ్‌లో ఎయిరిండియా పైలట్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన వసంత్ కుంజ్‌లో ఉన్న స్టార్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, ఫ్లైట్ కెప్టెన్‌గా పనిచేస్తున్న ఆ వ్యక్తి ది గ్రాండ్ హోటల్లోని తన గదిలో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని సన్నీ అసల్దేకర్గా పోలీసులు గుర్తించారు.పైలట్ సెప్టెంబర్ 10న హోటల్లో చెక్-ఇన్ చేశారు. మరుసటి రోజు ఆయన ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో ఆయన సోదరుడు హోటల్ మేనేజర్‌ను సంప్రదించాడు. దీంతో మేనేజర్ గదికి వెళ్లగా.. తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. మాస్టర్ కీ సహాయంతో తలుపు తెరిచి చూడగా పైలట్ స్పందన లేకుండా కనిపించారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఆయనకు పోస్టుమార్టం నిర్వహించారు. మరణానికి కచ్చితమైన కారణం తెలియలేదు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.ఇవాళ (శనివారం) తెల్లవారుజామున విధులకు ఆయన హాజరు కావాల్సి ఉంది. ఢిల్లీ నుంచి సియోల్‌కు వెళ్లే విమానాన్ని నడపాల్సి ఉంది. గుండెపోటు కారణంగానే ఆయన మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నాయి. పైలట్ గతంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పనిచేశారు. కొద్ది నెలల క్రితమే ఎయిర్ ఇండియాకు మారారు.ఇదీ చదవండి: ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది? -
‘‘మేము చోటా రాజన్ మనుషులం.. రూ.32 కోట్లు ఇస్తావా? చస్తావా?’’
ముంబై పశ్చిమ శివారు ప్రాంతాల్లో చేపట్టిన పునరాభివృద్ధి ప్రాజెక్టు కేంద్రంగా ఓ వసూళ్ల కుట్ర జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ డెవలపర్‌ను హత్య చేస్తామని, ఇతర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి తొలుత రూ.32 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఈ మొత్తం రూ.11 కోట్లకు తగ్గినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం ముంబై క్రైమ్ బ్రాంచ్ గాలింపు చేపట్టింది. వీరిలో ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎన్జీవో నిర్వాహకుడు కూడా ఉన్నారు.ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ ఎక్స్టార్షన్ సెల్ ఈ వసూళ్ల యత్నంపై దర్యాప్తు చేస్తోంది. పనులు కొనసాగిస్తే డెవలపర్ సిబ్బందికి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని, ప్రభుత్వ సంస్థలు, పౌర అధికారులకు ఫిర్యాదులు చేసి పనులను అడ్డుకుంటామని, చివరకు చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఎఫ్ఐఆర్లో ఎనిమిది మంది నిందితులతో పాటు మరికొందరి పేర్లు ఉన్నాయి. వీరిలో చోటా రాజన్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్విందర్ సింగ్‌కు చెందిన రాజ్‌లక్ష్మి సంస్థ పేరు ఉంది. ఎన్జీవో నిర్వాహకుడు క్లెమెంటినస్ ఫారో, టోనీ అనే మరో నిందితుడి పేర్లు కూడా ఉన్నాయి. ఫారో, టోనీ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కేసు బాంద్రా వెస్ట్‌లోని ఓ ఆస్తికి సంబంధించినది. ఈ ఆస్తి బాంబే ఆర్చ్డియోసిస్కు చెందినది. సుమారు 50 ఏళ్లుగా అక్కడ ఆస్తి ఉంది.ఈ ప్రాపర్టీ వల్లే..బాంద్రా వెస్ట్‌లోని పెరీరా రోడ్డులో ఉన్న ఆస్తి పునరాభివృద్ధికి బాంబే ఆర్చ్డియోసిస్ టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో దిల్జయ్ ప్రాపర్టీస్ అత్యధిక ధరను ప్రతిపాదించింది. అవసరమైన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, ఛారిటీ కమిషనర్ కార్యాలయం నుంచి అనుమతులు పొందిన తర్వాత ఆర్చ్డియోసిస్ యాజమాన్యం ఆస్తిని పునరాభివృద్ధి కోసం దిల్జయ్ ప్రాపర్టీస్‌కు అప్పగించింది.సుమారు 50 ఏళ్ల నాటి ఈ ఆస్తి శిథిలావస్థకు చేరుకుంది. 2024లో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దీనిని సీ-1 కేటగిరీ ప్రమాదకర భవనంగా ప్రకటించింది. సురక్షితంగా కూల్చివేసేందుకు వీలుగా మొత్తం ఆస్తికి విద్యుత్, నీటి సరఫరాను పౌర సంస్థ నిలిపివేసింది.ఎథెల్ స్టీవెన్, డేనియల్ స్టీవెన్, వారి కుటుంబ సభ్యుల్లో కొందరు ఆ ఆస్తిలో అక్రమంగా నివసిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2026 జూన్ నాటికి భవనం అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. బీఎంసీ ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది సమక్షంలో అధికారిక తనిఖీ నిర్వహించారు. దీనిని పంచనామా అంటారు. ఆ తర్వాత కేర్‌టేకర్ ఎథెల్ స్టీవెన్, డేనియల్ స్టీవెన్, టోనీ కుటుంబ సభ్యుల వస్తువులను అక్కడి నుంచి తొలగించారు. నిర్దేశిత విధానాల ప్రకారం ప్రమాదకర భవనాన్ని కూల్చివేశారు.కూల్చివేత తర్వాత బెదిరింపులుభవనం కూల్చివేసిన తర్వాత ఎథెల్, డేనియల్ కుటుంబ సభ్యులు నేర చరిత్ర ఉన్న వ్యక్తులుగా పేర్కొన్న కొందరితో కలిసి తరచూ ఆ ప్రాంతానికి రావడం ప్రారంభించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు ప్రకారం.. చోటా రాజన్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చెంబూర్, కుర్లా ప్రాంతాలకు చెందిన గ్యాంగ్ సభ్యులు వారితో కలిసి వచ్చేవారు. డెవలపర్‌కు చెందిన భద్రతా సిబ్బంది, ఇతర ఉద్యోగులపై దాడి చేసి బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనలపై బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. 2026 జూలై 11న ఎఫ్ఐఆర్ నంబర్ 1393, జూలై 29న ఎఫ్ఐఆర్ నంబర్ 1564 కింద 2 కేసులు నమోదయ్యాయి. ప్లాట్ వద్ద భద్రతా కంచె ఏర్పాటు పనులు చేపడుతున్న సమయంలోనూ బెదిరింపులు కొనసాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎథెల్, డేనియల్ తమ సహచరులతో కలిసి అక్కడికి వచ్చి ఎలాంటి పనిని కొనసాగించనివ్వబోమని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.రూ.32 కోట్ల డిమాండ్చెంబూర్లో చోటా రాజన్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్విందర్ సింగ్, కుర్లాకు చెందిన అబ్దుల్లా ఖాన్, బాంద్రాకు చెందిన రెమీ, నజీర్‌లతో తమకు సంబంధాలు ఉన్నాయని నిందితులు డెవలపర్‌కు చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిలో కొందరితో లేదా అందరితో కలిసి డెవలపర్ ప్రతినిధులను చంపుతామని బెదిరించారు.“పని కొనసాగించి ప్రాణాలు కాపాడుకోవాలంటే మాకు రూ.32 కోట్లు చెల్లించండి” అని నిందితులు డెవలపర్‌కు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులు ఆస్తి వద్దకు పదేపదే వచ్చి బెదిరింపులకు పాల్పడటంతో బాంద్రా పోలీస్ స్టేషన్లో మరో ఫిర్యాదు నమోదైంది. 2026 ఆగస్టు 24న నిందితులు కంపెనీ బాంద్రా కార్యాలయానికి వెళ్లి దిల్జయ్ ప్రాపర్టీస్ డైరెక్టర్ గగన్ శర్మను కలిసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే తుది హెచ్చరిక అని చెప్పి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కంపెనీపై ఒత్తిడి తెచ్చారు.ఆ తర్వాత రూ.11 కోట్లకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1న తొలి విడతగా రూ.25 లక్షలు ఇవ్వాలని, మిగిలిన మొత్తాన్ని తదుపరి 4 వారాల్లో చెల్లించాలని నిందితులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించిన డెవలపర్ఈ వ్యవహారం మరింత తీవ్రమై ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని భయపడిన డెవలపర్ ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించాడు. రికార్డింగ్‌లు, ఫొటోలు, గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ల ప్రతులతో అధికారులు ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ అనిల్ కుంభారేను కలిసి అధికారిక ఫిర్యాదు చేశారు. ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఈ వ్యవహారాన్ని సున్నితమైన కేసుగా పరిగణించి దర్యాప్తును యాంటీ ఎక్స్టార్షన్ సెల్‌కు అప్పగించారు.పోలీసుల వలలో ఐదుగురు సెప్టెంబర్ 1న ఎథెల్, డేనియల్, వారి సహచరులు రూ.25 లక్షల తొలి విడతను తీసుకునేందుకు డెవలపర్ బాంద్రా కార్యాలయానికి వచ్చారు. దీంతో యాంటీ ఎక్స్టార్షన్ సెల్ వల పన్ని, డబ్బు తీసుకుంటుండగా వారిని అరెస్ట్ చేసింది. వలలో భాగంగా ఏర్పాటు చేసిన డబ్బులో ఎక్కువ భాగం పిల్లలు ఆడుకునే నకిలీ కరెన్సీ. దీని విలువ రూ.24.95 లక్షలు. దాని పైన అసలైన రూ.500 నోట్లు రూ.5,000 విలువ మేర ఉంచారు.ఆ తర్వాత పోలీసులు ఎథెల్ స్టీవెన్, డేనియల్ స్టీవెన్, నసీర్ షేక్, అబ్దుల్లా ఖాన్, రెమీ ఫెర్నాండెజ్‌లను అరెస్ట్ చేశారు. వల పన్నిన సమయంలో ముగ్గురు నిందితులు పట్టుబడగా, ఆ చర్యకు సంబంధించి మరో ఇద్దరిని తర్వాత అరెస్ట్ చేశారు. ఎన్జీవో నిర్వాహకుడు, మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.ఎఫ్ఐఆర్లో 8వ నిందితుడిగా పేర్కొన్న ఎన్జీవో నిర్వాహకుడు క్లెమెంటినస్ ఫారో, టోనీ కోసం క్రైమ్ బ్రాంచ్ గాలింపు చేపట్టింది. అభివృద్ధి ప్రాజెక్టులో అడ్డంకులు సృష్టిస్తామని బెదిరించి తన ఎన్జీవో కోసం రూ.కోటి వసూళ్లుగా ఫారో డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చోటా రాజన్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్విందర్ సింగ్‌కు చెందిన రాజ్‌లక్ష్మి సంస్థ పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఉంది. నిందితులకు ఇతర వ్యక్తులు, గ్యాంగ్‌లతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న సంబంధాలపై పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. -
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ
ఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. సరిహద్దు వివాదాలు, పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. భారత్‌తో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరమన్నారు. అభివృద్ధి అంశాలపైన కలిసి పని చేయాలని.. తరచుగా సమావేశాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ప్రపంచ శాంతికి భారత్ చైనా సంబంధాల బలోపేతం అవసరం. ఇండియా, చైనా దీర్ఘకాలిక సంబంధాలపైన దృష్టి సారించాలి. ప్రపంచశాంతికి భారత్- చైనా సంబంధాల బలోపేతం అవసరం. మన దేశాల బలబలలు అందరికీ తెలుసునని జిన్‌పింగ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమన్నారు. విస్తృతమైన అంశాల పైన ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్న మోదీ.. బ్రిక్స్ అధ్యక్షతకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.తొలి రోజు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఢిల్లీ డిక్లరేషన్‌ను “బ్రిక్స్” శిఖరాగ్ర సదస్సు ఆమోదించింది. శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నట్లు సంయుక్త ప్రకటన చేశాయి. యుద్ధాలు, ఘర్షణలు, సమస్యల మూలాలను పరిష్కరించాలన్న బ్రిక్స్ దేశాలు.. ఏకపక్షంగా సుంకాల విధింపు పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని బ్రిక్స్ దేశాల కూటమి పిలుపునిచ్చాయి.ఇదీ చదవండి: భారత్‌కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది? -
గూగుల్ సీఈఓకు సన్యాసి షాక్.. ఒక్క మాటతో దిమ్మతిరిగే సమాధానం
యవ్వనంలో ఉన్నప్పుడు ఒకే దారిలో నడిచిన ఇద్దరు వ్యక్తులు.. ఒకరు ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యున్నత స్థాయికి చేరితే, మరొకరు పూర్తిగా భిన్నమైన ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. వీరిద్దరూ ఎదురుపడినప్పుడు జరిగిన ఆసక్తికర సంభాషణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజానికి ఈ ఘటన గతంలోనే జరిగినప్పటికీ ఇటీవల కృష్ణాష్టమి జరగడంతో ఇది ఇళ్లీ ఇప్పుడు వైరల్ అవుతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఇస్కాన్ సన్యాసి గౌరంగ దాస్ 1993లో ఐఐటీ పూర్తి చేశారు. సుందర్ పిచాయ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదవగా.. గౌరంగ దాస్ ఐఐటీ బాంబేలో చదివారు. ఇద్దరూ ఒకే సంవత్సరం ఐఐటీలో పట్టభద్రులైనా.. తర్వాత వారి జీవిత ప్రయాణాలు పూర్తిగా భిన్నంగా సాగాయి.సుందర్ పిచాయ్ 1993లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మెటీరియల్స్ సైన్స్, ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ పాఠశాలలో ఎంబీఏ పూర్తి చేశారు. 2004లో గూగుల్‌లో చేరిన పిచాయ్.. గూగుల్ క్రోమ్, క్రోమ్ ఓఎస్ వంటి ఉత్పత్తులపై పనిచేశారు. 2015 ఆగస్టులో గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2019 డిసెంబరులో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా కూడా నియమితుడయ్యారు.మరోవైపు గౌరంగ దాస్ ఐఐటీ బాంబేలో చదువు పూర్తి చేసిన తర్వాత భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. కార్పొరేట్ జీవితాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లారు. అనంతరం సన్యాసిగా మారి ఇస్కాన్‌లో సీనియర్ నాయకుడిగా ఎదిగారు. ఆధ్యాత్మిక విద్య, సామాజిక కార్యక్రమాలు, నాయకత్వ శిక్షణ కార్యక్రమాల్లో ఆయన పనిచేస్తున్నారు.ఏళ్ల తర్వాత సుందర్ పిచాయ్, గౌరంగ దాస్ 2019లో ఆకాశ్ అంబానీ వివాహ వేడుకలో కలుసుకున్నట్లు దాస్ తెలిపారు. ఆ సమావేశం గురించి 2025 జూన్‌లో లండన్‌లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరమ్ కార్యక్రమంలో గౌరంగ దాస్ మాట్లాడారు. పిచాయ్ తనను చూసి ‘‘నాకంటే నువ్వు చిన్నవాడిలా కనిపిస్తున్నావు’’ అని చెప్పినట్లు దాస్ గుర్తుచేసుకున్నారు.దానికి గౌరంగ దాస్ స్పందిస్తూ.. ‘‘మీ వ్యవహారం అంతా గూగుల్‌తో ఉంటుంది.. అది ఒత్తిడిని సృష్టిస్తుంది. నా వ్యవహారం అంతా దేవుడితో ఉంటుంది.. ఆయన ఒత్తిడిని తొలగిస్తాడు’’ అని చెప్పినట్లు తెలిపారు. వారి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ఇద్దరి జీవన మార్గాల మధ్య ఉన్న తేడాను ప్రతిబింబించింది. -
బ్రిక్స్ ప్రారంభోపన్యాసంలో మోదీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: బ్రిక్స్ సదస్సులో తీసుకునే నిర్ణయాల అమలు కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్నే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో భరతమండపం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. వచ్చే 20ఏళ్ల కాలానికి అవసరమైన ఎజెండాను రూపొందించాల్సిన అవసరం ఉందని నిర్ణీత గడువులోగా నిర్ణయాల అమలు కోసం వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.మోదీ మాట్లాడుతూ.. "ప్రస్తుతం గ్లోబల్ సౌత్ అనేక సమస్యలను ఎదుర్కొంటుందని ప్రజల మేలు కోసం దేశాలన్నీ కలిసి పని చేయాల్సి ఉంది ప్రపంచ పరిపాలన మరింత మెరుగుపడాల్సి ఉంది. పరస్పరం గౌరవం, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాం" అని మోదీ అన్నారు. అయితే అంతకుముందు ప్రధాని మోదీ అబూదాబి యువరాజు మహమ్మద్ బిన్ జాయద్ అలీ నహియాన్‌తో హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఇరు దేశాధినేతలు మలేషియా, ఇథీయోపియా దేశాధినేతలతో రక్షణ రంగంలో సహకారం అంశంపై చర్చలు జరిపారు.కాగా మరికోద్దిసేపట్లో సాయంత్రం 5:45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా జిన్‌పింగ్ భారత్ లో అడుగుపెట్టారు. చైనా అధ్యక్షుడితో ఆ దేశానికి చెందిన వ్యాపార ,అధికార ప్రతినిధి బృందంతో ఢిల్లీకి చేరుకుంది. గతంతో పోలిస్తే ఈ సారి పెద్ద మెుత్తంలో అధికార బృందం జిన్‌పింగ్‌తో ఉంది. భారత్‌తో ఆర్థిక వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని చైనా భావిస్తోన్నట్లు సమాచారం. -
భారత్‌కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది?
ఒకేలా కనిపించే రెండు విమానాలు.. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ విమానంలో ఉన్నారో ఎవరికీ తెలియదు.. అత్యాధునిక భద్రతా వ్యవస్థలు.. రహస్య కమ్యూనికేషన్ టెక్నాలజీ, అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ కమాండ్ సెంటర్‌గా మారే సామర్థ్యం.. ఇవన్నీ కలగలిసిన పుతిన్ ‘డూమ్స్‌డే ప్లేన్’ ఇప్పుడు భారత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బ్రిక్స్ సదస్సు కోసం పుతిన్ ఢిల్లీకి చేరుకోవడంతో అసలు ఈ ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’లో ఏముంది అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం విస్తరణపై చర్చించారు. ప్రపంచంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నాయకులలో ఒకరైన రష్యా అధ్యక్షుడు కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ప్రయాణించే విమాన శ్రేణిలో ఒకేలా ఉండే రెండు విమానాలు ఉంటాయి. వాటిలో ఒకటి 'డికాయ్'.. అత్యంత సురక్షితమైన ప్రత్యేక అధ్యక్ష విమానం('ఇల్యుషిన్ IL-96-300PU). దీనినే ఫ్లయింగ్ క్రెమ్లిన్ లేదా డూమ్స్‌డే ప్లేన్ అని కూడా పిలుస్తారు.రష్యా అధ్యక్షుడు ప్రయాణించేందుకు ఒకేలా ఉండే రెండు ఇల్యుషిన్ IL-96-300PU విమానాలను ఉపయోగిస్తారు. రష్యా అధ్యక్షుడు ఏ విమానంలో ఎక్కారనేది ఎవరికీ తెలియకుండా ఉండటానికి ఈ రెండు విమానాలు ఒకేసారి గాల్లోకి ఎగురుతాయి. మాస్కోకు ఈ డబుల్-షీల్డ్ భద్రత కొత్త వ్యూహం కాదు. అదనపు భద్రత కోసం పుతిన్ గతంలో కూడా ఇతర దేశాలకు ఇలాగే ప్రయాణించారు.1980లలో ఇల్యుషిన్ డిజైన్ బ్యూరో చేత అభివృద్ధి చేయబడిన ఈ విమానం.. రష్యా అధ్యక్షుడికి అత్యంత సురక్షితమైన కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లగల నాలుగు ఇంజిన్ల రష్యన్ విమానం ఇది. అత్యంత ప్రమాద పరిస్థితుల నుంచి రష్యా అగ్ర నాయకత్వాన్ని రక్షించేలా దీనిని రూపకల్పన చేశారు. సుదూర ప్రయాణాలు చేసే IL-96 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన ఈ "ఫ్లయింగ్ క్రెమ్లిన్"లో అవిాద్విగటెల్ PS-90A టర్బోఫాన్ ఇంజిన్లు ఉన్నాయి. ఇది ఒకేసారికీ సుమారు 11,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీనివల్ల సుదీర్ఘ ప్రయాణాలలో పదే పదే ఇంధనం నింపాల్సిన అవసరం ఉండదు. ఈ విమానం పొడవు 55.35 మీటర్లు కాగా.. దీని రెక్కల వెడల్పు 60.12 మీటర్లు. అధ్యక్షుడి ప్రయాణాలన్నింటినీ పర్యవేక్షించే రష్యా ప్రత్యేక విమాన స్క్యాడ్రన్ దీనిని నడుపుతుంది.జాతీయ అత్యవసర పరిస్థితుల్లో IL-96-300PU పూర్తి స్థాయి మొబైల్ కమాండ్ సెంటర్‌గా పనిచేయగలదు. ఇది ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సైనిక, నిఘా, ప్రభుత్వ నెట్‌వర్క్‌లను సురక్షితంగా సంప్రదించగల ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను కలిగి ఉంది. ఈ విమానంలో రాడార్-జామింగ్ సాంకేతికత ఉంది. అంతేకాకుండా ఇది అధునాతన రక్షణాత్మక వ్యవస్థలను కలిగి ఉంటుంది. అంతరాయం లేని, సురక్షితమైన సంభాషణను కొనసాగించడానికి శాటిలైట్ లింక్‌లు, రక్షిత రేడియో, డేటా ఛానెల్‌లను కూడా ఇది కలిగి ఉంది.భద్రతతో పాటు, ఈ "ఫ్లయింగ్ క్రెమ్లిన్" విలాసవంతంగా కూడా రూపుదిద్దుకుంది. ఇందులో బెడ్రూమ్లతో కూడిన ప్రైవేట్ ప్రెసిడెన్షియల్ సూట్, విలాసవంతమైన బాత్రూమ్లు, ప్రైవేట్ కిచెన్, డైనింగ్ ఏరియాలు, బోర్డ్‌రూమ్ సీటింగ్‌తో కూడిన పెద్ద సమావేశ మందిరం ఉన్నాయి. ఇవి కాకుండా ఈ విమానంలో బంగారంతో పూత పూసిన ఫిట్టింగ్‌లు, ఆకర్షణీయమైన కలప, ప్రీమియం లెదర్, అప్హోల్స్టరీ తదితర విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. ఇదీ చదవండి: జైలులో తనిఖీలు.. ఫోన్‌తో దొరికేసిన ప్రజ్వల్ రేవణ్ణ -
అంతర్జాతీయ ఖ్యాతి.. అద్భుత ఆకృతి
ఢిల్లీ: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ అతిథ్యమివ్వడంతో ప్రపంచ దేశాధినేతలు భారత్‌కు తరలివచ్చారు. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి భారత్‌పై పడింది. ఈ నేపథ్యంలో ఈ అంతర్జాతీయ శిఖరాగ్రసదస్సుకు ఆతిథ్యమిస్తున్న భరతమండపం ప్రత్యేకతలు ఏంటి..దానిని ఎప్పుడు నిర్మించారు. అనే వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ప్రపంచ దేశాల అగ్రనేతలు హాజరవుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 2026 బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు భారత్ రాజధాని న్యూఢిల్లీ వేదికైంది. ఈ వార్షిక సదస్సు కోసం దేశ నడిబొడ్డున ఉన్న అత్యాధునిక 'భారత్ మండపం' సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే ఇది వరకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సహా పలువురు ప్రపంచ స్థాయి నాయకులు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.భరత మండపం నిర్మాణంప్రగతి మైదాన్ కాంప్లెక్స్‌లో 123 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,700 కోట్ల వ్యయంతో ఈ వేదికను నిర్మించారు. 2023లో ప్రారంభమైన ఈ సముదాయం నేడు భారతదేశ ఆతిథ్య సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది. 12వ శతాబ్దపు 'అనుభవ మండపం' స్ఫూర్తితో దీనికి 'భారత్ మండపం' అని నామకరణం చేశారు.నటరాజ విగ్రహం ప్రత్యేకతఈ సముదాయంలో ఏర్పాటు చేసిన 27 అడుగుల ఎత్తు, 18 టన్నుల బరువు కలిగిన భారీ నటరాజ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అష్టధాతువులతో తమిళనాడు శిల్పులు దీనిని అద్భుతంగా మలిచారు. ప్రధాన సమావేశ మందిరం భవనం 'శంఖం' ఆకారంలో రూపొందించబడింది. ఇది చేతన శక్తిని, శుభారంభాన్ని సూచిస్తుంది. సూర్య శక్తి, జీరో నుంచి ఇస్రో సాధించిన ప్రయాణం, పంచ మహాభూతాల ప్రాముఖ్యతను తెలిపేలా దీని లోపలి బయటి డిజైన్లు భారతీయ నాగరికతను ప్రతిబింబిస్తున్నాయి.భారత్ మండపంలో వివిధ హాళ్లు150 దేశాల ప్రతినిధులకు సరిపడే సామర్థ్యం ఉన్న ఈ హాలులో కీలకమైన ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ నిర్వహించిన 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమం ఇక్కడే జరిగింది. డ్రోన్ టెక్నాలజీతో పాటు భారత్ సాధించిన నూతన సాంకేతిక ఆవిష్కరణలను ప్రపంచానికి చాటిచెప్పారు.హాల్ నెం. 14: బ్రిక్స్ బిజినెస్ ఫోరం సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొనే ఈ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాపార వర్గాలనుద్దేశించి ప్రసంగించనున్నారు.హాల్ నెం. 5: ప్రపంచ వ్యాప్తంగా విచ్చేసిన సుమారు 1,200 నుంచి 1,400 మంది జర్నలిస్టుల కోసం ఇంటర్నేషనల్ మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు.ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య సంక్షోభాలు, ఉగ్రవాద నిరోధక విధానాలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సవాళ్లపై ప్రపంచ నేతలు చర్చిస్తున్నారు. అలాగే బ్రిక్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విధానాలను చర్చించనున్నారు.కట్టుదిట్టమైన భద్రతభారత్ మండపంలో భద్రతా వ్యవస్థ అత్యంత అత్యాధునిక సాంకేతికతతో, అభేద్యమైన కోటను తలపించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడింది. అంతర్జాతీయ సదస్సులు జరిగే సమయంలో ఇక్కడ శత్రు దుర్భేద్యమైన మల్టీ-లేయర్డ్ (బహుళ అంచెల) భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంగణంలోని ప్రధాన సెక్యూరిటీ ప్రత్యేకతలు భారత్ మండపం చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల మేర బహుళ అంచెల భద్రతా వలయం ఉంటుంది. ఔటర్ రింగ్‌లో ఢిల్లీ పోలీస్ మరియు పారామిలటరీ బలగాలు కాపలా ఉంటే, అంతర్గత కోర్ జోన్లో (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండోలతో పాటు ప్రత్యేక దళాలు మోహరిస్తాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నైజేషన్: ఇక్కడి నిఘా వ్యవస్థలో AI సాంకేతికతను ఉపయోగిస్తారు. హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనుసంధానించబడి ఉంటుంది. ఇది అనుమానాస్పద వ్యక్తులను లేదా నేరస్థుల డేటాబేస్‌లో ఉన్న ముఖాలను క్రౌడ్‌లో సైతం క్షణాల్లో గుర్తించి అలర్ట్ చేస్తుంది.డ్రోన్ సిస్టమ్స్ ఆకాశ మార్గం నుండి ఎలాంటి ముప్పు రాకుండా భవనం చుట్టూ అత్యాధునిక యాంటీ-డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్స్ అప్రమత్తంగా ఉంటాయి. అనుమతి లేని ఏ డ్రోన్ లేదా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అయినా ఈ పరిధిలోకి వస్తే వాటిని జామ్ చేయడం లేదా కూల్చివేయడం జరుగుతుంది. ఇలా భరతమండపంకు ఆధునాతనమైన ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. -
జొమాటో కస్టమర్ల నెత్తిన పిడుగు, భారీ షాకిచ్చిందిగా!
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో (Zomato) తన వినియోగ దారుల నెత్తిన భారీ పిడుగు వేసింది. 'క్యాష్ ఆన్ డెలివరీ' (COD) ఎంచుకునే వినియోగదారులకు అదనంగా రూ.5 వసూళ్లను షురూ చేసి కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే వినియోగదారులపై మోపుతున్న ఛార్జీల బాదుడుకు మరో వడ్డన తోడైంది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం జొమాటోను సొంతం చేసుకున్న ‘ఎటర్నల్’ (Eternal) సంస్థ, తమ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లో క్యాష్ ఆన్ డెలివరీ (Cash on Delivery) ఎంచుకునే వినియోగదారులపై అదనంగా ఈ ఫీజును వసూలు చేయనుంది.ఈ కొత్త “పే ఆన్ డెలివరీ ఫీజు” (Pay on delivery fee) జొమాటో బిల్లు వివరాలలో ప్రత్యేక లైన్ ఐటమ్‌గా కనిపిస్తోంది. ఆహారం ఇంటికి వచ్చాక నగదు రూపంలో చెల్లించే (CoD) ఆర్డర్లపై ఈ రుసుము విధిస్తుస్తోంది.. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఫీజు రూ. 7 నుండి రూ. 20 వరకు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ రుసుము జొమాటో ఇప్పటికే వసూలు చేస్తున్న ప్లాట్‌ఫామ్ ఫీజు, రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జీలు , GST కి అదనమైనది. ఆన్లైన్లో చెల్లించే వారికి ఈ ఫీజు వర్తించదు, కేవలం క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్న వినియోగదారులు మాత్రమే ఈ అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: రూ. 250లతో చెట్టు కింద ఉచిత స్కూలు: KBC 18 కంటెస్టెంట్ ఇంట్రస్టింగ్ స్టోరీఇప్పటికే ప్లాట్‌ఫామ్ ఫీజు కింద ప్రతి ఆర్డర్‌పై రూ. 14.99 వరకు వసూలు చేస్తున్న జొమాటో రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జీలు, జీఎస్టీ వాయింపునకు తోడుఈ సీఓడీ ఫీజు అదనం. ప్రస్తుత లెక్కల ప్రకారం జొమాటో రోజుకు సగటున 2.3 నుండి 2.5 మిలియన్ల (23-25 లక్షల) ఆర్డర్లను ప్రాసెస్ చేస్తుంది. తాజా పెంపుతో కంపెనీకి ఏడాదికి వందల కోట్ల అదనపు ఆదాయాన్ని దండుకోనుంది. ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ తీవ్రమవుతున్న సమయంలో జొమాటో ఈ నిర్ణయం తీసుకుంది. రాపిడోకి చెందిన ‘ఓన్లీ’ (Ownly) ఆదరణ పొందుతుండటం, ఫ్లిప్‌కార్ట్ ‘ఈట్ ఇన్’ (Eat In) పేరుతో ఫుడ్ డెలివరీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించడం మరియు ‘స్విష్’ (Swish) వంటి స్టార్టప్‌లు కొత్తగా నిధులు సమకూర్చుకోవడంతో జొమాటో, స్విగ్గీ వంటి దిగ్గజాలపై పోటీ ఒత్తిడి పెరుగుతోందంటున్నారు మార్కెట్ నిపుణులు.ఇదీ చదవండి: నేనో పెద్ద ప్రకటన చేయబోతున్నా : కేజ్రీవాల్ ట్వీట్ వైరల్ -
జైలులో తనిఖీలు.. ఫోన్‌తో దొరికేసిన ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు: లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జనతాదళ్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లో డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ప్రజ్వల్ రేవణ్ణ ఉన్నారు. ఆగస్టు 11న క్రైమ్ బ్రాంచ్ అధికారులు జరిపిన ఆకస్మిక దాడిలో రేవణ్ణ మొబైల్ ఫోన్ వాడుతున్నట్లు గుర్తించారు. అలాగే.. ప్రజ్వల్ ఉంటున్న హై సెక్యూరిటీ బ్యారెక్ నుంచి ఛార్జర్, పెన్ డ్రైవ్, నోట్‌బుక్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్, పెన్ డ్రైవ్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపగా.. ఫోన్లో డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు, పెన్ డ్రైవ్‌లో వెబ్ సిరీస్‌లు ఉన్నట్లు తేలింది.ఫోన్లో వాట్సాప్, వీడియో కాల్స్ జరిగినట్లు కాల్ రికార్డుల పోలీసుల పరిశీలనలో తేలింది. పలువురు మహిళలతో సంప్రదింపులు జరిగినట్లు కూడా గుర్తించారు. బెంగళూరు సెంట్రల్ జైలులో 'వీఐపి' ఖైదీలకు అందుతున్న ప్రత్యేక సౌకర్యాల అంశంపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి.. ఆ లైంగిక దాడికి సంబంధించిన వీడియోలను సర్క్యులేట్ చేసిన కేసులో రేవణ్ణ గత ఏడాది దోషిగా తేలాడు.హాసన్ జిల్లా హోళేనరసీపురలోని రేవన్న కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్‌లో డొమెస్టిక్ హెల్ప్‌గా పనిచేస్తున్న ఆ బాధితురాలు.. 2021 నుంచి ప్రజ్వల్ రేవణ్ణ తనపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఆ దృశ్యాలను వీడియో రికార్డు చేసిన రేవణ్ణ.. ఎవరికైనా చెబితే ఆ వీడియోలను విడుదల చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. రేవణ్ణ సెల్ నుంచి ఫోన్ లభ్యం కావడంతో అధికారులు ఓ జైలు అధికారిని సస్పెండ్ చేసి దర్యాప్తునకు ఆదేశించారు. జైళ్లలో వ్యక్తిగత మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలను పూర్తిగా నిషేధించారు. కేవలం గట్టి నిఘా ఉన్న ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్లైన్లు, పబ్లిక్ కాల్ ఆఫీసులు, నిర్దేశిత వీడియో-కాలింగ్ సిస్టమ్‌ల ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ అనుమతిస్తారు.ఇదీ చదవండి: భార్య.. భర్త.. ప్రియుడు.. ముగ్గురూ మంచోళ్లే! -
రూ. 250లతో చెట్టు కింద ఉచిత స్కూలు: KBC 18 కంటెస్టెంట్ ఇంట్రస్టింగ్ స్టోరీ
అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి 18' గురువారం ఎపిసోడ్లో, ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన రోల్ఓవర్ కంటెస్టెంట్ 27 ఏళ్ల ఉద్దేశ్య సచన్ రూ. 25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నంలో విఫలమై, రూ. 12.5 లక్షల నగదు బహుమతితో గేమ్‌నుంచి నిష్క్రమించారు. అయితే ఈ ఎపిసోడ్ సందర్భంగా ఉద్దేశ్య వెల్లడించిన వివరాలు నెట్టింట విశేషంగా నిలిచాయి.కాన్పూర్‌లో పేద పిల్లల కోసం ఒక పాఠశాలను నడుపుతున్నానని, అక్కడ 400 మంది పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నానని ఉద్దేశ్య సచన్ చెప్పారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం తన తల్లి వద్ద రూ. 250 అప్పుగా తీసుకుని ఒక చెట్టు కింద కొద్దిమంది పిల్లలకు పాఠాలు చెప్పడం ద్వారా ఈ పాఠశాలను ప్రారంభించారు. గత కొన్నేళ్లలో ఈ పాఠశాల విస్తరించి, ప్రస్తుతం సొంత భవనాన్ని కలిగి ఉంది. 12వ తరగతి వరకు పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఫీజులు లేకుండా మరింత మంది పిల్లలకు విద్యను అందించడానికి దీనిని ఇంకా విస్తరించాలని ఆయన భావిస్తున్నారు.ఇదీ చదవండి: నేనో పెద్ద ప్రకటన చేయబోతున్నా : కేజ్రీవాల్ ట్వీట్ వైరల్విద్యావ్యవస్థ చాలా ఖరీదైనదిగా మారిందని, పేద పిల్లలు చదువుకోలేకపోతున్నారనే ఈ పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. వీరిలో చాలామంది పిల్లలు సమీపంలోని మురికివాడల (స్లమ్స్) నుండి వస్తారు. దీని ద్వారా తనకు ఎలాంటి ఆదాయం రాదని, తన ప్రాథమిక అవసరాలైన ఆహారం, నివాసం తన అన్నయ్య చూసుకుంటారని తెలిపారు.కాగా ఉద్దేశ్య తండ్రి దర్జీగా (టైలర్) పనిచేస్తూ నెలకు రూ. 4000-5000 మాత్రమే సంపాదించేవారు. విద్యుత్ షాక్ కారణంగా ఆయన తల్లి అనారోగ్యానికి గురైన తర్వాత కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. తండ్రి ఫీజు చెల్లించలేకపోవడంతో ఉద్దేశ్యను 6 - 9 ఏళ్ల వయస్సులో రెండుసార్లు పాఠశాల నుండి పంపించివేశారు. ఫీజులు చెల్లించనందుకు పాఠశాల ఉపాధ్యాయులు ఆయన తల్లిదండ్రులను తరచూ అవమానించేవారని గుర్తు చేసుకున్నారు. ఆ వయసులోనే అయన అనుభవించిన అవమానాలు, మానసిక క్షోభే ఈనాటి ఉచిత విద్యకు పునాది అని చెప్పారు.ఇదీ చదవండి : నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్రూ. 250తో స్కూలుకు నాంది పడిందిలా ధాబా, కేఫ్ ,కొన్ని కర్మాగారాల్లో (ఫ్యాక్టరీలు) చిన్న చిన్న పనులు చేస్తూ, తండ్రి సహాయంతో తన చదువును పూర్తి చేశారు. అయితే తనలాంటి పిల్లలు ఇంకా చాలామంది ఉంటారని గ్రహించి, వారి జీవితాలను మార్చడానికి విద్య ఒక్కటే మార్గమని నమ్మి ఈ దిశగా అడుగులు వేశారు.తన తల్లి వద్ద రూ. 250 అప్పుగా తీసుకుని స్థానికంగా ప్రచారం చేయడానికి కొన్ని పాంప్లెట్లు ప్రింట్ చేయించి పాఠశాలను ప్రారంభించినట్లు ఉద్దేశ్య చెప్పారు. ప్రారంభ రోజుల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి పిల్లలను చదువుకోవడానికి ప్రోత్సహించేవారు. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ఆయన పాఠశాలకు విరాళాలు ఇచ్చారు. నటుడు ఆర్. మాధవన్ దీనిపై ఒక పోస్ట్ షేర్ చేసినప్పుడు పాఠశాలకు భారీగా విరాళాలు వచ్చాయి. ఇది విన్న అమితాబ్ బచ్చన్ కూడా తన సోషల్ మీడియా ద్వారా ఈ పాఠశాల గురించి ప్రచారం చేస్తానని ప్రకటించారు.KBC 18లో ఉద్దేశ్య ఎదుర్కొన్న రూ. 25 లక్షల ప్రశ్న: ఏ ప్రాచీన భారతీయ పాలకుడిని 'అమిత్రఘాత' అనే బిరుదుతో కూడా పిలిచేవారు?ఆప్షన్లు: సమ్రాట్ అశోకుడు, బింబిసారుడు, సముద్రగుప్తుడు, బిందుసారుడుఉద్దేశ్య 'మహాఫ్లిప్' లైఫ్‌లైన్ ఉపయోగించిన తర్వాత ఈ ప్రశ్న వచ్చింది. దీని సమాధానంపై కూడా ఆయనకు స్పష్టత లేకపోవడంతో 50:50 లైఫ్‌లైన్ ఎంచుకున్నారు. లైఫ్‌లైన్ తర్వాత తెరపై మిగిలిన రెండు ఆప్షన్లు: బింబిసారుడు , బిందుసారుడు.సరియైన సమాధానం తెలియకపోవడంతో, ఆయన గేమ్‌ను క్విట్ చేసి క్విట్ చేసిన తర్వాత, ఊహించి ఒక సమాధానం చెప్పమని కోరగా, ఆయన 'బిందుసారుడు' అని చెప్పారు. నిజానికి అదే సరైన సమాధానం.‘అమిత్రఘాత’ అంటేమగధను పాలించిన మౌర్య సామ్రాజ్య రెండవ చక్రవర్తి బిందుసారుడిని 'అమిత్రఘాత' అని పిలిచేవారు. బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుని కుమారుడు, అలాగే మౌర్య సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధ పాలకుడైన అశోకుడి తండ్రి. బిందుసారుడి పాలన క్రీ.పూ. 297 నుండి క్రీ.పూ. 273 వరకు కొనసాగింది. ఈ పేరు 'అమిత్ర' (శత్రువు), 'ఘాత' (సంహారకుడు) అనే పదాల కలయికతో ఏర్పడింది. అంటే "శత్రు సంహారకుడు" అని అర్థం. విశేషమేమిటంటే, ప్రాచీన గ్రీకు రచయిత స్ట్రాబో ఆయనను 'అమిట్రోచేట్స్' (Amitrochates) అని పిలిచారు, సంస్కృత పదం,అమిత్రఘాతను గ్రీకులో 'అమిట్రోచేట్స్ అంటారు. -
భారత్‌కు కీలక దౌత్య విజయం.. న్యూఢిల్లీ డిక్లరేషన్కుఆమోదం
భారత్ ఆతిథ్యంగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సు వేళ భారత్‌కు దౌత్య పరంగా కీలక విజయం లభించింది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో సభ్యదేశాలన్నీ *"న్యూఢిల్లీ డిక్లరేషన్"*కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. గతంలో పశ్చిమాసియా యుద్ధంపై విభేదాల కారణంగా విదేశాంగ మంత్రుల సమావేశంలో ఉమ్మడి ప్రకటన వెలువడకపోయినా, ఈసారి నాయకుల స్థాయిలో ఏకాభిప్రాయం వెలువడనుంది.న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో అత్యంత ప్రధాన సందేశంగా "సంభాషణ (Dialogue), దౌత్యం (Diplomacy) ద్వారానే వివాదాలకు పరిష్కారం" అనే సూత్రాన్ని పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ ఘర్షణల నేపథ్యంలో ఇదే భారత్ నిరంతరం చెబుతున్న వైఖరిని ప్రధాని మోదీ పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన వెలువడింది. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ప్రధాన అంశాలుఅంతర్జాతీయ వివాదాలకు యుద్ధం కంటే చర్చలు, దౌత్యమే పరిష్కార మార్గమని స్పష్టం.ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండిస్తూ దానికి ఎలాంటి సమర్థన ఉండదని పునరుద్ఘాటింపు.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ పాలనా వ్యవస్థల్లో సమగ్ర సంస్కరణలకు మద్దతు.అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ నిర్ణయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్.వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, డిజిటల్ సహకారం, ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థలపై సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే నిర్ణయం.బ్రిక్స్ విస్తరణ తర్వాత ఇరాన్–యూఏఈ వంటి విభేదాలున్న దేశాలను ఒకే ప్రకటనపై ఏకాభిప్రాయానికి తీసుకురావడం భారత్ అధ్యక్షతకు పెద్ద పరీక్షగా నిలిచింది. అయినప్పటికీ ఈ పరీక్షలో సభ్యదేశాలన్నిటినీ ఏకతాటిపైకి తేవడం దౌత్య పరంగా భారత్‌కు కీలక విజయం.బ్రిక్స్ నాయకుల సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీ డిక్లరేషన్‌తో కూడిన ఉమ్మడి ప్రకటన అధికారికంగా విడుదల కానుంది. ఇందులో భారత్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వానికి మద్దతు, బహుపాక్షిక ప్రపంచ వ్యవస్థ బలోపేతంపై కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉండనున్నట్లు సమాచారం. -
నెక్ట్స్ మిషన్ ప్రకటించిన బిట్టూ భాయ్
ఒక నది బాగుపడాలంటే అధికారులు రావాలి.. భారీ నిధులు కేటాయించాలి.. పెద్ద సంఖ్యలో సిబ్బంది పనిచేయాలి. కానీ 20 ఏళ్ల యువకుడు మాత్రం ఇవేవీ లేకుండానే ఓ నదిని శుభ్రం చేసి చూపించాడు. నెలల తరబడి ఒంటరిగా శ్రమిస్తూ ప్లాస్టిక్, చెత్తాచెదారం తొలగించి అజ్నార్ నదికి కొత్త రూపు తీసుకొచ్చాడు. సోషల్ మీడియాలో అతడి పని వైరల్ కావడంతో ఆపై ఏకంగా అంతర్జాతీయ పర్యావరణ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్ అందుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి కార్యాచరణ సైతం ప్రకటించేశాడు..మధ్యప్రదేశ్‌కు చెందిన బిట్టూ తబాహీ అసలు పేరు సురేంద్ర సింగ్ చౌధరి. అజ్నార్ నది కాలుష్యంతో నిండిపోవడాన్ని చూసిన అతడు.. సమస్య గురించి మాట్లాడటంతో ఆగిపోలేదు. స్వయంగా రంగంలోకి దిగి నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించడం మొదలుపెట్టాడు. అవసరమైన ప్రాథమిక సామగ్రిని తన సొంత డబ్బుతో సమకూర్చుకుంటూ.. ఎవరూ తోడుగా లేకపోయినా పదేపదే నది వద్దకు వెళ్లి శుభ్రం చేస్తూ వచ్చాడు.మార్పును వీడియోలుగా..నది శుభ్రం చేసే ముందు పరిస్థితి ఎలా ఉంది.. తాను శ్రమించిన తర్వాత ఎలా మారింది అన్న విషయాలను బిట్టూ సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పంచుకున్నాడు. తొలుత స్థానికంగా కనిపించిన ఈ ప్రయత్నం క్రమంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. చెత్తతో నిండిన నది ప్రాంతాన్ని స్వయంగా శుభ్రం చేస్తున్న అతడి వీడియోలు వైరల్ కావడంతో బిట్టూ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది.డచ్ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్..బిట్టూ చేసిన పని చివరకు ‘ది ఓషన్ క్లీన్అప్’ దృష్టిని కూడా ఆకర్షించింది. డచ్ పర్యావరణవేత్త బోయన్ స్లాట్ స్థాపించిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, నదుల్లోని ప్లాస్టిక్ కాలుష్యాన్ని తొలగించేందుకు పనిచేస్తోంది. బిట్టూ కృషిని గుర్తించిన సంస్థ అతడికి ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో అతడికి మరింతగా అభినందనలు వెల్లువెత్తాయి.‘తర్వాత ఏ రాష్ట్రానికి రావాలి?’..ఉద్యోగ ఆఫర్ వచ్చిన తర్వాత బిట్టూ సోషల్ మీడియాలో మరో వీడియోను షేర్ చేశాడు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన అతడు.. ఇక తర్వాత ఏ రాష్ట్రానికి వెళ్లి శుభ్రత కార్యక్రమం చేపట్టాలని అడిగాడు. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి నదులు, పరిసరాలను శుభ్రం చేయాలనే తన ఆలోచనను వెల్లడించాడు.దీంతో నెటిజన్లు కూడా పెద్ద సంఖ్యలో స్పందించారు. బిహార్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల పేర్లను సూచిస్తూ కామెంట్లు చేస్తున్నారు. తమ ప్రాంతాల్లోనూ ఇలాంటి శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు.కొసమెరుపు.. బిట్టూ శుభ్రం చేసిన అజ్నార్ నది మళ్లీ కాలుష్యం బారిన పడడం ప్రారంభమైంది. కొందరు చెత్తాచెదారం అందులో వేయడం.. వాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో కొందరు యువకులు అక్కడ గస్తీ కాస్తూ బిట్టూ కష్టం వృథా కానివ్వకుండా కాపాడుకుంటున్నారు. -
గణపతి ఉత్సవాలకు కార్పొరేట్ హంగులు
ముంబై: మహానగరం ముంబైలోని ప్రముఖ గణపతి మండపాలకు కార్పొరేట్ సంస్థల సహకారం అంతకంతకు పెరుగుతోంది. ముంబయిలో ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా రాజా, చించ్పోక్లీచా చింతామణి మండపాలు ఈ వరుసలో ముందున్నాయి. ఈ ఏడాది చించ్పోక్లీచా చింతామణికి అదానీ గ్రూప్ సహకారం అందిస్తున్నది. గత ఏడాది అనంత్ అంబానీ లాల్బాగ్చా రాజా మండలిలో అధికారికంగా చేరారు. ప్రముఖ మండపాలతో అనుబంధం ద్వారా కార్పొరేట్ కంపెనీలు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి.లాల్బాగ్చా రాజా మండపానికి ఉన్న విస్తృత ప్రజాదరణ, ప్రముఖుల సందర్శనలను తమ ప్రచారానికి అనువుగా కార్పొరేట్ కంపెనీలు మలచుకుంటున్నాయి. అదానీ గ్రూప్ నుంచి రూ.3.5 కోట్లు పొందిన చింతామణి మండపం మరింత వ్యవస్థీకృత విధానాన్ని అనుసరిస్తోంది. అర కిలోమీటరు పొడవైన ప్రత్యేక ప్రచార ప్రాంతాన్ని ఏర్పాటు చేసి, సొంత మార్కెటింగ్ బృందాన్ని నియమించింది. తొలిసారిగా ఎల్ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేసింది. ఉత్సవానికి ముందే చింతామణి విగ్రహం ఆగమన్‌కు పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు ప్రచారం చేయడంతో భారీగా జనం తరలివచ్చారు.లాల్బాగ్చా రాజా వద్ద సర్దార్ హోటల్ నుంచి కాలాచౌకీ పోలీస్ స్టేషన్ వరకు ప్రధాన రహదారులపై బ్రాండింగ్ కేంద్రీకృతమైంది. భారీగా భక్తులు వచ్చే ప్రాంతాల్లో స్పాన్సర్ల బ్రాండింగ్‌ను ఏర్పాటు చేశారు. చింతామణి మండపంలో నిర్వాహకులే ప్రచార సందేశాలు, కంటెంట్‌ను నిర్వహిస్తూ భక్తుల భాగస్వామ్యం, స్పాన్సర్లకు కనిపించే స్థాయికి ప్రాధాన్యమిస్తున్నారు. చింతామణితో అనుబంధం తమకు గౌరవప్రదంగా ఉందని అదానీ ప్రతినిధి తెలిపారు. భక్తుల భద్రత, జనసమూహాల నిర్వహణపైనే తమ దృష్టి ఉందని, అదే సమయంలో చింతామణి సంప్రదాయాలను గౌరవిస్తూ, పరిరక్షిస్తున్నామని చెప్పారు.విగ్రహాల వద్దకు వెళ్లే రహదారులు, సందులు కూడా ప్రకటనల స్థలాలుగా మారుతున్నాయి. గణేశోత్సవ సమయంలో లక్షలాది భక్తుల కోసం ప్రత్యేక దర్శన మార్గాలు, బ్యారికేడ్లు, ప్రజలకు అందుబాటులో ఉండే మార్గాలకు అనుమతులు తీసుకుంటారు. ఈ మార్గాల్లోని బ్యారికేడ్లు, స్వాగత తోరణాలు, బ్యానర్లు, దిశానిర్దేశక బోర్డులు తదితరాలు స్పాన్సర్‌షిప్‌లో భాగమవుతున్నాయి. క్యూల్లో గంటల తరబడి వేచి ఉండే భక్తులు ప్రకటనదారులకు ఒకే చోట లభించే వినియోగదారులుగా మారుతున్నారని, జనసందోహం పెరిగే కొద్దీ ఈ ప్రాంతాల వాణిజ్య విలువ కూడా పెరుగుతోందని స్పాన్సర్‌షిప్‌తో సంబంధం ఉన్న వ్యక్తి తెలిపారు.స్పాన్సర్ల ప్రాధాన్యం పెరుగుతుండటంపై ఉత్సవ నిర్వాహకుల్లో చర్చ మొదలైంది. వాణిజ్య భాగస్వామ్యం ఉత్సవ స్వభావాన్ని మార్చడం లేదని, భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించేందుకు పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కొనేందుకు ఇది అవసరమని నిర్వాహకులు చెబుతున్నారు. అయినప్పటికీ సంప్రదాయానికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని, ఆచారాలు, పూజా విధానాలు, ఉత్సవ నిర్ణయాలు సంప్రదాయాలు, విలువల ప్రకారమే కొనసాగుతాయని తెలిపారు.ఇదీ చదవండి: నీమ్ కరోలీ బాబా: ఈ నాలుగు బోధనలతో జీవితం ప్రశాంతం -
‘నేనో పెద్ద ప్రకటన చేయబోతున్నా’ : కేజ్రీవాల్ ట్వీట్ వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం సంచలన ప్రకటన చేశారు. గోవాకు వెడుతున్నా.. పెద్ద ప్రకటన రానుంది అంటూ ట్వీట్ చేశారు. 2027 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ చేయనున్న కీలక ప్రకటన ఏమిటా అన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది. కేజ్రీవాల్ రాకకు ముందు, స్థానికంగా, ఆప్ గోవా ఫార్వార్డ్ పార్టీ (GFP)లకు సంబంధించిన హోర్డింగ్‌లు దర్శనమివ్వడంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.తాను గోవా పర్యటనకు వెళ్తున్నట్లు వెల్లడిండిన కేజ్రీవాల్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించలేదు. రానున్న గోవా ఎన్నికల నేపథ్యంలోఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇలా ఉంటే "మిమ్మల్ని మూడవసారి మోసం చేయనివ్వకండి" అనే స్లోగన్స్‌తో స్థానికంగా వెలసిన హోర్డింగ్‌లలో రెండు పార్టీల చిహ్నాలు ఉన్నాయి. 2027 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, విజయ్ సర్దేశాయి నేతృత్వంలోని GFP మధ్య ఎన్నికల పూర్వ పొత్తు ఉండవచ్చనే చర్చకు ఇది ఆజ్యం పోసింది.ఆదివారం జరగనున్న విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ ప్రసంగించనున్నారని, ఆ సందర్భంగా రెండు పార్టీల మధ్య పొత్తును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెందిన ఒక సీనియర్ నేత తెలిపారు. అంతేకాదు ఈ పొత్తును బీజేపీ,కాంగ్రెస్ రెండింటికీ ప్రత్యామ్నాయంగా ఉండబోతోందని కూడా పేర్కొన్నారు.అలాగే శ్రీ గురుసాహిబ్ జీ సదా మనకు తోడుగా ఉంటూ, ప్రతి అడుగులోనూ మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అంటూ మరో ట్వీట్ చేశారు కేజ్రీవాల్. Am going to Goa today to make a very big announcement.— Arvind Kejriwal (@ArvindKejriwal) September 12, 2026ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్కాగా గోవా శాసనసభ ఎన్నికలు 2027 మార్చిలోపు జరగాల్సి ఉంది. ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయిన ఆప్ అధినేత గోవాలొ అధికారి పీఠాన్ని దక్కించుకోవాలని పథక రచన చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే కొన్ని హామీలను గుప్పించారు కూడా. గోవాలో ఆద్మీ పార్టీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లోగా E20 పెట్రోల్ బ్యాన్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒక వేళ తాము ఈ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైతే రాజికీయాలనుంచి తప్పుకుంటానని కూడా ప్రకటించారు. E20 పెట్రోల్ కారణంగా వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనీ, E20 వల్లే చక్కెర ధరలూ పెరుగుతున్నాయని ఆరోపిస్తున్న ఆప్ E20పై జాతీయ ప్రచారాన్ని కూడా చేపట్టింది.ఇదీ చదవండి : నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్ -
నీమ్ కరోలీ బాబా: ఈ నాలుగు బోధనలతో జీవితం ప్రశాంతం
‘హనుమాన్ అంశ్’.. హిందీ సినిమా విడుదలైన తరువాత చాలామంది నీమ్ కరోలీ బాబా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. నీమ్ కరోలి బాబా.. మహరాజ్ జీగా కూడా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గురువు. ఆయన లోతైన ఆధ్యాత్మిక బోధనలను ఎంతో ప్రశాంతతను అందిస్తాయని పలువురు చెబుతుంటారు. కష్టాలను ఎదుర్కొనే సమయంలో.. జీవితంలోని సత్యాలను అంగీకరించడంపై ఆయన బోధనలు ప్రధానంగా దృష్టి సారించాయి. నిజాయతీగా జీవించడం, క్షమించడం ఎంతో ముఖ్యమని ఆయన నొక్కిచెప్పారు. భౌతిక వస్తువులన్నీ శాశ్వతం కాదని, దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనదని మహరాజ్ జీ వివరించారు. ఈ బోధనలు అంతర్గత ప్రశాంతతను అందించడంతోపాటు ప్రతికూల పరిస్థితులను తట్టుకునే సామర్థ్యానికి దోహదపడతాయి.నీమ్ కరోలీ బాబా తన మాటలు, చేతలతో కోట్లాది మంది హృదయాలను ప్రభావితం చేశారు. ‘మిరాకిల్ బాబా’గా కూడా పేరొందిన ఈయన.. హనుమంతుడి భక్తుడు. జీవితంలోని అత్యంత కఠినమైన సవాళ్లను అధిగమించేందుకు సహాయపడే నాలుగు శక్తివంతమైన నీమ్ కరోలీ బాబా బోధనలు ఇవే..1. ‘మీరు బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా ఏదైనా అంత్యక్రియలను చూసినప్పుడు.. జీవిత సత్యాలను వాస్తవంగా నేర్చుకుంటారు’ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఎదురవుతుంటాయి. ఇది విశ్వంలోని సహజ నియమం. కొన్నిసార్లు వర్షం పడుతుంది.. మరికొన్నిసార్లు ఎండ కాస్తుంది. కష్టాలను ఎదుగుదలకు అవకాశాలుగా మార్చుకునే నైపుణ్యాన్ని అలవర్చుకోవడం ఇక్కడ కీలకమైనది. కఠిన పరిస్థితులను జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సత్యాలను నేర్చుకునే కాలంగా పరిగణించాలని నీమ్ కరోలీ బాబా చెప్పారు. ఆధునిక మనస్తత్వశాస్త్రంలో ఈ వైఖరినే ‘మానసిక స్థైర్యం’గా పిలుస్తారు.2. ‘సంపూర్ణ నిజాయితీ, సత్యం అత్యవసరం. మీరు చెప్పిన దాని ప్రకారమే జీవించాలి’ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగేందుకు మనం పెంపొందించుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణాల్లో నిజాయతీ ఒకటి. దాచాల్సిన విషయం ఏదైనా ఉన్నప్పుడు మనుషులు భయపడతారు. మీతో మీరు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు నిజం చెప్పడం ప్రారంభించినప్పుడు.. వెలుగు వచ్చిన వెంటనే చీకటి మాయమైనట్లుగా భయం కూడా మీ నుంచి దూరమవుతున్న అనుభూతి కలుగుతుంది. ఈ ప్రపంచంలో సత్యమే గొప్ప శక్తి. ఈ వెలుగును ఎప్పటికీ వదులుకోవద్దు.3. ‘క్షమించడమే గొప్ప ఆయుధం. ఎందుకంటే ఆ ఆయుధం కలిగిన వ్యక్తి చలించనివాడిగా ఉంటాడు. అతను వెంటనే కోపాన్ని వదులుకోగలుగుతాడు’ద్వేషం, పగ, అసూయ మొదలైనవి మన ప్రశాంతతను, అంతర్గత సామరస్యాన్ని నిశ్శబ్ద వ్యాధిలా దెబ్బతీసే ప్రతికూల భావాలు. వీటిని వదిలేయడం అనేది మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మరో గొప్ప శక్తి. వదిలేయడాన్ని అలవర్చుకునే కళను నేర్చుకునేందుకు ధ్యానం ఒక గొప్ప సాధనగా ఉపయుక్తమవుతుంది.నిటారుగా వెన్నెముకను ఉంచి సౌకర్యంగా కూర్చొని, మీలో ఉద్భవిస్తున్న ఆలోచనలు, భావోద్వేగాలను గమనించండి. అవి వచ్చి వెళ్లిపోతున్నాయనే సత్యాన్ని గుర్తించండి. వాటికి ప్రతిస్పందించవద్దు. ఈ సాధనను ప్రతిరోజూ కొనసాగిస్తే.. మీ అంతరంగంలో ప్రశాంతత నెలకొంటున్న అనుభూతిని గుర్తిస్తారు.4. ‘దేవుని ప్రేమ తప్ప ప్రతిదీ అశాశ్వతమే’ఈ భౌతిక ప్రపంచంతో మనల్ని మనం అంటిపెట్టుకోవడం ఎప్పటికీ దుఃఖానికే దారితీస్తుంది. ఎందుకంటే ఏది ఉద్భవిస్తుందో అది అంతరించిపోతుంది. ఏదీ శాశ్వతంగా ఉండదు. అయితే మన ఆత్మల్లో ఉన్న దైవిక తత్వం శాశ్వతమైనది. అది నిత్యమైనది, మార్పులేనిది. ఈ సత్యంపై ధ్యానం చేయండి.భగవద్గీతలో శ్రీకృష్ణుడు సూచించిన విధంగా కర్మయోగాన్ని ఆచరించండి. మీ విధులను నిర్వర్తించండి.. ఫలితాల విషయంలో మీకు మీరు అతిగా ఆపాదించుకోవద్దు. మీ కర్మలను దేవుని పాదాల వద్ద అర్పించండి. జనన మరణాల శాశ్వత చక్రం నుంచి విముక్తి పొందేందుకు, ముక్తి లేదా మోక్షాన్ని సాధించేందుకు ఇదే ఏకైక మార్గం.ఇదీ చదవండి: వీఐపీ కల్చర్‌కు దూరంగా.. రైలెక్కిన గవర్నర్ -
నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్
సాక్షి,ముంబై : బాలీవుడ్ నటి అమీషా పటేల్ కుటుంబానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమీషా పటేల్ తల్లిదండ్రుల చర్చిగేట్ (ముంబై) నివాసం నుండి , బంగారు, వజ్రాల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇంటి పనిమనిషే ఈ చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. నటి తల్లి ఆశా పటేల్ ఫిర్యాదు మేరకు నిందితురాలు సీమా ఘాటేను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.పోలీసుల కథనం ప్రకారం జనవరి 2026లో ఒక గాజు చోరీకి గురైంది. దీనిపై సీమాను అనుమానించిన ఆశా పటేల్, తప్పు ఒప్పుకుని, పోయిన ఆభరణాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆమె కోరారు.అయితే, ఆ గాజును తిరిగి ఇవ్వకపోవడంతో, ఆశా పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు.దీంతో పాలఘర్కు చెందిన 40 ఏళ్ల సీమా ఘాటే అనే ఇంటి పనిమనిషిని మెరైన్ డ్రైవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ 5 లక్షలకు పైమాటే. వీటిల్లో డైమండ్గాజులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లో గృహ కార్మికురాలిగా పని చేస్తోంది.ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్దీనిపై అమీషా పటేల్ తల్లి ఆశా పటేల్, పనిమనిషి ఘాటేపై అనుమానం వ్యక్తం చేస్తూ మెరైన్ డ్రైవ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు విరార్‌లో ఘాటేను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి ఎలాంటి రికవరీ చేయలేదు.నిందితురాలు సీమ నేర చరిత్ర, సహచరులు ప్రాతను పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. మరోవైపు ఆమెకు సెప్టెంబర్ 15 వరకు మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..! -
బ్రిక్స్ సదస్సు: భారత్‌లో అడుగుపెట్టిన జిన్‌పింగ్
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ సదస్సు-2026లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పిన్ ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయన భారత అధికారులు స్వాగతం పలికారు. బ్రిక్స్‌లో భాగంగా.. సాయంత్రం జిన్‌పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించనున్నారు. పాలమ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో జిన్‌పింగ్‌తో పాటు సుమారు 400 మందితో కూడిన భారీ బృందం భారత్‌కు వచ్చింది. భారత అధికారులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో సాదర స్వాగతం పలికారు. మోదీతో జరిగే ద్వైపాక్షిక భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇరు దేశాల సంబంధాల మెరుగుదలతో పాటు వాస్తవాధీన రేఖ (LAC) పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.New Delhi: Chinese President Xi Jinping arrives in New Delhi to attend the 18th BRICS Summit https://t.co/jqG0LAC3Rw pic.twitter.com/QG6cB1BtXH— IANS (@ians_india) September 12, 2026గాల్వాన్ ఘటన నేపథ్యంలో.. దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు రావడం గమనార్హం. ఆ భేటీలో ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ భారత్ మండపం వేదికగా 18వ బ్రిక్స్ సదస్సు ఇవాళ మధ్యాహ్నాం 2గం.లకు ప్రారంభం కానుంది. ఇవాళ, రేపు ఆ సమావేశాలు జరగనున్నాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు ముందు బీజింగ్ కీలక సందేశం ఇచ్చింది. రెండు దేశాలు పరస్పర విశ్వాసాన్ని పెంచుకుని, సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చైనా పేర్కొంది. భారత్–చైనా సంబంధాలు సుస్థిరంగా, ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందడం ఇరు దేశాల ప్రయోజనాలకు మాత్రమే కాకుండా ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కూడా కీలకమని స్పష్టం చేసింది.ఇటు చైనా, భారత్ కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నట్లు భారత్‌లో చైనా రాయబారి షూ ఫెంగ్హాంగ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాలు పరస్పర విభేదాలను సరిగ్గా పరిష్కరించుకుంటూ.. సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇరాన్ అధ్యక్షుడి చేతిలో చెయ్యేసి.. -
వీఐపీ కల్చర్‌కు దూరంగా.. రైలెక్కిన గవర్నర్
కాన్పూర్: యూపీలోని ఛత్రపతి సాహూ జీ మహారాజ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న రెండు రోజుల ఏఐ మంథన్ 2.0 కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఆనందీబెన్ పటేల్ శనివారం రైలులో కాన్పూర్ సెంట్రల్‌కు చేరుకున్నారు. ఉత్సర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో ఆమె కాన్పూర్‌కు వచ్చారు. విశ్వవిద్యాలయంలో జరిగే ఏఐ మంథన్ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించనున్నారు. శని, ఆదివారాలలో ఈ కార్యక్రమం జరగనుంది.గవర్నర్ రైలులో కాన్పూర్‌కు రావడం విశ్వవిద్యాలయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ వినయ్ కుమార్ పాఠక్ ఆమెకు స్వాగతం పలికారు. గతంలో జులై 9న జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి కూడా ఆనందీబెన్ పటేల్ రైలులోనే కాన్పూర్‌కు వచ్చారు. ఈసారి కూడా రైలు ప్రయాణానికే ప్రాధాన్యతనిచ్చారు. ఆమె నిర్ణయం నిరాడంబరతను ప్రోత్సహించే సందేశాన్ని ఇస్తోందని పలువురు అంటున్నారు.ఏఐ మంథన్ 2.0లో దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, పరిపాలనా రంగాలకు చెందిన నిపుణులు పాల్గొంటున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రోబోటిక్స్, పాలన, పరిశోధన, ఉపాధి రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై చర్చించనున్నారు. ఐఐటీ, ఎయిమ్స్, బిట్స్ పిలానీ, గూగుల్, ఐబీఎం తదితర సంస్థలకు చెందిన నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.మంథన్‌లో పాల్గొనే అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు కూడా రైలు ద్వారా లేదా ఒకే వాహనంలో కార్యక్రమానికి రావాలని గవర్నర్ సూచించారు. వేర్వేరు వాహనాల రాకపోకలను తగ్గించడం, సామూహిక ప్రయాణాన్ని ప్రోత్సహించడం ఈ సూచన ఉద్దేశం.రెండు రోజుల కార్యక్రమానికి విశ్వవిద్యాలయ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏఐ ఆచరణాత్మక వినియోగం, భారతదేశ భవిష్యత్తులో కృత్రిమ మేధ పాత్రపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను సిద్ధం చేయడం, పరిశోధన-ఆవిష్కరణలను ప్రోత్సహించడం, కొత్త ఉపాధి అవకాశాలపై కూడా నిపుణులు మేధోమథనం చేయనున్నారు.ఇదీ చదవండి: 5జీ రావడం లేదని.. టెక్నీషియన్‌ను టవర్‌కు కట్టేసి.. -
భార్య.. భర్త.. ప్రియుడు.. ముగ్గురూ మంచోళ్లే!
వివాహేతర సంబంధాల మోజులో నేరాలు ఘోరాలు జరుగుతున్న రోజుల్లో.. భర్తను చంపే భార్యలు, భార్యలను హతమార్చే భర్తలు, ప్రేమ పేరుతో బ్లాక్మెయిల్ చేసే ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా.. ఒక భార్య తనకు భర్త వద్దని, ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో ఆ భర్త తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కథలో ట్విస్టులు మాత్రం సినిమాను మించి ఉన్నాయి!..ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన కన్యాదానం చిత్రంలో.. తన స్నేహితుడి ప్రేమను నిలబెట్టేందుకు భార్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపిస్తాడు హీరో. ఆ క్లైమాక్స్‌ను ఏమాత్రం తీసిపోని రేంజ్లో జరిగిన ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటే.. ఆమె మాత్రం అతను వద్దని తెగేసి చెప్పింది. దీంతో ఆ సినిమాలో శ్రీకాంత్ చేసినట్లే.. ప్రియుడి వద్దకే భార్యను చేర్చాడా భర్త. లక్నోకు చెందిన ప్రాంతీయ రక్షక్ దళ్ (PRD) జవాన్ విక్కీకి సొనాలీతో ఏడాది క్రితం వివాహమైంది. అయితే పెళ్లికి ముందే సొనాలీకి తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇద్దరూ స్కూల్ టైం నుంచే స్నేహితులు. ఆ స్నేహం కాస్తా వాళ్లతో పాటే పెరిగి ప్రేమగా మారింది. అయితే అతనితో వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదు. బలవంతంగా విక్కీకి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆమె తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. భర్తను మోసం చేయొద్దని.. సుఖంగా కాపురం చేసుకోమని ఆ ప్రియుడు ఆమెకు హితబోధ చేస్తూ వచ్చాడు. అయితే ఆమె మాత్రం అలా ఉండలేనంటూ తెగేసి చెప్పింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న సొనాలీ అత్తింటి నుంచి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త విక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సమీప జిల్లాలకు సమాచారం పంపి గాలింపు చేపట్టారు. చివరకు..సొనాలీ హర్దోయ్‌లో ఓ వ్యక్తితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. అతను తన ప్రియుడని చెప్పడంతో అంతా కంగుతిన్నారు. బుధవారం పోలీసులు ఇద్దరినీ లక్నోకు తీసుకొచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడించారు. గంటల తరబడి నచ్చజెప్పినా సొనాలీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భర్తతో ఒక్క క్షణం కూడా ఉండటం తనకు ఇష్టం లేదని, తన చిన్ననాటి ప్రియుడితోనే జీవితాంతం ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేసింది. ఆ సమయంలో ప్రియుడు.. భర్త వద్దకే వెళ్లిపోవాలంటూ సూచించడం గమనార్హం.అయితే భార్య మాటలు విన్న విక్కీ కొంతసేపు షాక్‌కు గురైనా.. చివరకు ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. “ఇందులో బలవంతం ఏమీ లేదు. ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో వారితోనే ఉండు” అని చెప్పాడు. అనంతరం ఇరువర్గాల అంగీకారంతో అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత సొనాలీ, ఆమె చిన్ననాటి ప్రియుడు స్థానిక ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేశారు. ఈ సమయంలో ఆమె భర్త విక్కీ స్వయంగా భార్యను ప్రియుడికి అప్పగించాడు.పెళ్లి తర్వాత కూడా చిన్ననాటి ప్రేమను కొనసాగించిన సొనాలీ.. చివరకు తన ప్రియుడినే ఎంచుకుంది. అయితే ఈ ప్రేమకథలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు బయటపడితే గొడవలు, దాడులు, హత్యలు, బ్లాక్‌మెయిలింగ్‌ల వరకు వెళ్లే ఘటనలు చూస్తుంటాం. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు.. భర్త బలవంతం చేయకుండా భార్య నిర్ణయాన్ని గౌరవించాడు. అంతేకాదు.. ఆమె చేయిని ప్రియుడి చేతిలో పెట్టి దగ్గరుండి పెళ్లి జరిపించాడు. ఆ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది.In #Lucknow's Malihabad, a PRD (Prantiya Rakshak Dal) jawan arranged his wife's marriage to her lover. His wife had run away from home, and upon discovering she was having an affair, the husband deemed it appropriate to have her married to the man rather than create a dispute. pic.twitter.com/9SC6Vdq05m— Siraj Noorani (@sirajnoorani) September 11, 2026


