breaking news
Fashion
-
అవే నా స్టయిల్ ఆఫ్ లవ్: నటి చైత్ర జే ఆచార్
సింపుల్ నుంచి బోల్డ్ వరకు, ట్రెండ్ నుంచి ట్రెడిషనల్ వరకు ఏ స్టయిల్లోనైనా తన స్వాగ్‌ని చూపే నటి చైత్ర జే ఆచార్. జీన్స్, షార్ట్స్ ప్లస్ టీ షర్ట్ నా స్టయిల్ ఆఫ్ లవ్. బయటకు వెళ్లేటప్పుడు ఇదే లుక్‌ను కాస్త బోల్డ్‌గా స్టయిల్ చేస్తా. ప్రత్యేక సందర్భాల్లో చీరల్లో మెరుస్తాను. అవి నాకు సంప్రదాయబద్ధమైన, కంఫర్ట్ లుక్‌ను ఇస్తాయి. దుస్తులు ఏవైనా, మినిమల్ జ్యూలరీని ప్రిఫర్ చేస్తా అంటోంది చైత్ర జే ఆచార్. ఇక్కడ ఆమె ధరించిన చీర బ్రాండ్: ఇజాయి ధర: రూ. 3,850, జ్యూలరీ బ్రాండ్: ఫైన్ షైన్ జ్యూలరీ, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. క్రిస్టల్ క్రష్!రాళ్ల నగలు నేటి యువత స్టయిల్‌కి ర్యాప్ సాంగ్లాంటి ఎనర్జీని ఇస్తున్నాయి. అందుకే, బంగారం మెరుపు కంటే, క్రిస్టల్ జ్యూలరీనే వారి ఫేవరెట్ క్రష్‌గా మారింది. నిజానికి, రాళ్ల ఆభరణాలకు ఫ్యాషన్‌లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. ఇవి కేవలం మెరుపుతోనే కాదు, ట్రెండ్, లగ్జరీ మిక్స్ చేసిన మోడర్న్ డిజైన్లతో వస్తాయి. విశేషంగా, వైట్ స్టోన్ జ్యూలరీకి ఒక అదనపు ఆర్భాటం అందిస్తాయి. ఒక్కసారి రాళ్ల ఆభరణాలు ధరించగానే సాధారణ దుస్తులు కూడా ప్రత్యేకంగా మెరుస్తాయి. డైలీ వేర్‌కు, మినిమలిస్టిక్ వైట్ సఫైర్ స్టడ్స్, సింపుల్ బ్యాంగిల్స్ ఎప్పటికీ బెస్ట్ ఆప్షన్. ఆఫీస్ స్టయిల్‌కు క్లాసిక్ వైట్ స్టోన్ పీసులు, జెంటిల్ డిజైన్, ప్రొఫెషనల్ లుక్ అందిస్తాయి. వివాహాది శుభకార్యాల కోసం పెద్ద హారాలు, చోకర్స్, గ్రాండ్ స్టేట్మెంట్ లుక్ ఇస్తాయి. ప్రతి సందర్భానికి ప్రత్యేకంగా మోడర్న్ స్టోన్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. జుట్టు పోనీగా కట్టి వెళ్ళితే రాయల్టీ లుక్, వేవీ హెయిర్ లేదా కర్ల్స్ వేసుకుంటే క్యూట్ టచ్ గ్యారంటీ. (చదవండి: beauty: ముఖం మెరుస్తూ..కాంతిగా ఉండాలంటే..! కుంకుమ పువ్వుతో..) -
విలాస సౌందర్యం...
బాలీవుడ్ నిర్మాత, ఫ్యాషన్ ఐకాన్ గౌరీ ఖాన్ దీపావళి పండుగ నేపథ్యంలో జోయా ఆధ్వర్యంలో ఐకానిక్ రూబీ రష్ నెక్లెస్ ఆవిష్కరించింది. 70 క్యారెట్ల మొజాంబిక్ ఎర్ర కెంపులతో నెక్లెస్ లో అందంగా కనిపించింది. 1950లో హాలీవుడ్ దిగ్గజాలు మార్లిన్ మన్రో, ఎలిజబెత్ టేలర్ ఇంద్రియాలకు ప్రసిద్ధి చెందిన ఎరుపు రంగు లిప్‌స్టిక్ ప్రేరణతో ఈ రూబీ రష్ డిజైనింగ్ రూపొందించామని జోయా యాజమాన్యం తెలిపింది. స్త్రీతత్వం, శాశ్వతమైన గ్లామర్‌ను ప్రతిబింబించే ఈ డిజైన్స్ హైదరాబాద్‌తో పాటు అన్ని నగరాల్లో అందుబాటులో ఉంటాయని అన్నారు. మహిళల సౌందర్యం, ఆత్మస్థైర్యానికే కాకుండా లగ్జరీకి నిదర్శనంగా నిలుస్తుందని గౌరీ ఖాన్ పేర్కొన్నారు -
ఫ్రెంచ్ సూపర్ బ్రాండ్ తొలి స్టోర్ : ఎవరీ బ్యూటీ విత్ బ్రెయిన్
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ డిపార్ట్మెంట్ స్టోర్లలో ఒకటైన గ్యాలరీస్ లఫాయెట్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబైలోని కాలా ఘోడాలోని చారిత్రాత్మక టర్నర్ మోరిసన్ అండ్ వోల్టాస్ హౌస్ భవనాలలో తన తొలి భారతీయ ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ప్రారంభించింది. గ్యాలరీస్ లఫాయెట్ , భారతీయ వ్యాపారం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ (ABFRL) ప్రత్యేక భాగస్వామ్యంతో ఇది అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇండియన్ లగ్జరీ ఫ్యాషన్ మార్కెట్లో ఇదొక చారిత్ర క్షణమని నిపుణులు పేర్కొంటున్నారు.ఈ సందర్భంగా ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా అరేబియా సముద్రంలో అద్భుతమైన వేడుకను నిర్వహించాయి. గేట్‌వే ఆఫ్ ఇండియా నుండి, యాచ్‌లలో కుమార్ మంగళం బిర్లా, అనన్యా బిర్లా ,గ్యాలరీస్ లఫాయెట్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నికోలస్ హౌజ్ ఈ లాంచింగ్ ఈవెంట్‌ను అద్భుతంగా నిర్వహించారు. గ్యాలరీస్ లఫాయెట్ ముంబై లాంచ్‌లో యువ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా వ్యాపార వారసురాలు అనన్య బిర్లా (Ananya Birla) ఎరుపు రంగు ఆలిస్ ఒలివియా సూట్లో అద్భుతమైన లుక్‌తో ఆకట్టుకున్నారు. ఆమె తల్లి ఆభరణాలు, రోలెక్స్, సొగసైన సన్ గ్లాసెస్‌తో కాంటెంపరరీ పవర్ డ్రెస్సింగ్‌తో తన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకున్నారు. View this post on Instagram A post shared by Harper's Bazaar India (@bazaarindia) కాగా బెయిన్ & కో ప్రకారం, దేశంలోని లగ్జరీ విభాగం 2030 నాటికి 3.5 రెట్లు పెరగనుంది. ఫ్రెంచ్ ఐకాన్ గ్యాలరీస్ లఫాయెట్ 130 ఏళ్ల ఫ్యాషన్, కళ , సంస్కృతి వారసత్వాన్ని ఆదిత్య బిర్లా గ్రూప్ భారతీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ముంబైలో 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయిదు అంతస్తుల్లో ఇది రూపుదిద్దుకుంది. ఈ స్టోర్‌ను లండన్‌కు చెందిన ఆర్కిటెక్చరల్ సంస్థ వర్జిల్ + పార్టనర్స్ రూపొందించారు. -
బొట్టు కూడా ఒక డిజైనర్ ఆభరణం : ఆదాయం 20 లక్షలు
భారతీయ మహిళామణులకు బొట్టు అంటే ప్రాణం.అందం, సంప్రదాయాల మేళవింపు అది. పండగ అయినా, పెళ్లిఅయినా, ఏ వేడుక అయినా అదొక ఫ్యాషన్. అందుకే కాలక్రమేణా బొట్టు లేదా బిందీ రూపాలు మారుతూ వచ్చాయి.ఈ మార్పునే ఆకళింపు చేసుకున్నారు బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా. రోజువారీ జీవితంలో భాగమైన బొట్టు బిళ్లలను ఫ్యాషన్ ఆభరణాలుగా మార్చి, తన క్రియేటివిటీతో పలువురి సెలబ్రిటీల ఫ్యావరెట్‌గా మారిపోయింది. మిలిటరీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన మేఘన ఉద్యోగాన్ని వదిలి మరీ ఈ వ్యాపారాన్ని ఎంచుకుంది. మేఘనా సక్సెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం ఈ కథనంలో.బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా బిందీ సంప్రదాయం నుండి ప్రేరణ పొంది, ది బిండి ప్రాజెక్ట్‌ను స్థాపించారు. అయితే ఈ జర్నీ వెనుక పెద్ద పోరాటమే ఉంది. మేఘనా ఖన్నా పూణేలో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ చేశారు. ఒక ఏడాది పాటు ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కానీ సొంతంగా వ్యాపారాన్ని చేయాలనే ఆలోచనకు మరింత పదును పెరిగింది. ఈ క్రమంలో ఆమె దృష్టి ముక్కు పోగులపై పడింది. జోధ్‌పూర్ కళాకారులతో కలసి "లెవిటేట్" అనే హ్యాండ్‌క్రాఫ్ట్ జ్యువెలరీ బ్రాండ్‌ను ప్రారంభించింది. 2002 - 2020 వరకు అంటే పద్దెనిమిదేళ్లు లెవిటేట్ విజయవంతంగా నడిచింది. ఇందులో రకరకాల చోట్ల నుంచి వచ్చిన అందమైన నగలు, యాక్సెసరీలు, గృహాలంకరణ వస్తువులు ఉండేవి. కోవిడ్ మహమ్మారి మేఘనా వ్యాపారాన్ని దెబ్బతీసింది. చివరకు వ్యాపారం మూసివేయాల్సి వచ్చింది. కానీ బిజినెస్ చేయాలనే కోరిక మాత్రం నశించ లేదు. View this post on Instagram A post shared by Startup Pedia (@startup.pedia)2022లో అనుకోకుండా బొట్టు బిళ్లల్లో బంగారు, వెండివి ఉంటాయని తెలుసుకుంది మేఘనా. తన స్నేహితురాలు అమ్మమ్మ ఇచ్చిన బంగారు బొట్టు చూశాక తానెందుకు ఇలాంటి తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. అన్ని ఆభరణాల మాదిరిగానే బొట్టు బిళ్లలు కూడా ఒకఫ్యాషన్‌గా ఉండాలనే ఆలోచనతో "ది బిందీ ప్రాజెక్ట్" ప్రారంభించింది. దీనికి తోడు ‘లెవిటేట్’ అనుభవం ఉండనే ఉంది. రూ.5 లక్షలతో బిందీ ప్రాజెక్ట్ షురూ అయింది. కేవలం ఇద్దరు మహిళలకు శిక్షణ ఇచ్చి, అందంగా స్పెషల్ డిజైన్లతో బిందీ డిజైన్లు రూపొందాయి. దీనికి తగ్గట్టు మార్కెటింగ్ చేసుకున్నారు. తొలుత వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పర్యావరణహితమైన, రీసైకిల్ చేయబడిన వ్యర్థాలతో అందమైన బొట్టు బిళ్లలను తయారు కావడంతో సెలబ్రిటీలను సైతం విపరీతంగా ఆకర్షించాయి. ఇవి కేవలం ఒక సాధనంగా కాకుండా, ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిపోయాయి. రెండున్నరేళ్లలో 1500 కస్టమర్లు వచ్చారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఇన్‌స్టా ద్వారా ఆర్డర్లు తీసుకుంటారు. ఇలా 2024 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల ఆదాయం వచ్చింది. ఇది 2025లో రూ. 20 లక్షలకు చేరిందంటే దీని ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఫెస్టివ్, లెదర్, వస్త్రంతో పూర్తిగా చేత్తో తయారవుతాయి. రంగు రాళ్లు, ఇత్తడి ముక్కలు, పూసలు ఇలా రక రకాలుగా తయారయ్యే ఒక్కో బొట్టు బిళ్లా ఒక్కో డిజైనర్ ఆభరణంలా ఉంటుంది. సామాన్యులతో పాటు,ప్రముఖ పాప్ గాయని ఉషా ఉతుప్, కరీనా కపూర్, కరిష్మా, తమన్నా, సోనం కపూర్ తదితర బాలీవుడ్ హీరోయిన్లను కూడా ఆకర్షిస్తున్నాయి. -
భారత్‌కు తొలిసారి మిసెస్ యూనివర్స్ కిరీటం.. భార్యగా, తల్లిగా ఆమె చరిత్ర..
అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్ విజయ కేతనం ఎగురవేసింది. భారత్‌కు చెందిన షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా, మొట్టమొదటి తల్లిగా చరిత్ర సృష్టించారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా ఆమె సుమారు 120 మందితో పోటీ పడి కిరీటాన్ని దక్కించుకున్నారు.తొమ్మిదేళ్ల క్రితం సికందర్ సింగ్ అనే వ్యక్తితో పెళ్లి, ఒక కుమారుడు ఉన్న షెర్రీ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "ఈ విజయం హద్దులు దాటి కలలు కనే ప్రతి మహిళదీ. బలం, దయ, పట్టుదల మహిళ నిజమైన అందానికి నిదర్శనం అని అదే తాను ప్రపంచానికి చూపాలనుకున్నా." అంటూ భావోద్వేగంగా చెప్పారామె. అంతేగాదు ప్రతి గృహిణి తన కుటుంబాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ.. తను కన్న ప్రతి కలను నిజం చేసుకోగల సత్తా ఆమెకు ఉందని సగర్వంగా చెప్పింది. పైగా తన విజయం ప్రతి మహిళను ప్రేరేపించి అడ్డంకులను చేధించి తన లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుందని పేర్కొంది. కాగా, చరిత్రాత్మకమైన ఈ విజయం భారత్‌ను గర్వపడేలా చేసిందని మిస్ యూనివర్స్ పోటీ నిర్వాహకులు ప్రశంసించారు. ఆమెకు ఇన్‌స్టాలో 2.5 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by UMB PAGEANTS: MISS AND MRS INDIA (@umbpageants) (చదవండి: Karwa Chauth: భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..) -
‘మిత్ర మండలి’ నిహారిక.. సందడి
దేశంలో అగ్రగామి ఇన్ఫ్లుయెన్సర్ అయిన వర్థమాన నటి నిహారిక ఎన్ఎం (Niharika NM) హైదరాబాద్ నగరంలోని శరత్ సిటీ మాల్లో ఆదివారం సందడి చేశారు. ప్రస్తుతం ‘మిత్ర మండలి’ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా అరంగేట్రం చేస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు మరికొద్ది రోజుల్లో రానున్నారు.ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాండెడ్ ఫుట్ వేర్ బాటా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సంస్థ తన కొత్త కలెక్షన్లో భాగంగా ‘బ్రైటర్ మూమెంట్స్’ పేరుతో కొత్త ప్రొడక్ట్‌ను శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో (Sarath City Capital Mall ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటరాక్టివ్ గేమ్స్, పండుగ పోటీలు నిహారిక ఉత్సాహంగా పాల్గొన్నారు. అభిమానులతో సెల్పీలు దిగుతూ మీట్–అండ్–గ్రీట్ (Meet and Greet) కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: ముద్దుల కోడలితో నీతా అంబానీ.. బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా? -
ముద్దుల కోడలితో నీతా అంబానీ : బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?
MMDiwali ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా దివాలీ బాష్‌లో స్టన్నింగ్ లుక్‌తో అలరించారు. 61ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా, అందంగా తనదైన ఫ్యాషన్ స్టైల్‌తో ఆకట్టుకుంటారు. అటు వ్యాపారవేత్తగా రాణిస్తూ, ఫిట్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.అంతేకాదు మహిళలు 40 ఏళ్లు దాటిన తరువాత కనీసం వ్యాయామం యోగా లాంటివి చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూమహిళలకు సందేశమిస్తారు. తాజాగా అరుదైన హెర్మేస్ జ్యువెలరీ బ్యాగ్ , కొలంబియన్ ఎమరాల్డ్స్‌తో సీక్విన్డ్ మనీష్ మల్హోత్రా చీరలో నీతా అంబానీ మరోసారి ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకున్నారు.దీపావళి సమీపిస్తున్న తరుణంలో మనీష్ మల్హోత్రా ఎప్పటిలాగే తన ఇంట్లో బి-టౌన్ సెలబ్రిటీలతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు మొత్తం బాలీవుడ్ పరిశ్రమ తరలివచ్చింది. అంబానీ ఫ్యామిలీకి చెందిన అత్తాకోడళ్ల ద్వయం చీరలలో అందరి దృష్టిని ఆకర్షించింది. (మూడు నెలలు ముహూర్తాలు లేవు..నగరానికి పెళ్లి కళ వచ్చేసింది!)బిలియనీర్ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ చైర్మన్,ముఖేష్ అంబానీ భార్య డిజైనర్ నీతా అంబానీ, చిన్నకోడలు రాధికా మర్చంట్‌తో చీరల్లో ఫెస్టివ్‌ల్ లుక్‌లో అదరగొట్టేశారు. ముఖ్యంగా నీతా బ్రైట్ సిల్వర్ వెండి సీక్విన్ సారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో క్లాసిక్ అండ్ ఫెస్టివ్ లుక్‌లో ఆకట్టుకున్నారు. దీనికి తగ్గట్టు స్పెషల్ హై జ్యువెలరీ కలెక్షన్ అద్భుతమైన ఎమరాల్డ్స్ చెవిపోగులు, వజ్రాల బ్రాస్లెట్తో హైలైట్‌గా నిలిచారు. ఇంకా తనదైన శైలిలో ధరించిన ప్రత్యేక ఎడిషన్ మినియేచర్ లగ్జరీ బిర్కిన్ మరో హైలైట్. వజ్రాలతో పొదిగి రోజ్ గోల్డ్‌తో తయారు చేసిన ఈ బ్యాగ్ ధర రూ.17.74 కోట్లు ఉంటుందని అంచనా. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) నీతా వెండి సీక్విన్ చీరను ధరించగా, కోడలు రాధిక ముత్యాలతో రూపొందించిన మనీష్ మల్హోత్రా చీరలో క్లాసీ వైబ్‌ను పంచారు. డీప్ నెక్లైన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, ఓపెన్ పల్లుతో స్టైల్ చేసింది. అలాగే అత్తగారిలాగానే తన లుక్‌కి మ్యాచింగ్ బ్యాగ్ ధరించింది. అత్తగారి చేయి పట్టుకుని నడిచి వచ్చిన తీరు అక్కడున్నవారినందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. -
నటి అనుకుట్టి ఇష్టపడే స్టైలిష్వేర్లు ఇవే..!
శారీలో కొత్త డ్రేపింగ్ స్టయిల్స్ ట్రై చేస్తుంటాను. ఇది శారీకి కొత్త జీవాన్ని ఇస్తుంది. సామాన్యమైన సల్వార్‌ను కూడా కొత్త శైలిలో ధరించడం ద్వారా ప్రత్యేకతను పొందవచ్చు. నేను ఎల్లప్పుడూ సహజ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తాను. అందుకే, నా చర్మం, జుట్టు సహజంగానే మెరుగ్గా ఉంటాయి. నిజానికి, నా అందం మొత్తం నా సహజత్వంలోనే ఉంది అని చెబుతోంది అనుమోల్అందానికి వయసుతో నిమిత్తం ఉండదనేందుకు నిదర్శనం ఆమె. అందమైన వర్చస్సుతో పాటు నిండైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడే నటి అనుమోల్ ఫాలో అయ్యే స్టయిలింగ్ టిప్స్ నేటి యువతను కూడా ఆకర్షించి, ఫాలో అయ్యేలా చేస్తున్నాయి. ఇక్కడ అనుమోల్ ధరించిన చీరబ్రాండ్: చినాయా బెనారస్, ధర: రూ. 16,658, జ్యూలరీ బ్రాండ్: దీపాలీ డిజైన్స్, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.స్టిచ్డ్ జ్యూలరీఆభరణాలు లేకుండా రాయల్టీ లుక్ సాధ్యమేనా? అసాధ్యం అనుకుంటున్నారా? కాని, మీ దగ్గర ఒకే ఒక్క స్టిచ్డ్ జ్యూలరీ బ్లౌజ్ ఉంటే, అసాధ్యాన్ని చాలా సులభంగా సుసాధ్యం చేయగలరు. మెడ చుట్టూ నెక్లెస్‌లా మెరుస్తూ, చేతులపై వంకీల్లా మెరిసిపోతూ, వెనుకవైపు పెండెంట్‌లా గ్లామర్ జోడించే ఈ మగ్గం వర్క్ డిజైన్లు, ‘ఎక్కడ హారం? ఎక్కడ గొలుసు?’ అని వెతికే పని, ఇతర అదనపు జ్యూలరీ అవసరం లేకుండా చేస్తాయి. ఎందుకంటే ఆభరణాలే బ్లౌజ్లో దాక్కుని ఉంటాయి. ఒక్క బ్లౌజ్‌తోనే మీ స్టయిల్ నేరుగా స్టార్డమ్ లెవెల్‌కి చేరుతుంది. సింపుల్ కలర్ చీరతో కలిపితే మగ్గం వర్క్ మరింత హైలైట్ అవుతుంది, హెయిర్ స్టయిల్ బన్ లేదా సైడ్ ప్లేట్స్ సరిగ్గా సరిపోతుంది. వీటితోపాటు, మినిమల్ మేకప్ అదనంగా అందాన్ని జోడిస్తుంది. అయితే, బ్లౌజ్ ఫిటింగ్ సరిగ్గా ఉంటే, మగ్గం వర్క్ డిజైన్ మరింత ప్రభావవంతంగా కనిపిస్తుంది. దీపిక కొండి(చదవండి: అందాల ఆషికా రంగనాథ్ స్టైలిష్ వేర్లు ఇవే..!) -
గ్లోబల్ వేదికగా హైదరాబాదీ ఫ్యాషన్
సాక్షి, సిటీబ్యూరో: గ్లోబల్ ఇండియా కోచర్ వీక్‌లో భాగంగా నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్ హరీష్ అక్కిసెట్టి ప్రదర్శించిన సరికొత్త కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియన్ బ్రైడల్, కోచర్ ఫ్యాషన్‌లో ప్రసిద్ధి చెందిన హైదరాబాదీ హరీష్ కలెక్షన్ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించింది. ఈ సందర్భంగా డిజైనర్ హరీష్ అక్కిసెట్టి మాట్లాడుతూ.. టైమ్స్ ఫ్యాషన్ వీక్, ఇండియా ఫ్యాషన్ వీక్ లండన్ వరుసలో ప్రస్తుత గ్లోబల్ ఇండియా కోచర్ వీక్ కూడా హైదరాబాద్ డిజైనింగ్ వైభవాన్ని గ్లోబల్ వేదికగా ప్రదర్శించే అవకాశం కలిగిందని అన్నారు. వెడ్డింగ్ ట్రౌస్సో లైన్‌తో ఈ కలెక్షన్‌ను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఫ్యాషన్ షోలో వాకింగ్ చేస్తూ, బ్యాక్‌స్టేజ్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న డిజైనర్లతో ప్రయాణం చేసి నగరంలో వినూత్న డిజైనింగ్ స్టైలింగ్ అందించడం కోసం లేబుల్ ప్రారంభించానని హరీష్ వివరించారు. మ్యూజియం జ్యువెలరీ కలెక్షన్ఈ నెల 18 వరకూ అందుబాటులో ప్రదర్శన సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ భారతదేశపు తొలి లగ్జరీ జ్యువెలరీ మ్యూజియం కలెక్షన్ ప్రదర్శన జూబ్లీహిల్స్‌లో ఏర్పాటైంది. నగరానికి చెందిన వేగ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించిన ఈ ప్రదర్శన అక్టోబర్ 18 వరకూ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రత్యేక ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం డీమ్డ్ టు బీ యూనివర్సిటీకి చెందిన డా.సీహెచ్.ప్రీతిరెడ్డి, ఫిక్కీ ఎఫ్ ఎల్ ఓ చైర్పర్సన్ ప్రతిభా కుందా, ప్రముఖ నటి తేజస్వి మదివాడ, మాల్వి మల్హోత్రా, ప్రాంతికా దాస్ తదితర నగర ప్రముఖులు పాల్గొన్నారు. -
ఇయర్ చెయిన్స్: ప్రాచీన అలంకరణే ట్రెండీ స్టైలిష్‌గా
రమణుల ఆభరణాల అలంకరణలో చెవుల నుంచి హెయిర్ వరకులేయర్లుగా చెయిన్ ఉండటం ఫ్యాషన్ మాత్రమే కాదు మన సంస్కృతి, సౌందర్యం, ఆచారం కూడా. దక్షిణ భారతదేశంలో చెంపసరాలు, మాటీలుగా పేరున్న ఈ ఇయర్ చెయిన్స్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ సెలబ్రిటీల వరకు ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్‌గా మారాయి. ఇటీవల దుర్గా నవరాత్రుల్లో సెలబ్రిటీలు ధరించిన మాటీల అందం నవతరపు చూపులను ఇట్టే కట్టిపడేసింది.ప్రాచీన ఆభరణంగా, అలంకరణలో సంపూర్ణతకు చిహ్నంగా నిలిచే మాటీలు వివాహ వేడుకలలో వధువు సింగారంలో తప్పనిసరై వెలుగొందుతోంది.పండగల రోజులలో ధరించిన డ్రెస్సుల తగిన ట్రెండీ మోడల్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. బంగారం, డైమండ్స్లోనే కాదు వివిధ రకాల పూసలు, సిల్వర్, ఆక్సిడైజ్లలోనూ ఈ మాటీల అందం మనసు దోచేస్తుంది. సాంప్రదాయ ఆభరణాలకు మోడర్న్ మెరుపులు జోడించడమే ఈ ఇయర్ చెయిన్స్. ఒకప్పుడు దేవతల విగ్రహాల్లో, అమ్మమ్మల చెవులకు కనిపించిన చెంప సరాలు ఇప్పుడు రన్ వే వేదికలపై అడుగులు వేసే మోడల్స్ చెవుల్లో, మ్యాజిక్ ఫెస్టివల్ లుక్స్‌లో, బ్రైడల్ ఫొటోషూట్లలో కొత్త శైలిలో మెరిసి΄ోతున్నాయి. దక్షిణ భారతీయ సంప్రదాయాల్లో చెంప సరాలు (ఇయర్ చెయిన్)ఒక ముఖ్యమైన అలంకారం. నాటి కాలంలో మహిళల గౌరవం, ఆభరణ సంపూర్ణతకు చిహ్నంగా వెలుగొందిన చెంప సరాలు రాబోయే వేడుకలలో మరిన్ని ఆకర్షణలను జోడించనున్నాయి.అద్దుకున్న ఆధునికతఈ రోజుల్లో ఆ చెంప సరాలు కొత్త రూపాల్లో కనిపిస్తున్నాయి. సిల్వర్, ఆక్సిడైజ్డ్, మెరూన్ కలర్ పూసలు, ముత్యాల చెయిన్లు, ఫ్యూషన్ ఫ్యాషన్‌లో కూడా ఇయర్ చెయిన్స్ స్పెషల్ లుక్ ఇస్తున్నాయి. సాదాసీదా కుర్తా మీదకైనా, లెహంగా లేదా చీర ధరించినా ఆభరణాల అలంకరణలో ఇయర్ చెయిన్ అందం జత చేరితే ఆ అందం ఇనుమడిస్తుంది.శక్తి సరాలు..ఇది కేవలం అలంకారం కాదు. చెవులు–జుట్టు ప్రదేశంలో ఈ సరాలు కదలడం మన ప్రాణశక్తిని సమతుల్యం చేస్తుందని చెబుతారు. అందుకే కొంతమంది దీనిని ‘శక్తి సరాలు’గా భావిస్తారు.సెలబ్రిటీల స్టైల్ టచ్బాహుబలి సినిమాలో అనుష్క ధరించిన చెవి జూకాలు, చెంప సరాలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. అలాగే, ఇటీవల దుర్గా నవరాత్రుల్లో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సెలబ్రిటీలైన అలియా భట్, జాన్వికపూర్, సోనమ్‌కపూర్, శోభిత ధూళిపాల, నయనతార... లాంటి నటీమణులు తమ ట్రెడిషనల్ ఫొటోషూట్లలో ఇయర్ చెయి ధరించి ట్రెండ్ సెట్ చేశారు. ఆ లుక్స్ వల్లే ఈ పాత ఆభరణం మళ్లీ యంగ్ జనరేషన్లో పాపులర్ అయింది. పాత ఆభరణానికి కొత్త రూపం దక్కింది. ఇప్పుడు వాటి డిజైన్ , మెటీరియల్, వాడుక అన్నీ ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త భాషను పరిచయం చేస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది కళాకారులు రీసైకిల్ మెటల్, హ్యాండ్ మేడ్ ఫ్యాబ్రిక్ థ్రెడ్స్తోనూ వీటిని రూపొందిస్తున్నారు. అమ్మమ్మల నాటి సంప్రదాయ నెమలి, మామిడిపిందెల నుంచి ప్రారంభమైన చెంప సరాల డిజైన్లు ఈ రోజుల్లో ఇయర్ కఫ్స్ వరకు వినూత్నంగా కళ్లకు కడుతున్నాయి. (చదవండి: భారత్ పిలిచింది..! కష్టం అంటే కామ్ అయిపోమని కాదు..) -
వేలాదిగా బారులు తీరిన మోడల్స్, కేఆర్కే ట్వీట్ వైరల్
ప్రముఖ సినీ క్రిటిక్, నటుడు , నిర్మాత కమాల్ రషీద్ ఖాన్ (కమల్ ఆర్. ఖాన్.Kamaal R. Khan, KRK) వివాదాస్పద ట్వీట్లో వార్తల్లో నిలిచాడు. తాజాగా ఒక మెగా మోడల్ హంట్ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు బిగ్బాస్ఫేమ్ కమల్ఆర్ఖాన్. ఈ లైన్ చూస్తే ప్రస్తుతం నిరుద్యోగం ఎంత ఉందో అర్థం అవుతుంది అంటూ అక్కడ వేలాదిగా బారులు తీరిన మోడల్స్‌ను ద్దేశించి కమెంట్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌కు 2.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాదు జెన్ జెడ్ పాపులర్ అవ్వాలని ఎంత పాకులాడుతున్నారో, ధనవంతులుకావాలిన కావాలని ఎంత తహతహ లాడుతున్నారో అనడానికి ఇది నిదర్శనం అంటూ కమెంట్ చేశాడు. దీంతో నెటిజన్లు కమల్ఆర్ఖాన్ను విమర్శిస్తూ, సమర్ధిస్తూ కమెంట్స్ చేశారు. మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్యలో జెన్-జి యువతులుండటం సానుకూలమే కదా అని కొందరు కొనియాడగా, మరికొందరు ప్యాంటు కూడా కొనుక్కోలేనంత పేదవాళ్లు జెన్-జెడ్ అమ్మాయిలు అంటూమరికొందరు అనుచితంగా వ్యాఖ్యానించారు.This line is for Phoenix Mega Model Hunt. It’s proof, how much unemployment is right now. And it’s proof that how Gen~G are desperate to become famous and rich. pic.twitter.com/lsxwatCpVU— KRK (@kamaalrkhan) October 5, 2025 కాగా ఫీనిక్స్ మెగా మోడల్ హంట్ 2025 ( Phoenix Mega Model Hunt 2025) అనేది బెంగళూరులో జరిగే అతిపెద్ద ఫ్యాషన్ షో. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఫ్యాషన్ గురు ప్రసాద్ బిదపా నేతృత్వంలో జరుగుతుంది.ఫ్యాషన్, సంగీతం, కాక్టెయిల్స్ ఈవెంట్స్‌కి రిజిస్ట్రేషన్ చేసుకున్న జంటలకు, మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఔత్సాహికులైన యువతీ యువతులు ఈ ఈవెంట్లో పాల్గొని తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తారు. -
డెక్కన్ డెర్బీ–2025 : యురేకా... మలైకా!
సాక్షి, సిటీబ్యూర : రేస్–2 విన్ ఫౌండేషన్ (Race2Win Foundation ) ఆధ్వర్యంలో హైదరాబాద్ రేస్ క్లబ్లో డెక్కన్ డెర్బీ– 2025 (Deccan Derby 2025 ) లో ఫ్యాషన్, రేసింగ్, సేవల మేలు కలయికగా ఘనంగా నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. ఇందులో ప్రముఖ డిజైనర్ ద్వయం రోహిత్ గాంధీ – రాహుల్ ఖన్నా రూపొందించిన ‘ఫ్యాషన్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్’ కలెక్షన్ ప్రదర్శనలో బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) షోస్టాపర్‌గా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్జున్ బాజ్వా, రెజినా కసాండ్రా, అవంతిక మిశ్రా, నైరా బెనర్జీ తదితర సినీ ప్రముఖులు పాల్గొని వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆనందంగా వుంది.. మలైకా అరోరా మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది. రోహిత్ గాం«దీ, రాహుల్ ఖన్నా డిజైన్ కలెక్షన్ ఆకట్టుకుంది. రేస్–2 విన్ ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం’ అని అభినందించారు. రేస్–2 విన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వై.గోపీరావు మాట్లాడుతూ, ‘డెక్కన్ డెర్బీ 2025 ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా రేసింగ్, ఫ్యాషన్, సేవా కార్యక్రమాల సమ్మేళనం అనే వెవిధ్యం సాకారమైంది’ అన్నారు. ఇదీ చదవండి: Director Sukumar టీ కోసం క్యూ కట్టడం చూశా.. -
క్వీన్ ఆఫ్ దాండియాతో నీతా అంబానీ గార్బా స్టెప్పులు : ఉర్రూతలూగిన వేదిక
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ తన నృత్యంతో మరోసారి ఆడియెన్స్‌ను అలరించారు. అమ్మవారి పూజలు, ప్రార్థనలు మొదలు గర్బా స్టెప్పుల దాకా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా దసరా నవరాత్రులు తన చిన్న నాటి అనుభవాలను నెమరు వేసుకున్నారు. ముఖ్యంగా ఫల్గుణి పాఠక్‌తో కలిసి స్టెప్పులు వేసిన వీడియో వైరల్‌గా మారింది.నీతా అంబానీ నేతృత్వంలో ముంబై జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో దాండియా నైట్ అత్యంత ఉత్సాహంగా నడిచింది. ఈ వేడుకల్లో ఫల్గుణి పాఠక్ భక్తి, పాటలు పాడి భక్తులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా నీతా అంబానీతో కలిసి వేసిన దాండియా విశేషంగా నిలిచింది. View this post on Instagram A post shared by Jio World Convention Centre (@jioworldconventioncentre)ముఖ్యంగా నీతా అంబానీ తన బాల్య జ్ఞాపకాలతో పాటు, పాఠక్‌తో గత పాతికేళ్లుగా తనకున్న సుదీర్ఘ అనుబంధం గురించి మాట్లాడారు. తాను చిన్నప్పుడు, నవరాత్రి తొమ్మిది రాత్రులు నృత్యం చేసేదాన్నని గుర్తు చేసుకున్నారు. దసరా, నవరాత్రి పండుగలు ఎపుడూ తనకు భక్తి ,ఐక్యత, రాత్రి భారతదేశ సాంస్కృతిక గొప్పతనాన్ని గుర్తు చేస్తుందన్నారు. కాగా గుజరాత్‌లోని సంగీత కుటుంబంలో పుట్టిన ఫల్గుణి పాఠక్ గర్బా , దాండియా డ్యాన్స్‌లకు పెట్టింది. అందుకే "దాండియా రాణి" అని పేరొందింది. ఎన్నో పాప్గీతాలను ఆలిపించిన ఫల్గుణి తన మధురమైన స్వరంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెల్చుకుంది. ఇదీ చదవండి: ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే! -
తనిష్క్ మియా 'మానిఫెస్ట్' కలెక్షన్ లాంచ్
ప్రముఖ జ్యయల్లరీ సంస్థ తనిష్క్ కొత్త కలక్షన్ ఆవిష్కరించింది. పండుగ సీజన్ సందర్భంగా మియా 'మానిఫెస్ట్' కలెక్షన్‌ను లాంచ్ చేసింది. ఈసందర్బంగా ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది.ఆధునికత, ఆధ్యాత్మిక ,సమకాలీన డిజైన్‌తో రాజ సౌందర్యాన్ని మిళితం చేస్తూ సరికొత్త డిజైన్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. మియా ప్యాలెస్ ఆర్చ్‌లు, పైస్లీ , బంగారంలో కమలం పువ్వు మరియు సహజ వజ్రాలు, ముత్యాలు, సహజ బహుళ-రంగు నీలమణిలు , ఆకుపచ్చ అవెంచురిన్లతో పాటు ఆధునిక డిజైన్లతో ఉత్పత్తులను అందిస్తోంది. చోకర్లు, నెక్లెస్‌లు, నవరత్నాలు, ఝుమ్కాలు , క్వార్ట్జ్ క్రిస్టల్ మాలాలను అందిస్తుంది, ఇవి పండుగ చక్కదనాన్ని సరసమైన ధరతో మిళితం చేయని కంపెనీ తెలిపింది. దీంతోపాటు వెండి ఆభరణాల కలెక్షన్‌ను కూడా పరిచయం చేస్తుంది. ఆధునిక ట్విస్ట్‌తో అపారమైన ధరించగలిగే డిజైన్లు ఉత్సాహభరితమైన దీపావళి వేడుకలు, నవరాత్రి ఉత్సవాలు లేదా ఆలోచనాత్మక బహుమతికి అనువుగా ఉంటాయని సంస్థ తెలిపింది. మియాస్ మానిఫెస్ట్ కలెక్షన్లో చెవిపోగులు, పెండెంట్లు, బ్రాస్లెట్లు, ఝుమ్కాలు, చోకర్, నెక్‌పీస్‌లు లాంటివి మరెన్నో మియా స్టోర్లలో లభ్యం.ఆధునిక మహిళల కోసం రూపొందించిన పండుగ గ్లామర్ నుండి ట్రెండ్-ఫార్వర్డ్, స్టైలిష్ డిజైన్లను అందిస్తోందని మియా బ్రాండ్ అంబాసిడర్ అనీత్ పడ్డా వెల్లడించారు. ఈ అద్భుతమైన చోకర్ను ధరించి కనిపించారు.సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 23 వరకు, నిబంధనల మేరకు కస్టమర్లు వజ్రాల ఆభరణాల తయారీ ఛార్జీలపై 100శాతం తగ్గింపు, సాదా బంగారం, రంగు రాతి ఆభరణాల తయారీ ఛార్జీలపై 20శాతం తగ్గింపు లభింస్తుంది నిబంధనలు వర్తిస్తాయి. -
సెంటర్‌స్టోన్ డైమండ్‌రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా?
యువ వ్యాపారవత్త, అంబానీ వారసురాలు ఇషా అంబానీ తన ఫ్రెండ్ పెళ్లిలో స్టైలిష్ దుస్తుల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. అలెశాండ్రో మిచెల్ డెబ్యూ వాలెంటినో కలెక్షన్‌కు చెందిన డిజైనర్ వేర్లో తళుక్కుమంది. ఆత్మవిశ్వాసం, హుందాతనంతో కూడిన అద్భుతమైన అందంతో తన తల్లి నీతా అంబానీలాగానే లగ్జరీ అండ్ ఫ్యాషన్ స్టైల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇషా అంబానీ.క్రీమ్ కలర్, పాస్టెల్ గ్రీన్ కలర్లో, అల్లికలు ,లేయర్డ్ రఫ్ఫ్లే ఎంబ్రాయిడరీ, క్లాసిక్ లగ్జరీగా రూపొందించిన ఈ గౌను ఇషా సహజ సౌందర్యాన్ని హైలైట్ చేశాయి. ఇంకా అద్భుతమైన పూల ఆకారపు డైమండ్ చెవిపోగులు, అందమైన బంగారు బ్రాస్లెట్ , అద్భుతమై సెంటర్ స్టోన్‌తో డైమండ్ రింగ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.(పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!)ఫ్యాషన్ ఐకాన్ ఇషా అంబానీ తన సన్నిహితులతో వేడుకలకు హాజరైంది. దీని ధర దాదాపు రూ. 5 లక్షలు. అంబానీ ఫ్యామిలీ ఇన్‌స్టా పేజ్ ఇషా అంబానీ ఫోటోలను షేర్ చేసింది. ఈ వెడ్డింగ్‌లో ఆమె లుక్ మోడ్రన్ ఫ్యాషన్ అభిరుచిని ఆమె గ్లోబల్ స్టైల్‌ని సూచిస్తుందంటూ ఫ్యాన్స్ పొగిడేశారు. ఇటాలియన్ లగ్జరీ హౌస్ క్రియేటివ్ కలెక్షన్స్ సంచలనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. వాలెంటినో కలెక్షన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.మరోవైపు ఇషా అంబానీకి వాలెంటినో కలెక్షన్ అంటే చాలా ప్రేమ. ఈ లగ్జరీ బ్రాండ్‌తో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. తన పెళ్లి రిసెప్షన్ వేడుకలో వాలెంటినో లెహంగానే ధరించింది. ఈ ఫ్యాషన్ హౌస్ రూపొందించిన మొదటి లెహంగా ధరించడం, అనేక సందర్భాల్లో ఈ కలెక్షన్ దుస్తులకే ఆమె ప్రాధాన్యత. చదవండి: స్కూలు ప్రిన్సిపాల్ ఇంగ్లీషుకి బ్యాంకు అధికారులే ‘బౌన్స్’.. మీరూ చూడండి! కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్-నీతా అంబానీల ఏకైక కుమార్తె ఇషా అంబానీ. ప్రస్తుతం రిలయన్స్‌రీటైల్ బాధ్యతల్లో విజయ పథంలో దూసుకుపోతోంది. 2018లో డిసెంబర్లో ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది ఇషా. ఈ జంటకు ఆదియా శక్తి, కృష్ణ కవల పిల్లలున్నారు. -
పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!
అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan ) పారిస్ ఫ్యాషన్ వీక్ (Paris Fashion Week) లో తళుక్కున మెరిసింది. ప్రముఖ భారతీయ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో 51 ఏళ్ల వయసులో కూడా మెరిసిపోయింది .పారిస్ ఫ్యాషన్ వీక్ ఉమెన్స్ రెడీ-టు-వేర్ స్ప్రింగ్-సమ్మర్ 2026 కలెక్షన్లో భాగమైన "లిబర్టే, ఎగలైట్, సోరోరైట్ (లిబర్టీ, ఈక్వాలిటీ, సిస్టర్హుడ్)" షో కోసం గ్లోబల్ బ్రాండ్ లోరియల్ పారిస్ తరపున ఐశ్వర్య రాయ్ ర్యాంప్‌పై నడిచారు.భారతీయ హస్తకళను ప్రపంచ వేదికకు తీసుకెళ్లిన ఈ గ్లోబల్ ఐకాన్ మరోసారి భారతీయ దుస్తుల వైభవాన్ని చాటి చెప్పారు. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) ప్రముఖ భారతీయ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన (Manish Malhotra. )అద్భుతమైన బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఇండిగోలో కస్టమ్-మేడ్ ఇండియన్ షేర్వానీలో ఐష్ లుక్ అదిరిపోయింది. మనీష్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ దుస్తుల వివరాలను పంచుకున్నారు. ఇది పారిస్ ఫ్యాషన్ వీక్ గొప్పతనాన్ని అందిస్తుందన్నారు. ఈ డిజైనర్ ఈ దుస్తులలో "10-అంగుళాల డైమండ్-ఎంబ్రాయిడరీ కఫ్‌లు, విలాసవంతమైన నెక్లెస్ లాగా పొడవైన లేయర్డ్ డైమండ్ స్కాలోప్లు, డైమండ్ టాసెల్ డ్రాప్ మరియు డైమండ్-స్టడ్డ్ యానిమల్ బ్రోచెస్" ఉన్నాయి..నటి ధరించిన షేర్వానీలో వజ్రం-స్టడ్డ్ బటన్లతో స్ప్లిట్ నెక్లైన్తో కూడిన ఎత్తైన బంధ్గాలా కాలర్ ఉంది. ప్యాడెడ్ భుజాలు, పూర్తి-పొడవు స్లీవ్‌లు, సైడ్ మరియు ఫ్రంట్ స్లిట్లు , బాడీ-హగ్గింగ్ సిల్హౌట్ దుస్తులకు ఫ్లేర్డ్ ప్యాంటు ఫిట్ జత చేశారు. వీటితోపాటు ఐశ్వర్య రాయ్ హై హీల్స్, డైమండ్ ఇయర్ స్టడ్లు మరియు స్టేట్మెంట్ డైమండ్ రింగులను ధరించారు. ఆమె జుట్టును వదులుగా వదిలి, ఆమె సిగ్నేచర్ స్టైల్లో ఒక వైపున విడదీసి, తన దుస్తులకు ఆర్కిటెక్చరల్ బోల్డ్నెస్కు రొమాంటిక్ టచ్‌ను జోడించి మరింత గ్లామర్‌గా మెరిసారు. -
10 కేజీల బంగారంతో డ్రెస్..! ఎక్కడంటే..
బంగారం రేటు ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. కొనాలంటే.. గుండెల్లో గుబులు తెప్పించేలా ధర పలుకుతోంది. సామాన్యుడు సైతం బెంబేలేత్తెలా ఉంది. అలాంటిది అక్కడ ఏకంగా స్వచ్ఛమైన బంగారంతో దుస్తులు రూపొందించారట. పైగా దాని ధర వింటే కచ్చితంగా నోరెళ్లబెడతారు. మరి ఆ కథకమామీషు ఏంటో చకచక చదివేయండి మరి...సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ అల్ రోమైజాన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తులను రూపొందించి సరి కొత్త చరిత్ర సృష్టించింది. 'దుబాయ్ డ్రెస్' పేరుతో రూపొందించిన ఈ gold dress గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. పూర్తిగా 21 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. దీని మొత్తం బరువు 10.0812 కిలోగ్రాములు కాగా, మార్కెట్ విలువ సుమారు రూ. 11 కోట్లు పైనే ఉంటుందని అంచనా. కేవలం బంగారం ధర కారణంగానే కాకుండా కళాత్మకంగా రూపొందించిన విధానం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అల్ రోమైజాన్ గోల్డ్ జ్యువెలరీ కంపెనీ ఈ డ్రెస్‌ని బంగారు కిరీటం(398 గ్రాములు), నెక్లెస్ (8,810.60 గ్రాములు,) చెవిపోగులు (134.1 గ్రాములు), తల అలంకరణ (738.5 గ్రాములు) బంగారంతో భాగాలుగా రూపొందించింది. ఆ తర్వాత ఈ భాగాలను మొత్తం కలిపి దుస్తుల రూపంలో ప్రత్యేకంగా ధరించేలా డిజైన్ చేసింది. ఇందులో కేవలం బంగారమే కాకుండా రంగురంగుల విలువైన రత్నాలను కూడా ఉపయోగించింది జ్యువెలరీ కంపెనీ. క్లిష్టమైన ఈ డిజైన్ని అత్యంత నాజుగ్గానూ, ఎమిరేట్స్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించింది. ఇందులోని ప్రతి నమునా చరిత్రకు అర్థంబట్టేలా తీర్చిదిద్దారు నిర్వాహకులు. ఈ డ్రెస్ ఆధునికత, చరిత్ర తోపాటు సృజనాత్మకతను ప్రతిబింబిస్తోంది. ఈ దుస్తుల డిజైన్ ప్రధాన ఉద్ధేశ్యం బంగారం, ఆభరణాల వ్యాపారానికి ప్రపంచ గమ్యస్థానంగా ఉన్న దుబాయ్‌ను మరింతగా బలపరచడమేనని సదరు జ్యువెలరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ దుస్తులు షార్జాలో జరుగుతున్న 56వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లో 500కిపైగా ప్రదర్శకులు పాల్గొంటారు. అందులో ఇటలీ, భారతదేశం, టర్కి, అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, చైనా, సింగపూర్, హాంకాంగ్, మలేషియా దేశాల జ్యువెలరీ డిజైన్లర్లు , తయారీదారులు పాల్గొంటారు. కాగా, ఈ షోలో తొలిసారిగా ఆస్ట్రేలియా, మయన్మార్, పాకిస్తాన్ దేశాల డిజైనర్లు, తయారీదార్లు కూడా పాల్గొనడం విశేషం.(చదవండి: అందరికీ ఒకటే రక్తం!) -
ఫెస్టివ్ ఫీవర్ : విక్రయాల జోరు
సాక్షి, సిటీబ్యూరో: పండుగ సీజన్ విక్రయాల్లో గృహోపకరణాలు, పురుషుల దుస్తులు, పాదరక్షలు ముందు వరుసలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఫ్యాషన్‌కే ఎక్కువ డిమాండ్ ఏర్పడిన విషయాన్ని ప్రముఖ ఆన్లైన్ విపణి ఫ్లిప్‌కార్ట్ షాప్సీ అధ్యయనం వెల్లడించింది. గృహావసర వస్తువులకు డిమాండ్ 108% పెరిగిందనీ, పురుషుల సాధారణ దుస్తులు, పాదరక్షల విక్రయాలు 95% పెరిగాయనీ తెలిపింది. మహిళల కుర్తా, ప్యాంట్ సెట్లు, ఇయర్‌బడ్స్, పురుషుల అనలాగ్ గడియారాలు అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తులుగా నిలిచాయని తేల్చింది.(చదివింది 12 th.. సంపాదన నెలకు రూ. 3 లక్షలకు పైనే) జెన్ జెడ్‌గా పేర్కొంటున్న నవ యువ తరం ప్రధానంగా గ్రూమింగ్, ఫ్యాషన్, దుస్తులపై దృష్టి పెట్టగా, మిలీనియల్స్ (నేటి తరం) గృహ అవసరాలు, ఫ్యాషన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం 60% అమ్మకాలకు దోహదపడిందని, మొత్తం ఆర్డర్లలో 57%తో మహిళా కొనుగోలుదారులు టాప్‌లో నిలిచారని వెల్లడించింది. చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్ -
ప్రతిదీ యుద్ధమే!
ఫ్యాషన్ రంగంపై ఇష్టంతో చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్‌ను వదిలేసి, తనదైన డిజైన్ శైలిని దుస్తులపైన చూపుతున్నారు మాదాపూర్‌లో ఉంటున్న కావ్యారెడ్డి. నేత కార్మికులతో కలిసి వింటేజ్, క్రియేటివ్ డిజైన్స్‌ని రూ పొందిస్తున్నారు. వారి జీవనశైలిపైన డాక్యుమెంటరీ రూ పొందించారు. చిత్రకారిణిగా, శాస్త్రీయ నృత్యకారిణిగా, యోగా ట్రైనర్‌గానూ రాణిస్తున్న కావ్య ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లనూ,వాటిని తాను ఎదుర్కొంటున్న తీరును ఇలా వివరించారు.‘‘చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ రంగం అంటే చాలా ఇష్టం. ఫ్యాషన్‌ని కెరీర్‌గా మార్చుకోవాలని చాలా ప్రయత్నించాను. కానీ, బీటెక్ అయ్యాక సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగిగా మారి పోయాను. నా సొంత సం పాదనతో డిజైనింగ్ రంగంలోకి రావాలని ఆలోచన. దాంతో ఉద్యోగిగా ఉన్నా నాదైన సొంత డిజైన్స్‌ను ప్లాన్ చేస్తూనే ఉన్నాను. ఉద్యోగినిగా మంచి పొజిషన్లో ఉన్నా అది మానేసి, ఫ్యాషన్ కాలేజీలో స్టూడెంట్‌గా జాయిన్ అయ్యాను. కోర్సు పూర్తయ్యాక ఒక ఫ్యాషన్ కంపెనీలో ఉద్యోగినిగా చేరి, కమర్షియల్‌గా మన ఆలోచనలను ఎలా తీసుకువెళ్లాలో నేర్చుకున్నాను. కెమెరా, గ్రాఫిక్స్, డిజిటల్ మార్కెటింగ్.. ఇవన్నీ నేర్చుకొని మూడేళ్ల క్రితం ‘సఖ్య’ పేరుతో నా సొంత బ్రాండ్‌ను ప్రారంభించాను.రీల్.. రియల్..కాబోయే వధూవరుల డ్రెస్సింగ్‌కి మా డిజైన్ స్టూడియోకి వస్తారు. వారి స్కిన్ టోన్, హైట్.. దృష్టిలో పెట్టుకొని వివిధ రకాల మోడల్ డ్రెస్సులతో మా దగ్గరే ఒక ర్యాంప్‌వాక్ చేయిస్తాను. దానిని కెమెరాలో రికార్డ్ చేసి, ఇస్తాను. అదేవిధంగా రియల్‌గా ఎలా ఉన్నారో 3 మిర్రర్ కాన్సెప్ట్‌తో చూపిస్తాను. దీంతో సరైన ఫిటింగ్, డిజైన్, కలర్.. ఇవన్నీ చూసుకొని వారు సంతృప్తి చెందితేనే డిజైన్ చేసి ఇస్తాను.మరిన్ని డిజైన్ల కోసం..ఆర్గానిక్ వైట్ క్లాత్ తీసుకొని, ఆర్గానిక్ డైస్‌తో మా ప్రత్యేకమైన డిజైన్స్ వేయిస్తాను. వాటిని డెవలప్ చేసి, ఆ డిజైన్స్‌ని ఉపయోగిస్తాం. డిజైన్‌కి రెప్లికా లేకుండా చూడటమే మా ప్రత్యేకత. సినీతారలు, అవార్డు ఫంక్షన్లకు నా డిజైన్స్ వెళుతుంటాయి. ఫ్యాషన్ కాలేజీలలో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడమూ చేస్తుంటాను. ఈ రంగంలో చూపుతున్న ప్రతిభకు అవార్డులూ అందుకున్నాను. వచ్చిన ఆర్డర్‌ను టైమ్ ప్రకారం ఇవ్వడం ఒక పెద్ద టాస్క్. దీంట్లో మెటీరియల్, వర్కర్స్, డబ్బును తిరిగి రాబట్టుకోవడం, మెయింటెనెన్స్... ప్రతిదీ యుద్ధమే. స్త్రీ ఎదగాలని చేసే ప్రతి ప్రయత్నంలో అన్నింటా అడ్డంకులు ఉంటాయి. ఇన్నింటిలో నా సొంత ఆసక్తులను వదలుకోను. పెయింటింగ్స్ వేస్తుంటాను. శాస్త్రీయ నృత్యంలో సాధన చేస్తుంటాను. యోగా ట్రైనర్‌గా క్లాసులు తీసుకుంటాను’’ అంటూ ఈ జీవన యుద్ధంలో తన పోరాట పటిమను పెంచుకుంటున్న తీరును వివరించారు ఈ డిజైనర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిమన చేనేతలుగద్వాల్, పోచంపల్లి, ధర్మవరం.. ఒక్కో హ్యాండ్లూమ్కి సంబంధించి పది చీరలు స్పెషల్‌గా డిజైన్ చేస్తాను. వాటి ప్రింట్లు, డిజైన్ ప్రత్యేకంగా క్రియేట్ చేస్తాను. చేనేత కారుల జీవన విధానంపైన డాక్యుమెంటరీ చేశాను. వారిలో ఎంతో సృజన ఉంది. అయితే వారు చెప్పేదేమంటే–‘మేం మా ప్రాణం పెట్టి రోజులు, నెలలు కష్టపడి ఒక చీర డిజైన్ చేస్తాం. అలాంటిదే నార్త్ నుంచి రెప్లికాలు తెచ్చి, మా జీవనో పాధిని దెబ్బతీస్తున్నారు’ అనే బాధను వ్యక్తం చేశారు. -
మిలన్ ఫ్యాషన్‌వీక్ : రొటీన్‌గా కాకుండా బోల్డ్ లుక్‌లో మెరిసిన ఆలియా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ డెమ్నా లేటెస్ట్ కలెక్షన్ లాంచింగ్ వినూత్నంగా కనిపించింది. తన సాధారణ స్టైల్‌కి భిన్నంగా మిలాన్ ఫ్యాషన్‌వీక్ 2025(Milan FashionWeek)లో అందరి దృష్టినీ అలరించింది. గూచీ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ (Gucci global brand ambassador) ఆలియా ఫర్ కోట్లో హాట్ లుక్స్‌లో అదరగొట్టింది.ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ గూచీ క్రియేటివ్ డైరెక్టర్ డెమ్నాతొలి కలెక్షన్‌ను ప్రదర్శించిన సినిమాటిక్ దృశ్యం ది టైగర్ ప్రత్యేక చలనచిత్ర ప్రదర్శనకు హాజరైంది. బోల్డ్ దుస్తులను పాయింటెడ్-టో బ్లాక్ హీల్స్,టాప్ హ్యాండిల్ , చైన్ స్ట్రాప్‌తో కూడిన చిన్న, స్ట్రక్చర్డ్ బ్లాక్ లెదర్ హ్యాండ్‌బ్యాగ్ లుక్‌ను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by GUCCI (@gucci) ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రనిర్మాత స్పైక్ జోన్జ్ , మేటి దర్శకురాలు హలీనా రీజ్న్ దర్శకత్వం వహించిన ఆకర్షణీయమైన లఘు చిత్రం ‘ది టైగర్’ ప్రీమియర్ ద్వారా గూచీ సినిమా , హై ఫ్యాషన్‌పై తన నిబద్దతను చాటుకుంది. ఈ ప్రీమియర్‌లో ఆలియా గూచి లా ఫామిగ్లియా లెక్షన్ను ఆవిష్కరించింది.ఈ సందర్భంగా నెక్లైన్తో కూడిన మినీ డ్రెస్‌కి ఫాక్స్ ఫర్ కోట్ లుక్ మరింత అందాన్నిచ్చింది. స్టేట్మెంట్ GG చెవిపోగులు , గూచీ వెదురు బ్యాగ్ మరో స్పెషల్ ఎట్రాక్షన్. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) ఈ సందర్భంగా డిసెంబర్ 25, 2025న విడుదల కానున్న తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆల్ఫా’ గురించి అలియా ఒక అప్డేట్ను అందించింది. విడుదల గురించి నటి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. అయితే, ఇది నా తొలి యాక్షన్ వెంచర్,ప్రేక్షకులు దానితో ఎలా కనెక్ట్ అవుతారో అని ఆసక్తిగా ఉన్నానని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యపై అభిమానులు భిన్నంగా స్పందించారు.ఆలియా ఇప్పటికే జిగ్రా ,హార్ట్ ఆఫ్ స్టోన్లో యాక్షన్ సన్నివేశాల్లో నటించిందిగా అని కొంతమంది నెటిజన్లు ప్రతిస్పందించారు. -
అమ్మ చీర చుట్టేసి..ఫ్యాన్స్‌ను కట్టిపడేసి : జాన్వీ అమేజింగ్ లుక్
ముంబైలో జరిగిన హోమ్‌బౌండ్ స్పెషల్ స్క్రీనింగ్‌లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చాలా ప్రత్యేకంగా కనిపించింది. తన తల్లి, దివంగత లెజెండరీ నటి శ్రీదేవి చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది తన రాబోయే చిత్రం హోమ్‌బౌండ్ ప్రత్యేక షోలో ఒకపుడు శ్రీదేవి ధరించిన నేవీ (రాయల్ బ్లూ ) బ్లూ చీర, జాకెట్టులో తళుక్కున మెరిసింది. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ,విరాట్ కోహ్లీ వివాహ రిసెప్షన్లో శ్రీదేవి ఈ చీరను ధరించారు. అదే చీరలో అద్భుతమైన తన లుక్‌తో జాన్వీ అభిమానులను ఆశ్చర్యపరిచింది.బంగారు ఎంబ్రాయిడరీతో రూపుదిద్దుకున్న ఈ నేవీ బ్లూ చీరకు బ్లాక్ వెల్వెట్ బ్లౌజ్‌తో జత చేయగా, స్టేట్మెంట్ చెవిపోగులు, చోకర్-స్టైల్ నెక్లెస్ , సొగసైన బన్‌తో లుక్‌ను పూర్తి చేసింది. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన హోమ్‌బౌండ్ 2026 ఆస్కార్‌లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీ అని ప్రకటించిన తర్వాత ఈ ప్రీమియర్ షోకు మరింత ప్రాధాన్యత ఒనగూడింది.ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఈ చిత్రాన్ని 98వ అకాడమీ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రంగా దేశ పోటీదారుగా ప్రకటించింది. ఈ చిత్రం గతంలో 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) మరియు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM)లలో ప్రదర్శించబడింది. ఇది సెప్టెంబర్ 26న భారతదేశంలో థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
అదిరే ఫ్యాషన్ లుక్ : దాండియా ధడక్
నవరాత్రులలో దాండియా ఆటలు గర్భా నృత్యాలు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేలా ఉంటాయి. ఈ ఆటపాటలలో పాల్గొనే వారు మరింత సౌకర్యంగా ఉండేలా చూపరులకు కనువిందు చేసేలా... ప్రత్యేక డ్రెస్సులూ ఉంటాయి. ముదురు రంగులు, అద్దాల మెరుపులు, ఎంబ్రాయిడరీ చేసిన లెహంగాలు, ధోతీ ప్యాంట్స్‌కి ఆధునికపు హంగుల అమరిక ఈ రోజుల్లో ముచ్చట గొలుపుతుంటాయి. నవరాత్రి గర్భా, దాండియా రాత్రుల కోసం ట్రెండీ దుస్తుల ఆలోచనలు నవతరాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ వైపుగా నడిపిస్తున్నాయి. ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌తో అలంకరించిన రంగురంగుల చనియా చోళి దుస్తులను స్టైల్ చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి.ధోతీ ప్యాంటుతో క్రాప్ టాప్ మిర్రర్,ఎంబ్రాయిడరీ చేసిన క్రాప్ టాప్, ధోతీ ప్యాంటు కలయిక కంఫర్ట్ స్టైల్‌తో ఆకట్టుకుంటుంది. దాండియా ఆడటానికి అనుకూలంగా ఉండే ఈ డ్రెస్ కాన్ఫిడెన్స్నూ ఇస్తుంది. ఫ్యాషన్ లుక్ కోసం ధోతీ ప్యాంటును కొత్త క్రాప్ టాప్‌తో తిరిగి వాడచ్చు.లెహెంగా అసెమెట్రికల్ కుర్తీఅసెమెట్రికల్ కుర్తీలు వేడుకలకు సరైన ఎంపికగా నిలుస్తున్నాయి. ఫ్లేర్డ్ లెహెంగాతో జత చేస్తే చూపుతిప్పుకోలేరు. ఒక డైనమిక్ ఎలిమెంట్‌ను జోడిస్తుంది. పండుగ సీజన్లో స్పెషల్ లుక్ కోరుకునేవారికిది బెస్ట్ ఆప్షన్. ప్యాంటుతో సైడ్ స్లిట్ కుర్తీసంప్రదాయ దుస్తులకు ఆధునిక టచ్‌ను ఇష్టపడే వారికి సైడ్ స్లిట్ కుర్తీ సరైన ఎంపిక. ఇది ప్లెయిన్, ఎంబ్రాయిడరీ లేదా బ్రోకేడ్ బోర్డర్లతో డిజైన్ చేసిన ప్యాంటుతో, లెహెంగా కాంబినేషన్‌గా ధరించవచ్చు.లెహెంగాతో మిర్రర్ డెనిమ్ షర్ట్ఇండో–వెస్ట్రన్ లుక్ కోసం లెహెంగాతో డెనిమ్ షర్ట్‌ను జత చేయచ్చు. ఈ ఇండో–వెస్ట్రన్ లుక్ వివిధ రకాల ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే వారికి సరైనది. క్లాసిక్ లెహెంగా, క్యాజువల్ డెనిమ్ షర్ట్ మరింత కంఫర్ట్‌గా ఉంటుంది, ఇది నవరాత్రుల్లో ప్రత్యేకంగా చూపుతుంది. సొంతంగా క్రియేషన్ పెద్ద పెద్ద జూకాలు, గాజులు, లేయర్డ్ నెక్లెస్‌లు.. జర్మన్ సిల్వర్ జ్యువెలరీని ఎంచుకోవచ్చు నృత్యం చేసే సమయం కాబట్టి వాటర్ ప్రూఫ్ మేకప్‌ను ఎంచుకుంటే లుక్ ఫ్రెష్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద బిందీలు నవరాత్రి రోజులలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. పొడవాటి జడలు, వివిధ మోడల్స్‌లో ఉన్న ముడులు, వదులుగా ఉండే హెయిర్ స్టైల్స్ బాగుంటాయి. బోహో– ఫ్యూజన్ కాంబినేషన్లో డెనిమ్ డ్రెస్‌లు పగటి పూట కూడా ఈ రోజుల్లో క్యాజువల్‌గా ధరించవచ్చు. సంవత్సరాలుగా లెహంగాలు, ఘాగ్రాలు నవరాత్రి దుస్తులుగా ఉన్నాయి కాబట్టి స్కర్టులు, కుర్తీల నుండి లేయర్డ్ ఇండో–వెస్ట్రన్ గౌన్ల వరకు ఈ రోజుల్లో ప్రయత్నించవచ్చు. ∙రంగురంగుల టాసెల్స్, రాజస్థానీ ఎంబ్రాయిడరీ ప్యాచ్‌లు, మిర్రర్ వర్క్ ఉపయోగించి పండగ థీమ్‌ను క్రియేట్ చేయవచ్చు. నవరాత్రి స్పెషల్ డ్రెస్సులు దాదాపు రూ.1500/– నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. లేదంటే ఇంట్లోనే డిజైనరీ క్రాప్ టాప్, బ్లౌజ్ లేదా చిన్న కుర్తీతో జత చేయబడిన డెనిమ్ బాటమ్స్ ధరిస్తే డ్యాన్స్ చేసేవారికి తాజా, ఉల్లాసభరితమైన వైబ్‌ను జోడిస్తాయి. పండుగ అలంకరణ కోసం దుప్పట్టా లేదా బాందిని స్టోల్ లేదా టై–డై ప్రింట్లతో స్టైల్ చేయచ్చు. నవరాత్రి ఫ్యాషన్ అనేది వ్యక్తిగత వ్యక్తీకరణతో సంప్రదాయాన్ని కళ్లకు కట్టవచ్చు. వాటిని మార్కెట్లో కొనుగోలు చేసినా, సొంతంగా తమదైన స్టైల్‌ను క్రియేట్ చేసినా, బోహో–ఫ్యూజన్ డ్రెస్సులు డ్యాన్స్ ఫ్లోర్‌పై హంగామా చేస్తాయి. ఈ పండుగ సీజన్లో సాధారణంగా కాకుండా తమదైన సొంత సృజనాత్మకతను సరికొత్తగా పరిచయం చేయచ్చు.చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు! -
2025 టు 1990
గూగుల్ జెమిని నానో బనాన ట్రెండ్ హవా కొనసాగుతుండగానే మరోవైపు నానో బనాన ఏఐ శారీ ట్రెండ్ మొదలైంది. మహిళా యూజర్లు జెమిని నానో బనాన ఇమేజ్ ఎడిటింగ్ టూల్‌ను ఉపయోగించి తమ సెల్ఫీలను 90 దశకం డ్రామటిక్ బాలీవుడ్–స్టైల్ ప్రోర్ట్రయిట్స్లోకి మార్చడమే... బనాన శారీ ట్రెండ్.ఏఐ ప్రాంప్ట్‌లతో అలనాటి అద్భుత చీరలలో మెరిసిపోవడమే బనాన ఏఐ శారీ ట్రెండ్ ప్రత్యేకత.ఈ ట్రెండ్ పుణ్యమా అని 90 దశకంలోని పాపులర్ స్టైల్స్..పోల్కా–డాట్ డిజైన్, బ్లాక్ పార్టీ–వేర్ శారీ, సాఫ్ట్ ఫ్లోరల్ యాక్సెంట్లు మళ్లీ కనువిందు చేస్తున్నాయి.మీరు కూడా ఈ ట్రెండ్‌లో భాగం కావాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి...∙జెమిని చాట్‌జీపీటీలో లాగిన్ కావాలి ∙ట్రై ఇమేజ్ ఎడిటింగ్–క్లిక్ చేయాలి. ∙క్లీయర్ సోలో ఫోటోను అప్లోడ్ చేయాలి. ∙బ్లాక్ శారీ, వైట్పోల్కా డాట్....మొదలైన వైరల్ ్రపాంప్ట్స్లో ఒకదాన్ని పేస్ట్ చేయాలి. ∙రెట్రో శారీపోర్ట్రయిట్ క్షణాల్లో కళ్లముందుంటుంది. -
బీటౌన్ ఈవెంట్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్(Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. తన తొలి ప్రాజెక్ట్‌గా "The Bads of Bollywood" అనే సాటిరికల్ యాక్షన్ డ్రామా (సెప్టెంబర్ 18) నుంచి స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిర్వహించిన స్టార్-స్టడెడ్ స్క్రీనింగ్ ఈవెంట్లో అనేక మంది ప్రముఖులు సందడి చేశారు. ముఖ్యంగా ఫ్యాషన్ ఐకాన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ (Nita Ambani) అందరి దృష్టిని ఆకర్షించారు. తన స్టైలిష్ లుక్‌తో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.ఈవెంట్‌కి తగినట్టు డైమండ్ నగలు,అద్భుతమైన చీరలు, అందానికి మించిన హందాతనంతో ప్రతీ ఈవెంట్లోనూ నీతా అంబానీ ప్రత్యేకంగా నిలుస్తారు. తాజాగా ఈవెంట్లో ఆమె దుస్తులుఅందరినీ ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె ధరించిన పచ్చని అద్భుతమైన హారమే ప్రత్యేకంగా నిలవడం విశేషం.నీతా అద్భుతమైన పరాయిబా, హృదయాకారపు వజ్రాల డబుల్ స్ట్రింగ్, వజ్రాల హారాన్ని ధరించారు. హృదయ ఆకారపు స్టడ్ చెవిపోగులు, సరిపోలే ఉంగరం ,సున్నితమైన డైమండ్ బ్రాస్లెట్తో తన లుక్‌ను మరింత ఎలివేట్ చేశారు. అలాగే ఈ హారానికి పొదిగిన టైటానియం ఫ్లవర్ పీస్మరింత ఆకర్షణీయంగా నిలిచింది. దీనికి మ్యాచింగ్ కలర్లో ఆమె ధరించిన చీర నీతా అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది.అనన్య పాండే, కరణ్ జోహార్, ఫరా ఖాన్, బాబీ డియోల్, అలియా–రణ్‌బీర్, విక్కీ కౌశల్ మరియు అనేక మంది స్టార్-స్టడెడ్ సాయంత్రం హాజరయ్యారు. సందడిగా సాగిన ఈ స్క్రీనింగ్ ఈవెంట్లో అంబానీ ఫ్యామిలీ మరో ఎట్రాక్షన్. సెలబ్రిటీలతో పాటు, అంబానీలు కూడాను అందంగా తీర్చిదిద్దారు. నీతా అంబానీ తన భర్త ముఖేష్ అంబానీ చేతిలో చేయి వేసి, రెడ్ కార్పెట్‌పై పోజులిచ్చారు. ఇంకా ఆకాష్ రాధిక , శ్లోకా, ఇషా అంబానీ మెరిసారు. ఆకాష్ అంబానీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) గ్రాండ్ ప్రీమియర్ కోసం, రాధిక బోల్డ్ రెడ్ స్ట్రాప్‌లెస్ గౌను ధరించి, డైమండ్ నెక్లెస్ మరియు బ్రాస్లెట్తో పాటు చిన్న రెడ్ క్లచ్ బ్యాగ్‌తో తన లుక్‌ను అలంకరించింది. శ్లోకా షీర్ కార్సెట్-స్టైల్ బాడీస్ , భారీ ప్యాట్రన్డ్ స్కర్ట్‌తో కూడిన నేవీ-బ్లూ గౌనును ఎంచుకున్నారు, ఆకాష్ క్లాసిక్ బ్లాక్ వెల్వెట్ టక్సేడోలో చాలా అందంగా కనిపించారు. -
సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్ అడ్రస్‌గా..ప్రధాని మోదీ డ్రెస్సింగ్ స్టైల్
ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంతేగాదు ఆ పార్టీ శ్రేణులు తమ ప్రియతమ నేత పుట్టినరోజుని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు కూడా. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్‌లోని థార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలతో కాసేపు ముచ్చటించారు. అక్కడ మోదీ వేదికపైకి రాగానే ఆ రాష్ట్ర సాంస్కృతికి అద్దం పట్టే గులాబీ రంగు తలపాగా(పగ్డి), జాకెట్‌ను బహుకరించారు. ఆ పగ్డిపై(తలపాగ) క్లిష్టమైన బంగారం, ముత్యాలతో ఎంబ్రాయిడరీ చేయడగా, బంజారా సమాజం శక్తిమంతమైన చేతి పనికి నిదర్శనం జాకెట్‌పై లంబానీ ఎంబ్రాయిడరీ ఉంది. వీటితోపాటు ధార్ జిల్లాకు చెందిన ప్రసిద్ధ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్త్రం పై సహజరంగులతో కూడిన రేఖాగణిత నమునాలు ఉన్న స్కార్ఫ్‌ను కూడా మోదీకి బహుకరించారు. ఇది ఆయన 75వ పుట్టినరోజు అయినప్పటికీ తన సిగ్నేచర్ శైలికే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రజలు ఇచ్చిన అభిమాన బహుమతులు, దుస్తుల కారణంగా మోదీ డ్రెస్సింగ్ స్టైల్ సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆ కానుకలతో మోదీ లుక్‌లో మధ్యప్రదేశ్ సాంస్కృతిక వారసత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆయన ఈ పుట్టినరోజుని పీఎం మిత్ర పార్కుకి పునాది రాయి వేయడం, అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ ఆరోగ్య పథకాల ప్రారంభంతో జరుపుకోవడం విశేషం. ఇక ఆ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ..స్వావలంబన చర్య తీసుకోవాలనే పిలుపునిస్తూ ప్రసంగించారు. "ఇది పండుగల సమయం. మన స్వదేశీ ఉత్పత్తుల మంత్రాన్ని పునరావృతం చేస్తూ ఉండాలి. 140 మంది కోట్ల భారతీయులు ఏది కొనుగోలు చేసినా..అది మేడ్ ఇన్ ఇండియాగానే ఉండాలని అభ్యర్థిస్తున్నా. వికసిత్ భారత్‌కు మార్గం వేసి, ఆత్మనిర్బర్ భారత్‌గా ముందుకు సాగాలన్నారు. ఎప్పుడైతే మనం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే కొనుగోలు చేస్తామో, అప్పుడూ డబ్బు మన దేశంలోనే ఉంటుంది, పైగా ఆ డబ్బుని అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించవచ్చని అన్నారు. అలాగే మహేశ్వరి చీరలు, పీఎం మిత్రా పార్క్ ప్రాముఖ్యత గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇక్కడ పట్టు, పత్తి లభ్యత, నాణ్యత తనిఖీలు, సులభమైన మార్కెట్ యాక్సెస్ వంటివి నిర్ధారిస్తారని అన్నారు. దాంతోపాటు స్పిన్నింగ్, డిజైనింగ్, ప్రాసెసింగ్, ఎగుమతి అన్నీ ఒకే చోట జరుగుతాయని చెప్పారు. అదీగాక ఈ చీరలు, వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా తమ ముద్ర వేస్తూ, దేవి అహల్యాబాయి హోల్కర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి..మన మాతృభూమిని ప్రపంచ మార్కెట్లో ప్రకాశవంతంగా మెరిసేలా చేయగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. .(చదవండి: ప్రపంచంలోనే తొలి ఏఐ కేబినేట్ మంత్రి..! ఎందుకోసం అంటే..) -
మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..!
కలలకు ఆకాశమే హద్దు అనడానికి ఉదాహరణ డిజైనర్ సౌరభ్ పాండే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన అతని పేరు ఈరోజు ప్రపంచ ఫ్యాషన్ వేదికలపై వినిపిస్తోంది. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ యువకుడు, తన కలలకోసం కష్టపడుతూ, పట్టుదలతో ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓ ప్రత్యేకతను చూపుతున్నాడు.స్కూల్ కెళ్లే సమయంలోనే సౌరభ్‌కి డ్రాయింగ్, డిజైన్స్ పై ప్రత్యేక ఆసక్తి. పాత బట్టలను కొత్తగా కట్ చేసి, రంగులు కలిపి, తన గ్రామంలోనే చిన్న చిన్న డిజైన్స్ చేస్తూ, ‘ఫ్యాషనః అంటే ఏంటి?’ అనే ప్రశ్నకు తన స్టైల్లో సమాధానం చెప్పేవాడు.సవాళ్లే అవకాశాలకు మార్గంఉన్న ఆ చిన్న ఊళ్లో అవకాశాలు లేవు. ఫ్యాషన్ కోర్సులు, స్టడీ మెటీరియల్, ఫ్యాబ్రిక్ అందనంత దూరంలో ఉన్నాయి. అయినా అతని కృషి ఆగలేదు. నీరసపడలేదు. పేపర్‌పైన స్కెచ్‌లు వేసి, సోషల్ మీడియాలో తన టాలెంట్‌ను ప్రదర్శించాడు. అదే అతనికి పెద్ద అవకాశాలు తెచ్పిపెట్టింది.అంతర్జాతీయ బ్రాండ్ల దృష్టిసౌరభ్ పనిని గమనించిన ప్రతిభావంతులు అతన్ని మొదట స్థానిక ఈవెంట్లలో ΄ాల్గొనమని ఆహ్వానించారు. అటు నుంచి 17 ఏళ్ళ వయసులో అతన్ని ముంబై వైపుగా నడిపించింది. ఆ మహా నగరంలో మనుగడ కష్టమే. ఒక చిన్న ఇల్లు లాంటి గదిలో తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి ఉండేవాడు. ఇల్లు గడవడం కోసం ఒక మాల్లో 12 గంటలు షిఫ్టులో పనిచేస్తూ, రాత్రిళ్లు ఫ్యాషన్ డిజైన్లు గీస్తూ వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. అతను తన పరిస్థితుల కంటే పెద్ద లక్ష్యాన్ని చాలా ఏకాగ్రతతో నడిపించాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా సౌరభ్ పనిని గమనించినప్పుడు అతని జీవితం గొప్ప మలుపు తిప్పింది. ఒక అవకాశం మరికొన్ని మార్గాలను చూపించింది. అక్కడి నుంచి అతని డిజైన్లు గూచీ, డియోర్, ప్రాడా వంటి ప్రపంచ లగ్జరీ బ్రాండ్ల దృష్టికి వచ్చాయి. ఇప్పుడు అతను ఈ ఫ్యాషన్ హౌస్‌లతో కలసి ప్రత్యేక కలెక్షన్లు రూపొందిస్తున్నాడు.స్టైల్ ప్రత్యేకతభారతీయ సంప్రదాయ బట్టల టెక్స్చర్స్కి ఆధునిక డిజైన్ల కలయిక, నేచురల్ కలర్స్, ఎకో–ఫ్రెండ్లీ ఫాబ్రిక్‌ల వాడకం, సింపుల్ కట్లు, గ్లోబల్ లుక్ .. ఈ ప్రత్యేకతలు అతన్ని అందరిలో ముందుంచుతున్నాయి. ఫ్యాషన్ వేదికల మీద అతని డిజైన్స్ ప్రదర్శించేంతగా వెళ్లింది. సోషల్ మీడియాలో అతని విచిత్రమైన వీడియోలకు ఎగతాళి చేసిన జనమే, ఆ తర్వాత అవే వీడియోలకు కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. తిరస్కరణ, ఎగతాళి నుండి ఇప్పుడు అతను కోట్లు సంపాదించేంతగా ఎదిగాడు. తన కథను తానే తిరగ రాసుకున్నాడు. అతన్ని సక్సెస్ గురించి అడిగితే ‘ఎవ్వరు ఏమనుకున్నా నేను నాలా ఉండటమే నాకు ఇష్టం. అదే నా నిజమైన ఫ్యాషన్ స్టేట్మెంట్’ అంటాడు. మారుమూల గ్రామాల యువతకు సౌరభ్ ఒక స్ఫూర్తి. ‘కల అంటే పెద్దది కావాలి. మన దగ్గర వనరులు లేకపోయినా, కష్టపడితే ప్రపంచమే మన దారికి రావచ్చు’ అని అతను చెప్పే సందేశం ప్రతి యువకుడిలో కొత్త ఆశను నింపుతోంది. (చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?) -
నన్హీ పరీ
ఈ రోజుల్లో పిల్లలందరూ ప్రతిభాఘనులే! అయితే చదువు ఒత్తిడిలో అది మసకబారుతోంది! అలాంటి పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు తమ ప్రజ్ఞను ప్రదర్శించడానికి భువనేశ్వర్‌లోని కిట్స్ (కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వేదిక కల్పిస్తోంది.. ‘నన్హీ పరీ లిటిల్ మిస్ ఇండియా’ పేరుతో!ఈ పోటీల్లో పదమూడేళ్ల నుంచి పదిహేనేళ్ల బాలికలందరూ పాల్గొనవచ్చు! విజేతలకు క్యాష్ప్రైజ్తోపాటు గెలుపొందిన స్థానాన్ని బట్టి కిట్స్‌లో తమకు ఇష్టమైన కోర్స్‌లో ఉచిత, భారీ రాయితీలతో విద్యనూ అందిస్తోంది. ఆ వివరాలు.. టాలెంట్ లేని పిల్లలు కనపడట్లేదిప్పుడు. ఇంజినీరింగ్, మెడిసిన్ చదువులకు స్కూల్ నుంచే పునాది వేస్తూ పిల్లల్లోని సహజమైన ప్రతిభను బయటకు రానీకుండా చేస్తున్నాం. దానివల్ల వాళ్లు తమకు పరిచయంలేని పదిమంది ముందుకు రావడానికి జంకుతున్నారు. మాట్లాడ్డానికి వణుకుతున్నారు. వేదికెక్కడానికి వెనుకాడుతున్నారు. దాన్ని గమనించింది.. ఆడపిల్లల చదువు కోసం కొన్ని దశాబ్దాలుగా పాటుపడుతున్న కిట్స్. ఒక్క చదువుకే కాదు బాలికల ప్రతిభాపాటవాలకూ ప్లాట్‌ఫామ్ కావాలని నిశ్చయించుకుంది. 2001లో ఒడిశాలో ‘నన్హీ పరీ లిటిల్ మిస్ ఇండియా’ పోటీలను మొదలుపెట్టింది. 2004కల్లా ఉత్తర భారతంలోని ప్రతి రాష్ట్రం పాల్గొనే స్థాయికి ఎదిగింది. 2015లో దక్షిణాది రాష్ట్రాలకూ చేరిన ఈ పోటీలు ఇప్పుడు జాతీయ స్థాయిని అందుకున్నాయి. ఈ ఏడు పాతికేళ్ల సంబరాన్ని జరుపుకోనున్నాయి. వీటి కోసం తెలుగు రాష్ట్రాల బాలికలకు ఈ నెల 20న హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీలో ఆడిషన్స్ జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 13–15 ఏళ్ల బాలికలు తమ పరిచయంతోపాటు తమ ప్రతిభను చూపే వన్ మినిట్ వీడియోను https://forms.gle/ 1QzSwfVcuPy5jTto8 అనే లింక్‌కి గానీ, 8790161155/ 8790163355 నంబర్లకు వాట్సాప్ గానీ, kiitnanhipari.hyd@ gmail.comకి మెయిల్ గానీ చేయొచ్చు. ఆఖరు తేదీ 15 సెప్టెంబర్. 20వ తేదీన జరిగే ఆడిషన్స్‌లో ఇంట్రడక్షన్, పెర్ఫార్మెన్స్ అనే రెండు రౌండ్లు ఉంటాయి. ఇందులోంచి ఇద్దరు భువనేశ్వర్‌లో జరిగే ఫైనల్స్‌కి ఎంపిక అవుతారు. అలా దేశమంతటా ఆడిషన్స్ జరిగి.. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికై ఫైనల్ పోటీలకు వస్తారు. రెండు రోజులు జరిగే ఈ పోటీల్లోంచి ముగ్గురు విజేతలను ఎంపికచేస్తారు. మొదటి బహుమతిగా పదిలక్షల క్యాష్ ప్రైజ్, కళింగ ఇన్స్టిట్యూట్లో ఉచిత విద్య, ఫస్ట్ రన్నరప్‌కి రూ. అయిదు లక్షల క్యాష్ ప్రైజ్, కిట్స్‌లో యాభై శాతం ఫీజు డిస్కౌంట్, సెకండ్ రన్నరప్‌కి రూ. మూడు లక్షల క్యాష్ ప్రైజ్, కిట్స్‌లో యాభై శాతం ఫీజు డిస్కౌంట్ ఉంటుంది. ఇవికాక మరో పది కేటగిరీల్లో కేటగిరీకి రూ. 20 వేల చొప్పున మొత్తం రూ. 2 లక్షల క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఇలా ఈ పోటీలు భవిష్యత్‌లో అమ్మాయిలు పలు అంతర్జాతీయ వేదికల మీద బెరుకు లేకుండా పెర్ఫార్మెన్స్ ఇచ్చేలా... ఇలాంటి పోటీల్లో నిర్భయంగా పాల్గొనేలా తర్ఫీదునిస్తున్నాయి. -
ఇండో వెస్ట్రన్ అంటే ఇష్టం: అనుపమ పరమేశ్వరన్
‘ఫ్యాషన్ అంటే మనల్సి మనం అందంగా తీర్చిదిద్దుకోవడం.. సౌందర్యంగా కనిపిస్తూనే సౌకర్యంగా ఉండటం మరింత బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఈ మధ్యనే సరికొత్త కథాంశంతో విడుదలైన ‘పరదా’ సినిమాలో మగువల భావోద్వేగాలను, సామాజిక పరిస్థితులను తెరకెక్కించాం. ఇది ప్రభావవంతమైన కథాంశం, నటన పరంగానూ అందరి ప్రశంసలు పొందింది.’ అంటూ చెప్పుకొచ్చారు అందాల తార అనుపమ పరమేశ్వరన్. నగరంలోని బంజారాహిల్స్ వేదికగా స్వదేశీ ఫ్యాషన్ బ్రాండ్ ‘బిబా’ ఫ్లాగ్ప్ స్టోర్‌లో సోమవారం సందడి చేశారు. ఈ వేదికపై నూతనంగా రూపొందించిన ఫెస్టివ్ కలెక్షన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనుపమ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఫ్యాషన్ ట్రెండ్స్, తదుపరి సినిమాల విశేషాలు ఆమె మాటల్లోనే..! హైదరాబాద్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ఫ్యాషన్ హంగులను చూస్తే సంతోషంగా అనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఇండో వెస్ట్రన్ ఫ్యాషన్ వేర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇదే నా స్టైల్ స్టేట్మెంట్. ముఖ్యంగా కాటన్, స్మూత్కాటన్ ఇష్టపడతాను. గ్రాండ్ లుకింగ్ కన్నా కంఫర్ట్ ముఖ్యం. మన మూలాల్లోని ఫ్యాబ్రిక్, సంస్కృతి–అధునాతన డిజైనింగ్ సమ్మిళిలితం చేస్తే ఎక్కువగా ఆకర్షిస్తుంది. వాటిని ప్రోత్సహిండం ఇష్టం. బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అమ్మాయిలకు అనువుగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి శారీస్, ఈవెంట్స్‌ను బట్టి డ్రెస్ వేసుకుంటా. మహిళల ఫ్యాషన్ వేర్ అంతర్గత శక్తిని, మానసిక స్థితిని తెలియజేస్తుందని నమ్ముతాను. నాకు రెడ్ కలర్, మస్టర్డ్ యెల్లో రంగుల దుస్తులే నచ్చుతాయి. రెడ్ అంటే పవర్ఫుల్.. నేను ఎక్కువ షాపింగ్ చేయను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లినప్పుడు కచి్చతంగా షాపింగ్ చేస్తుంటాను. సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి షూటింగ్స్ వెళ్లినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో, సందడి లేని ఇతర షాపింగ్ ప్రదేశాల్లో కొనుగోలు చేస్తాను. ‘డిఫరెంట్ బై డిజైన్’ అనే ఫిలాసఫీని ప్రతిబింబించేలా బిబా అందిస్తున్న దసరా కలెక్షన్ మన సాంస్కృతిక మూలాలను గుర్తుచేస్తుంది. వరుస షూటింగ్స్‌తో బిజీ.. సినిమాల పరంగా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ వాతావరణంలో సరికొత్త అనుభూతిని పొందుతాను. ఈ మధ్యే తెలుగులో నా ‘పరదా’ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో ‘కిష్కిందపురి’ సినిమా విడుదల కానుంది. కిష్కిందపురి తరువాత ‘బైసన్’ కూడా విడుదలకు సిద్ధమౌతోంది. ఈ రెంటితో పాటు ‘భోగీ’ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది షూటింగ్ పూర్తి కానుంది. మరో తెలుగు సినిమాలోనూ నటిస్తున్నాను. ఇవి కాకుండా మలయాళంలో మరో రెండు సినిమాలు చేస్తున్నా. -
పట్టులాంటి జుట్టు కోసం..!
ఒత్తైన జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే చాలామంది పొడవాటి, నల్లని కురుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి కారణంగా చిట్కాలు కూడా పనిచేయడం లేదు. దీంతో జుట్టు విపరీతంగా రాలిపోతోంది. కొన్నిసార్లు జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం లభించకపోవచ్చు. అటువంటి వారికి నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ హ్యాట్ అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న శక్తిమంతమైన ఎల్ఈడీ డయోడ్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న టోపీ పేరు రెడ్ లైట్ థెరపీ బెరెట్ హ్యాట్. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. జుట్టును పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ టోపీలో ఉన్న ఎరుపు రంగు లైట్లు జుట్టు కుదుళ్లకు కాంతిని అందిస్తాయి. ఈ కాంతి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ (ఏటీపీ) ఉత్పత్తిని పెంచి కణాలకు శక్తిని అందిస్తుంది. దీంతో కుదుళ్లు బలంగా మారి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ కాంతి తలలోని రక్తప్రసరణను పెంచుతుంది. ఈ టోపీలో ఆప్షన్ల ప్రకారం నీలి రంగుల లైట్లు కూడా ఉంటాయి. నీలి రంగు లైట్లు స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచి, చుండ్రును తగ్గిస్తాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. ఈ పరికరం స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచి పొడవాటి జుట్టును అందిస్తుంది. బ్యాటరీతో పనిచేసే ఈ టోపీని ఎక్కడైనా సులువుగా వాడుకోవచ్చు. ఈ టోపీని స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఉపయోగించవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు 30 నిమిషాల పాటు ఈ టోపీ పెట్టుకుంటే చాలు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. దీని ధర 44 డాలర్లు అంటే రూ.3,852 అన్నమాట. ఇదే మోడల్లో టెక్నాలజీ పెరిగేకొద్దీ ధరలో మార్పు ఉంటుంది.ఒతై ్తన జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే చాలామంది పొడవాటి, నల్లని కురుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి కారణంగా చిట్కాలు కూడా పనిచేయడం లేదు. దీంతో జుట్టు విపరీతంగా రాలిపోతోంది. కొన్నిసార్లు జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం లభించకపోవచ్చు. అటువంటి వారికి నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ హ్యాట్ అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న శక్తిమంతమైన ఎల్ఈడీ డయోడ్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న టోపీ పేరు రెడ్ లైట్ థెరపీ బెరెట్ హ్యాట్. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. జుట్టును పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ టోపీలో ఉన్న ఎరుపు రంగు లైట్లు జుట్టు కుదుళ్లకు కాంతిని అందిస్తాయి. ఈ కాంతి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ (ఏటీపీ) ఉత్పత్తిని పెంచి కణాలకు శక్తిని అందిస్తుంది. దీంతో కుదుళ్లు బలంగా మారి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ కాంతి తలలోని రక్తప్రసరణను పెంచుతుంది.ఈ టోపీలో ఆప్షన్ల ప్రకారం నీలి రంగుల లైట్లు కూడా ఉంటాయి. నీలి రంగు లైట్లు స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచి, చుండ్రును తగ్గిస్తాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. ఈ పరికరం స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచి పొడవాటి జుట్టును అందిస్తుంది. బ్యాటరీతో పనిచేసే ఈ టోపీని ఎక్కడైనా సులువుగా వాడుకోవచ్చు. ఈ టోపీని స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఉపయోగించవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు 30 నిమిషాల పాటు ఈ టోపీ పెట్టుకుంటే చాలు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. దీని ధర 44 డాలర్లు అంటే రూ.3,852 అన్నమాట. ఇదే మోడల్లో టెక్నాలజీ పెరిగేకొద్దీ ధరలో మార్పు ఉంటుంది.పట్టులాంటి జుట్టుకు...పట్టులా సుతిమెత్తగా ఉండే జుట్టు అందాన్ని పెంచుతుంది. జుట్టు మృదువుగా ఉంటే స్టైలింగ్ చేయడం కూడా ఈజీ. అయితే పెరిగిన కాలుష్యం, జుట్టుపై సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో జుట్టు పొడిబారి, రఫ్‌గా మారుతుంది. ఇలాంటి జుట్టుకు తగిన తేమ, పోషణను అందించే చికిత్సే డీప్ కండిషనింగ్. ఈ డీప్ కండిషనింగ్ హెయిర్ ట్రీట్మెంట్ వల్ల జుట్టు తేమగా, ఆరోగ్యంగా మారుతుంది. దీంతో మెరిసే జుట్టును పొందవచ్చు. ఇంట్లో డీప్ కండిషనింగ్ చేసుకోవాలనుకునేవారు ముందుగా హెయిర్ మాస్క్ ఎంపిక చేసుకోవాలి. పెరుగు–తేనె, గుడ్డు–ఆలివ్ నూనె మాస్క్ అయితే బెటర్. కండిషనింగ్ చేసుకునే ముందు తక్కువ గాఢత ఉన్న షాంపూతో తల స్నానం చేయాలి. జుట్టు ఆరిన తర్వాత హెయిర్ మాస్క్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే సుతిమెత్తని జుట్టు మీ సొంతమవుతుంది. ఇంట్లో డీప్ కండీషనింగ్ చేసుకోలేని వారు పార్లర్‌కు వెళ్లవచ్చు. బ్యూటీ పార్లర్లోని నిపుణులు జుట్టు రకాన్ని బట్టి ప్రత్యేకమైన ఉత్పత్తులతో కండిషనింగ్ చేస్తారు. అవసరం బట్టి పార్లర్లో స్టీమ్ థెరఫీ కూడా ఇస్తారు. దీనివల్ల జుట్టుకు మరింత పోషణ అందుతుంది. కురులు అందంగా, ఆకర్షణీయంగా మారుతాయి. (చదవండి: రక్తపరీక్షతో ప్రీఎక్లాంప్సియా గుర్తింపు!) -
మిస్–మిసెస్ బెలెజా
అందం, తెలివితేటల కలబోతగా సాగిన మిస్–మిసెస్ బెలెజా గ్రాండ్ ఫినాలే ఆకట్టుకుంది. సోమాజిగూడలోని హోటల్ కత్రియాలో జరిగిన తుది పోటీలో మిస్ కేటగిరీ విజేతగా డీ.కావ్యాంజలి, ఫస్ట్ రన్నరప్‌గా కందకట్ల ప్రత్యూష, సెకండ్ రన్నరప్‌గా వీ.జానకీ దేవి నిలిచారు. మిసెస్ కేటగిరీ విజేతగా ఇందిరా దేవి, ఫస్ట్ రన్నరప్‌గా డా.పీ.నిఖిలా రెడ్డి, సెకండ్ రన్నరప్‌గా అవుల రేవతి గెలుపొందారు. కార్యక్రమానికి వైద్యులు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్న్ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, గృహిణులతో పాటు విభిన్న రంగాలకు చెందిన 20 మంది ఫైనలిస్ట్‌లు పోటీపడ్డారు. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి నెరళ్ల మల్యాద్రితో పాటు బెలెజా వ్యవస్థాపకురాలు వందన దాసరి, సోషలైట్ సుధాజైన్ పాల్గొన్నారు. (చదవండి: సంపదలోనే కాదు ఆరోగ్యంగానూ బిలియనీరే..! ఆ ఒక్క సూత్రంతో..) -
కూల్ మాన్సూన్లో..స్పెషల్ హాట్ ట్రీట్స్..!
వర్షాకాలంలో మనసు వెచ్చదనాన్ని కోరుకుంటుంది. వెచ్చని నీడతో పాటు వేడి వేడి పానీయాలను కూడా ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. ఈ సీజన్‌కు అనుగుణంగా నగరవాసులను ఆకట్టుకునే క్రమంలో.. మాన్సూన్ కోసం నగర కేఫ్స్‌లో కొత్త అందాలను.. వాటి మెనూతో సరికొత్త రుచులను సంతరించుకుంటాయి. ముసురు పట్టిన వాతావరణంలో ముచ్చటైన వేడి వేడి రుచులను ఆస్వాదించే సిటిజనుల్లో ఎవరి రూటు వారికే సపరేట్.. అలా వెచ్చదనాన్ని అందించే పానీయాల్లో కొన్నింటి గురించి.. వర్షాకాలంలో మరీ ముఖ్యంగా ఆస్వాదించే ఒక ముఖ్యమైన పానీయం చాయ్/ కాఫీ. ముసురు పట్టిందంటే చాలు ఈ దుకాణాలు జనంతో కిటకిటలాడిపోతాయి. వీటిని బంకమట్టితో తయారైన సంప్రదాయ పాత్రలైన కప్పులో అందిస్తారు. అలాగే అల్లం టీ (అద్రాక్ చాయ్) కూడా రుతుపవనాల సీజన్‌కు రుచికరమైన ఎంపిక. చాయ్‌తో మరిగించిన తురిమిన తాజా అల్లం అలరిస్తుంది. బంజారాహిల్స్‌లోని రోస్టరీ కాఫీ హౌస్ వీటికి పేరొందింది. అలాగే బంజారాహిల్స్‌లోనే ఉన్న రోస్ట్ సీసీఎక్స్లో అమెరికానో కూడా చాలా మంది ఫేవరెట్. జూబ్లీ హిల్స్ కేఫ్ వంటి కేఫ్స్‌లో డార్క్ చాక్లెట్‌తో తయారు చేసిన ఇటాలియన్ హాట్ చాక్లెట్ కూడా ఈ సీజన్లో పలువురి ఎంపిక. దీనిని కేవలం ఒక పానీయంగా మాత్రమే కాదు.. ఒక ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటారు దీని అభిమానులు. ఫిలింనగర్‌లోని ఆరోమలె కేరళ థీమ్‌తో రూపొందిన కేఫ్. మాన్సూన్లో అతిథుల కోసం తడవకుండా చినుకుల్ని ఆస్వాదించే స్పెషల్ సీటింగ్ దీని ప్రత్యేకత. ఈ కేఫ్ అందించే క్యాన్ బెర్రీ బ్రూ టీనీ, బ్రౌనీ హాట్ చాక్లెట్ వంటి పానీయాలు కూడా హాట్ లవర్స్‌ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లోని ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌లో ఉన్న టైగర్ లిల్లీ కేఫ్ అండ్ బిస్ట్రోలో మిక్స్డ్ బెర్రీ మచ్చా పలువురి ప్రత్యేక ఎంపిక. బంజారాహిల్స్, కార్ఖానాల్లో ఉన్న మనం చాక్లెట్.. బ్రౌనీ హాట్ చాక్లెట్ రుచులకు నగరవాసులు, మరీ ముఖ్యంగా యువత ఫిదా అవుతున్నారు. సూప్‌లు, సుగంధ ద్రవ్యాలు.. ఇదే విధంగా సూప్‌లు, టీలతో సహా వేడి లేదా గోరువెచ్చని ద్రవ పదార్థాలు వర్షాకాలంలో ఊరటనిస్తాయి. వెచ్చగా ఉండటానికి మాత్రమే కాక జీర్ణక్రియకు సైతం ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సీజన్లో పానీయాల్లో అల్లం, పసుపు, తులసి వంటి సుగంధ ద్రవ్యాలను జోడించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందనీ, రోగనిరోధక శక్తిని పెంచుతుందనీ వైద్యులు చెబుతున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన పానీయాలను కోరుకునే వారు కథా లాంటి హెర్బల్ ‘టీ’ల ను ఎంచుకుంటున్నారు. ఈ కథా అనేది ఒక సంప్రదాయ భారతీయ పానీయం. దీనిని చాయ్ లేదా ‘టీ’గా తీసుకుంటారు. దగ్గు, జలుబు సీజనల్ ఫ్లూ వైరస్‌లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తారు. మూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ఈ కథా.. సహజ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జ్వరం, గొంతు నొప్పికి ఉత్తమ నివారణగా ఎంచుకుంటారు. ఇది పూర్తిగా యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. పలు రకాల రుచులు, థీమ్‌లు..జూబ్లీహిల్స్‌లోని కేఫ్ ఉకుసా పెప్పర్ మింట్ హాట్ టాడీ పేరిట అందించే మాన్సూన్ స్పెషల్స్‌కు సైతం అధిక సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. బేగంపేట్‌లో ఉన్న ఫన్నెల్ హిల్‌లో హాట్ చాక్లెట్ కూడా ఈ సీజన్లో నగర యువతను ఆకట్టుకుంటోంది. నీలోఫర్, పిస్తా హౌజ్‌లతో పాటు ఓల్డ్ సిటీలోని ఘాన్సీ బజార్లో ఉన్న నిమ్రా కేఫ్ వంటి ప్రదేశాలు, ఇరానీ చాయ్‌కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. జూబ్లీ హిల్స్‌లోని చాయ్ పానీ వేడి పానీయాలు స్నాక్స్ కాంబోకు ప్రసిద్ధి చెందింది. క్రిస్పీ సమోసాలు, పకోడాలు, వడా పావ్లతో పాటు వెరైటీ రుచుల టీలతో ఇక్కడ గెస్ట్స్ మాన్సూన్ను ఆస్వాదిస్తారు. బంజారాహిల్స్‌లో చాలా మందికి కల్చరల్ స్పేస్గానే పరిచయమున్న లామకాన్.. సమోసా వంటి స్నాక్స్‌కు మాత్రమే కాదు కడక్ చాయ్ వంటి ప్రత్యేక వెరై‘టీ’లకు పేరొందింది. చాయ్ పకోడాకు బదులు హాట్ చాక్లెట్ క్రోయిసెంట్లను ఎంచుకునే వారు జూబ్లీహిల్స్‌లోని ఫోన్స్ చాక్లెట్‌ను సందర్శిస్తున్నారు. ఇటాలియన్ క్లాసిక్ హాట్ చాక్లెట్‌తో ఈ సీజన్‌కు ఫేమస్ అయ్యింది. (చదవండి: అత్యంత వృద్ధ 'డ్రైవర్ అమ్మ'..!) -
బాయ్ ఫ్రెండ్‌తో బాక్సింగ్ క్వీన్..మేరీ కోమ్ మేకప్ వీడియో వైరల్
ప్రముఖ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష కుమారుడు వివాహ వేడుకలో బాక్సింగ్ సంచలనం మేరీ కోమ్ (Mary Kom స్పెషల్ ఎట్రాక్షన్ నిలిచారు. బాక్సింగ్ రింగ్‌ను శాసించిన లెజెండ్మేరీ కోమ్ గోల్డెన్సిల్క్ చీర, నిండుగా నగలు, తలనిండా పూలతో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌తో పాటు పలువుర్ని మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన లుక్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో మేరీ కోమ్ షేర్ చేశారు. దీంతో ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతేకాదు కిర్రాక్ ఫోజులతో బాక్సింగ్ రింగ్‌లోనే కాదు..బ్యూటీలో కూడా క్వీన్ అనిపించుకుంది. అంతేకాదు ఆమె పక్కన నడిచిన వ్యక్తికూడా చర్చల్లో నిలిచాడు.మేరీ కోమ్ ముస్తాబైంది ఇలా View this post on Instagram A post shared by Dr Mangte Mary Kom (@mcmary.kom)ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో పుట్టిన మాంగ్టే చుంగ్నీజాంగ్ మేరీ కోమ్..అద్భుతమైన బాక్సర్ ఒలింపిక్ మెడల్ విజేతగా నిలిచారు. ఒక సాధారణ క్రీడాకారిణి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకోవడం దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచిన ఒక స్ఫూర్తిదాయకమైన మహిళ.క్రీడలకు ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా, ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డులు లభించాయి. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ గెలిచిన ఏకైక బాక్సర్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకుని భారత క్రీడా ప్రపంచంలోనే కాకుండా గుర్తింపును తెచ్చుకున్నారు. 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్ .మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితులైనారు. 2005లో ఆంఖోలర్ అకా ఓన్లర్‌ను పెళ్లి చేసుకోగా, వీరికి నలుగురు పిల్లలు. అయితే విభేదాల కారణంతో గత ఏడాది భర్తతో విడిపోయారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించారు.ఎవరీ హితేష్ చౌదరి కాగాభర్తతో విడాకుల తరువాత తన వ్యాపార భాగస్వామి హితేష్ చౌదరి( Hitesh Choudhary))తో ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలు వినిపించాయి.మేరీ కోమ్ లేదా హితేష్ చౌదరి ఇద్దరూ బహిరంగంగా ప్రేమ సంబంధాన్ని ధృవీకరించనప్పటికీ, గతంలో అనేక సార్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ తాజాగా పెళ్లి వేడుకలో కూడా సందడి చేశారు. ఉమ్మడి వ్యాపార వెంచర్ స్పోర్టీ ఫిట్ ప్రైవేట్ లిమిటెడ్ హితేష్ చౌదరి సీఎండీగా ఉన్నారు. -
పీటీ ఉష కొడుకు పెళ్లి : స్పెషల్ ఎట్రాక్షన్‌గా మేరీ కోమ్
ప్రముఖ అథ్లెట్ , రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష, వి. శ్రీనివాసన్ ల కుమారుడు డాక్టర్ విఘ్నేష్ ఉజ్వల్ పెళ్లి పీటలెక్కాడు. సోమవారం లే మెరిడియన్ హోటల్లో జరిగిన విలాసవంతమైన వేడుకలో అశోక్ కుమార్ -షిని కుమార్తె కృష్ణను సాంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకున్నారు. కొచ్చిలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి క్రీడా, రాజకీయ, చలనచిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్, నటుడు శ్రీనివాసన్, కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ , ఎంపి జాన్ బ్రిట్టాస్ ఉన్నారు.“ఈ వివాహం తన కొడుకు జీవితంలో తదుపరి దశ. తల్లిగా తన జీవితంలో ఎంతో ఆనందమైన క్షణాలు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమేననీ, నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత తనకు నచ్చిన, మెచ్చిన అమ్మాయిని తన భాగస్వామిగా చేసుకున్నాడని పీటీ ఉష వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) స్పోర్ట్స్ మెడిసిన్‌లో డిప్లొమా సంపాదించారు. ప్రస్తుతం అతను పి.టి. ఉష కేరళలో స్థాపించిన ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్‌లో స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by P.T.Usha (@ptushaofficial) అందంగా మెరిసిన వధూవరులు విశాలమైన బంగారు జరీ అంచు, క్లిష్టమైన మోటిఫ్‌లతో నేసిన కంజివర్మ చీరలో నవ వధువు అందంగా కనిపించింది. మ్యాచింగ్ బ్లౌజ్, సాంప్రదాయ ఆభరణాలతో ఆమె ముగ్ధమనోహరంగా కనిపించింది. ముఖ్యంగా, చక్కటి నక్షి డిజైన్‌తో రూపొందించిన చోకర్‌తో , పొడవాటి లేయర్డ్ నెక్లెస్‌తో జత చేసింది. ఇంకా అందమైన టెంపుల్ మాంగ్-టీకాతో పాటు మ్యాచింగ్ చెవిపోగులు, కమర్బంధ్, వంకీ , ఉంగరాలు ధరించింది. సింపుల్ మేకప్ ,గ జ్రాతో అలంకరించిన జడ ఆమెకు అందంగా అమరాయి. మరోవైపు, వరుడు విఘ్నేష్ లేత గోధుమరంగు టోన్ గల కుర్తా, ధోతీ మరియు కండువాలో అందంగా కనిపించాడు.పి.టి. ఉష కొడుకు పెళ్లిలో మేరీ కోమ్ స్పెషల్బాక్సింగ్ రింగులో పంచులతో విరుచుకుపడి ప్రత్యర్థులను మట్టి కరిపించి, బంగారు పతకాలతో మురిపించిన మేరీ కోమ్ ఈ పెళ్లిలో ట్రెడిషనల్లుక్లో ఆకట్టుకున్నారు. గోల్డెన్ సిల్క్ చీర, ఆభరణాలు, తలలో మల్లెలతో కేరళ స్టైల్లో అందరి దృష్టిని ఆకర్షించారు అంతేకాదు, కల్యాణానికి వచ్చినఅందరి ప్రశ్నలకు సంతోషంతో సమాధానాలిస్తూ కనిపించారు .తాను కేరళ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతాననీ వడ, ఇడ్లీ, సాంపార్ అన్నీ బెస్ట్అని మేరీ కోమ్ చెప్పుకొచ్చారు.. కేరళలో అందరూ చోట్ ఇష్టపడతారు, ఐ లైక్ చావల్, ఐ ఆమ్ ఏ రైస్ ఈటర్ అని చెప్పారు. మరి ఫిట్ నెస్ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించినపుడు.. మితంగా తింటూ పరవాలేదు అని సమాధానమిచ్చారు. -
సీనియర్ సిటిజెమ్స్..! అరవైలోనూ ఇరవైని తలపించేలా
కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నారు మహా కవి శ్రీశ్రీ.. దీనికి భిన్నంగా ఈ వృద్ధులు ఎప్పటికీ యువకులే.. అన్నట్లు కొందరు నగరవాసులు వయసును లెక్కజేయకుండా అన్నింటా మేము సైతం అన్నట్లు నేటి యువతకు చాలెంజ్ విసురుతున్నారు. అరవైల్లోనూ ఇరవైని తలపించే రీతిలో విభిన్న పోటీల్లో భాగస్వాములవుతూ ఉత్సాహంగా ఆటల నుంచి అందాల పోటీల వరకూ పాలుపంచుకుంటున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతూ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటున్నారు నాటి తరం సీనియర్ సిటి‘జెమ్స్’. రిటైర్మెంట్ అనంతరం కృష్ణా.. రామా.. అంటూ మూలన కూర్చోక.. ఎంచక్కా టూర్లు, ట్రెక్కింగ్స్ అంటూ తమకు నచి్చన రంగంలో సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొండాపూర్‌లో నివసించే బాబూ రాజేంద్రప్రసాద్ రెడ్డికి 70 ఏళ్లు.. అనితరసాధ్యమైన రీతిలో 12వేల అడుగుల ఎత్తుకు ట్రెక్కింగ్ చేశారు. 72 ఏళ్ల వయసులోనూ ఎన్ఎమ్డీసీ ఫుల్ మారథాన్ అంటే 42.2 కి.మీ పరుగును పూర్తిచేశారు మరో నగరవాసి నాగభూషణరావు. ఇంకా మరిన్ని మారథాన్లలో భాగస్వామ్యం అవుతానంటున్నారు. పోరాట కళల్లో రాణిస్తూ మార్షల్ ఆర్ట్స్‌లో గిన్నిస్ రికార్డ్ సాధించారు మరో నగరవాసి కిరణ్ ఉనియాల్ (53).. ఇలా వయసుతో ప్రమేయం లేని విజయాలతో ఓల్డేజ్ అనే పదానికి కొత్త అర్థాన్ని ఇస్తూ.. తమ రొటీన్ లైఫ్‌ని కొత్తగా మార్చేస్తున్నారు. అలాంటి సీనియర్ల హుషారు సరికొత్త యువ తరాన్ని ఆవిష్కరిస్తూ.. కొత్త కొత్త పోటీలకు ఊపునిస్తోంది. అప్పుడే అసలైన జీవితం.. రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతోంది అంటే ఊళ్లు తిరుగుతూ తీర్ధయాత్రలతోనో, ఒళ్లు నలగని పార్ట్ టైమ్ ఉద్యోగాలతోనో, మనవళ్లతోనో.. పార్కుల్లో స్నేహితులతో ముచ్చట్లతోనో కాలం వెళ్లదీసే రోజులు కావివి అంటున్నారు నేటి తరం సీనియర్ సిటిజన్స్. ఓ వైపు ఉద్యోగమో, వ్యాపారమో.. కెరీర్ ముగుస్తుండగానే.. మరోవైపు కొత్త లక్ష్యాలు పుట్టుకొస్తున్నాయి. ‘నిజం చెప్పాలంటే ఓ వ్యక్తిగా మనకేం కావాలి.. మనమేం చేయగలం.. అనే ఆలోచనలతో అప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది’ అని చెబుతున్నారు నగరానికి చెందిన సాహిల్ గులాటి(65). టాలెంట్, ఆసక్తి ఉండాలేగానీ.. ఇటీవల ఖ్యాల్స్ (కేహెచ్వైఏఏఎల్స్) అనే ఏజ్టెక్ స్టార్టప్, ‘50 ఎబవ్’ అనే పేరుతో టాలెంట్ హంట్ పోటీలు ప్రారంభించింది. ఇది 50 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేకించింది. గానం, ఫొటోగ్రఫీ, వంటలో ప్రావీణ్యం, కవితలు రాయడం, నటన.. ఇలా అదీ ఇదీ అని లేకుండా దాదాపు అన్ని విభాగాలనూ కలుపుకుని ఏకంగా 50 విభాగాల్లో విజేతలను ఎంపిక చేస్తుండడం విశేషం. కళా ప్రతిభ, ట్రావెల్, లైఫ్‌స్టైల్ వంటి విభాగాల్లో సత్తా ప్రదర్శించే అవకాశం కలి్పస్తోంది.. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పోటీ కోసం 20 నగరాల్లో ఆఫ్‌లైన్, ఆన్లైన్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. వయసు సంబంధిత స్టీరియో టైప్ పోటీలకు భిన్నంగా వయోజనుల్లో పోటీ తత్వాన్ని, ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆత్మవిశ్వాసం ఉండాలేగానీ అందం వయసెరగదు అంటున్నారు మిస్టర్ అండ్ మిసెస్ సీనియర్ ఫ్యాషన్ పేజెంట్ ఇండియా నిర్వాహకులు రేఖా దేశాయ్. గత మే నెల్లో 55 ఏళ్లు దాటిన వారి కోసం ఓ పోటీని కొత్తగా ప్రారంభించారామె. స్వయంగా ఆరు పదుల వయసులో ఉన్న రేఖా దేశాయ్.. ‘కలలకు ఎక్స్పైరీ డేట్ లేదు. సీనియర్స్ కళ్లలో మెరుపులు చూడడమే నా కార్యక్రమ లక్ష్యం’ అంటున్నారు. వీరి సంస్థ నిర్వహించే పీచ్ ఈవెంట్స్ తమ మొదటి సీజన్ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఆటలకు, పాటలకు సై..సీనియర్స్ కోసం నిర్వహించే ఆటల పోటీలకూ కొదవలేదు. ఈత, గోల్ఫ్ నడక వంటి వాటిలోనూ పోటీలు జరుగుతున్నాయి. అలాగే బోస్, కార్న్హోల్, క్రికెట్ వంటి ఆటలు కూడా అందుబాటులో ఉన్నాయి. అస్సోంకు చెందిన 70ఏళ్ల ఖిరాదా సైకియా కలిత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ గత జూన్‌లో ధర్మశాలలో జరిగిన నేషనల్ మాస్టర్స్ గేమ్స్‌లో నాలుగు బంగారు పతకాలు గెలుచుకోవడం ఎందరికో స్ఫూర్తిని అందించింది. అదే విధంగా 60 ఏళ్ల పైబడిన వారి కోసం నిర్వహించే మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్స్, ఏవీటీ చాంపియన్ టూర్స్, పాన్ ఇండియా ఫెడరేషన్ కప్ వంటి ఆటల పోటీల్లోనూ నగరవాసులు చురుకుగా పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నారు. ( చదవండి: -
అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!
స్నేహ అంటే సంప్రదాయంలో పుట్టిన సౌందర్య కవిత లాంటిది. దాదాపు చాలావరకు పట్టుచీర, జడలో మల్లెలు, నుదుటిన బొట్టు అన్నీ కలిసి కనిపిస్తూ ఉండే ఆమె అందం ఎప్పుడూ పండుగ వాతావరణంలా మెరిసిపోతుంది. ఆ అందాన్ని కూడా స్నేహ ఒక్క చిరునవ్వుతోనే రెట్టింపు చే స్తుంది. ప్రతిసారీ కొత్తగా, ప్రత్యేకంగా కనిపించడం అంటే చాలా ఇష్టం. ప్రింటెడ్ కాంచీపురం నుంచి మోనోటోన్ బనారసీ, ఫ్లోరల్ నుంచి బ్రోకేడ్ వరకు, ఏ చీర అయినా సరే రంగులతో మ్యాజిక్ చేస్తాను. అందుకే, చీరలంటే చాలా ఇష్టం అని చెబుతోంది స్నేహ.ఆభరణాల పండుగ! పండుగ రోజు ఉదయం చీర కట్టుకుంటూ అద్దం ముందు నిలబడి ఏ ఆభరణం వేసుకోవాలి అనుకుంటే, అది తప్పకుండా ఫెస్టివల్ జ్యువెలరీ అయి ఉండాలి. బంగారం మెరుపులో రంగురంగుల రత్నాలు, ముత్యాల గుత్తులు, చెక్కిన సున్నితమైన ఆకృతులు – ఇవన్నీ కలిసినప్పుడు వచ్చే వైభవం పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు, ప్రతి పండుగను ఒక జ్ఞాపకంగా మార్చే మ్యాజిక్. ఆ ఆభరణాలను వేసుకున్నప్పుడల్లా మనం కేవలం ఆ రోజుకే కాదు, మన పూర్వీకుల సంప్రదాయానికి, వారసత్వానికి కూడా గౌరవం ఇస్తున్నట్లే అనిపిస్తుంది. లేత రంగుల కంచీపురం చీరలపై ఈ ఆభరణాలను వేసుకుంటే రత్నాల మెరుపు ఇంకా హైలైట్ అవుతుంది. జుట్టును పొడవైన జడగా వేసి మల్లెపూలు, కనీసం రెండు పొడవైన హారాలు జుంకీలు, వంకీలు – ఇలా లేయరింగ్ చేస్తే ఆకర్షణ వస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న డిజైన్లను చూస్తే, లక్ష్మీదేవి, గణేశ్ మోటిఫ్స్‌తో వచ్చే టెంపుల్ హారాలకు బాగా డిమాండ్ ఉంది.చీర బ్రాండ్: స్నేహాలయ సిల్క్స్, ధర: రూ. 25,000, జ్యూలరీ బ్రాండ్ : ఇతిహాస జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: డ్రెస్ స్టైల్‌నూ మార్చేయచ్చు..!) -
ఆరోగ్యమే.. అందం.. ఆనందం
జీవితంలో ఎంత ఎదిగినా, ఏం సాధించినా.. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఎంతో ప్రధానమైనవని, ఇంటర్నల్ వెల్నెస్, ఎక్స్టర్నల్ కేర్ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్నీ ప్రదర్శిస్తాయని ప్రముఖ సినీతార శ్రియా శరణ్ తెలిపారు. చాలా రోజుల తరువాత ఈ పాన్ ఇండియా నటి నగరంలో సందడి చేశారు. నగరంలోని కొండాపూర్ వేదికగా వెల్నెస్, చర్మ సంరక్షణ, అధునాతన సౌందర్య సేవలందించే ‘జెన్నారా క్లినిక్స్’ను శ్రియా శరణ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అందమైన జీవితం, ఆరోగ్యకరమైనప్రయాణంతో పాటు తన తదుపరి సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఆ రోజులు ఎంత మధురమో.. చాలా మంది నన్ను కలిసినప్పుడు అప్పుడూ.. ఇప్పుడూ ఒకేలా ఎలా ఉండగలుగుతున్నారని అడుగుతున్నారు.., దానంతటికీ కారణం ‘ఎల్లప్పుడూ నాకు మానసిక సంతోషాన్నందిస్తున్న అభిమానుల ప్రేమ, రెండోది ఆరోగ్యం పట్ల నా జాగ్రత్త. సినిమా రంగంలో ఉన్నాను కాబట్టి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా సంరక్షించుకోవాలి. దీని కోసం నేను సాధారణ పద్ధతులను కొనసాగిస్తాను. ఇంట్లో తయారు చేసిన ఫేస్‌ప్యాక్‌లు వాడతాను, కొబ్బరి నూనె, ఆల్మండ్ ఆయిల్ వినియోగించడంతో పాటు ఆయుర్వేదిక్ పద్ధతులను పాటిస్తాను. మన సంస్కృతిలో ఇలాంటి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నాయి. అప్పటి రోజులు ఎంత మంచివో.., అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఎలాంటి కాలుష్యం ఉండేదికాదు. రసాయనాలు లేని ఆహారం తినేవారు. అందుకే వారి మోములో సహాజ సౌందర్యం ఉట్టిపడేది. ఆ గ్లో నాకు చాలా ఇష్టం. ప్రస్తుత ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌లో అలా బతకడం కాస్త కష్టమే కానీ ఎవరికి వారు వారి ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. ఈ తరాన్ని నేను వేడుకునేది కూడా ఇదే, మైండ్ మెడిటేషన్, యోగా చేయండి. పాజిటివ్ లైఫ్ పై అవగాహన పెంచుకోండి. నాలాగే మినరల్స్, విటమిన్స్ ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించండి. హైదరాబాద్‌లో సౌందర్య రంగం, సినిమా రంగం గ్లోబల్ స్థాయిని చేరుకుంది. మోడ్రన్ లైఫ్‌స్టైల్ హబ్‌గా మారింది. దానిని ఆస్వాదిస్తూనే విభిన్న విధాలుగా మనల్ని మనం సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. ఆల్ టైం ఫేవరెట్.. హైదరాబాద్ ఎప్పటికీ నా ఫేవరెట్ సిటీ. ఎన్నెన్నో మధురమైన అనుభవాలు, ఆనందాలు నగరంతో పెనవేసుకుని ఉన్నాయి. 17 ఏళ్లప్పుడు అనుకుంటా మొదటిసారి ఇక్కడికి వచ్చాను. సినీ ప్రయాణంలో భాగంగా ఈ నగరాన్ని నాకు కుటుంబంలా మార్చేసింది. ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్‌ను కలవడానికే ఇక్కడికి వస్తుంటాను. నా తదుపరి సినిమాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను చేరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మిరాయ్ సినిమాలో నటించాను. ఇందులో నా పాత్ర అందరికీ నచ్చుతుంది. మరో అద్భుతమైన ప్రాజెక్ట్ చంద్రయాన్. ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. వినూత్నమైన సబ్జెక్ట్ ఇది. ఎంతో వైవిధ్యమున్న ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. (చదవండి: ఓపెన్‌గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..) -
డ్రెస్ స్టైల్‌నూ మార్చేయచ్చు..!
పెద్ద సైజులో బీడ్స్, స్టోన్స్ లేదా సిల్వర్, గోల్డ్, బ్రాస్ మెటల్‌తో తయారు చేసిన ఆకర్షణీయంగా కనిపించే స్టేట్మెంట్ జ్యువెలరీని ధరించడం ఈ రోజుల్లో మరింత ఫ్యాషనబుల్‌గా ఆకట్టుకుంటోంది. యువతరం సాధారణంగా లైట్, సన్నని జ్యువెలరీకి బదులు బోల్డ్ డిజైన్స్‌ని పెద్ద సైజులో ఎంపిక చేసుకుంటోంది. ట్రైబల్ జ్యువెలరీకి అతి దగ్గరగా ఉంటోన్న ఈ ఫ్యాషన్ ఆభరణాలు డ్రెస్ స్టైల్‌ను మార్చేసే ‘హైలైట్ యాక్ససరీస్’గా నిలుస్తున్నాయి. ఇయర్ హ్యాంగింగ్స్హూప్స్, జుమ్కీలు, డ్రాప్ ఇయర్ రింగ్స్, షెల్స్ లేదా జియోమెట్రిక్ షేప్స్.వన్ పీస్ డ్రెస్ లేదా సింపుల్ కుర్తీకి బాగా సెట్ అవుతాయి.నెక్లస్, గాజులుమొత్తం మెడ కవర్ చేసే హారాలు లేదా మొత్తం చేతిని కవర్ చేసే గాజులు లభిస్తున్నాయి. వీటిని మెటల్, బీడ్స్, ముత్యాలు, స్టోన్స్‌తో తయారు చేస్తారు. ప్లెయిన్ టాప్స్, చీరల మీదకు బాగా నప్పుతాయి. మెటల్, వుడ్, ఆర్ట్ వర్క్ ఉన్నవి. వెస్ట్రన్ – ట్రెడిషనల్ రెండింటికీ సెట్ అవుతాయి.క్యాజువల్ లుక్ డైలీ వేర్ / ఫ్రెండ్స్ అవుటింగ్షర్ట్ స్టైల్స్‌కి ఓవర్సైజ్డ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ నెక్‌పీస్ + పెద్ద హూప్ ఇయర్ రింగ్స్. బోహో మ్యాక్సీ డ్రెస్ పైకి కలర్‌ఫుల్ బీడ్స్, షెల్ జ్యువెలరీ, బ్రాడ్ బ్యాంగిల్స్. కుర్తీ లెగ్గింగ్స్ పైకి ఆక్సిడైజ్డ్ జుమ్కీలు లేదా చెవులు మొత్తం కవర్ చేసే లాంగ్ ఇయరింగ్స్.ఆఫీస్ లేదా ఫార్మల్ లుక్ఆఫీస్ వేర్ పైకి సింపుల్ ఓవర్సైజ్డ్ రింగ్ + చిన్న హూప్స్ బాగుంటాయి. ఒకే రింగ్ పెద్దగా వేసుకుంటే చేతి మీదే ఫోకస్ ఉంటుంది. కాక్టెయిల్ రింగ్స్ ఇప్పుడు ట్రెండింగ్. బ్లేజర్, ట్రౌజర్స్ పైకి పెద్ద చెయిన్ లేదా మందపాటి నెక్ పీస్ సెట్ అవుతుంది. కాటన్ లేదా లినెన్ శారీస్ పైకి పొడవాటి ముత్యాల దండ, స్టడ్స్ లేదా ఆక్సిడైజ్డ్ లాంగ్ ఇయర్ రింగ్స్.పార్టీ ఈవెనింగ్ లుక్ బ్లాక్ డ్రెస్‌పైకి గోల్డెన్ చంకీ నెక్‌పీస్, పెద్ద స్టేట్మెంట్ రింగ్ బాగా నప్పుతుంది. గౌన్ పైకి షైనీ స్టోన్ ఓవర్సైజ్డ్ ఇయర్ రింగ్స్ సరి΄ోతాయి. నెక్లెస్ అవసరం లేదు.కాక్టెయిల్ పార్టీమినిమలిస్టిక్ గౌన్‌కి ఓవర్సైజ్డ్ బ్రేస్లెట్ హైలెట్ అవుతుంది. సింపుల్ డ్రెస్‌కి హెవీ జ్యువెలరీ పర్ఫెక్ట్ లుక్. వెస్ట్రన్ అవుట్‌ఫిట్‌కి బోల్డ్ మెటల్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ బాగుంటుంది. శారీస్, లెహంగాస్కి స్టోన్స్, పెరల్స్, కుంకుమపువ్వు కలర్స్‌తో ఉన్నవి బాగా మెరిసి΄ోతాయి. ఆఫీస్ లుక్‌కి – చిన్న ఓవర్సైజ్డ్ రింగ్స్ లేదా లైట్ కలర్ హూప్స్. పార్టీ లుక్‌కి – షైనీ, గ్లిట్టర్, బోల్డ్ నెక్పీసులు అందంగా ఉంటాయి. సంప్రదాయ వేడుకలైన పండగలు /పెళ్లిళ్లకు పట్టు చీరల మీదకు ఓవర్సైజ్డ్ కుందన్ లేదా టెంపుల్ జ్యువెలరీ నెక్లెస్, హ్యాంగింగ్స్ బాగుంటాయి. లెహంగా మీదకు నెక్లెస్ లేకుండా హెవీగా ఉండే చాంద్‌బాల్ ఇయర్ రింగ్స్ సెట అవుతాయి. అనార్కలీ లేదా కుర్తీస్ మీదకు లేయర్డ్ పెరల్ నెక్లెస్, చేతికి పెద్ద కఫ్స్ అందంగా కనిపిస్తాయి.మోడర్న్ ఫ్యూజన్ లుక్క్రాప్ టాప్, స్కర్ట్ మీదకు ఓవర్సైజ్డ్ నెక్లెస్, లాంగ్ ఫెదర్ ఇయర్ రింగ్స్ అందంగా ఉంటాయి. ఇండోవెస్ట్రన్ ఔట్‌ఫిట్స్‌కి ఆక్సిడైజ్జ్ సిల్వర్ ఓవర్సైజ్డ్ ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ప్లెయిన్ జంప్‌సూట్ మీదకు బోల్డ్ జియోమెట్రిక్ నెక్లెస్ చుంకీ బ్రేస్లెట్ బాగా నప్పుతుంది.ప్రకృతి నుంచి స్ఫూర్తిజీన్స్, కుర్తీస్ కి పెర్ఫెక్ట్ లుక్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అయితే బోహో లుక్ కోసం కలర్‌ఫుల్ బీడెడ్ హారాలు బాగుంటాయి. ఈవెనింగ్ పార్టీ లుక్స్ కోసం యంగ్ జనరేషనల్‌లో బాగా పాపులర్‌గా ఉన్నది లేయర్డ్ నెక్‌పీస్, ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందినవి ఫ్లవర్, లీఫ్ షేప్ ఎకో ఫ్రెండ్లీ జ్యువెలరీ. జాగ్రత్తలుఔట్ఫిట్ కలర్‌కి మ్యాచ్ అయ్యే జ్యువెలరీని ఎంచుకోవాలి. ఆభరణాలు చాలా హెవీ వాడితే నెక్ లేదా ఇయర్ మీద బరువు పడొచ్చు, సౌకర్యంగా ఉండేవి చూసుకోవాలి. ఒకేసారి హెవీ మేకప్, హెవీ జ్యువెలరీ కాకుండా బ్యాలెన్స్ చేయాలి. ఓవర్సైజ్డ్ నగల ధరించేటప్పుడు అన్నీ ఓవర్‌గా వేసుకోకూడదు. హెవీ ఇయర్ రింగ్స్ ధరించినప్పుడు హెవీ నెక్లెస్ వాడద్దు. సింపుల్ డ్రెస్ ధరించినప్పుడు ఓవర్ సైజ్డ్ జ్యువెలరీ అట్రాక్టివ్‌గా ఉంటుంది. క్లచ్ లేదా హ్యాండ్ బ్యాగ్ కూడా జ్యువెలరీ షైన్ కి మ్యాచ్ అయ్యేలా చేసుకోవాలి. (చదవండి: ఇండియన్ స్పైసీ రెస్టారెంట్ ఇన్ జపాన్) -
డిజైన్ డెమోక్రసీ..!
ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ ఉత్పత్తులకు సంబంధించిన పాపులర్ ప్రదర్శన డిజైన్ డెమోక్రసీ వచ్చేనెల 5న నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించిన నిర్వాహకులు ఎక్స్పో వివరాలను వెల్లడించారు. ఇందులో 120కి పైగా ప్రముఖ బ్రాండ్లు, 80పైగా పేరొందిన స్పీకర్లు పాల్గొంటారని, 15 వేలకుపైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 3 రోజుల ప్రదర్శనలో చర్చలు, ఆవిష్కరణలు.. వంటివి ఉంటాయన్నారు. ఫర్నిచర్, లైటింగ్, ఫ్లోరింగ్, గృహోపకరణాలు, వంటగది, బాత్, డెకర్ ఉపకరణాలు ఫైన్ఆర్ట్, క్రాఫ్ట్ వంటి వాటి ఎంపికలో నగర వినియోగదారుల అభిరుచులను కొత్తస్థాయికి ఇవి చేరుస్తాయన్నారు. సమావేశంలో సహ వ్యవస్థాపకులు శైలజా పట్వావరీ, మల్లికా శ్రీవాస్తవ్, క్యూరేటర్ అర్జున్ రతి పాల్గొని మాట్లాడారు.విద్యార్థి ప్రతిభ..ఎఫ్‌డీడీఐ–హైదరాబాద్ విద్యార్థులు చదువుతోపాటు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ వినూత్న ఆలోచనలతో వివిధ వస్తువుల తయారీకి శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఎఫ్డీడీఐలోని ఎల్ఎల్పీడీకి చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి జీవా ప్రోటోటైప్ ఉత్పత్తిగా కుట్టులేని నాణెం పౌచ్‌కు రూపకల్పన చేశారు. రావి(పీపాల్) ఆకు రూపం, ఆకృతి నుంచి ప్రేరణ పొంది ఆకుపచ్చ రంగులో కృత్రిమ తోలు, గుండు సూది, షూలేస్‌ను ఉపయోగించి కుట్లు లేకుండా ఈ పౌచ్‌ను తయారు చేశాడు. జీవాను ఎఫ్‌డీడీఐ –హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ తేజ్‌లోహిత్‌రెడ్డి, ఫ్యాకల్టీ ప్రతినిధులు వేణుగోపాల్, గోఫ్రాన్, రుచిసింగ్, హుస్సేన్, రాంబాబు అభినందించారు. – రాయదుర్గం (చదవండి: నయా ట్రెండ్.. గణేశుడికి గ్రాండ్ వెల్కమ్!) -
'పారాచూట్ వెడ్డింగ్ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్ స్టోరీనా..
ఎంతో కష్టపడి నచ్చిన డ్రెస్ కొనుకున్నప్పుడు లేదా మన తల్లిదండ్రులు/ప్రియమైనవారో మనకెంతో ఇష్టమైన డ్రెస్ కొంటే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అదెంతో అపురూపం కూడా. ఆ దుస్తులు చూడగానే దాని తాలుకా జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతాయి. అయితే మన ప్రాణ సమానమైన వ్యక్తిని రక్షించిన వస్తువు లేదా మనిషి మనకు ఆప్తమిత్రుడు లేదా అత్యంత ఆత్మీయులు. అందుకు అర్థం పట్టేదే ఈ వెడ్డింగ్ గౌను. దీని వెనుకున్న కథ వింటే కళ్లు చెమరుస్తాయి. 'ప్రేమకు అర్థం ఏదంటే'.. అన్న పాట గుర్తొచ్చేలా ఉంటుంది ఈ జంట కథ. చరిత్రలో దాగున్న ఈ అందమైన స్టోరీ ఏంటో చదివేద్దామా..!ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఐకానిక్ వెడ్డింగ్ గౌను ఒక జంట ప్రేమకు గుర్తుగా మ్యూజియంలో భద్రంగా ఉంది. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంది. అదే ఇవాళ స్టైలిష్ వెడ్డింగ్ గౌనుగా బ్రిటన్, అమెరికా, రష్యా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. ప్రతి నవ వధువు ఇష్టపడే ఆ వివాహ గౌను వెనుక కథ చూస్తే ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది. దీని గురించి సంస్కృతి, చరిత్రపై అమితాసక్తి కలిగిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మే షరీఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో షేర్ చేశారు. దాంతో ఈ వెడ్డింగ్ గౌను వెనుకున్న లవ్‌స్టోరీ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. అంతేగాదు 'ప్రేమకు అర్థం ఎవరంటే?'..అన్న పాటను గుర్తుకుతెస్తోంది. ఆ వీడియోలో షరీఫి ప్రముఖులు ధరించిన ఎన్నో వెడ్డింగ్ గౌనులు చూసుంటారు గానీ ఈ పారాచూట్ వెడ్డింగ్ గౌను(parachute wedding dress) గురించి విన్నారా అంటూ ఆ స్టోరీ గురించి చెప్పడం ప్రారంభిస్తుంది. This wedding dress was made from a parachute that saved Maj. Claude Hensinger during WWII. In our @amhistorymuseum: https://t.co/0lf4659Pu0 pic.twitter.com/dSvRHwnvl7— Smithsonian (@smithsonian) June 16, 2017 వెడ్డింగ్ గౌను వెనుకున్న కథ..1947లో, ఒక మహిళ రెండవ ప్రపంచ యుద్ధం(World War II)లో తన భర్త ప్రాణాలను కాపాడిన పారాచూట్నే వెడ్డింగ్ గౌనుగా డిజైన్ చేసిందట. నైలాన్ ఫ్రాబ్రిక్ క్లాత్‌తో ఉండే పారాచూట్‌ని చాలా అందమైన వివాహ దుస్తులుగా మార్చిందామె. ఆ జంటే మేజర్ క్లాడ్ హెన్సింగర్, రూత్లు. 1947 రెండో ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికన్ బీ 29 పైలట్ అయిన మేజర్ క్లాడ్ హెన్సింగర్ తన సిబ్బందితో తిరిగి వస్తుండగా విమానం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. వెంటనే పారాచూట్ సాయంతో తన సిబ్బందిని, తనను రక్షించుకున్నారు. అంతేగాదు వారు ఆగిన నిర్మానుష్య ప్రదేశానికి అధికారులు వచ్చేంతవరకు వారికి ఆ పారాచూట్ రక్షణ కవచంలా వెచ్చదనాన్ని అందించింది. అతను సురక్షితంగా ఆ ప్రమాదం నుంచి బయపడిన వెంటనే తన స్నేహితురాలు రూత్‌ని నేరుగా కలసి జరిగినదంతా వివరించి ఆ పారాచూట్‌ని ఆమెకు ఇచ్చాడు. తన భర్త ప్రాణాలను కాపాడిన ఈ పారాచూట్ తనకెంతో అపురూపం అంటూ దాంతోనే వెడ్డింగ్ గౌనుని స్వయంగా రూపొందించుకుంది. అంతేగాదు దాన్ని ఆ దంపతులు ఎంత భద్రంగా ఉంచుకున్నారంటే..తన కూతురు, కోడలు కూడా వారి వివాహంలో ఆ గౌనునే ధరించారు. ఆ తర్వాత స్మిత్సోనియన్ మ్యూజియంలో ఆ గౌను నేటికి పదిలంగా ఉంది. View this post on Instagram A post shared by Mae Sharifi (@history_mae) (చదవండి: Smartphone Photography: కెమెరా క్లిక్.. అదిరే పిక్..! ట్రెండింగ్‌గా మారుతున్న మొబైల్ ఫోటోగ్రఫీ) -
ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్‌పేజీపై మెరిసిన సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. పాపులర్ ఫ్యాషన్ మ్యాగజైన్ గ్రాజియా కవర్ పేజీపై సమంత తళుక్కున మెరిసారి . వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని దీన్ని రిలీజ్ చేసినట్టు గ్రాజియా ప్రకటించింది. ఈ సందర్భంగా 15 ఏళ్ల నట ప్రయాణంలో ఎన్నో విలువైన పాత్రలు పోషించారని ప్రశంసిస్తూ సమంతపై ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది.పదిహేను సంవత్సరాలు, లెక్కలేనన్ని పాత్రలు, ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం. యాక్టింగ్ నుంచి సినిమాలను నిర్మించడం,తన సొంత వ్యాపారాల స్థాపన వరకు, మొదటి చిత్రాన్ని నిర్మించడం, వెల్నెస్ వెంచర్లను ప్రారంభించడంతోపాటు ఆధునిక మహిళను ప్రతిబింబించే పాత్రలను ఎంచుకోవడం ద్వారా సమంత రూత్ ప్రభు తన సొంత మార్గాన్ని నిర్దేశించుకుంటోందని తెలిపింది. యూరోసెంట్రిక్ ఆదర్శాలను దాటి ఫ్యాషన్ ఇమేజరీని పునర్నిర్మిస్తున్న ఐదుగురు మహిళా ఫోటోగ్రాఫర్లతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గ్రాజియా వెల్లడించింది. మ్యాగజైన్లో భాగమైన ఐదుగురు మహిళా ఫొటోగ్రాఫర్లు, ఆరుగురు డిజైనర్లతో ఫొటోగ్రఫీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు 'గ్రాజియా' పేర్కొంది. 22 క్యారెట్ల బంగారపు ఉంగరం, గాజులు, ఝుంకాలు, నెక్లెస్‌తో అద్బుతంగా కనిపిస్తున్న సమంత లుక్కు ఫిదా అవుతున్నారు View this post on Instagram A post shared by GRAZIA India (@graziaindia) తాను ఒకేసారి ఐదు సినిమాలు తీయనని, తన బాడీ, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని,పనిని తగ్గించానని గ్రాజియతో తెలిపింది. అయితే చేసే ప్రతీ పనిలో పూర్తి శక్తిని పెడుతున్నాననీ,పరిమాణం తగ్గి ఉండవచ్చు కానీ ప్రాజెక్టుల నాణ్యత ఖచ్చితంగా పెరిగిందని స్పష్టం చేసింది. జీవితంలో ప్రతిదీ నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం పైనే ఉంటుంది. నిద్ర, ఆహారం,మానసిక ఆరోగ్యం గురించి గతంలో కంటే కఠినంగా ఉంటున్నానని చెప్పింది. అలాగే చాలెంజింగ్ పాత్రలు, ముఖ్యంగా మహిళల కోసం ముఖ్యమైన చిత్రాలను తీసుకోవాలనుకుంటున్నాను. ఆధునిక స్త్రీని సూచించే పాత్రలను పోషించాలనుకుంటున్నా అవి రావడ కష్టంమే కానీ అదే లక్ష్యం అని పేర్కొంది. కాగా సమంత నిర్మాతగా వచ్చిన తొలి సినిమా శుభం'. మంచి టాక్ సంపాదించుకున్న ఈ సినిమాలోఅతిథి పాత్రతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా -
400 లగ్జరీ బ్యాగ్స్, ఈ పిచ్చిలేకపోతే ముంబైలో పెంట్ హౌస్ కొనేదాన్ని: నటి
సెలబ్రిటీ విమెన్ అంటే లగ్జరీ బ్యాగులు, లగ్జరీ కార్లు కామన్. లగ్జరీ వస్తువుల కలెక్షన్ అనగానే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ గుర్తు వస్తారు. కానీ ఈ విషయంలో నేనేమీ తక్కువ కాదంటోంది బాలీవుడ్ అందాలభామ అమీషా పటేల్.అమీషా పటేల్ వద్ద వందల సంఖ్యలో లగ్జరీ బ్యాగులున్నాయి. దీంట్లో ఒక బ్యాగు ఖరీదు రూ. 70 లక్షలు. ఈ బ్యాగులు కొనకపోతే ఆ డబ్బులతో ముంబైలో పెంట్ హౌస్ కొనేదాన్ని అని స్వయంగా అమీషానే జోక్ చేసిందంటే వాటి విలువను అర్థం చేసుకోవచ్చు.ఫరా ఖాన్ ప్రముఖుల ఇళ్లను సందర్శించే యూట్యూబ్ షో తాజా ఎపిసోడ్లో దక్షిణ ముంబైలోని నటి అమీషా పటేల్ (ఆగస్టు 18 సోమవారం) ఇంటిని సందర్శించిన వీడియోను పంచుకుంది, దీనిలో ఆమె రెడ్ చికెన్ థాయ్ కర్రీని కూడా వండింది, కహో నా... ప్యార్ హై షూటింగ్ ,థాయిలాండ్‌లో ప్రతి రాత్రి ఆ వంటకం తినడం గురించి గుర్తుచేసుకుంది.ఇంకా ఈ వీడియోలో తన ఇంటితోపాటు ,స్పెషల్ ఎడిషన్ బ్యాగులు , విలాసవంతమైన షూ కలెక్షన్లతో నిండిన బహుళ అల్మారాలను కూడా చూపించింది.400 బ్యాగులు, రూ. 70 లక్షల బ్యాగు కూడాఅమీషా అల్మారాలో బ్యాగుల ధర 5 లక్షల నుండి ప్రారంభమవుతాయనీ, డిజైన్ సేకరణను బట్టి పది లక్షల వరకు ఉంటుందని తెలిపింది. డియోర్ , బొట్టెగా వెనెటా నుండి బిర్కిన్స్ అండ్ YSL టోట్ల వరకు తన దగ్గర ఉన్న ప్రతీవిలువైన వస్తువును పరిచయం చేసింది. తన దగ్గర ‘300-400’ వరకు బ్యాగులు ఉంటాయని వెల్లడించింది. అమీషా పటేల్‌కు లగ్జరీ బ్యాగ్స్ అంటేచిన్నప్పటినుంచీ చాలి ఇష్టమట. తాజాగా తన దగ్గర ఉన్న బ్యాగ్స్ కలెక్షన్స్, ఖరీదైన బ్యాగ్ గురించి చెప్పుకొచ్చింది. తన దగ్గర ఉన్న ఖరీదైన బ్యాగ్ బిర్కిన్ బ్యాగ్ ధర రూ. 70 లక్షలు ఉంటుందని బయటపెట్టింది. వీటితోపాటు 365 క్లచ్‌లు బెల్ట్ బ్యాగులు కూడా ఉన్నాయి. అంతేకాతు తనకెంతో ఇష్టమైన పింక క్రోక్ బిర్కిన్ లెదర్ బ్యాగు గురించి ప్రత్యేకంగా చెప్పింది. దాదాపు 15 సంవత్సరాల క్రితం కొన్నప్పుడు, లేత గులాబీ రంగులో ఉండేదట. క్రమంగా తోలు రంగు మరింత అందంగామారుతోందని చెప్పుకొచ్చింది.ఇక అమీషా షూ కలెక్షన్ విషయానికి వస్తే ఒక్కో షూ ధర రూ. 80,000 నుండి లక్ష వరకు ఉంటుంది. అలాంటివి వందల జతలు ఆమె అల్మారాలో ఉన్నాయి. అమీషా పటేల్ ముంబై ఇల్లుఆమె వ్యక్తిగతంగా తీర్చిదిద్దుకున్న అమీషా ముంబై ఇంటిలో సౌకర్యం లగ్జరీ అభిరుచి కలగలిపి దర్శనమిస్తాయి. పచ్చదనం, వెలుతురు ప్రాధాన్యతనిచ్చింది. అంతేకాదు గోడలనిండి ఫోటోలు, అరుదైన MF హుస్సేన్ పెయింటింగ్‌లతో తన కళాభిమానాన్ని చాటుకుంది. అమీషా చివరిగా 2023లో హిట్ మూవీ గదర్ 2లో నటించింది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా లో సన్నీ డియోల్ ఉత్కర్ష్ శర్మ కూడా నటించారు. ఈ చిత్రం గదర్: ఏక్ ప్రేమ్ కథ (2001) కి సీక్వెల్. -
కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా
ఇంటినీ, కుటుంబాన్ని చక్కదిద్దడంలో మాత్రమే కాదు.. అడుగు పెట్టిన రంగం ఏదైనా పట్టుదలగా ఎదిగి, తమ ఆసక్తిని,కలలను నెరవేర్చుకున్న ధీరవనితలు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా పురుషులకే సాధ్యం అనుకునే వ్యాపార రంగంలో అడుగు పెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ఫల్గుణి నాయర్, వినితా సింగ్, ఇందిరా పూరి ఇషా అంబానీ కార్పొరేట్ సీఈవోలుగా ఎదుగుతున్నారు. మరికొంతమంది మహిళలు తమ కృషి ఆధారంగా స్టార్టప్‌లలో కూడా తామేంటో నిరూపించు కున్నారు. అంతేకాదు తక్కువ పెట్టుబడితోనే అద్భుతాలు చేస్తూ తనలాంటి ఎందరో ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాంటి వారిలో ఒకరు నిధి యాదవ్. ఆమె సాధించిన విజయం ఏమిటో తెలుసుకుందామా!ఇండోర్‌లో జన్మించిన నిధికి ఫ్యాషన్ రంగం అంటే చాలా ఇష్టం. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన నిధి డెలాయిట్‌లో పనిచేసేది. ఐదంకెల జీతం. కానీ అది సంతృప్తి నివ్వలేదు. తన అభిరుచిని కెరీర్‌గా మార్చుకోవడానికి, నిధి కూడా ఫ్లోరెన్స్‌లోని పోలిమోడా ఫ్యాషన్ స్కూల్లో ఒక సంవత్సరం కోర్సు చేసింది. అలా సొంత వ్యాపారం మొదలు పెట్టాలనే కోరికతోపాటు,కుటుంబానికి దగ్గరగా ఉండేందుకు భారతదేశానికి తిరిగి రావాలనే పెద్ద ముందడుగు వేసింది. తన సొంత బ్రాండ్‌ను సృష్టించాలని నిర్ణయించుకుంది. అప్పటికే వివాహం, ఏడు నెలల పసిబిడ్డ ఉన్నా కూడా తన ఆశయానికి కట్టుబడి ఉంది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, డెలాయిట్‌లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. 23 ఏళ్ల వయస్సులో ఉద్యోగాన్ని వదిలివేసి భర్తతోకలిసి తన సొంత దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించింది. 2014లో గురుగ్రామ్‌లోని తన 2BHK ఇంట్లో రూ.3.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఆక్స్ క్లోతింగ్‌ను ప్రారంభించింది.స్టైలిష్ ఎథ్నిక్ వేర్‌ను సరసమైన ధరల్లో అందించాలి, ముఖ్యంగా 18-35 సంవత్సరాల వయస్సు గల యువతులను లక్ష్యంగా చేసుకుంది. అనుకున్నట్టుగానే ఆమె వెంచర్ త్వరగా ఆదరణ పొందింది.2021 నాటికి రూ.200 కోట్ల ఆదాయాన్ని సాధించింది. చాలా తక్కువ సమయంలో ఆక్స్ ప్రజాదరణ పొందింది. కంపెనీ కేవలం ఒక సంవత్సరంలో రూ. 8.50 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది 2018లో, కంపెనీ ఆదాయం రూ. 48 కోట్లకు పెరిగింది. ఐదేళ్లలోనే కంపెనీ ఒక రేంజ్‌కి చేరింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.అంటే 2014లో రూ. 1.60 కోట్లుగా ఉన్న ఆదాయం 2015లో రూ. 8.50 కోట్లకు, ఆ తర్వాత 2018 నాటికి రూ. 48 కోట్లకు పెరిగింది. 2021 నాటికి, ఆక్స్ ఎటువంటి బాహ్య నిధులు లేకుండానే రూ. 200 కోట్ల ఆదాయాన్ని అధిగమించింది.రూ. 500 కోట్ల టర్నోవర్‌తోపాటు గ్లోబల్ విస్తరణ లక్ష్యంగా ముందుకు సాగుతోంది నిధియాదవ్.చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుబ్రాండ్ ప్రారంభ రోజుల్లో, నిధి ఆమె భర్త తమ పసికందుతో కలిసి గురుగ్రామ్,జైపూర్ మధ్య వారాంతపు తిరుగుతూ సామాగ్రిని సేకరించేవారు. ఈ కష్టాల మధ్య కోవిడ్ మహమ్మారి మరో సవాల్ విసిరింది. దీంతో పాటు కొత్త అవకాశాల్ని కూడా తెచ్చిపెట్టింది. క్లోతింగ్ ఉత్పత్తి సంక్షోభం తరుణంలో ఆక్స్ మాస్క్‌లు , PPE కిట్లను తయారు చేయడంలో పై చేయి సాధించింది. అలా కోవిడ్ కాలంలో బ్రాండ్ వృద్ధి 25 శాతం పెరిగిందంటే ఆమె కృషిని అర్థం చేసుకోవచ్చు. మిగిలిపోయిన బట్టను ఉపయోగించి పిల్లల దుస్తుల శ్రేణిని కూడా ప్రారంభించింది.ఇదీ చదవండి: 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ! -
టమాటాలతో 'బయోలెదర్'..! పర్యావరణం మెచ్చే ఫ్యాషన్ ప్రొడక్ట్స్..
ప్యాషన్ యాక్ససరీల్లో లెదర్ బ్రాండెడ్ వస్తువులది ఒక ప్రత్యేక స్థానం. అలాంటి లెదర్ కారణంగా ఎన్నో జంతువులు చనిపోతున్నాయనే విషయం తెలిసిందే. పైగా ఇది పర్యావరణ అనుకూలమైంది కూడా కాదు. దీనికి చెక్‌పెట్టేలా పర్యావరణ హితంగా ఆహార వ్యర్థాలను నివారించే దిశగా ఒక సరికొత్త లెదర్‌ని తీసుకొచ్చారు ప్రితేష్ మిస్త్రీ. ఈ సరికొత్త ఆవిష్కరణతో లెదర్ ప్లేస్‌లో బయోలెదర్ని తీసుకొచ్చి..జంతువులకు హాని కలగకుండా కాపాడటమే గాక పర్యావరణ హిత ఫ్యాషన్ ఉపకరణాలకు నాంది పలికారు. ఆయనకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే..ముంబైకి చెందిన ప్రితేష్ మిస్త్రీకి కాలేజ్‌లో ఇంజనీరింగ్ చదివే సమయంలో ఈ ఆలోచన తట్టింది. అయితే తన చివరి సంవత్సరం ప్రాజెక్టులో భాగంగా ఈ దిశగా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. ఆ ఆవిష్కరణ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఆయన బయోలెదర్ కోసం టమాటా వ్యర్థాలనులను వినియోగించారు. దాని నుంచి తయారు చేసిన లెదర్‌తో బూట్లు, బ్యాగ్‌లు వంటివి కూడా రూపొందించారు. వీటిని టీబీసీ బ్రాండ్ ఉత్పత్తులుగా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. వాటికి అత్యంత ఆదరణ లభించడమే గాక అందరి ప్రశంసలందుకుంది. అంతేగాదు 2021 పెటా వేగన్ ఫ్యాషన్ అవార్డుల్లో కూడా ఈ టీబీసీ బయోకంపెని ఉత్పత్తులు ఉత్తమ ఆవిష్కరణగా నిలిచాయి. టమాటాలే ఎందుకు..టమాటాలను ప్రాథమిక ముడి పదార్థంగా ఉపయోగించి పాలియురేతేన్, పాలీ వినైల్ క్లోరైడ్ వంటి ప్లాస్టిక్ చోటివ్వకుండా బయోలెదర్ సృష్టించాలన్నది మిస్త్రి లక్ష్యం. జంతువులకు కూడా హాని కలిగించకుండా చేయాలన్నది ప్రధాన అజెండా. ఇక అందుకోసం ఈ టమాటాలనే ఎందుకు ఎంచుకున్నారంటే..భారతదేశం ఏడాదికి 44 మిలయన్ల టన్నుల టమాటాలను ఉత్పత్తి చేస్తున్న రెండో అతిపెద్ద దేశం కావడంతో ఈ కూరగాయను ఎంచుకున్నాడు మిస్త్రీ. అదీగాక ఏటా వాటిలో 30 నుంచి 35% వరకు టమాటాలు వృధా అయిపోతున్నాయి. కాబట్టి ఆ సమస్యకు చెక్‌పెట్టి..పర్యావరణ హితంగా బయోలెదర్ తయారు చేయాలని భావించాడు. అందులోనూ టమాటాలో స్కిన్, విత్తనాలు, పెక్టిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది లెదర్ తయారీకీ అత్యంత అనుకూలం అని తెలిపారు మిస్త్రీ. అలాగే జంతువుల చర్మం నుంచి చేసే లెదర్ తయారీ ఫ్యాక్టీరీల నుంచే వచ్చే కాలుష్యాన్ని కూడా ప్రత్యక్షంగా చూడటంతో ఇలా పర్యావరణ హితంగా, ఆహార వ్యర్థాలను నివారించే బయో లెదర్ తయారు చేయాలనుకున్నట్లు తెలిపారు. అయితే తాము లెదర్ తయారు చేయగలిగాం కానీ, దాని, ఆకృతి, మనిక పరంగా నెలల తరబడి శ్రమిస్తే గానీ మంచి నాణ్యమైన బయో లెదర్‌కి బీజం పడలేదని వివరించారు. అలాగే సహజ రంగులనే ఉపయోగించేలా కేర్ తీసుకుంటామని చెప్పారు. తమ టీబీసీ కంపెనీ టమాటాలు బాగా పండే గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలలోని ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల సాయంతో పొలాల నుంచి నేరుగా టమాటా వ్యర్థాలను సేకరిస్తారట. దాన్ని లెదర్ తయారీకి వీలుగా ఉండే వనరుగా మారుస్తారట. ఆ తర్వాత మొక్కల ఆధారిత బైండర్లు, సహజ ఫైబర్ల సాయంతో మన్నికైన బయోలెదర్ని తయారు చేస్తామని తెలిపారు. ఆకృతి కోసం విషరహిత క్యూరింగ్ చేస్తామని చెప్పారు. అలా 2024 మే నాటికి బయోలెదర్తో తయారు చేసిన వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించామని తెలిపారు. ఇంటీరియర్ డిజైన్, ఆటోమెటివ్ పరిశ్రమలకు పనికొచ్చేలా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పైగా ఈ లెదర్ ఆహ్లాదకరమైన వాసనను వెదజల్లుతుందని చెప్పారు. నిజంగా ఇది అలాంటి ఇలాంటి ఆవిష్కరణ కాదు కదా..పర్యావరణం మెచ్చే లెదర్ ఉత్పత్తులు కదూ..!. View this post on Instagram A post shared by Bioleather (@bioleather) (చదవండి: డిజిటల్ డ్యామేజ్..! అంతకంతకు మయోఫియా వ్యాధులు..) -
ఫ్యాషన్ క్లిక్.. ట్రై లుక్ : మువ్వన్నెల వస్త్రాలు
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల వస్త్రధారణలో భాగం కావడం సాధారణమే. అయితే ఈ మూడూ ఒకే డ్రెస్సింగ్‌లో మేళవింపుగా చూడాలంటే అది ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సాధ్యం. భారత జాతీయ జెండాను ప్రకాశింపజేసే త్రివర్ణాలను రంగరించి ఫ్యాషన్ ఔత్సాహికులు వస్త్రధారణ కాంతులీనేలా చేయడం ఇప్పుడు నగరంలో సర్వసాధారణంగా మారింది. ఆయా సందర్భాలు, సంఘటలకు అనుగుణంగా వస్త్రధారణలో మార్పులు ప్రస్పుటంగా కనిపించేలా అదరగొట్టే లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ వస్త్రధారణలో దుస్తులతోపాటు వివిధ రకాల యాక్సెసరీస్ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో భారతీయ జెండా రంగులను – కాషాయం (ధైర్యం), తెలుపు (శాంతి) ఆకుపచ్చ (సంపద/ శ్రేయస్సు) దుస్తుల్లో చేర్చడం ఆనవాయితీగా మారింది. ఈ సందర్భంగా మహిళలు మూడు రంగుల్లో సొగసైన చీరలు, సల్వార్ కమీజ్ సెట్స్ లేదా కుర్తాలను ఎంచుకుంటున్నారు. అలాగే కాషాయం దుపట్టా, ఆకుపచ్చ గాజులతో తెల్లటి కుర్తాలను జత చేయడం లేదా పూర్తి త్రివర్ణాలు కలగలిసిన చీర ధరించడం కూడా ట్రెండ్ అవుతోంది. ‘మిగిలిన రోజుల్లో ఎన్ని ఫ్యాషన్స్ ఫాలో అయినా, ప్రత్యేక సందర్భాల్లో ట్రై కలర్స్ మన డ్రెస్సింగ్‌లో మేళవించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తాం. ఈ వస్త్రధారణ మన ఫ్యాషన్ సెన్స్ చాటి చెప్పడానికి కాదు.. మనం భారతీయులం అని సగర్వంగా చెప్పుకోడానికి కదా’ అంటున్నారు నగరానికి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ కాచిగూడ నివాసి గౌరీ జోషి. ఇదే అభిప్రాయన్ని పూర్తిగా బలపరుస్తున్నారు నగర మహిళ సుమన్ కృష్ణ. ‘ఇది ఫ్యాషన్ షో కాదు.. మన అస్తిత్వ ప్రదర్శన’ అంటారామె. ఖాదీ.. హైదరాబాదీ.. పురుషులు కుర్తాలు, నెహ్రూ జాకెట్లు లేదా జాతీయవాద స్పర్శతో కూడిన సాధారణ టీ షర్ట్స్ కూడా ఇండిపెండెన్స్ లుక్‌లో భాగం చేస్తున్నారు. ఖాదీ అనేది కేవలం ఒక ఫ్యాబ్రిక్ మాత్రమే కాదు. ఇది నాటి స్వాతంత్య్ర ఉద్యమంలో భాగం. అందుకే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖాదీ లేదా భారతీయ చేనేత వ్రస్తాలను కూడా అనేక మంది ధరిస్తున్నారు. తద్వారా భారతదేశ స్వాతంత్య్ర పోరాట మూలాలను స్మరించుకోవడంతో పాటు స్థానిక చేనేత కళాకారులకు మద్దతు అందించినట్టుగా భావిస్తున్నారు. అలాగే ఈ ట్రెండ్స్‌లో లినెన్ కాటన్, చందేరి ఖాదీ మిశ్రమాలు కూడా స్టైలిష్‌గా ప్రదర్శిస్తున్నారు. ‘జాతీయత ప్రతిబింబించే వస్త్రధారణ ఎంచుకున్నప్పుడు నా డ్రెస్సింగ్‌లో ఖాదీ తప్పనిసరిగా ఉండాల్సిందే’ అని చెప్పారు నగరానికి చెందిన ఈవెంట్ మేనేజర్ రాజ్ కిషోర్. స్వేచ్ఛా స్ఫూర్తిని తెలిపేలా.. : స్వేచ్ఛా స్ఫూర్తిని వ్యక్తీకరించడానికి ఫ్యాషన్ ఒక శక్తిమంతమైన మార్గం అంటున్నారు నగరానికి చెందిన హామ్స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాకల్టీ. వారు అందిస్తున్న విశేషాలివి.. త్రివర్ణాలు (కుంకుమ, తెలుపు, లేదా ఆకుపచ్చ) కలిగన కుర్తాలను ఎంచుకుని, దానికి నప్పేలా లేదా కాంట్రాస్ట్‌గా ఉండే పైజామా జత చేయాలి. వీటికి అనుగుణమైన షేడ్‌లో దుపట్టా జోడించడం ఫ్రీడమ్ లుక్‌కి మెరుపునిస్తుంది.స్వేచ్ఛను సగర్వంగా వేడుకగా జరుపుకోవడంలో ఆత్మవిశ్వాసం కనిపించాలి. అధికారిక సమావేశాలకు, సంప్రదాయ దుస్తులు, చీర లేదా కుర్తా, పైజామా వంటివి సరైన ఎంపిక. అయితే సాధారణ సమావేశాలకు, మరింత ఆధునిక శైలితో ప్రయోగాలు చేయవచ్చు. త్రివర్ణంలో మెరిసే గాజుల నుంచి స్కార్ఫ్‌లు, హెడ్ బ్యాండ్స్, రిస్ట్‌బ్యాండ్స్ వరకూ విభిన్న రకాల యాక్సెసరీస్ కూడా ఫ్రీడమ్ ఫ్లేవర్ జోడించడానికి సులభమైన మార్గం. సాధారణ ట్రై కలర్స్‌లో మెరిసే హెయిర్ క్లిప్‌తో కూడా ఇండిపెండెన్స్ డే లుక్ ప్రతిబింబించవచ్చు. స్ఫటికంలా మెరిసే తెల్లటి టాప్‌కి జీన్స్, జాకెట్ లేదా వేరే డ్రెస్ ఏదైనా స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్ ప్రస్ఫుటించేలా క్లాసిక్ డెనిమ్ దుస్తులు ధరించి, వాటికి ట్రై కలర్ యాక్సెసరీస్ జోడిస్తే అందంగా తళుక్కుమనేలా కనిపిస్తారు. ఇది ఓ రకంగా ఫ్యూజన్Œ స్వేచ్ఛను కనబరుస్తుంది. ధోతి–చీర సంప్రదాయ ట్రెండ్‌ను మిళితం చేస్తుంది. ఇది ఫ్యాషన్–ఫార్వర్డ్ సౌకర్యవంతమైన విధంగా జరుపుకోడానికి అనువైన ఎంపికగా చేస్తుంది. హామ్ స్టెక్ కాలేజ్ ఆఫ్ డిజైన్ ఇయర్ రింగ్స్ టు.. లెగ్గింగ్స్.. చెవిపోగుల నుంచి ట్రైకలర్స్తో ఎంబ్రాయిడరీ చేసిన జుతా (ఓ రకమైన పాదరక్షలు)ల వరకూ, యాక్సెసరీస్ కూడా ఫ్రీడమ్ స్ఫూర్తిని చాటేలా వినియోగిస్తున్నారు. అలాగే బ్యాగులు, దుపట్టాలు మాసు్కలు సైతం త్రివర్ణ శోభితంగా మారుతున్నాయి. పాఠశాలలు లేదా కళాశాలల్లోని అబ్బాయిలు అమ్మాయిలు త్రివర్ణాల థీమ్‌తో టీ షర్ట్స్, స్నీకర్స్ ఎంచుకుంటున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా త్రివర్ణాల థీమ్‌లతో కూడిన ఫ్యామిలీ కాంబో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ‘ప్రౌడ్ ఇండియన్’ అనే క్యాప్షన్ రాసున్న కస్టమైజ్డ్ టీ షర్ట్స్ స్కూల్స్‌లో విరివిగా కనిపిస్తున్నాయి. పర్యావరణ స్పృహతో మేళవించిన ఫ్యాషన్ అనుసరణీయంగా మారింది. ఆర్గానిక్ కాటన్, రీసైకిల్ చేసిన దుస్తులు కూడా వినియోగిస్తు న్నారు. -
ఫరెవర్ మిసెస్ ఇండియా హైదరాబాద్ విజేతగా బంగ్లా చంద్రలేఖ
ఫరెవర్ మిసెస్ ఇండియా 2025 హైదరాబాద్ విజేతగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన బంగ్లా చంద్రలేఖ నిలిచారు. జైపూర్ జీ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ టైటిల్ గెలుచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెరల్ సిటీ హైదరాబాద్ నుంచి పోటీల్లో పాల్గొని విజేతగా నిలవడం చాలా ఆనందాన్నిచ్చిందని తెలిపారు. షారా ఫ్యాషన్ డిజైనింగ్ వ్యవస్థాపకురాలిగా వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటూ, కార్పొరేట్ కంపెనీలో టీమ్ లీడర్‌గా రాణిస్తూనే ఫరెవర్ మిసెస్ ఇండియా హైదరాబాద్ పోటీల్లో పాల్గొన్నానని చెప్పారు. నటన, మోడలింగ్ అంటే ఇష్టం. అందుకే ఫ్యాషన్ డిజైనింగ్‌లో అడుగు పెట్టాను. నా ఇష్టాలకు కుటుంబ సభ్యుల సహకారం తోడైందని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరనే గట్టి నమ్మకాన్ని కలిగిస్తోందన్నారు. అందం, ఆత్మస్థైర్యంహైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తూ ఎస్కే మిసెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్, మిసెస్ తెలంగాణ కిరీటాలను గెలుచుకున్న ప్రియాంక తారే తన వ్యక్తిత్వం, ప్రతిభ, పట్టుదలతో ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచారు. నోయిడాలో జరిగిన ప్రతిష్టాత్మక ఎస్కే యూనివర్స్ ఇండియా ఇంటర్నేషనల్ 2025 సీజన్ 27లో ఆమె సౌందర్యం, సమతుల్యత, ఆత్మవిశ్వాసం జడ్జీలతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విజేతగా ఎంపిక చేశారు. ఛత్తీస్‌గఢ్ భిలాయ్‌కు చెందిన ప్రియాంక ఈ పోటీల్లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించారు. కార్పొరేట్ లీడర్‌గా, ఈవెంట్స్, ఎచ్ఆర్, సీఎస్ఆర్ రంగాల్లో రాణించడమే కాకుండా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా, గాయనిగా, నృత్యకారిణిగా తన బహుముఖ ప్రజ్ఞ చాటుకుంది. టీఎస్ఈ8 ఉమెన్స్ అచీవ్మెంట్ అవార్డు 2025తో పాటు యూట్యూబ్, ఇన్‌స్టా్రగామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. (చదవండి: International Youth Day: విజయకేతనం ఎగరేసిన ధీర యువత..!) -
10వేల క్రిస్టల్స్, ఐవరీ వైట్ లెహంగాలో జాన్వీ డాజ్లింగ్ లుక్
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కోచర్ కలెక్షన్ క్వాంటం ఎంటాంగిల్‌మెంట్‌ను ముంబైలో ఆవిష్కరించారు ఈ బ్రైడల్ కోచర్ షోలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అందంగా మెరిసిపోయింది. మొన్న మసాబా గుప్తా బ్రైడల్గా అందంగా మురిపించిన జాన్వీ తాజాగా గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన లెహంగాలో అభిమానులను మెస్మరైజ్ చేసింది. జాన్వీ ధరించిన లెహెంగాకు సంబంధించి కొన్ని వివరాలను గౌరవ్ గుప్తా ఇన్‌స్టాలో షేర్ చేశారు.ఐవరీ వైట్ స్వర్ణమ లెహంగా, పొడవైన దుపట్టాలో అద్భుతమైన లుక్‌లో జాన్వీ అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. ఈ షోలో జాన్వీ షోస్టాపర్‌గా నిలిచింది. గౌరవ్‌తో కలిసి అభిమానులను పలకరించింది. దీనికి తోడు డైమండ్ ఆభరణాలతో దేవకన్యలా మెరిసింది. 10వేలకు పైగా స్ఫటికాలతో ఈ లెహంగాను డిజైన్ చేశారట. అంతేకాదు జాన్వీ సోదరి ఖుషీ కపూర్‌లో కూడా ఈ బ్రైడ్ల్ షోలో సందడి చేసింది. (పండగ వేళ గుడ్ న్యూస్ : లక్షల టన్నుల బంగారం నిక్షేపాలు, ఎక్కడ?) View this post on Instagram A post shared by Gaurav Gupta (@gauravguptaofficial) ఈ ఇంకా షోలో డైరెక్టర్ కిరణ్‌రావు, దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ, మలైకా అరోరా, శ్రియా శరణ్ దిశా పఠాని, తదితర ఫిలిం స్టార్లు, పలువురు మోడల్స్ మెరిసారు. ఈ షోకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: బుల్లితెర నటి సమీరా ఔదార్యం, బంగారం లాంటి పని -
సంచార జాతుల ప్రాచీన హస్త కళ..ట్రెండీ స్టైల్‌గా..!
మెటాలిక్ కలర్, మిర్రర్ వర్క్ డ్రెస్‌లో నటి ఖుషీ కపూర్ హ్యూందయ్ ఇండియన్ కొచర్ వీక్‌లో మెరిసిపోయారు. డిజైనర్ రిమ్జిమ్ దాదు చేసిన ఈ మోడర్న్ డిజైన్స్‌కి గుజరాతీ సంచార జాతుల హస్తకళ ప్రేరణగా నిలిచింది. ఎవర్‌గ్రీన్‌గా నిలిచే కలర్స్‌కి తోడైన ప్రాచీన హస్తకళ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆక్సిడైజ్డ్ సిల్వర్, మిర్రర్ వర్క్, హెరిటేజ్, మోడర్న్ ... అంశాలతో లగ్జరియస్ బ్రాండ్‌గా పేరొందిన రిమ్జిమ్ దాదు ఈ డిజైన్స్ రూపొందించారు. ‘ఆక్సిన్‘ పేరుతో మన మూలాల కాంతి అని అర్ధం వచ్చేలా చేసిన ఈ డిజైన్స్‌లో పటోలా వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌ను ఆమె తన డిజైన్స్‌కి జత చేశారు.ఖుషీ కపూర్ ధరించిన కస్టమ్ టెక్ట్స్‌టైల్ బ్రాకెట్–స్టైల్ బ్లౌజ్, హై–వెయిస్టెడ్ లెహంగా ఎంగేజ్మెంట్, రిసెప్షన్ వంటి వేడుకలలో హైలైట్‌గా నిలిచే లక్ష్యంతో ఈ డ్రెస్‌ను రూపొందించారు. మెటాలిక్ కలర్లోనే స్కర్ట్ అంతా మిర్రర్ వర్క్ చేశారు. బంజారా సంచార స్ఫూర్తితో ప్రేరణ పొందిన ఈ సేకరణలో మెటాలిక్ తీగలను ఉపయోగించారు. దీంతో బంజారా తెగ సాంస్కృతిక వారసత్వం హైలైట్ అయ్యింది. ‘బంజారాతో దుస్తులకు ఉన్న సంబంధాన్ని, అది తనకు తెచ్చిన అందం, సౌకర్యాన్ని ఇష్టపడుతున్నాన’ని ఖుషీకపూర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఆక్సిడైజ్డ్ సిల్వర్, మిర్రర్ వర్క్, హెరిటేజ్, మోడర్న్ ... అంశాలతో లగ్జరియస్ బ్రాండ్‌గా పేరొందిన రిమ్జిమ్ దాదు ఈ డిజైన్స్ రూపొందించారు. ‘ఆక్సిన్‘ పేరుతో మన మూలాల కాంతి అని అర్ధం వచ్చేలా చేసిన ఈ డిజైన్స్‌లో పటోలా వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌ను ఆమె తన డిజైన్స్‌కి జత చేశారు. ఇతర మోడల్స్ ధరించిన డ్రెస్సులను డిజైనర్ దాదు తన బ్రాండ్ సిగ్నేచర్ మెటల్ వైర్ల నుండి రూపొందించిన టైలర్డ్ ఫారమ్స్, స్కల్ప్చర్ డ్రేప్లతో ఆకట్టుకుటోంది. ఈ డిజైన్స్‌లో పైస్లీ మోటిఫ్‌లు మెరుస్తూ ఆకట్టుకున్నాయి. మన దేశీయ వారసత్వ హస్తకళా సంపద ఎన్నటికీ వన్నెతగ్గదని నిరూపిస్తూ డిజైనర్లు స్ఫూర్తిమంతమైన డిజైన్స్ మన ముందుకు తీసుకువస్తూనే ఉంటారు. మన మూలాల గొప్పతనాన్ని ఎప్పటికీ నిలిచి ఉండేలా ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంటారు. (చదవండి: సెల్ఫ్ బ్రాండ్..అదే ట్రెండ్..! పేరులో ఐడెంటిటీ..అదే ఇవాళ స్టైల్లో మేటి..) -
ముసురులో ముచ్చటైన ఆహారం..! పోషకాలు ఫుల్..
ముసురులో వేడివేడిగా.. ముచ్చటైన ఆహారం తినాలని ఎవరికి ఉండదు.. అలాంటి ఆహారాల్లో చెప్పుకోదగినది.. అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న వస్తువులతో సిద్ధం చేసుకోగలిగినది ఏదైనా ఉందంటే.. అది కిచిడీ ఒక్కటే.. అంతేకాదు.. నగరంలో అనేక మందికి ఇది అభిమాన బేక్ర్ఫాస్ట్ డిష్ కూడా. రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ దేశీ వంటకం ప్రపంచ గ్యాస్ట్రోనామిక్ మెనూలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. విభిన్న రకాల కూరగాయలు, దినుసుల మేళవింపుతో అనేక పోషక విలువలు దీని సొంతమని ఆహార నిపుణులు చెబుతోన్న మాట.. శుభ్రత, ఆరోగ్యం, రుచిని కలగలిపే భారతీయ వంటకం కిచిడీ. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ నప్పే, నచ్చే వంటకంగా చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా మన దేశపు ‘సూపర్ ఫుడ్’గా కూడా ఇది గుర్తింపు పొందుతోంది. భారత్ నుంచి ప్రపంచ గ్యాస్ట్రోనామిక్ మెనూలో బిర్యానీ, పంజాబీ కడీ, దోస, రాజ్మా చావల్ తరహాలో కిచిడీ కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన రోజువారీ ఆహారంలో కిచిడీని భాగం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సినీ సెలబ్రిటీలు కరణ్ జోహార్, తమన్నా భాటియా, మంధిరా బేడీ, క్రికెటర్ హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్ వంటి ప్రముఖులు కూడా కిచిడీ లవర్స్‌గా తమను తాము చెప్పుకుంటున్నారు. ఆరోగ్యానికీ మేలు.. మనలో చాలా మందికి చిన్నప్పటి జ్ఞాపకాలలో కిచిడీ రుచులు తప్పకుండా ఉంటాయి. అరుగుదల సులభం అనే ఆలోచనతోనే కిచిడీకి అంత క్రేజ్ వచ్చిందనేది నిస్సందేహం. రుచిగా ఉండటమే కాదు, దీనిని ప్రత్యేకంగా వండే శైలి కారణంగా తేలికగా జీర్ణం కాగలదు. ఇది కొన్ని వెరైటీల్లో ఎక్కువగా ముద్దలాగా తయారవుతుంది. కొన్ని రకాల్లో ఘన పదార్థంలా ఉంటుంది. అయినా ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి దోహదపడుతుంది. వర్షం, ముసురు పట్టిన రోజుల్లో లేదా అనారోగ్య సమయంలో తినడానికి శ్రేష్ఠమైన ఆహారం. కిచిడీ సులభంగా జీర్ణమవుతుంది. అనేక విధాలుగా తయారు చేయొచ్చు. ప్రతి ఒక్కరికీ సరిపోయే ఆహారం ఇది అంటున్నారు సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్. ప్రొటీన్లు, విటమిన్లు అధికం..దీనిలో ఉండే మసాలాలు, మినపప్పు, బియ్యం వంటి పదార్థాల వల్ల ఇది శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు అందిస్తుంది. తేలికగా జీర్ణం కావడం మాత్రమే కాదు.. ఇది జీర్ణశక్తిని మెరుగుపరిచే ఆహారం కూడా. బియ్యంలో కలిపే ‘ హింగు (ఇంగువ), మిరియాలు, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి వంటి మసాలాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. ఇటీవలే ఓ ప్రదర్శనలో చెఫ్ శివజిత్ సూరి మూంగ్ దాల్, మష్రూమ్స్, ట్రఫుల్ నూనె, గ్రీన్ బీన్స్ వంటి పదార్థాలతో కిచిడీ అంతర్జాతీయ ఫ్లేవర్ తీసుకొచ్చి ఆహార ప్రియుల్ని ఆకట్టుకున్నారు. వీటితోపాటు సాబూదాన్, వెజిటబుల్స్, చిరుధాన్యాలతో చేసే కిచిడీ వెరైటీల రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. నగరంలో ఎక్కడెక్కడ? ఈ కిచిడీ ప్రియుల కోసం నగరంలో పలు రెస్టారెంట్స్ వెరైటీ డిష్‌లను అందిస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లలోని ఈట్ ఫిట్ రెస్టారెంట్‌లోని గ్రేట్ ఇండియన్ కిచిడీ, జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లలో ఉన్న అంతేరా కిచెన్, ఎమ్ఓఏఐ, కృష్ణపట్నం, మోడ్రన్/కాంటినెంటల్ వంటలతో కూడిన రెస్టారెంట్లలోని కిచిడీలు మంచి రేటింగ్స్ పొందాయి. అలాగే అమీర్‌పేట్‌లోని హబీబో అందించే దాల్ కిచిడీ, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీలలో ఉన్న డైలీ రిచ్యువల్స్, టెర్రాయ్ అండ్ నియో తెలంగాణ కిచెన్, రెడ్ రినో, హోటల్ నయాబ్, టోలిచౌకిలోని హోటల్ రుమాన్, షాగౌస్లు అందించే కిచిడీ ఖీమా అండ్ కట్టా వంటివి కిచిడీ వంటకాలకు పేరొందాయి. (చదవండి: శ్రావణ శోభను తెచ్చేలా..పట్టుతో స్టైలిష్‌గా మెరుద్దాం ఇలా..!) -
సెల్ఫ్ బ్రాండ్..అదే ట్రెండ్..!
ప్రస్తుత కాలంలో ప్రతిదీ ఓ ట్రెండే.. అది ఫ్యాషన్ అయినా.. లైఫ్ స్టైల్ అయినా.. పేర్లు, ఇష్టాలు, అభిప్రాయాలు, ఆసక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో.. వాడే వస్తువులు, ధరించే దుస్తుల ద్వారా తమ భావాన్ని వ్యక్తికరించాలనే తపనలో ప్రస్తుత తరం యువత ఆలోచిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మధ్య కాలంలో విడుదలైన పుష్ప సినిమాలోని డైలాగ్ గుర్తుందా..! ‘పుష్ప అంటే పేరుకాదు పుష్ప అంటే బ్రాండ్’ అన్నట్లు బ్రాండ్ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతోంది నేటి యువత. అయితే ఇందులోనూ ఎవరి ట్రెండ్ వారిదే.. ఎవరి బ్రాండ్ వారిదే.. ప్రస్తుతం ఫ్యాషన్ అంటే కేవలం అందాన్ని పెంచేదో, ఆధునికతను చూపించేదో మాత్రమే కాదు. తమ తమ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే సాధనంగా కూడా మారిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘తమ గురించి తాము చెప్పుకునే’ ఫ్యాషన్ ట్రెండ్. ఇప్పుడు నగరంలో ఈ తరహా ట్రెండ్ ఊపందుకొంది. వ్యక్తిగత అభిరుచిని బట్టి అలాంటి సెల్ఫ్–ఎక్స్ప్రెషన్ స్టైల్స్ విభిన్న రకాలుగా ఉంటున్నాయి. ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే స్టైల్స్ ప్రాధాన్యత పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా పలు బ్రాండ్లు సైతం వినూత్న ఫ్యాషన్లను ఆవిష్కరిస్తున్నాయి. కఫ్ లింక్స్ పై పేర్లు.. ఇటీవల తమ పేరు లేదా వ్యక్తిగత గుర్తింపుతో కూడిన కఫ్ లింక్స్ ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విభిన్న అలంకరణలతో, చేతి చివర్లలో ధరించే ఈ కఫ్ లింక్స్‌లో పేరు, ఇంకేమైనా ప్రత్యేకమైన డిజైన్లు చెక్కించుకుంటున్నారు. ఒకప్పుడు కార్పొరేట్ ఫార్మల్ వేర్లో భాగంగా మాత్రమే వినియోగించే హ్యాండ్‌మేడ్ – కస్టమ్ – డిజైన్ బంగారం, వెండి లాంటి మెటల్స్‌తో తయారవుతున్నాయి. పేర్లు, లక్షణాల ప్రాతిపదికన డిజైన్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అలాగే వీటిని బహుమతులుగానూ వినియోగిస్తున్నారు. ఈ ట్రెండ్ ముఖ్యంగా యువతలో, పెళ్లిళ్లు లేదా ఫ్యామిలీ ఫంక్షన్లలో తమ పేరు లేదా ఇనీíÙయల్స్తో ప్రత్యేకత చూపించాలనుకునే వారి వల్ల బాగా పాపులర్ అవుతోంది. ఫ్యాషన్ రంగ నిపుణులు కూడా ఈ ట్రెండ్‌ను ‘పర్సనలైజ్డ్ ఎలిగెన్స్’గా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి కొత్త ప్రయోగాలు, సంప్రదాయ ఆధునికతల కలయికగా మన నగరంలో మారుతున్నాయని చెబుతున్నారు. కేవలం కఫ్లింక్స్ మాత్రమే కాదు, వ్యక్తిగత గుర్తింపును ఫ్యాషన్‌లో కలిపే ట్రెండ్స్ ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి. సొంత/ఇంటి పేరుతో లేదా మొదటి అక్షరంతో డిజైన్ చేసిన గొలుసులు. నేమ్ నెక్లెస్ / ఇసీíÙయల్ పెండెంట్స్, రింగ్స్ వంటివి సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్ లాంటి మెటల్స్‌లో లభ్యం అవుతున్నాయి. ఇది ముఖ్యంగా యువతలో, ప్రేమ జంటల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. జాకెట్లు/శాలువాలు : షర్ట్, జాకెట్స్(బ్లేజర్స్)పై పేరు లేదా చిన్న మెసేజ్‌ను ఎంబ్రాయిడరీతో బ్రాండెడ్ లోగో తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇది డ్రెస్‌కి ఓ వ్యక్తిగత టచ్ ఇచ్చేలా చేస్తుంది. కస్టమ్ మేడ్ టి–షర్ట్స్, ప్రింట్ చేసిన పేరు, ఫేవరెట్ కోట్, బర్త్‌డేట్ లేదా క్యారెక్టర్ డ్రాయింగ్‌తో కూడిన డిజైన్లు, గ్రూప్ ఈవెంట్స్, బర్త్‌డేలు, ట్రావెల్ వంటి సందర్భాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సొంత పేర్లను కాకపోయినా, తమ భావోద్వేగాలు ప్రతిబింబించే పదాలు, సంకేతాలు టాటూలుగా వేయించుకోవడం కూడా సెల్ఫ్–ఎక్స్ప్రెషన్లో భాగమే. పేర్లు, ఇనీషియల్స్‌తో కూడిన స్నీకర్స్, లేదా ఫేవరెట్ డిజైన్‌తో ఉండే పాదరక్షలు, షూ డిజైన్లుగా మారుతున్నాయి. ఈ ట్రెండ్ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ‘నైక్’ వంటి బ్రాండ్లు కూడా కస్టమైజేషన్‌కు అవకాశం ఇస్తున్నాయి. ఇండియన్ వెడ్డింగ్ డ్రెస్‌లపై పేర్లు కాడలుగా అల్లడం పెళ్లి కూతురు లేదా వరుడు దుస్తుల్లో తన పేరు లేదా జంట పేరు అల్లించుకోవడం ట్రెండ్‌గా మారుతోంది. అలాగే బ్యాగ్స్, వాలెట్స్, ట్రావెల్ పౌచ్‌లు తదితర పర్సనల్ ఐటమ్స్‌పై మోనోగ్రామ్‌లు, నేమ్ ఇనీషియల్స్‌తో ఉన్న హ్యాండ్‌బ్యాగ్స్ కూడా విరివిగా వాడుతున్నారు. ఇవి లగ్జరీ బ్రాండ్స్ (లూయిస్ విటన్, గూచి) నుంచి చిన్న ఆర్టిసన్ స్టోర్ల వరకూ అందుబాటులో ఉన్నాయి. (చదవండి: జల్లుల సీజన్..ఒళ్లు జాగ్రత్త..! లేదంటే వర్షపు వ్యాధుల ముప్పు..) -
విచిత్రమైన షరతు!
ఇండస్ట్రీకి ‘నో డేటింగ్’ కండిషన్ తో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్. ఇప్పుడు టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ, అభిమానులు గుడి కట్టేంత ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది.నిధి నిజానికి హైదరాబాద్‌లోనే 1992 ఆగస్టు 17న పుట్టింది. చిన్నతనం కూడా అక్కడే గడిచింది. తర్వాత బెంగళూరులో చదువుకుంది. అందుకే హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో సునాయాసంగా మాట్లాడగలుగుతుంది.తన తొలి సినిమా ‘మైఖేల్ మున్నా’ కోసం, ఏ హీరోయిన్ ఒప్పుకోని షరతును అంగీకరించింది. సినిమాలో నటిస్తున్నంతవరకూ ఎవరితోనూ డేటింగ్ చేయరాదని ఒప్పందంలో క్లాజ్ పెట్టారు. ‘‘అప్పట్లో కెరీర్ కావాలి, డబ్బులు అవసరం. కాబట్టి సరేనన్నాను’’ అని నవ్వుతూ చెబుతుంది నిధి.తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ అయింది. కాని తమిళంలో శింబు, ఉదయనిధి స్టాలిన్, జయం రవిలతో చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్‌తో ‘రాజాసాబ్’ సినిమాలపై చాలా ఆశలు పెట్టుకుంది.పూజా హెగ్డే తర్వాత, నాగ చైతన్య, అఖిల్– అన్నదమ్ములు ఇద్దరితోనూ నటించే అవకాశం దక్కించుకున్న హీరోయిన్ నిధి.ఫిబ్రవరి 14, వాలెంటైన్ ్స డే రోజున తమిళనాడులో అభిమానులు ఆమె విగ్రహానికి పాలతో అభిషేకం చేసి, గుడి కట్టినట్టు వార్తలు, ఫొటోలు వెలుగులోకి రావడం చూసి, షాక్ అయిందట!హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో నిధి అమ్మమ్మ వాళ్ల ఇల్లు ఉంది. ‘హైదరాబాద్ మించిన ఫన్ ప్లేస్ ప్రపంచంలో లేదనిపిస్తుంది’ అని అంటుంది నిధి. అంతేకాదు, నగరంలో దాదాపు 15 వేల మంది బంధువులు ఉన్నారట!బెంగళూరులో చదువుకునేటప్పటి నుంచే హీరోయిన్ కావాలనే కోరిక. కాని, ఇండస్ట్రీలో పరిచయాలు లేకపోవడంతో ఫేస్బుక్లో అందమైన ఫోటోలు పెడుతూ, ఎవరైనా దర్శకుడు కాంటాక్ట్ చేస్తాడేమో అని ఎదురు చూసేది. ఆ ఆశే ఆమెను మోడలింగ్, అందాల పోటీల వైపు తీసుకెళ్లింది. తర్వాత హీరోయిన్ గా మారింది.కాలేజీలో ఓ అబ్బాయి ‘నీవు చాలా అందంగా ఉన్నావు’ అన్నాడు. వెంటనే చేతిలో ఉన్న యాపిల్ అతని మీదకు విసిరి, ‘నన్ను అంత మాట అంటావా!’ అంటూ అరిచిందట! ఇప్పుడు అభిమానులు పొగుడుతున్నప్పుడు ఆ సంఘటన గుర్తొచ్చి నవ్వుకుంటుందట! -
శ్రావణ శోభను తెచ్చేలా..పట్టుతో స్టైలిష్‌గా మెరుద్దాం ఇలా..!
ఇంటికి ఐశ్వర్యాన్ని, పండగ కళనూ తీసుకువచ్చే మాసంగా శ్రావణానికి పేరు. పూజలు, వివాహ వేడుకలతో ఎప్పుడూ సందడిగా ఉండే ఈ రోజుల్లో వాతావరణం మబ్బు, తుంపరలతో డల్‌గా కనిపిస్తుంది. ఇలాంటి సమయాలలో బ్రైట్‌గా వెలిగిపోవాలంటే పట్టు ఎంపిక ఎప్పుడూ పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. పట్టు చీరలు అన్నివేళలా ఒకే తరహా కట్టు అంటే బోర్‌గా ఫీలయ్యే నవతరానికి మోడర్న్ స్టైల్లో కట్టు, కుట్టు డిజైన్స్ చాలానే వచ్చాయి. ఈ మాసంలో మెరుపును, ఉత్సాహాన్ని ఇచ్చే పట్టు ఇండోవెస్ట్రన్స్ స్టైల్స్ ఇవి...డ్యుయెల్ టోన్... పండగలు అనగానే మనలో చాలామంది ఎరుపు, పసుపు, పచ్చ రంగుల గురించి ఆలోచన చేస్తారు. ఈ యేడాది ట్రెండ్‌లో ఉన్న రంగులు.. పీకాక్ బ్లూ, గోల్డ్ పట్టు చీరలు లేదా డ్రెస్సులు ఈవెనింగ్ పార్టీలకు ఎంచుకోవాలి. బాటిల్ గ్రీన్– మెరూన్ కలిసిన సంప్రదాయ రంగులు పండగల సమయాల్లో, లావెండర్ – సిల్వర్, మెహందీ రంగులు పూజలకు, మస్టర్డ్– నేవీ బ్లూ రంగులు ఇండోర్ ఈవెంట్లకు బ్రైట్ లుక్‌నిస్తాయి. దీంతోపాటు రెండు రంగుల కాంబినేషన్లో వచ్చే డ్యుయెల్ టోన్ పట్టుచీరలు వేడుకలకు మంచి లుక్‌ను తీసుకు వస్తాయి. ఉదాహరణకు బ్లూ– పింక్, గోల్డ్– మెరూన్ .. కలయికలతో ఉన్నవి. పట్టు చీరలు లైట్వెయిట్లోనూ లభిస్తున్నాయి. పెద్ద జరీ అంచు చీరలు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. మన చేనేతలైన గద్వాల, ΄ోచంపల్లి, నారాయణపేట, పీతాంబరం, బనారసి.. పట్టు చీరలు ఈ మాసానికి నిండుతనాన్ని తీసుకువస్తాయి.పట్టు లాంగ్ జాకెట్స్/ కేప్స్...ప్లెయిన్ మ్యాక్సీ డ్రెస్ వేసుకుంటే బనారసీ లాంగ్ జాకెట్ బ్రైట్‌గా, ట్రెడిషనల్‌గా కనిపిస్తుంది. లాంగ్ గౌన్పైకి జాకెట్ లేదా కేప్ లేయర్డ్గా ఉండి స్టైలిష్ ఎంపిక అవుతుంది. మోడర్న్ పట్టు బ్లౌజ్‌లు... పట్టు చీరలు/ స్కర్ట్స్‌కి ఆఫ్–షోల్డర్ బ్లౌజ్ ధరిస్తే స్టైలిష్‌గా కనిపిస్తారు. పట్టుచీర పూర్తి సంప్రదాయ విధానం అని ఆలోచించే యువతరానికి పెప్లమ్ స్టైల్ బ్లౌజ్ లేదా బెల్ట్‌తో కూడిన చీర కట్టు మంచి లుక్‌తో నప్పుతుంద. బ్యాక్–ఓపెన్ లెహంగా స్టైల్ చీర కట్టుకు హాల్టర్ నెక్ బ్లౌజ్, ప్లెయిన్ సిల్క్ స్కర్ట్‌కి కాలర్ నెక్ ఉన్న షర్ట్ స్టైల్ బ్లౌజ్‌తో ఆధునికతను జోడించవచ్చు. పట్టు లాంగ్ గౌనులుకాంచిపట్టు లేదా మైసూర్ సిల్క్ చీరలతో డిజైన్ చేసిన లాంగ్ గౌనులు ఈ మాసంలో ప్రత్యేకంగా ధరించవచ్చు. అమ్మాయిలకు ఇవి సరైన ఛాయిస్ అవుతాయి. శరీరాకృతికి తగినట్టు, ఫ్లేయర్డ్ స్కర్ట్‌ని అలాగే ధరించవచ్చు. కొన్నిసార్లు దుపట్టాతో కూడా మ్యాచ్ చేయవచ్చు. ఎంగేజ్మెంట్, రిసెప్షన్, వివాహ ఊరేగింపు.. సమయాలలో వీటి ఎంపిక ఈ సీజన్లో ప్రత్యేకంగా ఉంటుంది.ఇండో–వెస్ట్రన్ పట్టుపట్టు క్రాప్ టాప్‌కి లెహెంగా లేదా స్కర్ట్ ధరించవచ్చు. వీటిలో బనారసి లేదా ఉ΄్పాడ క్రాప్ టాప్ (స్లీవ్‌లెస్/బోట్ నెక్/హై నెక్)తో ఉన్నవి ఎంచుకోవచ్చు. వీటికి లేయర్డ్ కాంట్రాస్ట్ జరీ లెహెంగా మంచి కాంబినేషన్ అవుతుంది. జరీ బోర్డర్‌ని నెట్ లేదా జార్జెట్ ఫ్యాబ్రిక్‌కి జత చేసి దుపట్టాను డిజైన్ చేసుకోవచ్చు. సంప్రదాయ పూజలు, రాఖీ వంటి పండగలు, ఎంగేజ్మెంట్ వంటి వేడుకలకు ఇది మంచి ఎంపిక అవుతుంది.విభిన్న మోడల్స్ కట్టుడిజైనర్ బ్లౌజ్ ధరించే సాధారణ పట్టు చీరను ఎంచుకుంటే దానికి నడుము వద్ద ఎంబ్రాయిడరీ చేసిన ఫ్యాబ్రిక్ బెల్ట్ ధరించవచ్చు. వడ్డాణానికి మరొక శైలి. ఈ స్టైల్ యంగ్ లుక్‌ని తీసుకువస్తుంది. దీనికి టెంపుల్ జ్యువెలరీ, చోకర్లు ఉపయోగించవచ్చు.పట్టు ధోతీ ప్యాంటు– షార్ట్ కుర్తీఅమ్మాయిలు ట్రెండీ లుక్ కోసం ఇటీవల ధోతీ ప్యాంట్ , షార్ట్ కుర్తీని ఎంచుకుంటున్నారు. వీటిని పట్టుతో డిజైన్ చేస్తే ఈ కాలం స్టైలిష్‌గానూ, సంప్రదాయ లుక్‌తో బ్రైట్‌గా మెరిసిపోతారు. ధోతీ ప్యాంట్ కోసం నారాయణపేట, గద్వాల్ సిల్క్లను ఎంచుకోవచ్చు. ఎంబ్రాయిడరీ/మిర్రర్ వర్క్ చేసిన షార్ట్ కుర్తీలు ధోతీ ప్యాంటుకు మంచి కాంబినేషన్ అవుతుంది. వీటికి కొల్హాపురి లేదా జుట్టీలు పాదరక్షలుగా ఎంచుకోవాలి. – ఎన్నార్(చదవండి: సమద్రగర్భంలో..మహిళా స్కూబాడైవర్లు..!) -
ఐటీ గర్ల్స్ జాన్వీ కపూర్, అనన్య పాండే ధరించే కాలా ధాగా స్టోరీ ఏంటో తెలుసా..!
ఒకప్పుడు హిందూ సంప్రదాయంలో భాగమైన ఆ ఆచారమే ఇవాళ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. బహుశా సాధారణ వ్యక్తులు ఆచారంగా చేస్తే..అతి పెద్ద ఫ్యాషన్ కాదు. అదే ఏ సెలబ్రిటీనో లేక పెద్ద స్టారో ట్రెడిషన్‌ని అనుసరిస్తే..అది స్టైలిష్ యాక్సెసరీగా మారిపోతుంది. అందుకు ఉదాహరణ ఈ కాలా ధాగా. ఏంటిది అనుకుంటున్నారా..?అదేనండి మన సినీ ప్రముఖులు, పెద్ద స్టార్లు, సెలబ్రిటీల చేతి మణికట్టు వద్ద స్టైలిష్‌గా ఓ నల్లదారం కనిపిస్తుందే దాన్నే హిందీలో కాలా ధాగా అంటారు. సాధారణంగా ఏ కాశీ క్షేత్రానికో, తిరుపతి వంటి పుణ్య కేత్రాలకు వెళ్లినప్పుడూ అక్కడ ఉండే మార్కెట్లో ఈ నల్ల తాడులనే కాశీ తాడులుగా దర్శనమిస్తుంటాయి. ఆయా క్షేత్ర సందర్శనం అనంతరం ఇంటికి చేరుకుని తమ బంధువులకు, స్నేహితులకు ప్రసాదం తోపాటుగా ఈ కాశీతాడుల, ఎరుపు రంగు తాడులను ఇస్తుంటారు. వీటిని రక్షగా ధరిస్తుంటారు. అలాంటి తాడే ఈ కాలా ధాగా. మన హిందూ సంప్రదాయంలో దీన్ని చెడు దృష్టికి రక్షగా ధరిస్తారు. దీన్ని ధరిస్తే కనుదిష్టి పోతుందని భక్తుల నమ్మకం. అది నేడు ఈ ఐటీ గర్ల్స్ పుణ్యామా అని ఫ్యాషన్ యాక్సెసరీగా మారింది. మరి ఈ కాలా ధాగాను ధరించే సెలబ్రిటీలు ఎవరంటే..ఈ సెలబ్రిటీలు ఈ సంప్రదాయన్ని ధైర్యంగా పాటించడమే కాదు, రెడ్ కార్పెట్ వద్ద అయినా, లేదా వాళ్ల వర్క్ పరంగా స్టైలిష్ కనిపించాల్సి వచ్చినా చేతికి ఈ కాలాధాగా ఉండాల్సిందే. అంతలా ఈ సంప్రదాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. సిగ్నేచర్ లుక్‌గా..నల్లదారం లేకుండా కనిపించని నటి ఎవరైనా ఉన్నారంటే అది జాన్వీకపూర్. ఆమె రెడ్ కార్పెట్ లుక్స్ లేదా క్యాజువల్ వార్డ్ రోబ్ అయినా ఈ కాలా ధాగా ఉండాల్సిందేనట. ఇది లేకుండా కనపించదు. సరికొత్త ఫ్యాషన్ వేర్లో ఉన్నా..ఇది మణికట్టుకి ఉండాల్సిందేనట.అనన్య పాండే సైతం దీన్న ధరిస్తుందట. ఇటీవల ఈ జెన్ జెడ్ ఐకాన్ హనుమాన్ ఆలయంలో కనిపించారు. ఆమె అందమైన పసుపు సల్వార్ సూట్ తోపాటు ఈ కాలాధాగాను కూడా జత చేసింది. కేవలం బాలీవుడ్ నటులే కాదు అంబానీలు కూడా ఈ పవిత్ర నల్లదారాన్ని గట్టిగా విశ్వసిస్తారు. ప్రత్యేకంగా చెప్పాలంటే రాధిక మర్చంట్ తన పెళ్లికూతరు లుక్స్‌లో ఈ థ్రెడ్‌తో స్టైలిష్‌గా కనిపించింది. ఇక ఇషా అంబానీ సైతం దీన్ని ధరిస్తారు. ఈ సంప్రదాయన్ని వాళ్లంతా తన రొటీన్ జీవితంలో భాగం చేసుకునేలా ప్రాముఖ్యత ఇచ్చారు. బహుశా ఉండగా ఉండగా..ఇది కాస్తా అదెదో ఫ్యాషన్ ట్రెండ్‌లా మారిపోతుందేమో!. (చదవండి: ఆ మూవీలో మాదిరిగా 20 ఏళ్లకే అల్జీమర్స్ వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
మరో స్వదేశీ స్టోర్ వచ్చేస్తోంది : కుమార్తె, కోడళ్లతో నీతా అంబానీ ప్రత్యేక పూజ
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ఫౌండర్, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, నీతా అంబానీ ముంబైలో మరో స్వదేశీ స్టోర్‌ను లాంచ్ చేయనున్నారు. మేడ్ ఇన్ ఇండియా స్పూర్తితోపాటు, హస్తకళలను ఆదరించడం, హస్త కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా దేశంలోనే తొలిసారి అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టోర్‌ను హైదరాబాద్ ఏర్పాటు చేసిన నీతా అంబానీ తాజాగా ముంబైలోని ఈరోస్‌లో స్వదేశ్ ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నీతా అంబానీ కుమార్తె ఇషా, కోడళ్లు శ్లోక, రాధికలతో కలిసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.స్వదేశ్ స్ఫూర్తి ప్రతిబింబించేలా ఈవేడుక నిర్వహించారు. దేశీయ అనాది సంప్రదాయాలు, తరతరాలుగా అందివస్తున్న చేతివృత్తుల నైపుణ్యానికి శాశ్వత వారసత్వానికి నివాళిగా ఈ వేడుకను నిర్వహించారు.భారతీయ కళలను, సంప్రదాయాలను గౌరవించడంలో నీతా అంబానీ ఎపుడూ ముందుంటారు. తాజాగా మరో అద్భుతమైన చీరలో రాజసం ఉట్టిపడేలా కనిపించారు. రాజ్శృందర్ రాజ్‌కోట్ 10 నెలలకు పైగా చేతితో నేసిన అద్భుతమైన మధురై కాటన్ ఘర్చోలా చీరను ధరించారు. ఈ చీరకు ప్రముఖ డిజైనర్ మనీష్‌మల్హోత్రా అందమైన జాకెట్టును నీతా ఎంపిక చేసుకున్నారు. యాంటిక్ గోల్డ్ వరల్డ్ ఎంబ్రాయిడరీతో ఫిరోజీ సిల్క్ కాంచాలి బ్లౌజ్‌తో స్టైల్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india) తాత ముత్తాల నాటి మహిళా కళాకారులకు నివాళిగా నీతా తనకు వారసత్వంగా వచ్చిన బంగారు బాజుబంద్ను ధరించారు. ఇది నీతా తల్లి ముత్తాత నుండి లభించిన ఆర్మ్లెట్. తన వివాహం సందర్భంగా కూడా దీన్ని ధరించడం విశేషం. ఇది కేవలం ఒక ఆభరణం కాదు, వారసత్వం, ప్రేమ , ఒక తరం మహిళల నుండి మరొక తరం వరకు ప్రవహించే శాశ్వత శక్తికి చిహ్నం . పెద్దల కరుణ, జ్ఞానం ఆశీర్వాదాలతో నిండిన ఈ ఆర్మ్లెట్ అంబానీ నుంచి , ఆమె కుమార్తె ఇషా కుమార్తె, మనవరాలికి వారసత్వంగా లభిచనుంది.ఇక నీతా అంబానీ జ్యుయల్లరీ గురించి చెప్పాలంటే స్వదేశ్ నుండి వచ్చిన అద్భుతమైన నెక్లెస్‌తో తన లుక్‌ను మరింత వన్నె తెచ్చారు. ప్రతి ప్యానెల్ వైట్ గోల్డ్‌తో శ్రీనాథుడి జీవితంలోని దైవిక క్షణాలను చిత్రీకరించేలా చేతితో చేసిన కళాసృష్టి ఇది. కళాత్మకతను ఆధ్యాత్మికతతో మిళితం చేస్తుంది. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online) -
ధోతికట్టు..అదిరేట్టు..!
‘పంచె కట్టుటలోన ప్రపంచాన మొనగాడుకండువా లేనిదే గడపదాటని వాడుపంచ భక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడుసినారె.. రాసిన ఈ నాలుగు పంక్తుల్లో తెలుగువాడి పంచెకట్టు వైభవాన్ని చాటి చెప్పాయి.ధోతి ఒక అంచును పైనున్న లాల్చీ కుడి జేబులో పెట్టుకుని కనిపించిన నందమూరి తారకరామారావు తన తెలుగుదనపు ఠీవీని ప్రదర్శించారు. అలాగే వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం తనదైన శైలి పంచెకట్టుతో మూర్తీభవించిన తెలుగుదనానికి ప్రతిరూపంగా కనిపించేవారు. తెలుగు వారు ఠీవీగా చాటుకునే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సైతం విదేశీ పర్యటనలు మినహా ఎప్పుడూ పంచె కట్టును వీడింది లేదు’.ఈవెంట్లలోనే..నాటి తరం కట్టు బొట్టు ఇప్పడు ఫ్యాషన్ ట్రెండ్ అయింది. ప్రత్యేక సందర్భాల్లో నాటి చీరకట్టులో ప్రత్యేకత చాటుకుంటున్నారు. నాటి వస్త్రధారణ నేటి ఈవెంట్స్‌లో సరికొత్త సంప్రదాయ అలంకరణగా మారింది.– పడకంటి ఇందు,చామ కృష్ణవేణి, కరీంనగర్ ఎనభై ఏళ్లుగా..మా పుట్టిల్లు మర్తనపేట. అత్తగారి ఊరు ఇప్పలపెల్లి. పెళ్లయిన నాటి నుంచి ఇదే తరహా గోచీ చీరలే ధరిస్తున్న. 80 ఏళ్లు దాటుతున్నా మరో ఆలోచన లేదు. 18 మూరల చీరను కూడా సులువుగా కట్టుకుంటాం. కష్టం చేసుకుని బతికెటోళ్లకు ఇదే సౌకర్యం. – గొడుగు లచ్చవ్వ, ఇప్పలపల్లి సాగు పనులకు అనుకూలంనా చిన్నప్పటి నుంచి గోచీ గుడ్డ ధరించేది. కొంత పెద్దయ్యాక మొదలైన ధోతికట్టు ఇప్పటి వరకూ కొనసాగిస్తున్న. ధోతితో ఉండే సౌకర్యం మరే వస్త్రంతో ఉండదు. వ్యవసాయం చేసుకునే మాలాంటి కుటుంబాల్లో మగవాళ్లందరికీ ధోతికట్టే అలవాటైంది. సాగు పనులకు సౌకర్యంగా ఉండడం ధోతికట్టులో ఉన్నంతగా మరి దేనిలోనూ ఉండదు.సలేంద్రి దేవయ్య, పెద్దూరు అర్ధశతాబ్దకాలం క్రితం వరకు పురుషులు పంచెకట్టు, స్త్రీలు గోచి చీరలతో ఇబ్బడిముబ్బడిగా దర్శనమిచ్చేవారు. క్రమంగా ఈ వస్త్రధారణలో మార్పు ప్రవేశించింది. పల్లె సీమల్లో ఒక ఈడు దాటిన స్త్రీ, పురుషులు ఇంకా అక్కడక్కడా దర్శనమిస్తున్నా మెజార్టీ ప్రజల్లో ఈ అలవాటు దాదాపు కనుమరుగయ్యే దశ కనిపిస్తోంది. పంచెకట్టు ఒక తరం ఉనికిని, అస్తిత్వాన్ని, సాంస్కృతిక జీవన విధానాన్ని ప్రతిబింబించింది. ఆధ్యాత్మిక కార్యాలు, వివాహాది శుభకార్యాల సమయంలో వరుడితో పాటు అతని తండ్రి, కన్యాదానం చేసే వధువు తండ్రి సైతం పంచెకట్టుకే ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ పిల్లలకు ఐదారేళ్ల వయసొస్తే పంచెలు కట్టించే వేడుక నిర్వహించడం కూడా చూస్తున్నదే.పంచెకట్టు ప్రయోజనాలుశరీరానికి సహజమైన గాలి తగలడం పంచెకట్టుతో ఉన్న నిజమైన సౌకర్యం. ఏ తరహా శరీరానికైనా నప్పే పంచె వల్ల ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యం బాగుంటుందంటారు. పది మంది పిల్లల్ని కని పెంచిన పూర్వీకుల సంతతి కూడా ఇందుకు నిదర్శనంగా కనిపించడం విశేషం.ఇక స్త్రీల వేషధారణలో సైతం గోచీ పెట్టుకునే చీరలు ఈ తరానికి తెలియవంటే ఆశ్చర్యం లేదు. అమ్మమ్మ, నాన్నమ్మలంటేనే ఆ తరహా వేషధారణ గుర్తొచ్చేది. ఇప్పుడు మెల్లగా మొదలైన మార్పు అటు పంచెను ఇటు గోచీ చీరను తుడిచిపెట్టేసింది.సుమారు ఏడెనిమిది మీటర్లు లేదా 9 గజాలు లేదా 18 మూరల పొడవుండే ఈ చీరలు ధరించడం తెలుగునాట తరాలుగా కొనసాగింది. ప్రధానంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉన్న వారికి సాగుపనులకు అనుగుణంగా ఉండే అద్భుతమైన కట్టుబడి ఇది. గొల్ల కురుమలతో పాటు సాగు పనులు చేసే కాపు సామాజికవర్గాల్లో ఈ తరహా చీరకట్టు కనిపించేది. వాళ్ల ఆచారాల ఆధారంగా కొంగు కొందరు ఎడమ వైపు మరి కొందరు కుడివైపుకి ధరించేవారు.ఈ తరానికి తెలియని బొడ్లె సంచిగోచీ చీర ధరించే మహిళలు విధిగా ధరించే మరో వస్త్ర పరికరం బొడ్లె సంచి. ఈ తరానికి కనీసం చూసే భాగ్యం కూడా లేని అపురూపమైన నాటి మనీ పర్స్. వాలెట్‌గా పిల్చుకుంటున్న నేటి మనీ పర్స్‌లోని అరల కన్నా ఎక్కువగా ఉండే ఈ బొడ్లె సంచిలో ప్రయాణాలకు అవసరమైన చిల్లర నాణేలు, ఒకటో రెండో కరెన్సీ నోట్లకు భద్రమైన బ్యాగు. జాగ్రత్తగా దాచుకున్న డబ్బులున్న బొడ్లె సంచిని గోచీ చీరతో పాటు బొడ్లో దోపుకునే సంరక్షించుకునేవారు. ఇది కూడా లేని వాళ్లు కొంగు చివరన డబ్బులు మూటగా కట్టుకుని దాన్ని శరీరం చుట్టూ తిప్పి తిరిగి బొడ్లో దోపుకునే వారు.జీన్స్ ప్యాంటుల్లోకి వచ్చాక..స్త్రీ, పురుష వ్యత్యాసం లేకుండా ఇప్పుడు అందరూ కామన్‌గా ధరించేది జీన్స్ ప్యాంట్‌నే. యువతరానికి నచ్చినప్పటికీ దీంతో ఉండే అసౌకర్యం, అనారోగ్యం కూడా ఎక్కువే. జననేంద్రియాలను పట్టి ఉంచే లక్షణంతో ఉంటాయి కాబట్టి సహజమైన ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువ ఉష్ణానికి గురవుతుంటాయి. కాబట్టి పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడానికి ఉన్న కారణాల్లో ఇదొకటిగా నిపుణులు చెప్తున్నారు. ఒకరిద్దరికి మాత్రమే పరిమితం అవుతున్న జంటలు కొన్నైతే, స్థిరపడ్డాకే సంతానం అనుకుంటూ 30 దాటినా పెళ్లిల్లు లేవు, 40 దాటినా సంతానం లేకుండా పోతున్నారు.అన్ని మారిపోతున్నాయిమన సంప్రదాయలు ఇప్పుడు కనిపించడం లేదు. అన్ని మారిపోతున్నాయి. మగ్గం బట్టలు పోయి మిల్లు బట్టలు వచ్చాయి. అప్పటి దోతి, పంచె కుట్టు, బనీయన్లు ఇప్పుడు కానరావడం లేదు. నేను మాత్రం మా తాత, నాయిన పద్ధతిలోనే నడుచుకుంటున్న.– కనుమల్ల రామస్వామి, నేత కార్మికుడు, వెదిర గోచీ పెట్టుకోవడమే అలవాటుచిన్నప్పుడు గౌను, లంగాజాకెట్ వేసుకునేదాన్ని. వయస్సు వచ్చాక లంగా, జాకెట్ ఓనీ, తర్వాత గోచిచీర కట్టుకుంటున్న. ఇప్పటి పిల్లలకు గోచిపెట్టుకోవడం నామోషీగా అనుకుంటారు. కానీ అదే మన పాతకాలం పద్ధతి. చీర కంటే గోచి చీర కట్టుకుంటే బాగుంటుంది.– కనకమ్మ, వ్యవసాయదారు, కరీంనగర్ నిండుగా ఉంటుందిపాత పద్ధతిలో ఆరుగజాల చీర కట్టుకుంటే నిండుగా ముతైదువ తనం ఉట్టిపడుతుంది. ఇప్పుడు ఎవరూ పాత పద్ధతులు పాటించడంలేదు. ఇంకా ముసలివాళ్లు మాత్రమే గోచిచీర కట్టుకుంటున్నారు. – ఓదెమ్మ, వ్యవసాయదారు,రైతుబజార్, కరీంనగర్ (చదవండి: -
కరీనా మోడ్రన్ స్టైల్ ‘‘గళ్ల లుంగీ స్కర్ట్.. నల్ల కళ్లద్దాలు’’!
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan) ప్రస్తుతం గ్రీస్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసి అభిమానులను మెస్మరైజ్ చేసింది.తన మోడ్రన్ లుక్స్‌కు దేశీ ట్విస్ట్ ఇవ్వడం కరీనా ఫ్యాషన్ స్టైల్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. పసుపు రంగు హాల్టర్-నెక్ బ్రాలెట్‌తో పాటు గళ్ల లుంగీ-స్టైల్ స్కర్ట్‌లో అల్ట్రా-హిప్గా కనిపిస్తున్న కొత్త చిత్రాలను పోస్ట్ చేసింది కరీనా. నల్ల సన్ గ్లాసెస్ , బ్రౌన్ టోపీతో తన లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది.తన ఫోటోలకు “గ్రీస్‌లో లుంగీ డ్యాన్స్ ..భలే మజా వచ్చింది. తప్పకుండా తప్పక ప్రయత్నించండి’’ అనే క్యాప్షన్ ఇవ్వడం విశేషం. దీనికి వెరైటీ లుంగీ అంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు. ఫ్యాన్స్‌తో పాటు, కరీనా స్నేహితులు మనీష్ మల్హోత్రా, సావ్లీన్ మంచాంద, పూనమ్ దమానియా ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) ఇటీవల వివాదం రేపిన ప్రాడా కొల్హాపురి చెప్పులపై కూడా ఎమోజీలతో సెటైర్ వేసింది కరీనా. కొల్హాపురి మెటాలిక్ సిల్వర్ స్లిప్పర్లలో ఒక చిత్రాన్ని షేర్ చేస్తూ.. "సారీ...ఇది ప్రాడా కాదు... నా OG కొల్హాపురి" అని క్యాప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొల్హాపురి చెప్పులనుంచి భారతీయ లుంగీ వరకు కరీనా స్టైలింగ్, ఫ్యాన్స్ ప్రశంసలు లభిస్తున్నాయి. -
రూ. 8.6 లక్షల మెన్స్ బ్యాగు, షాకవుతున్న నెటిజన్లు
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ (Louis Vuitton) ఇటీవల అరుదైన, విచిత్రమైన, ఖరీదైన ఉత్పత్తులతో వార్తల్లో నిలుస్తోంది. పారిస్‌లో జరిగిన మెన్స్ స్ప్రింగ్/సమ్మర్ 2026 షోలో ఈ సరి కొత్త బ్యాగ్‌ను లాంచ్ చేసింది. లైఫ్‌బాయ్ రింగ్‌లా వున్న ఈ బ్యాగు ధర చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. అదీ పురుషుల బ్యాగ్ ఇంత ధర పలకడం నెట్టింట సంచలనంగా మారింది.ఈ బ్యాగ్ ధర సుమారు 10,000 డాలర్లు, అంటే భారతీయ రూపాయల్లో రూ. 8,60,000. లూయిస్ విట్టన్ సిగ్నేచర్ మోనోగ్రామ్ లెదర్ కాన్వాస్‌తో దీన్ని తయారు చేసింది. చక్కటి స్టోరేజ్ స్పేస్‌తో బ్యాగ్‌లో మూడు వేర్వేరు జిప్ కంపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎడ్జస్టబుల్ లెదర్ స్ట్రాప్ కారణంగా భుజంపై లేదా క్రాస్-బాడీగగా వేసుకోవచ్చు. దీంతో లూయిస్ బ్రాండ్ అంతే మరి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ బ్యాగ్ సృజనాత్మక డిజైన్, కళా నైపుణ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ లగ్జరీ బ్యాగు హాట్ కేకుల్లా సేల్ కావడం విశేషమేమరి. లూయీ విటోన్ గతంలో విమానం, డాల్ఫిన్, లాబ్‌స్టర్ ఆకారంలో బ్యాగ్‌లను తయారు చేసిన చరిత్ర ఉంది. ఇవన్నీ ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: చదివింది తక్కువే, రూ.500తో ముంబైకి, కట్ చేస్తే కోటీశ్వరుడుగా -
అద్దమంటి ఆకృతి..!
ముఖాన్ని మాత్రమే కాదు మన ఆత్మవిశ్వాసాన్నీ చూపుతుంది అద్దం.అద్దం లాంటి ఆకృతి కాదు, ఆకృతే అద్దంగా మారుతోంది.అద్దాన్ని ఫ్యాబ్రిక్‌కి జత చేసి, ధరించడం ఎవర్‌గ్రీన్‌గా పేరొందిన స్టైల్. వాటిలో .. అసిమెట్రిక్ మిర్రర్ స్టైల్ నేడు ఫ్యాషన్ ప్రపంచాన్ని అమితంగా ఆకట్టుకుంటోంది. అద్దం కేవలం స్టైల్ కాదు ఒక స్టేట్మెంట్. ర్యాంప్ పై రిఫ్లెక్షన్ప్రముఖ డిజైనర్లు గౌరవ్ గుప్తా, వ్యాన్ హెర్పెన్ వంటి వారు మిర్రర్ వర్క్ డిజైన్స్‌తో తమ హవా కొనసాగించారు. గాలా, కాన్స్ రెడ్ కార్పెట్లలోనూ సెలబ్రిటీలు మిర్రర్ షైనింగ్ గౌన్స్‌లో మెరుస్తున్నారు. స్ట్రీట్ స్టైల్ఈ ట్రెండ్ ఫ్యాషనబుల్‌గా కనిపించడానికే కాదు, జీన్స్ టాప్స్ లో అసిమెట్రిక్ హేమ్ లైన్, మిర్రర్ బెల్ట్స్, శాలువాలు, బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, ఫుట్‌వేర్ .. ఇలా అన్ని యాక్సెసరీస్ లో ఈ బిగ్ మిర్రర్ టచ్ కనిపిస్తోంది.అద్దం, డిజైన్‌తో డ్రెస్ స్పెషల్‌గా ఉంటుంది కాబట్టి ఇతర హంగులేవీ అక్కర్లేదు. మదిని మరింత మెరుపుగా సింగారించడానికి అద్దం వర్క్ కొత్తగా రూపుకడుతుంది. పర్ఫెక్ట్ షేప్‌తో డ్రెస్ అందంగా కనిపిస్తుంది అనేది ఒక కోణం మాత్రమే. నిజమైన ఫ్యాషన్ అనేది మిర్రర్ డిజైన్స్‌లోనూ ఉంటుంది. అసిమెట్రికల్ బ్యూటీని అర్థం చేసుకునే వారికి ఇది ఓ వేడుక కూడా. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సంగీత్ వర్మ్ మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్‌లో మేటిగా నిలిచారు. రెడ్ కార్పెట్, వివాహ వేడుకలలో ప్రత్యేకంగా నిలిచే ఈ మిర్రర్ డ్రెస్సులు మరింత అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. (చదవండి: Prajakta Koli : అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ వాయిస్‌గా ఆమె..! వన్ అండ్ ఓన్లీ..) -
ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి ఇష్టపడే ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవే..!
మిస్ ఇండియా ట్యాగ్ ఉన్నా, ఆమె స్టయిల్ మాత్రం ‘హే, నేను మీ పక్కంటి అమ్మాయినే!’ అనే నేచురల్ స్వాగ్తో ఉంటుంది. అదే మీనాక్షి చౌదరి మ్యాజిక్! స్కిన్‌కి మేకప్ కంటే, మినిమలిజమే బెస్ట్ ఫిల్టర్ అంటూ, చిన్న చిరునవ్వుతో మెరిసే మీనాక్షి చెప్పిన కొన్ని స్టయిలింగ్, బ్యూటీ సీక్రెట్స్ మీకోసం.. సింపుల్‌గా ఉంటూనే ప్రతి లుక్‌లోనూ ప్రత్యేకతను కోరుకుంటా. అలాగే, మేకప్ కంటే, స్కిన్కేర్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా. రోజూ నీళ్లు తాగడం, హెల్దీ డైట్, పడుకునే ముందు మేకప్ రిమూవ్ చేయడం– ఇవే నా బ్యూటీ సీక్రెట్స్. ఎమరాల్డ్ గ్రీన్, రాయల్ బ్లూ, ఫైరీ రెడ్ రంగులు నా ఫేవరెట్. ఇవి వేసుకుంటే నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. – మీనాక్షి చౌదరి.సింగిల్ కింగ్! సాంప్రదాయానికి స్టయిలిష్ లుక్ కావాలంటే, స్టేట్మెంట్ చోకర్ ఉండాల్సిందే!. ఇది మెడకు ఒక మినీ ఆటిట్యూడ్ ఇచ్చే హారం. సాధారణ చోకర్స్ కంటే వివిధ రకాల పూసలు, రత్నాలతోపాటు వైవిధ్యమైన కళాత్మక డిజైన్స్‌తో ఉంటుంది. చూడటానికి చిన్నదిగా కనిపించినా, దీన్ని వేసుకున్న వెంటనే అద్దం ముందు నాలుగు రౌండ్లు తిరగాల్సిందే! ఎందుకంటే, ఈ హారం మిమ్మల్ని ప్రతి యాంగిల్లోనూ చాలా కొత్తగా చూపించగలదు. దీనిని చీరలతో ధరించాలి అనుకుంటే గాఢమైన ముదురు రంగుల చోకర్స్ను ఎంచుకోండి. ఇక ప్లెయిన్ డిజైన్, లైట్ కలర్స్ లెహంగా, కుర్తీలపై కూడా ఇది బాగా నప్పుతుంది. జడ లేదా హై బన్, స్లీకీ బన్ హెయిర్ స్టయిల్‌తో చోకర్స్ని మరింత హైలైట్ చేయొచ్చు. అలాగే మేకప్ మినిమమ్ ఉంటే చోకర్ మరింత బ్రైట్‌గా కనిపిస్తుంది. అయితే, ఈ చోకర్ను వేరే హారాలతో కలపకుండా స్టయిలింగ్ చేసుకోవడంలో జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే, ఇది సింగిల్‌గానే రాయల్‌గా కనిపిస్తుంది. అందుకే, ఇది వేసుకున్న వారి వద్దకు ‘అందంగా లేనేమో’ అనే అనుమానం దరిదాపుల్లోకి కూడా రాదు. జ్యూలరీ బ్రాండ్: కర్ణిక, ధర: రూ. 17,000చీర బ్రాండ్: జాన్కీ ఇండియా, ధర: రూ. 44,800బ్లౌజ్ ధర: రూ. 17,000 (చదవండి: నౌకాదళ యుద్ధ విమానాలు నడపనున్న తొలి మహిళ ఆమె..!) -
లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్..పర్స్ వడ్డాణం..!
ఎంబ్రాయిడరీ చేసిన మ్యాచింగ్ బెల్ట్‌లు డ్రెస్‌ను అందంగా చూపుతాయి. దీంతో వడ్డాణాల స్థానంలో రకరకాల మోడల్స్‌లో ఉన్న ఫ్యాబ్రిక్ బెల్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మోడల్స్ అంతటితో ఆగి΄ోకుండా మరింత ఉపయుక్తంగా, అందంగా పర్స్ బెల్ట్‌లను డిజైన్ చేస్తున్నారు డిజైనర్లు. శారీ, లెహంగా, ఏ డ్రస్ అయినా అదే మెటీరియల్‌తో డిజైన్ చేసే పర్సుల బెల్ట్‌లు అదీ మ్యాచింగ్‌తో వాడటం వేడుకలలోనూ హైలైట్ అవుతున్నాయి.ముస్తాబు పూర్తయ్యాక వేడుకకు వెళ్లే ముందు ఫోన్, డబ్బులు పెట్టుకోవడానికి ΄పాట్లి బ్యాగ్స్, క్లచెస్.. వంటివి వెతుకుతుంటారు. అవి కూడా డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేవి ఉంటే బాగుండేది అని కొందరు, అదనంగా వీటిని పట్టుకెళ్లడం కష్టమే అని విసుక్కునే వారూ ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా బెల్ట్ పర్సుల మోడళ్లు అందంగా ఆకట్టుకుంటున్నాయి.టాప్ టు బాటమ్పాట్లి, ఇతర హ్యాండ్ బ్యాగ్స్ ధరించే డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా అదే ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేయడం కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. వీటివల్ల విడిగా హ్యాండ్ బ్యాగ్, పర్సులను కొనుగోలు చేయనక్కర్లేదు. ఒకే రంగు, ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించి డ్రెస్‌తోపాటు బ్యాగ్‌నూ రూపొందించుకోవచ్చు. వేడుకలలోనే కాదు క్యాజువల్‌గానూ కలర్ఫుల్గా వెలిగిపోవచ్చు. నడుముకు పర్స్ ఎంబ్రాయిడరీ చేసిన ఫ్యాబ్రిక్‌తో బెల్ట్, దానికి జత చేసిన పర్స్ ఈ బెల్ట్ స్పెషల్. లెహంగా, శారీ, డ్రెస్ ఏదైనా అదే ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేయడం వల్ల ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. లేసులు, టాజిల్స్, పూసలు, స్టోన్స్... ఈ పర్సులకు జత చేయడం అదనపు ఆకర్షణ. (చదవండి: అమ్మ అలా చెప్పి ఉండకపోతే ఇలా ఉండేవాడిని కాను: అమిర్ ఖాన్) -
గుండెను గుచ్చే అందమైన ముల్లు
‘కాంటా లగా’ మ్యూజిక్ ఆల్బమ్ ఫేమ్, ప్రముఖ బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా ఓ ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్ట్‌తో మృతిచెందిన సంఘటన ఇటీవల చాలా సంచలనం రేపింది. షెఫాలీ అనేక ఏళ్లుగా ఈ చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోజు ఆమె ఉపవాసంలో ఉండి... ఇంజెక్షన్ తీసుకున్నందున ఇలా జరిగిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సాధారణంగా నటీనటులతో పాటు ఇతరులు తీసుకునే బ్యూటీ చికిత్సలనూ అలాగే... గుండెపై వాటి ప్రభావాలను చూద్దాం...‘అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం’ అంటూ తెలుగు కవులు వినిపించారూ... వివరించారు. అందం ఆనందాన్నిస్తుంది. దానికి ప్రాణాల్ని మూల్యంగా చెల్లించాలా అన్నది సమాజం అడుగుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో అసలు బ్యూటీ చికిత్సలో జరిగేదేమిటి, వాటి పర్యవసానాలేమిటి, గుండెపైన వాటి ప్రభావాలేమిటో తెలుసుకుందాం. మొదట్లో సినీతారలు... తర్వాత్తర్వాత క్రమంగా బాగా ధనవంతులు మొదలు... నేడు సామాన్యుల వరకూ సౌందర్య కాంక్ష చేరింది. ఇప్పుడు పార్లర్‌కు వెళ్లడమన్నది మధ్యతరగతీ, దిగువ మధ్యతరగతికీ సాధారణమైంది. మెరుస్తున్న మేని నిగారింపు, యూత్‌ఫుల్ లుక్‌తో కనిపించడం అందరికీ ఇష్టమైన అంశమైంది. బ్యూటీ థెరపీ లేదా ఈస్థటిక్ ట్రీట్మెంట్ అని పిలిచే సౌందర్య చికిత్సల్లో రక్తనాళం ద్వారా నేరుగా రక్తంలోకి పంపించే గ్లుటాథియోన్ డ్రిప్స్ మొదలుకొని రకరకాల మీసోథెరపీ (మీసో థెరపీ అంటే చర్మంలో ఉండే మూడు పొరల్లోని మధ్యపొరపై ప్రభావం చూపేవి) మందులూ, కొలాజెన్ ΄ పౌడర్లు, చర్మం నిగారింపుతో ఫెయిర్‌గా కనిపించేందుకు వాడే ఇంజెక్షన్లు, పైపూతగా వాడే క్రీములు, ΄ పౌడర్లు... ఇలా రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. పైకి మిలమిలా మెరుస్తూ ఉండే చర్మం వెనక కొన్ని నల్లటి చిక్కటి చీకటి రహస్యాలూ ఉంటాయి. కొన్నింటిపైన ఓ మేరకు నియంత్రణలు ఉన్నప్పటికీ... మరికొన్నింటి విషయంలో అసలు ఎలాంటి అదుపూ లేకుండా ఏమాత్రం శిక్షణ లేనివారూ, తమకు ఎలాంటి పరిజ్ఞానమూ లేనివారూ చేసేవి కూడా ఉంటాయన్నది ఓ నగ్న సత్యం. ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్ బ్యూటీ చికిత్సల్లో ఎన్నెన్నో రకాలు... వ్యక్తులు అందంగా కనిపించేందుకు చేసే చికిత్సల్లో పలు రకాలైనవి ఉంటాయి. ఉదాహరణకు... → పెరుగుతున్న వయసు ఛాయలు చర్మంపై కనిపించకుండా... ముడుతలూ, లోతైన గీతలు కనిపించకుండా చేసేందుకు యాంటీ ఏజింగ్ చికిత్సగా బొటాక్స్ ఇంజెక్షన్లు, ఇతర డర్మల్ ఫిల్లర్స్ → మార్కెట్లో యాంటీ ఏజింగ్ మందులు, డీ–టాక్స్ లేదా ఇమ్యూనిటీ బూస్టర్స్‌గా పిలుస్తూ... రక్తనాళం ద్వారా రక్తంలోకి మందును ఎక్కించే గ్లుటాథియోన్, నికొటినెమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ (ఎన్ఏడీ+) మందులు → రక్తంలోని ప్లాస్మాను వేరు చేసి చర్మంలోకి ఎక్కించే పీఆర్పీ (ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా) థెరపీ, (జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ (జీఎఫ్‌సీ) చికిత్స, ఎగ్జోసోమ్స్, చర్మాన్ని ఉత్తేజితం చేసే పాలీ డైయాక్సీ రైబో న్యూక్లియోటైడ్ (పీడీఆర్ఎన్) వంటి చికిత్సలు → కొలాజెన్ పెపై్టడ్స్, బయోటిన్, చర్మాన్ని తెల్లగా మార్చే గుట్లాథియోన్ లాంటి పిల్స్‌తో పాటు కొన్ని హార్మోన్ థెరపీలు. ఇవన్నీ ఆహారంలోని సప్లిమెంట్స్ కాగా... వీటిలో కొన్నింటిని నోటిద్వారా (ఓరల్‌గా) ఇస్తారు → ఇక పైపూత లేపనాలు (టాపికల్)గా వాడే పెపై్టడులూ, రెటినాయిడ్స్ ఉండే క్రీములు... ఇవి సౌందర్య ఔషధ రూపాల్లో ఇస్తుండటం వల్ల వీటిని ‘కాస్మస్యూటికల్స్’గానూ చెబుతారు.మన దేశంలోఅనుమతిఉన్నవి కొన్నే...మన దేశంలో ఇలాంటి మందులకు అనుమతి ఇచ్చే అత్యున్నత అథారిటీ ‘సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ – సీడీఎస్సీఓ) అనే సంస్థ. దీనితో పాటు అమెరికన్ సంస్థ ఎఫ్‌డీఏ అనుమతించిన వాటిని మనదేశంలోనూ అనుమతిస్తుంటారు. వాటిల్లో కొన్నింటికే అనుమతులున్నాయి → ఉదాహరణకు రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్, హై–డోస్ విటమిన్ సి, ఎన్ఏడీ+ లేదా మరికొన్ని మిశ్రమ మందులు (కాక్టెయిల్స్)కు పై సంస్థల అనుమతి లేదు → చర్మంలో ఉండే మూడు పొరల్లో మధ్యపొరపై పనిచేసే మరికొన్ని చికిత్సలను ‘ఎక్సోజోమ్ బేస్డ్’ చికిత్సలు అంటారు. వీటితో పాటు స్టెమ్‌సెల్ థెరపీల వంటివాటిని శిక్షణ పొందిన క్వాలిఫైడ్ నిపుణులు అందిస్తేనే సురక్షితం.ప్రమాదాలూ / అనర్థాలు ఎప్పుడంటే... ముందుగా చెప్పిన ప్రకారం... అత్యంత సుశిక్షితులూ, అన్ని విధాలా తగిన విద్యార్హతలు ఉన్న డర్మటాలజిస్టుల వంటి నిపుణులు మాత్రమే ఈ చికిత్సలను అందించాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం చాలాచోట్ల అనధికారిక సెలూన్లు, స్పాలు ఇంకా చెప్పాలంటే కొన్నిచోట్ల ఇళ్లలో కూడా అనధికారికంగా ఈ ఔషధాలనూ, ఇవ్వకూడని సప్లిమెంట్లను ఇస్తున్నారు. పైగా ఇళ్లలో ఇచ్చే ఈ చికిత్సల్లో ఏవైనా దుష్ప్రభావాలు ఎదురైతే... వాటి పర్యవసానాలేమిటీ, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న పరిజ్ఞానం అనర్హులైన చికిత్సకులకు ఉండదూ, అలా ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులూ ఉండవు. అయినప్పటికీ చాలామంది వీటిని యధేచ్ఛగా ఇస్తున్నారూ... అలాగే అందంపై ఆసక్తి ఉన్న యువతీయువకులు తీసుకుంటున్నారు.చదవండి: క్యాషియర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నేరమా బాస్?!ఇవీ నమోదైన (డాక్యుమెంటెడ్) ప్రమాదాలు / అనర్థాలు → అలర్జిక్ రియాక్షన్లు, అనాఫిలాక్సిస్ అనర్థాలు (అదుపు చేయలేని విధంగా చాలా తక్కువ వ్యవధిలో వచ్చే తీవ్రమైన రియాక్షన్లు వీటి ద్వారా ఒక్కోసారి షాక్ కూడా కలిగితే దాన్ని అనాఫిలెక్టిక్ షాక్‌గా కూడా వ్యవహరిస్తారు). ఈ రియాక్షన్లు అరుదుగా ప్రాణాంతకమూ అయ్యే అవకాశాలు లేక΄ోలేదు → రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్ ఇంజెక్షన్లతో అనాఫిలెక్టిక్ షాక్, అసెప్టిక్ మెనింజైటిస్ (మెదడు, వెన్నుపాములో ఉండే పొరల వాపు) వంటివి చాలా అరుదు. అయితే కొన్నిసార్లు ఇలాంటి రియాక్షన్స్ కనిపించిన దాఖలాలు ఉన్నాయి → హై–డోస్ విటమిన్ బి కాంప్లెక్స్ ఇచ్చిన కొన్ని సందర్భాల్లో అవి వికటించి, ప్రాణాంతకంగా మారిన సందర్భాలూ ఉన్నాయి. నిజానికి చాలాకాలం నిల్వ చేయడానికి అందులో వాడే ప్రిజర్వేటివ్స్ వల్ల ఇలాంటి రియాక్షన్లు కనిపించాయి → కొన్ని సందర్భాల్లో బ్యూటీ మందులు వాడాక ఇన్ఫెక్షన్లు, రక్తానికి ఇన్ఫెక్షన్ (సెప్సిస్) కనిపించాయి → స్టెమ్ సెల్ చికిత్సల్లో కొంతమేరకు కనిపించే ముప్పు (రిస్క్)→ స్టెమ్‌సెల్స్‌తో చేసే చికిత్సల్లో ఇమ్యూన్ రియాక్షన్స్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ముప్పు ఉన్నందున నిజానికి బ్యూటీ చికిత్సల్లో స్టెమ్‌సెల్స్‌కు అనుమతి లేదు.ప్రజలు తెలుసుకోవలసిన అంశాలు... → బ్యూటీ చికిత్స అందించేవారికి వాస్తవంగా ఆ అర్హత ఉందా, వారికి తగిన విద్యార్హతలు ఉన్నాయా వంటి అంశాలను అడిగి తెలుసుకోవాలి → చాలా త్వరగా ప్రభావం చూపుతాయన్న ‘క్విక్ ఫిక్స్ మార్కెటింగ్’ ప్రచారాలను నమ్మడం సరికాదు. మెల్లగా వచ్చే ప్రభావాలే దీర్ఘకాలం నిలుస్తాయి. ఇవి చాలావరకు నిరపాయకరమని గుర్తించాలి → ఆ సౌందర్యసాధనాలకూ, ఉత్పాదనలకు ఎఫ్‌డీఏ లేదా సీడీఎస్‌సీవో సంస్థల ఆమోదం ఉందా అని చూడాలి→ గ్లుటాథియోన్ వంటి మందులు ఇచ్చే సమయంలో అది నిరపాయకరమైన మోతాదులోనే ఉందా అని చూడాలి. అంటే వారానికి 600 నుంచి 1200 ఎంజీకి మించి మందు తీసుకోకూడదు. (అనర్థాలు సంభవించిన కొన్ని కేసులను చూసినప్పుడు కొందరు అవసరమైన మోతాదుకు ఐదు రెట్లు ఇచ్చిన దాఖలాలనూ గుర్తించారు) చివరగా... అందం చాలా ఆకర్షణీయమైదే. అందరూ కోరుకునేదే. అయితే దానికి చెల్లించాల్సిన మూల్యం ప్రాణాలు కాకూడదు. అందంగా ఉండటం కంటే ఆరోగ్యంగా జీవించి ఉండటం ముఖ్యం.ఎందుకీ అనర్థాలు... ఈ అనర్థాలకు చాలా కారణాలు ఉంటాయి. → చట్టపరంగా వీటిని అదుపు చేసే యంత్రాంగం కొరవడటం → యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ తరహా క్లినిక్లూ, చికిత్సల గురించి విపరీత ప్రచారం → ఏమాత్రం అర్హతా, పర్యవసానాలపై అవగాహన లేని అనర్హులు చికిత్సలందించడం. అన్నిటికంటే ముఖ్యంగా వినియోగ దారుల్లో కొరవడిన అవగాహన : ఈ ఉత్పాదనల విషయంలో ప్రజల్లో ఎలాంటి అవగాహన లేక΄ోవడం వల్ల కూడా ఈ తరహా అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు ‘స్వాభావికమైన, ప్రకృతిసిద్ధమైన (నేచురల్)’ వంటి మాటలు ఉపయోగించినప్పుడు అవేవీ ప్రమాదకరం కానివిగా భావిస్తూ చాలామంది ప్రమాదకరమైన సింథసైడ్ రసాయనాలనూ విచ్చలవిడిగా వాడుతున్నారు.వసతులన్నీ హాస్పిటల్స్‌లోనే... బ్యూటీ చికిత్సలు తీసుకునే సమయంలో అది పెద్ద హాస్పిటల్ అయి ఉండటం, ఎమర్జెన్సీ సౌకర్యాలూ కలిగి ఉండేలా చూసుకోవడం ముప్పును తప్పిస్తుంది. వాస్తవానికి రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్ వంటివి తగిన మోతాదులో ఇచ్చినప్పుడు గుండె΄ోటు రావడం, గుండె ఆగి΄ోవడం (కార్డియాక్ అరెస్ట్), అనాఫిలెక్టిక్ షాక్‌కు గురికావడం వంటి సందర్భాలు చాలా అరుదు. అయితే అన్ని వసతులూ, ఎమర్జెన్సీ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రితో తగిన విద్యార్హతలూ, చికిత్స అర్హతలూ కలిగిన డాక్టర్ల ఆధ్వర్యంలో బ్యూటీ చికిత్సలు తీసుకుంటే... ఒకవేళ ఏవైనా రియాక్షన్స్, అనాఫిలెక్టిక్ రియాక్షన్స్ వచ్చినా తక్షణం చికిత్స అందించడం వల్ల ప్రాణాలను కాపాడటానికి అవకాశముంటుంది. -
ఐకానిక్ ఆటో: ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్, ధర తెలిస్తే.!
మొన్న కొల్హాపురి చెప్పుల్ని పోలిన ప్రాడా చెప్పులు సంచలనం రేపాయి. ఇపుడు లూయిస్ విట్టన్ రిక్షా ఆకారంలో లాంచ్ చేసిన లగ్జరీ బ్యాగ్ నెట్టింట సందడిగా మారింది. ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచిన ఈ హ్యాండ్‌బ్యాగ్ ఫోటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ డైట్ పరాత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ 2026 కలెక్షన్ ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. ఇండియన్ ఆటోరిక్షా ఆకారంలో వచ్చిన హ్యాండ్‌బ్యాగ్ ఈ సీజన్లో భారతదేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఆటో-రిక్షా ప్రేరణతో లూయిస్ విట్టన్ కొత్త హ్యాండ్బ్యాగ్దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ మూల మూలలా సందడిగా తిరిగే ఐకానిక్ ఆటో ఆకారంలో లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌ను తీసుకొచ్చి లూయిస్ విట్టన్. లూయిస్ విట్టన్ సిగ్నేచర్ మోనోగ్రామ్ కాన్వాస్‌తో బుల్లి చక్రాలు (ఇవి పనిచేస్తాయి కూడా) హ్యాండిల్‌బార్..ఇలా అచ్చం ఆటోలాగానే దీన్ని రూపొందించారు. View this post on Instagram A post shared by Urban NXT | Luxury Platform (@urban.nxt) ఇలాంటి కళా ఖండాలను మార్కెట్లోకి తీసుకురావడం LVకి కొత్త కాదు, ఇది గతంలో విమానాలు, డాల్ఫిన్లు, పీత ఆకారంలో ఉన్న బ్యాగులను ఆవిష్కరించింది. అయితే, ఆటోరిక్షా బ్యాగ్ మాత్రం స్ట్రీట్కల్చర్కి ప్రతిబింబంగా నిలుస్తోందంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. దీనిక ఖరీదుఎంతో తెలిస్తే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిపనేలేదే. లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఎల్వీ తీసుకొచ్చిన ఈ బ్యాగ్ ధర . 35 లక్షలట. View this post on Instagram A post shared by Diet Paratha (@diet_paratha)నెటిజన్ల స్పందనవేలాది లైక్‌లు, కమెంట్స్, జోక్స్‌తో ఈ హ్యాండ్‌బ్యాగ్ ఫోటోలు నెట్టింట్ వైరల్ అయ్యాయి. లగ్జరీ బ్యాగ్ ధర కూడా లగ్జరీగానే ఉంటుందా? " బావుంది! కానీ చాందినీ చౌక్‌లో విడుదలయ్యే వరకు నేను వెయిట్ చేస్తా" అని ఒకర చమత్కరించగా, మరొకరు, "నా అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ బ్యాగ్ ఖరీదైందా? లేక ఆటో ఖరీదైనదా?" అని ఒకరు, "సరే, మీటర్ ప్రకారం దాని ధర నిర్ణయిస్తారా?" అని మరొకరు చమత్కరించారు. -
ట్రెండ్ సెట్టర్ నిధి అగర్వాల్ స్టైలింగ్ టిప్స్ ..!
ఫ్యాషన్ ట్రెండ్స్‌కి ట్రెండ్‌సెట్టర్ తను. ప్రతి లుక్‌లోనూ ఒక డిఫరెంట్ శైలి చూపిస్తూ, మెరుపులా మెరిసే లుక్‌తో మాయ చేస్తుంది నటి నిధి అగర్వాల్. కాని, తన స్రీకెట్ ‘చాలా సింపుల్’. ఆమె స్టయిలింగ్ టిప్స్,తను ఫాలో అయ్యే ఫ్యాషన్ విశేషాలు మీకోసం.హెవీ మేకప్ నాకు అసలు నచ్చదు. నేచురల్ లుక్‌నే ఎక్కువగా ఇష్టపడతాను. ఎప్పుడూ ముఖం క్లీన్ గా, చాలా సింపుల్‌గా ఉండేలా చూసుకుంటాను ఇదే నా సీక్రెట్. ఇక, డ్రెస్ విషయానికి వస్తే, బ్లాక్ నా ఫేవరెట్. ఏ ఫంక్షన్‌కైనా బ్లాక్ డ్రెస్‌నే ఫ్రిఫర్ చేస్తా అని చెబుతున్నారు నిధి అగర్వాల్రింగ రింగారే..‘రోజూ లేట్ అవుతుందని ఆఫీస్‌కు పరుగులు తీస్తూ, చక్కగా రెడీ కాలేకపోతున్నాం?’ అని బాధపడే ఫ్యాషన్ ప్రియులను కాపాడటానికి వచ్చిన అందమైన సాధనాలే ఈ ‘చెవి రింగులు’. ఇవి చిన్నవే కావచ్చు, కానీ వీటి ప్రభావం మాత్రం పెద్దగా ఉంటుంది. పెద్దవిగా ఉండే హూప్లతోపాటు, చిన్న గోల్డ్, వెండి రింగులు లేదా సన్నని ముత్యాలతో ఉండే స్టడ్స్ ఇవన్నీ ఆఫీస్ ఔట్‌ఫిట్‌కి బాగా మ్యాచ్ అవుతాయి. అయితే, ఇవి వేసుకునే ముందు మీ జుట్టు స్టయిల్ కూడా రింగుల రకానికి తగ్గట్లుండాలి. హెయిర్ బన్ అయితే గోల్డ్ హూప్ రింగులు అదిరిపోతాయి. జుట్టు అల్లుకుంటే చిన్న స్టడ్స్ సాఫ్ట్ లుక్ ఇస్తాయి. చీర, కుర్తీకి లైట్ వెండి చెవి రింగులు చాలా అందంగా కనిపిస్తాయి. ఇక ప్యాంట్ షర్ట్ వేసుకున్నప్పుడు చిన్న గోల్డ్ రింగ్స్ సరిపోతాయి. డైలీ వేర్కి చక్కగా ఉపయోగపడే వీటి ఖరీదు తక్కువ, స్టయిల్‌కి మాత్రం హై క్లాస్. రోజూ కొత్తదనంతో కనిపించాలనుకునే వారికి ఇవి గొప్ప ఫ్యాషన్ ఫ్రెండ్స్ అవుతాయి! డ్రెస్ బ్రాండ్: జారాధర: రూ. 12,950జ్యూలరీ బ్రాండ్: కార్టియర్వాచ్ ధర:రూ. 21,70,000 -
‘మిసెస్ ఆసియా వరల్డ్–2025’ విజేత రేవతి
యుఎస్‌తో పాటు భారత్‌లో 16 ఏళ్లకు పైగా సామాజిక సేవ, మహిళా సాధికారత, ప్రపంచ మానవతా విలువల కోసం కృషి చేస్తున్నందుకు గానూ ‘మిసెస్ ఆసియా వరల్డ్ విన్నర్–2025’ కిరీటాన్ని నగరానికి చెందిన డాక్టర్ రేవతి దక్కించుకున్నారు. ఈ విషయాన్ని మనస్వ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలైన డాక్టర్ సూర్య రేవతి మెట్టుకూరు గురువారం తెలిపారు. జూన్ 22న దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ కార్యక్రమంలో భారత మహిళగా ఈ అరుదైన గౌరవం దక్కిందని అన్నారు. ఐటీ, ఫైనాన్స్, మైనింగ్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో సీఈఓగా పనిచేశాసిన, తెలంగాణ రాష్ట్రంలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకుని విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సంక్షేమం, యువత ఉపాధిపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. 100 శాతం అక్షరాస్యత సాధించినందుకు రాష్ట్రపతి అవార్డు పొందినట్లు తెలిపారు. (చదవండి: నేషనల్ కాదు ఇంటర్నేషనల్..! లగ్జరీ బ్రాండ్లతో జత కట్టిన అందాల భామలు వీరే) -
కొత్త శకానికి నాంది పలికిన ఇషా అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమార్తె, వ్యాపారవేత్త ఇషా అంబానీ (Isha Ambani ) మరో ఘనతను సాధించారు సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 2025 ((Serpentine Summer Party 2025)కి తొలి భారతీయ చైర్‌పర్సన్‌గా ఎంపికై కళా ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలికారు.సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 25వ వార్షికోత్సవం సందరబంగా తొలి బారతీయ చైర్‌గా ఇషా ఎంపికయ్యారు. కళలు, సంస్కృతి రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడర్లు, ప్రభావవంతమైన వ్యక్తులనుచేర్చుకోవడంలో మరింత మార్పువచ్చిందని నిరూపించిం దని, ప్రపంచ దేశాలకు, భారత్‌కు మధ్య ఇషా సాంస్కృతిక వారధి అంటూ ప్రశంసిస్తున్నారు ఫ్యాషన్ నిపుణులు. సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 2025లో ఇషా అంబానీ లక్ మెరీనా టబస్సమ్ రూపొందించిన 2019 నాటి వాలెంటినో, షాంపైన్ కలర్ పూసల దుస్తులను ధరించింది. ఉంగరాల జుట్టు, సహజమైన మేకప్ వేసుకుని, హీల్స్‌తో ఇషా ప్రతి ఫ్రేమ్‌లో అందమమైన లుక్‌లో అలరించింది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా అంబానీ కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఇషా తనదైన వ్యాపార నైపుణ్యాలతో వ్యాపారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ డియోర్‌కు ప్రపంచ రాయబారి , సోనమ్ కపూర్, సమ్మర్ పార్టీలో సందడి చేసింది. డియోర్ ఫాల్ 2025 కలెక్షన్ నుండి కిమోనో జాకెట్ ధరించింది అందర్నీ ఆకట్టుకుంది. జూన్ 24, 2025న లండన్‌లోని సెర్పెంటైన్ పెవిలియన్‌లో జరిగిన ఈ పార్టీలో ఈజా గొంజాలెజ్, అలిసియా వికాండర్, రెబెల్ విల్సన్, జార్జియా మే జాగర్, లేడీ అమేలియా స్పెన్సర్, లేడీ ఎలిజా స్పెన్సర్, లిల్లీ అలెన్ తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు. -
ఆ చెప్పులు మన వారసత్వ కళ..ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ఏకంగా..!
మనవాళ్లు ఎప్పుడో కళాత్మకంగా రూపొందించినవి కొన్ని రకా ఫ్యాషన్ బ్రాండ్లు కాపీ కొట్టేసి మార్కెట్లోకి రిలీజ్ చేసి ధర నిర్ణయిస్తుంటే కళ్లప్పగించి చూస్తుంటాం. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వ కళ అని గుర్తుకు రాదు. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ అనగానే..డబ్బులు వెచ్చించేయడమే గానీ..అదేంటని నిశితంగా ఆలోచించేవారే కరువు. అందువల్లే కాబోలు ప్రముఖ లగ్జరీ బ్రాండ్లు మన ఆర్ట్‌ని సులభంగా కాపీ కొట్టేస్తున్నాయి. అచ్చం అలానే ఓ దిగ్గజ ఇటలీ ఫ్యాషన్ బ్రాండ్ ఎంత పనిచేసిందో వింటే విస్తుపోతారు.కొల్హాపూర్ లెదర్ చెప్పులు చాలా ప్రసిద్ధిగాంచినవి. ముఖ్యంగా పెద్దవాళ్ల హుందాతనం ఉట్టిపడేలా చేసేలా ఉంటాయి ఆ చెప్పులు. కొల్హాపురి ఫ్లాట్ చెప్పులుగా బాగా ఫేమస్. అయితే వాటిని ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ప్రాడా సమ్మర్ 2026 56 రన్‌వే లుక్‌లలో అచ్చం మనలాంటి పాదరక్షలనే ప్రదర్శించింది. అచ్చం మన కొల్హాపురి చెప్పులు మాదిరిగా ఉన్నాయి. అయితే ఆ లగ్జరీబ్రాండ్ వాటి ధర ఏకంగా అక్షరాల రూ. 1.2 లక్షలుగా నిర్ణయించడం విశేషం. ఈ లగ్జరీ బ్రాండ్ మన వారసత్వానికి ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా తానే డిజైన్ చేసినట్లుగా ఫోజులు కొడుతూ..అంత ఖరీదు నిర్ణయించడంతో సర్వత్రా ఆగ్రహాం వ్యక్తమైంది. నెట్టింట అందుకు సంబధించిన ఫోటోలను ఆ బ్రాండ్ వైరల్ చేయడంతో నెటిజన్లు ఇది "చప్పల్ చోరి" అంటూ తింటూపోస్తున్నారు. PRADA is selling Kolhapuri chappals for ₹1.2 lakh — a design stolen from the Chamar community of India, who’ve handcrafted them for generations. No credit. No acknowledgment. Just pure cultural theft dressed in luxury branding. Shameful. #CulturalTheft #Kolhapuri pic.twitter.com/l3ITZlGSEG— The Dalit Voice (@ambedkariteIND) June 25, 2025ఫ్యాషన్ సంస్కృతికి తప్పుడు అర్థాన్నిచ్చేలా చేసిందంటూ మండిపడుతున్నారు. కనీసం భారతీయ వారసత్వ కళను ప్రశంసిస్తూ..వాటిని ప్రదర్శించినా..మా కళ మళ్లీ పునరుజ్జీవనం చేసుకుంటుందని సంతోషించేవాళ్లం అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. కొల్హాపురి చెప్పుల చరిత్ర...12వ శతాబ్దానికి చెందిన వారసత్వ కళ. ఇది సాంప్రదాయకంగా మహారాష్ట్ర, కర్ణాటకలోని చెప్పులు కుట్టేవారి చేతిల్లో రూపుదిద్దుకున్న కళ ఇది. ఈ కొల్హాపురి చెప్పులకు జీఐ ట్యాగ్ కూడా ఉంది. ఇది మన భారతీయ వారసత్వంలో భాగం. ఆ కాలంలోనే మన పూర్వీకులు ధరించిన చెప్పులివి. వీటిని తయారు చేయడానికి ఆరువారాలపైనే పడుతుందట. వీటి ధర రూ. 500 నుంచి రూ. 700ల మధ్య ఉంటుందట. కాగా, దీనిపై ప్రముఖ కాలమిస్ట్ శోభా దే కూడా మండిపడ్డారు. ఈ బ్రాండ్లు మన భారతదేశాన్ని ఒక మార్కెట్‌గా చూస్తున్నాయని విమర్శించారు. ఒకరంగా ఇది చేతిపనుల నైపుణ్యాలన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. అలాగే మన మూలాలను మర్చిపోకుండా గుర్తు చేసింది. ఫ్యాషన్ ట్రెండ్‌గా పరిచయం చేసిన ఈ చెప్పులు మన కళా వారసత్వానికి ప్రతీకలని గొంతెత్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. View this post on Instagram A post shared by Mahrukh Dar (@fashionjournalbym) (చదవండి: 22వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్.. ఐనా ఆమె స్టిల్ బ్యాచిలర్..!) -
ఫ్యాషన్ ప్రపంచంలో అత్తాకోడళ్ల ప్రభంజనం..! చిన్న బొటిక్ వెంచర్ కాస్తా..
అత్తాకోడళ్లు అనగానే నూనె, ఉప్పులా ఉంటారనే భావనే కలుగుతుంది అందరిలో. అత్యంత అరుదుగా కొందరిలోనే సఖ్యత ఉంటుంది. చాలామటుకు..ఆ బంధం..కాస్త ఇబ్బందికరమైన వాతావరణంలానే కనిపిస్తుంది. కానీ ఈ అత్తాకోడళ్ల విషయంలో అందుకు విరుద్ధం. ఆ అత్తాకోడళ్లు తమ అభిరుచులతో ఒక వస్త వ్యాపారాన్ని ప్రారంభించి. ఫ్యాషన్‌కి సరికొత్త అర్థాన్ని ఇచ్చేలా మంచి సక్సెస్‌తో దూసుకుపోతున్నారు. చిన్న బొటిక్‌గా ప్రారంభించి.. నేడు ఫ్యాషన్‌లో ఒక బ్రాండ్‌గా అవతరించి మరీ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారిద్దరూ. ఆ అత్తకోడళ్ల విజయగాథ ఏంటో చూద్దామా..!.ఫ్యాషన్‌కి సరికొత్త అర్థాన్నిస్తున్న ఆ అత్తకోడళ్లే సర్లా గుప్తా, శిల్పా గుప్తాలు. రెండు దశాబ్దాల క్రితం ఢిల్లీ నడిబొడ్డున చిన్న బోటిక్ వెంచర్‌గా తమ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ ఇద్దరికి భారతీయ వస్త్రధారణ పట్ల ఉన్న ఇష్టమే..ఈ వెంచర్ పెట్టేందుకు దారితీసింది. ఆ ఇరువురు లెహంగాలు, చుడీదార్లు నుంచి డ్రేప్డ్ చీరలు వరకు అన్నింటిలో తమ మార్క్ ఉండేలా సరొకొత్త విధానంలో డిజైన్ చేస్తారిద్దరూ. అత్తగారు సర్లా గుప్తా సంప్రదాయ, వారసత్వానికి పెద్దపీట వేస్తే..కోడలు శిల్పా గుప్తా ఆధునికతకు, సృజనాత్మకతకు ప్రాముఖ్యత ఇచ్చేలా డిజైన్ చేస్తుంది. వారి విలక్షణమైన డిజైన్ శైలి ఒక్కసారిగా ఫ్యాషన్ ప్రపంచంలో ఇండో-వెస్ట్రన్ శైలి ముఖచిత్రానే మార్చేసింది. అంతేగాదు ఈ అత్తాకోడళ్లు డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకుని రూపొందించిన డిజైనర్‌వేర్‌లు ఈ జనరేషన్‌కు సులభంగా చేరువవ్వడమే గాక ఒక కొత్త ట్రెండ్‌ని సృష్టించాయి. అలా వారి చిన్న బొటిక్ వెంచర్ 'ఘున్‌ఘాట్' అనే ఫ్యాషన్ బ్రాండ్‌గా స్థిరపడి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. బనారసి టిష్యూ చీరల నుంచి సమకాలీన అనార్కలి వరకు, ఘున్‌ఘాట్ కలెక్షన్లు కళా సౌందర్యానిక ప్రతీకలుగా నిలిచాయి. ఈ బ్రాండ్ డిజైనర్‌వేర్‌లను గుజరాత్, రాజస్థాన్, వారణాసి అంతట ఉన్న హస్తకళాకారులు తయారు చేస్తారు. ఇవన్నీ చేతితో రూపొందించిన డిజైనర్‌వేర్‌లు. దాదాపు 200పైగా కళాకారులతో ఈ డిజైనర్‌వేర్‌లు రూపొందుతాయి. ప్రతి లెహంగా లేదా పైథానీ చీర వెనుక హస్తకళాకారుల వారాల తరబడి కష్టం ఉంటుంది. పేయింటింగ్ దగ్గర నుంచి, ఎంబ్రాయిడరీ వంటి తుది ఫిట్టింగ్‌ల వరకు ఎక్కడ కూడా షార్ట్‌కట్‌లతో పూర్తి చేయరు. ప్రతీది కళాకారుల చేతుల నుంచి జాలువారే డిజైనర్వేర్లే కావడం విశేషం. కుటుంబంగా కస్టమర్లు..ఘున్‌ఘాట్ బ్రాండ్ నుంచి దుస్తులు కొనుగోలు చేసే వ్యక్తుల ఆ బ్రాండ్ కుటుంబీకుల్లో ఒకరిగా మారిపోతారట. అంతలా ఆబ్రాండ్ వారిని ఆకట్టుకుంటుందట. తమ బ్రాండ్ కళకు ఫిదా అయ్యి కస్టమర్లే ప్రకటనదారులగా మారిపోతారట. ఇక ఈ ఏడాది ఘున్‌ఘాట్ "మోడరన్ మహారాణి" కలెక్షన్లను ప్రారంభించింది. పాతదనం, కొత్తదనాన్ని మిళితం చేసేలా డిజైన్ చేసింది. అంతేకాదండోయ్ ఆధునిక టైలరింగ్‌తో చేతితో నేసిన కళను వారధి చేసేలా రెడీ-టు-వేర్ ఫ్యూజన్ పటోలా దుస్తులను కూడా తీసుకురానుందట. చివరగా ఈ బ్రాండ్ అభివృద్ధి చెందతూ.. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్యాషన్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రదర్శనకు సిద్దం కానుంది. అంతేగాదు తమ బ్రాండ్ కళాకారుల సమూహంతో వర్క్‌షాప్‌లు కూడా ఏర్పాటు చేయనుంది. తద్వారా తర్వాత తరాలు ఈ సంప్రదాయ పద్ధతుల తెలుసుకునేలా రక్షిస్తోంది. అలా ఫ్యాషన్ వస్త్ర పరిశ్రమలో తమ బ్రాండ్‌తో ప్రభంజనం సృష్టించి.. మంచి గుర్తింపును, పేరుని తెచ్చకున్నారు ఈ అత్తాకోడళ్లు సర్లా గుప్తా, శిల్పా గుప్తాల ద్వయం. (చదవండి: అప్పుడు ఆర్మీ అధికారి.. కానీ ఇవాళ వీధుల్లో..) -
పార్టీ ఏదైనా సుందరాంగుల మణికట్టు... కనికట్టు
గాజులది ఆభరణాలను మించిన స్థాయి. సంప్రదాయం, వేడుక ఏదైనా మణికట్టు చుట్టూ మెరిసే వ్యక్తిగత శైలి. వివాహిత మహిళలకు గాజులలో శ్రేయస్సు, ప్రేమ మెండుగా కలిసి ఉంటాయి.అందుకే, పా మట్టి గాజులైనా వాటి స్థానాన్ని వీడి పోవు.ఆధునిక మహిళ ఆ గాజులను కొత్త అల్లికలు, రంగులు, శైలులతో మణికట్టును కనికట్టు చేస్తోంది.వేడుకల కోసం రకరకాల ఆభరణాలతో వార్డ్రోబ్ను కొంగొత్తగా నిర్మిస్తున్నా రాబోయే పండుగ రోజుల్లో చేతుల లుక్‌ను పెంచుకోవాలనుకునే వారికి సేకరణలో పూర్తిగా చోటు సంపాదించడానికి కావల్సినన్ని జతల గాజులు దొంతర్లుగా సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ట్రెండ్‌లో ఉన్న ముఖ్యమైన ఐదు రకాలు గాజుల పెట్టెలో తప్పక ఉండాల్సిందే! ప్రతిరోజు గ్లామర్ ... మినిమలిస్ట్ గోల్డ్ కడా బ్యాంగిల్బంగారు కడా గాజులు నిన్నటి తరం తప్పని ఆభరణం. బరువైన, చంకీ కడాలు ఇప్పుడు అందరికీ నచ్చడం లేదు. కొత్త తరం వెర్షన్ సొగసైనది, తేలికగా ఉండేది కోరుకుంటుంది. ఆధునిక టచ్‌తో కూడిన సాధారణ, లైట్‌వెయిట్ బంగారు కడాలను ఎంపిక చేసుకోవచ్చు. అల్లికలు, చివరలు ఓపెన్‌గా ఉండేవి, ఒకటి లేదా రెండు రేఖాగణిత నమూనాలు ఉన్నవి.. రోజువారీ దుస్తులకు సరైనవి. పూజల నుండి సంప్రదాయ శైలి వరకు కొన్ని సన్నని గాజులు, బోల్డ్ సింగల్ కడా ధరిస్తే రెండు విధాలుగా ఆకట్టుకుంటుంది. రిచ్ లుక్ కోసం ఒక మంద΄ాటి కడాను రెండు సున్నితమైన బంగారు గాజులతో జత చేయవచ్చు. ఫ్యామిలీ ఈవెంట్స్, కార్యాలయ పూజలు, రోజువారీ సల్వార్ సూట్‌కు కూడా ఇవి బాగుంటాయి.పోల్కీ గాజులు – భారతీయ వివాహానికి తప్పనిసరిబాలీవుడ్ వధువుల ఎంపికతో పోల్కీ బ్యాంగిల్స్ తిరిగి వచ్చాయి. గతంలో కంటే మరింత పెద్ద స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయి. అన్‌కట్ డైమండ్స్‌తో హెరిటేజ్ ఆకర్షణతో కూడిన ఈ గాజులు రాచకళను సృష్టిస్తున్నాయి. వివాహ వేడుకలకు ఇవి ప్రత్యేకం అని చెప్పవచ్చు. వేడుకలో ఎంచుకున్న డ్రెస్‌కు తగిన కలర్, డిజైన్‌ను బట్టి గాజుల తయారీ ఉంటుంది. ఇవి ఎప్పటికీ ఎవర్గ్రీన్ సెట్స్ అని చెప్పవచ్చు. వారసత్వ సంపదకు అర్హమైనవి, ఏదైనా పండుగ దుస్తులకు తక్షణ గ్లామ్‌ను జోడిస్తాయి.పోల్కీ గాజులను మెరిసేలా అలంకరించాలి. దీనికి కాంబినేషన్‌గా పోల్కీ చోకర్, చెవి పోగులతో జత చేయచ్చు. వివాహాలు, కర్వా చౌత్, యానివర్సరీ పార్టీలు, రాణిలా భావించాలనుకునే ఏదైనా కార్యక్రమంలో ఈ పోల్కీ గాజులను ధరించవచ్చు.మీనాకారీ గాజులు – రంగుల ఆనందంరంగుల రంగులతో ఉండే గాజులను ఎవ్వరైనా ఇష్టపడతారు. మీనాకారీ గాజుల ప్రకాశవంతమైన ఎనామిల్ వర్క్, అద్భుతమైన డిజైన్లకు పేరొందాయి. పూల నుండి నెమళ్ల వరకు ఇవి సంస్కృతి, రంగుల పరిపూర్ణ మిశ్రమం. దుస్తుల రంగులకు తగినవి ఎంపిక చేసుకోవాలంటే మీనాకారీ గాజులు సరైన ఎంపిక. పండుగలు, వేడుకలలో అలంకరణ బోరింగ్‌గా ఉండకుండా ఇవి సంప్రదాయ శక్తిని తెస్తాయి. లెహంగా లేదా చీర బార్డర్ కి సరిపోయే రంగు గాజులను ఎంచుకోవచ్చు. బోనాలు, నవరాత్రి, దీపావళి, తీజ్, హల్దీ ఫంక్షన్ల సమయాల్లో ధరించే దుస్తులకు ఈ గాజులు అదనపు ఆకర్షణను తెస్తాయి. వీటిలో వేడుకను బట్టి, ఫొటో బ్యాంగిల్స్ జత చేయడం మరో ఆకర్షణ. (ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో) స్టేట్మెంట్ కఫ్ బ్యాంగిల్స్ – ఆధునిక శైలిప్రతి గాజూ సంప్రదాయకంగా ఉండనవసరం లేదు. మీదైన స్టైల్ స్టేట్మెంట్ చూపించాలనుకున్నప్పుడు కఫ్ బ్యాంగిల్స్ సరైనవి. వీటిలో ముత్యాలు, స్టోన్స్, ఎనామెల్ లేదా వెడల్పుగా మెటల్ కఫ్‌లను ఎంచుకోవచ్చు. ఇండో–వెస్ట్రన్ శైలికి ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి. స్పెషల్‌గా, సాధారణ దుస్తులను కూడా ఫ్యాషన్–ఫార్వర్డ్‌గా కనిపించేలా ఈ కఫ్ బ్యాంగిల్స్ చేస్తాయి. మణికట్టు మీద చంకీ కఫ్ ధరించి, మరొకటి సాధారణమైనది వేసుకోవాలి. ఇది స్టైల్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. స్టేట్మెంట్ పీస్‌గా మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. కాక్టెయిల్ పార్టీలు, ఫ్యూజన్ దుస్తులు లేదా మీరు మీ స్టైల్ గేమ్‌ను ప్రదర్శించాలనుకునే ఆఫీస్ గ్యాదరింగ్స్ కూడా ఈ కఫ్ బ్యాంగిల్స్ సరైన ఎంపిక. ట్రెండ్స్ మారుతాయి. కానీ గాజులు ఎప్పటికీ ఉంటాయి. వివాహ జ్ఞాపకాలలో, పండుగలలో, రోజువారీ ఆచారాలలో, వ్యక్తిగత ఫ్యాషన్ స్టేట్మెంట్లో కూడా భాగంగా నిలుస్తాయి. చక్కగా అలంకరించిన గాజుల చేతులు అద్భుతంగా కనిపించడమే కాదు, అవి మీదైన ప్రత్యేకతను ఎదుటివారికి పరిచయం చేస్తాయి. ఇక ఇప్పుడు మీరు గాజులు ధరించడానికి వివాహిత మహిళ మాత్రమే కాదు, నేటి అభివృద్ధిలో వెలిగే ఒక స్టైల్ ఐకాన్ కూడా!ఇదీ చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా! -
సిల్క్ చీరలో సమంత.. ఇది 1930ల నాటి స్టైల్!
నటి సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu) సింపుల్ డిజైనర్ వేర్లో ట్రెండీగా కనిపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడే తన స్టైలిష్ ఫోటోలను నెటిజన్లతో షేర్ చేసుకుంటారామె. అలానే ఈసారి పచ్చి మామిడకాయ లోపలి భాగం రంగులోని చీరలో తళుక్కుమ్మంది. ఆ సంప్రదాయ చీరలో స్టైలిష్‌గా కనిపిస్తున్న సమంత అనుసరించిన ఫ్యాషన్ శైలి 1930ల నాటిది. అంతేకాదండోయ్ నాటి గ్లామర్ స్టైల్‌కి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ చీర డిజైనింగ్ చెప్పే అర్థం చూస్తే షాకవ్వుతారు. ఇక్కడ సమంత రా మ్యాంగో శాటిన్ సిల్క్ చీరలో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. వావ్..! వాటే శారీ అనేలా ఉంది ఆమె లుక్. ఈ తాజా లుక్ 1920-30ల ఛానెల్ ఆర్డ్ డెకో శైలి అట. అంటే..ఇక్కడ సమంత ధరించిన చీర ఆర్ట్ డెకో ఉద్యమం నుంచి ప్రేరణ పొందిన డిజైన్. ఈ చీరపై కనిపించే బోల్డ్ లైన్లు, రేఖాగణిత నమునాలు, నిర్మాణ నైపుణ్యానికి సంబధించిన డిజైన్‌లో రూపొందిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే ఆర్కిటెక్చర్‌కి సంబంధించిన గీతలే దర్శనమిస్తాయి. దీనిలో కనిపించే క్షితిజ సమాంతర రేఖలకు ప్రేరణ ఏరోడైనమిక్ డిజైన్ అని, ఇవి నాటికల్ అంశాలను కూడా నొక్కిచెబుతాయని అంటున్నారు ష్యాషన్ నిపుణులు. అయితే ఈ గీతలు, రేఖలు అన్ని చేతితో చేసిన ఎంబ్రాయిడరీ డిజైన్ అట. సున్నితమైన బంగారు జరీతో డిజైన్ చేస్తారట. చూడటానికి సాదాసీదాగా కనిపించే ఈ శారీని రిచ్‌లుక్‌లో ఉండి, రాచరికానికి అద్ధం పట్టే విలాసవంతమైన స్టైలిష్వేర్గా అభివర్ణిస్తారు ఫ్యాషన్ ప్రియులు. ఆ చీరకు తగ్గ మేకప్, చెవిపోగులు, కాక్టెయిల్ రింగ్‌తో తన రూపాన్ని అద్భుతంగా కనిపించేలా చేసింది సమంత. పాత ఫ్యాషన్‌కి సరికొత్త రూపమిచ్చేలా కొత్త ట్రెండ్‌ని సెట్ చేసేలా ఉంది సమంత వింటేజ్ ఆర్ట్ డెకో లుక్. చాలా సింపుల్‌గా కనిపిస్తున్న ఈ శాటిన్ సిల్క్ చీర ధర వచ్చేసి సుమారు రూ. 50 వేలు పైనే పలుకుతుందట. View this post on Instagram A post shared by RAW MANGO (@raw_mango) (చదవండి: ఎవరీ లీనా నాయర్? ఏకంగా బ్రిటిష్ అత్యున్నత గౌరవం..) -
పువ్వుల డిజైనర్‌వేర్‌లో స్టైలిష్‌గా కనిపిద్దాం ఇలా..!
పువ్వులకు మగువలకు విడదీయరాని బంధం ఉంటుంది. పువ్వులను తమ భుజాల మీదుగా మణికట్టు వరకు అలంకరించుకుని అందంగా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. వెస్ట్రన్ గౌన్లలో విరివిగా కనిపించే ఈ స్టైలు ఇప్పుడు ఎల్లలు దాటి మన సంప్రదాయ డిజైనర్ వేర్‌లోనూ కనువిందు చేస్తోంది. ఫ్యాబ్రిక్‌తో పువ్వులు వచ్చేలా కుట్టడం ఈ స్టైల్ ప్రత్యేకత. ఇక పువ్వులు చేతుల్లో కాదు, చేతులకు అందంగా అలంకరించుకోవచ్చు.పింక్, పీచ్ కలర్ బ్లౌజ్ అయితే ఫెమినైన్ లుక్, రెడ్ కలర్ అయితే స్టేట్మెంట్ అటైర్గా, తెలుపు, గోధుమరంగు అయితే వేదికలపైన పల్లకీ లుక్‌తో కనిపిస్తారు. ఏ స్టైల్లో కనిపించాలనుకుంటే ఆ డ్రెస్సింగ్‌కి సరిగ్గా నప్పే ఈ గులాబీల గుచ్చాలు ప్రత్యేకంగా కనిపించడమే కాదు, ఫొటోలలోనూ విలాసంగా ఉంటుందనే ఆలోచన కూడా దీనికి క్రేజ్ పెంచుతోంది. నిన్నటి వరకు పిల్లల డ్రెస్సింగ్‌లో కనిపించే ఈ స్టైల్ పెద్దవారి చీరకట్టుకూ అందాన్ని తీసుకువచ్చింది. రిసెప్షన్, సంగీత్.. వంటి వేడుకలలో గ్రాండ్‌గా వెలుగుతోంది.స్లీవ్స్ డిజైన్ బోల్డ్‌గా ఉంటే, నెక్ సింపుల్‌గా ఎలాంటి ఆభరణాలు లేకుండా ఉంటే బాగుంటుంది. పెద్ద పెద్ద ఆభరణాలు కాకుండా సన్నని చైన్లు వాడచ్చు.గులాబీ పువ్వు ఆకృతి వచ్చేలా బ్లౌజ్ స్లీవ్స్ డిజైన్ చేయడం ఈ స్టైల్ స్పెషల్. ఈ పువ్వులు లేయర్లుగా మంచి ఫ్లేర్ వచ్చేలా డిజైన్ చేస్తారు. వీటిని ఎక్కువగా నెట్, ఆర్గాంజా, షిఫాన్ వంటి ఫ్యాబ్రిక్స్‌తో తయారు చేస్తారు.ఇండో వెస్టర్న్ డ్రెస్సుల్లో, ఫ్యూజన్ గౌన్లు, క్రాప్ టాప్ + స్కర్ట్ లుక్, పెప్లం టాప్స్, షరారా, పలాజో సెట్లలో విరివిగా కనిపిస్తున్నాయి.సంప్రదాయ డ్రెస్సులకు రెండు వైపులా ఫ్యాబ్రిక్ గులాబీల కుచ్చు ఉంటే, వెస్ట్రన్ స్టైల్స్‌లో బ్లౌజ్ లేదా గౌన్‌కు, సింగిల్ షోల్డర్ ఫ్రాక్‌కి ఒకవైపు గులాబీ గుచ్చం కనువిందు చేస్తుంది.శారీ లేదా లెహంగా కూడా సింగిల్ షోల్డర్ రోజ్ బొకేని డిజైన్ చేయించుకోవచ్చు.శారీ బ్లౌజ్ ట్రెండ్లలో గులాబీ స్లీవ్స్ అందంగా అమరిపోతున్నాయి.రోజ్ స్లీవ్స్ ఎంచుకున్నప్పుడు జుట్టును పోనీటైల్ లేదా బన్ స్టైల్ వేసుకుంటే డ్రెస్సింగ్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది.హై నెక్ టాప్ అయితే డ్యూయల్ రోజ్ స్లీవ్స్ బాగుంటాయి. (చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..) -
తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..
కూచిపూడి కళాకారిణి శ్రవ్యమానస. అత్యంత సామాన్య కుటుంబంలో పుట్టిన శ్రవ్య తనకు తానుగా ఎక్కిన నిచ్చెన మెట్లే అన్నీ. తొమ్మిదేళ్ల వయసులో గజ్జె కట్టి... నేడు ‘మిస్ వరల్డ్ 2025’ కార్యక్రమాల్లో నాట్య ప్రదర్శనలిచ్చిన ఘనతను తన ఖాతాలో జమ చేసుకున్నారు. కళాకారుల బిడ్డ! శ్రవ్య అమ్మానాన్నలిద్దరూ కళాకారులే. సామాన్య కుటుంబం కావడంతో ఉద్యోగం మీదనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. శ్రవ్య జీవితంలో నాట్యం, చదువు రెండూ సమతూకంగానే పెరిగాయి. ఎంటెక్ పూర్తి కాగానే హైదరాబాద్ మెట్రో రైల్లో ఉద్యోగం వచ్చింది. కానీ కళ కోసం ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. దేశవిదేశాల్లో ఆమె ప్రదర్శనలు పద్దెనిమిది వందలు దాటాయి. ఆమె అకాడెమీలో శిక్షణ తీసుకున్న విద్యార్థుల సంఖ్య మూడు వేలు దాటింది. అధ్యయనమే గెలిపిస్తోంది! ‘నాట్యసాధనలో నిత్యం మేధోమధనం జరుగుతూ ఉండాలి. గురువులు నేర్పించిన జ్ఞానంతో సరిపుచ్చుకుంటే అక్కడే ఆగిపోతాం’ అంటారు శ్రవ్య. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో బుద్ధవనంలో ప్రదర్శన బుద్ధుడి ఇతివృత్తంగా ఉండాలన్నారు నిర్వహకులు. వారం రోజుల్లో బౌద్ధాన్ని అధ్యయనం చేసి, కాస్ట్యూమ్స్ లేత రంగులతో నిరాడంబరంగా డిజైన్ చేసి, బృందం మొత్తానికి కుట్టించడం వరకు ఎందులోనూ రాజీ పడలేదామె. అలాగే చౌమొహల్లా ప్యాలెస్ ప్రదర్శనకు సితార్ వంటి నిజాం సంగీత శైలితో సెమీ క్లాసికల్ రూపొందించి ప్రదర్శించారు. పోచంపల్లిలో తెలుగు జానపదం కోలాటం, శిల్పారామంలో బృందావనం, బంజారా, రాసలీలలు ప్రదర్శించి చూపారు. ఆర్ద్రతే కళ క్యాన్సర్ పేషెంట్‌కి విగ్ తయారు చేయడానికి సహజమైన కేశాలు అవసరమని తెలిసి గుండు చేయించుకుని తన కేశాలనిచ్చారు శ్రవ్య. కళాకారులను బతికించేది మనసు లోతుల్లోంచి ఉబికి వచ్చే ఎమోషనే. ఈ సున్నితత్వాన్ని తనలో పదిలపరుచుకుంటున్నారామె. అబుదాబిలో శ్రీనివాస కల్యాణం ప్రదర్శనకు స్టాండింగ్ ఒవేషన్ రావడం మధురానుభూతి, యాసిడ్ సర్వైవర్ మనోగతాన్ని ఆవిష్కరించడం నర్తకిగా ఆమె సామాజిక బాధ్యత. కళాకారులు సామాజిక సమస్యల మీద స్పందించడంతోపాటు సాంకేతికంగా కూడా ఎప్పటికప్పుడు తమను తాము అప్డేట్ చేసుకోవాలి. చెయ్యి పట్టుకుని నడిపించే గాడ్ఫాదర్లు లేని శ్రవ్య మానస... డిజిటల్ వేదికగా ప్రపంచానికి సుపరిచితం కావడం వల్లనే మిస్ వరల్డ్ 2025 కార్యక్రమాల్లో నాట్య ప్రదర్శన అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ‘వ్యక్తిగా పరిపూర్ణత సాధించిన బ్యూటీ ప్రాజంట్స్ నుంచి చాలా నేర్చుకున్నాను’... అన్నప్పుడు ఆమెలో శిఖరాన్ని అధిరోహించిన సంతోషం వ్యక్తమైంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆ వెడ్డింగ్ గౌనుకి ఒకటిన్నర మిలియన్ల వ్యూస్..!
ఐదంటే ఐదు డాలర్లు పెట్టి ఎప్పుడో అరవై ఏళ్ల క్రితం నాటి వెడ్డింగ్ గౌన్ కొనుక్కుందామె, అది తొడుక్కుని చూద్దామని టిక్‌టాక్‌లో అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేసింది. అయితే అది ఆమెకు సరి΄ోలేదు. దాంతో తనకన్నా కొద్దిగా తక్కువ పర్సనాలిటీ ఉన్న తన చెల్లెలికి ఆ గౌన్ ఇచ్చింది. అది ఆమెకు అతికినట్లు సరి΄ోయింది. త్వరలో జరగనున్న తన వెడ్డిండ్కి ఆ గౌన్ని డ్రై క్లీనింగ్ చేయించి దానినే ధరించాలని డిసైడ్ చేసుకుంది. ఇక్కడ అది కాదు విశేషం. వీరిద్దరి వీడియోస్‌కి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. షష్టిపూర్తి కూడా జరుపుకున్న నాటి ఆ గౌను అంత నాజూగ్గా ఉండటం, అది కారుచౌకగా కొనుక్కుని దానికి చిన్న చిన్న రిపేర్లు చేయించి తన వెడ్డింగ్ రోజున అదే గౌన్‌ను ధరించాలనుకోవడం చాలా బాగుందంటూ అందరూ ఆ అక్కచెల్లెళ్లని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఓహియోలోని కొలంబస్కు చెందిన మ్యాడీ స్ట్రేయర్ అనే ఆమె వింటేజ్ వెడ్డింగ్ డ్రెస్‌లు దొరికే ఎస్టేట్ సేల్‌లో పాతకాలం నాటి ఈ వెడ్డింగ్ గౌన్ చూసి ముచ్చటపడింది. వెంటనే ఐదు డాలర్లు చెల్లించి దానిని కొనుక్కుంది. తనకు సరిపోకపోవడంతో చెల్లెలికి దానిని ప్రెజెంట్ చేసింది. అయితే ఆమె కూడా ఆ గౌనును చూసి మురిసిపోయి త్వరలో జరగబోయే తన పెళ్లికి బోలెడంత ఖరీదు చేసి అప్పటికే వెడ్డింగ్ గౌన్‌ను కొనుక్కున్నప్పటికీ దానిని పక్కనపెట్టి మరీ అక్క ఇచ్చిన ఈ గౌన్ తొడుక్కోవడానికి డిసైడైంది. వీరిద్దరి వీడియోలకూ ఒకటిన్నర మిలియన్లకి పైగా వ్యూస్, లక్షా ఇరవై ఆరువేల లైకులూ వచ్చాయి. Woman Buys 1963 Wedding Dress for $5 at Estate Sale—but There's a Twist - Newsweek https://t.co/s9Cgy4hgkE— Manuco (@manuco22) June 7, 2025 (చదవండి: Different Dowry Case: కట్నంగా బైక్, నగదుతోపాటు కిడ్నీ కూడా ఇవ్వాల్సిందే..) -
Akhil-Zainab Reception: స్పెషల్ ఎట్రాక్షన్‌గా శోభితా ధూళిపాళ.. లక్షలు ఖరీదు చేసే..
అఖిల్-జైనాబ్ వివాహ రిసెప్షన్(Akhil Akkineni-Zainab's wedding reception)లో నూతన వధువరులిద్దరూ సింపుల్ లుక్‌లో అందరిని కట్టిపడేశారు. వివాహం అనంతరం అక్కినేని ఫ్యామిలీ రిసెప్షన్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నాగ చైతన్య, శోభితా ధూళిపాళ హాజరు కావడం ప్రధాన అకర్షణగా నిలిచింది. ఈ రిసెప్షన్ వేడుకలో శోభితా ఎర్రటి శాటిన్ చీరలో స్టైలిష్ లుక్‌లో కనిపించిది. ఈ చీరకు మ్యాచింగ్‌గా బంగారు వర్ణం బ్లౌజ్‌ను ధరించడం మరింత ట్రెండీగా కనిపించింది. అయితే శోభితా అందమైన లుక్ కంటే ఆమె ధరించిన డియోర్ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. శోభితా ధరించిన చీరకు పూర్తి విభిన్నంగా బ్లాక్ బ్యాగ్ ఎంచుకోవడం మరింత హైలెట్‌గా నిలిచింది. అయితే ఈ బ్యాగ్ ధర వింటే కళ్లు చెదిరిపోతాయ్. ఇది అక్షరాల రూ. 3 లక్షల పైనే పలుకుతుందట. ఇక అఖిల్ జైనాబ్ వివాహ వేడుకలో చైతూ, శోభితాల జంట తెలుపు, క్రీమ్ కలర్ డిజైనర్‌వేర్‌లలో కనిపించి సందడి చేశారు. అంతేగాదు వారిద్దరూ జైనాబ్ను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ..ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కాగా, అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఇంట వరుస శుభాకార్యాలు జరిగాయి. గతేడాది చివర్లో నాగచైతన్య- శోభిత (Sobhita Dhulipala) పెళ్లి జరగ్గా ఇటీవల (జూన్ 6, 2025న) అఖిల్ వివాహం జరిగింది. బిజినెస్మెన్ జుల్ఫీ రవ్జీ కూతురు జైనబ్‌ను అఖిల్ (Akhil Akkineni) వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. ఈ వివాహ వేడుకను నాగార్జున సింపుల్‌గా ఇంట్లోనే జరిపించాడు. అయితే రిసెప్షన్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో గ్రాండ్‌గా జరిగింది.(చదవండి: Akhil-Zainab Reception డైమండ్ నగలతో, గార్జియస్‌గా అఖిల్ అర్థాంగి) -
Akhil-Zainab డైమండ్ నగలతో గార్జియస్‌గా అఖిల్ అర్థాంగి
Akhil-Zainab Reception నూతన వధూవరులు అక్కినేని అఖిల్, జైనబ్ రవ్జీ రిసెప్షన్ వేడుకలో అందంగా మెరిసారు. మూడు ముళ్ల వేడుక అనంతరం అక్కినేని ఫ్యామిలీ రిసెప్షన్ ఇచ్చింది. ఈ వేడుకల్లో పలువురు సెలబ్రిటీలు సందడిగా కనిపించారు. ఆర్టిస్ట్, వ్యాపారవేత్త జైనబ్ రవద్జీ రిసెప్షన్ లుక్ వైరల్‌గా మారింది. మేకప్ ఆర్టిస్ట్ సూర్య సింగ్ జైనబ్ లుక్కు సంబంధించిన వీడియోన, ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో అక్కినేని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సింపుల్‌గా నెట్టెడ్ ఫ్రాక్ ధరించిన జైనబ్ మినిమల్ మేకప్‌తో అందంగా మెరిసింది. అలాగే పెళ్లికి ధరించినట్టు గానే మొత్తం వజ్రాభరణాలను ఎంచుకుంది. డైమండ్ చౌకర్, లేయర్డ్ చెయిన్ ధరించింది. మ్యాచింగ్‌గా చెవులకు డైమండ్ ఝుంకీలు వేసుకుంది. అటు కొత్త పెళ్లి కొడుకు అఖిల్ కూడా సింపుల్ లుక్‌లో అదరగొట్టేశాడు. View this post on Instagram A post shared by Surya Singh (@suryasinghmakeup)మరోవైపు టాలీవుడ్ యంగ్ హీరో మరిది అఖిల్ రిసెప్షన్ లో రెడ్ సారీలో అక్కినేని వారి పెద్ద కోడలు నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ లుక్ నెట్టింట సందడిగా మారింది. భర్త నాగ చైతన్యతో కలిసి ఆమె ఫోటోలకు ఫోజులిచ్చారు. అక్కినేని నాగార్జున, అమల దంపతుల కుమారుడు అఖిల్ అక్కినేని వివాహం తరువాత రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. -
మార్వ్‌లెస్. మాన్సూన్ వెడ్డింగ్స్..
‘చిటపట చినుకులు పడుతూ ఉంటే.. చెలికాడే సరసన ఉంటే.. చెట్టాపట్టగ చేతులు కలిపి చెట్టు నీడకై పరుగిడుతుంటే.. చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ..’ అంటూ సాగే పాత తెలుగు సినిమా పాటను గుర్తు చేసేలా నేటి వెడ్డింగ్ ప్లానర్లు ప్లాన్ చేస్తున్నారు.. సాధారణంగా వర్షాకాలంలో పెళ్లిళ్లు అంటే కాస్త ఇబ్బంది.. చిరాకే.. కానీ, పక్కాగా ప్లాన్ చేస్తే వానాకాలంలో పెళ్లి వేడుకలను మధురమైన అనుభూతిగా మిగుల్చుకోవచ్చు.పెళ్లిళ్ల సీజన్ ఆరంభమైంది. మరోవైపు వేసవి ముగియకముందే వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అంగరంగ వైభవంగా అలంకరించుకొని, బంధువులు, స్నేహితుల మధ్య పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో అకస్మాత్తుగా వర్షం పడితే ముందస్తు ప్లానింగ్ అంతా వేస్ట్ అవుతుంది. పెళ్లికి వచ్చిన వారు చిరాకు పడటంతో పాటు రావాల్సిన బంధువులు రాలేని పరిస్థితి తలెత్తుతుంది. అందుకే వానాకాలంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం కాసింత కష్టమే. కానీ, ఇవన్నీ పాత రోజులు. నిజం చెప్పాలంటే వర్షాకాలంలో పెళ్లి వధూవరులకు మంచి అనుభూతిని మిగులుస్తుందని అంటున్నారు వెడ్డింగ్ ప్లానర్లు.హైబ్రిడ్ వేదికలు.. ఈమధ్య కాలంలో వర్షాకాలంలో వివాహాలు ట్రెండీగా మారాయి. పెళ్లి శుభలేఖల నుంచి మొదలుపెడితే వేదిక, మండపం అలంకరణ, అతిథుల ఆహ్వానం, ఫొటోగ్రఫీ, బరాత్ వరకూ అన్నీ ప్రత్యేకమైనవిగా ఉంటాయి. సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే వధూవరులకు, అతిథులకు గొప్ప అనుభూతి కలిగేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమాటిక్ పెళ్లి వేడుకలను వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాయి. వాన ఇబ్బందుల నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.అన్ని రకాలుగా వేడుకలకు సిద్ధం చేయడమే ఈ సంస్థల ప్రత్యేకత. పెళ్లి మండపమే కాదు టెర్రస్, లాన్, ఓపెన్ ఏరియా అన్నింటినీ గ్లాస్ కనోపీలతో కవర్ చేస్తారు. జర్మన్ హ్యాంగర్ టెంట్లు, వాటర్ ప్రూఫ్ డోమ్‌లు, ముడుచుకునే పైకప్పులతో వివాహ వేదిక, మండపాలు నిర్మిస్తారు. అకస్మాత్తుగా వర్షం కురిస్తే వాననీరు వెళ్లేందుకు సరైన మార్గాలను ఏర్పాటు చేస్తారు. ట్రాన్స్పరెంట్ పెళ్లి వేదిక, మండపాలతో వధూవరులకే కాదు అతిథులు కూడా వర్షం పడినా తడిసిపోకుండా వర్షపు జల్లులు, శబ్దాలను ఆస్వాదిస్తూ గొప్ప అనుభూతిని పొందుతారు.భద్రత కీలకమే.. నాన్‌స్లిప్ టైల్స్, మ్యాట్లు, తగినంత లైటింగ్‌తో పాటు వృద్ధులకు డ్రై జోన్లను ఏర్పాటు చేస్తారు. వర్షాకాలంలో బరాత్‌లకు బదులుగా సన్నాయి మేళం, డోల్ చప్పుళ్లు, మ్యూజిక్ బ్లాస్టింగ్స్ ఏర్పాటు చేస్తారు. దీంతో అతిథులు గొడుగుల కింద నృత్యం చేసే వీలుంటుంది. విద్యుత్ అంతరాయం కలగకుండా బ్యాకప్ బ్యాటరీలు, జనరేటర్లను క్యారీ చేస్తారు. డీహ్యుమిడిఫయ్యర్లు, ప్లాస్టిక్ టార్ప్లిన్ ఏర్పాటు చేస్తారు. లాంతర్లు, షాండీలియర్ల వెలుగులో వధూవరులు గొడుగుల కింద లేదా వర్షంలో తడుస్తూనే రొమాంటిక్ ఫొటోలకు ఫోజులు ఇస్తారు.వర్షాన్ని ఆస్వాదించేలా.. శుభలేఖ కూడా మేఘాలు, వర్షం చినుకులను ప్రతిబింబించేలా ముద్రిస్తారు. అతిథులు పెళ్లి వేదికలో అక్కడక్కడ శుభ్రమైన చిన్న టవల్స్‌ను అందుబాటులో ఉంచుతారు. బగ్ స్ప్రే ప్యాచ్‌లు, త్వరగా ఆరిపోయే న్యాప్కిన్లు, వర్షంలో, బురదలో జారిపడిపోకుండా ఫ్లిప్‌ఫ్లాప్ పాదరక్షలు అందుబాటులో ఉంచుతారు. అతిథులు వర్షం మూడ్ ఆస్వాదించేందుకు వేడి టీ, కాఫీలు, మసాలా మాక్టెయిల్స్, ముల్లడ్ వైన్ కాక్టెయిల్స్తో బార్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.వెల్వెట్, సిల్క్ వంటి బరువైన దుస్తులుహుందాగా కనిపిస్తాయి. అయితే వీటి వల్ల వర్షాకంలో ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతుంది. ఒకవేళ వర్షంలో తడిస్తే అవి మరింత బరువుగా మారతాయి. పైగా వర్షం పడిన సమయంలో ఉక్కపోతకు ఇబ్బంది కలిగిస్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని వీటికి బదులు తేలికపాటి నేత వ్రస్తాలు, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, మృధువైన నైలాన్‌తో తయారైన వ్రస్తాలు, సిల్‌్క, సింథటిక్ ఫైబర్‌తో తయారైన జార్టెట్తో లెహంగాలను డిజైన్ చేస్తున్నారు. ఇవి నీటిని పీల్చుకోకపోవడంతో పాటు తేలికగా ఉండటమే వీటి ప్రత్యేకత. వాటర్ ప్రూఫ్ లైనింగ్, క్విక్ డ్రై దుపట్టాలను వధూవరులు ఎంచుకుంటున్నారు. -
పట్టుచీరలపై నూనె మరకా? ఎప్పటికీ కొత్తవాటిలా మెరవాలంటే!
పెళ్లిళ్లు,పార్టీల సీజన్ వచ్చిందంటే ఏ చీర కట్టుకోవాలి అనేది పెద్ద ప్రశ్న. చీర ఉంటే, సమయానికి మ్యాచింగ్ బ్లౌజు కనిపించదు. అంతేకాదు రెండింటికీ తగ్గట్టు జ్యుయల్లరీ వెతుక్కోవాలి.అన్నీ బావున్నాయి అంటే.. మనకు నచ్చిన పట్టుచీర మరక వెక్కిరిస్తుంది. మరి పట్టుచీరపై మరకలుపడితే ఏం చేయాలి? పట్టుచీరలు మెరుపు తగ్గకుండా కొత్తవాటిలా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.పట్టు చీరపై నూనె మరక పడితే..?పట్టు చీర కట్టుకున్నప్పుడు పూజలు వంటి ప్రత్యేక సందర్భాలలో నూనె చుక్కలు పడటం సహజమే. నూనె మరక పడిన వెంటనే శుభ్రమైన పొడి కాటన్ బట్టతో ఆ ప్రదేశంలో అద్దాలి. బట్ట లేకపోతే పేపర్, టవల్ తో కూడా నూనె పడిన చోట అద్దవచ్చు.అయితే ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మరక పడిన చోట గట్టిగా రుద్దితే మిగతా చోట్లకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే నూనె పీల్చుకుని ఆ ప్రదేశంలో మరక పోవడం మొదలవుతుంది. నూనె పడిన చోట మాత్రమే మెల్లగా అద్ది మరకను తొలగించాలి. (Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్‌లో అఖిల్- జైనబ్)ఇలా వస్త్రం లేదా పేపర్ టవల్ తో అద్దిన తర్వాత అక్కడ పౌడర్ చల్లి శుభ్రం చేయాలి. పౌడర్ చల్లి మరక పడిన చోటును నీటితో కడిగితే చాలు. పేరుకు పోయిన నూనె, మురికి అంతా పోతుంది. పొరపాటున కూడా వేడి నీటితో మరకలను తొలగించడానికి ప్రయత్నించవద్దు. వేడి నీరు పడితే మరక పోనే పోదు.మరక ఉన్న చోట బేకింగ్ సోడా లేదా కార్న్‌స్టార్చ్‌ను పలుచగా చల్లి కొద్దిసేపటి తర్వాత, వేరే ఏదైనా బట్టతో తుడిచివేసి, మళ్ళీ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వెనిగర్ లేదా నిమ్మరసం తీసుకొని కొద్దిగా నీరు కలిపి, సున్నితమైన బట్టతో మరక ఉన్న ప్రాంతాన్ని తుడవాలి. పట్టు చీరలను శుభ్రం చేసిన తర్వాత, వాటిని నీడలో ఆరనివ్వాలి. ఇదీ చదవండి: మీ ముఖం చందమామలా మెరవాలంటే..!ఎలా శుభ్రం చేయాలంటే..ఖరీదైన చీరలను సాధ్యమైనంత వరకు ఇంట్లో వాష్ చేయకపోవడమే మంచిది. డ్రై క్లీనింగ్ లేదా ఇతర ప్రొఫెషనల్ క్లీనింగ్ సేవలను ఉపయోగించుకోవాలి.పట్టు చీరలను మడతపెట్టేటప్పుడు, జాగ్రత్తగా మడతపెట్టి, పొడి గాలి తగిలేలా చేయాలి.అలాగే బంగారు, వెండి జరీ చీరలను మెత్తటి కాటన్ బట్టలో చుట్టి ఉంచడం మంచిది.సంవత్సరాల తరబడి ఒకే మడతల్లో చీరలను అలా ఉంచేయకూడదు. మధ్యమధ్యలో గాలికి ఆరనిచ్చి,మడతలు మార్చిపెట్టుకోవాలి. పట్టు చీరలను శుభ్రం విషయంలో ఏదైనా అనుమానాలుంటే ఎక్స్పర్ట్ సలహా తీసుకోవడం ఉత్తమం. మగ్గం వర్క్ బ్లౌజులను ఉల్టా చేసిన మడతపెట్టుకునొ భద్రపరుచుకోవాలి. లేదంటే స్టోన్స్, కుందన్స్ ఊడిపోయి, అందం పోతుంది. ఇదీ చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..ఇంకో చిట్కా:పాతగా అనిపించిన పట్టు చీరల్ని పిల్లలకు పట్టులంగాలుగా కుట్టింవచ్చు. లేదంటే పెద్దవాళ్లే లాంగ్ ఫ్రాక్, డిజైనర్ బ్లౌజులు, కుర్తాలుగా రీమోడలింగ్ చేయించుకోని రీయూజ్ చేసుకోవచ్చు. -
పెళ్లి తరువాత తొలిసారి జంటగా : అఖిల్- జైనబ్ డాజ్లింగ్ లుక్
మోస్ట్ అడోరబుల్ సెలబ్రిటీ కపుల్ అఖిల్ అక్కినేని, జైనబ్ ( Akhil -Zainab ) జంట పెళ్లి తరువాత తొలిసారి సందడి చేశారు. మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ జంటే ఇపుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జూన్ 6న పెళ్లి చేసుకున్న ఈ జంటల ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట సందడి చేస్తున్నాయి. తాజాగా సూఫీ నైట్‌లో అందంగా మెరిసారు. మురిపెంగా ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని అందర్నీ అబ్బుర పరిచారు.సూఫీ రాత్రిలో అఖిల్- జైనాబ్ అద్భుతంగాసెలబ్రిటీ జంట, అఖిల్ అక్కినేని లేడీ లవర్ జైనాబ్ సూఫీ కార్యక్రమంలో కనువిందు చేశారు. జైనాబ్ పూల ప్రింట్‌తో ఉన్న లాంగ్ ఫ్రాక్ ధరించగా, అఖిల్ నేవీ బ్లూ షేర్వాన, పైజామాతో కనిపించాడు. మాంగ్ టీకా, డైమండ్ నెక్‌పీస్‌తో తన లుక్‌ను మరింత అద్భుతంగా మల్చుకుంది. ఈ వేడుకలో కూడా డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్‌గా కనిపించింది. వివాహం తర్వాత నూతన వధూవరులుగా తొలిసారి ఇలా కనిపించి అలంకరించారు. పవర్ కపుల్ వరుణ్ జైన్, అతని భార్య సన్యా ఈ వేడుకలో కనిపించారు.అఖిల్ - జైనబ్ వెడ్డింగ్ 2024 నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ -జైనాబ్ మూడేళ్ల బంధం తరువాత ఈ నెలలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తరువాత గ్రాండ్రిసెప్షన్ కూడా ఇచ్చారు. మహేష్ బాబు, చిరంజీవి, రాంచరణ్, ప్రశాంత్ నీల్ లాంటి సినీ ప్రముఖులతోపాటు, అనేక రాజకీయ, క్రీడారంగ సెలబ్రిటీలు ఈ పార్టీకి హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. -
Hebah Patel ఫ్యాషన్.. ఫాలో అయ్యేది కాదు
మోడర్న్ లుక్‌లో కనిపించే ముద్దమందారంలాంటి అమ్మాయి నటి హెబ్బా పటేల్ (Hebah Patel). స్టయిలింగ్, ఫ్యాషన్ చాయిసెస్ కూడా సంప్రదాయం, ఆధునికతల కలయికలాగే ఉంటాయి.ఇప్పుడు అలాంటి ఓ టూ ఇన్ వన్ లుక్ కోసం తను ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..మేకప్ కంటే ముందు స్కిన్‌కేర్‌పై ఎక్కువ శ్రద్ధ పెడతా. మేకప్ ఎంత తక్కువ వేసుకుంటే, అంత బాగుంటాం. ఇక దుస్తులను నా మూడ్, కంఫర్ట్, సందర్భం, వెళ్లే చోటును బట్టి స్టయిలింగ్ చేసుకుంటా. ఫ్యాషన్ అంటే ఫాలో అయ్యే విషయం కాదు. ఫీల్ అయ్యేదని నమ్ముతా. – హెబ్బా పటేల్ చీర బ్రాండ్: హర్షిత నిమిషకవి ధర: రూ. 4,500బ్లౌజ్ ధర: రూ. 1,500జ్యూలరీ బ్రాండ్: బ్లూమ్ బై సుష్మిత ఇదీ చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే.. నెక్‌పీస్ ధర: రూ. 699గాజులు ధర: రూ. 1,549చదవండి: అఖిల్ పెళ్లి సందడి : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్ -
మిస్ యూనివర్స్‌కు మన తెలుగు తేజాలు
త్వరలో థాయిలాండ్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025 కోసం భారత్ నుంచి మిస్ యూనివర్స్ ఇండియాను ఎంపిక చేయడానికి పోటీలు జరిగాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనలిస్టుల ఎంపికలో మిస్ యూనివర్స్ తెలంగాణగా కశ్వి, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్‌గా ప్రకృతి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు..సుస్మితాసేన్ స్ఫూర్తినేను మెడికల్ స్టూడెంట్‌ని. మోడల్ గా కూడా రాణిస్తున్నాను. శాస్త్రీయ నృత్యమూ నేర్చుకున్నాను. అందాల పోటీలు అంటే కేవలం బ్యూటీ గురించి మాత్రమే కాదు. మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం, సమాజానికి మంచి చేయాలనే ఆలోచన, జీవన నైపుణ్యాల వృద్ధి.. ఇలా అన్నింటిపై ఫోకస్ ఉంటుంది. అందుకే నేను దీనిమీద దృష్టి పెట్టాను. నేను పుట్టి పెరిగింది అమెరికాలో. మా అమ్మానాన్నలు తెలంగాణ వాసులు. మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెలా ఎదగాలన్నది నా డ్రీమ్. అందుకే నన్ను నేను నిరూపించుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. ఈరోజుల్లో ప్రజల్లో మానసిక అనారోగ్యం బాగా పెరుగుతోంది. దీనిపై చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నాను. అలాగే గృహహింస పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాను. వీటితో పాటు మూగ, చెవిటి వారికి సహాయకారిగా ఉంటూ వారి వృద్ధికి కృషి చేస్తున్నాను. ఈ విషయాలు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి. తెలంగాణకు రావడానికి ముందే మా పేరెంట్స్ నుంచి, బుక్స్ నుంచి తెలంగాణ గొప్పతనం గురించి తెలుసుకున్నాను. ఇక్కడికి రావడం విజేతగా నిలవడం... చాలా సంతోషంగా ఉంది.– కశ్వి, మిస్ యూనివర్స్ తెలంగాణకాన్ఫిడెన్స్ ముఖ్యంకళ్ళు మూసినా, తెరిచినా కిరీటమే కళ్ళ ముందుండేది. ఫైనలిస్ట్‌గా ఎంపికయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. పోటీలో మన మాటల్లో, నడకలో, ప్రవర్తనలో కాన్ఫిడెన్స్ నే ప్రధానంగా చూస్తారు. ఫైనల్ రౌండ్లో... త్యాగం, పాజిటివిటీ, నెగెటివిటీల గురించి అడిగారు. త్యాగం అనేది ఎప్పుడూ గొప్పదే. మన జీవితంలో చిన్న చిన్న త్యాగాలు చేస్తుంటాం. కానీ, త్యాగం వల్ల మన సెల్ఫ్ హ్యాపీగా లేకపోతే చేయకూడదు అని నేను చెప్పడం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. గత ఏడాది ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ నుంచి పోటీ చేసి గెలు పొందాను. ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికయ్యాను. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, భాష.. ఇలా అన్నింటి గురించి తెలిసుండాలి. అమ్మానాన్న బెంగళూరులో ఉంటారు. అమ్మ వర్కింగ్ విమెన్, అక్క ప్రేరణ నాకు బ్యాక్ బోన్ అని చెప్పవచ్చు. అంతగా ఎంకరేజ్ చేస్తారు. బీకామ్‌లో డిగ్రీ చేశాను. డాన్స్ అంటే ఇష్టంతో డాన్స్ కోర్సు చేశాను. బెంగళూరులో డాన్స్ స్టూడియో ఉంది. రియాలిటీ షో చేశాను, నేను నటించిన సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. నన్ను ఆల్ రౌండర్ అని నా ఫ్రెండ్స్ అంటుంటారు. బ్యూటీ అంటే ఫిజికల్‌గా కనిపించేదే కాదు.. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ . దానినే అన్నింటికన్నా భిన్నంగా చూపగలగాలి.–ప్రకృతి కంబం, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్– నిర్మలారెడ్డిఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
జిమ్స్, వర్కవుట్స్ లేకుండానే ఆరోగ్యం
ప్రస్తుతం ఆరోగ్యం/ఫిట్నెస్ సాధన అంటే తప్పకుండా జిమ్‌కి వెళ్లాలి, చెమటలు కక్కేలా కసరత్తులు చేయాలి అనుకుంటున్నారు చాలామంది. అయితే ఎలాంటి ప్రత్యేకమైన వ్యాయామం లేకుండానే రోజువారీ పనుల ద్వారానే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునే విధానం ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. దానికి దోహదం చేస్తోంది నీట్.. నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థెర్మోజెనిసిస్(ఎన్ఇఎటి)అంటే మన శరీరం నిద్రపోవడం, తినడం లేదా ప్లాన్ చేసిన వ్యాయామం కాకుండా చేసే ప్రతి చిన్న చలనం ద్వారా ఖర్చయ్యే ఎనర్జీ.. దీనినే నీట్‌గా పేర్కొంటున్నారు. ఉదాహరణకు నడక, నిలబడటం, ఇల్లు శుభ్రపరచడం, పిల్లలతో ఆడుకోవడం వంటివాటి వల్ల వచ్చే శక్తి నీట్. సంక్షిప్తంగా చెప్పాలంటే..: జీవనశైలిలో చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడమే నీట్ పెరుగుదలకు ఆరోగ్య జీవనానికి దోహదం చేస్తుంది. శరీరం నుంచి ఎక్కువ కేలరీస్ ఖర్చయ్యేలా రోజువారీ పనులను నిర్వహించుకుంటూ నీట్‌ను సొంతం చేసుకునే వ్యక్తులకు మెరుగైన బాడీ కంపోజిషన్, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నీట్ టూ ఫిట్.. ఇలా.. రోజులో ఖర్చు చేసే మొత్తం కేలరీల సంఖ్య బాగా పెరిగి, బరువు నియంత్రణకు నీట్ దోహదం చేస్తుంది. ఇది సంతులితమైన ఎనర్జీ బ్యాలెన్స్‌కి దారితీస్తుంది. ముఖ్యంగా డెస్క్ జాబ్స్ చేస్తున్నవారికి ఇది ఒక ఆచరణీయ మార్గం. కొన్ని అధ్యయనాల ప్రకారం నీట్ ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. వ్యాయామం ఒక జీవనశైలిగా మారుతుంది. జిమ్‌కి వెళ్లకపోయినా ఈ తరహా జీవనశైలి వల్ల చురుకుదనం, ఆరోగ్యం సొంతం అవుతాయి. నీట్‌ను వెలుగులోకి తెచ్చినది ఈయనే.. ఈ కాన్సెప్ట్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ ఓబెసిటీ రీసెర్చర్ డా.జేమ్స్ లెవిన్ పరిచయం చేశారు. ఆయన తన మయో క్లినిక్‌లో పరిశోధనలు చేస్తూ ఈ పద్ధతి ద్వారా సాధ్యమయ్యే ఆరోగ్యలాభాలను వివరించారు. ఆయన పరిశోధనల ప్రకారం రోజూ చేసే చిన్న చిన్న కదలికలే (అంటే నడక, మెట్లు ఎక్కడం, కదులుతూ మాట్లాడటం వంటివి) చాలా ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తాయి. ఇవే మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రధాన మార్గాలుగా మారుతున్నాయి. ఈ కాన్సెప్ట్ ప్రస్తుతం అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాల్లో ప్రముఖంగా వినియోగంలో ఉంది. మన దేశంలోనూ బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా తమ రోజువారీ జీవనశైలి మార్చుకుంటూ నీట్‌ను, ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకుంటున్నారు.ఒక్క రోజులో 8 వేల నుంచి 10 వేల అడుగులు నడవడం కోసం.. వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా, ఫోన్ మాట్లాడాలన్నా దానిలో నడకను భాగం చేయడం. మీటింగ్స్‌ని వాక్ – టాక్‌గా మార్చడం జిమ్‌లో, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో స్టెప్ ఎరోబిక్స్ చేయనక్కర్లేదు. సింపుల్‌గా లిఫ్ట్‌కు గుడ్‌బై చెప్పి ఎలివేటర్ బదులుగా మెట్లు ఎక్కడం అన్ని ఫ్లోర్స్ కాకపోయినా రోజూ కనీసం 3 అంతస్తుల వరకూ మెట్లపై వెళ్లగలిగితే.. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంట్లో వార్తల కోసమో మరేదైనా కార్యక్రమం కోసమో టీవీ చూసేందుకు కుర్చీ, సోఫాలు కాకుండా సైక్లింగ్ చేస్తూనో, బాల్‌పై కూర్చునో చూడటం.. భోజనం తర్వాత కనీసం 10–15 నిమిషాలు నడవడం ఒకవేళ వెంటనే కూర్చుని పనిచేయాల్సి వస్తే దానికి బదులుగా నుంచోవడం..పని సమయంలో ప్రతి 30 నిమిషాలకు ఒక్కసారి లేచి కనీసం 2–3 నిమిషాలు నడక.. సినిమా చూస్తున్నా, మధ్యలో లేచి నుంచోవడం, లేదా అటూ ఇటూ నడవడం.ఇంటి ఫ్లోర్‌ను తుడవడం, గిన్నెలు కడగడం, తోట, వంట పనులు చేయడం.. ఇంట్లో పిల్లలు ఉంటే వారితో ఆడుకోవడానికి కొంత సమయం కేటాయించడం..వర్కవుట్ చేసినా ‘నీట్’గానే ఉండాలి మనం ఇంటి పనులను మనమే చేసుకుంటూ, మన వ్యక్తిగత కార్యకలాపాల్లోనూ కదలికల్ని భాగం చేస్తే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అది జిమ్‌కు ప్రత్యామ్నాయం కాకపోవచ్చు కానీ.. ఖచి్చతంగా మన ఆరోగ్యానికి ప్రయోజనకరమే. నేనైతే ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు తగ్గకుండా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తాను. అంతేగాకుండా చురుగ్గా ఉండడానికి నీట్ మీద ఆధారపడతాను. ఆస్పత్రిలో నేను ఎప్పుడూ లిఫ్ట్‌కి బదులుగా మెట్లనే వినియోగిస్తాను. విభిన్న విభాగాల మధ్య తిరగడంతో పాటు వీలున్నంతగా నడుస్తూనే ఉంటాను. రోజుకు కనీసం 3వేల నుంచి 10వేల అడుగుల వరకూ నడిచేలా చూస్తాను. – డా.ఎ.ప్రణతిరెడ్డి, క్లినికల్ డైరెక్టర్, బర్త్ రైట్ బై రెయిన్ బో హాస్పిటల్ ఆఫీసుల్లో ఉన్నప్పుడు టీ తేవడానికి లేదా ప్రింట్ అవుట్స్ తీసుకోవడానికి ఫ్యూన్స్తో కాకుండా çస్వయంగా నడిచి వెళ్లి తెచ్చుకోవడం.ఎక్కువ సేపు నిలబడాల్సి వచ్చినప్పుడు సులభమైన స్ట్రెచింగ్స్ చేస్తూ ఉండటం.. ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా కాలూ చేయీ కదుపుతూ ఉండటం. వాటర్ బాటిల్ తెచ్చి పక్కన పెట్టుకోకపోవడం వల్ల దాని కోసం తరచూ కాస్తంత దూరం నడవడం..ఈ చిన్న చిన్న మార్పు చేర్పులతో నీట్ పెంపు అనేది ఆరోగ్యానికి దోహదపడే ఒక సహజమైన, సులభమైన మార్గం. ఇది ప్రత్యేకంగా వ్యాయామానికి సమయం కేటాయించాల్సిన అవసరం లేకుండా, ఇలా నీట్‌ను పెంచుకుంటే అది మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడుతుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. -
Akhil-Zianab : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్
అక్కినేని కుటుంబం మొత్తానికి అఖిల్ అక్కినేని , జైనాబ్ రవ్జీ మూడు ముళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. గత ఏడాది నవంబరులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో(జూన్ 6న)వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అఖిల్ తల్లిదండ్రులు అక్కినేని నాగార్జున-అమల, సవతి సోదరుడు నాగ చైతన్య -శోభిత ధూళిపాళ దంపతులు దగ్గరుండి వీరి పెళ్లి వేడుకను వైభవంగా జరిపించారు. అఖిల్-జైనాబ్ వెడ్డింగ్ పిక్స్ నెట్టింట సందడిగా మారాయి. అలాగే వధువు జైనాబ్ చీర, నగలపై ఆసక్తి నెలకొంది.వధువు జైనాబ్ వజ్రాభరణాలతో అందంగా మెరిసిపోయింది. జైనాబ్ ముఖంలో ఐవరీ-గోల్డ్ చీర, జడలో మల్లె పూలతో పెళ్లి కళ ఉట్టి పడింది. అలాగే పెళ్లి ముస్తాబులో మొత్తం డైమండ్ నగలనే ఎంచుకోవడం స్పెషల్ ఎట్రాక్షన్. వజ్రాల ఆభరణాలతో తన బ్రైడల్ లుక్‌ను తీర్చిదిద్దుకుంది. రెడ్ రూబీ పొదిగిన డైమండ్ చోకర్ నెక్‌పీస్ అందంగా అమిరింది. దీంతోపాటు మ్యాచింగ్ చైన్, మూడు లేయర్ల డైమండ్ నెక్లెస్, మఠపట్టి, మ్యాచింగ్ ఝుమ్కాలు, ముక్కెర, వజ్రాల గాజులు, డైమండ్ వడ్డాణం ఇలా ప్రతీదీ డైమండ్స్‌తో తళుక్కున మెరిసింది. అటు కొత్త పెళ్లికొడుకు అఖిల్ కూడా శ్వేత వస్త్రాల్లో సింపుల్‌గా అందంగా కనిపించాడు. View this post on Instagram A post shared by Surya Singh (@suryasinghmakeup)జైనబ్‌తో తన రిలేషన్‌షిప్‌ను అఖిల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. రెండు ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఈ ఫోటోలు జైనబ్ డైమండ్ రింగ్‌ను కూడా మనం చూడవచ్చు. మొత్తానికి అక్కినేని నాగార్జున తన ఇద్దరి కొడుకులకు పెళ్లిళ్లు చేసి, తండ్రిగా తన బాధ్యతలను పూర్తి చేశాడు. -
ఎంబ్రాయిడరీ నగలు..! ఇట్టే కట్టిపడేసే ఫ్యాషన్ ట్రెండ్..
చెవులకు జూకాలు, మెడలో హారాలు చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలునడుముకు వడ్డాణాలు, వేళ్లకు ఉంగరాలు రంగులుగా, అల్లికలుగా..సంప్రదాయ కళ, ఆధునిక శైలి కలయికతో అభివృద్ధి చెందినవి ఎంబ్రాయిడరీ నగలు. సిల్క్ దారాలు, అద్దాలు, పూసలు, మెరిసే రాళ్లు, ప్యాచ్‌వర్క్‌తో రూపు కట్టిన ఈ నగలు అందరి చూపులను ఇట్టే కట్టడి చేస్తాయి. తేలికగా.. అందంగా!లైట్ వెయిట్: సాధారణ గోల్డ్/ సిల్వర్ జ్యూవెలరీలతో పోలిస్తే ఈ ఆభరణాలు చాలా తేలికగా ఉంటాయి. వీటిలోనూ నెక్లెస్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, మాంగ్ టిక్కా, రింగ్స్,... వివిధ రకాల మోడల్స్‌లో ఎంచుకోవచ్చు. కస్టమైజ్డ్ : డిజైన్, రంగులు, శైలి ఎవరికి వారు ఎలా కావాలంటే అలా మార్చుకోవడానికి వీలుంటుంది. డ్రెస్‌ని బట్టి మోడల్ని, కలర్స్‌ని ఎంపిక చేసుకోవచ్చు. వెరైటీ ఆఫ్ డిజైన్స్: మొఘల్, జర్దోసి, మిర్రర్ వర్క్, గుజరాతీ వర్క్... లాంటి అనేక శైలులను ఈ ఎంబ్రాయిడరీలో చూపవచ్చు. పూర్తి ఎకో–ఫ్రెండ్లీ: సహజమైన వస్తువులతో తయారవడం వల్ల పర్యావరణానికి ఏ మాత్రం హానికరం కాదు.వేడుకలకి అనుకూలం: సంప్రదాయ, ఇండో – వెస్ట్రన్ స్టైల్ డ్రెస్‌లకి ఇది సరైన ఎంపిక.సొంతంగా తయారీ!ఎంబ్రాయిడరీ హూప్‌ను కొనుగోలు చేసి, మల్టీ కలర్ దారాలు, ఫ్యాబ్రిక్ గ్లూతో నచ్చిన విధంగా తయారుచేసుకోవచ్చు. పర్యావరణహితమైన ఉత్పత్తులు కావడం, రీసైక్లింగ్ చేసే సదుపాయం కూడా ఈ ఆభరణాల తయారీలో చూపించవచ్చు.వేడుకకు తగిన ఆభరణంఉపయోగించే మెటీరియల్స్ని బట్టి ఆభరణం ఉంటుంది కాబట్టి వేడుకను బట్టి డిజైన్ని ఎంచుకోవచ్చు.సిల్వర్, జరీ దారాలతో జర్దోజి, మొఘల్ వర్క్‌ని గ్రాండ్‌గా తీర్చిదిద్దవచ్చు. ఈ ఎంబ్రాయిడరీ చేసిన ఆభరణాలను సంప్రదాయ వేడుకలలో లెహంగాలు, శారీలకు ఎంచుకోవచ్చు. కాథా అనే వర్క్ బెంగాలీ ఫోక్ ఎంబ్రాయిడరీ ఆర్ట్. రంగుల దారాలతో లైట్ వెయిట్ జ్యూవెలరీని రూపొదించవచ్చు. ఇవి ప్లెయిన్, ఇండోవెస్ట్రన్ డ్రెస్సులకు, కాటన్ చీరలకు బాగా నప్పుతాయి. గుజరాత్ కచ్ వర్క్, రాజస్థాన్ కళా శైలిని ప్రతిబింబించేలా పూలు, అద్దాలతో చేసిన ఎంబ్రాయిడరీ ఆభరణాలు సంప్రదాయ పండుగలు, ఆర్ట్ ఎగ్జిబిషన్లు, కాలేజీ ఫంక్షన్లు.. వంటి వాటిలో స్టైల్‌గా కనిపిస్తాయి. లేస్ మెటీరియల్‌తోనూ రంగు దారాలతో పూలు, ఆకులు కుట్టి, ఆభరణంగా ధరించవచ్చు. ఇవి ఎక్కువగా వెస్ట్రన్ డ్రెస్సులకు బాగా నప్పుతాయి -
మేకప్ ప్రొడక్ట్స్‌తో బికేర్‌ఫుల్..! పాపం ఆ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ..
మేకప్ వేసుకోవడం అంటే చాలామంది అతివలకు ఇష్టం. అదీగాక యూట్యూబ్‌ల పుణ్యమా అని ఎలా వేసుకోవాలో సులభంగా తెలుసుకుంటున్నారు. అయితే కొందరూ అత్యుత్సాహంతో సౌందర్య సాధనాలతో చేసేపనులు చివరికి విషాదాన్ని మిగుల్చుతున్నాయి. డెర్మటాలజిస్ట్‌లు సైతం మేకప్ ప్రొడక్ట్స్ ఏవి కూడా కంటికి, నోటికి తగలకూడదని హెచ్చరిస్తుంటారు. వాటిల్లో ఉపయోగించే కెమికల్స్ వల్ల ప్రాణాంతక సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని సూచిస్తుంటారు. కానీ చాలామంది వీటిని పెడచెవిన పెట్టేస్తారు. అలానే ఇక్కడొక బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ నిర్లక్ష్య ధోరణితో చేసిన పని ఆమె ప్రాణాలనే కోల్పయేలా చేసింది. వివరాల్లోకెళ్తే..సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే ఈ తైవాన్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ మేకప్ ముక్‌బాంగ్‌కు ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె మేకప్‌కి సంబంధించిన వీడియోలతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. సింపుల్ చిట్కాలతో చక్కగా మేకప్ వేసుకోవడం ఎలాగో చూపించడం తోపాటు..మధ్య మధ్యలో ఆ ప్రొడక్స్ టేస్ట్ చేస్తానంటూ కామెడీ చేసేది. ఒక్కోసారి నిజంగానే టేస్ట్ చేసి చూపించి నెటిజన్లలో ఉత్కంఠ రేపేది. ఆ క్రమంలోనే ఆమె యూట్యూబ్ వీడియోలకు మరింత క్రేజ్ పెరిగింది. ఈ అత్యుత్సాహమే ఆమె ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. బుగ్గలకు పూసుకునే ఫౌండేషన్ దగ్గరి నుంచి లిప్‌స్టిక్ వరకు అన్ని టేస్ట్ చేసి..ఇది మరింత భయంకరంగా ఉంది అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది ఈ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ . సోషల్ మీడియా స్టార్డమ్ కోసం చేసిస పనికి..పలు బ్రాండెడ్ కంపెనీ ఆమె వద్దకు క్యూ కట్టేవి. మంచి స్టార్డమ్ సంపాదించుకుంది గానీ ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఆ మేకప్ ఉత్పత్తులను టేస్ట్ చేయడమే శాపమై ప్రాణాలను చేజేతులారా కోల్పోయేలా చేసింది. జస్ట్ 24 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి ఆమెకు. ఐతే అధికారికంగా ఆమె మరణానికి గల కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. కానీ ఆమె ఆకస్మికంగా అనారోగ్యం బారినపడి చనిపోయినట్లు బాధితురాలి కుటుంబం ప్రకటించడం గమనార్హం. నిపుణుల వార్నింగ్..దయచేసి ఇలాంటి వీడియోలను ప్రోత్సహించొద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు నిపుణులు. మేకప్ ప్రొడక్ట్స్‌లో వాడే కెమికల్స్ సాధారణంగా అందరి శరీరాలకి సరిపడవు. అలాంటి వాటిని టేస్ట్ చేసే సాహసం అససలు చెయ్యొద్దని నొక్కి చెప్పారు. అంతేగాదు మేకప్ వేసుకోవడంలో ఎంత శ్రద్ధపెడతామో, తీసేటప్పుడూ కూడా అంతే కేర్‌ఫుల్‌గా ఉండాలన్నారు. అలాగే మేకప్‌తో అలానే అస్సలు పడుకోవద్దని..ఎంత ఆలస్యమైనా..దాన్ని పూర్తిగా తొలగించుకునే నిద్రపోవాలని తెలిపారు. View this post on Instagram A post shared by 芭樂水水 (@guava_beauty_) (చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్‌గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్‌లో సెంచరీ కొట్టాలంటే..) -
మిస్ యూనివర్స్ సన్నాహకం..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ సందడి ముగిసిందో లేదో మరో అంతర్జాతీయ గ్లామర్ వేదిక ‘మిస్ యూనివర్స్’ సందడి మొదలైంది. మిస్ యూనివర్స్ పోటీల్లో భాగంగా మంగళవారం నగరంలోని దస్పల్లా హోటల్ వేదికగా సాష్ నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు ఈ సాష్ ఈవెంట్లో తమ క్యాట్ వాక్‌తో అలరించారు. మిస్ యూనివర్స్ తెలంగాణ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ల కోసం పోటీదారులుగా ప్రతి రాష్ట్రం నుంచి 15 మంది ఎంపిక కాగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 30 మంది అలరించారు. అంతర్జాతీయ అందాల వేదికపై భారతీయ ప్రశస్తిని సగర్వంగా ప్రదర్శించేందుకు తెలుగు అమ్మాయిలు సన్నద్ధమవుతున్నారు, బ్యూటీ రంగంలో మన ప్రత్యేకతను చాటుకుంటున్నామని మిస్ యూనివర్స్ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ప్రసాద్ గారపాటి తెలిపారు. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించడానికి విభాగాల్లో తలపడనున్నామని మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ సునీత సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ ఆంటోనీ గుంజాల్వెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 7, 8 తేదీల్లో గ్రాండ్ ఫినాలే..రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కంటెస్టెంట్లకు ఈ నెల 6న మాదాపూర్‌లోని అరైవల్ హోటల్స్ వేదికగా మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. 7, 8 తేదీల్లో నగరంలోని ధారా రిసార్ట్ అండ్ కన్వెన్షన్‌లో గ్రాండ్ ఫినాలే నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తుంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా విజేతకు కిరీటం ధరింపజేస్తారు. రాష్ట్ర సమాచార–సాంకేతిక, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. -
రూ. 20 వేలతో ష్యాషన్ బ్రాండ్..కోట్ల టర్నోవర్ : దోస్తుల సక్సెస్ స్టోరీ
కొత్తగా ఏదైనా చేయాలనే కోరిక, వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకొని అందలాలను అధిరోహించాలనే పట్టుదల ఇద్దరు స్నేహితరాళ్లను వ్యాపారవేత్తలుగా మార్చింది. ఇది వారి కలలను సాకారం చేసుకోవడం వరకే పరిమితం కాలేదు. నేత వస్త్రాలను ప్రాచుర్యం, చేతివృత్తులవారికి ఆర్థిక స్వావలంబన, మహిళాలకు సాధికారతను తెచ్చి పెట్టింది. అలా మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన నిరుపమ సింగ్ శర్మ, అంజనా భమ్రా అనే ఇద్దరు స్నేహితులు అద్భుతాలు చేశారు. ఇంతకీ వీరేం సాధించారు తెలుసుకుందామా...!నిజానికి నిరుపమ సింగ్( Nirupama Sharma) అంజనా భమ్రా Anjana Bhamra) సక్సెస జర్నీ సుమారు పదేళ్ల క్రితం సాయంత్రం కాఫీ ఒక స్నేహితుడు అడిగిన సాయం వారిలో వ్యాపార ఆలోచనకు పునాది వేసింది. ఫ్యాషన్, ఫాబ్రిక్ పట్ల వారి జ్ఞానం ఆసక్తి సొంత ఫ్యాషన్ లేబుల్ కలిగి ఉండాలనే ఆలోచన వారి మనస్సులలో మొలకెత్తింది. అలా ‘ది సాఫ్రాన్ సాగా ’ పుట్టింది. భారతీయ కళా నైపుణ్యం, మహిళా సాధికారత, ఫ్యాషన్, పర్యావరణ అనుకూల డిజైనర్ దుస్తుల బ్రాండ్ ఇది. 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తితో దేశీయ హస్తకళను ప్రోత్సహిస్తుంది.చీరలు, సూట్లు, దుస్తులు, బ్లౌజులు , ట్రెండీ లాంజ్‌వేర్ వంటి ఉత్పత్తులను తయారుచేసి విక్రయిస్తున్నారు అంతేకాదు తమ బ్రాండ్‌ను జీరో-వేస్ట్‌గా మార్చడానికి ,మిగిలిపోయిన బట్టలను రీసైక్లింగ్ కూడా చేస్తారు. ఇదీ చదవండి : అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీ పురాతన హస్తనైపుణ్యానికి, ఆధునిక ట్రెండ్‌ను, సౌందర్యాన్ని జోడించి, పలురకాల ప్రింట్లు , రంగులతో అనేక ప్రయోగాలు చేస్తున్నాం అంటారు సాఫ్రాన్ సాగా వ్యవస్థాపకులు నిరుపమ సింగ్ శర్మ, అంజనా భమ్రా. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి, సితార, లినెన్, బాటిక్, బాగ్ బహార్, ఇంద్రధనుష్ వంటి గాలి ఆడేలా, లేత రంగు ఫాబ్రిక్ను ఎంచుకుంటామన్నారు. సీజన్‌కు తగినట్టు దుస్తులను తయారు చేస్తూ వినియోగదారుల ఆదరణను సొంతం చేసుకున్నారు.2015లో పదేళ్ల క్రితం కేవలం 20వేల రూపాయల పెట్టుబడితో 'ది సాఫ్రాన్ సాగా' అనే ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించారు. అదీ 40 ఏళ్ల వయసులో వ్యాపారం ప్రపంచంలోకి అడగుపెట్టారు. అంజనా ఒక హోటల్, సెలూన్, బోటిక్ నడిపేది. ఆమె స్నేహితురాలు నిరుపమ మార్కెటింగ్, కమ్యూనికేషన్లలో నిపుణురాలు. ఇలా వీళ్లిద్దరి కలయికలో రూపుదిద్దుకున్న ఈ బిజినెస్ టర్నోవర్ రూ. 1.5 కోట్లను దాటేసింది. అయితే వీరి సక్సెస్ జర్నీ అనుకున్నంత సులువుగా ఏమీ సాగలేదు. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ఒక సవాల్ అయితే, తమ బ్రాండ్‌ను జనాల్లోకి తీసుకెళ్లడం మరో సవాల్. ఒక దశలో ఈఎంఐలు కట్టడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సవాళ్లను ఇద్దరూ కలిసి మొక్కవోని దీక్షతో అధిగమించారు. దీనికోసం ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు కరిగి పోయాయి. మొదట్లో ఆశించినంత లాభాలు రాక, ఆదాయం రాకపోయినా నిరాశపడలేదు. ధైర్యంతో తమ బ్రాండ్‌ను విజయ తీరాలకు చేర్చారు. ఏదైనా సాధించాలనే పట్టుదల, కృషితో ముందుకు సాగి, సక్సెస్‌కు వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు. -
అందమైన అనుభవాలు.. అద్భుతమైన జ్ఞాపకాలు
2024లో మిస్ పోలోనియా కిరీటాన్ని గెలుచుకున్న మాజా క్లాజ్డా ఈ ఏడాది మిస్ వరల్డ్ ఫైనల్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. అందం, తెలివితేటలు, సమతుల్యతతో న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను ఆకర్షించింది. ఆమె బ్యూటీ విత్ ఎ పర్పస్ చొరవ, నేటి అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటైన పిల్లలు, యుక్తవయస్కుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. మానసిక అనారోగ్య నివారణ, భావోద్వేగ సంఘర్షణలపై దృష్టి సారించి, 40 కి పైగా వర్క్‌షాప్‌లను నిర్వహించింది. మానసిక శ్రేయస్సు గురించి యువత తమను తాము, తమతో ఉన్న వారిని ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ఈ వర్క్‌షాపులు ఉపకరిస్తున్నాయి. మనస్తత్వశాస్త్ర విద్యార్థిగా, మాజా టీనేజర్లతో వారి స్వంత భాషలో కనెక్ట్ అవుతుంది. సామాజిక బహిష్కరణ ప్రమాదంలో ఉన్న పిల్లలకు మద్దతు ఇచ్చే గ్రోయింగ్ అప్ జోన్ ఫౌండేషన్ కు చెందిన 12 ఏళ్ల బాలుడి కలను మాజా ఇటీవల నెరవేర్చింది. ఆమె అతన్ని బార్సిలోనాలో జరిగే లైవ్ మ్యాచ్‌కు హాజరు కావడానికి బార్సిలోనాకు తీసుకువెళ్లింది. అతని జీవితకాల కోరికను నెరవేర్చింది.సంతృప్తికరమైన అనుభవాలునేను పొందిన గొప్ప విజయాల్లో ఒకటి చిన్నచూపును అధిగమించడం. మొదట్లో న లుగురితో కలవాలంటే చాలా సిగ్గుపడేదాన్ని. దానిని దాటి ఈ దశకు వచ్చాను. ప్రజలతో కలిసి పోవడం, వారితో మాట్లాడుతూ ఉండటం అంటే నాకు ఇష్టం. కిరీటం దక్కక పోయినా అంతకు మించిన అనుభవాలు నాకు అద్భుతమైన జ్ఞాపకాన్ని ఇచ్చాయి. ఇక్కడి ఆతిథ్యం నాకు మా ఇంటిని గుర్తు చేసింది. ఇది నా రెండో కుటుంబంలా అనిపించింది. మెడికల్ టూరిజంలో భాగంగా ఏఐజీ హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు వారి ఆ΄్యాయత నన్ను ఆకట్టుకుంది. వారు ఎంతో బాధలో ఉండి కూడా చిరునవ్వుతో మాకు ఆహ్వానం పలికారు. ముచ్చటించారు. అది నా జీవితంలో మరచి పోలేను. ఇక్కడ ప్రతి ఒకరికి మరొకరితో ఉన్న కనెక్టివిటీ, రిలేషన్స్ చాలా బాగున్నాయి’’ అంటూ తెలంగాణలో మిస్ వరల్డ్ పాజెంట్ జరిగిన తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది మాజా క్లాజ్డా– నిర్మలారెడ్డి -
సమానత్వం.. సాధికారత సాధిస్తా!
హాసెట్ డెరెజె అడ్మస్సు రెండవ స్థానంలో నిలిచి మిస్ వరల్డ్ చరిత్రలో అత్యున్నత ర్యాంకింగ్ సాధించింది. ఇథియోపియా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ అందాలభామ, ఫస్ట్ రన్నర్–అప్‌గా , మిస్ వరల్డ్ ఆఫ్రికా టైటిల్‌ను గెలుచుకున్నారు. కెమికల్ ఇంజినీరింగ్ చేస్తున్న పంతొమ్మిదేళ్ల హాసెట్ దక్షిణాఫ్రికాలో జరిగిన మిస్ టీన్ ఇథియోపియా, కిందటేడాది మిస్ వరల్డ్ ఇథియోపియా పోటీలో విజేతగా నిలిచారు. ఇథియోపియాలోని మహిళల విద్య, ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆమె సమాజంలో సానుకూల మార్పులు తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ సమాజాలలో తల్లీబిడ్డల ఆరోగ్యం, బాలికల విద్యపై దృష్టి సారించిన ఆమె ‘‘బ్యూటీ విత్ ఎ పర్పస్’’ ప్రాజెక్ట్ న్యాయమూర్తులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది.నా పనే నా కిరీటంకిరీటం మరొకరికి వెళ్లచ్చు. కానీ, నా అంతర్గత అందం నేను చేసే పనిపైనే ఉంటుంది. అదే నాకు కిరీటం. స్థానికంగా, అంతర్జాతీయంగా ఆరోగ్య సమానత్వం, లింగ సాధికారత కోసం ఒక గొంతుకగా పనిచేస్తాను. ఈ పోటీలలో పాల్గొనడం ద్వారా భారతీయ సంప్రదాయ, సాంస్కృతిక పరిమళాన్ని అర్థం చేసుకున్నాను. ఆస్వాదించాను. ఈ ఫీలింగ్ చాలా సంతోషంగా ఉంది. ఓ పా గురించి చె ప్పాలంటే తను చాలా హార్డ్ వర్కర్. నేను తనకు చాలా పెద్ద అభిమానిని. తనకు కిరీటం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. తనలో భిన్నమైన క్వాలిటీస్ ఉన్నాయి. నిజానికి అందం అంటే అందరూ అనుకుంటున్నట్టు చర్మం, జుట్టు, గోళ్లు, డ్రెస్సింగ్.. ఇవి కావు. మన చుట్టూ ఉన్న సమాజం కోసం పనిచేయడమే. మా పేరెంట్స్ నా ఎదుగుదల కోసం ఎంతో కృషి చేశారు. నా ఈ విజయానికి నా కుటుంబ మద్దతు ఎంతో ఉంది.మానసిక ఆరోగ్యంపై అవగాహన కోసం...ఇథియోపియాలో మానసిక ఆరోగ్యంపై ప్రజలలో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాను. మాయా చారిటబుల్ ఆర్గనైజేషన్ కు అంబాసిడర్‌గా ఉంటూ ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నాను. మిస్ వరల్డ్ అనేది కేవలం అందానికి సంబంధించినది మాత్రమే కాదు. నా దేశం నుంచి ఈ స్థాయికి చేరిన తొలి ఇథియోపియన్ నేనే. మిస్ వరల్డ్ ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం, ఇది ప్రపంచవ్యాప్తంగా తల్లులు, వారి పిల్లల జీవితాలలోనూ స్ఫూర్తి నింపేది’’ అని చె ప్పారు. -
Opal Suchata: 72 ఏళ్ళ కల ఇది..! ఆ కాంక్షతోనే గెలిచా..
ఓపల్ సుచాతా.. మోడల్, థాయ్‌లాండ్.. తొలి మిస్ వరల్డ్... ఇప్పుడు 72వ మిస్ వరల్డ్! థాయ్‌లాండ్‌కి చెందిన ఆమె కేన్సర్ ఫ్రీ ప్రపంచం కోసం పాటుపడుతోంది! దానికో కారణం ఉంది. పదహారవ ఏట ఆమెకు బ్రెస్ట్ ట్యూమర్ సర్జరీ అయింది. అది తన జీవనోద్దేశాన్ని, లక్ష్యాన్నే మార్చింది అంటున్న ఓపెల్ సుచాతా గురించి మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే..‘‘నేను పుట్టి పెరిగింది థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో. మా ఊరూ హైదరాబాద్‌లాగే పర్ల్ సిటీ! హైస్కూల్ కోసం బ్యాంకాక్‌కి మూవ్ అయ్యాను. సైకాలజీ, ఆంత్రోపాలజీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్. ప్రస్తుతం నేను అంబాసిడర్ కావాలనే ధ్యేయంతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతున్నాను.. మా కుటుంబ విషయానికి వస్తే అమ్మ, పెద్దమ్మలు, అత్తలు .. అందరూ స్ట్రాంగ్ పర్సన్సే. ఒకరకంగా చెప్పాలంటే నేను స్ట్రాంగ్ విమెన్ మధ్యలో పెరిగాను. ఆ వాతావరణమే నాకు స్ఫూర్తి. ఆ స్ట్రెంతే నా పదహారవ ఏట బ్రెస్ట్‌లో డిటెక్ట్ అయిన ట్యూమర్‌తో ఫైట్ చేసేలా చేసింది. అది క్యాన్సర్ ట్యూమర్ కాదు. అయినా చాలా భయపడ్డాను. ఆ భయాన్నుంచి ఓ ఉద్దేశం కోసం ప్రయాణించేలా చేసింది నా చుట్టూ ఉన్న మహిళల స్ట్రెంతే! సర్జరీ తర్వాత ఈ హర్డిల్‌ని గనుక దాటగలిగితే నా జీవితాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాలకు అంకితం చేయాలనుకున్నాను. లక్కీగా దాటాను. దాంతో అనుకున్నట్టుగానే ‘ఓపల్ ఫర్ హర్’ప్రాజెక్ట్‌తో బ్రెస్ట్‌క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ను స్టార్ట్ చేశాను. మహిళా సాధికారతకూ పాటుపడుతున్నాను. ఈ బ్యూటీ పాజెంట్‌లో నేను పాల్గొనడానికి ప్రేరణ కూడా అదే. బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే రౌండ్‌తో ఈ మిస్ వరల్డ్ బ్యూటీ పాజెంట్ మన కథను ప్రపంచానికి వినిపించే అవకాశాన్ని కల్పిస్తోంది. అందుకే ఈ పాజెంట్‌లో పాల్గొన్నాను. నా కథను షేర్ చేసుకుని, నాప్రాజెక్ట్ ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలను వివరించి బ్రెస్ట్ క్యాన్సర్ మీద మహిళలకే కాదు జెండర్స్‌కి అతీతంగా అందరికీ అవగాహన కల్పించాలనుకున్నాను.తోటి కంటెస్టంట్లందరి ఆలోచనలూ పంచుకుంటానుమిస్ వరల్డ్ హోదాలో నేను ప్రపంచమంతా పర్యటించగలిగే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రపంచమంతటా నా ప్రాజెక్టుల గురించి చెప్పుకోగలను. అయితే నాకు నా తోటి కంటెస్టంట్లందరి ఆలోచనలూ,ప్రాజెక్టులూ కూడా చాలా నచ్చాయి. నాకు వీలున్నంతవరకు నేను అందరి ఆలోచనలూ,ప్రాజెక్టులనూ కూడా అన్ని వేదికలమీదా పంచుకుంటాను.క్రౌన్‌తో మా దేశానికి వెళుతున్నందుకు సంతోషంగా ఉందినా బ్యూటీ పాజెంట్ జర్నీ నా పద్దెనిమిదవ ఏట మొదలైంది. మొదటిసారి నేను గెలవలేదు. తర్వాత రెండేళ్లకు మళ్లీ నేషనల్ బ్యూటీ పాజెంట్‌లో పాల్గొన్నాను. గెలిచాను. మిస్ వరల్డ్‌కి ఎంపికయ్యాను. బ్యూటీ విత్ ఎ పర్పస్‌తో విన్ అయ్యి.. మిస్ వరల్డ్ క్రౌన్ తో మీ ముందుకు వచ్చాను. నిజానికి ఇది మా దేశం 72 ఏళ్లుగా కంటున్న కల. ఆ కల నా ద్వారా సాకారం అయినందుకు, నేను మిస్ వరల్డ్ క్రౌన్‌తో మా దేశానికి వెళ్లగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాజెంట్ నా లెర్నింగ్ అన్ లెర్నింగ్ప్రాసెస్కు ఓ వేదికైంది. భిన్నదేశాలు, విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన నా తోటి కంటెస్టెంట్స్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఎక్సే్చంజ్ ఆఫ్ వ్యూస్, ఒపీనియన్స్, నాలెడ్జ్ షేరింగ్‌తో కొత్త విషయాలను తెలుసుకోగలిగాను. నా ఆలోచనా తీరూ మారింది. నా పర్సెప్షన్ బ్రాడ్ అయింది.అన్నీ అద్భుతంతెలంగాణ రావడం ఇదే మొదటిసారి. ఇక్కడి మహిళలు చాలా వైబ్రెంట్‌గా ఉన్నారు. వాళ్ల కట్టుబొట్టు తీరు, ఇక్కడి ఫుడ్, కల్చర్, ఆతిథ్యం అన్నీ అద్భుతం. నేను జ్యూయలరీ ఫ్యాన్ ని. అందుకే నాకు హైదరాబాద్ బాగా నచ్చింది. ముత్యాలే కాదు సంప్రదాయ, ఫ్యాషన్ జ్యుయలరీకి ఫ్యూజన్ లా ఉందీప్రాంతం. నేను చూసిన ఈ అద్భుతాన్ని మా వాళ్లకు చెప్పాలనుకుంటున్నాను. అంతేకాదు, ఇక్కడ నన్ను ఇన్ స్పైర్ చేసిన కథలు చాలా ఉన్నాయి. వాటినీ మావాళ్లకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాటల కన్నా చేతలతోనే అవతలి వాళ్లకు ప్రేరణగా నిలవాలనుకుంటాను. మన పక్కనున్న వాళ్లకు ఓ భరోసాగా నిలవాలనుకుంటాను. నన్ను నేను అలా మలచుకోవడానికే ప్రయత్నిస్తాను’’ అని చెప్పింది ఈ మిస్ వరల్డ్.– సరస్వతి రమఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ -
నటి మడోన్నా సెబాస్టియన్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
చక్కని చిరునవ్వుతో మనసు గెలుచుకునే నటి మడోన్నా సెబాస్టియన్. తెరమీద కనిపిస్తే ఆ ఫ్రేమ్కే అందం తెచ్చిపెట్టగలిగేంత అందంగా ఉంటారు. అలా తెరమీదనే కాదు, తెరవెనుక కూడా కనులవిందుగా ఉంటుంది ఆమె స్టయిలింగ్. ఇందుకోసం ఆమె సెలెక్ట్ చేసుకున్న కొన్ని ఫ్యాషన్ బ్రాండ్సే ఇవి.చెవి దగ్గర మొదలై మెడ చుట్టూ తిరిగి జడలో ముగిసే అందమైన కథే చెంపసరాలు. ఇవి కేవలం ఆభరణాలే కాదు. జడలోకి దిగి వచ్చే పూల గొలుసులు. ఇవి పెట్టుకున్న అమ్మాయి ఎక్కడ కనిపించినా ఆ ఫ్రేమ్ మొత్తం అందంగా మెరిసిపోతుంది. చెంపసరాల ట్రెండ్ కొత్తేమీ కాదు. కాని, ఇప్పుడు వీటి ప్రెజెంటేషన్, స్టయిలిష్‌గా మారడంతో మళ్లీ వీటికి రీబర్త్ వచ్చింది. మోడర్న్ వన్ పీస్ డ్రెస్స్ల్లోకి కూడా అమ్మాయిలు స్టేట్మెంట్ లుక్‌గా వీటిని వేసుకుంటున్నారు. ముత్యాలు, కుందన్, రుబీ, టెంపుల్ ఇలా రకరకాల డిజైన్లలో లభించే చెంపసరాలను వేసుకుంటే, చుట్టూ ఉన్నవాళ్ల చూపులన్నీ మీ చెవులవైపు తిప్పేలా చేస్తాయి. చీర, లెహంగా, లాంగ్ ఫ్రాక్ డ్రెస్ ఏదైనా, వీటిని వేసుకోవడానికి కమ్మలను మాత్రం పెద్దవిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే, బోసిగా ఉంచిన మెడ, చెంపసరాలకు తగ్గట్టుగా ఉండే హెయిర్ స్టయిల్, సింపుల్ గాజులు ఇవన్నీ కలిస్తేనే అందం. అప్పుడే చెంపసరాలకు, వాటిని వేసుకున్న మీకు పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. అచ్చం నటి మడోన్నా లుక్‌లాగా.అందం అందులో ఉండదు..అందం అంతా క్రీమ్స్, మేకప్స్‌లో ఉండదు. మంచి స్కిన్ కేర్‌లోనే ఉంటుంది. ఆల్మండ్ ఆయిల్ మసాజ్, నేచురల్ ప్రాడక్ట్స్, హైడ్రేటింగ్ స్కిన్ కేరే నా బ్యూటీ సీక్రెట్. దుస్తుల్లో కూడా ‘ఇది నాకు నప్పుతుందా?’ అని కాకుండా ‘ఇది నేను కంఫర్ట్‌గా వాడతానా?’ అని ఆలోచించి సెలక్ట్ చేస్తానని చెబుతోంది మడోన్నా సెబాస్టియన్. -దీపిక కొండి(చదవండి: ఘనంగా ముగిసిన మిస్ వరల్డ్ అందాల పోటీలు) -
Miss World 2025: ఘనంగా ముగిసిన గ్రాండ్ ఫినాలే..
ప్రపంచ వేదికపై హైదరాబాద్ నగర ప్రశస్తి మరోసారి అత్యంత వైభవంగా మారుమోగింది. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. 108 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్న ఈ అందాల పోటీల్లో మిస్ థాయిలాండ్ ప్రపంచ సుందరిగా నిలిచింది. నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన భారీ వేదికపై కళ్లు చెదిరే హంగులతో లైటింగ్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఈ వేదిక పై భారతీయ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించిన నృత్య కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోడియంపై తెలుగు సెలబ్రిటీలు సందడి చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు క్యాట్ వాక్ చేసే పోడియం ప్యానెల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ రానా దగ్గుబాటి, మరో సినీతార నమ్రత శిరోద్కర్ ఆశీనులయ్యారు. ఇదే వరుసలో ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్, సామాజికవేత్త, మొట్టమొదటిసారిగా మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ విభాగానికి గ్లోబల్ అంబాసిడర్‌గా ఎన్నికైన తెలుగు మహిళ సుధారెడ్డి ఉన్నారు. మెగా హంగామా.. ఈ పోటీలను వీక్షించడానికి మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి వచ్చారు. ఈ మెగా వేదికపై ప్రముఖ సెలబ్రిటీ ఇషాన్ కట్టర్ చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ విశేషంగా అలరించింది. ఇందులో భాగంగా తను ఆస్కార్ విన్నింగ్ పాట నాటు నాటు సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేస్తుంటే.. చిరంజీవి సంతోషంగా చప్పట్లు కొట్టారు. స్టేజ్ పైన వదల బొమ్మాళీ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను ఉత్సాహపరిచిన సోనూసూద్ తెలుగు సినిమాలతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృతజ్ఞతలు తెలిపారు.ఆతిథ్యం అద్భుతం.. ఈ పోటీల నేపథ్యంలో తెలంగాణ అందించిన ఆతిథ్యం అద్భుతమని టాప్ 4లో నిలిచిన పోలండ్ కాంటెస్టెంట్ కొనియాడారు. ఇక్కడి మర్యాదలు ఆత్మీయత తనను కట్టిపడేశాయని.. భాగ్యనగరాన్ని తన రెండో ఇంటిగా అనుభూతి చెందానని సంతోషం వ్యక్తం చేశారు. ప్యానలిస్టుల్లో రానా, నమ్రత.. అంతే కాకుండా ఈ గ్రాండ్ ఫినాలేలో టాప్ 4 మార్టినిక్, ఇథియోఫియా, పోలెండ్, థాయిలాండ్ కాంటెస్టెంట్ లను చివరి ప్రశ్నలు అడిగిన నలుగురు ప్యానలిస్టుల్లో రానా, నమ్రత ఇద్దరూ తెలుగు వారే కావడం గమనార్హం. మరో రెండు ప్రశ్నలు అడిగిన ఇద్దరిలో సోనూ సూద్ కూడా హైదరాబాద్‌కు సుపరిచితుడే. ( చదవండి: ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా) -
నేడు ఫినాలే..బ్యూటీ కిరీటం ఎవరికి?
అందం అంటే ఆత్మవిశ్వాసం.. అందం అంటే ఓ సామాజిక బాధ్యత.. అందం అంటే సాధికారత.. అందం అంటే ఎమోషనల్ బ్యాలెన్స్, ఫిజికల్ ఫిట్నెస్.. అనే అందమైన నిర్వచనాలను స్థిరపరుస్తూ సాగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు ఈసారి హైదరాబాద్ వేదికైంది! ఈ పోటీలు ఫైనల్‌కి వచ్చాయి. మిస్ వరల్డ్ కిరీటం ఎవరికి దక్కనుందో తేలేది నేడే! నూటఎనిమిది దేశాలకు చెందిన సుందరీమణులు పోటీ పడుతున్న ఆ బ్యూటీ పాజెంట్ ఫైనల్ ఎలా ఉండబోతోంది, మిస్ వరల్డ్‌గా ఎంపికైన సుందరి ఏడాదంతా ఏం చేస్తుంది లాంటివి ఆసక్తిని రేకెత్తిస్తాయి.హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో సాయంత్రం ఆరున్నరకు మొదలవనున్న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే వేడుకను మిస్ వరల్డ్ 2016 స్టెఫనీ డెల్ బాయే ( Stephanie del valle), యాంకర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ సచిన్ కుంభార్.. ఇద్దరూ కలిసి హోస్ట్ చేస్తున్నారు.ఎంపిక ఇలా.. ముందుగా 108 దేశాల సుందరీమణులు వేదిక మీదికి వస్తారు. అమెరికా– కరిబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా– ఓషియానియాల నుంచి ఖండానికి పది మంది చొప్పున మొత్తం నలభై మందిని క్వార్టర్ ఫైనల్కిసెలెక్ట్ చేస్తారు. అయితే ఇప్పటికే రకరకాల పోటీల్లో ఈ నాలుగు ఖండాల నుంచి పద్దెనిమిది మంది క్వార్టర్ ఫైనల్‌కి చేరుకున్నారు. మిగిలినవారిని పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ చేసిన జ్యూరీ ఈ రోజు వాళ్ల పేర్లను ప్రకటించి వేదిక మీదికి ఆహ్వానిస్తుంది. ఈ నలభై మందిలోంచి ప్రతి ఖండానికి టాప్ ఫైవ్ చొప్పున, మళ్లీ అందులోంచి ప్రతి ఖండానికి టాప్ 2 లెక్కన సెలెక్ట్ చేస్తారు.ఫైనల్‌గా.. ఫైనల్రౌండ్ వచ్చేసరికి మొత్తం నలుగురు మాత్రమే మిగులుతారు. ఈ నలుగురిని జ్యూరీ ఓ ప్రశ్న అడుగుతుంది. ఆ జవాబును బట్టి మిస్ వరల్డ్‌ను ఎంపిక చేస్తారు. విజేతకు కిందటేడు మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా అందాల కిరీటాన్ని తొడుగుతుంది. జ్యూరీలో నటుడు సోనూ సూద్, సుధారెడ్డి, మిస్ ఇంగ్లండ్ 2014 డాక్టర్ కెరీనా టరెల్, మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మోర్లే సభ్యులుగా ఉంటారు.గెలిచిన తర్వాత.. మిస్ వరల్డ్ టైటిల్ విజేత తన దేశం తరపున ప్రపంచవ్యాప్త సాంస్కృతిక కార్యక్రమాలు, అధికారిక వేడుకలు, సంబరాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పలు చారిటీ ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్‌లో పాల్గొంటుంది. మిస్ వరల్డ్ సంస్థ తరపున ప్రపంచ యాత్ర చేస్తూ ఆ సంస్థ లక్ష్యాలను ప్రచారం చేస్తుంది. అక్షరాస్యత, పలు సామాజిక అంశాల అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటుంది.ఇంకా... → మిస్ వరల్డ్ విజేతకు తొడిగే అందాల కిరీటం ధర రూ. 85 లక్షల పైచిలుకే! 18 క్యారట్ల గోల్డ్‌తో చేసిన ఆ కిరీటం మధ్యలో 62. 83 క్యారట్ల డైమండ్ చుట్టూ 1770 చిన్న చిన్న డైమండ్స్ ΄÷దిగి ఉంటాయి. వాటన్నిటి బరువు 175.49 క్యారట్లుంటాయి. దీన్ని ఆ విజేత ముఖ్యమైన ఈవెంట్స్‌లో మాత్రమే ధరిస్తుంది. ప్రపంచ యాత్రలో అసలైన కిరీటాన్ని పెట్టుకోదు. మిస్ వరల్డ్ విజయానికి చిహ్నంగా విజేతకు రెప్లికా క్రౌన్‌ను ఇస్తారు. అసలు కిరీటం మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ దగ్గరే ఉంటుంది. ఈ పోటీలకు వయోపరిమితి 17 ఏళ్ల నుంచి 27 ఏళ్లు. → టర్మ్ అవకముందే మిస్ వరల్డ్ హోదాకు రాజీనామా చేసిన తొలి మిస్ వరల్డ్ 1974 సంవత్సర విజేత హెలెన్ మోర్గన్. టైటిల్ గెలిచిన నాలుగు రోజులకు ఆమె ఏడాదిన్నర బిడ్డకు తల్లి అని తెలిసిందట. మిస్ వరల్డ్ పోటీల్లో అవివాహితలు మాత్రమే పాల్గొనాలనే నియమాన్ని ఉల్లంఘించినందువల్ల ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. → అమెరికా – వియత్నాం యుద్ధంలో అప్పటి మన ప్రభుత్వం వియత్నాం పక్షాన నిలబడింది. దీనికి విరుద్ధంగా మన తొలి మిస్ట్ వరల్డ్ రీటా ఫారియా అమెరికన్ ఎంటర్టైనర్ బాబ్ హోప్‌తో కలిసి అమెరికా సైనికులను ఎంటర్టైన్ చేసిందని ఆమె చర్య పట్ల అప్పుడు మన ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. → మిస్ వరల్డ్ పోటీలు మొదలైన నాటి (1951) నుంచి ఈరోజు దాకా మన దేశం ఆరుసార్లు కిరీటాన్ని గెలిచి రికార్డ్ సృష్టించింది. → విజేతల్లో ఐశ్వర్యా రాయ్‌ను మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ మిస్ వరల్డ్‌గా చెబుతుంటారు. → ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటనలకు నో చెప్పిన తొలి మిస్ వరల్డ్‌గా డయానా హెడెన్ (మిస్ వరల్డ్ 1997)ను ప్రస్తావిస్తారు. ‘నా ఒంటి రంగు పట్ల నాకెలాంటి రిగ్రెట్స్ లేవు. ఛాయ తక్కువగా ఉండటాన్ని నేను ఆత్మన్యూనతగా ఎప్పుడూ భావించలేదు. ఆ స్కిన్టోన్తోనే నేను మిస్ వరల్డ్‌గా గెలిచాను. నా దృష్టిలో ఆత్మవిశ్వాసమే అసలైన అందం. కాబట్టి దాన్నే ప్రమోట్ చేస్తాను ఫెయిర్‌నెస్ క్రీమ్స్‌ని కాదు’ అని చెప్పింది డయానా. → అందాల పోటీల్లో చమత్కారం, సునిశిత దృష్టి గల జవాబులకు ప్రియాంక చోప్రాపెట్టింది పేరుగా ఖ్యాతినార్జించింది. – సరస్వతి రమఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
Miss world 2025 పెరిగిన ఇమేజ్!
హైదరాబాద్ ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా మారడంతో తెలంగాణ ఇమేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఏప్రిల్ నెలలో పెట్టు బడులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ‘భారత్ సమ్మిట్’ను రాష్ట్ర ప్రభుత్వం హైదరా బాదులో ఘనంగా నిర్వహించింది. దాదాపు వంద దేశాల నుంచి 400మంది పైగా ప్రతి నిధులు హాజరయ్యారు. తెలంగాణను ప్రత్యక్షంగా చూసిన వీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ‘మిస్ వరల్డ్’ పోటీలో పాల్గొంటున్నసుందరీమణులు తెలంగాణ సంస్కృతి, సంప్రదా యాలను తెలుసుకునేందుకు ‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే నినాదంతో నిర్వహించిన ప్రపంచసుందరీమణుల పర్యటన కార్యక్రమం మనరాష్ట్రం ఓ పెద్ద ప్రపంచ పర్యాటక కేంద్రంగా అవతరించేందుకు వీలు కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో సుందరీమణుల ఆట పాటలు, పర్యటన విశేషాల ప్రత్యక్ష ప్రసారం... ఆ యా దేశాల పర్యా టకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇదీ చదవండి: గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్ భర్తలందరూ డ్రైవర్లేగా!మిస్ వరల్డ్ పోటీలు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను హైలైట్ చేయడమే కాక స్థానిక ఉత్పత్తులకు మంచి ప్రచారం కలించాయి. స్పెయిన్‌కు చెందిన కీమో ఫార్మా వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరా బాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తి చూపడం ఈ సందర్భంగా గమనార్హం. పోటీల సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాలు, హస్తకళలకు సంబంధించిన ఉత్పత్తుల వాడకం... స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్‌ను ఏర్పరచడానికి దోహదం చేస్తుంది. చదవండి: Tripuranthakam భూలోక కైలాస క్షేత్రం త్రిపురాంతకేశ్వరాలయం– జి. లక్ష్మణ్ కుమార్ సమాచార–పౌరసంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, కరీంనగర్ -
Miss World 2025: విశ్వ వేదికపై.. నాటు పాట..
అంతర్జాతీయంగా ప్రపంచ సుందరి పోటీలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు మిస్ వరల్డ్‌గా భారతీయులు కిరీటం గెలిస్తే గొప్పగా కీర్తించుకున్నాం.. కానీ గతేడాది 71వ మిస్ వరల్డ్ ముంబైలో, ఈ సారి 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ (హైదరాబాద్)లో నిర్వహించడంతో ఇండియా విశిష్టత విశ్వవ్యాప్తమైంది. అయితే ఈ సారి నగరంలో జరుగుతున్న పోటీల నేపథ్యంలో హైదరాబాద్‌కు మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు తెలుగు పాటలు సైతం వైరల్‌గా మారాయి. ఏ దేశంలో ఈ పోటీలు జరిగినా ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు రావడం సహజమే. అయితే వినూత్నంగా ఈ సారి తెలుగు పాటలు వైరల్‌గా మారాయి. దీనికి కారణం.. ఈ సారి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలుగు పాటలకు అభిమానులుగా మారడం చెప్పుకోవాల్సిన విషయం. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు బసచేస్తున్న ట్రైడెంట్ హోటల్ వేదికగా మిస్ నైజీరియా పాడిన ‘రానూ.. బొంబైకి రానూ’ అనే పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో జానపద సాహిత్యంతో రూపొందించిన ప్రైవేట్ సాంగ్ రాను బొంబైకి రాను..!! తెలంగాణతో పాటు దక్షినాది వరకూ ఫేమస్ కావడం ఓకే.. కానీ ఏకంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఈ పాటను పాడటం, దీనికి స్టెప్పులేయం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ పాట వైరల్ అవ్వడమో లేదా మిస్ నైజీరియాకు తెగ నచ్చేసిందో తెలియదు కానీ.. మిస్ వరల్డ్ పోటీల్లో ముఖ్యమైన టాలెంట్ రౌండ్లోనూ ఈ ముద్దుగుమ్మ ఇదే పాటకు డ్యాన్స్ వేశారు. వినూత్నంగా ఇండో ఆఫ్రికన్ డ్యాన్స్ అంటూ ఈ తెలుగు పాట, తమ దేశానికి చెందిన పాటలతో తన టాలెంట్ రౌండ్‌ను ప్రదర్శించారు. ఐతే ఇదే రౌండ్ చివరలో 20 దేశాలకు చెందిన టాలెంట్ రౌండ్ ఫైనలిస్టులు మళ్లీ ఇదే పాటకు స్టెప్పులేయడం మరోసారి వైరల్‌గా మారింది. ఇందులో మిస్ ఇండియా నందినీ గుప్తా అదిరిపోయే స్టెప్పులేశారు.. మార్ఫా స్పెషల్.. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో మిస్ తారలతో నగరంలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ‘హెరిటేజ్ వాక్’ నిర్వహించిన విషయం విధితమే. ఐతే ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన మార్ఫా సంగీతానికి ఈ సుందరీమణులు డ్యాన్స్ వేసి సందడి చేశారు. ఈ వీడియోలు తమ సోషల్ మీడియా యాప్స్‌లో పోస్ట్ చేయగా ప్రపంచవ్యాప్తంగా తిలకించారు.కుర్చీ మడత పెట్టి.. అందరూ తెలుగు పాటలతో అదరగొడితే.. మిస్ ఇండియా నందినీ గుప్తా మాత్రం సూపర్ స్టార్ మహేష్‌బాబు ‘కుర్చీ మడత పెట్టి...’ అనే డైలాగ్ కం పాటతో తన ప్రత్యేకతను చాటుకున్నారు.ఎలా ఉన్నారూ..?? మరో కార్యక్రమంలో భాగంగా ఈ ముద్దుగుమ్మలంతా తెలంగాణ వారసత్వ వైభవాన్ని, విశిష్టతను తిలకించడానికి వరంగల్ వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిస్ కెనడా.. తెలుగులో ‘నమస్తే.. ఎలా ఉన్నారు’ అని సందడి చేయగా, మిస్ యూఎస్ఏ.. ‘అందరూ బాగున్నారా’ అంటూ పలకరించారు. మిస్ అర్జెంటీనా ఐతే పాన్ ఇండియా ఫేమస్ తెలుగు డైలాగ్ ‘తగ్గేదే లే’ అంటూ అలరించారు. ఈ అందాల తారల నోటి వెంట ముచ్చటగొలిపే ఈ మాటలు సైతం యూట్యూబ్‌లో, సోషల్ యాప్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.బాలీవుడ్ స్వరాలు సైతం.. ఇవే కాకుండా జిలేబి బేబీ, ఓం శాంతి ఓం, ధూమచాలే వంటి బాలీవుడ్ ఇండియన్ బాలీవుడ్ పాటలతోనూ పలువురు మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు.తీన్మార్.. నగరంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ ప్రపంచ సుందరీమణులతో నిర్వహించిన స్పోర్ట్ ఈవెంట్లో కూడా తెలుగు పాటలకు, తీన్మార్ బ్యాండ్‌కు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. హోర్ట్ ఆఫ్ గోల్డ్ పేరుతో ట్రైడెంట్ హోటల్లో నిర్వహించిన సేవా కార్యక్రమంలో సైతం అనాథ చిన్నారులను ఉత్సాహపరచడానికి తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకొచ్చిన నాటు నాటు పాటతో పాటు డీజే టిల్లూ, ఇడియట్, అద్దాలా మేడలున్నవే అనే తెలుగు పాటలకు డ్యాన్సులు చేసి మరో సారి తెలుగు సంగీతాన్ని, సాహిత్యాన్ని ఆస్వాదించారు.అందాల బొమ్మ నోట.. బుట్టబొమ్మా పాట..మిస్ వరల్డ్ కంటెస్టెంట్, మిస్ జర్మనీ సైతం మరో తెలుగు పాటతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందాలొలికే ఈ ముద్దుగుమ్మ క్యూట్ క్యూట్ వాయిస్‌తో బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా నను చుట్టూకుంటివే అనే అల్లూ అర్జున్ టాప్ హిట్ సాంగ్ పాడి అందరి మనసులూ దోచుకున్నారు. ఈ పాటకు అనుగుణంగా స్టెప్పులేస్తూ చేసిన వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అంతేకాకుండా చుమ్కా కీరా హోయ్ అనే మరో బాలీవుడ్ పాటను సైతం పాడారు. (చదవండి: Miss World 2025: నందిని గెలిస్తే..నంబర్ వన్ మనమే..! అత్యధిక టైటిల్స్ గెలిచిన ఏకైక దేశంగా..) -
ఫ్యాషన్‌కి సరికొత్త అర్థం..! 'సంస్కృత శ్లోకాల సంస్కృతి'..
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు సంస్కృత పదాల ప్రింట్లు ఉన్న కండువాలు, దుపట్టాలు వంటివాటిని ధరించడం చూస్తుంటాం. అయితే ఇటీవల అంతర్జాతీయ వేదికలపైనా ఆడంబరంగా జరిగే వేడుకలలోనూసంస్కృత శ్లోకాల ఎంబ్రాయిడరీ, ప్రింట్లతో డిజైన్ చేసిన దుస్తులు ధరించి లోతైన భారతీయ ఆత్మను సరికొత్తగా పరిచయం చేస్తున్నారు. ఆధునిక ఆలోచనలకు సంప్రదాయాన్ని జోడించిఫ్యాషన్ రంగంలో హుందాతనాన్నీ చాటుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్గొనేవారు వీటిని ఎంచుకుంటున్నారు.కాన్స్‌లో.. సంస్కృత శ్లోకంఇటీవల కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్–2025లో నటి ఐశ్వర్యారాయ్ అద్భుతమైన బ్రొకేడ్ సిల్వర్ కేప్, బ్లాక్ గౌన్ ధరించి అంతర్జాతీయంగా అభిమానులను ఆకట్టుకున్నారు. భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన ఆ గౌను కేప్పైన భగవద్గీత శ్లోకాన్ని ఎంబ్రాయిడరీ చేశారు. ‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనా. అంటే–కర్మలను చేసే హక్కు మీకు ఉంటుంది. కానీ, ఆ కర్మల ఫలాలకు కాదు’ అని అర్థం వచ్చేలా ఫ్యాషన్, ఆధ్యాత్మికత– ఈ రెండింటి కలబోతను ఐశ్వర్య తన దుస్తుల ద్వారా ప్రకటించింది. కాన్స్ డ్రెస్ కోడ్ ప్రకారం బనారసి వెండి కేప్ ఐశ్వర్య లుక్‌ను ఆకర్షణీయంగా మార్చింది. వెండి, బంగారు, నలుపు రంగులతో కూడిన ఈ డ్రెస్‌తో విశ్వపు అందాన్ని వేదికపైన చిత్రీకరించి, రాణిలా వెలిగిపోయింది ఐష్.వెడ్డింగ్ లెహంగాపైనఇషా అంబానీ తన సోదరుడి వివాహ సమయంలో ధరించిన సంప్రదాయ లెహంగా అందరినీ అమితంగా ఆకట్టుకుంది. డిజైనర్లు అబుజాని, సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన ఆ లెహంగాపైన భగవద్గీత శ్లోకాలను ఎంబ్రాయిడరీతో డిజైన్ చేశారు. గౌరీ పూజలో పాల్గొనడానికి ఆమె ఈ సంస్కృత శ్లోకాలతో డిజైన్ చేసిన లెహంగాను ధరించింది.అక్షరాల మాలఫ్యాబ్రిక్ పైన క్లిష్టమైన డిజైన్లుగా సంస్కృత శ్లోకాలు ప్రాచుర్యం పొదడంతో డిజైనర్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. దీంతో సంస్కృత శ్లోకాలు, ప్రాంతీయ భాషలో ఉన్న అక్షరాల ప్రింట్లు సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నింపుకుంటున్నాయి. భగవద్గీత వంటి గ్రంథాల నుండి ఈ శ్లోకాలను తరచుగా చీరలు, లెహంగాలు, కుర్తీలు, దుపట్టాలు వంటి క్లాత్స్‌పై ముద్రించడం, ఎంబ్రాయిడరీ చేయడం, నేత నేయడం చేస్తున్నారు. ఈ ధోరణి మహిళలు తమ దుస్తుల ద్వారా వారి సాంస్కృతిక గుర్తింపును, వారసత్వాన్ని వ్యక్తపరిచే వీలు కల్పిస్తోంది.కలెక్షన్ థీమ్ధ్యాన, యోగ కలెక్షన్లో ‘ఓం నమః శివాయ, యోగ కర్మస్య కోశలం, సర్వ భవంతు సుఖినః శాంతిః భవంతుః శాంతిః ... వంటి శ్లోకాలతో మోడ్రన్ ట్రెడిషనల్ వేర్ రూపుదిద్దుకుంటోంది.రాజస సంస్కృతంమహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాల నుండి శ్లోకాలతో గౌన్లు, షేర్వాణీలను అలంకరిస్తున్నారు. బ్లాక్ కాటన్ లేదా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద బంగారు రంగులో సంస్కృత అక్షరాలను ఎంబ్రాయిడరీ లేదా ప్రింట్స్‌గా వేస్తున్నారు.బోర్డర్ డిజైన్లు, ప్రింటింగ్ టెక్నిక్లుసంస్కృత శ్లోకాలను చీరలు లేదా దుపట్టాల అంచులపై ముద్రిస్తున్నారు. వీటిలో జెపూర్ స్టయిల్ బ్లాక్ ప్రింట్స్‌ని ఉపయోగిస్తున్నారు. (చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్‌పై ప్రశంసలు) -
Miss World 2025: నందిని గెలిస్తే..నంబర్ వన్ మనమే..!
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో కీలక ఘట్టాలకు తెరలేచింది. మరో వారం రోజుల్లో ప్రపంచ సుందరి ఎవరో తేలనుంది. నగరంలో తొలిసారి జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఈ సారి భారతీయ సుందరి నందిని గుప్తా గెలిస్తే.. అది మరో కిరీటాన్ని భారత్‌కు అందించడం మాత్రమే కాదు అత్యధిక టైటిల్స్ గెలుచుకున్న దేశం అనే రికార్డ్‌ని కూడా అందిస్తుంది. ప్రస్తుతం నెం.1 స్థానంలో ఉన్నా.. మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైన 15ఏళ్ల తర్వాత తొలిసారిగా మన దేశం నుంచి 1966లో రీటా ఫరియా టైటిల్ గెలిచారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యారాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ఈ టైటిల్స్‌ను సాధించి దేశాన్ని అగ్రస్థానంలో నిలిపారు. అదే విధంగా వెనిజులా 1955, 1981, 1984, 1991, 1995, 2011లలో ప్రపంచ సుందరి కిరీటాల్ని దక్కించుకుంది. తద్వారా ఇండియా, వెనిజులా – రెండూ సమానంగా 6 టైటిల్స్ గెలుచుకుని నెంబర్ వన్ స్థానాన్ని పంచుకుంటున్నాయి. మన తర్వాత యునైటెడ్ కింగ్డమ్ (యుకె) 5 టైటిల్స్, జమైకా, ఐస్లాండ్ – రెండూ చెరో 3 టైటిల్స్ గెలుచుకున్నాయి.నగరంపై నజర్ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్లామర్ ప్రపంచం దృష్టి మొత్తం నందిని గుప్తాపైనా, హైదరాబాద్ నగరంపైనే ఉంది. ఈ దఫా టైటిల్‌ను నందిని గెలిస్తే అది భారత్‌ను ప్రపంచ సుందరి పోటీల్లో నెం.1 స్థానానికి చేరుస్తుంది. కాబట్టి ఆ ఘనత నగరం వేదికగా సాకారం కావాలని గ్లామర్ రంగ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. (చదవండి: అమెరికా వేదికపై మెరిసిన తెలుగు అందం..! ఎవరీ చూర్ణికా ప్రియ..?) -
ఫుల్స్టాప్ ఉండకూడదు
72వ మిస్ వరల్డ్ కాంటెస్ట్‌కు హాజరైన మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా బుధవారం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో బ్యూటీ విత్ ఎ పర్పస్ చారిటీ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టినా యువతకు స్ఫూర్తినిచ్చేలా మాట్లాడారు.కిందటేడాది మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న క్రిస్టినా బ్యూటీ విత్ ఎ పర్పస్ అంబాసిడర్‌గా ప్రపంచమంతా పర్యటించింది. క్రిస్టినా పిస్కోవా ఫౌండేషన్ స్థాపించి దానిద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు చదువు దూరం కాకూడదన్న సంకల్పంతో టాంజానియాలో స్కూల్‌ను ప్రారంభించింది. సోంటా ఫౌండేషన్ ద్వారా చెక్ రిపబ్లిక్‌లోని వికలాంగులకు మద్దతు ఇస్తుంది. చెక్ రిపబ్లిక్ దేశంలోని ట్రినెక్ నగరంలో పుట్టింది క్రిస్టినా. ఆ తర్వాత వారి కుటుంబం దేశ రాజధాని ప్రాగ్లో స్థిరపడింది. న్యాయశాస్త్రంలో, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన క్రిస్టినా మోడలింగ్‌పై ఆసక్తి ఉండటంతో అటుగా అడుగులు వేసింది. స్థానిక భాషతోపాటు ఇంగ్లిష్, పోలిష్, స్లోవాక్, జర్మనీ భాషల్లో ప్రావీణ్యం సాధించింది. లండన్‌లోని ఎలైట్ మోడల్ మేనేజ్మెంట్లో చేరి, అందాల పోటీలో పాల్గొనడానికి శిక్షణ తీసుకుంది. మిస్ చెక్ రిపబ్లిక్ పోటీల్లో పాల్గొని, తొలిప్రయత్నంలోనే కిరీటం దక్కించుకుంది.సాధించగలం అనే నమ్మకంమ్యూజిక్, ఫ్యాషన్, ఆర్ట్ అంటే ఇష్టపడే క్రిస్టినా తన సక్సెస్ గురించి వివరిస్తూ –‘‘జీవితంలో పుల్‌స్టాప్ అనేది ఎప్పుడూ ఉండకూడదు. అన్నీ కామాలే ఉంచాలి. నేను మ్యూజిక్ నేర్చుకున్నా, ఆర్ట్ ఫామ్స్ నేర్చుకున్నా, మోడలింగ్ చేసినా... ఏ లక్ష్యం కోసం పనిచేసినా దానికి సంబంధించి సమస్యలు, ఒత్తిళ్లు వస్తూనే ఉండేవి. ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కొన్నాను. నేను ఈ స్టేజీకి రావడం వెనకాల పెద్ద పోరాటమే చేశాను. కానీ, కలలను సాధించే క్రమంలో చేసే ప్రయత్నాలు, ఆ తర్వాత పొందిన ఫలితాలతో చాలా ఆనందాన్ని పొందాను. మార్పు అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. ఏడాది పొడవునా శ్రమిస్తూనే ఉండాలి. ఏ లక్ష్యం కోసం పాటుపడుతున్నామో దానిని వదిలిపెట్టకూడదు. ఇతర భాషౖలపెనా పట్టు సాధించాలి.మంచి మార్పుకు ఉదాహరణగా! అందాల పోటీ అత్యుత్తమమైనది. ప్రపంచవ్యాప్తం గా అవసరంలో ఉన్న పిల్లలకు ఆశను, ఆనందాన్ని కలిగించే శక్తిని ఇస్తుంది. ఇది ఎంత ఛాలెంజింగో అంత పెద్ద బాధ్యత కూడా. మంచి మార్పుకు ఉదాహరణగా, ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా, ముఖ్యమైన అంశాలపై అవగాహన తీసుకువచ్చేలా ఉండాలి. ఏదైనా సాధించాలంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి.మరచిపోలేని అద్భుతంతెలంగాణలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో పాటు ఉత్సాహభరితమైన సంస్కృతి ఎంతో ఆకట్టుకుంది. యాదగిరిగుట్ట టెంపుల్ ఆర్కిటెక్చర్, రాజరికపు వారసత్వానికి ఆభరణంగా నిలిచిన చౌమహల్లా ΄్యాలెస్, తెలంగాణ వంటకాలు, ఇక్కడి సంప్రదాయం.. ఇదంతా ఒక అద్భుత ప్రయాణంగా మారిపోయింది. విక్టోరియా మెమోరియల్ హోమ్‌ను సందర్శించి లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించాం. ముఖ్యంగా పిల్లలతో సమయం గడపడం, వారి కథలు వినడంతో వారితో కలిసి ఆనంద క్షణాలను పంచుకున్నాం’’ అని తెలిపారు క్రిస్టినా. – నిర్మలారెడ్డి ఫొటోల: ఎస్. ఎస్. ఠాకూర్ -
‘ఎర్ర’ గౌనులో దీపికా రాయల్ లుక్ : స్పిరిట్‌పై ఫ్యాన్ కామెంట్ వైరల్
ప్రముఖ దర్శకుడు సందీప్‌రెడ్డి, ‘స్పిరిట్’ మూవీ, బాలీవుడ్ స్టార్హీరోయిన్ దీపికా పదుకొణే మధ్య నడుస్తున్న వివాదం నేపథ్యంలో దీపికా పదుకొనే ఇన్‌స్టా లుక్ వైరల్‌గా మారింది. బ్రైట్ రెడ్ డ్రెస్‌లో దీపికా ఆశ్చర్యపరిచింది. డైమండ్ ఆభరణాలతో స్పెషల్ లుక్‌లో అదరగొట్టేసింది. దీంతో అభిమానులు కామెంట్స్ వైరల్‌గా మారాయి.ప్రపంచ లగ్జరీ బ్రాండ్ ‘కార్టియర్ ’ ఈవెంట్లో స్టాక్‌హోమ్‌లో దీపికా పదుకొణే ఎరుపు రంగు అవతారంలో అబ్బురపరిచింది. ఈ బ్రాండ్ అంబాసిడర్ అయిన స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో అందంగా మెరిసింది. ఆషి స్టూడియో రూపొందించిన ఆఫ్-షోల్డర్ రెడ్ మొహైర్ గౌను, కార్టియర్ ఆభరణాలతో ధరించింది. మదర్-ఆఫ్-ఆల్ ఫ్యాషన్ లుక్స్‌తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. తన లుక్కు పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనిపించేలా ధరించిన ప్రిన్సెస్ కోడెడ్ డైమండ్స్ , నీలమణి పొదిగిన నెక్లెస్ , సాలిటైర్ స్టడ్ చెవిపోగులు మరింత ఎట్రాక్షన్‌గా నిలిచాయి. అంతేనా షోల్డర్ లెంత్ జుట్టును సొగసైన సైడ్ పార్టెడ్ హెయిర్ జెల్ లాడెన్ వెల్ కెంప్ట్ లుక్ లో స్టైల్ చేసింది. తన రూపానికి తగినట్టు మస్కారా, న్యూడ్ బ్రౌన్ లిప్ ఆయిల్మేకప్తో గ్లామర్ లుక్‌ను సంపూర్ణం చేసుకుంది. దీంతో నెటిజన్లు ఆమె లుక్‌కి ఫిదా అవడం మాత్రమే కాదు.. ‘‘డోంట్ వర్రీ..దీపికా మా మద్దతు నీకే.. చాలా అందంగా ఉన్నావ్’’ అంటూ కమెంట్ చేశారు. అంతేకాదు.. స్పిరిట్ ఫ్లాప్.. పక్కా అంటూ మరో యూజర్ కమెంట్ చేయడం గమనార్హం.ఇదీ చదవండి: ట్విటర్ గాలం : ఇండో-అమెరికన్ , యూట్యూబ్ సీఈవోకి గూగుల్ భారీ ఆఫర్కాగా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్లో 'స్పిరిట్' అనే మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో తొలుత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేనును ఎంపిక చేశారు. కానీ వివాదాల నేపథ్యంలో ఆమెను ఈ ప్రాజెక్ట్నుంచి తొలగించారు. దీపిక స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కనిపించనుంది. -
Miss world 2025 బ్యూటీ విత్ ఎ పర్పస్ గాలా
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సామాజికవేత్త, వ్యాపారవేత్త సుధారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన ‘బ్యూటీ విత్ ఎ పర్పస్ గాలా’లో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న 108 దేశాలకు చెందిన అందాల తారలు సందడి చేశారు. బంజారాహిల్స్‌లోని విలాసవంతమైన నివాసం ’మోన్ అమూర్ ప్యాలెస్’లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ’మిడ్నైట్ పరŠల్స్’ థీమ్‌తో తెలంగాణ సంస్కృతి, అతిథి సత్కారం, మానవతా సేవలకు నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా ఇచ్చిన విందులో భారతీయ వంటకాలతో పాటు ఏషియన్, ఇటాలియన్, అంతర్జాతీయ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టెండర్ కోకోనట్ కార్పాచ్చియో, పనీర్ మిల్లే–ఫ్యూల్, సాఫ్రన్ ఖిచడి వంటి ఆధునిక భారతీయ వంటకాలు, ఉడాన్ నూడుల్స్‌తో కూడిన ట్రఫిల్ సోస్, లాబ్‌స్టర్ థెరి్మడార్ రిసోటో వంటి ఇతర వంటకాలను అతిథులు ఆస్వాదించారు. రస్మలై ట్రెస్లెచెస్, చాకొలేట్ డుల్సే డి లెచే మూస్స్, బాస్క్ చీజ్‌కేక్ లాంటి భారతీయ, పాశ్చాత్య స్వీట్స్ అండ్ డిజర్ట్స్ సమ్మేళనం ఆకట్టుకున్నాయి. కళాత్మక అలంకరణలో శ్వేత–బంగారు రంగులతో కూడిన డెకార్, పుష్ప గుచ్ఛాలు, పెరల్స్ అలంకరణ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శాస్త్రీయ సంగీత బృందం ’తబలా, సన్స్’ సంగీత ప్రదర్శన, డెలిగేట్ల ఫ్లాష్ మాబ్ డాన్స్ కార్యక్రమానికి జోష్ని తీసుకొచ్చాయి. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రాజెక్టుల ప్రదర్శన కార్యక్రమంలో కొన్ని ఉత్తమమైన మానవతా కార్యక్రమాలను డెలిగేట్లు ప్రదర్శించారు. ఈ గాలా వేడుక కు రాజ కుటుంబ సభ్యులు మహారాణి రాధికా గాయక్వాడ్ (బరోడా), ప్రిన్సెస్ కృష్ణకుమారి (జోధ్‌పూర్), డాక్టర్ మధు చోప్రా, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ గాలా ద్వారా భారత సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలిగినందుకు గర్వంగా ఉంది..’అని అన్నారు. మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లే ఈ వేడుకను ‘సౌందర్యంతో పాటు సమాజసేవకు వేదిక’గా అభివర్ణించారు. -
అందాల పోటీల్లో పత్తా లేని పాన్ ఇండియా స్టార్లు
హైదరా‘బాత్’.. క్యా హై!తమ గ్లోబల్ ఈవెంట్ మరింత ప్రజాదరణ పొందేలా చేయడానికి మిస్ వరల్డ్ పోటీ నిర్వాహకులు దేశంలోని సినీ రంగ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపడం సాధారణమే. ఫ్యాషన్, గ్లామర్, సామాజిక సేవ అనే రంగాల సంగమంగా ఈ వేడుక సాగుతుంది కాబట్టి సినిమా రంగం తోడ్పాటును వారు ఎప్పుడూ ఆహా్వనిస్తారు. కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు జడ్జీలుగా లేదా స్పెషల్ గెస్టులుగా కూడా పాల్గొంటారు. అయితే ఈ దఫా ఈవెంట్లో జడ్జిగా ఇప్పటివరకూ ఒక్క సోనూసూద్ పేరు తప్ప మరెవరి పేరూ వినిపించడం లేదు. అలాగే నగరం వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో నాగార్జున లాంటి ఒకరిద్దరు తప్ప టాలీవుడ్ సెలబ్రిటీల జాడ కనపడడం లేదు. ఇటీవలి కాలంలో పాన్ ఇండియా సార్లుగా పేరు తెచ్చుకున్న పలువురు టాలీవుడ్ నటులు ఈ పోటీల వైపు కన్నెత్తి చూస్తున్నట్టు గానీ, వీటి గురించి పన్నెత్తి మాట్లాడుతున్నట్టు గానీ లేదు. తుది పోటీలకు ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. ఫైనల్స్‌లో అయినా టాలీవుడ్ తారలు సందడి చేస్తారని, నగర ప్రతిష్టను అంతర్జాతీయంగా ఇనుమడింపజేసే ఈవెంట్‌కు అదనపు జోష్ జత చేస్తారని ఆశిద్దాం.సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యంత పురాతనమైన అందాల పోటీ మిస్ వరల్డ్. ఈ పోటీలు మన దేశపు అతివల అందాన్ని మాత్రమే కాదు మేధస్సును, శక్తియుక్తులను ప్రపంచానికి అనేకసార్లు చాటి చెప్పాయి. ఈ పోటీలకు ఆతి«థ్యం ఇచ్చే అవకాశం తొలిసారి ఓ తెలుగు రాష్ట్రానికి, అందులోనూ తెలంగాణకు దక్కింది. గత కొన్నిరోజుల క్రితం ప్రారంభమైన ఈ పోటీలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వివిధ రకాల పోటీల్లో పాల్గొంటూ సుందరీమణులు సందడి చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంత హల్చల్ జరుగుతున్నా.. టాలీవుడ్ మాత్రం అంత పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల నిరాసక్తత చర్చనీయాంశంగా మారుతోంది. నేరుగా మోడలింగ్, సినిమాలతో అనుబంధం కలిగి ఉండే ఈ పోటీల విషయంలో చిత్ర పరిశ్రమ తీరు ఆశ్చర్యకరంగా, ఒకింత ఆక్షేపణీయంగా కూడా ఉంది. బెంగళూరు.. బాలీవుడ్ సందడి ప్రపంచ సుందరి పోటీలు భారత్‌లో ఇంతకుముందు రెండుసార్లు జరిగాయి తొలుత బెంగళూరులో 1996లో జరగగా, 2024లో ముంబయిలో జరిగాయి. ఈ రెండు సందర్భాల్లోనూ మిస్ వరల్డ్ ఈవెంట్‌కు భారతీయ సినిమా పరిశ్రమ నుంచి విశేష మద్దతు లభించింది. తొలిసారి బెంగళూరులో జరిగిన పోటీల నిర్వహణ బాధ్యతలను బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు చెందిన ఏబీసీఎల్ తలకెత్తుకోగా.. బాలీవుడ్ నుంచి పలువురు తారాగణం తరలివచ్చి ఆ ఈవెంట్లో పాల్గొన్నారు. ముఖ్యంగా మన తొలి మిస్ వరల్డ్‌గా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన, బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యా రాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముంబై... స్టార్స్ జై ముంబైలో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ బాధ్యతల్లో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, మేగన్ యంగ్ సంస్థలు పాలుపంచుకున్నాయి. అప్పుడు కూడా భారతీయ సినీ పరిశ్రమల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్‌తో పాటు దీపికా పదుకొణె, ఆలియా భట్..దక్షిణాది నుంచి మణిరత్నం, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక ఐశ్వర్యారాయ్, ప్రియాంకా చోప్రా, మానుషి చిల్లర్ వంటి మిస్ వరల్డ్ మాజీ విజేతలు ఆ పోటీలకు అదనపు ఆకర్షణ చేకూర్చారు. ఇక కృతిసనన్, పూజా హెగ్డే, సోనాక్షి సిన్హా, మన్నారా చోప్రా తదితర హీరోయిన్లతో పాటు నిర్మాత, దర్శకుడు సాజిద్ నడియాడ్వాలాలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీలకు హాజరైన వారిలో బాలీవుడ్ చిన్నితెర ప్రముఖులు కూడా ఉండడం విశేషం. రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా, దివ్యాంకా త్రిపాఠి, వివేక్ దహియా తదితర చిన్నితెర స్టార్స్ కూడా హాజరయ్యారు. బాలీవుడ్ గాయనీ గాయకులు నేహా కక్కర్, టోనీ కక్కర్లు, షాన్లు తమ సంగీత ప్రదర్శనలతో అలరించారు. -
వోగ్ బ్యూటీ అవార్డ్స్: సమంతా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఫిదా
స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు (Samantha Ruth Prabhu ) ముంబైలో జరిగిన వోగ్ బ్యూటీ అవార్డ్స్ (Vogue Beauty Awards)లో కటౌట్ డ్రెస్‌లో టోన్డ్-బాడీతో కనిపించి ఫ్యాన్స్‌ని విస్మయ పర్చింది. నిర్మాతగా శుభం మూవీ విజయం తరువాత సమంత చాలా ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోంది. రాజ్ నిడిమోరుతో డేటింగ్ బజ్ మధ్య వోగ్ బ్యూటీ అవార్డ్స్‌లో ఆమె డ్రెస్, స్టన్నింగ్ లుక్ వైరల్‌గా మారింది.మే 26న సమంత వోగ్ బ్యూటీ అవార్డ్స్ కు హాజరైంది. ఈ కార్యక్రమానికి అదితి రావు హైదరి, శిల్పా శెట్టి కుంద్రా, భూమి పెడ్నేకర్, సారా టెండూల్కర్ లాంటి అనేక మంది బాలీవుడ్ దివాలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సమంత లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, దృష్టినీ ఆకర్షించింది. ఈ ఈవెంట్ కోసం, సమంత చాక్లెట్ బ్రౌన్-హ్యూడ్ బాడీ-ఫిటెడ్ గౌనులోదుస్తుల్లో మెరిసింది. సమంత టోన్డ్ బాడీ, గిరజాల జుట్టులో లుక్ ను మరింత హైలైట్‌గా నిలిచింది. సమంతలుక్కు సంబంధించిన వీడియో వైరల్గాకాగానే నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కునిపించారు. నిజంగా సమంతనా? డిఫరెంట్ కనిపిస్తోంది"మునుపటి కంటే సంతోషంగా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు" ‘‘కాన్స్ ఫెస్టివల్‌కు ఎందుకు వెళ్లలేదు’’ లాంటి కమెంట్లు వెల్లు వెత్తాయి. "ఆమె ఎందుకు అంత సన్నగా కనిపిస్తోంది?" అని మరికొందరు ఆశ్చర్యపోయారు.Serving fire with every curve @Samanthaprabhu2 x @VOGUEIndia! 😍 🔗 https://t.co/tG3hraSulg #VogueBeautyAwards2025#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/B2Cycjeu1g— Samantha FC || TWTS™ (@Teamtwts2) May 27, 2025 వోగ్ బ్యూటీ అవార్డ్స్ కార్యక్రమంలో శిల్పా శెట్టి కాలర్డ్ స్కర్ట్ , క్రాప్ టాప్ ధరించింది. మరోవైపు, సారా టెండూల్కర్ నల్లటి దుస్తులు ధరించి, హాఫ్-బన్ హోయిర్ స్టైల్లోనూ,అదితి రావు హైదరి నల్లటి బంగారు రంగు గ్లిట్టర్ గౌనులో మెరిసింది. -
అమెరికా వేదికపై మెరిసిన తెలుగు అందం..! ఎవరీ చూర్ణికా ప్రియ..?
అగ్రరాజ్యం వేదికపై తెలంగాణ తేజం మెరిసింది. అమెరికా మెచి్చన అందం మన హైదరాబాద్ ఏఎస్రావునగర్కు చెందిన చూరి్నకా ప్రియ కొత్తపల్లి సొంతం. ఓ వైపు చదువులో రాణిస్తూనే.. మరోవైపు అందాల పోటీల్లో దూసుకెళ్లింది. ఎంఎస్ కోసం అమెరికా వెళ్లిన చూర్ణికా ప్రియ డల్లాస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. ఎవరీ చూర్ణికా ప్రియ..పుట్టింది పశ్చిమగోదావరి భీమవరం. పెరిగింది హైదరాబాద్ ఏఎస్‌రావునగర్ డివిజన్లోని భవానీనగర్‌లో.. తల్లిదండ్రులు కొత్తపల్లి రాంబాబు, వనజ ప్రోత్సాహంతో హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన తర్వాత ఎంఎస్ కోసం అమెరికా వెళ్లింది. సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్న ఆమె ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనబర్చాలని నిర్ణయించుకుంది. డల్లాస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025లో పాల్గొంది.ఈ పోటీల్లో మొత్తం 5,300 మంది పాల్గొన్నారు. ఇందులో ఫైనల్‌కు 20 మంది యువతులు ఎంపికయ్యారు. ఆ తర్వాత టాప్–5, టాప్–3లో చోటు దక్కించుకుని సోమవారం తెల్లవారుజున(అమెరికాలో ఆదివారం అర్ధరాత్రి) జరిగిన గ్రాండ్ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ పోటీలకు ప్రముఖ సింగర్ గీతామాధురితో పాటు మరొకరు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అంతేకాదు.. ప్రతిష్టాత్మకమైన పీపుల్స్ చాయిస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆమెకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. చాలా సంతోషంగా ఉంది తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వేదికపై చాటాలనే లక్ష్యంతో చూర్ణికా ప్రియ ఈ పోటీల్లో పాల్గొంది. మిస్ తెలుగు యూఎస్ఏ–2025లో పాల్గొన్నట్లు మొదట మాకు తెలియదు. టాప్–20లో సెలక్ట్ అయిన తర్వాత మాకు చెప్పింది. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. తర్వాత మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. తన ఇష్టాలను ఎప్పుడూ కాదనలేదు. తనకు నచ్చిన రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నాం. టాప్–3లో ఉన్నాను ఫైనల్‌కు సెలక్ట్ అయ్యాను చెప్పింది. తర్వాత ఫోన్ చేసి ఫైనల్లో రన్నరప్‌గా నిలిచాను అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. – కొత్తపల్లి రాంబాబు, తండ్రి(చదవండి: కాన్స్ ముగింపు వేడుకలో గూచీ చీరలో మెరిసిన అలియా..! పాపం నాలుగు గంటలు) -
సృజనార్చన
అర్చన కొచ్చర్.. బాలీవుడ్లో షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, మలైకా అరోరా, కంగనా రనౌత్, డయానా పెంటీ మొదలైన వారికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా చేసి సెలబ్రిటీ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్‌గా పాపులర్ అయ్యారు. ఇప్పుడు జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలలో ఫ్యాషన్, టాలెంట్ సెగ్మెంట్స్ కోసం అవుట్‌ఫిట్స్‌ని డిజైన్ చేసి తెలంగాణ టెక్స్టైల్స్, చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. ఈ నేపథ్యంలో అర్చన పరిచయం ఆమె మాటల్లోనే.‘నేను పుట్టి, పెరిగింది ముంబైలో. కామర్స్‌లో డిగ్రీ చేశాను. ఫ్యాషన్‌కు సంబంధించిన అకడమిక్ డిగ్రీ ఏమీ లేదు కానీ.. ఫ్యాషన్ పట్ల ప్యాషన్ నాకు ఊహ తెలిసిన నాటి నుంచే మొదలైందని చె పొ్పచ్చు. దీనికి స్ఫూర్తి చిన్నప్పటి నుంచి నేను చూసిన చేనేత, ఎంబ్రాయిడరీ కళాకారులే! ఏళ్ల నాటి ఈ కళా సంస్కృతిని ప్రతి తరానికి పరిచయం చేస్తూ వాటిని ప్రిజర్వ్ చేస్తున్న తీరు నన్ను అబ్బురపరచేది. ఆ కళల పట్ల వాళ్లకున్న నిబద్ధత, నైపుణ్యం, సృజనాత్మకతకు ముచ్చటేసేది. వీటన్నిటికీ ఓ వేదిక ఏర్పర్చి.. ప్రపంచమంతా గుర్తించేలా చేయాలనిపించింది.ప్రతి నేత వెనుక ఉన్న చారిత్రక కథనాన్ని ప్రపంచానికి వినిపించాలనిపించింది. ఆ ప్రేరణతోనే ఫ్యాషన్ డిజైనింగ్లోకి అడుగుపెట్టాను. పదహారవ ఏటనే ఫస్ట్ ఎగ్జిబిషన్‌ను పెట్టాను. ఇరవయ్యేళ్ళకే బ్రైడల్ వేర్ డిజైనర్‌గా పాపులర్ అయ్యాను. అయితే నా ఈ జర్నీకి మా అమ్మనూ ఓ స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల నాకున్న ఆసక్తిని గమనించి దాని వివరాల్లోకి వెళ్లేలా ప్రోత్సహించింది. ఈ రోజు నేనీ స్థాయిలో ఉండటానికి మా అమ్మతో పాటు మా వారు రాజీవ్ కొచ్చర్, మా అమ్మాయి సిమ్రాన్ కారణం. వాళ్ల ప్రోత్సాహ సహకారాలు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. అహింసా సిల్క్పట్టు అనగానే ఆ నేతకు ఎన్ని పట్టుపురుగులను పొట్టన పెట్టుకున్నారో అనే ఆలోచన, అభిప్రాయానికి వచ్చేస్తారు ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించే ఎవ్వరైనా! అందులో నేను కూడా! అందుకే ఒక ఫ్యాషన్ డిజైనర్‌గా పర్యావరణహితమైన ఫ్యాషన్‌ను, డిజైన్స్‌ను క్రియేట్ చేసి, ప్రమోట్ చేయాలని నిశ్చయించుకున్నాను. ఆప్రాజెక్ట్కి ‘అహింసా సిల్క్’ అనే పేరు పెట్టాను. జార్ఖండ్ వెళ్లి.. అక్కడి గిరిజన స్త్రీలతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. ఈప్రాజెక్ట్ వల్ల ఆ గిరిజన మహిళలకు ఉ పాధి దొరకడమే కాదు వాళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది, వాళ్లకు ఆర్థిక స్వాతంత్య్రమూ వచ్చింది. ఈ అహింసా సిల్క్ డిజైన్స్‌తో న్యూయార్క్ ఫ్యాషన్ షోలో పాల్గొన్నాను. అంతర్జాతీయ గుర్తింపు దొరికింది.మిస్ వరల్డ్ బ్యూటీ ప్యాజెంట్లో..ఫ్యాషన్ ప్రపంచంలో నా ప్రయాణం చిన్నగానే మొదలైంది. కానీ ప్రతిచోటా మన దేశ ప్రతిభను చాటడానికే ప్రయత్నించాను. ‘అహింసా సిల్క్’ ప్రాజెక్ట్‌తో మన దేశానికున్న రిచ్ టెక్స్టైల్ హెరిటేజ్ ని ప్రపంచానికి పరిచయం చేశాను. ప్రతి కలెక్షన్ వెనుక భారతీయ చేనేత కళానైపుణ్యం, సంస్కృతిని చూపించాను. అందుకే ఈ రోజు నాకు మిస్ వరల్డ్ (Miss World) బ్యూటీ పాజెంట్‌లో అవుట్‌ఫిట్స్‌ని డిజైన్ చేసే అవకాశం దక్కింది. ఇది నా ఘనత కాదు.. మన చేనేత సంస్కృతికున్న స్ట్రెంత్. పోచంపల్లి ఇక్కత్, గొల్లభామ, నారాయణ్‌పేట్ చీరలు, లగ్జరియస్ బ్రోకేడ్స్, బంగారు జరీ చీరలు, జర్దోసీ ఎంబ్రాయిడరీ, హైదరాబాద్ ముత్యాలతో 240 అవుట్‌ఫిట్స్‌ను డిజైన్ చేశాం. ప్రతి త్రెడ్‌లో డీటైయిలింగ్ కనపడుతుంది. అది మన కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకతకు అద్దం పడుతుంది. ఈ డిజైన్స్‌ను ధరిస్తున్న ప్రతిఒక్క పార్టిసిపెంట్‌కి ఈ దేశ ఘన చరిత్రను ధరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అలా ఈ డిజైన్స్ అన్నీ మన కల్చర్, ప్రైడ్, గ్లోబల్ సిస్టర్హుడ్కి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇవి పార్టిసిపెంట్స్ అంటున్న మాటలు! ఈ మొత్తం అవుట్‌ఫిట్స్‌ని డిజైన్ చేయడానికి నాకు, నా టీమ్‌కి నెల రోజులు పట్టింది. వీటిని టాప్ మోడల్ రౌండ్, ఫినాలేలో ధరిస్తారు.దక్షిణ భారత ఫ్యాషన్ కాపిటల్‌గా.. పోచంపల్లి ఇక్కత్ నుంచి గద్వాల దాకా తెలంగాణకు ఘనమైన చేనేత చరిత్ర ఉంది. ఇక్కడ సంప్రదాయ నేతకు ఎంతప్రాధాన్యం ఉందో ఫ్యాషన్‌కూ అంతేప్రాముఖ్యత కనిపిస్తుంది. తమ మూలాలను ఎంత గౌరవిస్తారో ట్రెండ్స్‌నూ అంతే ఆదరిస్తారు. ఇక్కడ హెరిటేజ్‌కి, మోడర్న్ స్టయిల్‌కి మధ్య స్ట్రాంగ్ కనెక్షన్ కనిపిస్తుంది. అందుకే ఈప్రాంతం నాకు కల్చర్ అండ్ ఫ్యాషన్ల ఫ్యూజన్‌గా కనిపిస్తుంది. ఫ్యాషన్ అందంగా.. సస్టెయినబుల్‌గా ఇవాల్వ్ అవడానికి ఈ బ్యాలెన్స్ చాలా ముఖ్యం.తెలంగాణ టెక్స్టైల్స్, చేనేత కళను కంటెంపరరీ ఫ్యాషన్‌గా మలచడానికి దీనికి మించి ఇంకేం కావాలి! అంతేకాదు హైదరాబాద్‌లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాంస్కృతిక సంపద, సృజన ఇవన్నీ దీన్ని సౌత్ ఇండియా ఫ్యాషన్ హబ్‌గా మారే స్కోప్నిస్తున్నాయి. ఈ బ్యూటీ పాజెంట్ సక్సెస్‌తో ఫ్యాషన్ షోస్‌కు తెలంగాణ మంచి హోస్ట్‌గా ఉండగలదని నిరూపించుకుంది. విరివిగా ఫ్యాషన్ షోలు జరిగితే స్థానిక ఫ్యాషన్ డిజైనర్స్, చేనేత కళాకారులకూ మంచి సపోర్ట్ దొరుకుతుంది’ అని చెప్పారు అర్చన.– రమ సరస్వతిఫొటోలు: ఎస్ ఎస్ ఠాకూర్ -
కాన్స్ ముగింపు వేడుకలో గూచీ చీరలో మెరిసిన అలియా..! పాపం నాలుగు గంటలు
సినీ ప్రముఖుల, ఫ్యాషన్ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 అంగరంగా వైభవంగా జరిగింది. ఈ నెల 13న మొదలైన ఈ వేడుక శనివారంతో ముగిసింది. ఈ ఫ్యాషన్ వేడుకలో మనదేశం తరఫున ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. వారంతా విలాసవంతమైన దుస్తులు, బ్రాండెడ్ ఆభరణాలతో రెడ్‌కార్పెట్‌పై మెరిశారు. అయితే ఈ కాన్స్ ముగింపు వేడుకల్లో బాలీవుడ్ నటి అలియా భట్ హైలెట్‌గా నిలిచారు. ఆమె ఈ కేన్స్‌లో పాల్గొనడం తొలిసారి. పైగా అలియా లోరియల్ పారిస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ వేడుకలో ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ ముగింపు వేడుకల్లో అలియా గూచీ చీర లుక్ అందర్నీ మిస్మరైజ్ చేసింది. స్ఫటికాలు, ఐకానిక్ జీజీ మోనోగ్రామ్‌తో అలంకరించబడిన కస్టమ్-మేడ్, వెండి రంగు గూచీ చీర ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకర్షించింది. ఈ మేరకు వోగ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఆ చీరలో రెడీ అవ్వడానికి ఎంతలా పాట్లు పడ్డానో వివరించారు అలియా. కాన్స్ ముగింపు వేడుక కోసం ప్రిపేర్ అవ్వుతుండగా..ఒక రకమైన గందరగోళం ఎదురైంది. తాను ముగింపు వేడుకల కోసం ఎంతో ఉత్సాహంగా ఆత్రుతగా ఉంటే..సరిగ్గా రెడీ అయ్యే టైంకి కరెంట్ లేదు. దాదాపు నాలుగు గంటల నుంచి కరెంట్ లేదు. విద్యుత్ లేకపోతే మేకప్ దగ్గర నుంచి చీర కట్టుకునేంతవరకు ఏ పని సవ్వంగా అవ్వదు. ఏంటో టెన్షన్ నన్నువెతుక్కుంటూ వస్తుందా అనే ఫీలింగ్ వచ్చిందంట అలియాకి. హెయిర్ స్టైలిస్ట్‌లు, మేకప్ మ్యాన్లు తమ సౌందర్య పరికరాలను పనిచేసేలా ఎండలో ఉంచి..తనని రెడీ చేసేందుకు ట్రై చేస్తుండగా.. కరెంట్ వచ్చేసిందంటా. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ ఆఘమేఘాలపై అలియాని రెడీ చేశారట. థ్యాంక్ గాడ్..ఉత్కంఠ రేపేలా టెన్షన్‌కి గురిచేసినా..గూచి బ్రాండ్ తయారు చేసిన ఈ చీరలుక్ అందరి మదిని దోచుకోవడం సంతోషాన్నిచిందని అంటోంది. అలాగే ఈ ఆనందం అతకముందుకు అనుభవించిన హైరానా మొత్తం ఉఫ్‌మని ఎగిరిపోయేలా చేసిందిని చెబుతోంది అలియా. ఇక గూచీ బ్రాండ్ రూపొందించిన ఈ చీరకు బ్యాక్‌లెస్ బ్లౌజ్, ప్లంగింగ్ నెక్లైన్, ఫ్లోర్-గ్రేజింగ్ స్కర్ట్ ఎంత సూటబుల్‌గా ఉంది. చెప్పాలంటే అలియా లుక్ భారతీయ సంప్రదాయాన్ని సమకాలీన అంశాలతో మిళితం చేసినట్లుగా ఉంది. పైగా కాన్స్ 2025లో చిరస్మరణీయమైన సైలిష్ లుక్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) (చదవండి: అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాళిని బ్యూటీ రహస్యం ఇదే..!) -
Eesha Rebba బంగారం లాంటి వేడుక
గచ్చిబౌలి: కొత్తగూడలోని శరత్‌సిటీ క్యాపిటల్ మాల్ లోని ఓ జ్యువెలరీ స్టోర్‌లో కొద్ది రోజులుగా గోల్డ్, సిల్వర్ బార్ చాలెంజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో టాలివుడ్ నటి ఈషా రెబ్బ (Eesha Rebba)సందడి చేశారు. నిత్యం సందర్శకులతో సందడిగా జరుగుతున్న ఈ చాలెంజ్‌లో ఈషా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈషా మాట్లాడుతూ బంగారం లాంటి వేడుక నిర్వహించారని, ఇలాంటి వినూత్న కార్యక్రమాలు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తాయని అన్నారు. గోల్డ్–సిల్వర్ బార్ చాలెంజ్ ఈవెంట్లో పాల్గొని సందర్శకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గెలుపొందిన వారికి బంగారు, వెండి నాణేలు బహుమతిగా అందజేశారు. రజతాభరణాల్లో మోడల్స్ తళుకులు- వెండి వెలుగులు బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.9లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ జ్యువెలరీ హబ్‌లో మోడల్స్ వెండి ఆభరణాలను ధరించి హొయలు పోయారు. బంగారం ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో నగర ప్రజలు సిల్వర్ జ్యువెలరీపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీంతో సిల్వర్ ఆభరణాలకు డిమాండ్ పెరుగుతుందని ఈ సందర్భంగా ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుత తరుణంలో సిల్వర్ జ్యువెలరీతో పాటు గృహాలంకరణలోనూ వెండితో చేసిన వస్తువులు వినియోగిస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాదీ మోడళ్లు అబ్బురపరిచే వెండి కళాకృతులు.. క్రాఫ్టెడ్ జ్యువెలరీని ప్రదర్శించారు. ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్‌తో అందాల ముద్దుగుమ్మలు వెండి వెలుగులు నింపారు. 100 ఏళ్ల తమ వారసత్వానికి ఈ షోరూమ్ మళ్ళీ మద్దతు ఇచ్చే ఒక అద్భుత అవకాశమని, గచ్చిబౌలిలోని తమ హబ్, బషీర్‌బాగ్‌లోని జ్యువెలర్స్ వలే నాణ్యతకు, సంప్రదాయ డిజైన్లకు, ఆధునికతకు నిలువెత్తు ఉదాహరణ అని నిర్వాహకులు చెబుతున్నారు. ‘ప్రతి వెండి కళాకృతి నగర సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, సంప్రదాయ రూపకల్పన నుంచి ఆధునిక డిజైన్లకు వేదికగా నిలుస్తుందని వివరించారు. నీల మేఘ శ్యామనృత్య రూపకం గురు శ్రవ్య మానస ఆధ్వర్యంలో నిర్వహణ మోతీనగర్: ప్రముఖ కూచిపూడి నృత్యకళా సంస్థ సుమధుర ఆర్ట్స్ అకాడమీ సమర్పణలో గురు శ్రవ్య మానస ఆధ్వర్యంలో సంస్థ నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా ‘నీల మేఘ శ్యామ’ నృత్య రూపకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. సుమారు 200 మంది నృత్య కళాకారులు పాల్గొని అహూతులను అలరించారు. వీక్షకుల సమక్షంలో జనరంజకంగా నిర్వహించిన ప్రదర్శనలో కృష్ణ భగవానుని లీలామృతంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ప్రధానంగా చేసుకొని గురు శ్రవ్య మానస భోగిరెడ్డి తన శిష్య బృందంతో అద్భుతంగా రూపకల్పన చేశారు. కూచిపూడి విద్యార్థులందరూ చక్కని హావభావాలతో విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా రవికుమార్ దూళిపాట, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ నటులు, శ్రీనివాస భోగిరెడ్డి ప్రదర్శనకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమాన్ని శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్‌రావు, ఐఏఎస్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మేనేజింగ్ డైరెక్టర్ కె.లక్ష్మీ, ఐఏఎస్‌లు, ప్రముఖ సినీ, టీవీ దర్శక, నిర్మాతలు పాల్గొన్నారు. -
ప్రపంచ సుందరి పోటీలకు ‘మెట్రోరైల్’ విస్తృత ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ప్రపంచసుందరి పోటీలపై హైదరాబాద్ మెట్రో రైల్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. మరికొద్ది రోజుల్లో పోటీలు ముగియనున్న దృష్ట్యా మిస్‌వరల్డ్ పోటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మరోవైపు తెలంగాణ పర్యాటక, చారిత్రక, వారసత్వ కట్టడాలపై ప్రజల్లో, ప్రయాణికుల్లో అవగాహన కలి్పంచేందుకు పోస్టర్లు, కటౌట్లు, చిత్రాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేసింది. నగరంలోని గోల్కొండ, చారి్మనార్ వంటి చారిత్రక కట్టడాలతో పాటు పోచంపల్లి, రామప్ప, లక్నవరం, ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వంటి ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలపై ఆకర్షణీయమైన దృశ్యాలను వివిధ ప్రాంతాల్లో ఆవిష్కరించారు. ప్రపంచసుందరి పోటీల్లో హైదరాబాద్ మెట్రో రైల్ తనవంతు భాగస్వామ్యాన్ని నిర్వహిస్తోందని మెట్రోరైల్ ఎండీ ఎనీ్వఎస్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ పోటీలపై ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ ప్రాశస్త్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రచారకార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణకు పరిచయం చేసేలా.. పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచ సుందరీ మణులను తెలంగాణకు పరిచయం చేసేవిధంగా హైటెక్ సిటీ నుంచి నాగోల్ వరకు, మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు పలు ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు, మెట్రో స్తంభాలు, రహదారులకు ఇరువైపులా ఉన్న మెట్రో రైలింగ్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు మెట్రో రైళ్లలోనూ స్క్రీన్లపై, మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫాంలు, కాన్కోర్స్లలోనూ మిస్ వరల్డ్ వేడుకలను ప్రతిబింబించేలా అనేక ఏర్పాట్లు చేశారు. అలాగే మెట్రో స్టేషన్ల ప్రవేశ ద్వారాలను సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరీ్చలతో అలంకరించారు. నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజు సుమారు 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ వారసత్వ సంపదను ప్రయాణికులకు తెలియజేసే బృహత్ కార్యక్రమంలో భాగంగా వివిధ రూపాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లు ఎనీ్వఎస్ చెప్పారు. తెలంగాణ సంప్రదాయాలకు కీర్తి పతాకగా నిలిచిన బోనాలు, బతుకమ్మ, చార్మినార్ వంటి విశేషాలతో కూడిన ఆకర్షణీయ దృశ్యాలను ’మెట్రో రైల్’ ఈ వేడుకల సందర్భంగా మరింత విస్తృత ప్రచారం కల్పించిందని ఎండీ వెల్లడించారు. -
బ్యూటీకి కేరాఫ్‌గా భాగ్యనగరం..!
ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ నగరం పాతికేళ్లకు ముందే ఈ పోటీల్లో తన ప్రస్థానాన్ని ఘనంగా చాటింది. దేశానికి విశ్వసుందరి, ప్రపంచ సుందరి రెండు కిరీటాలనూ అందించిన తొలి నగరంగా చరిత్ర సృష్టించింది. హేడెన్ హైదరాబాదీయే.. నగరానికి చెందిన ఆంగ్లో–ఇండియన్ కుటుంబంలో 1973వ సంవత్సరం మే 13న జని్మంచిన డయానా హేడెన్.. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైసూ్కల్లో తన పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేశారు. పాఠశాల విద్యార్థినిగా ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో ఆమె 13 సంవత్సరాల వయసులోనే తన భృతి కోసం పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది. నగరంలో ఆమె మోడలింగ్ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు ఎన్ కోర్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేశారు. అనంతరం గ్లామర్ రంగంలో అడుగుపెట్టి నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని ఐశ్వర్యారాయ్ దక్కించుకున్న తర్వాత 3వ సారి దేశానికి అందించిన ఘనత డయానా హేడెన్ దక్కించుకున్నారు. అంతేకాదు హైదరాబాద్‌ను కూడా చరిత్రకు ఎక్కించారు. ఈ 1997 మిస్ వరల్డ్ పోటీ విజేత మెయిన్ టైటిల్‌తో పాటు మూడు సబ్–టైటిళ్లను కూడా గెలుచుకున్నారు. అలా గెలిచిన ఏకైక మిస్ వరల్డ్ టైటిల్ హోల్డర్‌గా నిలిచారు. ఆ తర్వాత సినిమా, టీవీ రంగంలో ఆమె స్థిరపడ్డారు.విశ్వసుందరిని అందించిందీ మనమే..మిస్ యూనివర్స్ కిరీటాన్ని దేశానికి అందించిన సుషి్మతాసేన్ కూడా హైదరాబాదీనే. ఆమె 1975వ సంవత్సరంలో నవంబర్ 19న నగరంలోని బెంగాలీ బైద్య కుటుంబంలో జన్మించారు. భారత వైమానిక దళం మాజీ వింగ్ కమాండర్ షుబీర్ సేన్, ఆభరణాల డిజైనర్ అయిన సుబ్ర సేన్లు ఆమె తల్లిదండ్రులు. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. అనంతరం 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా నిలిచి, బాలీవుడ్లో స్థిరపడి పలు హిందీ చిత్రాల్లో పనిచేశారు. నగరంలో తాను స్థాపించిన ఐయామ్ షి పోటీల సందర్భంగా పలుమార్లు ఆమె నగరాన్ని సందర్శించారు. (చదవండి: 44 ఏళ్ల తర్వాత తల్లి చెంతకు కూతురు..! ట్విస్ట్ ఏంటంటే..) -
అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాళిని బ్యూటీ రహస్యం ఇదే..!
అందమంతా పోతపోసుకున్నట్లు కనువిందు చేసే మాయ పేరే మృణాళిని రవి. సోషల్ మీడియాలో రీల్స్ నుంచి సిల్వర్ స్క్రీన్‌పై రియల్‌గా కనిపించడంలోనే కాదు, ఫ్యాషన్‌లోనూ స్టయిలిష్‌గా ఉంటుంది. ఆరోగ్యకరమైన అలవాటు ఒక్కటి చాలు మీ అందాన్ని మరింత పెంచడానికి. రోజూ పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకొని, మాయిశ్చరైజర్ రాసుకుంటా. ఆ అలవాటే నా అందానికి సహజత్వాన్ని ఇస్తుందని చెబుతోంది మృణాళిని రవి.రాయల్ రింగ్..సాధారణ దుస్తుల్లో కూడా రాయల్‌గా కనిపించాలంటే.. మీ దగ్గర తప్పకుండా ఒక్కటైనా స్టేట్మెంట్ రింగ్ ఉండాల్సిందే! అది చిన్నదైనా, పెద్దదైనా సరే, మొత్తం మీ లుక్కే ఒక ప్రత్యేకమైన ఎలిగెన్స్‌ను ఇవ్వగలదు. ఇవి ఎక్కువగా వివిధ ఆకారాలు, రంగులు, స్టోన్స్‌తో ప్రత్యేకమైన డిజైన్స్‌లో ఉంటాయి. స్టేట్మెంట్ రింగ్ వేసుకున్నప్పుడు చేతికి వేరే ఏ ఇతర ఆభరణాలతోనూ స్టయిలింగ్ చేయొద్దు. ఎక్కువ రింగ్స్ వేసుకుంటే ఫోకస్ చెదిరిపోతుంది. మంచి నెయిల్ పాలిష్‌తో జత కలిపితే ఉంగరం ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. మ్యూట్ షేడ్స్ లేదా డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే కలర్స్ ఉపయోగించండి. లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్‌లు, టాప్‌లు అసలు వేసుకోవద్దు. అలాగే హ్యాండ్‌బ్యాగ్‌కు బదులు క్లచ్ తీసుకెళ్లడం ఉత్తమం. (చదవండి: ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!)ఇక కాంప్లిమెంటరీ జ్యూలరీగా కమ్మలను చూజ్ చేసుకోండి. అవికూడా మితంగా, సేమ్ టోన్ జ్యూలరీలో సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటోషూట్స్, వివాహాది శుభకార్యాలకు సింపుల్ అండ్ గ్రేట్ ఆప్షన్ ఇది. అప్పుడు అక్కడ మీరు మాట్లాడకపోయినా సరే, మీ స్టయిల్ మాట్లాడుతుంది. ఇక మృణాళిని ధరించే జ్యూలరీ బ్రాండ్: కర్ణిక, ఇయర్ రింగ్స్ ధర: రూ. 33,200, ఉంగరం ధర: రూ. 2,200, చీర బ్రాండ్: ఆలివ్ హ్యాండ్ప్రింట్స్ రూ. 3,850/-.బ్లౌజ్ ధర: రూ. 1,050/-.(చదవండి: వర్షం సాక్షిగా.. ఒక్కటైన జంటలు..!) -
హైదరాబాద్‌తో అనుబంధం పెంచుకున్న మిస్ వరల్డ్ తారలు
గ్లోబల్ వేదికగా ఏ రంగంలోనైనా హైదరాబాద్ తన ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ఇది ఇప్పుడొచ్చిన గుర్తింపేం కాదు.. నిజాం కాలం నుంచే అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగరం ప్రసిద్ధి చెందింది. ఆనాటి సంస్కృతులు, ఆహారం, విలాస నగరంగానే కాకుండా ఇప్పటి ఐటీ, సినిమా, క్రీడలు తదితర రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోంది. ఈ ఒరవడిలో వీటన్నింటి సమాహారంగానే ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు నగరంలో నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నగరానికి వచి్చన విషయం విధితమే. ఈ ప్రయాణంలో అందాల తారలు నగరానికి ముగ్దులైపోతున్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో ఒక్కరు మాత్రమే విజేతగా నిలుస్తారు.. కానీ ఈ మిస్ల అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది భాగ్యనగరం. ఈ నేపథ్యంలో పలువురు మిస్‌వరల్డ్ పోటీదారులు ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు.. బెల్జియం చాక్లెట్లు మావే.. వచి్చనప్పటి నుంచి చూస్తున్నా.. ఎంతో ఆతీ్మయత, ప్రేమ నింపుకున్న మనుషులు మీరంతా..?! నాకు చాలా సంతోషంగా అనిపించింది. అధునాతన జీవన విధానం బాగా నచ్చింది. దీనికి సమానంగా సామాన్య జీవనం కనిపిస్తోంది. మిస్ వరల్డ్ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని ప్రాంతాలను సందర్శించాను.. ఎంత అందమైన నగరమో. ఇక్కడి బెల్జియం చాక్లెట్లను చూశాను. ఈ బెల్జియం చాక్లెట్లకు మాతృక మా దేశమే. హైదరాబాద్‌లో షాపింగ్ చేయడం మరచిపోలేని అనుభూతి. – కారెన్ జాన్సెన్, మిస్ బెల్జియంఅమ్మా నాన్నలను తీసుకొస్తా.. ఇక్కడ అద్భుతమైన జీవన విధానమే కాదు.. ఎన్నో వింతలు ఉన్నాయి. మిస్ వరల్డ్ బృందంతో పాటు అవన్నీ సందర్శించాను. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలను చూడటానికి మళ్లీ హైదరాబాద్ వస్తా. వీటిని చూపించడానికి మా తల్లిదండ్రులను కూడా తీసుకొస్తాను. నా ఫేవరెట్ డెస్టినేషన్ నగరాల్లో హైదరాబాద్ కూడా చేరింది. నగరం చూట్టూ ఉన్న ప్రకృతి కూడా నాకు బాగా నచి్చంది. – ఎమ్మా మోరిసన్, మిస్ కెనెడామరో ఇల్లులా అనిపించింది.. భారత దేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం.. అంతెందుకు విదేశాలకు చెందిన కొన్ని సంస్కృతులు సైతం ఇక్కడ తారసపడ్డాయి. ఈ వైవిధ్యాన్ని చూడటానికి భారత్ మొత్తం తిరగాల్సిన పనిలేదు. కేవలం హైదరాబాద్ వస్తే చాలు. ఇది నేను అనుభవపూర్వకంగా చెబుతున్నా. ఢిల్లీ వెళ్తే ఒకలా, చెన్నై, లద్దాక్ వెళితే మరోలా.., ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సాంస్కృతి కనిపిస్తుంది. అంతెందుకు కోల్‌కతా (బెంగాల్) వెళితే మా బంగ్లాదేశ్ మూలాలు కనిపిస్తాయి. ఇవన్నీ హైదరాబాద్‌లో చూశా. ఇది ఒక మినీ ఇండియా. నాకైతే హైదరాబాద్ మరో ఇల్లులా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజల ఆత్మీయ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. నాకు నచి్చన స్పైసీ ఫుడ్ లభిస్తుంది. వారసత్వ వంటకాలు బాగున్నాయి. నేను తిన్న కొబ్బరి చట్నీ అయితే సూపర్బ్. – అక్లిమా అతికా కొనికా, మిస్ బంగ్లాదేశ్అమ్మాయిలకు అనువైన నగరం.. ఇక్కడి అమ్మాయిలను చూస్తే సంతోషంగా ఉంది. వారికి అనుకూలమైన వాతావరణం ఉంది. మా దేశం జింబాబ్వే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం.. అంతర్జాతీయంగా ఫ్యాషన్ రంగంలో మా కళకు, డిజైనింగ్‌కు ప్రత్యేకత ఉంది. మా డిజైనర్ల డిజైనింగ్ ఇక్కడ చూసి సంతోషం అనిపించింది. ఒక మోడల్‌గా గర్వపడుతున్నా. విదేశాల్లోనూ ఆఫ్రికన్ల సంస్కృతి ఇప్పుడు ట్రెడ్‌గా మారుతోంది. మేమంతా వివిధ దేశాల నుంచి వచ్చిన మహిళలుగా మాకు వేర్వేరు నమ్మకాలున్నాయి. కానీ ఇక్కడి సంస్కృతిక సమ్మేళనం, వైవిధ్యం ఐక్యతను ప్రదర్శిస్తోంది. ఇలాంటి సమాంతర వ్యవస్థ ఉండటం అద్భుతం. రంగు, రూపం వంటి అంశాలతో భిన్నంగా ఉన్న స్త్రీలను ఈ వైవిధ్యం విజేతను చేస్తుంది. అవకాశం ఉంటే మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనుంది. –కోర్ట్నీ జాంగ్వే, మిస్ జింబాబ్వే మొదటి సారి పానీ పూరీ తిన్నా.. వియత్నాంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పానీ పూరీ గురించి వీడియోలు చూశాను. ఉన్నత చదువుల కోసం ఆ్రస్టేలియా వెళ్లినప్పుడు కూడా కొన్ని సార్లు వీటి గురించి విన్నాను. అయితే హైదరాబాద్ వచ్చాకే పానీ పూరీ మొదటి సారి తిన్నా. వీటి రుచిని మాటల్లో చెప్పలేను. మొదట్లో వీటిని సరిగా తినలేకపోయాను. మిస్ ఇండియా నందినీ గుప్తా పానీపూరీ ఎలా తినాలో చూపించింది.. అప్పటి నుండి తినడం అలవాటైంది. ప్రస్తుతం హైదరాబాద్ అనగానే మొదట పానీపూరీనే గుర్తొస్తుంది. ఇక్కడి ప్రజలు ఆతీ్మయంగా పలుకరిస్తారు. నేను బసచేసే హోటల్ సిబ్బంది చూపించే ప్రేమ ఇంటిని మరిపిస్తోంది. చారి్మనార్ వీధుల్లో కొన్న వస్తువులు వియాత్నాం తీసుకెళతాను. ఎయిర్‌పోర్ట్‌లోకి రాగానే బొట్టు పెట్టి ఆహ్వానించిన విధానం నాకెంతో నచి్చంది. తెలంగాణ సంస్కృతిలో భాగంగా ప్రదర్శించిన నృత్యాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. – హూన్ త్రాన్ నీ, మిస్ వియాత్నాం -
ఇక్కడి సంస్కృతికి ఫిదా అయ్యాం
తెలంగాణలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ బ్యూటీ పాజెంట్‌లో భాగంగా ‘హెడ్ టు హెడ్ చాలెంజ్’ ఈవెంట్ కూడా పూర్తయింది. ఇందులో టర్కీ, వేల్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జాంబియా దేశాలకు చెందిన సుందరీమణులు గెలుపొందారు. వాళ్ల పరిచయాలు..బుద్ధవనం ప్రాజెక్ట్ వెరీ వెరీ స్పెషల్– ఇడిల్ బిల్గెన్, మిస్ టర్కీమిస్ వరల్డ్ పాజెంట్‌లో భాగంగా హెడ్ టు హెడ్ ఛాలెంజ్‌లో విజేతగా నిలిచింది మిస్ టర్కీ ఇడిల్ బిల్గెన్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘ఈ రోజు నాకు చాలా స్పెషల్. నా దేశానికిప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగానూ చాలా ఉత్సాహంగానూ ఉన్నాను. ఈ హెడ్ టు హెడ్ ఛాలెంజ్‌లో ముందంజలో ఉండటం మరింత ఆనందం. మహిళల భద్రత, సాధికారత, విద్య, సాంస్కృతిక గుర్తింపు, మానసిక ఆరోగ్యం, సోషల్ మీడియా ప్రభావం, వాతావరణ మార్పుల... ఇలా విభిన్నమైన టాపిక్స్‌తో హెడ్ టు హెడ్ చాలెంజింగ్ రౌండ్ గడిచింది. ఎక్కడైనా మహిళల విజయానికి చదువు చాలా ముఖ్యమైనది. ఏ దేశంలోనైనా అభివృద్ధి, సాధికారిత రెండూ కలిసి ప్రయాణించాలి. జనాభాలో సగం మంది వెనకబడి ఉంటే మనం విజయం సాధించలేం. ఇక్కడ మహిళలు వెనుకబడి ఉండకుండా ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి. సాంకేతికత, వైద్యపురోగతికి ఈప్రాంతం కేంద్రంగా ఉంది. ప్రజల ఆప్యాయత, ప్రేమ, దయాగుణం, ఇక్కడి సంస్కృతి హైలైట్ చేస్తున్నాయి. ఇవే విషయాలను వేదికపై నుంచి వినిపించాను. తెలంగాణలోని టూరిజం నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా బుద్ధవనం ప్రాజెక్ట్ వెరీ వెరీ స్పెషల్. అక్కడ మాంక్స్ చదివే మంత్రాలు ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తాయి. నేను రేడియేషన్ అంకాలజీలో మెడిసిన్ చేస్తున్నాను. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలలో పాల్గొంటుంటాను. ‘నేనొక వైద్యురాలిని, అంతేకాదు నేను ఒక టర్కిష్ మహిళను. మిస్ వరల్డ్‌లో టర్కిష్ మహిళల గొంతుగా నేను ఉండాలనుకుంటున్నాను’ అని వేదికపై వివరించాను. బ్యూటీ విత్ ఎ పర్పస్ప్రాజెక్ట్లో భాగంగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అవగాహనకు కృషి చేస్తున్నాను. ఒక వైద్యురాలిగా క్యాన్సర్ రోగులకు సహాయకారిగా ఉండటం నా బాధ్యత. క్రీడలు అంటే చాలా ఇష్టం. మానసిక ఒత్తిడి నుంచి విశ్రాంతి పొందడానికి క్రీడలు, జిమ్ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అసాధ్యం అనేది మన డిక్షనరీలో ఉండకూడాదు. ఎలాంటి సమస్య వచ్చినా దానిని అధిగమించగలను, సాధించగలను అనే ఆలోచన మనలో ధైర్యాన్ని నింపుతుంది. విజయాలను మన ముందుంచుతుంది’ అంటూ వివరించింది ఇడిల్.యువతకు చదువు చాలా ముఖ్యం– మిల్లీ మే ఆడమ్స్, మిస్ వేల్స్మిస్ వరల్డ్ పాజెంట్‌లో భాగంగా హెడ్ టు హెడ్ ఛాలెంజ్ టాప్ టెన్ జాబితా యూరప్కుప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ వేల్స్ మిల్లీ మే ఆడమ్స్ టాప్ టెన్ జాబితాలోకి చేరింది. ఈ సందర్భంగా మిల్లీ మాట్లాడుతూ – ‘‘ఈ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంది. స్వతహాగా పర్యటనలు చేయడం, చారిత్రక ప్రదేశాలు సందర్శించడం అంటే నాకు చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడు గొప్ప గొప్ప కట్టడాలను సందర్శిస్తుంటాను. అందులో భాగంగా గతంలో ఇండియాకు వచ్చినప్పుడు తాజ్‌మహల్‌ని సందర్శించాను. ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ పాజెంట్‌లో భాగంగా హెరిటేజ్ టెంపుల్స్, చార్మినార్ చాలా బాగా నచ్చాయి. ఇక్కడి శిల్పనిర్మాణం అద్భుతం అనిపిస్తుంది. ట్రిప్స్ చాలా ఎంజాయ్ చేశాం. ఇక్కడి సంస్కృతితో పాటు మహిళల సాధికారిత గురించి తెలుసుకున్నాను. ప్రభుత్వాలు అందిస్తున్న రక్షణ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఫ్రీ బస్ సౌకర్యం గురించి తెలుసుకున్నాం. బ్యూటీ విత్ ఎ పర్పస్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ రౌండ్లో 20 మందితో పోటీపడ్డాను. పోటీలో నా వర్క్స్ గురించి, చదువుప్రాముఖ్యత గురించి అడిగారు. నేను వేల్స్లో మెడిసిన్ చదువుతున్నాను. స్ట్రీట్ డాక్టర్స్ అనే జాతీయసంస్థతో కలిసి పనిచేయడంతో పాటు, యువతకు చదువు ఎంత అవసరమో వివరిస్తూ, పాఠశాల విద్య పట్ల అవగాహన కల్పిస్తున్నాను. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, అందాల పోటీల ద్వారా నిధుల సేకరించి, ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన పిల్లలకు మద్దతుగా నిలుస్తున్నాను. నా విజయానికి ఇవన్నీ ఉపకరించాయి. యువతులు, బాలికలకు తమపై తమకు పూర్తి విశ్వాసం ఉండాలి. అప్పుడు ప్రపంచంలో ఏదైనా సాధించడానికి మనకు సహకారం అందుతుంది. కోరుకున్న జీవితాన్ని గడపటానికి మహిళకు సాధికారతతో పాటు దయ, వినయం కూడా ఉంటే ఎక్కడ ఉన్నా రాణిగా వెలిగిపోతాం’’ అంటూ అందమైన నవ్వుతో సమాధానమిచ్చింది మిస్ వేల్స్.పెళ్లి తప్పించుకుని మెడిసిన్ చదివాఫేత్ వాలియా, మిస్ జాంబియా‘‘వృత్తిరీత్యా డాక్టర్ని. నాకు ఒక తమ్ముడు. మా అమ్మ పాస్టర్. నాన్న కార్పెంటర్. మేము లుసాకాలో ఉంటాం. నాకు ముందునుంచీ అందాల పోటీలంటే ఇష్టం. నాకు పదిహేనేళ్లున్నప్పుడు మొదటిసారిగా అందాల పోటీల్లో పాల్గొన్నాను. గెలిచాను కూడా! బ్యూటీ అంటే నా దృష్టిలో ఆత్మవిశ్వాసం. మా దగ్గర బాల్య వివాహాలు ఎక్కువ. నన్నూ బాల్య వివాహానికి సిద్ధం చేసింది మా సమాజం. అయితే బాగా చదువుకుని మా దేశంలోని ఆడపిల్లల తలరాతను మార్చాలి అనుకునేదాన్ని. మా ఆర్థిక పరిస్థితి బాలేనందువల్ల నా పదహారవ ఏట నాకు పెళ్లి చేసేయాలనే ఒత్తిడి తెచ్చారు మా కమ్యూనిటీ పెద్దలు. కానీ నేను తలవంచలేదు. ఆ పెళ్లిని తప్పించుకున్నాను. కష్టపడి మెడిసిన్ చదివాను. అప్పుడు గనుక నేను ఆ తెగువ చూపించక పోయుంటే ఈ రోజు మీతో ఇలా మాట్లాడే అవకాశం వచ్చేది కాదు. నా ఈ కథను ప్రపంచానికి చెప్పి, ఆడపిల్లలకు మానసిక స్థయిర్యాన్ని, స్ఫూర్తిని పంచడానికి అందాల పోటీలు ఓ వేదికగా కనిపించాయి. మన కథను వినిపించే, మన వ్యక్తిత్వాన్ని తెలియజేసే అవకాశాన్నిస్తాయి. అందుకే ఎలాగైనా ఈ ప్లాట్‌ఫామ్ దాకా రావాలనుకున్నాను. వచ్చాను.వాయిస్ ఆఫ్ ఫెయిత్ జీవితంలో గెలవడానికి ఉపయోగపడేవి చదువు, నైపుణ్యం మాత్రమే. నా బ్యూటీ విత్ ఎ పర్పస్ కూడా అదే! ‘వాయిస్ ఆఫ్ ఫేత్’ అనే ఫౌండేషన్ ద్వారా అట్టడుగు వర్గాల పిల్లలకు చదువుప్రాధాన్యాన్ని తెలియజెబుతున్నాను. సేంద్రియ సాగు విధానాలను నేర్పి.. వాళ్ల సుస్థిర ప్రగతికి పాటుపడే ప్రయత్నం చేస్తున్నాను. సాంకేతిక రంగంలో వాళ్లు నైపుణ్యం సాధించేలా శిక్షణనిప్పిస్తున్నాను. ఈ పనులన్నీ ఎలా చేస్తున్నానో ‘హెడ్ టు హెడ్ చాలెంజ్ (బ్యూటీ విత్ ఎ పర్పస్)’ రౌండ్లో ప్రెజెంట్ చేశాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, సాంకేతిక రంగాల్లో తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతున్నట్టుంది. అధిక జనాభా, తక్కువ భూభాగం లాంటి సవాళ్లతో కూడా ఇండియా సాధించిన ఈ ప్రగతి చూస్తుంటే ముచ్చటేస్తోంది. ప్రజల అవసరాల పట్ల ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధి ప్రశంసనీయం. తెలంగాణ సంస్కృతికి, ఆతిథ్యానికీ నేను ఫిదా అయ్యాను. మా దేశం కూడా ఈ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మిస్ జాంబియా ఫేత్ వాలియా.తెలంగాణ మినీ ఇండియా– అనా లీజ్ నాన్సాన్, మిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో‘‘మాది పెద్ద కుటుంబం. మేము మొత్తం ఎనిమిది మంది పిల్లలం. అందరిలోకి నేనే పెద్ద. అందుకే అన్ని విషయాల్లో నా తోబుట్టువులకు నేనో మార్గదర్శిగా ఉండాలని కోరుకునేదాన్ని! మా నాన్న ఇంజినీర్, అమ్మ గృహిణి. చదువు విషయంలో నాకు మా నాన్నే స్ఫూర్తి. ఇంగ్లండ్‌లో సివిల్ ఇంజినీరింగ్ చదివాను. ఇప్పుడు మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను. పర్యావరణహిత నిర్మాణాలు నా లక్ష్యం. నేను అథ్లెట్ కూడా! ఫుట్‌బాల్ ప్లేయర్‌ని. బ్యూటీ పాజెంట్‌లో పాల్గొనడానికి నాకు ప్రేరణ.. ఇందులోని ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ సెగ్మెంట్. ఇందులో నేను నమ్మే సుస్థిర అభివృద్ధి, హ్యాపీ లివింగ్ వంటివాటి గురించే చెప్పే అవకాశం దొరుకుతుందని అనుకున్నాను. నా బ్యూటీ విత్ ఎ పర్పస్ కూడా అదే! ‘ద రిపుల్ ఎఫెక్ట్’ అనే సంస్థను స్థాపించాను. స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా సస్టెయినబుల్ కమ్యూనిటీస్‌ని ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. ముఖ్యంగా నిస్సహాయ మహిళల సాధికారత, పిల్లల చదువు కోసం పనిచేస్తున్నాను. మా దేశానికి వలసలు ఎక్కువ. ఆ పిల్లలకు స్థానిక భాషలు, ఇంగ్లిష్ వంటివి రాక చదువుకు దూరమవుతున్నారు. అందుకే ట్రినిడాడ్‌లోని ‘విస్డమ్ సియోరామ్’ అనే ఓ టెక్నాలజీ కంపెనీ సహాయంతో ఆ పిల్లలకు పలు భాషలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. నేను అథ్లెట్‌ని కూడా కాబట్టి స్పోర్ట్స్ మీదా ఫోకస్ చేస్తున్నాను. ఆటలతో శారీరక దృఢత్వమే కాదు ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా అలవడుతుంది. అందుకే పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించే ప్రయత్నమూ చేస్తున్నాను. ముఖ్యంగా స్విమ్మింగ్‌లో. ఎందుకంటే అది లైఫ్ స్కిల్ కాబట్టి. స్థానిక వనరులతో గ్రీన్ బిల్డింగ్ టెక్నిక్స్‌ని చెప్పే పాడ్‌కాస్ట్ చానెల్‌నూ స్టార్ట్ చేశాను. ఇందులో ఇంజినీర్స్, ఆర్కిటెక్ట్స్, పర్యావరణవేత్తలను ఇంటర్వ్యూ చేస్తుంటాను. అంతేకాదు మొక్కలు నాటే కార్యక్రమాలూ నిర్వహిస్తుంటాను. ఇవన్నీ నా బ్యూటీ విత్ ఎ పర్పస్‌లో భాగాలే!కలర్ఫుల్గా.. ఇండియా గురించి విన్నాను. కానీ తెలంగాణ స్టేట్ గురించి ఎప్పుడూ వినలేదు. తెలంగాణ మినీ ఇండియాలా అనిపించింది. మాలాగే ఇక్కడా భిన్న మతాలు, భిన్న సంస్కృతీసంప్రదాయాలు కనిపించాయి. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడి ఫుడ్ స్పైసీగా ఉన్నప్పటికీ చాలా బాగుంది. సో డిలీషియస్. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనిపించేలా ఉంది తెలంగాణ ఆతిథ్యం! చాలా హ్యాపీ!’’ అన్నారు అనా లీజ్ నాన్సాన్ఇంటర్వ్యూలు: నిర్మలారెడ్డి, సరస్వతి రమ -
కాన్స్‌లో వివాదాల బ్యూటీ ఊర్వశి : ఈ సారి రూ. 5లక్షల డైమండ్ బ్యాగ్‌తో
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కాన్స్ ఫిలి ఫెస్టివల్ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) మరోసారి సంచలనం రేపింది. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చిలుక లాంటి గౌనుతో పాటు చిలుక క్లచ్‌తో తొలిసారి మురిపించిన ఈ బ్యూటీ ఈ సారి ఏకంగా గోల్డ్, డైమండ్స్‌తో రూపొందించిన 'బికినీ' బ్యాగ్‌తో కనిపించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఈ డైమండబ్యాగ్ ధర ఎంతో తెలుసా?గత కొన్నేళ్లుగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ సందడిలో ఎక్కువగా వినిపించే పేరు ఊర్వశి రౌతేలా. అలాగే వివాదాలకు కూడా తక్కువేమీ కాదు. మొన్న చిలక క్లచ్‌తో వివాదాన్ని రూపి, కొంతమందినెటిజన్లను ఆకట్టుకోవడంలో విఫలమైనప్పటికీ, ఖరీదైన బ్యాగ్‌తో రెడ్ కార్పెట్‌పైకి తిరిగి వచ్చింది. దీని ధర. రూ. 5.29 లక్షల బస్ట్ గోల్డ్ బికినీ బ్యాగ్‌ను ప్రదర్శించడం చర్చకు దారి తీసింది. అంతేకాదు ఈ ఫెస్టివల్లో మొదటి రోజు ఆమో ధరించిన చిలుక క్లచ్ కూడా జుడిత్ లీబర్ బ్రాండ్‌కు సంబంధించిందే.. దీని ధర రూ. 4.86లక్షలు.బంగారు రంగు ఫిష్‌టైల్-స్టైల్ గౌనులో నటి లా వెన్యూ డి ఎల్'అవెనిర్ (కలర్స్ ఆఫ్ టైమ్) ఉర్వశి రౌతేలా ఈ ప్రదర్శనకు హాజరైంది. ఈ గౌను అభిమానులను మంత్రముగ్ధులను చేసినప్పటికీ, హైలైట్‌గా నిలిచించి మాత్రం గోల్డ్ బికినీ బ్యాగ్.ఇదీ చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్‌పై ప్రశంసలు లగ్జరీ బ్రాండ్ జుడిత్ లీబర్ బస్ట్-షేప్డ్ బికినీ బ్యాగ్‌ను ధరించింది. మెటాలిక్ గోల్డ్ బికినీ టాప్‌తోపాటు, ఖరీదైన రత్నాలు, స్ఫటికాలు, వివిధ ఆకారాలు, కట్లు, ఫ్యాన్సీ నెక్లెస్‌ల కలగలుపుతో తయారు చేశారు. చేయబడింది. వెబ్సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, బ్యాగ్ షాంపైన్-టోన్డ్ మెటల్ హార్డ్‌వేర్‌తో పుల్-ట్యాబ్ మాగ్నెటిక్ క్లోజర్‌ను కలిగి ఉంది. షోల్టర్ చైన్‌తోపాటు, మెటాలిక్ లెదర్-లైన్డ్ ఇంటీరియర్‌తో కూడా వచ్చింది. ఇక ధర విషయాని వస్తే దీని ధర 6,195 అమెరికన్ డాలర్లు. అంటే దాదాపు రూ. 5,29,000 అవుతుంది. ఈ బస్ట్ బ్యాగ్ ఎనిమిది ఇతర వేరియంట్లలో అందుబాటులో ఉంది. చదవండి: బనారసీ చీరలో నీతా అంబానీ లుక్ : లగ్జరీ బ్యాగ్ స్పెషల్ ఎట్రాక్షన్ఫోటోషూట్ కోసం ఊర్వశి ఏం చేసిందంటే..కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025, ఊర్వశి రౌతేలా మెట్లపై ఫోటోషూట్ సమయంలో ఎవ్వరినీ లోపలికి రావడానికి వీల్లేకుండా, దారిని బ్లాక్ చేసిందట. రెడ్ కార్పెట్ కి వెళ్లేముందు హోటల్ మెట్ల మార్గంలో ఫోటోషూట్ చేయించుకుంది. ఈ సందర్భంగా ఇతర అనేక మంది ఇతర అతిథులకు ఆటంకం కల్పించింది. కనీసం వారినిచూసి అని పక్కకు తప్పుకోకుండా, తన పోజుల్లో మునిగిపోవడంతో వారు అసౌకర్యానికి గురయ్యారని సమాచారం. -
భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్‌పై ప్రశంసలు
ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 (Cannes Film Festival)లో నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫ్యాన్స్‌లోని ప్యారిస్ లో జరుగుతున్న 78వ కాన్స్ ఉత్సవాల్లో వరుగా రెండోరోజు తన అద్భుతమైన లుక్‌తో అందర్నీ అలరించింది. మాజీ మిస్ యూనివర్స్. మొదటి రోజు చీర, కెంపుల హారం, సింధూరంతో అటు ఫ్యాన్స్‌ను, ఇటు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. రెండో రోజు లుక్‌లో భారతీయత ఉట్టిపడేలా దర్శనమిచ్చి వావ్ అనిపించింది.కాన్స్ వేడుకలో రెండో రోజు ఐశ్వర్య రాయ్ మోడ్రన్ డ్రెస్‌లో కనిపించింది. కానీ ఇందులో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను మేళవించడం విశేషం. ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ వెల్వెట్ డ్రెస్‌లో ఆమె తళుక్కున మెరిసింది. ముఖ్యంగా చేతితో గీతలోని సంస్కృత శ్లోకాన్ని ఎంబ్రాయిడరీ చేయించుకోవడం విశేషంగా నిలిచింది. బనారసీ కేప్పై భగవద్గీతలోని ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ’ అనే శ్లోకాన్ని తీర్చిదిద్దుకుంది. వెండి, బంగారం, బొగ్గు , నలుపు రంగుల్లో, మైక్రో గ్లాస్ స్ఫటికాలతో చేతితో ఎంబ్రాయిడరీ చేసినట్టు డిజైనర్ తెలిపారు. అలాగే వారణాసిలో చేతితో నేసిన ఈ కేప్ పై భగవత్ గీతలోని సంస్కృత శోక్లాన్ని ఎంబ్రాయిడరీ చేసినట్టు వెల్లడించారు. దీంతో ఐష్ లుక్‌పై ఫ్యాషన్ వర్గాలు సహా, సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by Gaurav Gupta (@gauravguptaofficial)ఐశ్వర్య ఫస్ట్ లుక్ సంప్రదాయం, గుర్తింపుకు చిహ్నంగా ఉండగా, రెండవది పునఃనిర్మాణం ఫ్యాషన్‌కి గుర్తు అని వ్యాఖ్యానించారు. 78వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 13 న ప్రారంభమైనాయి.రేపటితో(24) ఈ వేడుకలు ముగియనున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదా -
బనారసీ చీరలో నీతా అంబానీ లుక్ : లగ్జరీ బ్యాగ్ స్పెషల్ ఎట్రాక్షన్
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. దేశంలో ముంబైలో నెలకొల్పిన 'నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్' (NMACC) ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీతా న్యూయార్క్‌లోని ఐకానిక్ లింకన్ సెంటర్లో 'ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్' పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అంతేకాదు స్వయంగా భరతనాట్యం నృత్యకారిణి నీతా అంబానీ ఈ వేదికపై ప్రదర్శన ఇవ్వనున్నారు.బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ భారతీయత, ష్యాషన్ పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారు.వ్యాపారం , ఫ్యాషన్ రంగంలో ఎప్పుడూ ప్రత్యేకమైన శైలే. ప్రపంచ స్థాయిలో భారతీయ సంస్కృతిని అందరినీ ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ప్రీ-ఈవెంట్ లుక్‌లో అచ్చమైన బంగారం, వెండి జరీతో గండభేరుండ మోటిఫ్‌లతో చేతితో నేసిన ఎరుపు రంగు బనారసి చీరను ధరించారు. దీనికి సింపుల్ జ్యుయల్లరీ ఎంచుకున్నారు. దీనికి జతగా ధరించిన కస్టమ్ హెర్మ్స్ బ్యాగ్ షో మరింత హైలైట్‌గా నిలిచింది. రాబోయే ఈవెంట్‌పై పనిచేస్తున్న ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా దీనికి సంబంధించిన ఫోటో, వివరాలను పంచుకున్నారు. ఈ లగ్జరీ బ్యాగ్‌ను పదేళ్ల క్రితం ఆమె కోసం ప్రత్యేకంగా రూపొందించారట. నీతా అంబానీ ఇప్పటికే తన లుక్‌తో భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) సెప్టెంబర్ 12 నుండి 14 వరకు న్యూయార్క్‌లో ఇండియా వీకెండ్NMACC సెప్టెంబర్ 12 నుండి 14, 2025 వరకు న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్లో ఇండియా వీకెండ్‌ను నిర్వహించనుంది. 2023లో భారతదేశ సంస్కృతి, వారసత్వం, నాటకం, నృత్యం, జానపదాలు, కళలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటైన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ మరో అడుగు ముందుకేసిందని నీతా అంబానీ ప్రకటించారు. ప్రపంచ వేడుకగా తొలిసారి న్యూయార్క్‌లోని ప్రఖ్యాత లింకాన్ సెంటర్లో ఎన్ఎంఏసీసీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు డ్యాన్స్, సంగీతం, ఫ్యాషన్, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నామని ఆమె తెలిపారు. ఈ వేడుకలో భారతదేశం, దేశానికి చెందిన 5 వేల ఏళ్లనాటి వైభవాన్ని చాటి చెప్పేందుకు ఉత్సాహంగా ఉన్నామని చెప్పారు నీతా అంబానీ.చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదాగ్రాండ్ స్వాగత్ ఉత్సవంతో ఈవేడుకలు ప్రారంభమవుతాయి. ఇందులో అంబానీ చేనేత ఎంపోరియం, స్వదేశ్ కోసం ఫ్యాషన్ షో కూడా ఉంటుంది. ప్రతి డిజైన్‌ను మనీష్ మల్హోత్రా క్యూరేట్ చేస్తారు. మరోవైపు, నగరంలో తన రెస్టారెంట్ బంగ్లాను నడుపుతున్న మిచెలిన్ స్టార్ చెఫ్ వికాస్ ఖన్నా, దేశంలోని విభిన్న రుచులతో ప్రత్యేకంగా రూపొందించిన మెనూను అందిస్తారు. ఇంకా శంకర్ మహదేవన్, శ్రేయ ఘోషల్ ,రిషబ్ శర్మ వంటి సంగీతకారులు , గాయకులు కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనున్నారు.ఇదీ చదవండి: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ చర్య, భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి? -
అమేజింగ్ అమ్మాయిలు
ఈమె పేరు.. వలేరియా పేరస్. మిస్ ప్యూర్టో రికో! వృత్తిరీత్యా టీచర్. మిడిల్ స్కూల్ పిల్లలకు సైన్స్ బోధిస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు, ఆతిథ్యం గురించి వలేరియా పంచుకున్న విషయాలు... ‘‘మిస్ వరల్డ్ కోసం 119 మంది అమేజింగ్ అమ్మాయిలతో పోటీ వావ్ అనిపిస్తోంది. ఈ పోటీల కోసం ఇండియా.. ఎస్పెషల్లీ హైదరాబాద్ రావడం సూపర్బ్ ఫీలింగ్. ఇక్కడి హాస్పిటాలిటీ నాకు చాలా నచ్చింది. మా ఇంటిని, దేశాన్ని వదిలి ఎక్కడో సుదూర తీరాలకు వచ్చినట్టేమీ అనిపించడం లేదు. ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. మేమంతా భిన్న దేశాల నుంచి వచ్చినవాళ్లమనే భావన కలగట్లేదు. చాలా త్వరగా మా మధ్య బాండింగ్ ఏర్పడింది. ఇనాగ్యురల్ ఫంక్షన్ రోజు.. మేమంతా ఒకరికొకరం మేకప్ చేసుకున్నాం. హెయిర్ స్టయిల్ చేసుకున్నాం. జ్యూవెలరీ కూడా ఎక్సేఛేంజ్ చేసుకున్నాం. అంత అద్భుతమైన సిస్టర్హుడ్ డెవలప్ అయింది మా మధ్య! ఇక్కడికి రావడానికి ముందు కొంచెం భయమేసింది.. ఇక్కడి మనుషులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. వాతావరణం ఎలా ఉంటుందో అని! కానీ ల్యాండ్ అయ్యాక.. ఇక్కడి వాళ్ల మర్యాద చూస్తున్నాను కదా.. ట్రెమండస్! పహల్గామ్ ఘటనతో దేశంలో ఊహించని పరిణామాలు ఏర్పడ్డాయి కదా! అది కూడా కొంచెం భయపెట్టింది. ఫార్చునేట్లీ అంతా ప్రశాంతంగానే ఉంది. ఉండాలి కూడా! అయితే ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా మా సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది. మాకెలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకుంది. చూసుకుంటోంది. తెలంగాణ కల్చర్, ఆర్ట్.. రిచ్ అండ్ క్రియేటివ్‌గా ఉంది. ఫుడ్ కొంచెం కారంగా ఉన్నా డెలీషియస్‌గా ఉంది. నచ్చింది. నా బ్యూటీ విత్ పర్పస్ విషయానికి వస్తే.. ఆటిజం, డౌన్‌సిండ్రోమ్ పిల్లల కోసం వర్క్ చేస్తున్నాను. అంతేకాదు సమాజంలోని అట్టడుగు వర్గాల సాధికారత కోసమూ కృషిచేస్తున్నాను. మనుషులందరూ సమానమే! కాబట్టి అవకాశాలూ సమానంగా ఉండాలి. ఉన్నవాళ్లు, లేనివాళ్లు, జెండర్ విభేదాలు ఉండకూడదు. అంతేకాదు ప్రతివారికీ వారికే ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని వాళ్లు గుర్తించి, ఆ దిశగా వాళ్ల ప్రయాణం సాగేందుకు సాయపడుతున్నాను’’ అన్నారు వలేరియా.– రమ సరస్వతిఫొటో: ఎస్ ఎస్ ఠాకూర్ -
ఎథ్నిక్ వేర్‌కు పెరుగుతున్న ఆదరణ, భారీ సేల్స్
స్వదేశీ ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఫ్యాషన్ విభాగంలో ఎథ్నిక్ వేర్ (Ethnic Wear) కేటగిరీలో భారీ సేల్స్‌ను సాధించింది. ఒక్క ఏడాదిలో 60 లక్షలమంది కొనుగోదారులను తనఖాతాలో వేసుకుంది. అలాగే 90 శాతం రిపీటెడ్ కస్టమర్లు ఉన్నారని ఫిప్కార్ట్ ప్రకటించింది. టైర్ 2 , టైర్ 3 నగరాల నుండి బలమైన డిమాండ్ ఉందని తెలిపింది. సాంప్రదాయ దుస్తుల కొనుగోలుదారుల్లో 25–35 వాళ్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం మొత్తం దుకాణదారుల పరిమాణంలో 55 శాతం తమదే అని తెలిపింది. వాటా కలిగి ఉంది.ఇది తమ కస్టమర్విశ్వాసం, విధేయతను నిదర్శనమని, అలాగే ఈ పెరుగుదల డిజిటల్ స్వీకరణను మాత్రమే కాకుండా యువ భారతీయ వినియోగదారులలో అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ ప్రాధాన్యతలను కూడా ప్రతిబింబిస్తుందని పేర్కొంది.బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, పాట్నా, లక్నో, చెన్నై, పూణే, ముంబై , గౌహతి వంటి నగరాలు కీలకమైన డిమాండ్ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. మహిళల విభాగంలో 65శాతం కొనుగోళ్లు మహిళా దుకాణదారులుండగా, అయితే పురుషుల స్తులలో, 88శాతం లావాదేవీలు పురుషులే షాపింగ్ చేస్తున్నారు. భారతీయ దుస్తుల మార్కెట్లోని ప్రస్తుత ఫ్యాషన్ అనేది ప్రస్తుత పోకడలతో సాంప్రదాయ డిజైన్ల కలయిక, ఫ్యాషన్ వినియోగదారులను ఆకర్షించే ఇండో-వెస్ట్రన్ దుస్తులు మిళితంగా ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ గుప్తా తెలిపారు.ఎథ్నిక్ వేర్ విభాగంలో, ముఖ్యంగా చీరలు , కుర్తాలలో గణనీయమైన వృద్ధిని చూస్తున్నామన్నారు. గత సంవత్సరం స్టైల్ ట్రెండ్స్ పరంగా, కుర్తాలు 42 శాతం డిమాండ్‌తో ముందంజలో ఉన్నాయి, ఆ తర్వాత చీరలు 24 శాతం , కుర్తీలు 18 శాతం పెరిగాయి. నిర్దిష్ట శైలులు విపరీతమైన వృద్ధిని సాధించాయి: గత సంవత్సరంతో పోలిస్తే మే 2025లో అనార్కలి సూట్లు 45రెట్టు, చికంకారి కుర్తాలు 40రెట్లు, రెడీ-టు-వేర్ చీరలు 3రెట్లు పెరిగాయి. బ్లాక్ చీరలు లాంగ్ ఫ్రాక్‌ల కోసం ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. అలాగే ఈద్, దీపావళి , రక్షాబంధన్ సమయాల్లో కుర్తా సెట్లు గరిష్ట స్థాయికి చేరుకుంటుండగా, దుర్గా పూజ, ఓనం , పొంగల్ సమయాల్లో చీరలకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది.ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదాఇటీవలి నివేదికల ప్రకారం, 2024 నాటికి, భారతీయ ఎథ్నిక్ వేర్ మార్కెట్ విలువ సుమారు 197.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2033 నాటికి 558.5 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఆన్లైన్ షాపింగ్వృద్ధి ఈ గ్రోత్‌కు దోహదం చేస్తోంది. చదవండి: ఇవాళ ఏ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలబ్బా? ఇపుడిదే ట్రెండ్! -
తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదా
కాన్స్ ఫిలిం ఫెస్టివ్‌లో అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ బచ్చన్ మళ్లీ మెరిసింది. దశాబ్దానికి పైగా ప్రతిష్టాత్మక రెడ్‌కార్పెట్‌పై మెరుస్తున్న ఐశ్వర్య ఈ ఏడాది కూడా తన అందంతో అందర్నీ ఆశ్చర్యపర్చింది. భారతీయ సంస్కృతిని గౌరవించేలా దుస్తులతో ఫ్యాషన్ ప్రపంచాన్ని విస్మయ పర్చింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సుదీర్ఘ విరామం తర్వాత ఐశ్వర్య రాయ్ బచ్చన్ చీరలో మెరవడం ఒక విశేషమైతే, ముఖ్యంగా ఆమె ధరించిన కెంపుల హారం, ఇతర ఆభరణాలు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 51 ఏళ్ల వయసులో అందమైన బెనారసీ చీర, అందమైన నగలు నుదుట సింధూరంతో ముగ్ధమనోహరంగా మెరిసిన ఐశ్వర్య లుక్ పలువురి ప్రశంసలందుకుంది. కాన్స్‌లో తొలిసారి చీరలో మెరిసిన ఐశ్వర్య78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కనిపించడానికి ఐశ్వర్య రాయ్ బచ్చన్ మనీష్ మల్హోత్రాడిజైన్ చేసిన చీర, ఆభరణాలను ఎంచుకుంది. ఐవరీ, రోజ్ గోల్డ్ కలర్ బెనారసీ రియల్ సిల్వర్ జరీ ఎంబ్రాయిడరీ చీరలో రాయల్లుక్తో అదరగొట్టింది. వారణాసి ఫేడింగ్ సాంప్రదాయ కడ్వా టెక్నిక్‌తో హ్యాండ్ లూమ్ చీర ఆది తితో నేయబడింది.కడ్వా టెక్నిక్‌లో ప్రతి మోటిఫ్‌ను చాలా అందంగా తీర్చిద్దారు. అలాగే బంగారం, వెండితో తయారు చేసిన వైట్ టిష్యూ, జర్దోజీ ఎంబ్రాయిడరీతో చేతితో తయారుచేసిన దుపట్టాను ధరించింది. మొత్తంమీద, ఆమె లుక్ భారతీయ నైపుణ్యం, సంస్కృతి, వారసత్వాన్ని చాటి చెప్పింది. ఈ లుక్ ఫ్యాషన్ విమర్శకులను, అభిమానులను ఆకట్టుకుంది.సాధారణంగా కనిపించే పచ్చలకు బదులుగా కాన్స్ ఈవెంట్లో ఐశ్వర్య కెంపులతో రూపొందించిన లేయర్డ్ హారాన్ని , మ్యాచింగ్ చౌకర్ను ధరించింది. ఇవి కూడా మనీష్ మల్హోత్రా హౌస్నుంచి వచ్చినవే. ఐశ్వర్యతన ఐశ్వర్యాన్ని ప్రతిబింబించేలా 500 క్యారెట్ల మొజాంబిక్ కెంపుల పొడవైన అద్భుతమైన హారాన్ని ఎంచుకుంది.అన్కట్డైమండ్స్, కెంపులతో 30 క్యారెట్ల 18 క్యారెట్ల నాణ్యతగల బంగారంతో దీన్ని రూపొందించారు. దీనికి జతగా రూబీస్ స్టేట్మెంట్ రింగ్ ఐశ్వర్యకు రాయల్ లుక్నిచ్చింది. సంక్లిష్టమైన పూల డిజైన్‌లో తయారు చేసిన ఆభరణలు ప్రపంచ వేదికపై సాంప్రదాయ భారతీయ హస్తకళ ల అద్భుతాన్ని ప్రదర్శించారు.ఇదీ చదవండి: పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీఐశ్వర్య రాయ్ లుక్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇండియా సత్తాను ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సిందూర్ ను గుర్తుకు తెచ్చేలా ఐశ్వర్య రాయ్ సిందూర్ ధరించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఐశ్వర్య నిలిచిందంటూ కొనియాడారు.చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్ -
అందమైన సమాజం!!
హైదరాబాద్‌లోని ట్రై డెంట్ హోటల్లో మిస్ వరల్డ్ 2025 పాజంట్స్ మధ్య కలివిడిగా తిరుగుతున్నారు షానియా బాలెస్టర్. కొత్తగా కనిపించిన వారిని తానే ముందుగా పలకరించి ‘ఐ యామ్ ఫ్రమ్ జిబ్రాల్టర్’ అని పరిచయం చేసుకుంటోంది. దేశం పేరు అడగకుండానే చెబుతోంది, తన పేరు మాత్రం అడిగితే తప్ప చెప్పడం లేదు. ‘భౌగోళికంగా దేశాలుగా విడిపోయిన మనందరిదీ ఒకటే ప్రపంచం’ అన్నారు షానియా బాలెస్టర్. చిన్న దేశం ‘‘మిస్ వరల్డ్ 2025కి క్యాప్షన్ బ్యూటీ విత్ పర్పస్. నాకు సంబంధించినంత వరకు ప్రపంచపటంలో జిబ్రాల్టర్ అనే దేశం ఒకటుందని ప్రపంచానికి తెలియచేసే అరుదైన అవకాశం. జిబ్రాల్టర్ చాలా చిన్నదేశం. జనాభా ముప్ఫై ఐదు వేల లోపే. ప్రపంచంలోని అనేక ఖండాల నుంచి వచ్చి స్థిరపడిన వారితో మా దేశం రకరకాల సంస్కృతుల నిలయమైంది. దాంతో ఇండియా కూడా నాకు సుపరిచితమైన దేశంలానే అనిపిస్తోంది. హైదరాబాద్ ఆహారం కొంచెం ఘాటుగా అనిపించినప్పటికీ చాలా రుచిగా ఉంది. ప్రపంచానికి పరిచయం నా కెరీర్ మోడలింగ్. నాకు సంతోషాన్నిచ్చే పని చారిటీ. నాలుగేళ్ల నుంచి మోడలింగ్‌కు కొంత విరామం ఇచ్చి బ్యూటీ కాంటెస్ట్ మీద దృష్టి పెట్టాను. మిస్ జిబ్రాల్టర్ కిరీటంతోనే ఆగిపోయి ఉంటే ఆ విజయం నాకు మాత్రమే పరిమితమయ్యేది. నా విజయం నా దేశానికి ఉపయోగపడాలంటే అది ప్రపంచ వేదిక మీదనే సాధ్యమవుతుంది. మాది సార్వభౌమత్వం సాధించాల్సిన దేశం. ఇప్పుడు మాకున్న గుర్తింపు బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీగానే. ఈ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా వందకు పైగా దేశాలకు మా దేశం పరిచయమైంది. అందాల పోటీల ద్వారా దేశాలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమవుతాయి. ప్రపంచం అంతా ఒకటేననే భావన పెంపొందుతుంది. రెండు దేశాల మధ్య మాత్రమే కాదు ప్రపంచదేశాలన్నింటి మధ్య సుçహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. ఒక దేశం చరిత్ర మరొకరికి అర్థమవుతుంది, సాంస్కృతిక గొప్పదనం అవగతమవుతుంది. మనకిప్పటి వరకు తెలియని అనేక దేశాల గురించి తెలుసుకుంటాం. ఒకదేశం ఔన్నత్యం గురించి మరొక దేశంలో సందర్భోచితంగా తెలియచేయగలుగుతాం. అవసరమైన సందర్భంలో సంఘీభావంతో వ్యవహరించగలుగుతాం. అందం మనసుదే మా జిబ్రాల్టర్ చాలా చిన్నదేశమే కానీ సమాజం చాలా అందమైనది. వివక్ష లేని సమాజం మాది. స్త్రీ పురుషుల లిటరసీ రేట్ సమానం అని చెప్పడానికి గర్వంగా ఉంది. నిజానికి అందం అనేది బాహ్య సౌందర్యం కాదు. దయ, కరుణ, అర్థం చేసుకోవడం. ఎదుటి వారి కష్టాన్ని వారి దృష్టి కోణం నుంచి విశ్లేషించుకుని అర్థం చేసుకోగలిగిన మనసు ఉండడమే నిజమైన అందం. ఈ బ్యూటీ పాజంట్ తర్వాత కూడా నా సర్వీస్‌ని కొనసాగిస్తాను. అయితే భవిష్యత్తు ప్రణాళిక గురించి ఇప్పుడే చెప్పలేను. నా దేశం సార్వభౌమాధికారం సాధించడానికి నేనేం చేయగలనో అంతా చేస్తాను’’ అన్నారు మిస్ వరల్డ్ జిబ్రాల్టర్ షానియా బాలెస్టర్. మా జిబ్రాల్టర్ చాలా చిన్నదేశమే కానీ సమాజం చాలా అందమైనది. వివక్ష లేని సమాజం మాది. స్త్రీ పురుషుల లిటరసీ రేట్ సమానం అని చెప్పడానికి గర్వంగా ఉంది.– షానియా – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: ఎస్ ఎస్ ఠాకూర్ -
ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్
అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో (Cannes Film Fesitval 2025) అరంగేట్రం చేసింది. డెబ్యూలోనే తన అందం, ఫ్యాషన్ స్టైల్‌తో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. డిజైనర్ డ్రెస్, ముత్యాల దండలు, చక్కటి మేలిముసుగుతో తళుక్కున మెరిసింది. దీంతో 2025 కాన్స్‌లో భారతీయ అందగత్తెలు -ఉత్తమ లుక్ టైటిల్ జాన్వీకి ఇవ్వాలంటున్నారు ఫ్యాన్స్.బాలీవుడ్లో అత్యంత అందమైన నటీమణులలో ఒకరైన జాన్వీ కపూర్, తన అందమైన లుక్స్ ,నటనా నైపుణ్యాలతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తాజాగా బ్యూటీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బ్లష్ పింక్ త్రీ-పీస్ ఎథ్నిక్ డ్రెస్‌లో తనదైన స్టైల్లో అరంగేట్రం చేసింది.జాన్వీ రాబోయే చిత్రం హోమ్‌బౌండ్ 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్బంగా జాన్వీతోపాటు, నీరజ్ ఘయ్వాన్, ఇషాన్ ఖట్టర్, కరణ్ జోహార్ , విశాల్ జెత్వా కూడా రెడ్ కార్పెట్‌పై నడిచారు.ఘూంఘాట్లో జాన్వీ కపూర్ కాన్స్ అరంగేట్రం జాన్వీ లుక్‌ను ఆమె కజిన్ , సెలబ్రిటీ స్టైలిస్ట్ రియా కపూర్ స్టైల్ చేశారు. తరుణ్ తహ్లియాని ప్రత్యేకంగా రూపొందించినగౌనులో జాన్వీ కపూర్ మెరిసింది. 2022లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ ధరించిన ఫ్రాక్ అలా అనిపించినా, భిన్నమైన లుక్‌లో ఉంది. సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్, సావ్లీన్ మంచాంద జాన్వి లుక్ కు 90ల నాటి శ్రీ దేవి గ్లామ్ ను జోడించింది,లేత గులాబీ రంగులో , కార్సెట్ బాడీస్ బాటమ్, పొడవాటి ట్రాతో కూడిన స్కర్ట్‌ను ఆమె ఎంచుకుంది. దీనికి అందమైన ఘూంఘాట్ మరో హైలైట్‌గా నిలిచింది. దాన్ని తలపై కప్పుకుని మహారాణిలా జాన్వీ అడుగులు వేయడం స్పెషల్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor)డిజైనర్ డ్రెస్‌తో పాటు ముత్యాల ఆభరణాలు ఆమె లుక్‌కి మరింత హుందాతనాన్నిచ్చాయి. జాన్వీ నెక్లెస్‌ల స్టాక్‌తో సహా ముత్యాల నగలు ప్రత్యేక ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహంలేదు. చోపార్డ్ హౌస్‌కు చెందిన డైమండ్ పొదిగిన బ్రూచ్, డైమండ్ డ్రాప్ స్టైల్ పెండెంట్, లారియట్ స్టైల్ నెక్లెస్, ఒక సిగ్నేచర్ మల్టీ లేయర్డ్ నెక్లెస్‌తో షో స్టార్ గా నిలిచింది. దీనికి జతగా ప్లవర్ డిజైన్ డైమండ్ చెవిపోగులు, చక్కటి మేకప్ హెయిర్‌డోతో, ఆమె తన లుక్‌ను ఎలివేట్ చేసింది. -
Ananya Nagalla : అలరించిన ఫ్యాషన్ స్ట్రీట్ వాక్
సాక్షి, సిటీబ్యూరో: ’లెగ్దా డిజైన్ స్టూడియో’ వేదికగా నిర్వహించిన ‘ఫ్యాషన్ స్ట్రీట్ వాక్’లో నగరంలోని టాప్ మోడల్స్ అధునాతన ఫ్యాషన్ డిజైన్లతో అలరించారు. మహిళల ట్రెండీ డిజైన్స్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని కలర్ఫుల్గా మార్చుతున్న లెగ్దా డిజైన్ స్టూడియో నూతన బ్రాంచ్‌ను హబ్సిగూడలో సోమవారం టాలీవుడ్ తార అనన్య నాగళ్ల ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ దివ్య కర్నాటి, మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటి అనన్య నాగళ్ల మాట్లాడుతూ ఈ తరం అమ్మాయిల అందాలను ఇనుమడింపజేసే డ్రీమ్ డిజైన్లను సృష్టించడానికి లెగ్దా డిజైన్ స్టూడియో చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళలకు ఉపాధిని కల్పిస్తూ, వారి సృజనాత్మకతకు మద్దతుగా నిలుస్తున్న డిజైనర్ దివ్య కర్నాటి సేవలు మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌లో ఫ్యాషన్ స్టూడియో ఏర్పాటు చేయడం ఇక్కడి ష్యాషన్ హంగులకు, ఆదరణకు తార్కాణాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పేషెంట్‌ను పరిక్షించి డాక్టర్ మందులు ఇచ్చినట్టే, శరీర రూపురేఖలను బట్టి ఫ్యాషన్ దుస్తులను రూపొందించడం వినూత్న కళ అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.ఇదీ చదవండి: బీర్ బాటిళ్ల ట్రక్ బోల్తా: ఎగబడిన జనం, ఘోరం ఏంటంటే!గ్లోబల్ డిజైన్స్.. వైవిధ్యాన్ని కోరుకునే ఈ తరం యువతకు అధునాతన సృజనాత్మకతను జోడిస్తూ డిజైనింగ్ చేస్తున్నాం. ఇద్దరితో మొదలైన మా ప్రయాణం 30 మందికిపైగా ఫ్యాషన్ డిజైనర్లకు అవకాశాలను కలి్పస్తున్న ఫ్యాషన్ సెంటర్‌గా ఆవిష్కృతమైంది. గ్లోబల్ ట్రెండ్స్‌కు అనుగుణంగా డిజైన్స్‌ను రూపొందిస్తున్నాం. – దివ్య కర్నాటి, లెగ్దా డిజైన్ స్టూడియో నిర్వాహకులు -
Miss world 2025 బ్యూటీఫుల్ గేమ్స్
మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ టాలెంట్, బ్యూటి విత్ ఎ పర్పస్, బెస్ట్ స్విమ్ సూట్, నైట్ గౌన్, మిస్ ఫొటోజెనిక్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ హెయిర్.. స్కిన్ వంటి రౌండ్స్ ఉన్నట్టే స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. మిస్ వరల్డ్ 2025 పోటీలో భాగంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో ఘనంగా జరిగిన ఈ రౌండ్లో మిస్ ఎస్టోనియా.. ఎలిస్ రాండ్మా విజయం అందుకున్నారు. మొదటి రన్నరప్‌గా మిస్ మార్టీనిక్ ఆరేలీ జోచిమ్, రెండో రన్నరప్‌గా మిస్ కెనడా మారిసన్ నిలిచారు. వాళ్ల వివరాలు..మిస్ ఎస్టోనియా.. ఎలిస్ రాండ్మా1999 నుంచి ఇప్పటివరకు ఎస్టోనియా దేశం.. మిస్ వరల్డ్ పోటీల్లో స్పోర్ట్స్ ఈవెంట్లో గెలిచి, ఈ బ్యూటీ పాజెంట్లోని తర్వాత రౌండ్స్‌కి అర్హత పొందడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో మిస్ ఎస్టోనియా ఎలిస్ రాండ్మా.. యూరప్ టాప్ టెన్ ఫైనలిస్ట్స్, టాప్ 40 ఫైనలిస్ట్స్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఎస్టోనియాలోని కిర్నాకు చెందిన ఎలిస్.. ఐటీ సిస్టమ్ డెవలప్మెంట్ గ్రాడ్యుయేట్. సేల్స్ కన్సల్టెంట్‌గా, స్టోర్ మేనేజర్‌గా, రాడిసన్ మెరిటన్ పార్క్ ఇన్ హోటల్లో హోస్టెస్‌గా, జూనియర్ ఐటీ డెవలప్మెంట్ స్పెషలిస్ట్‌గా.. రకరకాల ఉద్యోగాలు చేసింది. మోడలింగ్ అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ఆన్లైన్ చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆమె వాటినే తన బ్యూటీ విత్ ఎ పర్పస్‌గా పేర్కొంది. ‘స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్లో స్వర్ణం సాధించడం చాలా సంతోషంగా ఉంది. గెలుస్తానో లేదో అనుకున్నా కానీ సులభంగానే గెలిచాను. నిజానికిదో చాలెంజ్.. గొప్ప అనుభవం! జీవితంలోని ఒడిదుడుకులను ఎలా అధిగమించవచ్చో నేర్పే ఈవెంట్ ఇది. లైఫ్‌కి చాలా ఉపయోగపడుతుంది!’ అని ఆ ఈవెంట్ గురించి చెప్పింది ఎలిస్. మిస్ మార్టీనిక్.. ఆరేలీ జోచిమ్..మార్టీనిక్లోని డ్యూకోస్ పట్టణానికి చెందిన ఆరేలీ జోచిమ్.. హైజీన్ సేఫ్టీ ఎన్వైర్మెంట్ స్టడీస్‌లో డి΄్లోమా చేసింది. నిత్యం నవ్వుతూ ఉండే ఆరేలీకి ప్రకృతి అంటేప్రాణం. జీవితాన్ని చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటా నంటోంది. తన జీవితానుభవాలు, తన భావోద్వేగ ప్రయాణాల స్ఫూర్తితో ‘మెసొన్ లాన్మూర్ (ప్రేమాలయం)’ అనే సంస్థను స్థాపించి మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. దీని గురించే ఆమె ‘బ్యూటీ విత్ ఎ పర్పస్ రౌండ్’లో ముచ్చటించనుంది. ‘బాడీ ఫిట్‌గా ఉండాలంటే స్పోర్ట్స్ చాలా అవసరం. ఏప్రొఫెషన్లో ఉన్నా ఆటల పట్ల ఆసక్తి పెంచుకుని ఏదో ఒక స్పోర్ట్‌ని ప్రాక్టీస్ చేస్తే శారీరకంగానే కాదు మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాం. ఇది మన రెగ్యులర్ప్రొఫెషన్లో సక్సెస్‌కి చాలా ఉపయోగపడుతుంది’ అంటుంది ఆరేలీ జోచిమ్.మిస్ కెనడా.. ఎమ్మా మారిసన్.. కెనడా, ఓంటారియోలోని ఓ చిన్న పట్టణం (Chapleau) లో పుట్టి, పెరిగిన ఎమ్మా.. మిస్ కెనడా కిరీటాన్ని ధరించిన స్థానిక ఆదిమ తెగకు చెందిన తొలి యువతి. ఇండిజినస్ ప్రిపరేటరీ స్టడీస్ అండ్ టూరిజంలో డిగ్రీ చేసింది. ఈస్థటిక్స్ అండ్ హెయిర్‌కి సంబంధించిన కోర్స్ కూడా చదివింది. అందాల పోటీ అంటే స్కిన్ షో కాదని, సామాజిక బాధ్యతను గుర్తించే వేదికని తెలిశాక.. ఆ పోటీల పట్ల మక్కువ పెంచుకుంది.బ్యూటీ పాజెంట్స్లో పాల్గొంది. ‘రిబ్బన్ స్కర్ట్స్’ అనే కార్యక్రమం ద్వారా తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోంది. ‘రిబ్బన్ స్కర్ట్స్’ అనేది తమ తెగ మహిళలకు సంబంధించిన ఒక సంప్రదాయ నేత. దాన్ని వాళ్లు తమ చరిత్ర, సాంస్కృతిక సంబరాలకు ఒక గుర్తుగా భావిస్తారు. దాన్నే ఆమె తన సామాజిక సేవా కార్యక్రమంగా ఎంచుకుంది. ‘ఎందుకంటే కెనడాలో మైదానప్రాంతపు అమ్మాయిల కన్నా పన్నెండింతలు మా తెగకు చెందిన అమ్మాయిలు అదీ పదిహేనేళ్లలోపే శారీరక, లైంగిక దాడులకు బలవుతున్నారు. ఇదీ చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలుదీన్ని నిలువరించి మా తెగలోని అమ్మాయిలు సాధికారత సాధించేందుకే నేను ‘రిబ్బన్ స్కర్ట్స్’ పేరుతో సామాజిక కార్యక్రమాలను స్టార్ట్ చేశాను. స్వావలంబన తో మావాళ్లను నాగరిక సమాజానికి కనెక్ట్ చేయాలన్నదే నా లక్ష్యం. ఇదే నా బ్యూటీ విత్ పర్పస్’ అంటుంది ఎమ్మా. మిస్ వరల్డ్ అందాల పోటీలలో సెకండ్ రన్నరప్ గెలుపు గురించి మాట్లాడుతూ ‘గొప్ప ఎక్స్‌పీరియెన్స్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వాళ్లతో పోటీపడి విజేతగా నిలవడం మరచిపోని అనుభూతి. తర్వాత దశకు ఇదొక స్ఫూర్తి. నా బలాబలాలు తెలుసుకోవడానికి ఈ స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్ చాలా ఉపయోగపడింది. దీంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని చెప్పింది. చదవండి: నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే! -
మెరిసిన చేనేత.. మురిసిన భామలు
పోచంపల్లి ఇక్కత్ చీరలు, ఇక్కత్ వస్త్రాలు, విశ్వవ్యాప్తంగా తరలివచ్చిన సుందరాంగుల మనసు దోచుకున్నాయి. చేనేత కళాకారుల వస్త్ర డిజైన్లను చూసి వారు ముగ్ధులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రపంచ సిల్క్ సిటీ భూదాన్ పోచంపల్లిలో.. ప్రపంచ సుందరీమణుల పోటీదారుల పర్యటనలో అడుగడుగునా చేనేత వస్త్ర కళా వైభవం కళ్లకు కట్టింది. చేనేత చీరలు, వస్త్రాలను చూసి విదేశీ వనితలు మురిసిపోయారు. ఈ సందర్భంగా కొన్ని వస్త్రాలను ధరించి ఇక్కత్ చీరల తయారీ ప్రక్రియ, డిజైన్ల వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్ చీరల నేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి మరోసారి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. తెలంగాణ పర్యాటక శాఖ.. చేనేతను మరింత ప్రచారంలోకి తీసుకురావడంలో విజయవంతమైంది.అందగత్తెలతో ప్రపంచం దృష్టికి..పోచంపల్లిలో అందాల భామల పర్యటనతో చేనేత, ఇక్కత్ వస్త్రాలు ప్రపంచానికి మరోసారి పరిచయమైనట్లయింది. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చేనేత కళాకారుల ప్రతిభకు గుర్తింపు దక్కేలా ప్రభుత్వం కృషి చేసింది. పోచంపల్లికి వచ్చిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు.. పోచంపల్లి చీరల తయారీ, డిజైన్, అద్దకం ఇక్కత్ వస్త్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క చీర తయారీకి కళాకారులు తీసుకునే శ్రమ, డిజైన్ల సృజనాత్మకత.. పోటీదారుల మనస్సును హత్తుకున్నాయి. చీరలపై భిన్న డిజైన్లను తిలకించిన అందగత్తెలు పరవశించిపోయారు. రంగు రంగుల డిజైన్లతో ఉన్న ఇక్కత్, డబుల్ ఇక్కత్ చీరలు, శాలువాలు, డ్రెస్ మెటీరియల్, కాటన్, పట్టు చీరలను చేతితో తడిమి మరీ చూశారు. పోచంపల్లి, వెంకటగిరి ,గొల్లభామ, నారాయణపేట చీరలు, వస్త్రాల ప్రదర్శన సుందరీమణులను ఆకట్టుకుంది.ర్యాంప్ వాక్‌తో మెరుగులు దిద్ది..అందగత్తెలకే అసూయ పుట్టేలా నిర్వహించిన ఫ్యాషన్ షో.. పోచంపల్లి సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ అందగత్తెలే అచ్చెరువొందేలా హైదరాబాద్, ఢిల్లీకి చెందిన భారతీయ మోడల్స్.. ఇక్కత్ చీరలు, వస్త్రాల ఫ్యాషన్ షో అద్భుతంగా సాగింది. సంప్రదాయం, ఆధునికత ఉట్టిపడేలా రూపొందించిన డిజైన్లు ధరించిన చేనేత, ఇక్కత్ వస్త్రాలతో యువతీ యువకులు ప్రపంచానికి ఆధునికత జోడించిన చేనేత దుస్తులను పరిచయం చేశారు. ర్యాంప్‌వాక్ అదుర్స్ర్యాంప్వాక్లో చేనేత డిజైన్లతో మోడల్స్ ధరించిన దుస్తులను..ప్రపంచ అందగత్తెలు కళ్లార్పకుండా చూ స్తూ చప్పట్లు, కేరింతలతో ప్రోత్సహించారు. ప్రపంచ సుందరీమణులు, స్థానిక మోడల్స్ ధరించిన చేనేత వస్త్రాలతో వేదిక చేనేతను విశ్వవ్యాప్తం చేసింది. 1956లో పోచంపల్లిలో పట్టు పరిశ్రమకు బీజం పోచంపల్లి టైఅండ్‌డై ఇక్కత్ చేనేత కళారంగం ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. 1956లో పోచంపల్లిలో పట్టు పరిశ్రమకు బీజం పడింది. మొదటిసారిగా పోచంపల్లికి చెందిన కర్నాటి అనంతరాములు, తడక పెద్దయాదగిరిలు నిలువు, పేక పద్ధతిలో సహజరంగులతో పట్టు చీరలను నేశారు. నాటి నుంచి ఎందరో చేనేత కళాకారులు ప్రయోగాలు చేస్తూ నూతన డిజైన్లు సృష్టిస్తూ చేనేత కళను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ప్రపంచాధినేతల ఆకట్టుకునేలా ఇక్కత్ వస్త్రాలుపోచంపల్లి ఇక్కత్ కళ ప్రపంచ వ్యాప్తమైంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య బ్రిగ్గేట్టే మెక్రాన్‌కు.. ఇక్కడి నేతన్నలు నేసిన ఇక్కత్ చీరను బహూకరించారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ప్రపంచ పర్యాటక సంస్థ.. 2021లో పోచంపల్లికి ‘అంతర్జాతీయ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు’ బహూకరించడంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. చేనేత కుటీర పరిశ్రమ ద్వారా సంప్రదాయ వృత్తి, వారసత్వ సంపదను కాపాడుకుంటూనే పలువురు ఉపా«ధి పొందుతున్నందుకు ఈ గుర్తింపు ఇచ్చారు. పోచంపల్లి వస్త్రాలు తప్పనిసరి.. దేశ, విదేశాల్లో జరిగే అంతర్జాతీయ సదస్సుల్లో అతిథులకు పోచంపల్లి శాలువాను కప్పడం సంప్రదాయంగా మారింది. ఇక్కత్ చేనేత వస్త్రాలను సిల్క్, కాటన్, సిల్క్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్స్, రజయ్ (క్విల్స్), స్టోల్స్, స్కార్ప్, దుప్పట్టా, డోర్, టేబుల్ కర్టెన్లు, పిల్లో కవర్లు తదితర వెరైటీలు దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆఫ్రికా, యూరప్, అమెరికాలకు వెళ్తున్నాయి. ముస్లిం దేశాలలో మహిళలు ముఖానికి ధరించే స్కార్ఫ్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇక అపెరల్ ఫ్యాబ్రిక్, హోమ్ ఫర్నిషింగ్, డ్రెస్ మెటీరియల్స్‌ను యూరప్ దేశాల ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు.పేటెంట్ హక్కులతో ముందుకు..పోచంపల్లి వస్త్రాలకు మొట్టమొదటిసారిగా 2003లో కేంద్ర ప్రభుత్వం జియొగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ (పేటెంట్) సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక్కత్ కళ దేశంలో మరెక్కడా లేదు. మారుతున్న కాలానుగుణంగా ఇక్కడి చేనేత కళాకారులు పోచంపల్లి ఇక్కత్ డిజైన్లలో గద్వాల, కంచి, ధర్మవరంతో పాటు కొత్త కొత్త డిజైన్లు వచ్చేలా వినూత్న ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. కాగా పేటెంట్ హక్కులు పొందినప్పటికీ.. నకిలీ వస్త్రాల తయారీ చేనేత వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇక్కత్ యూనివర్సల్ బ్రాండ్ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పోచంపల్లి టై అండ్ డైలోనే ఇక్కత్ ఉంది. ఇక్కత్ అనేది ఒక యూనివర్సల్ బ్రాండ్. చేనేత చీరలు పూర్తిగా చేతితో మగ్గంపై ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న సంప్రదాయ కళ. నూలు ఉడకబెట్టడం, రంగుల అద్దకం వంటి చేతి వృత్తి. ఎంతో మంది మహిళలు ఇక్కత్ చీరల పనితో జీవనోపాధి పొందుతున్నారు. పోచంపల్లి చీరల డిజైన్ కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో గుర్తింపు పొందాయి. – ఎం.హనుమంతరావు, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లాచేనేతకు ప్రభుత్వం చేయూత తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ సుందరీమణుల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన అందాల భామలు పోచంపల్లి చీరలు, వస్త్రాలకు ముగ్ధులయ్యారు. ప్రపంచ పటంలో పోచంపల్లి కళాకారులు రూపొందించిన వస్త్రం సంపద వెల కట్టలేనిది. సీఎం రేవంత్ అధ్వర్యంలోని ప్రభుత్వం చేనేతకు చేయూత నిస్తోంది. – కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి(చదవండి: మన శక్తిని నమ్ముకుందాం నటాషా న్యో న్యో జీ.. మిస్ యుగాండా! ) -
గుడి సేవకులు.. దేవుడిచ్చిన బంధాలు
పల్లకీలోని అమ్మాయి పేరు హిమబిందు. తండ్రి ఆవులశెట్టి చంద్రశేఖరప్ప వస్త్ర దుకాణం నిర్వహిస్తుండగా, తల్లి లక్ష్మీదేవి గృహిణి. బీసీఏ పూర్తి చేసిన ఈమె ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలు. మూడేళ్లుగా తన వంతు సేవగా ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. ఈ అమ్మాయి ఎదురొచ్చి టెంకాయ కొడితే కానీ ఆ బృందం బయలుదేరుతున్న బస్సు కదలదు. అంతటి సెంటిమెంట్. పల్లకీ మోస్తున్నారంటే వాళ్లు సొంత మేనమామలు అనుకుంటే పొరపాటు. గుడి సేవ బృందంలోని సభ్యులు ఎంచుకున్న తోవ ఇది. తమతో పాటు సేవలో పాల్గొనే అమ్మాయిల పెళ్లి సందర్భంగా ఈ ‘పల్లకీ సేవ’ ఇంటి మనుషులుగా సొంత ఖర్చుతో నిర్వహిస్తుండటం విశేషం. కర్నూలు కల్చరల్: అమ్మాయిని ఓ అయ్య చేతిలో పెట్టాలంటే తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండదు. పెళ్లి చూపులు మొదలు.. అప్పగింతల వరకు ఒకటే హడావుడి. కాంక్రీట్ వనాల్లో ఎవరికి వారుగా బతుకున్న రోజుల్లో బంధాలు, బంధుత్వాలు గుర్తుకు తెచ్చుకున్నా కళ్ల ముందు మెదలని పరిస్థితి. సొంతూళ్లకు దూరంగా, సప్త సముద్రాలకు అవతల ఉద్యోగాలు చేస్తున్న వారికి వరుసలు తెలియవు, ఉన్న ఊళ్లో ఎవరిని ఏమని పిలవాలో దిక్కుతోచదు. అలాంటిది పెళ్లి అనగానే.. తల్లిదండ్రుల గుండెలు బరువెక్కుతాయి. అమ్మో.. ఇంత తక్కువ సమయమా? అనే మాట వినపడటం సర్వ సాధారణం. అయితే ముక్కూమొహం తెలియని వాళ్లు, మేమున్నామని భరోసా కల్పిస్తే.. సొంత మేనమామళ్లా హడావుడి చేస్తే.. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా మెలుగుతుంటే.. జీవితంలో అంతకంటే సంతోషం ఏముంటుంది. ఈ కోవకు చెందినదే ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’. కార్యక్రమం చేశామా, వెళ్లిపోయామా అన్నట్లు కాకుండా.. ఈ బృందం ఓ కుటుంబంలా మెలుగుతోంది. కష్టాలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ.. సంతోషాలను కలిసి పంచుకుంటున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. వాట్సాప్ గ్రూపులో 1,500 పైనే సభ్యులు మొదట అరకొరగా మొదలైన మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత వాట్సాప్ గ్రూపు దినదిన ప్రవర్దమానంగా వెలుగొందుతోంది. ప్రస్తుతం ఈ గ్రూపులో 1,500 మందికి పైగానే సభ్యులు. ఎంపిక చేసుకున్న గుడి వివరాలను గ్రూపులో తెలియజేసి కార్యక్రమం నిర్వహణలో పాల్పంచుకునేందుకు ఆసక్తి కలిగిన సభ్యుల వివరాలతో జాబితా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత అవసరమైన మేరకు సభ్యులకు అవకాశం కలి్పస్తున్నారు. మరో కార్యక్రమంలో మిగిలిన వారికి ఆ భాగ్యం లభిస్తోంది. ఇప్పటి 123 దేవాలయాల్లో కార్యక్రమం నంద్యాలలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో మొదలైన కార్యక్రమం ఇప్పటి వరకు 123 దేవాలయాల్లో తమ సేవను విస్తరించడం విశేషం. కాశీలోని విశాలక్ష్మి గుడిలో ఏకంగా 9 రోజుల పాటు ఈ బృందం తమ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లకీలో పెళ్లి కూతురు‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలైన హిమబిందు స్వస్థలం నంద్యాల కాగా.. వివాహం ఆదివారం కర్నూలు నగరంలో నిర్వహించారు. వరుడు వీర నవీన్. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వివాహం సందర్భంగా బృందం సభ్యులు సు మారు 150 మంది హాజరయ్యారు. వీరు పల్లకీని తీసుకొచ్చి పెళ్లి మంటపానికి తీసుకొస్తున్న తీరుకు వివాహానికి హాజరైన అతిథులు ఆశ్చర్యచకితులయ్యారు. ఎవరికి ఎవరో అన్నట్లుగా బతుకుతున్న రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని చర్చించుకోవడం విశేషం. -
ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!
గ్లామర్, గ్రేస్, క్లాస్, క్యూట్... ఇలా అందాన్ని పొగిడే ఎన్ని పదాలున్నా, అన్నింటినీ కలిపి ఒకేసారి వాడినా కూడా నటి రాశీ ఖన్నా ఫ్యాషన్ లుక్స్‌ని నిర్వచించలేం. ట్రెడిషనల్ నుంచి జెండర్ ఫ్లూయిడ్ ఫ్యాషన్ వరకు ప్రతి స్టయిలింగ్లోనూ తన ఫ్యాషన్ స్టేట్మెంట్ స్కోర్ సెంచరీనే! అలాంటి ఒక ఫస్ట్‌క్లాస్ లుక్, ఇందుకోసం తను ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ అండ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూసేయండి. చెవి కప్పేస్తే కళ్లకందం దుద్దులు, బుట్టకమ్మలు, జూకాలు– ఇలా ఎన్ని రకాల కర్ణాభరణాలున్నా, వేటి గొప్ప వాటికే ఉంటుంది. అలా ఒకప్పటి గొప్ప ఆభరణం. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదే ఫుల్ కవర్డ్ ఇయర్ కఫ్స్. ఇవి సాధారణ ఇయర్ కఫ్స్లాగా సపరేట్గా ఉండవు. కింద కమ్మలతోపాటే, కఫ్ రెండూ కలిపి ఒకే తరహా డిజైన్‌లో ఉంటాయి. వీటిని చెవికి పెట్టుకోకుండా హుక్తో తగిలించుకుంటే చాలు. సంప్రదాయ దుస్తులకు ఇది సరైన జోడీ. వేడుకల్లో వీటిని ధరిస్తే ప్రత్యేక ఆకర్షణగా మీరే నిలుస్తారు. అయితే, ఇలాంటి ఇయర్ కఫ్స్ వేసుకునేటప్పుడు మెడను బోసిగా ఉంచుకోవాలి. అప్పుడే వీటి లుక్ ఎలివేట్ అవుతుంది. హెయిర్ స్టయిల్ కూడా బన్ లేదా సెంటర్ బన్ వేసుకోవాలి. వేవీ లేదా లూస్ హెయిర్ స్టయిల్ అస్సలు నప్పదు దీనికి. అలాగే మరో చిన్న టిప్ ఏంటంటే, మొత్తం ఎఫర్ట్ చెవులకే కాకుండా, కాస్త చేతులకు కూడా ఇవ్వండి. అంటే చేతికి మీ డ్రెస్‌కు తగ్గట్టు మ్యాచింగ్ గాజులు వేసుకుని లుక్‌ని కాస్త బ్రైట్ చేయండి. అచ్చం నటి రాశీ ఖన్నా లాగా.. "ఫ్యాషన్‌లో లెస్ ఈజ్ మోర్ అనే ఫిలాసఫీని నమ్ముతా. అలాగని, ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేయడానికి భయపడను. ఎలాంటి దుస్తులనైనా ఆత్మవిశ్వాసంతో ధరిస్తే, అందంగా కనిపిస్తారు." అంటోంది రాశీ ఖన్న. ఇక్కడ రాశీ కన్నా ధరించిన ఇయర్ రింగ్స్ బ్రాండ్: కోహర్ బై కనికాధర రూ. 6,500/-.(చదవండి: 'వాటర్ బర్త్' అంటే..? నటి కల్కి కోచ్లిన్ ప్రసవ అనుభవం..) -
కాన్స్‌లో గర్వంగా.. అందంగా : ఈ బ్యూటీ డ్రెస్ స్పెషల్ ఏంటో తెలిస్తే..!
ప్రతిష్టాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో (CannesFilmFestival-2025) నటి , వ్యవస్థాపకు రాలు పరుల్ గులాటి(Parul Gulati) బోల్డ్‌గా అరంగేట్రం చేసింది. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రముఖ దర్శకుడు అరి ఆస్టర్ తాజా చిత్రం ఎడింగ్టన్ ప్రపంచ ప్రీమియర్‌కు హాజరైన అందర్నీ ఆశ్చర్యపర్చింది. పరుల్ గులాటి తన సొంత హెయిర్ ఎక్స్టెన్షన్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ, ప్రదర్శిస్తూ రెడ్ కార్పెట్‌పై నడిచింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన రెడ్ కార్పెట్ మీద అందం, ధైర్యం, వ్యాపారాన్ని మిళితం చేసి జుట్టుతో ప్రత్యేకంగా తయారుచేసిన దుస్తులతో ఐకానిక్ అరంగేట్రం విశేషంగా నిలిచింది. పరుల్, అత్యంత ప్రత్యేకమైన, విచిత్రమైన దుస్తులలో అందరి దృష్టిని ఆకర్షించింది. కస్టమ్-మేడ్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించింది. పూర్తిగా జుట్టుతో తయారు చేసిన స్ట్రాప్‌లెస్ బ్లాక్ డ్రెస్‌లో పరుల్ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టింది. ఈ దుస్తులను రూపొందించడానికి నెల కంటే ఎక్కువ సమయం పట్టిందని, దీనికి 12 మంది నైపుణ్యం కలిగిన కళాకారులు శ్రమించిఆరు. ఈ డ్రెస్‌తో పాటు, స్టేట్మెంట్ డైమండ్ చెవిపోగులు, బోల్డ్ చంకీ రింగ్, ఓపెన్-టో బ్లాక్ హీల్స్‌తో హుందాగా అడుగులు వేసింది. ఈ స్పెషల్ కాస్ట్యూమ్‌కు రిద్ధి బన్సాల్ తో పాటు ప్రఖ్యాత స్టైలిష్ , డిజైనర్ మోహిత్ రాయ్ కూడా జీవం పోశారుతన లుక్ వెనుక ఉన్న భావోద్వేగ , సృజనాత్మక ఉద్దేశ్యాన్ని వివరించింది ఈ బ్యూటీ.- " పూర్తిగా మానవ జుట్టుతో తయారు చేసిన దుస్తులను ధరించడం అంటే ఫ్యాషన్ సరిహద్దులను దాటడం మాత్రమే కాదు. ఇది నేనే అని చాలా బిగ్గరగా మాట్లాడే దుస్తులు.. నేను ‘నిష్ హెయిర్’ వ్యవస్థాపకురాలిగా నా స్వంత బ్రాండ్ జుట్టును ధరిస్తున్నాను. నా దృష్టికి ప్రాణం పోసిన నా డిజైనర్ స్నేహితుడు మోహిత్ రాయ్ తో కలిసి..జడను జడగా అల్లిన కథ ఇది. కాన్స్ వంటి ఐకానిక్ వేదికపై నా సృజనాత్మక, వ్యాపారానికి ప్రాతినిధ్యం వహించడం నేను ఎప్పటికీ మర్చిపోలేని క్షణం. రెడ్ కార్పెట్ తన కల’’ అని పేర్కొంది.ఈ ప్రత్యేకమైన హెయిర్-మేడ్ డ్రెస్‌తో పరుల్ ప్రత్యేకంగా నిలబడటం మాత్రమే కాదు, మహిళలు తమ అందాన్ని నమ్మకంగా స్వీకరించేలా, ఒక వ్యవస్థాపకురాలిగా పరుల్ ప్రయాణానికి సింబాలిక్‌గా ఉందంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. -
Miss world 2025 హైదరాబాద్ నగరానికి గ్లోబల్ గుర్తింపు
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండటం విదితమే. అయితే మిస్ వరల్డ్ అనేది ఒక ప్రముఖ అంతర్జాతీయ వేదిక. ఈ వేడుక ఎక్కడ జరిగినా దీనికి గ్లోబల్ వేదికగా ప్రచారం, స్పందన ఉండటం సర్వసాధారణం. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఈసారి స్పందన మాత్రం ఇంతకు ముందెన్నడూ లేనంతగా వస్తోంది. దీనికి తోడు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అంతా ఒక్కో రోజు ఒక్కో ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శిస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారం మొత్తం సోషల్ యాప్స్‌లో వైరల్‌గా మారుతోంది. ఈ తరుణంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించిన నగరంలోని, రాష్ట్రంలోని ప్రాంతాలన్నీ అంతర్జాతీయ ఆన్లైన్ వేదికగా మరింత గుర్తింపు పొందుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ నగరానికి గ్లోబల్ గుర్తింపును తీసుకొచ్చింది. ప్రముఖుల సోషల్ మీడియా పోస్టులు, వివాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఈవెంట్‌ను మరింత విశేషంగా మార్చాయి. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ పోటీలు కీలక పాత్ర పోషించాయి. ఈ వేడుక కేవలం అందాల పండుగగా మాత్రమే కాకుండా, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ అంశాల్లో దేశవ్యాప్తంగ చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ పోటీల నేపథ్యంలో ప్రముఖ సినీ తారలు, క్రీడా ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు చేస్తున్న పోస్టులు, వ్యాఖ్యలు ఈ మిస్ వరల్డ్ ఈవెంట్‌ను మరింత విశేషంగా మార్చుతున్నాయి. క్రిస్టినా పిస్కోవాతో మొదలు.. ఈ నెల్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కాకముందే మాజీ మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సారి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి మొదట ఆన్లైన్, సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయ్యింది. ‘ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్య ఘట్టం’ అంటూ ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌కు విశేష స్పందన లభించింది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలుచార్మినార్, లాడ్ బజార్, ఎక్స్పీరియం పార్క్, రామప్ప ఆలయం వంటి ప్రదేశాల్లో కంటెస్టెంట్స్ తీసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ముఖ్యంగా వందల ఏళ్ల హైదరాబాద్ చరిత్రకు నిదర్శనంగా నిలిచిన చార్మినార్ వద్ద 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ తారల సందడికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. అంతేకాదు.. ప్రత్యేకంగా రామప్ప ఆలయంలో మహిళలు కంటెస్టెంట్స్ పాదాలను కడుగుతున్న వీడియో వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై మహిళా హక్కుల సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు.రాజకీయ స్పందనలు.. బీఆర్ఎస్ నేత కేటీఆర్, మిస్ వరల్డ్ ఈవెంట్‌కు రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించి, వాస్తవ ఖర్చు రూ.27 కోట్లు మాత్రమేనని, దానిలో మిగతా భాగం స్పాన్సర్‌షిప్‌ల ద్వారా సమకూర్చబడిందని సంబంధిత అధికారులు, ప్రతినిధులు తెలిపారు. ఆధ్యాత్మికతకు అద్భుత స్పందన.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేయి స్తంభాల దేవాలయం, రామప్ప ఆలయాల సందర్శనతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు భారత ఆధ్యాతి్మకతపై ప్రత్యేక అనుభూతి కలిగింది. శిల్ప కళ, గోపురాల లోతైన అర్థాల్ని వారు గౌరవంతో స్వీకరించడం గమనార్హం. రామప్ప ఆలయం వద్ద వారు యోగా మరియు ధ్యానం చేసిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా సంచలనం.. ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రం సాంస్కృతికంగా ఎంత విస్తృతమైందో ప్రపంచానికి తెలిసింది. ప్రపంచ నెటిజన్ల దృష్టి ఇప్పుడు హైదరాబాద్ మీదే. ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ అంతా ఈ కంటెస్టెంట్స్ లొకల్ ట్రెడిషనల్ దుస్తుల్లో ఫొటోలు, వీడియోలతో కళకళలాడుతోంది. స్థానికులు తమ సంప్రదాయాన్ని అంతర్జాతీయ వేదికపై చూసి గర్వపడుతున్నారు. పర్యాటక అభివృద్ధికి బలమైన వేదిక.. ఈ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖకు ఒక బలమైన ప్రచార మాధ్యమంగా మారింది. ఇప్పటికే విదేశాల నుంచి ‘తెలంగాణ టూరిజం’ వెబ్సైట్ ట్రాఫిక్ గణనీయంగా పెరిగిందని సమాచారం. యాదాద్రి దేవాలయం యొక్క ఆధునీకరణ, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వంటి అంశాలు ప్రపంచం ముందు నిలబెట్టే ఈ సందర్భం, రాష్ట్ర అభివృద్ధికి బంగారు అవకాశంగా మారుతోంది. మిస్ వరల్డ్ పోటీలు కేవలం అందానికి మాత్రమే కాదు.. సంస్కృతి, చైతన్యం, స్త్రీ శక్తిని ప్రదర్శించడానికి మార్గంగా మారింది.. ఈసారి హైదరాబాదులో జరిగిన ఈవెంట్ భారత్‌ను, ముఖ్యంగా తెలంగాణను గ్లోబల్ మాప్‌పై మరింత ప్రకాశింపజేసింది. ఇది దేశానికి గర్వకారణమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ ఈవెంట్లకు మార్గదర్శకంగా నిలుస్తుంది. అంతర్జాతీయ కంటెస్టెంట్స్.. తెలంగాణ సంస్కృతిపై మక్కువతో మిస్ వరల్డ్ యుఎస్ఏ, మిస్ వరల్డ్ దక్షిణాఫ్రికా, మిస్ వరల్డ్ శ్రీలంక వంటి కంటెస్టెంట్స్, తెలంగాణ సంస్కృతి, చారిత్రక ప్రదేశాలపై తమ మక్కువను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. ‘ఇండియాలోని వైవిధ్యాన్ని అనుభవించడం గొప్ప అనుభూతి’ అంటూ వారు పేర్కొన్నారు. పీవీ సింధు, నిఖత్ జరీన్ : తెలంగాణకు స్వాగతం తెలంగాణకు చెందిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌లు తమ సోషల్ మీడియా ద్వారా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు స్వాగతం పలికారు. ‘తెలంగాణ సంస్కృతిని అనుభవించండి’ అంటూ వారు చేసిన వీడియోలు, పోస్ట్‌లు యువతలో ఉత్సాహాన్ని పెంచాయి. -
అందాల పోటీ అంటే..మనల్ని మనం తెలుసుకోవడమే..!
హైదరాబాద్‌లో జరిగే 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో చెక్ రిపబ్లిక్కు ప్రాతినిధ్యం వహిస్తుంది అడెలా స్ట్రొఫెకోవా.21 ఏళ్ల ఈ బ్యూటీ మోడల్, ఫిట్నెస్ ట్రైనర్, ఈవెంట్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తోంది. కనెక్టింగ్ హార్ట్స్ అక్రాస్ జనరేషన్స్ పేరుతో రెండు, మూడు తరాల వారిని ఒకచోట చేర్చడం, ప్రేమ, దయ, స్నేహపూరిత వాతావరణాన్ని వ్యాప్తి చేయడంపై దృష్టి పెడుతుంది. ఏదైనా సాధించాలనుకోవడానికి ముందు తమకు నిజంగా ఏం కావాలో తెలుసుకోవడం ముఖ్యం’ అంటూ తన గురించి తెలియజేసింది. ‘‘అందాల కిరీటం అనేది ఒక ఏడాది వరకే. కానీ, చాలామందితో కనెక్ట్ అవ్వచ్చు. నా కల ఒక్కటే! మిస్ వరల్డ్‌గా నన్ను నేను చూసుకోవాలి. నా చిన్నప్పటి నుంచే ఈ ఆలోచన ఉండేది. మా అమ్మ మేకప్ వస్తువులన్నీ నేనే వాడేసేదాన్ని. అమ్మ డ్రెస్సులు, హీల్స్ వేసుకొని ఇంట్లో తిరిగేదాన్ని. పదిహేనేళ్ల వయసు నుంచి అందాల పోటీలలో పాల్గొంటూ వచ్చాను. పదిహేడేళ్ల వయసులో మొదటి సారి ప్రపంచ పోటీలో పాల్గొన్నాను.ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్విజయసాధనకు..బ్యూటీ కాంటెస్ట్‌లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. వివిధ రంగాలలో మమ్మల్ని పరీక్షిస్తారు. వాటిలో పాల్గొన్నప్పుడు కొంత ఆందోళనగా కూడా ఉంటుంది. కానీ, నన్ను నేను నిరూపించుకోవడానికి ముఖ్యమైన సమయం అదే. మిస్ బ్యూటీ కావాలని కలలు కనే యువతులు అనుకరించడం కాదు. ముందు తామేం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడం ముఖ్యం. నిజంగా ఏదైనా కోరుకుంటే 200 శాతం ప్రయత్నించాలి. అప్పుడే విజయం సాధించగలం. ఒక్క మిస్ విషయమే కాదు నేను ఏదైనా కోరుకున్నప్పుడు విజయం కోసం నా వంతుగా మొత్తం ప్రాణం పెట్టేస్తాను. అలాగే, విజయాలూ సాధించాను. కోరుకున్నది పొందాలంటే సరైన సమయం, శక్తి, దృష్టి పెడితే అదే మనకు అదృష్టంగా మారుతుంది. అందాల పోటీలలో పాల్గొనడమంటే అన్ని విధాల తమని తాము మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేసుకోవడమే. ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!ఫిట్నెస్ ట్రైనర్ నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. స్విమ్, రన్నింగ్, హార్స్ రైడింగ్ చేస్తాను. మోడలింగ్ నా కెరియర్. జీవనాధారం కూడా అదే. ఫిట్నెస్ ట్రైనర్‌గా కోచింగ్ ఇస్తాను. ఆ సమయంలో చాలా ఆనందిస్తాను. ఫిట్నెస్ గురించి నేను చెప్పే విషయాలు వినడమే కాదు, వాళ్లు ఆచరణలో పెడతారు. ఓ గొప్ప సమాజమే నాతోపాటు ఉందనిపిస్తుంది. వారితో నా అనుభవాలను పంచుకోవడం కూడా నాకు చాలా ఇష్టం. వారానికి కనీసం రెండుసార్లు ఫిట్నెస్ గ్రూప్‌లకు కోచ్‌గా పనిచేస్తాను. నాకు ప్రస్తుతం ఉన్న క్షణం చాలా ముఖ్యమైనది. అందుకే ఈ క్షణంలో మాత్రమే జీవిస్తాను. సాధ్యమైనంత వరకు ప్రపంచాన్ని తెలుసుకోవాలి అనుకుంటాను.ఫ్యాషన్ గురించి ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని తను ధరించే దుస్తుల ద్వారానే వ్యక్తపరచగలడు. మేం చెక్ రిపబ్లిక్లో స్థిరపడినా వివిధ దేశాలకు సంబంధించిన దుస్తుల్లో నన్ను నేను చూసుకుంటాను’’ అని వివరించారీ బ్యూటీ.అందాల పోటీలలో పాల్గొనడమంటే అన్ని విధాల తమని తాము మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేసుకోవడమే-అడెలా స్ట్రొఫెకోవా, చెక్ రిపబ్లిక్ – నిర్మలారెడ్డిఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ -
స్వేచ్ఛగా .. రెక్కలు విప్పేలా...
అమ్మాయిలకు చదువు కాదుకదా.. కనీసం వ్యక్తిగత శుభ్రత పాటించే వెసులుబాటు కూడా లేని చోట అందాల పోటీలంటే ఆనందంగా సాగనంపుతారా? పంపరు! అయోమ్ టీటో మతీజ్‌కు కూడా తీవ్ర నిరసన ఎదురైంది! అయినా వెనకడుగు వేయకుండా అందాల పోటీలకు అటెండ్ అయింది.. మిస్ సౌత్ సుడాన్‌గా కిరీటం ధరించి మిస్ వరల్డ్‌కి పోటీపడ్డానికి హైదరాబాద్ చేరుకుంది. తన దేశ పరిస్థితులు, వ్యక్తిగత వివరాలు, తన లక్ష్యం వగైరా ఆమె మాటల్లోనే...‘‘లా చదివాను. లీగల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. సౌత్ సుడాన్లో పుట్టాను. కానీ అక్కడి రాజకీయ అనిశ్చితి వల్ల మా అమ్మ మమ్మల్ని తీసుకుని కెనడాకు వలస వచ్చేసింది. అందుకే నేను అక్కడే పెరిగాను. మా నాన్న, ఆయన తరపు, అమ్మ తరపు బంధువులంతా సౌత్ సుడాన్‌లోనే ఉండిపోయారు. మా అమ్మ కెనడాలో టీచర్‌గా ట్రైన్ అయ్యి, మా సొంత దేశంలోని పిల్లలకు మంచి స్కూల్‌ను ఏర్పాటు చేయడానికి తిరిగి సుడాన్ వచ్చేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత 2019లో నేను మా కుటుంబాన్ని చూడ్డానికి నా సొంత దేశానికి వెళ్లాను. ఎమోషనలే కాదు.. కొంచెం షాక్ కూడా అయ్యాను. కెనడాలో నేను ఆస్వాదించిన జీవితం, సౌత్ సుడాన్లో మా వాళ్లంతా అనుభవిస్తున్న జీవితాన్ని బేరీజు వేసుకుని. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను నా దేశ ప్రజలకూ ఉన్నత ప్రమాణాల జీవితం అందేలా కృషి చేయాలని! కోవిడ్ తర్వాత వచ్చేశాను. సర్వీస్ మొదలుపెట్టాను. నా బ్యూటీ విత్ పర్పస్ అదే!అందాల పోటీలకు వ్యతిరేకంఅందాల పోటీల పట్ల సౌత్ సుడాన్లో చాలా వ్యతిరేకత ఉంది. నేను మిస్ సౌత్ సుడాన్ పాజెంట్‌లో పాల్గొంటున్నప్పుడు, ఇప్పుడు కూడా నిరసన ఎదురైంది. కానీ నా దృష్టిలో ఈ పోటీలు స్కిన్ షో కాదు. వైవిధ్యమైన సంస్కృతులు, భాషలు, జీవనశైలులను పరిశీలించే, అధ్యయనం చేసే అవకాశాన్నిచ్చే వేదిక. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సర్దుబాటు, సహనాన్ని నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా నా సామాజిక బాధ్యతను మెరుగ్గా నిర్వర్తించేందుకు తోడ్పడతాయి. అందుకే నిరసనను ఎదుర్కొని మరీ ఈ పోటీకి వచ్చాను. అంతేకాదు ఈ పోటీలు ఒకరినొకరు తెలుసుకుని, అర్థం చేసుకుని, ఒకరికొకరు సాయం అందించుకునే స్ఫూర్తినీ పంచుతాయి. మహిళలకు అలాంటి స్ఫూర్తి, ప్రేరణ అవసరం. దానికి అందాల పోటీలే కావాలా అంటారేమో! స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి ప్రపంచ వ్యాప్తంగా పాతుకుపోయి.. అది స్త్రీల సహజ లక్షణమనే అభిప్రాయమూ అంతే లోతుగా నాటుకుపోయింది. దాన్ని అబద్ధమని నిరూపిస్తున్నాయి ఈ పోటీలు! కొన్ని దేశాల పేర్లే తెలియవు నేనీ కంటెస్ట్‌కి వచ్చేదాకా! అందుకే పట్టుబట్టి మరీ ఈ పోటీకి వచ్చాను. ఇక్కడి వైవిధ్యత, ఆధ్యాత్మికత నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. ఈ దేశంలోని వాళ్లను చూస్తే నాకు ఫారినర్స్‌గా అనిపించరు. మా వాళ్లలాగే అనిపిస్తారు. ఎప్పుడో ఎక్కడో తప్పిపోయి.. ఇప్పుడు కలుసుకుంటున్నామేమో అనిపిస్తోంది! తెలంగాణ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడి ఎడ్యుకేషన్, మెడికల్ కేర్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్రపంచ ప్రమాణాలతో పోటీపడుతున్నాయి. సౌత్ సుడాన్ యువత తమ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కే వస్తోంది. మా దేశంలోని చాలామంది ప్రజలు ఆరోగ్య అవసరాల కోసం ఇక్కడి హాస్పిటల్స్‌నే ఆశ్రయిస్తున్నారు.బాల్య వివాహాలు.. బలవంతపు పెళ్లిళ్లుప్రపంచంలోని అనేక దేశాల్లాగే సౌత్ సుడాన్‌లోనూ పురుషాధిపత్యమే! కొడుకుకేప్రాధాన్యం. అమ్మాయికి వ్యక్తిగత శుభ్రత విషయంలోనూ ఆర్థికపరమైన వెసులుబాటు ఉండదు. బాల్యవివాహాలు, బలంతపు పెళ్లిళ్లు కామన్. ఇక చదువుకునే అవకాశమెక్కడిది? నేను ఇక్కడిదాకా రాగలిగాను అంటే మా అమ్మే కారణం. మమ్మల్ని ఆమె కెనడా గనుక తీసుకువెళ్లకపోయుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో (ఈ మాట చెబుతున్నప్పుడు ఆమె కళ్లల్లో నీళ్లు). నాకింకా గుర్తు.. ఆమె లగేజ్ సర్దుతుంటే ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం?’ అని అడిగాను. ‘మీరు స్వేచ్ఛగా మీకు నచ్చింది చదువుకునే చాన్స్ ఉన్నచోటికి’ అని చెప్పింది! మేం నలుగురు అక్కచెల్లెళ్లం. మాకొక తమ్ముడు. అందరినీ సింగిల్ పేరెంట్‌గానే పెంచింది అమ్మ. ఎలాంటి అవకాశాల కోసం అమ్మ మమ్మల్ని కెనడాకు తీసుకెళ్లిందో అలాంటి అవకాశాలనే సౌత్ సుడాన్‌లోని అమ్మాయిలకూ కల్పిస్తోంది తాను నడిపిస్తున్న స్కూల్ ద్వారా! ఆమె చేస్తున్న ఆ సర్వీస్‌కి నేనూ శాయశక్తుల సాయపడుతున్నాను. మా దేశంలోని యంగ్ గర్ల్స్‌కి నేను మెంటర్‌గా ఉండాలి! వాళ్ల కలలను సాకారం చేసుకునేలా నేను తోడ్పడాలి. వాళ్లకు రెక్కలున్నాయనే విషయాన్ని గ్రహించేలా చేయాలి. సాధికారతకు, సామాజిక బాధ్యతకు ఐకాన్స్‌గా ఉండి, తర్వాత తరాలను ఇన్స్పైర్ చేసేలా వాళ్లను తీర్చిదిద్దాలి. ఇదంత సులువైన జర్నీ కాదు. అయినా ప్రయత్నం వీడను!’’ అంటూ తన జర్నీ గురించి చెప్పారు మిస్ సౌత్ సూడాన్.మా దేశంలోని యంగ్ గర్ల్స్‌కి నేను మెంటర్‌గా ఉండాలి! వాళ్లు కలలను సాకారం చేసుకునేలా నేను తోడ్పడాలి. వాళ్ళకు రెక్కలున్నాయనే విషయాన్ని గ్రహించేలా చేయాలి. – సరస్వతి రమఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!
లాపతా లేడీస్ సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన యంగ్‌హీరోయిన్ నితాన్షి గోయల్ (Nitanshi Goel). ఈ మూవీలో తనదైన నటనతో అటు విమర్శకులు, ఇటు అభిమానుల హృదయాలను గెలుచుకుంది. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల్లో ఒకటైన లాపతా లేడీస్‌లోని ఫూల్ పాత్రతో అభిమానులను కట్టిపడేసింది. ఇన్‌స్టాలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్న అతి పిన్న వయస్కురాలైన నటి కూడా నితాన్షి కావడం విశేషం.ఇపుడు మరో విశేషం ఏమిటంటే... నితాన్షి 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరంగేట్రం చేసింది. అరంగేట్రం చేయడం మాత్రమే కాదు కాన్స్‌లో తన లుక్స్‌తో వావ్ అనిపించింది. 17 ఏళ్ల యువతార బ్లాక్ అండ్ గోల్డ్ గౌన్‌తో తళుక్కున మెరిసి అభిమానులను ఫిదా చేసింది. ఆమె లుక్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె డిజైనర్ దుస్తులు, స్టైల్, సీనియర్ నటీమణులకు ఆమె ఇచ్చిన గౌరవం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. అందరి దృష్టి నితాన్షి గోయల్ జుట్టుపైనే ఉంది, ఆమె రేఖ-మధుబాలతోపాటు, శ్రీదేవికి లాంటి స్టార్లను తన జడలో చుట్టేసుకుంది.నితాన్షి లుక్‌లో ప్రధాన ఆకర్షణ, ముత్యాల జడలో కేన్స్ 2025లో తన ముత్యాల జుట్టుతో 8 మంది బాలీవుడ్ నటీమణులకు నివాళి అర్పించింది. నితాన్షి గోయెల్ అలనాటి బాలీవుడ్ అందాల తారలు మధుబాల, నర్గీస్, మీనా కుమారి, నూతన్, వహీదా రెహ్మాన్, ఆశా పరేఖ్, వైజయంతిమాల, హేమ మాలిని, రేఖ , శ్రీదేవి వంటి ప్రముఖ బాలీవుడ్ నటీమణుల సూక్ష్మ ఫోటో ఫ్రేమ్‌లున్న (miniature photo frames) కస్టమ్-మేడ్ హెయిర్ యాక్సెసరీతో అదరగొట్టేసింది. హిందీ సినిమా ప్రపంచంలో చెరిగిపోని ముద్ర వేసుకున్న నటీమణులపై తన ప్రేమను చాటుకున్న వైనం పలువుర్ని ఆకట్టుకుంది. కాన్స్ 2025కి ఈ డ్రెస్ వేసుకోవాలని నిర్ణయించుకోవడానికి తనకు 10-15 నిమిషాలు పట్టిందని చెప్పింది.చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?ముత్యాల చీర,పూసలు, ముత్యాలు, సీక్విన్లతో తయారు చేసిన ప్రీ-డ్రేప్డ్ చీరలో అందంగా ముస్తామైంది. దానిపై మల్టీ లేయర్ల , 3D వర్క్ , ఇంకా దీనికి భారీ పల్లూ కూడా ఉంది. ఈ చీరకు ముత్యాలు పొదిగిన స్ట్రాపీ బ్లౌజ్‌ను జత చేసింది. తన ఫ్యాషన్ ఐకాన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ అని చెప్పిన నితాన్షి, కాన్స్‌లో ఉన్నప్పుడు అలియా భట్ ధీటుగా ఉండాలని కోరుకున్నానని వెల్లడించింది. నితాన్షి లుక్ డిస్నీడాల్‌గా చాలా ముద్దుగా ఉంది.నితాన్షి రికార్డులాపతా లేడీస్ చిత్రంలో ఉత్తమ నటి అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్. లోరల్ పారిస్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ, ఆమె గురువారం కాన్స్ రెడ్ కార్పెట్‌లోకి అడుగుపెట్టింది, ఈఘనతను సాధించిన అతి పిన్న వయస్కురాలైన భారతీయ నటిగా నిలిచింది. ఇదీ చదవండి: మాయమైపోతున్న మనిషి కోసం..శాలిని -
జస్ట్ డ్రెస్సింగ్ మాత్రమే కాదు..ట్రెండ్‌కి తగ్గ ఆభరణాలతో మెరవండిలా..!
చక్కటి ఆభరణాలు వస్త్రధారణలో ఒక ముఖ్యమైన భాగం, ఇది దుస్తులను మెరిపించడం మాత్రమే కాదు డ్రెస్సింగ్ వెలవెల పోయేలా చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది. మెరవాలంటే ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటే మాత్రమే సాధ్యం. అయితే ప్రతి సీజన్లో రకరకాల ట్రెండ్లు వస్తుండటంతో, ఏది అనుసరించాలో, ఏది వదిలివేయాలో ? అనే గందరగోళం తప్పదు. ఈ నేపథ్యంలో సిటీ జ్యువెలరీ డిజైనర్లు అందిస్తున్న సూచనలివి.. లేయరింగ్, స్టాకింగ్.. పలు రకాల లెంగ్త్ ఉన్న చైన్ పెండెంట్లను లేయర్‌లాగా ధరించవచ్చు. లేదా ఒకే వైపు పలు బ్రేస్లెట్లను ఒకటిగా పేర్చవచ్చు. ఆల్ పీసెస్ రంగులు కలిసి కనబడేలా చూసుకోవడమే ఖచి్చతమైన స్టాక్‌కు కీలకం. ఇవి ఒక సాధారణ బైండింగ్ కారకంగా ఉండాలి. షాండ్లియర్ చెవిపోగులు.. ఈ షాండ్లియర్ శైలి చెవిపోగులు అత్యధికంగా మహిళల్ని ఆకట్టుకుంటాయి. దుస్తులకు నప్పేలా అలంకరణకు ఇది సరైన మార్గం. వీటిని మరే ఇతర ఆభరణాలూ లేకుండా ధరించవచ్చు. డైమండ్ షాండ్లియర్స్ కావచ్చు లేదా జడౌ చంద్బాలిస్ కావచ్చు చెవిపోగులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. బోల్డ్ రింగులు.. ఒక పెద్ద డేరింగ్ రింగ్ ధరించడం రూపానికి అత్యాధునికతను జోడిస్తుంది. దీని కోసం ఓ అసాధారణమైన డిజైన్లను ఎంచుకోవాలి. రత్నం, సిగ్నెట్ పెద్ద వాస్తవిక పువ్వులు వంటివి మరింత అందాన్నిస్తాయి. జడౌ..జతగా.. ఏదైనా భారతీయ ఆభరణాల శైలిలో జడౌ నెక్లెస్ ధారణ తరతరాల వారసత్వంగా వస్తోంది. పూర్వ కాలంలో చాలా ఆభరణాలు మొఘల్ ఇతివృత్తంతో ప్రభావితమయ్యాయి, అయితే ప్రస్తుతం ఆధునిక ఆభరణాల తయారీలో పురాతన పద్ధతుల్లో ఏదైనా ఒకదానిని జత కలపడం ఒక ప్రత్యేకమైన కొత్త సంప్రదాయంగా మారింది. ఆ విధంగా జడౌ నెక్లెస్‌కు ఆదరణ పెరిగింది. ఆమె..ఆభరణం.. కాబోయే వధువు అయితే, పెళ్లి రోజు లుక్‌లో ఆభరణాలు అతి ముఖ్యమైన భాగం. పెళ్లి ఆభరణాలు, అవి ఏ వధువునైనా యువరాణిగా చూపించగలవు. పెళ్లి వేడుకల్లో భారీ నెక్‌పీస్ ఎంచుకుంటారు. అయితే ఇవి విడదీసి, ధరించగలిగేలా ప్రత్యేకంగా రూపొందుతాయి. అన్నీ కలిపినప్పుడు అవి గ్రాండ్‌లుక్‌ని సంతరించుకుంటాయి. అలాగే వివాహానంతరం కూడా వాటిని సందర్భానుసారం ధరించవచ్చు. ఆఫీస్..డైమండ్ పీస్.. పని విధానాలకు అనుగుణంగా అలాగే సాయంత్రం సమావేశాల్లో సమర్థవంతంగా మమేకమయ్యే అందమైన పీసెస్, సెన్సిటివ్ డైమండ్ హగ్గీలు లేదా సాలిటైర్ స్టడ్లు రోజువారీ డ్రెస్సింగ్‌కు సరైన ఎంపిక. ఆఫీసుకు ఇండియన్ ఫార్మల్స్ ధరించడం ఇష్టపడితే, డైమండ్ సరౌండ్‌తో లేదా ఒక జత సింగిల్ పోల్కీ ఇయర్ స్టడ్‌తో సరిపెట్టొచ్చు. (చదవండి: కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..) -
Miss World Zimbabwe మెంటల్ హెల్త్ పై సైలెన్స్ వద్దు
‘‘ప్రస్తుతం నేను ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి వేదిక పైన నిల్చున్నాను. కానీ మన ప్రపంచం అంత అందంగా లేదు.., ఎన్నో సామాజిక వైరుధ్యాలున్నాయ’ని మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న మిస్ జింబాబ్వే కోర్ట్న జాంగ్వే తెలిపింది. 2023 నాటికి ప్రపంచ సామాజిక వైకల్యానికి మానసిక ఆరోగ్య సమస్యలు ప్రధాన కారణంగా నిలువనున్నాయని, ఇది తన మాట కాదు.. ఏకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించిందని గుర్తు చేసింది. ముఖ్యంగా తమ ఆఫ్రికన్ దేశాల్లో ఈ మానసిక ఆరోగ్య (మెంటల్ హెల్త్) సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీని గురించి ఎవరూ అంతగా మాట్లాడట్లేదని జాంగ్వే ఆవేదన వ్యక్తం చేసింది. ఒక వేళ తాను మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే ఈ సమస్యపై కొనసాగుతున్న నిశ్శబ్దాన్ని ఛేదించడానికి తన కిరీటాన్ని, కీర్తిని వినియోగిస్తానని ఉద్వేగంగా ప్రకటించింది. మిస్ వరల్డ్ 2025 నేపథ్యంలో కోర్ట్న జాంగ్వే ప్రత్యేకంగా ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకుంది. మిస్ వరల్డ్ అనేది మహిళా సాధికారత పై దృష్టి సారించే అంతర్జాతీయ వేదిక. ఈ గుర్తింపు మహిళా సాధికారత, ఇతర సమస్యలపైన పోరాడటానికి మద్దతిస్తుందని నమ్ముతాను. నా దృష్టిలో నిజమైన అందం బాహ్య రూపాన్ని అధిగమిస్తుంది. నిజమైన సౌందర్యం మనల్ని వ్యక్తపరిచే వ్యక్తిత్వం, చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎలా దోహదపడతారనే బాధ్యత.అందుకే సోషల్ మెంటల్ హెల్త్‌ను నా భద్యతగా తీసుకున్నాను. డిప్రెషన్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో పోరాడుతున్న సమాజంలో పెరిగాను. ఇలాంటి కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలను దగ్గరగా చూశాను. నా పాఠశాలలో నా స్నేహితులు డ్రగ్స్‌కు బానిసలైన సంఘటనలు చూస్తూ పెరిగాను. ఈ సమస్యలకు మా మూలాల్లో కారణాలు ఎన్నైనా ఉండొచ్చు.., కానీ వాటిని మార్చాల్సిన బాధ్యత నా పైన ఉంది. జింబాబ్వే వంటి మా ఆఫ్రికన్ దేశాల్లో పలు సామాజిక రుగ్మతలున్నాయి. ఇలా మాట్లాడితే అది మా మూలాలకు కళంకం కావొచ్చు. కానీ నేను దీని పైన అవగాహన కల్పించాలని నిశ్చయించుకున్నాను. ఇది మా ఒక్కరి సమస్య కాదు.. ప్రపంచ సమస్య. మిస్ జింబాబ్వేగా నిలిచిన తరువాత నా ప్రయత్నం వల్ల చాలా మార్పును చూశాను. అందుకే నేను మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే నా ప్రయత్నాన్ని విశ్వవ్యాప్తం చేస్తాను. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జింబాబ్వేలో చేపట్టిన నాప్రాజెక్ట్ను ప్రపంచంలోని వివిధప్రాంతాలకు తీసుకెళ్తాను. డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించడానికి నాకున్న పలుకుబడితో అవగాహన కల్పిస్తాను. ఆకలి, పేదరికం, కనీస వసతులు లేని వారి గొంతుకగా మారతాను. అంతర్జాతీయంగా ఫ్యాషన్ రంగంలో మా కళకు, డిజైనింగ్‌కు ప్రత్యేకత ఉంది. మా డిజైనర్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఒక మోడల్‌గా ఈ విషయంలో నేను గర్వపడతాను. మాది చాలా కష్టపడే వ్యక్తిత్వం. జింబాబ్వే గురించి నాకు చాలా నచ్చిన ఒక విషయం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మాప్రామాణికతను కోల్పోము. అందుకే విదేశాల్లోనూ ఆఫ్రికన్ల సంస్కృతి ఇప్పుడు ట్రెండ్‌గా మారుతోంది. భారతదేశంలో సాంస్కృతిక వైవిధ్యం, సమ్మేళనం మనమందరమెంత విభిన్నమో దానిని అంతే అందంగా చూపిస్తుంది’’ అంటూ తన మనసులోని భావాలను పంచుకున్నారు జాంగ్వే.– హనుమాద్రి శ్రీకాంత్ -
మన శక్తిని నమ్ముకుందాం నటాషా న్యో న్యో జీ.. మిస్ యుగాండా!
కుతూహలం, జిజ్ఞాస, ప్రతిభ, సామాజిక బాధ్యత, లాస్ బట్ నాట్ లీస్ట్ అందం.. అన్నిటికీ పర్యాయ పదం! నటాషా పరిచయం ఆమె మాటల్లోనే...నేను పుట్టి,పెరిగింది యుగాండాలో! అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ గ్రాడ్యుయేషన్ కోసం యూకే వెళ్లి, చదువు పూర్తవగానే తిరిగి నా దేశానికి వచ్చేశాను. వృత్తిరీత్యా అకౌంటెంట్ని, ఆంట్రప్రెన్యూర్‌ని కూడా. కంపాలాలో నాకో బ్యూటీ స్టోర్ ఉంది. స్కిన్ కేర్, మేకప్, యాక్సెసరీస్ లాంటివంటే నాకు చాలా ఆసక్తి. అదే నన్ను ఈ పాజెంట్ వైపు లాక్కొచ్చిందని చెప్పొచ్చు. మా దగ్గర కూడా అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య వివక్ష చాలా! కానీ అదృష్టవశాత్తు మా ఇంట్లో లేదు. మమ్మల్నందరినీ సమానంగా పెంచారు.బ్యూటీ విత్ పర్పస్మా తమ్ముడికి ఆటిజం. యుగాండాలో స్పెషల్ నీడ్స్ పిల్లలకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాళ్లనెలా పెంచాలో కూడా తెలియదు. తమ్ముడి కోసం అమ్మ ట్రైన్ అయింది. అమ్మ నడిపే స్కూల్లోనే స్పెషల్ నీడ్ చిల్డ్రన్ కోసం కూడా ఓ సెక్షన్ పెట్టింది. పిల్లల పేరెంట్స్‌కి అవేర్నెస్ కల్పిస్తోంది. అందులో నేనూ పాలు పంచుకుంటున్నాను. స్పెషల్ నీడ్ పిల్లల కోసం హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయ్యేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నా బ్యూటీ విత్ పర్పస్ అదే! అలాగే టాలెంట్ రౌండ్లో నేను పియానో ప్లే చేయబోతున్నాను. స్పోర్ట్స్ రౌండ్లో స్విమ్మింగ్. స్విమింగ్ ఈజ్ మై ఫేవరిట్ స్పోర్ట్.మర్యాద, మాట తీరు..రిచ్ కల్చర్, ట్రెడిషన్ వంటి విషయాల్లో మా దేశానికి, ఇండియాకు చాలా పోలిక ఉంది. ఇక్కడి రైస్, స్పైసీ ఫుడ్ నాకు చాలా నచ్చాయి. కొత్త వాతావరణంలో.. కొత్త మనుషుల మధ్య ఉన్నామన్న ఫీలింగే లేదు. అందరికీ అందరం ఎప్పటి నుంచో పరిచయం అన్నట్టుగానే ఉంది. కొత్త కొత్త భాషల్లో రోజూ కనీసం ఒక వర్డ్ అయినా నేర్చుకుంటున్నాను. అలాగే మా భాషనూ నా తోటి కంటెస్టెంట్స్‌కి నేర్పేందుకు ట్రై చేస్తున్నాను. ఐకమత్యం అసాధ్యాలను సుసాధ్యం చేయగలదని అర్థమైంది. వేగంగా వెళ్లాలంటే ఒంటరిగా ప్రయాణించాలి. కానీ సుదీర్ఘ దూరాలకు వెళ్లాలంటే మాత్రం కచ్చితంగా గుంపుగా ప్రయాణించాలి’’ అంటూ చెపాపు నటాషా. అందుకే కనెక్ట్ అయ్యాను.. నాకు ఇక్కడి చీరలు చాలా నచ్చాయి. కొనుక్కెళ్లాలనుకుంటున్నాను. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు బిగ్ ఫ్యాన్‌ని. ఆమె నటించిన బర్ఫీ సినిమా చాలాసార్లు చూశాను. అందులో ఆమె ఆటిజం అమ్మాయిగా అద్భుతంగా నటించింది. మా తమ్ముడికీ ఆటిజం కదా! అందుకే కనెక్ట్ అయ్యాను. విమెన్ ఎంపవర్మెంట్ విషయానికి వస్తే.. ప్రతి అమ్మాయి తన శక్తిని నమ్ముకోవాలి. ఎవరైనా వెనక్కి లాగితే రెట్టింపు ఉత్సాహంతో అడుగులు వేయాలి. మన సంకల్పం గట్టిగా ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరు! – నటాషా న్యో న్యో జీ – యుగాండా– సరస్వతి రమ -
Cannes: అరంగేట్రంలోనే ఎదురు దెబ్బ, లగేజీ మొత్తం గాయబ్!
ఫ్రాన్స్‌లో ఫ్యాషన్ సిటీ ప్యారిస్‌లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా నటులు, సెలబ్రిటీలు, ఫ్యాషన్ రంగ నిపుణులతో ఇక్కడ సందడి నెలకొంది. అయితే భారత్‌కుచెందిన భారతీయ ప్లస్-సైజ్ ఇన్ఫ్లుయెన్సర్,ఫ్యాషన్ ఐకాన్ సాక్షి సింధ్వానీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేన్స్ రెడ్ కార్పెట్ అరంగేట్రానికి కొన్ని గంటల ముందు, సాక్షి సింద్వానీ ఊహించని దెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివ్‌లో తన తొలి అనుభవం కోసం ఎదురు చూస్తున్న సాక్షి, తన లగేజీని పోగొట్టుకుంది. ఆమెకు సంబంధించిన నాలుగు బిజినెస్ క్లాస్ బ్యాక్‌లు మాయమై పోయాయి. దీంతో సాక్షి తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. ఎంతో అపురూపమైన జ్ఞాపకంగా మిగలాల్సిన కేన్స్ అనుభవం సంక్షోభంలో పడిపోయింది. ఈ విషయాన్ని సాక్షి ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది. దయచేసి సాయం చేయండి అంటూ మొర పెట్టుకుంది. అలాగే ఈ సమస్యపై స్పందించని, సహకరించకపోవడం పట్ల లుఫ్తాన్స , స్విస్ ఎయిర్‌లైన్స్‌పై సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు. దీంతో ఆమె ఫ్యాన్స్ సాక్షికి సానుభూతి ప్రకటించారు .ఇదీ చదవండి: తీవ్ర నష్టాల్లోలగ్జరీ ఫ్యాషన్ హౌస్, 1700 మందికి ఉద్వాసన'స్టైల్‌మీఅప్ విత్ సాక్షి' అనే హ్యాండిల్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్ట్ చేశారు. నైస్ విమానాశ్రయం మీదుగా కేన్స్‌కు వెళ్లేటప్పుడు లుఫ్తాన్స మరియు స్విస్ ఎయిర్‌లైన్స్ ఆమె చెక్-ఇన్ బ్యాగులను ఒక్కొక్కటి పోగొట్టుకున్నాయని సాక్షి వెల్లడించింది. ఆమె ఇలా రాసింది."నమ్మశక్యం కాని భయంకరమైన సంఘటన జరిగింది. నేను పూర్తిగా కుప్పకూలిపోయాను నా 4 బ్యాగులూ పోగొట్టుకున్నాను. ఇపుడు నా దగ్గర ఏ వస్తువులూ లేకుండా నేను కేన్స్‌లో ఉన్నాను. నా జీవితంలో అత్యంత భయానకమైన రాత్రి ఈ మొత్తం ఉదంతంలో లుఫ్తాన్సా , స్విస్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి’’ అని ఆమె పేర్కొంది.కేన్స్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రదర్శన కోసం నెలల తరబడి వేచి ఉన్నాననీ, తన లగేజీ సురక్షితంగా ఉండాలని, “హై ప్రియారిటీ” కింద బిజినెస్ క్లాస్‌లో చెక్ ఇన్ చేశానని తెలిపింది.విమానయాన అధికారుల నుండి మద్దతు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది.చదవండి: కోవిడ్ మహమ్మారి : పెరుగుతున్న కేసులు, మరణాలు అధికారుల హెచ్చరికలుఎవరీ సాక్షి సింధ్వానీఢిల్లీకి చెందిన ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్లస్ సైజ్ ఫ్యాషన్ కంటెంట్‌కు పేరుగాంచింది, అంతర్జాతీయ అందాల దిగ్గజం లోరియల్ తో కలిసి రెడ్ కార్పెట్ పై నడుస్తూ, కేన్స్ 2025 లో చరిత్ర సృష్టించనున్న భారతీయ ప్రభావశీలురులలో సాక్షి సింద్వానీ ఒకరు. ధైర్యంగా ఫ్యాషన్ స్టీరియోటైప్‌లను బద్దలు కొట్టి ప్లస్-సైజు ఇన్ఫ్లుయెన్సర్గా తకంటూ ఒక పేరు తెచ్చుకుంది. -
Miss World 2025 నమస్తే నేర్చుకున్నాను : లెబనాన్ బ్యూటీ నద
నద... అంటే అరబిక్ భాషలో పిల్లల స్వచ్ఛమైన మనసు, ఉషోదయపు మంచు బిందువులు అని అర్థం. మిస్ వరల్డ్ లెబనాన్2025 పేరు నద (Nada Koussa). మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీల కోసం హైదరాబాద్‌కి వచ్చిన నద తన పేరుకు అర్థం చెప్పుకుంటూ తమ దేశంలో పిల్లల బాల్యం, యువత భావోద్వేగాలు అంత స్వచ్ఛంగా ఏమీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యూటీ పాజంట్ కావాలనే కోరిక కలగడానికి కారణం తెలియదు కానీ బాల్యం నుంచి తనతోపాటు పెరిగి పెద్దయిందన్నారామె.ఈ అవకాశం కోసం ఎదురు చూశాను!‘‘ఎనిమిదేళ్ల వయసు నుంచి నాకు జ్ఞాపకం ఉంది. నా ఆకాంక్ష తీరడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ బ్యాచులర్స్ పూర్తయింది. మాస్టర్స్ ఇన్ సైకాలజీ కూడా పూర్తయింది. క్లినికల్ సైకాలజిస్టుగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను సందర్శిస్తూ పిల్లలకు, యువతకు మనోధైర్యాన్నిస్తున్నాను. అంతర్యుద్ధంతో అట్టుడిగిన దేశం మాది. అలాగే ఇరుగు పొరుగు యుద్ధాల తాకిడి కూడా దేశాన్ని కుదిపేసింది. అలాంటి దేశంలో మానసిక స్థైర్యం కల్పించడం చాలా అవసరం. ఇందుకోసం నేను ఐదు ఎన్జీవోలతో కలిసి పని చేస్తున్నాను.మహిళలు నలిగిపోతున్నారు!మా దేశంలో సగటు మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక దేశం ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొంటోందీ అంటే ఆ పరిణామాలకు క్షేత్రస్థాయిలో నేరుగా బాధితులయ్యేది మహిళలే. విద్య, ఉద్యోగం, పిల్లలను చక్కబెట్టుకుంటూ, ఆర్థికపరమైన సర్దుబాట్లు చేసుకుంటూ కుటుంబాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను తమ భుజాల మీద మోస్తున్నారు మా దేశంలో మహిళలు.ఎక్కడో ఒకరిద్దరు కాదు, దాదాపుగా ప్రతి మహిళా వీటన్నింటినీ భరిస్తోంది. వీటికితోడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోజులు గడపడం అనేది ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. ఎయిర్ క్రాఫ్ట్‌లు మన తల మీద నుంచి వెళ్తున్నట్లే ఉంటాయి. రోజూ ఒకదాని తర్వాత ఒకటిగా యుద్ధవిమానాలు ఇళ్ల మీద నుంచి వెళ్తుంటే వచ్చే ‘ఉమ్మ్మ్’ అనే శబ్దం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎంత చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కి పడుతుంటారు. రాత్రిళ్లయితే టేబుల్ మీద నుంచి పుస్తకం కింద పడిన శబ్దం వచ్చినా సరే గుండె వేగం పెరిగిపోతుంటుంది. ఇంట్లో అందరినీ ఒకసారి కలయచూసుకుని ‘హమ్మయ్య ఏమీ కాలేదు, అందరూ క్షేమం’ అని ఊపిరి పీల్చుకోవాల్సిన దుస్థితి. ఈ పరిస్థితుల్లో జీవించడం వల్ల వారిని మెంటల్ ట్రామా పీడిస్తోంది. ఇది ఏ ఒకరిద్దరిదో, ఒకటి-రెండు ప్రదేశాలదో కాదు. దేశమంతటా ఇదే పరిస్థితి. వారిలో మానసికాందోళనలు పోగొట్టి ధైర్యం, మానసిక ప్రశాంతత నెలకొల్పడానికి పని చేయాల్సిన అవసరం ఉంది. ఈ కలెక్టివ్ ట్రామాను తొలగించడానికి కార్యక్రమాలను రూపొందించుకుంటున్నాను. ఇన్నింటి మధ్య కొనసాగుతూ కూడా బ్యూటీ పాజంట్ కావాలనే కోరికను మాత్రం పక్కన పెట్టలేదు. సమాజం కోసం చేయాల్సిన కర్తవ్యాలను నిర్వర్తిస్తూనే బ్యూటీ కాంటెస్ట్ విజేతనయ్యాను. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీ కోసం మీ ముందుకు వచ్చాను. బ్యూటీ విత్ పర్పస్ థీమ్‌లో భాగంగా... నా విజయంతో నా దేశంలో ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. శాంతి కోసం పని చేయడానికి బ్యూటీ పాజంట్ గుర్తింపు ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: దేశానికి సేవ చేయాలని కలగన్నాడు..కానీ, పెళ్లైన నాలుగునాళ్లకేనమస్తే నేర్చుకున్నాను!బ్యూటీ పాజంట్ పోటీల కోసం వచ్చేటప్పుడు ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకున్నాను. నమస్తే చెప్పడం నేర్చుకున్నాను. హైదరాబాద్ నగరం చాలా నచ్చింది. కలర్ఫుల్గా, వైబ్రెంట్‌గా ఉంది. ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. చౌమొహల్లా ప్యాలెస్ ఒక అద్భుతం. నిర్మాణంలో సునిశితమైన క్రాఫ్ట్మన్షిప్కి ఫిదా అయ్యాను. ప్రతి అంగుళాన్ని వదలకుండా ఫొటోలు తీసుకున్నాను. ఆ కట్టడం గొప్ప చారిత్రక వారసత్వం, అలాగే హైదరాబాద్ మెహందీ కూడా’’ అంటూ మంగళవారం నాడు చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్ సందర్శన సమయంలో పెట్టించుకున్న మెహందీని చూపించారు నద కౌస్సా.చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా? – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు : ఎస్.ఎస్. ఠాకూర్ -
సాంస్కృతిక సమ్మేళనం.. అందాల సోయగం..
హైదరాబాద్: నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్‌కి మరింత వన్నె తీసుకొస్తున్నాయి. వివిధ దేశాలకు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ వ్రస్తాలతో అందాల తారలు హొయలు పోయారు. దీంతో పాటు వివిధ ప్రాంతాల్లోని ప్రత్యేకతలను తెలుసుకునేందుకు పోటీదారులు ఉత్సాహం చూపుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్ వేదికగా తమ తమ దేశాల వస్త్రధారణతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇది అధునాత సాంస్కృతిక సమ్మేళనంగా భావిస్తున్నారు. దీనికి తోడు ఇక్కడి అధునాతన జీవనశైలి, ముఖ్యంగా ఆహారం తమకు ఎంతగానో నచ్చిందని పలువురు తారలు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 31వ తేదీ వరకూ కొనసాగనున్న మిస్ వరల్డ్ పోటీల కోసం నిత్యనూతనంగా సన్నద్ధమవుతున్నట్లు వారు పేర్కొన్నారు. -
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీదారుల సందర్శన నేడిలా!
మిస్ వరల్డ్ పోటీదారుల సందర్శనతో ఈ చారిత్రక కట్టడాలకు ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం లభించనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఈ సందర్శనను తెలంగాణ పర్యాటక ప్రాచుర్యంలో భాగంగా నిర్వహిస్తోంది. తెలంగాణ సంప్రదాయ శిల్పకళ, చరిత్ర, చారిత్రక వైభవం నేటి యువతకు అంతర్జాతీయ వేదికలకు పరిచయం కావడం ఆహ్వానించదగ్గ పరిణామం.రామప్ప దేవాలయం, వేయి స్థంభాల గుడిమిస్ వరల్డ్ పోటీదారులు బుధవారం తెలంగాణలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడాలు – రామప్ప దేవాలయం, వేయి స్థంభాల గుడిని సందర్శించనున్నారు. ఈ సందర్శనతో తెలంగాణ సంస్కృతి, శిల్పకళకు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు లభించే అవకాశం ఏర్పడింది.రామప్ప దేవాలయం.. శిల్పకళకు నిలయం..వరంగల్ జిల్లా ములుగు సమీపంలోని పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప దేవాలయం 13వ శతాబ్దానికి చెందిన గొప్ప కట్టడం. కాకతీయ రాజవంశానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించిన ఈ దేవాలయం, మృదువైన రాతితో రూపొందించిన శిల్పాలతో విశేషంగా ప్రసిద్ధి చెందింది. గత 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన ఈ ఆలయం, చిరకాలం నిలిచే తేలికపాటి ఇటుకలతో నిర్మితమై, శిల్పకళ, శాస్త్రీయ నిర్మాణ కౌశలానికి ప్రతిరూపంగా నిలుస్తోంది.వేయి స్థంభాల గుడి – శిలాశిల్పాల సమ్మేళనంహనుమకొండలోని వేయి స్థంభాల గుడి అనేది 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన మరొక అద్భుత శిల్పకళా చరిత్ర. ఈ ఆలయం శైవ సంప్రదాయానికి చెందినది. వేలాది రాతి స్తంభాలతో కట్టబడి, ప్రతీ స్తంభం ప్రత్యేక శిల్పంతో కళాత్మకంగా రూపొందింది. ముఖ్యంగా అక్కడి ఉత్కృష్టమైన నృత్యశిల్పాలు, సంగీతాన్ని ప్రతిబింబించే శిలాచిత్రాలు సందర్శకులను ఆకట్టుకుంటుంటాయి.వరంగల్ కోటలోసందడి పేరిణి నృత్యాన్ని ఆస్వాదించనున్న అందాల రాణులుతెలంగాణ సంస్కృతి, చరిత్రకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే మరో ఘట్టానికి బుధవారం తెర లేవనుంది వరంగల్. బుధవారం మిస్ వరల్డ్ పోటీదారులు చారిత్రక వరంగల్ కోటను సందర్శించి, అక్కడి ప్రాచీన కళారూపమైన పేరిణి శివతాండవ నృత్యంను తిలకిస్తారు. ఈ సందర్శనలో పోటీదారులు కాకతీయుల ఘన వారసత్వానికి, తెలంగాణ సంప్రదాయాలను తెలుసుకోనున్నారు.వరంగల్ కోట – కాకతీయ వైభవానికి ప్రతీకవరంగల్ కోట.. ఎకోశిలా తోరణంలతో ప్రసిద్ధిగాంచిన ఈ కోట, 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు. రుద్రమదేవి, వంటి శక్తిమంతుల పాలనకు సాక్షిగా నిలిచిన ఈ కోట శిల్పకళ, ప్రాకారాల నిర్మాణ శైలి, ద్వారతోరణాల తో విశిష్టత అందుకుంది. కోట ప్రాంగణంలోని రాతి శిల్పాలు కాకతీయుల నిర్మాణ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి.పేరిణి నాట్యం – శక్తి, శివభక్తి సమ్మేళనంపేరిణి శివతాండవం అనేది పురాతన పురుషుల నృత్యరూపం. ఇది యుద్ధానికి ముందు వీరులు శక్తిని ప్రేరేపించుకునేందుకు చేసే తాండవ నృత్యంగా పేరు గాంచింది. శివుని ఆరాధనగా చేసే ఈ నృత్యం, ఉగ్రత, శక్తి, శ్రద్ధల సమన్వయంతో భక్తుల మనస్సులను హత్తుకుంటుంది.పేరిణి నృత్యాన్ని అంతరించి పోతున్న కళారూపంగా భావించి, ప్రముఖ నృత్య విద్యావేత్త పద్మశ్రీ డాక్టర్ నాట్యాచార్య నటరాజ రామకృష్ణ తిరిగి ప్రాచుర్యంలోకి తెచ్చారు. ప్రస్తుతం ఇది తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా పరిగణించబడుతోంది.ప్రపంచ వేదికపై తెలంగాణ కళల వెలుగుఈ సందర్శనలో మిస్ వరల్డ్ పోటీదారులు కోటలోని తూర్పు గోపురాన్ని, రాతిశిలల కట్టడాలను, తూర్పు ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన పేరిణి నృత్య ప్రదర్శనను తిలకించనున్నారు మిస్ వరల్డ్ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, సంప్రదాయ నృత్యాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇది తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక రంగానికి ఊతమిచ్చే గొప్ప అవకాశం. -
Miss World 2025 అందాల నారీమణులతో ‘శారీ’గమలు
సాక్షి, యాదాద్రి: చేనేత వస్త్రాలను ప్రపంచ స్థాయికి పరిచయం చేయడమే ప్రథమ లక్ష్యంగా.. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందగత్తెల ముందు ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. మిస్ వరల్డ్ (Miss World 2025 ) పోటీలకు వచ్చే అందగత్తెలు ఈ నెల 15న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రానున్నారు. పోచంపల్లిలోని రూరల్ టూరిజం రిసార్టుకు ప్రపంచ సుందరీమణులు 25 మంది రానున్నారు. వీరి రాక సందర్భంగా ఇక్కడి ఇక్కత్ చీరల ప్రాధాన్యాన్ని వారికి తెలియజేస్తారు. ఇందువల్ల స్థానిక చేనేత కళాకారులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన పోచంపల్లిని ప్రపంచ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నమిది. ఈ సందర్భంగా యాదగిరి గుట్టకు కూడా సుందరీమణులు రానున్నారు. కొండపైన స్వామి వారి దర్శనం అనంతరం.. కొండ కింద ఫొటో సెషన్ ఉంటుంది. ఇదీ చదవండి: కేన్స్‌లో తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో?చేనేత కళాకారులతో మాటామంతీమిస్ వరల్డ్ పోటీదారులు స్థానికంగా చేనేత కళాకారులతో ముచ్చటిస్తారు. చీరల తయారీకి వాడే దారం పుట్టుక నుంచి.. వస్త్రం తయారీ వరకు.. పలు అంచెల్లో వస్త్రాల తయారీని ఎలా రూపొందిస్తారో వారు అడిగి తెలుసుకుంటారు. యాంఫీ థియేటర్లో ప్రదర్శనపోచంపల్లిలోని టూరిజం సెంటర్ యాంఫీ థియే టర్లో విభిన్నమైన చేనేత వస్త్రాల ప్రదర్శన ఉంటుంది. చేనేత ఇక్కత్, డబుల్ ఇక్కత్, తేలియా రుమాల్.. ఇలా పలు రకాల వస్త్రాల ప్రదర్శన ద్వారా సంప్ర దాయ, ఆధునికత కలిసిన నూతన ప్యాషన్ వస్త్రాలను ప్రదర్శిస్తారు. దీనిద్వారా సంప్రదాయం, ఆధునికత కలిసి నూతన ప్యాషన్ అనే మాటకు చిరునామా కాబోతున్నాయి. ఇందువల్ల దేశ విదేశాల యువతలో చేనేతకు గౌరవం లభిస్తుంది. ప్రముఖులు ఇప్పటికే పొచంపల్లి వస్త్రాలను ధరించడం ప్యాషన్‌గా మారింది. స్టాళ్లలో ప్రదర్శనలు పూర్తిగా గ్రామీణ వాతావరణం కల్పించేందుకు టూరిజం పార్క్‌ను సిద్ధం చేశారు. సిద్దిపేట గొల్లభామ చీరలు, నారాయణపేట, గద్వాల చీరలు, పోచంపల్లి, పుట్టపాక, సిరిపురాలలో తయారయ్యే వస్త్రాలను ప్రదర్శిస్తారు. వీటిని స్థానిక మహిళలు ధరిస్తారు. సంప్రదాయంగా వచ్చిన వస్త్రాలను ఆధునిక ప్యాషన్ డిజైనర్లతో కొత్త రకంగా వస్త్రాలను రూపొందించి అందగత్తెల ముందు ప్రదర్శిస్తారు. ఇక్కత్ డిజైన్లతో తయారవుతున్న తేలియా రుమాల్, సిల్క్, కాటన్, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్స్, రజయ్ (క్విల్స్), స్టోల్స్, స్కాప్స్, దుప్పట్టా, డోర్, టేబుల్ కర్టన్స్, పిల్లో కవర్స్ తదితర వెరైటీలను ప్రదర్శించనున్నారు. -
Cannes 2025 తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో?
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 (Cannes 2025) లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela ) తన అద్భుతమైన ప్రదర్శనతో తన మాయాజాలాన్ని మరోసారి రిపీట్ చేసింది. తనదైన ఫ్యాషన్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసే ఊర్వశి రౌతేలా ఫ్రాన్స్ లోని కేన్స్ నగరంలో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తళుక్కుమని మెరిసింది. కొంతకాలంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను మిస్ కాని ఊర్వశి ఈసారి కూడా స్పెషల్ అప్పియరెన్స్‌తో అదరగొట్టేసింది. డార్క్ గ్రీన్ ట్యాబ్ గౌను, ధరించి యువరాణి లుక్‌లో తళుక్కుమంది. మరీ ముఖ్యగా ఆమెధరించిన ప్యారెట్ ఆకారంలో క్రిస్టల్ క్లచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో దాని ధర ఎంత అనే చర్చ నెట్టింట సందడిగా మారింది.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 78వ ఎడిషన్ మే 13, 2025న ప్రారంభమై మే 24, 2025న ముగియనుంది. అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రఖ్యాత వ్యక్తులు 12 రోజుల పాటు జరిగే గ్లామర్, కళల అద్భుతమైన వేడుకలో సందడి చేయనున్నారు. బాలీవుడ్ హీరోయిన్లతోపాటు, ఈ సారి 76 ఏళ్ల సిమీ గరేవాల్ కేన్స్ ఉత్సవంలో అరంగేట్రం చేస్తోంది.. ఈ సంవత్సరం కేన్స్ ముఖ్యాంశాలలో ఒకటి, అమెరికన్ నట దిగ్గజం, రాబర్ డి నీరోకు జీవిత సాఫల్యానికి గౌరవ పామ్ డి'ఓర్ అవార్డును ప్రదానం చేయడం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఉర్వశి రౌతేలా రెడ్ కార్పెట్ మీద నడిచింది.ఇదీ చదవండి: 76 ఏళ్ల వయసులో 56 ఏళ్ల తరువాత కేన్స్‌లో అరంగేట్రం..అస్సలు ఊహించలేదుఊర్వశి ధరించిన గౌనుతో పాటు, రంగురంగుల రత్నాలు, చెవిపోగులు, రంగురాళ్ల కిరీటం మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. ఇక మేకప్ విషయానికి వస్తే, ముదురు ఊదా రంగు ఐషాడోతో బోల్డ్, గ్లామరస్ మేకప్, కళ్ళపై రైన్‌స్టోన్స్ స్టిక్కర్‌తో తన మరింత ఎలివేట్ చేసుకుంది. పక్షి ఆకారంలో ఉన్న బ్యాగును పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ పోజులివ్వడంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు. కేన్స్‌లో చిలుకలా దుస్తులు ధరించి వచ్చిన తొలి మహిళ, ఇది నిజమా; లేక ఏఐ మాయాజాలమా అంటూ ఆశ్చర్యంలో మునిగి పోయారు.హైలైట్ ఏంటంటేఊర్వశి లుక్‌లో మరో హైలైట్ ఆమె క్లచ్. సాధారణ, ప్రాథమిక క్లచ్‌లను పక్కనపెట్టి, జుడిత్ లిబర్ డిజైనర్ క్రిస్టల్ చిలుక క్లచ్‌ను ఎంచుకుంది.అద్భుతమైన క్లచ్ ధర 5,495 US డాలర్లు అంటే దాదాపు రూ. 4,57,744లు.గతంలో ఊర్వశి రౌతేలా క్రొకోడైల్ నెక్ పీస్ ధరించి పలువుర్ని ఆకర్షించింది. 2023 కేన్స్‌లో రూ. 200 కోట్ల విలువైన నకిలీ మొసలి నెక్‌పీస్ ధరించిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది సిమా కౌచర్ రూపొందించిన పింక్ టల్లే గౌనులో ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై తొలి సారి తన బ్యూటీని ప్రపంచానికి చాటా చెప్పింది. -
‘మిస్ ఇండియా’ను తీర్చిదిద్దుతున్న సౌందర్య శిల్పులు
మిస్ వరల్డ్ వేదికపై భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ నందిని గుప్తా ధరించిన ప్రారంభోత్సవ దుస్తులు అహూతులను అమితంగా ఆకట్టుకున్నాయి. వీటిని డిజైన్ చేసింది నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్ గౌరంగ్ షా కావడం గమనార్హం. ఈ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా, ఉత్సవ వేదికపై మన జాతీయ వస్త్రధారణను, అదే విధంగా ఒక అపూర్వ వారసత్వాన్ని, కళను, శిల్పాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. భారత జానపద వస్త్ర సంపదకు చిహ్నంలా రూపుదిద్దుకున్న ఈ వైవిధ్యభరిత డిజైన్లలో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన జాందాని చేనేతల అందం ప్రస్ఫుటమవుతుంది. దుస్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతోపాటు బాంగ్డీ మోర్ మోటీఫ్ నాట్యం చేస్తూ మెరిసే నాలుగు నెమళ్లు. ఈ మోటీఫ్ కేవలం అలంకారమే కాదు, భారతదేశ హస్తకళా సంపదకు చిహ్నమని చాటి చెప్పాయి. ఆభరణ ‘భాగ్యమూ’ మనదే.. ఈ దుస్తుల వైభవాన్ని మరింతగా పెంచింది నగరానికి చెందిన కిషన్ దాస్ జ్యువెలరీ బ్రాండ్. 1870 నుంచి ఆభరణాల రంగంలో ఉన్న ఈ సంస్థ అందిస్తున్న ఆభరణాలు ప్రత్యేక సందర్భాల్లో నందిని గుప్తాకి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. చాంద్ సూరజ్ హారం, పెద్ద పావురాల ఆకృతులతో రూపొందించిన మరో హారం, బర్మా రూబీలు, బస్రా ముత్యాలు, అన్‌కట్ డైమండ్లతో మినుకు రాజవంశాల వైభవాన్ని ప్రతిబింబించే ఆభరణాలను ఆమె ధరిస్తున్నారు. అపు‘రూపం’.. కేశ సౌందర్యం.. మిస్ ఇండియా నందిని గుప్తా తన ప్రత్యేకమైన డ్రెస్‌లు, మేకప్, హెయిర్‌స్టైల్స్‌తో ఆకట్టుకోవడం వెనుక ఫెమినా మిస్ ఇండియా సంస్థ ఆమె కోసం ఎంపిక చేసిన నిపుణుల కృషి కనిపిస్తుంది. ఆమె మేకప్ డిజైన్ కోచ్‌గా ఆయేషా సేత్‌ను ఫెమినా నియమించినట్లు తెలుస్తోంది. నందినికి ఆమె ప్రత్యేక శిక్షణను అందించి, ఆమె అందానికి వన్నెలు అద్దుతున్నారు. ఈ శిక్షణ, నందినికి వివిధ సందర్భాలకు అనుగుణంగా మేకప్ శైలిని అభ్యసించేందుకు సహాయపడుతోంది. అదే విధంగా నందిని గుప్తా హెయిర్‌స్టైలింగ్ బాధ్యతను సుమితా థిల్లాన్ పర్యవేక్షిస్తున్నట్టు చెబుతున్నారు. నందిని ధరిస్తున్న ప్రతి డ్రెస్‌కు అనుగుణంగా ఆమె హెయిర్‌స్టైల్‌ను మార్పు చేర్పులు చేస్తూ ఆకట్టుకునేలా రూపొందిస్తూ తన వంతుగా ఆమెని మెరిపిస్తున్నారు.. పోటీల ప్రారం¿ోత్సవంలో నేషనల్ కాస్ట్యూమ్‌గా గౌరంగ్ షా డిజైన్ చేసిన జామ్దాని లెహంగాను నందిని ధరించగా, ఆమెకు వస్త్రధారణ, స్టైల్స్‌లో సేవలు అందిస్తున్న ఇతర డిజైనర్లలో అమృత్‌రాజ్ బోరా, సామంత్ చౌహాన్, నికితా మహిసాల్కర్లు ఉన్నారని సమాచారం. దీర్ఘకాల కృషి ఫలితం.. మిస్ వరల్డ్ పోటీలో దుస్తుల కోసం నందిని బృందం నన్ను సంప్రదించినప్పుడు, నాలో వెంటనే ఈ ఆర్ట్ పీస్ కళ్లలో మెదిలింది. కాలాతీత భారతీయ హస్తకళను ప్రతిబింబిస్తూ ఇది అంతర్జాతీయ వేదికకు సరిగ్గా సరిపోతుందని భావించాను. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుంచి 8 మంది పేరొందిన కళాకారులు అంకితభావంతో కూడిన బృందం ఈ కళాత్మక డిజైన్లకు జీవం పోయడానికి సహకరించింది. నెలల తరబడి కృషి ఫలితంగా ఈ కళాత్మక మాస్టర్ పీస్ ఆవిర్భవించింది. – గౌరంగ్ షా, నగర డిజైనర్ -
Miss World 2025: బ్యూటీ విత్ ఫన్..
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ –2025 పోటీల నేపథ్యంలో హైదరాబాద్ నగరం అందాల మగువల శోభను అలంకిరించుకుంది. హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్ వేదికగా వసతి పొందుతున్న ఈ సుందరాంగులు ఏ మాత్రం సమయం దొరికినా ఫన్ యాక్టివిటీస్‌తో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలుగు సినీ ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా.. నన్ను చుట్టూకుంటివే’ అనే పాటకు స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆ పాటకు అనుగుణంగా మిస్ డెన్మార్క్, మిస్ చెక్ రిపబ్లిక్, మిస్ జెర్మనీ సుందరాంగులు ఒరిజినల్ స్టెప్పులేశారు. మరి కొందరు తారలు సోషల్ మీడియా యాప్స్ కోసం సెల్ఫీ మోడ్‌లో రీల్స్ చేస్తూ సందడి చేశారు. మిస్ వరల్డ్ పోటీలతో పాటు వినోదం కోసం చేస్తున్న ఈ రీల్స్, ఫొటో షూట్లను ఎప్పటికప్పుడు వారి ఇన్‌స్టా, ఎక్స్ ఇతర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మిస్ ఇండియా నందినీ గుప్తా అందమైన అధునాతన–సంప్రదాయ సమ్మిళిత దుస్తుల్లో హోటల్లోని స్విమ్మింగ్ ఫూల్ పరిసరాల్లో చేసిన క్యాట్ వాక్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాకుండా బ్రెజిల్, బోత్వానా, ఘనా, ఎల్ సెల్వడోర్ వంటి దేశాలకు చెందిన మిస్ వరల్డ్ తారలు ఒకరినొకరు తమ మొబైల్స్‌లో ఫొటోలు తీస్తూ సందడి చేశారు. -
జూనియర్ ఎన్టీఆర్‌తో నటించాలనుంది అంటున్న బ్యూటీ!
ఇదివరకైతే ఇలాంటి పోటీల్లో నిర్ణీత కొలతల్లో శరీరాకృతి ఉండాలనే నియమం ఉండేది. కానీ ఇప్పుడు వీరందరినీ చూస్తుంటే అలా అనిపించట్లేదు. అయిదున్నర అడుగుల కంటే తక్కువ ఎత్తున్న వాళ్లున్నారు.. ఆరడుగులు ఎత్తు దాటిన వారూ ఉన్నారు. సన్నజాజి తీగను మరిపించే వారున్నారు, బలిష్టమైన శరీరాకృతితో మెరిసి΄ోతున్న వాళ్లూ ఉన్నారు. ఇంచుమించు అందరివీ వైవిధ్యభరితమైన నేపథ్యాలు, ఎన్నో పోరాటాలు, ఎదురీతలు... దాదాపు 120 దేశాల సుందరీమణులు. రకరకాల దేశాల శీతోష్ణస్థితులు... రకరకాల స్కిన్టోన్లు. వివిధ రకాల ఆకృతులు. వారందరికీ ఒక్కొక్కరిది ఒక్కో కథ! ఆత్మవిశ్వాసమే ఆభరణంగా.. ప్రతిభ, బ్యూటీ విత్ పర్సస్ ప్రధాన అర్హతలుగా తెలంగాణలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఆ సుందరీమణుల్లో రొజుకొకరి పరిచయం ఇక్కడ. ఈరోజు మిస్ జపాన్ కియానా తుమీత గురించి ఆమె మాటల్లోనే..నేను ప్రకృతి వైపరీత్యాల మీద పీహెచ్డీ చేస్తున్నాను. అంతకుముందు కేంబ్రిడ్జ్, ఎడింబరో యూనివర్సిటీల్లో విమెన్ లీడర్ షిప్ మాస్టర్ డిగ్రీ చేశాను. ఒక బిజినెస్ చానల్లోఎకనమిక్ న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్నాను. నా టాలెంట్ విషయాలకు వస్తే నేను జపనీస్ కాలిగ్రాఫర్ని. అందులో నాకు మంచి పేరుంది. ఎలక్ట్రిక్ ఫ్లూట్ కూడా వాయిస్తాను. ఈ పోటీల్లో టాలెంట్ రౌండ్లో ఎలక్ట్రిక్ ఫ్లూట్నే పెర్ఫార్మ్ చేయబోతున్నాను. ప్రకృతి గౌరవిస్తూ వైపరీత్యాలు రాకుండా జాగ్రత్తపడటం, ఒకవేళ ప్రకృతివైపరీత్యాలు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను. నా అందంతో ఈ ప్రయోజనాన్ని సాధించాలనుకుంటున్నా! ప్రకృతి వైపరీత్యాల పట్ల పిల్లలకు అవేర్నెస్ కల్పించడం! స్త్రీ, పురుష వివక్ష విషయానికి వస్తే.. దానికి జపాన్ కూడా అతీతమేమీ కాదు. చదువుకు సంబంధించి అమ్మాయి, అబ్బాయిలకు సమాన అవకాశాలున్నప్పటికీ.. లీడర్షిప్ విషయంలో మాత్రం పురుషులదే ఆధిపత్యం. ఆ అంతరం చాలా ఎక్కువ. వేతనాల్లో కూడా ఆ గ్యాప్ కనపడుతుంది. సమానమైన పనికి మహిళలకన్నా పురుషులకే వేతనాలు ఎక్కువ. డిసిప్లిన్, పని విషయాల్లో ప్రపంచంలోని ప్రతిదేశం జపాన్ వైపు చూస్తుందేమో కానీ.. టెక్నికల్ జాబ్స్ విషయంలో మాత్రం మేము ఇండియాను అప్రిషియేట్ చేస్తాం. కొత్తగా వచ్చిన ఏ టెక్నికల్ చేంజ్‌ను అయినా ఇట్టే గ్రహించి, అడాప్ట్ చేసుకుని రాణిస్తున్నారు. ఇండియాలో జరుగుతున్న క్రైమ్ గురించి వార్తల్లో విన్నప్పుడు కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. కానీ ఈ పోటీల కోసం ఇక్కడ ల్యాండ్ అయ్యి, ఇక్కడి మనుషులు, వాళ్లిచ్చే మర్యాద అవన్నీ చూశాక ఆ నెర్వస్నెస్, భయాలు అన్నీ పటాపంచలయ్యాయి. ఇక్కడికి రావడానికి నాకు దుబాయ్‌లో కనెక్టింగ్ ఫ్లయిట్ ఉండింది. అక్కడ బోర్డింగ్‌లో నా లగేజ్‌తో అవస్థపడుతుంటే ఒక ఇండియన్ జెంటిల్మన్ నాకు చాలా హెల్ప్ చేశాడు. అప్పుడే నాకు ఇండియా మీద గౌరవం రెట్టింపయింది. ఈ దేశానికి సంబంధించి నాకు ఇష్టమైన మరోవిషయం.. ఎర్రటి బొట్టు. ఈ పోటీలో ఒకరోజు నేను చీర కట్టుకుని, ఎర్రటి బిందీ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇండియాకు, జ΄ాన్కున్న మరో సామ్యం.. బౌద్ధం. మేము ఫాలో అవుతున్న బౌద్ధానికి, ఇక్కడికి వ్యత్యాసమున్నప్పటికీ బౌద్ధం ఈ దేశంతో మాకో కనెక్టివిటీని పెంచింది. ఇక్కడి ఆధ్యాత్మికతకు నేను ఫిదా అయ్యాను. బ్యూటీ పాజెంట్ విషయానికి వస్తే చాలా దేశాల్లో ఉన్నట్టే జపాన్‌లోనూ.. అందాల పోటీలు అంటే స్కిన్ షో తప్ప మరోటి కాదనే అభిప్రాయం, అపోహా ఉన్నాయి. కానీ బ్యూటీ విత్ పర్పస్ అనే ఐడియా నాకు నచ్చి.. పోటీల్లోపాల్గొంటున్నాను. సిస్టర్హుడ్ క్రియేట్ చేయడానికి ఇదొక వేదిక. సన్నగా ఉన్నామా.. లావుగా ఉన్నామా.. తెల్లగా ఉన్నామా.. నల్లగా ఉన్నామా అని కాదు.. అదసలు విషయమే కాదు. డజంట్ మ్యాటర్. ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామన్నదే మ్యాటర్. అందుకే నా దృష్టిలో ఆత్మవిశ్వాసమే అసలైన అందం!ఇదీ చదవండి: Operation Sindoor: 17 మంది బంగారు తల్లులు, అదో భావోద్వేగం! జూనియర్ ఎన్టీఆర్‌తో నటించాలనుంది..నాటు నాటు పాట జపాన్‌లో చాలా ఫేమస్. ఆ సినిమా అంటే నాకూ చాలా ఇష్టం. అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పక్కన నటించడానికి నేను సిద్ధం. బాలీవుడ్లో ప్రియాంక చోప్రా షారూఖ్ ఖాన్‌కి వీర ఫ్యాన్‌ని. ఇండియాది రిచ్ కల్చర్. ఇక్కడి రైతా చాలా డెలీషియస్‌గా ఉంటుంది. – కియానా తుమీతచదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర– సరస్వతి రమ -
ఓల్డ్ సిటీ.. న్యూ బ్యూటీ
హైదరాబాద్: మిస్ వరల్డ్–2025 పోటీదారులతో చార్మినార్నుంచి లాడ్ బజార్ వరకు మంగళవారం నిర్వహించనున్న హెరిటేజ్ వాక్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు పాతబస్తీలో కొన్ని ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే చిరు వ్యాపారులను కట్టడి చేసే దిశగా అందరికీ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఒకరోజు తమ వ్యాపారాలకు సెలవు ఇవ్వాలని సూచించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. చార్మినార్‌కు నాలుగు వైపులా ఉన్న దారుల్లో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. అణువణువూ తనిఖీ చేసిన అనంతరమే చార్మినార్ (Charminar) వరకు అనుమతించనున్నారు. ఇప్పటికే బాంబు, డాగ్ స్క్వాడ్లతో చార్మినార్, లాడ్ బజార్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ రూట్లో రహదారులను అందంగా తీర్చిదిద్ది..ఇరువైపులా తాత్కాలిక విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. చార్మినార్నుంచి లాడ్ బజార్ వరకు హెరిటేజ్ వాక్ అనంతరం అందాల పోటీదారులు ఇక్కడ షాపింగ్ చేయనున్నారు. అంతరం అక్కడి నుంచి వాహనాల ద్వారా చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకొని డిన్నర్ చేయనున్నారు. ఈ డిన్నర్లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొననున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దాదాపు 120 దేశాలకు చెందిన ప్రపంచ సుందరాంగులు ఈ హెరిటేజ్ వాక్‌లో పాల్గొననున్నారు. చార్మినా ర్నుంచి లాడ్ బజార్ వరకు నిర్వహించే వాక్‌లో ప్రపంచ సుందరాంగులు పాల్గొని ఇక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటారు. అనంతరం షాపింగ్ చేయనున్నారు. తెలంగాణ జరూర్ ఆనా.. అనే టైటిల్‌తో చూడముచ్చటగా తయారు చేయించిన ప్రత్యేక ఏసీ బస్సులో మిస్ వరల్డ్ పోటీదారులు పాతబస్తీకి వస్తారు. శివారు ప్రాంతమైన ఆరాంఘర్ నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లై ఓవర్ ద్వారా పాతబస్తీలోకి ప్రవేశిస్తారు. అనంతరం బహదూర్‌పురా, పురానాపూల్, పేట్లబురుజు, మదీనా సర్కిల్, పత్తర్‌గట్టి, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్ మీదుగా చారి్మనార్‌కు చేరుకుంటారు. డిన్నర్ (Dinner) అనంతరం తిరిగివచ్చిన రూట్లోనే వెళ్లనున్నారు. హెరిటేజ్ వాక్ (Heritage Walk) కోసం పాతబస్తీలో దాదాపు 10 కిలో మీటర్ల రేడియస్‌లో అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని జీహెచ్ఎంసీ (GHMC) చార్మినార్ జోనల్ కమిషనర్ టి.వెంకన్న తెలిపారు. వీధి దీపాల ఏర్పాటుతో పాటు తాత్కాలిక విద్యుత్ దీపాలంకరణ, బీటీ రోడ్లు, డివైడర్ల మరమ్మతులు చేయించామన్నారు. దాదాపు 250 మంది కారి్మకులు పారిశుధ్య పనుల్లో పాలుపంచుకున్నారని తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. మదీనా నుండి చార్మినార్, చార్మినార్ నుంచి శాలిబండ, శాలిబండ (రాజేష్ మెడికల్ హాల్) నుండి వోల్గా జంక్షన్, వోల్గా జంక్షన్ నుండి మూసబౌలి వయా ఖిల్వత్ రోడ్డుకు వెళ్లే రోడ్లలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకల్ని నియంత్రించనున్నారు. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు నగర పోలీస్ (ట్రాఫిక్) జాయింట్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. మదీనా జంక్షన్: నయాపూల్ నుండి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజ్ వైపు మళ్లిస్తారు. హిమ్మత్‌పుర: నాగల్‌చింత/శాలిబండ ప్రాంతాల నుండి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమ్మత్‌పురా జంక్షన్, హరి బౌలి మరియు వోల్గా జంక్షన్ వైపు ఫతే దర్వాజా రోడ్డు వరకు తరలిస్తారు.వోల్గా జంక్షన్: హిమ్మత్‌పురా నుండి వచ్చే ట్రాఫిక్‌ను చౌమొహల్లా ప్యాలెస్ వైపు అనుమతించరు. వీటిని వోల్గా జంక్షన్ ఫతే దర్వాజా వైపు మళ్లిస్తారు. ఫతే దర్వాజా నుండి వచ్చే ట్రాఫిక్‌ను హిమ్మిత్పురా వైపు మళ్లిస్తారు. మూసబౌలి: పురానాపూల్ (గుడ్ విల్ కేఫ్) నుండి వచ్చే ట్రాఫిక్‌ను చారి్మనార్/చౌమహల్లా ప్యాలెస్ వైపు అనుమతించరు మరియు మూసబౌలి వద్ద సిటీ కాలేజ్ మరియు ఫతే దర్వాజా వైపు దూద్‌బౌలి ద్వారా మళ్లిస్తారు. చౌక్ మైదాన్ కమాన్: చౌక్ మైదాన్ నుండి చార్మినార్వైపు వచ్చే ట్రాఫిక్‌ను చౌక్ మైదాన్ వద్ద కోట్ల అలిజా లేదా మొఘల్‌పురా వైపు మళ్లిస్తారు. ఎతేబార్ చౌక్: ఎతేబార్ చౌక్ ప్రాంతం నుండి గుల్జార్‌హౌస్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎతేబార్ చౌక్ వద్ద మండి మిరాలం మార్కెట్ లేదా బీబీ బజార్ వైపు మళ్లిస్తారు. షేర్ ఎ బైతుల్ కమాన్: మిట్టి కా షేర్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను గుల్జార్ హౌస్ వైపు అనుమతించరు మరియు మిట్టి–కే–షేర్ జంక్షన్ వద్ద ఘాన్సీ బజార్ వైపు మళ్లించి హైకోర్టు రోడ్డుకు చేరుకుంటారు. లక్కడ్ కోట్ (పాత సీపీ ఆఫీస్ జంక్షన్): అపాట్ వైపు నుండి చార్మినార్వైపు వచ్చే ట్రాఫిక్‌ను లక్కడ్ కోట్ వద్ద (ఓల్డ్ సీపీ ఆఫీస్ లేన్) మరియు మిరాలం మండి మార్కెట్ వైపు మళ్లిస్తారు (అవసరమైతే) ఈ పరిమితులు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తాయి. -
72nd Miss World: మీకూ మాకూ సామ్యం.. బౌద్ధం!
దాదాపు 120 దేశాల సుందరీమణులు. రకరకాల దేశాల శీతోష్ణస్థితులు... రకరకాల స్కిన్టోన్లు. వివిధ రకాల ఆకృతులు. వారందరికీ ఒక్కొక్కరిది ఒక్కో కథ! ఆత్మవిశ్వాసమే ఆభరణంగా.. ప్రతిభ, బ్యూటీ విత్ పర్సస్ ప్రధాన అర్హతలుగా తెలంగాణలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఆ సుందరీమణుల్లో రొజుకొకరి పరిచయం ఇక్కడ. ఈరోజు మిస్ జపాన్ కియానా తుమీత గురించి ఆమె మాటల్లోనే..నేను ప్రకృతి వైపరీత్యాల మీద పీహెచ్డీ చేస్తున్నాను. అంతకుముందు కేంబ్రిడ్జ్, ఎడింబరో యూనివర్సిటీల్లో విమెన్ లీడర్ షిప్ మాస్టర్ డిగ్రీ చేశాను. ఒక బిజినెస్ చానల్లోఎకనమిక్ న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్నాను. నా టాలెంట్ విషయాలకు వస్తే నేను జపనీస్ కాలిగ్రాఫర్ని. అందులో నాకు మంచి పేరుంది. ఎలక్ట్రిక్ ఫ్లూట్ కూడా వాయిస్తాను. ఈ పోటీల్లో టాలెంట్ రౌండ్లో ఎలక్ట్రిక్ ఫ్లూట్నే పెర్ఫార్మ్ చేయబోతున్నాను. ప్రకృతి గౌరవిస్తూ వైపరీత్యాలు రాకుండా జాగ్రత్తపడటం, ఒకవేళ ప్రకృతివైపరీత్యాలు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను. నా అందంతో ఈ ప్రయోజనాన్ని సాధించాలనుకుంటున్నా! ప్రకృతి వైపరీత్యాల పట్ల పిల్లలకు అవేర్నెస్ కల్పించడం! స్త్రీ, పురుష వివక్ష విషయానికి వస్తే.. దానికి జపాన్ కూడా అతీతమేమీ కాదు. చదువుకు సంబంధించి అమ్మాయి, అబ్బాయిలకు సమాన అవకాశాలున్నప్పటికీ.. లీడర్షిప్ విషయంలో మాత్రం పురుషులదే ఆధిపత్యం. ఆ అంతరం చాలా ఎక్కువ. వేతనాల్లో కూడా ఆ గ్యాప్ కనపడుతుంది. సమానమైన పనికి మహిళలకన్నా పురుషులకే వేతనాలు ఎక్కువ. డిసిప్లిన్, పని విషయాల్లో ప్రపంచంలోని ప్రతిదేశం జపాన్ వైపు చూస్తుందేమో కానీ.. టెక్నికల్ జాబ్స్ విషయంలో మాత్రం మేము ఇండియాను అప్రిషియేట్ చేస్తాం. కొత్తగా వచ్చిన ఏ టెక్నికల్ చేంజ్‌ను అయినా ఇట్టే గ్రహించి, అడాప్ట్ చేసుకుని రాణిస్తున్నారు. ఇండియాలో జరుగుతున్న క్రైమ్ గురించి వార్తల్లో విన్నప్పుడు కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. కానీ ఈ పోటీల కోసం ఇక్కడ ల్యాండ్ అయ్యి, ఇక్కడి మనుషులు, వాళ్లిచ్చే మర్యాద అవన్నీ చూశాక ఆ నెర్వస్నెస్, భయాలు అన్నీ పటాపంచలయ్యాయి. ఇక్కడికి రావడానికి నాకు దుబాయ్‌లో కనెక్టింగ్ ఫ్లయిట్ ఉండింది. అక్కడ బోర్డింగ్‌లో నా లగేజ్‌తో అవస్థపడుతుంటే ఒక ఇండియన్ జెంటిల్మన్ నాకు చాలా హెల్ప్ చేశాడు. అప్పుడే నాకు ఇండియా మీద గౌరవం రెట్టింపయింది. ఈ దేశానికి సంబంధించి నాకు ఇష్టమైన మరోవిషయం.. ఎర్రటి బొట్టు. ఈ పాజెంట్‌లో ఒకరోజు నేను చీర కట్టుకుని, ఎర్రటి బిందీ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇండియాకు, జపాన్‌కున్న మరో సామ్యం.. బౌద్ధం. మేము ఫాలో అవుతున్న బౌద్ధానికి, ఇక్కడికి వ్యత్యాసమున్నప్పటికీ బౌద్ధం ఈ దేశంతో మాకో కనెక్టివిటీని పెంచింది. ఇక్కడి ఆధ్యాత్మికతకు నేను ఫిదా అయ్యాను. బ్యూటీ పాజెంట్ విషయానికి వస్తే చాలా దేశాల్లో ఉన్నట్టే జపాన్‌లోనూ.. అందాల పోటీలు అంటే స్కిన్ షో తప్ప మరోటి కాదనే అభిప్రాయం, అపోహా ఉన్నాయి. కానీ బ్యూటీ విత్ పర్పస్ అనే ఐడియా నాకు నచ్చి.. పోటీల్లో పాల్గొంటున్నాను. సిస్టర్హుడ్ క్రియేట్ చేయడానికి ఇదొక వేదిక. సన్నగా ఉన్నామా.. లావుగా ఉన్నామా.. తెల్లగా ఉన్నామా.. నల్లగా ఉన్నామా అని కాదు.. అదసలు విషయమే కాదు. డజంట్ మ్యాటర్. ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామన్నదే మ్యాటర్. అందుకే నా దృష్టిలో ఆత్మవిశ్వాసమే అసలైన అందం! జూనియర్ ఎన్టీఆర్‌తో నటించాలనుంది..నాటు నాటు పాట జపాన్‌లో చాలా ఫేమస్. ఆ సినిమా అంటే నాకూ చాలా ఇష్టం. అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పక్కన నటించడానికి నేను సిద్ధం. బాలీవుడ్లో ప్రియాంక చోప్రా, షారూఖ్ ఖాన్‌కి వీర ఫ్యాన్‌ని. ఇండియాది రిచ్ కల్చర్. ఇక్కడి రైతా చాలా డెలీషియస్‌గా ఉంటుంది. – కియానా తుమీత– సరస్వతి రమ