నన్హీ పరీ | Nanhi Pari auditions at Telugu University in Hyderabad on 20 september 2025 | Sakshi
Sakshi News home page

నన్హీ పరీ

Sep 12 2025 6:26 AM | Updated on Sep 12 2025 6:26 AM

Nanhi Pari auditions at Telugu University in Hyderabad on 20 september 2025

లిటిల్‌ మిస్‌ ఇండియా

ఈ రోజుల్లో పిల్లలందరూ ప్రతిభాఘనులే! అయితే చదువు ఒత్తిడిలో అది మసకబారుతోంది! అలాంటి పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు తమ ప్రజ్ఞను ప్రదర్శించడానికి భువనేశ్వర్‌లోని కిట్స్‌ (కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) వేదిక కల్పిస్తోంది.. ‘నన్హీ పరీ లిటిల్‌ మిస్‌ ఇండియా’ పేరుతో!

ఈ పోటీల్లో పదమూడేళ్ల నుంచి పదిహేనేళ్ల బాలికలందరూ పాల్గొనవచ్చు! విజేతలకు క్యాష్‌ప్రైజ్‌తోపాటు గెలుపొందిన స్థానాన్ని బట్టి కిట్స్‌లో తమకు ఇష్టమైన కోర్స్‌లో ఉచిత, భారీ రాయితీలతో విద్యనూ అందిస్తోంది. ఆ వివరాలు..  

టాలెంట్‌ లేని పిల్లలు కనపడట్లేదిప్పుడు. ఇంజినీరింగ్, మెడిసిన్‌ చదువులకు స్కూల్‌ నుంచే పునాది వేస్తూ పిల్లల్లోని సహజమైన ప్రతిభను బయటకు రానీకుండా చేస్తున్నాం. దానివల్ల వాళ్లు తమకు పరిచయంలేని పదిమంది ముందుకు రావడానికి జంకుతున్నారు. మాట్లాడ్డానికి వణుకుతున్నారు. వేదికెక్కడానికి వెనుకాడుతున్నారు. దాన్ని గమనించింది.. ఆడపిల్లల చదువు కోసం కొన్ని దశాబ్దాలుగా పాటుపడుతున్న కిట్స్‌.

 ఒక్క చదువుకే కాదు బాలికల ప్రతిభాపాటవాలకూ ప్లాట్‌ఫామ్‌ కావాలని నిశ్చయించుకుంది. 2001లో ఒడిశాలో ‘నన్హీ పరీ లిటిల్‌ మిస్‌ ఇండియా’ పోటీలను మొదలుపెట్టింది.  2004కల్లా ఉత్తర భారతంలోని ప్రతి రాష్ట్రం పాల్గొనే స్థాయికి ఎదిగింది. 2015లో దక్షిణాది రాష్ట్రాలకూ చేరిన ఈ పోటీలు ఇప్పుడు జాతీయ స్థాయిని అందుకున్నాయి. ఈ ఏడు పాతికేళ్ల సంబరాన్ని జరుపుకోనున్నాయి. 

వీటి కోసం తెలుగు రాష్ట్రాల బాలికలకు ఈ నెల 20న హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీలో ఆడిషన్స్‌ జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 13–15 ఏళ్ల బాలికలు తమ పరిచయంతోపాటు తమ ప్రతిభను చూపే వన్‌ మినిట్‌ వీడియోను https://forms.gle/ 1QzSwfVcuPy5jTto8 అనే లింక్‌కి గానీ, 8790161155/ 8790163355 నంబర్లకు వాట్సాప్‌ గానీ, kiitnanhipari.hyd@ gmail.comకి మెయిల్‌ గానీ చేయొచ్చు.

 ఆఖరు తేదీ 15 సెప్టెంబర్‌. 20వ తేదీన జరిగే ఆడిషన్స్‌లో ఇంట్రడక్షన్, పెర్‌ఫార్మెన్స్‌ అనే రెండు రౌండ్లు ఉంటాయి. ఇందులోంచి ఇద్దరు భువనేశ్వర్‌లో జరిగే ఫైనల్స్‌కి ఎంపిక అవుతారు. అలా దేశమంతటా ఆడిషన్స్‌ జరిగి.. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికై ఫైనల్‌ పోటీలకు వస్తారు. రెండు రోజులు జరిగే ఈ పోటీల్లోంచి ముగ్గురు విజేతలను ఎంపికచేస్తారు.

 మొదటి బహుమతిగా పదిలక్షల క్యాష్‌ ప్రైజ్, కళింగ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచిత విద్య, ఫస్ట్‌ రన్నరప్‌కి రూ. అయిదు లక్షల క్యాష్‌ ప్రైజ్, కిట్స్‌లో యాభై శాతం ఫీజు డిస్కౌంట్, సెకండ్‌ రన్నరప్‌కి రూ. మూడు లక్షల క్యాష్‌ ప్రైజ్, కిట్స్‌లో యాభై శాతం ఫీజు డిస్కౌంట్‌ ఉంటుంది. ఇవికాక మరో పది కేటగిరీల్లో కేటగిరీకి రూ. 20 వేల చొప్పున మొత్తం రూ. 2 లక్షల క్యాష్‌ ప్రైజ్‌ ఉంటుంది. ఇలా ఈ పోటీలు భవిష్యత్‌లో అమ్మాయిలు పలు అంతర్జాతీయ వేదికల మీద బెరుకు లేకుండా పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చేలా... ఇలాంటి పోటీల్లో నిర్భయంగా పాల్గొనేలా తర్ఫీదునిస్తున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement