breaking news
Little Kid
-
నన్హీ పరీ
ఈ రోజుల్లో పిల్లలందరూ ప్రతిభాఘనులే! అయితే చదువు ఒత్తిడిలో అది మసకబారుతోంది! అలాంటి పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు తమ ప్రజ్ఞను ప్రదర్శించడానికి భువనేశ్వర్‌లోని కిట్స్ (కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వేదిక కల్పిస్తోంది.. ‘నన్హీ పరీ లిటిల్ మిస్ ఇండియా’ పేరుతో!ఈ పోటీల్లో పదమూడేళ్ల నుంచి పదిహేనేళ్ల బాలికలందరూ పాల్గొనవచ్చు! విజేతలకు క్యాష్ప్రైజ్తోపాటు గెలుపొందిన స్థానాన్ని బట్టి కిట్స్‌లో తమకు ఇష్టమైన కోర్స్‌లో ఉచిత, భారీ రాయితీలతో విద్యనూ అందిస్తోంది. ఆ వివరాలు.. టాలెంట్ లేని పిల్లలు కనపడట్లేదిప్పుడు. ఇంజినీరింగ్, మెడిసిన్ చదువులకు స్కూల్ నుంచే పునాది వేస్తూ పిల్లల్లోని సహజమైన ప్రతిభను బయటకు రానీకుండా చేస్తున్నాం. దానివల్ల వాళ్లు తమకు పరిచయంలేని పదిమంది ముందుకు రావడానికి జంకుతున్నారు. మాట్లాడ్డానికి వణుకుతున్నారు. వేదికెక్కడానికి వెనుకాడుతున్నారు. దాన్ని గమనించింది.. ఆడపిల్లల చదువు కోసం కొన్ని దశాబ్దాలుగా పాటుపడుతున్న కిట్స్. ఒక్క చదువుకే కాదు బాలికల ప్రతిభాపాటవాలకూ ప్లాట్‌ఫామ్ కావాలని నిశ్చయించుకుంది. 2001లో ఒడిశాలో ‘నన్హీ పరీ లిటిల్ మిస్ ఇండియా’ పోటీలను మొదలుపెట్టింది. 2004కల్లా ఉత్తర భారతంలోని ప్రతి రాష్ట్రం పాల్గొనే స్థాయికి ఎదిగింది. 2015లో దక్షిణాది రాష్ట్రాలకూ చేరిన ఈ పోటీలు ఇప్పుడు జాతీయ స్థాయిని అందుకున్నాయి. ఈ ఏడు పాతికేళ్ల సంబరాన్ని జరుపుకోనున్నాయి. వీటి కోసం తెలుగు రాష్ట్రాల బాలికలకు ఈ నెల 20న హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీలో ఆడిషన్స్ జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 13–15 ఏళ్ల బాలికలు తమ పరిచయంతోపాటు తమ ప్రతిభను చూపే వన్ మినిట్ వీడియోను https://forms.gle/ 1QzSwfVcuPy5jTto8 అనే లింక్‌కి గానీ, 8790161155/ 8790163355 నంబర్లకు వాట్సాప్ గానీ, kiitnanhipari.hyd@ gmail.comకి మెయిల్ గానీ చేయొచ్చు. ఆఖరు తేదీ 15 సెప్టెంబర్. 20వ తేదీన జరిగే ఆడిషన్స్‌లో ఇంట్రడక్షన్, పెర్ఫార్మెన్స్ అనే రెండు రౌండ్లు ఉంటాయి. ఇందులోంచి ఇద్దరు భువనేశ్వర్‌లో జరిగే ఫైనల్స్‌కి ఎంపిక అవుతారు. అలా దేశమంతటా ఆడిషన్స్ జరిగి.. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికై ఫైనల్ పోటీలకు వస్తారు. రెండు రోజులు జరిగే ఈ పోటీల్లోంచి ముగ్గురు విజేతలను ఎంపికచేస్తారు. మొదటి బహుమతిగా పదిలక్షల క్యాష్ ప్రైజ్, కళింగ ఇన్స్టిట్యూట్లో ఉచిత విద్య, ఫస్ట్ రన్నరప్‌కి రూ. అయిదు లక్షల క్యాష్ ప్రైజ్, కిట్స్‌లో యాభై శాతం ఫీజు డిస్కౌంట్, సెకండ్ రన్నరప్‌కి రూ. మూడు లక్షల క్యాష్ ప్రైజ్, కిట్స్‌లో యాభై శాతం ఫీజు డిస్కౌంట్ ఉంటుంది. ఇవికాక మరో పది కేటగిరీల్లో కేటగిరీకి రూ. 20 వేల చొప్పున మొత్తం రూ. 2 లక్షల క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఇలా ఈ పోటీలు భవిష్యత్‌లో అమ్మాయిలు పలు అంతర్జాతీయ వేదికల మీద బెరుకు లేకుండా పెర్ఫార్మెన్స్ ఇచ్చేలా... ఇలాంటి పోటీల్లో నిర్భయంగా పాల్గొనేలా తర్ఫీదునిస్తున్నాయి. -
సన్నీ లియోన్ వీడియో హల్ చల్
-
సన్నీ లియోన్ వీడియో హల్ చల్
బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్‌కు కుర్రకారులో స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓ చిన్నారి పాప సన్నీ లియోన్‌ను చూడగానే సొంత మనిషిలా దగ్గరయ్యింది. సన్నీని విడిచి తల్లిదండ్రులకు వద్దకు వెళ్లనంటూ మారాం చేసింది. చివరకు అయిష్టంగానే సన్నీని వీడి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. ఈ వీడియో యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ నెల 20న సన్నీ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అదే రోజు కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. ఓ పాపను సన్నీ లియోను ఎత్తుకుంది. బాగా తెలిసినవారి దగ్గరున్నట్టు ఆ పాప సన్నీ భుజాలపై తలవాల్చి ఉండిపోయింది. కాసేపటి తర్వాత ఆ పాప తల్లిదండ్రులు సన్నీ నుంచి ఆ అమ్మాయిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తమ దగ్గరకు రమ్మని పిలిచినా ఆ పాప సన్నీని వీడి రాలేదు. ఈ తతంగాన్ని గమనించి ఆపాపపై ముచ్చటపడ్డ సన్నీ.. తల్లిదండ్రులకు బై చెప్పమని ఆ అమ్మాయికి చెప్పి కాస్త దూరం తీసుకెళ్లింది. ఆ పాప నవ్వుతూ అలా చూస్తూ ఉండిపోయింది కానీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేదు. చివరకు తల్లిదండ్రులు ఆ పాపను బుజ్జగించి సన్నీ నుంచి తీసుకెళ్లారు. తర్వాతి రోజు సన్నీ మరో వీడియోను పోస్ట్ చేసింది. ఫోన్‌తో సెల్ఫీలు ఎలా తీయవచ్చో ఆ పాపకు సన్నీ నేర్పించింది. కాగా ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడ ఈ ఘటన జరిగింది అన్న విషయాలు తెలియరాలేదు. వీడియోను బట్టి భారత్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. -
ఇంటర్నెట్ లిటిల్ సెన్సేషన్