
సెలబ్రిటీ విమెన్ అంటే లగ్జరీ బ్యాగులు, లగ్జరీ కార్లు కామన్. లగ్జరీ వస్తువుల కలెక్షన్ అనగానే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ గుర్తు వస్తారు. కానీ ఈ విషయంలో నేనేమీ తక్కువ కాదంటోంది బాలీవుడ్ అందాలభామ అమీషా పటేల్.అమీషా పటేల్ వద్ద వందల సంఖ్యలో లగ్జరీ బ్యాగులున్నాయి. దీంట్లో ఒక బ్యాగు ఖరీదు రూ. 70 లక్షలు. ఈ బ్యాగులు కొనకపోతే ఆ డబ్బులతో ముంబైలో పెంట్ హౌస్ కొనేదాన్ని అని స్వయంగా అమీషానే జోక్ చేసిందంటే వాటి విలువను అర్థం చేసుకోవచ్చు.
ఫరా ఖాన్ ప్రముఖుల ఇళ్లను సందర్శించే యూట్యూబ్ షో తాజా ఎపిసోడ్‌లో దక్షిణ ముంబైలోని నటి అమీషా పటేల్ (ఆగస్టు 18 సోమవారం) ఇంటిని సందర్శించిన వీడియోను పంచుకుంది, దీనిలో ఆమె రెడ్ చికెన్ థాయ్ కర్రీని కూడా వండింది, కహో నా... ప్యార్ హై షూటింగ్ ,థాయిలాండ్‌లో ప్రతి రాత్రి ఆ వంటకం తినడం గురించి గుర్తుచేసుకుంది.ఇంకా ఈ వీడియోలో తన ఇంటితోపాటు ,స్పెషల్ ఎడిషన్ బ్యాగులు , విలాసవంతమైన షూ కలెక్షన్‌లతో నిండిన బహుళ అల్మారాలను కూడా చూపించింది.
400 బ్యాగులు, రూ. 70 లక్షల బ్యాగు కూడా
అమీషా అల్మారాలో బ్యాగుల ధర 5 లక్షల నుండి ప్రారంభమవుతాయనీ, డిజైన్ సేకరణను బట్టి పది లక్షల వరకు ఉంటుందని తెలిపింది. డియోర్ , బొట్టెగా వెనెటా నుండి బిర్కిన్స్ అండ్ YSL టోట్‌ల వరకు తన దగ్గర ఉన్న ప్రతీవిలువైన వస్తువును పరిచయం చేసింది. తన దగ్గర ‘300-400’ వరకు బ్యాగులు ఉంటాయని వెల్లడించింది. అమీషా పటేల్‌కు లగ్జరీ బ్యాగ్స్ అంటేచిన్నప్పటినుంచీ చాలి ఇష్టమట. తాజాగా తన దగ్గర ఉన్న బ్యాగ్స్ కలెక్షన్స్, ఖరీదైన బ్యాగ్ గురించి చెప్పుకొచ్చింది. తన దగ్గర ఉన్న ఖరీదైన బ్యాగ్ బిర్కిన్ బ్యాగ్ ధర రూ. 70 లక్షలు ఉంటుందని బయటపెట్టింది. వీటితోపాటు 365 క్లచ్‌లు బెల్ట్ బ్యాగులు కూడా ఉన్నాయి. అంతేకాతు తనకెంతో ఇష్టమైన పింక క్రోక్ బిర్కిన్ లెదర్ బ్యాగు గురించి ప్రత్యేకంగా చెప్పింది. దాదాపు 15 సంవత్సరాల క్రితం కొన్నప్పుడు, లేత గులాబీ రంగులో ఉండేదట. క్రమంగా తోలు రంగు మరింత అందంగామారుతోందని చెప్పుకొచ్చింది.
ఇక అమీషా షూ కలెక్షన్ విషయానికి వస్తే ఒక్కో షూ ధర రూ. 80,000 నుండి లక్ష వరకు ఉంటుంది. అలాంటివి వందల జతలు ఆమె అల్మారాలో ఉన్నాయి.
అమీషా పటేల్ ముంబై ఇల్లు
ఆమె వ్యక్తిగతంగా తీర్చిదిద్దుకున్న అమీషా ముంబై ఇంటిలో సౌకర్యం లగ్జరీ అభిరుచి కలగలిపి దర్శనమిస్తాయి. పచ్చదనం, వెలుతురు ప్రాధాన్యతనిచ్చింది. అంతేకాదు గోడలనిండి ఫోటోలు, అరుదైన MF హుస్సేన్ పెయింటింగ్‌లతో తన కళాభిమానాన్ని చాటుకుంది. అమీషా చివరిగా 2023లో హిట్ మూవీ గదర్ 2లో నటించింది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా లో సన్నీ డియోల్ ఉత్కర్ష్ శర్మ కూడా నటించారు. ఈ చిత్రం గదర్: ఏక్ ప్రేమ్ కథ (2001) కి సీక్వెల్.