
హైదరబాద్‌లో లగ్జరీ ప్రాపర్టీల మార్కెట్‌లో కొత్త ప్రమాణాలను సృష్టించడమే లక్ష్యంగా కొన్ని ప్రాజెక్ట్‌లు వెలుస్తున్నట్లు మకుటా డెవలపర్స్ ఛైర్మన్ జనార్ధన్ కొంపల్లి అన్నారు. ‘మకుటా తరంగ’ పేరుతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విలాసవంతమైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.
హైదరాబాద్‌లో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఇలాంటి ప్రాజెక్ట్‌లు ప్రత్యేకంగా నిలుస్తున్నట్లు చెప్పారు. మెట్రో కనెక్టివిటీ, రిటైల్ అవుట్లెట్లు, విద్యా సంస్థలు, ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నందుకు ఇలాంటి ప్రాజెక్ట్‌లకు ఆదరణ పెరుగుతున్నట్లు తెలిపారు. ఇదే అదనుగా ప్రీమియం రెసిడెన్షియల్ మార్కెట్‌లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రూ.40,000 లోపు ల్యాప్‌టాప్‌ల లిస్ట్ ఇదే..