
జీఎస్టీ(Goods and Services Tax) క్రమబద్ధీకరణలో కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గినా ల్యాప్‌టాప్‌ల ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం గతంలో ఉన్న 18 శాతం జీఎస్టీ శ్లాబులో ఎలాంటి మార్పులు చేయకపోవడమే ఇందుకు కారణం. అయితే పండుగవేళ బ్యాంకులు, రిటైలర్లు ఆఫర్ ఇస్తున్నాయి. మార్కెట్‌లో రూ.40,000 లోపు ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన కొన్ని ల్యాప్‌టాప్‌ల వివరాలు తెలుసుకుందాం.
మోడల్ | ప్రాసెసర్ | ర్యామ్/స్టోరేజ్ | ధర(అంచనా) |
---|---|---|---|
ASUS Vivobook Go 15 | Intel Core i3 (13th Gen) | 8GB / 512GB SSD | రూ.34,200 – రూ.44,999 |
Lenovo IdeaPad Slim 3 | AMD Ryzen 3 7320U | 8GB / 512GB SSD | రూ.36,000 – రూ.41,000 |
HP 15s | Ryzen 3 7320U / i3 (12/13 Gen) | 8GB / 512GB SSD | రూ.38,000 – రూ.45,000 |
Acer Aspire Lite | AMD Ryzen 5 5625U | 16GB / 512GB SSD | రూ.39,000 – రూ.43,000 |
Samsung Galaxy Book4 | Intel Core i3 (13th Gen) | 8GB / 512GB SSD | రూ.42,000 – రూ.47,000 |
(గమనిక: పైన తెలిపిన ల్యాప్‌టాప్‌ల ధరలు, ప్రత్యేకతలు ఈకామర్స్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్‌ల కారణంగా ఎప్పటికప్పుడు మారవచ్చు. కొనుగోలుకు ముందు వెబ్‌సైట్‌లో తుది ధరను ధ్రువీకరించుకోవాలి)
కొనుగోలు చేసేముందు చూడాల్సినవి..
వినియోగం, ఉద్దేశం (Usage and Purpose)
రోజువారీ/విద్యార్థుల కోసం: వెబ్ బ్రౌజింగ్, ఆన్‌లైన్ క్లాసులు, డాక్యుమెంట్లు వంటి సాధారణ పనులకు కనీసం Intel Core i3 (12th Gen లేదా అంతకంటే ఎక్కువ) లేదా AMD Ryzen 3 ప్రాసెసర్ ఉండాల్సిందే.
మల్టీ టాస్కింగ్/ ప్రొఫెషనల్: ఎక్కువ సాఫ్ట్‌వేర్‌లను ఏకకాలంలో ఉపయోగించాలనుకుంటే కనీసం Core i5 లేదా Ryzen 5 ప్రాసెసర్‌ను ఎంచుకోవడం మంచిది. పైన తెలిపిన బడ్జెట్‌లో i5 లేదా R5 పాతతరం ల్యాప్‌టాప్‌లు దొరికే అవకాశం ఉంది.
ప్రాసెసర్ (CPU)
ల్యాప్‌టాప్ వేగం, పనితీరును ప్రాసెసర్ నిర్ణయిస్తుంది.
Intel Core i3/i5: Intel ప్రాసెసర్‌ల్లో 11వ తరం (11th Gen) లేదా 12వ, 13వ తరం (12th/13th Gen) లేదా కొత్త వెర్షన్‌లను ఎంచుకోవాలి.
AMD Ryzen 3/Ryzen 5: AMD ప్రాసెసర్‌ల్లో 5000 సిరీస్, 7000 సిరీస్ లేదా కొత్త వెర్షన్‌లను పరిగణించాలి.
ర్యామ్ (RAM)
ర్యామ్ అనేది మల్టీ టాస్కింగ్‌కు కీలకం. మీరు ఒకేసారి ఎన్ని ప్రోగ్రామ్‌లను రన్ చేయగలరనేది దీనిపై ఆధారపడి ఉంటుంది. రోజువారీ పనులు, సాధారణ బ్రౌజింగ్, ఆఫీస్ వర్క్ కోసం కనీసం 8GB RAM ప్రామాణికం. పైన తెలిపిన బడ్జెట్‌లో 16GB RAMను పొందగలిగితే అది అత్యుత్తమ ఎంపిక.
స్టోరేజ్ (Storage)
ల్యాప్‌టాప్ త్వరగా బూట్ కావడానికి, అప్లికేషన్లు వేగంగా లోడ్ కావడానికి SSD (Solid State Drive) తప్పనిసరి. పాత HDD (Hard Disk Drive) ఉన్న ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయకండి. చాలా మంది వినియోగదారులకు కనీసం 512GB SSD సరిపోతుంది.
డిస్‌ప్లే
చూడటానికి సౌకర్యంగా ఉండే డిస్‌ప్లేను ఎంచుకోవాలి. కనీసం ఫుల్‌హెచ్‌డీ (1920 x 1080) తప్పనిసరి. హెచ్‌డీ (1366x768) స్క్రీన్‌లు పాతవి. ఇవి నాణ్యత తక్కువగా ఉంటాయి. యాంటీ-గ్లేర్ (Anti-Glare) ఫీచర్ ఉంటే బెటర్. ఇది లైటింగ్ ఉన్న పరిస్థితుల్లో కంటిపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
బ్యాటరీ లైఫ్
ల్యాప్‌టాప్‌ను ఎక్కువగా ప్రయాణంలో లేదా బయట ఉపయోగించాలనుకుంటే బ్యాటరీ లైఫ్ కనీసం 6-8 గంటలు లేదా అంతకంటే ఎక్కువ బ్యాకప్ ఇచ్చే ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవాలి.
ఇదీ చదవండి: అమెరికా ఆంక్షలపై ద్వంద్వ వైఖరి