
గత ఐదేళ్లపై క్రిసిల్ రేటింగ్స్ నివేదిక
గత ఐదేళ్లలో దేశీయంగా ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు ప్రధానంగా డైరెక్ట్‌టు కన్జూమర్(డీ2సీ) విభాగంలోని కంపెనీలనే కొనుగోలు చేసినట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ పేర్కొంది. ఇతర సంస్థల కొనుగోళ్లలో ముప్పావువంతు డీ2సీ సంస్థలేనని తెలియజేసింది. తద్వారా ఎఫ్‌ఎంసీజీ రంగంలోని దిగ్గజాలు వృద్ధికి ఊతమివ్వడంతోపాటు.. ప్రీమియం విభాగాలలో విస్తరణకు దారి ఏర్పరచుకున్నట్లు తెలియజేసింది. దీంతోపాటు విస్తరణ, లాభదాయకతల్లో టార్గెట్ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది.
ఈ జాబితాలో హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) ఇటీవల అప్‌రైజింగ్ సైన్స్ ప్రయివేట్(మినిమలిస్ట్)ను రూ. 2,706 కోట్లకు సొంతం చేసుకోగా.. సాతియా న్యూట్రాస్యూటికల్స్(ప్లిక్స్)ను రూ. 380 కోట్లకు మారికో కొనుగోలు చేసింది. హీలియోస్ లైఫ్‌స్టైల్(ద మ్యాన్ కంపెనీ)ను రూ. 272 కోట్లు వెచి్చంచి ఇమామీ టేకోవర్ చేయగా.. స్ప్రౌట్‌లైఫ్ ఫుడ్స్(యోగా బార్)ను రూ. 225 కోట్లకు ఐటీసీ చేజిక్కించుకుంది. ఈ అధ్యయనానికి 82 ఎఫ్‌ఎంసీజీ కంపెనీలను, 58 డీ2సీ సంస్థలను పరిగణనలోకి తీసుకున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది.
ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు