
బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ (Farah Khan) ఈ మధ్య యూట్యూబ్ వ్లాగ్స్‌పై స్పెషల్ ఫోకస్ చేసింది. ఎప్పుడూ ఏదో ఒక యాక్టర్ ఇంటికి వెళ్లి చిట్‌చాట్ చేస్తూ వీడియోలు తీస్తోంది. అలా తాజాగా హిందీ నటుడు కరణ్ టక్కర్ (Karan Tacker) ఇంటికి వెళ్లింది. ఎప్పటిలాగే తన వంటమనిషి దిలీప్‌ను తోడుగా తీసుకెళ్లింది. ఫరాఖాన్ చేసే వీడియోల పుణ్యమా అని దిలీప్ ఎక్కువ ఫేమస్ అయిపోయాడు.
ఫ్యామిలీ హౌస్.. కానీ!
కరణ్ ఇంటికి వెళ్లగా.. అక్కడున్న మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఫరాఖాన్‌కు బదులుగా దిలీప్‌ను గుర్తుపట్టి హాయ్ చెప్పింది. అది చూసి అవాక్కైన ఫరా.. ఆమె నాకు బదులుగా నీకు హాయ్ చెప్పింది అని ఆశ్చర్యపోయింది. అందుకు దిలీప్ మురిసిపోతూ ఈ మధ్య నాకు ఆడవాళ్ల ఫాలోయింగ్ పెరిగిపోయిందన్నాడు. ఇక మెయిన్ డోర్ నుంచి అడుగుపెడుతూనే ఇదెవరి ఇల్లు అని అడిగింది ఫరా. అందుకు కరణ్.. మా కుటుంబానిది అని బదులిచ్చాడు. అలాగైతే కచ్చితంగా ఇది నీది కాదు, నీ తల్లిదండ్రుల ఇల్లే! అది సరే, మరి అమ్మాయిలను ఇంటికి ఎలా తీసుకొస్తావ్? అని సరదాగా అడిగింది.
నాకింకా పెళ్లవలేదు
అందుకు కరణ్ వెంటనే.. మా ఇంట్లో అందరూ అర్థం చేసుకునేవాళ్లే! మా అభిరుచులకు అనుగుణంగా ఈ ఇల్లు కట్టారు. నాకింకా పెళ్లి కాలేదు కాబట్టి రెండు లివింగ్ రూమ్స్ ఉన్నాయి. ఒకటి మా పేరెంట్స్ కోసం, మరోటి నాకోసం! ఎప్పుడైనా ఎవరినైనా ఇంటికి తీసుకొస్తే మా ఫ్యామిలీ గ్రూప్‌లో మెసేజ్ చేస్తాను. అప్పుడు వాళ్లు వారి లివింగ్ రూమ్ దాటి ఇటుపక్క రారు. నా పేరెంట్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని చెప్పుకొచ్చాడు.
సీరియల్స్.. రియాలిటీ షోలు
కరణ్ టక్కర్.. లవ్ నే మిలాది జోడి, ఏక్ హజారూ మే మేరి బెహ్నా హై వంటి పలు సీరియల్స్‌లో నటించాడు. డ్యాన్స్ రియాలిటీ షో 'జలక్ దిక్‌లాజా 7'వ సీజన్‌లో పార్టిసిపేట్ చేయగా ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. 'ద వాయిస్', 'నాచ్ బలియే 8' వంటి పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. స్పెషల్ ఆప్స్, ఖాకీ వంటి వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేశాడు. తన్వి: ద గ్రేట్ సినిమాలోనూ నటించాడు.