
Akhil-Zainab Reception నూతన వధూవరులు అక్కినేని అఖిల్, జైనబ్ రవ్జీ రిసెప్షన్ వేడుకలో అందంగా మెరిసారు. మూడు ముళ్ల వేడుక అనంతరం అక్కినేని ఫ్యామిలీ రిసెప్షన్ ఇచ్చింది. ఈ వేడుకల్లో పలువురు సెలబ్రిటీలు సందడిగా కనిపించారు. ఆర్టిస్ట్, వ్యాపారవేత్త జైనబ్ రవద్జీ రిసెప్షన్ లుక్ వైరల్‌గా మారింది. మేకప్ ఆర్టిస్ట్ సూర్య సింగ్ జైనబ్ లుక్‌కు సంబంధించిన వీడియోన, ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో అక్కినేని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సింపుల్‌గా నెట్టెడ్ ఫ్రాక్ ధరించిన జైనబ్ మినిమల్ మేకప్‌తో అందంగా మెరిసింది. అలాగే పెళ్లికి ధరించినట్టు గానే మొత్తం వజ్రాభరణాలను ఎంచుకుంది. డైమండ్ చౌకర్, లేయర్డ్ చెయిన్ ధరించింది. మ్యాచింగ్‌గా చెవులకు డైమండ్ ఝుంకీలు వేసుకుంది. అటు కొత్త పెళ్లి కొడుకు అఖిల్ కూడా సింపుల్ లుక్‌లో అదరగొట్టేశాడు.
మరోవైపు టాలీవుడ్ యంగ్ హీరో మరిది అఖిల్ రిసెప్షన్ లో రెడ్ సారీలో అక్కినేని వారి పెద్ద కోడలు నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ లుక్ నెట్టింట సందడిగా మారింది. భర్త నాగ చైతన్యతో కలిసి ఆమె ఫోటోలకు ఫోజులిచ్చారు. అక్కినేని నాగార్జున, అమల దంపతుల కుమారుడు అఖిల్ అక్కినేని వివాహం తరువాత రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.