‘మిసెస్‌ ఆసియా వరల్డ్‌–2025’ విజేత రేవతి | Mrs Asia World 2025 Dr Surya Revathi Mettukuru awarded Mrs Asia World 2025 ... | Sakshi
Sakshi News home page

‘మిసెస్‌ ఆసియా వరల్డ్‌–2025’ విజేత రేవతి

Jun 27 2025 10:19 AM | Updated on Jun 27 2025 11:56 AM

Mrs Asia World 2025  Dr Surya Revathi Mettukuru awarded Mrs Asia World 2025 ...

యుఎస్‌తో పాటు భారత్‌లో 16 ఏళ్లకు పైగా సామాజిక సేవ, మహిళా సాధికారత, ప్రపంచ మానవతా విలువల కోసం కృషి చేస్తున్నందుకు గానూ ‘మిసెస్‌ ఆసియా వరల్డ్‌ విన్నర్‌–2025’ కిరీటాన్ని నగరానికి చెందిన డాక్టర్‌ రేవతి దక్కించుకున్నారు. 

ఈ విషయాన్ని మనస్వ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలైన డాక్టర్‌ సూర్య రేవతి మెట్టుకూరు గురువారం తెలిపారు. జూన్‌ 22న దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ కార్యక్రమంలో భారత మహిళగా ఈ అరుదైన గౌరవం దక్కిందని అన్నారు. 

ఐటీ, ఫైనాన్స్, మైనింగ్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో సీఈఓగా పనిచేశాసిన, తెలంగాణ రాష్ట్రంలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకుని విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సంక్షేమం, యువత ఉపాధిపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. 100 శాతం అక్షరాస్యత సాధించినందుకు రాష్ట్రపతి అవార్డు పొందినట్లు తెలిపారు. 

(చదవండి: నేషనల్‌ కాదు ఇంటర్నేషనల్‌..! లగ్జరీ బ్రాండ్‌లతో జత కట్టిన అందాల భామలు వీరే)
 

Advertisement
 
Advertisement
Advertisement