పట్టులాంటి జుట్టు కోసం..! | Health Tips: | Sakshi
Sakshi News home page

పట్టులాంటి జుట్టు కోసం..!

Sep 7 2025 10:25 AM | Updated on Sep 7 2025 10:25 AM

Health Tips:

ఒత్తైన జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే చాలామంది పొడవాటి, నల్లని కురుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి కారణంగా చిట్కాలు కూడా పనిచేయడం లేదు. 

దీంతో జుట్టు విపరీతంగా రాలిపోతోంది. కొన్నిసార్లు జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం లభించకపోవచ్చు. అటువంటి వారికి నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ హ్యాట్‌ అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న శక్తిమంతమైన ఎల్‌ఈడీ డయోడ్స్‌ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న టోపీ పేరు రెడ్‌ లైట్‌ థెరపీ బెరెట్‌ హ్యాట్‌. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. జుట్టును పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. 

ఈ టోపీలో ఉన్న ఎరుపు రంగు లైట్లు జుట్టు కుదుళ్లకు కాంతిని అందిస్తాయి. ఈ కాంతి అడినోసిన్‌ ట్రైఫాస్ఫేట్‌ (ఏటీపీ) ఉత్పత్తిని పెంచి కణాలకు శక్తిని అందిస్తుంది. దీంతో కుదుళ్లు బలంగా మారి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ కాంతి తలలోని రక్తప్రసరణను పెంచుతుంది. ఈ టోపీలో ఆప్షన్ల ప్రకారం నీలి రంగుల లైట్లు కూడా ఉంటాయి. నీలి రంగు లైట్లు స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచి, చుండ్రును తగ్గిస్తాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. ఈ పరికరం స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచి పొడవాటి జుట్టును అందిస్తుంది. 

బ్యాటరీతో పనిచేసే ఈ టోపీని ఎక్కడైనా సులువుగా వాడుకోవచ్చు. ఈ టోపీని స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఉపయోగించవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు 30 నిమిషాల పాటు ఈ టోపీ పెట్టుకుంటే చాలు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. దీని ధర 44 డాలర్లు అంటే రూ.3,852 అన్నమాట. ఇదే మోడల్‌లో టెక్నాలజీ పెరిగేకొద్దీ ధరలో మార్పు ఉంటుంది.

ఒతై ్తన జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే చాలామంది పొడవాటి, నల్లని కురుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి కారణంగా చిట్కాలు కూడా పనిచేయడం లేదు. దీంతో జుట్టు విపరీతంగా రాలిపోతోంది. కొన్నిసార్లు జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం లభించకపోవచ్చు. 

అటువంటి వారికి నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ హ్యాట్‌ అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న శక్తిమంతమైన ఎల్‌ఈడీ డయోడ్స్‌ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.  ఈ చిత్రంలో కనిపిస్తున్న టోపీ పేరు రెడ్‌ లైట్‌ థెరపీ బెరెట్‌ హ్యాట్‌. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. జుట్టును పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. 

ఈ టోపీలో ఉన్న ఎరుపు రంగు లైట్లు జుట్టు కుదుళ్లకు కాంతిని అందిస్తాయి. ఈ కాంతి అడినోసిన్‌ ట్రైఫాస్ఫేట్‌ (ఏటీపీ) ఉత్పత్తిని పెంచి కణాలకు శక్తిని అందిస్తుంది. దీంతో కుదుళ్లు బలంగా మారి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ కాంతి తలలోని రక్తప్రసరణను పెంచుతుంది.ఈ టోపీలో ఆప్షన్ల ప్రకారం నీలి రంగుల లైట్లు కూడా ఉంటాయి. నీలి రంగు లైట్లు స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచి, చుండ్రును తగ్గిస్తాయి. 

దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. ఈ పరికరం స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచి పొడవాటి జుట్టును అందిస్తుంది. బ్యాటరీతో పనిచేసే ఈ టోపీని ఎక్కడైనా సులువుగా వాడుకోవచ్చు. ఈ టోపీని స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఉపయోగించవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు 30 నిమిషాల పాటు ఈ టోపీ పెట్టుకుంటే చాలు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. దీని ధర 44 డాలర్లు అంటే రూ.3,852 అన్నమాట. ఇదే మోడల్‌లో టెక్నాలజీ పెరిగేకొద్దీ ధరలో మార్పు ఉంటుంది.

పట్టులాంటి జుట్టుకు...
పట్టులా సుతిమెత్తగా ఉండే జుట్టు అందాన్ని పెంచుతుంది. జుట్టు మృదువుగా ఉంటే స్టైలింగ్‌ చేయడం కూడా ఈజీ. అయితే పెరిగిన కాలుష్యం, జుట్టుపై సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో జుట్టు పొడిబారి, రఫ్‌గా మారుతుంది. ఇలాంటి జుట్టుకు తగిన తేమ, పోషణను అందించే చికిత్సే డీప్‌ కండిషనింగ్‌. ఈ డీప్‌ కండిషనింగ్‌ హెయిర్‌ ట్రీట్‌మెంట్‌ వల్ల జుట్టు తేమగా, ఆరోగ్యంగా మారుతుంది. 

దీంతో మెరిసే జుట్టును పొందవచ్చు. ఇంట్లో డీప్‌ కండిషనింగ్‌ చేసుకోవాలనుకునేవారు ముందుగా హెయిర్‌ మాస్క్‌ ఎంపిక చేసుకోవాలి. పెరుగు–తేనె, గుడ్డు–ఆలివ్‌ నూనె మాస్క్‌ అయితే బెటర్‌. కండిషనింగ్‌ చేసుకునే ముందు తక్కువ గాఢత ఉన్న షాంపూతో తల స్నానం చేయాలి. 

జుట్టు ఆరిన తర్వాత హెయిర్‌ మాస్క్‌ అప్లై చేసుకొని మసాజ్‌ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే సుతిమెత్తని జుట్టు మీ సొంతమవుతుంది. ఇంట్లో డీప్‌ కండీషనింగ్‌ చేసుకోలేని వారు పార్లర్‌కు వెళ్లవచ్చు. బ్యూటీ పార్లర్‌లోని నిపుణులు జుట్టు రకాన్ని బట్టి ప్రత్యేకమైన ఉత్పత్తులతో కండిషనింగ్‌ చేస్తారు. అవసరం బట్టి పార్లర్‌లో స్టీమ్‌ థెరఫీ కూడా ఇస్తారు. దీనివల్ల జుట్టుకు మరింత పోషణ అందుతుంది. కురులు అందంగా, ఆకర్షణీయంగా మారుతాయి.  

(చదవండి: రక్తపరీక్షతో ప్రీఎక్లాంప్సియా గుర్తింపు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement