
అందం, తెలివితేటల కలబోతగా సాగిన మిస్–మిసెస్ బెలెజా గ్రాండ్ ఫినాలే ఆకట్టుకుంది. సోమాజిగూడలోని హోటల్ కత్రియాలో జరిగిన తుది పోటీలో మిస్ కేటగిరీ విజేతగా డీ.కావ్యాంజలి, ఫస్ట్ రన్నరప్‌గా కందకట్ల ప్రత్యూష, సెకండ్ రన్నరప్‌గా వీ.జానకీ దేవి నిలిచారు.
మిసెస్ కేటగిరీ విజేతగా ఇందిరా దేవి, ఫస్ట్ రన్నరప్‌గా డా.పీ.నిఖిలా రెడ్డి, సెకండ్ రన్నరప్‌గా అవుల రేవతి గెలుపొందారు. కార్యక్రమానికి వైద్యులు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్‌న్ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, గృహిణులతో పాటు విభిన్న రంగాలకు చెందిన 20 మంది ఫైనలిస్ట్‌లు పోటీపడ్డారు. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి నెరళ్ల మల్యాద్రితో పాటు బెలెజా వ్యవస్థాపకురాలు వందన దాసరి, సోషలైట్ సుధాజైన్ పాల్గొన్నారు.
(చదవండి: సంపదలోనే కాదు ఆరోగ్యంగానూ బిలియనీరే..! ఆ ఒక్క సూత్రంతో..)