
ప్రముఖ సినీ క్రిటిక్, నటుడు , నిర్మాత కమాల్ రషీద్ ఖాన్ (కమల్ ఆర్. ఖాన్.Kamaal R. Khan, KRK) వివాదాస్పద ట్వీట్‌లో వార్తల్లో నిలిచాడు. తాజాగా ఒక మెగా మోడల్ హంట్ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు బిగ్‌బాస్‌ఫేమ్ కమల్‌ఆర్‌ఖాన్. ఈ లైన్ చూస్తే ప్రస్తుతం నిరుద్యోగం ఎంత ఉందో అర్థం అవుతుంది అంటూ అక్కడ వేలాదిగా బారులు తీరిన మోడల్స్‌ను ద్దేశించి కమెంట్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌కు 2.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
అంతేకాదు జెన్ జెడ్ పాపులర్ అవ్వాలని ఎంత పాకులాడుతున్నారో, ధనవంతులుకావాలిన కావాలని ఎంత తహతహ లాడుతున్నారో అనడానికి ఇది నిదర్శనం అంటూ కమెంట్ చేశాడు. దీంతో నెటిజన్లు కమల్‌ఆర్‌ఖాన్‌ను విమర్శిస్తూ, సమర్ధిస్తూ కమెంట్స్ చేశారు. మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్యలో జెన్-జి యువతులుండటం సానుకూలమే కదా అని కొందరు కొనియాడగా, మరికొందరు ప్యాంటు కూడా కొనుక్కోలేనంత పేదవాళ్లు జెన్-జెడ్ అమ్మాయిలు అంటూమరికొందరు అనుచితంగా వ్యాఖ్యానించారు.
This line is for Phoenix Mega Model Hunt. It’s proof, how much unemployment is right now. And it’s proof that how Gen~G are desperate to become famous and rich. pic.twitter.com/lsxwatCpVU
— KRK (@kamaalrkhan) October 5, 2025
కాగా ఫీనిక్స్ మెగా మోడల్ హంట్ 2025 ( Phoenix Mega Model Hunt 2025) అనేది బెంగళూరులో జరిగే అతిపెద్ద ఫ్యాషన్ షో. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఫ్యాషన్ గురు ప్రసాద్ బిదపా నేతృత్వంలో జరుగుతుంది.ఫ్యాషన్, సంగీతం, కాక్‌టెయిల్స్ ఈవెంట్స్‌కి రిజిస్ట్రేషన్ చేసుకున్న జంటలకు, మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఔత్సాహికులైన యువతీ యువతులు ఈ ఈవెంట్‌లో పాల్గొని తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తారు.