
బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్(Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. తన తొలి ప్రాజెక్ట్‌గా "The Bads of Bollywood" అనే సాటిరికల్ యాక్షన్ డ్రామా (సెప్టెంబర్ 18) నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిర్వహించిన స్టార్-స్టడెడ్ స్క్రీనింగ్ ఈవెంట్‌లో అనేక మంది ప్రముఖులు సందడి చేశారు. ముఖ్యంగా ఫ్యాషన్ ఐకాన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ (Nita Ambani) అందరి దృష్టిని ఆకర్షించారు. తన స్టైలిష్ లుక్‌తో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.
ఈవెంట్‌కి తగినట్టు డైమండ్ నగలు,అద్భుతమైన చీరలు, అందానికి మించిన హందాతనంతో ప్రతీ ఈవెంట్‌లోనూ నీతా అంబానీ ప్రత్యేకంగా నిలుస్తారు. తాజాగా ఈవెంట్‌లో ఆమె దుస్తులుఅందరినీ ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె ధరించిన పచ్చని అద్భుతమైన హారమే ప్రత్యేకంగా నిలవడం విశేషం.
నీతా అద్భుతమైన పరాయిబా, హృదయాకారపు వజ్రాల డబుల్ స్ట్రింగ్, వజ్రాల హారాన్ని ధరించారు. హృదయ ఆకారపు స్టడ్ చెవిపోగులు, సరిపోలే ఉంగరం ,సున్నితమైన డైమండ్ బ్రాస్‌లెట్‌తో తన లుక్‌ను మరింత ఎలివేట్ చేశారు. అలాగే ఈ హారానికి పొదిగిన టైటానియం ఫ్లవర్ పీస్‌మరింత ఆకర్షణీయంగా నిలిచింది. దీనికి మ్యాచింగ్ కలర్‌లో ఆమె ధరించిన చీర నీతా అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది.
అనన్య పాండే, కరణ్ జోహార్, ఫరా ఖాన్, బాబీ డియోల్, అలియా–రణ్‌బీర్, విక్కీ కౌశల్ మరియు అనేక మంది స్టార్-స్టడెడ్ సాయంత్రం హాజరయ్యారు. సందడిగా సాగిన ఈ స్క్రీనింగ్ ఈవెంట్‌లో అంబానీ ఫ్యామిలీ మరో ఎట్రాక్షన్. సెలబ్రిటీలతో పాటు, అంబానీలు కూడాను అందంగా తీర్చిదిద్దారు. నీతా అంబానీ తన భర్త ముఖేష్ అంబానీ చేతిలో చేయి వేసి, రెడ్ కార్పెట్‌పై పోజులిచ్చారు. ఇంకా ఆకాష్ రాధిక , శ్లోకా, ఇషా అంబానీ మెరిసారు. ఆకాష్ అంబానీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.


గ్రాండ్ ప్రీమియర్ కోసం, రాధిక బోల్డ్ రెడ్ స్ట్రాప్‌లెస్ గౌను ధరించి, డైమండ్ నెక్లెస్ మరియు బ్రాస్‌లెట్‌తో పాటు చిన్న రెడ్ క్లచ్ బ్యాగ్‌తో తన లుక్‌ను అలంకరించింది. శ్లోకా షీర్ కార్సెట్-స్టైల్ బాడీస్ , భారీ ప్యాట్రన్డ్ స్కర్ట్‌తో కూడిన నేవీ-బ్లూ గౌనును ఎంచుకున్నారు, ఆకాష్ క్లాసిక్ బ్లాక్ వెల్వెట్ టక్సేడోలో చాలా అందంగా కనిపించారు.
