Akhil-Zainab Reception: స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా శోభితా ధూళిపాళ.. లక్షలు ఖరీదు చేసే.. | Sobhita Dhulipala styled stunning red satin saree And Christian Dior bag | Sakshi
Sakshi News home page

Akhil-Zainab Reception: ఎర్రటి చీరలో శోభితా ధూళిపాళ..ఏకంగా లక్షల ఖరీదు చేసే..

Jun 12 2025 6:41 PM | Updated on Jun 12 2025 7:22 PM

Sobhita Dhulipala styled stunning red satin saree And Christian Dior bag

అఖిల్-జైనాబ్ వివాహ రిసెప్షన్‌(Akhil Akkineni-Zainab's wedding reception)లో నూతన వధువరులిద్దరూ సింపుల్‌ లుక్‌లో అందరిని కట్టిపడేశారు. వివాహం అనంతరం అక్కినేని ఫ్యామిలీ రిసెప్షన్‌ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నాగ చైతన్య, శోభితా ధూళిపాళ హాజరు కావడం ప్రధాన అకర్షణగా నిలిచింది. 

ఈ రిసెప్షన్‌ వేడుకలో శోభితా ఎర్రటి శాటిన్ చీరలో స్టైలిష్‌ లుక్‌లో కనిపించిది. ఈ చీరకు మ్యాచింగ్‌గా బంగారు వర్ణం బ్లౌజ్‌ను ధరించడం మరింత ట్రెండీగా కనిపించింది. అయితే శోభితా అందమైన లుక్‌ కంటే ఆమె ధరించిన డియోర్‌ బ్యాగ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. శోభితా ధరించిన చీరకు పూర్తి విభిన్నంగా బ్లాక్‌ బ్యాగ్‌ ఎంచుకోవడం మరింత హైలెట్‌గా నిలిచింది. 

అయితే ఈ బ్యాగ్‌ ధర వింటే కళ్లు చెదిరిపోతాయ్‌. ఇది అక్షరాల రూ. 3 లక్షల పైనే పలుకుతుందట. ఇక అఖిల్‌ జైనాబ్‌ వివాహ వేడుకలో చైతూ, శోభితాల జంట తెలుపు, క్రీమ్‌ కలర్‌ డిజైనర్‌వేర్‌లలో కనిపించి సందడి చేశారు. అంతేగాదు వారిద్దరూ జైనాబ్‌ను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ..ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 

కాగా, అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఇంట వరుస శుభాకార్యాలు జరిగాయి. గతేడాది చివర్లో నాగచైతన్య- శోభిత (Sobhita Dhulipala) పెళ్లి జరగ్గా ఇటీవల (జూన్‌ 6, 2025న) అఖిల్‌ వివాహం జరిగింది. బిజినెస్‌మెన్‌ జుల్ఫీ రవ్జీ కూతురు జైనబ్‌ను అఖిల్‌ (Akhil Akkineni) వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. ఈ వివాహ వేడుకను నాగార్జున సింపుల్‌గా ఇంట్లోనే జరిపించాడు. అయితే రిసెప్షన్‌ మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో గ్రాండ్‌గా జరిగింది.

(చదవండి: Akhil-Zainab Reception డైమండ్‌ నగలతో, గార్జియస్‌గా అఖిల్‌ అర్థాంగి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement