
రేస్–2 విన్ ఆధ్వర్యంలో
డెక్కన్ డెర్బీ–2025 అలరించిన
పలువురు సినీ ప్రముఖులు, మోడళ్లు
సాక్షి, సిటీబ్యూర : రేస్–2 విన్ ఫౌండేషన్ (Race2Win Foundation ) ఆధ్వర్యంలో హైదరాబాద్ రేస్ క్లబ్‌లో డెక్కన్ డెర్బీ– 2025 (Deccan Derby 2025 ) లో ఫ్యాషన్, రేసింగ్, సేవల మేలు కలయికగా ఘనంగా నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. ఇందులో ప్రముఖ డిజైనర్ ద్వయం రోహిత్ గాంధీ – రాహుల్ ఖన్నా రూపొందించిన ‘ఫ్యాషన్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్’ కలెక్షన్ ప్రదర్శనలో బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) షోస్టాపర్‌గా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్జున్ బాజ్వా, రెజినా కసాండ్రా, అవంతిక మిశ్రా, నైరా బెనర్జీ తదితర సినీ ప్రముఖులు పాల్గొని వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆనందంగా వుంది..
మలైకా అరోరా మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది. రోహిత్ గాం«దీ, రాహుల్ ఖన్నా డిజైన్ కలెక్షన్ ఆకట్టుకుంది. రేస్–2 విన్ ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం’ అని అభినందించారు. రేస్–2 విన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వై.గోపీరావు మాట్లాడుతూ, ‘డెక్కన్ డెర్బీ 2025 ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా రేసింగ్, ఫ్యాషన్, సేవా కార్యక్రమాల సమ్మేళనం అనే వెవిధ్యం సాకారమైంది’ అన్నారు.
ఇదీ చదవండి: Director Sukumar టీ కోసం క్యూ కట్టడం చూశా..