
సాక్షి, సిటీ బ్యూరో: విదేశాల్లో బోబా టీ కోసం చిన్నా, పెద్దా క్యూ కట్టడం గమనించానని ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ (Director Sukumar) చెప్పారు. తైవాన్‌కు చెందిన పాపులర్ బ్రాండ్ బోబా టీ (Taiwanese bubble tea)కి ‘షేర్ టీ’ పేరిట దేశపు మొదటి అవుట్‌లెట్ సైబరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్లో ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించిన సందర్భంగా సుకుమార్ మాట్లాడారు. అమెరికా వంటి ‘విదేశాల్లో ఎంతో ఇష్టపడే బోబా టీని తైవాన్‌కు చెందిన నిపుణుల ద్వారా సిటీకి అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థకు చెందిన ప్రవీణ్ వికాస్ తదితరులు పాల్గొన్నారు.
బోబీ టీ లేదా బబుల్ టీ
బోబా టీ, లేదా బబుల్ టీ. తైవాన్‌లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకట్టుకుంటోంది. బోబా టీ షాప్స్ క్రేజ్ ముంబయి, బెంగళూరు వంటి నగరాలతో పాటు హైదరాబాద్‌కు కూడా చేరింది.
చదవండి: Director Sukumar టీ కోసం క్యూ కట్టడం చూశా..