Anakapalle
-
అక్రమ క్వారీలకు అండగా నాయకులు, అధికారులు
రోలుగుంట : మండలంలో అనుమతులు లేకుండా నడుస్తున్న క్వారీలపై అధికారుల జాప్యం వీడాలని చోడవరం జనసేన ఇన్చార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు డిమాండ్ చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎటువంటి అదికారిక అనుమతులు లేని క్వారీల నుంచి నిత్యం వందలాది లారీలతో బహిరంగంగానే మెటీరియల్ తరలింపు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం బాధాకరమన్నారు. అలాగే అనుమతులున్న క్వారీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్నారు. ఈ క్వారీ యజమానులు చేస్తున్న అక్రమాలకు అండాదండగా ఉంటూ వారి నుంచి నిత్యం డబ్బులు వసూలు చేస్తున్న రాజకీయనాయకులు, అధికారుల కు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రభుత్వ దృిష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. వారి గుట్టు వివరాలతో బయటపెడతా.. చోడవరం జనసేన ఇన్చార్జిపి.వి.ఎస్.ఎన్.రాజు -
సాగరతీరంలోఅయోధ్య రామ మందిరం
● నేటి నుంచి సందర్శకులకు అనుమతి ఏయూ క్యాంపస్: విశాఖ నగరవాసులకుసరికొత్త అనుభూతిని పంచేందుకు అయోధ్య రామ మందిరం నమూనా సిద్ధమయింది. బీచ్‌రోడ్డులోని పామ్‌బీచ్ హోటల్ పక్కన ఏర్పాటు చేసిన రామ మందిర నమూనాను గురువారం ఉదయం 8.48 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. వేదిక వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్ మాట్లాడుతూ విశాఖ వాసులకు అయోధ్య రామ మందిరం సందర్శించిన అనుభూతిన పంచేలా 90 అడుగుల ఎత్తు, 392 స్తంభాలు, 44 ద్వారాలతో నిర్మించినట్లు పేర్కొన్నారు. రెండు నెలలపాటు ప్రజల సందర్శనకు ఇది అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో పాలూరి శేషమాంబ, దుర్గా ప్రసాద్, బీజేపీ నాయకులు అశోక్, దిలీప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
వెంకన్నకు సమర్పించిన కానుకలకు రశీదులు ఇప్పించండి
నక్కపల్లి: ఉపమాక వేంకటేశ్వర స్వామికి తాము సమర్పించిన కానుకలకు రశీదులు ఇప్పించాలని భక్తులు కోరారు. బుధవారం ఉపమాకకు చెందిన కర్రిగురువోజి, వమ్మవరానికి చెందిన శ్రీకాకుళపు బంగారు శెట్టిలు దేవస్థాన ఇన్స్పెక్టర్ కూర్వేశ్వరరావును కలిశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన కల్యాణోత్సవాల సందర్భంగా గురువోజి పావుతులం బంగారు ఉంగరాన్ని, బంగారు శెట్టి తులం బంగారు శతమానా లను స్వామివారికి కానుకలుగా అందజేశారు. వీటిని ఆలయప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులకు అందజేశామన్నారు. రశీదు ఇమ్మని కోరగా కల్యాణోత్సవాల్లో బిజీగా ఉండటం వల్ల తర్వాత రశీదు ఇస్తామని మరోసారి రావాలని చెప్పారన్నారు. ఇంతవరకు రశీదులు ఇవ్వలేదన్నారు. తాము స్వామివారికి ఇచ్చినకానుకలకు రశీదులు ఇప్పించి, ఆ వస్తువులు స్వామివారికిచెందేలా చూడాలని కోరారు.దీనిపై ఇన్స్పెక్టర్ కూర్మేశ్వరరావు మాట్లాడుతూ భక్తులు తెలిపిన వివరాల ప్రకారం కానుకలు తమ వద్దకు ఇంకా రాలేదన్నారు. ఆ వస్తువులు తన వద్దకు వస్తే టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దేవస్థానం అప్రైజర్‌తో తనిఖీలు చేసి, దాతలు పేర్కొన్న విధంగా వస్తువుల బరువు సరిచూసి రశీదు అందజేయడం జరుగుతుందన్నారు.ఇన్స్పెక్టర్ను కలిసిన వారిలో దేవస్థానం మాజీ చైర్మన్ కొప్పిశెట్టి కొండబాబు, నాయకులు కొప్పిశెట్టి జగదీశ్వరరావు, వాసు, తోలేటి శ్రీను తదితరులు ఉన్నారు. ఉపమాక దేవాలయ ఇన్స్పెక్టర్ను కోరిన భక్తులు -
రోడ్లపై ‘బీర్ల వరద’
యలమంచిలి రూరల్: బీర్లు తరలిస్తున్న వాహనాలు మండలంలోని రెండు ప్రాంతాల్లో ప్రమాదాలకు గురవడంతో సీసాలు రోడ్లపై చెల్లాచెదురుగా పడ్డాయి. వాటిలో సగానిపైగా పగిలి.. రహదారులపై బీర్ల వరద పారింది. కింగ్ ఫిషర్ అల్ట్రా బీర్ల లోడుతో వెళ్తున్న రెండు వాహనాలు బుధవారం ప్రమాదాలకు గురయ్యాయి.ఈ రెండు ప్రమాదాలు 16వ నంబరు జాతీయ రహదారిపై యలమంచిలి మండల పరిధిలో జరిగాయి. వివరాలివి.. తండాలదిబ్బ కూడలి వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుక నుంచి బీర్ల లోడుతో వెళ్తున్న లారీ ఢీకొంది.ఈ ప్రమాదంలో సుమారుగా 86 కేసుల్లో బీర్ల సీసాలు పగిలిపోయినట్టు యలమంచిలి ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు.పగిలిన బీర్ల సీసాల విలువ సుమారుగా రూ.రెండు లక్షలకు పైగా ఉంటుందని అంచనా.రణస్థలం బెవరేజస్ నుంచి కడప ప్రభుత్వ డిపోకు ఈ బీర్ల లోడు లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.అయితే దీనిపై యలమంచిలి రూరల్ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం, ప్రమాదానికి గురైన బీర్ల లారీ నుంచి బాగున్న సరుకును మరో లారీలోకి ఎక్కించేక్రమంలో ఎకై ్సజ్ పోలీసులు పొంతనలేని సమాధానాలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.ప్రమాదానికి గురైన కంటైననర్ లారీలో మొత్తం 1,275 బీర్ల కేసులు వెళ్తుండగా 86 కేసుల్లో సీసాలు పాడైనట్టు ఒకసారి,మొత్తం 1,270 కేసులే ఉన్నాయని,వాటిలో 95 కేసుల్లో బీర్ల సీసాలు డ్యామేజ్ అయ్యాయని మరోసారి ఎకై ్సజ్ పోలీసులు ఘటనాస్థలానికి కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులకు చెప్పడం గమనార్హం.ఇదిలా ఉండగా ప్రమాదానికి గురైన బీర్ల లారీ నుంచి సరుకును మరో లారీలోకి మార్చిన తర్వాత ఆ వాహనాన్ని మూడు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఎర్రవరం సమీపంలో ఒక పెట్రోల్ బంక్ వద్ద గంటల సేపు నిలిపి ఉంచారు.అబ్కారీ శాఖకు చెందిన బీర్ల లోడు ప్రమాదానికి గురైనపుడు ఎంత సరుకు దెబ్బతిందో నిర్థారించడానికి నిర్వహించాల్సిన పంచనామాలో నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది.అంతేకాకుండా రణస్థలంలో బీర్ల లోడుతో బయలుదేరిన లారీ ఎప్పుడు ప్రమాదానికి గురైందో ఎవరూ కచ్చితంగా చెప్పకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో బయటపడాల్సి ఉంది. పులపర్తి వద్ద బీర్ల వ్యాన్ బోల్తా యలమంచిలి మండలం పులపర్తి వద్ద బీర్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది.యలమంచిలి నుంచి తునివైపు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో భారీగా బీర్లు,ఇతర మద్యం సీసాల లోడుకు నష్టం వాటిల్లింది.డ్యామేజ్ కాకుండా మిగిలిన సరుకును అక్కడ సిబ్బంది వేరు చేశారు.ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బీర్ల లోడుతో వెళ్తున్న రెండు వాహనాలకు ప్రమాదం తండాలదిబ్బ వద్ద ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న బీర్ల లారీ పులపర్తి వద్ద మరో వ్యాన్ బోల్తా -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి
కె.కోటపాడు : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పోతనవలస గ్రామానికి చెందిన చిరికి మనోజ్(24) బుధవారం కేజీహెచ్‌లో మృతిచెందాడు. మృతుడు తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎ.కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎ.కోడూరు ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోతనవలస గ్రామానికి చెందిన మనోజ్ ఈ నెల 17న పోతనవలస నుంచి ఆర్.వై.అగ్రహారానికి బైక్‌పై బయలుదేరాడు. మార్గ మధ్యంలో రోడ్డుకు అడ్డంగా చెట్టుకొమ్మ పడి ఉండడాన్ని గమనించకుండా వెళ్లడంతో బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. మనోజ్ రోడ్డుపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కె.కోటపాడులో ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్టు ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. -
విశాఖలో టూరిజం సర్క్యూట్
విశాఖ సిటీ: విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం సర్క్యూట్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో బుధవా రం ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధు లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ఏకరవు పెట్టారు. జీవీఎంసీ వాటర్ పైప్‌లైన్ పనులు పూర్తి చేయాలని, నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని, పుష్ కార్ట్లు లేకపోవడంతో పారిశుధ్య పనులకు ఇబ్బందులు, 2014లో పేదల ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం డీడీలు కట్టించుకున్న వారికి ఇళ్ల స్థలాల మంజూరు, సదుపాయాలు కల్పించాలని కోరారు. ఏకపక్ష నిర్ణయాలు వద్దు : ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, ప్రాజెక్టుల విషయంలో అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతితో పాటు విశాఖపై కూడా దృష్టి పెట్టాలని చెప్పారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. కోస్టల్ కారిడార్ నుంచి భీమిలి వరకు బీచ్ కారిడార్ అభివృద్ధిపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వీకేపీసీపీఐఆర్, మాస్టర్‌ప్లాన్–2041, ఎంఐజీ లేఅవుట్లు, ప్రతిపాదిత లేఅవుట్లు, మాస్టర్‌ప్లాన్ రహదారుల నిర్మాణాలు, తీర ప్రాంత కోత ప్రాజెక్టు, కై లాసగిరి, రుషికొండ సమగ్రాభివృద్ధి, భోగాపురం నుంచి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్డు, సింహాచలం స్థలాలకు సంబంధించిన సమస్యలు, అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ వంటి అంశాలపై చర్చించారు. ఇకపై ప్రతి నెలా సమావేశం నిర్వహించి ఉత్తరాంధ్ర అభివృద్ధి పనులపై సమీక్షిస్తామన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సంపత్ కుమార్, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు హరేందిర ప్రసాద్, విజయకృష్ణన్, అంబేడ్కర్, మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై మంత్రి నారాయణ సమీక్ష అమరావతిపైనే కాదు.. విశాఖపై కూడా దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేల విజ్ఞప్తి -
పేటలో పోటాపోటీ
పాయకరావుపేట మెయిన్‌రోడ్డు లో ఆక్రమణలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నాయకుల అండతో ఒకరిని చూసి మరొకరు, పోటాపోటీగా ఆర్అండ్బీ స్థలాన్ని ఆక్రమించి బడ్డీలను ఏర్పాటుచేస్తున్నారు. ఆక్రమణల కారణంగా రోడ్డు ఇరుకుగా మారి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మెయిన్‌రోడ్డులో యథేచ్ఛగా ఆక్రమణలు తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం పట్టించుకోని అధికారులు తొలుత బడ్డీల ఏర్పాటు.. తరువాత పక్కా షెడ్ల నిర్మాణం పాయకరావుపేట: నియోజకవర్గ కేంద్రమైన పాయకరావుపేటలో మెయిన్‌రోడ్డు ఆక్రమణదారుల చెరలో చిక్కుకుంది. పట్టణంలో తాండవ వంతెన నుంచి వై.జంక్షన్ వరకు రెండు కిలోమీటర్లు మెయిన్ రోడ్డు ఉంది. రోడ్డుకు ఇరు పక్కల స్థలాన్ని ఆక్రమించి పెద్ద ఎత్తునషెడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. ప్రతి రోజూ ఎక్కడోచోట ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో 100 అడుగులు ఉండాల్సిన రోడ్డు ఇరుకుగా మారి, నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈ రోడ్డులో రెండువైపులా స్థలాలను ఆక్రమించి ఇప్పటికి సుమారు 120 బడ్డీలు, పాకలను ఏర్పాటు చేశారు. శరవేగంగా అభివృద్ధి పాయకరావుపేట పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. స్థానికులతోపాటు, పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో ఉన్న రసాయన పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులంతా పాయకరావుపేటలో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. పిల్లల చదువులు, ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాలనుంచి పలువురు వచ్చి పట్ణణంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. చుట్టు పక్కల 40 గ్రామాల ప్రజలు వాణిజ్య అవసరాల కోసం నిత్యం ఇక్కడి వస్తుంటారు. దీంతో పట్టణం నిత్యం రద్దీగా ఉంటోంది. ముఖ్యంగా మెయిన్ రోడ్డుపై నిత్యం జనసంచారం ఉంటోంది. రోడ్డు ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. పంచాయతీ స్థలాల్లోనూ పాగ ముందు నాయకుల అండతో చిన్న స్థలాన్ని ఆక్రమించి బడ్డీ ఏర్పాటు చేసి, కొద్దిరోజుల తరువాత పర్మినెంట్‌గా షెడ్లు వేసేస్తున్నారు. మెయిన్‌రోడ్డుపై రాకపోకలు సాగించేవారు రోడ్డు దిగేందుకు అడుగు జాగా కూడా ఉండడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కోర్టు వివాదం కారణంగా మెయిన్ రోడ్డును విస్తరించకుండా డబుల్‌లైన్ రహదారిగా అభివృద్ధి చేశారు. అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు డబుల్ రోడ్డు నిర్మించేందుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో నిధులు విడుదల చేయించినప్పటికీ కోర్టు వివాదం కారణంగా రూ.రెండు కోట్లతో పాతరోడ్డును అభివృద్ధి చేసే పరిస్థితి ఏర్పడింది. మెయిన్‌రోడ్డుతోపాటు పట్టణంలో పలు ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లలో కమ్యూనిటీ అవసరాల కోసం పంచాయతీకి కేటాయించిన స్థలాలు సైతం కబ్జాకు గురయ్యాయి. వీటి గురించి పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. తరలివస్తున్న మాల్స్ పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన షాపింగ్ మాల్స్ ఇప్పుడు పాయకరావుపేట పట్టణానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. వస్త్ర దుకాణలను ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక హంగులతోకూడిన మూడు సినిమా థియేటర్లు ఉన్నాయి. మూడు జూనియర్ కళాశాలలు, రైసు మిల్లులు, మోటారు సైకిళ్లషోరూములతో పట్టణం వాణిజ్యకేంద్రంగా మారింది. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో పాయకరావుపేటలో నివాసం ఏర్పర్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో పాటు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. మెయిన్ రోడ్డును విస్తరిస్తేనే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని స్థానికులు తెలిపారు.సగానికి సగం కుచించుకుపోయిన రోడ్డు ఆక్రమణలు పెరిగిపోతున్నాయి మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా రోజు రోజుకు ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. సాయంత్రం అయితే తీవ్రమైన ట్రాఫిక్సమస్యలు ఎదుర్కొంటున్నాం. పాయకరావుపేటనుంచి తుని వెళ్లాలంటే చాలా సమయం పడుతోంది. బడ్డీలు ఏర్పాటు చేసి ఆ తరువాత పక్కా నిర్మాణాలు చేపడుతున్నారు. డబుల్‌లైన్‌గా విస్తరిస్తే తప్ప రాకపోకలు సాగించడం కష్టం. చిరువ్యాపారుల సమస్యలు పరిష్కరించి రోడ్డు విస్తరణ చేపట్టాలి. – జి.రాజశేఖర్‌రెడ్డి, పాయకరావుపేట -
ఏం తిని బతకాలి..!
కోటవురట్ల: పొట్టకూటి కోసం ఉపాధి పని చేస్తున్న కూలీల కడుపులు మాడ్చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పది వారాలుగా కూలి డబ్బులు ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎలా బతాకాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పందూరు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు బుధవారం నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో హాజరైన కూలీలు రోడ్డుపై బైఠాయించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ పథకం నియమ నిబంధనలను మార్చడమే కాకుండా, పది వారాలుగా కూలి డబ్బులు ఇవ్వకపోతే ఏం తిని బతుకుతారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాష్ట్రాల చేతిలో ఉన్న పథకం అమలు, ఉపాధి పనుల కల్పన, అంచనా వ్యయం తదితర అంశాలు ఇకపై కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లనున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యుక్తధార యాప్ ద్వారానే ఇకపై కూలీల వేతనాలు చెల్లించనున్నారన్నారని చెప్పారు. ఇందుకోసం ప్రస్తుతం మండలానికో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి అమలు చేస్తున్నారన్నారు. ఈ యాప్ వినియోగం ద్వారా ఇకపై రాష్ట్రాల ప్రమేయం పూర్తిగా ఉండదని, కేంద్ర ప్రభుత్వమే అన్ని పనులు పర్యవేక్షిస్తుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం మార్చుకుని, పాత పద్ధతిలోనే కొనసాగించాలని, వెంటనే 10 వారాల వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. -
బకాయి పడ్డ బిల్లులు, జీతాలు వెంటనే విడుదల చేయాలి
చోడవరం : మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు రావలసిన బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి డిమాండ్ చేశారు. మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద చోడవరం మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న నిర్వాహకులంతా కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేశారు. తమకు గత డిసెంబరు నెల నుంచి నేటి వరకూ మధ్యాహ్న భోజన పథకం సంబంధించిన బిల్లులు మంజూరు కాలేదని, బకాయి పడ్డ బిల్లులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని వరలక్ష్మి డిమాండ్ చేశారు. బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని, అప్పులకు వడ్డీలు కట్టుకోలేక చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఐదు నెలలుగా బిల్లులు రాకపోతే వచ్చే జూన్ నుంచి పాఠశాలలు తెరిస్తే విద్యార్థులకు ఎలా భోజనం పెట్టగలమని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతినెలా 15వ తేదీకి బిల్లులు వచ్చేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదని ఆమె ధ్వజమెత్తారు. అదే విధంగా తమ వేతనాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదని, ఇదే ఉపాధిగా నమ్ముకొని జీవిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులందరం జీతాలు రాక, బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని చెప్పారు. వెంటనే ప్రభుత్వం తమ జీతాలు, బిల్లులు చెల్లించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంఈవో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో సంఘ ప్రతినిధులు జి.లక్ష్మి, నారాయణమ్మ, ఎర్రయ్యమ్మ, బి. లక్ష్మి, దేముడమ్మ, సత్యవతి, దేవి పాల్గొన్నారు. మధ్యాహ్నభోజన పథకం నిర్వాహకుల డిమాండ్ ఎంఈవో కార్యాలయం వద్ద ధర్నా -
చిన్నారి కిడ్నాప్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
అనకాపల్లి టౌన్: అనకాపల్లిలో సంచలనం సృష్టించిన బాలిక రోహిత కిడ్నాప్ కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఇన్చార్జి డీఎస్పీ బి.మోహన్‌రావు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15న రోహిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బాలిక ఆచూకీ కనుగొని, కిడ్నాప్ చేసిన గాజువాకకు చెందిన లక్ష్మి, ఆమె భర్త అప్పలస్వామినాయుడులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేసు దర్యాప్తులో భాగంగా లక్ష్మి ఇచ్చిన సమాచారం మేరకు లోతుగా విచారణ చేపట్టగా.. ఈ కిడ్నాప్‌లో మరో ముగ్గురికి సంబంధం ఉందని నిర్ధారించారు. కశింకోట మండలం ఏఎస్ పేట గ్రామానికి చెందిన గొర్లి శ్రీనివాసరావుకు పిల్లలు లేకపోవడంతో దత్తత తీసుకోవాలని ప్రయత్నించారు. అయితే న్యాయపరంగా అడ్డురావడంతో అక్రమంగా ఎవరినైనా దత్తత తీసుకోవాలనే ఉద్దేశంతో తనకున్న పరిచయాలతో అనకాపల్లి గాంధీనగర్‌కు చెందిన తగరంపూడి షణ్ముఖను శ్రీనివాసరావు సంప్రదించారు. ఇద్దరూ కలిసి అనకాపల్లి లోకావారి వీధికి చెందిన బోనాల దేవిని సంప్రదించగా.. పాప లేదా బాబు గానీ అప్పజెప్పుతానని, అందుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆమె చెప్పింది. అందుకు ఒప్పుకున్న శ్రీను తన బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి అడ్వాన్స్‌గా షణ్ముఖకు రూ.లక్ష అందజేశాడు. అనంతరం షణ్ముఖ వెళ్లి దేవికి రూ.30వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఆ తరువాత దేవితో ఒప్పందం కుదుర్చుకున్న గాజువాకకు చెందిన లక్ష్మి, అప్పలస్వామినాయుడు.. బాలికను కిడ్నాప్ చేసి, విక్రయించే ప్రయత్నంలో భార్యాభర్తలు పోలీసులకు దొరికిపోయారు. వీరిని ఈ నెల 17న అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా ముగ్గురిని అరెస్ట్ చేసి, షణ్ముఖ నుంచి రూ.70వేలు, శ్రీను నుంచి రూ.750 స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ విజయ్‌కుమార్, ఎస్ఐలు వెంకటేశ్వరావు, ఈశ్వరావు, తదితరులు పాల్గొన్నారు. -
కూటమి సర్కారు కుటిల యత్నం
అచ్యుతాపురం: అనకాపల్లి–అచ్యుతాపురం రహదారి నిర్వాసితుల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య, నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తోంది. ఏ ఒక్కరికీ అంగీకారం లేని టీడీఆర్‌ను తెరపైకి తీసుకొచ్చి బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుంది. రెండు దశాబ్దాల నుంచి నలుగుతున్న భూసేకరణకు ఎటువంటి తక్షణ పరిహారం ఇవ్వకుండా కేవలం కాగితాలు ఇచ్చి పని కానిచ్చేయాలన్న ప్రభుత్వం తీరు ఈ ప్రాంతంలోని రైతులు, నిర్వాసితుల హృదయాలను కలిచివేస్తోంది. టీడీఆర్ విషయం తేల్చకుండానే రెండు బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ పనులను ప్రారంభించి, ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. తొందరపాటెందుకు..? అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణ అంశం ఎప్పటి నుంచో నలుగుతోంది. రెండు దశాబ్దాల కాలంలో మూడు ప్రభుత్వాలు మారాయి. 9 రెవెన్యూ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ అంశంలో పరిహారం అందించిన తర్వాతే రోడ్డు వేయాలని ఇప్పటి వరకూ పాలకులు భావించగా.. నేటి కూటమి ప్రభుత్వం టీడీఆర్ తీసుకునే విధంగా ఎన్వోసీపై సంతకాలు చేసేందుకు సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసిన పరిహారం అంశం తేల్చకుండానే పనులు ప్రారంభించేసింది. తద్వారా బలవంతంగానైనా టీడీఆర్‌లను రైతులపై రుద్ది భూములను లాక్కోవాలన్న ఎత్తుగడ ఆందోళన రేకెత్తిస్తోంది. కాంట్రాక్టర్ అచ్యుతాపురం జంక్షన్లో ప్లైఓవర్ పనులు, హరిపాలెం, మునగపాక వద్ద బ్రిడ్జి పనులకు ఉపక్రమించారు. ఆర్అండ్బీ పరిధిలో ఎటువంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేని చోట రోడ్డు విస్తరణ, పక్కన డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. తద్వారా భూములివ్వని వారిని ఆత్మ రక్షణలో పడేసేలా కాంట్రాక్టర్, ప్రభుత్వం ఉన్నట్లుగా అర్థం అవుతోంది. అధికారులపైనా ఒత్తిడి..! ఈ ప్రాంతంలోని రెవెన్యూ అధికారులపై ఒక కూటమి నేత తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. గ్రామ సభల్లో టీడీఆర్‌ల అంశంపై తీవ్ర వ్యతిరేకత రాగా.. వారిని ఒప్పించలేకపోయారంటూ రెవెన్యూ యంత్రాంగంపై ఆ నేత చిందులు తొక్కినట్టు తెలుస్తోంది. ఒక తహసీల్దార్ సెలవుపై వెళ్లడానికి కారణం ఇదేనా.. అన్న చర్చ సాగుతోంది. టీడీఆర్‌లపై ఇంకా స్పష్టత లేదని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలోని సిబ్బంది ఒకపక్క చెబుతుండగా.. మరోపక్క పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డుకు ఆనుకొని ఉన్న భూముల్ని కోల్పోవడం వల్ల వచ్చిన పరిహారంతో వేరొక చోట ఇల్లు కట్టుకొని స్థిరపడవచ్చన్న ఆశతో ఉన్న రైతులకు టీడీఆర్ ప్రతిపాదన అశనిపాతంగా మారింది. పరిహారంపై తేల్చకుండానే అచ్యుతాపురం – అనకాపల్లి రహదారి పనులు ప్రారంభం టీడీఆర్ బాండ్లు వద్దంటున్నా నిర్వాసితుల గోడు పట్టించుకోని వైనం ఆర్ అండ్ బీ పరిధిలో చురుగ్గా పనులు నిర్వాసితులను ఆత్మరక్షణలోపడేసే పన్నాగం ఆత్మరక్షణలో రైతులు అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణ పనులు ప్రారంభించి నిర్వాసితులపై ఒత్తిడి తేవడం దారుణం. టీడీఆర్‌లకు ఒప్పుకోబోమని ఇప్పటికే రైతులు చెప్పారు. పరిహారం ఇవ్వకుండా, స్పష్టత ఇవ్వకుండా పనులు మొదలు పెట్టడం ద్వారా రైతుల్ని ఆత్మ రక్షణలో పడేస్తున్నారు. చరిత్రలో ప్రజా కంటకులుగా నిలిచిపోతారు. – బి.జగన్, ఉప సర్పంచ్, తిమ్మరాజుపేట టీడీఆర్‌లపై ఒత్తిడి తేవడం సరికాదు అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణకు సంబంధించి నిర్వాసితులపై ఒత్తిడి తేవడం సరికాదు. ఇప్పటికే మూడు విడతలుగా గ్రామాల్లో సభలు నిర్వహించి పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పుడు టీడీఆర్‌లు ఇస్తామని చెప్పడం అన్యాయం. ఇది 1200–1550 మంది రైతులు, ప్రజల సమస్య. పరిహారం ఇచ్చాకే పనులు ప్రారంభించాలి. – రొంగలి రాము, సీపీఎం మండల కన్వీనర్, అచ్యుతాపురం -
రేషన్ బండిపై రాజకీయ కక్ష
దేవరాపల్లి: పేద ప్రజల అవస్థలను తొలగిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటి వద్దకే రేషన్ వ్యవస్థను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా రద్దు చేయడం అత్యంత దారుణమని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. ఈ మేరకు దేవరాపల్లి మండలం తారువలో బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టారనే రాజకీయ దురుద్దేశంతో పేదల ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేస్తున్న ఎండీయూల వ్యవస్థను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. పేద ప్రజలు పనులు మానుకొని రోజంతా రేషన్ డిపోల దగ్గర క్యూలో పడిగాపులు కాస్తూ అవస్థలు పడకూడదన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ఎండీయూ వ్యవస్థ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. రేషన్ డిపోల ద్వారా పాత పాత పద్ధతిలోనే రేషన్ పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కోసం కూలి పనులు మానుకోవాల్సిన దుస్థితి దాపరిస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా పేదలకు నిత్యావసర సరకులు అందిస్తున్న ఎండీయూ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం ఎందుకు అంత కర్కశంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయలేదు సరికదా.. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలతో పాటు పలు సేవలను రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో వేలాది మంది ఎండీయూ ఆపరేటర్లు, సహాయకుల కుటుంబాలు రోడ్డు పడతాయని బూడి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఇలాంటి నిర్ణయాలను మానుకోవాలని హితవు పలికారు. విప్లవాత్మక డోర్ డెలివరీ వ్యవస్థ నిలిపివేత దారుణం కూటమి ప్రభుత్వం నిర్ణయంతోప్రజలకు మళ్లీ పాట్లు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ధ్వజం -
జూలో ఉత్సాహంగాసమ్మర్ క్యాంప్
ఆరిలోవ (విశాఖ): ఇందిరాగాంధీ జూ పార్కులో బుధవారం పాఠశాల పిల్లలకు సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది. జూ పార్కుతోపాటు జీవీఎంసీ, వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ త్రూ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, గ్రీన్ పాజ్, యూత్ కన్సర్వేషన్ యాక్షన్ నెట్వర్క్ సంయుక్తంగా ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాయి. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ శిబిరంలో నగరంలో పలు పాఠశాలలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటి రోజు వారికి పక్షుల వీక్షణ నిర్వహించారు. జూలో ఉన్న పక్షులతోపాటు లోపల సహజ వాతావరణంలో చెట్లపై తిరిగే వివిధ రకాల పక్షులను పిల్లలు తిలకించారు. వాటి గురించి జూ ఎడ్యుకేషన్ సిబ్బంది చిన్నారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జూ క్యూరేటర్ జి.మంగమ్మ మాట్లాడుతూ పిల్లలకు వన్యప్రాణులపై అవగాహన కల్పించడానికి సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వన్యప్రాణులు, వాటి జీవిత విశేషాలు, ఆహార అలవాట్లు, పర్యావరణానికి వాటి ఉపయోగం తదితర అంశాల గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తామన్నారు. -
సింహాచలం ప్రధానార్చకుడు కన్నుమూత
సింహాచలం: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ప్రధానార్చకుడు ఇరగవరపు వెంకట రమణాచార్యులు (58) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు ఈ నెల 19న గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో మరణించారు. రమణాచార్యులు 1992లో అధ్యాపకుడిగా సింహాచలం దేవస్థానంలో ఉద్యోగంలో చేరారు. 1994లో అర్చకుడిగా, 2020లో ప్రధానార్చకుడిగా పదోన్నతి పొందారు. శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామికి జరిగే వార్షిక ఉత్సవాలు, నిత్య పూజల నిర్వహణలో రమణాచార్యులు తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా స్వామివారి వార్షిక కల్యాణోత్సవం రోజుల్లో జరిగే ఎదురు సన్నాహోత్సవ ఘట్టంలో పూలదండలతో ఆయన చేసే నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. రమణాచార్యులకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
సైబర్.. టెర్రర్
అచ్యుతాపురం అడ్డాగా అసాంఘిక కార్యకలాపాలు ● రెండో రోజు సాఫ్ట్వేర్ డీ–కోడ్ చేయడానికి ప్రత్యేక బృందాలు ● సైబర్ నేరస్తులపై కొనసాగుతున్న విచారణ ● అనుమానితులను గుర్తిస్తున్న పోలీసు అధికారులు ● భయాందోళనలో స్థానిక ప్రజలు స్థానిక పోలీస్ అధికారి సెలవు రోజునే దాడులు అచ్యుతాపురం సెజ్‌లో జరిగే ఆన్లైన్ ట్రాప్ అంతా స్థానిక పోలీసులకు తెలిసే జరుగుతుందా..? కొన్ని నెలలుగా ఈ మోసాలు జరుగుతున్నా పోలీసులు ఎందుకు రైడ్ చేయలేదు..? ప్రజల మనసుల్లో మెదులుతున్న ప్రశ్నలివి. పోలీస్ ఉన్నతాధికారులకు సైతం ఈ సందేహాలు వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో పేకాట డెన్లపై, ఆన్లైన్ కోడిపందేలతో పాటు పలు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా.. స్థానిక పోలీస్ అధికారి, సిబ్బంది దాడులు జరిపేవారు కాదని తెలుస్తోంది. దాడులు జరిపినా ముందుగా సమాచారం లీక్ చేసేవారని ఉన్నతాధికారులు గుర్తించారు. అందుకే జిల్లా పోలీసు ఉన్నతాధికారే రంగంలోకి దిగి స్థానికంగా మరో డివిజన్ స్థాయి పోలీస్ అధికారితో కలిసి రైడింగ్‌కు వ్యూహరచన చేసినట్టు చెబుతున్నారు. స్థానిక పోలీసు అధికారి సెలవు రోజున ఈ దాడులు జరగడం గమనార్హం. సాక్షి, అనకాపల్లి/అచ్యుతాపురం రూరల్: పారిశ్రామికీకరణతో ప్రగతి బాట పట్టిన ప్రాంతమది.. ఇప్పుడు సైబర్ టెర్రర్తో కలవరపడుతోంది. అచ్యుతాపురానికి సమీపంలోని భోగాపురంలో మంగళవారం రాత్రి పలు అపార్ట్మెంట్లు, వాటిలోని ఫ్లాట్లపై పోలీసు దాడి ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఆన్లైన్ ట్రాపింగ్కు పాల్పడిన సైబర్ నేరగాళ్లను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్టు సమాచారం. నిందితులు వాడుతున్న సాఫ్ట్వేర్ డీ–కోడ్ చేసే ప్రయత్నంలో సంబంధిత శాఖలు నిమగ్నమై ఉన్నాయి. అచ్యుతాపురం కేంద్రంగా ఎన్నాళ్లుగా ఈ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి..? వీరి ద్వారా ఆన్లైన్ ట్రాపింగ్‌లో మోసపోయిన వారెందరు..? తదితర కోణాల్లో పోలీసులు అత్యంత రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ డీ–కోడ్ అయితేనే గానీ వివరాలు చెప్పలేమని పోలీసు అధికారులు తెలిపారు. 100 మందికి పైగా సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి భోగాపురం సమీపంలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో కార్యకలాపాలు సాగిస్తున్న 100 మందికిపైగా సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో మూడొంతుల మంది పారిపోయారు. పోలీసుల అదుపులో ఉన్న కొందరు సైబర్ నేరగాళ్ల నుంచి సమాచారం రాబడుతున్నారు. బుధవారం ఉదయం కూడా కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. భోగాపురం సమీపంలో ఉన్న పవన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని మొత్తం 40 ఫ్లాట్లలో వీరు సైబర్ నేరాలు నడిపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో పాలుపంచుకుంటున్న వారు సమీపంలోని వివిధ అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. వీరు చాలా గోప్యత పాటించేవారని, వంటలు చేసుకోవడానికి ఉపయోగించే గ్యాస్, పాలు, ఏమైనా పార్శిళ్లు వచ్చినా కింద పెట్టేసి వెళ్లిపోవాలే తప్ప.. వారుండే ఫ్లాట్లలోకి వెళ్లనిచ్చేవారు కాదని చెబుతున్నారు. శని, ఆది వారాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా వాడుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు. వారు ఆరు నెలలుగా ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. -
ఆనంద యోగం.. ఆరోగ్య భాగ్యం
అనకాపల్లి: ఆరోగ్యమే గొప్ప సంపద అని, యోగాతో దానిని సాధించి ఆనందంగా ఉండవచ్చని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ఆధ్వర్యంలో బొజ్జన్నకొండ వద్ద ఆమె బుధవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ’విశ్వమంతా యోగాతో ఆరోగ్యం’ అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన నిర్వహించుకుంటున్నామని, ఆ నేపథ్యంలో బుధవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆమె చెప్పారు. ఇందులో పాల్గొనే వారి కోసం ప్రభుత్వం యోగాంధ్ర యాప్ రూపొందించిందని, యాప్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. యోగాంధ్ర ప్రారంభ కార్యక్రమంలో అయిదు వందల మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని, వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరు రోజులో కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలన్నారు. యోగా లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కె.బాబూరావు, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఇన్చార్జి ఆర్డీవో వై.శ్రీనివాసరావు, జిల్లా ఆయూష్ మెడికల్ అధికారి డా.శిరీష, అనకాపల్లి మెడికల్ అధికారి కె.లావణ్య, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, యోగా లైఫ్ ఫౌండేషన్ యోగా శిక్షకులు, సాధకులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
మామిడి తాండ్ర పుల్లన
మామిడి తాండ్ర తయారు చేస్తున్న దృశ్యం నక్కపల్లి : ప్రతి ఏటా మామిడి సీజన్లో ఏర్పాటయ్యే తాండ్ర తయారీ దుకాణాలు రెండేళ్ల నుంచి కానరావడం లేదు. నక్కపల్లి మండలంలో మామిడి తాండ్ర తయారీ దుకాణాలు కొన్నేళ్లుగా ఎక్కువగా ఏర్పాటు చేసేవారు. ఈ సీజన్లో నియోజకవర్గంలో పలు ప్రాంతాలతో మామిడి తాండ్ర తయారీ కానరాలేదు. నక్కపల్లి మండలంలో వేంపాడు, చినదొడ్డిగల్లు, కాగిత, రేబాక, రమణయ్యపేట, తదితర ప్రాంతాల్లో మామిడి తాండ్ర తయారీ అధికంగా జరిగేది. ఈ ప్రాంతాల్లో సుమారు 15 వరకు మామిడి తాండ్ర దుకాణాలు ఏర్పాటు చేసేవారు. మామిడి గుజ్జును తాండ్రగా తయారు చేసి స్థానికంగా విక్రయించడంతో పాటు, ఇతర ప్రాంతాలకు సుమారు 50 నుంచి 100 టన్నుల వరకు ఎగుమతి చేసేవారు. తాండ్ర తయారీపై చుట్టు పక్కల సుమారు 100 మంది వరకు ఉపాధి పొందేవారు. మరో 50 మంది వరకు తాండ్రను కాగిత టోల్‌ప్లాజా వద్ద కిలోల చొప్పున ప్యాక్ చేసి బస్సుల్లోను, కారుల్లోను వెళ్లేవారికి విక్రయించేవారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో సైకిళ్లపై వెళ్లి విక్రయించేవారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా మామిడి కాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో దాదాపు 15 వేల హెక్టార్లలో మామిడితోటలు ఉన్నాయి. చాలా తోటల్లో పూతదశలో తెగుళ్లు రావడం, పొగమంచు కారణంగా మామిడి కాయలు కాయలేదు. దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈ ఏడాది మామిడి పండ్లకు గిరాకీ పెరిగింది. దిగుబడి ఎక్కువగా ఉన్న సమయంలో కలెక్టర్, సువర్ణరేఖ, నీలం, దేశవాళి, బంగినపల్లి, రసాలు వంటి రకాలను కొనుగోలు చేసి గుజ్జు చేసి తాండ్ర తయారీకి ఉపయోగించేవారు. ధరలు చూస్తే బేజారు..: మామిడి దిగుబడి తగ్గిపోవడంతో ధర కూడా విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం కలెక్టర్ మామిడి కాయలు టన్ను రూ.35 వేలు ఉంది. బంగినపల్లి రకాలయితే టన్ను రూ.40వేల వరకు ఉంది. సువర్ణరేఖ రూ. 50 వేలకు పైబడే ఉంది. దీంతో తాండ్ర తాయారీకి వెనుకడుగు వేస్తున్నారు. రసాలు, దేశవాళీ, ఇతర జాతులకు చెందిన మామిడి కాయలు సైతం టన్ను రూ.20 వేల పైబడి మాటే. అంత ధర పెట్టి కాయలను కొనడంతో పాటు ముడిసరకులు, ఇతర ఖర్చులకు గిట్టుబాటు కాదని భావించిన వ్యాపారులు ఈ ఏడాది తాండ్ర తయారీకి స్వస్తి పలికినట్టు సమాచారం. కార్మికులకు వేతనం రూ.500 నుంచి రూ. 800 వరకు చెల్లించాల్సి వస్తుంది. స్థానికంగా ఉండే కమీషన్ వ్యాపారులు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన మామిడి కాయలను తాము అనుకున్న ధర రావడంతో దేశవాళీ, కలెక్టర్, ఇతర జాతులకు చెందిన రకాలను జ్యూస్‌ల కోసం ఎగుమతి చేస్తున్నారు. దీంతో తాండ్ర తయారీకి అవసరమైన మామిడి కాయలు అందుబాటు ధరల్లో లభించడం లేదు. ఈ ధరలకు కాయలు కొని తాండ్ర తయారు చేసినా అధిక ధరలకు విక్రయించాల్సి ఉంటుంది. దీంతో అమ్మకాలు తగ్గిపోతాయి. గత ఏడాది మామిడి తాండ్ర కిలో రూ.500 ఉంటే ఈ ఏడాది రూ. 800లకు విక్రయిస్తే తప్ప గిట్టుబాటు కాదు. పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. దీంతో నష్టాలను చవి చూడాల్సి వస్తుందని భావించి తాండ్ర తయారీకి స్వస్తి పలికినట్టు తయారీదారులు చెబుతున్నారు. తగ్గిన మామిడి దిగుబడి తాండ్ర తయారీకి వెనకడుగు పెరిగిన ముడిసరుకు, తయారీ ఖర్చులు గిట్టుబాటు కాక ఏర్పాటు కాని దుకాణాలు గిట్టుబాటు కాని తాండ్ర చిన దొడ్డిగల్లు పరిసర ప్రాంతాల్లో గతంలో ఐదు మామిడి తాండ్ర దుకాణాలు ఉండేవి. రెండేళ్ల నుంచి దిగుబడి అంతంతమాత్రంగానే ఉండడంతో ముడిసరకు ధరలు పెరిగిపోయాయి. దీంతో తాండ్ర తయారీకి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక్కడ తయారు చేసిన తాండ్రను స్థానికంగా విక్రయించడంతో పాటు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే వారు. ఈ ఏడాది ఒక్క దుకాణం కూడా ఏర్పాటు కాలేదు. కూలీలు కూడా తాండ్ర తయారీ లేక ఉపాధి పనులకు, భవన నిర్మాణ పనులకు వెళ్లిపోతున్నారు. – తోటసత్తిబాబు, కమిషన్ దుకాణం నిర్వహకుడు, చినదొడ్డిగల్లు -
130 కిలోల గంజాయి పట్టివేత
● ఒకరు అరెస్టు, ముగ్గురు పరార్ చీడికాడ: కారులో అక్రమంగా తరలిస్తున్న 130 కిలోల గంజాయితో వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. ఆయన మంగళవారం అందించిన వివరాలిలా ఉన్నాయి. గంజాయి అక్రమ రవాణా జరుతున్నట్టు అందిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం మండలంలోని ఖండివరం వద్ద మాటువేసి అటుగా వస్తున్న కారును అడ్డగించి తనిఖీలు నిర్వహించామన్నారు. ఆ కారులో రూ.ఆరున్నర లక్షక్షల విలువ గల 130 కిలోల గంజాయిని గుర్తించామన్నారు. గంజాయి తరలిస్తున్న మండలంలోని బైలపూడికి చెందిన కాశీ తేజను అదుపులోకి తీసుకున్నామన్నారు. అతనితో పాటు మరో ముగ్గురు పైలేట్లుగా వ్యవహరించినట్టు తెలిపారు. వారు పరారీలో ఉన్నారని తెలిపారు. -
సారా బట్టీలపై దాడులు
ఎటపాక: నవోదయం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఎటపాక మండలంలో సారా తయారీ కేంద్రాలపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ఎకై ్సజ్, పోలీసు శాఖల అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. విశాఖపట్నం ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి ఆదేశాలతో మండలంలోని పిచుకలపాడు, గుండువారిగూడెం గ్రామాల్లో ఎకై ్సజ్, సివిల్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు మంగళవారం ఆకస్మికంగా దాడులు జరిపాయి. దాడుల్లో 4500 లీటర్ల బెల్లం ఊట ,40 లీటర్ల సారా, 20 కేజిల పటిక సీజ్ చేశారు. గుండువారిగూడెం గ్రామంలో ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. సారా తయారికీ ఉపయోగించే 48 డ్రమ్ములను సామగ్రితో పాటు ధ్వంసం చేసినట్టు రంపచోడవరం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగరాహుల్ తెలిపారు. ఈ దాడుల్లో కొత్తగూడెం ఏఈఎస్ కరంచంద్, రంపచోడవరం ఏఈఎస్టీఎఫ్ సీఐ ఇంద్రజిత్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ అప్పలనాయుడు, చింతూరు ఎకై ్సజ్ ఎస్ఐ స్వామి, అనకాపల్లి సీఐ శ్రీనివాసరావు, భద్రాచలం ఎస్ఐ సీతారామరాజు, పాల్వంచ ఎస్హెచ్ఓ సరిత, ఎటపాక సీఐ కన్నపరాజు, ఇరు రాష్ట్రాల ఎన్ఫోర్స్మెంట్, సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. 4500 లీటర్ల బెల్లం ఊట, 40 లీటర్ల సారా ధ్వంసం తయారీ సామగ్రి స్వాధీనం ఐదుగురిపై కేసు నమోదు -
బండారు అప్పన్న మృతిపై డీఎస్పీ విచారణ
నర్సీపట్నం: నర్సీపట్నం మండలం, వేములపూడిలో నవంబరు 5న చోటు చేసుకున్న బండారు అప్పన్న మృతిపై డీఎస్పీ పి.శ్రీనివాసరావు విచారణ జరిపారు. మృతుడి తండ్రి బండారు మహాలక్ష్మి, కుటుంబ సభ్యులు కేసును నీరుగార్చుతున్నారంటూ సోమ వారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ విజయకృష్ణన్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మంగళవారం మృతుడి తండ్రి మహాలక్ష్మి, కుటుంబ సభ్యులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ముందుగా మృతుడి తండ్రిని, తరువాత కుటుంబ సభ్యులు గోవింద, చిన్ని, మంగను విడివిడిగా విచారించారు. కుమారుడుని కోల్పోయాను కేసు నీరుగార్చకుండా న్యాయం చేయాలని డీఎస్పీకి విన్నవించానని మహాలక్ష్మి తెలిపారు. కేసులో పురోగతి లేకపోవడం వల్లనే కలెక్టర్‌ను ఆశ్రయించానని, ఇప్పటికై నా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. కత్తిగాటు, కర్రతో కొట్టినట్టు ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదమని ఎలా నమ్ముతామని అన్నారు. ఇప్పటికై నా పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే దోషులు బయటపడతారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే తన కొడుకు మృతికి గల కారకులను బయటపెట్టి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీని కోరడం జరిగిందని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి దుర్మరణం
కశింకోట: మండలంలోని బయ్యవరం పాల డెయిరీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఎస్ఐ లక్ష్మణరావు అందించిన వివరాల ప్రకారం...విశాఖపట్నం నుంచి నరసాపురం వెళుతున్న కారు, బయ్యవరం పాల డెయిరీ వద్ద అవతలి రోడ్డులోకి అకస్మాత్తుగా మలుపు తిరుగుతున్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న బుంగా వెంకట నరసమ్మ (72) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు నరేష్, మేనకోడలు సువర్ణ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజిహెచ్‌కు వైద్యులు సిఫారసు చేశారు. విశాఖలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న నరేష్, తమ తల్లి నరసమ్మ, కుటుంబ సభ్యులు సువర్ణ, ముగ్గురు పిల్లలతో కలిసి కారులో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బంధువుల ఇంటికి పెళ్లికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. నరసమ్మ మృతదేహానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జయి దెబ్బతింది. తన కళ్లముందే తల్లి నరసమ్మ మృతి చెందడంతో నరేష్, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ఆర్ఆర్ ప్యాకేజీ రూ.25 లక్షలు ఇవ్వాల్సిందే
నక్కపల్లి : ఏపీఐఐసీకి భూములిచ్చిన రైతులు, నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు చెల్లించాల్సిందేనని పలువురు రైతులు కోరారు. మంగళవారం చందనాడ, అమలాపురం, మూలపర గ్రామాల్లో ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి అర్హత సాధించిన రైతులు, నిర్వాసితుల జాబితాలు ప్రకటించేందుకు గ్రామసభ నిర్వహించారు ఆర్డీవో రమణ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో ప్రభుత్వం ప్రకటించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వివరాలను ఆర్డీవో వెల్లడించారు. ఐదు సెంట్ల ఇంటి స్థలంతో పాటు ప్యాకేజీ కింద రూ.8.30 లక్షలు నిర్ణయించడం జరిగిందన్నారు. దీనిపై రైతునాయకులు సూరాకాసుల గోవిందు,గంటా తిరుపతిరావు, తళ్ల భార్గవ్, తళ్ల అప్పలస్వామి, పెదకాపు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ చాలదన్నారు. పదేళ్ల క్రితం భూములు ఇస్తే ఇప్పుడు నష్టపరిహారం, ప్యాకేజీ చెల్లిస్తున్నారని, అప్పటికీ ఇప్పటికీ మార్కెట్ధరల్లో చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు చెల్లించాలన్నారు. పెళ్లికాని మహిళలకు కూడా ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు. డీఫారం భూముల్లో ఉన్న చెట్లక , వ్యవసాయ బోర్లకు, బావులకు సైతం నష్టపరిహారం చెల్లించాల్సిందేనన్నారు. ప్యాకేజీ వ్యవహారం తేల్చకుండా భూములు స్వాధీనం చేసుకుని పనులు ప్రారంభించడం తగదన్నారు. తహసీల్దార్ నర్సింహమూర్తి డీటీ నారాయణరావు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. -
భంగపడ్డ గంగపుత్రులు
వేష నిషేధ భృతి మంజూరులో అవకతవకలు ‘‘అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీ పరిధిలో అర్హత ఉన్న 300 మంది మత్స్యకారులకు వేట నిషేధ భృతి రాలేదు. మొత్తం 367 బోట్లు రిజిస్టర్ అయినవి ఉన్నాయి. ప్రతీ బోటుకు ఆరుగురు ఉంటారు. అందులో ఐదుగురు అర్హులకు మాత్రమే భృతి వచ్చింది. ఆరో వ్యక్తిగా కూటమి నేతలు తమకు అనుకూలమైన వ్యక్తి పేరును నమోదు చేసుకున్నారు. ఇలా అర్హత ఉండి రాని వారు.. వాడమొదల తాతారావు (బోట్ నెం.ఏపీ–వీ3–ఎండీ–120), మడ్డు మత్తురాజు (బోట్ నెం.ఏపీ–వీ3–ఎండీ–120), తెడ్డు అప్పన్న (బోట్ నెం.ఏపీ–వీ3–ఎండీ–159), కంబాల మౌళి (ఏపీ–వీ3–ఎండీ–120), వాడమొదల సత్తియ్య (ఏపీ–వీ3–ఎండీ–61), వాడమొదల నూకరాజు(ఏపీ–వీ3–ఎండీ–1688)’’ ● పూడిమడకకు చెందిన కౌవిరి బాపయ్య అనే మత్స్యకారుడికి ఒక్క సెంటు భూమి కూడా లేదు. కానీ ఆయనకు 80 ఎకరాల భూమి ఉన్నట్లు చూపించి నిషేధ భృతి ఆపేశారు. ఎందుకు రాలేదని సచివాలయ ఉద్యోగులను అడిగితే నీ పేరు మీద 80 ఎకరాలున్నట్లు చూపిస్తోందని చెప్పే సరికి బాపయ్య ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా మంది అర్హులైన మత్స్యకారులకు ఏదో ఒక కారణం చూపించి నిరాకరించారు. సాక్షి, అనకాపల్లి: మత్స్యకారుల సేవలో.. అని పేరు పెట్టారు. చివరకు వారి కడుపు కొట్టారు. అధికారంలోకి వచ్చాక తొలి సంవత్సరం వేట నిషేధ భృతి ఎలాగూ ఇవ్వలేదు. కనీసం రెండో సంవత్సరమైనా పద్ధతిగా ఇచ్చారా.. అంటే అదీ లేదు. భృతి అందుకున్న లబ్ధిదారుల వివరాలు సేకరిస్తే కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎందరో అనర్హులు లబ్ధి పొందినట్టు తేటతెల్లమయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ‘మత్స్యకార భరోసా’ పొందిన వారిలో అర్హత ఉన్న సుమారు 2 వేల మందికి ఈసారి భృతి అందలేదు. ఒక్కో బోటులో అర్హత లేని కూటమి పార్టీల అనుకూల మత్స్యకారులకు భరోసా కల్పించారు. వేట మీదే ఆధారపడి జీవించే గిరిపుత్రులకు అన్యాయం చేశారు. దీనిపై కలెక్టర్‌కు, జిల్లా మత్స్యకార అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. వేట నిషేధ కాలంలో అప్పులు చేసి, కాలం గడుపుతామని, భృతి మంజూరులో రాజకీయం చేసి తమ కడుపు కొట్టడం అన్యాయమని గంగపుత్రులు వాపోతున్నారు. తీరంలో ఉన్న ఆరు మండలాల పరిధిలోని 31 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 12,644 మత్స్య కుటుంబాలు కేవలం చేపల వేట, విక్రయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కూటమికి అనుకూలంగా ఉన్నవారికే భృతి వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకముందు వేట నిషేధ భృతి మొక్కుబడిగా అందించేవారు. రూ.5 వేల చొప్పున నిషేధం ముగిసిన చాలా కాలానికి ఇచ్చేవారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక భృతిని రూ.10 వేలకు పెంచడమే కాక ఠంఛనుగా వేట నిషేధ సమయంలో అందించేవారు. కూటమి పార్టీలు ఆ పరిహారాన్ని రెట్టింపు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినా.. దాన్ని మొదటి ఏడాది విస్మరించారు. రెండో ఏడాది ఇచ్చినా తీరని అన్యాయం చేశారు. రీసర్వే పేరిట అర్హులను తొలగించి, తమకు అనుకూలంగా ఉన్నవారికి లబ్ధి చేకూర్చారు. అర్హత ఉన్నవారిని కాదని అనర్హులకు నిషేధ భృతి గత లబ్ధిదారుల్లో కొందరికి నిలిపివేత బోటులో వేటకెళ్లే మత్స్యకారుల బృందంలో ఒకరిద్దరి పేర్లు కూటమి నేతలకు అనుకూలురవే జిల్లా వ్యాప్తంగా 1580 మందిమత్స్యకారులకు నిలిచిపోయిన భృతి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంఉద్యమిస్తాం.. కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వానికి మత్స్యకారుల ఓట్లే కావాలి.. వారి సమస్యలు, వెతలు వినపడవు. వేట నిషేధ భృతి మొదటి ఏడాది ఇవ్వలేదు. రెండో ఏడాదిలో జిల్లాలో సుమారుగా 1500 మందికి అందలేదు. ఎన్నికల్లో కూటమి పార్టీలకే మత్స్యకారులు ఎక్కువగా ఓట్లు వేశారు. నమ్మిన వారిని మోసం చేయడం తగదు. అర్హులకు వేట నిషేధ భృతి అందకపోతే ఉద్యమానికై నా సిద్ధమే. – చోడిపల్లి శ్రీనివాసరావు, మాజీ మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్చేదు వాస్తవాలు 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 11,500 మంది మత్స్యకారులకు నిషేధ భృతి అందించారు. 2024లో కూటమి ప్రభుత్వం మత్స్యకార భరోసా కల్పించలేదు. 2025లో జిల్లాలో నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ మండలాల్లో 11,544 మందికి రూ.23.28 కోట్లు భృతి అందించారు. వీరు కాకుండా అర్హత ఉన్న సుమారుగా 1580 మందికి మత్స్యకారులు వేట నిషేధ భృతి రాలేదు. వీరిలో అచ్యుతాపురం మండలంలో 400 మంది మత్స్యకారులు, రాంబిల్లి, పరవాడ మండల పరిధిలో 200 మంది, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల పరిధిలో 400 మందికి పైగా మత్స్యకారులు ఉన్నారు. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయని, కార్లు, భూములు ఉన్నాయని లేకపోయినా ఉన్నట్లు చూపించి సుమారు 500 మంది మత్స్యకారులను అనర్హులుగా పక్కన పెట్టారు. పేదవారితో రాజకీయమా? అర్హత ఉన్న మత్స్యకారులందరికీ నిషేధ భృతి ఇవ్వాలి. వేటకెళ్లే వారెవరో.. వెళ్లని వారెవరో సచివాలయంలో ఉన్న అధికారులకు తెలియదా..? వారికి అన్నీ తెలిసే స్థానిక కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వేటకెళితేగానీ పూటగడవని మత్స్యకారులున్నారు. అలాంటి వారికి ఇవ్వాల్సిన భృతిని కూడా నిలిపివేసి రాజకీయాలు చేస్తున్నారు. – ఉమ్మిడి జగన్, మత్స్యకార నాయకుడు, పూడిమడక బోటుకు రెండు అనధికార పేర్లు.. రిజిస్ట్రేషన్ అయిన ప్రతి బోటుకు ఒకటి లేదా రెండు అనర్హుల పేర్లు చేర్చారు. వారికి నిషేధ భృతి ఇచ్చారు. ఈ అవకతవకల్లో స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. మత్స్యకార భరోసాకు అర్హత ఉన్న సూరాడ కోదండరాం అనే బోట్ ఓనర్‌కు కూడా భృతి రాలేదు. అధికారులు పరిశీలించి అర్హులైన అందరికీ భృతి అందించాలి. – వాసుపల్లి శ్రీనివాసరావు, మత్స్యకారుడు, పూడిమడక టెక్నికల్ సమస్య కారణంగా కొందరికి రాలేదు వేట నిషేధ భృతి అర్హత ఉన్న ప్రతీ మత్స్యకారుడికీ ప్రభుత్వం అందించింది. చిన్నపాటి టెక్నికల్ సమస్య కారణంగా కొందరికి రాలేదని మా వరకూ వినతులు వచ్చాయి. అర్హత ఉండి భృతి రాని వారందరి నుంచి దరఖాస్తులు కోరుతున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అందిస్తాం. – ప్రసాదరావు, మత్స్యకార జిల్లా జేడీ -
ఉప మేయర్‌గా దల్లి ఏకగ్రీవం
డాబాగార్డెన్స్ (విశాఖ): జీవీఎంసీ ఉప మేయర్‌గా కూటమి తరఫున జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రక్రియకు ప్రిసైడింగ్ అధికారిగా జేసీ మయూర్ అశోక్ వ్యవహరించారు. గోవిందరెడ్డి పేరును టీడీపీ నుంచి పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, బీజేపీ నుంచి ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రతిపాదించారు. పోటీ లేకపోవడంతో ఎన్నికల అధికారి గోవిందరెడ్డికి నియామక పత్రం అందించారు. అనంతరం ప్రమాణస్వీకారం చేయించారు. ముందు జాగ్రత్త! ఉప మేయర్ ఎన్నికలో సోమవారం నాటి సీన్ రిపీట్ కారాదని జాగ్రత్త పడ్డారు. అసంతృప్త సభ్యుల్ని ముందుగానే రప్పించి మేయర్ చాంబర్లో కూర్చోబెట్టారు. మేయర్ పీలా శ్రీనివాసరావు తన చాంబర్ నుంచి లిస్ట్ ప్రకారం టిక్ పెట్టి మరీ సభ్యుల్ని కౌన్సిల్ హాల్లోకి పంపారు. ముందు రోజు డుమ్మాకొట్టిన వారికి బుజ్జగింపులు, తాయిళాలు అందినట్లు సమాచారం. యాదవ, కాపులకు వెన్నుపోటు జీవీఎంసీ మేయర్, ఉప మేయర్ ఎన్నికల్లో యాదవ, కాపు సామాజిక వర్గాలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ఆ సామాజిక వర్గ కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మేయర్‌గా గొలగాని హరివెంకట కుమారి(యాదవ), ఉప మేయర్‌గా జియ్యాని శ్రీధర్(కాపు)లకు అవకాశం ఇచ్చారు. కౌన్సిల్లో బలం లేకపోయినా దొడ్డిదారిన వారిని దించేసిన కూటమి నేతలు, విశాఖలో కూటమి మనుగడకు కారణమైన ఈ రెండు వర్గాలను విస్మరించడంపై ఆయా సామాజిక వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. -
తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
అనకాపల్లి: రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న దేవరాపల్లి మండలం ముత్యాలమ్మపాలెం గ్రామానికి చెందిన చౌడువాడ దేముడునాయుడిని మార్టూరు గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకున్నామని ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. తమ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మార్టూరు జంక్షన్ వద్ద ఇటీవల కాలంలో వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిగా గుర్తించామన్నారు. ఇతని వద్ద మొత్తం 5 కేసులలో చోరీకి గురైన 7.5 తులాల బంగారం, 28 తులాల వెండి వస్తువులు, కెనాన్ కెమెరా, రూ.1,500లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సుమారు రూ.8 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ, పగటి వేళ దొంగతనాలకు పాల్పడేవాడని ఆయన పేర్కొన్నారు. చిన్నతనంలోనే తండ్రి మృతి చెందడంతో నిందితుడు జులాయిగా తిరుగుతూ, చెడు వ్యసనాలకు బానిసై, ఆన్లైన్ బెట్టింగ్ వంటి చర్యలకు లోనై తన స్నేహితులతో కలసి ఈ చోరీలకు పాల్పడినట్లు ఆయన చెప్పారు. అనంతరం ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రశంసాపత్రాలతో అభినందించారు. నర్సీపట్నం టౌన్ పీఎస్ పరిధిలో... నర్సీపట్నంలోని శారదానగర్‌లో ఒంటరిగా నివసిస్తున్న రాళ్లపల్లి వెంకట లక్ష్మి గృహంలో ఈనెల 16న చొరబడి, ఆమైపె దాడి చేసి, బంగారు, వెండి ఆభరణాలను అపహరించిన అదే గ్రామానికి చెందిన ఉలబాల విజయకుమార్, కెళ్ల సతీష్, పత్రి నారాయణమ్మలను నర్సీపట్నం మండలం బలిఘట్టం టి–జంక్షన్ వద్ద అరెస్టు చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు ఆభరణాలు 10 తులాలు, బంగారు గొలుసు 3 తులాలు, బంగారు గాజులు 7 తులాలు, బంగారు ఉంగరం తులం, వెండి దీపం కుందులు 19.370 తులాలు ముగ్గురు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందిని ప్రశంసా పత్రాలతో ఎస్పీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (క్రైమ్) ఎల్.మోహనరావు, అనకాపల్లి ఇన్చార్జ్ డీఎస్పీ బి.మోహనరావు, అనకాపల్లి రూరల్ సీఐ జి.అశోక్‌కుమార్, రూరల్ ఎస్ఐ జి.రవికుమార్, సెంట్రల్ క్రైం పోలీస్ స్టేషన్ సీఐ అప్పలనాయుడు, ఎస్ఐలు పి.రమేష్, చోడవరం సీఐ పి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. పట్టపగలే చోరీలు నలుగురు నిందితుల అరెస్టు 7.5 తులాల బంగారం, 28 తులాల వెండి వస్తువులు స్వాధీనం -
● తల్లీబిడ్డ అవస్థలు
అమ్మ అయిన ఆ సంతోషం కళ్లల్లో నిండాలి. పసిబిడ్డను అక్కున చేర్చుకొని, ప్రభుత్వ వాహనంలో సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి. కానీ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగుల సమ్మె ఆ ఆశలపై నీళ్లు చల్లింది. వాహనాలు నిలిచిపోవడంతో బాలింతల అవస్థలు పడ్డారు. మంగళవారం కేజీహెచ్‌లో డిశ్చార్జ్ అయిన చోడవరం ఎడ్లవీధికి చెందిన సౌందర్య జ్యోతికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. బిడ్డతో ఆటోలో ఇంటికి వెళుతున్న ఈ దృశ్యం, సమ్మె కారణంగా సాధారణ పౌరులు ఎదుర్కొంటున్న కష్టాలకు అద్దం పట్టింది. సౌందర్య జ్యోతి ఒక్కరే కాదు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లాల్సిన ఎంతో మంది తల్లులు, పసిబిడ్డలతో కలిసి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి ఆశలకు భంగం కలిగి, ప్రభుత్వ సేవలు అందక, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. –మహారాణిపేట/ –ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
డొంకాడ దాడిపై డీఎస్పీ విచారణ
నక్కపల్లి: డొంకాడలో దళితులపై తెలుగుదేశంపార్టీకి చెందిన అగ్రవర్ణాలు దాడి చేసిన ఘటనపై మంగళవారం నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు గ్రామంలో విచారణ నిర్వహించారు. వివాహ సమయంలో పెళ్లికొడుకు సెల్‌ఫోన్ కనిపించకపోవడంతో దానిని మైక్, లైటింగ్ ఏర్పాటు చేసిన దళిత యువకులే తీశారంటూ పెళ్లికొడుకుతోపాటు అగ్రవర్ణాలకు చెందిన పలువురు వ్యక్తులు కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టిన సంగతి తెలిసిందే. అగ్రవర్ణాల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమపై దాడి చేసి కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ బాధితులు సోమవారం నక్కపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు డొంకాడకు చెందిన సుమారు 14 మంది అగ్రవర్ణాల వారిపై పలు సెక్షన్లతో కూడిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబులు మంగళవారం ఘటనా స్థలానికి, ఎస్సీ కాలనీకి వెళ్లి బాధితులను విచారించారు. దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఫిర్యాదు చేసిన వారితోపాటు, దాడిలో గాయపడిన వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. విచారణను వీడియో చిత్రీకరించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గ్రామంలో అగ్రవర్ణాల వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇలా ఒకసారి దాడి చేస్తే పెద్దల సమక్షంలో రాజీ పడ్డామన్నారు. ఆరు నెలల వ్యవధిలోనే సెల్‌ఫోన్ చోరీ అభియోగం మోపి దాడికి తెగబడ్డారన్నారు. గ్రామపెద్దల సమక్షంలోనే దాడి జరిగిందని వాపోయారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు. బాధితులకు ధైర్యం చెప్పి మరోసారి బుధవారం విచారణకు వస్తామన్నారు. ఇరువర్గాల వారు సంయమనం పాటించాలన్నారు. న్యాయం జరగకపోతే ఉద్యమం ఉధృతం గ్రామంలో డీఎస్పీ విచారణ అనంతరం దళిత సంఘాల ప్రతినిధులు, బాధితులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి బూర్తి ఏసయ్య, దళిత నాయకుడు రాజేష్, కూరపాటి అప్పారావు, మాజీ ఎంపీటీసీ విది కుమారి కన్నారావు, కుంచా రమణ, వీది సత్యనారాయణ, నొక్కి అప్పారావు, నాసా సంస్థ ప్రతినిధి శాంతికుమారి తదితరులు మాట్లాడుతూ పథకం ప్రకారం టీడీపీ నాయకులు దళితులపై దాడులకు తెగబడ్డారన్నారు. గొడవ జరుగుతున్న సమయంలో సర్దిచెప్పేందుకు వచ్చిన మరికొంతమంది దళితులను గ్రామ పెద్దల సమక్షంలోనే దాడి చేసి గాయపరిచారన్నారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్నారు. 8 మంది దళిత యువకులపై దాడి చేసిన 14 మంది పేర్లతో కూడిన ఫిర్యాదును పోలీసులకు అందజేశామన్నారు. దాడి చేసిన వారిలో కొంతమంది పేర్లు ఎఫ్ఐఆర్ నుంచి తప్పించే ప్రయత్నాలు, కేసును నీరుగార్చే కుట్ర జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. నిందితులను కాపాడేందుకు కొంతమంది టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం వచ్చిందని, అదే గనుక జరిగితే దళిత సంఘాలన్నీ ఏకమై రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాయని బూర్తి ఏసయ్య తెలిపారు. దళితుల నుంచి వాంగ్మూలం నమోదు కేసును నీరు గార్చే కుట్ర జరుగుతోందనిబాధితుల అనుమానం -
నాలుగు నెలలుగా పస్తులు
అనకాపల్లి: ఆస్పత్రుల్లో ప్రసవం అయిన తర్వాత బాలింతలను వారి పసికందులతో సహా క్షేమంగా ఇంటికి చేరుస్తున్నామని, ఎంతో బాధ్యత గల విధులు నిర్వహిస్తున్న తమను పస్తులతో ఉంచడం తగదని 102 తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు అన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఒకరోజు సమ్మె నిర్వహించారు. నెహ్రూచౌక్ వద్ద నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కనీస వేతనాలు అమలు చేయడం లేదని, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించడంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 4 మాసాలుగా జీతాలు లేక అప్పులు చేసి కుటుంబాన్ని పోషించే పరిస్థితి ఏర్పడిందని, నేషనల్ హెల్త్ మిషన్ కల్పించుకోవాలన్నారు. యూనియన్ జిల్లా నాయకులు నర్సింగరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జీతాలు చెల్లించక తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ల అవస్థలు ఒక రోజు సమ్మెతో నిరసన బాట పట్టిన బాధితులు -
పెంటకోట తీరంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
పాయకరావుపేట: పెంటకోట తీరంలో సోమవారం సాయంత్రం సముద్ర స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వచ్చి ఇలా గల్లంతు కావడంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్ఐ జె.పురుషోత్తం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాయకరావుపేట పట్టణం పాత హరిజనవాడకు చెందిన గంపల తరీష్(17) ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈయన స్నేహితుడు రాజవొమ్మంగికి చెందిన పిల్లి అభిలాష్(19) హైదరాబాద్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ పట్టణంలోని బంధువుల ఇంట్లో సోమవారం జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో పెంటకోట సముద్ర తీరానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. స్నానం చేస్తుండగా అభిలాష్ సముద్రంలో మునిగిపోతుండగా.. తరీష్ గమనించాడు. స్నేహితుడిని రక్షించే ప్రయత్నంలో తరీష్ కూడా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మైరెన్ పోలీసులు, స్థానిక పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి అయినా విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు. మంగళవారం ఉదయం మళ్లీ గాలింపు చేపడతామని ఎస్ఐ తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ దళాలతో కూడా గాలింపు చర్యలు చేపడతామన్నారు. ఇద్దరు విద్యార్ధులు శుభకార్యానికి వచ్చి, సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతు అవ్వడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
అర్జీల పరిష్కారం తూచ్..
తుమ్మపాల: అర్జీదారులపై అధికారులకు కరుణే లేదు.. సమస్యలు పరిష్కరిస్తారని గంపెడాశతో వస్తే కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారే గానీ పట్టించుకోవడం లేదు.. అని కలెక్టరేట్‌కు వచ్చిన పలువురు అర్జీదారులు తమ ఆవేదన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు తమ గోడును విన్నవించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి అనేక మంది తరలివచ్చారు. వ్యయ ప్రయాసలకోర్చి మండుటెండను సైతం లెక్కచేయకుండా వచ్చినప్పటికి సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపడం లేదని, విధుల్లో భాగంగా ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ ద్వారా అర్జీలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు. ఇప్పటికే అనేక సార్లు వచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగు చెంది పురుగులు మందులు, పెట్రోల్ వంటి ప్రాణాంతక పదార్థాలు వెంట తెచ్చుకుని అధికారులు, కలెక్టరేట్ పరిసరాలలో ఆత్మహత్యా యత్నాలతోపాటు పలు రకాల నిరసనలకు తెగిస్తున్నారు. ఆలస్యంగా పీజీఆర్ఎస్... ● పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించాల్సి ఉన్నప్పటికి అధికారుల రాక ఆలస్యమవడంతో అర్జీదారులు కొంత సమయం క్యూలోనే వేచి ఉండాల్సి వచ్చింది. ● యలమంచిలి 10వ వార్డు సచివాలయం పరిధిలో అర్హత ఉండి పింఛన్లు మంజూరు కావడం లేదంటూ 40 మందికిపైగా అర్హులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఇటీవల ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పింఛన్ల పథకంలో అర్హులుగా తమను చేర్చాలని అర్జీలు అందజేశారు. ● పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీలను కలెక్టర్ విజయ కృష్ణన్, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఎస్డీసీ సుబ్బలక్ష్మి స్వీకరించారు. మొత్తం 370 అర్జీలు నమోదయ్యాయి. దివ్యాంగులకు ఉచితంగా ఇల్లు కట్టివ్వాలి నిరుపేదలైన అనేక మంది దివ్యాంగులకు ప్రభుత్వమే కాలనీ నిర్మించి ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇల్లుతోపాటు కరెంటు, నీరు, తదితర సౌకర్యాలు కల్పించాలని శ్రీరామ దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు పీజీఆర్ఎస్లో కలెక్టర్‌కు విన్నవించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పథకాలు అమలు చేయాలి నెలకు రూ.13 వేల జీతంతో జీవించే తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పథకాలు కట్ చేసి మరింత నిరుపేదలను చేస్తున్నారని జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు వాపోయారు. నెలకు రూ.30 వేలకుపైగా జీతం పొందుతున్న ప్రైవేటు ఉద్యోగులకు అన్ని పథకాలు వర్తించినట్లే తమకు అమలు చేసి ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కరెంటు, మంచినీళ్లూ ఇవ్వండయ్యా.. ప్రభుత్వ ఆర్థిక సాయంతో సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నాను. ఊర్లో అందరికి ఇంటింటి కుళాయిలు వేశారు. మా ఇంటికి మాత్రం వేయలేదు. దూరం నుంచి బిందెలతో నీరు తెచ్చుకోవడం కష్టంగా ఉంది. కరెంటు మీటరు కోసం రూ.1,800 చెల్లించినప్పటికి కనెక్షన్ ఇవ్వలేదు. న్యాయం చేయాలని పీజీఆర్ఎస్లో కలెక్టర్‌కు మొరపెట్టుకున్నా – పల్లా అర్జునమ్మ, తురకలపూడి, బుచ్చెయ్యపేట మండలం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో మా మొర వినడం లేదు పలుమార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదు కార్యాలయాల చుట్టూ తిరగలేక చస్తున్నాం అర్జీదారుల ఆవేదన, అసహనం -
గొర్రెల మంద పంపకాల్లో వివాదం
కశింకోట: గొర్రెల మంద పంపకాల విషయమై ఇరువర్గాల మధ్య ఏర్పడిన వివాదంలో వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మండలంలోని ఉగ్గినపాలెంలో కలకలం రేపింది. సీఐ అల్లు స్వామినాయుడు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం... గొర్రెల మంద పంపకాల విషయమై గ్రామానికి చెందిన పక్కుర్తి అప్పలనాయుడు (65), కుమారుడు, అతని తమ్ముడుకు ఒమ్మి నూకరాజు, కుమారుడు ఒమ్మి శ్రీను మధ్య ఆదివారం వివాదం ఏర్పడింది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. దాంతో రాత్రి 9.30 గంటల సమయంలో కోపోద్రిక్తులైన నిందితులు నూకరాజు, శ్రీను అప్పలనాయుడుపై కర్రలతో దాడి చేశారు. కింద పడవేసి కాళ్లతో పొట్ట భాగంలో తొక్కుతూ తీవ్రంగా గాయపర్చారు. అయితే కొన ఊపిరితో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు అక్కడ వైద్యుడు ధ్రువీకరించారు. ఈ మేరకు అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయడానికి గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఉగ్గినపాలెంలో వృద్ధుడి దారుణ హత్య -
కొడుకు చూడలేదు.. పురుగుల మందు తాగి చచ్చిపోతా
అయ్యా.. నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను పెంచి పెద్ద చేస్తే, ఈ రోజు ఇంటి నుంచి బయటకు గెంటేస్తున్నాడు. నన్ను నానా చిత్రవధ చేస్తున్నాడు. వాడి నుంచి నాకు రక్షణ కల్పించాలని ఐదేళ్లుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా.. ఇప్పటికి ముగ్గురు ఎస్సైలు మారారు. నా సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ఈ రోజు న్యాయం చేయకపోతే చచ్చిపోదామని పురుగులు మందు డబ్బాతో కలెక్టరేట్‌కు వచ్చానని ఎస్.రాయవరం మండలం వేమగిరి గ్రామానికి చెందిన వృద్ధురాలు వై.సరోజమ్మ కన్నీరుమున్నీరైంది. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద పోలీసులు తనిఖీల్లో పురుగుల మందు డబ్బా గుర్తించి ఆమెను బయటకు తీసుకొచ్చి ఎస్.రాయవరం పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడికి పంపించారు. అయితే ఎస్.రాయవరం ఎస్సై కూడా న్యాయం చేయడం లేదని, కలెక్టర్ కళ్లెదుటే పురుగుల మందు తాగి చచ్చిపోతానంటూ వృద్ధురాలు రోదించింది. -
వడ్డాది టీడీపీ అధ్యక్షుడి ఎన్నికలో వర్గ విభేదాలు
బుచ్చెయ్యపేట : ఎమ్మెల్యే రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మధ్య వర్గ విభేదాల ప్రభావం ఇపుడు వడ్డాది టీడీపీ అధ్యక్షుడు పదవిపై పడింది. ఇటీవల గ్రామ టీడీపీ అధ్యక్షుని ఎన్నికల్లో భాగంగా గ్రామ టీడీపీ నాయకులు వడ్డాదిలో మీటింగ్ పెట్టారు. రెండేళ్లుగా టౌన్ అధ్యక్షుడిగా ఉన్న రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మేనల్లుడు దొండా నరేష్‌ను తిరిగి టౌన్ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అనంతరం కమిటీ మెంబర్లు తీర్మానం కాపీని మండల టీడీపీ గౌరవ అధ్యక్షుడు తమరాన దాసుకు, ఎమ్మెల్యే రాజుకు అందించారు. వడ్డాది టౌన్ అధ్యక్షుడిగా ఎన్నికై న నరేష్ ఎమ్మెల్యే రాజును కలిసి ఎన్నికై న విషయాన్ని తెలపగా ఎమ్మెల్యే అతనిని అభినందించారు. ఇదే పదవి నరేష్‌కు కాకుండా తాతయ్యబాబు బావమరిది గ్రామదేవత మోదకొండమ్మ ఆలయ కమిటీ చైర్మన్ దొండా గిరిబాబుకు ఇవ్వాలని మాజీ ఉప సర్పంచ్ సయ్యపురెడ్డి శ్రీనివాసరావు, మండల యాదవ సంఘం అధ్యక్షుడు శింగంపల్లి రమేష్, నాయకుడు శ్యామ్ తదితరులు తీర్మానం చేసి ఎమ్మెల్యే రాజును కలిసి దరఖాస్తు అందించారు. అప్పటికే నరేష్‌ను టౌన్ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించిన విషయం ఎమ్మెల్యేకు తెలిసినా ఆ విషయాన్ని రెండో వర్గానికి చెప్పకుండా వారి నుంచి దరఖాస్తు తీసుకోవడంపై పలువురు టీడీపీ నాయకులు ఆగ్రహం చెందుతున్నారు. స్వయాన తాతయ్యబాబు మేనల్లుడు దొండా నరేష్, బావమరిది దొండా గిరిబాబు వడ్డాది టౌన్ అధ్యక్షుడి పదవికి పోటీ పడడం వెనక ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరి బయట పడిందని అంటున్నారు. సోమవారం చోడవరంలో నియోజకవర్గ మినీ మహానాడు జరిగినా వడ్డాది టౌన్ అధ్యక్షుడి పేరు మాత్రం ఎమ్మెల్యే ప్రకటించలేదు. వేంకటేశ్వరస్వామి దేవస్ధానం మాజీ చైర్మన్ సయ్యపురెడ్డి మాధవరావు, కోవెల అప్పనదొర జిల్లా పరిషత్ హైస్కూల్ చైర్మన్ మేడివాడ రమణ, మాజీ వార్డుమెంబర్, తలారి శంకర్,నాయకులు ముత్యాల సూరిబాబు తదితరులు నరేష్‌నే వడ్డాది టౌన్ అధ్యక్షుడిగా నియమించాలని పట్టుబడగా, మరో వర్గం గిరిబాబుకి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యే రాజు ఎవరిని ఎంపిక చేస్తారోనని ఎదురు చూస్తున్నారు. -
ఏపీఐఐసీ భూముల్లో.. కూటమి గద్దలు
గ్రావెల్ దందాలో హోం మంత్రి అనుచరులు నియోజకవర్గంలో ఎక్కడైనా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిపితే సహించేది లేదని హోం మంత్రి అనిత ప్రకటించినప్పటికీ ఆమె ఆనుచరులుగా చెప్పుకుంటున్న వారే గ్రావెల్ దందాలకు పాల్పడటం గమనార్హం. నిత్యం వందలాది ట్రాక్టర్లపై తరలించి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. యథేచ్ఛగా గ్రావెల్, ఇసుక తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ మైనింగ్, ఏపీఐఐసీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులు చెబుతున్నారు. ఎవరైనా అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే హోం మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నారయి. బదిలీ చేయిస్తాం, అవసరమైతే భౌతిక దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించడం వల్లే అధికారులు కూటమి నాయకుల దందాను అరికట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై సీఐ కుమార స్వామి వద్ద ప్రస్తావించగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్లు రెవెన్యూ సిబ్బంది నుంచి ఫిర్యాదు వచ్చిందన్నారు. ట్రాక్టర్ల పట్టుకుని అప్పగించ లేదన్నారు. కొన్ని వాహనాల నంబర్లు, నంబర్లు లేని ట్రాక్టర్ల వివరాలు ఇచ్చారన్నారు. వాహనాలను తమకు అప్పగిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. నక్కపల్లి: సహజ వనరుల దోపిడీలో కూటమి నాయకులకు హద్దు అదుపు లేకుండా పోతోంది. పరిశ్రమల కోసం ఏపీఐఐసీ వారు సేకరించిన భూముల్లో గద్దల్లా వాలిపోయి జేసీబీలతో వేలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను తవ్వేస్తూ ట్రాక్టర్లపై తరలించి అమ్ముకుంటున్నారు. నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా ఒక్క ట్రాక్టర్ గ్రావెల్ తవ్వినా సరే సహించేది లేదని, దాడులు చేసి కేసులు నమోదు చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఇచ్చిన ఆదేశాలను వారు బేఖాతరు చేస్తున్నారు. మంత్రి ఆదేశాలను పక్కన పెట్టేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రావెల్ దందా కొనసాగిస్తున్నారు. అడ్డుకుంటున్న అధికారులను మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారు. పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీ వారు చందనాడ, అమలాపురం, రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, బోయపాడు తదితర గ్రామాల్లో ఐదు వేల ఎకరాలను సేకరించింది. నష్టపరిహారం, ప్యాకేజీ చెల్లింపు ప్రక్రియ పూర్తిచేసి భూములను స్వాధీనం చేసుకుంది. ఈ భూములను బల్క్‌డ్రగ్ పార్క్, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ల కోసం కేటాయించింది. పరిశ్రమలు స్థాపించే ప్రాంతాల్లో ఏపీఐఐసీ వారు మౌలిక సదుపాయాల కల్పించే పనులు ప్రారంభించారు. రోడ్లు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. పనులు చేసే సంస్థలకు గ్రావెల్, ఇసుక అవసరం ఉంది. దీంతో ఉపమాక, నీలకుండీలు, చందనాడ గ్రామాలకు చెందిన కొంతమంది టీడీపీ నాయకులు ఏపీఐఐసీ వారు సేకరించిన భూముల్లో కొండలు, ఇసుక దిబ్బల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతి లేకుండా జేసీబీలను ఏర్పాటు చేసి రాత్రి సమయాల్లో వేలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను తవ్వేస్తున్నారు. ఇలా తవ్విన గ్రావెల్‌ను నంబర్లు లేని ట్రాక్టర్లపై తరలించి సమీపంలో ఉన్న రసాయన పరిశ్రమలకు, ఇళ్లు, రోడ్లు నిర్మించే వారికి, మౌలిక సదుపాయాలు కల్పించే కాంట్రాక్టర్లకు విక్రయిస్తున్నారు. 15 రోజులుగా జరుగుతున్న ఈ దందా వెనుక మంత్రి అనుచరులమంటూ చెప్పుకు తిరిగే టీడీపీ నాయకుల అండదండలతోపాటు, వారికే చెందిన జేసీబీలు, ట్రాక్టర్లు ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది రెండు రోజు క్రితం రాత్రి సమయాల్లో దాడులు చేసి గ్రావెల్ తవ్వుతున్న జేసీబీలు, ట్రాక్టర్లను పట్టుకున్నారు. వాటి నంబర్లను నమోదు చేసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే రెవెన్యూ వారిచ్చిన నంబర్ల ఆధారంగా పట్టుబడ్డ వాహనాలను సీజ్ చేయడం కేసులు నమోదు చేయకుండా కొంతమంది కూటమి నాయకులు పైరవీలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. జేసీబీలతో రాత్రిపూట గ్రావెల్ తవ్వకాలు నంబర్లు లేని వాహనాల్లో అక్రమంగా తరలింపు హోం మంత్రి ఆదేశాలు బేఖాతరు పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన రెవెన్యూ వర్గాలు కేసులు నమోదు చేయకుండా కూటమి నేతల ప్రయత్నాలు ఏపీఐఐసీ భూముల్లో జేసీబీతో గ్రావెల్ తవ్వుతున్న దృశ్యం -
చక్కెర ఫ్యాక్టరీలను ఎపుడు తెరిపిస్తారు ఎంపీగారూ!
కోటవురట్ల : జిల్లాలో మూతపడిన నాలుగు చక్కెర కర్మాగారాలను ఎపుడు తెరిపిస్తారో ఎంపీ సీఎం రమేష్ ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.ఎస్.సత్యనారాయణరాజు ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీ సీఎం రమేష్ ఎన్నికల ముందు ఎన్నో హామీ లు కురిపించారని, అందు లో తాండవ, ఏటికొప్పాక, గోవాడ, తుంపాల చక్కెర కర్మాగారాలను తెరిపించి రైతుల జీవితాలలో వెలుగులు నింపుతామని కూటమి తరపున హామీ ఇచ్చారన్నారు. ప్రతి చిన్న విషయానికి ఎంతో హడావుడి చేసే ఎంపీ రమేష్ రైతుల కష్టాల పట్ల ఎందుకు స్పందించడంలేదో తెలపాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా సీఎం రమేష్ చక్కెర ఫ్యాక్టరీలను ఒక్కరోజు కూడా సందర్శించిన పాపాన పోలేదన్నారు. గోవాడ చక్కెర కర్మాగారంలో చెరకు రైతులు అనేక సమస్యలతో ఉక్కిరిబిక్కిరై రోడ్డెక్కి తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపినా ప్రభుత్వానికి పట్టలేదని విమర్శించారు. నాలుగు ఫ్యాక్టరీలను తెరిపించి చెరకుసాగులో అత్యధిక దిగుబడులు వచ్చేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. అధిక దిగుబడిని ఇచ్చే కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన చెరకు దవ్వను తెప్పించి ఇక్కడి రైతులకు సరఫరా చేయాలన్నారు. అంతేకాకుండా వరి, చెరకు పంటలను ప్రోత్సహించేలా ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణరాజు -
కేసు తేలేదాకా..అభివృద్ధి ఎలా..?
రాంబిల్లి(అచ్యుతాపురం): ఎవరో ఒక్కరు చేసిన ఫిర్యాదుకు నాలుగు గ్రామాల ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. తక్షణమే తమ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాలని, సాంకేతికంగా అవరోధంగా ఉన్న కోర్టు కేసులు పరిష్కరించాలని రాంబిల్లి మండలానికి చెందిన అప్పారాయుడిపాలెం, భోగాపురం ప్రజలు జిల్లా కలెక్టర్‌ను ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా సోమవారం కోరారు. వివరాలివి... టీడీపీ నేత నిర్వాకం వల్లే.. రాంబిల్లి మండలం పంచదార్ల పంచాయతీ పరిధిలో పంచదార్ల, ధారపాలెం, భోగాపురం, అప్పారాయుడిపాలెం ఉండేవి. ఆయా గ్రామాల ఓటర్ల సంఖ్య సుమారు 2,500. ఈ నాలుగు గ్రామాల్ని పరిపాలన సౌలభ్యం కోసం రెండు పంచాయతీలు చేయాలని నిర్ణయించారు. భౌగోళిక స్థితిగతులకు అనుగుణంగా పంచదార్ల,ఽ ధారపాలెం గ్రామాల్ని ఒక పంచాయితీగా, అప్పారాయుడిపాలెం, భోగాపురం గ్రామాల్ని ఒక పంచాయతీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించి గ్రామ సభలు నిర్వహించారు. అప్పారాయుడిపాలెం గ్రామం పంచదార్లకు 3 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆర్అండ్బీ శాఖ ధృవీకరించింది. గ్రామసభ ఆమోదాన్ని పరిగణిస్తూ అభ్యంతరాలుంటే పది రోజుల్లోగా ఫిర్యాదు చేయాలని పంచాయతీ విస్తరణాధికారి విభాగం సూచించింది. అయితే ఈ ప్రతిపాదనలు రుచించని వారు అప్పట్లో కోర్టుని ఆశ్రయించారు. దీనిలో టీడీపీ నేత హస్తముందనేది స్థానికుల ఆవేదన. దీంతో 2020 నుంచి నాలుగు గ్రామాల్లో ముఖ్య పంచాయతీకి పాలకులు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు నాలుగు గ్రామాలకు కలిపి సుమారు రూ. 56 లక్షలు ఆగిపోయాయి. రోడ్లు, మంచి నీటి సరఫరా, పారిశుధ్యం పడకేశాయి. నాలుగేళ్లు గడిచినా తమ గ్రామాల ఏర్పాటుకు సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉన్నందున ఎన్నికలు జరగలేదని, వెంటనే కోర్టు కేసుల్ని పరిష్కరించాలని ఆయా గ్రామాలకు చెందిన పలువురు జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్ఎస్ ద్వారా మొరపెట్టుకున్నారు. సందిగ్ధంలో నాలుగు గ్రామాలు 2020 తర్వాత జరగని స్థానిక ఎన్నికలు విడుదల కాని 15వ ఆర్థిక సంఘం నిధులు తమ సమస్య పరిష్కరించాలనిపీజీఆర్ఎస్లో కలెక్టర్‌కు వినతి -
ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 40 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల సమస్యలు సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలు, చీటింగ్, భూ సమస్యలపై అర్జీలు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, ఎస్ఐ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంఅనకాపల్లి టౌన్: జిల్లాలోని 19 కేంద్రాల్లో సోమవారం జరిగిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షకు 601 మంది విద్యార్థులకు గాను 411 మంది హాజరయ్యారని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో మూడు కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 65 మందికి గాను 50 మంది, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షకు 143 మందికిగాను 118 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తం 22 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశామని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. -
దళిత వాడలను పంచాయతీలు చేయాలి
నర్సీపట్నం: ప్రతి దళిత వాడను పంచాయతీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అంబేడ్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.వి.సునీల్ కుమార్ (ఐపీఎస్) పేర్కొన్నారు. మిషన్ సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త గుడబండి నాగేశ్వరరావు ఆర్థిక సహకారంతో నర్సీపట్నం మండలం ఓఎల్పురంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సునీల్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అడగటం లేదని, కొన్ని వందల ఏళ్లుగా అధికారానికి దూరంగా అణగదొక్కబడుతున్న జాతి కోసం దళిత వాడలను పంచాయతీలు చేయాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో వెయ్యి జనాభా దాటిన దళితవాడలు మూడు వేలు వరకు ఉన్నాయన్నారు. వీటిన్నింటిని పంచాయతీలు చేయాలన్నదే ప్రధాన డిమాండ్ అన్నారు. ఏటా బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.20 వేల కోట్లు చూపిస్తున్నారన్నారు. ఈ నిధుల్లో రూ.6 వేల కోట్లు ఇస్తే దళితవాడ పంచాయతీకి రూ.2 కోట్లు వస్తుందన్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా అణిచి వేయబడి అధికారానికి దూరంగా ఉన్న జాతికోసం బాధపడాలన్నారు. అనంతరం విగ్రహ దాత నాగేశ్వరరావును సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, ఏఐఎం రాష్ట్ర నాయకుడు శ్రీను, డీసీసీ అధ్యక్షుడు మీసాల సుబ్బన్న, గ్రామ సర్పంచ్ బంటు నాగరాజు, మాల కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మరిడియ్య, జనసేన నాయకులు అద్దెపల్లి గణేష్, భూసి వెంకటరావు, దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు చిట్ల చలపతిరావు, పెదపూడి ప్రభుదాసు, ఉపాధ్యాయుడు ఊడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సునీల్ కుమార్ -
కూటమిలోడిప్యూటీ చిచ్చు
● జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయింపుపైససేమిరా అంటున్న టీడీపీ నేతలు ● 22 రోజుల క్రితం ఉన్న ఐక్యత ‘కౌన్సిల్ సాక్షిగా’ భగ్నం ● కూటమి పార్టీల్లో బయటపడ్డ లుకలుకలు డాబాగార్డెన్స్ (విశాఖ): ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవనేది నానుడి. దీనికి తగ్గట్టుగానే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ, జనసేన మధ్య చిచ్చురేపింది. మొన్నటి మేయర్ ఎన్నిక వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇరుపార్టీల నేతల్లో అసహనం వ్యక్తమైంది. ఇన్నాళ్లూ కూటమి పార్టీలంతా ఒక్కటేనని బయటకు చెబుతున్నా.. ఈ ఎన్నిక సందర్భంగా లుకలుకలు బయటపడ్డాయి. సంఖ్యాబలం ఉండి కూడా కోరం లేక సమావేశం వాయిదా పడిందంటే.. ఐక్యత ఎంత మేర ఉందో అర్థమవుతోంది. మేయర్‌గా పీలా శ్రీనివాసరావును కూటమి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సమయంలోనే డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. టీడీపీ ఆశావాహులు మాత్రం గత వారం రోజులుగా ఈ పదవి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఎవరికి వారు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ తనకే పదవి వచ్చేలా చూడాలంటూ శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అయితే జనసేన పార్టీకే డిప్యూటీ మేయర్ పదవి కేటాయించారు. ఆ పార్టీకి చెందిన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డికి ఆ పార్టీ నేతలు బీ ఫారం అందజేశారు. కారాలు మిరియాలు జనసేనకు చెందిన దల్లి గోవిందరెడ్డికి బీ ఫారం ఇవ్వడంతో టీడీపీ కార్పొరేటర్లు జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికకు వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించారు. మంగళవారం ఉదయం నగరంలోని ఓ హోటల్లో భేటీ అయిన టీడీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. హోటల్ నుంచి ఓ వర్గం టీడీపీ కార్పొరేటర్లు వేరే చోటికి వెళ్లిపోయారు. ఓ వర్గం టీడీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరైనా.. కోరానికి సరిపడా సభ్యులు లేకపోవడంతో జనసేన ఆశలు ఆవిరైనట్టయింది. దీంతో ఇరు పార్టీల నేతలు కారాలు మిరియాలు నూరుకున్నారు. జంప్ జిలానీలు డీలా..స్వార్థ రాజకీయాలు, డబ్బు లకు అమ్ముడుపోయి వైఎస్సార్ సీపీ నుంచి జనసేనలో చేరిన కార్పొరేటర్లు, ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు వారు ఆశించినట్టు సాగకపోవడంతో తెల్ల మొహాలు వేసినట్టయింది. ఎందుకు పార్టీని వీడామని మధనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే ఎంత తేడా..! గత నెల 28న మేయర్ ఎన్నిక నిర్వహించారు. కుట్రలు, కుతంత్రాలతో నిర్వహించిన ఎన్నికలో పీలా శ్రీనివాస్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 22 రోజుల తర్వాత నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి పార్టీల్లో లుకలుకలు బయటపడ్డాయి. కేవలం అధికారం కోసం ఏర్పడిన పొత్తు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు. దల్లిపై ఎన్ని ఫిర్యాదులో.. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటీవలే వైఎస్సార్ సీపీ నుంచి జనసేనలో చేరిన పలువురు కార్పొరేటర్లు.. తొలి నుంచి జనసేన పార్టీలో ఉన్న దల్లి గోవిందరెడ్డిపై అధిష్టానానికి పలు ఫిర్యాదులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దల్లి గోవిందరెడ్డి గుట్కా వ్యాపారితో అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారంటూ ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. అవి అవాస్తవమని తెలియడంతో పార్టీ అధిష్టానం దల్లి గోవిందరెడ్డికే డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపింది. బీ ఫారం అందజేయడంతో ఆ పార్టీలో చేరిన వారంతా కంగుతిన్నట్టయింది. టీడీపీలో ముసలం పెట్టిందే వీరే.. డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు ముసలం పెట్టారని ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు బాహాటంగా అంటున్నారు. మేయర్ గంధం శ్రీనివాస్‌కు, వెలగపూడి యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ మంగవేణికి, గంటా భీమిలి నియోజకవర్గం యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ మొల్లి హేమలతకు హామీ ఇచ్చి వారిలో ఆశలు రేకెత్తించారనే ఆరోపణలు భగ్గుమంటున్నాయి. -
‘అన్నదాత’కు ఆపసోపాలు
కశింకోట: అన్నదాత సుఖీభవ పథకంలో నమోదు చేసుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భూముల రీ–సర్వేలో కొందరి ఆధార్, సెల్ నంబర్ తదితర వివరాలను నమోదు చేయపోవడం, మరికొందరికి తప్పుగా నమోదు చేయడం, భూముల వివరాలు, పేర్లలో తప్పులు చోటు చేసుకోవడం రైతులను కష్టాల పాలు చేస్తోంది. తప్పులు సరిచేసుకోవడం రైతుల బాధ్యతని అధికారులు చెబుతుండడంతో వ్యవసాయ, తహసీల్దార్ కార్యాలయాలు, సచివాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పని ఒత్తిడి పేరుతో అధికారులు, సిబ్బంది రైతుల పట్ల అసహనం వ్యక్తం చేస్తుండడంతో పాటు సకాలంలో పనులు జరగక నానా అవస్థలు పడుతున్నారు. పథకంలో చేరేందుకు ఈ నెల 20వ తేదీ ఆఖరు రోజు. గడువు నేటితో ముగుస్తున్నా సుఖీభవ పథకంలో నమోదైన వారి సంఖ్య జిల్లాలో 25 శాతం కూడా లేదు. కొత్త జాబితా తయారీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 అందించే వారు. ఈ పథకం స్థానంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టి కూటమి ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికకు వివరాల సేకరణ చేపట్టింది. ప్రభుత్వ సిబ్బంది సుఖీభవ పథకానికి అర్హులను గుర్తించడానికి రైతుల నుంచి డేటా సేకరిస్తున్నారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న జాబితా ఆధారంగా రైతుల పట్టాదారు పాసు పుస్తకం నకలు, లేదా 1బి, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్లను సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా రైతుల జాబితాలో ఉన్న మేరకు రికార్డులను సరిపోల్చి మరో జాబితాను తయారు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఆధార్ కార్డు నంబర్, సెల్ ఫోన్ నంబర్లు రీ–సర్వే రికార్డులకు అనుసంధానం కాకపోవడం, రైతుల పేర్లు తప్పుగా నమోదు కావడంతో సుఖీభవ పథకం నమోదుకు రైతు సేవా కేంద్రాల్లో తిరస్కరిస్తున్నారు. రికార్డులను సవరించుకోవాలని తహసీల్దార్, వీఆర్వోల వద్దకు పంపుతున్నారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడానికే ఈ క్లిష్టమైన ప్రక్రియను ప్రవేశపెట్టారని రైతులు ఆందోళన చెందుతున్నారు. 50 వేల మంది మాత్రమే నమోదు గతంలో రైతు భరోసా కింద జిల్లాలో 2.30 లక్షల మంది వరకు లబ్ధి పొందారు. వీరిలో ఇప్పటి వరకు 50 వేలు పైబడి మాత్రమే నమోదు అయినట్లు అధికారిక సమాచారం. ఇంకా కౌలు రైతులకు కౌలుదారి కార్డులు ఇవ్వలేదు. వారిని కూడా నమోదు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నమోదు గడువు పొడిగించగలరని అధికారులు పేర్కొంటున్నారు. రికార్డులు సవ్యంగా ఉన్న జాబితాను విజయవాడ కమిషనర్‌కు ఆన్లైన్లో నివేదిస్తే దాన్ని పరిశీలించి అక్కడ తుది జాబితాను రూపొందించి రైతు సేవా కేంద్రాలకు పంపుతారని, దీంతో అర్హుల ఫేషియల్‌తో ఈకేవైసీ చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇది జరగడానికి సమయం కూడా ఎక్కువ పడుతుందని, వచ్చే నెలలో ఈ ప్రక్రియ పూర్తి కాగలదంటున్నారు. భూముల రీ–సర్వే పరిగణన అన్నదాత సుఖీభవ పథకానికి భూముల రీ–సర్వే డేటాను పరిగణనలోకి తీసుకుంటున్నారు. జిల్లాలో 64 శాతం గ్రామాల్లో రీ– సర్వే పూర్తయిందని సమాచారం. రీ–సర్వే జరగని గ్రామాల్లో మాత్రం పాత పట్టాదారు పాసు పుస్తకాల డేటాను ఆధారంగా తీసుకుని పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. రీ–సర్వేలో భూముల విభజన, పంపకాలు జరగడం వల్ల న్యాయంగా లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సి ఉంది. రీ సర్వే భూ పత్రాల్లో ఆధార్, సెల్ నంబర్లు నమోదులో నిర్లక్ష్యం ఇది రైతుల బాధ్యత అంటున్న అధికారులు అన్నదాత సుఖీభవ నమోదుకు తిరస్కరణ దరఖాస్తుకు నేడు ఆఖరి రోజు 25 శాతం కూడా లేని నమోదు రికార్డుల సవరణకు రెవెన్యూ, సచివాలయ, వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది భూమి వివరాలతో ఆధార్ సంఖ్య అనుసంధానం కాలేదు. దీంతో అన్నదాత సుఖీభవ పథకంలో నమోదుకు వ్యవసాయ శాఖ సిబ్బంది తిరస్కరించారు. సచివాలయం, తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి సవరించుకోవాలని సూచించారు. సచివాలయం, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చింది. రీ–సర్వే సమయంలో ఆధార్ సంఖ్య నమోదు చేయకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నాం. – ముక్కా సత్తిబాబు, రైతు, వెదురుపర్తి గ్రామం 25 శాతం రైతుల రికార్డులు సరిపోల్చాం అన్నదాత సుఖీభవ పథకానికి జిల్లాలో 25 శాతం మంది రైతుల రికార్డులను సరిపోల్చాం. ఇంకా 75 శాతం వరకు రికార్డులు సరిపోల్చాల్సి ఉంది. దీనివల్ల పథకానికి నమోదుకు గడువు పెరగగలదు. ఆధార్, సెల్‌ఫోన్ నంబర్లు అనుసంధానం కాకపోవడం, పేర్లు తప్పులు పడటం తదితర వాటిని సవరించేందుకు తహసీల్దార్, వీఆర్వోల వద్దకు సిఫారసు చేస్తున్నాం. కౌలు రైతులకు ఈ పథకం వర్తింపునకు ఇంకా కార్డులు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో 2.30 లక్షల మంది వరకు ఈ పథకానికి లబ్ధిదారులు ఉంటారని అంచనా. – బి.మోహనరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, అనకాపల్లి -
వైస్ ఎంపీపీలు ఏకగ్రీవం
వైఎస్సార్సీపీ కై వసం దేవరాపల్లిలో పంచాడ సింహాచలంనాయుడు.. దేవరాపల్లి: వైస్ ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి మామిడిపల్లి ఎంపీటీసీ సభ్యుడు పంచాడ సింహాచలంనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఎస్.మంజులవాణి సమక్షంలో వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా జరిగింది. మండలంలోని 17 ఎంపీటీసీలకు గాను 12 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. సింహాచలంనాయుడు పేరునును ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి ప్రతిపాదించగా, ఎం.అలమండ ఎంపీటీసీ పోతల వెంకటరావు బలపరిచారు. ఎంపీటీసీలు సింహాచలంనాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. మాడుగులలో విజయలక్ష్మి.. మాడుగుల: స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం వైస్ ఎంపీపీ–1 ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 21 మంది ఎంపీటీసీలకు గాను 15 మంది ఎన్నికలో పాల్గొన్నారు. మాడుగుల ఒకటవ సిగ్మెంట్లో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీగా కొనసాగుతున్న పొలిమేర విజయలక్ష్మిని 15 మంది ఎంపీటీసీలు చేతులెత్తి వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ప్రిసైడింగ్ అధికారి కె.వీరన్ననాయుడు నియామక పత్రం అందజేసి విజయలక్ష్మి చేత రిజిస్టర్లో సంతకం చేయించి, ప్రమాణ స్వీకారం చేయించారు. -
దొంగ నోట్ల ఉచ్చులో వ్యాపారులు
నర్సీపట్నం: దొంగ నోట్లు కలకలం రేపుతున్నాయి. చిరు వ్యాపారులు తెలియక తీసుకుని తరువాత లబోదిబోమంటున్నారు. మూడు రోజుల కిందట పెద్ద బొడ్డేపల్లి ఆర్డీవో బంగ్లాకు సమీపంలోని పండ్ల దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తి రూ.500 నకిలీ నోటుతో పండ్లు కొనుగోలు చేశాడు. ఆ వ్యాపారి బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లగా ఆ నోటు నకిలీదిగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు. ● తాజా సోమవారం మున్సిపాలిటీ కొత్తవీధిలో నివాసం ఉంటూ కొత్తకోటలో ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్న సాంబశివ దొంగ నోట్లతో ఉన్న సంచిని నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సాంబశివ తన భార్యను ఊరు పంపించేందుకు బైక్ పై నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు తీసుకొచ్చారు. బస్సెక్కించి వచ్చే సరికి బైక్‌పై సంచి ఉంది. అందులో పాత జీన్ ప్యాంటు, ఒక షర్ట్‌తో పాటు రెండు కొత్త రూ.500 నకిలీ నోట్ల కట్టలు ఉన్నాయి. కంగారు పడిన టీచర్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన సూచన మేరకు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో నోట్ల కట్టలతో కూడిన సంచిని అప్పగించారు. ఇవి అమెజాన్ చిల్ట్రన్ బ్యాంక్ నుంచి రప్పించినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ.1000 అసలు నోట్లు చెల్లిస్తే పదివేల రూపాయలు 500 నోట్ల కట్లను పంపిస్తున్నారు. ఒక్కోసారి ఈ నకిలీ 500 నోట్ల కట్టలకు ఆఫర్స్ పెడుతున్నారు. ఒకప్పుడు మిషన్ల ద్వారా దొంగ నోట్లు ప్రింటింగ్ చేసి చలామణి చేసేవారు. ఇప్పుడు అమెజాన్ నోట్లు.. దొంగ నోట్ల చలామణి చేసే వ్యక్తులకు ఒక వరంగా మారాయి. చిల్ట్రన్ బ్యాంక్ పేరుతో కార్పొరేట్ దిగ్గజ కంపెనీ అమెజాన్ ద్వారా పంపిణీ అవుతున్న 500 నోట్ల కట్టల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొద్ది రోజుల క్రితమే నర్సీపట్నం పోలీసు స్టేషన్లో రైస్ పుల్లింగ్ కేసులో 10 లక్షల అమెజాన్ చిల్ట్రన్ బ్యాంక్‌కు చెందిన దొంగ నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. ఇటీవల నర్సీపట్నం దుకాణాల వద్ద కూడా ఈ నకిలీ 500 నోట్లు వెలుగు చూశాయి. అసలు, నకిలీ నోట్లకు తేడా తెలియని చిరు వ్యాపారులు మోసపోతున్నారు. మూడు రోజుల కిందట పెద్ద బొడ్డేపల్లిలో వెలుగులోకి.. తాజాగా దొంగ నోట్లను పోలీస్ స్టేషన్లో అప్పగించిన ఓ టీచర్ -
జనసేనకు టీడీపీ జెల్ల
● పొత్తు ధర్మం విస్మరించి ఎన్నికకు డుమ్మా కొట్టిన పలువురు టీడీపీ కార్పొరేటర్లు ● ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే కూడా గైర్హాజరు ● కోరంకు 56 మంది అవసరం కాగా 54 మంది హాజరు ● నేటికి ఎన్నిక వాయిదా వేస్తూ ఎన్నికల అధికారి ప్రకటన డాబాగార్డెన్స్ (విశాఖ): జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికలో జనసేనకు మిత్రపక్షమైన టీడీపీ జెల్ల కొట్టింది. పొత్తు ధర్మం మరిచి డిప్యూటీ మేయర్ కుర్చీ కోసం కుయుక్తులు పన్నింది. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించగా.. సోమవారం జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి పలువురు టీడీపీ ఆశావాహులు డుమ్మా కొట్టారు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ మంగళవారం నాటికి సమావేశం వాయిదా వేశారు. ముందస్తు సమాచారం మేరకు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభం కావల్సి ఉంది. ఆ సమయానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఆ పార్టీ కార్పొరేటర్ కవితతోపాటు సీపీఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, సీపీఐ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ హాజరయ్యారు. 11.10 గంటలకు జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్‌బాబు కౌన్సిల్‌కు వచ్చారు. 11.15 గంటలకు జనసేనకు చెందిన 14 మంది కార్పొరేటర్లు సమావేశ మందిరానికి చేరుకున్నారు. 11.20 గంటలకు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వచ్చారు. 11.30 గంటలకు కాకి గోవిందరెడ్డి మినహా టీడీపీ కార్పొరేటర్లు ఎవరూ హాజరు కాలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్ 11.40 గంటలకు కౌన్సిల్ హాల్లోకి అడుగుపెట్టారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ 11.53 గంటలకు సమావేశానికి హాజరయ్యారు. వచ్చిన వెంటనే ఎంత మంది సభ్యులు వచ్చారో లెక్కించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికకు 56 మంది అవసరం కాగా 54 మందే హాజరయ్యారని.. కోరం తగ్గట్టు సభ్యులు లేరని గుర్తించారు. దీంతో సమావేశాన్ని మంగళవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
నా కొడుకును చంపేశారు..
● రోడ్డు ప్రమాదమంటున్నారు ● కలెక్టరమ్మ న్యాయం చేయాలి ● పీజీఆర్ఎస్లో వృద్ధుడి ని‘వేదన’ తుమ్మపాల: రాజకీయ ప్రలోభాలతో హత్యకు గురైన తన కుమారుడి మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి కేసు నీరుగార్చుతున్నారని నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామానికి చెందిన బండారు మహలక్ష్మి వాపోయారు. ఈ కేసు దర్యాప్తును రీ ఓపెన్ చేయమని పోలీసులను ఆదేశించాలని కలెక్టర్ విజయ కృష్ణన్‌కు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తప్పుగా నమోదు చేసిన క్రైం నంబరు 5/2025ను రీఓపెన్ చేసి హత్య కోణంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు. ఈ ఏడాది జనవరి 11న రాత్రి 11 గంటల సమయంలో శరీరంపై అనేక గాయాలతో రక్తపు మడుగులో తన కుమారుడు బండారు అప్పన్న కనిపించాడని, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ అధికారులు హత్య అని చెప్పారని పేర్కొన్నారు. హంతకులను గుర్తించి జైలుకు పంపిస్తామని చెప్పిన పోలీసులు నేటికీ దర్యాప్తులో పురోగతి సాధించలేదన్నారు. ఎవరినీ అరెస్టు చేయకపోవడంతో పోలీసులను సంప్రదించగా, మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి గురై తన కుమారుడు మరణించినట్లు తానే స్టేట్మెంట్ ఇచ్చినట్లు పోలీసులు రాశారని తెలిపారు. తన కుమారుడికి మద్యం అలవాటు లేదని, హత్య జరిగిందని స్పష్టంగా చెప్పినా పోలీసులు తప్పుడు స్టేట్మెంట్ రాయడంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఐదు నెలలుగా కేసును నీరుగార్చి గాలికొదిలేశారని, ఈ హత్య వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందన్నారు. తక్షణమే కేసును రీ ఓపెన్ చేసి తన కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్‌ను ఆయన కోరారు. త్వరితగతిన లక్ష్యాలు పూర్తి చేయండి: కలెక్టర్ తుమ్మపాల: వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో ఆమె సోమవా రం సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సర్వే, సంపద తయారీ కేంద్రాలు, డ్వామా, హౌసింగ్, సూర్యఘర్, పంచాయతీ రాజ్‌లో పలు అంశాల పురోగతిపై ఆమె మాట్లాడారు. వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. బోర్ల మరమ్మతులకు అవసరమైన విడిభాగాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న వర్క్ ఫ్రం హోమ్, మనమిత్ర సేవలు, పిల్లల ఆధార్ నమోదు, ఈకేవైసీ వంటి సర్వేలను తక్షణం పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోనికి తీసుకురావాలన్నారు. పన్నుల వసూలు రెండు రోజు ల్లో పూర్తి చేయాలన్నారు. ఫారం ఫాండ్స్, పశువుల నీటి తొట్టెల నిర్మాణం తక్షణం చేపట్టాలన్నారు. ఉద్యాన శాఖ ద్వారా మొక్కల పెంపకానికి భూమిని గుర్తించాలన్నారు. -
చౌడువాడలో ‘బీట్ ది హీట్’ కార్యక్రమం
కె.కోటపాడు : స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బీట్ ది హీట్ ప్రోగ్రాం నిర్వహించారు. చౌడువాడ పీహెచ్సీ ఆధ్వర్యంలో సచివాలయం వద్ద వైద్య శిబిరం నిర్వహించారు. పీహెచ్సీ ఆవరణలో కమ్యూనిటీ సోప్ పిట్‌కు శంకుస్థాపన చేశారు. పక్షులు నీరు తాగడానికి, ఆహారం అందించడానికి ప్రత్యేకంగా తయారు చేసిన పరికరాన్ని డ్వామా పీడీ పూర్ణిమాదేవి ప్రారంభించారు. గ్రామంలో 20 మందికి పక్షులకు నీళ్లు పెట్టడానికి మట్టి పాత్రలు పంపిణీ చేఽశారు. గ్రామ పరిశుధ్య సిబ్బందిని సత్కరించి బియ్యంతో పాటు కిరాణా సామాగ్రిని అందజేశారు. సర్పంచ్ చలివేంద్రం ప్రారంభించి మజ్జిగను ఉచితంగా అందజేశారు. ఎంపీపీ సూర్యనారాయణ,ఎంపీడీవో సాంబశివరావు, తహసీల్దార్ రమేష్‌బాబు, డిప్యుటీ ఎంపీడీవో రమణి, సర్పంచ్ ఎరువునాయడు, ఎంపీటీసీ అప్పలరాజు, పంచాయతీకార్యదర్శి సురేష్‌బాబు, గుమస్తా అప్పారావు పాల్గొన్నారు. -
ఉపాధి నిధులతో సమృద్ధిగా పనులు
నాతవరం : ఉపాధి హామీ పథకంలో ఉపాధితో పాటు అనేక అభివృద్ధి పనులు చేసుకోవచ్చునని మండల ప్రత్యేకాధికారి నాగశిరీష అన్నారు. మండలంలో శనివారం స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా మర్రిపాలెం పంచాయతీ శివారు పొట్టిపాలెం గిరిజన గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన కంపోస్టు గుంతలను ప్రారంభించారు. పచ్చదనం పర్యవరణంలో భాగంగా మొక్కలు నాటారు. ఉపాధి హామీ పథకంలో ఈ గ్రామంలో రైతులు కూలీలు చేస్తున్న కంపోస్టు గుంతలను స్వయంగా పరిశీలించి కూలీలతో మాట్లాడారు. పొట్టిపాలెం గ్రామంలో రైతులకు కూలీలకు ఉపయోగపడే పనులకు గ్రామసభలో తీర్మానం చేసి అమలు చేసే బాధ్యత తీసుకోవాలని ఏపీవోకు సూచించారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరమణ, ఏపీవో దాసరి కొండాజీ, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కె.సత్యనారాయణ, డి.యర్రవరం సర్పంచ్ సత్యవతి, వెర్రిగెడ్డ రిజర్వాయరు కమిటి చైర్మన్ స్వామినాయుడు, మర్రిపాలెం పెద్ద చెరువు నీటి సంఘం చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
మొక్కల పెంపకం అందరి బాధ్యత
జాతీయ జెండాలతో ర్యాలీ చోడవరం: భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తూ చోడవరంలో అన్నివర్గాల ప్రజలు మెయిన్‌రోడ్డుపై శనివారం జాతీయజెండాలు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో భారత సైన్యం చేస్తున్న ఎటువంటి యుద్ధానికై నా ప్రజల మద్దతు పూర్తిగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు అన్నారు. కె.కోటపాడు : మొక్కలను ప్రతి ఒక్కరూ నాటి పెంచడాన్ని బాధ్యతగా గుర్తించాలని వారాడ సర్పంచ్ గొర్రుపోటు సౌజన్య అన్నారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం హీట్ ది బీట్ కార్యక్రమాన్ని జరిపారు. ఉపాధి కూలీలతో కలిసి గ్రామంలో మొక్కలను నాటారు. పంచాయతీ కార్యదర్శి బి.సరోజిని మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా మంచినీటిని ఎక్కువగా తీసుకోవాల కోరారు.వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపాలిటీ వైసీపీలో క్రియాశీలక కార్యకర్తగా వ్యవహరిస్తున్న శశి శనివారం మృతి చెందాడు. ఆనారోగ్యం బారిన పడడంతో రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యం పొందుతూ మృతి చెందారు. శశి అకాల మరణాన్ని పార్టీ శ్రేణులు, జీర్ణించుకోలేకపోతున్నారు. -
లైటరైట్ అనుమతులు రద్దు చేయాలి
నాతవరం : లేటరైట్ తవ్వకాల వల్ల గిరిజనులకు అన్ని విధాలుగా నష్టం జరుగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు పేర్కొన్నారు. సుందరకోట పంచాయతీ శివారు బమిడికలోద్దు ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలు జరిపి లారీలపై తరలిస్తున్న రోడ్డు మార్గాన్ని శనివారం సీపీఐ బృందం సందర్శించారు. కాకినాడ జిల్లా రవతలపూడి మండలం తూళ్లూరు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన లేటరైట్ మట్టిని నిల్వ చేసే యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. లేటరైట్ తవ్వకాలను సీపీఐ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. లేటరైట్ ఇతర మైనింగ్ తవ్వకాల కారణంగా చుట్టుపక్కల గిరిజన గ్రామాలు పూర్తిగా నాశనమౌవుతాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి లేటరైట్ అనుమతులు రద్దు చేసి తవ్వకాలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ప్రాంత గిరిజనులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, జిల్లా నాయుకులు గురుబాబు, క్రాంతి, నాతవరం మండలం సీపీఐ కార్యదర్శి చిన్నయ్యనాయుడు, అప్పారావు, సత్తిబాబు పాల్గొన్నారు. మైనింగ్ మాఫియాకు అధికారులు దాసోహం నర్సీపట్నం : లేటరైట్ తవ్వకాల్లో అడుగడుగునా అక్రమాలు జరుగుతున్నాయని, మైనింగ్ మాఫియాకు అధికారులు దాసోహమయ్యారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ నాతవరం మండలం, సరుగుడు ప్రాంతంలో లేటరైట్ తవ్వకాల్లో అడుగడుగునా అవినీతి చోటు చేసుకుందన్నారు. విచ్చలవిడిగా లేటరైట్ తవ్వకాలపై మైనింగ్ అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్నారు. బమిడికలొద్ది గ్రామంలోని జర్తా లక్ష్మణ్‌రావు పేరున ఉన్న 121 హెక్టార్లలో అనేక అక్రమాలు జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడలేదన్నారు. లేటరైట్ రవాణా వాహనాల్లో తప్పనిసరిగా జీపీఎస్ పరికరాలు అమర్చాల్సి ఉందన్నారు. సుస్థిర అభివృద్ధి చట్టం(2016) ప్రకారం గనిలో వేంబ్రిడ్జి ఉండాలన్నారు. ఎంఎండీఆర్ చట్టం 1957 సెక్షన్ 21(4) చట్టబద్దమైన పర్మిట్ లేకుండా మినరల్స్ రవాణా చేయడం నిషేధమన్నారు. లేటరైట్ అక్రమ తవ్వకాలకు సహకరిస్తున్న అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మజ్జిగ చలివేంద్రం ప్రారంభం
మాడుగుల : స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పంచాయతీ వారు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ కళావతి, మాజీ సర్పంచ్ సూర్యారావు, ఉపసర్పంచ్ వరహాలు, మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పలరాజు ఎంపీడీవో అప్పారావు పాల్గొన్నారు. జిల్లా స్థాయి భజన పోటీలు మాడుగుల రూరల్ : కేజేపురం జంక్షన్లో కల్యాణ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా ఈనెల 31న పెళ్లిరాట కార్యక్రమం నిర్వహిస్తారు. వచ్చే నెల 5న పుట్ట మట్టితో పూజలు, 6న కల్యాణోత్సవం, జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు. ఉపాధి పనుల్లో నాణ్యత పాటించాలి రోలుగుంట : పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రభుత్వం ఇస్తున్న పూర్తి కూలి పొందాలని ఉపాధి కూలీలకు మండల ప్రత్యేకాధికారి మనోహర్ సూచించారు. మండలంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా పలు గ్రామాల్లో జరుగుతన్న ఉపాధి పనులను ఆయన ఎంపీడీవో వి.ఎస్.నాగేశ్వరరావుతో కలిసి సందర్శించారు. ‘రైతులందరికీ అన్నదాత సుఖీభవ’ నర్సీపట్నం: అర్హత కలిగిన రైతులందరికీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సహాయం కింద అందజేస్తుందని నర్సీపట్నం వ్యవసాయశాఖ ఏడీఏ శ్రీదేవి తెలిపారు. వెబ్‌ల్యాండ్ ఆర్‌ఓఎఫ్‌ఆర్‌లో ఉన్న రైతుల వివరాలను రైతు సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. రైతులు తమ భూమి ఉన్న గ్రామంలో రైతు సేవ కేంద్రాన్ని సంప్రదించి వీలైనంత తొందరగా వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ప్రకృతి సేద్యంపై దృష్టి సారించండి మాకవరపాలెం : ప్రకృతి సేద్యంపై రైతులు దృష్టి సారించాలని, ఈ విధానాన్ని ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోందని మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్రావు సూచించారు. గిడుతూరులో శనివారం రైతులతో వ్యవసాయ, ప్రకృతి సేద్య అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం రైతులతో ర్యాలీ నిర్వహించి, నవధాన్య విత్తనాలను పంపిణీ చేశారు. మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యత -
పరారీలో ఉన్న నిందితులను పట్టుకోండి
యలమంచిలి రూరల్ : వివిధ కేసుల్లో న్యాయస్థానాలు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితులను పట్టుకుని,న్యాయస్థానాల ఎదుట హాజరుపర్చాలని జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశించారు. శనివారం ఆయన యలమంచిలి సర్కిల్ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించి ఛార్జిషీట్లను దాఖలు చేయాలన్నారు. రౌడీషేటర్లు, నేరచరిత్ర, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నిలిపి ఉంచకుండా పర్యవేక్షించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, బాలికల రక్షణకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి యాప్‌ను ఎక్కువమంది ఉపయోగించేలా చైతన్యం తీసుకురావాలన్నారు. అంతకుముందు తనిఖీకి వచ్చిన ఎస్పీకి పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్, యలమంచిలి సీఐ ధనుంజయరావు, ఎస్ఐలు సాదరస్వాగతం పలికారు. ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, యలమంచిలి రూరల్, యలమంచిలి పట్టణం, మునగపాక, యలమంచిలి ట్రాఫిక్ ఎస్ఐలు ఎం. ఉపేంద్ర, కె.సావిత్రి, ప్రసాద్, బి. రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ తుహిన్‌సిన్హా యలమంచిలి సీఐ కార్యాలయం సందర్శన -
ఉద్యోగాలు లేక మత్స్యవేటకు...
పరిశ్రమల వ్యర్థ రసాయనాల కారణంగా సముద్రం కాలుష్యం అవడంతో మత్స్య సంపద కోల్పోతున్నాం. యువకులకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించకపోవడంతో, అలవాటు లేని యువకులు కొంత మంది జీవనోపాధి కోసం మత్స్య వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకోగా, పిల్లలు స్థిరపడలేకపోవడం వారిని ఎంతో బాధిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టి మత్స్యకార యువకులకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతున్నాను. –ఉమ్మిడి జగన్, పూడిమడక మత్స్యకార నాయకుడు -
పెద్దేరు కాలువ వద్ద తప్పిన ప్రమాదం
బుచ్చెయ్యపేట : మేజర్ పంచాయతీ వడ్డాదిలో ప్రమాదం తప్పింది. శనివారం వడ్డాది ఎస్సీ కాలనీ నుంచి పెద్దేరు నది సిమెంట్ రోడ్డు మీదగా జంక్షన్‌కు వస్తున్న కారు అదుపు తప్పింది. శివాలయం, సచివాలయానికి వెళ్లే దారి మళ్లింపులో కారు వెనక చక్రం సిమెంటు రోడ్డు అంచు దిగి పెద్దేరు కాలువలోకి ఒరిగింది. ఏ మాత్రం కారు అదుపు తప్పిన పెద్దేరు కస్పా కాలువలోకి కారు పడిపోయి ప్రమాదం జరిగేది. స్థానికులు కారును లేపి సిమెంట్ రోడ్డుపై పెట్టడంతో ప్రమాదం తప్పింది. ఇరుకు రోడ్డులో కార్లు ఇతర వాహనాలు రాకుండా పంచాయతీ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య
ఎస్.రాయవరం : గ్రామదేవత పండక్కి తన భర్త అత్తవారింటికి రాలేదని మనస్థాపంతో ధోని మాధవి (25) పుట్టింట్లో ఫ్యానుకు ఉరి బిగించుకుని శనివారం మృతి చెందింది. ఎస్ఐ విభీషణరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తరేవుపోలవరం గ్రామానికి చెందిన ధోని మాధవికి అదే గ్రామానికి చెందిన నాగార్జునతో 7 నెలల క్రితం వివాహం జరిగింది. ఇటీవల మంగళవారం గ్రామంలో బంగారమ్మతల్లి జాతర జరిగింది. ఆ రోజున భర్త నాగార్జునను ఆహ్వానించగా పండక్కి రాలేదు. అప్పటినుంచి మనస్థాపానికి గురైన మాధవి శనివారం పుట్టింట్లో ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చున్నీతో ఉరి బిగించుకుని మృతి చెందింది. భార్యభర్తల మధ్య ఎటువంఇ వివాదాలు లేవని, అన్యోన్యంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారని చెప్పారు. వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
బీసీ ప్రభుత్వ ఉద్యోగ సంక్షేమ సంఘం ఎన్నిక
అనకాపల్లి టౌన్: బీసీ ప్రభుత్వ ఉద్యోగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా కొణతాల గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్లో అసోసియేషన్ ఎన్నికలు శనివారం జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు గత్తుల వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిగా బి.వి.వి.ప్రసాద్, కోశాధికారిగా కె.జోగినాయుడు, అసోసియేషన్ అధ్యక్షునిగా బి.దేముడుబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పి.జగదీష్, ఆర్.అప్పలరాజు, గౌరవ సలహాదారునిగా రిటైర్డ్ ఎమ్మార్వో పి.వీరభద్రరావు ఎన్నికయ్యారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూషణరావు, న్యాయ సలహాదారులు పి.రామచంద్రరావు పాల్గొన్నారు. -
20న సిరివెన్నెల 70వ జయంతి
అనకాపల్లి (కశింకోట): సినీ రంగంలో రచయితగా ఉత్తమ సాహిత్యాన్ని అందించిన మహోన్నత వ్యక్తిత్వం సిరివెన్నెల సీతారామశాస్త్రిదని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. సిరి వెన్నెల కళా పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు సీతారామశాస్త్రి 70వ జయంతి వేడుకలు అనకాపల్లి సత్య గ్రౌండ్లో జరగనున్నాయి. దీన్ని పురస్కరించుకొని శనివారం జనసేన కార్యాలయంలో సిరివెన్నెల 70వ జయంతి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సినీ గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి హాజరు కానున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. గవర కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర, నూకాంబిక దేవస్థానం చైర్మన్ పీలా నాగ శ్రీను, అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రవికుమార్, కొడుకుల శ్రీకాంత్, జోగినాయుడు, చదరం నాగేశ్వరరావు,ఈశ్వర్ పాల్గొన్నారు. -
స్థానికులకు ఉద్యోగాలివ్వడం లేదు...
భూములు, ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు, స్థానికులకు, మత్స్యకారులకు చట్ట ప్రకారం ఉపాధి కల్పించాలి. ఏయే పరిశ్రమల్లో స్థానికులకు ఎంత మందికి ఉపాధి కల్పించారో పరిశ్రమ బయట బోర్డు పెట్టాలి. పరిశ్రమలోపల ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించట్లేదు. ప్రతి 6 నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ చేయాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికై నా పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల అభ్యున్నతికి పాటు పడేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. –రొంగలి రాము, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు -
పరిశ్రమల కోసం భూములు కోల్పోయాం..
మాది దుప్పితూరు గ్రామం. నేను అచ్యుతాపురం నుంచి విశాఖలో గల ఒక ప్రైవేట్ పరిశ్రమలో పని చేసుకునేందుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం రాకపోకలు చేస్తున్నాను. బ్రాండిక్స్ పరిశ్రమలో మా భూములు కోల్పోయాం. కంపెనీ వారు వెయ్యి ఎకరాల స్థలం ఏడాదికి కేవలం వెయ్యి రూపాయలు లీజుకి ప్రభుత్వం నుంచి తీసుకుని, 60 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నేటికీ కల్పించలేదు. నా లాంటి అర్హత కలిగిన ఎందరో యువకులు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం చొరవతో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నాను. –మాడెం అజయ్, స్థానిక యువకుడు -
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
దేవరాపల్లి : ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని మండల ప్రత్యేక అధికారి ఎస్.మంజులవాణి సూచించారు. దేవరాపల్లిలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో మానహారంగా ఏర్పడి, ప్రతిజ్ఞ చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మండల ప్రత్యేక అధికారి ఎస్.మంజులవాణి, ఎంపీడీవో సువర్ణరాజు చీపర్లతో చెత్త ఊడ్చారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందశారు. సచివాలయం–1 వద్ద జరిగిన సమావేశంలో వేసవి ఎండ తీవ్రత నేపథ్యంలో వడ దెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కల్పించారు. బోయిలకింతాడలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, సర్పంచ్ బాబురావు ఆధ్వర్యంలో సచివాలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. మాకవరపాలెం: గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు అన్నారు. మండలంలోని గిడుతూరులో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం వీధుల్లో చెత్తను తొలగించడంతోపాటు ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నం : మున్సిపాలిటీలో స్వర్ణాంద్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్, ఆర్డీవో వి.వి.రమణ, కౌన్సిలర్లు సిహెచ్.పద్మావతి, కమిషనర్ జంపా సురేంద్ర, జిల్లా అదనపు వైద్యాధికారి జ్యోతి, మెప్మా, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. వీరంతా ర్యాలీ నిర్వహించి చెత్తను రోడ్లపై వేయకుండా పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని నినాదాలు చేశారు. కౌన్సిలర్ పద్మావతి అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. బుచ్చెయ్యపేట : గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ సిబ్బంది కృషి చేయాలని మండల ప్రత్యేకాధికారి గోపాల్,ఎంపీడీవో విజయలక్మి తెలిపారు. శనివారం గ్రీవెన్స్‌లో భాగంగా దిబ్బిడిలో పర్యటించారు. అంగన్వాడీ కేంద్రం, సచివాయాలం, సంపద కేంద్రం, నీటి తొట్టెలను,గ్రామ వార్డులను తనిఖీ చేశారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండడమే కాక అపరిశుభ్ర వాతావరణం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించారు. ఎండాకాలం అవడంతో ముఖ్య కూడల్లో చలి వేంద్రాలు, నీటి తొట్టెలో పశువులకు నీళ్లు ఉండేలా చూడాలన్నారు. ఎమ్మార్సీ భవనం వద్ద పారిశుధ్య చర్యలు రోలుగుంట : మండలంలో గ్రామాల్లో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో గల విద్యాశాఖ మండల వనురుల కేంద్రం వద్ద ఎంఈవోలు జాను ప్రసాద్, జాగ్గారావు సిబ్బందితో కలిసి భవన్ చుట్టూ చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను ేతొలగించారు. ఆవరణలో గల పిచ్చి మొక్కలు తొలగించి కార్యాలయాన్ని సుందరంగా తయారు చేశారు. సీఆర్పీలు సతీష్, చిరంజీవి పాల్గొన్నారు. -
దేవరాపల్లి వైస్ ఎంపీపీ అభ్యర్థిగా సింహాచలంనాయుడు
దేవరాపల్లి : మండల పరిషత్ వైస్ ఎంపీపీ అభ్యర్ధిగా వైఎస్సార్సీపీ తరుపున మామిడిపల్లి ఎంపీటీసీ సభ్యుడు పంచాడ సింహాచలంనాయుడును ఎంపిక చేసినట్లు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు తారువలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులంతా శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంపీటీసీ సభ్యులంతా ఏకగ్రీవంగా పంచాడ సింహాచలంనాయుడును వైస్ ఎంపీపీ అభ్యర్థిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం బూడి మాట్లాడుతూ 19న జరిగే వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియలో ఎంపీటీసీ సభ్యులంతా పాల్గొని సింహాచలంనాయుడుకు మద్దతు పలికి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ అభ్యర్థిగా ఎంపికై న పంచాడ సింహాచలంనాయుడును పలువురు అభినందించారు. కాగా గతంలో వైస్ ఎంపీపీ–1 పనిచేసిన చింతల బుల్లిలక్ష్మి ఇటీవల జరిగిన మండల పరిషత్ అధ్యక్ష ఉప ఎన్నికల్లో ఎంపీపీగా గెలుపొందడంతో వైస్ ఎంపీపీ పదవి ఖాళీ ఏర్పడింది. దీంతో వైస్ ఎంపీపీ పదవికి ఈ నెల 19 ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపఽథ్యంలోనే మండల పరిషత్‌లో వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉండడంతో వైఎస్సార్సీపీ తరపున పంచాడ సింహాచలంనాయుడు వైస్ ఎంపీపీగా గెలుపు అనివార్యం కానుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైస్ ఎంపీపీ–2 ఉర్రూకుల గంగాభవానీ, కోఆప్షన్ మెంబర్ దండే జాన్ విక్టర్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, యువజన విభాగం అధ్యక్షుడు కర్రి సూరినాయుడు, మండల బిసి సెల్ అధ్యక్షుడు కిల్లాన శ్రీనువాస్ యాదవ్, ఎంపీటీసీ సభ్యులు, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ విప్ జారీ దేవరాపల్లి మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నికకు సంభందించి వైఎస్సార్సీపీ విప్ జారీ చేసింది. ఈ మేరకు వైస్ ఎంపీపీ–1 ఈ నెల 19న ఎన్నిక నిర్వహించనున్న నేపధ్యంలో తమ పార్టీ ఎంపీటీసీలకు వైఎస్సార్సీపీ తరపున ఆ పార్టీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు విప్ జారీ చేశారు. వైఎస్సార్సీపీ తరుపున వైస్ ఎంపీపీ అభ్యర్థి మామిడిపల్లి ఎంపీటీసీ సభ్యుడు పంచాడ సింహాచలంనాయుడును ప్రతిపాదిస్తూ వైఎస్సార్సీపీ తరుపున బీ ఫారం పత్రాన్ని మండల అధ్యక్షుడు బూరె బాబూరావు, ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి,, జెడ్పీటీసీ కర్రి సత్యం శనివారం ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఎస్.మంజులవాణికి శనివారం అందజేశారు. ప్రకటించిన మాజీ డిప్యూటీ సీఎం బూడి -
‘స్థానికులకు’ ఉపాధి కలేనా..!
అచ్యుతాపురం రూరల్ : పరిశ్రమలకు గ్రామాల్లో భూములు సేకరించినప్పుడు నిర్వాసితులకు ఆర్.కార్డులు ఇస్తామని, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో శిక్షణ ఇచ్చి స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామని అప్పటి కలెక్టర్ సమక్షంలో అగ్రిమెంటు చేసుకున్నారు. కానీ నేటికీ అమలు కాలేదని కార్మిక సంఘాల నాయకులంటున్నారు. మత్స్యకార గ్రామాల యువతీ యువకులను పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించట్లేదని వాపోతున్నారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధాల కారణంగా మత్స్య సంపద కోల్పోయి, స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో అవకాశాలు లేక మత్స్యకార యువకుల జీవనం చాలా దుర్భరంగా మారింది. వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి రైతుల నుంచి వేలాది ఎకరాలు తీసుకుని నామ మాత్రంగా పరిశ్రమలు నెలకొల్పి, రాయితీలు పొందాక కుంటి సాకులతో అర్ధంతరంగా మూసేస్తున్నారు. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని ఎందరో నిరు పేద కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇక నడుస్తున్న పరిశ్రమలూ కార్మికులకు చాలీచాలని వేతనాలు ఇస్తున్నాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనం పెంచాల్సి ఉన్నప్పటికీ, గత 15 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుత ధరలకు అనుగుణంగా కనీసవేతనం రూ.26వేలు ఎక్కడా అమలు కావట్లేదని కార్మికులు వాపోతున్నారు. సెజ్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులు తమ జీవితాలు బాగుపడతాయన్న ఆలోచనతో వేల ఎకరాలు సెజ్ పరిశ్రమలకు ధారపోశారు. భవిష్యత్తులో తమ పిల్లల జీవితాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా సంతోషంగా గడిచిపోతుందని అనుకున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. స్థానికంగా పరిశ్రమలు వస్తే విద్యార్హతను అనుసరించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయనుకున్న నిర్వాసితుల కల కలగానే మిగిలింది. ప్రస్తుతమున్న పరిశ్రమల్లో స్థానికేతరులకు తప్ప స్థానికంగా ఉన్న నిర్వాసిత రైతుల పిల్లలకు ఉద్యోగ,ఉపాధి కల్పనలో పరిశ్రమల యాజమాన్యాలు చొరవ చూపించట్లేదు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో 560 ఎకరాల్లో భూమిని సేకరించారు.వీటిలో ఇప్పటివరకూ 208 పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఈ రెండు మండలాల్లో 27 గ్రామాలకు చెందిన 5,600 నిర్వాసిత కుటుంబాలను దిబ్బపాలెం, వెదురవాడ ఆర్ అండ్ ఆర్కాలనీలకు తరలించారు. నిర్వాసుతులందరూ కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 2000 మంది మహిళలకు ఉపాధి కల్పించారు. నిర్వాసితులకు దక్కని ఉపాధి అవకాశాలు అర్ధంతరంగా మూతపడుతున్న పరిశ్రమలు రోడ్డున పడుతున్న కార్మికులు భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమ యాజమాన్యాలు విధుల్లో ఉన్న కార్మికులకు చాలీ చాలని వేతనాలు -
పూరిల్లు.. పొదరిల్లు
● తాటాకు ఇంటిపై పెరుగుతున్న మక్కువ ● పల్లెకు వచ్చి సేద దీరుతున్న పట్నవాసులు ● ఫామ్ హౌస్ కల్చర్‌కు ఆదరణ పక్షుల కువకువలు వినిపించకుండా పోతున్నాయి.. ఆలమందలు కనిపించకుండా పోతున్నాయి.. ప్రకృతి అందాలు కనుమరుగయ్యాయి.. సూర్యుడు కూడా కనిపించనంతటి ఎత్తైన భవనాలు.. ఆ ఇళ్లలో కృత్రిమ బంధాలతో బతుకంటేనే విసుగెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే మళ్లీ పాత రోజుల వైపు కొందరు వెనుదిరిగి చూస్తున్నారు. ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు.ఎన్.గజపతి నగరంలో ఉపాధ్యాయుడు చిరికి శ్రీనివాసరావు కట్టించుకున్న తాటాకు ఇల్లు మాడుగుల: పట్టణాల్లోని రణగొణ ధ్వనులకు దూరంగా ఉంటే ఎంత బాగుంటుంది! వాతావరణ కాలుష్యం సోకని ప్రపంచానికి దగ్గరయ్యే అదృష్టం దక్కితే ఎంత బాగుంటుంది! ఈ ఊహే ఇప్పుడు అందరినీ పల్లెటూరి వైపు నడిపిస్తోంది. తాతల కాలం నాటి పూరి గుడిసెలంటే కొందరు మక్కువ చూపిస్తున్నారు. పెంకుటిళ్లు, డాబాలు రావడంతో పల్లెల్లో కూడా పూరిళ్లు కనుమరుగయ్యాయి. తాటాకు కమ్మలతో నిర్మించిన ఇళ్లలో వేసవి కాలంలో చల్లదనం.. చలికాలంలో వెచ్చదనం ఉంటుంది. ఎటువంటి అనారోగ్యాలు దరి చేరేవి కావు. రైతులకు పండే దినుసులు దాచుకోవడానికి బాగుండేవి. అయితే అగ్ని ప్రమాదాలకు భయపడి గ్రామాల్లో కూడా డాబాలు నిర్మించుకున్నారు. తాటి చెట్లు ఏవీ.. రైతు ఉన్న చోట తాటి చెట్టు ఉంటుందన్న సామెత ఇప్పుడు వినిపించకుండా పోయింది. తాటి చెట్లు లేవు, ఆ చెట్లు ఎక్కి తాటాకులు నరికే వారు కూడా కనుమరుగయ్యారు. అక్కడక్కడ మాత్రమే వీరు దర్శనమిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా పట్టణాలకు వెళ్లి నివాసముండడంతో అలాంటి వారు అరుదుగా కనిపిస్తున్నారు. అంతరించిన ఊర పిచ్చుకలు గ్రామీణ ప్రాంతాల్లో తాటాకు ఇళ్లు ఉండడం వలన తాటాకు పంచ పాలీల్లో ఊర పిచ్చుకలు అధికంగా ఉండేవి. ఇప్పుడు డాబా ఇళ్లు రావడంతో ఆ పిచ్చుకలు అంతరించిపోవడంతో పొలాల్లో చీడపురుగులు పెరిగిపోయి గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు తక్కువ ఖర్చుతో తాటాకు ఇల్లు నిర్మాణం జరిగేది. కానీ ప్రస్తుతం ప్రతి ఏటా తాటాకు నేతకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. తాటి చెట్లు చాలావరకు అంతరించిపోతుండడంతో ఇంటికి వచ్చేసరికి ఒక్కొక్క తాటాకు 10 రూపాయల ధర పలుకుతోంది. పని దొరకక పట్టణాలకు వలస వెళ్లిపోవడంతో తాటాకు నేసే వారు తక్కువయ్యారు. ట్రెండ్ మారుతోంది.. రానురాను ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు కనిపిస్తోంది. కొంతమంది మళ్లీ తిరిగి వారి స్వగ్రామాలకు వచ్చి తాటాకు ఇల్లు నిర్మించుకుని వేసవి సెలవుల్లో సేద తీరుతున్నారు. ప్రస్తుతం ఈ తరహాలోనే ఫామ్‌హౌస్‌లు నిర్మితమవుతున్నాయి. దేవరాపల్లి మండలంలో ఎన్.గజపతినగరం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చిరికి శ్రీనివాసరావు ఇప్పటికీ తాటాకు ఇంట్లోనే నివసిస్తున్నారు. మాడుగుల నియోజకవర్గంలో ఈ తరహా ఇళ్లు సుమారు 300 వరకు ఉన్నాయని అంచనా. తాటాకు ఇల్లంటే ఇష్టం నా చిన్నతనం నుంచి తాటాకు ఇంటిలోనే నివాసం ఉంటున్నాను. ఎందుకో ఈ వాతావరణం అంటే నాకెంతో ఇష్టం. ఇలాంటి చోట్ల స్వచ్ఛత గోచరిస్తుంది. ఎంతో ఆరోగ్యకరం కూడా. పూరింటిలో వేసవిలో కూడా ఏసీ పెట్టనవసరం లేదు. చల్లగా ఉంటుంది. మేడ ఇల్లు కట్టుకోగలిగే స్థోమత ఉన్నా తాటాకు ఇంటిలోనే నివాసం ఉంటాను. ఇప్పుడు నాలాగే చాలామంది ఆలోచిస్తున్నారు. –చిరికి శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు, ఎన్.గజపతినగరం తాటాకు ఇంటికి డిమాండ్ గ్రామాల్లో తాటాకు ఇళ్లు ఉండేటప్పుడు ఊర పిచ్చుకలు ఉండేవి. ఇప్పుడు డాబాలు రావడంతో అవి అంతరించిపోయి నేడు జూలో చూడవలసిన పరిస్థితి దాపురించింది. ధాన్యం, అపరాలు బయట ఆరబోసినప్పుడు గింజల్లో పురుగులు లేకుండా ఏరుకునేవి. నేడు మందులు చల్లినా పురుగులు నశించటంలేదు. అందుకే డాబాలున్నా సరే పక్కన చిన్న తాటాకు ఇల్లు నిర్మించుకుంటున్నారు. –పొలమేర విజయలక్ష్మి, ఎంపీటీసీ, మాడుగుల -
కళ్ల ముందే కుమారుడి మరణం
సబ్బవరం: సబ్బవరం మండలం చిన్నపాలెం సమీపంలో అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఆ నిరుపేద కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. నాతవరం మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన నక్కా అప్పలస్వామి, పద్మ దంపతులు ఆనందపురం మండలం గిడిజాల సమీపంలోని నీళ్లకుండీల వద్ద ఓ సిమెంట్ ఇటుక బట్టీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్వగ్రామంలో జరిగిన బోడకొండమ్మ పండగలో పాల్గొని, తిరిగి పనికి వెళ్లడానికి తమ తొమ్మిదేళ్ల కుమారుడు మనోజ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. జాతీయ రహదారిపై చిన్నపాలెం సమీపంలో నిలిచి ఉన్న కోళ్లను తరలించే బొలెరో వాహనాన్ని వారి ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు మనోజ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అప్పలస్వామి, పద్మ తీవ్ర గాయాలతో హాహాకారాలు చేశారు. వారిని హుటాహుటిన 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంటాడుతున్న విషాదం: ఈ కుటుంబంలో ఇది రెండో విషాదం. అంతకుముందు వారి చిన్న కుమారుడు శర్వాన్ సత్యనారాయణ గుండె సంబంధిత వ్యాధితో మరణించాడు. ఒక బిడ్డను వ్యాధితో పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు, ఇప్పుడు పెద్ద కొడుకును కూడా రోడ్డు ప్రమాదంలో కోల్పోయారు. మనోజ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మనోజ్ పెదనాన్న అప్పలకొండ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చావుబతుకుల మధ్య తల్లిదండ్రులు జాతీయ రహదారిపై మృత్యుఘోష -
ఒక్కో పోస్టుకు 43 మంది పోటీ
విశాఖ విద్య: మెగా డీఎస్సీకి దరఖాస్తు గడువు ముగిసింది. చాలా కాలం తర్వాత వెలువడిన నోటిఫికేషన్ కావడంతో ఉపాధ్యాయ పోస్టు సాధించేందుకు శిక్షణార్థులు భారీగా పోటీపడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని మేనేజ్మెంట్లలో 1,139 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 29,779 మంది అభ్యర్థులు 49,658 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సారి డీఎస్సీకి పోటీ తీవ్రంగానే ఉండనుంది. అంటే ఒక్కో పోస్టుకు 43 మంది పోటీపడుతున్నారు. ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతో ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులు అర్హతలను బట్టి ఆయా సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్నారు. సమయం తక్కువ.. ఒత్తిడి ఎక్కువ డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగనున్నాయి. మరో 20 రోజుల్లో పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు డీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ కలిగిస్తోంది. సమయం పెంచి, అందరికీ ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేయింబవళ్లు పుస్తకాలతో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. భర్తీ కానున్న పోస్టులు ఇవే.. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్ పరిధిలోని పాఠశాలల్లో 734(ఓపెన్ 290 + ఇతర కేటగిరీల మొత్తం 444) పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అదే విధంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో 400 పోస్టులు ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జువనైల్ హోమ్‌లో 5 ఖాళీలు కలుపుకుని మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 1,139 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా జోనల్ స్థాయిలో ఏపీ రెసిడెన్షియల్/మోడల్ స్కూల్స్/సోషల్ వెల్ఫేర్/బీసీ వెల్ఫేర్/ట్రైబల్ వెల్ఫేర్(గురుకులాలు) పరిధిలోని విద్యాలయాల్లో జోనల్ ప్రాతిపదికన 400 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉపాధ్యాయ కొలువుకు దరఖాస్తుల వెల్లువ 1,139 పోస్టులకు 49,658 పైగా దరఖాస్తులు కొలువు కొట్టాలంటే కష్టపడాల్సిందే.. -
తల్లిదండ్రుల చెంతకు చిన్నారి
అనకాపల్లి టౌన్: నాలుగు రోజుల క్రితం తప్పిపోయిన కుమార్తె కనిపించడంతో ఆ తల్లి ఆనందానికి హద్దులు లేవు. పాపను ఎత్తుకొని ముద్దాడింది. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. కలకలం సృష్టించిన చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తల్లీబిడ్డలను ఒక్కటి చేశారు. అనకాపల్లి లోకవారి వీధిలో నివసిస్తున్న కశింకోట మండలం గవరపేట వీధికి చెందిన కూలీ దంపతులు భీశెట్టి హరీష్, లలిత ఈనెల 14న పనిలోకి వెళ్లాక వారి నాలుగేళ్ల చిన్నారి లోహిత కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. మర్నాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ విజయకుమార్ నేతృత్వంలో ఎస్సైలు సత్యనారాయణ, ఈశ్వర్రావు, వెంకటేశ్వరరావులు, సీసీఎస్ ఎస్ఐలు అశోక్‌కుమార్, స్వామినాయుడు, అప్పలరాజు ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల సాయంతో నిందితుల కదలికలను కనిపెట్టారు. చాక్లెట్ ఆశ చూపించి.. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే.. ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. చిన్నారి ఒక మహిళను అనుసరిస్తూ వెళ్లింది. డెయిరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి, మరికొన్ని చాక్లెట్లను చూపించి, నిందితురాలు బాలికను ఆకర్షించింది. పెరుగుబజార్లో బాలికతో కలిసి అనకాపల్లి–విశాఖ 500 నెంబర్ గల ఆర్టీసీ బస్సులో 14వ తేదీ సాయంత్రం 5.50 గంటలకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఫేస్ ఐడెంటిఫికేషన్‌తో మహిళ ఫోన్ నంబర్‌ను కూడా పోలీసులు కనుగొన్నారు. వెంటనే మహిళ ఫోటోను స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి ఆమెను గాజువాకలో పెందగంట్యాడ నివాసి టొంటోని లక్ష్మీగా గుర్తించారు. పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో నిందితులు టొంటోని లక్ష్మీ, ఆమె భర్త టొంటోని అప్పలస్వామి బాలికతో కలిసి బొలెరో వాహనంలో అనకాపల్లికి చెందిన బోనాలా దేవిని కలవడానికి అనకాపల్లికి వస్తుండగా.. జలగలమదుం జంక్షన్ వద్ద అనకాపల్లి టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు పిల్లల దొంగల ముఠా అరెస్టు వివరాలు వెల్లడించిన ఎస్పీ సంచలనం సృష్టించిన మిస్సింగ్ కేసు వివరాలను ఎస్పీ తుహిన్ సిన్హా శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనకాపల్లికి చెందిన బోనాల దేవి సూచనలతో గాజువాకకు చెందిన టొంటోని లక్ష్మి అనకాపల్లి వచ్చి పాపను మాయం చేసిన విషయం గుర్తించామన్నారు. నిందితులు ముగ్గురినీ విచారించగా పాపను విక్రయించడానికి ప్రయత్నించినట్లు అంగీకరించారని తెలిపారు. మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితురాలు లక్ష్మి విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కిడ్నీ రాకెట్ కేసులో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితుడు టొంటోని అప్పలస్వామి రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు. అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, ఇన్చార్జ్ డీఎస్పీ బి.మోహన్‌రావు, టౌన్ సీఐ టీవీ విజయ్‌కుమార్ బృందానికి నగదు రివార్డు, ప్రశంసా పత్రాలు అందజేశారు. -
ఉమ్మడి విశాఖ జిల్లాలో కిడ్నాప్ కలకలం
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్ కలకలం రేపుతోంది. అనకాపల్లి టౌన్‌కి చెందిన నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. అనకాపల్లి లోకావారి వీధి ఇంటి నుంచి అదృశ్యం అయినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు.సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన అనకాపల్లి పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఓ మహిళ చాకచక్యంగా చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. గుర్తు తెలియని మహిళ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాత కిడ్నాప్ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. -
మూడు ముక్కలాట
● జీవీఎంసీలో తారస్థాయికి కూటమి రాజకీయం ● టీడీపీ, జనసేన అధిష్టానం దృష్టికి పంచాయితీ ● తమకే ఇవ్వాలంటూపట్టుబడుతున్న జనసేన ● ససేమిరా అంటున్న టీడీపీ ● ఇరు పార్టీల మధ్య అగ్గిరాజేస్తున్న డిప్యూటీ మేయర్ పోస్ట్ డాబాగార్డెన్స్: జీవీఎంసీలో కూటమి రాజకీయం తారాస్థాయికి చేరింది. అవిశ్వాసం ద్వారా గత మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌లను పదవుల నుంచి తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత మేయర్‌ను తొలగించి, తెలుగుదేశం పార్టీకి చెందిన పీలా శ్రీనివాస్‌ను కూటమి సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజాగా డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయానికి వస్తే, కూటమిలో విభేదాలు మొదలయ్యా యి. మేయర్ పదవిని తీసుకున్నందున, డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ వివాదం తెలుగుదేశం పార్టీ అధిష్టానం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ల దృష్టికి చేరింది. తమకంటే తమకు కావాలంటూ.. మేయర్ పదవిని తెలుగుదేశం పార్టీ తీసుకున్నందున, పొత్తులో భాగంగా డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ కార్పొరేటర్లు, పెద్దలు పట్టుబడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తే తాను రాజీనామా చేస్తానని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పార్టీ అధినేతకు బహిరంగంగా లేఖ పంపారు. దీంతో కూటమి రాజకీయం వేడెక్కింది. పొత్తు ధర్మంలో భాగంగా డిప్యూటీ మేయర్ పదవి తమకు కావాలని జనసేన పార్టీ ఎప్పటి నుంచో ఆశిస్తోంది. ఇదిలా ఉండగా, జనసేన పార్టీ నుంచి డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటీవలే వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన పెద్దిరెడ్డి ఉష, వంశీరెడ్డి, మాసిపోగు మేరీజోన్స్, ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ పార్టీలో చేరిన మహ్మద్ సాదిక్, కందుల నాగరాజుతో పాటు ఆ పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి కూడా పోటీలో ఉన్నారు. తాడోపేడో.. డిప్యూటీ మేయర్ ఒక్క పోస్టు కోసం రెండు పార్టీలు పట్టువిడవకుండా ఉన్నాయి. ఈ విషయంలో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నాయి. డిప్యూటీ మేయర్ తమకే ఇవ్వాలని జనసేన గట్టిగా పట్టుబడుతుండగా, తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ పోస్టును వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ పోస్టు కోసం ఈ నెల 19న ఎన్నిక జరగనుంది. మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకోవడంతో, డిప్యూటీ మేయర్ తమకు కేటాయించాలని జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. లేనిచో రాజీనామా చేస్తామని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ శుక్రవారం పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపడంపై కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. అంత సీన్ లేదు.. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్‌కే డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలంటూ సాక్షాత్తు నూతనంగా ఎన్నికై న మేయరే అధిష్టానానికి లేఖ పంపినట్టు భోగట్టా. వీరిద్దరి మధ్య నేను అర్హురాలినేనంటూ బీజేపీ కార్పొరేటర్ కూడా రేస్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కూటమిలో అంతర్గత తగాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ కుమ్ములాటలే నిదర్శనం. నువ్వా..నేనా? డిప్యూటీ మేయర పదవిపై పార్టీల అధినాయకులు తేల్చకపోవడంతో ఇరు పార్టీల్లోనూ ఆశావాహుల సంఖ్య పెరిగింది. టీడీపీలో 10 మంది వరకు ఈ పదవి కోసం పోటీ పడతుండగా, జనసేనలో ఉన్న వారంతా (ఒక్క మూర్తి యాదవ్ తప్పా..ఎందుకంటే మూర్తి యాదవే తనను మినహాయించి ఎవరికై నా ఇవ్వాలని పవన్ కల్యాణ్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు) రేసులో ఉన్నట్టు తెలిసింది. ఎవరి స్థాయిలో వారు సీనియర్ల ద్వారా అధినాయకుడి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇరు పార్టీల నుంచి ఇద్దరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుకు డిప్యూటీ మేయర్ కట్టబెట్టాలని ఆ పార్టీలో పలువురు కార్పొరేటర్లు భావిస్తూ..ఆ పేరు ప్రతిపాదించినట్టు సమాచారం. ఇక జనసేన విషయానికొస్తే..ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మేయర్‌గా టీడీపీ నేత ఉండడంతో డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ పదవిని జనసేన వదులుకునే ప్రసక్తే లేదంటూ తెగేసి చెబుతున్నారు. జనసేన నుంచి ఎందరో ఆశావాహులున్నా..ఎమ్మెల్యేలు మాత్రం ఉషశ్రీ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా కూటమిలో డిప్యూటీ మేయర్ పదవి పెద్ద రాద్ధాంతం చేస్తోంది. -
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
యలమంచిలి రూరల్: మున్సిపాలిటీ పరిధి సోమలింగపాలెంలో విషాదం చోటు చేసుకుంది.సమీప బంధువైన యువకుడి వివాహ వేడుకలో భాగంగా భోజనాల దగ్గర విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అదే గ్రామానికి చెందిన కొయిలాడ చిన అప్పలనాయుడు(27) మృతి చెందాడు.ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.వివరాలు... గురువారం రాత్రి సోమలింగపాలెంలో ఒక వివాహ వేడుకలో భోజనాలు చేసే చోట అదనంగా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడం కోసం లైటింగ్ వేసే వ్యక్తికి సహాయం చేసే నిమిత్తం చిన అప్పలనాయుడు షామియానాలు వేసే ఇనుపరాడ్డును అక్కడకు తీసుకొస్తుండగా పైన ఉన్న 11కేవీ విద్యుత్ వైర్లు తగిలాయి.దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్పృహ కోల్పోయిన యువకుడిని హుటాహుటిన యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యుడు తెలిపారు. అప్పటివరకు ఎంతో ఆనందంగా జరుగుతున్న వివాహ వేడుకలో ఊహించని రీతిలో అపశ్రుతి చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా బంధువులు,గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.మృతుడికి ఆరు నెలల క్రితమే వివాహమైంది.భార్య గర్భవతి.ఈ ఘటనతో ఆ వివాహాన్ని వధూవరుల కుటుంబ సభ్యులు అన్నవరం దేవస్థానంలో చేయించారు. మృతి చెందిన యువకుడు తండ్రి ఫిర్యాదు మేరకు యలమంచిలి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సోమలింగపాలెంలో పెళ్లింట విషాదం -
వుషు పోటీల్లో అక్కిరెడ్డిపాలెం క్రీడాకారులకు పతకాలు
అనకాపల్లి టౌన్: మండలంలోని అక్కిరెడ్డి పాలెం ఫిట్నెస్, బాక్సింగ్ క్లబ్‌కు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి వుషు పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. కర్నూల్లో ఈ నెల 12 నుంచి 14 వరకు సబ్ జూనియర్,జూనియర్ బాలబాలికల చాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. సబ్ జూనియర్ కేటగిరీలో జిమ్ నుంచి ఎనిమిది మంది పాల్గొనగా 42 కిలోల విభాగంలో ఎన్.వార్షిక్, 48 కిలోల విభాగంలో గోవర్ధన్, 60 కిలోల విభాగంలో బి.దుర్గాప్రసాద్ బంగారు పతకాలు సాధించారు. జూనియర్ కేటగిరి 48 కిలోల విభాగంలో ఇ.లక్ష్మిత్, 60 కిలోల విభాగంలో ఎ.వరప్రసాద్ బంగారు పతకాలు సాధించగా , 52 కిలోల విభాగంలో ఎన్.తులసీరామ్ రజతం, 56 కిలోల విభాగంలో పి.శశి, 65 కిలోల విభాగంలో వై.వినయ్ కాంస్య పతకాలు సాధించారు. వీరందరూ ఈ నెల 26 నుంచి 31 వరకు తమిళనాడులో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు జిమ్ కోచ్‌లు అరుణ, హరీష్ తెలిపారు. -
మాతా, శిశు మరణాల నివారణకు చర్యలు
తుమ్మపాల: జిల్లాలో మాతా, శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సర్వే, మాతా, శిశు మరణాలు, వ్యాధి నిరోధక టీకాలు, మలేరియా, డెంగ్యూ వంటి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన దంపతులు, గర్భిణులు, శిశువుల రిజిస్ట్రేషన్ సక్రమంగా జరగాలన్నారు. హైరిస్క్ కేసులు, బరువు తక్కువ గల పిండాల కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించి ఆస్పత్రులకు తరలించాలన్నారు. తదుపరి సమీక్షలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో హాజరుకావాలని అధికారులకు ఆమె సూచించారు. అబార్షన్లు అధికంగా చేస్తున్న ఆస్పత్రులపై నిఘా పెట్టాలని, అబార్షన్లకు గల కారణాలపై నివేదిక అందించాలన్నారు. శిశువులకు వ్యాక్సినేషన్ సకాలంలో పూర్తి చేసి, వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. గత సంవత్సరం 19,781 జననాలకు 133 మంది శిశువులు, 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 16 మంది మరణించారని, 15 మాతృ మరణాలు సంభవించాయని కలెక్టర్ వివరించారు. ఇక నుంచి మరణం సంభవించిన ప్రతి కేసు నివేదికను వెంటనే అందజేయాలన్నారు. గ్రామాల్లో ఆశా, ఏఎన్ఎం కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కువగా సిజేరియన్ నిర్వహిస్తున్న ఆస్పత్రుల వివరాలు సేకరించాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను ఆస్పత్రులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, 104 వాహనాల ద్వారా ప్రజలకు సక్రమంగా సేవలు అందేలా వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఎం.శాంతిప్రభ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ వి.రమణ, డీఐవో డాక్టర్ చంద్రశేఖర్ దేవ్, డీపీఎంవో డాక్టర్ ప్రశాంతి, మెడికల్ అధికారులు పాల్గొన్నారు. అబార్షన్ చేస్తున్న ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా సమీక్ష సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్ -
హైవే పక్కన గ్యాస్ ట్యాంకర్ బోల్తా
యలమంచిలి రూరల్: యలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న టీఎస్ 06 యూసీ0645 నంబరు గల గ్యాస్ ట్యాంకర్ రేగుపాలెం సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోయింది. దీంతో ట్యాంకర్ నుంచి భారీగా గ్యాస్ లీకై ంది. తెల్లని గ్యాస్ పక్కనున్న పొలాలు, కాలువ వైపునకు వ్యాపించింది. ఇది చూసిన వాహనచోదకులు, చుట్టు పక్కల వారు భయంతో పరుగులు తీశారు. అయితే లీకై న వాయువు శీతల పానీయాల్లో ఉపయోగించే కార్బన్ డయాకై ్సడ్గా లారీ డ్రైవర్, క్లీనర్ చెప్పడంతో ప్రమాదకరం కాదని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలువురు వాహన చోదకులు లీకవుతున్న గ్యాస్‌కు ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. సంఘటన స్థలానికి వెళ్లిన హైవే పోలీసులు లీకవుతున్న గ్యాస్‌తో ఎవరికీ ప్రమాదం లేదని, భయపడవద్దని చెప్పారు. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. భారీగా లీకై న గ్యాస్ పరుగులు తీసిన వాహనచోదకులు, స్థానికులు -
పాలిసెట్, ఏపీఆర్జేసీ ఫలితాల్లో తిమిరాం విద్యార్థి సత్తా
దేవరాపల్లి: మండలంలోని తిమిరాం గ్రామానికి చెందిన ఎలిశెట్టి హేమ చంద్రకుమార్ పాలిసెట్, ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంక్‌లు సాధించి సత్తా చాటాడు. ఓ ప్రైవేటు విద్యా సంస్థలో పదో తరగతి చదివిన విద్యార్థి ఇటీవల సీబీఎస్ఈ ఫలితాల్లో 477 మార్కులు సాధించాడు. ఏపీఆర్జేసీలో 132 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 17వ ర్యాంక్ సాధించాడు. పాలిసెట్ ప్రవేశ పరీక్షలో 120కు 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్‌తో మెరిశాడు. హేమచంద్రకుమార్ తండ్రి సూరిబాబు ఆటో డ్రైవర్ కాగా.. తల్లి బహుమతి గృహిణి. -
ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ సతీష్‌కుమార్ హఠాన్మరణం
చింతపల్లి/రావికమతం: లంబసింగి గ్రామానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్, స్థానిక వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కంఠా జాహ్నవి భర్త సతీష్‌కుమార్(46)హఠాన్మరణం చెందారు. కుటుంబీకులు అందించిన వివరాలిలా ఉన్నాయి. సతీష్‌కుమార్ రావికమతం మండలం కొత్తకోట ఎస్బీఐ ఫీల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ నర్సీపట్నం శారదానగర్‌లో నివాసముంటున్నారు. గురువారం ఉద్యోగ రీత్యా సతీష్‌కుమార్, భార్య జాహ్నవి చింతపల్లి వచ్చి విధులు ముగించుకుని స్వగ్రామం చౌడుపల్లిలో బస చేశారు. శుక్రవారం ఉదయం బ్యాంకుకు బయలు దేరే సమయంలో చాతి నొప్పి రావడంతో ఆయన కుప్పకూలిపోయాడు. వాచ్‌మన్, స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే సతీష్‌కుమార్ మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామం లంబసింగికి తరలించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. పిన్న వయస్సులో సతీష్ మృతి చెందడంతో ఇటు చౌడుపల్లి, లంబసింగిలో విషాదఛాయలు అలముకున్నాయి. సతీష్‌కు భార్యతో పాటు కుమారుడు, కుమారై ఉన్నారు. -
దాతలు సహకరించినా దక్కని ప్రాణం
రావికమతం: తీవ్ర అనారోగ్యానికి గురైన విద్యార్థి మణికంఠ చికిత్స పొందతూ విశాఖలో మృతిచెందాడు. మండలంలో కన్నంపేట గ్రామానికి చెందిన సియాద్రి మణికంఠ కొత్తకోట హైస్కూల్లో పదోతరగతి చదివి, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మానవతా వాదులు స్పందించి సహాయం చేసి, విద్యార్థి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. విశాఖలోని కేజీహెచ్ లో చిక్సిత పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో కన్నంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు నాని, అమ్మాజీ గుండెలవిసేలా రోదించారు. స్నేహితులు, పాఠశాల ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలు
కశింకోట: మండలంలో ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందానికి చెందిన సుమారు 20 మంది గాయపడ్డారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి విశాఖలోని వేపగుంట వెళుతున్న సింహాచలం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు.. ముందు వెళుతున్న ప్రైవేటు బస్సును వెనుకగా ఢీకొంది. దీంతో ఆర్టీసీ బస్సులోని సుమారు 20 మందికి స్వల్పగాయాలయ్యాయి. వారిలో కొంతమందిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి అదే బస్సులో తరలించగా, అక్కడ ప్రాథమిక చికిత్స పొంది ఇళ్లకు వెళ్లిపోయారు. వారి వివరాలు తెలియరాలేదు. వేపగుంటకు చెందిన యువతి వివాహం అన్నవరంలో జరగడంతో దానికి బంధు మిత్రులు ఆర్టీసీ బస్సును లీజుకు తీసుకొని వెళ్లి, తిరుగు ప్రయాణంలో విశాఖ వెళుతుండగా మార్గమధ్యంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 40 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో బస్సు ముందు అద్దాలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం -
ఆర్‌ఏఆర్‌ఎస్ విద్యార్థులకు ర్యాంకుల పంట
అనకాపల్లి: ఏపీ ఈసెట్–2025 అగ్రికల్చర్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ పరీక్షల్లో ఆర్‌ఏఆర్‌ఎస్ పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తొలి యాభై స్థానాలలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు పరిశోధన స్థానం ఏడీఆర్ సీహెచ్.ముకుందరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డి.నళిని రాష్ట్రంలో మొదటి ర్యాంక్, జి.భావన 3వ ర్యాంక్, ఇ.సాయి సుదర్శిని 4, ఎం.కీర్తి స్వరూప 5, పి.గురుసాయి 6, కె.సాయి హర్షిణి 7, ఎం.దీపిక 8, జి.మణిరత్నం 9వ ర్యాంక్‌తోపాటు జాహ్నవిరాణి 12వ ర్యాంక్, ఎం.త్రిషాదేవి 13, కె.గ్లోరియా షెరూన్ 14, జి.రక్షిత 17, ఎం.రాహుల్ 23, ఎస్.ప్రిన్స్ 25, ఎల్.లావణ్య 29, పి.దివ్య 36, పి.రేష్మ 39, సీహెచ్.శ్రీనివాసరావు 40, ఎ.దేవి అమృత 42, వైవిఎస్.ప్రశాంత్ 47వ ర్యాంకులు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. -
మట్టి తిని బతకాలా ?
చీడికాడ: ఉపాధి హామీ పథకం బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఉపాధి హామీ పథకం కూలీలు శుక్రవారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని అర్జునగిరిలో ఉపాధి వేతనదారులు నోటిలో మట్టిని పెట్టుకుని... దానిని తింటున్నట్టు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న వీరికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఉపాధి బకాయిలు చెల్లించలేదన్నారు. వేతనదారులు మట్టితిని బతకాలా అని ప్రశ్నించారు. సకాలంలో వేతనాలు చెల్లించకపోతే దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా జీతాలు చెల్లించలేదన్నారు. కూలీలకు వెంటనే బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి వేతనదారుల వినూత్న నిరసన -
పెళ్లి బృందం కారు బోల్తా
● నవ దంపతులతో సహా ఆరుగురికి గాయాలు నక్కపల్లి: మండల కేంద్రం నక్కపల్లికి సమీపంలో 16 వ నంబర్ జాతీయ రహదారి పై సారిపల్లి పాలెం వద్ద నూతన దంపతులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నూతన దంపతులతో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కశింకోట మండలం నూతగుంటపాలెం గ్రామానికి చెందిన యామిని, వినయ్‌లకు గురువారం వివాహం జరిగింది. శుక్రవారం అన్నవరంలో సత్యదేవుని వ్రతం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా సారిపల్లి పాలెం సమీపంలో బస్సును తప్పించబోయి వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొంది. ఈ ఘటనలో నూతన దంపతులు యామిని, వినయ్లతోపాటు వైష్టవి, ఆశ, వీరబాబు, రోషిణిలకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. ప్రమాదం పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
చదువులు తిరోగమనం
● అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు మంగళం ● ఉమ్మడి విశాఖ జిల్లాలో 82 స్కూళ్లు రద్దు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● అక్కడి విద్యార్థులు సమీప హైస్కూళ్లకు తరలింపు ● అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 52 స్కూళ్ల మూత ● దూరం కానున్న హైస్కూల్ చదువులు ● గ్రామాల్లో డ్రాపౌట్ కానున్న విద్యార్థులు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరం ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతుల్లో 46 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఈ పాఠశాలను రద్దు చేసి విద్యార్థులను 4 కిలోమీటర్ల దూరంలోని వేములపూడి హైస్కూల్‌కు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు, ముఖ్యంగా ఆడపిల్లలు అంత దూరం వెళ్లి చదువుకోగలరా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనివల్లపేద విద్యార్థులు చదువుకు దూరమై, డ్రాపౌట్లుగా మారే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రద్దు చేసిన అనేక పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. విశాఖ విద్య : కూటమి ప్రభుత్వం విద్యారంగంపై ప్రయోగాల పేరుతో పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిది రకాల పాఠశాలల పేరుతో పాఠశాల విద్య పునర్నిర్మాణం చేపట్టడం గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుకు దూరం చేసే చర్యగా ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియ కాగా, ప్రస్తుత ప్రభుత్వం పాఠశాలలను డీగ్రేడ్ చేస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేయడం ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యారంగ నిపుణులు అంటున్నారు. విద్యాశాఖ చరిత్రలో ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ చూడలేదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. గ్రామీణ విద్యకు విఘాతం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించనుంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారు. గతంలో దూరం ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఐదో తరగతి తర్వాత చదువు మానేసేవారు. అందుకే గత ప్రభుత్వాలు ప్రాథమికోన్నత పాఠశాలలను అందుబాటులోకి తెచ్చాయి. కానీ, ప్రస్తుత నిర్ణయంతో గ్రామీణ విద్యార్థులకు హైస్కూల్ చదువులు మళ్లీ దూరమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్లు పెరిగే అవకాశం ఉందని విద్యారంగ నిపుణు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల్లో అసంతృప్తి జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 3, 4, 5 తరగతులను సమీప హైస్కూళ్లలో విలీనం చేసి, ప్రైమరీ తరగతులకు స్కూల్ అసిస్టెంట్లతో బోధన ఏర్పాటు చేసింది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దు చేయడంతో 6, 7, 8 తరగతులను సమీప హైస్కూళ్లకు తరలిస్తున్నారు. ఫలితంగా, ఆ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు (స్కూల్ అసిస్టెంట్లు) వేరే చోటుకు బదిలీ కావలసి వస్తోంది. పాఠశాలల పునర్నిర్మాణం వల్ల ఉపాధ్యాయ పోస్టులకు కోత పడుతోంది. యూపీఎస్‌లు రద్దు చేయడంతో స్కూల్ అసిస్టెంట్లు వేర్వేరు హైస్కూళ్లకు బదిలీ కానున్నారు. ఈ పరిణామాలతో ఉపాధ్యాయులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 82 ప్రాథమికోన్నత పాఠశాలలను (యూపీఎస్) రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లాలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 27, అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 52 పాఠశాలలు రద్దు కానున్నాయి. ఇకపై ఈ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలుగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రద్దు చేసిన యూపీఎస్లలోని 6, 7, 8 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలలకు తరలించాలని ఆదేశిస్తూ, దీనికి సంబంధించిన మ్యాపింగ్‌ను కూడా పూర్తి చేశారు. ఈ విధానం 2025–26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుందని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 82 స్కూళ్ల రద్దు -
అవిశ్వాసం నోటీసు తిరస్కరణ
యలమంచిలి రూరల్: యలమంచిలి మున్సిపల్ వైస్ చైర్మన్లపై కూటమి నాయకులిచ్చిన అవిశ్వాసం నోటీసును కలెక్టర్ విజయ కృష్ణన్ తిరస్కరించినట్టు మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజు శుక్రవారం రాత్రి స్థానిక విలేకరులకు తెలిపారు. వైఎస్సార్సీపీ తరపున ఎన్నికై న వైస్ చైర్మన్లు బెజవాడ గోవిందరాజు నాగేశ్వరరావు, అర్రెపు నాగ త్రినాథ ఈశ్వర గుప్తాలపై మెజార్టీ లేకపోయినా కూటమి నాయకులు అవి శ్వాసం కోరుతూ జిల్లా కలెక్టరుకు ఈ నెల 8వ తేదీన నోటీసు అందజేశారు. నోటీసులో 16 మంది సంతకా లు ఉన్నాయి. సంతకాల్లో కొన్ని అసంపూర్తిగా, అనుమానాస్పదంగా ఉన్నాయి. నోటీసులో కింద ఇద్దరు వార్డు కౌన్సిలర్ల పూర్తి చిరునామాలు, సంతకాలు ఉండాలి. ఇవేవీ లేకుండానే అవిశ్వాసం కోరుతూ నోటీసు అందజేశారు. అర్రెపు నాగ త్రినాథ గుప్తా పదవీ బా ధ్యతలు చేపట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు పూర్తి కాలేదు. అయినప్పటికీ నోటీసులో గుప్తా పేరు కూడా చేర్చారు. పట్టణంలో 25 వార్డులుండగా వైఎస్సార్సీపీకి 23 మంది, టీడీపీకి ఒకరు, స్వతంత్రులు ఒకరు వార్డు సభ్యులుగా ఉన్నారు. మెజార్టీ లేకపోయినా అవిశ్వాసం కోరుతూ నోటీసు ఇచ్చి ప్రలోభాలతో గెలవాలని కూటమి నాయకులు భావించారు. నోటీసు ఇచ్చిన తర్వాత కూటమికి మద్దతునిస్తున్న వార్డు సభ్యులను ఊటీలో ప్రత్యేక శిబిరానికి సైతం తరలించారు. అయితే వైఎస్సార్సీపీకి చెందిన మెజార్టీ సభ్యులు కూటమి నేతల ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం నిజాయతీగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసం వీగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. వేధింపుల పర్వం : వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తున్న కౌన్సిలర్లను పలు రకాలుగా బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈరిగిల గణేష్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సైతం వెనకాడలేదు. శుక్రవారం పట్టణంలోని ఎస్సీ కాలనీలో గణేష్ కొత్తగా నిర్మించుకుంటున్న ఇల్లు అక్రమ కట్టడమంటూ మున్సిపల్ అధికారులు నోటీ సు అతికించారు. అంతలోనే ఏమనుకున్నారో గోడకు అతికించిన నోటీసును మళ్లీ తొలగించి తమ వెంట తీసుకుపోయినట్టు గణేష్ బంధువులు సాక్షికి చెప్పా రు. శనివారం ఉదయం గణేష్ ఇంటిని కూల్చివేయడానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పట్టణ పోలీసులను బందోబస్తు కల్పించాలని కోరినట్టు సమాచారం. ఇలాంటి కుట్రలను ఎదుర్కొంటామని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. పట్టణంలో పదుల సంఖ్యలో ఉన్న అక్రమ కట్టడాలన్నింటినీ తొలగించాలని, ఆ తర్వాతే తమ పార్టీకి చెందిన గణేష్ వార్డు సభ్యుని ఇంటికి రావాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అసంపూర్తిగా ఉందన్న కలెక్టర్ ఓటమి భయంతోనే తప్పుల తడకగా వేశారంటున్న వైఎస్సార్సీపీ -
ఉప్పొంగిన దేశభక్తి
● నక్కపల్లిలో ఘనంగా తిరంగా ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న మంత్రి అనిత నక్కపల్లి: వందేమాతరం.. భారత్ మాతాకీ జై.. నినాదాలతో నక్కపల్లి హోరెత్తింది. శుక్రవారం తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. ఉపమాక ఆర్చ్ నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు జరిగిన ఈ ర్యాలీలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ.. ఇటీవల విజయవంతమైన ఆపరేషన్ సిందూర్‌కు అందరూ జేజేలు పలికారు. ప్రాణత్యాగం చేసిన వీర సైనికుడు మురళీ నాయక్‌కు సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాజీ సైనికులను సన్మానించారు. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, తోట నగేష్, గెడ్డం బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నేడు ఐఐపీఈ స్నాతకోత్సవం 51 మందికి డాక్టరేట్లు ప్రదానం విశాఖ విద్య: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) 5వ స్నాతకోత్సవం శనివారం నోవాటెల్‌లో జరగనుందని ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్య క్షుడు ప్రొఫెసర్ పి.కె.బానిక్, డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన్ తెలిపారు. ఐఐపీఈలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించా రు. స్నాతకోత్సవానికి హిందుస్థాన్ జింక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హోల్ టైమ్ డైరెక్టర్ అరు ణ్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరవుతారన్నా రు. 51 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో అకడమిక్ ప్రోగ్రామ్ నుంచి ఇద్దరు విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ ప్ర దానం చేస్తామన్నారు. అకడమిక్ సీజీపీఏ, ఎ క్స్‌ట్రా కరిక్యులర్ విజయాల ఆధారంగా ఓవరాల్ ఎక్స్‌లెన్స్ కోసం ఒక ఉత్తమ విద్యార్థికి ప్రతిష్టాత్మక రాష్ట్రపతి బంగారు పతకం లభిస్తుందన్నారు. -
అరెస్టులు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట
సాక్షి, అనకాపల్లి: విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. వీరిద్దరి అరెస్ట్‌లను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. శుక్రవారం అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరగనిది జరిగినట్లు దుష్ప్రచారం చేస్తూ.. ప్రతి అంశంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిందించడమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. ఎక్కడా ఏ ఆధారాలు లేకపోయినా, లిక్కర్ స్కామ్ అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అందులో అందరి పేర్లు చేరుస్తూ, తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తూ, తప్పుడు వాంగ్మూలాలతో కూటమి ప్రభుత్వం లేని లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు చేస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు చేస్తున్న ఈ అనైతిక పని, మొత్తం వ్యవస్థలపైనే ప్రభావం చూపుతుందన్నారు. మంత్రి నారా లోకేష్ పదే పదే చెబుతున్నట్లుగా, రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం కొనసాగుతోందన్నారు. ఈ అరెస్ట్‌లపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం చేస్తుందని, తమకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ -
దళారుల చేతిలో దగా రైతన్నకు కూరగాయాలు
●దేవరాపల్లి: సరకు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలి.. బేరమాడే స్థాయిలో రైతులను నిలబెట్టాలి.. ఇది ప్రభుత్వం బాధ్యత. అధికారుల కర్తవ్యం. కానీ దళారీలు నిర్భయంగా దోపిడీ చేస్తున్నారు. కష్టపడి సాగు చేసిన రైతును దోచుకుంటున్నారు. అయినా పట్టించుకునేవారు లేరు. జిల్లాలో అతి పెద్దదైన దేవరాపల్లి హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌కు జిల్లా నలుమూలల నుంచే కాక విశాఖ, విజయనగరం, అల్లూరి జిల్లాల నుంచి వచ్చి సరకు కొనుగోలు చేస్తారు. మార్కెట్‌కు రోజూ సుమారు 10 టన్నుల కూరగాయలు వస్తాయి. రూ.10 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ఇక్కడి హోల్‌సేల్ మార్కెట్‌కు దేవరాపల్లి, వేపాడ, అనంతగిరి మండలాల పరిధిలో 3 వేల ఎకరాల్లో పండించిన కాయగూరలను తీసుకువచ్చి విక్రయిస్తారు. టమాటా, బీర, బెండ, వంగ, ఆనప, కాకర, చిక్కుడు, బరబాటి, దోసకాయలతోపాటు తోటకూర, పాల కూర, గోంగూర, కొత్తిమీర తదితర ఆకుకూరలను ఇక్కడ పండిస్తారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే.. స్థానిక కాయగూరల మార్కెట్‌పై ఇటు మార్కెట్ కమిటీ అధికారులు, అటు పంచాయతీ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో దళారీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్ ద్వారా ఆదాయం పొందుతున్న పంచాయతీ అధికారులు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. నిలువ నీడ లేకపోవడంతో ఎండకు ఎండి, వానకు తడవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఇక్కడి రైతులకు రైతుబజారు కార్డులు మంజూరు చేయకపోవడం, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. దేవరాపల్లి హోల్‌సేల్ మార్కెట్లో దళారీల దోపిడీ సిండికేట్‌గా ఏర్పడి మద్దతు ధర లేకుండా చేస్తున్న వైనం కనీస మద్దతు ధర దక్కక తీవ్రంగా నష్టపోతున్న రైతులు ఆవేదనతో రోడ్లపైన కాయగూరలు పారబోస్తున్న దైన్యం దిగుబడి బాగున్నా.. సుమారు ఎకరం విస్తీర్ణంలో వంగ, బీర, ఆనప, దోస కాయలు సాగు చేశాను. దుక్కులు, ఎరువులు, పురుగుల మందులు తదితర పనులకు సుమారు రూ.22 వేల వరకు పెట్టుబడులు పెట్టాను. దిగుబడి కూడా బాగానే ఉంది. కాని దేవరాపల్లి హోల్‌సేల్ మార్కెట్లో మద్దతు ధర ఉండటం లేదు. కనీసం కూలి డబ్బులు కూడా రాలేదు. – కొల్లి రమణ, కూరగాయల రైతు, దేవరాపల్లి కనీస ధర దక్కడం లేదు అరవై సెంట్లలో సుమారు రూ.16 వేల వరకు పెట్టుబడి పెట్టాను. కాయ గూరల దిగుబడి బాగానే ఉంది. కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలు లేకుండా చేస్తున్నారు. దీంతో బయట మార్కెట్లో కాయగూర ధరలు బాగానే ఉన్నప్పటికీ దేవరాపల్లి మార్కెట్లో కష్టపడి పండించిన రైతుకు కనీస ధర దక్కడం లేదు. – అల్లు రాము, కూరగాయల రైతు, దేవరాపల్లి -
వారి ప్రేమలు, బాధ్యతలను గుర్తు చేస్తాం
ఆవేశంతో అనర్ధాలు కొనితెచ్చుకుంటారు. అంతవరకు ఉన్న ప్రేమానుబంధాలను ఆ క్షణంలో మరచిపోతారు. వారికి కౌన్సిలర్లు చెప్పే మాటలు ఎంతో ఉపయోగపడతాయి. వారిని ఆలోచింపచేస్తాయి. పెళ్లి చేసుకొని ఐదు, పదేళ్లు అయిన జంటలు కూడా మా వద్దకు వస్తుంటారు. వారిని కనీసం ఐదారుసార్లు కూర్చోపెట్టి కౌన్సెలింగ్ చేస్తాం. భార్యా, భర్తల గొడవల్లో పిల్లల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని కూడా చెపుతాం. మా పరిధి దాటిన తర్వాత కూడా కౌన్సెలింగ్ చేసి లోక్ అదాలత్ ద్వారా ఇద్దరినీ కలుపుతాం. – ఇ.శ్రీనివాసులు, డీఎస్పీ, మహిళా పోలీస్ స్టేషన్, అనకాపల్లి -
నైపుణ్యతకు మెరుగు!
ఆర్ట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులుక్రాఫ్ట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులుఉపాధి కోసం.. నా డిగ్రీ చదువు అనివార్య కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. నాకు ముగ్గురు పిల్లలు. క్రాఫ్ట్‌లో ఇప్పటికే లోయర్, హయ్యర్ కంప్లీట్ చేశాను. టీటీసీ పూర్తి చేస్తే ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నేను నేర్చుకున్న విద్యలో మరింత నైపుణ్యత పొందుతూ.. ఇంటి వద్ద మరి కొంతమందికి శిక్షణ ఇస్తున్నాను. – కర్రి చంద్రిక, గవరపాలెం, అనకాపల్లి జిల్లా విశాఖ విద్య: నిరుద్యోగ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తోంది. ఉన్నత విద్యను అభ్యసిస్తూనే.. సత్వర ఉపాధి లక్ష్యంగా నైపుణ్యతతో కూడిన స్వల్పకాలిక టెక్నికల్ కోర్సుల వైపు ఆసక్తి కనబరుస్తోంది. ఇటువంటివారి కోసం విద్యాశాఖ ఏటా వేసవిలో ‘టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్’(టీటీసీ) కోర్సులను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. 42 రోజుల వ్యవధి గల ఈ కోర్సుల్లో ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 42 ఏళ్ల వరకు వయస్సు గల వారు అర్హులు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ కోర్సులను అభ్యసించేందుకు 180 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం నగరంలోని ప్రభుత్వ క్వీన్ మేరీ హైస్కూల్లో ప్రత్యేక క్యాంప్‌ను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. ఎన్ఈపీ అమలుతో టీటీసీకి డిమాండ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏటా వేసవిలో టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉండేవి. జాతీయ విద్యావిధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో తప్పనిసరిగా ఆర్ట్, క్రాఫ్ట్ సబ్జెక్టు టీచర్లను నియమించాలనే నిబంధన పెట్టారు. టీటీసీ కోర్సు చేసిన వారు మాత్రమే ఆయా పోస్టులకు అర్హులు కావటంతో డిమాండ్ పెరిగింది. మానసిక, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే అంశాలతో కూడిన సబ్జెక్టులు కావటంతో వచ్చే ఏడాది నుంచి కోర్సు వ్యవధి 42 రోజులకు బదులుగా 6 నెలలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. నైపుణ్యతతో కూడిన శిక్షణ ఈనెల ఒకటో తేదీన ప్రారంభమైన శిక్షణ తరగతులు జూన్ 11వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతీ రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులను నిర్వహిస్తున్నారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఆరుగురు టీచర్లు.. సైకాలజీ, స్కూల్ అడ్మిస్ట్రేషన్ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు మరో ఇద్దరు టీచర్లను నియమించారు. వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నైపుణ్యతతో కూడిన శిక్షణ అందిస్తున్నారు. స్వయం ఉపాధి వైపు అడుగు టీటీసీ కోర్సుపై ఆసక్తి చూపుతున్న యువత ఆర్ట్, క్రాఫ్ట్ శిక్షణతో ఉద్యోగ అవకాశాలు వేసవిలో 42 రోజుల పాటు శిక్షణా తరగతులు బొమ్మలు వేయడం ఇష్టం నేను బీటెక్ కంప్యూటర్ సైన్సు పూర్తి చేశాను. ఎంటెక్‌లో చేరేందుకు ఎంట్రన్స్ రాస్తున్నాను. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే ఇష్టం. నాన్న ప్రోత్సాహంతో ఆర్ట్‌లో శిక్షణ పొందుతున్నాను. ఆర్ట్ కోర్సులో లోయర్, హయ్యర్ ఇప్పటికే పూర్తి చేశాను. మరింత నైపుణ్యత పొందేందుకు టీటీసీ శిక్షణ ఉపయోగపడుతుంది. –ఎం.పీ.శ్లేఘన, సుజాతనగర్, విశాఖ జిల్లా -
గతుకుల రోడ్డుపై ఆటో బోల్తా
● డ్రైవర్ మృతి ఎస్.రాయవరం: మండలంలోని నీలాద్రిపురం సమీపంలో అడ్డురోడ్డు – నర్సీపట్నం ఆర్అండ్బీ రోడ్డుపై గురువారం ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఎస్ఐ విభీషణరావు వివరాల ప్రకారం.. తిమ్మాపురం గ్రామానికి చెందిన శానాపతి లక్ష్మీవరప్రసాద్(32) భార్యాపిల్లలతో తన స్వగ్రామం నుంచి చినగుమ్ములూరు వెళ్తుండగా, రోడ్డుపై గతుకులు కారణంగా ఆటో బోల్తా పడింది. ఈ క్రమంలో ఆటో కింద పడిపోయిన లక్ష్మీవరప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అడ్డురోడ్డు సన్‌షైన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. మృతడు నాలుగేళ్లుగా తిమ్మాపురం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెంలో నివాసం ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చినగుమ్ములూరులో వివాహానికి వెళ్లేందుకు వచ్చి ఈ ప్రమాదానికి గురయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. -
కూటమి మాస్టర్ ప్లాన్
● ఈ నెల 22 నుంచి జూన్ 21 వరకు మళ్లీ అభ్యంతరాల స్వీకరణ ● ఇందులో ప్రజాప్రతినిధులప్రయోజనాలకు పెద్దపీట ● వారి స్థిరాస్తి వ్యాపారాలకు అనుగుణంగా సవరణలకు ప్లాన్ ● నేతలు చెప్పినట్లే మార్పులు చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు? విశాఖ సిటీ: కూటమి ‘మాస్టర్’ ప్లాన్ వేస్తోంది. తమ వారికి లబ్ధి చేకూరేలా బృహత్తర ప్రణాళికలో సవరణలకు సిద్ధమైంది. ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసేందుకు అడుగులు వేస్తోంది. చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ.. అన్నట్లు.. 2021లో పూర్తయిన విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. గతంలో అశాసీ్త్రయంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించారన్న నెపంతో అయిపోయిన పెళ్లికి మళ్లీ బాజాలు వాయించడానికి పూనుకుంది. కేవలం కూటమి నేతల స్థిరాస్తి వ్యాపారాలకు మేలు జరిగేలా మార్పులు, చేర్పులకు ఈ నెల 22 నుంచి మళ్లీ మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాల స్వీకరణ ప్రారంభించనుంది. 2021లోనే మాస్టర్ ప్లాన్ పూర్తి వీఎంఆర్డీఏ పరిధిలో ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో బృహత్తర ప్రణాళిక–2041కు ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి 2011లో ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఏళ్లు గడిచినా అది పూర్తి కాకపోవడంతో 2016లో ప్రైవేట్ కన్సల్టెంట్ సంస్థ లీ అసోసియేట్స్‌కు రూ.10 కోట్లకు ఆ బాధ్యతను అప్పగించారు. అయినప్పటికీ 2019కి కూడా అది పూర్తి కాలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్టర్‌ప్లాన్‌పై దృష్టి సారించింది. మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమయంలో వీఎంఆర్డీఏ పరిధిలో 46 మండలాలు, 1,312 గ్రామాలున్నాయి. ప్రణాళికను రూపొందించేందుకు విశాఖపట్నంలోని 5 వర్గాలు, 45 రెవెన్యూ, 55 మత్స్యకార గ్రామాలు, 13 వార్డులను పరిగణనలోకి తీసుకొని.. సలహాలు, సూచనలు ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించారు. అలాగే విజయనగరం జిల్లాలోని 48 రెవెన్యూ, 19 మత్స్యకార గ్రామాలు, 5 వార్డులు, రెండు వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందుకోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాల స్వీకరణలో మొత్తంగా 17,460 అభ్యంతరాలు, సలహాలు వచ్చాయి. వీఎంఆర్డీఏ, రెవెన్యూ, ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సంయుక్త తనిఖీలు, సందర్శనలు నిర్వహించి వాటిన్నింటినీ పరిశీలించారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులను అనుసరించి విభిన్న కోణాల్లో ఆలోచన చేసి ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేశారు. దానికి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో 2021 నవంబర్ 8న వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్–2041కు అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన షురూ.. ప్రజాప్రతినిధులకు లబ్ధి చేకూరేలా? ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులకు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనతోనే వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునః పరిశీలనకు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాల పేరుతో కూటమి నాయకులు సూచించిన మార్పులు, చేర్పులకే పెద్ద పీట వేయాలన్న నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వారు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు సమాచారం. వీరి స్థిరాస్తి వ్యాపారాలు, వ్యక్తిగత ఆస్తుల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రహదారుల ప్రణాళికలను మార్పులు చేసుకోడానికి సిద్ధమవుతున్నట్లు కూటమిలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా మధురవాడ నుంచి ఆనందపురం మధ్యలోను అలాగే అనకాపల్లిలో పలు చోట్ల మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మాస్టర్ ప్లాన్ మొత్తంగా మార్పు చేసే అవకాశం లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. కేవలం వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి శాసీ్త్రయంగా ఉన్న వాటిని మాత్రమే మార్పులు, చేస్తామని స్పష్టం చేస్తున్నారు. మళ్లీ అభ్యంతరాల స్వీకరణ వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌పై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ నాయకులు ఆరోపణలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్లాన్‌లో మార్పులు చేస్తామని అప్పుడే ప్రకటించారు. అన్నట్లుగానే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాస్టర్ ప్లాన్–2041ను సమ్రంగా సమీక్షించాలని నిర్ణయించింది. నాలుగు నెలల్లో కొత్త మాస్టర్‌ప్లాన్‌ను తీసుకువస్తామని అమాత్యులు సైతం ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే బృహత్తర ప్రణాళికను పునః పరిశీలనకు తేదీని ఖరారు చేశారు. ఈ నెల 22 నుంచి జూన్ 21వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని నిర్ణయించారు. వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రజలు, భాగస్వాములు, సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నారు. మాస్టర్ ప్లాన్–2041లో ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే స్వయంగా గానీ, పోస్టు లేదా ఆన్లైన్ ద్వారా కూడా తెలపవచ్చని వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ ప్రకటించారు. ప్రజలందరూ మొబైల్ ద్వారా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. -
జాబ్‌మేళాలో 450 మంది ఎంపిక
యలమంచిలి రూరల్: యలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు నిరుద్యోగులు నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 25 కంపెనీల్లో ఉద్యోగాలకు 1,500 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. వీరిలో 450 మందిని ఆయా కంపెనీల సెలెక్టర్లు ప్రాథమికంగా ఎంపిక చేసుకున్నారు. అంతకుముందు ఉదయం జాబ్ మేళాను నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎ. గోవిందరావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ పి. చంద్రశేఖర్, పీడీ పోలిరెడ్డి, వివిధ కంపెనీల హెచ్ఆర్లు పాల్గొన్నారు. -
జనవాణికి అధికారులు ఎలా వెళ్తారు?
మునగపాక: జనసేన పార్టీ కార్యాలయంలో అధికారులు జనవాణి కార్యక్రమం నిర్వహించడం ఎంతవరకు సమంజసమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ ప్రశ్నించారు. మునగపాకలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమం అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలే గాని జనసేన కార్యాలయంలో ప్రజల నుంచి దరఖాస్తులు ఎలా స్వీకరిస్తారన్నారు. అధికారులకు ఎటువంటి గైడెన్స్ లేకున్నా పార్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరుకావడం తప్పిదమన్నారు. అధికారులు జనసేనకు తొత్తుగా వ్యవహరించడం విచారకరమన్నారు. పార్టీ నాయకులతో కలిసి అధికారులు ప్రజా వాణిలో పాల్గొంటే భవిష్యత్‌లో ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్నారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆళ్ల మహేశ్వరరావు, ఎస్.బ్రహ్మాజీ, టెక్కలి జగ్గారావు, ఎంఎస్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నాయకులు -
రాష్ట్రస్థాయి వుషు పోటీల్లో చోడవరం క్రీడాకారులకు పతకాలు
చోడవరం : రాష్ట్ర స్థాయి వుషు మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో చోడవరం క్రీడాకారులు పతకాలు సాధించారు. కర్నూల్లో ఈనెల 12నుంచి 14వ తేదీ వరకూ రాష్ట్రస్థాయి ఉషూ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో చోడవరం గణేష్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన క్రీడాకారులు పలు విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. జూనియర్స్ 45 కేజీల విభాగంలో తేజ స్వరూప్ బంగారు పతకం సాధించారు. ఉమెన్స్ సీనియర్స్ 60 కేజీల విభాగంలో లావణ్య రజత పతకం, 65 కేజీల విభాగంలో సాయి లక్ష్మి కాంస్య పతకం సాధించారు. వీరు త్వరలో రాజస్థాన్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం నుంచి పాల్గొంటారని కోచ్ పుల్లేటి గణేష్ తెలిపారు. -
రూ.8.3 లక్షలు ఏ మూలకూ చాలవు
నక్కపల్లి: పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ప్రభుత్వం ప్రకటించిన రూ.8.30 లక్షలు ఏమూలకూ సరిపోవని, ప్యాకేజీ పెంచాల్సిందేనంటూ పలువురు అఖిలపక్ష నాయకులు, నిర్వాసితులు డిమాండ్ చేశారు. గురువారం చందనాడలో నిర్వాసితుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ తరపున కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, సీపీఎం తరపున జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, నిర్వాసితుల తరపున గంటా తిరుపతిరావు, తళ్ల భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. వీసం రామకృష్ణ, అప్పలరాజులు మాట్లాడుతూ పరిశ్రమల కోసం ఏపీఐఐసీకి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ విషయంలో ప్రభుత్వం పూర్తి న్యాయం చేయలేదన్నారు. డీఫారం రైతులకు కేవలం భూములకు మాత్రమే నష్టపరిహారం చెల్లించి ఫలసాయానికి పరిహారం ఇవ్వలేదన్నారు. ఇక సాగుదార్లకు ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదన్నారు. నివాస ప్రాంతాలు, పశువుల షెడ్లు కోల్పోయిన వారికి నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లకు ఇవ్వాల్సిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీని అరకొరగా ప్రకటించారన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.25 లక్షలకు పెంచాలి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.8.30 లక్షలు, ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఈ ఎనిమిది లక్షలు పునాదులు తీయడానికి కూడా సరిపోవన్నారు. రైతులకు 2013 భూసేకరణ చట్టప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీని రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున ప్రత్యేక ప్యాకేజీ చెల్లించాలన్నారు. ప్యాకేజీ విషయంలో న్యాయం జరగకపోతే నిర్వాసితుల తరపున ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఎన్నికల ముందు నిర్వాసితుల తరపున ఆందోళనలు చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారన్నారని విమర్శించారు. 2014లో టీడీపీ నాయకుల మాటలు నమ్మి రైతులు కోర్టుల్లో కేసులు ఉపసంహరించుకుని ఏపీఐఐసీకి భూములు ఇచ్చారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. చందనాడ, డీఎల్‌పురం, అమలాపురం, బుచ్చిరాజుపేట, రాజయ్యపేట గ్రామాలకు చెందిన నిర్వాసితులు, రైతులు పాల్గొన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంచాల్సిందే ఏపీఐఐసీ నిర్వాసితుల డిమాండ్ చందనాడలో అఖిలపక్ష సమావేశం -
లారీని ఢీకొని ఆటోడ్రైవర్ దుర్మరణం
పీఎంపాలెం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కూరగాయలు రవాణా చేస్తున్న ఆటో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ బాలకృష్ణ వెల్లడించిన వివరాలివి. ఆనందపురం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బంగారు రమణ(41) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజూ మాదిరిగానే గురువారం తెల్లవారుజామున ఆనందపురం కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలను తన ఆటోలో వేసుకుని నగరంలోని పెదవాల్తేరుకు బయలుదేరాడు. తెల్లవారుజామున సుమారు 4.30 గంటల సమయంలో ఎండాడ కూడలికి సమీపంలోని వరాహగిరి కాలనీ ఎదురుగా జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రమణ నడుపుతున్న ఆటో ముందు అతివేగంగా వెళుతున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. ఊహించని ఈ పరిణామానికి రమణ తన ఆటోను అదుపు చేయలేక లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ఆటోలో ప్రయాణిస్తున్న నరసింగరావు అనే వ్యక్తి స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. -
కూటమి కుట్ర
సచివాలయాలపై నక్కపల్లి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సచివాలయ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సచివాలయాలను సగానికి సగం తగ్గించి ప్రభుత్వ పాలన ప్రజలకు దూరం చేసి మళ్లీ పాత రోజులను గుర్తుకు తెచ్చే ప్రయత్నాలకు తెరలేపింది. గుట్టుచప్పుడు కాకుండా సచివాలయాల విలీన ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారుల నుంచి సేకరిస్తోంది. ప్రభుత్వం సచివాలయాలను కుదిస్తే ప్రజలు వివిధ పనుల కోసం మళ్లీ 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం అనేక వ్యయ ప్రయాసలు పడి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు గత సర్కారు గ్రామాల్లో సచివాలయాలు నెలకొల్పి, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 12 మంది సిబ్బందిని నియమించింది. రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కడమే కాక, కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సచివాలయ భవనాల నిర్మాణానికి రూ.40 లక్షల చొప్పున నిధులు వెచ్చించారు. ప్రభుత్వ పథకాలను దరఖాస్తు చేసిన 72 గంటల్లోగా మంజూరు చేసేందుకు పక్కా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సేవల కుదింపు జిల్లాలో 522 సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రస్తుతం 3844 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. తాజాగా ఈ సచివాలయాలను సగానికి కుదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు భోగట్టా. అంటే 261 సచివాలయాలే మిగులుతాయి. సిబ్బందిని సర్దుబాటు చేసి ఇతర ప్రభుత్వ శాఖలకు పంపించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే సచివాలయాల్లో పనిచేసే సిబ్బందిని మండల కేంద్రాలు, సబ్స్టేషన్లు, వ్యవసాయ వెటర్నరీ ఆస్పత్రులకు పంపించి అక్కడ పనిచేయిస్తోంది. సచివాలయాల విలీన ప్రక్రియ అమలు చేస్తే మూడు నుంచి నాలుగు పంచాయతీలను కలిపి ఒక సచివాలయం కిందకు తీసుకు వచ్చే ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. నక్కపల్లి మండలంలో 32 పంచాయతీలకు 22 సచివాలయాలు ఉండేవి. విలీన ప్రక్రియలో భాగంగా వీటిని 11కు కుదిస్తూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. వేంపాడులో విలీనం కానున్న అమలాపురం సచివాలయం బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నిజమైంది. ప్రజల చెంతకే ప్రభుత్వం వచ్చింది. అన్ని రకాల సేవలను అందించింది. అది నిన్నటి మాట. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన స్వర్ణయుగం అది. వైఎస్ జగన్ సర్కారు నెలకొల్పిన సచివాలయ వ్యవస్థ విచ్ఛిన్నం. కార్యాలయాలు సగానికి సగం కుదింపు. చిత్తశుద్ధి శూన్యం. సేవలు బహుదూరం. ఇది నేటి చేదు వార్త. ఈ ప్రతిపాదనలు అమలైతే జనానికి మళ్లీ పాత కష్టాలు మొదలైనట్టే. సగానికి సగం కుదిస్తూ ప్రతిపాదనలు జిల్లాలో ఇంతవరకు 522 సచివాలయాలు ఇక ప్రభుత్వ సేవలు ప్రజలకు దూరమే.. విలీనం అమలయితే 261కి కుదింపు వేంపాడు వెళ్లాలంట.. మా గ్రామం మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేయడంతో అన్ని రకాల ప్రభుత్వ సేవలు ఇక్కడే అందేవి. ఇప్పుడు మా సచివాలయాన్ని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేంపాడులో విలీనం చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇలా అయితే చాలా ఇబ్బంది పడతాం. ప్రభుత్వ నిర్ణయం సరికాదు. – సూరాకాసుల గోవిందు, అమలాపురం, నక్కపల్లి మండలం కుగ్రామానికి అన్యాయం మా గ్రామంలో సచివాలయాన్ని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాగితలో విలీనం చేస్తారని తెలిసింది. సరైన రవాణా సదుపాయాలు లేని, ముస్లింలు ఎక్కువగా నివసించే మా గ్రామంలో జగనన్న ప్రభుత్వం సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం సచివాలయాన్ని కాగిత గ్రామానికి తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మా మారుమూల పల్లెకు మళ్లీ కష్టాలు మొదలైనట్టే. –గొర్ల గోవిందు, పెదదొడ్డిగల్లు సచివాలయాల్లో సేవలివీ.. గ్రామ సచివాలయంలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, పశుసంవర్థకశాఖ, వ్యవసాయ, హార్టికల్చర్, ఫిషరీస్ కార్యదర్శులు, మహిళా పోలీస్, వుమెన్ వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, సర్వేయర్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఏఎన్ఎం, వీఆర్ఏ, కంప్యూటర్ ఆపరేటర్ తదితర సిబ్బందిని నియమించింది. సచివాలయాల ద్వారా దాదాపు 350 రకాల సేవలను ప్రభుత్వం అందించింది. కుల, ఆదాయ నివాస ధ్రువపత్రాలు, జనన మరణ ధ్రువపత్రాలు, రైతులకు అవసరమైన పట్టాదారు పాసుపుస్తకాల దరఖాస్తులు, మోతుబరి సర్టిఫికెట్, వన్ బి, అడంగల్, సర్వే సర్టిఫికెట్లు, మ్యారేజ్ సర్టిిఫికెట్లు, వాణిజ్య, వ్యాపారాలకు సంబంధించిన అనుమతులు, లైసెన్స్‌ల జారీ, డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్‌లు, అమ్మ ఒడి, రైతుభరోసా పథకాలకు దరఖాస్తులు, విద్యాదీవెన, విద్యావసతి, పోస్ట్‌మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు, కొత్తగా పింఛన్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు, ప్రధాన దేవాలయాల్లో దర్శనాలు, గదుల బుకింగ్ సదుపాయం, ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం దరఖాస్తులు, గృహ అవసరాలకు, వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తులు, రైతులకు విత్తనాలు, ఎరువుల కోసం దరఖాస్తులు ఇలా ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వ్యక్తిగత, సామాజిక అవసరాల కోసం దరఖాస్తు చేయడానికి, వాటిని మంజూరు చేయడానికి సచివాలయాలు ఉపయోగపడేవి. -
పిడుగుపాటుకుపశువులు మృత్యువాత
రావికమతం: మండలంలో పిడుగుపాటుకు 16 మేకలు, పాడి ఆవు మృత్యువాత పడ్డాయి. వివిధ ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షంతో భారీగా పిడుగులు పడ్డాయి. రావికమతం శెట్టివారి పాకలు వద్ద వర్షానికి చింత చెట్టు కిందకు మేకలు వెళ్లగా ఆ చెట్టుపై పిడుగు పడడంతో సీరా సాంబ, రమణ, దేవర అప్పలనాయుడు, నమ్మి వెంకటస్వామిలకు చెందిన 14 మేకలు, కేబీపీ అగ్రహారంలో దేవర అప్పారావుకు చెందిన 2 మేకలు మృతి చెందాయి. వాటి విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మట్టవానిపాలెం గ్రామ శివారు ప్రాంతంలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు పాడి ఆవు మృతి చెందింది. దీని విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని బాధిత రైతు మైచర్ల విశ్వనాథం తెలిపారు. -
ఏపీఆర్డీసీకి దిమిలి విద్యార్థి ఎంపిక
కోటవురట్ల: స్థానిక ప్రభుత్వ జానియర్ కళాశాలలో చదివిన విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాడు. ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షా ఫలితాలలో కళాశాలకు చెందిన దిమిలి భవానీ ప్రసాద్ రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించాడు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరు ఎ.ఆర్.టి.సుజాత, అధ్యాపకులు విద్యార్థిని అభినందించారు. విద్యార్థి దిమిలి ప్రసాద్ మాట్లాడుతూ నాగార్జునసాగర్‌లో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో బీకాంలో చేరి భవిష్యత్‌లో మంచి ఉద్యోగం సాధించాలన్నది కోరికగా తెలిపాడు. కళాశాలలో లెక్చరర్లు మంచి సహకారం అందించారని వారికి కృతజ్ఞతలు తెలిపాడు. -
అందమైన బంధం
సామరస్యతతోనే శాశ్వతం భార్యాభర్తల సంబంధాలు చాలా సున్నితమైనవి. అందంగా అల్లుకున్న అనుబంధం చిన్నపాటి కలతలకే ఒక్కోసారి చెదిరిపోయే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో వారితో మాట్లాడి సమాధానపరిస్తే సమస్య ఇట్టే పరిష్కారం అయిపోతుంది. అలాంటి గురుతర బాధ్యతను నెరవేరుస్తోంది అనకాపల్లిలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్. ఆధునికీకరించిన కౌన్సెలింగ్ సెంటర్ భవనాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా గురువారం ప్రారంభించారు. ● సత్ఫలితాలను ఇస్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ ● మూడు వంతుల కేసులు సుఖాంతం -
చోరీ కేసులో ముగ్గురు అరెస్టు
బుచ్చెయ్యపేట: మండలంలో గల వడ్డాది పోస్టాఫీసులో దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. గత నెల 17వ తేదీన వడ్డాది పోస్టాఫీసు తాళాలు పగలగొట్టి రూ, 67,855 నగదును గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకుపోయారన్నారు. దీనిపై పోస్టాఫీసు బీఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామన్నారు. క్లూస్ టీం, సీసీ పుటేజీ, టెక్నాలజీ ఆధారంగా చోరీకి పాల్పడ్డ వడ్డాది ఎస్సీ కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నామన్నారు. ఆ ముగ్గురిలో ఒకరు మైనర్ కాగా మిగిలిన ఇద్దరు 18 ఏళ్ల యువకులన్నారు. మైనర్ బాలుడిని జువైనల్‌కు, ఇద్దరిని రిమాండ్‌కి తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. దొంగలను చౌకచక్యంగా పట్టుకున్న సిబ్బంది అర్జున్, గణేష్, వెంకట్‌లను ఎస్ఐ అభినందించారు. -
మాజీ ఎమ్మెల్యే చిట్టినాయుడు భార్య మృతి
సాక్షి, పాడేరు: పాడేరు మాజీ ఎమ్మెల్యే, దివంగత కొట్టగుళ్లి చిట్టినాయుడు భార్య గంగాభవానీ (70) మంగళవారం రాత్రి కేజీహెచ్‌లో వైద్యసేవలు పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మికి గంగాభవాని మాతృమూర్తి. సమాచారం తెలుసుకున్న అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, వైఎస్సార్సీపీ నేత చెట్టి వినయ్ సంతాపం వ్యక్తం చేశారు. వారంతా పాడేరులోని గుడివాడ గ్రామానికి చేరుకుని గంగాభవానీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తదితరులు సంతాపం తెలిపారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయులు, వర్తకులంతా గంగాభవానికి కన్నీటి వీడ్కోలు పలికారు. స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. సంతాప సూచకంగా మధ్యాహ్నం వరకు పట్టణంలోని వర్తకులు దుకాణాలను మూసివేశారు. -
చోడవరం టీడీపీలో వర్గ పోరు
● ఎమ్మెల్యే రాజు తీరుపై తాతయ్యబాబు, మల్లునాయుడు గుర్రు ● అసమ్మతి నాయకులకు ఎంపీ సీఎం రమేష్ ప్రోత్సాహం! చోడవరం: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుల మధ్య ఆధిపత్య వర్గపోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర రూరల్ హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మధ్య ఆధిపత్య పోరు బహిరంగంగానే జరుగుతోంది. ఎమ్మెల్యే రాజుకి అత్యంత సన్నిహితుడు, క్లాస్మేట్ అయిన గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు కూడా ఎమ్మెల్యే తీరుపై లోలోపల అసమ్మతితో ఉన్నారు. వాస్తవానికి వీరు ముగ్గురూ గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం రాజుకే టిక్కెట్టు ఇవ్వడంతో తాతయ్యబాబు, మల్లునాయుడు అసమ్మతితోనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాతయ్యబాబు నేరుగా మంత్రి లోకేష్‌తో సంబంధాలు పెట్టుకోవడంతో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కోటరీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవితోపాటు అధికారం వచ్చిన వెంటనే రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్‌గా కూడా పదవి దక్కింది. ఈ పరిణామం ఎమ్మెల్యే రాజుకి రుచించలేదు. అధిష్టానం నేరుగా తాతయ్యబాబుకు పదవులు ఇవ్వడంతో ఎమ్మెల్యే అంటీఅంటనట్టుగా ఉన్నారు. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉన్న కాపు సామాజికవర్గానికి చెందిన తాతయ్యబాబు తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. అన్ని గ్రామాల్లోనూ చాపకింద నీరులా తన వర్గం మరింత బలపడేలా పావులు కదుపుతున్నారు. దీనిని ఏమాత్రం సహించలేకపోతున్న ఎమ్మెల్యే రాజు చెక్‌పెట్టేందుకు తాతయ్యబాబు సొంత మండలమైన బుచ్చెయ్యపేటలోనే వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణకు పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో తాతయ్యబాబుకు సమాచారం లేకుండానే గేదెల సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే పాల్గొంటుండడంతో తాతయ్యబాబు వర్గానికి ఏమాత్రం నచ్చడం లేదు. వడ్డాదిలో బయటపడ్డ విభేదాలు ఇటీవల వడ్డాదిలో పార్టీ సమాశానికి జిల్లా అధ్యక్షుడైన తాతయ్యబాబు ఫొటో లేకుండానే ఫ్లెక్సీ వేయించడంతో ఇరువర్గాల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ విషయం లోకేష్, చంద్రబాబు వరకూ కూడా తాతయ్యబాబు తీసుకెళ్లి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఈ గొడవ జరిగిన ఈ నెలరోజుల్లో పార్టీ అధిష్టానం ఏమి చెప్పిందో గానీ తాతయ్యబాబు తన వర్గాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఆయనే ముఖ్య అతిథిగా వెళ్లిపోతుండడంపై ఎమ్మెల్యే మరింత గుర్రుగా ఉన్నారు. బుచ్చెయ్యపేటతో పాటు చోడవరం, రావికమతం, రోలుగుంట మండలాల్లో కూడా వీరిద్దరి వర్గాలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. ఈ పరిణామం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల్లో తీవ్ర అయోమయాన్ని నింపింది. మరో పక్క మల్లునాయుడు కూడా తన వెలమ సామాజిక వర్గంతో పాటు పార్టీలో తన అనుచరుల వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజుకి చోడవరం పట్టణం వరకూ మల్లునాయుడు కుడి భుజంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే పక్కనే ఉంటూనే రెండుసార్లు తనకు ఎమ్మెల్యే టిక్కెట్టు రాకుండా అడ్డుపడి తన స్వలాభం కోసం రాజు చేస్తున్న రాజకీయ చతురతకు ఈసారి చెక్ పెట్టాలని మల్లునాయుడు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన కూడా బయటకు ఎమ్మెల్యేతో తిరుగుతూ లోలోపల ఎంపీ రమేష్, తాతయ్యబాబులతో సఖ్యతగా ఉంటూ తన వర్గాన్ని బలోపేతం చేసుకునే చర్యలు చేపట్టారు. ఇటీవల పలు పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా వెళ్లడం, చోడవరం పట్టణంలో మరిడిమాంబ పండగను ఎంతో ప్రతిష్టాత్మకంగా మల్లునాయుడే తన భుజాలపైనే వేసుకొని చేసినప్పటికీ ఈ రెండు కార్యక్రమాలకు ఎమ్మెల్యే రాకుండా డుమ్మా కొట్టడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇంకా నాలుగేళ్లు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే అధికార టీడీపీ ప్రధాన నాయకులు మధ్య ఆధిపత్య , వర్గ విభేదాలు మరింత బహిర్గతం కావడంతో తటస్థంగా ఉన్న పార్టీ కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి ఎంపీ సీఎం రమేష్ లోపాయికారిగా ప్రోత్సాహం అందిస్తున్నారంటూ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ వర్గ విభేదాలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఎస్పీ తుహిన్ సిన్హా
ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి మాకవరపాలెం: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఎస్పీ తుహిన్‌సిన్హా పోలీసు సిబ్బందిని ఆదేశించారు. మాకవరపాలెం పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, నేర నియంత్రణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ర్యాగింగ్, మహిళలపై జరుగుతున్న వేధింపులు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళా చట్టాలపైన, శక్తి యాప్‌పైన విసృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో కీలకమని, వీటిపై ప్రజలకు వివరించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను తనిఖీ చేసిన ఎస్పీ సిబ్బందితో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై స్పందించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ పాల్గొన్నారు. -
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను వినియోగించుకోవాలి
తుమ్మపాల: విద్యాసంస్థలకు వేసవి సెలవుల దృష్ట్యా జిల్లాలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను విద్యార్థులు వినియోగించుకోవాలని ఇన్చార్జి కలెక్టర్, జేసీ ఎం.జాహ్నవి అన్నారు. కలెక్టరేట్లో బుధవారం తన చాంబర్లో వేసవి క్రీడా శిబిరాల క్రీడాకారులకు క్రీడా పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 50 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులందరూ క్రీడా శిబిరాలను వినియోగించుకుని ఆటలలో బాగా రాణించాలని, భవిష్యత్తులో పతకాలు సాధించాలన్నారు. ఆటల వల్ల విద్యార్థుల మనో వికాసం పెరుగుతుందని, ఆరోగ్యం బాగుంటుందని, చదువులో రాణిస్తారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటలలో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలన్నారు. ప్రతి క్రీడా శిబిరానికి రూ.5 వేలు విలువచేసే క్రీడా పరికరాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎల్.వి.రమణ క్రీడా శిక్షణ శిబిరాల వివరాలు తెలియజేస్తూ జిల్లాలో ఏర్పాటు చేసిన 50 శిక్షణ శిబిరాలకు 982 మంది విద్యార్థుల పేర్లు నమాదు చేసుకున్నారని, వారిలో 612 మంది బాలురు, 370 మంది బాలికలు ఉన్నారన్నారు. వీరికి 20 క్రీడా అంశాలలో శిక్షణ అందిస్తున్నామన్నారు. 8 నుండి 14 ఏళ్ల వయస్సు గల విద్యార్థులలో ప్రతిభావంతులను గుర్తించి వారిని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం క్రీడా శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందు ఇటీవల జరిగిన సివిల్ సర్వీసెస్ ఆటల పోటీల్లో వెండి పతకం సాధించిన ఖోఖో జాతీయ స్థాయి రజత పతక విజేత శ్యామ్ ప్రసాద్‌ను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు కె.త్రిమూర్తులు, రెహమాన్, చిరంజీవి, రమేష్, అచ్చుతాపురం, జిల్లాపరిషత్ పాఠశాల క్రీడా శిబిరం, హరిపాలెం రగ్బీ ఆట శిబిరం, అక్కిరెడ్డిపాలెం క్రీడాశిబిరం విద్యార్థులు పాల్గొన్నారు. -
అచ్యుతాపురం కూడలిలో ట్రాఫిక్ కష్టాలు
● ఫ్లై–ఓవర్ నిర్మాణ పనులతో సమస్యలు ● ప్రత్యామ్నాయ రహదారులు లేక ట్రాఫిక్ ఇక్కట్లు ● అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం అచ్యుతాపురం రూరల్ : సెజ్ కర్మాగారాల నుంచి వచ్చే భారీ వాహనాలను అచ్యుతాపురం పాత సినిమా హాల్ పక్క నుంచి పోలీస్‌స్టేషన్‌కి వెళ్లే మార్గంలో మళ్లించడం వల్ల బుధవారం ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అచ్యుతాపురం కూడలిలో ఫ్లై–ఓవర్ నిర్మించడానికి ఏర్పాటు చేసిన భారీ యంత్రం కారణంగా అటువైపు వాహనాలు రాకపోకలు చేయడానికి వీలుకాలేదు. ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో పరిశ్రమలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే కార్మికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. సరైన ప్రణాళిక లేకుండా... ఫ్లై–ఓవర్ నిర్మాణంలో నిర్వాహకులకు సరైన అవగాహన లేకపోవడం కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు అంటున్నారు. ట్రాఫిక్ని మళ్లించకుండా ఫ్లై–ఓవర్ నిర్మాణం పనులు చేపడితే వచ్చే సమస్యలను గ్రహించలేకపోవడం అధికారులు, నాయకుల తెలివితక్కువ తనంగా భావిస్తున్నారు. ఆ మాత్రం అవగాహన లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం పిచ్చికి పరాకాష్టగా ఉందని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఎలా...! ఆరంభంలోనే ఇంతటి ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటే మున్ముందు మరెన్ని ఇబ్బందులు పడాలోనని జనం వాపోతున్నారు. ఇటువంటి ట్రాఫిక్ సమస్యలు ఎదురైతే అత్యవసరంగా పరిశ్రమల్లో కానీ స్థానిక నివాసాల్లో గానీ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు వెళ్లేందుకు కూడా వీలులేనంత ట్రాఫిక్ ఇబ్బంది కలిగింది. ముందస్తు ఆలోచన లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే అభివృద్ధి కార్యక్రమాల కారణంగా అనేక మంది అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అధికారులకు ఫ్లై–ఓవర్ నిర్మాణంలో ట్రాఫిక్ని మళ్లించే విధానం సరికాదని తెలిసినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితిలో నోరు మెదపలేకున్నామని అంటున్నారు. కొందరి స్వార్థ పూరిత ఆలోచనల కారణంగా సామాన్య పౌరులు సమస్యల పాలౌతున్నారని వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, నాయకులు మంచి ఆలోచనతో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ముందుగా ఫ్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేసి వాహనాలను మల్లించి అనంతరం అవసరమైతే అప్పుడు ఫై–ఓవర్ నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
రోగి వైద్య సమాచారం ఆన్లైన్లో నమోదు చేయాలి
● జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంటు అధికారి ప్రశాంతి ● జిల్లాలో అన్ని పీహెచ్‌సీలకు సమాచారం ● నాతవరం పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ నాతవరం: ప్రభుత్వం నుంచి కొత్తగా వచ్చిన ఆదేశాల ప్రకారం పీహెచ్సీలలో వైద్యులు పరీక్షించిన రోగి తాలుకా ఆరోగ్య సమాచారాన్ని విధిగా ఆన్లైన్లో డిజిటల్ రికార్డు నమోదు చేయాలని జిల్లా ప్రోగ్రాం మేనేజమెంట్ అధికారి (డీపీఎంవో)జె.ప్రశాంతి అన్నారు. మండల కేంద్రంలో గల పీహెచ్‌సీని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో రోగులకు అందిస్తున్న వైద్య సమాచారం ఆన్లైన్లో నమోదు చేసిన రికార్డులను స్వయంగా పరిశీలించారు. పీహెచ్‌సీకి రోజు వారీ వస్తున్న రోగుల వివరాలను వైద్యాధికారి ప్రసన్నను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో ప్రధాన సమస్యలు, సిబ్బంది వివరాలు అడిగి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నుంచి కొత్తగా వచ్చిన ఆదేశాల ప్రకారం పీహెచ్సీలో రోగికి అందించిన వైద్యం, మందుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఆ రోగి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పీహెచ్సీలో వైద్యం కోసం వెళ్తే ఆ రోగికి గతంలో ఏవ్యాధి ఉండేది ఏయే మందులు అందజేశారనే పూర్తి సమాచారం ఆధార్ నంబర్ ఆన్లైన్లో చెక్ చేస్తే తెలుస్తుందన్నారు. డీఎంహెచ్‌వో ఆదేశాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ప్రసన్న , ఫార్మసిస్టు వెంకటరావు , హెల్త్ సూపర్వైజర్లు బైరాగి, వెంకటరమణ పాల్గొన్నారు. -
12 కిలోల గంజాయి స్వాధీనం
నక్కపల్లి: జాతీయరహదారిపై వేంపాడు టోల్‌ప్లాజా వద్ద తమిళనాడు, బెంగళూరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి నక్కపల్లి పోలీసులు 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సీఐ కుమార స్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బెంగళూరుకు చెందిన మునివెంకటప్ప అంజనప్ప, తమిళనాడుకు చెందిన కుప్పా ముత్తులు స్కూలు బ్యాగుల్లో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోతుండగా ఎస్ఐ సన్నిబాబు ఆధ్వర్యంలో సిబ్బంది వెంబడించి పట్టుకున్నారన్నారు. వారి వద్ద రూ.50 వేలు విలువగల 12 కిలోల గంజాయి లభించిందన్నారు. గంజాయి స్వాధీనం చేసు కుని ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం జరి గిందన్నారు. అంజనప్పపై గతంలో హత్య కేసు, కుప్పా ముత్తపై గంజాయి కేసు నమోదయిందని తెలిపారు. -
గోవాడ సుగర్స్‌ను ప్రభుత్వం ఆదుకోవాలి
చోడవరం : గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఆదుకోవాలని ఫ్యాక్టరీ కార్మికుల సమావేశం కోరింది. గోవాడ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో సుగర్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ కార్మిక సంఘం సమావేశం బుధవారం నిర్వహించారు. గుర్తింపు యూనియన్ ప్రధానకార్యదర్శి కె.వి. భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనేక సమస్యలు, ఫ్యాక్టరీ మనుగడ, రానున్న క్రషింగ్ సీజన్‌కు చేపట్టవలసిన చర్యలపై కార్మికులు చర్చించారు. 2024–25 క్రషింగ్ సీజన్లో తలెత్తిన అనేక సమస్యలు, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వానికి తెలియజేసేందుకు రాజకీయాలకు అతీతంగా ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వేసిన కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబును, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను, మంత్రి లోకేష్‌ను అనేకసార్లు కలిసి వివరించడం జరిగిందని కార్యదర్శి భాస్కరరావు అన్నారు. ఫ్యాక్టరీని, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకూ ఎటువంటి సాయం అందలేదన్నారు. మరలా మరోసారి చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎంలను, అనకాపల్లి ఎంపీని కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఫ్యాక్టరీ ఆస్తులను రీ వాల్యుయేషన్ చేయించి ప్రభుత్వ గ్యారంటీతో వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేయాలని, 2025–26 రానున్న క్రషింగ్ సీజన్‌కు వర్కింగ్ క్యాపిటల్ నిమిత్తం, ప్రస్తుతం రైతులకు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించుటకు అవసరమైన నిధులు ప్రభుత్వం మంజూరు చేయాలని సమావేశంలో తీర్మాణించింది. వచ్చే సీజన్‌కు ఓవర్‌హాలింగ్ పనులు పూర్తిగా చేసి కోజనరేషన్ ఉత్పత్తి కూడా పూర్తిగా జరిగేలా ఫ్యాక్టరీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘం సమావేశంలో కోరింది. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు బండి శ్రీను, నూకరాజు, అల్లం రామఅప్పారావు, జగన్నాథరావు, సత్యనారాయణ, శ్రీనివాసరాజు పాల్గొన్నారు. వచ్చే క్రషింగ్ సీజన్‌కు అవసరమైన గ్రాంటు ఇవ్వాలి రైతులు, కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి ఫ్యాక్టరీ కార్మిక సంఘం డిమాండ్ -
నిందితుడిని పట్టుకున్న కానిస్టేబుల్‌కు రివార్డు
కోటవురట్ల : కె.వెంకటాపురంలో 2010లో సంచలనంగా మారిన హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ నరేష్‌ను డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించి రివార్డును అందజేశారు. ఇందుకు సంబంధించి ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలివి. పోలీసు డిపార్ట్మెంట్లో హోంగార్డుగా పనిచేస్తున్న పాంగి అప్పారావు 2010లో కె.వెంకటాపురంలో తుపాకీతో ఒకరిపై కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా ముద్దాయి అప్పారావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చి సమయం ముగిసినా సరెండర్ కాకుండా తప్పించుకు తిరుగుతుండడంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్లో అతని కదలికలు ఉన్నట్టు గుర్తించిన కానిస్టేబుల్ నరేష్ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందజేశాడు. వెంటనే ఎస్ఐ రమేష్ సిబ్బంది కలిసి నిందితుడు పాంగి అప్పారావును పట్టుకుని నర్సీపట్నం కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ విధించడంతో అతనిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన నరేష్‌కు డిపార్ట్మెంట్ తరపున రివార్డును అందజేశారు. నక్కపల్లి సీఐ ఎల్.రామకృష్ణ, ఎస్ఐ రమేష్ అభినందించారు. -
19న దేవరాపల్లి వైస్ ఎంపీపీ ఎన్నిక
దేవరాపల్లి : మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను ఈ నెల 19న పకడ్బందీగా నిర్వహించనున్నట్లు స్థానిక ఎంపీడీవో సువర్ణరాజు తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఈ నెల 12న షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులకు, ఎమ్మెల్యే, ఎంపీకు ఇప్పటికే సమాచారం అందించామన్నారు. 19న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి చేతులు ఎత్తే పద్ధతిలో వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించి, ఫలితాన్ని వెంటనే ప్రకటిస్తామన్నారు. గతంలో వైస్ ఎంపీపీ–1గా ఎన్నికై న చింతల బుల్లిలక్ష్మి ఇటీవల నిర్వహించిన మండల పరిషత్ అధ్యక్ష ఉప ఎన్నికలో ఎంపీపీగా గెలుపొందారు. దీంతో వైస్ ఎంపీపీ–1 స్థానం ఖాళీ కావడంతో ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. కాగా ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా మండల ప్రత్యేక అధికారి ఎస్.మంజులవాణిని నియమించినట్టు ఎంపీడీవో తెలిపారు. -
రచ్చకెక్కిన విభేదాలు
● దేవరాపల్లి మండల కమిటీ ఎన్నికలో భగ్గుమన్న అసమ్మతి సెగలు ● ఎమ్మెల్యే బండారు ముందే కుమ్ములాటకు దిగిన కార్యకర్తలు ● వలస నేతలపై పార్టీలో పాత కాపుల గుర్రు దేవరాపల్లి: మండల టీడీపీ నేతలు వర్గ విభేదాలతో కుమ్ములాటకు దిగి రచ్చకెక్కారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సాక్షిగా పరస్పర దూషణలతో బాహాబాహీకి దిగారు. దేవరాపల్లిలోని రైవాడ అథితి గృహం వద్ద బుధవారం జరిగిన టీడీపీ సంస్థాగత ఎన్నిక వేదికగా కార్యకర్తలు గొడవ పడ్డారు. దీంతో ఈ సమావేశం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. స్థానిక ఎస్ఐ టి.మల్లేశ్వరరావు, సీఐ పైడపునాయుడు దగ్గరుండి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పాత టీడీపీ నేతలు, సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వలస నేతల మధ్య ఆధిపత్య పోరు ఈ వివాదానికి కారణంగా చెబుతున్నారు. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేదికగా చేసుకొని ఎమ్మెల్యే సమక్షంలో ఇరువర్గాలు వాగ్వివాదానికి దిగారు. తొలి నుంచీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు కొందరు ఎమ్మెల్యే ఎదుటే తమ అసంతృప్తిని వెళ్లగెక్కారు. దీంతో ఎమ్మెల్యే సహనం కోల్పోయి కొన్ని గ్రామాల నాయకులపై చిందులు తొక్కారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సహా పార్టీ పరిశీలకుడి ముందు కార్యకర్తలు బాహాబాహీకి దిగడానికి సిద్ధపడగా అక్కడే ఉన్న స్థానిక ఎస్ఐ మల్లేశ్వరరావు, సీఐ పైడపునాయుడు ఇతర పోలీస్ సిబ్బంది అడ్డుకొని సర్దిచెప్పారు. ఎమ్మెల్యేతో కలిగొట్ల నేతల వాగ్వాదం ప్రధాన కార్యదర్శిగా పదవి పేరు ప్రకటన సమయంలో ఒకే వ్యక్తికి పదవులు కట్టబెట్టడంపై ఎమ్మెల్యేతో కలిగొట్ల గ్రామానికి చెందిన కొందరు నేతలు వాదనకు దిగారు. ఈ సమయంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఎదురించే వారిని తాను లెక్క చేయనని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఆగ్రహించడంతో పార్టీ శ్రేణులు తీవ్ర విస్మయానికి గురయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగు దేశం జెండాను మోసిన వారిని కాదని, వలస నేతలకు ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నేతలు కొందరు గుర్రుగా ఉన్నారు. కుమ్ములాటలు, దూషణల నడుమ టీడీపీ మండల అధ్యక్షుడిగా ఎ.కొత్తపల్లి పెద్దాడ వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా కలిగొట్ల దొగ్గ దేముడునాయుడు పేర్లను ఎమ్మెల్యే, పార్టీ పరిశీలకుడు ప్రకటించారు. వర్గ విభేదాల నేపథ్యంలో రైవాడ, బోయిలకింతాడ, మారేపల్లి, కాశీపురం గ్రామ కమిటీ ఎన్నిక ప్రక్రియను వాయిదా వేశారు. -
ప్రజల భద్రతకు కొత్త దిక్సూచి
● హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌసుల్లో అతిథుల వివరాల నమోదు ● నేర చరితులు, అనుమానితులుంటే ఈ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ● ప్రస్తుతం జిల్లాలో 79 చోట్ల యాప్ డౌన్లోడ్ ● దశలవారీగా అన్ని పర్యాటక కేంద్రాల్లోనూ అందుబాటులోకి.. ఇలా గుర్తిస్తారు.. సందర్శకుల వివరాలను ఆధార్ కార్డు ద్వారా ‘సేఫ్ స్టే’ మొబైల్ యాప్‌లో నమోదు చేయాలి. వారిలో నిందితులు ఎవరైనా ఉన్నట్లయితే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు పూర్తి వివరాలు తెలుస్తాయి. తక్షణమే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తారు. అక్కడకు పోలీసులు వెళ్లి అనుమానితుల పూర్తి వివరాలు తెలుసుకుంటారు. ఇది నేరాలను నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటి దశగా జిల్లాలో 79 హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లలో యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. దశలవారీగా మిగిలిన చిన్నచిన్న హోటళ్లలోనూ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని పోలీస్ శాఖ చెబుతోంది. అనకాపల్లి: అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరులను రక్షించడానికి అనకాపల్లి పోలీసులు ‘సేఫ్ స్టే’ యాప్‌ను ప్రారంభించారు. హోటళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలలో బస చేసే అతిథుల వివరాలను.. క్రిమినల్స్ వివరాల డేటాబేస్‌తో సరిపోల్చి నేరస్తులను గుర్తించేందుకు ఈ యాప్ ఉపయోగపడనుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న లాడ్జీలు, హోటళ్లలో ఈ యాప్‌ను పొందుపరుస్తున్నారు. అక్కడ ఎవరు చెక్ ఇన్ చేసినా వారి వివరాలను ఈ ఆన్లైన్ యాప్‌లో పొందుపరిస్తే, వెంటనే అవి పోలీసులకు చేరతాయి. నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల వివరాలతో సరిపోలితే తక్షణమే పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు వీలుంటుంది. ఈనెల 8 నుంచి అమల్లోకి.. నేరస్తులను నిలువరించేందుకు సాధారణంగా చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేసి అనుమానముంటే అదుపులోకి తీసుకుంటారు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మన ప్రాంతంలో స్టే చేసే వారి వివరాలను సైతం విశ్లేషిస్తే అనుమానితులను ముందే కట్టడి చేయవచ్చు.. లేదా నేరం జరిగాక త్వరగా నిందితులను గుర్తించవచ్చు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే సేఫ్ స్టే యాప్. ఈనెల 8న జిల్లా పోలీస్ శాఖ ఈ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్‌ను జిల్లాలోని ప్రధానమైన హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌసుల్లో డౌన్లోడ్ చేయించారు. మిగతావారు కూడా ఈ యాప్‌ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల భద్రత మరింత పటిష్టం చేసేందుకే.. ‘సేఫ్ స్టే‘ యాప్ ద్వారా నేరస్తులను ముందుగానే గుర్తించవచ్చు. నేరాలను తగ్గించవచ్చు. ప్రజల భద్రతకు పూర్తి భరోసా కల్పించడానికి వీలుంటుంది. ఈ యాప్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంటుంది. దశలవారీగా జిల్లాలో యాప్ డౌన్లోడ్ చేయిస్తాం. త్వరలో రెండో దశలో పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. – తుహిన్ సిన్హా, ఎస్పీ ‘సేఫ్ స్టే‘ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన జిల్లా పోలీసులు -
సైన్స్ రీసెర్చ్ చేస్తా..
పాలిసెట్‌లో 120 మార్కులకు గాను 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించాను. ఈ రోజే విడుదలైన ఏపీఆర్జేసీలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు వచ్చింది. పదో తరగతిలో 595 మార్కులు వచ్చాయి. మా స్వస్థలం గుంటూరు కాగా మా నాన్న రాజేంద్రబాబు దివీస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. సంగివలసలో నివాసం ఉంటున్నాం. మా అమ్మ గృహిణి. ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతాను. ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేస్తాను. అనంతరం సైన్స్ రీసెర్చ్ చేస్తాను. –బాలినేని కల్యాణ్‌రామ్, 2వ ర్యాంకు -
అల్లూరి పార్కు అభివృద్ధికి ప్రణాళిక
● త్వరలో పనులు ప్రారంభం ● స్పీకర్ అయ్యన్నపాత్రుడు గొలుగొండ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆయన బుధవారం పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్కు అభివృద్ధికి సహకరించమని ఇప్పటి వరకు 10 మంది ఎంపీలతో మాట్లాడానని, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు రూ.10 లక్షలు, నెల్లూరి ఎంపీ మస్తాన్‌రావు రూ.10 లక్షలు ఇవ్వగా మరో 8 మంది ఎంపీలు త్వరలో నిధులు కేటాయించనున్నారని తెలిపారు. పార్కులో సోలార్ సిస్టమ్, భోజనశాల, మరుగుదొడ్లు, పార్కు చుట్టూ లైటింగ్, తాగునీరు ఏర్పాటు చేసి, శిథిలమైన భవనాలకు మరమ్మతులు చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ టూరిజం నుంచి నిధులు కూడా తీసుకువస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీ టూరిజం అధికారులు విజయభాస్కరరెడ్డి, సీతారాం, సత్యనారాయణ, టూరిజం మేనేజర్ అప్పలనాయుడు, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ పాల్గొన్నారు. -
వుషు స్టేట్ టోర్నమెంట్లో 12 మెడల్స్
నర్సీపట్నం: రాష్ట్ర స్థాయి వుషు టోర్నమెంట్లో నింజాస్ అకాడమీకి చెందిన క్రీడాకారులు 12 పతకాలు సాధించారు. కర్నూల్ జిల్లా శ్రీవెంకటేశ్వర కల్యాణమండపంలో ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగిన స్టేట్ వుషు చాంపియన్‌షిప్ పోటీల్లో వీరు పాల్గొన్నారు. అక్షయ రాణి–సీనియర్ వుమెన్.. శ్రీరామ్ నిహాల్, పి.ప్రణీత–సబ్ జూనియర్.. వై.దివాకర్ మెన్ సీనియర్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించారు. జి.సాయి ఉమెన్ సీనియర్, యు.రవికుమార్ సీనియర్ మెన్ విభాగంలో సిల్వర్ మెడల్స్ సాధించారు. సబ్ జూనియర్ బాయ్స్ విభాగంలో టి.జగదీష్, వై.సాత్విక్, ఎం.దుర్గాప్రసాద్, ఎం.హర్ష, ఎం.సాయి సందీప్, కె.విజయ్ కుమార్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. కోచ్ ప్రియాంక్ ఆధ్వర్యంలో క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారులను మోహన్ ముత్యాల, నేషనల్ రిఫరీ వెంకటేష్ అభినందించారు. 600 మందికి పైగా పాల్గొన్న క్రీడాకారుల్లో నింజాస్ క్రీడాకారులు పోటీ పడి మెడల్స్ సాధించారన్నారు. -
సవతి ప్రేమ!
విశాఖ జోన్‌పై కన్సాలిడేట్ బడ్జెట్లో అరకొర కేటాయింపులు డబ్లింగ్ పనులు.. కొత్త లైన్లకు నిధులు ● జోన్‌కు అన్యాయం చేస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ మిగిలిన విషయాల్లో కొంతమేర కేటాయింపులు చేయడం ఉపశమనం కలిగించే అంశం. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పనులకు ఈ బడ్జెట్లో కొంత మేర నిధులు కేటాయించడం శుభపరిణామం. కన్సాలిడేటెడ్ బడ్జెట్లో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో కేటాయింపులిలా ఉన్నాయి. ● ఓర్ ఎక్స్ఛేంజ్ కాంప్లెక్స్(ఓఈసీ) నుంచి ఉత్తర సింహాచలం వరకు 5.22 కి.మీ మేర డబ్లింగ్ పనులకు రూ.81.22 కోట్లు. ● పెందుర్తి నుంచి ఉత్తర సింహాచలం మధ్యలో సింహాచలం వద్ద సర్ఫేస్ క్రాసింగ్ లేకుండా చేసేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రూ.183.65 కోట్లు ● దువ్వాడ నుంచి ఉత్తర సింహాచలం వరకు 20.543 కిలోమీటర్ల మేర 3, 4వ లైన్ల నిర్మాణం కోసం రూ.302.25 కోట్లు. ● వడ్లపూడి జంక్షన్‌ను అనుసంధానిస్తూ గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ వరకూ టై లైన్ మాదిరిగా 12.04 కి.మీ మేర 3, 4వ లైన్ల నిర్మాణానికి రూ.154.28 కోట్లు. ● విశాఖపట్నం నుంచి గోపాలపట్నం వరకు 15.31 కి.మీ మేర థర్డ్, ఫోర్త్ లైన్ల నిర్మాణానికి రూ.159.47 కోట్లు. ● ఉత్తర సింహాచలం నుంచి గోపాలపట్నం వరకు 2.64 కి.మీ మేర థర్డ్, ఫోర్త్ లైన్ల నిర్మాణానికి రూ.129.45 కోట్లు. ● పలాస–విశాఖపట్నం–దువ్వాడ(బీ రూట్)లో ట్రాక్ పునరుద్ధరణ పనుల కోసం రూ.15 కోట్లు. ● ఉత్తర సింహాచలం నుంచి గోపాలపట్నం వరకు 2.07 కి.మీ మేర బైపాస్ డబ్లింగ్ పనులకు రూ.25.93 కోట్లు. ● విశాఖపట్నం కాంప్లెక్స్ ఏరియాలో ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ కోసం రూ.43.07 కోట్లు. సాక్షి, విశాఖపట్నం : కొబ్బరికాయ కొట్టేశాం.. కార్యాలయాలు కట్టేయండి అన్నట్లుగా మారింది విశాఖ రైల్వే జోన్‌పై ప్రభుత్వ వైఖరి. ప్రచార ఆర్భాటం.. ఆపై శంకుస్థాపన.. భూమి చదును.. ప్రజెంటేషన్లు.. గ్రాఫిక్స్‌లోనే హడావుడి కనిపిస్తుందే తప్ప.. క్షేత్రస్థాయిలో మాత్రం అడుగు కూడా కదలడం లేదన్న విషయం నిధుల కేటాయింపులోనే స్పష్టమవుతోంది. 2025–26 బడ్జెట్‌కు అనుబంధంగా రైల్వే కేటాయింపులకు సంబంధించిన కన్సాలిడేటెడ్ బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై సవతి ప్రేమ మాత్రమే కనిపిస్తోంది. విశాఖ రైల్వే జోన్‌తో పాటు దానికి అనుబంధంగా ఏర్పాటవుతున్న రాయగడ డివిజన్ అంబ్రెల్లా వర్క్స్‌కు కలిపి కేవలం రూ.170 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. రాయగడ డివిజన్ పనులకు మాత్రం ప్రత్యేకంగా మరో రూ.110 కోట్లు కేటాయించడం మరింత బలాన్ని చేకూర్చుతోంది. కీలకమైన జోన్‌కు పప్పుబెల్లాలు ఇచ్చి.. రాయగడ డివిజన్‌కు మాత్రం భారీగా నిధులు అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.భూమి చదును పనులకే పరిమితం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు శంకుస్థాపన జరిగి నాలుగు నెలలు.. టెండర్లు ఖరారు చేసి ఐదు నెలలు పూర్తయినా.. ఇంకా భూమి చదును పనులకే పరిమితమైంది. నిధుల మంజూరులో జాప్యం జరుగుతుండటం వల్లనే పనుల ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగుతోంది. 2025–26 బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఒక్క రూపాయి విదిలించని రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా రైల్వే కన్సాలిడేటెడ్ బడ్జెట్లోనూ మొండి చెయ్యి చూపించింది. కూటమిప్రభుత్వ నిర్లక్ష్యంతోనే..! జోన్‌కు శంకుస్థాపన చేసేశామంటూ పచ్చపత్రికల్లోనూ, సోషల్ మీడియాల్లోనూ భారీగా ప్రచారం చేసుకున్న కూటమి ప్రభుత్వం.. జోన్ ప్రధాన కార్యాలయాల నిర్మాణం మాత్రం తమకు అవసరం లేదన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కూడా వైజాగ్ జోన్ కార్యకలాపాలు ఇప్పట్లో ప్రారంభించకపోయినా ఫర్వాలేదన్నట్లుగా భావిస్తోంది. అందుకే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను పక్కనపెట్టి రాయగడ డివిజన్ నిర్మాణానికే పెద్దపీట వేస్తూ ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. అయినా కూటమి ఎంపీలు నోరు మెదపకపోవడం దురదృష్టకరం. -
ఉగ్రదాడులను ఎదుర్కొందామిలా..
అనకాపల్లిలో మాక్ డ్రిల్ అనకాపల్లి: ఉగ్రదాడులు, విపత్తులను ఎదుర్కోవడంపై అవగాహన కల్పించేందుకు అనకాపల్లిలో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పూడిమడక రోడ్డులోని గ్రీన్ హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో శేషాద్రి బ్లాక్ వద్ద ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, వైద్యారోగ్య శాఖలు పాల్గొన్నాయి. యుద్ధం వల్ల బాంబులు పడి, గ్యాస్ లీక్, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటే ఎలా బయటపడాలో వివరించారు. బాంబులు, ఇతర పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే విధానాన్ని కూడా వివరించారు. పై అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడం, క్షతగాత్రులను అక్కడి నుంచి కిందకు దించడం, వారికి వైద్య సహాయాన్ని అందించడం, హుటాహుటిన అంబులెన్సు ద్వారా ఆసుపత్రికి తరలించడం, , సహాయ చర్యలు చేపట్టడం వంటి అంశాలను ప్రత్యక్షంగా డ్రిల్ చేసి చూపించారు. ప్రకృతి వైపరీత్యాలతోపాటు, మానవ ప్రేరేపిత ప్రమాదాలను సైతం ఎదుర్కొనే విధానాన్ని వివరించి, అధికారులు తమ సన్నద్ధతను తెలియజేశారు. అప్రమత్తతే శ్రీరామరక్ష ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అదే మనను విపత్కర పరిస్థితుల నుంచి కాపాడుతుందని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. మాక్‌డ్రిల్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంత పెద్ద జనాభా గల అపార్ట్మెంట్లలో విపత్తుల నుంచి ఎలా బయటపడాలో వివరించారన్నారు. ఇన్చార్జి ఆర్డీవో శ్రీనివాస్, డీఎంహెచ్‌వో శాంతిప్రభ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఆర్.వెంకటరమణ, ఎన్డీఆర్ఎఫ్. ఇన్స్పెక్టర్ సుశాంత్ కుమార్, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
నర్సీపట్నం: గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ముందుస్తు సమాచారం మేరకు సీఐ జి.గోవిందరావు, ఎస్సై ఉమామహేశ్వరరావు, సిబ్బంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. చింతపల్లి వైపు నుంచి వస్తూ పోలీసులను గమనించిన స్మగ్లర్లు కారును కొంత దూరంలో ఆపి పారిపోయేందుకు ప్రయత్నించారు. అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కారు వెనక సీటుకు ప్రత్యేకంగా అర తయారు చేయించి 2 కిలోల చొప్పున ఐదు ప్యాకెట్లలో పది కిలోల గంజాయిని అమర్చారు. తమ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించడంతో గంజాయి బయటపడింది. తమిళనాడు, తిరుపూర్ భారతి నగర్ స్కూల్ వీధికి చెందిన కార్తీక్ అండవర్(34), అదే రాష్ట్రం విజయపురి రోడ్ మేలాతేరు, కోవిలపట్టికి చెందిన కారు డ్రైవర్ దీపన్(34)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కారుతో పాటు వీరి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు, రూ.8 వేలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. గంజాయిని కేసును ఛేదించిన సిబ్బందికి నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో ఎస్సై రమేష్ పాల్గొన్నారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత
పాయకరావుపేట: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్ ప్రకాష్ మంగళవారం తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో ఎన్.సత్యసాయి 483/500, ఎమ్.యశ్వసి 482/500, పి.తరుణ్ 481/500, ఎస్.రఘునందన్ 478/500 మార్కులతో సత్తా చాటారని, ప్లస్ –2 ఫలితాల్లో జి.సాయి అనీష్ 469/500, ధాత్రి నిహారిక 466/500 మార్కులు సాధించారన్నారు. నూటికి నూరు శాతం ఉత్తీర్ణతతో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. మాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో తమ విద్యార్థులు 100/100 మార్కులు సాధించడం హర్షణీయమన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె. నరసింహారావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. -
భళా... ఆమె నృత్య కళ
● ఉద్యోగం చేస్తూనే శిక్షణ ● ఆసక్తి చూపుతున్న బాలబాలికలు ● శాసీ్త్రయ నృత్యంలో రాణింపు ● నాట్య గురువు ఉమాదేవి స్ఫూర్తిదాయకం నర్సీపట్నం: సంస్కృతీ సంప్రదాయాలను బోధిస్తూనే... మనసుకు ఆహ్లాదం పంచుతోంది నృత్యం. ఈ కళావైభవాన్ని భావితరాలకు పంచేందుకు కృషి చేస్తున్నారు నాట్యగురువు ఉమాదేవి. అభినయం, నృత్యంలో ఎవరూ సాటిరారనేలా తన శిష్య బృందంతో నర్తిస్తూ ప్రశంసలందుకుంటున్నారు. శాసీ్త్రయ నృత్యంలో చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. తొలుత నృత్యంపై ఆసక్తి పెంచుకున్నామె, అందులో పట్టుసాధించి శిక్షకురాలిగా మారారు. ప్రభు త్వ సంస్థలో ఔట్ సోర్సింగ్ విభాగంలో ఉద్యోగిగా స్థిరపడినప్పటికీ నృత్యంపై మక్కువతో పది మందిని తీర్చిదిద్దాలనే తపనతో పెదబొడ్డేపల్లిలో శ్రీమృతేశ్వర నాట్య అకాడమీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 12 మంది బాలికలు శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు తర్ఫీదు ఇస్తున్నారు. పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు... శాశ్వత శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న బాలికలు, శిక్షకురాలు ఉమాదేవి ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. తిరుపతి, అన్నవరం, అప్పనపల్లి పాటు నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తూ ప్రశంసలు పొందుతున్నారు. అటు చదువులోనూ ఇటు కళల్లోనూ రాణిస్తూ పలువురి మెప్పు అందుకుంటున్నారు. బాలబాలికల్లో దాగి ఉన్న అంతర్గత ప్రతిభకు పదును పెడుతూ శాసీ్త్రయ నృత్యంలో ఎంతో మంది ప్రముఖల మన్ననలు పొందుతున్నారు. సంప్రదాయ నృత్యంతో శ్రీమృతేశ్వర నాట్య అకాడమీ బాలికలు నర్సీపట్నం పేరున నలుదిశలా వ్యాపింపజేస్తున్నారు. వేసవి విజ్ఞాన శిబిరంలోనూ తర్ఫీదు మరికొంత మంది బాలబాలికలను శాసీ్త్రయ నృత్యంలో తీర్చిదిద్దేందుకు నర్సీపట్నం శారదానగర్‌లో వేసవి నృత్య శిక్షణ శిబిరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ శిబిరంలో ఆంధ్రనాట్యంలోని అన్నమాచార్యులు, త్యాగరాజు కీర్తనలపై శాసీ్త్రయ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శాసీ్త్రయ నృత్యంపై 35 మంది బాలబాలికలకు నేర్పిస్తున్నారు. అటు చదువులోనూ..ఇటు సంప్రదాయ నృత్యంపై చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. -
పింఛన్ల డ్యూటీ నుంచి మినహాయించాలి
అనకాపల్లి: గ్రామాల్లో సామాజిక పింఛన్లు పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు రెండు, మూడు నెలలు పాటు సహకరించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. నాగశేషు తెలిపారు. స్థానిక దొడ్డి రామునాయుడు భవనంలో మంగళవారం ఆమె మాట్లాడారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి పిల్లల బరువు తీయడం, టీహెచ్ఆర్(టేక్ హోమ్ రేషన్) పంపిణీ చేయడం, పిల్లలకు వండి పెట్టడం, ప్రీ స్కూల్ నిర్వహించటం, యాప్‌లో అప్లోడ్ చేయడం ఇలా అనేక పనులతో సతమతమవుతున్న నేపథ్యంలో పెన్షన్ పంపిణీ భారం మోపొద్దన్నారు. అంగన్వాడీ సిబ్బంది తీవ్ర పని ఒత్తిడితో అనార్యోగానికి గురవుతున్నట్లు వాపోయారు. గుంటూరులో రాజకీయ జోక్యం వల్ల ఒక కార్యకర్తను సస్పెండ్ చేశారన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు ఎం. దుర్గరాణి, సభ్యురాలు సిహెచ్ రామలక్ష్మి, ఎ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట సాగుకు అనుకూలం
అనకాపల్లి: వర్ష సూచన ఉన్నందున కోత దశలో నువ్వు పైరును వాతావరణ పరిస్థితులు గమనించి కోసుకోవాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ సీహెచ్.ముకుందరావు తెలిపారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయంలో శాస్త్రవేత్తలతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోసిన పంటలు వర్షానికి తడవకుండా రైతులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రాగల వర్షాన్ని ఉపయోగించుకుని ఖరీఫ్‌కి ముందు జనుము లేదా జీలుగ లేదా పిల్లిపెసర లేదా పెసర వంటి పచ్చిరొట్ట పైరును వేసుకోవడానికి ఇదే అనువైన సమయమని పేర్కొన్నారు. వర్షాన్ని వినియోగించుకుని చెరకు వేసే రైతులు నేల తయారీ చేసుకోవాలన్నారు. చెరకులో నల్లి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పక్వానికి వచ్చి మామిడి, బొప్పాయి పండ్లను కోసి మార్కెట్‌కు తరలించాలన్నారు. పక్వానికి రాని గెలలు ఉంటే, కింద పడకుండా ఉండడానికి కర్రలతో ఊతమివ్వాలన్నారు. మామిడిలో పండు ఈగ ఆశించే అవకాశం ఉందని, నివారణకు రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలన్నారు. ప్లాస్టిక్ పళ్లెంలో మిథైల్ యూజినాల్ 2 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి తోటలో వేలగట్టాలని లేదా మార్కెట్లో లభ్యమయ్యే పండు ఈగను ఆకర్షించే బుట్టలను ఎకరాకు 5 చొప్పున 5–6 అడుగుల ఎత్తులో కొమ్మలకు కట్టాలని సూచించారు. వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవడానికి ఇది సరైన సమయమన్నారు. లోతు దుక్కులు చేయడం వల్ల కలుపు సమస్యను అధిగమించవచ్చని, పంటను నష్టపరిచే కీటకాలు, తెగుళ్ల ఉధృతిని తగ్గించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు బి.భవాని, పి.వి.పద్మావతి. ఎ.అలివేణి తదితరులు పాల్గొన్నారు. -
నునపర్తిలో అక్రమ గ్రావెల్ దందా
రాత్రిళ్లు భారీగా లారీల్లో తరలింపు అచ్యుతాపురం రూరల్: మండలంలోని నునపర్తి శివారు నడింపల్లి కొండల్ని రాత్రికి రాత్రి గ్రావెల్ దొంగలు దోచేస్తున్నారు. రెండు జేసీబీలతో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టి సుమారు 20కుపైగా లారీలతో తరలిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికంగా కొందరు యువకులు తెలిపారు. అక్రమ కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు. రేయింబవళ్లు అని తేడా లేకుండా ఇష్టారాజ్యంగా చెట్లను నరికేయడం, కొండలను పిండి చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ ధనార్జన చేస్తున్నారు. ఎవరైనా అధికారులు తూతూమంత్రంగా ఆపినా ఒకట్రెండు రోజులు తర్వాత షరామామూలే అన్నట్టుగా గ్రావెల్ దందా చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
నృత్యంలో రాణించడమే లక్ష్యం
శాసీ్త్రయ నృత్యమంటే ఇష్టం. చదువుకుంటూనే సమయాన్ని వృథా చేయకుండా అకాడమీకి వచ్చి ఆంధ్ర న్యాటం నేర్చుకుంటున్నాను. శాసీ్త్రయ నృత్యాల్లో రాణించాలనేది నా కల. –లలితా శాన్విక, పెదబొడ్డేపల్లి నృత్యం నేర్చుకోవటం అదృష్టం... అన్నమయ్య, త్యాగరాజు కీర్తనలకు నృత్యం నేర్చుకోవటం నా అదృష్టం. నృత్యంలో ప్రాథమిక అంశాలు నేర్చుకున్నాను. నృత్యంలో రాణిస్తానన్న నమ్మకం ఉంది. టీచర్ ఉమాదేవి ప్రోత్సహంతో నృత్యంలో రాణిస్తాను. –యశ్విత, నర్సీపట్నం -
5 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
రోలుగుంట: హత్యాయత్నం కేసులో అయిదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై రామకృష్ణారావు మంగళవారం తెలిపారు. మండలంలోని బీబీపట్నం గ్రామానికి చెందిన బాకూరి రామరాజుపై హత్యాయత్నం కేసు నమోదు కాగా, అప్పటి నుంచి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి వచ్చినట్టు సమాచారం అందుకుని మంగళవారం ఇతన్ని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచామని తెలిపారు. ఇద్దరు యువకులపై పోక్సో కేసు అనకాపల్లి టౌన్: బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై రవికుమార్ మంగళవారం తెలిపారు. ఓ గ్రామానికి చెందిన బాలిక(14)పై తగరంపూడి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడినట్టు ఫిర్యాదు అందిందన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు సాక్షి, విశాఖపట్నం : స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో బ్లాస్ట్‌ఫర్నేస్–1 విభాగంలో సమ్మె ప్రచారం నిర్వహించారు. దీనిపై ఆగ్రహించిన యాజమాన్యం కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిప్రదేశం వదిలి వెళ్లడాన్ని తప్పు పడుతూ 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరికొందరికి బుధవారం నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసు జారీ చేయడం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. యాజమాన్యం వైఖరికి నిరసనగా బుధవారం ఉదయం ఉక్కు అడ్మిన్ భవనం కూడలి వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు కార్మిక నాయకులు ప్రకటించారు. -
నృత్యం అంటే మక్కువ...
చిన్నప్పటి నుంచి శాసీ్త్రయ నృత్యం అంటే ఇష్టం. గజముఖ నృత్య అకాడమీ ధనం మాస్టారు దగ్గర శాసీ్త్రయ నృత్యంలో తర్ఫీదు పొందాను. నేను నేర్చుకున్న కలను పలువురికి అందించాలనే తపనతో సొంతంగా శ్రీమృతేశ్వర నృత్య అకాడమీని స్థాపించాను. నా దగ్గర ప్రస్తుతం 47 మంది బాలబాలికలు శిక్షణ పొందుతున్నారు. శిక్షణకే పరిమితం కాకుండా బాలికలతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. ఉద్యోగం ఉన్నప్పటికీ కళ మీద మక్కువతో శిక్షణ ఇస్తున్నాను. తల్లిదండ్రులు పిల్లల అభిరుచికి అనుగుణంగా ప్రోత్సహించాలి. –ఉమాదేవి, అకాడమీ శిక్షకురాలు, నర్సీపట్నం -
రూ.31 కోట్లతో తాగునీటి సమస్యకు పరిష్కారం
● ఉపాధి హామీలో ఇంకుడు గుంతల తవ్వకాలు ● జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో చైర్పర్సన్ సుభద్ర వెల్లడి మహారాణిపేట(విశాఖ): ఉమ్మడి విశాఖజిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.31 కోట్లు కేటాయించిందని, ఈ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర మంగళవారం తెలిపారు. జల్ జీవన్ మిషన్ పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆమె వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన పలు స్థాయీ సంఘాల సమావేశాల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మూడు ఇంకుడు గుంతల తవ్వకానికి అనుమతిస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న మురుగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇంకుడు గుంతలను నిర్మించనున్నట్టు చైర్పర్సన్ వెల్లడించారు. ఒక్కో ఇంకుడు గుంత నిర్మాణానికి సుమారు రూ. 74 వేల వరకు ఖర్చు అవుతుందని, ఈ నిధులను పూర్తిగా ఉపాధి హామీ పథకం ద్వారానే వెచ్చిస్తామని ఆమె స్పష్టం చేశారు. సమావేశంలో గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులు, ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగింది. వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను సభకు సమర్పించగా, సభ్యులు పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీపై స్పందిస్తూ, ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఒకవేళ ఎవరికై నా పింఛను అందకపోతే వెంటనే ఎంపీడీవోని సంప్రదించాలని చైర్పర్సన్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థలం కలిగిన రైతులు తమ భూముల్లో మొక్కలు పెంచడానికి ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవచ్చని ఆమె తెలిపారు. మన్యంలో దోమల బెడద అరకు జెడ్పీటీసీ శెట్టి రోషిణి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో దోమల బెడద అధికంగా ఉందని, దీని నివారణకు తక్షణమే ఫాగింగ్ చేపట్టాలని కోరారు. దోమల వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 108 అంబులెన్సులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, అత్యవసర పరిస్థితుల్లో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, బండారు సత్యనారాయణమూర్తి, జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్, మూడు జిల్లాల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మట్టి..కొల్లగొట్టి
రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా పోలవరం ఎడమ కాల్వ, అసైన్డ్ భూముల్లో అక్రమ తవ్వకాలు● యథేచ్ఛగా అక్రమ రవాణా ● చోద్యం చూస్తున్న రెవెన్యూ, మైనింగ్ అధికారులు ● అడ్డుకట్ట వేయాలని ప్రజల డిమాండ్ యలమంచిలి రూరల్: మండలంలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది.అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా నిర్వహిస్తూ రూ.కోట్లు గడిస్తోంది.అధికార టీడీపీ,జనసేన నేతల అండదండలు మట్టి మాఫియాకు ఉండడంతో అధికారులు సైతం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పోలవరం ఎడమ ప్రధాన కాల్వ గట్టు,చెరువులు,అసైన్డ్ భూములు,పంట పొలాల్లో మట్టిని యంత్రాలతో యథేచ్ఛగా తవ్వు తూ టిప్పర్లు,ట్రాక్టర్లతో ప్రైవేటు వెంచర్లు,కట్టడాలు, ఇటుక బట్టీలకు తరలించి రూ.లక్షలు గడిస్తున్నారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలను రెవెన్యూ,గనుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ఇంతవరకు కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.మండలంలో నిత్యం కొంతమంది టీడీపీ,జనసేన గ్రామ,మండల స్థాయి నాయకుల కనుసన్నల్లో ప్రతి రోజూ పదుల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లతో మట్టి అక్రమ రవాణా జరుగుతోంది. మంగళవారం యలమంచిలి మండలం ఏటికొప్పాకలో సచివాలయం ఎదురుగా ఉన్న రహదారి మీదుగా వీఆర్వో చూస్తుండగానే పది ట్రాక్టర్లతో మట్టిని ఓ ఇంటి నిర్మాణ పనులకు తరలించడం,ఆ వివరాలను సేకరించేందుకు వెళ్లిన కొందరు మీడియా ప్రతినిధులపై మట్టి మాఫియా దురుసుగా ప్రవర్తించడం, మీ ఇష్టం వచ్చిన పనిచేసుకోండని ప్రవర్తించిన తీరు మండలంలో చర్చనీయాంశమైంది. కల్పతరువు.. పోలవరం కాల్వ గట్లు యలమంచిలి మండలంలో పోలవరం ఎడమ ప్రధాన కాల్వ గట్ల నుంచి గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.కొందరు అక్రమార్కులు అధికార కూటమి నేతల అండదండలతో రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా యంత్రాలతో తవ్వకాలు జరిపి,లారీలు,ట్రాక్టర్లతో అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారు.లారీ సైజును బట్టీ గ్రావెల్ లేదా మట్టి లోడుకు రూ.6 వేల నుంచి రూ.22,500 వేలు,ట్రాక్టరుకు రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. నిరంతరాయంగా ఈ దందా కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ముఖ్యంగా ఈ అక్రమ తవ్వకాలపై నిఘా ఉంచి, అడ్డుకోవాల్సిన రెవెన్యూ,గనుల శాఖ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. ఎవరైనా మీడియా ప్రతినిధులు తెలియజేసినప్పుడు లేదా పత్రికల్లో వార్తలు వచ్చిన సందర్భాల్లో ఒకటి రెండ్రోజులు హడావుడి చేయడం తప్ప పకడ్బందీగా మట్టి మాఫియా ఆగడాలు కట్టించడంలో అధికారులు విఫలమవుతున్నారనే చెప్పాలి.మట్టి అక్రమ తవ్వకాలు ఎక్కువగా శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారే వరకు,ఇతర సెలవు దినాల్లో జరుగుతున్నాయి.ఇక కొన్ని చోట్ల పట్టపగలే దర్జాగా అధికారపార్టీ ప్రజా ప్రతినిధుల అండదండలతో ఈ దందా కొనసాగుతోంది. వెంచర్లు,బట్టీలు,నిర్మాణాలకు తరలింపు యలమంచిలి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు,ఇటుక బట్టీలు, నిర్మాణాలకు మట్టిని భారీగా తరలిస్తున్నారు.వెంచర్లు వేసేటప్పుడు మట్టి ఎక్కువగా అవసరమతుంది.వీటికి అవసరమయ్యే మట్టి లేదా గ్రావెల్‌ను జనసేన,టీడీపీ నేతలు గంపగుత్తగా మాట్లాడుకుని మట్టి తోలుకుని రూ.లక్షల్లో వెనకేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ గ్రావెల్,మట్టి తవ్వకాల సమాచారం అందించినా గనుల శాఖ అధికారులు సిబ్బంది కొరత పేరుతో తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు.ఎక్కడైనా మట్టి అక్రమంగా తవ్వకాలు జరుపితే ఎంత మొత్తంలో మట్టి తరలించారో నిర్థారించాల్సిన గనుల శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.ఇక రెవెన్యూ అధికారులు,సిబ్బంది సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తమ కళ్లముందే అక్రమ వ్యవహారం జరుగుతున్నా కళ్లకు గంతలు కట్టుకోవడం మరీ దారుణం. చర్యలు తీసుకుంటాం అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. మట్టి,గ్రావెల్ తవ్వకాలపై ని ఘా ఉంచుతున్నాం.గ్రామ స్థాయిలో వీఆర్వో,ఆపైన ఆర్ఐలు పర్యవేక్షించేలా ఆదేశాలిస్తున్నాం.ఎక్కడైనా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేస్తే మాకు సమాచారం అందించాలి.తక్షణమే మా సిబ్బందిని ఆ ప్రాంతానికి పంపించి ఆయా వాహనాలను స్వాధీనపర్చుకుని. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. –కె.వరహాలు, తహసీల్దార్, యలమంచిలి మీడియాపై దౌర్జన్యం మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసి కొందరు మీడియా ప్రతినిధులు వాటిని కవర్ చేసేందుకు వెళుతున్నపుడు అక్రమార్కులు వారిపై దురుసుగా ప్రవర్తించడం,కొందరు దుర్భాషలాడుతూ,దౌర్జన్యాలకు దిగడానికి కూడా వెనుకాడడం లేదు. ఫొటోలు,వీడియోలు తీస్తున్న మీడియా ప్రనినిధులను అడ్డుకోవడం,వారిపట్ల దురుసుగా మాట్లాడడం పరిపాటిగా మారింది.ఇటీవల యలమంచిలి సమీపంలో మామిడివాడ,కొత్తూరు ప్రాంతాల్లో ఒక జనసేన నాయకుడు అక్రమంగా చేస్తున్న మట్టి తవ్వకాల వద్దకు వెళ్లిన ఒక మీడియా ప్రతినిధిపై దౌర్జన్యానికి దిగాడు.మంగళవారం యలమంచిలి మండలం ఏటికొప్పాకలో జరుగుతున్న మట్టి అక్రమ రవాణా వద్దకు వెళ్లిన మీడియా ప్రతినిధులతో అక్రమార్కులు మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి..ఏమీ చేయలేరని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం వెనుక అధికార యంత్రాంగం అండదండలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి.మీడియా ప్రతినిధులు సమాచారం ఇచ్చినా గ్రామస్థాయిలో వీఆర్వో అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ తవ్వకాలు జరుపుతున్న పొక్లెయిన్,మట్టి అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను అక్కడి నుంచి తరలించుకుపోయిన తర్వాత అక్కడకు వెళ్తుండడం వెనుక ఆంతర్యం బహిరంగ రహస్యమే. -
ఖాళీ క్యారేజీలతో ఉపాధి వేతనదారుల ఆందోళన
దేవరాపల్లి: ఉపాధి హామీపథకం బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కూలీలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని తిమిరాం, వెంకటరాజుపురం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం వేతనదారులు ఖాళీ క్యారేజీలతో ఆందోళన చేశారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. వెంకన్న మద్దతు పలికారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ఉపాధి వేతనదారులకు కూలి సొమ్ముతో పాటు ఆశాఖలో ఉద్యోగులకు సైతం జీతాలు చెల్లించక పోవడం దారుణమన్నారు. కూటమి పాలనలో ఉపాధి హామీపథకం అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల శ్రామిక కుటుంబాలకు రూ. 800 కోట్లు మేర బకాయిలు ఉండడంతో పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 15 వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేసవిలో వ్యవసాయ పనులు లభించక ఉపాధి హామీ పనులపై ఆధారపడి జీవించే పేదల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఈ పథకంలో రాజకీయ జోక్యం మితిమీరిపోతోందని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను ఏక పక్షంగా తొలగించి కూటమి సానుభూతి పరులను నియమిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో పార్టీల వారీగా పను లకు కేటాయిస్తున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పనులు కల్పించేలా ఒత్తిళ్లు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితులు మునుపెన్నడూ లేవని, ఉపాధి బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న ఉపాధి పనులు బంద్ చేస్తామని, దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని వెంకన్న కోరారు. పథకం అమలులోమితిమీరిన రాజకీయ జోక్యం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న -
నేడు మాక్ ఎక్సర్సైజ్
తుమ్మపాల: శత్రువుల దాడులు చేసే సమయంలో తమను తాము రక్షించుకునే విధానంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 14న మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్టు ఇన్చార్జి కలెక్టర్, జేసి ఎం.జాహ్నవి తెలిపారు. మన దేశంపై శత్రువులు దాడిచేసే పరిస్థితి సంభవించినప్పుడు ఏర్పడిన అత్యవసర పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు అనకాపల్లి బైపాస్ రోడ్డులోని జయభేరి మారుతీ షోరూం ఎదురుగా గల గ్రీన్ హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ వద్ద ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహించే మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొని, జాగ్రత్తలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర సంసిద్ధతపై పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. -
కనుల పండువగా వెంకన్నకు చక్రస్నానం
చోడవరం: స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈనెల 13న స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సోమవారం స్వామివారికి శ్రీ చక్ర స్నానం నిర్వహించారు. ప్రత్యేక పూజలు జరపారు. ప్రత్యేకంగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామివారి ఉత్సవ విగ్రహాలకు శ్రీ చక్రస్నానం చేశారు. ఎమ్మెల్యే రాజుతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ వింజుమూరి శంకర్, దేవదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి, ఆలయ కమిటీ ప్రతినిధులు ఉపాధ్యాయుల శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. -
మహిళలకు, దివ్యాంగులకు సత్యసాయి సంస్థల వితరణ
అనకాపల్లి: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలని సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి అప్పలనాయుడు అన్నారు. స్థానిక ఆర్టీసీ రహదారి సేవా సంస్థ కార్యాలయంలో దివ్యాంగులకు వీల్ చైర్లు, మహిళలకు కుట్టు మిషన్లు, రైతులకు స్ప్రేయింగ్ యూనిట్లు పంపిణీ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఏపీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఈ ఉపకరణాలను భగవాన్ బాబా వారి తల్లి ఈశ్వరమ్మ డే సందర్భంగా జిల్లాకు 22 మందికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఏడుగురు మహిళలకు కుట్టు మిషన్లు, ఇద్దరు మహిళలకు జ్యూట్ కుట్టుమిషన్లు, ఏడుగురుకు వ్యవసాయదారులకు స్ప్రేయర్లు, అరుగురు వికలాంగులకు వీల్ చైర్లు అందజేసినట్టు తెలిపారు. సంస్థ సభ్యులు రాజశేఖర్, కామరాజు, అప్పలనాయుడు తదితరులతో పాటు జోనల్ ఇంచార్జిలు రామారావు, ప్రసాదు, లోపరాజు, రవిశంకర్, మహిళా యూత్ కో–ఆర్డినేటర్ భారతి, జాయింట్ సర్వీస్ కో–ఆర్డినేటర్ సరోజ, కన్వీనరు నాగరాజు పాల్గొన్నారు. -
జగ్గప్పారావుకు జ్ఞానీ జైల్‌సింగ్ పురస్కారం
మునగపాక: మండలంలోని గవర్ల అనకాపల్లికి చెందిన సామాజిక కార్యకర్త బొడ్డేడ జగ్గప్పారావు (జగన్) జ్ఞానీ జైల్‌సింగ్ అవార్డును దక్కించుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి జరిగిన సత్కార కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షరీఫ్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే, ఏపీజేయూ 5 వసంతాల వార్షికోత్సవంలో భాగంగా జగన్‌ను సత్కరించారు. ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ , వివిధ స్వచ్ఛంద సంస్థల సంయుక్త నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో జగన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. సహచట్టం, వినియోగదారుల హక్కు చట్టం తదితర కార్యక్రమాలపై జగ్గప్పారావు విస్తృత ప్రచారం చేస్తూ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. -
ఎస్పీ కార్యాలయానికి 20 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యలు ఫిర్యాదుల పరిష్కార వేదికకు 20 అర్జీలు వచ్చాయి. తమ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, చీటింగ్ వంటి అంశాలపై అర్జీలు వచ్చినట్లు చెప్పారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్ఐ వెంకన్న పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయానికి అందిన ఫిర్యాదుల్లో కొన్ని... బంగారం తాకట్టు విడిపించాలని... తనకు నగదు అవసరమై బాబాయి వరస అయిన నారాయణరావు పేరు మీద అనకాపల్లి అన్నపూర్ణ బ్యాంక్‌లో 5.5 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టానని, అయితే తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలని కోరగా తన సొంత ఖర్చులకు రూ.2 లక్షలు ఇస్తేనే విడిపిస్తానని అంటున్నారని అనకాపల్లి మండలం మార్టూరుకు చెందిన గిసాల కుమారి తెలిపింది. దీనిపై గ్రామ పెద్దల సమక్షంలో పెట్టినప్పటికీ సమస్య పరిష్కరించలేదని, దీంతో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు తన కుమారుడికి మెడికల్ డిపార్టుమెంట్లో ఉద్యోగం వేయిస్తామని చెప్పడంతో విశాఖ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న తన బంధువు ద్వారా అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్‌కు 2003 జూలై 1వ తేదీన రూ.5.10 లక్షలు ఇచ్చానని కాకినాడ జిల్లా పిఠాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అల్లం అప్పలనర్సయ్య తెలిపారు. ఆ హెడ్ కానిస్టేబుల్ అమరావతిలో డిప్యూటేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారని, త్వరలో ఉద్యోగం వేయిస్తానని చెప్పి నేటికీ ఉద్యోగం వేయించలేదని, దీంతో ఇచ్చిన నగదును ఇవ్వాలని కోరినా స్పందించడం లేదని తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసగించిన హెడ్ కానిస్టేబుల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. -
ఆశా కార్యకర్తపై దాడికి పాల్పడిన నర్స్పై చర్యలు తీసుకోవాలి
అనకాపల్లి: కశింకోట మండలం మూలపేట గ్రామం ఆశా కార్యకర్తపై దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)జిల్లా నాయకులు ఎల్.శాంతి, ఈ.పార్వతి, కె.వరలక్ష్మి, బి రామలక్ష్మిలు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేసి, వైద్యాలయంలో సూపరిటెండెంట్ ఎం.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఎన్టీఆర్ ఆస్పత్రికి గర్భిణిని డెలివరీకి తీసుకువచ్చిన కశింకోట మండలం మూలపేట ఆశా కార్యకర్త సిహెచ్ మాధవిపై రాత్రి ఎన్టీఆర్ ఆసప6తిలో ‘మేటి అసిస్టెంట్‘ సరళ మిశ్రా అకారణంగా దాడి చేసిందన్నారు. ఆశాలకు భద్రత కల్పించాలని, ఆశా కార్యకర్తను దుర్భాషలాడిన సరళ మిశ్రాపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సూర్యకళ, లక్ష్మి, రమణమ్మ పాల్గొన్నారు. -
దస్తావేజు ఇవ్వకుండా వీఆర్వో వేధిస్తున్నారు...
ల్యాండ్‌పూలింగ్ ద్వారా సంపతిపురం గ్రామంలో సర్వే నెం.286/5లో 1.28 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుని బదులుగా సర్వే నెం.284/30లో 378 చదరపు గజాల ప్లాట్‌ను తమ పేరున దస్తావేజు – 8333/2023 లో రిజిస్ట్రేషన్ చేశారని, కానీ దస్తావేజులు ఇవ్వకుండా అప్పటి వీఆర్వో శ్రీనివాసరావు ఇబ్బందులకు గురి చేశారని అనకాపల్లి మండలం సంపతిపురం గ్రామానికి చెందిన ఈరుగుల పైడిరాజు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. బదిలీపై మరోచోటకు వెళ్లినప్పటికీ తన పేరున గల దస్తావేజులు ఇవ్వడం లేదని, అతని వద్ద ఉన్న దస్తావేజు పత్రాన్ని ఇప్పించడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
వికలాంగుడి భూమి కబ్జాకు యత్నం..
చీడికాడ మండలం చినగోగాడ గ్రామంలో ఉన్న తన భూమి రికార్డులు ట్యాంపరింగ్ చేసి భూ కబ్జాకు ప్రయత్నిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖ జిల్లా గాజువాక మండలం నాతయ్యపాలెం గ్రామానికి చెందిన వికలాంగుడు అక్కిరెడ్డి అప్పారావు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. చినగోగాడ గ్రామం సర్వే నెం.10–6లో 35 సెంట్ల భూమిని 2006లో కొనుగోలు ద్వారా వచ్చిందని, సదరు భూమిని తానే సాగుచేసుకుంటున్నానని, తాను వికలాంగుడిని కావడం, విశాఖ జిల్లాలో నివాసముండడంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తనకు తెలియకుండా తన భూమిని వారి పేరున రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించుకుని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వారి నుంచి తమకు రక్షణ కల్పించి తమ భూమిని కాపాడాలని కోరారు. -
పోలీస్ కస్టడీకి గర్నికం హత్యకేసు నిందితులు
రావికమతం: మండలంలో మేడివాడ యువకుడు కొలిపాక పవన్‌కుమార్‌ను గత నెల 6 వ తేదీన గర్నికం తిరుమల ఫంక్షన్‌హాల్ దగ్గర స్నేహితులు వేపాడ నరేంద్ర కుమార్, దుర్గాప్రసాద్, మైనర్ బాలుడితో కలిసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసు, వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి సంబంధించి దుర్గా ప్రసాధ్, నరేంద్రకుమార్‌లను రెండు రోజులు పోలీసు కస్టడీకి తీసుకున్నామని కొత్తకోట సీఐ కోటేశ్వరరావు తెలిపారు. దుర్గాప్రసాద్, నరేంద్రకుమార్ తూర్పుగోదావరి జిల్లాలో మూడు బైక్‌లు, కాకినాడ జిల్లాలో ఒక్కటి, గాజువాకలో ఒక్కటి, మొత్తం 5 బైకులను చోరీకి పాల్పడ్డారని, నిందితుల సమాచారం మేరకు వాటిని స్వాధీనం చేసుకుని, సంబంధిత పోలీసుస్టేషన్లకు అందజేశామని సీఐ కోటేశ్వరరావు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ రఘువర్మ పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
అక్కిరెడ్డిపాలెం: మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరు యువకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలివి.. గాజువాకకు చెందిన చింతలపూడి లావణ్య వెంకటసత్యకుమార్, కొండపల్లి తరుణ్ వద్ద 2.4 గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాలు ఉన్నాయని, వారు ఆటోనగర్ వద్ద ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు దాడి చేసి, వారి నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి మత్తు పదార్థాలను తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు విచారణలో యువకులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి, కోర్టు ఆదేశాల మేరకు వారిని రిమాండ్‌కు తరలించారు. -
రెవెన్యూ సమస్యలే అధికం
● పీజీఆర్ఎస్లో పరిష్కారం కాని అర్జీలు ● అర్జీని ఎండార్స్‌మెంట్‌తో ముగిస్తున్న అధికారులు భూ పంపకాల్లో వివాదం గతంలో కుమారుడితో పాటు కుమార్తెలకు సమానంగా పంచి మూడు భాగాలుగా ఏర్పాటు చేసుకుని సాగుతో పాటు రెవెన్యూ రికార్డుల్లో ముగ్గురి పేరున నమోదు చేయించుకున్న పంపకాలను కాదని కొడుకు ఇబ్బందులు పెడుతున్నాడని చోడవరం మండలం పీఎస్ పేట గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు బండారు దేముడమ్మ కలెక్టరేట్లో జిల్లా అధికారులకు తెలిపింది. నడవలేని ఆమె కుమార్తె సహాయంతో ఆటోలో కలెక్టరేట్‌కు చేరుకుని తనకు భర్తమూలంగా, స్వార్జితంగాను వచ్చిన భూమి వివరాలతో పీజీఆర్ఎస్లో నమోదు చేసింది. ఆర్వోఆర్ కేసులు, ఎంఎల్‌సీసీ మీటింగ్‌లకు కూడా తాము హాజరవుతున్నామని, అయినా పరిష్కారం దొరకడం లేదని ఆమె కుమార్తె బోకం పైడితల్లమ్మ తెలిపింది. తుమ్మపాల: కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రోజురోజుకు ప్రజల మన్ననలు కోల్పోతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా పూర్తి కాకుండానే ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు పీజీఆర్ఎస్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని అధికారులు, పాలకులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని ప్రజలు చేసుకున్న అర్జీలకు పరిష్కారం లభించడం లేదని వాపోతున్నారు. జిల్లా స్థాయి అధికారి ధ్రువీకరణతో సమస్యపై ఎండార్స్మెంట్ మాత్రం ఇస్తున్నారని తెలిపారు. సోమవారం ఎండ తీవ్రంగా ఉండడంతో కలెక్టరేట్ వద్ద నిరసనల సంఖ్య తగ్గింది. పీజీఆర్ఎస్ వేదిక నుంచి ఇంచార్జి కలెక్టర్ ఎం.జాహ్నవి, డీఆర్వో సత్యనారాయణరావు, జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి–170, పంచాయతీ రాజ్ –25, పోలీస్–13, ఇతర శాఖల్లోను ఫిర్యాదులు నమోదయ్యాయి. బార్క్ నిర్వాసితుల నిరసన బార్క్ నిర్వాసితుల జాబితాలో కక్షపూరితంగా తమ పేర్లు తొలగించారంటూ అచ్చుతాపురం మండలం తంతడి శివారు యాతపాలేనికి చెందిన 30 మందికి పైగా నిర్వాసితులు కలెక్టరేట్ వద్ద నిరసన చేశారు. బార్క్ ఎక్స్టెన్సన్లో ఇల్లు కోల్పోయిన తమకు 2005 ఏడాదిలో నష్టపరిహారం మంజూరు చేసారని, తదుపరి ప్రభుత్వం చేపట్టిన రెండు సర్వేల్లో నిర్వాసితుల జాబితాలో తమ పేర్లు కొనసాగాయని, ఇటీవల చేపట్టిన సర్వేలో తమ పేర్లను తొలగించి ఈ నెల 8న సచివాలయంలో జాబితా ప్రదర్శించారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. కేబుల్ ఆపరేటర్ సంఘాల నిరసన ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ పథకంపై సీఎం చంద్రబాబు కేబుల్ ఆపరేటర్ సంఘాల నేతలతో రివ్యూ మీటింగ్ నిర్వహించి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ), ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ (ఎఫ్ఓఎఫ్), మల్టీ సర్వీసెస్ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల శ్రీరామ్, మల్టీ సర్వీసెస్ జిల్లా అధ్యక్షుడు కొణతాల ప్రకాష్, ఎఫ్ఓఎఫ్ జిల్లా అధ్యక్షుడు నడింపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తున్న ఫైబర్ నెట్ పథకం రానురాను దిగజారి పోతుందని, 2017లో పారంభించి ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ల్యాండ్ ఫోన్‌ను నాణ్యతతో కూడిన సేవలు తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులో కొనసాగుతున్నాయని, ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ఏపి ఫైబర్‌లో ఉన్నఫలంగా వందలాది మంది సిబ్బందిని తొలగించడంతో సేవలకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెటాప్ బాక్స్‌లపై రూ. 59 రెంట్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం పీజీఆర్ఎస్లో ఇంచార్జి కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. మత్స్యాకార భరోసా అందలేదు అచ్యుతాపురం రూరల్: అర్హులైన మత్స్యకారులకు మ త్స్యకార భరోసా అందలేదని మండల వైస్ ఎంపీపీ వాసుపల్లి పద్మావతి శ్రీనివాస్ అన్నారు. అర్హులైన మ త్స్యకారులకు వేట నిషేధ భృతి అందేలా న్యాయం చేయాలంటూ సోమవారం జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. బోటుకు ఇద్దరు చొప్పున మత్స్యకార భరో సా అర్హులకు అందనీయకుండా పక్కదోవ పట్టించారని, సుమారు 200 మంది అర్హులైన మత్స్యకారులకు వే ట నిషేధ భృతి అందలేదని తెలిపారు. అవకతవకలపై విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలన్నారు. చెరకు రైతుకు రవాణా చార్జీలు చెల్లించాలిబుచ్చెయ్యపేట: గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన వారికి రవాణా ఖర్చులు, వెయిటింగ్ చార్జీలు అందించాలని బుచ్చెయ్యపేటకు చెందిన పలువురు చెరకు రైతులు జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్‌కు చెరకు కాటాల నుంచి లారీల ద్వారా చెరకును తరలించాల్సిన కాంట్రాక్టర్ చెరకును పూర్తిగా తరలించకుండా మధ్యలోనే ఆపేయడంతో రైతులే సొంత ఖర్చుతో తరలించారని, ఫ్యాక్టరీ మరమ్మతులతో క్రషింగ్ నిలిచిపోవడంతో ఫ్యాక్టరీ అధికారులు రవాణా ఖర్చులతో పాటు వెయిటింగ్ ఛార్జీలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ కాంట్రాక్టర్‌కు రవాణా ఛార్జీలు చెల్లించిన అధికారులు రైతులకు మాత్రం ఇవ్వలేదని రైతులు గోపిశెట్టి శ్రీను, గాడి శ్రీను, రమణబాబు,ఐయితరెడ్డి రమణ తదితరులు తెలిపారు. ఈ మేరకు సోమవారం అనకాపల్లి కలెక్టరేట్లో జరిగిన స్పందనలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్‌కు వినతి పత్రం అందించారు. -
పంట భూములను ఖాళీగా ఉంచొద్దు
కశింకోట: పంట భూములను ఖాళీ ఉంచకుండా ఏదో పంట వేసి పచ్చగా ఉంచడానికి రైతులు కృషి చేయాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ సిహెచ్.లచ్చన్న కోరారు. మండలంలోని సుందరయ్యపేట శివారు లాలంకొత్తూరులో ఉన్న మండల మెగా ప్రకృతి వనరుల కేంద్రం వద్ద మూడో విడత నవ ధాన్యాలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట భూములను పంటలు వేయకుండా వృథాగా ఉంచరాదన్నారు. ప్రకృతి వ్యవసాయం సాగుకు విత్తనాలను రైతుల నుంచి సేకరించి పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే ఈ ఏడాది పండించిన నవ ధాన్య పంటల విత్తనాలను కూడా స్థానిక రైతుల నుంచి సేకరించి వచ్చే ఏడాది రైతులకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నవ ధాన్యాలను సకాలంలో నాటుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం సమర్ధంగా చేస్తున్న కూండ్రపు నూకాలమ్మను ఉత్తమ రైతుగా ఎంపిక చేసి దుశ్శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి సత్కరించారు. సర్పంచ్ వాసు, ప్రకృతి వనరుల కేంద్రం నిర్వాహకురాలు అరుణ, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, వీహెచ్‌ఎ కిషోర్ పాల్గొన్నారు. -
40 మందికి చికిత్సలు, 10 మందికి రక్త పరీక్షలు
పెద గరువులో వైద్య శిబిరం రోలుగుంట: అర్ల పంచాయతీ శివారు పెద గరువులో జ్వరాలపై సోమవారం పత్రికల్లో వచ్చిన వార్తపై వైద్య సిబ్బంది స్పందించారు. బుచ్చింపేట వైద్యుడు ఎస్.శ్రీనివాసరాజు ఫీల్డ్ సిబ్బందితో కలసి పెద గురువు గ్రామంలో సోమవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 62 మంది జనాభా గల ఇక్కడ 40 మందికి ఆరోగ్య పరీక్షలు చేశారు. పది మందికి రక్తపు పూతలు తీశారు. వారిలో కిలో ప్రవీణ్‌కుమార్(8)కి జ్వరమని నిర్ధారించి పీహెచ్‌సీకి రిఫర్ చేశారు. సిరిడి రాణి(7), కిలో ఆశ(5), కిలో పౌలి (ఏడాదిన్నర వయసు)కి దగ్గు, జలుబుగా గుర్తించి మందులు అందజేశారు. వైద్యాధికారి మాట్లాడుతూ గ్రామంలో పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. వాతావరణ మార్పులు, వేసవి ఎండలకు వైరల్ జ్వరాలు సాధారణమన్నారు. మరగకాచిన నీరు తాగాలని, నిల్వ ఆహారం తీసుకోకూడదని గ్రామస్తులకు సూచించారు. -
పూటకో మాట.. రోజుకో నిబంధన
● గందరగోళంగా పాఠశాలలపునర్వ్యవస్థీకరణ ● యూటీఎఫ్ ధ్వజం అనకాపల్లి: పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో లోపాలను సవరించాలని, పూటకోక మాట.. రోజుకో నిబంధనలతో విద్యావ్యవస్థను గందరగోళంలోకి నెట్టడం జరుగుతుందని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొందవి చిన్నబ్బాయ్ అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన డీఈవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్య వ్యవస్థను గందరగోళంలోకి నెట్టేస్తూ టీచర్ల బదిలీలు, పదోన్నతులను ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలుగా విభజిస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని తొమ్మిది రకాల పాఠశాలలుగా విభజించి ప్రజలను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టిందన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు జీవో నంబర్ 117 ను రద్దు చేస్తామని ఏడాదిపాటు చెబుతున్నప్పటికీ, ఇప్పటికీ రద్దు చేయలేదన్నారు, ఆ జీవోలో ఉన్న ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని కొనసాగించడం తగదన్నారు. హై స్కూళ్లలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 గా ఉండాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో 1:20 గా ఉండాలని, యూపీ పాఠశాలలను ఎత్తి వేయడం వల్ల పల్లె విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. 40 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా మార్చాలని పేర్కొన్నారు. రేషనలైజేషన్‌కు ఏప్రిల్ 23 నాటి విద్యార్థుల రోల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బదిలీలు, పదోన్నతులకు స్థిరమైన మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. సమస్యల సాధన కోసం ఈనెల 15న రాష్ట్ర స్థాయి ధర్నా విజయవాడలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యుటీఎఫ్ గౌరవాధ్యక్షుడు బోయిన వెంకటరావు, సహాధ్యక్షుడు రొంగళి అక్కునాయుడు, కోశాధికారి రాజేష్, కార్యదర్శులు సూర్య ప్రకాష్, రాజునాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
దేవరాపల్లి హైస్కూల్లో నాగుపాము కలకలం
దేవరాపల్లి: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం నాగుపాము హడావుడి సృష్టించింది. హైస్కూలు ఆవరణలో చేపడుతున్న బాలికల వసతి గృహ నిర్మాణ పనుల కోసం తీసిన గొయ్యిలో ఎలుకను మింగేసి కదలలేని స్థితిలో ఉన్న నాగుపామును స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారుల ద్వారా స్నేక్ క్యాచర్ కృష్ణకు సమాచారం అందించారు. నిచ్చెన సహాయంతో గొయ్యిలోకి దిగిన స్నేక్ క్యాచర్ సుమారు అరగంటపాటు శ్రమించి మూడున్నర అడుగుల పొడవున్న నాగుపామును పట్టుకొని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
అన్న ట్యాబ్‌లో గేమ్‌లు ఆడవద్దన్నాడని..
● బాలిక బలవన్మరణం ● కేజిహెచ్లో చికిత్స పొందుతూ మృతి కె.కోటపాడు: ట్యాబ్‌లో గేమ్‌లు ఆడుతోందని అన్న మందలించడంతో క్షణికావేశంలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పాచిలవానిపాలెం గ్రామానికి చెందిన పాచిల యమున (16) గత నెల 27న ట్యాబ్‌లో గేమ్‌లు ఆడడం చూసి అన్న జయంత్ మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక.. తల్లిదండ్రులు పాచిల వరలక్ష్మి, శ్రీరామ్మూర్తి, అన్న జయంత్ పొలం పనులపై మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లాక ఉరి వేసుకుంది. ఇంటికి తిరిగి వచ్చిన తల్లి యమున ఫ్యాన్‌కు వేలాడడం గమనించి భర్తకు తెలపగా కుమార్తెను హుటాహుటిన చౌడువాడ పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లిలో గల ఉషా ప్రైమ్ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 2 వరకూ అక్కడే వైద్యం అందించారు. ఆమె ఆరోగ్య పరిస్ధితిలో మార్పు రాకపోవడంతో ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు యమునను అదే రోజు విశాఖ కేజీహెచ్‌లో చేర్చారు. ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న యమున ఆరోగ్య పరిస్ధితి మరింత విషమించి ఈనెల 11వ తేదీ ఆదివారం రాత్రి ఆస్పత్రిలో మృతి చెందింది. యమున మృతిపై కె.కోటపాడు పోలీసులకు మేనమామ దొగ్గ కృష్ణ సోమవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన కె.కోటపాడు ఎస్ఐ ఆర్.ధనుంజయ్ విచారణ జరుపుతున్నారు. కేజీహెచ్‌లో పోస్టుమార్టం పూర్తయ్యాక శవాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఏడాది పదిలో 531 మార్కులు ఈ ఏడాది పది పబ్లిక్ పరీక్షల్లో మృతురాలు పాచిల యమున 531 మార్కులు సాధించింది. యమున ప్రతి పరీక్షలో మంచి మార్కులు సాధించేందని బంధుమిత్రులు తెలిపారు. యమున 8వ తరగతి నుంచి ప్రస్తుతం 10 వరకు తానాం రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంది. ఇంటర్మీడియట్లో చేరాల్సి ఉన్న ఆ బాలిక అన్నతో జరిగిన ఘర్షణ కారణంగా క్షణికావేశంలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. -
అవిశ్వాస తీర్మానంపై సమావేశం మినిట్స్ ఇవ్వండి
మహారాణిపేట (విశాఖ): జీవీఎంసీ ప్రత్యేక సమావేశం మినిట్స్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం ఇన్చార్జి రవిరెడ్డి కోరారు. గత నెల 19న జరిగిన ఈ సమావేశం ప్రక్రియల మినిట్స్, వాటి ప్రతిని వెంటనే అందించాలన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న తాను రాసిన లేఖకు ఈ వినతి అనుసంధానంగా ఇస్తున్నట్లు తైనాల విజయకుమార్ పేర్కొన్నారు. మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానంపై చర్చించిన సమావేశం వివరాలు, చేపట్టిన చర్యల మినిట్స్ కాపీని అందించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నియమిత పార్టీ విప్‌గా, తాను కోరిన పత్రాలను వీలైనంత త్వరగా అందజేయాలన్నారు. గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలన్నారు.కలెక్టర్‌కు తైనాల, రవిరెడ్డి వినతి -
గురువులకు సర్దుపోటు!
● ఉపాధ్యాయుల్లో బదిలీల గుబులు ● తుదిదశకు ఖాళీల కసరత్తు ● ఉమ్మడి జిల్లాలో భారీగా సర్ప్లస్ టీచర్లు ● మోడల్ స్కూళ్లకు హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లు ● సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు గండం విశాఖ విద్య: ఉపాధ్యాయుల బదిలీలకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్న నేపథ్యంలో స్కూళ్లలో ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయనే లెక్క తీసే పనిలో జిల్లా విద్యాశాఖ యంత్రాంగం తలమునకలై ఉంది. మంగళవారం నాటికి వాస్తవ ఖాళీలను ధ్రువీకరించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలోని ఎంఈవోలు, డీఈవో కార్యాలయ సిబ్బంది అంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఎంఈవోలను తన కార్యాలయానికి పిలిపించి.. వారి సమక్షంలోనే వాస్తవ ఖాళీలను లెక్క తీసి, వాటిని ధ్రువీకరించేలా డీఈవో ప్రేమ్‌కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో సోమవారం రాత్రి కూడా డీఈవో కార్యాలయంలోనే అధికారులు, సిబ్బంది అంతా క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహించారు. జిల్లాలో ఏడు రకాల బడులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవోను రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా జిల్లాలో ఏడు రకాల బడుల ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 3,158 పాఠశాలలు ఉండగా ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా ఏడు రకాలుగా బడులు (ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక, మోడల్ ప్రాథమిక, యూపీ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ మోడల్ ప్రాథమిక పాఠశాలలు) కూర్పు చేసి ఇక్కడి అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. 2024 డిసెంబర్ నాటికి స్కూళ్లలో నమోదైన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను లెక్క కట్టి, ఇందుకనుగుణంగానే ఖాళీల జాబితాలను సిద్ధం చేశారు. ఎస్జీటీ పోస్టులకు గండం ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారుగా 596 మోడల్ ప్రాథమిక స్కూళ్లును ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను కేటాయిస్తున్నారు. కాగా వీటిలో ప్రధానోపాధ్యాయుడిగా స్కూల్ అసిస్టెంట్‌ను నియమించనున్నారు. దీంతో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు గండిపడే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు. హైస్కూళ్లలో భారీగా సర్ప్లస్ టీచర్లు కొత్తగా ఏర్పాటు కాబోయే స్కూళ్లకు అనుగుణంగా పోస్టులు రేషనలైజేషన్ చేపట్టగా, హైస్కూళ్లలో భారీగా మిగులు ఉపాధ్యాయులు లెక్క తేలారు. గణితం, ఫిజికల్ సైన్సు, ఇంగ్లిష్ పోస్టుల్లో పనిచేసే వారే ఎక్కువగా మిగులుగా తేలారు. తాజా లెక్కల ప్రకారం సుమారుగా 234 మంది స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్ కాబోతున్నారు. వీరందరినీ మోడల్ ప్రాథమిక స్కూళ్లులో సర్దుబాటు చేసేలా కసరత్తు చేస్తున్నారు. గుబులు మొదలు రేషనలైజేషన్ ప్రక్రియతో ఉపాధ్యాయుల్లో గుబులు మొదలైంది. బదిలీలకు అంతా సిద్ధం చేస్తున్నప్పటికీ ఉమ్మడి జిల్లాలో భారీగా సర్‌ప్లస్‌లో ఉపాధ్యాయులు ఉండటంతో.. బదిలీల్లో ఎక్కడికి స్థానభ్రంశం కలుగుతుందోనన్న ఆందోళన ఉపాధ్యాయుల్లో మొదలైంది. డీఈవో కార్యాలయ అధికారులు ప్రకటించిన ఖాళీల జాబితాలతో తాము ఎక్కడికి బదిలీపై వెళ్లాలనే దానిపై ఉపాధ్యాయులు లెక్కలేసుకుంటున్నారు. రేషనలైజేషన్ మేరకు ఏ పోస్టులు పోతున్నాయి? ఏ పోస్టులు మిగులుతున్నాయనే విషయాన్ని డీఈవో కార్యాలయ అధికారులు ఎప్పుడు ప్రకటిస్తారా అని ఉపాధ్యాయులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. -
ఏయూ వీసీకి ఎక్స్‌లెన్స్ అవార్డు
విశాఖ విద్య : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (హైదరాబాద్) అందించిన ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఆదివారం హైదరాబాదులోని ఐఐసీటీలో జరిగిన నేషనల్ టెక్నాలజీ డే కార్యక్రమంలో అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆచార్య రాజశేఖర్ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందించడం పట్ల విశ్వవిద్యాలయ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసుల తీరు దారుణం
దేవరాపల్లి: బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, మహిళా నాయకురాలు విడదల రజని పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ మండిపడ్డారు. కూట మి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కొరవడిందని, మాజీ మంత్రి రజనిపై పోలీసులు వ్యవహరించి న తీరే ఇందుకు నిదర్శనమన్నారు. తారువలో సోమ వారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ‘సీఐ గారు ఏమిటి విషయమ’ని మర్యాదపూర్వకంగా అడిగిన మాజీ మంత్రిపై సదరు సీఐ దురుసుగా ప్రవర్తించడంతోపాటు ‘నీపై కూడా కేసులు పెడతామం’టూ బెదిరింపులకు దిగడం అత్యంత దారుణమన్నారు. మాజీ మంత్రి పట్ల పోలీసులు ఇలా వ్యవహరిస్తే.. రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. తమ 11 నెలల పాలనలో వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కూటమి ప్రభుత్వం ప్రశ్నించే వారిపై ఇలా కక్ష సాధింపులకు దిగుతూ, అరాచకంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళల ను గౌరవిస్తాం, రక్షణ కల్పిస్తామని చెబుతున్న కూటమి నేతలకు మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా వ్యవహరించిన సీఐపై చర్యలు తీసుకోవడంతోపాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ డిమాండ్ చేశారు. -
సింహగిరికి వైశాఖ పౌర్ణమి శోభ
సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సింహగిరికి భక్తులు పోటెత్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇలవేల్పుగా పూజించే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల భక్తులు, మత్స్యకారులు కుటుంబసమేతంగా పెద్ద సంఖ్యలో సింహాచలం తరలివచ్చారు. తొలుత కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. వంటలు వండుకుని కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. కోలలతో నృత్యాలు చేస్తూ స్వామిని కీర్తించారు. గరిడీ నృత్యాలు చేశారు. మెట్లమార్గం ద్వారా నడిచి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. స్నానమాచరించేందుకు తరలివచ్చిన భక్తులతో వరాహ పుష్కరిణి ప్రాంగణం కిక్కిరిసింది. పుష్కరిణి నుంచి అడవివరం మార్కెట్ కూడలి వరకు ఉన్న మార్గం భక్తజన సంద్రంగా మారింది. సింహగిరిపై దర్శన క్యూలు, కేశఖండనశాల, ప్రసాద విక్రయశాల, భక్తులతో నిండిపోయాయి. వరాహ పుష్కరిణి వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గోపాలపట్నం పోలీసులు, దేవస్థానం గార్డులు బందోబస్తు నిర్వహించారు. పుష్కరిణి మార్గంలో ఎలాంటి వాహనాలు వెళ్లకుండా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. -
AP: సచివాలయంలో సంసారం
అనకాపల్లి: గ్రామ సచివాలయం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల చెంతకే పౌర సేవలను తీసుకువెళ్లేందుకు ఏర్పరచిన వ్యవస్థ. గ్రామ స్వరాజ్యం కలను నిజం చేసే ఈ సచివాలయాల కోసం నాటి సర్కారు పక్కా భవనాలను నిర్మించింది. అక్కడి నుంచే దేశమంతటికీ ఆదర్శంగా నిలిచిన వ్యవస్థ నడిచింది. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడది తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది.రోలుగుంటలో మరో అడుగు ముందుకేసి ఓ ప్రైవేటు వ్యక్తికి నివాసంగా కూడా మారింది. స్థానిక టీడీపీ నాయకుడి అండదండలతో ఏకంగా ఆ వ్యక్తి సచివాలయంలో సంసారమే నడిపేస్తున్నాడు. సదాశయానికి గండి కొడుతున్నాడు. ఆయన కుటుంబంతో గత 8 నెలలుగా నివాసం ఉంటున్నా.. ఇదంతా కళ్ల ముందే జరుగుతున్నా.. అధికారులు ఏం చేస్తున్నారో.. కూటమి నాయకులు ఏం చెబుతారో! -
వీర జవాన్ త్యాగం మరువలేనిది
మురళీ నాయక్కువైఎస్సార్ సీపీ నేతల నివాళి మహరాణిపేట(విశాఖ): పాక్ దాడిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని దేశం మరువదని వైఎస్సార్ సీపీ నేతలు అన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మురళీ నాయక్ చిత్రపటం వద్ద ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ, సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మురళీనాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, రవిరెడ్డి, కటుమూరి సతీష్, మొల్లి అప్పారావు, కొండా రాజీవ్ గాంధీ, బానాల శ్రీనివాసరావు, రాజన్న వెంకటరావు, కటారి అనిల్ కుమార్ రాజు, షేక్ మహ్మద్ గౌస్, ఏమండి సత్యనారాయణ, పేడాడ రమణి కుమారి, సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకృష్ణ, పులగం కొండారెడ్డి, సేనాపతి అప్పారావు, రామిరెడ్డి, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, దేవరకొండ మార్కండేయులు, నీలాపు కాళిదాస్‌రెడ్డి, కె.రామన్నపాత్రుడు, నాగేంద్ర, అప్పన్న, కొట్యడ సూర్యనారాయణ, కనక ఈశ్వరరావు, గంగా మహేష్, పీతల వాసు, బెవర మహేష్, గోబింద్ బోధాపు, శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రంభ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్‌రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి
అనకాపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈనెల 20న నిర్వహించనున్న సమ్మెకు అన్ని వర్గాల ప్రజల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు వస్తోందని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేపాడ సత్యనారాయణ తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని చెప్పారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకించాలన్నారు. సోలార్ విద్యుత్, విండ్ విద్యుత్, హైదరాబాద్ ప్రాజెక్టులను, స్మార్ట్ మీటర్లను ఇలా అన్నింటినీ అదానీ సంస్థలకు కట్టబెడుతూ ప్రజలపై విపరీతమైన భారాన్ని ప్రభుత్వం మోపుతోందన్నారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయడం లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదని తెలిపారు. సచివాలయ లైన్మన్లను విద్యుత్‌శాఖలో విలీనం చేసి, వారికి ప్రమోషన్లు కల్పించాలని ఆయన కోరారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ భవిష్యత్తులో కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యకతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఆర్.కె.వి.ఎస్. కుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రేమ చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా కోశాధికారి వి.వి.శ్రీనివాసరావు, సభ్యులు అవతారం, కేదారేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
పెదగరువులో జ్వరాల విజృంభణ
రోలుగుంట: మండలంలోని అర్ట పంచాయతీ శివారు పెదగరువులో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే పలువురు మంచం పట్టారు. అందుబాటులో వైద్య సిబ్బంది లేకపోవడంతో చికిత్స అందడం లేదని, జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోందని గ్రామస్తులు తెలిపారు. ఎక్కువ మంది పిల్లలు జ్వరాలబారిన పడుతున్నారని చెప్పారు. కిలో ప్రేమ్ కుమార్ (15), కిలో పావులు (1), కిలో అక్ష(4), సేదరి రాణి(4)తో పాటు మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వైద్యాధికారులు స్పందించి, గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గిరిజన సంఘం నాయకుడు కిలో నర్సయ్య, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు కోరారు.