
ఆశా కార్యకర్తపై దాడికి పాల్పడిన నర్స్‌పై చర్యలు తీసుకోవ
అనకాపల్లి: కశింకోట మండలం మూలపేట గ్రామం ఆశా కార్యకర్తపై దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)జిల్లా నాయకులు ఎల్.శాంతి, ఈ.పార్వతి, కె.వరలక్ష్మి, బి రామలక్ష్మిలు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేసి, వైద్యాలయంలో సూపరిటెండెంట్ ఎం.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఎన్టీఆర్ ఆస్పత్రికి గర్భిణిని డెలివరీకి తీసుకువచ్చిన కశింకోట మండలం మూలపేట ఆశా కార్యకర్త సిహెచ్ మాధవిపై రాత్రి ఎన్టీఆర్ ఆసప6తిలో ‘మేటి అసిస్టెంట్‘ సరళ మిశ్రా అకారణంగా దాడి చేసిందన్నారు. ఆశాలకు భద్రత కల్పించాలని, ఆశా కార్యకర్తను దుర్భాషలాడిన సరళ మిశ్రాపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సూర్యకళ, లక్ష్మి, రమణమ్మ పాల్గొన్నారు.