
డిగ్రీ ఫలితాల్లో నర్సీపట్నం విద్యార్థులకు ఫస్ట్, సెకండ
నర్సీపట్నం: ఏయూ డిగ్రీ ఫలితాల్లో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాంక్‌లు సాధించారు. బీకామ్ విద్యార్థి చీమల దుర్గాప్రసాద్ ఆంధ్రా యూనివర్సిటీ మొదటి ర్యాంక్, మరో విద్యార్థిని అనిమిరెడ్డి సత్యాహేమలత రెండో ర్యాంకు సాధించారు. వీరితోపాటు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, అధ్యాపకులు అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని జూనియర్ విద్యార్థులు కళాశాలలో సౌకర్యాలను వినియోగించుకుని కష్టపడి చదివి మంచి ర్యాంక్‌లు సాధించాలని సూచించారు. ఫలితాలపై కామర్స్ విభాగంతో పాటు మిగిలిన అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.
బీఎస్సీ విభాగంలో పాయకరావుపేట విద్యార్థినికి 2వ ర్యాంక్
పాయకరావుపేట: ఆంధ్ర విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాల విద్యార్థిని మాకిరెడ్డి జయంతి బీఎస్సీ విభాగంలో యూనివర్సిటీ 2వ ర్యాంక్, జిల్లా మొదటి ర్యాంకు సాధించింది. బీబీఏ విభాగంలో నక్కా సారా జిల్లా 2వ ర్యాంకు, సయ్యుద్ గుల్ఫీషాన్, మద్దూరి కాశీ అన్నపూర్ణ జిల్లా 3వ ర్యాంక్ సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరు ఎ.రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె. నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.

డిగ్రీ ఫలితాల్లో నర్సీపట్నం విద్యార్థులకు ఫస్ట్, సెకండ

డిగ్రీ ఫలితాల్లో నర్సీపట్నం విద్యార్థులకు ఫస్ట్, సెకండ