ఉమ్మడి విశాఖ జిల్లాలో కిడ్నాప్‌ కలకలం | Four Year Old Child Kidnapped In Anakapalle District, More Details Inside | Sakshi
Sakshi News home page

ఉమ్మడి విశాఖ జిల్లాలో కిడ్నాప్‌ కలకలం

May 17 2025 11:24 AM | Updated on May 17 2025 4:13 PM

Four Year Old Child Kidnapped In Anakapalle District

సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. అనకాపల్లి టౌన్‌కి చెందిన నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది.⁠ అనకాపల్లి లోకావారి వీధి ఇంటి నుంచి అదృశ్యం అయినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన అనకాపల్లి పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఓ మహిళ చాకచక్యంగా చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. గుర్తు తెలియని మహిళ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాత కిడ్నాప్ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.

	ఉమ్మడి విశాఖ జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్ గ్యాంగ్ కలకలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement