తాడేపల్లి : మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పని చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు వైఎస్ జగన్. శత్రుచర్ల విజయరామరాజు మృతి రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు తీరని లోటని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు వైఎస్ జగన్.
కాగా, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వైఎస్సార్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన శత్రుచర్ల విజయరామరాజు.. ఎంపీగా, నాగూరు, పాతపట్నం ఎమ్మెల్యే గా పనిచేశారు. విజయరామరాజు మృతి పట్ల మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు సంతాపం తెలిపారు.


