
వారి ప్రేమలు, బాధ్యతలను గుర్తు చేస్తాం
ఆవేశంతో అనర్ధాలు కొనితెచ్చుకుంటారు. అంతవరకు ఉన్న ప్రేమానుబంధాలను ఆ క్షణంలో మరచిపోతారు. వారికి కౌన్సిలర్లు చెప్పే మాటలు ఎంతో ఉపయోగపడతాయి. వారిని ఆలోచింపచేస్తాయి. పెళ్లి చేసుకొని ఐదు, పదేళ్లు అయిన జంటలు కూడా మా వద్దకు వస్తుంటారు. వారిని కనీసం ఐదారుసార్లు కూర్చోపెట్టి కౌన్సెలింగ్ చేస్తాం. భార్యా, భర్తల గొడవల్లో పిల్లల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని కూడా చెపుతాం. మా పరిధి దాటిన తర్వాత కూడా కౌన్సెలింగ్ చేసి లోక్ అదాలత్ ద్వారా ఇద్దరినీ కలుపుతాం.
– ఇ.శ్రీనివాసులు, డీఎస్పీ,
మహిళా పోలీస్ స్టేషన్, అనకాపల్లి