
సారా బట్టీలపై దాడులు
ఎటపాక: నవోదయం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఎటపాక మండలంలో సారా తయారీ కేంద్రాలపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ఎకై ్సజ్, పోలీసు శాఖల అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. విశాఖపట్నం ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి ఆదేశాలతో మండలంలోని పిచుకలపాడు, గుండువారిగూడెం గ్రామాల్లో ఎకై ్సజ్, సివిల్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు మంగళవారం ఆకస్మికంగా దాడులు జరిపాయి. దాడుల్లో 4500 లీటర్ల బెల్లం ఊట ,40 లీటర్ల సారా, 20 కేజిల పటిక సీజ్ చేశారు. గుండువారిగూడెం గ్రామంలో ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. సారా తయారికీ ఉపయోగించే 48 డ్రమ్ములను సామగ్రితో పాటు ధ్వంసం చేసినట్టు రంపచోడవరం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగరాహుల్ తెలిపారు. ఈ దాడుల్లో కొత్తగూడెం ఏఈఎస్ కరంచంద్, రంపచోడవరం ఏఈఎస్‌టీఎఫ్ సీఐ ఇంద్రజిత్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ అప్పలనాయుడు, చింతూరు ఎకై ్సజ్ ఎస్‌ఐ స్వామి, అనకాపల్లి సీఐ శ్రీనివాసరావు, భద్రాచలం ఎస్‌ఐ సీతారామరాజు, పాల్వంచ ఎస్‌హెచ్‌ఓ సరిత, ఎటపాక సీఐ కన్నపరాజు, ఇరు రాష్ట్రాల ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
4500 లీటర్ల బెల్లం ఊట, 40 లీటర్ల సారా ధ్వంసం
తయారీ సామగ్రి స్వాధీనం
ఐదుగురిపై కేసు నమోదు