130 కిలోల గంజాయి పట్టివేత
● ఒకరు అరెస్టు, ముగ్గురు పరార్
చీడికాడ: కారులో అక్రమంగా తరలిస్తున్న 130 కిలోల గంజాయితో వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ బి.సతీష్ తెలిపారు. ఆయన మంగళవారం అందించిన వివరాలిలా ఉన్నాయి. గంజాయి అక్రమ రవాణా జరుతున్నట్టు అందిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం మండలంలోని ఖండివరం వద్ద మాటువేసి అటుగా వస్తున్న కారును అడ్డగించి తనిఖీలు నిర్వహించామన్నారు. ఆ కారులో రూ.ఆరున్నర లక్షక్షల విలువ గల 130 కిలోల గంజాయిని గుర్తించామన్నారు. గంజాయి తరలిస్తున్న మండలంలోని బైలపూడికి చెందిన కాశీ తేజను అదుపులోకి తీసుకున్నామన్నారు. అతనితో పాటు మరో ముగ్గురు పైలేట్‌లుగా వ్యవహరించినట్టు తెలిపారు. వారు పరారీలో ఉన్నారని తెలిపారు.


