సత్వర పరిష్కారం
భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్‌తో
తుమ్మపాల : భూ సంబంధిత సమస్యలను రెవెన్యూ క్లినిక్ ద్వారా సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పిజిఅర్‌ఎస్. కార్యక్రమంలో ఆమెతో పాటు జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి తీసుకున్న అర్జీల గూర్చి వెంటనే సంబంధిత అదికారులను వివరాలు అడిగి తెలుసుకొని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. అదేవిధంగా డివిజను, మండల, గ్రామస్థాయిలలో నిర్వహించే పిజిఆర్‌ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు అందజేసిన ధరఖాస్తుల పరిష్కారానికి అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరించి ధరఖాస్తుదారునికి తెలియజేయాలని, పరిష్కారం కాని ధరఖాస్తుల గూర్చి వారికి అందుకుగల కారణాలు వివరంగా తెలియజేయడం ద్వారా అర్జీలు రీ ఓపెన్ కాకుండా నివారించవచ్చని తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని సూచించారు. ప్రతి శాఖ అధికారి వారి శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని, గడువులోపల చర్యలు తీసుకోవాలని తెలిపారు. గతంలో మునుపెన్నడు లేనివిధంగా మొత్తం 410 అర్జీలు నమోదవ్వగా, వాటిలో 222 అర్జీలు రెవెన్యూ శాఖ పనితీరు కారణంగా పరిష్కారం కాని సమస్యలపైనే న మోదయ్యాయి. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అఽధికారులు పాల్గోన్నారు.
పంచాయతీల విభజనపై నిరసనలు
పంచాయతీల విభజనపై భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పలు గ్రామాల ప్రజలకు అధిక సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ వద్ద చేసిన నిరసనలు ఇరువర్గాల మధ్య ఆందోళనలకు తెరతీసాయి. కశింకోట మండలం జి.భీమవరం పంచాయతీ పరిధిలో ఉన్న సింగవరం గ్రామాన్ని విభజించి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలంటూ సింగవరం గ్రామస్తులు నిరసనలు చేపట్టగా, విభజనకు వ్యతిరేకంగా పంచాయతీని కలిపే ఉంచాలంటు జి.భీమవరం గ్రామస్తులు నిరసన తెలిపారు. అంతకుముందు సింగవరం గ్రామస్తులకు మద్దతుగా వచ్చిన సమాజ్‌వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు కోన గురవయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో కూటమి ప్రభుత్వం గడిచిన 20 నెలలుగా ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిందన్నారు. రెవెన్యూ పరిధి ఉన్నప్పటికీ సింగవరం గ్రామాన్ని జి.భీమవరం పంచాయతీలో ఉంచడంతో అక్కడ పాలకులు గ్రామాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచారని, కనీసం గ్రామానికి 40 శాతం నిధులు కూడా ఖర్చు చేయకుండా ఏకపక్షంగా జి.భీమవరం గ్రామాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారని, తక్షణమే అధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుచేయాలని కోరారు. గ్రామాలు వేరైన రెండు గ్రామాల ప్రజల మధ్య ఎటువంటి తారతమ్యాలు లేకుండా కలసిమెలసి ఉన్నామని, కొందరు నాయకులు స్వార్ధం కోసం ప్రత్యేక పంచాయతీ నినాదంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఒకే పంచాయతీగా కొనసాగించాలని జి.భీమవరం గ్రామస్తులు తెలిపారు.
మౌలిక వసతులు పట్టించుకోరా...
రోడ్డు ఏర్పాటుతో పాటు ఇళ్ల మురుగునీరు రాకుండా మౌలిక సౌకర్యాలు ఏర్పాటు కల్పించాలని కొత్తూరు గ్రామం శారదానగర్ 12వ వీధి వాసులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. 40 ఏళ్లుగా శాశ్వత నివాసాల్లో ఉంటున్నా పాలకులు గాని, అధికారులు గాని పారిశుధ్య నిర్వహణ, మౌలిక సౌకర్యాల కల్పనపై కనీసం పట్టించుకోవడం లేదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామసభల్లోను కూడా ప్రస్తావించినా పరిష్కారం దొరకడం లేదన్నారు. ఇంటిపన్నులు కట్టించుకోవడంపై ఉన్న శ్రద్ధ మంచినీరు, పారిశుధ్యంపై ఉండకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
వికలాంగ పింఛను మంజూరు చేయరూ...
తండ్రి శ్రీనుతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చిన వికలాంగుడు కిమిడి శివకుమార్
మతిస్థిమితం కోల్పోయి పూర్తిగా వికలాంగుడిగా ఉన్న తన కుమారుడికి పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ నక్కపల్లి మండలం పెదదొడ్డిగుళ్ల గ్రామానికి చెందిన కిమిడి శ్రీను తన కుమారుడు కిమిడి శివకుమార్‌ను తీసుకుని కలెక్టరేట్‌లో వినతి అందించారు. 90 శాతం మాన షిక వికలాంగుడిగా ఉన్న తన కుమారుడి స్ధితిగతులను చూసైన పించన్ అవకాశం కల్పించాలని కోరారు.
సత్వర పరిష్కారం
సత్వర పరిష్కారం


